
సాక్షి, అహ్మదాబాద్ : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వల్ల తనకు ప్రాణహాని ఉందని గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ పేర్కొన్నారు. బీజేపీ, సంఘ్ శక్తులు తనను హత్య చేయించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తనవద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన చెప్పారు.
ఫాసిస్టు భావజాలం కలిగిన వ్యక్తులు, సంస్థలు నన్ను తప్పకుండా చంపేందుకు ప్రయత్నాలు చేస్తాయని మేవానీ తెలిపారు. నన్ను భూమ్మీద లేకుండా చేయడం వల్ల వాళ్లు.. తాత్కాలిక లాభాన్ని పొందేందకు ప్రయత్నిస్తున్నారని మేవానీ అన్నారు. జిగ్నేష్ మేవానీ ప్రాణ రక్షణకు ‘వై’ కేటగిరీ భద్రతను కల్పించాలని దళిత సంఘాలు గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.