నైరుతి అమెరికాలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయి. ఇది 110 మిలియన్లకు మించిన ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికాలోని 38 నగరాల్లో ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని సమాచారం. లాస్ వెగాస్‌లో వేడిగాలులతో కూడిన ఉష్ణోగ్రత రికార్డు గరిష్ట స్థాయి 117F (47.2C)కు చేరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దక్షిణ ఐరోపాను కూడా తాకాయి. కెనడా చరిత్రలో ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు అడవుల్లో కార్చిచ్చుకు కారణంగా నిలుస్తున్నాయి. మానవ కార్యకలాపాలతో ముడిపడిన వాతావరణ మార్పులు ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు.
రంగంలోకి అగ్నిమాపకదళ సిబ్బంది
నైరుతి యుఎస్‌లోని పలు ప్రాంతాలలో, లాస్ ఏంజిల్స్ శివార్లలో వందలాది మంది అగ్నిమాపకదళ సిబ్బంది ఉష్ణోగ్రతలను చల్లబరిచేందుకు తమవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్లుఎస్) తెలిపిన వివరాల ప్రకారం కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు ఆదివారం 128F (53.9C)కి చేరుకున్నాయి. ఇది భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా లాస్ వెగాస్‌లోని రద్దీగా ఉండే వీధులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. హోటళ్ల ఫౌంటైన్‌లలోకి ప్రజలు ప్రవేశించకుండా సెక్యూరిటీ గార్డులు పర్యవేక్షిస్తున్నారు.
వీధులలో చెమటతో తడిసిపోతూ..
స్ట్రిప్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన హోటళ్లు, కాసినోలకు వెళుతున్న యువకులు ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాం అని తెలిపారు. లాస్ వెగాస్‌లో ఏకాస్త భవనం నీడ కనిపించినా, చిన్న చెట్టు నీడ వచ్చినా జనం అక్కడ సేద తీరుతున్నారు. కాసినోల లోపల ఎయిర్ కండిషనింగ్ అధికంగా ఉంచారు. వీధులలో చెమటతో తడిసిపోతున్న వ్యక్తులు కనిపిస్తూ ఇంతటి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. ఎల్ పాసో, టెక్సాస్‌లో 100.4F (38C) అంతకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫీనిక్స్, అరిజోనాలో ఉష్ణోగ్రతలు 17 రోజులుగా 109.4F (43C) కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం నాడు దట్టమైన మేఘాల కారణంగా ప్రజలకు స్వల్పంగా ఉపశమనం లభించింది. అయితే పగటి ఉష్ణోగ్రతలు 114F (45.5C) గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..!
‘శీతలీకరణ కేంద్రాలు’గా పబ్లిక్ భవనాలు
రాబోయే రోజుల్లోనూ ఇదేస్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పిల్లలు, గర్భిణులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వారు ఎండలోకి వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. కాలిఫోర్నియా, నెవాడాలోని కొన్ని ప్రాంతాల్లోని పబ్లిక్ భవనాలు ‘శీతలీకరణ కేంద్రాలు’గా మార్చారు. జనం ఇక్కడ వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే వేసవి తీవ్రతలను చూడాలని కోరుకునే పర్యాటకులను ఈ వాతావరణం ఆకర్షిస్తోందని కొందరు అధికారులు తెలిపారు. వారు దీనిని హ్యాపీ డెత్ డే అని పిలుస్తున్నారన్నారు.
హీట్ డోమ్ కారణంగా..
ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినపుడు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణ పీడనం ఎక్కువగా ఉంటే, ఆ వేడి ఎటూ విస్తరించలేక అక్కడే కేంద్రీకృతం అవుతుంది. అదే సమయంలో ఎండ కొనసాగుతూ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. దీనినే హీట్ డోమ్ అని అంటారు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఇటువంటి హీట్ డోమ్ ఏర్పడుతుంది. వచ్చే వారం మధ్య నాటికి హీట్ డోమ్ దక్షిణ అమెరికా అంతటా విస్తరించనున్నదని వాతావరణ ఛానెల్ తెలిపింది. కెనడాలో కొనసాగుతున్న కార్చిచ్చు కారణంగా అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ ప్రపంచంలో ఇప్పటికే 1.1C మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఉద్గారాలకు కోత విధించకపోతే ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్‌బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా..
అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ..
Published Tue, Jul 18 2023 10:02 AM | Last Updated on Tue, Jul 18 2023 10:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment