
బెంగళూరు: పలువురు కాలేజీ విద్యార్థినులు, లెక్చరర్ల ఫొటోలు పోర్న్‌సైట్‌లో ప్రత్యక్షమవ్వడం బెంగళూరులో కలకలం రేపింది. దీంతో విద్యార్థులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే.. విద్యార్థినుల సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫొటోలను డౌన్‌లోడ్ చేసి పోర్న్‌సైట్లలో అప్‌లోడ్ చేసినట్టుగా గుర్తించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిని సీవీ రామన్‌నగర్‌కు చెందిన అజయ్ థనికాచలం(37), మరొకరు రాజయ్యనగర్‌కు చెందిన వికాస్ రఘోత్తమ్ (27)గా గుర్తించారు. నిందితుల్లో ఒకరైన అజయ్ ఇంజనీర్ కాగా.. మరో నిందితుడు విశ్వక్‌సేన్ బాధిత విద్యార్థినుల బ్యాచ్‌మేట్ అని తెలుస్తోంది.
ఈజీ మనీకి అలవాటు పడి తన స్నేహితుల ఫోటోలను పోర్న్‌సైట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే తమ ఫొటోలు పోర్న్సైట్‌లో అప్‌లోడ్ అయ్యాయని గుర్తించిన విద్యార్థినులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 30 వరకు ఫొటోలు అప్ లోడ్ చేసినట్టు గుర్తించారు. వెంటనే సదురు సైట్లకు మెయిల్ చేసి వాటిని తొలగించేలా చర్యలు తీసుకున్నారు. నిందితుల మొబైల్ ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి సందీప్ పాటిల్ తెలిపారు. (సైబర్ ‘కీచకుల’ ఆటకట్టు)
Comments
Please login to add a commentAdd a comment