
సోషల్ మీడియా యూజర్ల ఆగడాలు రోజుకి రోజుకి మరింత ఇబ్బంది కరంగా మారుతున్నాయి. తాజాగా ఇదేం చోద్యం రా బాబూ అనిపించేలా ఒక ఒక షూట్ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. ఇది విశాఖపట్నం నగర వీధుల్లోచూసినట్టు తెలుస్తోంది.
నడిరోడ్డుమీద అందంగా ముస్తాబైన ఒక అమ్మాయిని అడ్డంగా నిలబెట్టి వీడియో తీస్తున్నాడో వ్యక్తి. అటూ ఇటూ వాహనదారులు ఇబ్బందిగా చూస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడవచ్చు. బ్యాక్ గ్రాండ్‌లో తెలుగు పాటను, ఫోటోగ్రాఫర్ తెలుగులో ఇస్తున్న డైరెక్షన్స్‌ను కూడా ఈ వీడియోలో మనం గమనించవచ్చు.
ప్రతీక్ సింగ్ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. బిజీగా ఉన్న రోడ్డులో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అవసరమా అనే క్యాప్షన్‌తో దీన్ని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వైజాగ్ ట్రాఫిక్ పోలీసును ట్యాగ్ చేస్తూ దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమెంట్ చేశారు.
The courage, the confidence, and the excitement
Pre-wedding shoot on a bustling road.
Is it necessary? pic.twitter.com/Es4hTmuf47— Prateek Singh (@Prateek34381357) June 14, 2024