fearfull
-
వామ్మో ఈ దారా? ప్రాణం పోయినంత పనైపాయె!!
మనం తెలియని ప్రదేశాలలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనలో మనకే చిన్నగా భయం మొదలవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భయం మరింత రెట్టింపవుతుంది. ప్రయాణించే దారిలో ఎలాంటి సంఘటనలు తారసపడుతాయో అనే సందేహం మనసులో ఏదో మూలన ఉండకమానదు. అదేవిధంగా ఈ వీడియోలో ఎదురైన ఈ సొరంగమార్గం కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసెయ్యండి!వామ్మో ఇది పాతాళమేనా అన్నట్లుగా..ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా తనకు ఓ కొండ ఎదురైంది. ఆ కొండ దాటడానికి సొరంగ మార్గం ఒక్కటే దిక్కు. చేసేదేమిలేక కారుని ముందుకు నడిపాడు. కారు ఆ గుహ మార్గంలోకి ప్రయాణించింది. అంతా చీకటిమయం. ఎదురుగా ఏముందో కనిపించే వీలులేదు. కారుకు ఉన్న లైట్లే అతని ధైర్యం. ఆ మార్గం కైలాసం ఆడుతున్నట్లుగా అన్నీ వంక మలుపులే. అక్కడక్కడా మనసు కుదుటపడేలా.. లెఫ్ట్, రైట్ టర్నింగ్ సంకేతాలు. ఇవేగానీ లేకపోతే ముందుకు సాగకపోవడమో, ప్రమాదం జరగడమో ఖాయం.వెళ్తున్నా కొద్ది సొరంగ మార్గం తనకు తానే దారి పొడవు పెంచుతున్నట్లుగా సాగుతూనే ఉంది. ఆ గుహలోంచి బయట ఎప్పుడు పడాల్లా అనేవిధంగా భయంతో కూడిన ఆతృత. కారు పైభాగం గుహకు తాకుతున్నట్లుగా ఆలోచన. చిమ్మని చీకటి... మరోసారి మళ్లీ ఈ దారిలోకి వద్దామా? బయటికి మార్గం ఉందా? లేక ఎక్కడైనా ఇరుక్కుపోతానా? వెనక్కి వెళ్లలేం! ముందుకే తప్ప మరేదిక్కులేదు! ఇప్పుడెలా? వెళ్తున్నానుగా... అనే ఆలోచనలు లోలోనే దిగమింగుతూ తేరుకునేలోపు సొరంగమార్గం ముగిసిపోయి.., బయటిదారి ఎదురయ్యేసరికి ప్రాణం గుప్పిట్లో దాచుకుని హమ్మయ్య!! అనుకున్నాడు ఆ డ్రైవర్. View this post on Instagram A post shared by Usha Vardhan (@usha.vardhan.96) ఇవి చదవండి: ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ -
దయనీయ స్థితిలో ఆఫ్గన్ శరణార్థులు
పొరుగుదేశం పాకిస్తాన్లో ఆఫ్గన్ శరణార్థులు దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లబుచ్చుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకూ సుమారు ఆరు లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను పాకిస్తాన్ వారి స్వస్థలాలకు బలవంతంగా తిరిగి పంపింది. అయితే ఇప్పటికీ పాక్‌లో కనీసం 10 లక్షల మంది ఆఫ్గన్ శరణార్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.బహిష్కరణ భయంతో ఆఫ్గన్ శరణార్థులు అజ్ఞాతంలో జీవిస్తున్నారు. పాకిస్తాన్లో తల దాచుకుంటున్న వీరు తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. తలదాచుకున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. దీంతో వీరికి జీవనోపాధి, అద్దె ఇల్లు, నిత్యావసరాల కొనుగోలు మొదలైనవి ఎంతో కష్టతరంగా మారాయి.తాజాగా కరాచీ పోలీసులు 18 ఏళ్ల ఆఫ్గన్ యువకుడి నుంచి నగదు, ఫోన్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని డిపోర్టేషన్ సెంటర్‌కు పంపారు. అక్కడి నుంచి ఆ యువకుడిని ఆఫ్ఘనిస్థాన్‌కు తరలించారు. కాగా అతని తల్లిదండ్రులు 50 ఏళ్ల క్రితం ఆఫ్గనిస్తాన్ వదిలి పాక్ తరలివచ్చారు.ఆ యువకుడు ఇంతవరకూ ఎప్పుడూ ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లలేదు. అతనిని ఆఫ్గనిస్తాన్ తరలించినప్పుడు అతని దగ్గర కట్టుబట్టలు తప్ప మరేమీ లేవని స్థానికులు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్‌లో యుద్ధ పరిస్థితుల మధ్య 17 లక్షల మంది పాకిస్తాన్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. ఇలా చట్టపరమైన అనుమతులు లేకుండా వచ్చినవారిని తిరిగి ఆ దేశానికి పంపేందుకు పాక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. -
ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా!
నిత్యం కాలం పరుగెడుతున్నట్లూ.. ఈ లోకం పరుగెత్తక తప్పదు. అందులో ఎన్ని చిక్కులున్నా, ఎన్ని అడ్డంకులున్నాగానీ వాటిని అధికమిస్తూ సాగక తప్పదు. ఇలాంటి తరుణంలో మనుషుల విషయానికొస్తే.., వారిలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలాగా ఉంటుంది. కొందరు ఎంతో ధైర్యవంతులుగానూ, మరికొందరు పిరికితనంగానూ కనిపిస్తుంటారు. ఇది సహజమే. ఇలాంటి ధైర్యాలకూ, భయాలకు రకరకాల ఫోబియాల పేర్లతో పిలుస్తుంటాం. అలాగే నిద్దుర విషయానికొస్తే.., ప్రతిరోజూ ఆహారం ఎంత అవసరమో, నిద్ర కూడా అవసరమే! అయితే, కొందరు నిద్దుర అంటేనే చికాకు పడుతూ, అసలు నిద్దురే రావటంలేదంటారు. ఏదో ఒక పనిలో నిమగ్నమౌతుంటారు. నిద్రపోవాలంటేనే కొందరు విపరీతంగా భయపడతారు. ఇలాంటి ఈ భయాన్నే ‘సోమ్నిఫోబియా /హిప్నోఫోబియా’ అంటారు. ఇవి చదవండి: ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వల్ల ఆ సమస్యలు ! పరిశోధనలో షాకింగ్ విషయాలు -
మిస్టరీ: అక్కడికి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా?
ప్రపంచాన్ని వణికించే ప్రదేశాల్లో ‘దార్గాస్’ ఒకటి. రష్యాలోని ‘నార్త్ ఒసీషియా– అలానియా’ రిపబ్లిక్లో గిజెల్డన్ నది సమీపంలో ఉన్న ఓ చిన్న పర్వతం మీద ఉన్న దార్గాస్ గ్రామాన్ని ‘సిటీ ఆఫ్ ది డెడ్’ అని పిలుస్తారు. దీన్ని గ్రామం అనే కంటే శ్మశానాల దిబ్బ అనడమే కరెక్ట్. అక్కడి స్థానికులు పగటి పూట కూడా ఆ పర్వతం మీదకు ఒంటరిగా వెళ్లరు. ఆ దరిదాపుల్లో ఒంటరిగా తిరగరు. రాత్రి అయితే ఆ పర్వతం వైపు చూడను కూడా చూడరు. ‘నార్త్ ఒసీషియా–అలానియా’లో అత్యధికంగా నివసించే ఒసీషియన్ గిరిజన తెగకు చెందిన చరిత్రను చెబుతుంది ఈ ప్రాంతం. మధ్యయుగం నాటి ఒసీషియన్స్.. మరణించిన తమ కుటుంబసభ్యుల మృతదేహాలను ఇక్కడ పాతిపెట్టేవారట! ఇక్కడి శిథిల నిర్మాణాలు ఇంకెన్నో భయపెట్టే కథనాలతో బెదరగొడతాయి. దార్గాస్లో 99 సమాధులు చిన్నచిన్న ఇళ్ల మాదిరి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని దగ్గరదగ్గరగా.. ఇంకొన్ని దూరం దూరంగా.. మరికొన్ని ఒకదాని వెనుక ఒకటిగా.. కనిపిస్తాయి. వాటికి ఒకవైపు సుమారు నాలుగు అంతస్తుల ఎత్తులో ఒక పొడవాటి స్థూపం కూడా ఆకట్టుకుంటుంది. దాని లోపలికి దిగడానికి పెద్దపెద్ద నిచ్చెనలు ఏటవాలుగా ఉంటాయి. ఈ నిర్మాణాలన్నీ రాళ్లతో కట్టినవే! అక్కడ సుమారు 10 వేలకుపైనే అస్థిపంజరాలు ఉన్నాయని అంచనా వేశారు పరిశోధకులు. అయితే అక్కడున్న శవపేటికలు పడవ ఆకారంలో ఉన్నాయట. చనిపోయిన వారి ఆత్మ.. నదులను దాటుకుని స్వర్గానికి వెళ్లడానికి పడవ అవసరమని అక్కడి స్థానిక పురాణాలు చెబుతాయి. ఆ సమాధుల్లో వాళ్లకు ఇష్టమైన దుస్తులు, వస్తువులను కూడా ఉంచేవారు. అయితే దార్గాస్ పర్వతం మీదకు వెళ్లినవారు తిరిగిరారనే ప్రచారం కూడా ఉంది. కొందరు సాహసవంతులు ఆ పర్వతం మీదకెక్కి, అక్కడి సమాధుల మధ్యకు వెళ్లి, ఇక తిరిగి రాలేదట! దార్గాస్లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెబుతుంటారు. నిజానికి అక్కడ కేవలం 99 సమాధులే ఉన్నా, పదివేలకు పైగా అస్థిపంజరాలు ఎలా వచ్చాయి? అనే ప్రశ్నకు బదులుగా ఒక విషాదగాథ వినిపిస్తుంది. 18వ శతాబ్దంలో ఒసీషియాలో ప్లేగు వ్యాపించింది. ఆ సమయంలో ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం.. ఈ పర్వత సమాధుల మీదున్న నిర్మాణాలను పునరుద్ధరించి.. అక్కడ ప్లేగు వ్యాధిగ్రస్తులను ఉంచేవారట. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. వారికి కావాల్సిన ఆహారాన్ని, వస్తువులను అందించేవారట. వ్యాధి సోకిన వారు తిరిగి ఊళ్లోకి రావడానికి లేకుండా ఎన్నో ఆంక్షలు ఉండేవట. దాంతో ఆ పర్వతం మీదే ఎంతోమంది ప్రాణాలు విడిచారు. వారి మృతదేహాలు కనీసం ఖననానికి కూడా నోచుకోకపోవడంతో మిగిలిన వ్యాధిగ్రస్తులు కుళ్లిన మృతదేహాల పక్కనే జీవిస్తూ నరకం అనుభవించారని చరిత్ర చెబుతోంది. వరుస మరణాలతో నాటి పరిస్థితి చాలా ఘోరంగా గడిచిందట. నిజానికి దార్గాస్ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఒక పక్క నది.. మరో పక్క ఎత్తయిన కొండలు, కొన్నిసార్లు నేలమీద దట్టంగా పేరుకున్న మంచు, మంచు కరిగినప్పుడు బయటపడే ఆకుపచ్చని గడ్డి నేల.. ఇలా కాలానికి తగ్గట్టుగా మారే దార్గాస్ ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి అందరూ సాహసించరు. కొందరు సాహసికులు మాత్రమే ఇక్కడికి Ðð ళ్లి.. ఫొటోలు, వీడియోలు తీసుకుని.. సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా రాత్రిపూట దార్గాస్ కొండల మీదకు వెళ్లేందుకు అనుమతి లేదు. మరి నిజంగానే అక్కడకి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
కోవిడ్‌ను మించిన వ్యాధి మనల్ని కబళిస్తుందా?
మొన్నటి వరకూ ప్రపంచాన్ని కోవిడ్-19 వణికించింది. దీని నుంచి కాస్త దూరవుతున్నామనేంతలోనే ఇప్పుడు మరొక ప్రాణాంతక వ్యాధి సమస్త మానవాళిని చుట్టుముట్టేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా త్వరగా వ్యాపించగల ఈ కొత్త వ్యాధికి ‘డిసీజ్ ఎక్స్’ అనే పేరు పెట్టారు. కరోనా మాదిరిగానే ఈ వ్యాధి కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ప్రాణాలను కూడా మింగేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లోనే ఈ వ్యాధి పేరును మొదటిసారి ప్రకటించింది. భవిష్యత్తుకు ముప్పుగామారిన ఈ వ్యాధి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీవ్రంగా హెచ్చరించింది. 2019లో కోవిడ్-19 వేగంగా వ్యాపించడం వల్ల అనేక దేశాలలో బాధితులకు సహాయం చేయడానికి తగినంత మంది వైద్యులు, నర్సులు, మందులు, పరికరాలు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ కోవిడ్-19 ప్రపంచానికి పెద్ద సమస్యగానే ఉంది. కొందరు శాస్త్రవేత్తలు డిసీజ్ ఎక్స్ వ్యాధి నుంచి మానవాళిని రక్షించేందుకు వ్యాక్సిన్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ అనే గ్రూప్ వ్యాక్సిన్ తయారీకి కృషిచేస్తోంది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ కొత్త వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాత వ్యాక్సిన్లను తయారీ సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంచనాలకు అందని డిసీజ్ ఎక్స్ డిసీజ్ ఎక్స్ ఎంత ఘోరంగా ఉండనుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు అంచనావేయలేకపోతున్నారు. ఇది తేలికపాటి జలుబు మాదిరిగా ఉండవచ్చు లేదా కోవిడ్-19 కంటే చాలా ప్రాణాంతకం కావచ్చని వారు భావిస్తున్నారు. ఏ సూక్ష్మక్రిమి దీనికి కారణంగా నిలుస్తున్నదో, దానిని ఏ విధంగా కనుగొనాలో, ఎటువంటి చికిత్స అందించాలో వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు. అందుకే ఈ వ్యాధి విషయంలో అప్రమత్తత అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. డిసీజ్ ఎక్స్ వ్యాధి సోకిన బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ డ్రాప్స్ ద్వారా వ్యాధి వ్యాపించవచ్చు. బాధితుడు తాకిన వస్తువులపై నిలిచిన సూక్ష్మక్రిములు ద్వారానూ ఈ వ్యాధి సంక్రమించవచ్చు. ఈ వ్యాధి క్రిములను మోసే కీటకాల నుంచి కూడా వ్యాప్తి చెందవచ్చంటున్నారు వైద్య శాస్త్రవేత్తలు. జంతువుల నుంచి.. డిసీజ్ ఎక్స్ అనేది కోతులు, కుక్కలు తదితర జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒక ఊహాజనిత వ్యాధి. దీని కారణంగా ప్రపంచం మొత్తం మీద తీవ్రమైన అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రాబోయే కాలంలో జంతువుల నుంచి మానవులకు సోకే పలు రకాల వ్యాధుల్లో ఇదీ ఒకటి కానుంది. అంటువ్యాధులను వ్యాప్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న పలు వైరస్లు గతంలో కంటే వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, ఇవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిలో ఏదైనా వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డిసీజ్ ఎక్స్ సోకినపుడు బాధితునికి జ్వరం, నరాల తిమ్మిరి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధి వ్యాపిస్తే కోవిడ్‌ను మించిన ప్రమాదం వాటిల్లవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రతీఒక్కరూ పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. -
మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి!
భారత్‌లో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, ఆదివారం కొత్తగా మరో 335 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701కి పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా తాజాగా ఐదుగురు మృతి చెందారు. కరోనాతో కన్నుమూసినవారిలో నలుగురు కేరళకు చెందినవారు కాగా, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. కరోనా కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 కేసులు కేరళలో నమోదయ్యాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. కోవిడ్ -19 కారణంగా ఇప్పటివరకు 5,33,316 మంది మరణించారు. కోవిడ్-19 మరణాల రేటు 1.19 శాతం. డిసెంబర్ 8న కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కరకుళంలో పాజిటివ్ కేసు కనుగొన్నామని ఐసీఎంఆర్‌డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ మీడియాకు తెలిపారు. కాగా రాష్ట్రంలో బయటపడిన కోవిడ్ సబ్-వేరియంట్ జేఎన్.1 విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. కొత్త వేరియంట్ గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేసిన భారతీయ ప్రయాణికురాలిలో నెలరోజుల క్రితమే సబ్-వేరియంట్‌ని గుర్తించారని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఇది కూడా చదవండి: ఈ ఏటి మేటి మహిళలు వీరే! -
దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వణికిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఈ వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లు ప్రజల ఆందోళనను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్‌వేరియంట్‌ను తొలుత లక్సెంబర్గ్‌లో గుర్తించారు. ఆ తర్వాత జేఎన్.1 కేసులు యూకే, ఐస్లాండ్, ఫ్రాన్స్, అమెరికాలో కూడా వెలుగు చూశాయి. తాజాగా ఈ సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసు భారతదేశంలోనూ వెలుగు చూసింది. తాజాగా జేఎన్.1 కేసు కేరళలో నిర్ధారితమయ్యింది. దీంతో కేరళ వైద్యశాఖలో మరోమారు ఆందోళనలు కమ్ముకున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తెలిపిన వివరాల ప్రకారం కరోనాకు చెందిన ఈ సబ్‌వేరియంట్ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.2.86 వంశానికి చెందినది. దీనిని ‘పిరోలా’ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం, జేఎన్.1, బీఏ.2.86 మధ్య ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రోటీన్‌లో మార్పు. స్పైక్ ప్రోటీన్‌ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్‌ల మాదిరిగా కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. జేఎన్.1 లక్షణాలు సీడీసీ తెలిపిన ప్రకారం కరోనాలోని ఈ కొత్త సబ్‌వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో, దాని లక్షణాలు కోవిడ్-19కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం. అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చంటున్నారు. జ్వరం, నిరంతర దగ్గు త్వరగా అలసిపోవడం, జలుబు, అతిసారం, తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి జేఎన్.1కి సంబంధించి ఎటువంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. సీడీసీ అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండటాన్ని గమనిస్తే, ఇది మన రోగనిరోధక వ్యవస్థ నుండి సులభంగా తప్పించుకోగలదని అంటున్నారు. ఇతర కరోనా వేరియంట్ల కంటే జేఎన్.1 ప్రమాదకరమా కాదా అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని సీడీసీ చెబుతోంది. ఇది కూడా చదవండి: శిశువును ఈడ్చుకుపోయిన సుడిగాలి.. తరువాత? -
ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
ఢిల్లీ వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ (మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించే ఉష్ణమండల తుఫాను)కారణంగా ఇక్కడి వాతావరణంలో వేడి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అదే సమయంలో వాయు కాలుష్య స్థాయిలో కూడా ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. ఇక్కడి ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 388, అశోక్ విహార్‌లో 386, లోధి రోడ్లో 349, జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏక్యూఐ 366గా నమోదయ్యింది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎండీ)లో శనివారం ఉదయం ఒక మోస్తరు పొగమంచు నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 28 అనంతరం గాలి నాణ్యత కొద్దిగా మెరుగుపడింది. నవంబర్ 2 నుంచి కాలుష్య నివారణ చర్యలు చేపట్టిన దరిమిలా గాలి నాణ్యతలో మెరుగదల చోటుచేసుకుంది. అనవసరమైన నిర్మాణ సంబంధిత కార్యకలాపాలు నిషేధించడం, కాలుష్య కారక వాహనాలు రోడ్లపైకి రావడాన్ని నిషేధించడంతో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం -
ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం
ఉత్తరకాశీ జిల్లాలోని మరో సొరంగం స్థానికులను భయానికి గురిచేస్తోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు ఉబికివస్తుండంతో ఇక్కడి సాగునీటి కాలువ, పంట భూములు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇటీవలే కుప్పకూలిన టన్నెల్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని ఉత్తరాఖండ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (యూజేవీఎన్‌ఎల్) తెలిపింది. ఉత్తరకాశీలోని మనేరి భళి-2 ప్రాజెక్ట్‌లో 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంది. ఈ సొరంగం గుండా నీరు ప్రవహిస్తోంది. ధారసులో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంటుంది. ధారసు బ్యాండ్ సమీపంలోని మహర్‌గావ్‌లోని సొరంగం నుండి నీటి లీకేజీ రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇది క్రమంగా పెరుగుతోంది. యూజేవీఎన్‌ఎల్ ఇప్పటికే దీని మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అయినా లీకేజీ అదుపులోకి రావడం లేదు. గత రెండేళ్ల నుంచి ఇక్కడ నీటి లీకేజీ వేగంగా పెరుగుతోందని గ్రామ పెద్ద సురేంద్రపాల్ చెప్పారు. ఫలితంగా సాగునీటి కాలువ, పలు పంట భూములు దెబ్బతిన్నాయని, పలు చోట్ల భూమి కోతకు గురవుతోందని అన్నారు. ఈ సొరంగానికి తక్షణమే మరమ్మతులు చేయాలని ఆయన కోరారు. కాగా మనేరి భళి సొరంగం నీటి లీకేజీ నివారణకు మరమ్మతులు చేస్తున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని యూజేవీఎన్‌ఎల్ ఎండీ సందీప్ సింఘాల్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఇటలీ ప్రధానితో భారత ప్రధాని దోస్తీ చేస్తే.. -
దేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆదివారం, నవంబర్ 26) ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలోని సోనిపట్‌లో ఉదయం 4 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై మూడుగా నమోదైంది. రెండో భూకంప కేంద్రం అస్సాంలోని దర్రాంగ్‌లో భూమికి 22 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇది ఉదయం 7:36 గంటలకు సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై మూడుగా నమోదయ్యింది. అయితే ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. తాజాగా సంభవించిన భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండడంతో దాని ప్రభావం కనిపించలేదు. ప్రజలు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. Earthquake of Magnitude:3.0, Occurred on 26-11-2023, 04:00:43 IST, Lat: 29.15 & Long: 76.97, Depth: 5 Km ,Location: Sonipat, Haryana, India for more information Download the BhooKamp App https://t.co/71kQ5wTDF1@Dr_Mishra1966 @KirenRijiju @Indiametdept @ndmaindia @Ravi_MoES pic.twitter.com/AtUSHA5KJ5 — National Center for Seismology (@NCS_Earthquake) November 25, 2023 గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 3న నేపాల్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. దీని కారణంగా 70 మందికి పైగా జనం మరణించారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో కూడా భూకంపం సంభవించింది. భయాందోళనకు గురైన జనం ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా పలువురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ స్వల్ప భూకంపాలు భారీ భూకంపాలకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం -
నేపాల్‌లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు!
భారత్ పొరుగు దేశమైన నేపాల్‌లో ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదయ్యిందని, భూకంప కేంద్రం మక్వాన్పూర్ జిల్లాలోని చిట్లాంగ్‌లో ఉందని నేపాల్ సైన్స్ సెంటర్ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కాగా నవంబర్ 3న, నేపాల్‌లోని జాజర్‌కోట్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 153 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా ఇప్పటికీ గుడారాలలో నివసిస్తున్న దుస్థితి నెలకొంది. చలికి వీరంతా అల్లాడుతున్నారు. విపరీతమైన చలి కారణంగా ఐదుగురు మృతిచెందారు. కాగా నవంబర్ 17న మయన్మార్‌లో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం 5.7 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. షాన్ రాష్ట్రంలోని కెంగ్ టంగ్ నగరానికి నైరుతి దిశలో భూకంపం కేంద్రీకృతమయ్యింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: వందేభారత్ స్నాక్ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు? -
జమ్మూకశ్మీర్‌లో కంపించిన భూమి.. 3.9 తీవ్రత నమోదు!
జమ్మూకశ్మీర్‌లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్‌లోని దోడాలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపం భయానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి, రోడ్లపైకి చేరారు. ఎన్సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం (నవంబర్ 16) ఉదయం 9:34 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కాగా నవంబర్ 4 న నేపాల్‌లో సంభవించిన భూకంపంలో 70 మందికి పైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, వేలాది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. పలువురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు.. స్వల్ప స్థాయి భూకంపాలు భారీ భూకంపానికి సంకేతంగా నిలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంప ప్రకంపనలు తరచూ సంభవించడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇది కూడా చదవండి: 19 అగ్నిపర్వతాలు ఏకకాలంలో పేలాయా? Earthquake of Magnitude:3.9, Occurred on 16-11-2023, 09:34:19 IST, Lat: 33.05 & Long: 76.18, Depth: Doda, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/oRC4OXqC4F@Indiametdept @ndmaindia @KirenRijiju @Dr_Mishra1966 @Ravi_MoES @DDNational pic.twitter.com/uukXdJuS7T — National Center for Seismology (@NCS_Earthquake) November 16, 2023 -
పాకిస్తాన్లో భూకంపం.. 5.2 తీవ్రత నమోదు!
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భూకంప సంఘటనలు గణనీయంగా పెరిగాయి. ప్రతిరోజూ ఏదోఒకచోట భూమి కంపిస్తూనే ఉంది. ఒకే రోజులో అధిక భూకంపాలు వచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. తెల్లవారుజామున 5.35 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. దీనిని గమనించిన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఏడాది టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. గత సెప్టెంబర్ 8న మొరాకోలో సంభవించిన భూకంపం, అక్టోబర్ 7న ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం, నవంబర్ 3న నేపాల్‌లో సంభవించిన భూకంపాలు కూడా విధ్వంసాన్ని సృష్టించాయి. తరచూ భూకంపాలు చోటుచేసుకోవడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: బిర్సా ముండా ఎవరు? ప్రధాని మోదీ ఆయన జన్మస్థలికి ఎందుకు వెళుతున్నారు? -
అరుదైన వింత వ్యాధి: ఆ వృద్ధుడు 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే..!
కరోనా టైంలో లాక్డౌన్, హోం క్యారంటైన్ వంటి పదాలని విని హడలిపోయాం. ఆ కరోనా మహమ్మారికి భయపడి అంతా స్వీయనిర్బంధంలో బిక్కుబిక్కుమని గడిపాం. అయిన వారితో సహా ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా గడపాల్సిన దారుణమైన దుస్థితితో ఎన్నో అవస్థలు పడ్డాం. హమ్మయ్యా! అని ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. చాలా వరకు పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఆ గడ్డు రోజులు తల్చుకుంటునే వామ్మో! అని హడలిపోతాం. అలాంటిది ఈ వృద్ధుడు నెల, రెండు నెలలు కాదు ఏకంగా 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే జీవిస్తున్నాడు. అది కూడా అతనికి ఎలాంటి అంటు రోగం లేకపోయిన ఎవ్వరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా తనను తాను నిర్బంధించుకుని ఎందుకు ఉంటున్నాడంటే.. వివరాల్లోకెళ్తే..71 ఏళ్ల ఆఫ్రికన్ వ్యక్తి తనను తాను నిర్బంధించుకుని ఎవ్వరితోనూ సంబంధాలు లేకుండా ఏకాకిగా బతుకుతున్నాడు. అతను ఎందుకిలా జీవిస్తున్నాడో వింటే ఇలాంటి భయాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతారు. జంతువులు, నీళ్లు, నిప్పు తదితర భయాలు గురించి వాటి తాలుకా ఫోబియాల గురించి విన్నాం. కానీ ఇలాంటి అత్యంత అరుదైన ఫోబియా గురించి విన ఉండే అవకాశమే లేదు. ఐతే ఇక్కడ ఈ వ్యక్తికి ఉన్న విచిత్రమైన భయం ఏంటంటే ఆడవాళ్లు. మహిళలా!.. అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అతడికి మహిళలంటేనే చచ్చేంత భయం. మహిళ గాలి సైతం తనను తాకకూడదని ఇలా 55 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నాడు. పైగా ఇంటి చుట్టూ కంచె కూడా వేసుకున్నాడు. ఇలా ఆ వృద్ధుడు 16 ఏళ్ల ప్రాయం నుంచి స్వీయ నిర్బంధంలో ఉంటున్నాడు. విచిత్రం ఏంటంటే అతడికి మహిళలంటే భయం కానీ అతడు ఆ మహిళల సాయంతోనే జీవనం సాగిస్తున్నాడు. ఎందుకంటే అతడికి సాయం చేసేది ఇరుగుపొరుగు మహిళలే. అ వ్యక్తి తన చిన్నతనం నుంచి ఇలా ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడని, బయటకు అస్సలు రాడని చెబుతున్నారు చుట్టుపక్కల మహిళలు. పొరపాటున ఏ మహిళ అయినా అతడి ఇంటి ఆవరణలోకి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించిన నిమిషం ఆలస్యం చేయకుండా తలుపువేసేసుకుంటాడని తెలిపారు. అతనికి మహిళలంటే చచ్చేంత భయం అని చెబుతున్నారు స్థానికులు. ఈ భయం కారణంగా ఆ వ్యక్తి 77 ఏళ్ల వచ్చినా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. చివరికి అతడు ఏ పని చేయలేని స్థితికి వచ్చేశాడు. అతడి దుస్థితిని చూసి చుట్టుపక్కల మహిళలు తమకు తోచిన రీతలో ఆహారపదార్థాలను అతడి వాకిట్లో ఉంచి వెళ్లిపోతారు. అతడు మాత్రం వారు వెళ్లిపోయాక మెల్లిగా వాటిని తీసుకుంటాడు. ఇలా వేరొక జెండర్‌ని చూస్తే భయపడే మానసిక స్థితిని గైనోఫోబియా అంటారు. అతడు తీవ్రమైన గైనోఫోబియాతో బాధపడుతున్నాడు. దీన్ని వైద్య పరిభాషలో డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్‌గా పిలుస్తారు. దీన్ని క్లినికల్ పరంగా ఓ నిర్ధిష్ట భయంగా చెబుతారు వైద్యులు. ఈ ఫోబియ ఉన్నవాళ్లు స్త్రీల పట్ల అహేతుకమైన భయంతో ఉంటారట. తరుచుగా వారి గురించి ఆలోచించడంతో ఒక విధమైన ఆందోళనకు దారితీసి క్రమంగా మరింత తీవ్రమైపోతుంది. ఫలితంగా ఆయా వ్యక్తులు పొరపాటున మహిళలను చూడగానే చెమటలు పట్టేసి, శ్వాస ఆడనట్లుగా అయిపోయి ప్రాణాలు కోల్పేయే పరిస్థితికి వచ్చేస్తారని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: అత్యంత ఘాటైన మిరపగా గిన్నిస్ రికార్డు..ఒక్కటి తిన్నా ఇక అంతే!) -
అసోంలో భూకంపం.. భయంతో జనం పరుగులు!
అసోంలోని ధుబ్రిలో ఈరోజు (ఆదివారం) తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అసోంలోని ధుబ్రిలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించినప్పుడు జనం గాఢ నిద్రలో ఉన్నారు. భూ ప్రకంపనలను గుర్తించిన వెంటనే జనం తమ ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. భయంతో ఇళ్ల వెలుపలే చాలా సేపు ఉన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం తెల్లవారుజామున 3.01 గంటలకు 17 కి.మీ లోతులో సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. గత సోమవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది. సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, చంబా జిల్లాల్లో రిక్టర్ స్కేల్‌పై 2.8, 2.1 తీవ్రతతో తేలికపాటి భూకంపాలు సంభవించాయి. కాగా తాజాగా సంభవించిన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? Earthquake of Magnitude:3.1, Occurred on 01-10-2023, 03:01:33 IST, Lat: 26.08 & Long: 90.05, Depth: 17 Km ,Location: Dhubri, Assam, India for more information Download the BhooKamp App https://t.co/8bErjjuCfL@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/1mxvy1CAQ5 — National Center for Seismology (@NCS_Earthquake) September 30, 2023 -
ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు?
వేర్పాటువాది నిజ్జర్ హత్య అనంతరం భారత్, కెనడాల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. తాజాగా కెనడాలో నివసిస్తున్న ముస్లింలు ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు భారత్ తీరును తప్పుపడుతూ, ఖలిస్తానీలకు మద్దతు పలుకుతున్నారు. గతవారంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. నిజ్జర్ హత్యకు భారతదేశమే కారణమని ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మొదలైంది. ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను సస్పెండ్ చేశాయి. క్రమంగా ఈ వివాదం పెరుగుతూ వస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. సోదరభావంతో సిక్కులు, ముస్లింలు తాజాగా కెనడాలో నివసిస్తున్న ఒక ముస్లిం న్యాయవాది మాట్లాడుతూ నిజ్జర్ హత్య ఉదంతం తమను ఆందోళనకు గురిచేసిందన్నారు. సిక్కు నేత హత్య తర్వాత దేశంలోని వాతావరణం అధ్వాన్నంగా మారిందన్నారు. జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. ఇక్కడ ముస్లింలు, సిక్కులు సోదరభావంతో మెలుగుతుంటారన్నారు. గత జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన విషయం విదితమే. భారత్‌పై కఠిన వైఖరి అవలంబించాలి భారత్-కెనడా వివాదం కారణంగా కెనడాలోని పలువురు ముస్లిం కార్యకర్తలు మైనారిటీలకు మరింత రక్షణ కల్పించాలని కోరుతున్నారని ఆ న్యాయవాది తెలిపారు. భారత్‌పై కఠిన వైఖరిని అవలంబించాలని వారు కోరుతున్నారన్నారు. ప్రధాని మోదీ ముస్లింలపై వివక్ష చూపుతున్నారని కొందరు ముస్లిం కార్యకర్తలు ఆరోపిస్తున్నరని ఆ న్యాయవాది తెలిపారు. ట్రూడో ప్రభుత్వం భద్రత కల్పించాలి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కెనడియన్ ముస్లిం (ఎన్సీసీఎం) అడ్వకేసీ గ్రూప్ హెడ్ స్టీఫెన్ బ్రౌన్ మీడియాతో మాట్లాడుతూ ట్రూడో ప్రభుత్వం కెనడియన్ ముస్లింలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కెనడాలో భారత ప్రభుత్వ ఏజెంట్లు చాలా చురుగ్గా వ్యవహరిస్తారని, వారు వలసవాదులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ట్రూడో ప్రభుత్వం తమ భద్రతకు హామీ ఇవ్వాలని, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని కెనడియన్ ముస్లింలు కోరుతున్నారని బ్రౌన్ తెలిపారు. ‘ఉర్దుస్తాన్’ కూడా ఏర్పాటు చేయాలని.. ఇండియా- కెనడా వివాదం మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం ఉగ్రవాది పన్నూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్లాన్ చేశాడు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని భావించాడు. ఖలిస్తాన్ మాత్రమే కాదు, ముస్లింల కోసం ప్రత్యేక దేశంగా ‘ఉర్దుస్తాన్’ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. కాగా భారతదేశంలో ఉగ్రవాది పన్నూపై డజనుకు పైగా కేసులు నమోదయ్యాయి. అతని ఆస్తులను కూడా జప్తు చేశారు. విద్యార్థుల ఆందోళన ఇదిలా ఉండగా కెనడాలోని భారతీయ విద్యార్థుల బహిష్కరణ అంశం మరింత వేడెక్కుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ, పలువురు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో చదువుకుంటున్నవారిలో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందిన విద్యార్థులున్నారు. నకిలీ ఆఫర్ లెటర్ల ద్వారా తమకు కెనడా యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్ ఇచ్చారని ఈ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చదువుకుని, భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకు కెనడాకు వచ్చిన ఈ విద్యార్థులు భారత్‌లోని ట్రావెల్ ఏజెంట్లను తప్పుపడుతున్నారు. ఇది కూడా చదవండి: డార్క్ ఎర్త్ అంటే ఏమిటి? శాస్త్రవేత్తలు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? -
జోడియాక్ కిల్లర్ ఎవరు? సీరియల్ హత్యలు చేస్తూ, వార్తాపత్రికలకు ఏమని రాసేవాడు?
1960వ దశకంలో అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో సాయంత్రం కాగానే వీధుల్లో నిశ్శబ్దం అలముకొనేది. జనం ఆ సమయంలో తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోయేవారు. జనం ఇంతలా భయపడటానికి కారణం జోడియాక్ కిల్లర్. జోడియాక్ ఒక సీరియల్ కిల్లర్‌గా పేరొందాడు. జోడియాక్ అనేది అతని అసలు పేరు కాదు. అది ఆ సీరియల్ కిల్లర్ తనకు తానుగా పెట్టుకున్న మారుపేరు. అమెరికాలో తొలి క్లాసిక్ సీరియల్ కిల్లర్‌గా పేరొందిన జోడియాక్ ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జనాలను ఒకరి తర్వాత ఒకరిని హత్యచేస్తూ వచ్చాడు. ఈ నరహంతకుడు కొన్నిసార్లు తుపాకీతో కాల్చి, కొన్నిసార్లు కత్తితో పొడిచి జనాలను చంపేవాడు. అయితే ఈ జోడియాక్ కిల్లర్ తాను హత్య చేసిన తర్వాత వార్తాపత్రికలకు ఈ విషయమై లేఖలు పంపేవాడు. అతని ఉత్తరాలు కోడ్ లేదా సంకేత భాష రూపంలో ఉండేవి. వీటిని చదవడం చాలా కష్టంగా ఉండేది. జోడియాక్ తాను రాసే లేఖలలో పోలీసులను దుర్భాషలాడేవాడు. తాను రాసిన లేఖలను ప్రచురించకుంటే మరింత మందిని చంపేస్తానని అదే లేఖలో బెదిరించేవాడు. యువ జంటలే లక్ష్యంగా ఈ సీరియల్ కిల్లర్ మారణకాండ సాగింది. ఈ హంతకుని చేతిలో మొత్తం 37 మంది హతులయ్యారు. అలాగే ఒంటరిగా ఎవరైనా దొరికితే వారిపై దాడి చేసి, చంపేసేవాడు. ఈ నరహంతకుడు సాగించిన ఇలాంటి ఐదు హత్యలను పోలీసులు నిర్ధారించారు. అయితే తాను స్వయంగా 37 మందిని చంపినట్లు ఈ సీరియల్ కిల్లర్ పత్రికలకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ‘ది సన్’లోని ఒక నివేదిక ప్రకారం జోడియాక్ కిల్లర్ వార్తాపత్రికలకు రాసిన తన నాల్గవ లేఖలో తన పేరు జోడియాక్ అని పెట్టుకుంటున్నట్లు తెలియజేశాడు. అయితే దీనికి నిర్దిష్ట కారణం తెలియజేయలేదు. క్రైమ్ రికార్డులలో ఈ పేరుతోనే అతని మీద కేసులు నమోదయ్యేవి. కాలిఫోర్నియా పోలీసులతో సహా అమెరికాలోని అన్ని ఏజెన్సీలు, డిటెక్టివ్లు ఎవరికి వారుగా జోడియాక్ కిల్లర్ కోసం వెదికారు. అయితే అతని జాడ ఎవరికీ తెలియరాలేదు. ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. ఈ నేపధ్యంలో జోడియాక్ కిల్లర్ కేసు 2004లో మూసివేశారు. అయితే ఈ కేసు 2007లో తిరిగి తెరిచారు. ఇది కూడా చదవండి: ఎండిన బావిలో వేడినీటి కుతకుతలు?.. స్నానాల కోసం క్యూ కడుతున్న జనం! -
అపార్ట్మెంట్లో కొండచిలువ కలకలం..!
హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లోకి కొండ చిలువ ప్రవేశించడంతో స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతినగర్‌లోని సాయి ఎలైట్ అపార్ట్‌లోని పార్కింగ్ ప్రదేశంలోకి కొండ చిలువ ప్రవేశించడంతో అపార్ట్మెంట్ వాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యుడు అంకిత్ శర్మకు ఫోన్ చేయడంతో వెంటనే అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు. తన వెంట తెచ్చిన బ్యాగ్‌లో కొండ చిలువను తీసుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద నీటితో కొండ చిలువ కొట్టుకుని వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
వెంకూర్లో తోడేలు కలకలం..! ఒక్కసారిగా షాక్..!!
ఆదిలాబాద్: మండలంలోని పాత వెంకూర్ శివారులోని వాగు సమీపంలో మంగళవారం యువకుడినూ, ఎద్దుపై దాడి చేసింది. స్థానికుల వివరాల మేరకు... వెంకూర్ గ్రామానికి చెందిన రేకుల బద్రి, అతడి బావమర్ది శివతో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని పశువులను మేపుతున్నాడు. ఒకసారిగా తోడేలు బద్రిపై దాడిచేసింది. దీంతో అతడు చేతులతో పక్కకు పడేశాడు. దీంతో అక్కడే ఉన్న ఎద్దుపై దాడికి పాల్పడింది. దీంతో బద్రి, శివ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. కుటుంబ సభ్యులు బద్రిని స్థానిక వైద్యశాలకు తరలించగా.. అవసరమైన మందులు లేకపోవడంతో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఆర్వో రేష్మ, ఎఫ్‌బీవో స్రవంతి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తోడేలు పాదముద్రలుగా అధికారులు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. -
వింతజీవుల అకస్మాత్తు దాడులు.. గ్రహాంతరవాసులే అంటున్న జనం!
గ్రహాంతరవాసులు మనం ఉంటున్న భూమి మీద లేదా విశ్వంలోని మరే ఇతర గ్రహం మీదనైనా నివసిస్తున్నారా? ఈ ప్రశ్నకు ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్త కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి గురించి వేల సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. భూమిపై గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి శాస్త్రవేత్తల వాదనలు రెండు రకాలుగా ఉన్నాయి. గ్రహాంతర వాసులు విశ్వంలో ఎక్కడో ఉన్నారని, ఏదో ఒక రోజు తప్పకుండా మన ముందుకు వస్తారని ఒక వర్గం చెబుతుండగా, మరోవర్గం ఈ వాదనను పూర్తిగా ఖండిస్తోంది. పెరూలో 7 అడుగుల వింతజీవులు తాజాగా పెరూ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఆల్టో నానే జిల్లాలో ఇలాంటి ఉదంతం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహాంతరవాసుల పొడవు 7 అడుగులు ఉంది. వాటి కళ్లు పసుపు రంగులో ఉన్నాయి. చూపరులకు ఆ వింత జీవులు భయం గొలుపుతున్నాయి. ఆ వింతజీవిని చూసిన ఓ బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆమెను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. ఎదుటివారి ముఖంపై ‘ఏలియన్స్’ దాడి పెరూలోని ఆల్టో నానే జిల్లా నివాసి ఇక్విటు మాట్లాడుతూ గత కొంతకాలంగా నల్లటి హూడీలు ధరించిన ఈ ‘ఏలియన్లు’ జనాలపై దాడిచేస్తున్నాయని చెప్పారు. అలాగే ఇక్కడి గిరిజన ప్రాంతంలో నివసించే ఇకూటి జాతి ప్రజలు కూడా అకస్మాత్తుగా జనాల మధ్యలోకి వచ్చి, దాడి చేసి పారిపోతున్నారని తెలిపారు. వారు ఎదుటివారి ముఖానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారని, ఇది ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నదని తెలిపారు. 15 ఏళ్ల బాలికపై దాడి నెల రోజుల క్రితం ఆల్టో నానే జిల్లాలో తొలిసారిగా ఏలియన్స్‌గా చెబుతున్న వింత జాతి జీవులు కనిపించాయని అంటున్నారు. వారి దాడుల కారణంగా 15 ఏళ్ల బాలిక గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఈ అమ్మాయి గ్రహాంతరవాసులను చూసి భయపడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ‘వింత జీవుల నుంచి ప్రజలను కాపాడుతున్నాం’ మరోవైపు ఈ జీవులు గ్రహాంతరవాసులా లేదా మరొకరా అనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరికొందరు హుడీ ధరించిన ఇలాంటి జీవిని తమ జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేదని అంటున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే ఆ వింతజీవులు చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాయి. ఆల్టో నానే జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు జైరో రెటెగుయ్ దవిలా మాట్లాడుతూ గ్రహాంతరవాసులుగా కనిపించినవారు ఆ బాలిక మెడపై గాయం చేశారన్నారు. దీంతో రాత్రిపూట తాము కాపలాకాస్తూ, స్థానికులను రక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ వింతజీవులు రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుండటంతో, వారి రూపాన్ని సరిగా గుర్తించలేకపోతున్నామన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఇది కూడా చదవండి: Pakistan Richest Man: కేవలం 500 డాలర్లతో అమెరికా చేరుకుని.. -
నేటికీ పాక్‌ను వణికిస్తున్న హిందూ వ్యాపారి ప్యాలెస్
ప్రపంచంలో దెయ్యాలు, భూతాల కథలతో ముడిపడిన అనేక ప్రాంతాలు కనిపిస్తాయి. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ పట్టణంలోనూ అటువంటి మహల్ ఒకటి ఉంది. సూర్యాస్తమయం అయ్యాక ఈ మహల్ సమీపంలోకి రావాలంటే ఎవరైనా భయంతో వణికిపోతారు. అటువంటి సాహసం కూడా ఎవరూ చేయరు. రాత్రి వేళ విచిత్ర శబ్ధాలు పాకిస్తాన్‌కు చెందిన లోకల్ డిజిటల్ పబ్లికేషన్ బ్రాండ్ సినారియోలో ప్రచురితమైన వివరాల ప్రకారం ప్యాలెస్ పరిసరాల్లో రాత్రివేళ విచిత్రమైన శబ్ధాలు వస్తుంటాయి. భవనంలో పెద్ద ఎత్తున పార్టీలు జరుగున్నట్లు రాత్రి వేళ ఏవో శబ్ధాలు వస్తుంటాయని చెబుతారు. 1927లో రాజస్థాన్‌కు చెందిన ఒక హిందూ వ్యాపారి నిర్మించిన ఈ ప్యాలెస్‌ను పాకిస్తాన్ సర్కారు మ్యూజియంగా మార్చివేసింది. అయినప్పటికీ నేటికీ రాత్రి వేళ ఇక్కడకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు. అనారోగ్యం పాలైన భార్య కోసం.. ఈ ప్యాలెస్ నిర్మాణ విషయానికి వస్తే చరిత్రలో పేర్కొన్న వివరాల ప్రకారం 1927లో రాజస్థాన్‌కు చెందిన శివరతన్ చంద్రరతన్ అనే మార్వాడీ వ్యాపారి తన భార్యపై తనకున్న ప్రేమకు గుర్తుగా ఈ ప్యాలెస్ నిర్మింపజేశారు. శివరతన్ చంద్రరతన్ దంపతుల ప్రేమ కథ అటు పాక్‌లోనూ, ఇటు భారత్‌లోనూ వినిపిస్తుంటుంది. శివరతన్ చంద్రరతన్ మొహట్టా భార్య తీవ్రమైన వ్యాధి బారిన పడింది. ఈ నమయంలో వైద్యులు అతనికి ఒక సలహా ఇచ్చారు. సముద్రపు వేగవంతమైన గాలి తగిలే ప్రాంతంలో ఆమెను ఉంచితే, ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు ఆ వ్యాపారికి సూచించారు. వారి సలహా వినగానే ఆ వ్యాపారి రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ప్రముఖ కళాకారులను పిలిపించి, ఈ ప్యాలెస్‌ను నిర్మింపజేశారు. ఆ సమయంలో ఈ ప్యాలెస్‌లో లెక్కకుమించిన సంఖ్యలో విందువినోద కార్యక్రమాలు జరిగేవని చెబుతుంటారు. సొరంగం గుండా ఆలయానికి మార్గం అత్యంత ఆదరణ పొందిన ఈ మొహట్టా మహల్ కింది భాగంలో ఒక సొరంగం ఉంది. ఇది కరాచీలోని ఒక ప్రముఖ హిందూ దేవాలయానికి దారితీస్తుందని చెబుతారు. శివరతన్ చంద్రరతన్ మొహట్టా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆలయానికి చేరుకునేందుకే ఈ సొరంగం నిర్మించారట. ఈ మార్గం గుండానే శివరతన్ చంద్రరతన్ భార్య ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తుండేవారట. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బ్రిటీష్ పాలనా కాలంలో ఈ ప్యాలెస్ పలు అక్రమ కార్యకలాపాలకు నిలయంగా ఉండేదని, అందుకే దీనికి భూతాల నిలయం అనే పేరు వచ్చింటారు. ఇది కూడా చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది! -
అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ..
నైరుతి అమెరికాలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయి. ఇది 110 మిలియన్లకు మించిన ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికాలోని 38 నగరాల్లో ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని సమాచారం. లాస్ వెగాస్‌లో వేడిగాలులతో కూడిన ఉష్ణోగ్రత రికార్డు గరిష్ట స్థాయి 117F (47.2C)కు చేరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దక్షిణ ఐరోపాను కూడా తాకాయి. కెనడా చరిత్రలో ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు అడవుల్లో కార్చిచ్చుకు కారణంగా నిలుస్తున్నాయి. మానవ కార్యకలాపాలతో ముడిపడిన వాతావరణ మార్పులు ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. రంగంలోకి అగ్నిమాపకదళ సిబ్బంది నైరుతి యుఎస్‌లోని పలు ప్రాంతాలలో, లాస్ ఏంజిల్స్ శివార్లలో వందలాది మంది అగ్నిమాపకదళ సిబ్బంది ఉష్ణోగ్రతలను చల్లబరిచేందుకు తమవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్డబ్లుఎస్) తెలిపిన వివరాల ప్రకారం కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు ఆదివారం 128F (53.9C)కి చేరుకున్నాయి. ఇది భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా లాస్ వెగాస్‌లోని రద్దీగా ఉండే వీధులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. హోటళ్ల ఫౌంటైన్లలోకి ప్రజలు ప్రవేశించకుండా సెక్యూరిటీ గార్డులు పర్యవేక్షిస్తున్నారు. వీధులలో చెమటతో తడిసిపోతూ.. స్ట్రిప్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన హోటళ్లు, కాసినోలకు వెళుతున్న యువకులు ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాం అని తెలిపారు. లాస్ వెగాస్‌లో ఏకాస్త భవనం నీడ కనిపించినా, చిన్న చెట్టు నీడ వచ్చినా జనం అక్కడ సేద తీరుతున్నారు. కాసినోల లోపల ఎయిర్ కండిషనింగ్ అధికంగా ఉంచారు. వీధులలో చెమటతో తడిసిపోతున్న వ్యక్తులు కనిపిస్తూ ఇంతటి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. ఎల్ పాసో, టెక్సాస్‌లో 100.4F (38C) అంతకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫీనిక్స్, అరిజోనాలో ఉష్ణోగ్రతలు 17 రోజులుగా 109.4F (43C) కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం నాడు దట్టమైన మేఘాల కారణంగా ప్రజలకు స్వల్పంగా ఉపశమనం లభించింది. అయితే పగటి ఉష్ణోగ్రతలు 114F (45.5C) గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..! ‘శీతలీకరణ కేంద్రాలు’గా పబ్లిక్ భవనాలు రాబోయే రోజుల్లోనూ ఇదేస్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పిల్లలు, గర్భిణులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వారు ఎండలోకి వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. కాలిఫోర్నియా, నెవాడాలోని కొన్ని ప్రాంతాల్లోని పబ్లిక్ భవనాలు ‘శీతలీకరణ కేంద్రాలు’గా మార్చారు. జనం ఇక్కడ వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే వేసవి తీవ్రతలను చూడాలని కోరుకునే పర్యాటకులను ఈ వాతావరణం ఆకర్షిస్తోందని కొందరు అధికారులు తెలిపారు. వారు దీనిని హ్యాపీ డెత్ డే అని పిలుస్తున్నారన్నారు. హీట్ డోమ్ కారణంగా.. ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినపుడు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణ పీడనం ఎక్కువగా ఉంటే, ఆ వేడి ఎటూ విస్తరించలేక అక్కడే కేంద్రీకృతం అవుతుంది. అదే సమయంలో ఎండ కొనసాగుతూ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. దీనినే హీట్ డోమ్ అని అంటారు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఇటువంటి హీట్ డోమ్ ఏర్పడుతుంది. వచ్చే వారం మధ్య నాటికి హీట్ డోమ్ దక్షిణ అమెరికా అంతటా విస్తరించనున్నదని వాతావరణ ఛానెల్ తెలిపింది. కెనడాలో కొనసాగుతున్న కార్చిచ్చు కారణంగా అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ ప్రపంచంలో ఇప్పటికే 1.1C మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఉద్గారాలకు కోత విధించకపోతే ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా.. -
ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు
ఇటీవల అమెరికాలోనిలోని మోంటానాలో గల గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురుపడటంతో వారు నిలువునా వణికిపోయారు. అప్పుడు వారికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఉదంతాన్ని వీడియోలో బంధించారు. వన్యప్రాణుల స్వభావానికి ఆ ఎలుగుబంటి ప్రవర్తించిన తీరు ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. పర్యాటకులు అవుట్‌డోర్‌లో చేసే అన్వేషణల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తు చేసేలా ఈ వీడియో ఉంది. స్టీవ్ ఫ్రాంక్లిన్.. ఆ ఎలుగుబంటి హిడెన్ లేక్ ట్రయిల్‌లో హైకర్ల వైపుగా ఇరుకైన మార్గంలో కొండ నుంచి దిగుతున్న వీడియోను బంధించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆ ఎలుగుబంటి సియెహ్ బెండ్ సమీపంలోని వాలు పైభాగంలో ఉన్న చెట్ల మధ్య కనిపించింది. కాలిబాట నిటారుగా రాతితో ఉండటాన్ని వీడియోలో గమనించవచ్చు. దీని వలన హైకర్లు పక్కకు వెళ్లినా ఎలుగుబంటిని తప్పించుకోలేకపోయారు. అయితే ఆ ఎలుగుబంటికి దూరంగా ఆ హైకర్లు మెల్లగా సమీపంలోని కాలిబాట నుంచి వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ఆ గ్రిజ్లీ మీ వెనుకే ఉందంటూ హైకర్లను ఎవరో హెచ్చరించడం వీడియోలో వినిపిస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు కాలిబాటలో నడవడం శ్రేయస్కరంగా అనిపించిదని ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో సుమారు వెయ్యి గ్రిజ్లీ, నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు మనుషులపై దాడులు చేస్తుంటాయి. ఎలుగుబంట్లు మనుషుల విషయంలో హింసాత్మకంగా ఉంటాయని స్పష్టంగా చెప్పలేనప్పటికీ, ఎలుగుబంట్లు ఎదురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను నేషనల్ పార్క్ సర్వీస్ సూచించింది. గ్లేసియర్ నేషనల్ పార్క్‌లోని హైకర్లను సమీపిస్తున్న గ్రిజ్లీ ఎలుగుబంటి దృశ్యాలు పర్యాటకుల మదిలో నిలిచిపోతాయి. ఈ ఎలుగుబంటి తమ జాతులను, వాటి ఆవాసాలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ సంఘటన హైలైట్ చేస్తుంది. వన్యప్రాణులు ఎదురుపడినప్పుడు ఎదురయ్యే అనుభవం, వాటిని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోకు లెక్కకు మించిన వ్యూస్వస్తుండగా, కామెంట్లు కూడా అదే రీతిన వస్తున్నాయి. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
ఖమ్మంలో కరోనా కలకలం
సాక్షి, కొత్తగూడెం : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం జిల్లాలోనూ కనిపిస్తోంది. అశ్వాపురానికి చెందిన ఓ యువతి(24) ఇటలీలో ఎంఎస్ చదువుతోంది. అక్కడ కరోనా వైరస్ ప్రభావంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో ఈనెల 7న ఆమె స్వగ్రామానికి వచ్చింది. రెండు రోజుల తర్వాత జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ మణుగూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో ఈనెల 10వ తేదీన భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చింది. అయితే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆ యువతిని ఈనెల 11న ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించిన అక్కడి వైద్యులు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. కొత్తగూడెం, భద్రాచలంలో ఐసోలేషన్ వార్డులు.. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కొందరికి కరోనా లక్షణాలున్నాయని ఇటీవల సోషల్ మీడియాల్లో ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు మాస్క్‌లు ధరించారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఎవరికీ ఈ వైరస్ లేదని వైద్యారోగ్య శాఖ అధికారులు ఓ వైపు ప్రకటిస్తూనే.. మరోవైపున కరోనాపై వైద్యశాఖ సిబ్బందికి, ల్యాబ్ టెక్నీషియన్లకు, ఫార్మసిస్టులకు శిక్షణ ఇచ్చారు. కొత్తగూడెం, భద్రాచలం ఏరియా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య, విద్యాశాఖ అధికారులకు మాతా, శిశు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సుధీర గత మంగళవారం హైదరాబాద్ నుంచి శాటిలైట్ ద్వారా అవగాహన కల్పించారు. ఫిబ్రవరి 20 తర్వాత చైనా, ఇటలీ, అమెరికా తదితర దేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కర్ కూడా పీహెచ్సీ వైద్యాధికారులకు సూచించారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారి వివరాలు సేకరించాలన్నారు. అనుమానితులు ఉంటే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. అశ్వాపురంలో అప్రమత్తం.. అశ్వాపురం యువతికి కరోనా పాజిటివ్ అని తేలడంతో స్థానిక సర్పంచ్ శారద ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేశారు. అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, డీఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కర్‌నాయక్ అశ్వాపురం చేరుకుని యువతి కుటుంబ సభ్యులను హైదరాబాద్ తరలించారు. తహసీల్దార్ భగవాన్‌రెడ్డి, స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి మణికంఠారెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, వైద్యాధికారులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. -
ఏమిటీ చెర?
తెలిసో తెలియకో నేరం చేశారు.. చిన్న వయసులోనే కటకటాలపాలయ్యారు.. ఇలాంటి చిన్నారులను చేరదీసి.. సన్మార్గంలో నడిపించి.. వారికి సత్ప్రవర్తన నేర్పేందుకు ఏర్పాటుచేసినవే జువనైల్ హోమ్స్. బాల నేరస్తుల్లో మార్పుతెచ్చి వారి భవితకు బంగారుబాట వేయాల్సిన ఈ హోమ్స్ లక్ష్యానికి వ్యతిరేక దిశలో పయనిస్తున్నాయి. గుంటూరులోని నెహ్రూనగర్ జువనైల్ హోమ్‌లో నలుగురు చిన్నారులు తేలిగ్గా పరారవడం.. ఈ విషయం చర్చనీయాంశం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో సదరు హోమ్‌ను గురువారం ‘సాక్షి’ పరిశీలించగా, అడుగడుగునా అనుమాన ఆనవాళ్లే కనిపించాయి. గుంటూరు (పట్నంబజారు): గుంటూరులోని నెహ్రూనగర్ చివరన వెంకటాద్రిపేట సమీపంలో 1971లో కొత్తపేట మహిళా మండలి (కేఎంఎం) ఏర్పాటుచేశారు. 1975లో రిజిస్ట్రేషన్ అయ్యింది. అప్పటి నుంచి పిల్లలు వదిలేసిన వృద్ధులు, అనాథలు, ఎవరూ లేనివారు, కుటుంబాలకు దూరమైన మహిళలను చేరదీస్తూ వసతి కల్పిస్తున్నారు. మూడు నెలల కిందటే జువైనల్స్ సంరక్షణ బాధ్యతను కేఎంఎం తీసుకుంది. దీనిలో 30 మంది పలు నేరాలు చేసిన జువనైల్స్ ఉండగా, 60 నుంచి 70 మంది వరకూ ఆసరా లేని వృద్ధులు ఉన్నారు. వీరికి భద్రతగా ప్రైవేట్ వ్యక్తులను నియమించారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం ఈ హోమ్‌లో ఉంటున్న చిన్నారిని చూసేందుకు వచ్చిన అతని సోదరుడు యాక్సాబ్లేడును ఇచ్చి వెళ్లాడు. దానిద్వారా ఆ చిన్నారి హోమ్ వెనుక భాగంలోని తలుపులకు ఉన్న మూడు తాళాలను కోసి, దుప్పట్లు ఒక దానికి ఒకటి ముడివేసి రెండో అంతస్తు నుంచి కిందకు దిగి నలుగురు స్నేహితులతో పరారయ్యాడు. పరారీ అయిన చిన్నారులు.. తమ తల్లిదండ్రులను చూసొస్తామని లేఖ రాసి వెళ్లినట్లు తెలుస్తోంది. సత్ప్రర్తనపై శ్రద్ధ ఏదీ.. చిన్నారుల్లో మార్పునకు తీసుకోవాల్సిన చర్యల్లో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోంది. యోగా సాధన, కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలేమీ తీసుకోవట్లేదు. తామే స్వయంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నా అలాంటి వాతావరణమేమీ కనిపించలేదు. నిబంధనలివీ.. జువనైల్ హోమ్ విశాలంగా ఉండాలి. సిబ్బంది వద్ద ఎలాంటి ఆయుధాలు ఉండకూడదు. బాల నేరస్తులను మానసికంగా, శారీరకంగా శిక్షించకూడదు. బాల నేరస్తులకు కొబ్బరి నూనె, స్నానం చేసేందుకు, బట్టలు ఉతికేందుకు తగినన్ని సబ్బులు ఇవ్వాలి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత హోమ్ నిర్వాహకులదే. ప్రతి నలుగురైదుగురికి ఒక మరుగుదొడ్డి ఉండాలి. బాల నేరస్తులు ఆడుకునేందుకు ఇండోర్ పరికరాలు ఉండాలి. వారిలో నేరప్రవృత్తి తగ్గించే కార్యక్రమాలను పరిశీలనా గృహంలో నిర్వహించాలి. టీవీలను ఏర్పాటు చేయవచ్చు. బాల నేరస్తులకు ఉదయం టిఫిన్, పాలు, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాలి. వారానికి ఒకరోజు మాంసాహారం, ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి కోడిగుడ్డు ఇవ్వాలి. బంధువులు కేటాయించిన సమయంలో మాత్రమే కలవాలి. కారణమేంటి? భద్రతా సిబ్బంది ప్రైవేట్ వారైనా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలి. సెక్యూరిటీ నిమిత్తం సిబ్బంది ఉన్నారని చెబుతున్నా గేటు వద్ద వాచ్మెన్ కూడా కనిపించలేదు. సిబ్బంది మొద్దునిద్రలో ఉండటం వల్లే తాళాలు కోస్తున్నా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. అయితే, యాక్సాబ్లేడు ఇచ్చిన సమయం రాత్రి 7 గంటలు కావడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై నిర్వాహకులు ఇప్పటివరకు న్యాయస్థానానికి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. పరారీ అయిన జువనైల్స్ మంగళగిరి పోలీసులకు చిక్కారని తెలుస్తోంది. అత్యవసరమైతే అంతే.. జువనైల్ హోమ్‌లో ఉండే చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. కాలపరిమితి లేని మందులనే మెడికల్ రూమ్‌లో ఉంచడం ఇందుకు నిదర్శనం. సెలైన్లు, ఎలక్ట్రాల్ పౌడర్, ఇంజ క్షన్లో కలిపే వాటర్ ప్యాకెట్లు కాల పరిమితి చెల్లినవి. వీటిని ‘సాక్షి’ గమనిస్తుండగా, నిర్వాహకులు వాటిని బల వంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. అత్యవసరమైతే ఆస్పత్రికి తీసుకెళ్లే వాహనం కూడా ఇక్కడ అందుబాటులో లేదు. నొప్పులు, జ్వరం వస్తే వినియోగించే యాంటిబయోటిక్ మందులే తప్ప వేరే ఏమీ లేవు. నిర్వాహకులు చెబుతున్న ఏఎన్ఎం విధులకు రాలేదు. ఆరోగ్యం బాగోలేక రాలేదని నిర్వాహకులు బుకాయిస్తున్నట్లు చిన్నారులు చెబుతున్నారు. మందుల గది స్టోర్‌రూమ్‌ను తలపించేలా ఉంది. బిడ్డల్లా చూస్తాం.. కేఎంఎంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కన్నబిడ్డల్లా చూస్తాం. అయితే, సెక్యూరిటీ తప్పిదం వల్లే చిన్నారులు పరారయ్యారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే కొత్తపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశాం. – పి.రాజ్యలక్ష్మి, నిర్వాహకురాలు