
పారాదీప్(ఒడిశా): ‘కళాశాలలో చదివే ప్రతి ఒక్క అమ్మాయి ప్రేమికుల దినోత్సవం రోజుకల్లా బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించాలి. లేదంటే కాలేజీలోకి అనుమతించబోము’ అంటూ ఒడిశాలో ఒక కాలేజీ తరఫున అధికారికంగా వెలువడిందని చెబుతున్న నోటీసు ఒకటి సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతోంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదుచేసి తప్పుడు నోటీస్ తయారుచేసిన నిందితుల కోసం వెతికే పనిలో పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని ఎస్‌వీఎం అటానమస్ కాలేజీ ప్రిన్సిపల్ పేరిట ఒక నకిలీ నోటీసు వెలువడింది. కాలేజీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో బిజయ్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. సంతకాన్ని దుర్వినియోగం చేశారని, అది నకిలీ నోటీసు అని కాలేజీ పరువు తీసేందుకు కావాలనే ఎవరో కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment