Jignesh Mevani
-
గుజరాత్ ఎన్నికలు.. గెలిచిన, ఓడిన ప్రముఖులు వీరే!
నరేంద్ర రికార్డులను భూపేంద్ర బ్రేక్ చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కమళనాథులకు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 127 సీట్లు రావడమే బీజేపీ ఖాతాలోకి అత్యధిక రికార్డు. ఇప్పుడు బీజేపీ దాన్ని తిరగరాసింది. ఏకంగా 156 సీట్లను చేజిక్కించుకుంది. మాధవ్‌సిన్హ్ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ నెగ్గిన 149 సీట్ల రికార్డునూ బీజేపీ ప్రస్తుతం తిరగరాయడం విశేషం. విపక్షాల మధ్య ఓట్ల చీలిక వచ్చినా... బీజేపీ ఏకంగా 53 (ఎన్నికల కమిషన్ తాజా సమాచారం ప్రకారం) శాతం ఓట్లు సాధించడం కూడా రికార్డే. కమలనాథులకు ఈ స్థాయిలో ఓట్లు గతంలో ఎప్పుడూ రాలేదు. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు 1977 నుంచి 2011 వరుసగా ఏడు పర్యాయాలు అధికారాన్ని చేపట్టాయి (34 ఏళ్ల పాటు బెంగాల్‌ను పాలించాయి). గుజరాత్లో 1998 నుంచి నిరంతరాయంగా అధికార పీఠంపై ఉన్న బీజేపీ వరుసగా ఏడోసారి నెగ్గి ఈ రికార్డును సమయం చేసింది. ►గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజారిటీతో గెలిచారు. ► క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జామ్‌నగర్ నార్త్‌లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెల్చారు. ► పటీదార్ ఉద్యమ నేత, బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ అర్బన్ వీరమ్గ్రామ్ స్థానంనుంచి ఆప్ అభ్యర్థిపై గెలిచారు. ► వదగామ్ (ఎస్సీ) స్థానంలో గతంలో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దళిత నేత జిగ్నేశ్ మేవానీ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ► హార్దిక్ మాజీ సన్నిహితుడు, పటీదార్ నేత అల్పేశ్ కథిరియా వరఛా రోడ్ (సూరత్) స్థానంలో విజయఢంకా మోగించారు. ► కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన గాంధీనగర్ (సౌత్) నియోజకవర్గ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ సైతం గెలిచారు. ఓడిన ప్రముఖులు ► గుజరాత్ ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కటర్గామ్లో ఓడారు. ► ఆప్ సీఎం అభ్యర్థి ఎసుదాన్ గాఢ్వీ ఖంభలియా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ► ప్రాథమిక, యువజన విద్యాశాఖ సహాయ మంత్రి కీర్తిసిన్హా వాఘేలా, ఏడుగురు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. ► ఇక హిమాచల్‌లో కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థులుగా ప్రచారం జరిగిన ఆశాకుమారి, రామ్‌లాల్ ఠాకూర్, కౌల్సింగ్ ముగ్గురూ ఓటమి చవిచూశారు. -
అసమ్మతి గళాలపై అసహనం
ప్రధానిపై ట్విట్టర్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే, పోలీసులు ఆయనపై మరొక కేసు బనాయించి అరెస్టు చేశారు! ఆ కేసులోనూ మేవానీకి బెయిల్ ఇచ్చిన కోర్టు.. పోలీసులకూ, ప్రభుత్వానికీ వ్యతిరేకంగా చేసిన పదునైన వ్యాఖ్యలు ఆ రెండు వర్గాలూ ఆత్మపరిశీలన చేసుకోదగినవి. గతంలో రాజ్య దౌర్జన్యాలకు రాజకీయ శత్రుత్వమే ప్రధాన కారణంగా ఉండేది. కానీ ఇప్పుడది సైద్ధాంతికంగా మారింది. అసమ్మతి గళాలపై ఇంత అసహనం ఏమిటి? అసమ్మతే కదా ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చేది! రాజకీయ వర్గం, పాలన, న్యాయవ్యవస్థ.. ప్రతి ఒక్కరూ అసమ్మతి హక్కును సమర్థించాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఇదొక్కటే మార్గం. గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని ఏప్రిల్ 20న అస్సాం పోలీ సులు అరెస్టు చేశారు. మేవానీ గుజరాత్‌లోని పాలన్పుర్లో ఉండగా అస్సాంలోని కొక్రజర్ జిల్లా నుంచి వచ్చిన పోలీసులు... ప్రధానిపై ట్విట్టర్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా అక్కడికక్కడ రాత్రి 11.30కి నిర్బం ధించి, మర్నాడు తెల్లవారుజాము వరకు ప్రశ్నిస్తూనే ఉన్నారు. తర్వాత గుజరాత్ నుంచి అస్సాంలోని అజ్ఞాత ప్రదేశానికి ఆయనను తరలిం చుకెళ్లారు. మేవానీ ట్విట్టర్లో నరేంద్ర మోదీని ‘గాడ్సే భక్తుడు’ అన్నాడని కొక్రజర్ జిల్లా భవానీపుర్‌కు చెందిన అనూప్ కుమార్ డే అనే బీజేపీ సానుభూతిపరుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మేవానీపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి, అస్సాం తీసుకెళ్లారు. మేవానీ సామాజిక న్యాయ కార్యకర్త, గుజరాత్‌లోని వడగామ్ నియోజకవర్గ శాసన సభ్యుడు. కాంగ్రెస్ మద్దతుగల ఈ యువ దళిత ఎమ్మెల్యే... పై కేసులో బెయిల్ పొందిన వెంటనే తిరిగి ఏప్రిల్ 25న అదే పోలీసులు నిస్సిగ్గుగా ఆయనను అరెస్టు చేశారు. విధి నిర్వ హణలో ఉన్న మహిళా పోలీసు అధికారిపై ‘దాడి’ చేసి, ఆమెను ‘దుర్భాష’లాడాడని అయనపై ఆరోపణ. ఆ కేసులోనూ మేవానీకి బెయిల్ లభించింది. బార్పేట జిల్లా, సెషన్స్ కోర్టు బెయిల్ ఆదేశాలు జారీ చేస్తూ... పోలీసులకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ వ్యతిరేకంగా కొన్ని పదునైన పరిశీలనలను వ్యక్తం చేసింది. అయితే గౌహతి హైకోర్టు ఆ పరిశీలనలపై సోమవారం స్టే విధించింది. మహిళా పోలీసు అధికారిపై దాడి చేసి, దుర్భాషలాడినట్లుగా జిగ్నేష్‌పై పోలీసులు రాసిన ఎఫ్.ఐ.ఆర్. వండివార్చినట్లుగా ఉందని బార్పేట కోర్టు పేర్కొంది. రాష్ట్రంలో ఇటీవల మితి మీరుతున్న పోలీసు చర్యలపై తమకు తాముగా పిటిషన్‌ను స్వీకరించాలని ఈ కింది కోర్టే గౌహతి హైకోర్టును అభ్యర్థించించినట్లు ఆ మధ్య మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ చక్ర వర్తి... మేవానీకి బెయిల్ ఉత్తర్వులను జారీ చేస్తూ... ‘మనం కష్టపడి సాధించిన ప్రజాస్వామ్యం పోలీసు రాజ్యంగా మారడమన్నది ఊహకు అందని విషయం’ అని వ్యాఖ్యానించారని కూడా మీడియా కథనాలు వెల్లడించాయి. మేజిస్ట్రేట్ ఎదుట నమోదు కోసం ఆ మహిళా పోలీస్ ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి ఈ కేసు నిజమేనని అంగీకరించవలసి వస్తే కనుక అప్పుడు మనం మన నేర శిక్షాస్మృతిని తప్పక తిరిగి రాయవలసి ఉంటుంది. సెషన్స్ కోర్టు పరిశీలనలపై గౌహతి హైకోర్టు స్టే ఆర్డర్ ఇస్తూ... ‘ఆ పరిశీలనలు దిగువ కోర్టు అధికార పరిధికి మించినవి’ అని వ్యాఖ్యానించడాన్ని కూడా ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చివరి దశలలో అవినీతితో విసిగిపోయిన దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారు. 2014లో నరేంద్ర మోదీ చరిత్రాత్మక మెజారిటీతో ప్రధానిగా ఎన్నికైనప్పుడు, ఈ ప్రభుత్వం నిజమైన అభివృద్ధికి కృషి చేస్తుందని పౌరులు ఆశించారు. అయితే, సరిగ్గా వ్యతిరేకంగా జరిగింది. బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పెద్ద ఎత్తున అసమ్మతి గళాలను అణచివేయడం ప్రారం భించాయి. ఇంతకుముందు రాజ్య దౌర్జన్యాలకు రాజకీయ శత్రుత్వమే ప్రధాన కారణంగా ఉండేది. కానీ ఆరెస్సెస్–బీజేపీ పాలనలో ప్రతి పక్షాల అణచివేత సైద్ధాంతికంగా మారింది. ప్రధానిని విమర్శిస్తూ ట్వీట్ చేసినందుకు ఐటీ చట్టం కింద... ఆ వెంటనే మరో కేసులో దాడి, దుర్భాషల ఆరోపణలతో జిగ్నేష్ అస్సాం పోలీసుల నిర్బంధానికి గురైన విధంగానే... దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, ఆ పార్టీల కార్యకర్తలు, పాత్రికేయులు కూడా అదే ప్రమాదానికి గురవుతున్నారు. బీజేపీ పాలనలో రాజ్యాధికార దుర్వినియోగం, చట్టవిరుద్ధ కార్యకలా పాల నిరోధక చట్టం (ఉపా) లేదా రాజద్రోహం వంటి క్రూరమైన చట్టాల వాడకం గణనీయంగా పెరిగిందని అనేక అధ్యయనాలు, ప్రభుత్వ వివరాలు కూడా చూపిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం 2019లో రాజద్రోహం కేసుల్లో 165 శాతం, ‘ఉపా’ కేసుల్లో 33 శాతం పెరుగుదల నమోదైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత నెలలో ఎటువంటి ముందస్తు సమా చారం లేకుండానే ప్రముఖ పాత్రికేయురాలు రాణా ఆయుబ్ విదేశాలకు వెళ్లడానికి ఉన్న అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆమ్నెస్టీ ఇంటర్నే షనల్ ఇండియా మాజీ డైరెక్టర్ అయిన ఆకార్ పటేల్ సరిగ్గా విమానం ఎక్కే ముందు ఇదే విధంగా సీబీఐ వేధింపులకు గురయ్యారు. పటేల్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఆదేశిం చినప్పటికీ, ఆ ఆదేశాలపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడం జరిగిందని పేర్కొంటూ సీబీఐ అక్కడికక్కడ ఆయన ప్రయాణాన్ని ఆపు చేయిం చింది. ఈ రెండు కేసుల్లో ఆయుబ్, పటేల్‌ల హక్కులను న్యాయ వ్యవస్థ సమర్థించడంతో ఈడీ, సీబీఐల ఉత్తర్వులు రద్దు అయిన ప్పటికీ, అసమ్మతిని వ్యక్తం చేసేవారిని రాజ్యం సహించదనే వాస్తవం మాత్రం స్పష్టమయింది? గతంలో భీమా కోరెగావ్ కేసులో పోలీసులు, కేంద్ర విచారణ సంస్థల అధికారులు అనేకమంది ఉద్యమకారులనూ, న్యాయ వాదులనూ అరెస్టు చేశారు. మావోయిస్టు సంబంధాలు ఉన్నాయనీ, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనీ వారిపై ఆరోపణలు! జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రస్తుతం ఈ కేసును విచారి స్తోంది. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఎన్ఐఏ తనకు అనుకూలంగా అవాస్తవాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని బాంబే హైకోర్టులో ఆరోపణలు నమోదై ఉండటం! మానవ హక్కుల న్యాయవాది, భీమా కోరేగావ్ కేసులో నింది తుడు అయిన రోనా విల్సన్‌కి సంబంధించి బాంబే హైకోర్టు ముందుకు అప్పట్లో ఒక ముఖ్యమైన పరిశీలన వచ్చింది. పరిశోధనాత్మక పాత్రికేయుడు జోసీ జోసెఫ్ ‘ది సైలెంట్ కూ’ అనే తన పుస్తకంలో– ‘అర్సెనల్ కన్సల్టింగ్’ అనే అమెరికన్ ఫోరెన్సిక్ బృందం బొంబాయి హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో.. ‘రోనా విల్సన్ కంప్యూ టర్లోకి ఎవరో తమ విస్తృతమైన వనరులతో (సమయం సహా) 2016 జూన్ 13న చొరబడినట్లు తాము కనుగొన్నామనీ, అప్పట్నుంచి దాదాపు రెండు సంవత్సరాల పాటు వారు తారుమార్ల కోసం ఆ కంప్యూటర్ని నియంత్రించారనీ పేర్కొంది’ అని రాయడాన్ని విల్సన్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అసహనం, అసమ్మతిపై కక్ష కట్టడం అనేవి నేడు బీజేపీకి మాత్రమే పరిమితం కాలేదు. ఉద్ధవ్ ఠాక్రే, మమతా బెనర్జీ, కె. చంద్రశేఖర్ రావు వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాల్లో అదే పని చేస్తున్నారు. ఈ రాజకీయ అసహనానికి ముగింపు పలకాలంటే రాజకీయ వ్యవస్థకే కాదు, న్యాయ వ్యవస్థకు కూడా కొన్ని దిద్దుళ్లు అవసరం. రాజ్య దౌర్జన్యాలకు సంబంధించిన చాలా కేసులలో అనేక విచారణ కోర్టులు, హైకోర్టులు, సుప్రీం కోర్టు.. ప్రజా ప్రయోజనాలకు రక్షణగా నిలబడ్డా యనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఇంకా అనేక మంది రాజకీయ కార్యకర్తలు బెయిల్ అభ్యర్థించినా తిరస్కరణకు గురై జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. తాజాగా, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం రాజద్రోహానికి సంబం ధించిన క్రూరమైన వలసరాజ్యాల చట్టంపై ఒక వైఖరిని తీసుకోవ డానికి ఆసక్తిని వ్యక్తం చేయడం ఎంతో సంతోషించదగిన విషయం. రాజకీయ వైషమ్యాలకు అంతమే లేకుండా పోతోంది. ఇది ప్రమాద కరం. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి వన్నె తెస్తుంది. రాజకీయ వర్గం, పాలన, న్యాయవ్యవస్థ ప్రతి ఒక్కరూ అసమ్మతి హక్కును సమర్థించాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఇదొక్కటే మార్గం. వ్యాసకర్త: శాయంతన్ ఘోష్ స్వతంత్ర పాత్రికేయుడు (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
బెయిల్‌పై బయటికి.. వెంటనే పుష్ప డైలాగ్ కొట్టాడు
అధికారం ఉందని ఓ మహిళను అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసు బనాయించారంటూ బీజేపీపై ఆరోపణలు గుప్పించాడు గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ. అస్సాంలో మహిళా కానిస్టేబుల్‌ను దుర్భాషలాడిన చేసిన కేసులో జిగ్నేష్ మేవానీకి శుక్రవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే. బెయిల్‌పై బయటికి వచ్చి రాగానే అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ఫేమస్ డైలాగ్ కొట్టాడాయన. పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ(తలవంచను).. తగ్గేదే లే.. డైలాగ్‌తో ఓ మీడియా ఛానెల్ ముందు పుష్పరాజ్ తరహా మేనరిజాన్ని ప్రదర్శించాడు జిగ్నేష్ మేవానీ. ‘‘నా అరెస్ట్ సాధారణ విషయం కాదు. పీఎంవోలో ఉన్న పొలిటికల్ బాస్‌ల సూచనలతోనే జరిగింది. నేను చేసిన ట్వీట్లో తప్పేం లేదు. ఆ విషయం ఇప్పటికీ గర్వంగా చెప్తున్నా.. జరిగిన మతఘర్షణలను, అల్లర్లను చూసి ఈ దేశంలో ఒక పౌరుడిగా శాంతి సామరస్యాలను కాపాడమని దేశ ప్రధానిని కోరా. అడగడానికి నాకు హక్కు ఉంది. అంటేకాదు చట్ట సభ ప్రతినిధిగా శాంతిని పాటించాలని ప్రజలను కోరా. అది నా విధి. అదేగా నేను చేసింది. దానికే కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని మేవానీ తెలిపారు. ఆపై ఒక ఆడదాన్ని అడ్డుపెట్టి.. కథను అల్లి మరో కేసు పెట్టారు. పిరికిపంద చర్యే ఇది. గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా అందుకే బీజేపీ ఇలా చేస్తోంది అని మేవానీ ఆరోపించారు. అరెస్ట్ వేళ తనకు మద్దతు ఇచ్చిన అస్సాం ప్రజానీకానికి, కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపాడాయన. అలాగే ఎక్కడో అస్సాంలో తనను అరెస్ట్ చేయడం, కేసులు బనాయించి బయటకు రాకుండా చేయడం.. ముమ్మాటికీ బీజేపీ కుట్రే అని అంటున్నాడు. ప్రశ్నించేవారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు వీళ్లు. అలాగే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నన్నూ టార్గెట్ చేశారు. దళితులు, గుజరాత్ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. సరైన టైంలో బుద్ధి చెప్తారు. గుజరాత్ ఎన్నికల్లో వాళ్లు(బీజేపీ) మూల్యం చెల్లించుకోక తప్పదు. అని పేర్కొన్నాడు ఎమ్మెల్యే మేవానీ. (చదవండి:ఎట్టకేలకుజిగ్నేష్ మేవానీకి బెయిల్) పోలీసులపై కోర్టు ఆగ్రహం మహిళా కానిస్టేబుల్‌పై దాడి కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని ‘‘కావాలనే’’ ఇరికించేందుకు ప్రయత్నించారంటూ అస్సాం పోలీసులపై అక్కడి కోర్టు మండిపడింది. బార్పేట కోర్టు మేవానీకి బెయిల్ మంజూర్ చేసే క్రమంలో తీవ్రంగా పోలీసులను మందలించింది. రాష్ట్రాన్ని పోలీస్ స్టేట్‌గా మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. -
జిగ్నేష్ మేవానీకి ఎట్టకేలకు బెయిల్
కొక్రాఝర్: గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీకి ఎట్టకేలకు బెయిల్ లభించింది. దౌర్జన్యపూరితంగా ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన కేసులో అస్సాంలోని బార్పేట సెషన్స్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. శనివారం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసినందుకు గుజరాత్లో ఏప్రిల్ 20న జిగ్నేష్‌ను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 25న ఆయనకు బెయిల్ మంజూరైంది. స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్ది గంటల్లోనే ఆయనను మరోసారి అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసు అధికారిని దుర్భాషలాడి దాడి చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 26న బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా బార్పేట చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముకుల్ చెతియా.. బెయిల్ నిరాకరించి ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. మేవానీ ఏప్రిల్ 28న మరోసారి బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయగా, వాదనలు విన్న తర్వాత కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. 29న బెయిల్ మంజూరు చేసింది. రూ. 1,000 వ్యక్తిగత బాండ్‌పై కోర్టు బెయిల్ ఇచ్చిందని మేవానీ తరపు న్యాయవాది అంగ్షుమన్ బోరా తెలిపారు. దీన్ని బట్టే ఇది అక్రమ కేసు అని అర్థమవుతోందన్నారు. మొదటి కేసుకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి మేవానీని తిరిగి కొక్రాఝర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని, ఆపై విడుదల చేస్తారని.. దీనికి ఒక రోజు పట్టవచ్చని బోరా చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రపూరితంగా తనను కేసుల్లో ఇరికించాయని మెవానీ అంతకుముందు ఆరోపించారు. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల నోరు మూయించేందుకు అధికార బీజేపీ చేస్తున్న ప్రయత్నంగా మేవానీ అరెస్ట్‌ను విపక్షాలు పేర్కొంటున్నాయి. (క్లిక్: తీవ్ర వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీకి దూరం కానున్నాడా?) -
ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ మళ్లీ అరెస్ట్.. బెయిల్ పొందిన కొద్ది సేపటికే..
గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీని అస్సాం పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్ల కేసులో జిగ్నేష్ మేవానీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్ది గంటల్లోనే ఆయనపై కొత్త కేసు నమోదైంది. దీంతో అస్సాం పోలీసులు జిగ్నేష్‌ను మళ్లీ అరెస్ట్ చేశారు. అయితే ఈసారి అధికారులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. అస్సాంలోని రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో(బార్పేట, గోల్పరా) మేవానిపై రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు భారీ భద్రత మధ్య కోక్రాఝర్ జైలు నుంచి బార్పేట పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. దీనిపై జిగ్నేష్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీపై తాజాగా రెండు జిల్లాల్లో నమోదైన కేసుకు సంబంధించి మళ్లీ అరెస్ట్ చేయడం చాలా బాధాకరమన్నారు. ఇది జరుగుతుందని తమకు ముందే తెలుసని, దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాగా ప్రధాని మోదీపై వివాదాస్పద ట్వీట్ల కేసులో తొలిసారి మేవానిని గత బుధవారం అస్సాం పోలీసులు పాలన్పూర్ పట్టణంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అస్సాం బీజేపీ నేత అరూప్ కుమార్ దే ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మతఘర్షణలకు దారితీసేలా రెచ్చగొట్టడం వంటి కేసుల్లో అరెస్టు అయిన మేవానీని అస్సాంలోని కోక్రాఝర్‌లోని స్థానిక కోర్టు ఆదివారం ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అనంతరం సోమవారం ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు నుంచి విడుదల కాకముందే మరో కేసులో బార్పేట పోలీసులు అరెస్టు చేశారు. -
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. బనస్కాంత జిల్లాలోని పాలన్పూర్ సర్క్యూట్ హౌజ్ వద్ద బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ట్వీట్‌పై చెలరేగిన వివాదంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. జిఘ్నేష్ అరెస్టును ఆయన మద్దతుదారులు ధ్రువీకరించారు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ లేకుండానే ఎమ్మెల్యేను అరెస్టు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానిపై అస్సాం పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక కమ్యూనిటీని కించపరచడం, రెండు వర్గాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు కుట్ర పన్నడం, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించడం.. వంటి ట్వీట్లు చేసినందుకు ఎమ్మేల్యే జిగ్నేష్ మేవానీపై పోలీసులు ఈ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. చదవండి: జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు స్వతంత్ర ఎమ్మెల్యే..కాంగ్రెస్‌కు మద్దతు జిగ్రేష్ మేవానీ వేద్గాం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి శాసనసభ సభ్యుడిగా గెలుపొందారు. అయితే, ఆయన గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారు. జిగ్నేష్ మేవానీతో పాటు సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్ గత ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో కన్హయ్య కూమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. మేవానీ మాత్రం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తన పదవీ కాలం ఉన్నంత వరకు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతానని ప్రకటించారు. -
కాంగ్రెస్‌లోకి కన్హయ్య
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కన్హయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కన్హయ్య వెంట గుజరాత్ దళిత యువ నేత, స్వతంత్య్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి బయటి నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ఇప్పుడే కాంగ్రెస్‌లో చేరట్లేదని జిగ్నేష్ చెప్పారు. ఇప్పుడు పార్టీలో చేరితే స్వతంత్య్ర ఎమ్మెల్యేగా కొనసాగడం కుదరదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీదనే బరిలో దిగుతానని స్పష్టంచేశారు. రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్(ఆర్‌డీఏఎం) కన్వీనర్ అయిన జిగ్నేష్ గుజరాత్‌లోని వద్గామ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు యువ నేతలు కాంగ్రెస్‌కు మద్దతివ్వడం పార్టీకి బాగా కలిసొచ్చే అంశం. గుజరాత్లో దళితులకు దగ్గరవుతున్న కాంగ్రెస్‌కు జిగ్నేష్ మద్దతు వచ్చే ఎన్నికల్లో లాభం చేకూర్చనుంది. 2019లో సీపీఐలో చేరిన కన్హయ్య బిహార్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేశారు. బెగుసరాయ్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ నేత గిరిరాజ్ సింగ్‌తో పోటీపడి ఓటమి పాలయ్యారు. మరోవైపు, కన్హయ్య కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ స్పందించింది. ఆయనను బెగూసరాయ్‌లో ప్రజలు తిరస్కరించారని, రాజకీయంగా ఎదిగేందుకే పార్టీ మారారని బిహార్ బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి మంగళ్ పాండే ఆరోపించారు. -
Kanhaiya Kumar: కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్య కుమార్
సాక్షి, ఢిల్లీ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, కాంగ్రెస్ రాజకీయ పార్టీనే కాదు.. అంతకంటే గొప్పదైన సిద్ధాంతం అని పేర్కొన్నారు. దేశంలో గొప్ప ప్రజాస్వామిక పార్టీ అని, కాంగ్రెస్ లేకుండా దేశంలో పరిపాలన సరైన రీతిలో సాగదని అన్నారు. చదవండి: Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు కాంగ్రెస్ పార్టీ చాలా మంది ఆశయాలను నిలబెడుతూ ఉందని తెలిపారు. మహాత్మాగాంధీలోని ఏకత్వం, భగత్సింగ్లోని ధైర్యం, బీఆర్ అంబేద్కర్‌లోని సమానత్వం అన్నింటిని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని పేర్కొన్నారు. అందుకోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెప్ పార్టీతోనే భారతదేశం రక్షించబడుతుందని కోట్లాది మంది యూవత భావిస్తున్నారని అన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో కన్హయ్య కుమార్ సీపీఐ పార్టీ తరఫున బిహార్‌లోని బెగూసరయ్ లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (ఆర్‌డీఏఎమ్) ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఈ రోజు కాంగ్రెస్ చేరాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల చేరలేదు. తాను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ చేరలేదని జిగ్నేష్ మేవాని తెలిపారు. తాను స్వతంత్ర ఎమ్మెల్యేనని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముతానని తెలిపారు. గుజరాత్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన గుజరాత్‌లోని వడ్గామ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్.. ముహుర్తం ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: వలసలు, వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ కొత్త జవసత్వాలు కూడగట్టుకునే పనిలో పడింది. యువతరమే పార్టీని బలోపేతం చేస్తుందని భావిస్తున్న అధిష్టానం ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే ఇద్దరు యువనాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకు ముహుర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (ఆర్‌డీఏఎమ్) ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని సెప్టెంబర్ 28న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మొదట అక్టోబర్ 2 గాంధీ జయంతిన వీరివురు కాంగ్రెస్‌లో చేరతారని వార్తలొచ్చాయి. అయితే ఇది మరింత ముందుగా భగత్‌సింగ్ జన్మదినమైన సెప్టెంబర్ 28న ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. చదవండి: (తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. ఆరోపణలు, చాలెంజ్‌లు!) గుజరాత్‌లోని వడ్గామ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత నాయకుడు, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలున్నాయి. కాగా, సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్, యువ నాయకుడు రాజీవ్ సతావ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. జిగ్నేష్ మేవాని పార్టీలో చేరితే శక్తిమంతమైన దళిత నాయకుడి అండ పార్టీకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరి బీహార్ యూనిట్‌ను బలపరుస్తారని భావిస్తున్నారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై కన్హయ్య కుమార్ ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉండటంతో యువతను బాగా ఆకర్షించే కన్హయ్య కుమార్‌ను ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. బిహార్ ఎన్నికల సమయానికి కన్హయ్యను పార్టీలో కొత్త శక్తిగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చదవండి: (పంజాబ్ ముగిసింది.. ఇక రాజస్తాన్‌పై కాంగ్రెస్ దృష్టి) -
కాంగ్రెస్ టాలెంట్ హంట్.. యువ నేతలపై వల
న్యూఢిల్లీ: వలసలు, వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ కొత్త జవసత్వాలు కూడగట్టుకునే పనిలో పడింది. యువ తరమే పార్టీని బలోపేతం చేస్తుందని భావిస్తున్న అధిష్టానం ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల కాలంలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సుస్మితా దేవ్, ప్రియాంక చతుర్వేది వంటి యువనేతలు పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఆ లోటుని భర్తీ చేయాలని చూస్తోంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజల్లో తమకంటూ ఒక ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, సీపీఐ నేత కన్హయ్య కుమార్, గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వంటి నాయకుల్ని కాంగ్రెస్ అక్కున చేర్చుకోవాలని చూస్తోంది. మోదీకి ఎదురొడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎదిరించి ప్రజల్లోకి బాగా దూసుకువెళ్లిన నాయకుల్లో కన్హయ్య కుమార్ ఒకరు. విద్యార్థి సంఘం నాయకుడిగా కేంద్రంపై ఆయన సంధించే ఒక్కో మాట తూటాలా పేలేది. ఆయన ప్రసంగాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సీపీఐలో చేరిన కన్హయ్య కుమార్ బెగుసరాయ్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. అప్పట్నుంచి పెద్దగా వార్తల్లోకి రాని ఆయన వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నారు. లెఫ్ట్ పారీ్టలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని అనుకుంటున్న కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాందీని మంగళవారం కన్హయ్య కుమార్ కలుసుకొని చర్చించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ కన్హయ్య కుమార్ ఎక్కడికి వెళ్లినా జనాన్ని ఆకర్షించే శక్తి ఉన్న నాయకుడు. ఆయన సభలకు యువత భారీగా తరలి వస్తుంది. అందుకే వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కన్హయ్య కుమార్‌ని ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. బిహార్ ఎన్నికల నాటికి ఆయనను కాంగ్రెస్ పారీ్టలో కొత్త శక్తిగా తీర్చిదిద్దాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గుజరాత్లో నాయకత్వ సమస్య గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని సైతం కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారు. గత ఎన్నికల్లో జిగ్నేష్ మేవాని పోటీ చేసిన వడ్గమ్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని దింపకుండా ఆయన విజయానికి కాంగ్రెస్ పరోక్షంగా సహకరించింది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేష్ మేవాని కాంగ్రెస్‌లో చేరడం వల్ల పార్టీకి బలం చేకూరుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్, యువ నాయకుడు రాజీవ్ సతావ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. జిగ్నేష్ మేవాని పారీ్టలో చేరితే శక్తిమంతమైన దళిత నాయకుడి అండ పార్టీకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
భారతీయుడిగా విచారిస్తున్నా..వారిని జాతి ఎప్పటికీ క్షమించదు!
సాక్షి,ముంబై: ఎల్గార్ పరిషద్ కేసులో ఉపా చట్టం కింద అరెస్టై, జైలు జీవితం గడుపుతున్న ప్రముఖ ఆదివాసీ హక్కుల ఉద్యమకారుడు ఫాదర్ స్టాన్ స్వామి (84) కన్నుమూయడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఫాదర్ స్టాన్ స్వామి అస్తమయం హక్కుల ఉద్యమానికి తీరని లోటని పలువురు రాజకీయ నేతలు, ఉద్యమ నేతలు తమ సంతాపం తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వామి మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన న్యాయానికి, మానవత్వానికి అర్హుడు అంటూ స్టాన్ మృతిపై సంతాపం తెలిపారు. స్వామి మరణం విచారకరం. గొప్ప మానవతావాది, దేవుడిలాంటి ఆయన పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించింది. ఒక భారతీయుగా చాలా బాధపడుతున్నానంటూ కాంగ్రెస్ ఎంపీ,సీనియర్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. ఈ విషాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు?నిర్దోషిని, సామాజిక న్యాయం కోసం నిరంతరం తపించిన స్వామిని ప్రభుత్వమే హత్య చేసిందని జయరాం రమేష్ వ్యాఖ్యానించారు. స్వామి మరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర మనస్తాపాన్ని వ్యక్తం చేశారు.సమాజంలో అత్యంత అణగారినవారి కోసం జీవితాంతంపోరాడిన వ్యక్తి కస్టడీలో చనిపోవడం అత్యంత విచారకరమని ట్విట్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయం తీరని అపఖ్యాతికి గురవుతోందన్నారు. ఇంకా జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ , సీపీఎం (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తదితరులు ట్విటర్ ద్వారా స్వామి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఫాసిస్ట్ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిన ధైర్యశాలి, ఉద్యమకారుడు స్వామికి మరణం లేదని, ఆయన తమ హృదయంలో ఎప్పటికీ జీవించే ఉంటారని దళిత యువనేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ట్వీట్ చేశారు. ఆ మహామనిషి రక్తంతో తమ చేతులను తడుపుకున్న మోదీ షాలను జాతి ఎప్పటికీ విస్మరించదంటూ మండిపడ్డారు. దారుణ ఉపా చట్టం ఆయనను బలి తీసుకుంది. త్వరలో విచారణ మొదలు కానుందనే ఆశ విఫలం కావడంతో న్యాయవాదులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు అందరూ మూగబోయారంటూ ప్రముఖ న్యాయవాది కబిల్ సిబల్ ట్వీట్ చేశారు. నోరెత్తిన వారినందరినీ "ఉగ్రవాదులు" గా ప్రభుత్వం ముద్ర వేస్తోందంటూ ఘాటుగా విమర్శించారు. కాగా కరోనా బారిన పడి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి మరింత క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నం 2.30 ఉండగా ఉదయం కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. 84 ఏళ్ల వయసులో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ స్థిరంగా మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్న స్వామిని జైల్లో నిర్బంధించి, బెయిల్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకుందని బీజేపీ సర్కార్‌పై పలువురు సామాజిక సంఘ నేతలు మండిపడుతున్నారు. Heartfelt condolences on the passing of Father Stan Swamy. He deserved justice and humaneness. — Rahul Gandhi (@RahulGandhi) July 5, 2021 Sad to learn of Fr #StanSwamy's passing. A humanitarian & man of God whom our government could not treat with humanity. Deeply saddened as an Indian. RIP. https://t.co/aOB6T0iHU9 — Shashi Tharoor (@ShashiTharoor) July 5, 2021 Stan Smith (84) passes away The system sucks UAPA No bail Little hope of early trial Others too languish in jail Lawyers , Academics , Social Activists ....raise their voices for the voiceless They too are now “voiceless” The State calls them “ terrorists” — Kapil Sibal (@KapilSibal) July 5, 2021 Fr Stan Swamy shall never die. He will live in our hearts as a hero, the brave dissenter who stood against the fascist Modi government at the cost of his life. Modi & Shah have Fr. Stan Swamy's blood on their hands. The country will never forgive them. #StanSwamy — Jignesh Mevani (@jigneshmevani80) July 5, 2021 Deeply saddened by the passing of Fr. Stan Swamy. Unjustifiable that a man who fought all through his life for our society's most downtrodden, had to die in custody. Such travesty of justice should have no place in our democracy. Heartfelt condolences! — Pinarayi Vijayan (@vijayanpinarayi) July 5, 2021 -
ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు
చెన్నై: తమిళనాడు పోలీసుల రాక్షసత్వంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో తండ్రీకొడుకుల్ని హింసించి చంపడంపై జనం మండిపడుతున్నారు. వీరిని ఇండియన్ ‘జార్జ్ ఫ్లాయిడ్’లు అంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో వ్యాఖ్యాని స్తున్నారు. తమిళనాడులోని శాంతాకులం ప్రాంతానికి పి.జయరాజ్ (62) జూన్ 19న తన దుకాణాన్ని లాక్డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు మూసివేయకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి గురించి కనుక్కోవడానికి వెళ్లిన జయరాజ్ కొడుకు బెనిక్స్‌నూ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వారి బంధువులు 20న స్టేషన్‌కెళ్లారు. అప్పుడే వారిద్దరి నడుము భాగాల కింద తీవ్రంగా రక్తస్రావం అవుతుండడాన్ని గుర్తించారు. 21న వీరిద్దరూ రిమాండ్‌లోనే కన్నుమూశారు. ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారు 19న రాత్రంతా పోలీసులు వీరిద్దరిని తీవ్రంగా హింసించారని ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు చెప్పారు. వారి ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారని తెలిపారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని విచారించనున్నట్లు తమిళనాడు హైకోర్టు ప్రకటించింది. తమిళనాడు పోలీసుల అమానుషత్వాన్ని అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ ఉదంతంతో పోలుస్తూ గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ ట్వీట్ చేశారు. -
‘అర్ధరాత్రి ఎందుకు ఇలా.. సిగ్గుచేటు’
ముంబై : మహారాష్ట్రలోని ఆరే కాలనీలో అర్ధరాత్రి చెట్ల నరికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద్దంటూ వందలాది మంది పర్యావరణ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేసి అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. గోరెగావ్ సమీపంలోని ఆరేకాలనీలో కార్ల పార్కింగ్ కోసం షెడ్డు నిర్మించేందుకు ముంబై మెట్రో నిర్ణయించింది. ఇందుకోసం భారీ సంఖ్యలో చెట్ల నరికివేత కార్యక్రమానికి పూనుకుంది. ఈ నేపథ్యంలో మెట్రో నిర్ణయాన్ని నిరసిస్తూ పర్యావరణ కార్యకర్తలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు చెట్ల నరికివేత అడ్డుకోవాలంటూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని కొట్టివేసింది. దీంతో మెట్రో అధికారులు రాత్రి సమయంలో నరికివేత పనులను ప్రారంభించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యావరణ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్డోజర్లకు అడ్డుగా నిలబడి శాంతియుతంగా నిరసన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై నిబంధనల ప్రకారం కోర్టు ఆర్డర్ వెబ్సైట్లో పెట్టిన 15 రోజుల తర్వాతే చెట్లు నరికివేసే వీలుంటుందని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. కానీ మెట్రో అధికారులు మాత్రం అర్ధరాత్రి అత్యుత్సాహం ప్రదర్శించి చెట్లను నరికివేయడం దారుణమని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై శివసేన చీప్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, వర్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య ఠాక్రే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు... ‘ మెట్రో 3 పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాల్సింది. కానీ అర్ధరాత్రి ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. భారీగా పోలీసులను మోహరించి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది. ఈ ప్రాజెక్టు ముంబైకి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే ప్రయోజనం చేకూరుస్తుంది అనుకున్నాం గానీ, ఇలా చెట్లను నరకుతుంది అనుకోలేదు అని వరుస ట్వీట్లు చేశారు. ఇక గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ సైతం పోలీసుల తీరును విమర్శించారు. ‘ ఆరేలో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై లాఠీచార్జీ చేశారు. వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. మహిళలను ఇష్టం వచ్చినట్లుగా నెట్టివేశారు. ఇది చట్టవ్యతిరేక చర్య’ అని ట్విటర్లో పేర్కొన్నారు. Lathi Charge done for the first time at the peaceful protests for Aarey. People have been detained inside, gates have been closed and the authorities are abusing the protestors. Women have been pushed and detained by the police at this hour, which is lawfully wrong. #SaveAarey — Jignesh Mevani (@jigneshmevani80) October 4, 2019 -
గుజరాత్లో అంటరానితనం
అహ్మదాబాద్: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా అంతరానితనం కొనసాగుతూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో దళిత ఉపాధ్యాయుడి పట్ల వివక్ష చూపిన అమానవీయ ఘటన తాజాగా వెలుగు చూసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటకు వచ్చింది. సురేంద్ర నగర్ జిల్లాలోని పియావా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దళితుడైన తన పట్ల ప్రధానోపాధ్యాయుడు మాన్‌సంగ్ రాథోడ్ ప్రతిరోజు వివక్ష చూపించారని బాధితుడు కన్హయలాల్ బరైయా(46) ఆరోపించారు. తనను అంటరానివాడిలా చూసేవారని వాపోయారు. ‘పాఠశాలలో రెండు వేర్వేరు కుండల్లో మంచినీళ్లు పెట్టించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేను ఒక కుండలో నీళ్లు మాత్రమే తాగాలి. అగ్రకులాల వారైన మరో ముగ్గురు ఉపాధ్యాయులు మరో కుండలో నీళ్లు ఉంచారు. అగ్ర కులాల వారి కుండలో నీళ్లు తాగినందుకు జూలైలో 3న నాకు నోటీసులు ఇచ్చారు. విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు వేధింపులు భరించాన’ని కన్హయలాల్ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనకు సాయుధ పోలీసుతో రక్షణ ఏర్పాటు చేశారు. గుజరాత్లో అంటరానితనం కొనసాగుతోందనడానికి కన్హయలాల్ ఉదంతమే నిదర్శనమని వాద్గామ్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని అన్నారు. అంతరానితనాన్ని రూపుమాపడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. -
ఫేక్ వీడియో; చిక్కుల్లో ఎమ్మెల్యే!
అహ్మదాబాద్ : నకిలీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కారణంగా గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ చిక్కుల్లో పడ్డారు. నకిలీ వీడియోను షేర్ చేసి తమ పరువుకు భంగం కలిగించారన్న ప్రైవేటు పాఠశాల ఫిర్యాదుతో పోలీసులు శనివారం ఆయనపై కేసు నమోదు చేశారు. గత నెల 20న జిగ్నేష్ మేవానీ.. ఓ వ్యక్తి విద్యార్థిని కొడుతున్న వీడియోను ఓ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. విద్యార్థిని అర్థనగ్నంగా నిలుచోబెట్టి.. చితకబాదుతున్నట్లుగా ఉన్న ఈ వీడియోలో ఉన్నది ఆర్‌ఎమ్‌వీఎమ్ పాఠశాల ఉపాధ్యాయుడు అని జిగ్నేష్ పేర్కొన్నారు. అంతేగాకుండా.. ‘ ఈ పాఠశాలను మూసివేసి.. అందులోని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు ఇదంతా ఏంటి’ అంటూ ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ఇది గుజరాత్‌కు సంబంధించిన వీడియో కాదని..ఈజిప్టుకు చెందినది అని జిగ్నేష్‌కు తెలిపారు. దీంతో ఆయన వెంటనే తన ట్వీట్‌ను తొలగించారు. అయితే అప్పటికే ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆర్‌ఎమ్‌వీఎమ్ హెడ్ మాస్టర్ పోలీసులను ఆశ్రయించారు. తమ పాఠశాల పరువు తీశారంటూ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 505(2)(అసత్యాలు ప్రచారం చేయడం), 500(పరువునష్టం) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా గుజరాత్‌లోని వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా పోటీ చేసిన మేవానీ ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. -
అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడనీ..
అహ్మదాబాద్ : అగ్రకుల అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ టీనేజ్ కుర్రాడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. గుజరాత్,మెహసాన పట్టణ సమీపంలోని దినోజ్ గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల కుర్రాడు.. 12వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి స్కూల్ ముందు వేచిఉండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. శరీరంపై గాయాలు చూసిన బాధితుడి తల్లి వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘పరీక్ష ఉంది వదలిపెట్టండన్నా.. అని వేడుకున్న విడిచిపెట్టలేదని బాధితుడు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు. తనను తీసుకెళ్లిన వారిలో ఒకరిని గుర్తుపట్టానని, అతను గుజరాత్ ఆర్టీసీ కండక్టర్ రమేష్ పటేలని పోలీసులకు తెలిపాడు. ఇక ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయకపోతే బంద్‌కు పిలుపునిచ్చి, ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ దాడితో బాధితుడు ఒక్క ఇంగ్లీష్ పరీక్షనే కాకుండా మరో ఎగ్జామ్ కూడా రాయలేని పరిస్థితి ఏర్పడింది మేవానీ తెలిపారు. -
ఎ‘టాక్’! కొత్త గళాలు.. ప్రశ్నించే గొంతుకలు..
చైతన్యానికి నిదర్శనం ప్రశ్నించడమైతే.. అన్ని రకాల ప్రశ్నలను ఆహ్వానించడం ప్రజాస్వామ్యానికి పుష్టినిస్తుంది! అందుకే.. ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో.. అసమ్మతికి తావు, ప్రాధాన్యం ఎక్కువే ఉండాలి. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షాలదైతే.. అది కాస్తా విఫలమైనప్పుడు పౌర సమాజం తన గొంతుకనివ్వాలి. ప్రజాస్వామ్యంలో మూలస్తంభాలుగా భావించే వ్యవస్థలు రకరకాల కారణాలతో రాజీ పడిపోతున్నఈ తరుణంలో.. మేమున్నామంటూ కొందరు ముందుకొస్తున్నారు!. ప్రజాస్వామ్యమంటే.. నేతలు, ఎన్నికలు మాత్రమే కాదు.. అంశాలపై గళమెత్తడం కూడా అంటున్న వీరు వినిపిస్తున్న కొత్త గళాలివిగో... ఓటరే అసలు దేవుడు: ప్రకాశ్‌రాజ్ ఒక్క సంఘటన మన జీవిత గమనాన్నిమార్చే స్తుందంటారు. ప్రకాశ్‌రాజ్ విషయంలోజరిగింది అచ్చంగా ఇదే. నటుడిగా ఐదారు భాషల్లోనటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న సమయంలో చిన్ననాటి స్నేహితురాలు.. అదీ తన గురువుగాభావించి పూజించిన లంకేశ్ కూతురు గౌరి.. ఇంటి ముందే దారుణమైన హత్యకు గురికావడంప్రకాశ్ను దేశంలోనే శక్తిమంతుడైన వ్యక్తిని కూడా ఢీకొనేలా చేసింది. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రకాశ్‌రాజ్ వేసిన ప్రశ్నలు చాలా మౌలికమైనవి. కర్రుకాల్చివాతపెట్టడమెలాగో బాగా తెలిసిన ప్రకాశ్రాజ్రాజకీయాలు కులం, మతం, ప్రాంతాల ఆధారంగా కాకుండా సామాన్యుడి అవసరాలు, బాగు చుట్టూజరగాలని కోరుకుంటారు. ప్రకాశ్ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయ బరిలోకీ దిగేశారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ ఇప్పటికే సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుస్తూప్రచారం కూడా మొదలుపెట్టారు. పార్లమెంటు సభ్యుడంటే ఢిల్లీలో కూర్చుని రాజకీయం మాత్రమే చేయడం కాదంటున్న ఈ నటుడుమురికివాడల్లోని అతి సామాన్యుల కష్టాలకూ స్పందించాలని అంటున్నారు. రామమందిర రాజకీయాలకు కాకుండా సామాన్య రైతుల కష్టాలను తీర్చడమే ముఖ్యమని స్పష్టంగా చెబుతున్న ప్రకాశ్ఎన్నికల్లో ఏమాత్రం విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే!! దళిత హక్కుల గళం: జిగ్నేశ్ మెవానీ ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని బహిరంగంగా వ్యాఖ్యానించగల ముఖ్యమంత్రులున్న ఈ దేశంలో దళితుడిగా పుట్టిన ప్రతివాడికీ విచక్షణ అంటే ఏమిటో స్పష్టంగా తెలుసని కుండబద్దలు కొట్టగలిగే జిగ్నేశ్ మెవానీ కూడా ఉన్నాడు! చర్మకారుడిగా తాత అనుభవాలు కదలించాయో.. పొట్టకూటి కోసం అహ్మదాబాద్ మున్సిపాలిటీలో అన్ని రకాల పనులూ చేసిన తండ్రి కష్టాలు ఆలోచనలు రేకెత్తించాయో తెలియదుగానీ.. ముంబైలో కొంతకాలం విలేకరిగానూ పనిచేసిన జిగ్నేశ్ ఆ తరువాతి కాలంలో న్యాయవాదిగా దళితుల హక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభించాడు. గుజరాత్‌లోని ఊనాలో దళితులకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా నిరసించిన జిగ్నేశ్ అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా గళమెత్తి, ఉద్యమించాడు. కమ్యూనిస్టు నేత ముకుల్ సిన్హా, గాంధేయ వాది చున్నీభాయ్ వేద్ వద్ద ఉద్యమ పాఠాలు నేర్చుకున్న జిగ్నేశ్ 2016 నాటి ‘‘దళిత్ అస్మిత్ యాత్ర’’తో ప్రాచుర్యంలోకి వచ్చారు. దేశంలో దళితులపై వివక్ష పోవాలన్నా, సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలన్నా కార్పొరేట్ సంస్థలకు బదులు దళితులకు భూమి పంపిణీ జరగాలని అంటున్నారు. ఇందుకోసం వ్యవస్థాగత మార్పులూ తప్పనిసరి అన్నది జిగ్నేశ్ వాదన. దళిత్ అస్మిత యాత్ర తరువాత జరిగిన ఎన్నికల్లో జిగ్నేశ్ గుజరాత్‌లోని వడ్గామ్ నుంచి అసెంబ్లీ బరిలో దిగి విజయం సాధించారు. తరువాతి కాలంలో దేశవ్యాప్తంగా దళితులను తమ హక్కుల సాధనకు ఉద్యమించేలా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని భీమా కొరేగావ్‌లో ఘర్షణలకు కారణమయ్యాడని పోలీసులు కేసులు పెట్టినా.. అతడి ప్రమేయమేమీ లేదని కోర్టు ఆ కేసును కొట్టేసింది. రోడ్డెక్కిన పాటీదార్: హార్దిక్ పటేల్ రెండేళ్ల క్రితం జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అత్తెసరు ఆధిక్యంతో ఇంకోసారి పగ్గాలు చేపట్టింది. దేశం మొత్తం మోదీ గాలులు వీస్తున్న 2017లో గుజరాత్లో బీజేపీని నిలువరించిన యువనేతగా హార్దిక్ పటేల్‌ను వర్ణిస్తారు విశ్లేషకులు. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలన్న ఆందోళనకు నేతృత్వం వహించిన హార్దిక్ పటేల్ ఆలోచనలు ఇతరుల కంటే చాలా భిన్నం. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈయన. మంచి మార్కులు సంపాదించుకున్నా తన చెల్లికి స్కాలర్షిప్ రాకపోవడం.. తక్కువ మార్కులతోనే ఓబీసీల్లోని చెల్లి స్నేహితురాలికి దక్కడం.. యువ హార్దిక్ పటేల్‌కు ఏమాత్రం నచ్చలేదు. రిజర్వేషన్లు కొందరికి మాత్రమే ఉపయోగపడుతున్నాయని ఆందోళన చేపట్టిన హార్దిక్.. ఓబీసీ కోటాలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలని.. అలా కుదరని పక్షంలో అందరికీ ప్రత్యేక కోటాలు తీసేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం వేలమంది యువకులతో నిర్వహించిన పాటీదార్ అనామత్ ఆందోళన్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఓబీసీ వర్గపు నేత అల్బేశ్ ఠాకూర్, దళిత ఉద్యమ నేత జిగ్నేశ్ మెవానీతో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్న హార్దిక్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. రాజ్యాంగంపై ఒట్టేసి..: కన్హయ్య కుమార్ మూడేళ్ల క్రితం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా దేశమంతా పరిచయమైన వ్యక్తి. పీహెచ్డీ విద్యార్థులకిచ్చే భృతిని తగ్గించడంపై ఢిల్లీ వీధులకెక్కిన కన్హయ్య కుమార్ తరువాతి కాలంలో దేశద్రోహం కేసులు ఎదుర్కోవడం.. అరెస్ట్ కావడం ఇటీవలి పరిణామాలే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బెయిల్‌పై విడుదలయ్యాక జేఎన్‌యూలో తోటి విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం.. చతురోక్తులు, మాట విరుపులతో మోదీ, అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఎక్కుపెట్టిన విమర్శలు దేశంలో సరికొత్త చర్చకు దారితీశాయి. కన్హయ్య కుమార్ నమ్మేది.. ప్రచారం చేసేది.. రాజకీయ నేతలు అనుసరించాలని కోరుకుంటున్నదీ ఒక్కటే. భారత ప్రజలందరి కోసం రాసుకున్న రాజ్యాంగాన్ని తు.చ. అమలు చేయమని! ఎన్నికల సమయంలో చేసిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలందరూ ప్రశ్నించాలన్నది అతని సిద్ధాంతం. బిహార్‌లోని బేగూసరాయిలోని భూమిహార్ కుటుంబం నుంచి వచ్చారీయన. జేఎన్‌యూలో పీహెచ్డీ చేసే సమయానికి ఆయన ఆలోచన తీరులో గణనీయమైన మార్పు వచ్చింది. రాజ్యాంగం రూపంలో అంబేడ్కర్ దళితులకు కల్పించిన రక్షణను, వామపక్ష సిద్ధాంతాలను కలిపి కన్హయ్య కుమార్ ప్రతిపాదిస్తున్న ‘‘లాల్.. నీల్’’ నినాదాన్ని ఇప్పుడు వామపక్ష పార్టీలు ప్రచారం చేస్తూండటం గమనార్హం. 2019 ఎన్నికల బరిలోనూ నిలుస్తున్న ఈ యువనేత భారత రాజకీయ వ్యవస్థలో సరికొత్త, ప్రస్ఫుటమైన గళమవుతారనడంలో సందేహం లేదు. గిరిజనుల మరో గొంతుక: సోనీ సూరి బస్తర్ జిల్లాలో ఒకప్పుడు ఓ సామాన్య ఉపాధ్యాయురాలి పేరు సోనీ సూరి! మరి ఇప్పుడు..? దాదాపు 17 రాష్ట్రాల్లో గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న ధీర వనిత. ఒకపక్క నక్సలైట్లు.. ఇంకోవైపు వారిని వెంటాడుతూండే పోలీసుల మధ్య నలిగిపోతూ మాన ప్రాణాలను కోల్పోతున్న గిరిజనులకు అండగా నిలవడం ఈమె వృత్తి, ప్రవృత్తి కూడా. తమతో కలిసిపోవాల్సిందిగా మావోయిస్టులు కోరినప్పుడు.. తమకు ఇన్ఫార్మర్గా పనిచేయాలని పోలీసులు ఆదేశించినప్పుడూ సోని సూరి చెప్పిన మాట ఒక్కటే. ఇద్దరికీ సమాన దూరంలో ఉండటం తన విధానమని కుండబద్దలు కొట్టింది. అందుకు తన భర్తను పోగొట్టుకుంది. అత్యాచారాలకు గురైంది. ఎనిమిది పోలీసు కేసులు ఎదుర్కొంది. చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టి మరీ తాను పోలీసుల చేతిలో అత్యాచారానికి గురయ్యానని.. అది తన హక్కులను కాలరాయడమేనని వాదించి విజేతగా నిలిచింది. ఆ తరువాతి కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎన్నికల బరిలోనూ నిలిచింది. సోనీ తండ్రిని మావోయిస్టులు కాల్చేస్తే.. సానుభూతి పరుడన్న నెపంతో పోలీసులు భర్తను ఎత్తుకెళ్లిపోయి.. హింసించిన కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయినాసరే నమ్మిన సిద్ధాంతాల కోసం, గిరిజనుల హక్కుల కోసం సోనీ సూరి ఛత్తీస్‌గఢ్‌లో పోరాడుతూనే ఉన్నారు. ఈ మధ్యలో ఆమెపై యాసిడ్ దాడి కూడా జరిగింది. కశ్మీర్ కి కలీ షెహలా రషీద్ షోరా కశ్మీర్ సమస్య పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది ఉగ్రవాదం మాత్రమే కావచ్చు. అయితే ఈ ఉగ్రవాదాన్ని అణచివేసే లక్ష్యంతో అక్కడ ఏర్పాటు చేసిన రక్షణ దళాలు హద్దుమీరి ప్రవర్తిస్తుంటాయని.. మానవ హక్కులను తోసిరాజంటాయని చాలామంది చెబుతుంటారు. కశ్మీర్‌లోనే పుట్టి పెరిగి.. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఎదిగిన షెహలా రషీద్.. కన్హయ్య కుమార్, ఉమర్ ఖాలిద్ అరెస్ట్‌కు నిరసనగా చేసిన ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. అంతకుముందు కూడా కశ్మీర్లో మానవ హక్కుల పరిస్థితిపై.. ముఖ్యంగా మైనర్ విచారణ ఖైదీలకు మద్దతుగా గళమెత్తారు షెహలా రషీద్. పీహెచ్డీ విద్యార్థులకు ఇచ్చే భృతిని తగ్గించిన సందర్భంలో ‘‘ఆక్యుపై యూజీసీ’’ పేరిట షెహలా తదితరులు చేసిన ఉద్యమం అందరికీ తెలిసిందే. 2015లో జేఎన్‌యూ ఎన్నికల్లో ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున బరిలో దిగిన షెహలా అత్యధిక మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. మంచి వక్తగా పేరొందిన ఈ కశ్మీరీ మహిళ వివాదాలకు కొత్తేమీ కాదు. ఒక ఫేస్బుక్ పోస్ట్‌లో మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఆరోపణపై 2017లో షెహలాపై ఒక కేసు నమోదైంది. కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం కేసు సందర్భంగానూ షెహలా చేసిన పలు వ్యాఖ్యలు దుమారం రేపాయి. పల్లె నాడి పట్టినోడు: సాయినాథ్ ‘‘పల్లె కన్నీరు పెడుతోందో.. కనిపించని కుట్రల’’... పదిహేనేళ్ల క్రితం ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసిన పాట. భారతీయ ఆత్మగా చెప్పుకునే పల్లెల్లోని కష్టాలకు ఈ పాట అద్దం పట్టింది. అయితే దశాబ్దాలుగా జర్నలిస్టుగా.. ఫొటో జర్నలిస్టుగా ఇదే పని చేస్తున్న పాలగుమ్మి సాయినాథ్ గురించి మాత్రం కొందరికే తెలుసు. కరువు, ఆకలి గురించి సాయినాథ్కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ లాంటి వాళ్లే చెబుతున్నారంటే ఈ వ్యక్తి సామర్థ్యం ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పీపుల్స్ ఆర్కై వ్ ఆఫ్ రూరల్ ఇండియా (పరి) పేరుతో సాయినాథ్ నడుపుతున్న ఓ వెబ్సైట్ దేశంలో అన్నదాతకు జరుగుతున్న నష్టమేమిటన్నది భిన్నకోణాల్లో వివరిస్తుంది. రైతు ఆత్మహత్యలు.. అందుకు దారితీస్తున్న కారణాలను వివరిస్తూ వేర్వేరు సమావేశాల్లో సాయినాథ్ చేసిన ప్రసంగాలు అత్యంత ఆసక్తికరమైనవంటే అతిశయోక్తి కాదు. ‘‘సుప్రీంకోర్టు జడ్జీలందరికీ కనీసం ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు ఉన్నన్ని అధికారాలు కూడా లేవు. కానిస్టేబుల్ అటో ఇటో తేల్చేస్తాడు. చట్టాలను తిరగరాసే శక్తిలేని సుప్రీంకోర్టు జడ్జీలు రెండువైపులా వాదనలను వినడం మాత్రమే చేయగలరు. కానిస్టేబుల్ మాత్రం తనదైన చట్టాన్ని సిద్ధం చేసుకోగలడు. ఏమైనా చేయగలడు’’ అంటారు సాయినాథ్. ప్రభుత్వ విధాన లోపాల కారణంగానే దేశంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని విస్పష్టంగా ఎలుగెత్తే సాయినాథ్ కార్పొరేట్ సంస్థలు సిద్ధం చేసిన గ్యాట్, డబ్ల్యూటీవో చట్టాల దుష్ప్రభావాలను రైతులు అనుభవిస్తున్నారని అంటారు. శ్రామిక బాంధవి: సుధా భరద్వాజ్ పుట్టిందేమో అమెరికా. పదకొండేళ్ల ప్రాయంలోనే భారత్‌కు తిరిగొచ్చారు. 18 నిండేసరికి అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఐఐటీ చదువుతూ.. కార్మికుల కష్టాలకు కదిలిపోయారు. న్యాయవాదిగానూ మారిపోయాడు. ఇదీ హక్కుల ఉద్యమకారిణి సుధా భరద్వాజ్ స్థూల పరిచయం. 30 ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఛత్తీస్‌గఢ్ ముక్తిమోర్చా తరఫున పనిచేస్తున్నారు. భిలాయి ప్రాంతంలోని గనుల్లో కార్మికుల వేతనాలను దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులపై కేసులు కట్టి న్యాయం కోసం పోరాడారు. గత ఏడాది జూలైలో రిపబ్లిక్ టీవీలో సుధా భరద్వాజ్‌పై వెలువడిన కథనం ఒకటి ఆమె అరెస్ట్‌కు దారితీసింది. మావోయిస్టు నేత ప్రకాశ్‌కు సుధా భరద్వాజ్ ఒక లేఖ రాసినట్లు.. ‘‘కశ్మీర్ తరహా పరిస్థితిని సృష్టించాలని అందులో పేర్కొన్నట్లు ఆర్ణబ్ గోస్వామి ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన సుధా భరద్వాజ్.. భీమా కోరేగావ్ అల్లర్ల విషయంలో పోలీసుల తీరును తప్పు పట్టినందుకే తనపై తప్పుడు ఆరోపణలు మోపుతున్నారన్నది సుధ వాదన. దేశమంటే మనుషులోయ్: ఖాలిద్ పార్లమెంటుపై ఉగ్రదాడి నిందితుడు అఫ్జల్ గురుపై జేఎన్‌యూలో ఒక కార్యక్రమం నిర్వహించడం ద్వారా వివాదాల్లోకి.. ప్రాచుర్యంలోకి వచ్చిన ఉమర్ ఖాలిద్ దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని గట్టిగా నమ్ముతారు. కాలేజీ రోజుల్లో భిన్న సంస్కృతులు, వ్యక్తులతో భిన్నత్వానికి పరిచయమైన ఉమర్.. తరువాతి కాలంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను, సమాజంలో వేర్వేరు వర్గాల వారికి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తడం మొదలుపెట్టారు. ఆర్థిక సరళీకరణల తరువాత దేశం అగ్రరాజ్యంగా ఎదుగుతోందన్న ప్రచారం జరుగుతున్న దశలోనూ కొన్ని వర్గాల వారు పొట్టగడిపేందుకు పడుతున్న కష్టాలు తనను కలచివేశాయని. దేశభక్తి అంటే.. వీరి కోసం పోరాడడమే అని గట్టిగా విశ్వసించి అనుసరిస్తున్నారు ఉమర్. రాజ్యాంగం కులమతాలకు అతీతంగా పనిచేయాలని.. స్పష్టం చేస్తూండగా. చేసే పని ఆధారంగా, కులం, వర్గం, మతం ఆధారంగా సమాజం విడిపోయి ఉండటం కూడా నిష్టు్టర సత్యమని.. రాజకీయాలు ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడాలని.. అంతరాలను, అసమానతలను మరింత పెంచేలా ఉండకూడదన్నది ఉమర్ విస్పష్ట అభిప్రాయం. దేశాన్ని ముక్కలు చేసే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఉమర్ ఖాలిద్ ప్రభుత్వాలు లాభాపేక్ష కలిగిన కార్పొరేట్లకు మద్దతుగా నిలవరాదని అంటారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన వారెన్ ఆండర్సన్‌ను అప్పటి అధికార పక్షం విమానంలో దేశం దాటిస్తే.. మోదీ ప్రభుత్వం నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులను దాటించేసిందని ఆరోపిస్తారు. -
మేం నిన్ను ఎన్నుకుంటాం..
బడ్జెట్ ‘‘ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్ని నియమాలకు, పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం. ఐదేళ్లపాటు కొనసాగే ప్రభుత్వ పదవీకాలం ఈ ఏడాది మే నెలతో ముగుస్తుంది. ప్రభుత్వం ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లను, ఒక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టగలదు. మూడు నెలల గడువు పెట్టుకుని ఏకంగా సంవత్సరానికి సరిపడ బడ్జెట్ ప్రవేశపెట్టడం సరికాదు’’ – ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ జపం ‘‘ప్రియాంకా గాంధీ గేమ్ చేంజర్ కానట్టయితే పొద్దుటి నుండీ అన్ని టీవీ చానళ్లూ, బీజేపీ ప్రతినిధులు ఆమె పేరు ఎందుకు జపిస్తున్నట్టు? కనీసం ఆమె ప్రస్తుతం మన దేశంలో లేదు, ఇప్పటి వరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయినా, అందరూ ఎందుకంత బెంబేలెత్తుతున్నారు?’’ – అశోక్ స్వైన్, ప్రొఫెసర్ ప్రజా గొంతు ‘‘నిన్న రాత్రి అనేకమందిని కలిశా. ‘మేం నిన్ను ఎన్నుకుంటాం. మళ్లీ మా దగ్గరకు వచ్చి మా అవస రాలు తీరుస్తావని మాకు తెలుసు’ అని ఓ తల్లి అరిచి చెప్పింది. ఎంతో ప్రేమ, నమ్మకం.. మరెంతో ఆశ. పార్లమెంట్లో ప్రజా గొంతు వినిపించాలన్న నా సంకల్పం రోజురోజుకూ బలోపేతం అవుతోంది’’ – ప్రకాష్ రాజ్, సినీ నటుడు భవిష్యత్ ‘‘ఐక్యతా విగ్రహం కోసం మూడు వేల కోట్లు, కుంభ మేళాకేమో రూ. 4,236 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వానికి, చిన్నారులకు వేయాల్సిన పోలియో వ్యాక్సిన్ కోసం డబ్బులు కేటా యించడానికి వచ్చేసరికి రూ. 280 కోట్ల లోటు బడ్జెట్ గుర్తొస్తుంది. ఇక చిన్నారుల భవిష్యత్‌ను కాపాడేదెవరు?’’ – జిగ్నేష్ మేవానీ, ఎమ్మెల్యే గోరక్షణ ‘‘ఉజ్వలమైన మన ప్రజాస్వామ్య దేశంలో ఇది కేవలం మరో మామూలు రోజు మాత్రమే. హరియాణాలోని రోహ్తక్ సమీపంలో భలౌట్ గ్రామం దగ్గర పశువులను విక్రయించే నౌషద్ మహ్మద్ అనే 24 ఏళ్ల కుర్రాడిని గోరక్షకులు రెండుగంటలపాటు చితకబాదారు. రక్తమోడుతూ, ఒళ్లంతా గాయాలతో ఉన్న అతడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకుపోకుండా, స్టేషన్‌కు తీసుకువెళ్లి గొలుసుతో కట్టిపడేశారు’’ – రాణా అయూబ్, జర్నలిస్ట్ -
జిగ్నేష్, కన్హయ్యపై సిరా దాడి
గ్వాలియర్: హిందూ సేనల దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో హిందూ సేన కార్యకర్త ఒకరు సిరాతో దాడికి పాల్పడ్డాడు. గుజరాత్ శాసనసభ్యుడు జిగ్నేష్ మేవాని, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్ సిరా దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ‘సంవిధాన్ బచావో’ ఆందోళన కార్యక్రమంలో భాగంగా స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సెమినార్‌కు వెళుతుండగా వీరిపై సిరా చల్లినట్టు వెల్లడించారు. వీరిపై హిందూ సేనకు చెందిన ముకేశ్ పాల్ అనే వ్యక్తి ఇంక్ చల్లాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. సిరా దాడి జరిగినప్పటికీ జిగ్నేష్, కన్హయ్యకుమార్ సెమినార్లో పాల్గొన్నారని తెలిపారు. ముకేశ్ పాల్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఆదివారం జిగ్నేష్, కన్హయ్యకుమార్ దిష్టిబొమ్మలను తగులబెట్టిన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మోదీని గద్దె దించే సమయమొచ్చింది
అనంతపురం సప్తగిరి సర్కిల్: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి మోదీని గద్దె దించే సమయం ఆసన్నమైందని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్, గుజరాత్ శాసనసభ్యుడు జిగ్నేష్ మేవానిలు పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ 29వ జాతీయ మహాసభల సందర్భంగా ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో గురువారం మహాసభను నిర్వహించారు. ముందుగా ఎస్ఎస్బీఎన్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్ మీదుగా ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ ఏఐఎస్ఎఫ్ జెండాలతో నిండిపోయాయి. ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ అధ్యక్షతన జరిగిన సభలో కన్హయ్య కుమార్ మాట్లాడుతూ దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మాట్లాడిన పౌరులపై అక్రమంగా దేశద్రోహం కేసులు బనాయించి జైళ్లల్లో నిర్బంధిస్తోందన్నారు. ప్రశ్నించే జర్నలిస్టులు, మేధావులపై హిందుత్వ సంస్థలు దాడులు చేయడమేగాక కొన్ని చోట్ల హత్యలకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరు అడ్డుకోలేరని తెలిపారు. దేశంలో దళితులు, ముస్లింలు, మహిళలు, ఆదివాసీలపై సంఘ్ పరివార్ శ్రేణులు దాడులకు దిగుతున్నా కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. హిందుత్వ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎన్‌యూలో విద్యార్థి నజీబ్‌పై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసి వేలాదిమంది విద్యార్థుల సమక్షంలోనే కిడ్నాప్ చేశారని ఆరోపించారు. నజీబ్ తల్లి తన కుమారుడి ఆచూకీ తెలపాలని పోరాడుతున్నా పట్టించుకోక పోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానకరమన్నారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థులందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మాల్యా, నీరవ్‌మోదీ రక్షించేందుకు యత్నం జిగ్నేష్ మేవాని మాట్లాడుతూ బ్యాంకులను లూటీ చేసి వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీలను రక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వారిని దేశద్రోహులుగా ప్రకటించి జైళ్లల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడేవారిపై దేశద్రోహం కేసులు పెట్టి నిర్బంధించడం అన్యాయమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన కూడు, గూడు, నీరు, విద్య, వైద్యం, ఉపాధి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గోసంరక్షణ పేరుతో గోరక్షక దళాలను ఏర్పాటు చేసి దాడులు, హత్యలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు సామాజిక బాధ్యతగా తీసుకుని ఇలాంటి వాటిపై పోరాటాలు సాగించాలని కోరారు. గ్రామాల్లోని దళితులు, ఆదివాసీలకు ప్రభుత్వ నిజస్వరూపాన్ని తెలియజేసి ప్రజలకు చైతన్యం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ అమలు చేయలేదన్నారు. రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్దదని తెలిపారు. ఈ ఒప్పందాన్ని హెచ్ఏఎల్కు కాకుండా ఎలాంటి అనుభవం లేని అంబానీ కంపెనీకి కాంట్రాక్టు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. కాపలాదారుగా చెప్పుకుంటున్న మోదీ పెద్ద దొంగగా మారారని విమర్శించారు. డీజిల్, పెట్రోలు ధరలు సెంచరీకి చేరువలో ఉన్నాయన్నారు. విద్యార్థుల సమస్యలపై కార్యాచరణ ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌కుమార్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు, దేశంలో విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలపై మహాసభలో చర్చించి కార్యచరణ రూపొందిస్తామన్నారు. విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటాలు సాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ బాలికల విభాగం జాతీయ కన్వీనర్ కరంబీర్‌కౌర్, జాతీయ నాయకులు విక్కీమహేసరి, పంకజ్ చౌహాన్, సుఖేష్ సుధాకర్, అమృత, మొహమ్మద్మోబీన్, స్టాలిన్, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సుబ్బారావు, జీ రంగన్న, అనంతపురం జిల్లా అధ్యక్షుడు మధు, కార్యదర్శి జాన్సన్‌బాబు, మనోహర్, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఈశ్వరయ్య, లెనిన్‌బాబు, నారాయణస్వామి, వేమయ్య యాదవ్, రాజారెడ్డి, బయన్న, రమణ, సీపీఐ నాయకులు ఎంబీరమణ, జాఫర్, సంజీవప్ప, మల్లికార్జున, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని కేంద్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో పెద్ద ఎత్తున రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. దేశంలో జరుగుతున్న అరాచకాలను రూపుమాపేందుకు ఏఐఎస్ఎఫ్ బాధ్యత తీసుకోవాలన్నారు. బ్రిటీషు వారిని తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. -
ఇలా అయితే మోదీని ఓడించలేం..
సాక్షి, అహ్మదాబాద్ : విపక్షాల ఐక్యతపై స్పష్టమైన అజెండా కొరవడటంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంపై దళిత నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవాని సందేహం వ్యక్తం చేశారు. ‘ రెండు కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తానన్న మోదీ విఫలమయ్యారు..అయితే ఉద్యోగ కల్పనకు ఇతర రాజకీయ పార్టీలు ఏం చేస్తాయన్నదీ పెద్ద సందేహంగా మిగిలింది. నిజాయితీ, చిత్తశుద్ధితో సానుకూల అజెండా లేకుండా బీజపీని ఓడించడం సాధ్యమా’ అని జిగ్నేష్ మెవాని ట్వీట్ చేశారు. కాగా జిగ్నేష్ మెవానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర విపక్షాల మద్దతుతో పోటీచేసి వద్గాం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీజేపీని మట్టికరిపించేందుకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగా విపక్షాలు ఏకతాటిపైకి రావాలని పలు బీజేపీయేతర పార్టీలు పిలుపు ఇస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్లో విపక్ష నేతలు కాంగ్రెస్‌తో పొత్తుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి లక్ష్యం కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. -
దేశ ప్రజలపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్: జిగ్నేష్
గాంధీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీపై దళిత ఉద్యమ నేత గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని విమర్శల వర్షం కురిపించారు. 125 కోట్ల దేశ ప్రజలపై ప్రాణాంతకమైన సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. 2016 నవంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత జవాన్లు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియోలను పలు ఛానల్స్ ఇటీవల ప్రసారం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మేవాని మంగళవారం గుజరాత్‌లోని తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం వాద్గామ్‌లో మీడియాతో మాట్లాడారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారని విమర్శించారు. అధికారంలోకి రాగానే రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన మోదీ ఒక్కరికి కూడా ఉద్యోగాన్ని ఇవ్వకుండా దేశ యువతపై సర్జికల్ దాడులు చేశారని వ్యాఖ్యానించారు. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండితలు చేస్తామన్న మోదీ ఆ హామీ గాలికొదిలేశారని మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన మేవాని.. వాద్గామ్ నియోజకవర్గం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. -
‘అంబేడ్కర్ పేరుతో ప్రమాణం చేయండి’
సాక్షి, ముంబై : దళితులెవ్వరు బీజేపీకి ఓటు వెయ్యకుండా అంబేడ్కర్‌పై ప్రమాణం చేయాలని గుజరాత్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమనేత జిగ్నేష్ మెవానీ కోరారు. నాగపూర్‌లో రిపబ్లిక్ యూత్ ఫెడరేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జిగ్నేష్ మాట్లాడుతూ.. దళితులు బీజేపి ఓటు వెయ్యవద్దని, ఓటు వేయకుండా అంబేడ్కర్ పేరుతో ప్రమాణం చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుమారు లక్షమంది చేత ప్రమాణం చేయించాలని పిలుపినిచ్చారు. దీనికి కొరకు మహారాష్ట్రలోని అన్ని జిల్లాలో ప్రచారం చేయాలన్నారు. త్వరలో జరుగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీష్‌గఢ్, మహారాష్ట్ర ఎన్నికల్లో దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పేర్కొన్నారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, మనుస్మృతిని ఆధారంగా చేసుకుని పరిపాలన చేస్తోందని విమర్శించారు. దేశంలో అతిపెద్ద అబద్దాల కోరుగా ప్రధాని మోదీని వర్ణించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా కూడా కనీసం లక్ష ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారని ధ్వజమెత్తారు. కనీసం మిమ్మల్ని నమ్ముకున్న ఎబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకైన ఉద్యోగాలు కల్పించండి అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. -
షాకింగ్: ఉనా కంటే దారుణ ఘటన!
గాంధీనగర్ : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణం చోటుచేసుకుంది. దళితుడిని కట్టేసి విచక్షణారహితంగా కొట్టి హింసించడంతో బాధితుడు మృతిచెందాడు. అతడి భార్యపై సైతం దాడి చేయగా ఆమె గాయపడ్డట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోను దళిత ఉద్యమ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఆ వివరాలిలా.. ముఖేష్ వనియా తన భార్యతో కలిసి రాజ్‌కోట్‌లో నివాసం ఉండేవాడు. చెత్త ఏరుకుని జీవనం సాగించే ముఖేష్ ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీ వైపు వెళ్లాడు. ఆ దళితుడిని అడ్డుకున్న కొందరు ఉద్యోగులు దొంగ అని అవమానించడంతో పాటు తాడుతో కట్టేసి చచ్చేలా కొట్టారు. ముఖేష్ భార్యపై కూడా దాడి చేశారు. ఉద్యోగులు విచక్షణా రహితంగా రాడ్లు, కర్రలు, తాడు లాంటి వాటితో కొట్టడంతో అమాయకుడు ముఖేష్ మృతిచెందగా, అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దళితులకు గుజరాత్ క్షేమదాయకం కాదని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియోను జిగ్నేశ్ మేవానీ పోస్ట్ చేయగా చర్చనీయాంశంగా మారింది. 2016లో జరిగిన ఉనా దాడికంటే ఇది అత్యంత దారుణ ఘటన అని ఆందోళన వ్యక్తం చేశారు. కుల ఘర్షణలతో అమాయకులు చనిపోతున్నా గుజరాత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫేస్బుక్లో జిగ్నేశ్ మేవానీ ప్రశ్నించారు. -
బీజేపీకి తప్ప ఎవరికైనా ఓటేయ్యండి
మైసూరు: బీజేపీకి తప్ప వేరే ఏ పార్టీకైనా ఓటేయాలని నటుడు ప్రకాశ్ రాజ్ కన్నడ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం మైసూరులో నిర్వహించిన ‘రాజ్యాంగ పరిరక్షణ’ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. గుజరాత్ యువ ఎమ్మెల్యే జిగ్నేశ్ మెవానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ప్రసంగిస్తూ... ‘బీజేపీ అధికారంలోకి వస్తే గనుక రెడ్డి సోదరులు ఆధిపత్యం చెలాయిస్తారు. యెడ్యూరప్ప ఓ రబ్బర్ స్టాంప్‌గా మారిపోతారు. మధ్యలోనే ఆయన్ని గద్దె దింపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పొత్తుల విషయంలో ప్రస్తుతం ప్రజల్లో గందరగోళం నెలకొంది. బీజేపీతో జత కట్టే ప్రసక్తే లేదని జేడీఎస్ అధినేత దేవగౌడ చెబుతున్నారు. కానీ, ఆయన తనయుడు కుమారస్వామి మాత్రం మౌనంగా ఉండటం నన్ను కలవరపెడుతోంది’ అని రాజ్ తెలిపారు. మోదీ ఓ సుళ్లేంద్ర... మోదీ అంటేనే విరుచుకుపడే ప్రకాశ్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘ అధికారం కోసం నరేంద్ర మోదీ దిగజారారు. తనకు ఎదురు తిరిగే వారిని పాతాళానికి తొక్కేస్తున్నారు. గతంలో ఏ ప్రధాని కూడా చెప్పనన్ని అబద్ధాలు మోదీ చెప్పారు. ఈ విషయంలో ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. అందుకే ఆయనకు సుళ్లేంద్ర అన్న బిరుదు ఇస్తున్నా. కన్నడలో దానర్థం అబద్ధాలకోరు’ అని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఆలోచించి ఓటేయ్యండి... ‘నేను పక్కా బీజేపీ వ్యతిరేకిని. గాలి బద్రర్స్‌ను క్షమించామని బీజేపీ చెబుతోంది. కానీ, 15 సీట్ల కోసం అవినీతి పరులను తిరిగి అక్కున చేర్చుకోవటం ఎంత వరకు సమంజసం?. అందుకే ఆ పార్టీని ఓడించాలని నేను పిలుపునిచ్చా. అలాగని మిగతా పార్టీలకు నేను అనుకూలం కాదు. ఆలోచించి ఓటేయాలని కన్నడ ప్రజలను నేను కోరుతున్నా’ అని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ‘మోదీ గజ దొంగ’... ఇక ఈ కార్యక్రమంలో దళిత యువ నేత జిగ్నేశ్ మేవానీ ప్రసంగించారు. ‘కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఓడించటం సాధ్యమౌతుంది. మోదీ ఓ గజదొంగ. యువతను ఉద్యోగాల పేరిట దారుణంగా మోసం చేశారు. దళితులకే ఉద్యోగాలు ఇవ్వాలని మేం ఎప్పుడూ డిమాండ్ చెయ్యలేదు. కానీ, ఆరెస్సెస్‌కు చెందిన వారికి కూడా బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేకపోతోంది. అత్యాచారాలపై మౌనంగా ఉండే మోదీ.. అసభ్య వీడియోలను అప్లోడ్ చేసే వారిని మాత్రం సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. 50 మందికి పైగా బీజేపీ ఎంపీలపై లైంగిక దాడుల కేసులున్నాయి. బీజేపీ అంటేనే రేపిస్టుల పార్టీ’ అంటూ మెవానీ విరుచుకుపడ్డారు. -
జిగ్నేశ్ మేవానీపై కేసు నమోదు
సాక్షి, బెంగుళూరు : దళిత ఉద్యమ నేత గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీపై కర్ణాటకలో కేసు నమోదైంది. కర్ణాటకలోని చిత్రదుర్గంలో శుక్రవారం దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జిగ్నేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జిగ్నేశ్ మాట్లాడుతూ... మోదీ సభలో కుర్చీలు విసిరి గొడవలు సృష్టించాలని పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి జయంత్ ఫిర్యాదు మేరకు చిత్రదుర్గం పోలీస్ స్టేషన్లో మేవానీపై ఐపీసీ సెక్షన్లు 153,188,117,34 కింద పలు కేసులు నమోదయ్యాయి. కాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 15న ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటన చేయనున్నారు. దేశంలో దళితులపై బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తుందని, మోదీ రాకకు నిరసనగా రాష్ట్రంలో జరిగే మోదీ సభలో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేయాలని జిగ్నేశ్ మేవానీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. -
మోదీ సభలో కుర్చీలు విసరండి: జిగ్నేశ్
బొమ్మనహళ్లి: ప్రధాని మోదీ పాల్గొనే కర్ణాటక ఎన్నికల ప్రచార సభల్లో కుర్చీలు విసిరి గొడవలు సృష్టించాలని దళిత ఉద్యమ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే నినాదంతో కర్ణాటకలోని చిత్రదుర్గలో శుక్రవారం దళిత సంఘాలు నిర్వహించిన సమావేశంలో మేవానీ మాట్లాడారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. లక్షలాది మందిని నిరుద్యోగులుగా మారుస్తున్నారని విమర్శించారు. ప్రధాని ఎన్నికల ప్రచారానికి వస్తే ఈ విషయంపై కుర్చీలు విసిరి నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు చేయడం చూస్తుంటే దళితులను అణచివేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. -
బీజేపీని ఓడించకుంటే ప్రజాస్వామ్యం కనుమరుగు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: బీజేపీ, సంఘ్‌పరివార్ శక్తులకు అడ్డుకట్ట వేయాలని, లేకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని గుజరాత్ ఎమ్మెల్యే, సామాజిక ఉద్యమకారుడు జిగ్నేష్ మేవాని పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో మహాజన పాదయాత్ర ముగింపు వార్షికోత్సవం సందర్భంగా ‘‘నేటి రాజకీయాలు–వామపక్ష సామాజిక శక్తుల కర్తవ్యం’’ అనే అంశంపై సదస్సు సోమవారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిగ్నేష్ మేవాని మాట్లాడుతూ దేశంలోని అంబేడ్కర్ వాదులు, వామపక్షాల కలయిక బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులను నివారించటంలో సఫలీకృతం అవుతాయని అన్నారు. సిద్దాంతపరమైన విభేదాలు వస్తే చర్చించుకొని ముందుకు పోవాలని తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించకుంటే ఎంతో కొంత ఉన్న ప్రజాస్వామ్యం కనుమరుగవుతుందని, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే దళితుల సంక్షేమం కోసం పని చేయాలని సూచించారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని చెప్పారు. ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సంక్షోభంతో పాటు కృత్రిమ రాజకీయ సంక్షోభం ఏర్పడిందన్నారు. తిరిగి వారే అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఎవరి జనాభాకు అనుగుణంగా వారికి సీట్లు ఇవ్వటమే ఫ్రంట్ లక్షమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మనువాద పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ మాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సామాజిక వేత్త ఉ.సాంబశివరావు, జాన్‌వెస్లీ, ఎం.వి.రమణ, ఎస్.రమ, పి.ఆశయ్య, ఎండి.అబ్బాస్, ఎం.శోభన్ నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
జిగ్నేష్‌ను చంపేందుకు వాట్సాప్‌లో చర్చ?
అహ్మదాబాద్ : గుజరాత్ పోలీస్ శాఖపై దళిత యువ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ సంచలన ఆరోపణలు చేశారు. తనను ఎన్కౌంటర్లో చంపాడానికి గుజరాత్ పోలీసులు కుట్ర చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఈ విషయం పోలీస్ వాట్సాప్ గ్రూప్ (ఏడీఆర్ అండ్ మీడియా)లో ఇద్దరి పెద్ద పోలీస్ అధికారుల మధ్య చర్చకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దానికి సంబంధించిన వెబ్ పోర్టల్ లింక్స్‌ను సైతం జత చేశారు. ఏడీఆర్ అండ్ పోలీస్ వాట్సాప్ గ్రూప్‌లో రాష్ట్రానికి చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్లతో పాటు మీడియా ప్రతినిధులున్నారు. ఇటీవల రెండు వీడియోలను అహ్మదాబాద్ డిప్యూటీ ఎస్పీ ఆర్బీ దేవ్దా ఈ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఓ వీడియోలో కొంతమంది పోలీసులు ఓ రాజకీయనాయుకున్ని చితక బాదుతుండగా.. మరో వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్లపై పోలీసులను ప్రశంసిస్తూ యూపీ సీఎం ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది. అయితే ఈ వీడియోలకు ఆ సదరు డిప్యూటీ ఎస్పీ పోలీసులు పట్ల అనుచితంగా, వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇలాంటి చర్యలే తీసుకోవాల్సి ఉంటుందని క్యాఫ్షన్ ఇచ్చాడు. ఇటీవల ఓ దళిత కార్యకర్త మరణంతో మెవానీ అహ్మదాబాద్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు మెవానీకి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆ అధికారి ఈ వీడియోలను పోస్ట్ చేయడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆ ఎస్పీ మాత్రం కేవలం ఆ వీడియోలు ఫార్వర్డ్ మెసేజ్లేనని, వాటిలో ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. దీంతో మేవానీ గుజరాత్ హోంమంత్రి, హోం సెక్రటరీ, డీజీపీలపై ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మెవానీ ఏప్రిల్‌లో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు మెవానీ స్పష్టం చేశారు. బీజేపీ వ్యతిరేకంగా జతకట్టే పార్టీలకు మద్దతివ్వనున్నట్లు పేర్కొన్నారు. దళితుల 20 ఓట్లు కూడా బీజేపీకి పడకుండా కృషి చేస్తానని ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే. Jignesh mevani's encounter? Here is the link of gujarati web portal which exposes a WhatsApp communication where two top cops are discussing how I could be killed in an encounter. Can you believe this ?https://t.co/qdS8e4iHCe — Jignesh Mevani (@jigneshmevani80) 23 February 2018 -
జిగ్నేష్‌పై జులుం.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అహ్మదాబాద్ : దళిత యువ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీపై గుజరాత్ పోలీసులు జులుం ప్రదర్శించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్తున్న ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళిత ఉద్యమ కార్యకర్త భానుభాయ్ వాంకర్ బలిదానానికి సంతాపంగా సారంగపూర్‌లోని అంబేద్కర్ విగ్రహాం వద్ద సంస్మరణ ర్యాలీ, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు వాంకర్ కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఇందులో పాల్గొనేందుకు తన అనుచరులతో కలిసి జిగ్నేష్ ర్యాలీగా బయలుదేరారు. అయితే ప్రారంభంలోనే ఆయన్ని అడ్డుకున్న పోలీసులు కారులోంచి లాగేశారు. ఆపై కారు తాళాలను బద్ధలు కొట్టి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్న విషయం తెలియరావటం లేదు. దీంతో జిగ్నేష్ అనుచరులు ధర్నాకు దిగారు. ఈ మేరకు యువ నేత సెహ్లా రషీద్ తన ట్విట్టర్లో సందేశాలను, ఆ వీడియోను పోస్ట్ చేశారు. తనకు న్యాయంగా దక్కాల్సిన భూమి కోసం ఏళ్ల తరబడి పోరాటం జరిపిన భానుభాయ్ వాంకర్ గురువారం పటన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మాహుతికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన మృతి చెందారు. ఈ నేపథ్యంలో దళిత వ్యతిరేక బీజేపీ దారుణ హత్యకు పాల్పడిందంటూ జిగ్నేష్ ఆరోపణలకు దిగాడు. యువ నేతలు హర్దిక్ పటేల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్లతో కలిసి జిగ్నేష్ అహ్మదాబాద్-గాంధీనగర్హైవేపై నిరసన ప్రదర్శనలో శనివారం పాల్గొన్నారు. భానుభాయ్ వాంకర్ -
ఆరెస్సెస్.. ఇదిగో మీకు సమాధానం..
ప్రియాప్రకాశ్ వారియర్ ఇప్పుడో ఇంటర్నెట్ సెన్సేషన్. ఆమె గురించి తెలియని వారు ఉండరంటే అతియోశక్తి కాదు.. బాలీవుడ్ సార్ట్ కిడ్స్‌కు కూడా సాధ్యంకానిరీతిలో ఆమె ఇంటర్నెట్ను ముంచెత్తింది. ఒక్కరోజులోనే సోషల్ మీడియాను తన సామ్రాజ్యం చేసుకుంది. కనుసైగలతో ఇష్టసఖుడిని లాలించి.. కన్నుగీటి అతన్ని ప్రేమమైకంలో దింపి.. ఆ హావభావాలతో యువత గుండెలోకి దిగిపోయింది. ఈమేరకు ఆమె కనుసైగల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనే.. దేశమంతటా మీడియాలో మర్మోమోగుతోంది. ఈ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా హల్చల్ చేస్తోంది. ప్రియాప్రకాశ్ వీడియోపై ఇప్పటికే సినీ స్టార్లు మొదలు ఎంతోమంది ప్రముఖులు స్పందించారు. తాజాగా గుజరాత్ దళిత ఫైర్‌బ్రాండ్ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఈ వీడియోపై స్పందించారు. ప్రేమికుల రోజుపై నిరసనలు వ్యక్తంచేసే ఆరెస్సెస్‌కు ఇదిగో సమాధానం అని పేర్కొన్నారు. ‘మాణిక్య మలరయ పూవీ’ వైరల్ హిట్ కావడం.. వాలెంటైన్స్ డేను నిరసించే ఆరెస్సెస్‌కు ఒక సమాధానం. ఒకరిని ద్వేషించడం కన్నా ప్రేమించడాన్ని అధికంగా ఇష్టపడతామని భారతీయులు మరోసారి రుజువు చేశారు’ అని జిగ్నేశ్ ట్వీట్ చేశారు. హిందుత్వ అతివాద సంస్థలు మొదటినుంచి ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. హిందూ మహాసభ, శ్రీరామసేన, భరతసేన, బజరంగ్ దళ్ మొదలైన సంస్థలు మోరల్ పోలీసింగ్ పేరిట ప్రేమికులరోజున బయట కనిపించే జంటలపై దౌర్జన్యం చేసి.. బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. -
‘గౌరీ హత్యను లక్ష గొంతులు ప్రశ్నించాయి’
సాక్షి, బెంగళూరు: ‘ఎవరైనా మరణిస్తే శ్రద్ధాంజలి ఘటించి వదిలేస్తాం. కానీ గౌరి లంకేశ్ హత్యకు గురైతే.. ఆ దారుణాన్ని లక్ష గొంతులు ప్రశ్నించాయి’ అని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. ప్రముఖ జర్నలిస్టు గౌరి లంకేశ్ 56వ జయంతి సందర్భంగా సోమవారం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ‘గౌరి డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘రోహిత్ వేముల మరణం, గౌరి లంకేశ్ హత్యను నిరసిస్తూ అనేక మంది రోడ్లపైకి వచ్చారు. దేశంలో జరుగుతున్న దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తున్నారు’ అని తెలిపారు. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ, విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.. లంకేశ్ హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తానని గౌరీ సోదరుడు ఇంద్రజిత్ వెల్లడించారు. -
జిగ్నేశ్ మేవాని కాంగ్రెస్ ఏజెంట్: పిడమర్తి రవి
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని కాంగ్రెస్ ఏజెంట్లా మాట్లాడుతున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న జిగ్నేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్లో జిగ్నేశ్ దళిత ఉద్యమాన్ని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణలో దళితులు చైతన్యశీలురని, ఇక్కడి దళిత సంఘాలకు మేవాని పాఠాలు అక్కర్లేదని అన్నారు. మాయావతి వంటి గొప్ప దళిత నాయకురాలిని విమర్శిస్తున్న జిగ్నేశ్ మేవానికి దళితుల మద్దతు లేదని అన్నారు. మంద కృష్ణ అంబేడ్కర్ సిద్ధాంతాన్ని గాలికొదిలి భౌతిక దాడులను నమ్ముకున్నారని, ఆయన జైల్లో ఉన్నా, బయట ఉన్నా మాదిగ ఏబీసీడీ వర్గీకరణ పోరాటం ఆగదని పేర్కొన్నారు. -
జిగ్నేశ్‌పై పిడమర్తి ఫైర్
సాక్షి, హైదరాబాద్: దళితుల గురించి మాట్లాడే అర్హత గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి లేదని తెలంగాణ ఎస్సీ కార్పొషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గుజరాత్లో దళిత ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందన్న జిగ్నేశ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌తో ఆయన సమావేశం కావడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. మంద కృష్ణమాదిగ జైల్లో ఉన్నా ఎస్సీ వర్గీకరణ పోరాటం ఆగదని పిడమర్తి రవి స్పష్టం చేశారు. కాగా, చంచల్‌గూడ జైల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను జిగ్నేశ్ మేవానీ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ కుట్ర పన్ని మంద కృష్ణను జైల్లో పెట్టాయని, అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. -
రోహిత్ వేముల తల్లికి విజ్ఞప్తి
రాజేంద్ర నగర్ : దళిత యువ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని.. రోహిత్ వేముల తల్లి రాధికకు ఓ విజ్ఞప్తి చేశాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఆమెను కోరుతున్నాడు. తద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పాలని జిగ్నేష్ ఆకాంక్షిస్తున్నాడు . ‘‘దళిత పోరాటంలో మా అందరికీ ప్రేరణగా నిలుస్తున్న రాధికమ్మకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. మీరు 2019 ఎన్నికల్లో పోటీ చేయాలి. తద్వారా పార్లమెంట్లో ‘మను’స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పించాలి’’ అని జిగ్నేష్ ఈ ఉదయం తన ట్విటర్లో ట్వీట్ చేశాడు. దళితులనే లక్ష్యంగా చేసుకుని వ్యవహరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీరుకు వ్యతిరేకంగా.. ఆమె పేరు ముందు మనుస్మృతిని చేర్చి అప్పట్లో పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. I strongly appeal to our inspiration Radhika(amma)Vemula to contest in 2019 elections and teach a lesson to Manusmriti Irani in Parliament. — Jignesh Mevani (@jigneshmevani80) 18 January 2018 రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ సెంట్రల్‌యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ రెండో వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన జిగ్నేష్.. రాధికమ్మను కలిసి సంఘీభావం తెలిపాడు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాధిక పాల్గొంటారని.. బీజేపీ ఓటమినే తమ అంతిమ లక్ష్యమని జిగ్నేష్ ఈ సందర్భంలో వెల్లడించారు. దళిత ఉద్యమం దేశంలోని ప్రతీమూలా విస్తరించాల్సిన అవసరం ఉందని.. దళిత వ్యతిరేక చర్యలకు మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని జిగ్నేష్ వెల్లడించాడు. -
దేశవ్యాప్తంగా వర్గీకరణ ఉద్యమం
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని గుజరాత్ స్వతంత్య్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అన్నారు. తెలంగాణలో వెంటనే వర్గీకరణ చేపట్టాలని కోరారు. చంచల్‌గూడ జైల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను ఆయన బుధవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ కుట్ర పన్ని మంద కృష్ణను జైల్లో పెట్టాయని, అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత హక్కుల కోసం కృష్ణమాదిగ కష్టపడుతున్నారని అన్నారు. దళితులు ఏకమై పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై మంద కృష్ణతో చర్చించినట్లు తెలిపారు. నిరుపేద దళితులకు 3 నుంచి 5 ఎకరాల భూమి పంపిణీ చేయాలని ఆయా ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వర్గీకరణ అంశాన్ని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తారా.. అన్న ప్రశ్నను ఆయన దాటవేశారు. -
మందకృష్ణకు జిగ్నేష్, కత్తి మహేష్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ బుధవారం చంచల్‌గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నా అంతరాత్మ ప్రభోదానుసారం మందకృష్ణను కలిశా. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలి. హక్కులకై పోరాడుతున్న మందకృష్ణను జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దళితుల ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళతాం. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాలి. ఎస్సీ వర్గీకరణ తప్పనిసరిగా చేయాలి. అలాగే తెలంగాణలో దళితులకు అయిదు ఎకరాల భూమి ఇవ్వాలి. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన తెలంగాణలో తీవ్రస్థాయికి చేరుకుంది. రోహిత్ వేముల బతికుంటే నాతో కలిసి వచ్చేవారు’ అని అన్నారు. మందకృష్ణను కలిసిన కత్తి మహేష్ మరోవైపు మందకృష్ణను కత్తి మహేష్ కూడా కలిశారు. చంచల్‌గూడకు వెళ్లి...మందకృష్ణను పరామర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేపడుతున్న పోరాటానికి కత్తి మహేష్ మద్దతు తెలిపారు. కాగా ట్యాంక్‌బండ్ వద్ద అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహించారంటూ మందకృష్ణ మాదిగపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండురోజుల క్రితం మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా మందకృష్ణను కలిశారు. -
‘వాళ్లు.. నన్ను చంపేస్తారు’
సాక్షి, అహ్మదాబాద్ : బీజేపీ, ఆర్ఎస్ఎస్ వల్ల తనకు ప్రాణహాని ఉందని గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ పేర్కొన్నారు. బీజేపీ, సంఘ్ శక్తులు తనను హత్య చేయించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తనవద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన చెప్పారు. ఫాసిస్టు భావజాలం కలిగిన వ్యక్తులు, సంస్థలు నన్ను తప్పకుండా చంపేందుకు ప్రయత్నాలు చేస్తాయని మేవానీ తెలిపారు. నన్ను భూమ్మీద లేకుండా చేయడం వల్ల వాళ్లు.. తాత్కాలిక లాభాన్ని పొందేందకు ప్రయత్నిస్తున్నారని మేవానీ అన్నారు. జిగ్నేష్ మేవానీ ప్రాణ రక్షణకు ‘వై’ కేటగిరీ భద్రతను కల్పించాలని దళిత సంఘాలు గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. -
మోదీతో ముప్పు: మేవానీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీరుతో దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మనుగడ ప్రమాదంలో పడ్డాయని ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మేవానీ ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి నిరాకరించినప్పటికీ ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో మంగళవారం జరిగిన ‘యువ హూంకార్ ర్యాలీ’లో మేవానీ మాట్లాడారు. తమ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించటం గుజరాత్ తరహా రాజకీయాలకు నిదర్శనమన్నారు. భీమ్ ఆర్మీ ఫౌండర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన్ను ఇంతకాలం జైలులో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. భీమా–కోరేగావ్ ఘటన ఎందుకు జరిగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ నేత రోహిత్ వేముల హత్యపై పోరాటం సాగిస్తామని, ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ‘యువ హూంకార్’ సభకు జనం రెండువేల మంది రాగా, పోలీసులు మాత్రం బందోబస్తుకు 15వేల మంది బలగాలను వినియోగించి ఉంటారని అంచనా. -
దూసుకొస్తున్న జిగ్నేష్.. టెన్షన్.. టెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ : ఓ పక్క వాటర్ కెనాన్లు, భారీ కేడ్లు, బాష్ప వాయుగోళాలు, లాఠీలు పుచ్చుకొని నిల్చున్న పోలీసులు.. మరోవైపు పెద్ద పెట్టున నినాదాలతో, మద్దతుదారులతో దూసుకొస్తున్న దళిత నేత జిగ్నేష్ మేవానీ. మొత్తానికి పార్లమెంటు వీధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల ఆదేశాలను లెక్కచేయకుండా ర్యాలీకోసం పార్లమెంటు వీధిలో జిఘ్నేష్ మేవాని బయలుదేరారు. పలు నిర్బంధాలను చేధించుకొని ఆయన పార్లమెంటు వీధికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ ర్యాలీ కోసం దాదాపు 600మంది మద్దతు దారులు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు వీధి నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం వరకు రాజ్యాంగం కాపీలతో, మనస్మృతి కాపీలతో 'యువ హంకార్ ర్యాలీ' నిర్వహించి తీరుతామని మేవానీ ప్రకటించారు. అయితే, గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పార్లమెంటు వీధిలో ఆంక్షలు ఉన్నాయని, అక్కడ ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ర్యాలీలు నిర్వహిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ, మేవానీ, ఆయనకు మద్దతుగా అస్సాం రైతుల హక్కుల పోరాట ఉద్యమ నేత అఖిల్ గొగోయ్ మరికొందరు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ర్యాలీ కోసం కార్యకర్తలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా.. ఈ ర్యాలీ కోసం దాదాపు 10 వేలమంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు వారిని నిలువరించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. పార్లమెంటు స్ట్రీట్ మొత్తం హైసెక్యూరిటీ జోన్‌గా ప్రకటించడం మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల కొన్ని మెట్రో సర్వీసులు రద్దు చేశారు. విద్య, ఉద్యోగాలు, లింగ సమానత్వంవంటి అంశాలపై పోరాటం చేస్తున్న దళిత సంస్థ బీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను విడుదల చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. -
జిఘ్నేష్ ర్యాలీ : ఢిల్లీలో భారీ భద్రత
-
జిగ్నేష్...అంబేడ్కర్‌ను విమర్శించడమా!?
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన దళిత నాయకుడు జిగ్నేష్ మెవానీపై సోషల్ మీడియా శుక్రవారం నాడు దుమ్మెత్తి పోసింది. ‘జిగ్నేష్ మెవానీ దళిత అరాచకవాది, హిందువుల మధ్య చిచ్చు పెట్టడం వల్ల భారత్‌ను అస్థిరం చేయాలనుకుంటున్నారు. ఆయన టెర్రిరిస్టులకన్నా ప్రమాదకారి. ఆయన ఇంకెంత మాత్రం దళితుల ప్రతినిధి కాదు. బీఆర్ అంబేడ్కర్, మాయావతిలను ఎలా విమర్శించారో చూడండీ!.....అంబేడ్కర్, కాన్షీరామ్, మాయావతిలు తనకన్నా గొప్పవారు, మంచివారు కాదని జిగ్నేష్ మెవానీ అనుకుంటున్నారు, దళితులను ద్వేషిస్తున్నారు. ముల్లాలను తప్ప అందర్ని ద్వేషించాల్సిందిగా కమ్యూనిస్టులు ఆయనకు నూరిపోసినట్టున్నారు..... జిగ్నేష్ మెవానీ కమ్యూనిస్టులకు, రాజదీప్ సర్దేశాయ్‌కి డార్లింగ్ కావచ్చు. ఎప్పుడయితే ఆయన అంబేడ్కర్‌ను తక్కువ చేసి మాట్లాడారో, కాన్షీరామ్, మాయావతి లాంటి వారిని కించపరిచారో ఉపేక్షించరాదు.....’ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దళితుల హక్కుల గురించి పోరాడుతున్న జిగ్నేష్ నిజంగా దళితులను కించ పరుస్తూ మాట్లాడారా? ఆయన మాట్లాడిన దానిలో దళితులకు, ఇతరులకు ఆగ్రహం తెప్పించిన అంశాలు ఏమున్నాయి? ఆయన హైదరాబాద్‌లోని లామాకాన్‌లో దళితులు, కమ్యూనిస్టులకున్న సారూప్యత, ఏయే అంశాలపై ఇరువురు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు? ఎవరు ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? దేశంలో కుల, వర్గ రహిత సమాజం ఏర్పడాలంటే ఇరువర్గాలు కలిసి పోరాటం సాగించాల్సిన అవసరం ఎంతుంది ? అన్న అంశాలపై దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. ఆయన మొత్తం ప్రసంగంలో ఎక్కడా దళిత ధ్రువ తారలనుగానీ, నాయకులనుగానీ కించపరుస్తూ మాట్లాడలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ట్వీట్లు చేశారో గమనిస్తే మనకే అర్థం అవుతుంది. దళితుల కంటే ఇతరులే ఎక్కువగా దళితుల పక్షాన విమర్శలు చేశారు. దళితులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేయడంలో ముందుండే కొన్ని ఆంగ్ల టీవీ ఛానళ్లయితే ఉన్నవి, లేనివి మాట్లాడుతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎవరో కొందరు వ్యక్తులు జిగ్నేష్ మెవానీ ప్రసంగం వీడియోను తప్పుడు అర్థం వచ్చేలా అసంబద్ధంగా ఎడిట్ చేసి ప్రసారం చేయడం వల్ల ఈ రాద్ధాంతం జరుగుతోంది. ‘కుల, మత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న వామపక్షాలు మనకు సహజమైన మిత్రులు. ఈ విషయాన్ని దళితులు అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో డాక్టర్ అంబేడ్కర్‌కు భిన్నమైన అభిప్రాయం ఉన్నాగానీ నా అభిప్రాయం మారదు. ముందు వర్గ రహిత సమాజం కోసం పోరాడితే కులం దానంతట అదే కనుమరుగవుతుందని, కాకపోతే ఆ తర్వాత కుల రహిత సమాజం కోసం పోరాడవచ్చన్నది కమ్యూనిస్టుల అభిప్రాయం. కుల వివక్ష దారుణాలకు దగ్ధమవుతున్నందున ముందుగా కుల రహిత సమాజం కోసమే పోరాడాలన్నది అంబేడ్కర్‌వాదుల అభిప్రాయం. నా ఉద్దేశంలో కులం, వర్గం అనేవి ఒకదానికొకటి ముడివడిన అవిభాజ్య అంశాలు. వీటి నిర్మూలనకు ఒకేసారి పోరాటం ప్రారంభించాలి. ఇందుకోసం అవసరమైతే కమ్యూనిస్టులు ఓ పక్క, దళితులు ఓ పక్క కూర్చొని సుదీర్ఘ చర్చల ద్వారా ఓ కార్యాచరణకు రావాలి. ఈ రెండు వర్గాలు కలిసి పోరాడినప్పుడే భారత్‌లో కుల, వర్గ రహిత సమాజం ఏర్పడుతుంది’ అంటూ ఓ సందర్భంలో జిగ్నేష్ వ్యాఖ్యానించారు. ‘ఆల్టర్ న్యూస్ డాట్ కామ్’ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హాను ఓ వెబ్ఫ్లాట్ ఫామ్‌పై ‘ఆయనో సిన్హా’ అని ఓ దళితుడు విమర్శించిన సందర్భాన్ని జిగ్నేష్ ప్రస్తావిస్తూ ‘నేను ఓ దళిత కుటుంబంలో పుట్టటం నా తప్పు కానప్పుడు, సిన్హా ఆయన ఇంట్లో పుట్టడం మాత్రం ఆయన తప్పెలా అవుతుందీ? ఇదంతా చెత్త. ఇదంతా బ్రాహ్మణిజమే. బ్రాహ్మణుల్లో ఉండే మనువాది తత్వం అంబేద్కర్ వాదుల్లో కూడా ఇంకా ఇమిడి ఉండడం వల్ల ఇలాంటి విమర్శలొస్తున్నాయి. ఆ భావజాలం నుంచి మనమూ బయటపడాలి’ అన్నారు. ఈ రెండు సందర్భాల్లోని మాటలనే కాకుండా ఇతర సందర్భాల్లోని ఆయన మాటలను తీసుకొని తప్పుడు అర్థం వచ్చేలా వీడియోను ఎడిట్ చేసి ఎవరో దురుద్దేశపూర్వకంగా సోషల్ మీడయాలో పోస్ట్ చేశారు. ఎవరైనా జాగ్రత్తగా ఎడిట్ చేసిన మీడియాను చూసి పొరపాటు పడి లేదా తొందరపడి విమర్శలు చేయడం సహజం. ఇలాంటి సమయాల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు అసలు వీడియోలను వెలుగులోకి తీసుకరావడం ఓ వెబ్సైట్ సామాజిక బాధ్యత. -
దళిత రాజకీయాలే కీలకమా?
జాతిహితం మైనారిటీలు, దళితులు, ఆదివాసుల నుంచి ఏ ఒక్కరూ నేడు కేంద్రంలో కీలక మంత్రు లుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో మినహా మరెక్కడా సీఎంలుగా లేరు. ఈ పరిస్థితే మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. బీజేపీ ఈ ముప్పును లెక్కచేయడం లేదు. దేన్నయినా జయించగల సమున్నత శక్తినని అది భావిస్తోంది. దళిత ఐక్యత వల్ల కలిగే ముప్పును మొగ్గలోనే తుంచేయగలనని అది భావిస్తోంది. కాబట్టే దళితుల ఆందోళనల పట్ల అతిగా ప్రతిస్పందిస్తోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది. దళితులు మన జాతీయ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తిగా ఆవిర్భవించనున్నారా? దళిత ఆత్మవిశ్వాసంగా ఇటీవల అభివర్ణిస్తు న్నది కేవలం సామాజిక–రాజకీయపరమైనదేనా లేక జోరుగా సాగనున్న ఈ ఎన్నికల ఏడాదిలో వర్తమాన రాజకీయాల ధోరణిని బద్దలుకొట్టే శక్తి దానికి ఉన్నదా? ఉన్నట్టయితే, ఆ రాకెట్లో మే 2019 వరకు సరిపడేటంత ఇం«దనం ఉన్నదా? లే క అంతకంటే ముందుగానే కొడిగట్టిపోతుందా? ఈ ప్రశ్నల పరం పరను మరో రెండు ప్రశ్నలతో ముగిద్దాం. ఈ నూతన అంశం జిగ్నేశ్ మెవానీ రూపంలో వ్యక్తమౌతోందా? రాజకీయ పరిభాషలో ఆయన సరికొత్త కాన్షీరాం కానున్నారా? లేక మహేంద్రసింగ్ తికాయత్ లేదా రిటైర్డ్ కల్నల్ కిశోరీసింగ్ బైంస్లాల వంటి వారు మాత్రమేనా? నేను చెప్పదలుచుకున్న అంశమైతే ఇదే.. కాన్షీరాం దేశ ప్రధాన భూభాగంలోని రాజకీయాలను ప్రగాఢంగా ప్రభావితం చేశారు. మిగతా ఇద్దరికీ వివిధ సమయాల్లో జాట్లు, గుజ్జర్ల మద్దతున్నా క్రమంగా తెరమరుగయ్యారు. దళిత ఓటర్లను సంఘటితం చేయగలరా? దేశ ఓటర్లలో దాదాపు 16.6 శాతం ఉండే దళితులు నిజానికి ముస్లింల కంటే మరింత శక్తివంతమైన ఓటు బ్యాంకు. కేరళ, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్పితే 1989కి ముందు కాంగ్రెస్ దళితులంతా తమ ఓటర్లేనని భావించగలిగేది. 1989 నుంచి కాంగ్రెస్ వెనుకబడిన కులాలు, ముస్లింలతో పాటూ దళితుల ఓట్లను కోల్పోవడం మొదలైంది. ముస్లింలకు భిన్నంగా దళితులు ఎన్నడూ వ్యూహాత్మకంగా లేదా ఒక పార్టీని ఎన్నుకోవాలి లేదా మరో పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలి అనే ఏకైక లక్ష్యంతో ఎన్నడూ ఓటు చేయలేదు. ఉత్తరప్రదేశ్, బిహార్ సహా చాలా కీలక రాష్ట్రాల్లో దళితుల ఓట్లు కాంగ్రెసేతర పార్టీలకు వెళ్లాయి. బీజేపీకి అది ఉపయోగపడింది. దళి తులలో కొందరు నరేంద్ర మోదీ పట్లా్ల, ఇటీవలి కాలంలో ఆ పార్టీ పట్ల కూడా ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తదుపరి దశలో... జాతీయ రాజ కీయాల్లో ఏమంత ప్రాధాన్యం లేనంతగా దళితుల ఓట్లు చీలిపోయాయి. మరోవిధంగా కూడా ముస్లింలకంటే దళితులు విభిన్నమైన ఓటర్లు. దళితుల ఓట్లు వివిధ రాష్ట్రాల్లో బాగా చెల్లా చెదురుగా ఉన్నాయి. కాబట్టి ముస్లింల వలే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను తలకిందులు చేయగల శక్తిని కోల్పో యారు. ఉత్తరప్రదేశ్ ఒక్కటే ఇందుకు మినహాయింపు. దళిత ఓటర్లు అత్య ధికంగా ఉన్నది పంజాబ్‌లో (32%). కానీ వారిలో చాలా మంది సిక్కులు. ఆ రాష్ట్రంలో ఓటర్లు కులం ప్రాతిపదికపై సమీకృతం కారు. కానీ పెద్ద సంఖ్యలో ఎవరి ఓట్లయినా ఒక పక్షంవైపు మొగ్గితే బలాబలాలు తారుమారు అవు తాయి. అందువల్ల మనం ముందు వేసిన ప్రశ్నల సారం ఒక్కటే.. దళిత ఆత్మ విశ్వాసానికి ప్రాతినిధ్యం వహిస్తూ, వారికి నాయకత్వం వహిస్తున్న మెవానీ దళిత ఓట్లను అలా సంఘటితం చేయగలరా? ఆ పని చేయగలిగితే అది ప్రస్తుత రాజకీయాల ధోరణిని భగ్నం చేయగలుగుతుంది. మెవానీ దళిత నేతగా ఆవిర్భవించినా ఆయన చాలా రాష్ట్రాలకు విస్తరిం చిన జనాకర్షణశక్తిగల నేత కూడా కావాల్సి ఉంటుంది. దళితులను అందరినీ సమీకరించగలిగిన ఒక నేత అవసరం. 1970ల మధ్య వరకు జగ్జీవన్‌రాం కాంగ్రెస్‌కు అలాంటి నేతగా ఉండేవారు. ఆ తర్వాత మరో దళిత నేతకు అలాంటి సాధికారతను కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. దాదాపు 8 శాతం ఓటర్లుగా ఉన్న ఆదివాసులకు చెందిన అలాంటి జాతీయ స్థాయి నేత ఏ పార్టీకీ, ప్రత్యేకించి కాంగ్రెస్‌కు (పీఏ సంగ్మా తర్వాత) లేరు. ఈ విష యంలో బీజేపీ పరిస్థితి మరీ అధ్వానం. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నా అది లెక్కలోకి రాదు. దళిత ఐక్యతకు అందివచ్చిన అవకాశం మైనారిటీలు, దళితులు, ఆదివాసులలో ఎవరూ కేంద్రంలో కీలక మంత్రులుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్యాలను మినహా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా లేని ఆసక్తికరమైన పరిస్థితి నేడుంది. సరిగ్గా ఇదే జిగ్నేశ్ మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ముప్పును లెక్కచేయనంతటి రాజకీయ చతురత మోదీ–షాల బీజేపీకి ఉంది. దేన్నయినా జయించేయగల సమున్నత శక్తిననే ఆలోచనా ధోరణి దానిది. కాబట్టి తలెత్తగల ఆ ముప్పుతో తలపడి సాధ్యమైనంత త్వరగా, మొగ్గలోనే తుంచేయాలని ఆ పార్టీ భావిస్తుంది. క్షేత్రస్థాయిలో దళి తులు కార్యాచరణకు దిగడం పట్ల వారు అతిగా ప్రతిస్పందించడంలో అదే వ్యక్తమౌతోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది. ఉనాలో గోరక్షకులు దళితులపై సాగించిన అత్యాచారం నేపథ్యంలో మెవానీ నేతగా ముందుకు వచ్చారు. తొలుత ఆయనను గుజరాత్‌కే పరిమి తమైన స్థానిక నేతగానే చూశారు. రాజకీయంగా పెద్దగా లెక్కలోకి తీసుకోవా ల్సిన వాడిగా చూడలేదు. ఆయన రాజకీయాల్లో మొదట్లో సాంప్రదాయ కమైన ఎన్నికల రాజకీయాలను మెచ్చని జేఎన్‌యూ తరహా భావజాలం కని పించింది. అదికాస్తా ఆయన ఎన్నికల బరిలోకి దిగాలని, అది కూడా బూర్జువా జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో కూటమి కట్టాలని నిర్ణయించు కోవ డంతోనే అది ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఆయన ప్రస్తుతం గుజ రాత్‌లోని ఒక ఎంఎల్ఏ మాత్రమే. అయినా అంతకంటే చాలా ఎక్కువ గానే లెక్కలోకి వస్తారు. ఇతర రాష్ట్రాలలోని దళితులకు తన సందేశాన్ని విని పించే అవకాశాన్ని కూడా అది ఆయనకు కల్పిస్తుంది. ఈ వారంలో ఆయన మహా రాష్ట్రలో చేసినది సరిగ్గా అదే. మెవానీలో చాలా బలమైన అంశాలు చాలానే ఉన్నాయి. యవ్వనం, అద్భుత వాక్పటిమ, సామాజిక మాధ్యమాలను ఉపయోగించగల శక్తిసామ ర్థ్యాలు, రాజకీయ, భావజాలపరమైన పట్టువిడుపుల గుణం ఆయనకు న్నాయి. అంతేకాదు, ఇప్పటికి ఏకైక శత్రువు బీజేపీ మాత్రమేనంటూ దానిపైకే గురిపెట్టి... మిగతా వారందరితోనూ కలవగల దృష్టి కేంద్రీకరణ కూడా ఉంది. పైగా ఆయన దళితులలోని ప్రధానమైన ఒక ఉపకులానికి చెంది నవారు. ఆయన వచ్చింది చిన్న రాష్ట్రం నుంచి, అయితే ఆయనకు ముందు కాన్షీరాం కూడా ఆయనలాగే ఒక చిన్న రాష్ట్రం నుంచి వచ్చి జాతీయస్థాయిలో అత్యంత ప్రబలమైన రాజకీయ ధోరణిని నిర్మించారు. అది ఆయనకు అను కూలంగా పనిచేసే మరో బలీయమైన అంశం అవుతుంది. పంజాబీ అయిన కాన్షీరాం కూడా సాంప్రదాయకంగా చెప్పుకోదగినది కాని ప్రాంతం నుంచి రంగం మీదకు వచ్చారు. డీఆర్డీఓలో సైంటిస్టుగా పనిచేస్తూ, అంబేడ్కర్ రచనలతో ప్రభావితుడై ఆయన షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాలు, మైనారిటీ ఉద్యోగుల జాతీయ స్థాయి సంఘాన్ని (బీఏఎంసీఈఎఫ్) నిర్మించడంతో ప్రారంభించారు. అప్పటివరకు దళితులు అనే పదం పెద్దగా వాడుకలో లేదు. మొదట్లో ఆయన పతాకశీర్షికలకు ఎక్కా లని తాపత్రయపడేవారిలా కనిపించారు. 1980ల చివరి కాలం అస్థిరమైనది, కాంగ్రెస్ క్షీణిస్తూ పలు వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. కాన్షీరాం చూపిన రాజకీయ చతురత ఉందా? సిక్కు వేర్పాటువాద నేతలు సహా రకరకాల గ్రూపులను ఆయన ఒక్క చోటికి చేర్చి భారీగా ప్రజలను సమీకరించారు. అయినా ఆయనను పెద్దగా లెక్క చేయలేదు. త్వరలోనే ఆయన తన శక్తిని పెంచుకుని, వారందరినీ వదిలించే సుకున్నారు. తన రాజకీయాలు వృద్ధి చెందాలంటే మెవానీ కూడా ఉమర్ ఖలీద్‌ను విడిచిపెట్టాలి. దేశ ప్రధాన భూభాగంలో వేళ్లూనుకోనిదే జాతీయ వాదాన్ని లేదా మతాన్ని ఢీకొంటూ దళిత రాజకీయాలను నిర్మించలేమని కాన్షీరాం 30 ఏళ్ల క్రితమే కనిపెట్టారు. దాన్ని మెవానీ గుర్తించాలి. అయితే, కాన్షీరాంగానీ, మాయావతిగానీ హిందూయిజాన్ని తిరస్కరించలేదు లేదా బౌద్ధాన్ని స్వీకరించలేదు. ‘‘మన పోరాటం హిందూ దేవతలతో కాదు మను వాదులతో’’ అనే వారాయన. ఇక బుద్ధుడంటారా? మను వాదులు మూడు కోట్ల దేవతల్లో ఒకడిని చేసేస్తారు అంటుండేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రముఖంగా ముందుకు వచ్చినది 1988లో. బోఫోర్స్ కుంభకోణం విష యంలో రాజీవ్‌ను తప్పు పడుతూ వీపీ సింగ్ ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. అదేసమయానికి అమితాబ్ బచ్చన్ రాజీనామా చేయ డంతో అలహాబాద్ పార్లమెంటు స్థానానికి ఉపఎన్నిక అవసరమైంది. వీపీ సింగ్‌కు, కాంగ్రెస్ అభ్యర్థి, లాల్‌బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రికి మధ్యనే పోటీ జరుగుతున్నదని మేం అంతా అనుకున్నాం. కొన్ని రోజుల ప్రచారం జరిగే సరికే కాన్షీరాం నిర్ణయాత్మక శక్తిగా ముందుకు వచ్చారు. అప్పుడే మేం మొదటిసారిగా సూటిగా సరళంగా దళిత రాజకీయాలను విన్నాం : ‘‘40 ఏళ్లుగా మనం జంతువుల్లా బతికాం. మనుషులుగా బతకా ల్సిన సమయం వచ్చింది.’’ ఆయన ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత రూప కల్పన చేసిన రాజకీయాల్లో మూడు అంశాలు కొట్టవచ్చిట్టు కనిపించేవి. ఒకటి, అస్పష్టంగానైనా వేర్పాటువాది అనిపించిన వారెవరైనా వారిని ఆయన దూరంగా ఉంచేవారు. రెండు, తన కుటుంబ జాతీయవాద, సైనిక వారసత్వాన్ని పదే పదే ఏకరువు పెడుతుండేవారు. అంతేకాదు, తన ప్రచా రాన్ని కూడా సైనిక పద్ధతుల్లోనే నిర్వహించేవారు: ప్రింటింగ్ బ్రిగేడ్, పాంప్లెట్ బ్రిగేడ్, దళిత బస్తీల్లో డబ్బాలు పట్టుకుని చందాలు సేకరించే బిచ్చగాళ్ల బ్రిగేడ్లను నిర్మించేవారు. వాళ్లిచ్చే డబ్బు ఎంత అని కాదు. ‘‘ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఒకసారి ఒక రూపాయి ఇచ్చాడంటే, కాంగ్రెస్ వెయ్యి రూపాయలిచ్చినా దానికి ఓటు వేయడు’’ అనేవారు. ఇక మూడవది, అతి ముఖ్యమైనది. ఆయన తన శిబిరాన్ని సువిశాలంగా మార్చారు. బహుజన సమాజ్ అనే నిర్వచనంతో ఇతర వర్గాలన్నిటినీ ఆకర్షించడానికి ప్రయత్నిం చారు. అలాగే ఆయన ఓట్లు మావి, అధికారం మీదా/ ఇక చెల్లదు, ఇక చెల్లదు అనే నినాదాన్ని తయారుచేశారు. తర్వాతి కాలంలో అధికారంలోకి రావడా నికి ముస్లింలను, కొన్ని ఉన్నత కులాలను కూడా కలుపుకుపోవాలని ఆయన, మాయావతి గుర్తించారు. అదే వారిని అధికారంలోకి తెచ్చింది. ఓడినా మాయావతిని ఇంకా ప్రబల శక్తిగా నిలిపింది. దళిత కౌటిల్యునిగా కాన్షీరాం తన మేధస్సుతో మాయావతిని తన చంద్రగుప్తునిగా తయారుచేశారు. మెవానీకి అలాంటి నైపుణ్యం, ప్రతిభ, తదేక దృష్టి ఉన్నాయా? చెప్పడం కష్టమే. కానీ, బీజేపీ, హిందూ ఉన్నత వర్గాలకు చెందిన మితవాదశక్తులూ ఆయన గురించి ఆందో ళన చెందడమే ఆ విషయాన్ని విశదం చేస్తుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేస్తున్నాయి
సాక్షి, న్యూఢిల్లీ : పూణేలో తాను ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని దళిత నేత, గుజరాత్ ఎంఎల్ఏ జిగ్నేష్ మెవాని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తనను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. మహారాష్ర్టలో భీమా - కొరేగావ్ ఘటనల నేపథ్యంలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ 31న జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మెవాని, జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, మహారాష్ర్ట బంద్‌లోనూ పాల్గొనలేదని మెవాని స్పష్టం చేశారు. తనను ఆర్ఎస్ఎస్, బీజేపీలు లక్ష్యంగా చేసుకుని దాడులు సాగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు మహారాష్ర్ట ఘటనలను నిరసిస్తూ దళితులు చేపట్టిన నిరసనలు గుజరాత్, యూపీలనూ తాకాయి. పూణేలో దళిత యువకుడి హత్యను ఖండిస్తూ యూపీలోని ముజఫర్‌నగర్‌లోనూ దళితులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
జిగ్నేష్‌కు డబుల్ షాక్
సాక్షి, ముంబై : అల్లర్లు.. బంద్ తర్వాత మాములు పరిస్థితులు కనిపిస్తున్న వేళ దళిత నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీకి మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఝలకే ఇచ్చింది. గురువారం ఆయన పాల్గొనాల్సిన ఓ సదస్సును పోలీసులు అడ్డుకున్నారు . ఈ మేరకు విలే పార్లేలోని భాయ్ దాస్ హాల్ ఆడిటోరియంను పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి విద్యార్థులను బలవంతంగా బయటకు పంపివేస్తున్నారు. కార్యక్రమం రద్దైన విషయాన్ని నిర్వాహకుడు, ఛత్ర భారతి ఉపాధ్యక్షుడు సాగర్ భాలేరావ్ ప్రకటించారు. అఖిల భారత విద్యార్థుల సదస్సు కార్యక్రమానికి జిగ్నేష్‌తోపాటు జేఎన్‌యూ నేత ఉమర్ ఖలీద్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం చాలా రోజుల క్రితమే అనుమతి తీసుకున్నప్పటికీ.. పోలీసులు ఇప్పుడు హఠాత్తుగా అడ్డుకోవటం ఆశ్చర్యంగా ఉందని సాగర్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆడిటోరియం చుట్టుపక్కల ప్రాంతంలో 149 సెక్షన్ విధించిన పోలీసులు.. పలువురు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. #Mumbai: Students gathered for Chhatra Bharati event outside Bhaidas Hall, being forcibly removed pic.twitter.com/eGT36BvQov — ANI (@ANI) 4 January 2018 జిగ్నేష్ కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఇదిలా ఉంటే జిగ్నేష్ రెచ్చగొట్టే ప్రసంగం మూలంగానే ఈ అల్లర్లు చోటు చేసుకున్నట్లు ఓ ఫిర్యాదు అందంటంతో పుణే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎఫ్ఐఆర్లో జిగ్నేష్, ఉమర్ ఖలీద్ పేర్లను కూడా చేర్చినట్లు విశ్వరమ్ బాగ్ పోలీసులు వెల్లడించారు. భీమ-కోరేగావ్ యుద్ధ 200వ వారికోత్సవం సందర్భంగా షనివార్ వాదా వద్ద డిసెంబర్31న ఎల్గర్ పరిషత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో జిగ్నేష్ ప్రసంగిస్తూ.. దళితులంతా రోడ్ల మీదకు వచ్చి పోరాడాలని పిలుపునివ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లర్లు చెలరేగాయని ఫిర్యాదులో అక్షయ్ బిక్కద్, ఆనంద్ ధోంద్ పేర్కొన్నారు. -
‘ఆయన.. ఈ శతాబ్దపు అత్యుత్తమ నటుడు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గుజరాత్ దళిత ఉద్యమనేత జిగ్నేష్ మేవాని ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. దళితులపై ప్రధాని కపట ప్రేమను కనబరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో దళితులపై దాడులను గురించి ప్రధాని మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో భారత్ నుంచి ప్రపంచ మహానటుడు వస్తాడన్న ప్రఖ్యాత ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ అంచనాలు నిజమయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన దళిత హక్కుల గురించి మోదీ ప్రసంగాల్లో చెప్పిన అంశాలను పోస్ట్ చేశారు. దళితులు హక్కులు గురించి మాట్లాడేవారంతా.. మహారాష్ట్రలో మాత్రం రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిచారని అన్నారు. ‘మీరు కాల్చాంటే నన్ను కాల్చండి. దళిత సోదరులను కాదు’ అంటూ ఆగస్టులో మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. దళితులపై గోరక్షకుల దాడులపై స్పందిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వద్గామ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మేవాని విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
బీజేపీకి దళిత యువ నేత సవాల్
పుణే : రాజ్యాంగాన్ని గౌరవించని నేతలకు చట్టసభల్లో కొనసాగే అర్హత లేదని దళిత నేత, యువ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ పేర్కొన్నాడు. అనంత కుమార్ హెగ్డే వ్యాఖ్యలను ఊటంకించిన జిగ్నేష్.. బీజేపీ పార్టీకి పెను సవాల్ విసిరాడు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య పద్ధతిని మారుస్తామని కొందరు ప్రకటనలు చేస్తున్నారు. దమ్ముంటే ఆ చేయండి. మా శక్తిని ఉపయోగించి దానిని ఎలా అడ్డుకోవాలో మాకు బాగా తెలుసు. ప్రజల అభిష్టం, వారి రక్షణ కోసం చట్టాల రూపకల్పన జరగాలి, అంతేకానీ, పార్టీలు, నేతలు తమ ఇష్టానుసారం మారుస్తామంటే కుదరదు అని జిగ్నేష్ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు గెలుచుకోనీయకుండా అడ్డుకోగలిగామని.. అన్నివర్గాలు ఏకమయితే 2019 ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించొచ్చని జిగ్నేష్ సభీకులను ఉద్దేశించి పిలుపునిచ్చాడు. కాగా, భీమ-కొరేగావ్ యుద్ధం స్మారకార్థం నిర్వహించిన ఆదివారం సాయంత్రం పుణేలో నిర్వహించిన ‘ఎల్గార్ పరిషత్’లో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో రోహిత్ వేముల తల్లి రాధిక, భీమ్ ఆర్మీ ప్రెసిడెంట్ వినయ్ రతన్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్(మాజీ ఎంపీ), జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ తదితరులు హజరుకాగా, పలు విద్యాలయాల నుంచి విద్యార్థులు, ప్రముఖ దళిత నేతలు హాజరయ్యారు. -
బీజేపీపై నా పోరాటం
సాక్షి, బెంగళూరు (చిక్కమగళూరు): కర్ణాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీకి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని దళిత పోరాట నేత, గుజరాత్‌కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ వెల్లడించారు. చిక్కమగళూరుకు చెందిన కోము సౌహార్ధ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిగ్నేష్ మెవానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘నేను ఏ పార్టీకి మద్దతుగా పనిచేయడం లేదు. నా పోరాటం దళితులు, నిమ్నవర్గాల సంక్షేమం కోసమే. నా పోరాటం మతవాదులను ప్రేరేపించే వారిపైనే’ అంటూ బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఇక ప్రముఖ పాత్రికేయురాలు గౌరి లంకేష్‌తో పాటు ఎంతో మంది ఉద్యమకారులు, పోరాటవేత్తలతో తనకు పరిచయాలు ఉన్నాయని అన్నారు. ఇక కర్ణాటక ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్ కాబోదని జిగ్నేష్ మేవానీ పేర్కొన్నారు. ఇక్కడ బీజేపీ ఆటలు సాగబోవని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై జిగ్నేష్ మెవానీ స్పందిస్తూ...‘కర్ణాటకలో మత కలహాలను సృష్టించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే మేం మాత్రం కర్ణాటకలో స్నేహపూరిత, సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తాం. కర్ణాటక, కేరళలో నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కర్ణాటకలో ఎన్నికల సమయంలో తిరిగి ఇక్కడికి వస్తాను’ అని జిగ్నేష్ మెవానీ వెల్లడించారు. -
జిగ్నేష్ మేవానీపై ‘కత్తి’ దూశాడు!
సాక్షి, హైదరాబాద్ : వారువీరనే తేడాలేకుండా వరుసగా పోస్టులు పెడుతూ వివాదాలకు కారకుడవుతోన్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి గర్జించారు. దళిత ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూనే గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో కలిసి కూర్చున్న జిగ్నేష్ ఫొటోపై తనదైన శైలిలో వ్యాఖ్యలు రాశారు మహేశ్. ‘లీడర్ అంటే దేవుడు. ఎవరో నాయకులకు ఊడిగం చెయ్యాలనేవి దళిత రాజకీయ పోకడలుకాబోవు. దళితులు ఆత్మగౌరవ పోరాటాలు చేసేది సమానత్వం కోసమేకానీ.. గెలిచి (నాయకుడి) పక్కన కూర్చుని చర్చించడానికి కాదు. ‘జీ హుజూర్..’ అని జైకొట్టడానికి కానేకాదు’ అని కత్తి మహేశ్ వ్యాఖ్యానించారు. ఉనా(గుజరాత్) దళిత ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన యువనాయకుడిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన జిగ్నేష్ మేవాని.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయం విదితమే. -
మోదీ శకంలో దూసుకొచ్చిన కొత్త తారలు!
2017... భారత రాజకీయ చరిత్రను కొత్త మలుపు తిప్పింది. భవిష్యత్ నాయకులుగా గుర్తింపు పొందుతున్న వారంతా ఈ ఏడాది వెలుగులోకి వచ్చారు. మోదీ శకం దేదీప్యమానంగా సాగుతున్న సమయంలో.. కొత్త తారలు ఆవిర్భవించడం విశేషమే. ఈ ఏడాది భారత రాజకీయ యవనికపై కొత్త ముఖాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొట్టే సత్తా ఉన్న నేతలెవరూ లేరా? అని అనుకుంటున్న తరుణంలో.. గుజరాత్ యువకులు ఆశాదీపంలా కనిపించారు. గుజరాత్ అంటే నాదే అని జబ్బలు చరుచుకునే మోదీకే ముగ్గురు ముప్పయి చెరువుల నీళ్లు తాగించారు. మోదీకి మొదటి అపజయ భయాన్ని కల్గించారు. ఇక దశాబ్దకాలంగా రాజకీయాల్లో ఉన్నా.. శతాబ్దాల కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నా గుర్తింపు రానీ రాహుల్ గాంధీకి ఈ ఏడు బాగా కలిసి వచ్చింది. మిణుకుమిణుకు మంటున్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ తిరిగి వెలుగులు తీసుకురాగలడనే నమ్మకం ఇప్పుడే మొదలయింది. అలాగే ఉత్తర ప్రదేశ్‌లో రెండు దశాబ్దల కిందట అధికారానికి దూరమయిన భారతీయ జనతాపార్టీకి యోగి ఆదిత్యనాథ్ రూపంలో కొత్త శక్తి లభించింది. హార్ధిక్ పటేల్ పటేదార్ రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మొదలు పెట్టిన హార్ధిక్ పటేల్.. రేపటి తరం రాజకీయ ప్రతినిధిగా గుజరాత్లో స్థానం సంపాదించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు కూడా సరిపోయేంత వయసులేని హార్ధిక్... ప్రధాని నరేంద్ర మోదీని ముప్పతిప్పలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి.. బీజేపీని ఓటమి అంచులవరకూ తీసుకు వచ్చారు. సౌరాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీగా సీట్లు వచ్చాయంటే అది హార్ధిక్ పటేల్ సత్తానే అని చెప్పాలి. జిగ్నేష్ మేవాని సామాజిక వేత్తగా, న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్న జిగ్నేష్ మేవానీ.. 2017 గుజరాత్ ఎన్నికల్లో రాజకీయ నేతగా మారారు. ప్రధానంగా దళిత నేతగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని జిగ్నేష్ చేసిన విమర్శలు.. ప్రజల ఆలోచనా సరళిలో మార్పు తెచ్చిందని చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ జిగ్నేష్.. వడ్గావ్ నియోజక వర్గం నుంచి 19 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. భవిష్యత్ గుజరాత్ నేతగా ఇప్పటికే ప్రజలు భావిస్తున్నారు. అల్ఫేష్ ఠాకూర్ గుజరాత్లో ఓబీసీ నేతగా అల్ఫేష్ ఠాకూర్.. ఎదిగారు. ఈ ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో.. బీజేపీని, ప్రధాని మోదీ, అమిత్ షాల లక్ష్యంగా అల్ఫేష్ విమర్శల వర్షం కురిపించారు. గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన పేరుతో.. ఆల్ఫేష్ ఠాకూర్ బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ఎన్నికల్లో.. అల్ఫేష్ ఠాకూర్.. బీజేపీ అభ్యర్థిపై 10 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యానాథ్.. మొన్నటి వరకూ గోరఖ్‌పూర్ మఠాధిపతిగా, గోరఖ్‌పూర్ లోక్‌సభ సభ్యుడిగానే అందరికీ తెలుసు. ఈ ఏడాది యూపీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. యోగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అతివాద హిందూ నేతగా ఆదిత్యనాథ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇప్పటికే నరేంద్ర మోదీ తరువాత భారత ప్రధాని అయ్యేది యోగి ఆదిత్యనాథ్ అని బీజేపీలో ఒక వర్గం ప్రచారం సైతం చేస్తోంది. రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి 2004లోనే రాహుల్ గాంధీ ప్రవేశించినా తిరుగులేని గుర్తింపు మాత్రం ఈ ఏడాదే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. వారసత్వంగా పార్టీ అధ్యక్షుడు అయ్యాడన్న వాదనలు ఉన్న సమయంలో గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ తొలిసారి తన సత్తాను చాటారు. కూటమి కట్టడంలోనూ, అందరినీ కలుపుకుపోవడంలోనూ, మోదీపై విమర్శలు చేయడంలోనూ రాహుల్ పరిణతి ప్రదర్శించారు. ‘నీచ్’ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌పై వేగంగా చర్యలు తీసుకుని.. తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. -
కర్ణాటక కాంగ్రెస్‌కు జిగ్నేశ్ దన్ను
సాక్షి, బెంగళూరు: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన ఆ రాష్ట్ర దళిత నేత జిగ్నేశ్ మేవానీ త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న దళితుల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ జిగ్నేశ్‌ను రంగంలోకి దింపనుంది. గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేసిన జిగ్నేశ్ బలమైన దళిత నేతగా ఎదిగారు. తొలి ప్రయత్నంలోనే ఆయన వడగావ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఆయనను ప్రచారానికి తీసుకురావాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకు ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఆయన సీఎం సిద్ధరామయ్యతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. -
'మోదీ.. ప్రజలను పిచ్చోళ్లను చేయకండి'
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల తర్వాత కూడా స్వతంత్ర అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన దళిత నేత జిగ్నేశ్ మేవాని ప్రధాని నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. మోదీ ప్రజలను పిచ్చివాళ్లను చేయాలని చూస్తున్నారని, అలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. ప్రధాని మోదీ రాజకీయాల నుంచి తప్పుకునే సమయం ఆసన్నం అయిందని, ప్రజలు ఆయన చేసే పనులను సహించే పరిస్థితుల్లో లేరని అన్నారు. ప్రజలు పిచ్చివాళ్లని అనుకోవడం మోదీ పొరపాటు అవుతుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను మోదీ మోసం చేశారని ధ్వజమెత్తారు. హార్థిక్ పటేల్ తో భేటీ అయిన జిగ్నేశ్ తమ మధ్య జరిగింది సామరస్య పూర్వక భేటీ అని చెప్పారు. అలాగే, భవిష్యత్తులో కూడా ఎలా పోరాడాలనే విషయాన్ని చర్చించుకున్నామని, తమ పోరాటం కేవలం దళితులు, పటేళ్ల కోసమే కాకుండా 6.50కోట్ల గుజరాతీల కోసం ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ అవినీతి రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని హెచ్చరించారు. -
దళితుల ఆశాదీపం జిగ్నేష్ మేవానీ
గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదురొడ్డి పోరాడిన ముగ్గురు యువకుల్లో జగ్నేష్ మేవానీ ఒకరు. దళితుడైన మెవానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేవలం 18 నెలల్లోనే ఎమ్మెల్యేగా బనస్కాంత జిల్లా వడ్గామ్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల చేతుల్లో అనాదిగా అణగారిపోతున్న తమ గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తారని దళితులు ఆశిస్తున్నారు. మేవానీని తమ ఆశాదీపంగా కొనియాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థిపై దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓబీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో యువ నాయకుడు అల్పేశ్ ఠాకూర్.. పటాన్ జిల్లా రాధాన్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన పటీదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు అసెంబ్లీకి పోటీచేసే వయస్సు లేకపోవడం వల్ల బరిలోకి దిగలేదు. 2016, జూలై నెలలోనే మేవాని రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ఉనాలో ఓ చనిపోయిన ఆవు ఛర్మాన్ని వలుస్తుంటే నలుగురు దళిత యువకులపై అగ్రవర్ణాలకు చెందిన యువకులు దాడిచేసి దారుణంగా హింసించారు. ఆ సంఘటనతో కదిలిపోయిన మేవాని, దళిత యువకులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దళితుల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకొని ‘ఉనా దళిత్ అత్యాచార్ లడత్’ సమితిని ఏర్పాటు చేశారు. లాయరైన మెవానీ కొంత కాలం జర్నలిస్ట్‌గా పనిచేసి ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా మారారు. దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఆయన ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ముందుకెళుతున్నారు. నేడు రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యావంతుడైన మేవానీ తప్పకుండా అసెంబ్లీ ముందుకు తీసుకెళతారనే విశ్వాసం తమకు పూర్తిగా ఉందని సురేంద్రనగర్ జిల్లా దళిత నాయకుడు నాథూభాయ్ పార్మర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేవాని విజయం ఇతర సామాజిక కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుందని, వారు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుత వ్యవస్థను మార్చేందుకు కృషి చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉనా సంఘటన అనంతరం మేవానీ తమకు ఎంతో మేలు చేశారని ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు పాతికేళ్ల సర్వాయ చెప్పారు. మేవానీ నాయకత్వంలో తమకు న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్న ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఉనా సంఘటనపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేయలేదు. కేసులో నిందితులను అరెస్ట్‌చేసి బెయిల్‌పై విడుదల చేశారు. మేవానీతోపాటు దసడ, దారిలింమ్డా, కోడినార్, కలవడ్, గధడ అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి కూడా దళితులు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. గత అసెంబ్లీలో కాంగ్రెస్, స్వతంత్య్ర అభ్యర్థులుగా ముగ్గురు దళితులు విజయం సాధించగా ఈసారి ఆరుగురు దళితులు విజయం సాధించడం విశేషం. అయితే మేవానీ రాజకీయాల్లో చేరకుండా సామాజిక కార్యకర్తల్లా దళితుల హక్కుల కోసం పోరాడితేనే బాగుండేదని కొంత మంది దళిత నాయకులు, ఘనశ్యామ్ షా లాంటి రాజకీయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. -
'2019లో అధికార మార్పు కోసం దేశం సిద్ధంగా ఉంది'
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ 150 సీట్లు తెచ్చుకుంటామని పదేపదే చెప్పింది. కానీ 182 సీట్లున్న గుజరాత్లో బీజేపీ గెలుచుకుంది 99 స్థానాలు మాత్రమే. ఈ నేపథ్యంలో బీజేపీపై దళిత హక్కుల నేత జిగ్నేష్ మేవానీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మార్పు కోసం దేశం సిద్ధంగా ఉందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. 'దేశం మార్పునకు సిద్ధంగా ఉంది. అందువల్లే 150 సీట్లు మీరు లక్ష్యంగా పెట్టుకున్నా.. 99 సీట్లు మాత్రమే తెచ్చుకున్నారు. ఇది ఆరంభం మాత్రమే. మార్పు కోసం తర్వలో తుఫాన్ రాబోతుంది' అని జిగ్నేష్ ట్వీట్ చేశారు. గుజరాత్ ఫలితాల నేపథ్యంలో దేశం సంస్కరణలకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా జిగ్నేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ స్వస్థలమైన వాద్‌నగర్‌ను ప్రస్తావిస్తూ ఆయనపై జిగ్నేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'వాద్‌నగర్‌కు చెందిన వ్యక్తికి వాడ్గామ్ ప్రజలు తగిన బదులు ఇచ్చారు. మూడు, నాలుగు రోజుల్లో వాద్గామ్ నుంచి వాద్నగర్ వరకు (50కిలోమీటర్ల) రోడ్‌షో నిర్వహిస్తాం. పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనకు సమాయత్తం అవుతున్నాం' అని ఆయన అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వాడ్గామ్ నియోజకవర్గం నుంచి జిగ్నేశ్ మేవాని గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. గుజరాత్ ఉనాలో దళితులపై గో రక్షకుల దాడికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన వారిలో జిగ్నేష్ ప్రముఖుడు. ఈ క్రమంలో దళిత హక్కుల నేతగా ఆయన గొంతుకను వినిపిస్తున్నారు. -
కాంగ్రెస్‌కు ఉన్న ఆ రెండు ఆశలు బతికాయి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఆశలు బతికాయి. తొలిసారి తమ పార్టీ తరుపున, పార్టీ అండతో బరిలోకి దిగిన ఇద్దరు యువ నేతలు జిగ్నేష్ మేవాని, అల్పేష్ ఠాకూర్ తమ విజయాన్ని ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిగ్నేష్ వాద్గాం స్థానం నుంచి బరిలోకి దిగి విజయాన్ని సొంతం చేసుకోగా.. ఓబీసీల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పోటీలో పెట్టిన అల్పేష్ ఠాకూర్ తన విజయాన్ని ఖరారు చేసుకున్నారు. తొలుత వెనుకబడినట్లు కనిపించినా చివరకు రాధన్‌పూర్ నుంచి గెలుపొందారు. గుజరాత్లో ఇది కూడా ఒక అతిపెద్ద నియోజకవర్గం. గుజరాత్లో తీవ్ర స్థాయిలో పటేళ్ల ఉద్యమం జరిగినప్పుడు హార్ధిక్ పటేల్ వెంట ఈ ఇద్దరు ఉన్నారు. అయితే, హార్ధిక్ ప్రస్తుత వయసు 24 ఏళ్లు కావడంతో అతను ప్రచారం మాత్రమే నిర్వహించాడు. జిగ్నేష్ దళిత నేత కాగా అల్పేష్ ఠాకూర్ మాత్రం ఓబీసీల ప్రతినిధి. ఇక జిగ్నేష్‌పై బీజేపీ బరిలోకి దింపిన లావింగ్జి ఠాకూర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తే అయినప్పటికీ అతడు అనూహ్యంగా బీజేపీలో వెళ్లి ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ మద్దతుతోనే బరిలోకి దిగిన ఈ ఇద్దరు నేతలు ప్రచారంలో కూడా బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చారు. ఇక అల్పేష్ ఠాకూర్ అయితే ఏకంగా ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు కురిపించారు. లక్షల రూపాయల విలువ చేసే పుట్టగొడుగులు మోదీ తింటారని, అందుకే ఆయన చర్మం తెల్లగా నిగనిగలాడుతుందంటూ కూడా ఆయన మోదీని విమర్శించారు. -
దళిత హక్కుల కార్యకర్తకు పట్టం
అహ్మదాబాద్ : దళిత హక్కుల కార్యకర్త, లాయర్ జిగ్నేష్ మేవాని(36) గుజరాత్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. బనస్కంత జిల్లాలోని వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. దళిత హక్కుల కార్యకర్త అయిన మేవాని వడ్గాం నుంచి పోటీకి నిలవడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అక్కడి నుంచి తమ అభ్యర్ధులను ఉపసంహరించుకున్నాయి. దీంతో జిగ్నేష్, బీజేపీ అభ్యర్థి విజయ్ చక్రవర్తిల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించారు. అయితే, అంచనాలను తలక్రిందులు చేస్తూ 18,150 ఓట్ల భారీ మెజార్టీతో జిగ్నేష్ భారీ విజయం సాధించారు. గుజరాత్‌లోని ఉనా జిల్లాలో దళితులపై దారుణాలపై జిగ్నేష్ అనేక ఆందోళనలు నిర్వహించారు. తన జాతి వారికి జీవించడానికి భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 'ఆజాదీ కూచ్' పేరుతో మేవాని చేపట్టిన ర్యాలీ బాగా ప్రాచుర్యం పొందింది. ఎవరి వాడిని కాదన్నారు.. దళితులపై దారుణాలను ఎండగట్టిన మేవాని.. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వానికి తాను వ్యతిరేకినని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతు ఇవ్వబోనని కూడా చెప్పారు. ఎవరికి ఓటు వేయాలనే విషయం ప్రజలకు తెలుసని, వారు అందరి కంటే స్మార్ట్ అని ఎన్నికలకు ముందు ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు మేవాని. -
‘గుజరాత్లో బీజేపీ ఓడిపోతుంది’
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెబుతుంటే ప్రత్యర్థులు మాత్రం ఒప్పుకోవడం లేదు. కాషాయ పార్టీకి ఓటమి తప్పదని ఢంకా బజాయిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంతా చెత్త అంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ కొట్టిపారేశారు. బీజేపీ తప్పకుండా ఓడిపోతుందని, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వాద్గామ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జిగ్నేశ్ పోటీ చేశారు. న్యాయవాది-హక్కుల కార్యకర్త అయిన జిగ్నేశ్.. పటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్, ఓబీసీ నేత అల్పేశ్ థాకూర్‌తో కలిసి బీజేపీని వ్యతిరేకించారు. అల్పేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, హార్దిక్ హస్తం పార్టీకి మద్దతు ప్రకటించారు. జిగ్నేశ్‌పై పోటీపై పెట్టకుండా కాంగ్రెస్ పరోక్షంగా ఆయనకు సహకరించింది. వాద్గామ్ నియోజకవర్గంలోని రెండు చోట్ల ఆదివారం రీపోలింగ్ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రంలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా, లేదా అనేది రేపు (సోమవారం) తేలిపోతుంది. -
మేవానీపై నాన్‌బెయిలబుల్ వారెంట్
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీపై నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జనవరిలో ఓ నిరసన కార్యక్రమంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్న కేసు విచారణకు ఆయన గైర్హాజరైనందుకే అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ఎస్ లాంగా మేవానీతో పాటు మరో 12 మందికి వ్యతిరేకంగా ఈ వారెంట్ జారీచేశారు. నామినేషన్ దఖాలు చేసే పనిలో బిజీగా ఉన్నందున జిగ్నేశ్ రాలేకపోయారని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది షంషాద్ పఠాన్ విన్నవించారు. అయితే ఈ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది. వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు వ్యతిరేకంగా జనవరి 11న నిర్వహించిన రైల్ రోకో ఆందోళనలో భాగంగా అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను జిగ్నేశ్, ఆయన మద్దతుదారులు నిలిపివేశారు. ఈ కేసులో 40 మంది కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వాద్గామ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జిగ్నేశ్ పోటీచేస్తున్నారు.