college students
-
కడుపు నింపుతున్న.. 'దోసెడు బియ్యం'
నెలలో మూడో మంగళవారం వచ్చిoదంటే..భుజాన పుస్తకాల బ్యాగే కాదు.. ప్రతి విద్యార్థి చేతిలోని బాక్సు నిండా ఇంటి వద్ద నుంచి బియ్యం నింపుకొని కాలేజీకి తెస్తారు. కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రమ్‌లో వాటిని పోస్తారు.వచ్చిన బియ్యం మొత్తాన్ని మూడు నుంచి ఐదు కేజీల చొప్పున ప్యాకెట్లుగా చేసి వాటిని పేదలకు అందజేసి వారి ఆకలిని తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలోని శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ (గుప్పెడు బియ్యం) పేరిట రెండున్నరేళ్లుగా నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. – సాక్షి, భీమవరంవిద్యార్థుల్లో మానవత్వం పెంపుదల.. కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉండగా వాటిలో 300 మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. విద్యతో పాటు ఎన్ఎస్ఎస్, రెడ్‌క్రాస్ సంబంధిత సేవా కార్యక్రమాల నిర్వహణకు ఇక్కడి అధ్యాపక బృందం, విద్యార్థులు ప్రాధాన్యమిస్తుంటారు. అందులో భాగంగానే 2022లో ‘దోసెడు బియ్యం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం తీసుకునే ఆహారంలో కొంచెం భాగం ఇతరులకు ఇవ్వడం, విద్యార్థుల్లో మానవత్వాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థీ నెలలో నిర్ణీత రోజున తమ ఇంటి వద్ద నుంచి గుప్పెడు బియ్యాన్ని తెచ్చి కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రమ్‌లో వేస్తే.. సేకరించిన మొత్తాన్ని అవసరమైన నిరుపేదలకు అందించాలి. ప్రతినెలా మూడో మంగళవారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైనా నెలలో ఆ రోజు సెలవు వస్తే ముందురోజున లేదా మరుసటి రోజున అమలు చేస్తున్నారు. నెలకు దాదాపు 100 నుంచి 120 కేజీల వరకు బియ్యం వస్తుండగా, వాటిని మూడు నుంచి ఐదు కేజీల వరకు బ్యాగులుగా ప్యాక్ చేసి గ్రామంలోని మార్కెట్ తదితర ప్రాంతాల్లోని నిరుపేదలకు పంపిణీ చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.నిర్మలకుమారి నేతృత్వంలో వైస్ ప్రిన్సిపల్ పి.మధురాజు, కామర్స్, బోటనీ లెక్చరర్లు బి.రాణిదుర్గ, డాక్టర్ సీహెచ్ చైతన్యల పర్యవేక్షణలో రెండున్నరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.మూడో మంగళవారం వచ్చిందంటే చాలు తమకంటే ముందే తమ పేరెంట్స్ బాక్సులో బియ్యం పోసి సిద్ధం చేయడం ద్వారా ఇప్పటికే తమ కళాశాలలో చేస్తున్న ఈ సేవలో భాగస్వాములయ్యారని విద్యార్థులు చెబుతున్నారు. మిగిలినచోట్ల విద్యార్థులు ప్రయత్నిస్తే ఒక పెద్ద సేవగా మారుతుందని వారు ఆశిస్తున్నారు. ఆనందంగా అనిపిస్తుంది ప్రతినెలా విద్యార్థులమంతా కలసి బియ్యం తెచ్చి పేదలకు పంచడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ ప్రోగ్రాం మరింత విస్తరించి ప్రతి ఒక్కరూ ఇతరులకు పంచే సేవ చేయటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. – పి.హర్షిత, బీకాం సెకండియర్ బియ్యం ఇచ్చి పంపుతారు నెలలో మూడో మంగళవారం వచ్చి0దంటే చాలు కాలేజీకి ఈరోజు బియ్యం తీసుకువెళ్లాలి ఇవిగో అంటూ బాక్సులో పోసి పేరెంట్స్ పంపిస్తుంటారు. మా స్టూడెంట్సే కాదు మా పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. – కె.జాయ్, బీకాం కంప్యూటర్స్, సెకండియర్మార్పుకోసం చిన్న ప్రయత్నం ఇది కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం కాదు. పేదరికాన్ని తగ్గించేందుకు, మానవత్వాన్ని పెంచేందుకు, సమాజంలో మార్పు కోసం మా విద్యార్థులు చేస్తున్న చిన్న ప్రయత్నం. ఈ కార్యక్రమం నిర్వహించే బాధ్యత నాకు అప్పగించడచాలా ఆనందంగా ఉంది. – బి.రాణి దుర్గ, కామర్స్ లెక్చరర్ పంచే గుణాన్ని అలవాటు చేసేందుకు తమకు ఉన్న దానిలో ఇతరులకు కొంచెం పంచే గుణాన్ని విద్యార్థులకు అలవాటు చేయడం హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ ముఖ్య ఉద్దేశం. మా కళాశాలలో ప్రిన్సిపల్ నిర్మలకుమారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న అత్యుత్తమ సేవా కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. – డాక్టర్ సీహెచ్ చైతన్య, బోటనీ లెక్చరర్ విద్యతో పాటు విలువలు మా కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారిలో మంచి విలువలు పెంపొందించాలన్నదే మా లక్ష్యం. పేదవారి ఆకలిని తీర్చడంలో ఉండే సంతృప్తిని వారు ఆనందిస్తున్నారు. ప్రతినెలా అందరూ ఎంతో ఉత్సాహంగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. – డాక్టర్ పి.నిర్మలాకుమారి, ప్రిన్సిపల్ -
సూపర్ స్టైలిష్ బైకులు.. కాలేజ్ స్టూడెంట్స్ కోసం!
భారతదేశంలో లాంగ్ రైడ్ చేయడానికి, రోజువారీ ప్రయాణానికి, మహిళలు కోసం, కాలేజ్ స్టూడెంట్స్ కోసం.. ఇలా వివిధ రకాల టూ-వీలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో ప్రత్యేకించి కాలేజ్ స్టూడెంట్లకు అనువైన ఐదు బెస్ట్ బైకుల గురించి తెలుసుకుందాం.యమహా ఎంటీ-15యమహా అంటే ముందగా గుర్తొచ్చేది స్టైల్. కాబట్టి ఇవి యువతను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటాయి. కాలేజ్ స్టూడెంట్లు బాగా ఇష్టపడే యమహా బైకులలో ఒకటి.. ఏంటీ-15. రూ.1.78 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ బైక్ మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 155 సీసీ ఇంజిన్ ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది.కేటీఎం 125 డ్యూక్యువత ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే బైకులతో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ బ్రాండ్ కేటీఎం. ఈ కంపెనీకి చెందిన 125 డ్యూక్ కాలేజ్ విద్యార్థులకు కూడా మొదటి ఎంపిక. దీని ధర రూ.1.78 లక్షలు. ఈ బైకులో 124.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. రోజువారీ వినియోగానికి, లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.బజాజ్ పల్సర్ ఎన్ఎస్200రూ.1.40 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే 'బజాజ్ పల్సర్ ఎన్ఎస్200' బైక్ కూడా కాలేజ్ స్టూడెంట్లకు నచ్చిన బైకులలో ఒకటి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ 199.5 సీసీ ఇంజిన్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ రైడింగ్ అందించే ఈ బైకును స్టూడెంట్స్ మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తారు.రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన హంటర్ 350 మంచి డిజైన్ కలిగి ఉండటం వల్ల.. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు మాత్రమే. ఇది స్టైలిష్ స్ట్రీట్ బైక్. ఇందులో 349.34 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 Bhp, 27 Nm టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్రూ. 96,781 ప్రారంభ ధర వద్ద లభించే బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన 'ఎక్స్ట్రీమ్ 125ఆర్'. ఇందులోని 124.7 సీసీ ఇంజిన్ ఉత్తమ పనితీరును అందిస్తుంది. చూడటానికి స్టైలిష్‌గా కనిపించే ఈ బైక్ 124.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. తద్వారా బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. -
పైథాగరస్ వర పుత్రికలు!
మేథ్స్ సబ్జెక్ట్ కష్టం. అందులోని ట్రిగొనమెట్రీ మరింత కష్టం. ట్రిగొనమెట్రీ లోని పైథాగరస్ సిద్ధాంతం ఇంకాస్త కష్టం. ప్లస్ లు, మైనస్ లను ఎలాగో లాగించేయొచ్చు. త్రిభుజాలు, త్రికోణాల ట్రిగొనమెట్రీ (త్రికోణమితి) ని, పైథాగరస్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోటానికి, ఆ లెక్కల్ని పరిష్కరించటానికి ఒక గణిత శాస్త్రవేత్తకు ఉండేంత ఐ.క్యూ.లో పిసరంతైనా లేకుంటే బుర్ర తిరిగి పోతుంది. అలాంటిది ఈ అమ్మాయిలను చూడండి, త్రికోణమితిని ఉపయోగించి పైథాగరస్ సిద్ధాంతాన్ని రుజువు చేసే ఐదు కొత్త సూత్రాలను కనుక్కున్నారు! లూసియానా లోని న్యూ ఆర్లీన్స్ కాలేజ్ విద్యార్థినులు... కాల్సియా జాన్సన్, నేకియా జాక్సన్ వీళ్లు. మొదటిసారి 2022లో ఈ అమ్మాయిలు పైథాగరస్ సిద్ధాంతాన్ని రుజువు చేసే కొన్ని సూత్రాలను ఆవిష్కరించారు. ఆ హద్దులను కూడా దాటి ఇప్పుడు ఐదు అదనపు రుజువులకు దారి తీసే ఐదు ప్రత్యక్ష రుజువులు కనిపెట్టారు. వీటివల్ల ట్రిగ్నామెట్రీని అర్థం చేసుకోవటం మరింత తేలిక అవుతుంది.వీరు సాధించిన ఈ ఘనతను ప్రఖ్యాత ‘అమెరికన్ మేథమేటికల్ మంత్లీ‘ తన తాజా సంచికలో గొప్పగా ప్రచురించింది. అబ్బాయిలూ... మీరింకా ఫుట్ బాల్ గ్రౌండ్ లోనే ఉన్నారా.. మేథ్స్ పరిశోధనలో అమ్మాయిలు ఇంత పెద్ద గోల్ కొట్టారని తెలిసినా కూడా!! -
సంప్రదాయ స్వీట్స్ తో ప్రీ దీపావళి వేడుకలు నిర్వహించిన ఓ విద్యాసంస్థ
-
పది పరీక్ష రాశారా? మా కాలేజీలో చేరండి
‘హలో.. నమస్కారమండి.. మీ పాప/బాబు పదో తరగతి అయిపోయింది కదండి.. ఇంటర్‌కు ఏం ప్లాన్ చేస్తున్నారు.. మాది కార్పొరేట్ కాలేజ్. ఐఐటీ.. మెయిన్స్.. అడ్వాన్స్.. ఏసీ.. నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్‌లున్నాయి. ఇప్పుడు జాయిన్ అయితే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం.. రిజల్ట్స్ వచ్చాక సీట్లు ఉండవు. ఫీజులు పెరుగుతాయి.. మీ ఇష్టం.. ఆలోచించుకొండి..’ ఇది జిల్లాలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు రోజూ వస్తున్న ఫోన్‌కాల్స్. ఇలా ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకొని ప్రవేశాల కోసం గాలం వేస్తున్నాయి. ఆదిలాబాద్‌టౌన్: తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కూలీ నాలి చేసైనా మంచి కళాశాలలో చదివించాలనే ఆ లోచనలో ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. అందించేది అరకొర విద్యే అ యినప్పటికీ.. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి.. రంగురంగుల బ్రౌచర్లు చూపి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరి మాయమాటలు నమ్మి చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులు సైతం అమ్ముకొని పిల్లలను చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫలితాలు రాక ముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. బంపర్ ఆఫర్లతో ఆకట్టుకునేలా.. ఆయా కళాశాలలు నియమించుకున్న పీఆర్వోలు వి ద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈ తతంగం మొదలైంది. వీరు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా ఇప్పటికే సేకరించారు. వివరాలు ఇచ్చినందుకు ఆయా పాఠశాలల యాజ మాన్యాలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధన ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికీ ఇవ్వరాదు. కానీకాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈవిధంగా వ్యవహరిస్తున్నా యి. హైదరాబాద్‌కు చెందిన పలు కళాశాలల వారు జిల్లాలో 50 మంది వరకు పీఆర్వోలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, వారి కళా శాలల్లో ఇచ్చే బోధన, వసతులు, ఏసీ క్యాంపస్‌లు, తదితర విషయాలను వివరిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. టార్గెట్ పెడుతూ.. కొన్ని యాజమాన్యాలు పీఆర్వోలను ప్రత్యేకంగా ని యమించుకొని ఏడాది పాటు వేతనాలు ఇస్తున్నా యి. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటీవ్లు సైతం అందజేస్తున్నాయి. మరోవైపు సంబంధి త కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర అ ధ్యాపకులు, సిబ్బంది తప్పకుండా ప్రతి ఒక్కరు 25 చొప్పున ఆ కళాశాలలో అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్లు పెట్టారు. వేసవిలో తరగతులు ఉండకపోవడంతో వారికి సగం వేతనమే చెల్లిస్తున్నారు. ప్రవేశాలు చేసిన వారికి మాత్రం ఇన్సెంటీవ్, కొంత కమీ షన్ ఇస్తున్నారు. లెక్చరర్లు, ఇతరులు ఎవరైనా అడ్మిషన్లు చేస్తే సాధారణ కళాశాలకు రూ.వెయ్యి, కార్పొరేట్ కళాశాలకు రూ.5వేల వరకు, హాస్టల్ క్యాంపస్ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే రూ.2500 అందజేస్తున్నా రు. కాగా, ఈ డబ్బంతా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నది కావడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా.. పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్‌లో అడ్మిషన్లు ప్రారంభించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 13 మోడల్, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, మహాత్మా జ్యోతిబాపూలే, ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు 45 ప్రైవేట్ కళాశాలలు 14 భారీగా ఫీజులు.. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌కు సంబంధించి జిల్లా నుంచి ఏటా వెయ్యి నుంచి 2వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఐఐటీ, నీట్, ఏసీ సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో ఏడాదికి రూ.3లక్షలు, సాధారణ చదువుకు రూ.1లక్ష 50వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ కళాశాలలు సైతం రూ.లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన లెక్చరర్ల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను సర్కారు కళాశాలల్లో చేర్పించాలి. అడ్మిషన్‌తో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందిస్తున్నాం. స్కాలర్షిప్ కూడా పొందవచ్చు. – రవీంద్రకుమార్, డీఐఈవో -
మత్స్యరంగం కొత్త పుంతలు
సాక్షి, అమరావతి: ‘ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా’గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మూడోదిగా ఏర్పాటైన ఈ వర్సిటీకి ఓ వైపు నూతన భవన సముదాయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే.. మరోవైపు దీనికి అనుబంధంగా కొత్త మత్స్య కళాశాల కొలువు దీరింది. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు..నిష్ణాతులైన అధ్యాపక బృందంతో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. 1200కు మించి పట్టభద్రుల్లేని పరిస్థితి రాష్ట్రంలో 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం..1.10 లక్షల హెక్టార్ల మంచినీటి సాగు..80 వేల హెక్టార్లలో ఉప్పునీటి సాగు విస్తీర్ణం ఉంది. 1.75 లక్షల మంది ఆక్వా రైతులు..8.50 లక్షల మంది మత్స్యకారులున్నారు. ఈ రంగంపై ఆధారపడి 16.50 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. 51.06 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తితో రాష్ట్రం దేశంలోనే నం.1 స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో చేపల ఉత్పత్తిలో 25.60 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 78 శాతం ఏపీ నుంచే జరుగుతోంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రానికి 11,901 డిప్లమో హోల్డర్లు, 6118 బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ), 2541 మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (ఎంఎఫ్ఎస్సీ) చదివిన వారు అవసరం. 2030 నాటికి కనీసం 50 వేల మందికి పైగా అవసరమవుతారని అంచనా. కానీ ప్రస్తుతం కేవలం 450 మంది డిప్లమో, 700 మంది బీఎఫ్ఎస్సీ, 50–60 మంది ఎంఎఫ్ఎస్సీ పూర్తిచేసిన వారు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2005 వరకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో, ఆ తర్వాత వెటర్నరీ యూనివర్సిటీకీ అనుబంధంగా ఉన్న మత్స్య యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ యాక్టు–2020ను తీసుకురావడమే కాదు..2022 ఫిబ్రవరి 19 నుంచి వర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలో ఉన్న నెల్లూరు జిల్లా ముతుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్‌తో పాటు అవనిగడ్డ మండలం బావదేవర పల్లి వద్ద ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల, కాకినాడలో ఉప్పునీటి రొయ్యలు, బిక్కవోలు మండలం బలభధ్రపురంలో మంచినీటి చేపల పరిశోధనా కేంద్రం, ఉండి వద్ద మంచి నీటి చేపలు, రొయ్యల పరిశోధన కేంద్రంతో పాటు 8 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలను మత్స్య వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తొలి ఏడాదిలోనే గుర్తింపు వర్సిటీకి అనుబంధంగా 60 బీఎఫ్ఎస్సీ సీట్లతో కొత్తగా నర్సాపురం మత్స్య కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచింది. కొత్తగా ఏర్పాటు చేసిన నర్సాపురం కళాశాలకు నిష్ణాతులైన అధ్యాపక బృందాన్ని నియమించి 2022–23 విద్యా సంవత్సరం నుంచే నర్సాపురంలోని తుఫాన్ భవనం (తాత్కాలికంగా)లో తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు యూజీసీ, ఐసీఏఆర్ గుర్తింపు కూడా లభించడం గమనార్హం. వచ్చే ఏడాది నుంచి మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, పీహెచ్డీ కోర్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కృష్ణా జిల్లా కైకలూరు వద్ద ఫిషరీస్ కళాశాలలతో పాటు కొత్తగా నాలుగు మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ తాడిగడపలో వర్సిటీ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కార్యకలాపాలకు శ్రీకారంచుట్టారు. శరవేగంగా నిర్మాణ పనులు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో లఖితపూడి– సరిపల్లి గ్రామాల మధ్య 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో యూనివర్సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే 40 ఎకరాలను గుర్తించగా, దాంట్లో రూ.100 కోట్లతో పరిపాలనా భవనంతో పాటు అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టళ్లు, రైతుల శిక్షణ కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా, మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. పిల్లర్ల దశకు చేరుకున్నాయి. మరొక పక్క వర్సిటీతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మత్స్యకళాశాల కోసం 48 టీచింగ్, 52 నాన్ టీచింగ్, 40 అవుట్సోర్సింగ్ కలిపి 140 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనామోదం కూడా ఇచ్చింది. శాస్త్రవేత్తను కావాలని.. మాది నెల్లూరు. మా నాన్న ఆర్టీసీ కండక్టర్.గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. ఎంసెట్‌తో పాటు నీట్లో కూడా క్వాలిఫై అయ్యాను. చిన్నప్పటి నుంచి మత్స్యశాస్త్రవేత్త కావాలన్న సంకల్పంతో బ్యాచురల్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో చేరాను. నర్సాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో సీటు వచ్చింది. ఫ్యాకల్టీ చాలా బాగుంది. నర్సాపురం సమీపంలోనే ప్రాసెసింగ్ ప్లాంట్స్, హేచరీలు, మత్స్య పరిశ్రమలుండడం మాకెంతో ఉపయోగంగా ఉంది. –పి.హరిబాబు, బీఎఫ్ఎస్సీ విద్యార్థి అపార అవకాశాలు మాది గుంటూరు. నాన్న బ్యాంక్ మేనేజర్. ఎంబీబీఎస్ చేయాలని నీట్ రాశాను. క్వాలీఫై కాలేకపోయాను. అపారమైన ఉపాధి అవకాశాలున్న మత్స్య రంగంలో అడుగు పెట్టాలన్న సంకల్పంతో నర్సాపురం కళాశాలలో బీఎఫ్ఎస్సీలో సీటు సాధించా. మత్స్య శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్నదే నా లక్ష్యం. –ఎస్డీ షరీఫాతేజ్, బీఎఫ్ఎస్సీ విద్యార్థిని త్వరలో నూతన ప్రాంగణంలోకి.. అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న మత్స్యరంగం బలోపేతం కావాలంటే ప్రత్యేకంగా మత్స్య యూనివర్సిటీ అవసరం. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మూడో మత్స్య వర్సిటీని ఏర్పాటు చేశారు. తొలిదశలో రూ.100 కోట్లతో వర్సిటీ భవనాలు నిర్మాణమవుతున్నాయి. వర్సిటీ భవనాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా నూతన ప్రాంగణంలో వర్సిటీ కార్యకలాపాలతో పాటు మరిన్ని కోర్సులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. –డాక్టర్ ఓగిరాల సుధాకర్, రిజిస్ట్రార్, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం -
విజయవాడ : ర్యాంప్ వాక్ లో అదరగొట్టిన కాలేజీ విద్యార్థులు (ఫొటోలు)
-
కళాశాలల్లో విద్యార్థుల మధ్య గొడవలు సృష్టించే విధంగా టీడీపీ ప్లాన్
-
100 శాతం జీఈఆర్ సాధించాలి
సాక్షి, అమరావతి: దేశంలో విద్యార్థుల నమోదులో నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆకాంక్షించారు. సెప్టెంబర్ 2005 నుంచి ఆగస్టు 2018 మధ్య జన్మించిన వారంతా రాష్ట్రంలోని ఏదో ఒక పాఠశాల/కాలేజీలో నమోదై ఉండాలన్నారు. ఇందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రవీణ్ ప్రకాశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చేరికలపై చర్చించారు. వచ్చే నెల సెప్టెంబర్ 4 నాటికి రాష్ట్రంలోని బడి ఈడు పిల్లలంతా ఏదో ఒక పాఠశాలలో చేరి ఉండాలన్నారు. వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, జిల్లా అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి నూరుశాతం నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. నూరుశాతం జీఈఆర్ సాధన అంశాన్ని తాను సవాలుగా తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యార్థుల విషయంలో స్థానికంగా నమోదైన అంశాల్లో తప్పులు ఉంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చాలెంజ్ విసిరారు. జీఈఆర్ సాధించడంలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని.. డేటా అంతా పూర్తి పారదర్శకంగా ఉండాలని కోరారు. జూలై రెండో వారంలో గుడివాడలో ఒక వలంటీర్ 100 శాతం జీఈఆర్ సాధించారని, ఇప్పుడు 63,993 మంది వలంటీర్లు తమ పరిధిలో 100 శాతం జీఈఆర్ సాధించారని గుర్తు చేశారు. -
ఆ గోల్డ్‌కి పెరుగుతున్న క్రేజ్..రోజుకో నగతో మహిళామణులు..
శుభకార్యం ఏదైనా... మహిళలు ప్రత్యేకంగా దృష్టి సారించేది ఆభరణాలపైనే. చీర రంగు, డిజైన్‌కు తగ్గట్టుగా ఆభరణాలు ధరించాలనుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ బంగారం ధరలు చుక్కలనంటుతుండంతో ప్రత్యామ్నాయ ఆభరణాల వైపు చూస్తున్నారు. చాలా మంది ‘వన్‌గ్రామ్ గోల్డ్’ వైపు మొగ్గుచూపుతున్నారు. ధర తక్కువగా ఉండటం...వివిధ మోడళ్లలో అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది వీటిని ధరించేందుకు ఇష్టపడుతున్నారు. రోజుకో మోడల్ నగతో ధగధగ మెరుస్తున్నారు. సాక్షి, పుట్టపర్తి: బంగారం.. కొనాలంటే ధర భయపెడుతోంది...ఎలాగోలా కొందామనుకున్నా కావాల్సిన మోడల్ అందుబాటులో ఉండటం లేదు. నచ్చిన మోడల్ నగ కొనుగోలు చేసినా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అందువల్లే బంగారు ఆభరణాల కొనుగోలు ఇప్పుడో పెద్ద ప్రహసనం. అందువల్లే సామాన్య, మధ్యతరగతి వారు ప్రత్యామ్నాయ ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. జిగేల్ మంటున్న వన్‌గ్రామ్ గోల్డ్ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయలేని సామాన్యులు, మధ్య తరగతి మహిళలకు ఇప్పుడు వన్‌గ్రామ్ గోల్డ్ కళ్లముందు జిగేల్‌మంటోంది. ధరలు కూడా అందుబాటులో ఉండటం..కోరిన డిజైన్లలో దొరుకుతుండటంతో వన్‌గ్రామ్ గోల్డ్‌కే జై కొడుతున్నారు. చైన్ స్నాచింగ్ కేసులు నేపథ్యంలో చాలా మంది తాళిబొట్టు గొలుసు కూడా వన్‌గ్రామ్ గోల్డ్‌నే వాడుతున్నారు. వీటిని ధరించడం సులువు, రవాణాలో ఇబ్బంది ఉండదు, పైగా చోరీకి గురైనా నష్టం పెద్దగా ఉండదు. దీనికి తోడు రకరకాల డిజైన్లు ఆకట్టుకుంటాయి. తక్కువ మొత్తానికే భారీ తూకం నగలు ఇంటికి చేరుతాయి. అందువల్లే చాలా మంది వన్‌గ్రామ్ గోల్డ్ బెస్ట్ అంటుండగా...జిల్లాలో దుకాణాలు భారీగా వెలిశాయి. గతంలో బెంగళరు, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లోనే ఎక్కువగా కనిపించే వన్‌గ్రామ్ గోల్డ్ నగల దుకాణాలు ఇప్పుడు హిందపురం, ధర్మవరం తదితర పట్టణాల్లోనూ మిరుమిట్లు గొలుపుతున్నాయి. సంపన్నులదీ అదే దారి ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ర.55 వేలపైనే పలుకుతుండగా... ఏ ఆభరణం కొనాలన్నా ర.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. కొనుగోలు చేసిన వారు కూడా చోరుల భయంతో ధరించలేని దుస్థితి. అందువల్లే ఇంట్లో బంగారం ఎక్కువ ఉన్న వాళ్లు బ్యాంకుల్లోని లాకర్లలో ఉంచుతున్నారు. శుభకార్యాల సమయంలో వాటిని తీసుకుని ధరిస్తున్నారు. ఆ వెంటనే మళ్లీ లాకర్లలోనే భద్రపరుస్తున్నారు. ఇదంతా ఎందుకు అనుకునే సంపన్నులు వన్‌గ్రామ్ గోల్డ్ నగలను ధరించేందుకు ఇష్ట పడుతున్నారు. బంగారం కొనుగోలు కోసం దాచిన డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడి పెడుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా డిజైన్లు బంగారు ఆభరణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు వివిధ డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. ఉంగరాల ధర .వెయ్యి నుంచి ర.10 వేల వరకు ఉంటోంది. మహిళలు ధరించే లాంగ్ చైన్లు రూ .5 వేల నుంచి ర.20 వేల వరకు రకరకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మధ్య తరగతి వారంతా విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ కళాశాలకు వెళ్లే యువతులు రెండు, మూడు సెట్ల నగలు కొంటున్నారు. ఫలితంగా అమ్మకాలు బాగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారం బాగుంది వన్‌గ్రామ్ గోల్డ్‌తో చేసిన ఆభరణాలకు నాలుగైదు ఏళ్లుగా విపరీతమైన డిమాండ్ పెరిగింది. పట్టణ వాసులకు పోటీగా పల్లె వాసులు కొనుగోలు చేస్తున్నారు. ధరల విషయంలో రాజీ పడకుండా నచ్చి.. మెచ్చిన డిజైన్లను సొంతం చేసుకుంటున్నారు. రోజూ కనీసం ఐదుగురు చొప్పున వన్ గ్రామ్ గోల్డ్‌తో చేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. – సాజిద్, బంగారు నగల వ్యాపారి, ధర్మవరం కాలేజీ విద్యార్థులే ఎక్కువ కరోనా లాక్డౌన్ తర్వాత వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. గ్రామీణ ప్రాంత వాసులు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. అందులో కూడా కాలేజీ విద్యార్థినులే అధికంగా ఉంటున్నారు. దొంగల బారి నుంచి నష్టపోకుండా ఉండేందుకు విరివిగా వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. – రమేశ్, వ్యాపారి, హిందూపురం (చదవండి: చీర కట్టుతో మతి పోగొడుతున్న.. ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర ఎంతంటే..) -
కేరళ కాలేజీ కుర్రాళ్లు.. కుమ్మేసుకున్నారు
-
నడిరోడ్డుపై కొట్టుకున్న రామ్‌చరణ్ లేడీ ఫ్యాన్స్.. వైరలవుతోన్న వీడియో
సినిమా స్టార్స్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. నటీనటులను ఫాన్స్ తమ దేవుళ్లుగా భావిస్తుంటారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు హడావిడీ చేస్తుంటారు ఇక టాలీవుడ్ విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యువకులతోపాటు అమ్మాయిలు కూడా హీరోలంటే పడిచచ్చిపోతారు. గర్ల్ఫ్యాన్ పేరుతో సోషల్ మీడియా పేజ్‌లు తెరిచి అభిమానాన్ని చాటుకుంటారు. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. తాజాగా ఓ ఇద్దరు రామ్ చరణ్ మహిళా అభిమానులు ఘర్షణ పడ్డారు. గొడవ ఎందుకు మొదలైందో తెలియదు కానీ హీరో విషయంలోనే ఇలా కొట్టుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ లేడీ ఫ్యాన్స్ వార్’ అనే క్యాప్షన్‌తో ట్విటర్లో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో యూనిఫాం ధరించిన ఇద్దరు యువతులు నడిరోడ్డుపై అందరిముందే పిచ్చిపిచ్చిగా తనుకున్నారు. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుతూ.. జుట్లు పట్టుకొని చెంపదెబ్బలు కొట్టుకున్నారు. చుట్టూ మిగతా విద్యార్థులు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా రెచ్చిపోయి గొడవ పడ్డారు. విద్యార్థినిలు కొట్టుకుంటుంటే అక్కడున్న వారంతా నవ్వుతూ, అరుస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. చివరికి అబ్బాయిలు జోక్యం చేసుకొని ఈ గొడవను ఆపేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. కానీ యువతులు తెలుగులో మాట్లాడుకోవడం ద్వారా ఏపీలో ఎక్కడో జరిగిందని భావిస్తున్నారు. అంతేగాక అసలు ఇద్దరు యువతులు నిజంగానే రామ్‌చరణ్ విషయంలో గొడవపడ్డారనేదానిపై స్పష్టత లేదు. Ram charan lady fans fan war pic.twitter.com/Gqc4rZhOjE — KingJdeep (@KingJdeep) March 27, 2023 -
Odisha College: ‘ఆ రోజులోపు బాయ్‌ఫ్రెండ్ ఉండాల్సిందే’
పారాదీప్(ఒడిశా): ‘కళాశాలలో చదివే ప్రతి ఒక్క అమ్మాయి ప్రేమికుల దినోత్సవం రోజుకల్లా బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించాలి. లేదంటే కాలేజీలోకి అనుమతించబోము’ అంటూ ఒడిశాలో ఒక కాలేజీ తరఫున అధికారికంగా వెలువడిందని చెబుతున్న నోటీసు ఒకటి సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతోంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదుచేసి తప్పుడు నోటీస్ తయారుచేసిన నిందితుల కోసం వెతికే పనిలో పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని ఎస్వీఎం అటానమస్ కాలేజీ ప్రిన్సిపల్ పేరిట ఒక నకిలీ నోటీసు వెలువడింది. కాలేజీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో బిజయ్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. సంతకాన్ని దుర్వినియోగం చేశారని, అది నకిలీ నోటీసు అని కాలేజీ పరువు తీసేందుకు కావాలనే ఎవరో కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కాలేజీ విద్యార్థుల మధ్య గొడవ.. కర్రలతో కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు
-
షాకింగ్.. ఇంజనీరింగ్ కాలేజ్‌లో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులోని న్యూ హారిజన్ ఇంజినీరింగ్ కాలేజీలో ముగ్గురు విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొట్టడంతో కళాశాల యాజమాన్యం ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. వాళ్ల తల్లిదండ్రులుకు కూడా నోటీసులు పంపింది. మరోవైపు కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురూ బెయిల్‌పై విడుదల అయ్యారు. అయితే వీళ్లు కావాలాని ఈ నినాదాలు చేయలేదని, సరదాగా చేసి ఇబ్బందుల్లో పడ్డారని పోలీసులు తెలిపారు. కాలేజీలో ఫెస్ట్.. అయితే ఈ కాలేజీలో నవంబర్ 25,26 తేదీల్లో ఇంటర్-కాలేజ్ ఫెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా తమకు నచ్చిన ఐపీఎల్ జట్లు, వివిధ దేశాల పేర్లతో నినాదాలు చేశారు. ఈ సమయంలోనే ముగ్గురు విద్యార్థులు ఆర్యన్, దినకర్, రియా.. సరదాగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అరిచారు. మరో విద్యార్థి వీడియో తీస్తున్నా పట్టించుకోకుండా అలాగే నినాదాలు చేశారు. దీంతో కేసులో ఇరుక్కుని ఇబ్బందులపాలయ్యారు. వీరి వయసు 17-18 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఘర్షణ
-
భీమవరం కాలేజీ హాస్టల్లో దారుణం..
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఘర్షణ కారణంగా ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంకిత్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. ఐరన్ బాక్స్‌లో అంకిత్ ఛాతిపై వాతలు పెట్టారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లీజ్ అని వేడుకున్నప్పటికీ వారు కర్రలతో కొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అంకిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
పెళ్లైన విషయం దాచి.. ఒకేసారి ఇద్దరు విద్యార్థినిలతో సహజీవనం
సాక్షి, చెన్నై: తనకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న సంగతిని దాచడమే కాకుండా.. ఒకే సమయంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేసి, ఓ ఇంట్లో ఉంచి సహజీవనం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కాట్టాతురై సమీపంలో కుట్టకులి కాలనీకి చెందిన విను (22) ఫ్లంబర్‌గా పని చే స్తున్నాడు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉ న్నారు. ఈ క్రమంలో విను మార్దాండం కాపుకాడు ప్రాంతానికి చెందిన ఓ ప్లస్–2 విద్యార్థిని ప్రేమించాడు. అలాగే ఆమె స్నేహితురాలైన తిరువిట్టా కేసవపురానికి చెందిన మరో ప్లస్–2 విద్యార్థినికి కూడా మాయమాటలు చెప్పి ఇద్దరిని కిడ్నాప్ చేశాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఈ ముగ్గురు చెన్నై తిరువణ్ణామలైలోని ఓ ఇంట్లో అద్దెకు తీసుకుని కాపురం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు విద్యార్థినులను విడిపించి, నిందితుడు వినును అరెస్టు చేశారు. చదవండి: జూనియర్ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో.. -
లవ్ ఎఫైర్.. అమ్మాయి కోసం నడిరోడ్డుపై తన్నుకున్న స్టూడెంట్స్
కాలేజ్ డేస్‌లో లవ్ వ్యవహరం పెద్ద రచ్చే చేసింది. ఒకే అమ్మాయిని ఇద్దరు స్టూడెంట్స్ ప్రేమించడంతో వారి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. వారిద్దరూ రెండు గ్రూపులను ఏర్పాటుచేసి అమ్మాయి నాదంటే నాది అని చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కుడ్డలూరుకు చెందిన ఓ ప్రైవేటు కాలేజీలో వరుణ్, సుధాకర్ అనే ఇద్దరు విద్యార్థులు చదువుతున్నారు. కాగా, అనూహ్యంగా వీరిద్దరూ అదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమించారు. ఈ ప్రేమ విషయంలో వారి మధ్య పెద్ద తగాదానే నడిచింది. సినిమా రేంజ్లో ఒకరికి ఒకరు వార్నింగ్ సైతం ఇచ్చుకున్నారు. సినిమాలో హీరో స్టైల్లో తనే నా హీరోయిన్ అంటూ మాటల వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహరంలో వారిద్దరూ రెండు గ్రూపులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బస్సు కోసం బస్‌స్టాప్‌లో వేచిచూస్తుండగా.. వారిద్దరూ ప్రేమించిన అమ్మాయి అక్కడికి రావడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రెండు గ్రూపుల సపోర్టర్లు అక్కడికి చేరుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నడిరోడ్డుపై చిత్తుగా తన్నుకున్నారు. ఇక, ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం... స్నేహితురాలిపై బ్లేడుతో దాడి...
సాక్షి,బళ్లారి: ఇద్దరు కాలేజీ విద్యార్థినులు ఒకరినిపై మరొకరు మంచి స్నేహం పెంచుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థాయికి స్నేహం ముదిరింది. ఆ స్నేహమే ఇద్దరి మధ్య గొడవ జరిగి పతాకస్థాయికి చేరుకుని బ్లేడ్‌తో హత్యాయత్నానికి దారితీసింది. ఈ ఘటన దావణగెరె నగరంలో చోటు చేసుకుంది. వివరాలు..గురువారం సాయంత్రం దావణగెరె నగరంలోని ఏవీకే కాలేజీ సమీపంలో చిక్కమగళూరు విద్యార్థిని లాస్య ఆమె స్నేహితురాలిపై దాడి చేసింది. దావణగెరెలో కాలేజీలో చేరినప్పటి నుంచి లాస్య, ఆమె స్నేహితురాలితో ఎంతో గాఢస్నేహం పెంచుకుంది. రోజులు గడిచే కొద్ది ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేని విధంగా స్నేహం ముదిరిపోయింది. లాస్య తన స్నేహితురాలిపై గొడవకు దిగి బ్లేడ్‌తో హత్యాయత్నం చేయడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన యువతిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. దాడి చేసిన లాస్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కళాశాలలో ఇద్దరి స్నేహం గురించి పోలీసులు ఆరా తీయగా నివ్వెరపోయేలా పోలీసులకు సమాధానం దొరికింది. బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇద్దరు యువతుల మధ్య గొడవ ఎందుకు పెరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేయగా ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కం కూడా ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడం గమనార్హం. (చదవండి: లోదుస్తుల్లో బంగారం తరలింపు.. మహిళ అరెస్ట్) -
రన్నింగ్ ట్రైన్ ఫుట్‌బోర్డుపై కత్తులతో వీరంగం
చెన్నై: రన్నింగ్ ట్రైన్ ఫుట్‌బోర్డులో నిల్చుని.. కత్తులు, కొడవళ్లతో వీరంగం సృష్టించిన ఆకతాయిల ఆట కట్టించారు పోలీసులు. వాళ్లను కాలేజీ విద్యార్థులుగా గుర్తించి.. ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ మంగళవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. రైలు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ.. ప్లాట్‌ఫామ్‌పైకి పదునైన ఆయుధాలు దూస్తూ.. గోల చేస్తూ ముగ్గురు యువకులు హల్ చల్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి వాళ్ల వల్ల దేశానికి ఏం ఉపయోగమంటూ తిట్టిపోశారు కొందరు. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. గుమ్మిడిపూండికి చెందిన అన్బరసు, రవిచంద్రన్‌ను, పొన్నేరికి చెందిన అరుల్‌ను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులుగా నిర్ధారించారు. రైళ్లలో, రైల్వే ప్రాంగణాల్లో ఇలాంటి దుర్మార్గపు ప్రవర్తన, ప్రమాదకరమైన విన్యాసాలను సహించేది లేదంటూ అధికారులు తెలిపారు. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణాలకు సంబంధించిన ఘటనలు ఇంటర్నెట్లో వైరల్‌కావడం, రైల్వే శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. రైల్వే శాఖ సకాలంలో స్పందించేందుకు యత్నిస్తోంది. We would like to inform you that the 3 youths seen in this viral video performing stunts with sharp weapons in their hand, have been arrested by @grpchennai! They are Anbarasu and Ravichandran from Gummidipoondi and Arul from Ponneri. They are all students of Presidency College. pic.twitter.com/3FQVpTWeoW — DRM Chennai (@DrmChennai) October 11, 2022 -
ఎగ్జామ్స్ టైమ్ ఫ్రెండ్
‘సబ్జెక్ట్ సరిగ్గా అర్థమే కాలేదు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అవడం ఖాయం. ఇంట్లోవాళ్లకు ఏం చెప్పాలి?!’ భయం. ‘కోవిడ్ టైమ్‌లోనే బాగుంది.కాలేజీకి వెళ్లి అందరిలో కూర్చోవాలంటే ఏంటోగా ఉంది’ విసుగు ‘నేనసలు బాగుపడతానా? ఈ లైఫ్ పెద్ద బోర్.. ’ డిప్రెషన్. ‘అనుకున్న టైమ్‌లో చదవాల్సిన సిలబస్ పూర్తవుతుందా?’ ఒత్తిడి. కాలేజీ స్టూడెంట్స్ తమ భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఒత్తిడుల నుంచి దూరం అవ్వడానికి ఉచితంగా ‘డాక్టరైట్ వెల్నెస్ యాప్’ ద్వారా సేవలను అందిస్తున్నారు హైదరాబాద్ వాసులు రజినీకాసు, జయంతీ సుబ్రహ్మణ్యం, ప్రసన్నలక్ష్మి, మధు రఘునాయకులు. ‘17 నుంచి 24 ఏళ్ల వయసు వారిలో భావోద్వేగాల బ్యాలెన్స్ చేసుకోవడం అనే సమస్య అధికంగా ఉంటుంది. ఏ విషయాన్ని ఎవరితో చెబితే ఏం సమస్యో అనుకునే వయసు అవడంతో ఎవరికీ చెప్పుకోలేక, జీవితంలో వెనకడుగు వేసేవారికి నేస్తంలా చేయూతనివ్వడానికి ముందుకు వచ్చాం’ అని వివరిస్తున్న ఈ బృందం చెబుతున్న విషయాలు ఇవి.. నేరుగా ఎదుర్కోలేని ఒత్తిడి ‘‘ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీ స్టూడెంట్స్‌ను నేరుగా కాలేజీలకు వెళ్లి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈ ఏజ్‌గ్రూప్‌లో వచ్చే రకరకాల సింప్టమ్స్‌ని సరైన సమయంలో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. వీరిలో సోషల్ ఇంట్రాక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయని గమనించాం. కోవిడ్ సమయంలో వర్చువల్‌గా మాట్లాడిన పిల్లలు ఆ తర్వాత కాలేజీలో నేరుగా ఫ్రెండ్స్‌తో కూడా ముఖాముఖిగా కలుసుకొని మాట్లాడుకోవడం కష్టపడుతున్నట్టు తెలిసింది. విద్యార్థుల్లో మార్పుకోసం ఏదైనా చేయాలన్న ఆలోచనను ఇలా అమలులో పెట్టాం’ అంటారు రజని కాసు. ఇరవై ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్న రజిని కాసు విద్యార్థుల మానసిక సమస్యలపై కౌనెలర్లతో చర్చించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. డిజిటల్ స్పేస్ నుంచి దూరంగా! ‘‘దాదాపు ఇంటిదగ్గరే రెండేళ్లుగా కంఫర్టబుల్ జోన్లో ఉన్నవాళ్లు నేరుగా ప్రతిభ చూపించమంటే వారి ఆత్మవిశ్వాసం స్థాయుల్లో మార్పులు వచ్చాయి. సాధారణంగా డిగ్రీస్థాయి పిల్లలకు ఫస్ట్ ఇయర్లో కాలేజీ వాతావరణం అంతా అలవాటు పడుతుంది. కానీ, ఆన్లైన్ క్లాసుల నుంచి నేరుగా కాలేజీకి రావడంతో అంతా కొత్తగా ఉండటంతో ప్రతి చిన్న విషయంలో వెనకడుగు వేస్తున్నారు. గ్యాడ్జెట్స్‌తోనే టైమ్ అంతా స్పెండ్ చేస్తున్నారు. అమ్మాయిలు–అబ్బాయిల్లో కెరియర్ పరంగా ఒకే విధమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ, అమ్మా యిలు ‘వేధింపు’ అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. పేరెంట్స్ ఇద్దరినీ ఒకే విధంగా చూస్తున్నప్పటికీ, ఎంత స్నేహంగా ఉన్నా అన్నీ పెద్దలకు చెప్పుకోలేరు. పిల్లలు తమ భావాలను సరైన దారిలో పెట్టడానికి అనువైన వేదిక దొరకడం లేదు. ఇవన్నీ విద్యార్థులతో ఈ ఏడాది కాలంగా మాట్లాడి తెలుసుకున్నవి’ అని వివరించారు అమెరికాలో హెల్తెకేర్ లీడర్షిప్, మేనేజ్మెంట్ విభాగంలో వర్క్ చేస్తున్న జయంతి. వినడమే కావాలి... ‘మనం కోపంగా చెప్పిన విషయేమేదీ పిల్లలు అర్ధం చేసుకోరు. అంతకు ముందు వాళ్లేం చెబుతున్నారో మనం శ్రద్ధగా వినాలి. ‘ఏం కాదు’ అనే మాట ఒక్కటే సరిపోదు. వాళ్లలో ఉన్న బాధ అంతా ఏడుపు రూపంలో బయటకు రావాలి. అప్పుడు వారు మానసికంగా ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నారో దాని నుంచి దూరమవుతారు. చెప్పడం నుంచే రియలైజ్ అవడం కూడా మొదలు పెడతారు. అప్పుడు వారిని సరైన మార్గంలో పెట్టచ్చు. బయటకు ఎవరికీ ఏం చెప్పుకోకుండా తమలో తామే అన్నట్టుగా ఉన్న వాళ్లు చాలావరకు డిప్రెస్ అవుతున్నారు. ఈ విధానం నుంచి బయటపడటానికి యాప్ ద్వారానే రకరకాల యాక్టివిటీస్‌ను కూడా పరిచయం చేస్తున్నాం’ అని తెలియజేశారు ఇరవై ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్న మధు. భయం నుంచి దూరం ‘కొన్ని భయాలు.. చెప్పుకోదగినంత పెద్దవీ కావు, చెప్పకూడనంత చిన్నవీ కాదు. ఈ సమస్య స్కూల్, కాలేజీ రోజుల్లో మొదలైతే ఆ తర్వాత కెరియర్లోనూ ఎదుర్కోవచ్చు. భయాన్ని వీడలేక రకరకాల వ్యసనాలకు లోనైనవారూ ఉన్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలన్నా సరైన గైడెన్స్ విద్యార్థులకు చాలా అవసరం. కోవిడ్ టైమ్‌లో ‘కోవిడ్ సాథీ’పేరుతో హెల్ప్‌లైన్ అందించిన మా గ్రూప్ సభ్యులం ఇప్పుడు ఈ యాప్ ద్వారా విద్యార్థులకు మేలు చేయాలనుకుంటున్నాం. ఏడాది క్రితం 6 వేల మంది విద్యార్థులకు చేరువఅవ్వాలని ఈ వర్క్ ప్రారంభించాం. ఇప్పుడు 2 వేల మంది విద్యార్థులు రోజూ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. రోజులో 24 గంటలూ స్టూడెంట్స్‌కి అందుబాటులో ఉంటున్నాం. ఈ యాప్ నుంచి సైకియాట్రిస్ట్‌లు, క్లినికల్ సైకాలజిస్ట్‌లు, శిక్షణ పొందినవాళ్లూ విద్యార్థులకు సరైన గైడెన్స్ ఇస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేని వాళ్లు తమ సమస్యలను నిపుణులతో చర్చించి సరైన మార్గం తెలుసుకోవచ్చు’ అని వివరించారు ఫార్మసీ రంగంలో ఇరవై ఏళ్లుగా సేవలు అందిస్తున్న ప్రసన్నలక్ష్మి. – నిర్మలారెడ్డి -
పాకెట్ మనీ కోసం.. మరో లోకంలో విహరించాలని..
సాక్షి, హైదరాబాద్: ‘సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన సాయికుమార్, ప్రతాప్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. పాకెట్ మనీ కోసం గంజాయి వ్యాపారంలోకి దిగారు. ఒడిశా రాష్ట్రంలోని సీలేరు ప్రాంతంలో మంగళ్ అనే వ్యక్తి నుంచి ఎండు గంజాయిని కిలో రూ.10 వేలకు కొనుగోలు చేసి బస్సుల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. శివారు ప్రాంతంలో వాటిని 5, 10 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా మార్చి.. రూ.150– 200కు విక్రయిస్తున్నారు’ ‘దుస్తుల వ్యాపారం పేరిట మార్క్ ఒవాలోబీ నైజీరియా నుంచి ముంబైకి వచ్చాడు. బిజినెస్ వీసా గడువు ముగిశాక.. ముంబై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఢిల్లీ నుంచి కొకైన్‌ను తీసుకొచ్చి నగరంలో విక్రయించడం మొదలుపెట్టాడు. పలుమార్లు జైలుకెళ్లాడు. నేరెడ్‌మట్‌కు చెందిన బీకామ్ ఫైనలియర్ విద్యార్థి హర్షవర్ధన్ స్నేహితుడైన అభిషేక్ సింగ్ ఓ చోరీ కేసులో జైలుకెళ్లాడు. అక్కడ మార్క్ ఒవాలోబీతో ఇతగాడికి పరిచయం ఏర్పడింది. బయటికొచ్చాక ఈ ముగ్గురు, మరికొందరు స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి.. డ్రగ్స్ వ్యాపారం చేయడం ప్రారంభించారు’ .. ఇలా ఒకటి రెండు సంఘటనల్లోనే కాదు డ్రగ్స్ వినియోగిస్తూ.. విక్రయిస్తూ ఎందరో విద్యార్థులు పట్టుబడుతున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన విద్యార్థులు.. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఫ్యాషన్‌గా మొదలు పెట్టి డ్రగ్స్ బానిసలుగా మారిపోతున్నారు. జైలులో పెడ్లర్లతో పరిచయాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సరఫరాదారులే కాదు వినియోగదారులపై కూడా కేసులు నమో దు చేస్తూ అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మూలాలను అంతమొందిస్తే తప్ప డ్రగ్స్‌ను అరికట్టలేమని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. కేవలం సరఫరాదారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిమాండ్‌కు తరలించి జైలుకెళ్లిన నిందితులలో సత్ప్రవర్తన రాకపోగా.. జైలులో కొత్త పరిచయాలు ఏర్పరుచుకొని బయటికొచ్చాక సరికొత్త ఎత్తుగడలతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు వరుసగా వెలుగుచూడటమే ఇందుకు ఉదాహరణ. గంజాయి రవాణాలు రౌడీషీటర్లు, పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్తులు కూడా దిగారు. ప్యాకెట్‌కు రూ.150– 200.. ►కొకైన్ బంగారం కంటే చాలా ఖరీదైనది, దీన్ని అందరూ కొనుగోలు చేయలేరు. దీంతో గంజాయి విక్రయం, వినియోగం పెరిగింది. కిలో రూ.15– 20 వేలకు కొనుగోలు చేసి.. శివారు ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మారుస్తున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. ప్యాకెట్ రూ.150– 200కు దొరకుతుండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేసే వీలుంటుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ►ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువత సొంతూర్లకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో బ్యాగులలో గంజాయిని తీసుకొస్తున్నారు. తాము సేవించడమే కాకుండా తోటి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి 5, 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన లాబా కుమార్ ప్రధాన్, బాపిలను ఇటీవల కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ►ఇదే తరహాలో ఆదిలాబాద్ నుంచి కిలో గంజాయి రూ.15 వేలకు కొనుగోలు చేసి నగర శివార్లలో ప్యాకెట్ల రూపంలోకి మార్చి విక్రయిస్తున్నట్లు జవహర్‌నగర్‌కు చెందిన బొడ్డు అభిషేక్, గాజుల పరమేష్, వడ్డారం ప్రవీణ్, ఆర్ శివలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. -
నర్సింగ్ విద్యార్థిని రవళి మృతి
సాక్షి, వరంగల్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రోహిణి నర్సింగ్ కళాశాల విద్యార్థిని కాందారపు రవళి(20) రెండు రోజులుగా రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచింది. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం, గోపాల్‌పూర్‌కు చెందిన కాందారపు తిరుపతి, రజిత దంపతుల పెద్ద కూతురు కందారపు రవళి హంటర్‌రోడ్డులోని రోహిణి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతుంది. ఈనెల 7న రాత్రి 10.30 గంటల సమయంలో హాస్టల్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థినులు, యాజమాన్యం రోహిణి ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి 1.30 సమయంలో తుదిశ్వాస విడిచింది. మృతదేహాన్ని ఎంజీఎంకు పంపించి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. విచారణ అనంతరం ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తల్లిదండ్రుల గోడు పట్టించుకోరా..? రవళి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు రోహిణి కళాశాల యాజమాన్యం తెలియజేయకుండా రవళి స్నేహితులు తెలియజేశారు. ఆ తరువాత రోహిణి ఆస్పత్రి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళనతో రవళిని చూడటానికి తల్లిదండ్రులకు అనుమతించారు. రవళి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చేరవేసిన తోటి విద్యార్థినులను తల్లిదండ్రులకు కలువనివ్వలేదు, ఆ విద్యార్థినులపై యాజమాన్యం బెదిరింపులకు పాల్పడి అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రి రవళి మృతిచెందిన విషయం కూడా యాజమాన్యం మృతదేహాన్ని ఎంజీఎం పంపడానికి అన్ని సిద్ధం చేసుకున్నాకే తెలియజేసినట్లు తెలిసింది. ఈ సంఘటనల నేపథ్యంలో రవళి మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. తల్లిదండ్రులు తమ గోడును యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థి సంఘాల ఎదుట విలపించినట్లు తెలిసింది. పోలీసులతో వాగ్వాదం.. నర్సింగ్ విద్యార్థిని రవళి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం పలు విద్యార్థి సంఘాల నేతలు రోహిణి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సుబేదారి పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు యాజమాన్యానికి బాసటగా నిలిచి మృతురాలి కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని వివిధ సంఘాల నేతలు ఆరోపించారు. మృతదేహాన్ని అర్ధరాత్రి ఎంజీఎంకు ఎందుకు పంపించారని వారు ప్రశ్నించారు. గోపాల్పూర్ గ్రామ సర్పంచిని అడ్డుగా పెట్టుకుని యాజమాన్యం తల్లిదండ్రులకు తీరని అన్యాయం చేశారని, ఈ సంఘటనపై అన్ని సంఘాలు ఐక్యంగా ఉండి రవళి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఆందోళన చేసిన వారిలో విద్యార్థి సంఘాల నేతలు తిరపతియాదవ్, కన్నం సునిల్, మేడ రంజిత్, కాడపాక రాజేందర్, వినోద్ లోక్‌నాయక్, ఎండీ పాషా, ఏకు ప్రవీణ్, నరేష్, దుప్పటి సుభాష్, రాకేష్ పాల్గొన్నారు. -
విజయవాడ : ఆకట్టుకున్న మేరీస్ స్టెల్లా కళాశాల విద్యార్థుల ఫ్యాషన్ షో
-
Hyderabad RTC: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులను పూర్తిస్థాయిలో రోడ్డెక్కించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కోవిడ్ దృష్ట్యా నిలిచిపోయిన శివారు రూట్లలో బస్సులను పునరుద్ధరించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, వృత్తివిద్యా కళాశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో అదనపు ట్రిప్పులను పెంచినట్లు హైదరాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, చేవెళ్ల, మొయినాబాద్, గండిమైసమ్మ తదితర రూట్లలో విద్యార్థుల రద్దీకనుగుణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 వేల ట్రిప్పులకుపైగా బస్సులు నడుస్తాయి. కోవిడ్ దృష్ట్యా విద్యాసంస్థలు మూసివేయడంతో బస్సుల రాకపోకలు కూడా తగ్గాయి. కోవిడ్ రెండో ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన అనంతరం అన్ని స్కూళ్లు, కాలేజీలు తదితర విద్యా సంస్థలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ కొన్ని విద్యాసంస్థలు ఇటీవల వరకు ఆన్లైన్ క్లాసులను నిర్వహించాయి. చదవండి:టీఎస్ఆర్టీసీ మరో ముందడుగు.. ప్రయాణికులకు సజ్జనార్ గుడ్‌న్యూస్ సెమిస్టర్ పరీక్షలను మాత్రమే ప్రత్యక్షంగా ఏర్పాటు చేశారు. కానీ.. దసరా అనంతరం అన్ని కాలేజీలు ప్రత్యక్ష బోధనకు చర్యలు చేపట్టాయి. దీంతో విద్యార్థుల రద్దీకనుగుణంగా బస్సులను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని వైపులా.. ► సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో ప్రతి రోజు సుమారు 1200 బస్సులు 3.5 లక్షల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తాయి. కీసర, గండిమైసమ్మ, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు రాకపోకలు సాగించేందుకు సాధారణ రోజుల్లో ఉదయం, సాయంత్రం సుమారు 1000 ట్రిప్పుల వరకు నడుపుతారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ట్రిప్పుల సంఖ్య భారీగా తగ్గింది. తిరిగి ఈ రూట్లలో ట్రిప్పులను పెంచేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ► హైదరాబాద్ రీజియన్ పరిధిలో నిత్యం 1,551 బస్సులు సుమారు 4.15 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కళాశాలలకు రాకపోకలు సాగించే విద్యార్థుల కోసం ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్ఎం వెంకన్న చెప్పారు. ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు.. మరోవైపు బస్సుల రాకపోకలు, ఇతరత్రా సమాచారంకోసం హైదరాబాద్ రీజియన్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులు 99592 26160ను సంప్రదించి బస్సుల వివరాలు తెలుసుకోవచ్చు. సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. -
కాలేజీ హాస్టళ్లలో కొత్త అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో కొత్త అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కోవిడ్–19 నేపథ్యంలో మూతబడ్డ సంక్షేమ వసతి గృహాలు ఈనెల 18 నుంచి పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ హాస్టళ్లు మాత్రమే తెరుచుకోగా, వీటిలో కాలేజీ విద్యార్థులు వసతి పొందుతున్నారు. 2020–21 విద్యా సంవత్సరంలో కోర్సు ముగిసిన విద్యార్థులు హాస్టల్ నుంచి రిలీవ్ కాగా.. వారి స్థానంలో ఫ్రెషర్స్‌కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి 550 పోస్టుమెట్రిక్ వసతి గృహాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. తాజాగా ఈ హాస్టళ్లలో నూతన అడ్మిషన్లకు ప్రభుత్వం ఆమోదించడంతో దాదాపు 40 వేల మంది విద్యార్థులకు అవకాశం కలగనుంది. ఏయే హాస్టల్లో ఎంతమందికి ప్రవేశాలు కల్పించాలనే దానిపై క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భౌతిక దూరానికి ప్రాధాన్యం..: ఒక్కో కాలేజీ హాస్టల్లో 150 నుంచి 220 మంది వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. పెద్ద భవనం, అధిక సంఖ్యలో గదులున్న చోట ఎక్కువ మంది విద్యార్థులుండగా.. చిన్నపాటి భవనాల్లోని హాస్టళ్లలో 120 నుంచి 150 మంది విద్యార్థులుంటున్నారు. వసతి గృహాల్లో భౌతిక దూరానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో గది విస్తీర్ణాన్ని బట్టి విద్యార్థుల సంఖ్యను ఖరారు చేయాలని సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు పంపారు. ఈ నేపథ్యంలో వసతి గృహ సంక్షేమాధికారులు శనివారం నాటికి ప్రతిపాదనలు రూపొందించి ఆయా జిల్లాల సంక్షేమాధికారులకు పంపినట్లు సమాచారం. వీటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆమోదం లభించిన తర్వాత కొత్త అడ్మిషన్లు ప్రారంభిస్తారు. అలాగే ప్రీ మెట్రిక్ హాస్టళ్ల ప్రారంభంపైనా అధికారులు దృష్టి సారించారు. వచ్చేనెల 1 నుంచి వీటిని ప్రారంభించేలా అధికారులు ప్రణాళికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయానికి నివేదించారు. -
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో మీ సొంతం
సాక్షి, హైదరాబాద్: కాలేజీ విద్యార్థుల సరదాలు తీర్చేందుకు స్వల్పకాలిక ఈజీ లోన్స్(తేలికగా రుణం) ఇచ్చేందుకు కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు ముందుకొచ్చాయి. విద్యార్థులు ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, బైక్, స్మార్ట్‌ఫోన్ తదితర వస్తువుల కొనుగోలుకు రూ.3 వేల నుంచి 80 వేల వరకు రుణం మంజూరు చేసే సంస్థలను ఆశ్రయిస్తున్న గ్రేటర్ విద్యార్థుల సంఖ్య సిటీలో వేలల్లోకి చేరుకుంది. ఇదే అదనుగా నకిలీ ఐడెంటిటీ కార్డులతో రుణం పొంది ఎగవేస్తున్న విద్యార్థులు సైతం ఉండడంతో ఆయా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ పరిణామం శ్రుతి మించితే రుణ చెల్లింపుల విషయంలో తల్లిదండ్రులకు తలనొప్పులు తప్పవంటున్నారు విద్యావేత్తలు. ఈజీ లోన్స్ ఇలా.. ► ప్రతి అంశాన్నీ ఒక్క క్లిక్‌తో తెలుసుకునే గ్రేటర్ స్టూడెంట్స్ తాజాగా స్వల్పకాలిక తేలికపాటి రుణాలు పొందేందుకు పలు ఆన్లైన్ క్రెడిట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ►మహానగరం పరిధిలో సుమారు 300 ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు వీటిని ఆశ్రయిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ► ప్రధానంగా క్రెడిట్ 24, క్వికర్‌లోన్, ఎం పాకెట్ తదితర సంస్థలు ఈ విషయంలో ముందున్నాయి. ► ఇక ఆన్లైన్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ విద్యార్థుల వద్దకే ఆయా సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు తరలివస్తున్నారు. తొలుత ర.3 వేల నుంచి ర.5 వేల వరకు స్వల్పకాలిక సూక్ష్మ రుణాలు అందజేస్తున్నారు. ► ఈ చిన్నపాటి రుణాలను సకాలంలో తీర్చినవారికి గరిష్టంగా రూ.80 వేల వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. రుణగ్రహీత సౌలభ్యాన్ని బట్టి నెలవారీగా కొంత మొత్తాన్ని వాయిదాగా చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. ► ఇక రుణం జారీ చేయాలంటే విద్యార్థుల కళాశాల ఐడెంటిటీ కార్డు, ఇంటి చిరునామ ధ్రువపత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులను పూచీకత్తుగా స్వీకరిస్తున్నాయి. ► ముందుజాగ్రత్తగా వారి నుంచి రుణం జారీ షరతులకు సంబంధించి రెండు పేజీల నిబంధనల పత్రాలపై సంతకాలు తీసుకుంటుండడం గమనార్హం. ఎగవేతదారులూ షరామామూలే.. విద్యార్థులు చిన్నపాటి అవసరాలు, సరదాలను తీర్చేందుకు ఈజీ లోన్స్ బాగానే ఉన్నా..ఇదే అదనుగా తమ మిత్రులు, తెలిసినవారి కళాశాలల ఐడెంటిటీ కార్డులు, జిరాక్స్ ప్రతులను సేకరిం ఆన్లైన్లో రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్న అక్రమార్కులూ ఉన్నట్లు ఆయా రుణజారీ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. తీరా రుణం మంజూరు చేశాక ఆరా తీస్తే సదరు విద్యార్థి ఆ కళాశాలలో చదవడం లేదన్న నిజాలు వెలుగుచూస్తుండడంతో ఆయా సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తుండడం గమనార్హం. ఇక కొన్ని రుణజారీ సంస్థలు రుణ వాయిదాల వసూళ్ల కోసం తల్లిదండ్రులకు నేరుగా ఫోన్లు చేస్తుండడం, వారి ఇళ్లకు వస్తుండడంతో తల్లిదండ్రులు సైతం ఆందోళనకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జాగ్రత్తలూ అవసరమే.. ► విద్యార్థుల అవసరాలకు ఈజీలోన్స్ ఒక పరిమితికి మించి అవసరమే కానీ..శృతి మించితే అనర్థాలు తప్పవని విద్యావేత్తలు, కళాశాలల Ķæజవన్యాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల జీవనశైలిలో వస్తున్న మార్పులను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని సచిస్తున్నారు. అప్పులు చేసి గొప్పలకు పోతే విద్యార్థుల జీవితాలు ప్రవదంలో పడినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఇక రుణం తీసుకునే సమయంలో గుడ్డిగా సంతకాలు చేయకుండా జాగ్రత్తగా షరతులతో కూడిన నిబంధనలను అమూలాగ్రం చదివి సంతకం చేయాలని సచిస్తున్నారు. పరీక్ష, ట్యూషన్, కోచింగ్‌లు, పుస్తకాల కొనుగోలు, నూతన కోర్సులు నేర్చుకునేందుకు రుణం పొందితే ఫర్వా లేదని.. విలాసవంతమైన జీవనశైలి గడిపేందుకు రుణం తీసుకుంటే చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
లోయలో పడిన బస్సు.. 27 మంది మృతి
జకర్తా: ఇండోనేషియాలోని జావా దీవిలో గురువారం తెల్లవారుజామున అర్థరాత్రి దాటాకా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోవడంతో 27 మంది మృతి చెందగా.. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని ఇస్లామిక్ జూనియర్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు టీచర్లు కలిసి బుధవారం విహారయాత్రకు బయల్దేరారు. బుధవారం అర్థరాత్రి దాటాకా సుమేడాంగ్ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీయగా.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా బస్సు బ్రేకులు పనిచేయకపోవడం వల్లే ప్రమాదం సంభంవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తల తెంచుకొని శరీరాన్ని పెంచుకుంటుంది బయటపడిన బంగారు కొండ.. మట్టికోసం ఎగబడ్డ జనం -
కాలేజీ యువతపై మానసికంగా తీవ్రప్రభావం
న్యూఢిల్లీ: కరోనా మూలంగా తలెత్తిన సంక్షోభం, లాక్డౌన్ మూలంగా కాలేజీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైనే అందరికంటే ఎక్కువగా ప్రభావం పడిందని ఓ సర్వే తేల్చింది. ఆన్లైన్ మానసిక ఆరోగ్య వేదిక ‘యువర్‌దోస్త్’ఎనిమిది వేల మందితో రెండు విడతలుగా సర్వే నిర్వహించింది. మొదట లాక్డౌన్ ప్రారంభంలో, రెండోసారి జూన్‌లో సమాజంలోని వివిధ వర్గాల మానసిక పరిస్థితిని ఈ సర్వే విశ్లేషించింది. లాక్డౌన్ ముందుకుసాగిన కొద్దీ... కాలేజీ విద్యార్థుల్లో భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. కోపం, అసహనం, ఆందోళన, ఒంటరితనం ఫీలవ్వడం, నిరాశానిస్పృహల్లో కూరుకుపోవడం అధికమైంది. ఆందోళన, భయం 41 శాతం ఎక్కువైంది. విద్యార్థినీ విద్యార్థుల్లో సాధారణ పరిస్థితులతో పోలిస్తే... కోపం, అసహనం, చికాకు 54 శాతం ఎక్కువయ్యాయి. నిరాశకు లోనుకావడం 27 శాతం, విచారంలో మునిగిపోవడం 17 శాతం, ఒంటరితనం, బోర్‌గా ఫీలవ్వడం 38 శాతం పెరిగాయి. ఇంటికి మాత్రమే పరిమితమైపోవడం విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. స్వేచ్ఛను కోల్పోయామనే భావన కాలేజీ లేదు. స్నేహితులతో పిచ్చాపాటి, క్యాంపస్‌లో సరదాలు... ఏవీ లేవు. రోజంతా ఇంట్లోనే ఉండాల్సి రావడం కూడా వారికి ఇబ్బందిగా మారింది. అన్నివేళలా తల్లిదండ్రులు కూడా ఉండటంతో స్వేచ్ఛను కోల్పోయామని విద్యార్థులు పేర్కొన్నారు. ఇంట్లోనే ఉండటంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు. తర్వాతేంటి? కాలేజీ విద్యార్థుల తర్వాత ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం పడిందని సర్వే తేల్చింది. ఉద్యోగ రంగాల్లో నెలకొన్న అనిశ్చితి, తర్వాత ఏంటి? అనే ప్రశ్న ఉద్యోగులను కుంగుబాటుకు గురిచేసింది. ఉద్యోగుల్లో భయాందోళనలు 41 శాతం పెరిగాయి. కోపం, అసహనం, చిరాకు 34 శాతం పెరిగాయి. నిరాశావాదం 17 శాతం, విచారపడటం 18 శాతం, ఒంటరితనం, బోర్‌గా ఫీలవ్వడం 26 శాతం పెరిగాయి. దీర్ఘకాలం నలుగురితో కలవకపోవడం, ఇంటికే పరిమితం కావడం, జీవనశైలిలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ఉద్యోగులు ఇప్పటికీ వీటికి అలవాటుపడటానికి ఇబ్బందిపడుతున్నారు. అందరిలోనూ ఒత్తిడి పెరిగిపోయింది. లాక్డౌన్ ఆరంభంలో 33 శాతం మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పగా... జూన్‌లో ఇది మరో 7.55 శాతం పెరిగింది. నిద్రలేమితో బాధపడుతున్న వారు కూడా 11 శాతం వరకు పెరిగారు. -
పోర్న్సైట్లలో విద్యార్థినులు, లెక్చరర్ల ఫోటోలు
బెంగళూరు: పలువురు కాలేజీ విద్యార్థినులు, లెక్చరర్ల ఫొటోలు పోర్న్సైట్లో ప్రత్యక్షమవ్వడం బెంగళూరులో కలకలం రేపింది. దీంతో విద్యార్థులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే.. విద్యార్థినుల సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫొటోలను డౌన్లోడ్ చేసి పోర్న్సైట్లలో అప్లోడ్ చేసినట్టుగా గుర్తించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిని సీవీ రామన్‌నగర్‌కు చెందిన అజయ్ థనికాచలం(37), మరొకరు రాజయ్యనగర్‌కు చెందిన వికాస్ రఘోత్తమ్ (27)గా గుర్తించారు. నిందితుల్లో ఒకరైన అజయ్ ఇంజనీర్ కాగా.. మరో నిందితుడు విశ్వక్సేన్ బాధిత విద్యార్థినుల బ్యాచ్‌మేట్ అని తెలుస్తోంది. ఈజీ మనీకి అలవాటు పడి తన స్నేహితుల ఫోటోలను పోర్న్‌సైట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే తమ ఫొటోలు పోర్న్సైట్లో అప్లోడ్ అయ్యాయని గుర్తించిన విద్యార్థినులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 30 వరకు ఫొటోలు అప్ లోడ్ చేసినట్టు గుర్తించారు. వెంటనే సదురు సైట్లకు మెయిల్ చేసి వాటిని తొలగించేలా చర్యలు తీసుకున్నారు. నిందితుల మొబైల్ ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి సందీప్ పాటిల్ తెలిపారు. (సైబర్ ‘కీచకుల’ ఆటకట్టు) -
యువతి కోసం గ్యాంగ్ వార్
సాక్షి, గుంటూరు: గుంటూరులో ఆదివారం రాత్రి గ్యాంగ్‌వార్ కలకలం సృష్టించింది. ఒక యువతి కోసం ఇద్దరు యువకులు వారి స్నేహితులతో రెండు గ్రూపులుగా విడిపోయి, ఘర్షణకు దిగడంతో అలజడి వాతావరణం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు, విశ్వసనీయ సమాచారం మేరకు.. గుంటూరు రూరల్ చౌడవరం సమీపంలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో వసంతరాయపురానికి చెందిన ప్రణయ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నగరంలోని బృందావన్ గార్డెన్స్‌కు చెందిన ఒక విద్యార్థిని అతడికి స్నేహితురాలు. ఆమెకు ఇన్‌స్ట్రాగామ్‌లో అకౌంట్ ఉండటంతో, కృష్ణనగర్‌కు చెందిన ఆవుల దివేష్ అలియాస్ సన్ని మేసేజ్‌లు పంపుతుండేవాడు. సన్నీ పంపుతున్న మేసేజ్‌ల విషయాన్ని సదరు విద్యార్థిని ప్రణయ్‌కు చెప్పడంతో సాంతికేతిక మాధ్యమాల ద్వారా ఇద్దరి మధ్యా వివాదం నెలకొంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దమ్ముంటే చూసుకుందాం రమ్మంటూ..ఇద్దరూ ఫోన్ నంబర్లు పంపుకున్నారు. విషయంపై తేల్చుకుందాం రమ్మంటూ..డొంకరోడ్డు వద్ద ముందుగా ప్రదేశాన్ని ఖరారు చేసుకున్నారు. డొంక రోడ్డు 6వ లైను వద్ద రెండు వర్గాలు కలిపి సుమారు 40 నుంచి 50 మంది విద్యార్థులు, యువకులు చేరడంతో అక్కడ స్థానికులు కేకలు వేశారు. అక్కడ నుంచి పిచ్చుకులగుంట వద్ద బాహాబాహీకి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న అరండల్‌పేట స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్, ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సిబ్బందిని ఘటన స్థలానికి పంపేసరికి ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులతో పాటు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సమాచారం వేగవంతంగా తెలియడం, సిబ్బంది త్వరితగతిన స్పందించడంతో ఎటువంటి ఘటనలు జరగకపోవడంతో పోలీసులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఘర్షణకు వచ్చిన వారిలో గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని ఒక స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ కుమారుడు ఉన్నట్లు సమాచారం. చదవండి: గ్యాంగ్ వార్: ఇప్పుడు దృష్టంతా ఆ సమాచారం పైనే! ఘర్షణ జరిగిన ఘటన స్థలంలో స్థానికుడిని విచారిస్తున్న ఏఎస్పీ గంగాధరం ముమ్మర దర్యాప్తు యువతి విషయంలో విద్యార్థుల ఘర్షణపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అరండల్‌పేట పీఎస్‌లో ఉన్న విద్యార్థులు, యువకులను సోమవారం అడిషనల్ ఎస్పీ డి. గంగాధరం, వెస్ట్ డీఎస్పీ బి.వి. రామారావు, స్టేషన్ ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు విచారించారు. ఘర్షణలకు కారణమైన వాస్తవాలను వెలికి తీసేందుకు విచారణ చేపట్టారు. యువతి విషయంలోనే ఘర్షణ లేక..ఇతరత్రా ఏమైనా ఉన్నాయా... ఘర్షణ సమయంలో ఉన్న విద్యార్థులు కాకుండా, ఇతరత్రా ఉన్న యువకులపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొంత మంది యువకులు ఇన్నోవా..మరికొంత మంది ద్విచక్ర వాహనాలపై పిచ్చుకులగుంట వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని ఏఎస్పీ గంగాధరం స్పష్టం చేశారు. కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని, మరికొంత మందిపై విచారణ జరుగుతోందని తెలిపారు. చదవండి: గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే! -
కత్తులతో విద్యార్థుల వీరంగం
-
బెజవాడలో కత్తులతో విద్యార్థుల వీరంగం
సాక్షి, విజయవాడ: బెజవాడలో కాలేజీ విద్యార్థులు రౌడీ మూకల్లా చెలరేగిపోయారు. నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడే దాకా వెళ్లింది. దీంతో బెజవాడ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దాడిలో గాయపడిన వారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. గ్యాంగ్‌వార్‌లో రాజకీయ పార్టీ నేతల అనుచరులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో అగ్నిప్రమాదం -
స్మార్ట్‌గా వ్యభిచారం.. కాలేజీ యువతులు కూడా!
సాక్షి, పలమనేరు : నియోజకవర్గంలో హైటెక్ వ్యభిచారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ల ద్వారానే మొత్తం వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచివారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలను నమ్మి పలువురు కళాశాలకు వచ్చే విద్యార్థులు సైతం ఈ ఊబిలో పడినట్టు భోగట్టా. తొలుత సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో సంబంధాలను ఏర్పరుచుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి వారిని దించుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైనా ఇలాంటి వ్యవహారాలు వెలుగుచూస్తే తప్ప అసలు విషయం ఎవరికీ తెలియకుండా సాగుతోంది. తాజాగా నియోజకవర్గంలోని వీకోట పట్టణంలోని ఓ లాడ్జిలో వ్యభిచార ముఠా గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్కడి ఓ టీడీపీ నాయకుని బంధువు ఉన్నట్టు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో మూలాలు పలమనేరు, కేజీఎఫ్, బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. తొలుత సోషల్ మీడియా ద్వారా..... ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ అవసరంగా మారింది. వయసుతో తేడా లేకుండా ఫేస్బుక్, టిక్‌టాక్, హలో, వాట్సాప్ వాడుతున్నారు. ఇందులోని మహిళలు, అమ్మాయిలతో కొందరు వ్యభిచార నిర్వాహకులు ఫ్రెండ్ షిప్ చేసుకుని చాటింగ్‌లు మొదలు పెడుతున్నారు. వీరితో పరిచయం పెరిగి కాల్స్, లైవ్ కాల్స్‌కు చేరుతోంది. వారి వ్యక్తిగత వివరాలే కాకుండా ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారికి ఉపాధి ఉద్యోగాల పేరిట తొలుత బుట్టలో వేసుకోవడం జరుగుతోంది. ఇంకొందరు స్థానికంగా ఉద్యోగాలు ఉన్నాయంటూ సంప్రదించాలని వల వేయడం సాగుతోంది. స్థానికంగా ఉన్న అమ్మాయిలు, మహిళలను ఇళ్లకు పిలిపించుకోవడం.. వారికి అండగా ఉంటామంటూ నమ్మకాన్ని కల్పిస్తున్నారు. మెల్లమెల్లగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఒక్కసారి ఇందులోకి దిగినవారు మళ్లీ బయటకు రావడం కష్టమే. ఆపై డేటింగ్ యాప్‌లలోకి... వ్యభిచార కూపంలోకి దించిన యువతులను డేటింగ్ యాప్‌లోకి అడ్మిట్ చేయిస్తారు. డేటింగ్ యాప్స్‌లో ముఖ్యమైన ఇన్‌స్ట్ర్రాగం, ఊ ది డేటింగ్ యాప్( రెడీ టూ మీట్ న్యూగర్ల్స్ ఫ్రం యువర్ ఏరియా), జస్ట్ ఫ్రెండ్స్, క్వాక్ క్వాక్, వీ మేట్, జిల్, స్నాప్‌చాట్, విగో, టిండర్, క్రస్‌లాంటి వాటిలోకి వెళితే వందలు కాదు వేలాదిమంది స్నేహితులుగా మారుతారు. ఇందులో నియర్ బై అనే ఆప్షన్ ద్వారా ఈ ప్రాంతంలోకి వారిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా లైవ్ కాల్స్ నుంచి డైరెక్ట్‌గా మీటింగులు జరుగుతుంటాయి. కళాశాల విద్యార్థినులు, ఒంటరి మహిళలు సైతం.. వ్యభిచార ఊబిలో పడిన వారిలో కళాశాల విద్యార్థినులు, బాలికలు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఆర్థిక అవసరాలు, విలాసాల కోసం జీవితాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో నిర్వాహకులు పెరుగుతూనే ఉన్నారు. పలమనేరులోని గంటావూరు, వీకోట, కర్ణాటకలోని కేజీఎఫ్, బెంగళూరుకు చెందిన పలువురు వ్యభిచార నిర్వాహకులు రింగుగా ఏర్పడి విటులను స్మార్ట్ ఫోన్ల ద్వారా బుక్ చేస్తున్నట్టు సమాచారం. విటులు సైతం నిర్వాహకుల ఖాతాలకు గూగూల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే చాలు అన్నీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని లాడ్జిలు, అద్దె ఇళ్లు వ్యభిచారానికి అడ్డాలు నియోజకవర్గంలోని కొన్ని లాడ్జిలు, పట్టణాల్లోని అవాసప్రాంతాల్లోని ఖరీదైన ఇళ్లు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇళ్లకు బంధువులు వచ్చినట్టుగా వస్తుంటారని, ఇక లాడ్జిల్లో ప్రత్యేక గదులే ఉన్నాయని సమాచారం. విటుల వద్దకు అమ్మాయిలను చేర్చేందుకు పట్టణంలోని కొందరు అద్దెకు కార్లను సైతం సిద్ధం చేస్తుంటారట. ఈ వ్యవహారంలో సూత్రధారులు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా వ్యభిచార నిర్వాహకుల ధనాశకు ఎందరో మహిళలు, యువతులు, విద్యార్థినుల జీవితాలు నాశనమవుతున్నా యి. ఇప్పటికైనా సంబంధిత ప్రాంతాల్లోని పోలీసులు దీనిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. -
విద్యార్థినులు లోదుస్తులు తొలగించాలంటూ..
గాంధీనగర్: గుజరాత్‌లోని ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థినుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది. విద్యార్థినుల్లో ఎవరెవరు నెలసరితో ఉన్నారో తెలుసుకునేందుకు లో దుస్తులు తొలగించాల్సిందిగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆదేశించారు. పిరియడ్స్ సమయంలో కొన్నింటిని విద్యార్థినులు తాకకుండా దూరంగా ఉంచేందుకు హాస్టల్ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలేజీ ప్రిన్సిపాల్ ఈ చర్యకు పూనుకున్నారు. గుజరాత్‌లోని బుజ్ ప్రాంతంలో శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. (క్లాస్‌మేట్‌ను ఫేస్బుక్ ద్వారా..) నెలసరి సమయంలో విద్యార్థినులు కాలేజీ ప్రాంగణంలోని ఆలయంలోకి వెళ్తున్నారని, కిచెన్ లోపలికి కూడా వెళ్తూ..ఎక్కడపడితే అక్కడ,, ఎవరిని పడితే వారిని తాకుతున్నారంటూ గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ తరగతి గదిలో ఉన్న 68 మంది విద్యార్థులను బయటకు పిలిపించింది. అక్కడ నుంచి వారందరినీ వాష్ రూమ్‌కి తీసుకెళ్లి వరుసలో నిలబెట్టి ఒక్కొక్కరినీ లో దుస్తులు తొలగించి నెలసరిలో ఉన్నారో లేదో చూపించాలని ప్రిన్సిపాల్ ఆదేశించింది. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థులు నెలసరిలో ఉన్నామంటూ పక్కకు తప్పుకోగా ప్రిన్సిపాల్ వారిని దుర్భాషలాడింది. (యువతిపై సాముహిక అత్యాచారం.. అరెస్ట్) కాగా స్వామి నారాయణ్ ద్విశతాబ్ది మెడికల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌లో దాదాపు 1500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. భారతీయ సాంప్రదాయాలు అనే పునాదులపై ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆచారాలు, నియమాలు, సాంప్రదాయ విలువలకు ఇక్కడ పెద్ద పీట వేస్తారు. నియమాల ప్రకారం.. నెలసరి సమయంలో విద్యార్థినులు ఆలయంలోకి, కిచెన్‌లోకి వెళ్లరాదు. అదే సమయంలో ఇతర విద్యార్థులను తాకరాదు. అయితే కిచెన్‌లో వాడేసిన శానిటరీ న్యాప్కీన్స్ ఉన్నాయంటూ.. హాస్టల్ వార్డెన్ విద్యార్థినులపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు విద్యార్థినులు మాత్రం కాలేజీ యాజమాన్యం తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన తమకు కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటోంది. అదే సమయంలో ఈ ఘటనపై ట్రస్ట్ సభ్యులు హిరానీ .. విద్యార్థులకు జరిగిన అవమానాన్ని తప్పుబట్టారు. -
కాలేజీల్లో ‘ఆన్లైన్ జియో బయోమెట్రిక్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఆన్లైన్ జియో బయోమెట్రిక్’ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ అభిప్రాయపడుతోంది. విద్యార్థుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచాలంటే ఈ విధానమే మేలని చెబుతోంది. ఇటీవల రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కాలేజీల్లో కమిషన్ తనిఖీలు నిర్వహిచింది. కాలేజీల్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉన్నట్లు గుర్తించింది. పలు ప్రైవేట్ కాలేజీల్లో రిజిస్టర్లలోని విద్యార్థుల సంఖ్యకు, హాజరైనట్లు నమోదు చేసిన సంఖ్యకు, వాస్తవంగా అక్కడున్న వారి సంఖ్యకు మధ్య పొంతన లేకపోవడాన్ని కమిషన్ పసిగట్టింది. పలు కాలేజీలు విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేస్తూ, యూనివర్సిటీలకు సమర్పిస్తున్నాయి. ఆయా విద్యార్థుల పేరిట ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము కోసం హాజరులో గోల్మాల్ చేస్తున్నాయి. మరోవైపు తరగతులకు హాజరు కాకున్నా హాజరైనట్లు అటెండెన్స్ వేయడానికి విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు ఆన్లైన్ జియో బయోమెట్రిక్ విధానంపై కమిషన్ దృష్టిపెట్టింది. దీనిపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హాజరులో మాన్యువల్‌గా అక్రమాలు ప్రస్తుతం పలు ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల హాజరును మాన్యువల్‌గా తీసుకొని రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పొందాలంటే నిర్దేశిత హాజరు తప్పనిసరిగా ఉండాలి. అందుకే విద్యార్థుల హాజరుపై కాలేజీలు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ ప్రభుత్వం ఫీజులు రాబట్టుకుంటున్నాయి. అందుకే మాన్యువల్ విధానానికి బదులు జియో బయోమెట్రిక్ విధానాన్ని అన్ని కాలేజీల్లో కచ్చితంగా అమలు చేయాలని కమిషన్ వెల్లడించింది. విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సూచనలు - ప్రతి విద్యార్థికి సెమిస్టర్ లేదా ఆ ఏడాది మొత్తంలో 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. - విద్యార్థి సంబంధిత సంవత్సరపు సబ్జెక్టుల్లో 50 శాతం వరకైనా ఉత్తీర్ణుడై ఉండాలి. అప్పుడే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హుడవుతాడు. - విద్యార్థుల వాస్తవ హాజరును నమోదు చేసేందుకు జియో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి. - జియో బయోమెట్రిక్‌ను 2020–21 నుంచి అమలు చేయాలి. దాన్ని ఆన్లైన్ విధానంలో పర్యవేక్షించాలి. - కాలేజీలోని విద్యార్థుల హాజరు నమోదు సర్వర్ డేటా బేస్‌ను సంబంధిత యూనివర్సిటీకి, సాంఘిక సంక్షేమ శాఖకు, జ్ఞానభూమి పోర్టల్‌తో అనుసంధానించాలి. - జియో బయోమెట్రిక్ పరికరాలు పని చేయకుంటే ఆ రోజు కాలేజీ ప్రిన్సిపల్ విద్యార్థుల అటెండెన్స్‌ను రికార్డు చేసి, రిజిస్టర్ స్కాన్డ్ కాపీలను సంబంధిత వర్సిటీకి, ప్రభుత్వ విభాగానికి ఈ–మెయిల్ ద్వారా పంపించాలి. - జియో బయోమెట్రిక్ హాజరును అమలు చేయని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. -
బస్సులో వీరంగం
చెన్నై, టీ.నగర్: చెన్నై మౌంట్ రోడ్డులో బస్సులో వీరంగం సృష్టించిన ఇద్దరి విద్యార్థులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో కళాశాల విద్యార్థులు గొడవలకు పాల్పడడం, సిటీ బస్సులలో వీరంగం సృష్టించడం పరిపాటిగా మారింది. కొన్ని నెలల క్రితం కీల్పాక్కం ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు ప్రజలపై దాడికి దిగారు. విద్యార్థులను అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. ఆ తరువాత వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉండగా సోమవారం మౌంట్‌రోడ్డులో మందవెలి – బ్రాడ్వే అనే సిటీ బస్సు నెం.21లో విద్యార్థులు బస్సు టాప్‌పైకి ఎక్కి డాన్స్‌లు చేయడమే కాకుండా ప్రయాణికులతో అభ్యంతరకరంగా వ్యవహరించారు. అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడ్డారు. దీనిపై ప్రజలు పోలీసు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారు. ట్రిప్లికేన్ డిప్యూటీ కమిషనర్ ధర్మరాజ్ సంబంధిత విద్యార్థులపై చర్యలు తీసుకోవలసిందిగా ఉత్తర్వులిచ్చారు. మోహన్‌దాస్ అక్కడికి వెళ్లి విద్యార్థులను పట్టుకున్నారు. వీరు రాయపేట న్యూ కళాశాలకు చెందిన వారుగా తెలిసింది. పెరంబూరు జమాలియా ప్రాంతానికి చెందిన మీరన్ సుద్దీన్, ఓల్డు వాషర్‌మెన్‌పేటకు చెందిన అప్జల్‌రెహ్మాన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి సైదాపేట జైలులో నిర్బంధించారు. -
దిశా నిర్దేశం
-
ఆ కాలేజ్ మెరిట్ స్కాలర్‌షిప్‌లకు అడ్డా..
సాక్షి, తొగుట(దుబ్బాక): తొగుట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ ఎంపికకు విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు కళాశాల అధ్యాపకులు కృషి చేస్తున్నారు. చదువులతో పాటు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో విద్యార్థులు రాణిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన పోటీ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు. కళాశాల నుంచి ఏటా ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపకార వేతనాలకు ప్రతి ఏటా ఎనిమిది మంది చొప్పున విద్యార్థులు ఎంపికవుతున్నారు. ఎంపికైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ చదివేందుకు ఐదు సంవత్సరాలకు సుమారు రూ.70 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కళాశాలలో యువ అధ్యాపక బృందం విద్యార్థులకు విద్యాబోదన అందిస్తున్నారు. పోటీ పరీక్షల్లో రాణించేందుకు మెలకువలు నేర్పిస్తున్నారు. 2009లో కళాశాల స్థాపన తొగుట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009లో జూనియర్ కళాశాల ఏర్పాటైంది. గ్రీమీణ ప్రాంతాల పేద విద్యార్దులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకు రావాలన్న ఉద్దేశంతో దివంగత దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కళాశాల ఏర్పాటుకు కృషిచేశారు. అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కళాశాలను ప్రారంభించారు. కళాశాల ఏర్పాటైన రెండో సంవత్సరంలోనే 200 మంది విద్యార్థులు చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్యకు కళాశాల సరిపోలేదు. దీంతో ముత్యంరెడ్డి తన సొంత భవనాన్ని కళాశాలకు అందజేశారు. అందులో చాలా కాలం పాటు విద్య కొనసాగింది. తర్వాత ఆరంపురంలో కళాశాలకు సొంత భవనం నిర్మించి అందజేశారు. దీంతో కళాశాలకు విశాలమైన భవనం అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారంటే విద్యా బోధన ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల ప్రోత్సాహం కళాశాలలో యువ అధ్యాపక బృందం విద్యాబోధనతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో ఎంపికవుతున్నారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటర్ విద్యతో పాటు పోటీ పరీక్షల్లో రాణించేలా బోధిస్తున్నాం. ఇప్పటివరకు కళాశాల నుంచి సుమారు వంద మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఇక్కడి విద్యార్థులు ప్రతి ఏటా ఎంపికవుతున్నారు. బోధనలో అధ్యాపకుల కృషి అభినందనీయం. – పరమేశ్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల రాంపురం ప్రత్యేక తరగతులు ఇంటర్ విద్యతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అధ్యాపకకులు బోధిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి తర్ఫీదునిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఉపకార వేతనాలకు కళాశాల నుంచి ఎంపికవుతున్నారు. అధ్యాపకుల సూచనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. – చిప్ప నవీన, కళాశాల పూర్వ విద్యార్థిని -
విద్యార్థీ.. నీకు బస్సేదీ?
ఉప్పల్ నుంచి ఘట్కేసర్, భోగారం వైపు బస్సు సర్వీసులను పెంచాలని ఇటీవల కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆపకుండా వెళ్తున్న ఓ బస్సు వెనక అద్దాలను పగులగొట్టారు. కనీసం ఫుట్‌బోర్డుపై నిల్చుని వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోవడంతో.. బస్సు వెనకున్న అంచుపై నిల్చొని ప్రయాణం చేశారు. అత్యంతప్రమాదకరమైన ఈ ప్రయాణ వీడియో నగర శివార్లలోని కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఎదుర్కొంటున్నఇబ్బందులకు అద్దం పట్టింది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క సికింద్రాబాద్ – ఉప్పల్ – ఘట్కేసర్ మార్గంలోనే కాదు... నగరానికి నలువైపులా ఉన్న అన్ని మార్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. బస్సులు కిక్కిరిసిపోవడంతో విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడం... ప్రైవేట్ వాహనాలు, బైకులపై కాలేజీలకు వెళ్తుండడంతోతరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. సిటీ శివార్లలోని కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం సరిపోని సర్వీస్‌లు.. నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో వందలాదిగా ఇంజినీరింగ్, ఒకేషనల్, ఐటీఐ తదితర కళాశాలలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న బస్సులు సుమారు 1,500 వరకు ఉన్నాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు సైతం ఈ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అప్పటికే కిక్కిరిసిపోయిన బస్సుల్లో విద్యార్థులు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజూ 80 బస్సులు అదనంగా నడుపుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. కానీ విద్యార్థుల డిమాండ్, రద్దీకి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. బైక్‌లపై వేగంగా వెళుతూ అదుపు తప్పి పడిపోతున్నారు. ఇలా ఏటా అనేక మంది ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. మృత్యువాత పడుతున్న సంఘటనలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రూట్లో నిత్యం 40వేల మంది విద్యార్థులు.. ప్రతి నిత్యం ఆల్వీన్ క్రాస్ రోడ్డు నుంచి మాదాపూర్, కొండాపూర్ వైపు, బాచుపల్లి, బొల్లారం, గండిపేట వైపు వెళ్లే బస్సుల సంఖ్య చాలా తక్కువ ఉండడంతో ఆ రూట్లో వెళ్లే విద్యార్థులు బస్సులకు వేలాడుతూ ఫుట్ బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రతిరోజు 40 వేల మంది వరకు విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. పటాన్చెరు నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే బస్సులు కూడా రద్దీగా వెళ్తున్నాయి. డ్రైవర్లు స్టాప్‌లలో బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు రన్నింగ్‌లో బస్సెక్కి ప్రమాదాలకు గురవుతున్నారు. మియాపూర్ డిపో–1 నుంచి 70 బస్సులు, మియాపూర్ డిపో –2 నుంచి 107 బస్సులు ఆయా రూట్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని ఇంజినీరింగ్ కళాశాలల రూట్లో సరైన ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరోరా, మహవీర్, ఇస్లామియా ఇంజినీరింగ్ కళాశాలలకు నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానమైన ‘300’ రూట్లో ఉన్న ఈ కళాశాలలకు సరైన సమయంలో బస్సులు పూర్తి స్థాయిలో తిరగడం లేదు. వెరసీ.. విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్‌బోర్డింగ్ ప్రయాణం చేయాల్సివస్తోంది. ఉరికితేనే బస్సు దొరికేది: పరుగులు తీస్తున్న విద్యార్థులు ఇదీ పరిస్థితి ♦ నగర శివార్లలోని వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు 1500 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ దృష్ట్యా మరో 80 బస్సులు అదనంగా నడుపుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ... అవి విద్యార్థులకు సరిపోవడం లేదు. ♦ మేడ్చల్‌లోని కండ్లకోయ, మేడ్చల్, మైసమ్మగూడ, కీసర, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో 50కి పైగా కాలేజీలు ఉన్నాయి. వీటిలో 10వేల మందిపైగా విద్యార్థులు ఉన్నారు. కానీ విద్యార్థుల రద్దీకి సరిపడా బస్సులు లేవు. ♦ మేడ్చల్ – సికింద్రాబాద్, ఘట్కేసర్ – భోగారం, ఘట్కేసర్ – అవుషాపూర్ రూట్లలో మరో 40–50 బస్సులు నడిపించాలని విద్యార్థులు కోరుతున్నారు. ♦ ఎల్బీనగర్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్ మొదలుకొని 12 ఇంజినీరింగ్ కళాశాలలు, నాగార్జునసాగర్ రహదారిపై దాదాపు 12 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణానికి విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. ప్రమాదకరం.. ఫుట్‌బోర్డు ప్రయాణం .. కుత్బుల్లాపూర్ వైపు.. నియోజకవర్గ పరిధి శివారు ప్రాంతాల్లో ఉన్న 12 ఇంజినీరింగ్ కళాశాలలు, పలు జూనియర్ కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వీరి కొందరు కాలేజీ బస్సుల్లో వస్తున్నప్పటికి చాలా మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు. ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోనే కాకుండా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లాలన్నా ఇటునుంచే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలి. ప్రతి విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికి తదనుగుణంగా ఈ రూట్లల్లో ఆర్టీసీ బస్సులు పెరగడం లేదు. దీంతో ఫుట్‌బోర్డులపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. సుచిత్ర నుంచి కొంపల్లి వరకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల సమయంలో దాదాపు 50 సర్వీసు ఆటోలు ఉన్నప్పటికి వీటిల్లో కూడా విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. బాచుపల్లి– గండిమైసమ్మ, బాలానగర్ నుంచి గండిమైసమ్మ, సుచిత్ర – కొంపల్లి, దూలపల్లి క్రాస్ రోడ్డు నుంచి బహదూర్‌పల్లి క్రాస్ రోడ్లలో వేలాది మంది విద్యార్థులు నిత్యం ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. సమయానుకూలంగా బస్సులు నడపాలి.. మియాపూర్ నుంచి బాచుపల్లి బొల్లారం వెళ్లే రూట్లో నాలుగు బస్సులే ఉన్నాయి. అవి కూడా పాత డొక్కు పడిన బస్సులు ఉండడంతో మధ్యలోనే ఆగిపోతున్నాయి. సరైన సమయానికి కళాశాలకు వెళ్లడంలేదు. బస్సుల సంఖ్య పెంచాలని గతంలో ఎన్నోసార్లు ట్విట్టర్, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – రాహుల్ ప్రీతమ్ , విద్యార్థి ఫుట్బోర్డే దిక్కు.. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల సంఖ్య తక్కువ ఉండడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఫుట్‌బోర్డు ప్రయాణం చేయాల్సివస్తోంది. మాదాపూర్, హైటెస్ సిటీ వైపు వెళ్లేందుకు బస్సులు అతి తక్కువగా ఉన్నాయి. దీంతో బస్సులు సమయానికి రాక ఉన్న బస్సుల్లోనే ఇరుకు ఇరుకుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. బస్టాప్‌లలో కొంతమంది డ్రైవర్లు నిలబడకుండా వెళ్తుండడంతోరన్నింగ్లోబస్సు ఎక్కాల్సివస్తోంది. – కౌశిక్, విద్యార్థి ఆగకుండానే వెళ్తున్నాయి.. నేను ప్రతిరోజూ ఒవైసీ ఆస్పత్రి మీదుగా అరోరా ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్తుంటాను. ఉదయం 8.30 గంటల అనంతరం బస్సులు పూర్తి స్థాయిలో నడవడం లేదు. పూర్తిగా రద్దీగా ఉంటోంది. 8.30 గంటల కంటే ముందు ఐదారు బస్సులు ఒకేసారి వెళ్తుంటాయి. దీంతో పాటు స్టాప్‌లలో కొన్నిసార్లు బస్సులను ఆపడం లేదు. ఆటోలో వెళ్లాల్సి వస్తోంది.– వినయ్, మహవీర్ కళాశాల సాయంత్రం ఎదురుచూపులే.. సాయంత్రం వేళ ఎల్బీనగర్ వైపు బస్సులు చాలా తక్కువ సంఖ్యలో నడుస్తున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు కళాశాల ముగిశాక బస్సుల కోసం గంటన్నర సేపు ఎదురు చూడాల్సి వస్తోంది. ఆరు గంటల అనంతరమే పూర్తి స్థాయిలో బస్సులను నడుపుతున్నారు. ఉదయం పూట కూడా కాలేజీకి వచ్చే సమయంలోనే బస్సులు తక్కువగా వస్తున్నాయి. – సాయితేజ, మహవీర్ కళాశాల ఇది చాలా దారుణం.. ట్రాఫిక్ పోలీసులు,ఆర్టీసీ అధికారులు ఫుట్‌బోర్డు ప్రయాణం మంచిది కాదని నీతులు చెబుతున్నారు. కాని సరిపడాబస్సులున్నాయా లేదా అనేది ఆలోచించకపోవడం దారుణం. బస్సులుంటేఫుట్ బోర్డు ప్రయాణం ఎందుకు చేస్తాం.– శ్రీలేఖ, బీటెక్ ప్రిన్సిటన్ కళాశాల,ఘట్కేసర్ -
ఆమెకు ఆమే అభయం
సాక్షి, హైదరాబాద్: ఆమెకు ‘ఆమే’అభయం.. ఆమెను వేధిస్తే ఇక అంతే. వెకిలిచేష్టలు, మకిలి మనుషులపై కొరఢా ఝళిపిస్తోంది. పోకిరీలపై ప్రతాపం చూపుతోంది. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తోంది. పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు.. కార్యాలయాలకు వెళ్లే మహిళలు... షాపింగ్ కోసమని ఇంటి నుంచి బయటకు వచ్చే గృహిణులు... ఇలా ఎవరు ఏ పనిమీద వెళుతున్నా ఎవరైనా వేధిస్తే షీటీమ్‌లు ఇట్టే పట్టేస్తున్నాయి. బాధిత మహిళలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ షీ బృందాలు గత మూడేళ్లలో 5,432 కేసులు నమోదు చేశాయి. అయితే, వీటిల్లో 4,830 కేసు లు మేజర్లపై, 602 కేసులు మైనర్లు నమోదయ్యాయి. మహిళలను వేధించేవారిలో కాలేజీల విద్యార్థులు, వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న మరికొందరు ఉన్నట్లు షీ బృందాలు సేకరించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పనిచేస్తున్న అవగాహన మంత్రం... బస్టాప్‌లు, ఆటోస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రోస్టేషన్లు, పనిచేసే ప్రాంతాలు, విద్యాసంస్థలు... ఇలా ఏ ప్రాంతమైనా సరే బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తే షీ బృందాలను ఆశ్రయించాలని చేస్తున్న విస్తృత ప్రచారం బాగానే పనిచేస్తోంది. లైంగిక వేధింపులకు గురయ్యే యువతులకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు గత మూడేళ్లలో దాదాపు ఐదువేల వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపు పది లక్షల మందిలో మార్పు తీసుకురాగలిగాయి. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు, గ్రామాలు, మురికివాడ లు, పనిచేసేప్రాంతాల్లో విస్తృతంగా జాగృతి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళాచట్టాల గురించి వివరించారు. పోలీసుస్టేషన్లే కాకుండా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్, హాక్ ఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రచారం చేయడం అమ్మాయిలకు, మహిళల్లో భరోసా కలిగించింది. ఫలితంగా వాట్సాప్, ఫేస్బుక్, ఈ–మెయిల్, ట్విట్టర్, డయల్ 100 ద్వారా ఫిర్యాదుల తాకిడి పెరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే మఫ్టీ దుస్తుల్లో షీ బృందాలు అక్కడికి చేరుకొని వీడియో చిత్రీకరణ ద్వారా ఆకతాయిల వెకిలి చేష్టలను చిత్రీకరించి సాక్ష్యాలుగా కోర్టులో సమరి్పస్తున్నాయి. అతి గారాబంతో దారి తప్పి.. - చిన్నప్పటి నుంచి స్త్రీలపట్ల గౌరవం పెంచేలా తల్లిదండ్రులు, గురువులు చొరవ చూపకపోవడం - తల్లిదండ్రుల అతి గారాబం - షీ బృందాలకు చిక్కుతున్నవారిలో 19 నుంచి 55 ఏళ్ల వయసువారే ఎక్కువ నోరెళ్లబెడుతున్నారు... ‘మేమేమీ తప్పుచేయలేదంటూ చిలుకపలుకులు పలికే ఈవ్ టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలోనే వీడియో ప్రదర్శించడంతో కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ‘మేం పట్టుకున్న ఈవ్‌టీజర్లలో 80 శాతం మంది రోజూ సిగరెట్లు తాగుతున్నారు. వారాంతాల్లో మద్యం పారీ్టలు చేసుకుంటున్నారు. హుక్కా కేంద్రాలకు వెళ్తూ మత్తును రుచిచూస్తున్నారు’ అని షీ టీమ్ సభ్యులు తెలిపారు. కౌన్సెలింగ్‌తో మార్పు కనబడుతోంది... షీ బృందాలకు చిక్కిన ఆకతాయిలకీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మార్పు వస్తోంది. పశ్చాత్తాపపడేలా చేయడంతోపాటు మరోమారు ఈవ్‌టీజింగ్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాం. వేధింపులపై ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగి మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నాం. ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. – అనసూయ, సైబరాబాద్ షీ టీమ్ ఇన్చార్జి మనస్తత్వం మంచిగా ఉండేలా చూడాలి పిల్లల ముందే ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడటం కూడా ఎదుటివారంటే లెక్కలేనితనాన్ని పెంచుతుంది. మగపిల్లలకు ఇష్టానుసారంగా డబ్బులు, స్వేచ్ఛ ఇవ్వడం వల్ల దారి తప్పుతున్నారు. అమ్మాయి కనబడితే కామెంట్ చేయడం మామూలు విషయమేనని భావిస్తున్నారు. అందుకే చిన్నప్పుడే పిల్లల మనస్తత్వం బాగుండేలా చూడాలి.. – లావణ్య, క్లినికల్ సైకోథెరపిస్ట్ -
పోయిందే.. ఇట్స్‌గాన్..
వాషింగ్టన్: పెంపుడు పిల్లులు, కుక్కలతో కాస్త సమయం వెచ్చిస్తే కాలేజీ విద్యార్థుల మానసిక స్థితి మెరుగవడంతోపాటు, వారిలో ఒత్తిడి స్థాయి తగ్గుతుందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. పెంపుడు జంతువులతో గడిపే పది నిమిషాల సమయం కూడా ఎంతో ప్రభావం చూపిస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాట్రిషియా పెండ్రీ తెలిపారు. పెంపుడు జంతువులతో సమయం గడిపిన విద్యార్థుల్లో ఒత్తిడిని కలిగించే కార్టిజాల్ అనే హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఇది ప్రయోగశాలల్లో కంటే నిజ జీవితంలో అనుసరిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయని తెలిపారు. ఈ మేరకు ప్రముఖ జర్నల్ ఏఈఆర్ఏ ఓపెన్‌లో వ్యాసం ప్రచురించారు. ‘పెట్ యువర్ స్ట్రెస్ అవే’పేరిట యూనివర్సిటీ పరిశోధకులు 249 మంది కాలేజీ విద్యార్థులతో పరిశోధనలు నిర్వహించారు. ఈ 249 మంది విద్యార్థులను 4 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ సభ్యులకు 10 నిమిషాలపాటు పిల్లులు, కుక్కలతో సమయం గడిపేలా చూశారు. రెండో గ్రూప్ సభ్యులు మొదటివారిని చూస్తూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. మూడో గ్రూప్ వాళ్లకు మొదటి గ్రూప్ సభ్యులు జంతువులతో సమయం గడుపుతున్న చిత్రమాలిక చూపించారు. నాలుగో గ్రూప్ సభ్యులను తమ వంతు వచ్చేవరకు వేచి ఉండమన్నారు. వాళ్లను అంతసేపు ఫోన్ వాడడం కానీ, చదవడం కానీ చేయవద్దన్నారు. ఇలా పరిశోధనల్లో పాల్గొన్న సభ్యుల నుంచి లాలాజలం నమూనాలను ఉదయం నుంచి సేకరించారు. ఇందులో జంతువులతో నేరుగా గడిపిన విద్యార్థుల లాలాజలంలో కార్టిజాల్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు తమ పెంపుడు జంతువులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారని తెలుసని, కానీ దాని వల్ల ప్రయోజనం కూడా ఉంటుందని ఈ పరిశోధనల్లో తేలిందని పెండ్రీ తెలిపారు. దీంతో శారీరక ఒత్తిడిని కూడా జయించవచ్చన్నారు. -
పాసులు సరే.. బస్సుల మాటేమిటి?
సాక్షి, నరసన్నపేట : విద్యార్థులకు ఆర్థికభారం తగ్గించేందుకు రాయితీ బస్ పాసులను మంజూరు చేస్తున్న ఆర్టీసీ.. దీనికి తగిన విధంగా బస్ సర్వీసులు నడపడం లేదు. గతంలో ప్రవేశ పెట్టిన స్టూడెంట్ స్పెషల్ సర్వీసులను డిమాండ్‌కు అనుగుణంగా నడపక పోవడంతో రెగ్యులర్ బస్‌లు నిండుతున్నాయి.దీంతో విద్యార్థులు ఫుట్‌పాత్‌లపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తుంది. మరోవైపు అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గంటల తరబడి కాంపెక్స్‌లో బస్‌ల కోసం చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు నరసన్నపేట కాంప్లెక్స్ వద్ద గురువారం ఆందోళనకు దిగారు. బస్‌పాస్‌లకు తగినట్లుగా స్టూడెంట్స్ స్పెషల్ బస్‌లు నడపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. ఇలా అయితే తమ ఇళ్లకు ఎలా చేరుకోవాలని ప్రశ్నించారు. గత వారం రోజులుగా రోజూ కాంప్లెక్స్‌లో ఎస్‌ఎంకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో వారంతా బస్‌లు కదలకుండా ఆందోళనకు దిగారు. ప్రధానంగా బోరుబద్ర, పిన్నింటిపేట, పోలాకి, ప్రియాగ్రహారం రూట్లో అధికంగా సమస్య ఉందన్నారు. వయా పోలాకి రూట్లో ఉండాల్సిన బస్‌లు గత ప్రభుత్వం హయాంలో నిమ్మాడ మీదుగా మార్చారని తెలిపారు. దీంతో అవసరం మేరకు రెగ్యులర్ బస్‌లు లేక, స్పెషల్ సర్వీసులు అరకొరగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు వివరించారు. స్టూడెంట్స్ స్పెషల్ బస్‌లు మరిన్ని నడపాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందించిన ఆర్టీసీ ఎస్ఎం మూర్తి.. అక్కడకు చేరుకుని, విద్యార్థులతో మాట్లాడారు. 1, 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. -
పరువమా.. పరుగు తీయకు
కౌమారం ఓ జలపాతం..కౌమారం ఓ సెలయేటి గలగల... కౌమారం పగ్గాల్లేని వేగం.. పాఠశాల దశ దాటి కళాశాలలో అడుగుపెట్టగానే.. అంతా ఓ కొత్త బంగారు లోకం... కానీ ఆ కొత్త బంగారులోకంలో పూల వెనక .. ముళ్లుంటాయి... ఆనందపు జలపాతాల వెనక సుడులుంటాయి... జారిపడితే అధఃపాతాలానికి దారులుంటాయి... అందుకే ప్రాయంలో అపాయాన్ని గుర్తెరగాలి... టీనేజీ డ్యామేజీ కాకుండా జాగురూకత ఉండాలి..ఎ దిగే వయసులో తప్పటడుగు పడకుండా చూడాలి... భవితకు క్రమశిక్షణతో బంగారు బాట వేసుకోవాలి... కౌమారంలో అంతా కొత్త బంగారులోకం.. తప్పటడుగు వేస్తే టీనేజీ...డ్యామేజీ.. కొత్త ఆనందాల వెనక అనర్థాలు.. బాలికలకు సదా అప్రమత్తత అవసరం సాక్షి, అచ్యుతాపురం(విశాఖపట్టణం) : ప్రపంచం గురించి ఇప్పుడే తెలుసుకుంటారు. అనేక పరిచయాలు కొత్త ఆలోచనలు, ఆకర్షణలు, ఆలోచనలు తెలుస్తుంటాయి. పాలకు, నీళ్లకు తేడా తెలుసుకోలేని వయసు. పాఠశాల విద్యను పూర్తిచేసి ఉన్నత విద్యకు శ్రీకారం చుట్టే ప్రథాన ఘట్టం ఇదే. తాము ఏర్పాటు చేసుకునే లక్ష్యాలకు పదును పెట్టాల్సిన సమయం ఇదే. పట్టుదలతో చదవాలన్నా, పరిచయాలతో చెడు అలవాట్లకు గురికావాలన్నా ఇక్కడే జరుగుతుంది. బాగుపడాలన్నా చెడిపోవాలన్నా టీనేజ్ కత్తిమీద సామని చెప్పాలి. ఉజ్వల భవిష్యత్‌కి భుజం తట్టి ప్రోత్సహించే చేతులుంటాయి. చెడుమార్గాన్ని నడిపించే చేతులుంటాయి జాగ్రత్తని ప్రముఖులు చెబుతున్నారు. ఆ...కర్షణలో రక్షణ లేదు కౌమార దశలో వచ్చే కొత్త కొత్త అనుభూతులు కొందరిని బలహీనులుగా మారుస్తాయి. హార్మోన్ల ప్రభావంతో లైంగిక ఆకర్షణలకు గురికావడం, ఆపై దాడులకు గురవడం, మోసపోవడం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో పరువానికి పగ్గాలు వేయడం ముఖ్యం. ముఖ్యంగా బాలికలు ఎదుర్కొనే పరిస్థితులు వేరు. తోటి విద్యార్థులుగాని, ఉపాధ్యాయులుగాని శుభాకాంక్షలు చెబుతూ షేక్‌హ్యాండ్ ఇచ్చినప్పుడు అరచేతిని వేలితోరుద్దడం, ప్రోత్సహిస్తున్నట్టు భుజంపై చేయివేయడం, ప్రయాణంలో చేతులు తాకించడం వంటి పలు చర్యలను ఆడపిల్లలు ఎదుర్కొనే ఇబ్బందికర స్పర్శలుగా గుర్తించారు. పరుషపదాలతో మాట్లాడడం, ఏకవచనంతో సంబోధించి మానసికంగా వేధించడం వంటి చర్యలూ వారిని కుంగదీస్తుంటాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి వివరాలను పోలీసులకు చేర వేస్తే శక్తి టీం మహిళా కానిస్టేబుళ్లు రంగంలోకి దిగుతారు. వారి భరతం పడతారు. కళాశాలకు బస్సులో ప్రయాణించేటప్పుడు ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తిస్తే ప్రయాణంలో ఉండగానే పోలీసులకు సమాచారం ఇస్తే బస్ ట్రాకింగ్ చేసి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది బస్‌స్టాప్‌కు చేరుకొని చర్యలు తీసుకుంటారు. మజా ఖర్చులతో కరుసైపోతారు పాఠశాల వదిలి కళాశాలలో అడుగుపెట్టగానే స్మార్ట్‌ఫోన్, నెట్ బ్యాలెన్స్‌కు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బర్త్‌డే పార్టీలు, వాలెంటైన్స్‌డే, యూత్‌డే, ఫ్రెడ్షిప్డేలంటూ పార్టీ కల్చర్ ఎక్కువవుతుంది. గ్రూపుగా యువతీయువకులు చేరి ఎంజాయ్చేయాలనే ఆలోచన వస్తుంది. ఆ వేడుకలు రానురాను కాస్త అప్‌గ్రేడ్ అవుతున్నాయి. లంచ్, డిన్నర్, డ్రింక్, బీర్లవరకూ దారితీస్తుంది. మదర్స్‌డే. ఫాదర్స్డేలను కూడా తమ ఆనందాల కోసమే వాడుకుంటున్నారు. తరుచూ పాస్ట్ఫుడ్కి అలవాటుపడి ఖర్చుని అమాంతంగా పెంచేస్తున్నారు. ఐదుగురు హోటల్‌కి వెళ్తే 2వేలుకి మించి ఖర్చుచేస్తారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కి వెళ్లే వందలకొద్దీ ఖర్చు చేస్తారు. తల్లిదండ్రులు స్కూల్ ఫీజు చెల్లించడానికి ఇబ్బందిపడే పరిస్థితిలో పిల్లల ఖర్చు భారంగా మారుతుంది. తల్లిదండ్రులు జేబు ఖర్చులకు దండిగా డబ్బులు ఇవ్వకపోతే పోపుల డబ్బాలో చేయిపెట్టక తప్పడం లేదు. అక్కడ చిల్లర దొరకకపోతే చిల్లర దొంగతనాలకు పాల్పడే స్థాయికి సిద్ధపడుతున్నారు. బాలనేరస్తుల్లో ఎక్కువ మంది తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడం కోసమే నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బు అవసరాలను తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం పట్టించుకోరు.. కాలేజీకి వెళ్తున్నామంటే కొందరు క్యారేజీని పక్కనపెట్టేస్తా రు. మధ్యాహ్నం భోజ నం చేయకపోవడం, చిరుతిండితో సరిపెట్టడంతో ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. సమృద్ధిగా నీరుతాగరు. తాగమని చెప్పేవారుండరు. చెప్పినా వినిపించుకోరు. జంక్‌ఫుడ్ తినడంతో తరుచూ అనారోగ్యానికి గురవుతా రు. బాలికలు జీరోసైజ్కోసం తిండిని పక్కన పెట్టేస్తున్నా రు. చాక్లెట్లు డ్రింక్‌లతో సరి పెడుతున్నారు. అప్పటివరకూ పుస్తకాలబ్యాగ్తోపాటు భోజనం క్యారియర్ని ప్రత్యేకబ్యాగులో తీసుకెళ్తారు. ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకూ అదే అలవాటుగా కొనసాగుతుంది. కాలేజీకి రాగానే ఇంటి భోజనంపై శ్రద్ధ తగ్గుతుంది. ఎదిగేవయçసులో సమృద్ధిగా పౌష్టికాహారం తినాలి. కానీ జంక్ ఫుడ్‌కు అలవాటు పడతారు. అందుకే క్రమశిక్షణగా ఇంటినుంచి భోజనం తీసుకెళ్లాలి. ‘షి’కారులు వద్దే వద్దు పిక్నిక్, హాలిడేట్రిప్, సైన్స్ టూర్, కెరియర్ మీట్, ఎగ్జిబిషన్, సమ్మిట్‌కి హాజరుకావడం ఇప్పుడు అవసరమయ్యింది. విద్యలో రాణించడానికి ఉపాధి అవకాశాలను చేజిక్కించుకోవడానికి దూరప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ క్రమంలో కొత్త కొత్త పరిచయాలు పెంచుకుంటారు. అయితే మిత్రులే అంటూ ఎవరినీ ఎక్కువగా నమ్మడం సరికాదు. ఏకాంత ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం మానుకోవాలి. అవే పరిచయాలతో అవకాశం ఉన్న ప్రతిసారీ బీచ్‌లకు, లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లడం అలవాటు చేసుకుంటున్నారు. అటువంటి ‘షి’కారులతో అనర్థాలే. ఒక్కసారే...అనుకుంటే అనర్ధమే.. చెడు అలవాటును పరిచయం చేయడంలో ఫ్రెండ్స్ వాడే మాట ఒక్కసారికి ఏమైపోతుందిలే..అని. అక్కడ నుంచి వ్యసనం మొదలవుతుంది.అదే పతనానికి నాంది అని గ్రహించాలి. మత్తుపదార్థాలను తీసుకోవడం, అసభ్యకరవీడియోలను చూడడం జీవితాలను నాశనం చేస్తాయి. మంచి ఫ్రెండ్స్‌కి దగ్గరవ్వాలి. చెడుస్నేహాన్ని వీడాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం ద్వారా టీనేజ్‌లో ప్రమాదాల నుంచి బయటపడగలరు. కౌమార దశలో జాగ్రత్తలు అవసరం కౌమారదశలో ఆడపిల్లలకు శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో పిల్లల్ని వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టే వారిపై కఠినంగా ఉండాలి. వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నారు. అభం శుభం తెలియదు. ఏవో అనుభూతులతో కొందరు ఆకర్షణలో పడిపోతారు. భవిష్యత్‌ని నాశనం చేసుకుంటున్నారు. మగ స్నేహితుల మాటలకు ఆకర్షితులై చనువు పెంచుకుంటున్నారు. అవే శారీరక దాడులకు దారితీస్తున్నాయి. టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రేమగా ఉండి ప్రతి అంశాన్ని అడిగి తెలుసుకోవాలి. – ఎం.కనకమహాలక్ష్మి, వైద్యాధికారిణి, అచ్యుతాపురం పీహెచ్సీ ఓ కంట కనిపెట్టి ఉండాలి పదో తరగతి వరకూ జాగ్రత్తగా చూస్తాం. ఇంటర్‌కి వెళ్లేసరికి ఎవరి మాటా వినరు. కొత్త పరిచయాలు, కొత్తస్నేహాలు, కొత్త అనుభూతులు ఉంటాయి. సరిగ్గా భోజనం చేయరు. మగపిల్లలతో పరిచయాలు పరిమితికి మించకూడదు. తల్లిదండ్రులకు జవాబుదారీగా ఉండాలి. ఎదుటివారికి అవకాశం ఇవ్వకూడదు. – ఎ.విజయ, ప్రధానోపాధ్యాయుని హైస్కూల్, అచ్యుతాపురం క్రమశిక్షణతోనే బంగారు భవిత క్రమశిక్షణతో ఉంటేనే పిల్లల ఉన్నత చదువులు సాధ్యమవుతాయి. ఆడపిల్లలకు అణువణువునా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇంటర్, పాలిటెక్నిక్‌కి వెళ్లే పిల్లలకు అంతా కొత్త వాతావరణం..దీంతో తప్పటడుగులు పడే అవకాశం ఎక్కువ. సోషల్‌మీడియా ప్రభావంతో ప్రతి చిన్నవిషయానికి పార్టీ చేసుకోవడం లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లడం ఇటీవల ఎక్కువయ్యాయి. అవి బాలికలపై దాడులు జరగడానికి అవకాశంగా మారుతుంది. ఆడపిల్లలు ధైర్యంగా సమస్యలను ఎదురొడ్డి నిలబడేలా వారిని తీర్చిదిద్దాలి. – పక్కుర్తి కుమారి, ఉపాధ్యాయుని -
ఏజే కళాశాలలో అంతా ఫెయిల్..
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: ఇంటర్మీడియెట్ ఫలితాల సాధనలో కృష్ణా జిల్లా అగ్రగామిగా నిలిచినా.. మచిలీపట్నంలోని కొన్ని కళాశాలల ఫలితాలు మాత్రం దయనీయంగా వచ్చాయి. మచిలీపట్నంలోని ఏజే (ఆంధ్రజాతీయ) కళాశాల నుంచి 11 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, మొదటి సంవత్సరం ఫలితాల్లో ఇక్కడి విద్యార్థులంతా ఫెయిలయ్యారు. జిల్లాలో 22 ఎయిడెడ్ కళాశాలలు ఉండగా, ఇక్కడి విద్యార్థులు సాధించిన ఫలితాల మేరకు ర్యాంకులను ఇంటర్మీడియెట్ అధికారులు ప్రకటించారు. ఏజే కళాశాల నుంచి 11 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరుకాగా ఒక్కరు కూడా పాస్‌కాకపోవటంతో ఈ కళాశాలకు సున్నా వేశారు. దీంతో ఫలితాల్లో అట్టడుగున నిలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. అదే విధంగా హిందూ ఎయిడెడ్ కళాశాలలో ఎంపీసీ, సీఈసీ గ్రూపుల నుంచి 65 మంది పరీక్షలు రాయగా, ఇందులో ఐదుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపు నుంచి 21 మందికి ముగ్గురు పాసయ్యారు. సీఈసీ గ్రూపు నుంచి 44 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న ఆయా కళాశాలల్లో ఇంత అధ్వానంగా ఫలితాలు రావటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విద్యార్థులు, యువతే టార్గెట్
సుల్తాన్‌బజార్: నర్కోటిక్ డ్రగ్స్, గంజాయి, లిక్విడ్ డ్రగ్స్, డ్రగ్స్ సిగరెట్స్‌ను అమాయక విద్యార్థులకు విక్రయిస్తున్న ఓ యువకుడిని సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుల్తాన్‌బజార్ ఏసీపీ దేవేందర్, ఇన్స్పెక్టర్ సుబ్బారామిరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. నాంపల్లి రెడ్‌హిల్స్‌కు చెందిన షేక్ ఇమ్రాన్(25), డ్రగ్స్‌కు బానిసయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తుల వద్ద డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేసి వాటిని తానూ వినియోగించుకుంటూ యువతకు విక్రయిస్తుంటాడు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంట చౌరస్తాలోని బంగారు మైసమ్మ అలయం వద్ద వాహన తనికీలు నిర్వహిస్తున్న పోలీసులు షేక్ ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద 10 ప్యాకెట్ల గంజాయి ముడిసరుకు, గంజాయితో నింపిన 5 సిగరేట్స్, 3 బాటిళ్ల లిక్విడ్ నర్కోటిక్ డ్రగ్స్ లభించాయి. దీంతో అతడి అదుపులోకి తీసుకుని విచారించగా మత్తు పదార్థాలకు బానిసైన విద్యార్థులు, యువతకు విక్రయిస్తుంటానని తెలడంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి ప్యాకెట్లు, లిక్విడ్ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును డీఎస్ఐ నరేష్ దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
కర్ణాటక, యశవంతపుర: ఓ యువతి విషయంపై ఇద్దరు కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసిన ఘటన నగరంలోని బాగలగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు... ఇక్కడి రామయ్య లేఔట్‌లోని సౌందర్య కళాశాలలో దయాసాగర్, రక్షిత్‌లు ద్వితీయ పీయూసీ చదువుతున్నారు. అదే కళాశాలలో చదువుతున్న అమ్మాయిని వీరు ఇద్దరు ప్రేమిస్తున్నారు. బుధవారం ఉదయం ఇద్దరు కళాశాలకు వచ్చారు. ప్రేమ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. సహచర విద్యార్థులు అడ్డుకున్నారు. అనంతరం దయాసాగర్ సమీపంలోని వాష్‌రూమ్ వద్దకు వెళ్లాడు. అంతకు ముందే చాకుతో వచ్చిన రక్షిత్ దయాసాగర్‌పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న దయాసాగర్‌ను కళాశాల సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగానే దయాసాగర్ మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ‘మ్మత్తు’గా గంజాయి దందా
తూప్రాన్: తూప్రాన్ పట్టణానికి బతుకుదెరువు కోసం ఓ కుటుంబం పది సంవత్సరాల క్రితం వచ్చింది. వీరికి ఏకైక కుమారుడు. మంచి ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చేర్పించారు. అయితే కుమారుడు స్థానికంగా ఉన్న తన స్నేహితులతో కలిసి సరదాగా తిరగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో చేడు వ్యసనాలకు బానిసగా మారాడు. తల్లిదండ్రులు మందలించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తూప్రాన్‌లో యువకుల అడ్డాలు... పట్టణంలోని గోల్డెన్పార్కు, నర్సాపూర్ చౌరస్తాలోని హోటల్, పట్టణ సమీపంలోని పెద్ద చెరువుకట్ట, పట్టణ సమీపంలో నూతనంగా వెలసిన వెం చర్లు, బ్యాచ్లర్స్ నివాసం ఉంటున్న అద్దెగదుల ను వాడుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో గంజాయి ని సిగరేట్లలో కలిపి తాగుతున్నారు. బాంకు, ఓసీ బీ అనే పేపరులో గంజాయిని నింపి సిగరేటుగా తయారు చేసుకొని తాగుతున్నట్లు సమాచారం. పల్లెలపై దృష్టి సారించిన అక్రమార్కులు.. హైదరాబాద్‌లో పోలీసుల నిఘా పెరిగిపోవడంతో గంజాయీ మాఫియా పల్లే ప్రాంతాల్లోని యువతపై దృష్టి సారించినట్లు తెలస్తుతోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని కొందరు యువకులతో పరిచయం పెంచుకుని అమ్మకాలు చేయిస్తోంది. వీరిలో ఎక్కువగా మధ్యతరగతి వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. ప్రకటనలకే పరిమితమైన అవగాహన.. మత్తు పదర్థాల వాడకంపై యువతకు అవగాహన కల్పించాల్సిన అధికారులు అటువైపుగా ఎలాంటి కార్యచరణ చేపట్టకపోవడం, కళాశాలల్లో పెడదోవ పడుతున్న వారిపై దృష్టి సారించి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసం ఎంతైన ఉంది. మత్తుబారిన పడిన వారిలో లక్షణాలు... మత్తుకు అలవాటు పడిన వారు నరాల బలహీనత, మెదడు మొద్దుబారడం, శరీరంలోని ఇత ర వ్యవస్థలు నియంత్రణలో ఉండకపోవడం, శరీరం తేలికపడినట్లు అయి కొద్ది సమయం తర్వాత కొత్తశక్తి వచ్చినట్లు అవుతుంది. మొదట నాడీవ్యవస్థ, మెదడు, కండరాలు వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. తర్వాత తమ ఆధీనం కోల్పోయి వెలుగును చూడలేరు. అధిక శబ్ధాలను వినలేరు. ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎవరితో సరిగా మాట్లాడరు. డ్రగ్స్, గంజాయి లభించకపోతే సైకోలాగా తయారువుతారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో అల్సర్ బారినపడతారు. నాసికరంధ్రాలు వాసనను పసిగట్టే శక్తిని కోల్పోతాయి. సిగరేట్ల రూపంలో పీల్చేవారికి నాలుక రుచిని కోల్పోతుంది. ఊపిరితిత్తుల వ్యవస్థ గోడలు నాశనమై చివరకు మరణానికి దారితీస్తుంది. మత్తు పదార్థాలు తీసుకున్న వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. తమ చుట్టూ ఎం జరుగుతుందో కూడా గమనించరు. ఆ సమయంలో వారు ఏం చేస్తారో కూడా వారికి అర్థంకాదు. ఇంట్లోవారు గానీ.. మిత్రులుగానీ గమనిస్తే వీరిలో చాలా తేడాలు కనిపిస్తాయి. వీరికి వెంటనే వైద్యం సహాయం అందిస్తే త్వరగా బయటపడే అవకాశాలుంటాయి. గంజాయి మత్తులో.. స్నేహితులతోనో.. సరదాగానో వీటివైపు ఆకర్షితులైన యువకులు ఆ అలవాటును వ్యసనంగా మార్చుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత మత్తు లేకుంటే బతకలేమనే స్థితికి దిగజారుతున్నారు. కేవలం యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొందరు గంజాయి వంటి మత్తు పదార్థాలను ఇతర ప్రాంతాలనుంచి పట్టణానికి యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ కేంద్రంలో పలువురు యువకులు జల్సాలు, షికార్లు, చెడు వ్యసనాలకు బానిసలై దారి తప్పుతున్నారు. తెలిసీతెలియని వయసులో నేరాలకు పాల్పడుతున్నారు. పలు కేసుల్లో చిక్కుకొని జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జిల్లాలో పట్టుబడిన పలు దొంగతనాల కేసుల్లో యువకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆయా కేసుల్లో యువకులను పోలీసులు విచారించే సమయంలో సరదాకోసం, తల్లిదండ్రులు డబ్బు ఇవ్వకపోవడం, ప్రియురాలికి కానుకలు ఇవ్వడంకోసం అంటూ వెల్లడించడం పోలీసులకు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం. తూప్రాన్ పట్టణానికి మేడ్చెల్, కొంపల్లి, హైదరాబాద్, చేగుంట, కామారెడ్డి నుంచి కొందరు వ్యక్తులు గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిగరెట్లలో గంజాయి నింపుతూ ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక కోడ్లతో అమ్ముతున్నారు. 10 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకేట్‌ను రూ.100 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. చర్యలు తీసుకుంటాం.. తూప్రాన్‌లో గంజాయి వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదు. యువత పట్ల ఎప్పటికప్పుడూ సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా పెంచాం. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చెడు వ్యసనాలకు గురికాకుండా వారిపై పర్యవేక్షణ ఉండాలి. మంచి స్నేహితులు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గంజాయి విక్రయించడం చట్టరీత్య నేరం. గంజాయి విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – లింగేశ్వర్‌రావు, సీఐ, తూప్రాన్ దశాదిశాలేని చదువే కారణం... యవత విలువైన దుస్తులు, షూస్ ధరించాలని, ఖరీదైన కార్లలో, బైక్‌లపై తిరగాలని, విలాసవంతమైన జీవితం గడపాల ని కలలు కంటున్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కష్టపడడం కంటే... దొడ్డిదారిన వారికి కావాల్సిన వాటి కో సం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం విద్యా విధానంలో విద్యార్థి ప్రతిభకు మార్కులే కొలమానంగా మారాయి. జ్ఞానం నేర్పుతున్నారనేగానీ నైతిక విలువలు, నీతి, నిజాయితీ, మంచి –చెడు, పెద్దలంటే గౌరవం నేర్పించడంలేదు. – మోత్కు రాంచంద్రం, మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు -
విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం
-
సీఎం చంద్రబాబు ప్రచారానికి కాలేజీ విద్యార్ధులు
-
వైఎస్ జగన్‌ను ప్రత్యక్షంగా చూడాలని..
సాక్షి, పార్వతీపురం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ.. ప్రజలకు నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం జననేత పార్వతీపురం నియోజకవర్గంలోని తామరఖండి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. జననేత రాక కోసం ప్రజలు వేచిచూస్తున్నారు. హత్యాయత్నం జరిగిన తరువాత జననేత ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలనే కోరికతో తామరఖండి కళాశాల విద్యార్థినిలు ప్రజాసంకల్పయాత్ర జరుగుతున్న చోటుకు తరలివచ్చారు. వైఎస్ జగన్ ఆరోగ్యం ఎలా ఉందో ప్రత్యక్షంగా చూడాలని అక్కడికి చేరుకున్న విద్యార్థినులు ఆయనను కలుసుకున్నారు. జననేతను ఆరోగ్యంగా చూసిన వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో తమ ప్రాంతం నుంచి బొబ్బిలి వరకు తగినని బస్సులు నడిచేవని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ బస్సులు లేక పది గ్రామాలకు చెందిన విద్యార్థులు కాలేజీలకు, పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీలో చేరిన 2వేల మంది.. పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం, బలిజిపేట మండలల్లోని ఎనిమిది పంచాయితీలకు చెందిన నలుగురు సర్పంచ్‌లు, నలుగురు ఎంపీటీసీలు జననేత సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిని జననేత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు రెండువేల మంది కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. -
మత్తు.. చిత్తు
సాక్షి, జనగామ: అమాయక యువతను మత్తు మాఫి యా విష వలయంలోకి లాగుతోంది. హైదరాబాద్ కల్చర్ జిల్లాకు అంటుకుంది. ఇన్నాళ్లు పెద్దలకే పరిమితమైన గంజాయి వ్యసనం ఇప్పుడు యువతను చెడగొడుతోంది. నిషేదిత గంజాయి విక్రయాలను కొందరు యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసిన మత్తు మాఫియా వారిని నాశనం చేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. కొంతమంది యువత అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న వారు.. ‘మత్తు’లోకి దింపుతూ.. బానిసలుగా మార్చేస్తున్నారు. రేపటి తరానికి దిక్సూచిగా నిలవాల్సిన యువత అడ్డదారిని ఎంచుకుంటున్నారు. ప్యాకెట్ మనీల పేరుతో తల్లిదండ్రుల గారాబంతో మరింత నాశనమవుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంగా గంజాయి ప్యాకెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే ప్రచారం సాగుతుంది. గతంలో పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకోగా బచ్చన్నపేట, రఘునాథపల్లిలో పెద్ద ఎత్తున పట్టుబడిన సంగతి తెలిసిందే. విద్యార్థులే లక్ష్యంగా.. అడ్డదారిలో డబ్బులు సంపాదనే లక్ష్యంగా కొంతమంది జనగామ కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలను సాగిస్తున్నట్లు సమాచారం. గంజాయిని హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి.. చిన్న చిన్న ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, గుంటూరు తదితర పట్టణాల నుంచి ఇక్కడికి గంజాయి సరఫరా అవుతున్నట్లుగా తెలుస్తుంది. అర్థరాత్రి సమయంలో రహస్య ప్రదేశాలకు తరలిస్తూ.. 10 గ్రాముల ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేస్తూ..డంపింగ్ చేస్తున్నారు. ఎవరికి అనుమానం కలుగకుండా..జిల్లా కేంద్రంలోని వారికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలతో పాటు కళాశాలల వద్ద గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నా చా కచక్యంగా తప్పించుకుంటూ గంజాయి అమ్మకా లు సాగుతున్నాయని సమాచారం. జిల్లా కేంద్రం చుట్టూ.. సిద్దిపేట, సూర్యపేట, వరంగల్, హైదరాబాద్ రహదారుల శివారులో సాయంకాలం 6 గంటల ప్రాంతం నుంచి రాత్రి 10 గంట ల వరకు గంజాయి పీలుస్తూ.. అనుభూతి పొం దినట్లుగా బ్రమపడుతున్నారు. స్థానికంగా నమ్మకం ఉన్న వారికి పెద్ద ఎత్తున కమీషన్ల ఎరచూపిస్తూ గంజాయి ప్యాకెట్లను అమ్మకాలు చేయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒక్కసారి పీలిస్తే.. గంజాయి ఆకును ఒక్కసారి పీల్చిన యువత.. దూరం కావాడం చాలా కష్టం. ప్రతి వ్యక్తి శరీరంలో ఆల్కహాల్ ఎంత అవసరమో అంతే ఉండాలి. అవసరమైన దాని కంటే ఎక్కువగా డ్రగ్స్ తీసుకు వారి ఆయుష్సు రోజు రోజుకు తగ్గిపోతుంది. అంతే కాకుండా ప్రతి రోజు సమయానుకూలంగా మత్తు కావాలనే కోరిక పుడుతుంది. పొడి గంజా యితో పాటు ఇంజక్షన్ల రూపంలో కూడా వీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. మత్తు ఇంజక్షన్లను తీసుకోవడం వల్ల పూర్తిగా నరాల వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. మత్తు దొరకని సమయంలో దీనికి అలవాటు పడిన వారు ఒక్కోసారి విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడి చేసే ప్రమాదం లేకపోలేదు. అంతే కాకుండా సైకోగా మారే అవకాశం ఉంటుంది. దర్జాగా అమ్మకాలు.. పోలీసులకు.. పౌరులకు అనుమానం రాకుండా చాలా చోట్ల గంజాయి ఉన్న సిగరెట్లను అమ్మకా లు చేస్తున్నారు. గతలో జనగామ జిల్లా కేంద్రంలో విదేశీ సిగరెట్లతో పాటు గుట్కా అమ్మకాలు చేస్తు న్న వారిని పోలీసులు పట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయం కావడంతో అధి కారులు.. పోలీసు నిఘాతో పాటు బార్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. తనిఖీలను తప్పించుకునేందుకు విద్యార్థుల రూపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ.. హైదరాబాద్ నుంచి ఇక్కడకు పెద్ద ఎత్తున గం జాయిని సరఫరా చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు డబ్బుల కోసం తల్లిదండ్రులను పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసిన సంఘటనలు కోకొల్లలు. పీడీ యాక్టు తప్పదు గుట్కా, గుడుంబా, గంజాయి, హుక్కా అమ్మకాలు చేస్తూ రెండుసార్లు పట్టుబడితే పీడీ యాక్టు నమోదు చేస్తాం. వీటి అమ్మకాలపై గట్టి నిఘా వేసినం. అమ్మకాలు చేస్తూ పట్టుబడితే ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గుడుంబా, గుట్కా అమ్మకం దారులను తహసీల్దార్ ఎదుట రూ.లక్ష పూచీకత్తు జమానత్ తీసుకుంటున్నాం. ఒక సారి కేసు నమోదైన వారు తిరిగి విక్రయిస్తే.. లక్ష జప్తు చేయడమే కాకుండా క్రిమినల్ చర్యగా భావిస్తాం. గంజాయి, గుట్కా అమ్మకాలపై కఠినంగా వ్యవహరిస్తాం. వినోద్‌కుమార్, ఏసీపీ, జనగామ -
అమ్మాయి కోసం ఘర్షణ
అనంతపురం సెంట్రల్: అమ్మాయి కోసం విద్యార్థులు ఘర్షణపడ్డారు. ఏకంగా రాళ్లు, కట్టెలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో గొడవ సద్దుమణిగింది. వివరాల్లోకెళితే.. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల వసతి గృహంలో మంగళవారం ఇద్దరు విద్యార్థులు అమ్మాయి విషయంలో గొడవపడ్డారు. తొలుత జూనియర్ విద్యార్థిపై సీనియర్లు చేయి చేసుకున్నారు. దీంతో సదరు విద్యార్థి బంధువులను వెంటతీసుకుని సాయంత్రం ఆర్ట్స్ కళాశాల వసతిగృహం వద్దకు వచ్చాడు. సీనియర్లతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఒకరికొకరు కొట్టుకున్నారు. జూనియర్ విద్యార్థికి మద్దతుగా వచ్చిన బాలు అనే యువకుని తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో వసతిగృహం విద్యార్థులు భయాందోళన చెందారు. బయట వ్యక్తులు వసతిగృహంలోకి వచ్చి కొడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందించారు. త్రీటౌన్ ఎస్ఐ క్రాంతికుమార్ సిబ్బందితో వచ్చి జరిగిన విషయంపై ఆరా తీశారు. గాయపడిన బాలును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గొడవ పడ్డ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి వదిలేశారు. త్రీటౌన్ సీఐ మురళీకృష్ణను వివరణ కోరగా.. విద్యార్థుల మధ్య చిన్న గొడవ జరిగిందని, అప్పుడే అది సద్దుమణిగిందన్నారు. -
4 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ, ఇంటర్మీడియెట్, ఇతర వృత్తివిద్యా కాలేజీలకు చెందిన సుమారు 4 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత అమలు చేయాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. విద్యార్థులకు పోషక విలువలుగల భోజనం అందించేందుకు కావాల్సిన మెనూ, వాటి ధరల నివేదికను ఈ నెల 6న ప్రభుత్వానికి సమర్పించాలని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు సూచించింది. నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించాక పథకం అమలుపై ఆయన నిర్ణయం ప్రకటిస్తారని కమిటీ తెలిపింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నలతో కూడిన కమిటీ శుక్రవారం సచివాలయంలో భేటీ అయింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఈడీ, డీఈడీ, మోడల్ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు అవసరమైన వసతులను సమకూర్చుకోవాలని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కమిటీ సూచించింది. ఈ సూచనకు అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు అంగీకరించారు. వీలైనంత త్వరలో వంటగదులు ఏర్పాటు చేస్తామని, 2, 3 రోజుల్లో తమ నివేదికను అందిస్తామన్నారు. కాలేజీల విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతను తెలుసుకునేందుకు మంత్రులు ఈ సందర్భంగా వంటకాలను రుచి చూశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, మోడల్ జూనియర్ కాలేజీల డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ కడుపులతోనే కాలేజీకి..
మంచిర్యాలఅర్బన్ : ‘‘ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నభోజనం ప్రవేశపెడుతాం.. విద్యార్థులకు రుచిక రమైన భోజనం అందిస్తాం..’’ అని ప్రభుత్వం ప్రకటించినా పథకం అమలుపై ఇంతవరకు ఆదేశాలు జారీ కాలేదు. జూన్ ఒకటి నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఇంతవరకు కాలేజీల్లో మధ్యాహ్నభోజన పథకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్నభోజన పథకం ఈ విద్యాసంవత్సరం నుంచి అమలువుతుందో.. లేదో అనే అనుమానాలు విద్యార్థులు, అధ్యాపకుల్లో వ్యక్తమవుతున్నాయి. గత నెల 21 నుంచి నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ప్రయివేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మూడేళ్లుగా మధ్యాహ్నభోజన ప«థకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిస్తూ వస్తోంది. అలాగే ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు అందించిందే తప్ప మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేయడంలో విఫలమైంది. దీంతో విద్యార్థులు ఖాళీ కడుపులతోనే కళాశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూరప్రాంత విద్యార్థులకు ఇక్కట్లే.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఆరాటపడుతున్నా ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదు. జిల్లాలో మంచిర్యాల, మందమర్రి, కాసిపేట్, చెన్నూర్, బెల్లంపల్లి (బాలురు), బెల్లంపల్లి (బాలికలు), జైపూర్, జన్నారం, దండేపల్లి, లక్సెటిపేట్లలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీతో పాటు వృత్తివిద్యా కోర్సులైన ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, సీఎస్సీ కోర్సులు నిర్వహిస్తున్నారు. 2016–17 విద్యా సంవత్సరం 1800 మంది విద్యార్థులు చదువుకోగా.. 2017–18 విద్యాసంవత్సరంలో 2800 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. జిల్లాలో 18 మండలాలకు గాను తొమ్మిది మండలాల్లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. భీమిని, తాండూర్, నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి మండలాలతో పాటు కొత్తగా ఏర్పడిన హాజీపూర్, కన్నెపల్లి, నస్పూర్, భీమారం మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆయా మండలాల విద్యార్థులు సమీప మండల కేంద్రాల్లోని కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కళాశాలకు ఉదయం 9.30 గంటలకు వెళ్లాలంటే రెండు గంటలు ముందుగానే అంటే ఉదయం 7గంటలకే విద్యార్థులు ఇళ్లనుంచి బయల్దేరాల్సి వస్తోంది. పేద విద్యార్థుల ఇళ్లలో ఉదయం వంట కాకపోవడంతో అల్పాహారం తీసుకోకుండానే కళాశాలలకు వెళ్తున్నారు. మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతో అలమటించాల్సిందే. ఆర్ధాకలితో ఉన్న విద్యార్థులకు అధ్యాపకులు బోధించే పాఠాలు అర్థంకాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఈసారి మధ్యాహ్నభోజనం అమలు చేస్తామని వెల్లండించినప్పటికీ ఖచ్చితమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దాతలపైనే భారం.. విద్యార్థుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని గతేడాది నుంచి కొన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాతలు ముందకు వచ్చి మధ్యాహ్నభోజనం అమలు చేశారు. లక్సెట్టిపేట్, దండేపల్లి, మంచిర్యాల ప్రభుత్వ కళాశాలల్లో మంచిర్యాలకు చెందిన ఛత్రపతి సాహు మహరాజ్ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఆరె శ్రీనివాస్ నేతృత్వంలో మధ్యాహ్నభోజనం అందించారు. పరీక్షలకు నాలుగునెలల ముందు నుంచి రోజుకు 926 మందికి భోజనం వడ్డించడంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివెరిసింది. అలాగే చెన్నూర్, జైపూర్, మందమర్రి జూనియర్ కాలేజీల్లో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు విద్యార్థుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేశారు. ఈసారి ప్రభుత్వం అమలు చేయకుంటే మళ్లీ స్వచ్ఛంద సంస్థలే ఆధారం కానున్నాయి. ఉత్తర్వులు రాలేదు.. ఈ విద్యాసంవత్సరంలో మధ్యాహ్నభోజన పథకం అమలుపై అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో పథకాన్ని అమలు చేస్తే విద్యార్థుల హాజరు శాతం పెరిగి, మెరుగైన ఫలితాలు సాధించేందకు అవకాశం ఉంటుంది. అయితే కళాశాలల ప్రారంభం తర్వాత దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. – బీనారాణి, డీఐఈవో కళాశాలలు బలోపేతం.. మ«ధ్యాహ్నభోజనం పథకం అమలుతో ప్రభుత్వ కళాశాలలు బలోపేతం అవుతాయి. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, మధ్యాహ్నం సమయంలో లంచ్‌బాక్స్ తీసుకురాకపోవడంతో విద్యార్థులు నీరసంగా ఉంటారు. దీంతో మధ్యాహ్నం సమయంలోనే కొంత మంది విద్యార్థులు ఇంటికి వెళ్లిపోతున్నారు. తద్వారా హాజరుశాతం తగ్గుతోంది. – లక్ష్మన్‌రావు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంతో ప్రయోజనం.. కళాశాలల్లో మధ్యాహ్నభోజనం ప్రవేశపెడుతున్నారని ప్రకటించడంతో సంతోషించాను. తీరా చూస్తే పథకం ఊసేలేదు. మధ్యాహ్నభోజనంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. గత విద్యాసంవత్సరంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పరీక్షల సమయంలో మధ్యాహ్నభోజనం పెట్టడంతో మాలాంటి ఎంతో మందికి మేలు జరిగింది. – ప్రవీణ్, ఇంటర్ ఉత్తీర్ణత విద్యార్థి -
93 మంది పాస్...143 మంది ఫెయిల్...
సాక్షి ప్రతినిధి, కడప: అది పేరెన్నికగన్న ప్రతిభ కళాశాల. పులివెందుల సమీపాన ఇప్పట్ల వద్ద ఉన్న దీని పేరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్. అందులో సీటు సంపాదించాలంటే ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాల్సిందే. అలా వడపోత ద్వారా ఎంపిక చేసుకున్న మెరికలకు మరింత పదునుపెట్టి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. కాగా ఈ మహోన్నత లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. పట్టించుకునేవారు లేకపోయే సరికి అధ్యాపకులు సైతం విద్యార్థులను గాలికి వదిలేశారు. మొదట్లో వందశాతం ఫలితాలు సాధించిన ఆ కళాశాల ఈ ఏడాది కేవలం 39శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో గురుకులాలల్లో అట్టడుగు స్థానానికి దిగజారింది. ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి మంచి ప్రమాణాలున్న ఇంటర్ విద్యతోపాటు, ఎంసెట్, ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల వద్ద సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సును నెలకొల్పారు. లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపాన 2006 నవంబర్ 1న కళాశాల భవనాలకు శంకుస్థాపన చేయగా, 2010 అక్టోబర్ 29నుంచి ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్, కర్నూల్, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన బాలబాలికలకు ఇక్కడ ప్రవేశం ఉంటుంది. 2012–13 విద్యా సంవత్సరం 100శాతం ఫలితాలు సాధించడమే కాకుండా విద్యార్థులంతా ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణలైన ఘన చరిత్ర ఈ కళాశాలకు ఉంది. ఆ తర్వాత ఉత్తీర్ణత శాతం క్రమేపీ తగ్గిపోయింది. ఇందులో ఇంటర్ ప్రవేశం కోసం 2016 ఏప్రిల్ 23తేదీన నిర్వహించిన ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులు ఇక్కడి గురుకులంలో రెండేళ్లు చదివి 2018 మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. 93 మంది పాస్...143 మంది ఫెయిల్... 2018 మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఈ కళాశాల నుంచి 120 మంది విద్యార్థులు హాజరు కాగా, కేవలం 40మంది మాత్రమే పాస్ అయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 116 మందికి గాను 53 మంది పాస్ అయ్యారు. అంటే ప్రథమ సంవత్సర పరీ„ýక్షల్లో 33శాతం, ద్వితీయ ఏడాదిలో 46శాతం సగటున 39శాతం మంది పాస్ అయ్యారన్నమాట. మొత్తం 236 మందికి గాను 143మంది ఫెయిల్ కాగా, వీరిలో అత్యధికులు కెమీస్ట్రీ, బాటనీ సబ్జెక్టుల్లో తప్పారు. విచారకర విషయం ఏమిటంటే ఈ సబ్జెక్టుల్లో కూడా చాలా మందికి ఒక్కమార్కు, సున్నా మార్కులు వచ్చాయంటే ఇంకా సబ్జెక్టు బోధించిన అధ్యాపకులు ఎంతటి ఘనులో ఇట్టే అర్థం అవుతోందని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రమశిక్షణ కరువే... అసలే కళాశాల స్థాయి అమ్మాయిలు...ఆపై టీనేజ్ అబ్బాయిలు...సమాంతర తరగతుల నిర్వహణ...పక్కపక్కనే బాలుర, బాలికల హాస్టల్ గదులు...దీనికి తోడు కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న కుర్రకారు అయ్యవార్ల భోదన...సరైనా కట్టుబాట్లు లేకపోతే పరిస్థితి చేయి దాటుతుందనడం బహిరంగ రహస్యం. ఈనేపధ్యంలో కళాశాలకు బలమైన పరిపాలనాదక్షుడు ఎంతో అవసరం. గత కొన్నేళ్లుగా ఈ కళాశాలకు అలాంటి వారు కరువయ్యారు. ఇక్కడ జరుగుతోన్న రహస్యాలను నాలుగు గోడల మ«ధ్య దాచేయాలని ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు బయటకు పొక్కుతూ వచ్చాయి. సమస్య మరింత తీవ్ర రూపం దాల్చకముందే ఇక్కడి నుంచి అటు బాలురనో, ఇటు బాలికలనో పంపివేయాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు 2017–18 విద్యా సంవత్సరంలో బాలురకు ఇక్కడ ప్రవేశం నిలిపేశారు. 2016–17 విద్యా సంవత్సరంలో చేరిన బాలురు సైతం ఈ ఏడాది బయటికి వెళ్లిపోనున్నారు. ఇక నుంచి అంతా బాలికలే, కాబట్టి అధ్యాపకులను సైతం మహిళలనే నియమిస్తే ఇక ఆ సమస్యకు పుల్‌స్టాప్ పడినట్లే. రెగ్యులర్ అధ్యాపకులు కరువు... ఇక్కడ ఒకరిద్దరు తప్పితే మిగిలిన వారంతా కాంట్రాక్టు అధ్యాపకులే. వీరిలో కొందరు పాఠాలు చెప్పకుండా ఏడాది పొడవునా పిచ్చాపాటి మాటలకు ప్రాధాన్యత ఇస్తూ పొద్దుపుచ్చారని తెలుస్తోంది. ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల మధ్య అసలు సయోధ్య లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 2016–17 విద్యా సంవత్సరంలో పనిచేసిన ప్రిన్సిపల్ ఒకింత బాధ్యత తీసుకున్నా అధ్యాపకులు అతని మాట అసలు లెక్కచేసేవారు కాదని సమాచారం. పైగా కళాశాల పేరుకే ఇంగ్లీషు మీడియం అయినప్పటికీ ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకుల్లో కొందరికి ఇంగ్లీషుపై పట్టు లేదని తెలుస్తోంది. ఇక్కడ సొంత నోట్స్, కాలేజీ మెటీరియల్ అసలు ఉండదు. మార్కెట్లో దొరికే గైడ్లను ఫాలో కావాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వివరిస్తున్నారు. ఫలితంగా పదుల సంఖ్యలో విద్యార్థులు, నాలుగైదు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు. రెండేళ్లపాటు రేయింబవళ్లు పాఠాలు బోధించి, లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసినా సాధించిన ఫలితాలు అధ్వానం ప్రస్తుత కలెక్టర్ చేవూరి హరికిరణ్ ప్రతిభ కళాశాల ఫలితాలు అధ్వానంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి, నిర్లక్ష్యానికి కారకులపై చర్యలు తీసుకుంటే తప్పా భవిష్యత్‌లో మార్పు రాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నెలాఖరులోగా స్కాలర్షిప్లు!
సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీకి సంక్షేమ శాఖలు కసరత్తు ప్రారంభించాయి. కోర్సు ముగిసేలోగా స్కాలర్ షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించాయి. 2017–18 విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 13.28 లక్షలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని శాఖలవారీగా విభజించి.. ప్రత్యేకాధికారులను నియమించి దరఖాస్తుల పరీశీలన చేపట్టింది. ముందుగా జనరల్ కోర్సులకు... వృత్తి విద్యా కోర్సులు ఏప్రిల్ నెలాఖరులోగా ముగియనున్నాయి. ఈ క్రమంలో ముందుగా జనరల్ కోర్సుల విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాలని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థుల దరఖాస్తులను ముందుగా పరిశీలిస్తున్నారు. మొదటగా చివరి సంవత్సరం విద్యార్థులకు, ఆ తర్వాత జూనియర్లకు ఉపకారవేతనాలు ఇవ్వనున్నారు. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలకు సంక్షేమ శాఖల వద్ద నిధులు అందుబాటులో ఉన్నాయి. మూడో త్రైమాసికంతోపాటు త్వరలో విడుదల కానున్న నాల్గో త్రైమాసికం నిధుల నుంచి వీటిని విడుదల చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖతోపాటు గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలు స్కాలర్షిప్ క్లియరెన్స్ బిల్లులను తయారు చేస్తున్నారు. వచ్చేవారం నుంచి ఆయా బిల్లులను ఖజానా శాఖకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. -
చదువులో దూసుకెళ్తాం..
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళలు చదువుకుంటే కుటుంబమంతటికీ ప్రయోజనం చేకూరుతుంది. ఇంటిలో అన్ని వ్యవహారాలు సమర్థంగా చక్కదిద్దుకుంటుంది. సారథిగా ఇంటిని నడిపిస్తుంది..అందుకే ఈనానుడి.. ఆడపిల్లకు పెద్ద చదువులవసరం లేదు..కొద్దో గొప్పో చదివించి పెళ్లి చేస్తే పోతుందనే భావన ఎక్కువ మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే ఇప్పుడిప్పుడే కొంత చైతన్యం వస్తోంది. ఆడపిల్లలు చదువుకుని రాణిస్తే వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలరనే భావన ఏర్పడుతోంది. మహిళలు ఆర్థిక బలం పెంచుకుని ధైర్యవంతులుగా జీవితాన్ని సాగిస్తారని తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో సైతం వీరి శాతం పెరుగుతోంది. దూర ప్రాంత చదువులకు మగపిల్లల్ని పంపినట్టే ఆడపిల్లలనూ పంపడానికి తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. తిరుపతిలో జరుగుతున్న అగ్రిఫెస్టుకు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలు వచ్చారు. వారిని ఇదే కోణంపై ‘సాక్షి’ ప్రశ్నించినప్పుడు వారంతా సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. చదువుల విషయంలో వివక్ష తగ్గిందని.. తల్లితండ్రుల్లో ఈమార్పు ఇంకా పెరగాలని వారంతా ఆకాంక్షించారు. వారేమంటున్నారో తెలుసుకుందాం. – యూనివర్సిటీ క్యాంపస్ జమ్మూలో తగ్గుతున్న వివక్ష మా ప్రాంతంలో స్త్రీలపై వివక్ష తగ్గింది. సాధారణంగా జమ్ముకాశ్మీర్ అంటే హింసాత్మక వాతావరణం ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. విద్యాసంస్థల్లో, సమాజంలో మహిళల్లో వివక్ష తగ్గింది. దీనివల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. జమ్ముకాశ్మీర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్త్రీ,పురుషులకు సమాన అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు పరస్పరం సహకరించుకుంటున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యలో సమాన అవకాశాలు వస్తున్నాయి. – మన్విత్ కౌర్, జమ్ము కాశ్మీర్ పూర్తి స్వేచ్ఛ ఉంది వ్యవసాయ విద్యాలయంలో బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నాను. సాధారణంగా అమ్మాయిలంటేనే ఆంక్షలుంటాయి. అయితే గతంతో పోల్చితే పరిస్థితి మారింది. మా తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చారు. దానివల్లే ఇలాంటి యువజనోత్సవాలకు వెళ్ళగలుగుతున్నాను. నాటితో పోల్చుకుంటే చాలా మార్పులు వచ్చాయి. సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు ఇందుకు దోహదపడుతున్నాయి.. –అనామిక శర్మ, జమ్మూ కాశ్మీర్ పరిస్థితులు మారాయి మా తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం వల్ల చదువులో రాణిస్తున్నాను. పూర్వపు రోజుల్లో మహిళలకు విద్య ఎందుకు అన్న వివక్ష ఉండేది. ఆడపిల్లల్ని స్కూళ్లకు పంపేవారు కాదు. విద్య మహిళలకు అవసరం లేదనుకునేవారు. ఇప్పుడు ఆలోచనల్లో మార్పులొచ్చాయి. దీనివల్ల అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారు. మేం పురుషులకు ఏమాత్రం తీసిపోము. – గురుసేన్కౌర్,జమ్మూకాశ్మీర్ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఇప్పుడు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు పెరి గాయి. తల్లిదండ్రులు కూడా పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. కోరుకున్న చదువు, ఉద్యోగం తదితర అంశాల్లో స్వేచ్ఛ పెరిగింది. మా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను ఎలాంటి వివక్షకు గురికాలేదు. వివక్ష నగరాల్లో పూర్తిగా తగ్గింది. ఇది మరింత విస్తృతం కావాల్సిన అవసరముంది. – హిధన్సీ అబ్రల్, జమ్మూకాశ్మీర్ స్త్రీలకు అనుకూల వాతావరణం నాన్న అంబుజా సిమెంట్ కంపెనీలో పనిచేస్తారు. కుటుంబంలో ముగ్గురం ఆడపిల్లలమే. అయినప్పటికీ అందరినీ చదివిస్తున్నారు. ఇటీవల కాలంలో మహిళలకు పురుషులకన్నా అవకాశాలు పెరిగాయి. దీంతో స్త్రీలు గడప దాటి సమాజంలోకి వెల్లగలుగుతున్నారు. స్త్రీ రిజర్వేషన్ల వల్ల పురుషులకన్నా మహిళలకే అకాశాలు పెరిగాయి. – జోషి ముద్ర, గుజరాత్ 70 శాతం మంది అమ్మాయిలే తమిళనాడులోని కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను. యువజనోత్సవాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మా యూనివర్సిటీలో 70 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు. భవిష్యత్తులో చదువుకునే అమ్మాయిల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాను. – మోషీనా, తమిళనాడు కెరీర్‌పై దృష్టి పెట్టాలి ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ చదువుతున్నాను. మా తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం, నాన్న ప్రైవేటు ఉద్యోగి. ఇంట్లో నాపై ఎలాంటి వివక్ష లేదు. గత ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన యువజనోత్సవాల్లో పాల్గొన్నాను. తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛ వల్లే వెళ్లగలుగుతున్నాను. కెరీర్‌పై దృష్టి పెట్టడం నేటి అమ్మాయిల ముందున్న కర్తవ్యమని భావిస్తున్నాను. –తేజశ్విని, కడప సమాన అవకాశాలు ఒకప్పుడు స్త్రీ విద్యపై వివక్ష ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దూర ప్రాంతాలకు పంపడమంటే రిస్కుగా తల్లి దండ్రులు భావించేవారు. ఆధునిక పరిస్థితుల ప్రభావం అందరిపై పడింది. మా నాన్న డాక్టర్. ఆడపిల్లలు చదువుకుంటే మంచిదన్న ఆలోచనతో ప్రోత్సహిస్తున్నారు. మా వర్సిటీలో స్త్రీ పురుషుల సంఖ్య సమానంగా ఉంటుంది. – నిధిసింగ్, రాంచి ఇద్దరూఅమ్మాయిలమే... మాది ఒంగోలు పొద్దుటూరు వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ చదువుతున్నాను. నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. మా తల్లిదండ్రులకు ఇద్దరం. మా ఇద్దరికి సమాన అవకాశాలు ఇచ్చారు. మా చెల్లి బీటెక్ చదువుతోంది, ఆడపిల్లలకు చదివిస్తున్నారు. విద్యవల్ల సమానత్వం వస్తుంది. ఈ విషయాన్ని మన రాష్ట్రంలో గుర్తించినందుకే మహిళలు రాణిస్తున్నారు. –రేష్మా, ఒంగోలు మహిళలదే ఆధిక్యత నేను తెలంగాణాలోని పీవీ నరసింహారావు వెటర్నరీ నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, నాతో పాటు అక్క, తమ్ముడు ఉన్నారు. అయితే తల్లిదండ్రులు సమానంగా చదివిస్తున్నారు. ఒకప్పుడు అబ్బాయిలను చదివిస్తే చాలనుకునేవారు. ఇప్పుడు మార్పు వచ్చింది. ఇప్పుడు పురుషుల కంటే మహిళలకే ఆధిక్యత పెరిగింది.– నివేదిత, తెలంగాణ నలుగురూ ఆడపిల్లలమే తండ్రి వ్యాపారం చేస్తా రు. అమ్మ గృహిణి. వారు పెద్దగా చదువుకోకపోయినా స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. మా కుటుంబంలో నలుగురమూ ఆడపిల్లలమే. అయినా అందరినీ చదివిస్తున్నారు. అమ్మాయిల చదువుపై కొన్నాళ్లు ఆంక్షలుండేవి. కేవలం కొద్దిపాటి చదువును చదివించి ఇంటికే పరిమితం చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదని భావిస్తున్నాను. –నయిలా ప్రాజ్, రాంచి మొదటి సారి వచ్చాను బాపట్లలో బీఎస్సీ అగ్రికల్చ ర్ చదువుతున్నా. నాన్న టీచర్, అమ్మ గహిణి. ఇంట్లో నేను, చెల్లి ఉంటాము. ఈ యువజనోత్సవాలకు తొలి సారి వచ్చాను. వివిధ ప్రాంతాల వారితో మాట్లాడగలిగాను. యూనివర్సిటీల్లో అక్కడక్కడ వివక్ష ఉంటుందనుకుంటున్నా. – అర్చన చౌదరి, బాపట్ల పరిస్థితి మారింది కోయంబత్తూరు వర్సిటీ నుం చి వచ్చాను. ఒకప్పుడు మహిళలకు చదువు ఎందుకనేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మా తల్లిదండ్రులకు ఇద్దరూ అమ్మాయిలమే. నాన్న ఫొటోగ్రాఫర్. ఇద్దరమ్మాయిలను సమానంగా చూస్తూ చదిస్తున్నారు. – కార్తీక, తమిళనాడు -
అన్నీ ఉన్నాయి.. అధ్యాపకులు తప్ప
‘పేరుకే రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యా సంస్థలు. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అర్హులైన అధ్యాపకులే లేరు. 12,333 మంది పీహెచ్డీ కలిగిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అవసరమైతే ప్రస్తుతం కేవలం 1,500 మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య అందేదెలా? అందుకే ఐదేళ్ల వరకు మాకు కొత్త సీట్లు వద్దు’ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య పరిస్థితులపై ఏఐసీటీఈకి రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొన్న అంశాలివీ. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను గాడిలో పెట్టేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే సీట్లకు కోత విధిస్తున్న ప్రభుత్వం ఇకపై కొత్త సీట్లను మంజూరు చేయవద్దని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి స్పష్టం చేసింది. సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఈ మేరకు రాసిన లేఖలో పేర్కొంది. ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడమే కాకుండా ప్రొఫెసర్ల కొరతతో సబ్జెక్టు పరమైన నాలెడ్జి విద్యార్థులకు అందడం లేదని వివరించింది. ఫలితంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్న విద్యార్థుల సంఖ్య 18 శాతానికి మించడం లేదని వివిధ సర్వేలే స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లోని లోపాలను పేర్కొనడంతోపాటు భవిష్యత్ అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఏఐసీటీఈ సగానికి..జేఎన్టీయూ మొత్తానికే కోత ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అవసరాల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించే చర్యల్లో భాగంగా కాలేజీలను కట్టడి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. మరోవైపు గడిచిన మూడేళ్లలో వరుసగా 30 శాతం లోపు సీట్లు భర్తీ అయిన కాలేజీల ఇంటేక్‌లో సగం సీట్లకు కోత విధిస్తామని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. తమ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లోనూ ఈ అంశాన్ని స్పష్టం చేసింది. జేఎన్టీయూ మాత్రం అనుబంధ గుర్తింపు విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. వరుసగా మూడేళ్లలో 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయిన కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేయడంతో యాజమాన్యాలు ఆందోళనలో పడ్డాయి. గత మూడేళ్లను కాకుండా వచ్చే మూడేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే చర్యలు.. 2017–18 విద్యా సంవత్సరంలో ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన అన్ని కాలేజీలకు యూనివర్సిటీలు అనుమతి ఇవ్వలేదు. అన్ని సీట్లను భర్తీ చేసేందుకు ఓకే చెప్పలేదు. 28,961 సీట్లకు కోత పెట్టాయి. మరోవైపు అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్లలోనూ 29,367 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. 20 మందికో అధ్యాపకుడు ఉండాలి.. 2017–18 నిబంధనల ప్రకారం ప్రతి 15 మందికి ఒక అధ్యాపకుడు అవసరం. తాజాగా ఏఐసీటీఈ ఆ నిబంధనలో మార్పు చేసింది. 2018–19 నిబంధనల ప్రకారం ప్రతి 20 మందికి ఒక అధ్యాపకుడు ఉంటే సరిపోతుంది. మొత్తం విద్యార్థులకు అనుగుణంగా అధ్యాపకులు 1:2:6 రేషియోలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. 2017–18 లెక్కలు ఇలా పీహెచ్డీ అర్హతతో ఉండాల్సిన అధ్యాపకులు12,333 మంది ప్రస్తుతం పీహెచ్డీ అర్హతతో ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 1,500 మంది 2020 నాటికి అయ్యే విద్యార్థుల సంఖ్య 5 లక్షలపైనే అందుకు అవసరమైన అధ్యాపకులు 34 వేల మంది ఎంటెక్ అర్హతతో అవసరమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు 22,667 మంది పీహెచ్డీ అర్హత అవసరమైన మిగతా అధ్యాపకులు 11,333 మంది అవసరమైన ప్రొఫెసర్లు 3,778 మంది అవసరమైన అసోసియేట్ ప్రొఫెసర్లు 7,555 మంది -
నెత్తురు చిందించిన కత్తుల పోరాటం!
-
రైల్వే స్టేషన్లో విద్యార్థి గ్రూపుల గ్యాంగ్‌వార్..!
సాక్షి, చెన్నై: విద్యార్థి గ్రూపుల దాడులతో చెన్నైలో ఓ రైల్వే స్టేషన్ అట్టుడికింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా మారి.. కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన చెన్నై శివారులోని అంబత్తూరు-కొరట్టూరు నడుమ పట్టరైవాకంలో చోటుచేసుకుంది. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన లోకల్ ట్రైన్ పట్టరైవాకం స్టేషన్‌కు చేరుకోగానే అందులో నుంచి దిగిన రెండు గ్రూపుల విద్యార్ధులు కత్తులతో ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. కొందరు విద్యార్థులు కత్తులు ప్రదర్శిస్తూ.. మరో వర్గం విద్యార్థులను వెంబడించి మరీ దాడులు చేశారు. ఈ ఘటనతో అదే రైల్లో ఉన్న ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. విద్యార్ధుల పరస్పర దాడులతో రైల్వేస్టేషన్ దద్దరిల్లింది. ఈ దాడుల అనంతరం విద్యార్ధులు అదే రైల్లో వెళ్లిపోవడం గమనార్హం. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దాడులు చేసుకున్న విద్యార్థులను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఈ దాడులను తమ సెల్ఫోన్ల ద్వారా రికార్డు చేసిన వారిని నుండి వీడియోలు తీసుకుని.. ఆరా తీస్తున్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసిన సదరు మూకను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. విద్యార్ధు గ్రూపుల గ్యాంగ్‌వార్ ఘటన చెన్నైలో కలకలం రేపుతోంది. -
కళాశాల విద్యార్ధులతో పార్టీ ప్రచారం
-
ఎంత ఎత్తుకు ఎదిగాడు
పిల్లలు ఎత్తుకి ఎదగాలని.. గొప్పవాళ్లు కావాలని.. సమాజమంతా వాళ్లను తలెత్తుకు చూడాలని.. ప్రతి తల్లి, ప్రతి తండ్రి కలలు కంటారు! కష్టపడ్తారు! పిల్లలతో కూడా కృషి చేయిస్తారు! ఖుషీ లేనంత కృషి చేయిస్తారు!! ఆ పిల్లలే ఇవ్వాళ ఎత్తయిన మేడ ఎక్కి అమ్మా నాన్నలు కోరుకున్నంత ఎత్తుకి ఎదగలేనని బాధపడుతూ కిందకి.. కిందకి.. కిందకి దూకేస్తున్నారు!! ‘‘నేను చూసింది నిజమేనా?’’ అప్పుడే స్పృహలోకి వచ్చిన ప్రశాంతి అడిగింది తన చుట్టూ ఉన్నవాళ్లను. ఎవరి దగ్గరా సమాధానం లేదు. అంతా మౌనంగా ఉన్నారు. ఆ గాంభీర్యం మరింత భయపెట్టింది ఆమెను. ‘‘ఎవరూ ఎందుకు మాట్లాడట్లేదు.. చెప్పండి? ’’ అంటూ బెడ్ మీద నుంచి లేవబోయింది. ‘‘ఏం చెప్పమంటావమ్మా..’’ ఆమెను పట్టుకొని బోరుమంది ప్రశాంతి తల్లి. ‘‘అంటే.. అంటే.. నిజమేనన్నమాట... నా కొడుకు.. నా కొడుకు..’’ అని సణుగుతూ మళ్లీ కళ్లు తిరిగిపడిపోయింది. అక్కడున్న వాళ్లంతా కంగారు పడ్డారు. ‘నీళ్లు తెచ్చి మొహం మీద జల్లండి’ అన్నారెవరో ఆ గుంపులోంచి. ‘ఇప్పటికే రెండుసార్లు పడిపోయింది. బీపీ డౌన్ అవుతుందేమో.. హాస్పిటల్‌కు తీసుకెళ్లడం మంచిది’ అన్నారు ఇంకొకరు. కాసేపటికి తేరుకుంది ప్రశాంతి. ‘నా కొడుకును చూడాలని ఉంది. నన్ను తీసుకెళ్లండి’ అంటూ ప్రాధేయపడింది ఏడుస్తూ! ప్రశాంతిని చూస్తుంటే అక్కడున్నందరికీ దుఃఖం వస్తోంది. ఆమెకు సమాధానం చెప్పే స్థితిలో లేరు ఎవ్వరూ! ఏమైంది? ప్రశాంతి, సాగర్‌కు ఇద్దరు పిల్లలు. కొడుకు కౌశిక్, కూతురు స్నిగ్ధ. కౌశిక్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. స్నిగ్ధ తొమ్మిదో తరగతి. సాగర్ స్టేట్గవర్నమెంట్ ఎంప్లాయ్. ప్రశాంతి ప్రయివేట్ ఉద్యోగి. ఇద్దరికీ పిల్లల మీద విపరీతమైన అంచనాలు. కొడుకును ఇంజనీర్, కూతురును డాక్టర్ చేయాలని కలలు కంటున్నారు. స్నిగ్ధ చదువులో చురుకే. తల్లిదండ్రుల కలను నిజం చేయగలదు. కాని కౌశిక్ ఆసక్తి,. అభిరుచులు వేరు. చిన్నప్పటి నుంచీ వాడికి ఆటలంటే ఇష్టం. టెన్నిస్ బాగా ఆడతాడు. కోచింగ్‌కు పంపించమని వాడితో సహా ఆ పిల్లాడి ఆటతీరును గమనించినవాళ్లు, అభినందించిన వాళ్లూ ప్రశాంతి, సాగర్లకు చెప్పారు. అయితే ఆ తల్లిదండ్రుల దృష్టిలో ‘ఆ ఆటలు కాలక్షేపానికే కాని కెరీర్ కోసం కాదు. కసరత్తుకే కాని కడుపునింపేవి కావు. చదువు ఒక్కటే నిలబెడుతుంది. కొలువును ప్రసాదిస్తుంది. దానికోసమే జీవితం..’ అని వాళ్ల బలమైన నమ్మకం. అందుకే పిల్లల చూపు వేరేవైపు మళ్లకుండా చదువు మీదనే పెట్టేలా కట్టుదిట్టం చేశారు. స్కూల్ అయిపోగానే ట్యూషన్.. ట్యూషన్ అయిపోగానే దాన్ని మననం చేసుకోవడం. తెల్లవారు జామున హోమ్ వర్క్.. ఇలా ఊపిరిసలపని షెడ్యూల్‌ను ఫిక్స్ చేసేశారు. స్నిగ్ధ అలవాటు పడిపోయింది కానీ, కౌశిక్‌కే ఆ పద్ధతి మింగుడు పడలేదు. ఆ అబ్బాయి అందులో ఇమడలేదు. కాని పిల్లల మనసు కన్నా పెద్దల ఆకాంక్షలకే విలువ ఎక్కువ కదా! కాబట్టి కౌశిక్‌కు ఇష్టం లేకపోయినా ఐఐటిని ఆ పిల్లాడి మెదడులో అచ్చేశారు. ఎమ్సెట్, ఐఐటికి సీట్ల ఫ్యాక్టరీలాంటి రెసిడెన్షియల్ కాలేజ్‌లో పడేశారు. ఇప్పుడు.. హాస్టల్లో కౌశిక్ స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ‘‘హాస్టల్ రూమ్‌లో ఎలా ఉండేవాడు కౌశిక్?’’ ‘‘ఫస్ట్ డే నుంచే దిగులుగా ఉన్నాడు. నాతో ఎప్పుడూ ‘నాకు ఇక్కడ ఉండాలని లేదు’ అని చెప్పేవాడు. అసలు మ్యాథ్స్ అంటే వాడికి ఇష్టమేలేదు. మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందంటే చాలు– చాలా భయపడేవాడు. ఎన్నోసార్లు ‘నా వల్లకాదు... నేను ఇంటికి వెళ్లిపోతా’ అని అన్నాడు సర్. ‘మరి ఈ విషయం మీ పేరెంట్స్‌కి చెప్పు’ అని మేమంటే.. ‘అమ్మో.. చంపేస్తారు’ అని భయపడేవాడు. ప్రతిరోజూ ఏడ్చేవాడు. మొన్నకూడా ‘నాకు మ్యాథ్స్ అంటే ఇష్టంలేదు.. హాస్టల్లో ఉండడం నచ్చట్లేదు. మా మమ్మీని, చెల్లెలిని చాలా మిస్ అవుతున్నా’ అని బాగా ఏడ్చాడు.‘ నాకు చచ్చిపోవాలనుందిరా..’ అని చెప్పాడు. మాకు భయమేసి తెల్లవారి మా వార్డెన్‌కి చెప్పాం కూడా’’ కౌశిక్ మనస్తత్వాన్ని వర్ణించాడు అతని క్లాస్మేట్, రూమ్మేట్ అఖిల్. ‘‘ మీ వార్డెన్ ఏమన్నాడు?’’ అడిగాడు సీఐ. ‘‘తిట్టాడు. ‘పిచ్చి వేషాలేస్తే తోలుతీస్తా’’ అన్నాడు సర్’’ కౌశిక్. ‘‘అదికాదు సర్.. పిల్లలు కదా.. మొదట్లో అలాగే ఇంటిమీద బెంగతో ఉంటారు.. వీడూ అలాగే అనుకొని బెదిరిస్తే సర్దుకుంటాడని చిన్నగా బెదిరించానంతే సర్’’ అంటూ అక్కడే ఉన్న వార్డెన్ చెప్పాడు భయం భయంగా. ‘‘ఊ’’ అంటూ ‘‘నిన్న రాత్రి ఎలా ఉన్నాడు?’’ అడిగాడు సీఐ. ‘‘నిన్న రాత్రి డిన్నర్‌కు రాలేదు. అడిగితే ‘ఆకలి లేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న స్నాక్స్ తింటాను’ అన్నాడు సర్. ‘సరే’ అని నేను డిన్నర్‌కు వెళ్లిపోయా. వచ్చాక చూస్తే పడుకుని ఉన్నాడు. అసలు నిన్న పొద్దున్నుంచే చాలా డల్‌గా ఉన్నాడు. ఈ మధ్య చాలా రోజుల్నుంచి ‘నాకు బతకాలనిపించట్లేదు’ అనడం స్టార్ట్ చేశాడు. ఎందుకలా అంటావ్‌రా అని గద్దించాను చాలాసార్లు. ఒకసారి ఆంటీ వాళ్లు ఫోన్ చేస్తే చెప్పాను కూడా. మరి వాళ్లు వాడితో ఏం మాట్లాడారో తెలీదు. అప్పటినుంచి చాలా కామ్ అయిపోయాడు. వీక్లీ టెస్ట్స్ కూడా సరిగ్గా రాసేవాడు కాదు. నోట్‌బుక్‌లో .. పేపర్స్ మీద వాంట్ టు డై అని రాసుకున్నాడు’ చెప్పాడు అఖిల్. ‘‘అంత పొద్దున్నే ఆ అబ్బాయి బిల్డింగ్ పైకి ఎక్కుతుంటే మీరు చూడలేదా?’’ వార్డెన్ ప్రశ్నించాడు సీఐ తీక్షణంగా. ‘‘సర్.. నేనప్పుడు .. వాష్‌రూమ్‌కి వెళ్లాను సర్.. వాష్‌రూమ్‌లోంచి బయటకు వస్తుంటే వినిపించింది పై నుంచి ఏదో కిందపడినట్టు దబ్మన్న శబ్దం. ఆ తర్వాత వాచ్‌మన్ చూసి గగ్గోలు పెడితే వెళ్లి చూశాను.. కౌశిక్..’ కాస్త భయంగా.. ఇంకాస్త బెరుగ్గా చెప్పాడు వార్డెన్. అలా తనకు నచ్చని జీవనశైలిని ఎండ్ చేసుకున్నాడు కౌశిక్. వాళ్లమ్మ బాధకు అదే కారణం. పోతూ పోతూ తల్లి, తండ్రికి తన మనసు అర్థమయ్యేలా ఉత్తరం రాసిపెట్టి మరీ పోయాడు. తల్లి తట్టుకోలేక స్పృహ కోల్పోతోంది. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన కొడుకు శవం ముందు జీవచ్ఛంలా పడి ఉన్నాడు తండ్రి. కౌశిక్ చనిపోయిన రోజు మాత్రం రాష్ట్రమంతా చర్చ అయింది టెలివిజన్ చానళ్లలో ప్యానల్ డిస్కషన్స్ రూపంలో. నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. సైకాలజిస్ట్‌లు, సైకియాట్రిస్ట్‌ల మాటలకు ఆరోజు చాలా విలువనిచ్చాయి వార్తాపత్రికలు, చానళ్లు. తెల్లవారి నుంచి.. అంతా మామూలే. నగరంలోని ఎక్కడో వీధిలో వచ్చే యేడుకి తమ పిల్లల ఎమ్సెట్, ఐఐటీ ర్యాంక్‌ల కోసం ఏ ఫ్యాక్టరీలైతే బాగుంటాయో జాబితా చూడసాగారు పేరెంట్స్. కౌశిక్‌ను బలితీసుకున్న ఫ్యాక్టరీ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుపోసాగింది. ఆసక్తులు, శక్తిసామర్థ్యాలను అనుసరించే... చేప చెట్టెక్కలేదు. కోతి ఈదలేదు. నీటిలో ఏ పరీక్షకైనా చేప సిద్ధం. చెట్టుమీద ఏ పరీక్షకైనా కోతి తయారు. చేపను చెట్టెక్కమని, కోతిని ఈదమని పరీక్షకు పెడితే...? అలాగే ఉంది కొంతమంది తల్లిదండ్రుల వ్యవహారం, కొన్ని కాలేజీల తీరు. ఏ పిల్లలైనా సహజంగా తల్లిదండ్రులు చెప్పిందే వింటారు. వాళ్లకు నచ్చిందే చేయాలనుకుంటారు. కాబట్టి పిల్లల ఆసక్తులు, శక్తిసామర్థ్యాలను అనుసరించే వాళ్లు చదివే కోర్సులను నిర్ణయిస్తే మంచిది. ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప చదువులేదన్నట్టు, పిల్లలకు ఆసక్తి ఉన్నా లేకపోయినా వాటినే చదవాలనే బలవంతం చాలా ప్రమాదం. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో పొద్దున ఆరు నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి చదివించడమూ మంచిది కాదు. అన్ని గంటలు పెద్దవాళ్లం మనమే పనిచేయలేం. పిల్లలెలా ఏకాగ్రత నిలుపగలరు? సైన్స్, మ్యాథ్స్ అంటే ఆసక్తి ఉన్న పిల్లలకు కూడా అంత నిరవధిక శ్రమ శ్రేయస్కరం కాదు. మధ్యలో ఫిజికల్, మెంటల్ రిలాక్సేషన్ అత్యవసరం. ఇక మెడిసిన్, ఇంజనీరింగ్‌లలో ఇంట్రెస్ట్ లేని పిల్లలకు ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. పిల్లాడు ఎందుకు ఆసక్తి లేదంటున్నాడో తల్లిదండ్రులు గమనించాలి. కాలేజ్‌లో పిల్లల మీద ఒత్తిడి పెంచే బోధనా విధానం ఉందా అనే విషయం చూడాలి. వీటన్నిటినీ పరిశీలిస్తూ పిల్లల ఆసక్తులు పరిగణనలోకి తీసుకుంటూ వాళ్లను చదివిస్తే వ్యక్తిత్వ, మనో వికాసాలతోపాటు చదువుకుంటున్న విషయం పట్లా అసలైన పట్టు వస్తుంది. ఎంచుకున్న రంగంలో విజయం సాధించే అవకాశమూ ఉంటుంది. లేకపోతే హోప్లెస్ కండిషన్లోకి వెళ్లిపోయి, డిప్రెషన్లో పడిపోయి, నిస్సారంగా అనిపించి ఆత్మహత్యా ప్రయత్నాలకు ఒడిగడతారు. – డాక్టర్ పద్మ పాల్వాయి చైల్డ్ సైకియాట్రిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ – శరాది -
మృత్యుశకటం
♦ ఇంటర్ విద్యార్థినులపై దూసుకెళ్లిన టిప్పర్ ♦ ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు ♦ ఓర్వకల్లు వద్ద ఘటన ♦ సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఉదయం తొమ్మిదిన్నర అవుతోంది. మరికొద్ది సేపట్లో కాలేజీ మొదలవుతుంది. దీంతో విద్యార్థినులంతా చకచకా నడుచుకుంటూ కాలేజీకి బయలుదేరారు. మరో రెండు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారు. ఇంతలోనే టిప్పర్ రూపంలో మృత్యుశకటం దూసుకొచ్చింది. ఓ విద్యార్థినిని మాంసపు ముద్దలా మార్చేసింది. మరో ఏడుగురిని గాయపరిచింది. ఈ ఘటన మంగళవారం ఓర్వకల్లులో చోటుచేసుకుంది. ఓర్వకల్లు: ఓర్వకల్లు మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 160 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని ఆర్సీ ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. వీరు ప్రతిరోజూ ఆటోలు, బస్సుల్లో ఓర్వకల్లు బస్టాండుకు చేరుకుని.. అక్కడి నుంచి జాతీయ రహదారి వెంట నడుచుకుంటూ కళాశాలకు చేరుకుంటుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం శకునాల గ్రామానికి చెందిన మహాలక్ష్మి, నిర్మల, శోభారాణి, మాధవి, హుశేనాపురం గ్రామానికి చెందిన శాంతకుమారి, మమత, కాల్వ గ్రామానికి చెందిన సుస్మిత, ఓర్వకల్లుకు చెందిన పరిమళ స్థానిక బస్టాండు వద్ద నుంచి రోడ్డు వెంట నడుచుకుంటూ కళాశాలకు బయలుదేరారు. మరో రెండు నిమిషాలలో కళాశాలకు చేరుకుంటారు. అయితే.. ఈలోపే వెనుక వైపు నుంచి టిప్పర్ వేగంగా వచ్చి వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో హుశేనాపురానికి చెందిన శాంతకుమారి(16) అక్కడికక్కడే చనిపోయింది. మిగతా ఏడుగురు గాయపడ్డారు. అదే సమయంలో రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్ఐ చంద్రబాబు నాయుడు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో శకునాలకు చెందిన మహాలక్ష్మి(16) పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపాల్ నాగభూషణంరెడ్డి, అధ్యాపకులు సంఘటన స్థలానికి చేరుకుని తమ వద్ద ఉన్న సెల్ నంబర్ల ఆధారంగా బాధిత పిల్లల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని బోరున విలపించారు. శాంతకుమారి మృతదేహం మాంసం ముద్దలా ఉండడంతో అది చూసి కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. శాంతకుమారి తండ్రి సోమన్న మరణించారు. తల్లి నీలమ్మ బధిరురాలు (మూగ–చెవిటి). దీంతో ఆమె అవ్వ వద్ద ఉంటూ చదువుకునేది. బోల్తా పడిన టిప్పర్ ప్రమాదానికి కారణమైన టిప్పర్ రోడ్డు పక్కనగల ఇనుప స్తంభాన్ని బలంగా ఢీకొని 20 అడుగుల దూరంలో బోల్తా పడింది. కాగా.. ఇది మండలంలోని వెంకటాపురం వద్దనున్న శ్రీలక్ష్మీ రోడ్డు మెటల్ కంపెనీకి చెందినది. ఈ కంకర కంపెనీని కర్నూలు మాధవనగర్‌లో నివాసముంటున్న నారాయణరెడ్డి, బనగానపల్లెకు చెందిన మరో నలుగురు భాగస్వాములు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ సిమెంటు కంకర మిశ్రమాన్ని కర్నూలుకు తరలిస్తూ ప్రమాదానికి కారణమైంది. పరిస్థితిని గమనించిన టిప్పర్ డ్రైవర్ గోవిందు వాహనం అద్దాలను పగులగొట్టుకుని పరారయ్యాడు. అందులో లభించిన మద్యం సీసాను బట్టి అతను మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్‌తో పాటు యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి, ఇన్చార్జ్ సీఐ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రమాద విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, పాణ్యం బీజేపీ నాయకుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, కర్నూలు ఆర్డీఓ హుసేసాహెబ్, తహసీల్దార్ శ్రీనాథ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ, టీడీపీ మండల కన్వీనర్లు లక్ష్మీకాంతరెడ్డి, గోవిందరెడ్డి ,గ్రామ సర్పంచు పెద్దయ్య తదితరులు బాధితులను పరామర్శించారు. ఓర్వకల్లు రహదారిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని గౌరు చరితారెడ్డి, వెంకటరెడ్డి అన్నారు. ఇకమీదట పునరావృతం కాకుండా చూడాలన్నారు. గాయపడ్డ విద్యార్థినులకు మెరుగైన వైద్యం : కలెక్టర్ కర్నూలు(హాస్పిటల్): ఓర్వకల్లు వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంటర్ విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ చెప్పారు. కర్నూలు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన విధానం గురించి విద్యార్థినులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి అనే విద్యార్థిని పరిస్థితి ఆందోళనగా ఉందని, మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారన్నారు. వీరందరికీ మెరుగైన వైద్యం అందించేలా వైద్యులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. -
కాలేజీ విద్యార్థులకు హాస్టళ్లు!
- ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు - దూర ప్రాంత విద్యార్థుల కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయం - ఎస్సీ విద్యార్థులకు ప్రాధాన్యం.. 70 శాతం సీట్లు వారికే.. సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. దూర ప్రాంతం నుంచి కాలేజీకి రాకపోకలు సాగించే వారి కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ త్వరలో ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం నియోజకవర్గానికో వసతిగృహం ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యకు తగి నట్టుగా వీటిని నెలకొల్పాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు సైతం హాస్టళ్ల ఆవశ్యకతపై లేఖలు పంపు తుండటంతో చర్యలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో పాఠశాల విద్యార్థుల వసతి గృహాలు కొనసాగుతున్నాయి. తాజాగా గురుకుల పాఠశాలలను ప్రారంభించడంతో పలు హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ తరుణంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉండి.. మౌలికవసతులు ఉన్న వాటిలో ఈ హాస్టళ్లను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారుల నుంచి వివరాలను సేకరిస్తోంది. వంద మందికి ఒక హాస్టల్ కొత్తగా హాస్టళ్లు ప్రారంభించడం ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా వాటిని పూర్తిచేసి అందుబాటులోకి తేవడానికి చాలా సమయం పడుతుంది. దీంతో విద్యార్థులు లేని, 40 కంటే తక్కువ విద్యార్థులున్న హాస్టళ్లను సమీప వసతి గృహాల్లో విలీనం చేయనున్నారు. అలా విలీనం చేసిన హాస్టల్ భవనంలోనే కొత్తగా కాలేజీ విద్యార్థుల కోసం వసతిగృహాన్ని ఏర్పాటు చేయాలని ఎస్సీ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో ఖర్చు తగ్గడంతో పాటే సిబ్బందికి స్థానచలనం కలిగించాల్సిన పని ఉండదని, వనరులు సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. పక్కా భవనం ఉండి కనీసం వంద మంది విద్యార్థులకు వసతి కలిగించే సామర్థ్యం ఉన్న భవనాలనే కాలేజీ హాస్టళ్లకు ఎంపిక చేయనున్నారు. వీటిని ఒకేసారి పెద్ద సంఖ్యలో కాకుండా ప్రాధాన్యత క్రమంలో ప్రారంభించనున్నారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జమ్మికుంట తదితర మండలాల్లో బాలికలు, బాలుర కోసం వసతిగృహాలు ఏర్పాటు చేయాలని ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. ఎస్సీ అభివృద్ధి శాఖకు లేఖ రాశారు. దాంతో అధికారులు ఆమేరకు చర్యలు చేపట్టి నివేదికను రూపొందించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని వసతి గృహాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ముగియగా.. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ప్రవేశాలు ముగిసిన తర్వాత విద్యార్థుల సంఖ్యను బట్టి వసతి గృహాల ఆవశ్యకతపై అంచనాకు వస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. ఉపకార నిధులతో నిర్వహణ కొత్తగా ఏర్పాటు చేసే వసతి గృహాల నిర్వహణ భారాన్ని విద్యార్థుల ఉపకార వేతనాల నుంచి సర్దుబాటు చేయాలని ఎస్సీ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టుమెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తోంది. వీటి మాదిరిగానే కొత్తగా ఏర్పాటు చేసే కాలేజీ హాస్టళ్లను నిర్వహించనుంది. ఒక హాస్టల్లో కనిష్టంగా వంద మంది విద్యార్థులుంటేనే నిర్వహణలో ఇబ్బందులుండవని అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్యను దృష్టిలో పెట్టుకుని బాలికలు, బాలుర హాస్టళ్ల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిలో ఎస్సీ విద్యార్థులకు 70 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగతా కోటాలో ప్రాధాన్యత క్రమంలో విద్యార్థులను చేర్చుకుంటారు. -
దమ్ మారో దమ్
టెక్కీల గం‘జాయ్’ నిత్యం కంప్యూటర్లతో కుస్తీపట్టే సాప్ట్వేర్ ఇంజనీర్లు డ్రగ్స్‌కు బానిసలయ్యారా? లక్షల్లో జీతాలు తీసుకుంటూ విలాస జీవితాలు అనుభవించే టెక్కీలు మత్తులో జోగుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చదువుకునేందుకు హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ దందా సాగిస్తున్న ఇద్దరు సోమాలియా దేశ విద్యార్థులను ఆబ్కారీశాఖ ఇటీవల అరెస్టు చేసి విచారించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశా, విశాఖ ఏజెన్సీల నుంచి కిలో కేవలం రూ. 3 వేల చొప్పున 20–25 కిలోల గంజాయిని కొనుగోలు చేస్తున్న డ్రగ్స్ ముఠాలు దాన్ని రైళ్లలో తొలుత వరంగల్‌కు తరలిస్తున్నాయి. అక్కడి నుంచి ట్రాలీ ఆటోల అడుగున గంజాయిని ప్యాకెట్ల రూపంలో దాచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ కాలేజీ విద్యార్థులు,సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయం రవాణా చేసిన గంజాయిని కాలేజీ విద్యార్థులతోపాటు శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు డ్రగ్స్ ముఠాలు విక్రయిస్తున్నాయి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఒక గ్రాము, రెండు గ్రాముల చొప్పున గంజాయిని సిగరెట్లలో పెట్టి ఒక్కో సిగరేట్‌ను రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇక్కడ అమ్మగా మిగిలిన గంజాయిని గోవాకు తరలించి కిలోకు రూ. 45 వేల నుంచి రూ. 50 వేల చొప్పున తాజా పట్టుబడిన సోమాలియన్లు విక్రయిస్తున్నట్లు తేలింది. సర్జికల్ డ్రగ్‌నూ మత్తు కోసం హాస్పిటళ్లలో ఆపరేషన్ల సమయంలో ఉపయోగించే పెంటాజోకిన్ కెమికల్ ఉన్న పార్ట్విన్ ఇంజక్షన్‌ను కూడా సాప్ట్వేర్ ఇంజనీర్లు మత్తు పదార్థంగా ఉపయోగిస్తున్నారు. కేవలం హాస్పిటళ్లు, లైసెన్స్డ్ డ్రగ్ సెంటర్లలో డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉంటేనే ఈ డ్రగ్‌ను విక్రయించాలని ఆదేశాలున్నా ఏపీలోని తిరుపతి, విశాఖ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. హెరాయిన్, కొకైన్ లాంటి డ్రగ్స్ రవాణా గుట్టురట్టవుతున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పుడు ఇలాంటి సర్జికల్ డ్రగ్స్‌ను వాడుతున్నారు. ఉన్మాదిగా మారే ప్రమాదం సాధారణంగా పెంటాజోకిన్ కెమికల్‌ను పెయిన్ రిలీఫ్‌కు వాడుతుంటారు. అది కూడా డాక్టర్ సిఫారసు చేస్తేనే ఇస్తారు. కానీ ఈ డ్రగ్‌కు బానిసలైన వారు రోజుకు రెండు నుంచి మూడు డోసుల చొప్పున (అంటే తీసుకున్నప్పుడల్లా 3 ఎంఎల్.. రోజుకు 9ఎంఎల్ చొప్పున) వాడుతున్నారు. దీనివల్ల అధిక రక్తపోటు, గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెదడు, నాడీకణాల పనితీరు దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్యులు తెలిపారు. దీన్ని అధిక మోతాదులో తీసుకున్న సందర్భంలో ఆ వ్యక్తి ఉన్మాదిలా వ్యవహరించే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దర్యాప్తు చేస్తున్నాం తాజాగా అరెస్టయిన సోమాలియా విద్యార్థులు ఈ దందాను ఇప్పుడిప్పుడే ప్రారంభించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై తమ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. అలాగే నిత్యం 250 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ వరకు పెంటాజోకిన్ను దిగుమతి చేసుకొని 2 ఎంఎల్‌కు రూ. 500 చొప్పున సాప్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్న ఇద్దరిని తాము అరెస్ట్ చేశామన్నారు. -
శ్మశానం పక్కనే కాలేజీ..చితిమంటల సాక్షిగా..
-
వరుస రేప్‌లతో అమ్మాయిల ఆందోళన
బరేలి: ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న వరుస అత్యాచారాలతో అమ్మాయిలు హడలిపోతున్నారు. ఢిల్లీ- కాన్పూర్ హైవేపై కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అటకాయించి, తల్లీకూతుళ్లపై దుండగులు గ్యాంగ్ రేప్ చేయడం.. బరేలి జిల్లాలో 24వ హైవేకు సమీపంలో ఉధ్యాయురాలిని అపహరించుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడం.. ఈ రెండు ఘటనలు నాలుగు రోజుల వ్యవధిలో జరగడంతో ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బరేలి జిల్లాలో కొందరు అమ్మాయిలు ఆకతాయిల చేష్టలకు భయపడి కాలేజీకి వెళ్లడం మానేశారు. తమకు భద్రత కల్పించే వరకు కాలేజీ వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. ఓ కాలేజీకి చెందిన దాదాపు 50 మంది విద్యార్థినులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ధనేలి, ఔరంగాబాద్ గ్రామాల విద్యార్థినులు, తమ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వెళ్లి షాహి పోలీసులను కలిశారు. స్థానిక యువకులు తమపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. కాలేజీ విద్యార్థినుల సమస్య తమ దృష్టికి వచ్చిందని, వారి భద్రత కోసం కాలేజీకి వెళ్లే దారిలో పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు మఫ్టీ దుస్తుల్లో పోలీసులను మోహరిస్తామని బరేలి డీఐజీ ఆశుతోష్ కుమార్ చెప్పారు. అమ్మాయిలకు భద్రత కల్పించాలని కోరుతూ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఎస్పీకి లేఖ రాశారు. -
కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి
మంచిర్యాల సిటీ : ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాలలోని కళాశాల వద్ద పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లెల శ్రీకాంత్ మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన రాష్ట్ర డెప్యూటీ సీఎం నేటికీ తన మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం స్పందించి వెంటనే భోజనం ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో తమ సంఘం చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రాజు, కె సాయి, కె.కుమార్ తదితరులు ఉన్నారు. -
అమ్మాయి కోసం విద్యార్థుల గొడవ
హైదరాబాద్: అమ్మాయి కోసం విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... తార్నాకకు చెందిన అనురాగ్ అనే విద్యార్థి బంజారాహిల్స్ రోడ్ నెం. 11 లోని అమిటి ఎంబీఏ కళాశాలలో బీబీఏ చదువుతున్నాడు. ఇదే కళాశాల లో చదువుతున్న విద్యార్థినిని ప్రతి రోజూ మాసబ్‌ట్యాంక్‌కు చెందిన మన్సూర్‌అలీఖాన్ అనే యువకుడు తన బైక్‌పై తీసుకుపోతున్నాడు. అయితే తమ కాలేజీకి చెందిన విద్యార్థినిని అలా తీసుకెళ్లడం పద్ధతి కాదంటూ అనురాగ్ రెండు రోజుల క్రితం మన్సూర్ అలీఖాన్‌ను హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం అనురాగ్ స్నేహితులు యువతిని తీసుకుపోవడానికి వచ్చిన మన్సూర్అలీఖాన్పై దాడి చేశారు. ఇందుకు ప్రతీకారంగా మన్సూర్ తన స్నేహితులు 20 మందిని తీసుకొని బుధవారం సాయంత్రం కళాశాల వద్దకు చేరుకున్నాడు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పథకం వేసుకొని, ఒకరిని ఒకరు వెంబడించుకుంటూ బంజారాహిల్స్ రోడ్ నెం 8 వద్దకు చేరుకున్నారు. అయితే, అప్పటికే సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు విద్యార్థులందరినీ అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్రూపుల వారు ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విహారంలో విషాదం
♦ 14 మంది విద్యార్థుల జల సమాధి ♦ వీరిలో 10 మంది విద్యార్థినులు మహారాష్ట్రలోని మురూడ్-జంజీరా బీచ్‌లో ఘటన సాక్షి, ముంబై: ఆడుతూ పాడుతూ సాగాల్సిన విహారయాత్ర పెను విషాదాన్ని మిగిల్చింది. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మురూద్-జంజీరా తీరంలో సోమవారం 14 మంది కాలేజీ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతిచెందారు. మరొ విద్యార్థి సైఫ్ అహ్మద్ ఆచూకీ ఇంకా తెలియలేదు. మృతుల్లో 10 మంది విద్యార్థినులు ఉన్నారు. ఐదుగురు విద్యార్థినులకు కాపాడి, చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. పుణేలోని ఇనాందార్ కాలేజీలో బీఎస్సీ, బీసీఏ చదువుతున్న 116 మంది విద్యార్థులు మురూడ్-జంజీరాకు మూడు బస్సుల్లో వచ్చారు. వీరిలో కొందరు.. ఉపాధ్యాయులకు తెలియకుండా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈత కోసం సముద్రంలోకి దిగారు. అదే సమయంలో భారీ అలలు రావడంతో నీట మునిగి కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు వెళ్లిన మరికొందరు విద్యార్థులూ మునిగిపోయారు. వీరి కేకలను విని జాలర్లు, స్థానికులు అక్కడికి పరుగున వెళ్లారు. ఐదుగురిని రక్షించి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. గల్లంతైనవారి కోసం గాలించి, 14 మృతదేహాలను బయటికి తీశారు. కోస్ట్‌గార్డ్, నేవీ హెలికాప్టర్లు, పడవలతో రాత్రి ఎనిమిది గంటల వరకు గాలింపు జరిపారు. మృతులను శిఫా కాజీ, సుమయా అన్సారీ, యూసుఫ్ అన్సారీ, సుప్రియా పాల్, ఫర్హిన్ సయ్యద్, ఇఫ్తిఖార్ శేఖ్, సాజిద్ చౌదరీ, రాజ్ తన్జినీ, స్వప్నాలి సంగత్, సమ్రిన్ శేఖ్, షఫియా అన్సారీ, రఫియా, సానా మునీర్‌గా గుర్తించారు. విద్యార్థుల మృతివార్తతో ఇనాందార్ కాలేజీ క్యాంపస్ శోకసంద్రంలో మునిగిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనపై గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
'వాళ్లు ఉగ్రవాదులు కాదు.. విద్యార్థులు'
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో సీసీటీవీలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులు ఉగ్రవాదులు కాదని ఆ రాష్ట్ర పోలీసులు తేల్చేశారు. వారంతా కాలేజీ విద్యార్థులేనని స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అన్ని చోట్ల పోలీసులు అప్రమత్తంగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తెల్లవారు జామున ఏడు నుంచి ఎనిమిది మంది వ్యక్తులు ముసుగులు ధరించి వెళుతుండగా సీసీటీవీలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను వాట్సాప్ ద్వారా విడుదల చేసిన పోలీసులు ఈ వీడియోల్లో చూసిన వ్యక్తులను గుర్తుపడితే సమాచారం ఇవ్వాలని, ఉగ్రవాదులనే అనుమానం ఉందని అభిప్రాయం చెప్పారు. 'సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఆ వ్యక్తులను గుర్తించాం. వారు రాజ్ పూర్ రోడ్డులోని బైబిల్ కాలేజీ విద్యార్థులు. వారు రెండు గ్రూపులుగా మారి సెయింట్ థామస్ కు వెళ్లొస్తుండగా వారి దృశ్యాలే సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి' అని డెహ్రాడూన్ పోలీసు ఉన్నతాధికారి సదానంద డేట్ తెలిపారు. -
ర్యాగింగ్‌కు మరో విద్యార్థి బలి
► ‘ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్’ అంటూ సూసైడ్ నోట్ ► వరంగల్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాయినాథ్ మేడ్చల్/మేడ్చల్ రూరల్/కాజీపేట రూరల్/రామకృష్ణాపూర్(ఆదిలాబాద్): భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలలో అడుగుపెడుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పెనుభూతం బలి తీసుకుంటూనే ఉంది! రిషితేశ్వరి ఘటన మరవకముందే ర్యాగింగ్ కోరల్లో చిక్కి మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ‘ప్లీజ్ స్టాప్ ది ర్యాగింగ్.. ఆ రోజు సీనియర్స్ అలా చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు..’ అని సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ కాలేజీలో వండ్లకొండ సాయినాథ్(18) ఇంజనీరింగ్ (ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జూలై 28న కాలేజీలో చేరిన సాయినాథ్.. కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లిలోని రాంరితేష్ అనే ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. నాలుగు రోజుల క్రితం రాఖీ పౌర్ణమి సందర్భంగా బోరబండలోని తన సోదరి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకున్నాడు. అక్కడ్నుంచి ఆదివారం హాస్టల్‌కు చేరుకున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలోని తన సొంతూరు రామక్రిష్ణాపురానికి బయలుదేరి వెళ్లాడు. ఇంటికని వెళ్లిన సాయినాథ్ సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు వరంగల్-కాజీపేట్ మధ్య వడ్డేపల్లి చెరువు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జేబులో ‘‘ప్లీజ్ స్టాప్ ది ర్యాగింగ్.. ఆ రోజు సీనియర్స్ అలా చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు’’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది. విచారణ చేపట్టిన పోలీసులు సాయినాథ్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న బాలానగర్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి కాలేజీకి వెళ్లి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ర్యాగింగ్‌పై కూపీ లాగుతున్నారు. ఈ కాలేజీ మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డికి చెందినది కావడం గమనార్హం. విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కాలేజీ నిర్మానుష్యంగా కనిపిం చింది. విద్యార్థులు, సిబ్బంది ఎవరూ కని పించలేదు. దీంతో పోలీసులు ఫోన్ల ద్వారా కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించారు. కాసేపటికి కాలేజీ ప్రిన్సిపల్ జంగారెడ్డి అక్కడికి చేరుకుని తమ కాలేజీలో ర్యాగింగ్ చోటు చేసుకోలేదని చెప్పారు. సాయినాథ్ హాస్టల్‌కు కూడా వెళ్లిన పోలీసులు ఆయన పుస్తకాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కూలిన ఆశల సౌధం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం వెంకట్రావుపల్లెకు చెందిన వడ్లకొండ కనకయ్య, అరుణ దంపతుల చిన్న కుమారుడు సాయినాథ్. వీరిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు మట్టి కూలీ పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. కూతురిని ఏంబీఏ చదివించారు. పెద్ద కుమారుడు రఘునందన్ హైదరాబాద్‌లోనే బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సాయినాథ్‌ను కూడా ఇంజనీర్ చేయాలని తల్లిదండ్రులు కలలుగన్నారు. కానీ ర్యాగింగ్ రక్కసి వారి కలలను కల్లలు చేసింది. వీరు కొన్నేళ్ల క్రితం మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు వలస వచ్చారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సాయినాథ్ మృతదేహాన్ని వెంకట్రావుపల్లెకు తరలించారు. మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘‘రెలైక్కిపోయావా కొడుకా... మల్లెప్పుడు వస్తావనుకోవాలె కొడుకా.. ర్యాగింగ్ భూతం నాకు కడుపు కోత విధించిందిరా కొడుకా...’ అంటూ తల్లి అరుణ గుండెలవిసేలా విలపించింది. -
అతడ్ని ఉరితీసినందుకు రూ.10వేల చెక్
మంగళూరు: ముంబయి పేలుళ్లలో దోషి యాకుబ్ మెమన్ను ఉరితీసిన తలారికి కర్ణాటకు చెందిన ఓ విద్యార్థి సంఘం రూ.10 వేల చెక్‌ను పంపించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న అలాంటి వ్యక్తిని ఉరితీసిన తలారిని గౌరవించడం తమకు గర్వంగా ఉందని, అందుకే ఈ చెక్ పంపిస్తున్నామని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. పుత్తూరులోని అంబికా పదవి పూర్వ విద్యాలయకు చెందిన కొంతమంది విద్యార్థి నాయకులు తొలుత ఈ ఆలోచన చేసి కాలేజీ యాజమాన్యానికి తెలియజేయగా వారు జైలు అధికారులను సంప్రదించారు. అందుకు వారు అనుమతించడంతో ప్రతి క్లాసులో నుంచి స్వచ్ఛంద విరాళాలు వసూలు చేసి మొత్తం పది వేల రూపాయలను తలారీకి పంపించారు. -
డేంజర్ జోన్
పుస్తకాలు పట్టాల్సిన స్కూల్/కాలేజీ విద్యార్థులు ఈ మధ్య ట్యాబ్, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, నెట్ బ్రౌజింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. హోంవర్క్, చదువు, భోజనం ఇలా అన్నీ మరిచి వాటికి బందీలుగా మారుతున్నారు. వ్యసనంగా మారి చివరకు చదువులో వెనుకబడి మానసిక వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో నగరంలో ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి రాకుండా తల్లిదండ్రులే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ వారు పలు సూచనలు చేస్తున్నారు. కరెన్సీన గర్‌కు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రోజూ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడటం, ఫేస్బుక్ చూడటం, గేమ్స్ ఆడుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. రానురానూ ఇది వ్యసనంగా మారడంతో చదువుపై ధ్యాస తగ్గింది. మార్కులు ఎక్కువగా రావడం లేదని కళాశాల నుంచి అతని తల్లి దండ్రులకు ఫోన్ వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు మానసిక వైద్యుడి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. పెనమలూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి బైక్‌పై వెళ్తూ ఫోన్లో మాట్లాడటం, నిత్యం ఇంటర్నెట్లో గేమ్స్ ఆడటం అలవాటుగా మార్చు కున్నాడు. దీంతో ఇటీవల కాలంలో మెడ మజిల్స్ పట్టేశాయి. తొలుత న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి అనంతనం ఫిజియో థెరపీ చేయించారు. లబ్బీపేట : స్కూల్‌కు వెళ్లొచ్చాక పిల్లలు కాసేపు ఆడుకోవడం సహజం. ఇదంతా గతం. ప్రస్తుతం కాలం మారింది. కంప్యూటర్, వీడియో గేమ్స్, స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ అందు బాటులోకి రావడంతో బయట ఆడుకునే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. దాదాపు అందరి ఇళ్లలో ఫోన్లు, నెట్ సదుపాయం అందుబాటులో ఉండటంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఒంటరిగా వాటితోనే గడుపుతున్నారు. అయితే, వీటిద్వారా వినోదం కలిగే మాట వాస్తవమే కానీ, ఇతర ఆటల ద్వారా కలిగే సమిష్టితత్వం, శారీరక దారుఢ్యం వంటి ప్రయోజనాలేవి ఉండవన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. గేమ్స్ పేరిట కంప్యూటర్, ట్యాబ్‌లకు అతుక్కుపోయే పిల్లలను మందలించాలి. గేమ్స్ పుణ్యమా అని కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయే చిన్నారులు అంతగా చదువుపై దృష్టిపెట్టలేక పోతున్నారు. అంతేకాదు.. కుటుంబ సభ్యులతో సరదాగా ఉండలేకపోతున్నారు. రోజుకు 3 నుంచి 4 గంటలపైనే కంప్యూటర్ గేమ్స్, ట్యాబ్స్, సెల్ఫోన్లలో మునిగిపోవడం సర్వసాధారణ విషయంగా మారింది. ఇలాంటి అలవాట్ల వల్ల కొందరిలో దుష్ర్పభావాలు తలెత్తుతాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులూ ఇలా చేయండి.. కంప్యూటర్ గేమ్స్ నుంచి పిల్లల దృష్టి మరల్చేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి. కంప్యూటర్ వినియోగంలో ముందే పరిమితి విధించాలి. ఇంట్లో అంతా సంచరించే ప్రాంతంలో కంప్యూటర్ ఉంచడం, అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారో గమనించడం, కొన్నిసార్లు పిల్లలు ఆడే ఆటల్లో పాలుపంచుకోవడం చేయాలి. సాధ్యమైనంత వరకు స్మార్ట్ఫోన్లకు పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లలతో కలిసి తరచూ సరదాగా గడపడం చేస్తుండాలని, అలా చేస్తే పిల్లలు ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చోరని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యపరంగా పెను ప్రమాదమే.. తరచూ ట్యాబ్, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల మణికట్టు వద్ద కండరాల నొప్పి, మెడనొప్పి, కుంగుబాటు, భావోద్రేకాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. గేమ్స్ ఆడవద్దంటే ఒక్కసారిగా కోపోద్రిక్తులైపోతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడపరు. స్నేహితులతో చనువుగా ఉండరు. తమ భావాలను ఎదుటివారితో పంచుకోరు. హోంవర్క్ పూర్తి చేయకపోవడం, తరగతుల్లో పాఠాలపై శ్రద్ధ పెట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల మానసిక ఎదుగుదలలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. -
అఖిల్‌ను భయపెట్టిన అమ్మాయిలు!!
నిత్య నవ మన్మధుడు నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ ఇంకా ఒక్క సినిమాలో కూడా పూర్తిస్థాయిలో నటించలేదు. కానీ అప్పుడే మనోడికి అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిపోయింది. మొన్నీమధ్య మెహిదీపట్నంలోని ఓ కళాశాలలో 'మేకింగ్ ఎ డిఫరెన్స్' అనే కార్యక్రమానికి అఖిల్ అతిథిగా వెళ్లాడు. కుర్రాడు ఎర్రగా, బుర్రగా ఉన్నాడని.. అక్కడి అమ్మాయిలు అతడిని తెగ టీజ్ చేశారని సమాచారం. చాలామంది షేక్ హ్యాండ్లు ఇచ్చి, సెల్ఫీలు తీసుకున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా అఖిల్ మోహం, మీసాలు, గడ్డం, వీపు తడిమి అతగాడిని తెగ భయపెట్టేశారని తెలిసింది. దీంతో అఖిల్ కంగారు పడిపోయాడు. ఎలాగోలా అక్కడి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాననిపించి, అక్కడినుంచి బయట పడ్డాడట. ఇప్పటికే పలుమార్లు తారల క్రికెట్ పోటీలలో తన సత్తా చూపించిన అఖిల్.. ఇటీవలే అక్కినేని మూడు తరాలతో తీసిన 'మనం' సినిమాతో తెరంగేట్రం చేశాడు. అందులో చేసింది ఒక్క సీనే అయినా.. అఖిల్ అభిమానుల సంఖ్యకు మాత్రం కొదవేమీ లేదు. అందుకే టైటాన్ వాచీలు, మౌంటెన్ డ్యూ డ్రింక్ కంపెనీలు అక్కీని తమ బ్రాండ్ అంబాసడర్‌గా పెట్టుకున్నాయి. -
నత్తనడకన ‘ఇందిరమ్మ
విద్యా నిలయం’ పనులు మొయినాబాద్: కళాశాల విద్యార్థినుల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ‘ఇందిరమ్మ విద్యా నిలయం’ హాస్టల్ భవనం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఎనిమిది నెలలు దాటినా ఇప్పటికీ పునాదులకే పరిమితమయింది. కళాశాలల్లో చదివే విద్యార్థుల వసతి కోసం ఇందిరమ్మ విద్యా నిలయాలు నిర్మించేందుకు గత ఏడాది అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా జిల్లాలో ఆరు హాస్టల్ భవనాలను నిర్మించేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసి, ఒక్కో భవనానికి రూ. 2.50 కోట్ల నిధులు కేటాయించింది. వాటిలో ఒకటి మొయినాబాద్‌లో బాలికల కోసం నిర్మించేందుకు మంజూరు చేశారు. దాంతో భవన నిర్మాణంకోసం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అర ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ భవన నిర్మాణానికి గత సంవత్సరం నవంబర్ 14న అప్పటి జిల్లా చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ శంకుస్థాన చేశారు. ప్రభుత్వం ఈ భవన నిర్మాణ పనుల పర్యవేక్షణను వైద్య, ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. నెల రోజుల్లోపే టెండర్లు పూర్తి కావడంతో వెం టనే పనులు ప్రారంభించారు. కానీ ఆ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్‌లోపు ఈ భవనం పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం నడుస్తున్న పనులను బట్టిచూస్తే మరో సంవత్సరం పాటు భవని ని ర్మాణ పనులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నాలుగు నెలల క్రితం పనులను పరిశీలించేందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆనందర్‌కుమార్ పనులు వేగవంతం చేయాలని, డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచిం చారు. అయినా పనులు మందకొడిగానే సాగుతుండడంతో వచ్చే విద్యా సంవత్సరంలోనైనా ఈ భవనం విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందో రాదోననే సందేహం నెలకొంది. -
ఫేస్బుక్లో మనకూ ఓ పేజీ
‘ఫేస్బుక్’.. ఈ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ గురించి తెలియని వాళ్లు అరుదనే చెప్పాలి. టీనేజ్ కుర్రకారు నుంచి 60 ఏళ్ల వయస్సు వారికి ఇందులో అకౌంట్ ఉంది. ఫేస్బుక్ (ఎఫ్బీ) ద్వారా ప్రపంచంలో ఏమూలనున్నా టెక్ట్స్ ఛాటింగ్, వీడియో ఛాటింగ్ కనెక్ట్ అయి ఉంటారు. ఇందులో చెప్పుకోదగ్గ మరో అంశం ఫేస్బుక్ పేజీ. మనకు ఇష్టమైన అంశం గురించి, వ్యక్తి గురించి, ప్రాంతం గురించి ఇందులో పేజీ తయారు చేసుకొని అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఎఫ్బీలో ప్రస్తుతం పేజీ సంస్కృతి బాగా పెరిగిపోయింది. దీనిని ఎఫ్బీ వినియోగదారులు బాగానే వినియోగించుకుంటున్నారు. కళాశాలలు, రాజకీయ నేతల పేర్లతో ఉన్న పేజీలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి చాలా స్పెషల్ ఇట్స్‌మై చిత్తూర్, తిరుపతి రిలీజియన్ ఆర్గనైజేషన్, తిరుపతి సిటీ లాంటి పేజీలు జిల్లాలో ఎఫ్బీ యూజర్స్‌కు సుపరిచితమే. కొందరు ఔత్సాహికులు వీటిని నిర్వహిస్తూ యూజర్స్‌కు వినోదంతో పాటు సమాచారాన్ని అందిస్తున్నారు. ఇట్స్ మై చిత్తూర్ పేజీలో చిత్తూరులో రోజూ జరిగే విశేషాలు, చూడదగ్గ ప్రదేశాలు లాంటివి పెడుతుంటారు. దీనికి 11వేల మంది అభిమానులున్నారు. తిరుపతి రిలీజియన్ ఆర్గనైజేషన్‌కు అత్యధికంగా 2 లక్షల 29 వేల మంది అభిమానులున్నారు. ఈపేజీలో తిరుమల, తిరుపతిలోని దేవాలయాల విశేషాలను పెడుతుంటారు. అలాగే అక్కడ దేవుళ్లకు జరిగే పూజల ఫొటోలను అభిమానులకు అందుబాటులో ఉంచుతుంటా రు. ఇంకా తిరుపతి సిటీ పేజీకి ఐదు వేలమంది పైనే అభిమానులు ఉన్నారు. ఇందులో తిరుపతికి సంబంధించిన విశేషాలు, ఫొటోలను అభిమానుల కోసం పెడుతుంటారు. అలాగే సిటీలో ఏఏ కార్యక్రమాలు జరుగుతాయనే వివరాలను పేజీలో అప్డేట్ చేస్తుంటారు. ఇంకా జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల పేర్లతోనూ ఔత్సాహికులు పేజీలు నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతలకు కూడా.. జిల్లాలోని ప్రముఖ రాజకీయ నేతల పేర్లతో ఫేస్బుక్లో ప్రత్యేకంగా పేజీలు ఉన్నాయి. దీని ద్వారా వాళ్లు చేసే కార్యక్రమాల వివరాలు, ఫొటోలను అభిమానుల కోసం అప్డేట్ చేస్తుంటారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆర్కే.రోజా, భూమన కరుణాకరరెడ్డి, టీడీపీ చిత్తూరు, కఠారి మోహన్ యూత్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తలారి ఆదిత్య, సత్యప్రభ ఆదికేశవులు ఇలా తదితరుల పేర్లతో పేజీలు ఉన్నాయి. దినపత్రికల్లో వారిపై వచ్చే వార్తా విశేషాలను పేజీలో పెడుతూ అభిమానుల నుంచి లైక్స్ సంపాదిస్తుంటారు. ఎక్కువగా వాడుతోంది కళాశాలలే ఫేస్బుక్లో ఎక్కువగా పేజీలు ఓపెన్ చేసి వాడుతోంది జిల్లాలోని కళాశాలలే. దీని యూజర్స్‌గా ఉండే కళాశాల విద్యార్థులు అభిప్రాయాలు పంచుకోవడమే కాకుండా కళాశాల గురించి ప్రచారం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. శ్రీవెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎస్వీసీఈ), శ్రీవెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్వీసెట్), యోగానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్, శ్రీశ్రీనివాసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సెన్సైస్ (సీతమ్స్) ఇలా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు, శ్రీ వెంకటేశ్వరా వేదిక్ యూనివర్సిటీల పేరుతో ఎఫ్బీలో పేజీలు ఉన్నాయి. వీటికి అభిమానులు బాగానే ఉన్నారు. కళాశాలలో జరిగే ఫ్రెషర్స్‌డే, వినూత్న కార్యక్రమాల వివరాలు, ఫొటోలు పేజీల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. పేజీలకు అభిమానులుగా ఉండే విద్యార్థులు వీటికి లైక్స్ కొడుతూ కామెం ట్స్ చేసుకుంటారు. ఇంకా కళాశాల అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎవర్ని సంప్రదించాలనే వాటిపై ప్రచారం కూడా చేసుకుంటున్నారు. జిల్లాలో పాఠశాలలు, కాలేజీల పేరుతో ఎఫ్బీలో చాలా పేజీలు ఉన్నాయి. విద్యాశాఖకు ఓ పేజీ జిల్లా విద్యాశాఖ ఎఫ్బీలో ఓ పేజీ తయారు చేసుకుంది. విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను నిర్వహించే ప్రేమ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు దీనిని నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ నుంచి వచ్చే ఉత్తర్వులను వెబ్‌సైట్‌తో పాటు పేజీలోనూ పెడుతుంటారు. ప్రస్తుతం టీచర్లలో చాలా మంది స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు. వీరిలో ఎఫ్బీలో చాలా మందికి అకౌంట్ ఉంది. దీంతో విద్యాశాఖ పేజీ ద్వారా వివరాలు సులువుగానే తెలుసుకుంటున్నారు. -
సెల్లో వైద్య సలహాలు
సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించిన ఏపీఎస్ కళాశాల విద్యార్థులు అప్లికేషన్లో నిపుణులైన వైద్యుల పేర్లు, ఈ-బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లింపునకు అవకాశం సాక్షి, బెంగళూరు : అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు తాము ఉన్న చోటే వైద్య సలహాలు, సూచనలు పొందడం ద్వారా చికిత్సను అందుకునేలా నగరంలోని ఏపీఎస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఓ సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించారు. doc.onmove పేరిట రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ పనితీరును రూపకర్తలైన ప్రణతి, వినుతా, ప్రసన్నలు మీడియాకు వివరించారు. వీరంతా ఏపీఎస్ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపకర్తలు మాట్లాడుతూ...వృద్ధాప్యంతో బాధపడేవారు, అత్యవసర చికిత్స అవసరమైన వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించినట్లు చెప్పారు. నగర ప్రాంతాల్లోని వృద్ధులు తమ పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తిన ప్రతిసారి ఆస్పత్రికి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటారని అన్నారు. ఇక అత్యవసర చికిత్స అవసరమైన సందర్భాల్లో ఆస్పత్రికి చేర్చే వరకు రోగి ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉండేందుకు ప్రాథమిక చికిత్స ఎంతైనా అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. ఇక ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను తమ సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న అనంతరం ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నారనే విషయాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ వెంటనే ఆయా వ్యాధులకు సంబంధించిన నిపుణులైన వైద్యుల పేర్లన్నీ సెల్‌ఫోన్ తెరపై ప్రత్యక్షమవుతాయని తెలిపారు. అనంతరం వారిలో ఎవరోఒకరి పేరును ఎన్నుకోవాల్సి ఉంటుందని, తర్వాత ఫోన్లో లైవ్ చాటింగ్ ద్వారా వైద్యులు ఏ మందులు వాడాలి, తదుపరి ఎలాంటి చికిత్స అవసరమౌతుంది వంటి విషయాలపై సూచనలు, సలహాలు అందిస్తారని వెల్లడించారు. వైద్య సేవలకు గాను ఈ-బ్యాంకింగ్ ద్వారా వైద్యుల ఫీజును చెల్లించేందుకు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్లో అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులను సైతం వైద్యుల జాబితాలో చేర్చితే ప్రజలకు ఉచితంగా వైద్య సలహాలు అందుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ అంశాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ వ ుంత్రి యు.టి.ఖాదర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అప్లికేషన్ రూపకర్తలు తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.