చెన్నై: అతనో కలెక్టర్.. తన కింది స్థాయి ఉద్యోగులతో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన అతి చేశారు. ఆయన చేసిన తప్పిదం కారణంగా తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఓ కలెక్టర్ తన కింది స్థాయి ఉద్యోగిని తన బూట్లు తీసుకెళ్లమని కోరడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోపై నెటిజన్లు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. తమిళనాడులోని కళ్లకురిచి కలెక్టర్ శ్రావణ్ కుమార్ జాతావత్ ఓ ఆలయం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆలయంలోకి ప్రవేశించే ముందు తన బూట్లను తీసుకెళ్లమని అసిస్టెంట్‌ని కోరాడు. దీంతో, వెంటనే ముందుకు వచ్చిన అసిస్టెంట్.. కలెక్టర్ బూట్లను తీసుకెళ్లాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అధికారులతో సహా నెటిజన్లు కలెక్టర్ తీరును విమర్శిస్తున్నారు. అయితే, ఈ వీడియోపై సదరు కలెక్టర్ స్పందిస్తూ.. అది నిజం కాదని బుకాయించారు. కలెక్టర్ తనవైపు ఎలాంటి తప్పు చేయలేదని ఖండించాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ శరవణ్ కుమార్ జాతావత్ స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కింది ఉద్యోగులను తన బూట్లు తీయమని ఎప్పుడూ అడగలేదని చెప్పారు. ఉత్సవానికి ముందు.. కువాగం కూతాండవర్ ఆలయాన్ని సందర్శించి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లను పరిశీలించడానికి అక్కడికి వచ్చినట్టు తెలిపారు. తన బూట్లను తీసుకెళ్లమని తను అసిస్టెంట్‌కి ఎప్పుడూ సూచించలేదన్నారు. సోషల్ మీడియాలోని వీడియో ఎడిట్ చేయబడిందనీ, తప్పుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు సోషల్ మీడియాతో స్పందిస్తూ.. తోటి ఉద్యోగితో ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు .. గుడి దగ్గర వరకు బూట్లు వేసుకొని వెళ్లడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు.
#எங்கேசமூகநீதி
— எழில் ஆதித்தமிழன் (@EzhilAathi) April 12, 2023
கள்ளக்குறிச்சி கலெக்டர் ஷர்வண்குமார் தன்னுடைய உதவியாளரை அழைத்து காலணியை எடுத்து செல்ல சொன்ன வீடியோ ...#Kallakurichi #collector @CMOTamilnadu @tnpoliceoffl @VinothKumar_25 @surendhar_RK pic.twitter.com/8eRLwXb3lm
Comments
Please login to add a commentAdd a comment