వామ్మో ఈ దారా? ప్రాణం పోయినంత పనైపాయె!! | It Was A Terrible Tunnel Social Media Viral Video | Sakshi
Sakshi News home page

వామ్మో ఈ దారా? ప్రాణం పోయినంత పనైపాయె!!

Published Wed, May 29 2024 2:12 PM | Last Updated on Wed, May 29 2024 2:40 PM

It Was A Terrible Tunnel Social Media Viral Video

మనం తెలియని ప్రదేశాలలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనలో మనకే చిన్నగా భయం మొదలవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భయం మరింత రెట్టింపవుతుంది. ప్రయాణించే దారిలో ఎలాంటి సంఘటనలు తారసపడుతాయో అనే సందేహం మనసులో ఏదో మూలన ఉండకమానదు. అదేవిధంగా ఈ వీడియోలో ఎదురైన ఈ సొరంగమార్గం కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసెయ్యండి!

వామ్మో ఇది పాతాళమేనా అన్నట్లుగా..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా తనకు ఓ కొండ ఎదురైంది. ఆ కొండ దాటడానికి సొరంగ మార్గం ఒక్కటే దిక్కు. చేసేదేమిలేక కారుని ముందుకు నడిపాడు. కారు ఆ గుహ మార్గంలోకి ప్రయాణించింది. అంతా చీకటిమయం. ఎదురుగా ఏముందో కనిపించే వీలులేదు. కారుకు ఉన్న లైట్లే అతని ధైర్యం. ఆ మార్గం కైలాసం ఆడుతున్నట్లుగా అన్నీ వంక మలుపులే. అక్కడక్కడా మనసు కుదుటపడేలా.. లెఫ్ట్‌, రైట్‌ టర్నింగ్‌ సంకేతాలు. ఇవేగానీ లేకపోతే ముందుకు సాగకపోవడమో, ప్రమాదం జరగడమో ఖాయం.

వెళ్తున్నా కొద్ది సొరంగ మార్గం తనకు తానే దారి పొడవు పెంచుతున్నట్లుగా సాగుతూనే ఉంది. ఆ గుహలోంచి బయట ఎప్పుడు పడాల్లా అనేవిధంగా భయంతో కూడిన ఆతృత. కారు పైభాగం గుహకు తాకుతున్నట్లుగా ఆలోచన. చిమ్మని చీకటి... మరోసారి మళ్లీ ఈ దారిలోకి వద్దామా? బయటికి మార్గం ఉందా? లేక ఎక్కడైనా ఇరుక్కుపోతానా? వెనక్కి వెళ్లలేం! ముందుకే తప్ప మరేదిక్కులేదు! ఇప్పుడెలా?  వెళ్తున్నానుగా... అనే ఆలోచనలు లోలోనే దిగమింగుతూ తేరుకునేలోపు సొరంగమార్గం ముగిసిపోయి.., బయటిదారి ఎదురయ్యేసరికి ప్రాణం గుప్పిట్లో దాచుకుని హమ్మయ్య!! అనుకున్నాడు ఆ డ్రైవర్‌.

 

 

ఇవి చదవండి: ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement