ఆరెస్సెస్‌.. ఇదిగో మీకు సమాధానం.. | Priya viral video is an answer to RSS, tweets Jignesh Mevani | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 14 2018 1:45 PM | Last Updated on Wed, Feb 14 2018 1:47 PM

Priya viral video is an answer to RSS, tweets Jignesh Mevani - Sakshi

ప్రియాప్రకాశ్‌ వారియర్‌ ఇప్పుడో ఇంటర్నెట్‌ సెన్సేషన్‌. ఆమె గురించి తెలియని వారు ఉండరంటే అతియోశక్తి కాదు.. బాలీవుడ్‌ సార్ట్‌ కిడ్స్‌కు కూడా సాధ్యంకానిరీతిలో ఆమె ఇంటర్నెట్‌ను ముంచెత్తింది. ఒక్కరోజులోనే సోషల్‌ మీడియాను తన సామ్రాజ్యం చేసుకుంది. కనుసైగలతో ఇష్టసఖుడిని లాలించి.. కన్నుగీటి అతన్ని ప్రేమమైకంలో దింపి.. ఆ హావభావాలతో యువత గుండెలోకి దిగిపోయింది.  ఈమేరకు ఆమె కనుసైగల వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలోనే.. దేశమంతటా మీడియాలో మర్మోమోగుతోంది. ఈ వాలెంటైన్స్‌ డే స్పెషల్‌గా హల్‌చల్‌ చేస్తోంది. ప్రియాప్రకాశ్‌ వీడియోపై  ఇప్పటికే సినీ స్టార్లు మొదలు ఎంతోమంది ప్రముఖులు స్పందించారు.

తాజాగా గుజరాత్‌ దళిత ఫైర్‌బ్రాండ్‌ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ ఈ వీడియోపై స్పందించారు. ప్రేమికుల రోజుపై నిరసనలు వ్యక్తంచేసే ఆరెస్సెస్‌కు ఇదిగో సమాధానం అని పేర్కొన్నారు. ‘మాణిక్య మలరయ పూవీ’ వైరల్‌ హిట్‌ కావడం.. వాలెంటైన్స్‌ డేను నిరసించే ఆరెస్సెస్‌కు ఒక సమాధానం. ఒకరిని ద్వేషించడం కన్నా ప్రేమించడాన్ని అధికంగా ఇష్టపడతామని భారతీయులు మరోసారి రుజువు చేశారు’ అని జిగ్నేశ్‌ ట్వీట్‌ చేశారు. హిందుత్వ అతివాద సంస్థలు మొదటినుంచి ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. హిందూ మహాసభ, శ్రీరామసేన, భరతసేన, బజరంగ్‌ దళ్‌ మొదలైన సంస్థలు మోరల్‌ పోలీసింగ్‌ పేరిట ప్రేమికులరోజున బయట కనిపించే జంటలపై దౌర్జన్యం చేసి.. బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement