Viral News
-
మిలియనీర్లకు మించి అదిరిపోయే విందు : సోషల్‌మీడియాలో సందడే సందడి!
ప్రతిరోజూ ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వింతగా, మరికొన్నిఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా పాకిస్తాన్‌లోని ఒక బిచ్చగాడి కుటుంబం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ భారీ విందు ఇవ్వడం సోషల్ మీడియాలో విశేషంగా మారింది. స్టోరీ ఏంటంటే..దేవాలయాల వద్ద, వివిధ కూడళ్ల వద్ద బిచ్చమెత్తుకునే బిచ్చగాళ్లకు సంబంధించిన కథనాలు గతంలో చాలానే విన్నాం. చేసే వృత్తి భిక్షాటన అయినా, ఖరీదైన ఆస్తులు, ఇల్లు కలిగి ఉండటం తెలుసు. కానీ స్వయంగా బిచ్చమెత్తుకుని జీవనం సాగించే ఒక కుటుంబం దాదాపు 20 వేలమందికి పసందైన విందు ఇవ్వడం లేటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. అది కూడా ఇంట్లోని పెద్దావిడ చనిపోయి, 40వ రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం విశేషంBeggars in Gujranwala reportedly spent Rs. 1 crore and 25 lacs on the post funeral ceremony of their grand mother 🤯🤯Thousands of people attended the ceremony. They also made arrangement of all kinds of meal including beef, chicken, matranjan, fruits, sweet dishes 😳😳 pic.twitter.com/Jl59Yzra56— Ali (@PhupoO_kA_betA) November 17, 202420వేల మంది అతిథులు, 2 వేల వాహనాలు గుజ్రాన్వాలాలోని రహ్వాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులను వేదిక వద్దకు తరలించడానికి సుమారు 2,000 వాహనాలను కూడా ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం కోసం, సిరి పాయె, మురబ్బా వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు పలు మాంసాహార వంటకాలను వడ్డించారు. ఇందుకోసం 250 మేకలను వినియోగించినట్టు సమచారం. వీటితోపాటు మటర్ గంజ్ (స్వీట్ రైస్), అనేక తీపి వంటకాలతో అతిథుల నోరు తీపి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. దీనిపై నెటిజన్లు, అటు సానుకూలంగా,ఇటూ ప్రతికూలంగానూ కామెంట్స్ చేశారు. -
హైదరాబాద్ లో ఆర్జీవీ కి నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు
-
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ పై జనం ఆగ్రహం
-
‘ఎమ్మెల్యే సాబ్ మీకే ఓటు వేశా.. నా పెళ్లి చేయండి ప్లీజ్’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేకు ఓటు వేసినందుకు తనకు పెళ్లి చేయాలని కోరాడు ఓ వ్యక్తి. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యే కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో, వారి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. యూపీలోని చర్ఖారీ నియోజకవర్గానికి బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ పర్యటించిన అనంతరం.. బ్రిజ్‌భూషణ్ తన వాహనంలో వెళ్తూ మహోబా ప్రాంతంలో పెట్రోల్ కొట్టించుకునేందుకు ఒక బంక్ వద్ద కారును ఆపారు. ఈ సందర్భంగా అక్కడే పనిచేస్తోన్న స్థానిక వ్యక్తి అఖిలేంద్ర ఖరే.. ఎమ్మెల్యేను చూసి ఆయన వద్దకు వచ్చారు.అయితే, అఖిలేంద్ర ఖరే తనను ఏదైనా అడిగేందుకు వస్తున్నాడని ఎమ్మెల్యే భావించారు. ఇంతలో ఎమ్మెల్యే వద్దకు వచ్చిన అఖిలేంద్ర.. సర్ నా ఓటు మీకే వేశాను. దయచేసి నాకు పెళ్లి చేయండి ప్లీజ్ అని అడిగాడు. దీంతో, ఖంగుతున్న ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్.. నీ వయసెంత అని అడిగాడు.. 44 అని చెప్పడంతో.. మరి ఎలాంటి అమ్మాయి కావాలేంటి? అని ఎదురు ప్రశ్న వేశారు.దానికి ఖరే బదులిస్తూ.. కొన్ని వర్గాలకు చెందిన వారు వద్దని సమాధానం ఇవ్వగా.. అలా ఎప్పుడూ వివక్ష చూపకూడదని, ఎవరితో రాసిపెడితే వారితోనే వివాహం జరుగుతుందని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో నీకు త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటున్నా. నాకు ఓటేశావు కదా.. నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పుకొచ్చారు. దీంతో, వీరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: వయనాడ్‌లో ప్రియాంక ప్రత్యర్థి సత్యన్ మొకెరి -
ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి
-
Gold Rate Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..
-
జ్యువెలరీ షోరూంలో రూ.6 కోట్లు నగలు చోరీ
-
భవిష్యత్ తరాలకు రతన్ టాటా రతనాల మాటలు
-
అవయవదానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులు
-
నార్కో టెస్టుకు కోర్టు సంచలన తీర్పు
-
పందొమ్మిదేళ్లకు.. ‘ఫ్యామిలీ ట్రీ’ట్!
జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఒక విద్యార్థి రిన్. ఇరవై ఏళ్ల రిన్ని ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కాలేజీ వాళ్లు ‘ఫ్యామిలీ ట్రీ’ తయారుచేయమన్నారు. తల్లి తప్ప మరెవరూ లేకపోవడంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు రిన్. తల్లి సచియే తకహతాను అడిగాడు. తల్లి–తండ్రి విడిపోయే సమయంలో రిన్ వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే. వారు విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ‘ఆధారాల కోసం వెతికే క్రమంలో కొన్ని పాత ఫ్యామిలీ ఫొటోలు, తండ్రి సుఖ్‌పాల్ పేరు, అమృతసర్ అడ్రస్ దొరికాయి. గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ కోసం వెతికి, టికెట్ బుక్ చేసుకొని ఆగస్టు 15న పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి చేరుకున్నాడు.అయితే విధి అతన్ని మరింతగా పరీక్ష పెట్టింది. సుఖ్‌పాల్ అక్కడి నుండి ఎప్పుడో వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడని తెలిసింది. తండ్రి ప్రస్తుతం ఉంటున్న అడ్రెస్ ఎవరూ చెప్పలేకపోయారు. ‘నా దగ్గర మా నాన్న పాత ఫొటోలు ఉండటంతో స్థానిక ప్రజలను అడిగి కనుక్కోవడానికి ప్రయత్నించాను. చాలా మందిని అడిగాక అదృష్టం కొద్దీ ఒక వ్యక్తి నా తండ్రి ఫొటో గుర్తించి, అతని కొత్త చిరునామా నాకు ఇచ్చే ఏర్పాటు చేశాడు. అలా 19 ఏళ్ల తర్వాత మా నాన్నను మళ్లీ కలవగలిగాను’ అని తండ్రిని కలుసుకున్న ఉద్విగ్న క్షణాలను పంచుకుంటున్నాడు రిన్.‘ఇలా జరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ, జరిగింది. నా ప్రస్తుత భార్య గుర్విందర్‌జిత్ కౌర్, నా ఏకైక కుమార్తె అవ్లీన్ కూడా రిన్ను కుటుంబంలోకి హృదయపూర్వకంగా స్వాగతించినందుకు సంతోషంగా ఉన్నాను. నా మాజీ భార్య సచియేతో ఫోన్లో మాట్లాడాను. రిన్ క్షేమం గురించి చె΄్పాన’ని సుఖ్‌పాల్ కొడుకును కలుసుకున్న మధుర క్షణాలను పంచుకుంటున్నాడు.రక్షాబంధన్ రోజే...రిన్ తండ్రి కుటుంబాన్ని కలవడం, పండగప్రాముఖ్యతను గురించి తెలుసుకొని, ఆ రోజు సవతి సోదరి అవ్లీన్ చేత రాఖీ కట్టించుకోవడం.. వంటివి రిన్ను థ్రిల్ అయ్యేలా చేశాయి. ‘మా సోదర–సోదరీ బంధం చాలా బలమైనది’ అని ఆనందంగా చెబుతాడు రిన్.కొడుకును అమృత్‌సర్‌కి తీసుకెళ్లి..ఇన్నేళ్లకు వచ్చిన కొడుకును వెంటబెట్టుకొని సుఖ్‌పాల్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించుకున్నాడు. అటారీ వాఘా సరిహద్దులో జరిగిన జెండా వేడుకను వీక్షించారు. సుఖ్‌పాల్ తన గతాన్ని వివరిస్తూ ‘2000 సంవత్సరం మొదట్లో థాయ్‌లాండ్ విమానాశ్రయంలో భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా సచియేను చూశాను. విమానంలో మా సీట్లు పక్కపక్కనే ఉన్నాయి. అలా మా మొదటి సంభాషణ జరిగింది. ఆమె వరుసగా ఎర్రకోట, తాజ్‌మహల్‌లను సందర్శించడానికి న్యూఢిల్లీ, ఆగ్రాకు వెళుతోంది.గోల్డెన్ టెంపుల్ గురించి చెప్పి, అమృత్‌సర్‌కి తన పర్యటనను పొడిగించమని సచియేని నేనే అడిగాను. ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పి అమృత్‌సర్‌కి నాతో పాటు వచ్చింది. మా కుటుంబంతో కలిసి 15 రోజులకు పైగా ఉంది. ఇక్కడ ఉన్న సమయంలో స్థానిక పర్యాటక ప్రదేశాలతో పాటు ఎర్రకోట, తాజ్‌మహల్‌ను సందర్శించాం. సచియే జపాన్‌కు వెళ్లాక కూడా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు తనకు 19 ఏళ్లు, నాకు 20 ఏళ్లు. 2002లో సచియేను వివాహం చేసుకుని, జపాన్ పర్యటనకు వెళ్లాను. ఏడాది తర్వాత రిన్ జన్మించాడు. నేను జపనీస్ నేర్చుకున్నాను. అక్కడ చెఫ్‌గా పని చేశాను.కొన్ని రోజుల తర్వాత మేం కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేకపోయాం. దీంతో నేను భారతదేశానికి తిరిగి వచ్చేశాను. ఆమె రిన్‌తో కలిసి నన్ను చూడటానికి భారతదేశం వచ్చింది. మరోసారి తనతో కలిసి జపాన్‌కు వెళ్లాను. కానీ, కలిసి ఉండలేకపోయాం. 2004లో విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత మూడేళ్ళు జపాన్‌లోనే ఉన్నా కానీ, వారిని కలవలేదు. 2007లో స్వదేశానికి తిరిగి వచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు మేమంతా రిన్‌తో టచ్‌లో ఉంటాం’ అని గత స్మృతులను, ప్రస్తుత ఆనందాన్ని ఏకకాలంలో పొందుతూ ఆనందంగా చెబుతున్నాడు సుఖ్‌పాల్. -
భర్త పదవీ విరమణ.. కేరళ కొత్త సీఎస్ భార్య
-
వాట్సాప్‌లో.. వైరల్ అవుతున్న నిజామాబాద్ షాప్ ఫ్లెక్సీ!
ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఢిల్లీవాలా స్వీట్ హోంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వీట్ హోమ్ వద్ద పార్కింగ్ సదుపా యం లేకపోవడంతో కొనుగోలుదారులు వాహనాలను రోడ్డుపైనే నిలుపుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.ఆదివారం రోజున గాంధీచౌక్ నుంచి మమత సర్కిల్ వరకు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులతో స్వీట్‌హోం నిర్వాహకులు గొడవపడ్డారని, ఆ తరువాత పోలీసుల వేధింపుల కారణంగా స్వీట్హోంను మూసివేస్తున్నామని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి న్యూసెన్స్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ వాలా స్వీట్ హోంపై బీఎన్ఎస్ కింద క్రైం నంబర్ 343/2024, యూ/ఎస్ 221, 224, 285 కింద కేసు నమోదు చేసి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు నివేదిక పంపించినట్లు ప్రకటనలో తెలిపారు. ఢిల్లీవాలా స్వీట్ హోం వారు పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి ని శాఖ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదని పేర్కొన్నారు. -
7 రోజులుగా వీడని బాలిక మిస్సింగ్ మిస్టరీ..
-
రాంబిల్లి మైనర్ బాలిక ఘటనపై
-
మాతో రాజాకీయం చేస్తే ఊరుకోం..
-
అర్ధరాత్రి ముజ్రా పార్టీ
-
ఈవీఎంలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
-
శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం
-
రాజ్ తరుణ్ లవర్ లావణ్య సంచలన ఆడియో
-
సమంత వివాదాస్పద పోస్ట్ మండిపడుతున్న డాక్టర్లు
-
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శించిన సోనూసూద్
-
అడ్డంగా దొరికిన టీవీ5 సాంబశివరావు..
-
ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో డీఎం విందు?
కరీంనగర్: వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మురళీకృష్ణ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి ఇంట్లో విందు చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీంతో మద్యం తాగడం వ్యక్తి గతమైన విషయమైనప్పటికీ ఉద్యోగుల ఇళ్లలో ఇలా చేయడం ఇబ్బందికరమని పలువురు పోస్ట్ లు పెడుతున్నారు. దీనిపై డీఎంను వివరణ కోరగా గతేడాది జూలైలో ఉద్యోగి ఇంటికి తీజ్ ఉత్సవాలకు వెళ్లానని, ఎలాంటి మద్యం తీసుకోలేదని తెలిపారు. 10 నిమిషాలు మాత్రమే ఉండి వచ్చా నని, ఎవరో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. -
క్షీణించిన మంత్రి ఆతిషి ఆరోగ్యం