లవ్‌ ఎఫైర్‌.. అమ్మాయి కోసం నడిరోడ్డుపై తన్నుకున్న స్టూడెంట్స్‌ | Fight Between College Students In Tamil Nadu Over Love Affair | Sakshi
Sakshi News home page

ఎంత ఘాటు ప్రేమయో.. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్టూడెంట్స్‌.. చివరకు..

Published Sat, Oct 29 2022 3:11 PM | Last Updated on Sat, Oct 29 2022 3:11 PM

Fight Between College Students In Tamil Nadu Over Love Affair - Sakshi

కాలేజ్‌ డేస్‌లో లవ్‌ వ్యవహరం పెద్ద రచ్చే చేసింది. ఒకే అమ్మాయిని ఇద్దరు స్టూడెంట్స్‌ ప్రేమించడంతో వారి మధ్య పెద్ద ‍యుద్ధమే నడిచింది. వారిద్దరూ రెండు గ్రూపులను ఏర్పాటుచేసి అ‍మ్మాయి నాదంటే నాది అని చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. కుడ్డలూరుకు చెందిన ఓ ప్రైవేటు కాలేజీలో వరుణ్‌, సుధాకర్‌ అనే ఇద్దరు విద్యార్థులు చదువుతున్నారు. కాగా, అనూహ్యంగా వీరిద్దరూ అదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమించారు. ఈ ప్రేమ విషయంలో​ వారి మధ్య పెద్ద తగాదానే నడిచింది. సినిమా రేంజ్‌లో ఒకరికి ఒకరు వార్నింగ్‌ సైతం ఇచ్చుకున్నారు. సినిమాలో హీరో స్టైల్‌లో తనే నా హీరోయిన్‌ అంటూ మాటల వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహరంలో వారిద్దరూ రెండు గ్రూపులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. 

ఈ క్రమంలో​ శుక్రవారం బస్సు కోసం బస్‌స్టాప్‌లో వేచిచూస్తుండగా.. వారిద్దరూ ప్రేమించిన అమ్మాయి అక్కడికి రావడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రెండు గ్రూపుల సపోర్టర్లు అక్కడికి చేరుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నడిరోడ్డుపై చిత్తుగా తన్నుకున్నారు. ఇక, ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement