heat
-
అయోధ్యలో.. తొలి మంచు కురిసింది..
అయోధ్య: రాముడు కొలువైన అయోధ్యలో ఈరోజు(ఆదివారం) శీతాకాలపు తొలి పొగమంచు కనిపించింది. వేడి నుంచి ఉపశమనం లభించడంతో పాటు అయోధ్యవాసులను చలి తాకింది. భక్తులు తొల పొగమంచును ఎంజాయ్ చేస్తున్నారు.అయోధ్యలో తొలి పొగమంచు ప్రభావం రోడ్లపై వెళుతున్న వాహనాలపై పడింది. వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. సరయూ తీరం, రామ్ కీ పైడీ, రాంపథ్.. ఇలా అన్ని చోట్లా పొగమంచు కనిపిస్తోంది. అయోధ్య చేరుకున్న భక్తులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది చలికాలం ఆగమనానికి ప్రతీక అని స్థానికులు అంటున్నారు.చలి ప్రవేశంతో అయోధ్యకు వచ్చే భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలుగుతోంది. అయోధ్యలో తొలిసారిగా పొగమంచు కమ్ముకోవడం శుభపరిణామమని భక్తులు భావిస్తున్నారు. కౌశాంబి నుండి అయోధ్యకు వచ్చిన భక్తురాలు రాణి మాట్లాడుతూ అయోధ్యలో పొగమంచు మాత్రమే ఉందని, చలి అంతగా లేదన్నారు. గోరఖ్‌పూర్ నుంచి అయోధ్యకు వచ్చిన నవీన్ అనే భక్తుడు మాట్లాడుతూ అయోధ్యలో కురుస్తున్న పొగమంచు చక్కని అనుభూతిని ఇస్తున్నదన్నారు.ఇది కూడా చదవండి: కార్తీకం స్పెషల్.. దేశంలోని ప్రముఖ శివాలయాలు -
హిమాచల్‌లో అకాల ఎండలు.. 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
సిమ్లా: గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో వాతావరణం వేడిగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే, జూన్ నాటి వేసవి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారింది. దీంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు.మరికొద్ది రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజానికి హిమాచల్ ప్రదేశ్‌లో సెప్టెంబర్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈనెల 15 తర్వాత హిమాచల్‌లో రెండు రోజుల పాటు వాతావరణం చల్లగా మారింది. మనాలి, కిన్నౌర్, లాహౌల్ స్పితి తదితర ప్రాంతాల్లోని పర్వతాలపై మంచు కురిసింది. అయితే గడచిన కొద్దిరోజులుగా వర్షాలు తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగాయి. సిమ్లా, మనాలిలో ప్రస్తుతం ఏర్పడిన ఉష్ణోగ్రతలు పదేళ్ల రికార్డును బద్దలు కొట్టాయి.సిమ్లా వాతావరణ కేంద్రం విడుదల చేసిన డేటాలోని వివరాల ప్రకారం ఈ నెల 23, 24 తేదీల్లో సిమ్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదైంది. ఇది గడచిన పదేళ్లలో అత్యధికం. 1994లో సెప్టెంబర్ 30న సిమ్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెంట్రీగ్రేడ్గా నమోదయ్యింది. అదేవిధంగా మనాలిలో కూడా సెప్టెంబర్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సెప్టెంబర్ 23న 27.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.మరోవైపు సెప్టెంబర్ నెలలో కాంగ్రాలో ఆల్ టైమ్ ఉష్ణోగ్రతల రికార్డు బద్దలైంది. ఈ నెలలో ఇక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ 35 డిగ్రీలకు చేరుకోలేదు. అయితే తాజాగా సెప్టెంబర్ 24న ఇక్కడ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యంత వేడిగా ఉండే హిమాచల్ జిల్లాలోనూ పరిస్థితి ఇలానే ఉంది. సెప్టెంబర్‌లో ఉనాలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ధర్మశాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల క్రితం ఇక్కడ అత్యధికంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఇది కూడా చదవండి: నదీ జలాల భాగస్వామ్యంపై భారత్‌తో బంగ్లా చర్చలు -
హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు మృతి!
జరుసలెం: అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 550 మందికి పైగా హజ్ యాత్రికులు మృతి చెందినట్లు అరబ్ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఇందులో అధికంగా ఈజిప్ట్ దేశానికి చెందినవాళ్లు ఉన్నారని, అధిక టెంపరేషన్ వల్ల కలిగిన ఆనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు.భారీగా వచ్చిన యాత్రికుల రద్దీ కారణంగా ఒక వ్యక్తి తీవ్ర గాయపడి మరణించగా, మిగతా మొత్తం ఈజిప్ట్‌కు చెందిన యాత్రికులు అధిక ఎండకు కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాత్రికుల మరణాలకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్ హాస్పిటల్ ఇచ్చినట్లు దౌత్య అధికారులు తెలిపారు. జోర్డాన్‌కు చెందినవాళ్లు 60 మందిని కలుపుకొని మొత్తంగా 577 మంది హజ్ యాత్రికులు మరణించినట్ల అధికారలు తెలిపారు. ఎండ వేడికి ఇంతపెద్ద సంఖ్యలు యాజ్ యాత్రికుల మృతి చెందటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు తెలిపారు.ఇక.. సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు సౌదీ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవటంతో హజ్ యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. -
Delhi: భానుడి ఉగ్రరూపం.. 24 గంటల్లో 33 మంది మృతి
దేశరాజధాని ఢిల్లీలో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఎండ వేడిమికి జనం పడరాని పాట్లు పడుతున్నారు. గడచిన 24 గంటల్లో వడదెబ్బకు 33 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ఐదు జిల్లాల్లో వడదెబ్బ కారణంగా మృతిచెందినవారి వివరాలు పోలీసులకు ఇంకా లభ్యం కాలేదు. వడదెబ్బకు బలైనవారిలో అత్యధికులు ఫుట్‌పాత్‌లు, నైట్ షెల్టర్లలో ఉంటున్నవారేనని పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు ప్రతిరోజూ వందకుపైగా బాధితులు వాంతులు, తల తిరగడంలాంటి సమస్యలతో వస్తున్నారు.లజ్‌పత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందారు. అలాగే నెహ్రూ నగర్ ఫ్లైఓవర్ కింద రెండు మృతదేహాలు, మూల్‌చంద్ ఆస్పత్రి ముందు ఫుట్‌పాత్‌పై ఓ వ్యక్తి మృతదేహం, మూల్‌చంద్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒకని మృతదేహం లభ్యమైంది. లజ్‌పత్ నగర్లో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉత్తర జిల్లాలో ఎనిమిది మృతదేహాలు, వాయువ్య జిల్లాలో ఏడు మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. జన్‌పథ్ లేన్ ఫుట్‌పాత్‌పై ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతల బారినపడటంతోనే వీరు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు ఎండ వేడిమికి నెమళ్లు మృతి చెందుతున్నాయని నైరుతి జిల్లా పోలీసులు తెలిపారు. గత 24 గంటల్లో పోలీసులకు లభ్యమైన 33 మృతదేహాలు ఇంకా గుర్తిపునకు నోచుకోలేదు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం వివిధ ఆస్పత్రులలో ఉంచారు. -
దక్షిణాదిన వానలు.. ఉత్తరాదిన ఎండలు
దేశంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాదిన ఎండలు మండిపోతుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు పలకరించడంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కాస్త చల్లబడింది. మొన్నటి వరకూ దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి. అయితే రుతుపవనాలు పలకరించాక, వాతావరణం మారింది. ఉత్తరాదిన భానుడి భగభగలు కొనసాగుతుంటే.. దక్షిణాదిన మాత్రం వర్షాలు పడుతున్నాయి. వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.మరో మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది ఐఎండీ.వర్షాలతో దక్షిణాది చల్లబడినా.. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ దాటింది. రానున్న రోజుల్లో ఇది 47 డిగ్రీలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది.హీట్‌వేవ్, నీటి సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న దేశ రాజధానిపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీగా విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది. ఉత్తర్‌ప్రదేశ్ మండోలాలోని పవర్ గ్రిడ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ఢిల్లీ వాసులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నగరానికి ఈ గ్రిడ్ నుంచి 1500 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సరఫరా అవుతుంది. మొత్తంగా ఉత్తరాది ప్రజలు ఇటు ఉష్ణోగ్రతలు, అటు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
మండుతున్న భూగోళం, 29 ఏళ్ల రికార్డు బద్ధలు!
ఉష్ణోగ్రతలు రికార్డులు బద్ధలుకొడుతున్నాయి. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఒకవైపు పెరుగుతున్న టెంపరేచర్లు, మరోవైపు ముంచెత్తుతున్న భారీ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అయితే.. ఇది స్వీయ తప్పిదమే అంటున్నారు నిపుణులు. మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు.పెను ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత మే నెల అత్యంత వేడి నెలగా రికార్డు క్రియేట్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎండల తీవ్రత దాదాపు సంవత్సరమంతా కొనసాగింది. ఆయా నెలలకు సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్ధలయ్యాయి. ఈ ఏడాది మేలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాగ్జిమమ్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. వాతావరణంలో విపరీతమై మార్పుల వల్ల వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఎల్‌నినోతో పాటు.. మానవ తప్పిదాలే వాతావరణ మార్పులకు కారణమంటూ ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీసెస్ వెల్లడించింది.ఈ ఏడాది మే నెలలో సరాసరి ఉష్ణోగ్రతలు.. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉన్నట్లు ఐరోపా వాతావరణ సంస్థ వివరించింది. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితేనే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని మించిపోయినట్లు భావిస్తారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య 12 నెలల సరాసరి భూ ఉష్ణోగ్రతల్లోనూ రికార్డు నమోదైంది. 1991 నుంచి 2020 మధ్యనాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.75 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. అంటే.. పారిశ్రామికీకరణకు ముందునాటి కంటే ఇది 1.63 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ.రాబోయే ఐదేళ్లలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనే వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది.. 2023లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటడానికి 80 శాతం మేర అవకాశముందని ఐరోపా వాతావరణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడానికి 86 శాతం అవకాశముందని వివరించింది. 2024-28 మధ్యకాలంలో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కొనసాగడానికి 47 శాతం అవకాశం ఉందని తెలిపింది. 2023-27 మధ్య కాలంలో ఇందుకు ఒక శాతం మేర అవకాశం ఉందని గత ఏడాది డబ్ల్యూఎంవో ఇచ్చిన నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం.. 1850 నుంచి 1900 మధ్యనాటితో పోలిస్తే 2024 నుంచి 2028 మధ్యకాలంలో భూ ఉపరితలానికి చేరువలోని వాతావరణం సరాసరి ఉష్ణోగ్రత 1.1 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉండొచ్చని తెలిపింది. -
ఒడిశాలో వడగాడ్పుల విలయం.. 99 మంది మృతి!
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. వడగాలుల తీవ్రతకు ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణోగ్రత రానురాను రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. విపరీతమైన ఎండల కారణంగా పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రులలో చేరుతున్నారు.ఒడిశాలో ఎండల ప్రభావం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇది పలువురి ప్రాణాలను బలిగొంటోంది. ఒడిశాలో గత 72 గంటల్లో 99 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఈ 99 మరణాల్లో 20 కేసులను జిల్లా మేజిస్ట్రేట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ మాట్లాడుతూ వడదెబ్బ కారణంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో 141 మంది మృతి చెందినట్లు వివిధ జిల్లాల మెజిస్ట్రేట్‌లలో నమోదయ్యిందన్నారు. During the last 72 hours, 99 alleged sun stroke death cases have been reported by the Collectors. Out of 99 alleged cases, 20 cases have been confirmed by the Collectors. During this summer, total 141 alleged sun stroke death cases have been reported by the Collectors out of… pic.twitter.com/bWXsiaFA3F— ANI (@ANI) June 3, 2024 -
నిప్పుల కుంపటిలా తెలంగాణ
-
ఉత్తరాదిన సూర్యుడి భగభగలు..మానవ శరీరంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
ఉత్తరాదిని ఎప్పుడూ లేని విధంగా ఉష్టోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒక్క బుధవారం రోజునే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. మొత్తం ఉత్తర భారతదేశం తీవ్ర వేడిగాలులతో అల్లాడిపోతోంది. దీంతో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఈ అధిక ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యానికి త్రీవమైన ప్రమాదాలను తెచ్చిపెతాయని హెచ్చరించింది. ముఖ్యంగా నీటి కొరతతో జనాభా అల్లాడిపోతుందని, ఇది ఢిల్లీ నివాసితులుకు అత్యంత సవాలుగా ఉంటుదని పేర్కొంది. ఈ వేడిని నివారించడం అనేది అసాధ్యమైనదైనప్పటికీ..ప్రమాదాలు, వాటి లక్షణాలపై అవగాహన ఏర్పరుచుకోవడం కీలకం. ఈ ప్రతికూల వాతారణంలో ఆరోగ్య ప్రభావాలను అర్థం చేసుకుని వాటికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. అవేంటో చూద్దాం.వేడి అనేది సైలెంట్ కిల్లర్‌లా మనిషిని అతలాకుతలం చేసి మరణానికి దారితీసేలా చేస్తుంది. ఈ అధిక ఉష్ణోగ్రతలకు శరీరం ఎలా స్పందిస్తోందో చూద్దాం.విపరీతమైన వేడికి శరీరం స్పందించే తీరు..మానవ శరీరం చల్లగా ఉండటానికి రెండు ప్రధాన విధానాలను కలిగి ఉంటాయి. ఒకటి వాసోడైలేషన్, రెండు చెమట. వాసోడైలేషన్ చర్మం ఉపరితలం దగ్గర రక్తనాళాలను విస్తరించి వేడిని తప్పించుకునేలా అనుమతిస్తుంది. ఇక చెమట..శరీరం వేడికి ఉక్కిపోయి.. చెమట రూపంలో శరీరాన్ని చల్లబరుస్తుంది. దీని వల్ల కండరాల పనితీరుకు ముఖ్యమైన లవణాలు కూడా చెమట రూపంలో బయటకి వెళ్లిపోతాయి. దీంతో నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీసి వేడి సంబంధిత అనారోగ్యానికి గురవ్వుతారు.వేడి కారణంగా వచ్చే తిమ్మర్లు:వేడి కారణంగా కాళ్లు, పొత్తికడుపులో ఒక విధమైన తిమ్మిర్లు వస్తాయి. దీనికి కారణం.. శరీరంలో వేగంగా ద్రవాలు , ఎలక్ట్రోలైట్లను కోల్పోవడం వల్ల ఇది సంభవిస్తుంది. వేడి కారణంగా వచ్చే అలసట:ఉష్ణోగ్రత పెరగడంతో త్వరిగతిన ప్రజలు అలసటకు గురవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా విపరీతమైన చెమటలు పట్టి, ఈ చెమట రూపంలో ముఖ్యమైన లవణాలు కోల్పోవడంతో స్ప్రుహ కోల్పోవడం, వికారం, తలనొప్పి, పల్స్ వేగవంతమవ్వడం జరుగుతుంది. దీని కారణం శరీరం చల్లబడటానికి టైం తీసుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి హృదయ స్పందన రేటు పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ:ఇది అత్యంత తీవ్రమైన వేడి సంబంధిత అనారోగ్యం. చికిత్స చేయకండా వదిలేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైతే శరీరంలోని శీతలీకరణ విధానాలు విఫలమవుతాయి. చెమట పట్టడం ఆగిపోయి, పొడిగా మారుతుంది. శ్వాస నిస్సారమైన అస్పష్టమైన మాటలు, మూర్చలకు దారితీస్తుంది. ఒక్కోసారి తీమ్రైన సందర్భాల్లో కోమా లేదా మరణం సంభవించవచ్చు. ఇలా వడదెబ్బకు గురైన వారిలో మొదట వైఫల్యం చెందే అవయవం మూత్రపిండాలు. ఇవి రక్తం నుంచి మలినాలను తొలగించలేని స్థితికి చేరుకుంటాయి. అందువల్ల వడదెబ్బకు గురైన వారిని సంరక్షించేలా తగు జాగ్ర త్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఎండలు దంచికొడుతున్నప్పుడూ పుష్కలంగా నీరు తాగడం, ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు తాగడం, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. కఠినమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. వదులుగా ఉండే దుస్తులు ధరించండి. సాధ్యమైనప్పుడల్లా ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాల్లో ఉండేందుకు ప్రయత్నించండి. వేడి అనారోగ్యానికి సంబంధించిన సంకేతాలు వస్తే వెంటనే చర్యలు తీసుకోండి. బయటకు వెళ్లక తప్పదనుకున్నప్పుడూ.. వేడి తక్కువగా ఉండే ఉదయ, సాయంత్రాల్లో పనులు పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవడం, వేడికి గురికాకుండా ఉండేలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వంటివి చేయాలి.(చదవండి: వయసు 74 ఏళ్లు, చూస్తే..పదహారణాల పడుచు పిల్లలా ఏముందంటే..!) -
ఎండకు సొమ్మసిల్లిన 50 మంది విద్యార్థినులు.. ఆస్పత్రికి తరలింపు
ఉత్తరాదిన ఎండలు దంచికొడుతున్నాయి. తాజాగా బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎండ వేడిమికి తాళలేక 50 మందికి పైగా విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో పాఠశాలలో కలకలం చెలరేగింది.అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య శాఖను సంప్రదించారు. ఎంతసేపటికి అంబులెన్స్ రాకపోవడంతో ఆ విద్యార్థినులందరినీ పాఠశాల సిబ్బంది ప్రైవేట్ వాహనాల్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్థూ స్థానికులు రోడ్డుపై ధర్నాకుదిగారు.బీహార్‌లోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంతటి ఎండ వేడిమిలోనూ రాష్ట్రంలోని పాఠశాలలు పనిచేస్తున్నాయి. బుధవారం ఉదయం మండుటెండల కారణంగా అరియారి బ్లాక్‌లోని మన్కౌల్ మిడిల్ స్కూల్లో విద్యార్థినులు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు.ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రార్థనల అనంతరం పదుల సంఖ్యలో చిన్నారులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. దీంతో పిల్లలందరినీ ప్రైవేట్ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ చిన్నారులంతా డీహైడ్రేషన్ బారిన పడ్డారని వైద్యుడు సత్యేంద్ర కుమార్ తెలిపారు. పిల్లలకు చికిత్స అందిస్తున్నామన్నారు. -
భానుడి భగభగలు: ట్రాన్స్ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు
ఉత్తరాదిన భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో సామాన్యులు, జంతువులు, పక్షులే కాదు చివరికి విద్యుత్ పరికరాలు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతున్నాయి. విపరీతమైన ఎండ వేడిమికి విద్యుత్ శాఖకు చెందిన పరికరాలు గరిష్ట లోడ్ కారణంగా అత్యంత వేడిగా మారుతున్నాయి.పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న సమయంలో విద్యుత్ లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ల ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవి పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని చల్లబరచేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది టాన్స్ఫార్మర్ల ముందు ఫ్యాన్లు, కూలర్లు అమరుస్తున్నారు.మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లోని చంబల్ కాలనీలోని విద్యుత్ గ్రిడ్‌లోని ట్రాన్స్ఫార్మర్, బీపీఎల్ కూడలిలోని విద్యుత్ గ్రిడ్ ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. వీటిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నాయి. తద్వారా వారు విద్యుత్‌ను సక్రమంగా, అంతరాయం లేకుండా సరఫరా చేయగలుగుతున్నారు.సాధారణంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి. అయితే వేడి కారణంగా ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ వేడెక్కితే, దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అలాగే ట్రిప్పింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రతను స్థిరంగా నిర్వహించడానికి వాటి మందు కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. -
వంట చేయాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. తీవ్రమైన వేడిగాలులు ఈ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయలు, పప్పుల ధరలపైన కూడా కనిపిస్తోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటి సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా బంగాళదుంపలు, టమాటా, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.కూరగాయల ద్రవ్యోల్బణం అత్యంత అస్థిరంగా ఉంటుంది. వేడిగాలులు, భారీ వర్షాలు, పంట నష్టం మొదలైన పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 11 నెలల కనిష్ట స్థాయి అంటే 4.8 శాతానికి పడిపోయింది. వెల్లుల్లి, అల్లం ద్రవ్యోల్బణం మార్చి , ఏప్రిల్‌లలో మూడు అంకెలలో ఉంది.పప్పులు, కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే సరఫరా తగినంతగా లేదు. ప్రతికూల వాతావరణం కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేడిగాలు ఇదే రీతిన కొనసాగితే ధరలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన అధిక ధరలను అరికట్టడానికి కూరగాయలు, పప్పుల దిగుమతులను సరళీకరించాలని వారు సూచిస్తున్నారు. -
హర్యానాలో కర్ఫ్యూ విధించిన సూర్యుడు
హర్యానాలో వేసవి తాపం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో పగటిపూట ఎక్కడ చూసినా కర్ఫ్యూ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చండీగఢ్‌తో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణీయంగా పెరిగాయి. దేశంలోని హాటెస్ట్ నగరాల్లో హర్యానాలోని నుహ్ రెండో స్థానంలో ఉంది. దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నగరంగా యూపీలోని ఆగ్రా నిలిచింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం హర్యానాలోని 25 నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ హర్యానాలోని 11 జిల్లాల్లో మే 23 వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జాబితాలో మహేంద్రగఢ్, రేవారీ, గురుగ్రామ్, నుహ్, పల్వాల్, ఫరీదాబాద్, సిర్సా, ఫతేహాబాద్, హిసార్, భివానీ, చర్కి దాద్రీ జిల్లాలు ఉన్నాయి. పంచకుల, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కైతాల్, కర్నాల్, ఝజ్జర్, రోహ్తక్, సోనిపట్, పానిపట్, జింద్ 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.మరోవైపు అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు పలు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంబాలాలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పగటిపూట మార్కెట్లు వెలవెల బోతున్నాయి. సాయంత్రం పూట కొద్దిసేపు మాత్రమే వ్యాపారం జరుగుతున్నదని దుకాణదారులు వాపోతున్నారు. ఒకప్పుడు సందడిగా ఉండే మార్కెట్లు ఇప్పుడు ఎండ వేడిమి కారణంగా నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. -
240 కోట్ల కార్మికులు ఎండలకు విలవిల!
తరచూ చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ప్రతి సంవత్సరం సగటున 240 కోట్ల మంది కార్మికులపై పడుతోంది. దీనికి సంబంధించిన వివరాలను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తన నూతన నివేదికలో అందించింది. దీనిలోప్రపంచవ్యాప్తంగా కార్మికుల భద్రత, వారి ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాలను వివరించారు.ప్రపంచంలోని 71 శాతం మంది కార్మికులు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ బారిన పడుతున్నారు. 2010లో ఇది 65.5 శాతంగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంతగా కార్మికులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం 2.3 కోట్ల మంది కార్మికులు తీవ్రమైన వేడి కారణంగా పని సమయంలో అనారోగ్యానికి గురవుతున్నారు. 18,970 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.అత్యధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే కార్మికులు కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో 2.62 కోట్ల మంది కార్మికులు ఉండవచ్చని అంచనా. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ కార్మిక చట్టాలను పటిష్టం చేయాలని ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. తద్వారా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించవచ్చని పేర్కొంది. అత్యధిక వేడి, వాయు కాలుష్యం మొదలైనవాటి నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. -
ఎండలకు చచ్చిపోతున్న చేపలు.. వ్యాపిస్తున్న దుర్వాసన!
మండుతున్న ఎండలు మన దేశాన్నే కాదు ప్రపంచంలోని పలు దేశాలను భయపెడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు అటు జనాలను, ఇటు జీవాలను మలమలమాడిపోయేలా చేస్తున్నాయి. కరువు బారిన పడిన దక్షిణ వియత్నాంను ఈ ఎండలు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దక్షిణ వియత్నాంలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చేపలను బలి తీసుకుంటున్నాయి. 300 హెక్టార్లలో విస్తరించి ఉన్న ‘సాంగ్ మే’ చెరువులోని వేలాది చేపలు ఎండ వేడికి తాళలేక చనిపోయాయి. డాంగ్ నైలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. 1998లో ఈ ప్రాంతంలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రిజర్వాయర్ నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం కూడా చేపలు చనిపోవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత వేసవి కాలంటో 200 టన్నులకు పైగా చేపలు చనిపోయాయి. అత్యధిక ఉష్ణోగ్రత, నీటి కొరత కారణంగా ఈ చేపలు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన చేపల వాసన గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో విపరీతంగా వ్యాపించడంతో ఇక్కడి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈ చనిపోయిన చేపలను చెరువులో నుంచి తొలగించే పనిలో మత్స్యకారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం విచారణ ప్రారంభించింది. -
ఆసియా అంతటా భానుడి భగభగలు
దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలకు ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలు దేశాల్లో ఆరోగ్య హెచ్చరికలు జారీ చేయడంతో పాటు స్కూళ్లను మూసివేశారు.అటు ఫిలిప్పీన్స్ నుండి థాయ్‌లాండ్ వరకు, ఇటు భారతదేశం నుంచి బంగ్లాదేశ్ వరకు రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు మించవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అత్యధిక ఉష్ణోగ్రతల నేపధ్యంలో బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్‌లో పాఠశాలలను మూసివేశారు. మరోవైపు ఇండోనేషియాలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో శనివారం ఉష్ణోగ్రత 38.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది దశాబ్దాల క్రితం నాటి ఉష్ణోగ్రతల రికార్డును అధిగమించింది.ఈ వేడి వాతావరణం మే మధ్యకాలం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి కొరత, కరెంటు కోతలు, పంట నష్టం మొదలైన సమస్యలు ఎదురవుతున్నాయి.కంబోడియా గత 170 ఏళ్లలో ఎప్పుడూ చూడని అత్యధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటోందని జలవనరులు, వాతావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చాన్ యుథా తెలిపారు. గడచిన వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. సెంట్రల్ మాగ్వే, మాండలే, సాగింగ్, బాగో ప్రాంతాల్లోని ఏడు టౌన్‌షిప్‌లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని మయన్మార్ వాతావరణ విభాగం వెల్లడించింది. మయన్మార్‌లోని పలు పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రపంచస్థాయి రికార్డులను దాటాయి.థాయ్‌లాండ్‌లోని కొన్ని ఉత్తర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. బ్యాంకాక్‌లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగపూర్‌లోని వాతావరణ శాఖ దేశంలో ఉష్ణోగ్రతలు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. వియత్నామీస్ మీడియా నివేదికల ప్రకారం మధ్య వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో అడవుల్లో కార్చిచ్చు సంభవించే ప్రమాదం ఉందని జాతీయ వాతావరణ సంస్థ హెచ్చరించింది.మలేషియాలో వరుసగా మూడు రోజులు 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని మలేషియా వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆసియా అంతటా అత్యధిక ఉష్ణోగ్రతలు నెలకొన్నందున పలు చోట్ల ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలతో ఆసుపత్రులలో చేరుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.వడదెబ్బ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 30 మంది మృతి చెందారని థాయ్‌లాండ్ డిసీజ్ కంట్రోల్ విభాగం తెలిపింది. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వడదెబ్బ కాణంగా దేశంలో ఇప్పటివరకూ రెండు మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. ఫిలిప్పీన్స్‌లో విపరీతమైన వేడి వాతావరణం కారణంగా 34 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు మరణించారు. ఈ వివరాలను ఫిలిప్పీన్స్ ఆరోగ్య శాఖ తెలిపింది.బంగ్లాదేశ్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ 20 మంది వడదెబ్బ కారణంగా మృతిచెందారు. ఇండోనేషియాలో అత్యధిక ఉష్ణోగ్రతలు డెంగ్యూ జ్వరాలకు దారి తీస్తున్నాయి. దోమల ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్, కేసుల కంటే డెంగ్యూ జ్వరాలు రెండింతల మేరకు పెరిగాయని బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
ఆశలు..అడుగంటి.. గణనీయంగా పడిపోయిన భూగర్భ జలమట్టాలు
సాక్షి ప్రతినిధులు మహబూబ్‌నగర్/ కరీంనగర్/ ఖమ్మం: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటం, భూగర్భ జలాలు అడుగంటడంతో పలు జిల్లాల్లో పంటలు ఎండి పోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి కొరత మామిడి లాంటి పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తోందని రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో బోర్లు వట్టి పోవడంతో నీరందక ఇప్పటివరకు లక్షకు పైగా ఎకరాల్లో పంటలు ఎండినట్లు అంచనా. ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మండే ఎండలు,అడుగంటిన భూగర్భ జలాలతో పంటలు ఎండిపోతున్నాయి. నిజానికి 2022–23 యాసంగిలో మొత్తం 5,15,375 ఎకరాల్లో పంటలు సాగైతే ఈ ఏడాది 3,55,827 ఎకరాల్లోనే సాగు చేశారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాత కాల్వ కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో సుమారు5 వేలకు పైగా ఎకరాల్లో వరి ఎండింది. భగీరథ ప్రయత్నం చేసినా.. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన శీలం విష్ణు ఈ ఏడాది యాసంగిలో వైరా నది కింద11 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. మరో 20 రోజుల్లో వరి చేతికి అందనుండగా వైరా రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో వైరా నదిలో పొక్లెయినర్‌తో గుంతలు తవ్విం చి మోటారు ద్వారా పైరుకు నీరందించే ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లేక 80 శాతం మేర పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి అంతా నేల పాలైందని విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగావరి పంటపై రైతాంగం ఆధారపడుతుంది.పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఈసారి మార్చి 31 వరకు వేసంగి పంటకు నీరందింది. కానీ గతేడాదితో పోలిస్తే ఆశించినంత మేరకు అందలేదు. ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయింది. పలుచోట్ల పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లాలో దాదాపు 25వేల ఎకరాల వరకు వరి పంట సాగునీరు అందక ఎండిపోయిందని అనధికారిక అంచనా. పెద్దపల్లి జిల్లాలో ఎండలు దంచికొడుతుండటంతో చెరువులు, బావులు వట్టిపోతున్నాయి. మంథని, ముత్తరాం, రామగిరి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెలా మండలాల్లో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వీర్నాపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మాత్రం కొంతమేర వరి పంట ఎండిపోయింది. ఇక జగిత్యాల జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కింద కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల వరకు పొలాలు ఎండిపోయాయి. ఈనిన వరి ఎండిపోయింది.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు లకావత్శ్రీనివాస్. ఊరు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌మండలం సేవాలాల్ తండా. యాసంగిలోమూడెకరాల్లో వరి పంట వేశాడు. 3 బోరు బావులు నమ్ముకుని పంట సాగు చేస్తే భూగర్భజలాలు కాస్తా అడుగంటిపోయాయి. దీంతో బోర్లు వట్టిపోయి 3 ఎకరాల్లో ఈనిన పంటఎండిపోయింది. ఇటీవల రూ.లక్ష వెచ్చించి550 ఫీట్ల లోతులో బోరు వేయించాడు.కానీ నీళ్లు పడక పోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. బకెట్‌తో నీళ్లు పోస్తూ.. ఈమె రైతు బోయ అంజమ్మ.నారాయణపేట జిల్లా మరికల్ మండలంఅప్పంపల్లికి చెందిన ఈమె పదేళ్లుగా కూరగాయల సాగు చేస్తోంది. ఈ ఏడాది అరఎకరంలో బెండతో పాటు ఇతర కూరగాయలు సాగు చేసింది. ఎండల తీవ్రత కారణంగా బోర్లల్లో నీటిమట్టం దాదాపుగా అడుగంటి పోయింది. వచ్చే కొద్దిపాటి నీటిని బిందెలు,బకెట్ల ద్వారా పోస్తూ పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. 5 బోర్లువేశాడు మక్తల్ మండలం ఉప్పర్‌పల్లికి చెందిన రవీందర్‌రెడ్డికి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.ఈ యాసంగిలో బోరుబావి కింద రెండు ఎకరాల్లో వరి, మిగతా మిరప తోట సాగు చేశాడు.భూగర్భజలాలు అడుగంటడంతో సుమారు రూ.1.20 లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేశాడు. రెండింటిలో నీరు పడలేదు. మూడింటిలో అంతంత మాత్రంగా నీరు పడింది. మిరపతోటకు నీరు సక్రమంగాఅందకపోవడంతో రూ.40 వేల వ్యయంతో స్ప్రింక్లర్లు వేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చేసిన అప్పు ఎలా తీర్చాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
వేసవి తాపం : మజ్జిగ చేసే మేలు గురించి తెలుసా!
వేసవి కాలం వచ్చేసింది. వాతావరణంలో వచ్చే మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ వేసవి తాపానికి అల్లాడవలసిందే. అయితే కూల్డ్రింకులు, ఇతర శీతల పానీయాలకు బదులుగా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బొండాలు, చెరుకు రసం, పళ్లరసాలు, మజ్జిగ లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే మంచింది. వడదెబ్బ తగలకుండా, శరీరం డీ-హైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ఇవి చాలా అవసరం. ముఖ్యంగా చవగా, ఈజీగా లభించే మజ్జిగ తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలున్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. మజ్జిగను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.. వేసవికాలంలో రోజూ రెండుసార్లు మజ్జిగ తాగడం వలన ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో, వాటిని ఎలా పుచ్చుకోవాలో చూద్దాం... మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడి కలుపుకుని తాగడం వలన వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. అంతేకాదు రోజూ మజ్జిగను తాగడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవడం వలన దాహార్తి తీరుతుంది. గ్లాసు పల్చటి మజ్జిగలో చిటికడు సొంఠి, చిటికడు సైంధవ లవణం కలుపుకుని తాగితే వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం, దబ్బాకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి సేవించడం వలన దాహార్తి తీరడమే కాదు.. శక్తి కూడా చేకూరుతుంది. వేసవి వేడికి తిన్న ఆహారం అరగక ఒక్కోసారి వాంతులు అవుతుంటాయి. అలాంటప్పుడు చిటికడు జాజికాయ పొడిని మజ్జిగలో కలుపుకుని సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. కనుక వేసవిలో కూల్ డ్రింక్స్ కంటే ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ రెండుసార్లు మజ్జిగను తీసుకోండి. -
తేనెని నేరుగా వేడిచేస్తున్నారా?
మనం నిత్యం కొన్ని పదార్థాలను నిల్వ చేసేటప్పుడు పలు సమస్యలు ఎదుర్కొంటాం. ఒకవేళ పాడైతే ఎండలో పెట్టడమో లేక ఓ సారి మంటపై వేడిచేయడమో చేస్తాం. కానీ అలా అన్ని వేళలా అన్ని రకాల పదార్థాలకు పనికిరాదు. ఏవీ వేడి చేస్తే మంచిది? వేటిని నేరుగా వేడి చేయకూడదు వంటి ఆసక్తికర ఇంటి చిట్కాలు తెలుసుకుందామా! తేనె కొంతకాలం వాడకుండా ఉంచేస్తే సీసా అడుగున గడ్డకట్టుకుపోతుంటుంది. అలాంటప్పుడు తేనెను కరిగించడానికి ఓ అరగంట పాటు తేనె సీసాను ఎండలో ఉంచాలి. తేనెను ఎప్పుడూ నేరుగా వేడి చేయకూడదు. ఎండ లేకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో తేనె సీసాను ఉంచాలి. నీటి వేడితో ఐదు – పది నిమిషాల్లో తేనె కరుగుతుంది. ఒకవేళ తేనెను నేరుగా వేడిచేస్తే పోషక విలువలు పోయి పాయిజన్‌గా మారిపోతుందట. పైగా నేరుగా వేడి చేయడం వల్ల జిగురు వంటి పదార్థంలా మారిపోతుంది. దాన్ని గనుక ఆహారంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకుని, అమా అనే టాక్సిన్‌గా మారుతుంది. దీంతో మనకు కడుపు నొప్పి రావడం, శ్వాసక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు, బరువు పెరుగుటం వంటి దుష్పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పాల ప్యాకెట్లు ఫ్రిజ్‌లో పెట్టుకునేటప్పుడు ఆ ప్యాకెట్లను నేరుగా పెట్టకూడదు. ప్యాకెట్ మన వాకిటి ముందుకు వచ్చే లోపు రకరకాల ప్రదేశాలను తాకి ఉంటుంది. కాబట్టి ప్యాకెట్‌ని నీటితో కడిగి ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. వెల్లుల్లి రేకలు పొట్టు సులువుగా వదలాలంటే... వెల్లుల్లి రేకను కటింగ్ బోర్డు మీద పెట్టి చాకు వెనుక వైపు (మందంగా ఉండే వైపు, ఈ స్థితిలో చాకు పదును ఉన్న వైపు పైకి ఉంటుంది) తిప్పి వెల్లుల్లి రేక చివర గట్టిగా నొక్కితే వెల్లుల్లి రేక తేలిగ్గా విడివడుతుంది. పైనాపిల్‌ను కట్ చేయడానికి పెద్ద చాకులను (షెఫ్స్ నైఫ్) వాడాలి. ముందుగా కాయ పై భాగాన్ని, కింది భాగాన్ని తొలగించాలి. ఇప్పుడు కాయను నిలువుగా పెట్టి చెక్కును పైనుంచి కిందకు తొలగించాలి. ఆ తర్వాత మీడియం సైజ్ చాకుతో కాయను చక్రాలుగా తరగాలి. బటర్‌ను వంట మొదలు పెట్టడానికి ఓ అరగంట లేదా గంట ముందు ఫ్రిజ్‌లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. ఒకవేళ మర్చిపోతే వేడి పాలగిన్నె మూత మీద లేదా ఉడుకుతున్న వంట పాత్ర మూత మీద పెడితే పది నిమిషాల్లో మెత్తబడుతుంది. అలా కుదరకపోతే స్టవ్ మీద బర్నర్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ఉంచాలి. ఐస్‌క్రీమ్ సర్వింగ్ స్పూన్లు ఇంట్లో ఉండవు. పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు దానిని పలుచగా కట్ చేయాలంటే చాకును మరుగుతున్న వేడి నీటిలో ముంచి తీయాలి. ఒక స్లయిస్ కట్ చేయగానే చాకు చల్లబడిపోతుంది. కాబట్టి ప్రతి స్లయిస్కూ ఓ సారి వేడి నీటిలో ముంచాలి. (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
ప్రాణాలు తీసిన రూమ్ హీటర్.. తండ్రితో సహా 3 నెలల చిన్నారి మృతి
చలి వణికిస్తోంది. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా చలి తీవ్రంగా ఉంది. ఈ కారణంగా చాలా మంది ఇంట్లో ఉపశమనం కోసం రూమ్ హీటర్లను ఉపయోగిస్తారు. అయితే రూమ్ హీటర్లు వాడే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా ప్రాణాలకే రిస్క్. ఈ మధ్య కాలంలో హీటర్ల వల్ల కలుగుతున్న ప్రమాదాల గురించి వింటూనే ఉన్నాం. రూమ్ హీటర్లు గాలిలో తేమను తగ్గించగలవు. దీంతో ఆక్సిజన్ తగ్గిపోయి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. కొన్నిసార్లు అగ్ని ప్రమాదానికి కారణమై ప్రాణాలు కోల్పోవం వంటి ఘటనలు కూడా జరిగాయి. తాజాగా రాజస్థాన్‌లోనూ వాటర్ హీటర్ ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. హీటర్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఓ తండ్రి, మూడు నెలల చిన్నారి మృత్యువాతపడ్డారు. భార్య చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఖైర్తాల్-తిజారా జిల్లాలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. దీపక్ యాదవ్ అనే వ్యక్తి స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో చలిగా ఉందని రూమ్ హీటర్ ఆన్ చేశాడు. ఈ క్రమంలో హీట్ ఎక్కువై ఇంట్లో ఉన్న దూదికి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు చెలరేగడంతో దీపక్, అతని మూడు నెలల కుమార్తె నిషిక సజీవ దహనమయ్యారు. భార్య సంజు తీవ్రంగా గాయడింది. వీరి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, దీపక్ మరియు నిషిక మరణించినట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
పారిస్ ఒప్పందానికి చిల్లు? భయపెడుతున్న భూతాపం!
ప్రపంచ మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ రోజురోజుకు పెరిగిపోతున్న భూతాపం. దీనిని నియంత్రించే లక్ష్యంతో 2015లో 200 దేశాలు పారిస్ వాతావరణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని ప్రకారం అధిక ఉష్ణోగ్రతల నియంత్రణకు ఈ దేశాలన్నీ తగిన చర్యలు చేపట్టాలి. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంట్రీగ్రేడ్‌ల కన్నా తక్కువకు నియంత్రించాలి. అప్పుడే విపత్కర వాతావరణ ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చని పారిస్ ఒప్పందంలో తీర్మానించారు. అయితే ఇది విఫలమయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2023 నవంబరు 17న నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆరోజు భూ ఉపరితల ఉష్ణోగ్రత పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యింది. ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో ఇదే రికార్డుగా నిలిచింది. ఇది అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయంగా పెరిగిన గాలి ఉష్ణోగ్రత, సముద్ర ఉష్ణోగ్రత, అంటార్కిటిక్ సముద్రపు మంచు విస్తీర్ణం మొదలైనవి భూతాపం పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. గత జూలైలోనూ భూ ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. సెప్టెంబర్ నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నాయని మరో నివేదిక పేర్కొంది. భూతాపం నియంత్రణకు అన్ని దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడం, అటవీ రక్షణ పెంపుదల, మొక్కల ఆధారిత ఆహారాలవైపు మళ్లడం, కొత్త బొగ్గు ప్రాజెక్టులను ఎత్తివేయడం, చమురు, గ్యాస్ వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి ప్రయత్నాలను తప్పనిసరిగా చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఉష్ణోగ్రతలను లక్ష్యం మేరకు నియంత్రించలేకపోతే అత్యంత దారుణమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగితే సముద్ర మట్టాలు 10 సెంటీమీటర్లు పెరిగి, చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పరిమితం చేయగలిగితే కనీసం కోటి మందిని ఈ ముప్పు నుంచి బయటపడేయచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారతీయలు పాక్‌లో వ్యాపారం చేయవచ్చా? -
మహావినాశనం ముందుంది? ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు!
‘యుగాంతం’.. ‘మహావినాశనం’ వీటికి సంబంధించిన చర్చలు ప్రపంచంలో కొత్తేమీకాదు. ఈ ఆసక్తికర అంశాలపై పలు సినిమాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మానవాళి అంతం గురించి అంచనా వేయడానికి నిపుణులు, శాస్త్రవేత్తలు అత్యాధునిక సూపర్ కంప్యూటర్ను ఉపయోగించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్ గురించి కంప్యూటర్ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు. భూమిమీద మానవజాతి ఎప్పుడు అంతరించిపోతుందో తెలుసుకున్నారు. దీని ప్రకారం యుగాంతం మనకు అత్యంత సమీపంలోనే లేకపోయినప్పటికీ, 250 మిలియన్ సంవత్సరాల (ఒక మిలియన్ అంటే పది లక్షలు) దూరంలో ఉన్నట్లు తేలింది. అధ్యయనంలో పాల్గొన్న బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు డాక్టర్ అలెగ్జాండర్ ఫార్న్స్వర్త్ మాట్లాడుతూ భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడి కారణంగా మానవాళి మనుగడ దుర్భరంగా మారుతుందని అన్నారు. ఈ విధంగా మరణాలు విపరీతంగా సంభవిస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో సూర్యుని నుంచి ఇప్పుడున్న దానికన్నా సుమారు 2.5 శాతం అధిక రేడియేషన్ విడుదల కానుంది. ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఇప్పటి కంటే రెండు రెట్లు అధికం కాగలవని ఆయన హెచ్చరించారు. ఈ నేపధ్యంలో అగ్ని పర్వత విస్ఫోటనాలతో ఏర్పడే సూపర్ ఖండం తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలను ఆక్రమిస్తుంది. ఫలితంగా భూభాగంలోని అధిక ప్రాంతాల్లో 40 నుండి 70 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంది. ఈ నూతన సూపర్ ఖండం మానవాళికి మూడు రెట్ల ముప్పును కలిగిస్తుంది. మానవులు, జంతువులు, క్షీరదాలకు అననుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పెరిగే రోజువారీ ఉష్ణోగ్రత తీవ్రతలు, అధిక తేమ స్థాయిలు కలసి మానవుల మనుగడకు అంతం పలకుతాయని ఫార్న్స్వర్త్ హెచ్చరించారు. అయితే ఈ విపత్తును నివారించడానికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని నిలిపివేయడం ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు. లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బెంజమిన్ మిల్స్ మాట్లాడుతూ శిలాజ ఇంధన వినియోగంలో పెరుగుదల భూమిపై మానవాళి అంతాన్ని వేగవంతం చేస్తుందని, ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఊహించిన దానికంటే ముందుగానే మానవాళి అంతానికి చేరుకోవచ్చని అన్నారు. భవిష్యత్‌లో భూమిపై నివాసయోగ్యంకాని సూపర్ ఖండం ఏర్పడినప్పుడు సంభవించే పరిణామాలు ఎలావుంటాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్లను వినియోగించి అధునాతన వాతావరణ నమూనాలను తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? క్రెమ్లిన్ ఏమంటోంది? -
అమెజాన్‌లో వందల డాల్ఫిన్ల మృతదేహాలు ఎందుకు తేలుతున్నాయి? వాతావరణ మార్పులే కారణమా?
అమెరికాలోని అమెజాన్ నదిలో ఇటీవలి కాలంలో 120 డాల్ఫిన్ల మృతదేహాలు తేలుతూ కనిపించాయి. తీవ్రమైన ఎండవేడిమి కారణంగా డాల్ఫిన్లు చనిపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల అమెజాన్ ఉప నదుల్లోని వేలాది డాల్ఫిన్లు నీటిలో ఆక్సిజన్ లేకపోవడం కారణంగానూ చనిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ నదుల్లో మిగిలి ఉన్న డాల్ఫిన్లను శివార్లలోని చెరువులకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెజాన్ నదిలోని డాల్ఫిన్లు వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలకు విలవిలలాడిపోతున్నాయి. వేడి కారణంగా నదులు ఎండిపోతుండటంతో డాల్ఫిన్ల మనుగడకు ముప్పు ఏర్పడింది. తక్కువ నీటి మట్టాలు, అధిక ఉష్ణోగ్రతలు మొదలైనవి నదిలోని నీరు గణనీయంగా వేడెక్కడానికి కారణంగా నిలుస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్న చేపలలో పింక్ డాల్ఫిన్లు అధిక సంఖ్యలో ఉంటున్నాయి. ఇవి దక్షిణ అమెరికాలోని నదులలో మాత్రమే కనిపిస్తుంటాయి. బ్రెజిల్ సైన్స్ మినిస్ట్రీతో కలిసి పనిచేస్తున్న మామిరోవా ఇన్స్టిట్యూట్ ఇటీవల లేక్ టెఫేలో లెక్కకుమించిన డాల్ఫిన్ మృతదేహాలు కనిపించాయని తెలిపింది. వీటి మృతి వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని మామిరోవా ఇన్స్టిట్యూట్ తెలిపింది. సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నదులలో మిగిలి ఉన్న డాల్ఫిన్లను శివార్లలోని మడుగులు, చెరువులకు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ పని అంత సులభం కాదని, ఇలా చేస్తే వాటి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: తల్లి ఫోనులో మునక.. కుమారుడు నీట మునక! -
జపనీస్ కుర్రాళ్లకు గడ్డం ఎందుకు ఉండదు?
జపనీస్ కుర్రాళ్లను మనం సినిమాల్లో, ఇంటర్నెట్లో చూసేవుంటాం. వారెవరూ గడ్డాలు పెంచుకోరనే విషయాన్ని మనం గమనించే ఉంటాం. జపాన్‌లో సాధారణ యువకుడు మొదలుకొని ప్రముఖ సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ క్లీన్ షేవ్‌తో కనిపిస్తుంటారు. దీంతో జపాన్ పురుషులకు గడ్డం పెరగదా లేకా వారు గడ్డం పెంచుకోవడాన్ని ఇష్టపడరా అనే ప్రశ్న మన మదిలో తలెత్తుతుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జపనీస్ కుర్రాళ్లకు జట్టు పెరగదా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పురుషుల మాదిరిగానే జపనీస్ కుర్రాళ్లు గడ్డం పెంచుకోగలుగుతారు. అయితే వారి జుట్టు పెరుగుదల ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు చల్లని ప్రాంతాల్లో నివసించే వారి శరీరంపై ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. వేడి ప్రదేశాలలో నివసించే వారి శరీరంపై తక్కువ వెంట్రుకలు ఉంటాయి. తూర్పు ఆసియా ప్రజలదీ అదేతీరు. అయితే జపాన్ విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఈడీఏఆర్ జన్యువు కారణంగా జపాన్ పురుషుల ముఖంపై తక్కువగా వెంట్రుకలు పెరుగుతాయి. ఈ వారసత్వం కొత్త తరాలకు బదిలీ అవుతుంది. వెంట్రుకల పెరుగుదలకు టెస్టోస్టెరాన్ హార్మోన్ కారణంగా నిలుస్తుంది. 19 నుండి 38 సంవత్సరాల వయస్సు గల యువకులలో టెస్టోస్టెరాన్ స్థాయి డెసిలీటర్కు 264-916 నానోగ్రాముల మధ్య ఉండాలి (ng/dl). అయితే దీనిలో అనిశ్చితి కారణంగా తూర్పు ఆసియా ప్రజలలో జుట్టు తక్కువగా పెరుగుతుంది. గడ్డం ఎందుకు పెంచుకోరు? జపనీస్ కుర్రాళ్లలో కొద్దిమంది మాత్రమే గడ్డం పెంచుతారు. చిన్నపాటి గడ్డం కలిగిన పురుషులు జపనీస్ చరిత్రలో కనిపిస్తారు. కొన్ని దేశాల్లో గడ్డం కలిగి ఉండటం మగతనానికి చిహ్నంగా పరిగణిస్తుంటారు. అయితే గడ్డం దట్టంగా ఉండటమనేది సోమరితనానికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే జపనీస్ పురుషులు గడ్డం పెంచుకోరు. జపనీయుల భావనలో అందం అనేది కళ్లలో ఉంటుంది. అందుకేవారు వారు గడ్డం పెంచుకోవడంపై అంతగా దృష్టిపెట్టరు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
వేడికొద్దీ వానలు
ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వర్షపాతం మామూలు కన్నా తక్కువగా ఉంటుందని సూచనలు వచ్చాయి. ఈ సూచనలు మొత్తం దేశానికి వర్తిస్తాయని చెప్పుకోవాలి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం వారి వాతావరణ శాఖ మాత్రమే కాక స్కైమెట్ అనే ఒక ప్రైవేట్ సంస్థ కూడా వాతావరణం గురించి పరిశోధనలు చేసి సూచనలు అందిస్తూ ఉంటుంది. ఈ సంస్థవారు నిజానికి ఈ సంవత్సరం వర్షపాతం దేశం మొత్తం మీద మామూలుగా 94 శాతం మాత్రమే ఉంటుందని ప్రకటించారు. మళ్లీ ఈ అవకాశం 40 శాతం ఉంటుందని కూడా అన్నారు. వాన రాకడ, ప్రాణం పోకడ చెప్పలేము అన్న మాట ఇక్కడ బహుశా గుర్తు చేసుకోవాలేమో? ఉత్తర భారత దేశం, దేశంలోని మధ్య ప్రాంతాలలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. మామూలు గానే ప్రపంచమంతటా వాతావరణం వేడెక్కుతోంది. హిందూ మహాసముద్రంలో డైపోల్ అనే పరిస్థితి ఒక పక్కన, అనుకున్న దానికన్నా ముందే వచ్చిన ఎల్ నినోలు మరోపక్కన ఇందుకు కారణం అని చెబుతున్నారు. తూర్పు ఉష్ణమండల ప్రాంతంలో ఉన్న శాంతి మహా సముద్రం అనే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రత సగటు కన్నా అర డిగ్రీ ఎక్కువయినందుకు ఎల్ నినో వస్తుంది. అన్నట్టు ఈ మాటలోనే చివరి అక్షరానికి ‘య’ ఒత్తు ఇచ్చినట్టు పలకాలట. మాటకు చిన్న బాబు అని అర్థం. ఈ పరిస్థితి ముందు అనుకున్న దానికన్నా రెండు నెలలు ముందే వచ్చేసింది. అంతకుముందు మూడు సంవత్సరాల పాటు లా మీనా అనే పరిస్థితి. అంటే ఇందుకు వ్యతిరేకమైన పరిస్థితి ఉండేది. సముద్రం పైభాగంలో నీళ్లు వేడెక్కడం, చల్లబడడం అనే ఈ రెండు పరిస్థితులు మూడు నుంచి ఏడేళ్లకు ఒకసారి మారుతుంటాయి. ఒక పక్కన మానవ కార్యక్రమాల వల్ల వాతావరణం వేడెక్కుతున్నది. దానికి తోడుగా ఈ పరిస్థితులు కూడా వచ్చేసరికి మొత్తం ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పగడపు కొండలన్నీ పాడై పోతాయి. అనుకోని పద్ధతిలో వరదలు వస్తాయి. లక్షల కోట్ల డాలర్ల నష్టం కలిగే పరిస్థితులు వస్తాయి. ఎల్ నినో లేకుండానే వాతావరణ పరిస్థితి దారుణంగా ఉంది, ఇక ఇది కూడా తోడైతే ఏమవుతుందో అంటున్నారు పరి శోధకులు పెడ్రో డి నేజియో. 2015 – 16 ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి బలంగా వచ్చింది. పసిఫిక్ సముద్రంలో పెద్ద ఎత్తున వేడి చేరుకున్నది. ఇందులో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కూడా కొంత ఉంది. ఇప్పుడిక సముద్రం మీద మూత తీసివేసినట్లే అంటారు యూఎస్ సంస్థ ‘ఎన్ఓఏఏ’ పరిశోధకులు మైఖేల్. సముద్రోపరితలంలో చేరిన వేడి ప్రభావం ఇప్పటికే ప్రపంచం మీద ప్రభావం చూపు తున్నది. 2024 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఒకటిన్నర డిగ్రీలు ఎక్కువయ్యే అవకాశం నిండుగా ఉంటుంది అంటున్నారు ఈయన. సాధారణంగా ఈ వేడి కారణంగా తూర్పు వ్యాపార పవనాల మీద ప్రభావం ఉంటుంది. కనుక వేడి మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు ఆ గాలుల వేగంలో అంతగా మార్పు కనిపించలేదు అని పరిశీలకులు గమనించారు. ప్రస్తుతం వచ్చిన పరిస్థితి వచ్చే ఫిబ్రవరి దాకా బలంగా కొనసాగుతుంది. కనుక సముద్రం మీద నుంచి వచ్చే వ్యాపార పవనాలను అక్కడి వేడి ప్రభావితం చేస్తుంది. సెప్టెంబర్ కల్లా ఈ పరిస్థితి గురించి మరింత మంచి అవగాహన అందుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఎల్ నినో బలంగా ఉన్నా లేకున్నా వరదలు, ఉత్పాతాలు మాత్రం తప్పవు. ఎల్ నినో వల్ల మంచి కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఆఫ్రికా లోని కరవు ప్రాంతాలలో వర్షాలు వస్తాయి. అక్కడి ఆకలిగా ఉన్న జనాలకు తిండి దొరుకుతుంది. మొత్తం మీద మాత్రం ప్రభావాలు వ్యతి రేకంగా మాత్రమే ఉంటాయనీ, ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఉండక తప్పదనీ పరిశోధకులు అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తులలో ఐదు శాతం తగ్గింపు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ తెలివి తెచ్చుకుని, వాతావరణం వేడెక్కకుండా ఉండే ఏర్పాట్ల మీద దృష్టి పెట్టాలి. డా‘‘ కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత, అనువాదకుడు మొబైల్: 98490 62055 -
సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే .!
సాధారణంగా వేసవి వచ్చేదంటే అమ్మో!.. ఉక్కపోతా అంటూ అరిచేస్తాం. ఏసీలు, కూలర్లు పెట్టేసి.. వేలల్లో కరెంట్ బిల్లులు కట్టేసి హమ్మయ్యా అనుకుంటాం. జేబు చిల్లు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం గానీ సహజసిద్ధంగా ఇంటిని ఎలా కూల్‌గా ఉంచుకోవచ్చో ఆలోచించం. ఎందకంటే ఎలాగో విద్యుత్ సౌకర్యం, డబ్బులు కట్టే సామర్థ్యం రెండు ఉన్నాయి. ఇక మరో ఆలోచన కాదు గదా!.. ఆ పదం వరకు కూడా వెళ్లం. కానీ ఈ ఎడారి దేశంలోని ఓ నగరం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవడమేగాక దాని వినూత్న ఆలోచన విధానంతో అందనంత ఎత్తులో ఉంది ఆ నగరం. వివరాల్లోకెళ్తే..ఇరాన్లో ఎడారి నగరమైన యాజ్డ్లో వేడి అలా ఇలా ఉండదు. తట్టుకోవడం చాల కష్టం, కనీస అవసరాలు ఉండవు. పైగా కావల్సినంత విద్యుత్ కూడా ఉండే అవకాశమే లేదు కూడా. అలాంటి ఆ ప్రాంతం అందుబాటులో ఉన్న వనరులతోటే అద్భుతాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా 2017లో యునెస్కోలో వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఇంతకీ ఆ నగరంలో అంత గొప్పగా ఏముందంటే..ఆ నగరంలో ఇళ్లన్ని ఎత్తులో ఉండి పైన చిమ్నీ లాంటి టవర్లు ఉంటాయి. వేడి గాలిని ఇంట్లోకి రాకుండా నిరోధించి, చల్లగా ఉండేలా చేస్తుంటాయి ఆ టవర్లు. ఒకరకంగా చెప్పాలంటే వాటిని 'సహజసిద్ధమైన ఏసీ'లని చెప్పొచ్చు. నివాసాలను చల్లబర్చడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. వీటిని విండ్ క్యాచర్లు అంటారు. ఇది మధ్యప్రాచ్యంలోని పర్షియన్ సామ్రాజ్య కాలం నాటి నిర్మాణంగా భావిస్తారు నిపుణులు. నిజానికి వేసవిలో అక్కడ సుమారు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీంతో శతాబ్దాలకు ముందే అప్పటి వాళ్లే ఇళ్లను కూల్‌గా ఉంచడానికి వీలుగా ఇలాంటి నిర్మాణంలో ఇళ్లను నిర్మించారు. ప్రజలు దాన్ని ఇప్పటకీ కొనసాగిస్తుండటం విశేషం. విద్యుత్ గురించి తెలియక మునుపే మా పూర్వికులు ఇలాంటి ఇళ్లను కనుగొన్నారు, దాన్నే మేము కొనసాగించడమే కాకుండా ఆ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం అని గర్వంగా ఇరాన్ పర్యాటక మంత్రిత్వ శాఖ డిప్యూటీ అబ్డోల్మాజిద్ షాకేరి చెబుతున్నారు. ఇక్కడ ఇళ్లపై ఉండే 'విండ్ క్యాచర్'(చల్లటి గాలిని ఇచ్చేవి) టవర్లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి. తమ పూర్వీకులు చెదపురుగుల గూడుని బేస్ చేసుకుని ఇలా ఇళ్లను నిర్మించినట్లు ఇరాన్ వాసులు చెబుతున్నారు. ఈ ఇళ్లు ఆధునిక సిమెంట్ భవనాలకు అత్యంత విరుద్ధం. ఇవి బంకమట్టి ఇటుకతో నిర్మించే శతాబ్దాల నాటి సంప్రదాయ రీతి కట్టడాల నిర్మాణం. ఇక్కడ ఇంకో అద్భుతమైన నిర్మాణం ఉంది. అది భూగర్భ జల వ్యవస్ధ. దీన్ని ఖానాట్స్ అని పిలుస్తారు. భూగర్భ బావులు, లేదా చిన్న కాలువలు అని చెప్పొచ్చు. అక్కడ ఇళ్లు వేడి ఎక్కకుండా ఉండటానికి ఇవి కూడా ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇరాన్లో ప్రస్తుతం 33వేల ఖానాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇరాన్ అధికారులు ఈ ఖానాట్స్లను ఎండిపోకుండా పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా దేశాలు ఇలాంటి ప్రకృతిసిద్ధంగా లభించే గాలిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే మంచి గాలి పీల్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే గాక వాతావరణంలో కార్బన్ స్థాయిలు తగ్గించినవాళ్లము అవుతాం కదా ఆలోచించండి!. (చదవండి: టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!) -
అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ..
నైరుతి అమెరికాలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయి. ఇది 110 మిలియన్లకు మించిన ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికాలోని 38 నగరాల్లో ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని సమాచారం. లాస్ వెగాస్‌లో వేడిగాలులతో కూడిన ఉష్ణోగ్రత రికార్డు గరిష్ట స్థాయి 117F (47.2C)కు చేరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దక్షిణ ఐరోపాను కూడా తాకాయి. కెనడా చరిత్రలో ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు అడవుల్లో కార్చిచ్చుకు కారణంగా నిలుస్తున్నాయి. మానవ కార్యకలాపాలతో ముడిపడిన వాతావరణ మార్పులు ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. రంగంలోకి అగ్నిమాపకదళ సిబ్బంది నైరుతి యుఎస్‌లోని పలు ప్రాంతాలలో, లాస్ ఏంజిల్స్ శివార్లలో వందలాది మంది అగ్నిమాపకదళ సిబ్బంది ఉష్ణోగ్రతలను చల్లబరిచేందుకు తమవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్డబ్లుఎస్) తెలిపిన వివరాల ప్రకారం కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు ఆదివారం 128F (53.9C)కి చేరుకున్నాయి. ఇది భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా లాస్ వెగాస్‌లోని రద్దీగా ఉండే వీధులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. హోటళ్ల ఫౌంటైన్లలోకి ప్రజలు ప్రవేశించకుండా సెక్యూరిటీ గార్డులు పర్యవేక్షిస్తున్నారు. వీధులలో చెమటతో తడిసిపోతూ.. స్ట్రిప్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన హోటళ్లు, కాసినోలకు వెళుతున్న యువకులు ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాం అని తెలిపారు. లాస్ వెగాస్‌లో ఏకాస్త భవనం నీడ కనిపించినా, చిన్న చెట్టు నీడ వచ్చినా జనం అక్కడ సేద తీరుతున్నారు. కాసినోల లోపల ఎయిర్ కండిషనింగ్ అధికంగా ఉంచారు. వీధులలో చెమటతో తడిసిపోతున్న వ్యక్తులు కనిపిస్తూ ఇంతటి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. ఎల్ పాసో, టెక్సాస్‌లో 100.4F (38C) అంతకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫీనిక్స్, అరిజోనాలో ఉష్ణోగ్రతలు 17 రోజులుగా 109.4F (43C) కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం నాడు దట్టమైన మేఘాల కారణంగా ప్రజలకు స్వల్పంగా ఉపశమనం లభించింది. అయితే పగటి ఉష్ణోగ్రతలు 114F (45.5C) గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..! ‘శీతలీకరణ కేంద్రాలు’గా పబ్లిక్ భవనాలు రాబోయే రోజుల్లోనూ ఇదేస్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పిల్లలు, గర్భిణులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వారు ఎండలోకి వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. కాలిఫోర్నియా, నెవాడాలోని కొన్ని ప్రాంతాల్లోని పబ్లిక్ భవనాలు ‘శీతలీకరణ కేంద్రాలు’గా మార్చారు. జనం ఇక్కడ వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే వేసవి తీవ్రతలను చూడాలని కోరుకునే పర్యాటకులను ఈ వాతావరణం ఆకర్షిస్తోందని కొందరు అధికారులు తెలిపారు. వారు దీనిని హ్యాపీ డెత్ డే అని పిలుస్తున్నారన్నారు. హీట్ డోమ్ కారణంగా.. ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినపుడు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణ పీడనం ఎక్కువగా ఉంటే, ఆ వేడి ఎటూ విస్తరించలేక అక్కడే కేంద్రీకృతం అవుతుంది. అదే సమయంలో ఎండ కొనసాగుతూ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. దీనినే హీట్ డోమ్ అని అంటారు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఇటువంటి హీట్ డోమ్ ఏర్పడుతుంది. వచ్చే వారం మధ్య నాటికి హీట్ డోమ్ దక్షిణ అమెరికా అంతటా విస్తరించనున్నదని వాతావరణ ఛానెల్ తెలిపింది. కెనడాలో కొనసాగుతున్న కార్చిచ్చు కారణంగా అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ ప్రపంచంలో ఇప్పటికే 1.1C మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఉద్గారాలకు కోత విధించకపోతే ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా.. -
ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచినా మద్యం గడ్డకట్టదు.. ఎందుకంటే?
ఈ రోజుల్లో చాలామందికి మద్యం అలవాటు ఉంది. మద్యాన్ని చాలామంది చల్లగా తాగేందుకు లేదా, ఐస్ ముక్కలు వేసుకుని తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మద్యాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా అది ఎందుకు గడ్డకట్టదో మీకు తెలుసా? దీనికి వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంగతి తెలుసుకునేముందు ఏ ద్రవ పదార్థమైనా ఏ విదంగా గడ్డ కడుతుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ లిక్విడ్లోనూ దాని అంతర్గత ఉష్ణోగ్రత ఉంటుంది. అది దాని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అది ఉన్న వాతావరణంలోని ఉష్ణోగ్రత తగ్గితే దానిలోని అణువులు ఒకదానికొకటి మరింత దగ్గరవుతాయి. ఫలితంగా ద్రవ పదార్థం గడ్డకట్టే స్థితికి చేరుకుంటుంది. ద్రవ పదార్థం గడ్డకట్టడమనేది వివిధ కారణాలపై ఆధారపడివుంటుంది. మద్యంలో ఉండే ఆర్గానిక్ మాలిక్యూల్స్ దానిని గడ్డకట్టనీయకుండా చేస్తాయి. ద్రవపదార్థం గడ్డకట్టడం అనేది దాని ఘనీభవనస్థానంపై ఆధారపడి ఉంటుంది. ప్రతీ పదార్థానికి దాని ఘనీభవన స్థానం వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నీటినే తీసుకుంటే అది జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఘనీభవిస్తుంది. అంటే నీటి ఘనీభవన స్థానం జీరో డిగ్రీ సెంటీగ్రేడ్. మద్యం విషయానికొస్తే దాని ఘనీభవన స్థానం 114 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ కారణం చేతనే మద్యం గడ్డ కట్టాలంటే 114 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. మన ఇళ్లలో ఉండో ఫ్రిజ్‌లలో 0 నుంచి -10 లేదా అత్యధిక ఉష్ణోగ్రత -30 డిగ్రీ సెంటీగ్రేడ్‌గా ఉంటుంది. అందుకే మద్యాన్ని ఇంటిలోని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా గడ్డకట్టదు. ఇది కూడా చదవండి: తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆరోజు జరిగిందిదే.. -
పరేడ్‌లో కుప్పకూలిన బ్రిటిష్ సైనికులు..వీడియో వైరల్
బ్రిటన్‌లో వార్షిక ట్రూపింగ్ ది కలర్ సందర్భంగా ప్రిన్స్ విలయమ్స్ ఎదుట సైనికులు పరేడ్ రిహార్స్ల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో లండన్‌లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు చేరుకోవడంతో.. సైనికులు ఆ వేడికి తాళ్లలేక స్ప్రుహ తప్పి పడిపోయారు. చక్రవర్తి అధికారిక పుట్టిన రోజు సందర్భంగా ప్రతి జూన్‌లో లండన్‌లో ట్రూపింగ్ ది కలర్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అందుకోసం వార్షిక కవాతు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే విలియమ్స్ ఎదుట రిహార్సల్స్ చేస్తున్నారు సైనికులు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో..ఆ వేడికి తాళ్లలేక ముగ్గురు సైనికులు కుప్పకూలినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఈ మేరకు ప్రిన్స్ విలియం సైనికులను కృతజ్ఞతలు తెలుపుతు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో విలియమ్స్..ఈ ఉదయం కల్నల్ రివ్యూలో పాల్గొన్న ప్రతి సైనికుడుకి చాలా కృతజ్ఞతలు. Conducting the Colonel's Review of the King's Birthday Parade today. The hard work and preparation that goes into an event like this is a credit to all involved, especially in today’s conditions. pic.twitter.com/IRuFjqyoeD — The Prince and Princess of Wales (@KensingtonRoyal) June 10, 2023 క్లిష్ట పరిస్థితుల్లో మీరు నిబద్ధతతో మీ విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమం విజయవంతం కావడం కోసం తమ వంతుగా కృషి చేస్తున్నందుకు ధన్యావాదాలు అని ట్వీట్ చేశారు. సైనికులు విధి నిర్వహణలో భాగంగా ఆ సమయంలో ఉన్ని ట్యూనిక్స్, బేర్ స్కిన్ టోపీలు ధరించడంతో ఎండకు తాళ్లలేకపోయారు. దీంతో స్ప్రుహ కోల్పోయిన ఆ సైనికులకు వైద్యులు తక్షణ చిక్సిత్స అందించారు. కాగా, జూన్ 17న అంగరంగ వైభవంగా జరగనున్న సదరు కార్యక్రమాన్ని చార్లెస్ III పర్యవేక్షిస్తారు. 💂 At least three British royal guards collapsed during a parade rehearsal in London ahead of King Charles' official birthday as temperatures exceeded 88 degrees Fahrenheit pic.twitter.com/V0fLjROoD5 — Reuters (@Reuters) June 10, 2023 (చదవండి: రన్‌వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ..ప్రయాణికులకు తీవ్ర గాయాలు) -
Green Roof : మండుటెండల్లో రేకుల ఇల్లు కూడా చల్లచల్లగా..!
వేసవిలో మండే ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఎగువ మధ్యతరగతి, ధనికులైతే ఇళ్లలో ఏసీలు పెట్టుకొని సేదతీరుతుంటారు... మరి నగరాల్లోని బస్తీలు, మురికివాడల్లో రేకుల ఇళ్లలో నివసించే పేదల పరిస్థితి ఏమిటి? పైకప్పుల నుంచి లోపలికి వచ్చే వేడికి తాళలేక, నిద్ర పట్టక వారు విలవిల్లాడా ల్సిందేనా? ఈ ప్రశ్నకు వినూత్న ప్రయోగాలు చవకైన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. భూతాపం ఏటేటా పెరిగిపోతున్న ఈ కాలంలో పేదల ఇళ్లను చల్లబరిచే పనిని విస్తృతంగా వ్యాప్తిలోకి తేవడానికి జూన్ 6న ‘వరల్డ్ గ్రీన్ రూఫ్ డే’ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. (బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలోని ఓ మురికివాడ (ఫావెల్)లో లూయిస్ కాసియానో తన అస్బెస్టాస్ రేకుల ఇంటిపై స్వయంగా ఏర్పాటు చేసుకున్న గ్రీన్ రూఫ్ (ఏరియల్ వ్యూ)) జూన్ 6 వరల్డ్ గ్రీన్ రూఫ్ డే పై ఫొటోలో తన ఆకుపచ్చని ఇంటి పైకప్పుపై కూర్చున్న వ్యక్తి పేరు లూయిస్ కాసియానో (53). బ్రెజిల్‌లోని రియో డి జెనీరో మహానగరంలో పార్క్యు అరర అనే మురికివాడలో ఆస్బెస్టాస్ సిమెంటు రేకుల ఇంట్లో 85 ఏళ్ల తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. వేసవిలో అక్కడ పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్షియస్ దాటిపోతూ ఉంటుంది. ‘ఇటుకలు పగలు వేడిని పీల్చుకొని రాత్రుళ్లు వదులుతూ ఉంటాయి. తెల్లవారుజామున 3 గంటలయ్యే వరకు ఇల్లు చల్లబడేది కాదు. చెమటలు ఆగేవి కాదు. నిద్రపట్టేది కాదు. (మురికివాడలో ఇరుకైన రేకుల ఇళ్ల మధ్య 50 డిగ్రీల సెల్షియస్ ఎండలోనూ మొక్కలతో పచ్చగా లూయిస్ కాసియానో ఇల్లు. పైపు డ్రిప్ ద్వారా ఈ మొక్కలకు తగుమాత్రంగా నీరు ఇస్తూ లూయిస్ పరిరక్షించుకుంటున్నారు.) భరించలేనంత వేడిగా ఉండేది..’అని పదేళ్ల క్రితం పరిస్థితిని కాసియానో గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన స్వయంగా తన ఇంటిపై గ్రీన్ రూఫ్ ఏర్పాటు చేసుకోవటంతో పరిస్థితి సానుకూలంగా మారిపోయింది. 2012లో రేకుల ఏటవాలు పైకప్పు మీద మొక్కల్ని పెంచడం మొదలుపెట్టాక ఇల్లు చల్లబడింది. ‘ఇరుగు పొరుగు ఇళ్లకన్నా మా ఇల్లు 15 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంటోంది. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా కొన్ని గంటలు లేకపోయినా ఇంట్లో ఉండగలుగుతున్నాం’అని కాసియానో చెప్పారు. (లూయిస్ కాసియానో రేకుల ఇంటి పైకప్పుపై మొక్కల్ని పెంచుతున్నది ఇలా) రియో డి జెనీరో యూనివర్సిటీలో గ్రీన్రూఫ్స్పై పరిశోధన చేస్తున్న బ్రూనో రెసెండో సహకారంతో కాసియానో తన ఇంటిపై ప్లాస్టిక్ కూల్‌డ్రింక్ సీసాలను రీసైకిల్ చేసి తీసిన తేలికపాటి పాలిస్టర్ నాన్‌ఓవెన్ జియోటెక్స్‌టైల్ పరదాను పరచి, మట్టి పోసి తీవ్ర ఎండలను సైతం తట్టుకొనే మొక్కలను పెంచుతున్నారు. గ్రీన్‌రూఫ్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరీ ఆయన ప్రచారం చేస్తున్నారు. గ్రీన్‌రూఫ్‌లు.. కొన్ని ప్రయోగాలు ముంబై, బెంగళూరులలో సీబ్యాలెన్స్, హసిరుదల వంటి స్వచ్ఛంద సంస్థలు ఇళ్ల పైకప్పులపై వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటి పైకప్పు మీద నీలిరంగు టార్పాలిన్‌పై నీరు నింపిన ప్లాస్టిక్ సీసాలను సీబ్యాలెన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సీసాల్లోని నీరు ఉష్ణోగ్రతను గ్రహించడం వల్ల ఆ మేరకు ఇల్లు తక్కువగా వేడెక్కుతుందని ఆ సంస్థ చెబుతోంది. రేకుల ఇంటిపై నీలిరంగు ప్యానెళ్లను అమర్చడం ద్వారా కూడా వేడిని తగ్గించవచ్చు. రేకుల ఇంటిపై తెల్ల టి ‘ఎకోబోర్డ్ పేనల్స్’ను పరచి అధిక ఉష్ణోగ్రత నుంచి కొంత మేరకు రక్షణ పొందొచ్చు. రేకుల ఇంటిపై అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి.. దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం చేయొచ్చు. ఈ ఉపాయం సత్ఫలితాలిస్తున్నట్లు సీబ్యాలెన్స్ సంస్థ చెబుతోంది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటిపై ఎకోబోర్డ్ ప్యానల్స్‌ను పరచి అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రయత్నం) మొండి మొక్కలతో కూల్‌కూల్‌గా.. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఇళ్ల పైకప్పులను చల్లగా ఉంచే కొన్ని మొండి జాతుల మొక్కలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన స్వతంత్ర పరిశోధనా సంస్థ పుణేలోని అఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఆర్ఐ) ఇటీవల గుర్తించింది. పశ్చిమ కనుమల్లో కనుగొన్న 62 రకాల మొండి జాతి మొక్కలు 95% తేమను కోల్పోయినా చనిపోవని, తిరిగి తేమ తగిలినప్పుడు చిగురిస్తాయని తెలిపింది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో ఓ రేకుల ఇంటిపైన అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి, దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం) నగరాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే రేకులు, శ్లాబ్ ఇళ్ల పైకప్పులపై ఈ జాతులను పెంచితే స్వల్ప ఖర్చుతోనే గ్రీన్‌రూఫ్‌లు అందుబాటులోకి వస్తాయి. డ్రిప్ ద్వారా నీటిని తగుమాత్రంగా అందిస్తే ఎంత ఎండైనా ఇవి పచ్చగానే పెరిగే అవకాశం ఉంది. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
ఇక నుంచి ఎండలే ఎండలు
-
‘హీట్’ మూవీ రివ్యూ
టైటిల్: హీట్ నటీనటులు: వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్ తదితరులు నిర్మాతలు: ఎం.ఆర్.వర్మ, సంజోష్ దర్శకత్వం: ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ సంగీతం : గౌతమ్ రవిరామ్ సినిమాటోగ్రఫీ : రోహిత్ బాచు విడుదల తేది: మే 5, 2023 ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు వస్తుంటాయి. అయితే అందులో సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లకు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడూ ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లను తెరకెక్కించడం అంత సులభం ఏమీ కాదు. కానీ సరైన కథ, గ్రిప్పింగ్ కథనం ఉంటే సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు హీట్ అనే సినిమా ఆ జానర్లో ప్రేక్షకులను మెప్పించేందుకు నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. హీట్ మూవీ కథేంటంటే.. అభిజిత్ (వర్దన్ గుర్రాల), సిరిల్ (మోహన్ సాయి)లిద్దరూ చిన్నతనం నుంచి ఫ్రెండ్స్. ఈ ఇద్దరూ కంపెనీ భాగస్వామ్యులుగానూ సక్సెస్ అవుతారు. ఈ క్రమంలో ఓ ప్రాజెక్ట్ విషయంలో స్టీఫెన్ అనే వ్యక్తితో ఇబ్బంది కలుగుతుంది. అదే సమయంలో సిరిల్ తాను ప్రేమించిన ఆరాధ్య (అంబికా వాణి)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కులంతార పెళ్లి కావడంతో ఆరాధ్య కుటుంబ సభ్యులు రగిలిపోతారు. ఆరాధ్య అన్న రుద్ర ఎలాగైనా సరే వారిని చంపాలని అనుకుంటాడు. తదనంతరం సిరిల్, ఆరాధ్యలు కనిపించకుండా పోతారు. వారిని మాయం చేసింది ఎవరు? సిరిల్‌ను ఘోరంగా చంపింది? తన ఫ్రెండ్ సిరిల్ కోసం అభి చేసిన ప్రయత్నాలు ఏంటి? అసలు ఈ కథలో మైఖెల్ పాత్ర ఏంటి? చివరకు అభి తన సమస్యల నుంచి బయటపడ్డాడా? అన్నది కథ. ఎలా ఉందంటే.. హీట్ మూవీ అంతా కూడా ఒకే రాత్రిలో జరుగుతుంది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సమస్యలు మొదలై.. తెల్లారే సరికల్లా కథ సుఖాంతం అవుతుంది. ఈ మధ్యలో ఏం జరిగిందనే దాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. మరీ అంత గ్రిప్పింగ్‌గా కాకపోయినా.. పర్వాలేదనిపిస్తాడు. అయితే ఇలాంటి కథలకు ఉండే కామన్ పాయింట్ అందరికీ తెలిసిందే. సైకో శాడిస్ట్ కిల్లర్ ఎవరు? ఎందుకు ఆ పనులు చేస్తున్నాడు.. వరుసగా హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనేది అంత ఆసక్తికరంగా చెప్పినట్టుగా అనిపించదు. ఫస్టాఫ్‌లో వరుసగా హత్యలు జరుగుతుండటం, తన ఫ్రెండ్స్‌ను కాపాడుకునేందుకు హీరో కారులో అక్కడికీ ఇక్కడికీ పరుగులు పెట్టడం, సైకో బెదిరింపులు, హ్యాకింగ్లు వీటితోనే సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో సినిమా కాస్త స్లో అయినట్టుగా అనిపిస్తుంది. కానీ అప్పటికే ఈ సైకో కిల్లర్ ఎవరు.. అనేది ప్రేక్షకులకు ఓ అంచనా వస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. ఎమోషన్స్‌ను ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో దర్శకులు కొంత సఫలమైనట్టుగా కనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. వర్దన్ గుర్రాల అభి పాత్రలో మెప్పిస్తాడు. ఎమోషన్స్ క్యారీ చేయడంలో సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది. చివర్లో ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఓకే అనిపిస్తాడు. సిరిల్ పాత్ర నిడివి తక్కువే అయినా ఆకట్టుకుంటాడు. మైఖెల్ తన విలనిజంతో ఆకట్టుకుంటాడు. హీరోయిన్లు ఎమోషనల్ కారెక్టర్లతో పర్వాలేదనిపిస్తారు. స్నేహా ఖుషి, అంబికా వాణిలు కనిపించినంత సేపు ఆకట్టుకుంటారు. ఇక విలన్‌గా సైకో మైఖెల్ పాత్రధారి కూడా ఓకే అనిపిస్తాడు. ఇలా అన్ని పాత్రలు నటీనటులు తమ వంతు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాలో పాటలు తక్కువే. సినిమా ఫ్లోకి అడ్డుపడతాయని పాటలను కూడా అంతగా పెట్టలేదనిపిస్తుంది. ఇక ఆర్ఆర్ మాత్రం సినిమా ఆసాంతం వినిపిస్తూనే ఉంటుంది. సీన్లను బాగానే ఎలివేట్ చేస్తుంది. నైట్ విజన్ షాట్స్ బాగుంటాయి. ఈ సినిమా అంతా ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. ఆ మూడ్‌ను కెమెరామెన్ తెరపైన చూపించాడు. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా అనిపిస్తాయి. -
HEAT Movie Trailer: మైండ్ ఈజ్ డేంజరస్ వెపన్..
వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హీట్’. ఎం.ఆర్.వర్మ సమర్పణలో ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవలె విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. మే 5న విడుదల కాబోతోన్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆసాంతం ఉత్కంఠను రేకెత్తించేలా ఉంది. 'ఫ్రెండ్ అంటే వెలుతురున్నప్పుడు షాడో లాంటి వాడు కాదు.. చీకట్లో కూడా వెలుతురునిచ్చే వాడే నిజమైన ఫ్రెండ్' అంటూ సాగే డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. చేజింగ్ సీన్లు, మర్డర్ సీన్లతో ట్రైలర్ ఉరుకులు పరుగులు పెట్టినట్టు అనిపిస్తోంది. (చదవండి: ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి) ట్రైలర్ మధ్యలో వచ్చిన.. 'మనకి అర్హత లేని వాటిని టచ్ చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి'.. 'ఆటలో ఆడాలంటే..ఆడటం మాత్రమే తెలిస్తే చాలదు.. ప్రత్యర్థిని సరిగ్గా అంచనా వేయగలిగిన వాడు.. ప్రెజర్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయగలిగిన వాడు మాత్రమే గెలుస్తాడు'.. 'మైండ్ ఈజ్ డేంజరస్ వెపన్'.. 'ఎమోషన్ ఈజ్ ఏ మోస్ట్ డేంజరస్ వెపన్'.. అంటూ వచ్చిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా.. రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేశారు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా హీట్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి జంటగా నటించిన చిత్రం 'హీట్'. ఈ చిత్రానికి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించిన ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు శైలేష్ కొలను చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్‌తోనే సినిమా థీమ్ ఏంటన్నది చెప్పేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే కారు, నడిచి వస్తున్నట్టుగా మనిషి, భూతద్దం వంటివి చూస్తుంటే..ఇది ఒక ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. పోస్టర్‌తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది చిత్రబృందం. ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా.. రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేశారు. శివన్ కుమార్ కందుల, శ్రీధర్ వెజండ్ల సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్, అప్పాజీ అంబరీష, జయ శ్రీ రాచకొండ, ప్రభావతి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. -
రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి
-
ఈ ఏడాది మండిపోనున్న ఎండలు..
-
ఫ్యాన్.. ఏసీ ఆన్.. హీటెక్కుతున్న 'గ్రేటర్'.. భారీగా విద్యుత్ వినియోగం
సాక్షి, సిటీబ్యూరో: భానుడి ప్రతాపం అప్పుడే మొదలైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు విద్యుత్ శాఖకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సాధారణంగా శివరాత్రి తర్వాత ఎండల తాకిడి పెరుగుతుంది. ఈసారి మాత్రం ముందుగానే ఎండలు మండుతుండటంతో గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. . ఉదయం 10 గంటల తర్వాత సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం పూట బయటికి రావాలంటేనే నగరవాసులు కాస్త ఆలోచిస్తున్నారు. శనివారం గరిష్ఠంగా 35.4 సెల్సియస్ డిగ్రీలు, కనిష్ఠంగా 16.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భగ్గున మండుతున్న ఎండలకు ఉక్కపోత తోడవడంతో ఉపశమనం కోసం సిటీజన్లు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. 57 ఎంయూలకుపైగా.. ► వాతావరణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ మార్పులను శరీరం తట్టుకోలేక పోతోంది. నిజానికి చలి కారణంగా నిన్న మొన్నటి వరకు ఫ్యాన్లు పెద్దగా వాడలేదు. ప్రస్తుతం ఉక్కపోత ప్రారంభం కావడంతో ఏకంగా ఏసీలను ఆన్ చేస్తున్నారు. కేవలం గృహ విద్యుత్ మాత్రమే కాకుండా వాణిజ్య వినియోగం భారీగా నమోదవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేస్తుండటమే ఇందుకు కారణం. ► ఫిబ్రవరి మొదటి వారంలో నగరంలో రోజు సగటు విద్యుత్ డిమాండ్ 52 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 57 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. రెండో శనివారం విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. వర్కింగ్ డేస్‌తో పోలిస్తే.. సెలవు దినాల్లో వినియోగం కొంత తగ్గాల్సి ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి చివరి నాటికి 75 నుంచి 80 ఎంయూలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేసింది. హీటెక్కుతున్న డీటీఆర్లు ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగడంతో సబ్స్టేషన్లలోని ఫీడర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆయిల్ లీకేజీలను సరి చేయకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఒత్తిడి తట్టుకోలేక పేలిపోతున్నాయి. తాజాగా శనివారం పాతబస్తీ దారుíÙఫాలోని ఓ డీటీఆర్ నుంచి మంటలు వ్యాపించి భారీ శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. వేసవి ప్రారంభానికి ముందే లైన్ల పునరుద్ధరణ, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ, ఎర్తింగ్ ఏర్పాటు, లూజు లైన్లను సరి చేయడం వంటి పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. అధికారులు ఇప్పటి వరకు వాటిపై దృష్టిపెట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..! -
చలికాలం వచ్చేసింది.. నిశ్శబ్దంగా వెచ్చదనం ఈ గ్యాడ్జెట్ ప్రత్యేకం
అసలే చలికాలం వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో చలి మరీ వణికించేస్తుంది. అతిగా చలి వణికించే ప్రాంతాల్లో చలి నుంచి రక్షణ కోసం జనాలు రూమ్హీటర్లను వాడుతుంటారు. వీటి వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది. పైగా వీటి నుంచి వెలువడే సన్నని రొద సరిగా నిద్రపట్టనివ్వదు. అలాంటి ఇబ్బందులేవీ లేని అధునాతన పోర్టబుల్ రూమ్ హీటర్‌ను రష్యన్ బహుళ జాతి సంస్థ ‘బల్లూ గ్రూప్’ అందుబాటులోకి తెచ్చింది. ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ‘అపోలో బల్లు కన్వెక్షన్ హీటర్’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ 1500 వాట్ల రూమ్ హీటర్‌ను తేలికగా ఎక్కడికైనా తీసుకుపోయిన కోరుకున్న చోటు అమర్చుకోవచ్చు. సాధారణ రూమ్ హీటర్లతో పోలిస్తే, ఇది వినియోగించుకునే విద్యుత్తు దాదాపు సగానికి సగం తక్కువ. మూడువందల చదరపు అడుగుల గదిని ఇది వెచ్చగా ఉంచగలదు. ఇందులో 24 గంటల టైమర్ కూడా ఉంది. గదిలో ఎంతసేపు వెచ్చదనం కావాలో ఈ టైమర్‌లో సెట్ చేసుకోవచ్చు కూడా. దీని ధర 179.99 డాలర్లు (సుమారు రూ.15 వేలు) మాత్రమే! చదవండి: సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు! -
ఫ్లయింగ్ సాసర్లా కనిపించే.. ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్.. ప్రయోజనాలు ఇవే
అంతరిక్ష ప్రయోగాలు అంటేనే ఎంతో క్లిష్టమైనవి. అందులోనూ మనుషులు స్పేస్‌లోకి వెళ్లే ప్రయోగాలు మరింత రిస్క్. పెద్ద ఎత్తున రక్షణ ఏర్పాట్లు ఉండాలి. ఏ చిన్న లోపమున్నా భారీ ప్రమాదం తప్పదు. పైగా మార్స్‌పైకి మనుషులను పంపేందుకు నాసా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో స్పేస్ షిప్‌లు.. మార్స్‌పై దిగేప్పుడు పుట్టే వేడిని తట్టుకోవడానికి, మెల్లగా ల్యాండ్ కావడానికి వీలయ్యే రక్షణ ఏర్పాట్లు కావాలి. ఈ క్రమంలోనే నాసా ఫ్లయింగ్ సాసర్లా కనిపించే ఓ ప్రత్యేక ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను రూపొందించింది. బుధవారం దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఈ హీట్ షీల్డ్ ఏంటి, దాని ప్రాధాన్యత, భవిష్యత్తులో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వాతావరణం ఘర్షణ నుంచి.. అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లు, వ్యోమనౌకలు గంటకు 25 వేల కి.మీ.కిపైగా వేగంతో ప్రయాణిస్తుంటాయి. తిరిగి భూవాతావరణంలోకి వచ్చేప్పుడూ అంతే వేగంతో ప్రవేశిస్తాయి. ఈ సమయంలో వాతావరణ ఘర్షణ వల్ల వాటి ఉపరితలంపై వేల డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత పుడుతుంది. దీనిని తట్టుకునేందుకు రాకెట్లు, స్పేస్ షిప్‌ల ఉపరితలంపై హీట్ షీల్డ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక సిరామిక్ టైల్స్ వాడతారు. మార్స్‌పైకి వెళ్లాలంటే.. భూమితోపాటు అంగారకుడు (మార్స్), శుక్రుడు (వీనస్) వంటి గ్రహాలపైనా వాతావరణం ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరిన వ్యోమనౌకలు మార్స్‌పై దిగాలంటే దాని వాతావరణం ఘర్షణను ఎదుర్కోవాలి. అదే సమయంలో సున్నితంగా ల్యాండింగ్ కావడం కోసం వేగాన్ని త్వరగా తగ్గించుకోవాలి. ఇప్పటివరకు చంద్రుడు, మార్స్‌పైకి రోవర్లను పంపినప్పుడు ల్యాండింగ్ కోసం ప్యారాచూట్లను వాడారు. చిన్నవైన రోవర్లకు అవి సరిపోయాయి. కానీ మానవసహిత ప్రయోగాలకు వాడే వ్యోమనౌకలు భారీగా ఉంటాయి. ఈ క్రమంలో వేడిని ఎదుర్కోవడం, వేగాన్ని తగ్గించుకోవడానికి పరిష్కారంగా నాసా శాస్త్రవేత్తలు ‘లో ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యాన్ ఇన్‌ఫ్లాటబుల్ డీసెలరేటర్ (లోఫ్టిడ్)’ ప్రయోగాన్ని చేపట్టారు. ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్ అంటే.. మొదట చిన్నగా ఉండి, కావాలనుకున్నప్పుడు గాలితో ఉబ్బి, పెద్దగా విస్తరించే ఉష్ణ రక్షక కవచం అని చెప్పుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది? వ్యోమనౌకకు ముందు భాగాన ఈ ప్రత్యేక పరికరాన్ని అమర్చుతారు. మార్స్పైగానీ, భూవాతావరణంలోకిగానీ వ్యోమనౌక ప్రవేశించినప్పుడు ఇది విచ్చుకుంటుంది. వ్యోమనౌక ముందు గొడుగులా ఏర్పడుతుంది. దీనివల్ల వాతావరణం నేరుగా వ్యోమనౌకను తాకకుండా ఈ హీట్‌షీల్డ్ అడ్డుకుంటుంది. ఇది సుమారు 20 అడుగుల వెడల్పుతో ఉండటంతో వాతావరణం ఒత్తిడికి వ్యోమనౌక వేగం కూడా తగ్గుతుంది. వేగం బాగా తగ్గాక చివరన ప్యారాచూట్‌ను వినియోగిస్తారు. దీనితో సున్నితంగా ల్యాండింగ్ అవుతుంది. ప్రయోగాత్మకంగా.. సోమవారం అమెరికాలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అట్లాస్–వి రాకెట్ ద్వారా మరో ఉపగ్రహంతోపాటు ‘లోఫ్టిడ్’ను ప్రయోగించనున్నారు. రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లాక దీనిని భూమివైపు వదిలేస్తుంది. సుమారు గంటకు 35వేల కిలోమీటర్ల వేగంతో అది భూమివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. తర్వాత ఎంత వేగంతో ప్రయాణిస్తోంది? ఒత్తిడి ఎంత పడుతోంది? ఎంతమేర ఉష్ణోగ్రత పుడుతోందన్న వివరాలను పరిశీలించేందుకు ఇందులో ప్రత్యేకమైన సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఈ డేటా ఆధారంగా ‘లోఫ్టిడ్’కు తుదిరూపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం కేవలం హీట్‌షీల్డ్‌ను మాత్రమే ప్రయోగిస్తున్నారు. విజయవంతమైతే వ్యోమనౌకలకు అమర్చి పంపుతారు. భవిష్యత్తులో ఇతర గ్రహాలపైకి చేసే అన్ని రకాల ప్రయోగాల్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొలంబియా ప్రమాదమే ఉదాహరణ 2003లో నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ అంతర్జాతీయ అంతరిక్షం (ఐఎస్ఎస్) నుంచి తిరిగి వస్తూ పేలిపోయింది. అందులో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా సహా ఏడుగురు వ్యోమగాములు మృతిచెందారు. ఈ ప్రమాదానికి కారణం స్పేస్ షటిల్ ఎడమవైపు రెక్కపై ఉన్న హీట్ షీల్డ్ కొంతమేర దెబ్బతినడమే. అంతకుముందు స్పేస్ షటిల్ అంతరిక్షంలోకి వెళ్తున్న సమయంలోనే.. దానికి అనుబంధంగా ఉన్న రాకెట్ ట్యాంక్ ఇన్సులేటింగ్ ఫోమ్ చిన్న ముక్క విడిపోయి స్పేస్ షటిల్ రెక్కపై ఉన్న హీట్ షీల్డ్‌కు తగిలింది. హీట్ షీల్డ్‌గా అమర్చిన టైల్స్‌లో పగులు వచ్చింది. చిన్న పగులుతో.. పెద్ద ప్రమాదం కొలంబియా షటిల్ భూమికి తిరిగివచ్చేప్పుడు ధ్వని వేగానికి 20 రెట్లకుపైగా వేగంతో.. అంటే సుమారు గంటకు 25 వేల కిలోమీటర్లకుపైగా వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో 1,500 సెంటీగ్రేడ్లకుపైగా వేడి పుట్టింది. కానీ షీట్ షీల్డ్ టైల్స్‌లో పగులు కారణంగా ఆ వేడి లోపలి భాగానికి చేరి.. రెక్కలోని భాగాలు దెబ్బతినడం మొదలైంది. కాసేపటికే స్పేస్ షటిల్ పేలి ముక్కలైపోయింది. హీట్ షీల్డ్‌లో చిన్న పగులు ఉన్నా ఇంత ఘోరమైన ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలోనే నాసా శాస్త్రవేత్తలు.. ఇతర గ్రహాలపై దిగేప్పుడు స్పేస్ షిప్‌లకు హీట్ షీల్డ్‌గా ఉండేందుకు, అదే సమయంలో వేగాన్ని తగ్గించి సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు తోడ్పడే ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను అభివృద్ధి చేస్తున్నారు. -
షాకింగ్ వీడియో: ట్రైయిన్‌లో టీ ఇలానా వేడి చేసేది! బాబోయ్...
ట్రైయిన్‌లో మనకు రకరకాల పదార్థాలు అమ్ముతుంటారు. ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో లాంగ్ జర్నీ ఐతే అక్కడ ఏం అమ్ముతుంటే అవి కొనుక్కుని తినక తప్పదు. జనాలు ఎక్కువగా తాగేది టీ లేదా కాఫీ. ఎందుకంటే కాసేపు రిలాక్స్ అవ్వడానికి చిన్న కప్పు టీ పడితే చాలు అని చాలా మంది భావిస్తారు. కానీ ఇప్పుడూ ఈ సంగతి గనుక వింటే ట్రైయిన్‌లో టీ తాగడానికి కచ్చితంగా జంకుతారు. వివరాల్లోకెళ్తే....ఒక ట్రైయిన్‌లో టీ అమ్మే వ్యక్తి ఎలా టీని వేడి చేస్తున్నాడో ఇద్దరు ప్రయాణకులు చూసి వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యక్తి టీని వేడి చేయడం కోసం శుభ్రంగా లేని ఒక హీటర్ని ఉపయోగించి వేడి చేశాడు. అక్కడ అతను చేసే విధానం చూస్తే వాంతు వచ్చేలా ఉంది. ఈ ఘటన సబరి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. పలువురు ప్రయాణికులు సబరి ఎక్స్‌ప్రెస్‌లో విక్రయించే ఆహరపానీయాలు చాలా ఘోరంగా ఉంటాయని చెబుతున్నారు.ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో. దీంతో నెటిజన్లు ఇలాంటి కాంట్రాక్టును రద్దు చేసి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. View this post on Instagram A post shared by ꧁VISHAL༆ (@cruise_x_vk) (చదవండి: రోడ్డుపై చిరుత కలకలం... భయపెట్టించేలా పరుగు తీసింది) -
దర్జాగా పడుకోండి.. ఫోన్ చూస్తూ, పేపర్ చదువుతూ బరువు తగ్గండి! ఎలాగంటారా?
‘ఏ కష్టం లేకుండా వచ్చిపడిన ఊబకాయాన్ని తగ్గించాలంటే మాత్రం కచ్చితంగా కష్టపడాలి’ అనేది ఒకప్పటి మాట. ఎంత సులభంగా పెరిగారో అంతే సౌఖ్యంగా తగ్గొచ్చంటోంది ఇప్పటి టెక్నాలజీ. సౌఖ్యమంటే అట్టాంటి ఇట్టాంటి సౌఖ్యం కాదు. దర్జాగా పడుకుని, ఫోన్ లేదా పేపర్ చూస్తూ హ్యాపీగా బరువు తగ్గొచ్చన్న మాట. ఈ స్టీమింగ్ బాడీ బ్లాంకెట్.. ఫార్ ఇన్ఫ్రారెడ్ డిజిటల్ హీట్ థెరపీతో బాడీలోని కొవ్వుని ఇట్టే కరిగించేస్తుంది. అదనంగా శరీరానికి సరికొత్త నిగారింపునూ అందిస్తుంది. దీన్ని ఒకవైపు నుంచి ఓపెన్ చేసి, చిత్రంలో ఉన్న విధంగా ఉపయోగించాలి. చేతులు బయటికి తీసుకునేందుకు ఇరువైపులా రెండు జిప్పులు ఉంటాయి. చదవండి: వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులు... ముప్ఫై నిమిషాలు ఈ బ్లాంకెట్‌లో రెస్ట్ తీసుకుంటే.. ఒక గంట స్విమ్మింగ్‌కు, ఒక గంట రన్నింగ్‌కు.. ఒక గంట సైకిల్ రైడ్‌కు.. వంద సిటప్స్కు.. లేదా 30 నిమిషాల యోగాకు సమానమట. ఈ బ్లాంకెట్ ఇన్ఫ్రారెడ్ లేయర్, వాటర్ ప్రూఫ్ లేయర్, షీల్డ్ లేయర్, థర్మల్ లేయర్, టెంపరేచర్ కంట్రోల్ లేయర్, హీట్ లేయర్, ఇన్సులేషన్ లేయర్ వంటి 7 సమర్థవంతమైన లేయర్స్‌తో రూపొందింది. దీన్ని వినియోగించే సమయంలో.. ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుందని గుర్తించిన వెంటనే.. ఒక నిమిషం పాటు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ థెరపీని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కొవ్వు తగ్గి.. చర్మకణాలు పునరుత్తేజం చెంది, రోగనిరోధక శక్తి, జీవక్రియ మెరుగుపడతాయి. అలసట తగ్గుతుంది. చిత్రంలోని బ్లాంకెట్‌తో పాటు ఇంటెలిజెంట్ కంట్రోల్ బాక్స్, ఒక రిమోట్ లభిస్తాయి. బాక్స్ మీద టైమ్ డిస్ప్లే, స్టార్ట్ బటన్, టెంపరేచర్ కంట్రోల్, టెంపరేచర్ డిస్ప్లే, సేఫ్టీ స్విచ్.. ఇలా సెట్టింగ్స్ ఉంటాయి. ఈ డివైజ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇదొక హోమ్ స్పా లాంటిది. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు.. తీరిక దొరికినప్పుడు ఆన్ చేసుకుని ఓ వైపు సేదతీరుతూనే ఇంకో వైపు కొవ్వు కరిగించుకోవచ్చు. అందంతో పాటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. -
మండిన ఎండ..పుట్ట నుంచి బయటకొచ్చిన పాములు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎండ తీవ్రత శనివారం ఎక్కువగా ఉంది. వేడిని తట్టుకోలేక ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్ సమీపంలోని గృహ నిర్మాణశాఖ నిర్మిత కేంద్రం అవరణలో ఉన్న పుట్ట నుంచి ఒక్క సారిగా ఐదు పాములు బయటకు వచ్చాయి. దీన్ని చూసిన అక్కడ ఉన్నవారు భయానికి గురయ్యారు. పుట్ట నుంచి బయటకు వచ్చిన పాములు సమీపంలోని తుప్పల్లోకి జారుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సర్పాల సయ్యాట ఆమదాలవలస రూరల్: శ్రీహరిపురం గ్రామం సమీపంలోని కొండ ప్రాంతంలో శనివారం రెండు సర్పాలు సయ్యాట ఆడాయి. నాగు, జెర్రీ జాతులకు చెందిన పాముల సయ్యాటను స్థానికులు ఆసక్తిగా తిలకించి సెల్ఫోన్లలో చిత్రీకరించారు. -
ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు అలజడి
వాషింగ్టన్ : కాలిఫోర్నియాను కార్చిచ్చు దహించివేస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపకదళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మంటల కారణంగా ఆరెగాన్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు ప్రజలకు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ కోతలను అధిగమించటానికి వీలైనంత తక్కువగా విద్యుత్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఇందుకోసం ఐదు గంటల ‘ప్లెక్స్ అలర్ట్’ను ప్రకటించారు. ఈ అలర్ట్ సాయంత్రం 4 గంటలనుంచి ప్రారంభమవుతుంది. కాగా, ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు అలజడి రేపుతోంది. శనివారం మొహావే కౌంటీలో అగ్ని తీవ్రతపై సర్వే నిర్వహిస్తున్న చిన్న విమానం పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిని ఎయిర్ టాక్టికల్ గ్రూప్ సూపర్వైజర్ జెఫ్ పిచుర్రా, మాజీ టక్సన్ ఏరియా ఫైర్ చీఫ్ మాథ్యూ మిల్లర్లుగా గుర్తించారు. ఈ కార్చిచ్చు ఆదివారం నాటికి 83,256 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. దాదాపు 20 ఇళ్లను నాశనం చేసింది. కార్చిచ్చు కారణంగా కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. శనివారం మొజావే డెసెర్ట్‌లో 53 డిగ్రీల సెల్సియస్(127 ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఫర్నెస్ క్రీక్ డెసెర్ట్‌లో ఏకంగా 57 డిగ్రీల సెల్సియస్(135ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1913 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉష్టోగ్రతలు నమోదు కావటం ఇదే ప్రథమం. -
రాష్ట్రంలో పెరిగిన వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత పెరిగింది. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం, నిర్మల్ జిల్లా సోన్, జగిత్యాల జిల్లా మెట్పల్లి, మేడిపల్లి, రాయికల్, రాజన్నసిరిసిల్ల జిల్లా మల్లారం, ఆదిలాబాద్ జిల్లాలోని బేల, ఆదిలాబాద్ కలెక్టరేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, శ్రీరాంపూర్, నిజామాబాద్ జిల్లా నందిపేట్, ఆర్మూర్‌లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా 42 నుంచి 44 డిగ్రీలు నమోదవుతాయని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
నిప్పుల కుంపటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాడ్పులు, ఎండల తీవ్రత తగ్గడంలేదు. మంగళవారం మళ్లీ పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. అనేకచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ సహా ఆ జిల్లాలోని జైనాడ్, బేలా, తలమడుగు, తంసి, నిర్మల్ జిల్లా మమ్డా, లక్ష్మణ్‌చంద, మంచిర్యాల జిల్లా వెల్గనూర్, జన్నారం, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఇస్సపల్లెలలో 46 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచడంతో జనం విలవిల్లాడిపోయారు. నిజామాబాద్, రుద్రంగి, కొల్లూరు, సోన్ఐబీ, భోరాజ్, మెట్పల్లి, శ్రీరాంపూర్లలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడా వడగాడ్పులు వీయడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రామగుండం, నల్లగొండ, మెదక్‌లలో 44 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల మూడ్రోజులు వడగాడ్పులు.. రాగల మూడ్రోజులు ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. బుధవారం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ఉన్న మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. మరోవైపు దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. -
నేడు, రేపు వడగాడ్పులు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం, బుధవారం రెండు రోజులు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలా బాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగి త్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబా బాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మంగళవారం కొన్నిచోట్ల, బుధవారం అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. దంచికొట్టిన ఎండలు.. సోమవారం పలు ప్రాంతాల్లో వడగాడ్పులతోజనం అవస్థలు పడ్డారు. నిర్మల్ జిల్లా కడ్డెం పెద్దూరు, సోన్ ఐబీ, మమ్డా, పొంకల్, లక్ష్మణ్ చంద, పాత ఎల్లాపూర్, నిజామాబాద్ జిల్లా కల్దుర్కి, చిన్నమావంది, ఆదిలాబాద్ సహా అదే జిల్లా తంసి, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటల్లో 46 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ముత్తారం మంథని, తానూరు, బీరవల్లి, బేలా, లింగాపూర్, వడ్డాయల్, కుబీర్, తాండ్రలలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 43, హైదరాబాద్, హన్మకొండలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 40 డిగ్రీలు నమోదైంది. బంగాళాఖాతంలోకి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని మరికొన్ని చోట్లకు ఈ నెల 27న నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. -
రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగ
-
నిప్పుల వాన
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘అగ్గి’రాజుకుంది! ప్రచండ భానుడి ఉగ్రరూపానికి తెలంగాణ విలవిల్లాడింది. ఎండ వేడికితోడు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాడ్పులతో వివిధ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోనూ 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడి, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రిపూట కూడా ఆ వేడి తగ్గలేదు. ఎండ తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు అల్లాడిపోయారు. రోహిణి కార్తె కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని, 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత దాటితే ఆయా ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు అధికమవుతున్నందున వడగాల్పుల తీవ్రత సైతం పెరగనున్నట్లు తెలిపింది. ఉత్తర భారతం నుంచి రాష్ట్రంపైకి వేడిగాలులు, పొడిగాలులు వస్తున్నాయని, ముఖ్యంగా రాజస్తాన్ నుంచి ఈ గాలులు వస్తుండటంతో తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. అలాగే ఉంపన్ తుపాను వెళ్లిపోవడంతో తేమ కూడా దాంతోపాటు వెళ్లిపోయిందని, ఫలితంగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ రెండు కారణాలతో రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తున్నాయన్నారు. అయితే గతేడాది కంటే ఈసారి వడగాడ్పులు నమోదైన రోజులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈసారి ఇప్పటివరకు మూడు రోజులే వడగాడ్పులు నమోదయ్యాయని వివరించారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీలు అధికంగా నమోదు కావడం లేదా 45–46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగా లెక్కిస్తామన్నారు. 47 డిగ్రీలు, ఆపైన ఉష్ణోగ్రతలు నమోదైతే తీవ్ర వడగాడ్పులుగా లెక్కిస్తామని పేర్కొన్నారు. నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు... రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పలుచోట్ల వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగనున్నట్లు పేర్కొంది. ఆ ద్రోణి వస్తే తేమ గాలులు వస్తాయని, అప్పుడు కాస్తంత వేడి తగ్గుతుందని తెలిపింది. కేటీపీపీలో 51 డిగ్రీలు? గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఆదివారం 51 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదైనట్లు కేటీపీపీలోని ఉష్ణోగ్రత పట్టిక చూపింది. కానీ ఈ వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ధ్రువీకరించలేదు. -
కరోనా వ్యాప్తిపై వేసవి ప్రభావం తక్కువ
వాషింగ్టన్: ఉత్తరార్ధగోళంలోని అధిక వేసవి ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేసే అవకాశం లేదని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం అధ్యయనం తెలిపింది. ఈ మేరకు సైన్స్ జర్నల్‌లో ఓ నివేదికను విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా నిర్వహించిన అనేక అధ్యయనాలు వాతావరణం, కరోనా వైరస్ మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపాయి. ఎక్కువ వేడిగా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందడానికి తక్కువ అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇవన్ని ప్రాథమిక దశలోనే ఉండటంతో వాతావరణం, కోవిడ్-19 మధ్య ఖచ్చితమైన సంబంధం గురించి పూర్తిగా తెలియడం లేదు.(కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు) ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ప్రిన్స్టన్ అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీనిలో వాతావరణం, వైరస్ వ్యాప్తి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. అయితే వైరస్ వ్యాప్తిపై వాతావరణం ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది అని ఈ అధ్యయనం తేల్చింది. అంతేకాక సమర్థవంతమైన నియంత్రణ చర్యలు లేకుండా కేవలం వాతావరణ పరిస్థితుల మీద నమ్మకం ఉంచడం క్షేమం కాదని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని .. వేసవి వాతావరణం మహమ్మారి వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేస్తుందని భావించవద్దని సూచించింది.(సెప్టెంబర్ నాటికి మూడుకోట్ల డోస్‌లు!) అంతేకాక మహమ్మారి ప్రారంభ దశలో ఎక్కువ వెచ్చని లేదా ఎక్కువ తేమతో కూడిన వాతావరణం వైరస్ వ్యాప్తిపై ఎలాంటి ప్రభావం చూపించలేదని తాము గర్తించినట్లు ప్రిన్స్టన్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ (పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అసోసియేట్) రాచెల్ బేకర్ అన్నారు. ఫ్లూ జాతికి చెందిన వైరస్ల వ్యాప్తిలో తేమ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ కోవిడ్ 19 వ్యాప్తిపై పరిమాణం వ్యాప్తిపై వాతావరణం చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. అధిక జనాభా కారణంగానే వైరస్ త్వరగా వ్యాపిస్తుందని బేకర్ అన్నారు.(‘డబ్ల్యూహెచ్ఓకి నిధులు పూర్తిగా నిలిపివేస్తాం’) బ్రెజిల్, ఈక్వెడార్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలోని అత్యధిక వేసవి ఉష్ణోగ్రతలు వైరస్ వ్యాప్తిపై చాలా తక్కువ ప్రభావం చూపాయని బేకర్ తెలిపారు. వాతావరణం వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తుందని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. బలమైన నియంత్రణ చర్యలు, వ్యాక్సిన్ లేకుండా కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం సాధ్యపడదన్నారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి వివిధ వాతావరణ పరిస్థితల్లో దాని వ్యాప్తి ఎలా ఉందనే అంశంపై తాము ఈ పరిశోధనలు కొనసాగించినట్లు బేకర్ తెలిపారు. -
వేసవి కోసం ‘ఫ్యాన్ జాకెట్లు’
న్యూఢిల్లీ : బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో గురువారంను ‘ట్రాపికల్ థర్స్డే’గా పిలుస్తున్నారు. ఒళ్లంతా కాలిపోతుందంటూ ఎక్కువ మంది స్విమ్మింగ్ పూల్స్, బీచ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. మరికొందరు వేడిని తట్టుకునే మంచు చెప్పులు, ఫ్యాన్ జాకెట్ల కోసం షాపింగ్ చేస్తున్నారు. మహాబీస్ డాట్ కామ్ ద్వారా దాదాపు (భారత్ కరెన్సీలో) ఆరు వందల రూపాయలకు ‘మహాబీస్ సమ్మర్ స్లిప్పర్స్’ను, అమెజాన్ డాట్ కో డాట్ యూకే ద్వారా 140 రూపాయలకు ‘ర్యాపిడ్ రిలీఫ్ రీ యూజబుల్ కోల్డ్ స్లిప్పర్స్’ను ప్రజలు ఎగబడి కొంటున్నారు. ఈ స్లిప్పర్స్‌ను ఇంటా బయట ఉపయోగించవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ఫ్రిజ్‌లో పెట్టి కూల్ చేయాల్సి ఉంటుంది. ఎండవేటిని తట్టుకోలేక అరిపాదాల్లోని నరాలు విస్తరిస్తున్నాయని, తద్వారా అరి పాదాలు స్వెల్లింగ్ వచ్చినట్లు ఉబ్బిపోతున్నాయని, అలాంటప్పుడు ఈ కోల్డ్ స్లిప్పర్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఇక ‘అమెజాన్ డాట్‌కో డాట్ ఇన్ యూకే’ ద్వారానే బ్యాటరీతో నడిచే ‘మకితా ఫ్యాన్ జాకెట్‌ను దాదాపు పది వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ముందు, వెనక భాగాల్లో ఉండే రెండు చిన్న ఫ్యాన్లు ఉండడమే కాకుండా చుట్టూరు నీటి బ్యాగ్ ఉంటుంది. రెండు ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు బ్యాగులోని నీరు ఆవిరవుతూ శరీరానికి కావాల్సినంత చల్లదనాన్ని ఇస్తుంది. బ్రిటన్‌లో ఈసారి ఏసీ యూనిట్ల అమ్మకాలు ఏకంగా 11 శాతం పెరిగాయి. మరోపక్క వాటర్ పరుపులు కూడా ఎక్కువగానే అమ్ముడు పోతున్నాయి. ఈ పరుపుల మీద ఒంటరిగా పడుకుంటేనే శరీరం ఎక్కువగా చల్లగా ఉంటుందని బెడ్ కంపెనీ స్లీప్ ఆఫీసర్ నీల్ రాబిన్సన్ సూచిస్తున్నారు. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు గడ్డకట్టిన మంచనీళ్ల బాటిళ్లను వెంట తీసుకెళుతున్నారు. ఎండకు చల్లటి మంచినీళ్లను తాగుతూ ఉండడం వల్ల ఒక్క శరీరానికే కాకుండా మెదడుకు కూడా కావాల్సినంత చల్లదనం దొరుకుతుందని వైద్యులు సూచిస్తున్నారు. -
వేడితో కరెంటు
నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ ఉంటోంది. ఫోన్‌ను ఎక్కువ సేపు వాడితే వేడి అవుతుంటుంది. అయితే ఆ వేడి ఏమవుతుంది..? వృథా అవుతుంది. కానీ ఆ వేడిని వృథా కానీయకుండా.. విద్యుత్ తయారుచేస్తే..! సెల్ఫోన్లే కాదు ఫ్రిజ్‌లు, కార్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి వెలువడే వేడితో విద్యుత్‌ను తయారుచేస్తే.. చాలా అద్భుతమైన ఐడియా కదా..? అయితే ఇలాంటివన్నీ అనుకోవడానికే బాగుంటుంది కానీ.. నిజ జీవితంలో ఎలా సాధ్యమవుతుందని మూతి విరవకండి. ఎందుకంటే ఆ ఆలోచనను నిజం చేశారు.. అమెరికాలోని ఉటా యూనివర్సిటీ పరిశోధకులు. సిలికాన్ చిప్పులను ఉపయోగించి ఉష్ణం నుంచి విద్యుత్‌ను పుట్టించి చూపించారు. ఇందుకు 5 మి.మీ.ల పరిమాణంలోని రెండు సిలికాన్ చిప్‌లను 100 నానోమీటర్ల దూరంలో ఉంచి.. ఒకదాన్ని చల్లబరిచి.. మరోదాన్ని వేడి చేశారు. దీంతో ఉష్ణం వెలువడి.. దాని నుంచి విద్యుత్ తయారైంది. సిలికాన్ చిప్‌ల మధ్య ఎంత దూరం తక్కువగా ఉంటే.. అంత ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని పరిశోధనల్లో పాలుపంచుకున్న ప్రొఫెసర్ మాథ్యూ ఫ్రాంకోయెర్ పేర్కొన్నారు. ఈ సాంకేతికతతో భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వస్తువులు వేడి కావడాన్ని తగ్గించొచ్చు. వాటి బ్యాటరీ సామర్థ్యం కూడా మెరుగుపరచవచ్చు. సౌర ఫలకాల పనితీరు కూడా మెరుగుపరచవచ్చని, వాహనాల ఇంజన్ నుంచి వెలువడే ఉష్ణ శక్తితో ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేసేలా, కంప్యూటర్లలో వాడే ప్రాసెసర్ల పని తీరు మెరుగుపర్చేలా దీన్ని వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. -
వేడి వృథా కాకుండా.. కరెంటు..!
నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ ఉంటోంది. ఫోన్‌ను ఎక్కువ సేపు వాడితే వేడి అవుతుంటుంది. అయితే ఆ వేడి ఏమవుతుంది..? వృథా అవుతుంది. కానీ ఆ వేడిని వృథా కానీయకుండా.. విద్యుత్ తయారుచేస్తే..! సెల్ఫోన్లే కాదు ఫ్రిజ్‌లు, కార్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి వెలువడే వేడితో విద్యుత్‌ను తయారుచేస్తే.. చాలా అద్భుతమైన ఐడియా కదా..? అయితే ఇలాంటివన్నీ అనుకోవడానికే బాగుంటుంది కానీ.. నిజ జీవితంలో ఎలా సాధ్యమవుతుందని మూతి విరవకండి. ఎందుకంటే ఆ ఆలోచనను నిజం చేశారు.. అమెరికాలోని ఉటా యూనివర్సిటీ పరిశోధకులు. సిలికాన్ చిప్పులను ఉపయోగించి ఉష్ణం నుంచి విద్యుత్‌ను పుట్టించి చూపించారు. ఇందుకు 5 మి.మీ.ల పరిమాణంలోని రెండు సిలికాన్ చిప్‌లను 100 నానోమీటర్ల దూరంలో ఉంచి.. ఒకదాన్ని చల్లబరిచి.. మరోదాన్ని వేడి చేశారు. దీంతో ఉష్ణం వెలువడి.. దాని నుంచి విద్యుత్ తయారైంది. సిలికాన్ చిప్‌ల మధ్య ఎంత దూరం తక్కువగా ఉంటే.. అంత ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని పరిశోధనల్లో పాలుపంచుకున్న ప్రొఫెసర్ మాథ్యూ ఫ్రాంకోయెర్ పేర్కొన్నారు. ఈ సాంకేతికతతో భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వస్తువులు వేడి కావడాన్ని తగ్గించొచ్చు. వాటి బ్యాటరీ సామర్థ్యం కూడా మెరుగుపరచవచ్చు. సౌర ఫలకాల పనితీరు కూడా మెరుగుపరచవచ్చని, వాహనాల ఇంజిన్ నుంచి వెలువడే ఉష్ణ శక్తితో ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేసేలా, కంప్యూటర్లలో వాడే ప్రాసెసర్ల పని తీరు మెరుగుపర్చేలా దీన్ని వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. -
చ..ల్ల..టి వేసవి
తాటాకుతో చేసిన వింజామరల అంచులను రంగురంగుల వస్త్రాలతో అలంకరించి, మీద కొద్దిగా గంధపు నీళ్లు చిలకరించి విసురుకుంటుంటే, చల్లటి తుషారాలు శరీరాన్ని తాకుతుంటే, ‘ఏమి హాయిలే హలా’ అని పాడుకుంటూ ఎండను ఎంజాయ్ చెయ్యలేమా?! ఫ్యాను, కరెంటు ఉన్నా కూడా ఇదొక కూల్ ఐడియా! అమ్మ బాబోయ్ ఏం ఎండలో.. భరించలేకుండా ఉన్నాం. సూర్యుడే దిగి వచ్చి అందరినీ సంబరంగా ఆశీర్వదిస్తున్నాడేమో అన్నట్లుగా ఉన్నాయి! తట్టుకోవాలి తప్పదు. అప్పుడేగా ఏ ఋతువునైనా మనం గౌరవించినట్లు. మూడు నెలల పాటు అతిథిగా వచ్చిన ప్రచండ భాస్కరుడినీ అలాగే గౌరవించాలి. అందుకు బదులు... ‘అష్’ ‘ఉష్’ అంటూ వేడి వేడి నిట్టూర్పులు నిట్టూరిస్తే ఎలాగ! ఆయన పని ఆయన సక్రమంగా చేయడమూ తప్పేనా? అసలు సూర్యుడు వేడిగా ఉండకపోతే ఆషాఢంలో వానలు పడవు. పైరులు కళకళలాడకుండా వెలతెలపోతాయి. ఆయన వేడివేడిగా వచ్చి, నీళ్లన్నీ పీల్చేస్తేనే కదా మేఘం వర్షించగలిగేది. ఆ విషయం మర్చిపోయి ‘ఎండలు బాబోయ్ ఎండలు’ అంటూ ఎండాకాలమంతా ఆ ప్రత్యక్ష నారాయణుడిని నిందిస్తూంటే ఎలాగ. ఆయనకే కనక కోపం వచ్చి, చిన్నబుచ్చుకున్నాడనుకోండి.. మన పరిస్థితి ఏంటి? వానలు పడవు, పంటలు పండవు. సరే ఇదంతా ప్రకృతికి సంబంధించిన విషయం. కరెంటు లేని రోజుల్లో వేసవిలో దొంగలకు సౌకర్యంగా ఉండేది కాదు. తెల్లవార్లూ విసనకర్రలతో విసురుకుంటూ, నిద్రపోకుండా ఇంట్లోని పెద్దవాళ్లలో ఎవరో ఒకరు మెలకువగా ఉండటంతో చోరుడికి అనుకూలించేది కాదు. వాడు ఎన్ని కళలు ప్రదర్శిద్దామన్నా పప్పులుడికేవి కాదు. పరోక్షంగా ఎవరో ఒకరు కాపలా కాస్తూ ఉండేవారు. పాపం ఆ వచ్చినవాడికి నిరాశే మిగిలేది. వేసవిలో ఇదొక భరోసా మనకు. ఇక ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మల ప్రహసనం మరోలా ఉండేది. తాటాకుతో చేసిన వింజామరల అంచులను రంగురంగుల వస్త్రాలతో అలంకరించి, వాటి మీద కొద్దిగా గంధపు నీళ్లు చిలకరించి విసురుకుంటుంటే, చల్లటి తుషారాలు శరీరాన్ని తాకుతుంటే, ‘ఏమి హాయిలే హలా’ అని పాడుకుంటూ ఎండను ఆస్వాదించే ఉంటారు.సాయంత్రం సంబరం మరోలా ఉండేది. ఊర్లో ఉండే పెద్ద చెరువుకి పిల్లలంతా తాబేలు పిల్లల్లా బుడి బుడి అడుగులు వేస్తూ, డాల్ఫిన్ చేపల్లా నీళ్లలోకి దూకి, సొర చేపల్లాగ ఈత కొడుతూ, రకరకాల విన్యాసాలు చేసి, శరీర తాపం చల్లారాక ఒంటి నిండా వాన ముత్యాలు నింపుకుని, ఇంటికి వచ్చేవారు. ఇంట్లో ఉండే మేనత్తలో, బాబయ్యలో.. చీకటి పడకుండా అన్నాలు తినిపించి, పిల్లల్ని పక్కనే పడుకోబెట్టుకుని, పోతన భాగవత పద్యాలు నేర్పుతూ, విసనకర్రతో చల్లగా విసురుతుంటే, ఆరుబయట చంద్రుణ్ని, నక్షత్రాలను చూస్తూ, తుంగ చాప మీద పడుకుని, ఆదమరిచి నిద్రపోయేవారు. అలా ప్రకృతికి అనుగుణంగా శరీరాన్ని అలవాటు చేసేసేవారు. ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పిస్తున్న సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అని స్తుతిస్తూనే, ఎండల్తో చంపేస్తున్నాడని నిందించడం ఎంతవరకు న్యాయం? శ్రీరాముడు సూర్యవంశీయుడే కదా, అనునిత్యం ఆయనకు నమస్కరించేవాడు కదా! సూర్యభగవానుడిని దినమణి అని, పూర్వ దిక్పాలకుడు అని కూడా అంటారుగా. అంతటి దేవుడిని ఇంతగా తెగనాడటం భావ్యమేనా? భావ్యమే లెండి. ఎందుకంటారా, ఆయన మనకు మిత్రుడు (సూర్యుడిని మిత్రుడు అని కూడా అంటారు), ఆయన దగ్గర మనకు చనువు ఉంది కదా, అందుకే అలా నిందాస్తుతి చేస్తుంటాం.ఇవన్నీ కాదు. వేసవి అంటే మామిడిపండ్లు, ద్రాక్షలు. నూజివీడు పెద్దరసాలు, చిన్న రసాలు, గోదావరి జిల్లాలలో ప్రత్యేకంగా దొరికే కొత్తపల్లి కొబ్బరి, చెరకు రసాలు, పంచదార కలశం, సువర్ణరేఖ.. ఇవేనా! ఊరు వెళితే చాలు తాటి చెట్లు ఎక్కినవాళ్లు కత్తితో తాటికాయలు కోసి ధబీధబీమని కింద పడేయడం, నీళ్లు బయటకు రాకుండా జాగ్రత్తగా కత్తితో చెదిపి ఇస్తే, ఒక్కో ముంజలోకి వేలితో చిన్న రంధ్రం చేసి స్ట్రా వంటివి లేకుండా ముంజకాయను నోట్లోకి తీసుకుని, నీళ్లు తాగేసి, గుజ్జు జాగ్రత్తగా తీసుకుని తినడం ప్రతి వేసవిలోనూ ఓ సరదా. రసాలు తినడమైతే ఓ పెద్ద టాస్క్. ఒంటి మీద కారకుండా తినాలి. అదొక మధురమైన ఉల్లాసం. ఎర్రటి కొత్త ఆవకాయలోకి మామిడిపండు రసం నంచుకుని తింటే ‘ఆహా నా రాజా’ అని జంధ్యాల మార్కు డైలాగు గుర్తురాకుండా ఉండదు. చెప్పొచ్చేదేమంటే.. ఇంత వేడి, ఇంత ఎండ లేకపోతే ఇవన్నీ ఇంత చల్లగా ఎలా ఆస్వాదించగలం. అందుకే అష్షుబుష్షులు మాని, ఆహా ఓహో అనుకుందాం. మనమెంత నిట్టూర్చినా ఎండ వేడిగా ఉండకమానదు, వడ గాడ్పు వీచక మానదు, శరీరాలు చెమట చిందించకా తప్పదు. కనుక ఫీల్ ది కూల్ ఆఫ్ సమ్మర్. వైజయంతి పురాణపండ -
వృద్ధుల పింఛన్ పాట్లు
సాక్షి,నల్లగొండ: పింఛన్ కోసం వృద్ధులు పోస్టాఫీస్ వద్ద ఉదయం 7 గంటల నుంచే పడిగాపులు కాస్తూ మధ్యాహ్నం 12 గంటల వరకు ఎండలో క్యూ లైన్లో నిల్చుని తాగడానికి నీరు కూడా లేకుండా గోస తీశారు. రెండు నెలలుగా పింఛన్ పెండింగ్‌లో ఉన్నా జనవరి మాసం పింఛన్ మాత్రమే ఇస్తున్నారని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో నానా ఇబ్బందలు పడుతున్నామని వృద్ధులు బుధవారం సాక్షితో ఆవేదన వ్యక్తం చేశారు. ఎండవేడిమి తట్టుకోలేక.. క్యూ లైన్లో నిల్చున్న పింఛన్‌దారులు -
ఫుల్ ట్యాంక్ వద్దు..
సాక్షి,సిటీ బ్యూరో: మండుతున్న పెట్రో ధరలకు తోడు పెరుగుతున్న ఎండలకు వాహనాల్లో ఇంధనం ఆవిరైపోతోంది. హైదరాబాద్ మహా నగరంలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రత తీవ్ర రూపం దాలుస్తుండటంతో ఉష్ణతాపం వాహనాల్లోని ఇంధనంపై ప్రభావం చూపుతోంది. ద్విచక్ర వాహనంలో లీటర్ పెట్రోల్ ఏ మూలకు సరిపోవడం లేదు. ఎండల్లో పార్కింగ్ లేదా ప్రయాణాలతో వాహనాల్లో ఇంధనం ఆవిరై గాలిలో కలుస్తోంది. దీంతో వాహనాల మైలేజీ కూడా తగ్గిపోతోంది. ఉదయం ఆరు గంటల నుంచి బాణుడు నిప్పులు చెరుగుతుండటంతో వాహనాలు వేడెక్కుతున్నాయి. ట్యాంకుల్లో ఇంధనం వేడెక్కి అవిరై గాలిలో కలుస్తోంది. 20 శాతంపైనే .. గ్రేటర్ పరిధిలో ప్రతి రోజు సగటు వినియోగంలో 20 శాతం పైగా పెట్రో, డీజిల్ ఉష్ణతాపానికి ఆవిరై గాలిలో కలుస్తున్నట్లు అంచనా. నగరంలో సుమారు 50 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, మరో పది లక్షల వరకు వాహనాలు నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకుల ద్వారా ప్రతి రోజు 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతిరోజు పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కో ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతిరోజు ధరల సవరణలతో పెట్రోల్ బంకులకు వెళ్లే వినియోగదారులు అవసరాలకు మించి వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌ను పోయించుకుంటున్నారు. దీంతో వాహనాల ట్యాంకులు వేడెక్కి ఇంధనం ఆవిరైపోతుంది. ఫుల్ ట్యాంక్ వద్దు.. ప్రధాన ఆయిల్ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల నిల్వల పట్ల వాహనదారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాహనాల ట్యాంక్‌లో సగం వరకే ఇంధనం నింపాలని సూచిస్తున్నాయి. ఫుల్ ట్యాంక్ చేస్తే ప్రమాదమని, గతంలో ట్యాంక్ నిండుగా నింపటం వల్ల ప్రమాదాలు సంభవించినట్లు బోర్డుల ను ప్రదర్శిస్తున్నాయి. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
కారు డోర్ లాక్ పడి బాలుడు మృతి
పూణే : ఎండ వేడికి తట్టుకోలేక ఓ ఐదేళ్ల చిన్నారి పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లాడు. ఆ కారే ఆ పసివాడిని మింగేసింది. పోలీసుల వివరాల ప్రకారం కరణ్ పాండే (5) మధ్యాహ్నం పూట తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. వేడికి తట్టుకోలేక అక్కడే పార్కు చేసి ఉన్న కారు ఎక్కాడు. అది కాస్తా లాక్ అవడంతో కరణ్ లోపలే ఉండిపోయాడు. లోపల వేడి తట్టుకోలేక బయటకు రావడానికి ప్రయత్నించాడు. కానీ కార్ లాక్ అవడం వల్ల బయటకు రాలేకపోయాడు. దీంతో కారు లోపల ఊపిరాడక మరణించాడు. అయితే ఎంతసేపయిన కరణ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. సుమారు ఆరు గంటలపాటు వెతికిన తరువాత కారులో కరణ్ మృతదేహాన్ని కనుగొన్నారు. కరణ్ తల, మెడ, ముఖం మీద కాలిన గాయాలు ఉన్నాయి. ఈ గాయాలు కారు లోపలి వేడి వల్ల ఏర్పడి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు యజమాని వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
మండుతున్న ఎండలు!
సాక్షి, మచిలీపట్నం: భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతల పెరుగుదల ఎక్కువగా ఉంది. రెండు రోజులుగా మచిలీపట్నంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వివరాలు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 35 డిగ్రీల మేరకు నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే ప్రస్తుతం ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వింత పరిస్థితి ఎదురవుతోంది. రాత్రిళ్లు విపరీతమైన చలి, ఉదయం 8 గంటల వరకు పొగమంచుతో కూడిన చలి ఉంటుండగా.. ఉదయం 10 గంటలు సమిపిస్తుండగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటోంది. వేడి గాలులు, వేడి తీవ్రత అధికమవుతోంది. వెరసి రాత్రిళ్లు చలికి వృద్ధులు వణుకుతుండగా.. ఉదయం ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో బట్టి చూస్తే.. జిల్లాలో వేసవి ఉపశమన చర్యలకు తక్షణం యంత్రాంగం ఉపక్రమించాల్సిన అవసం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా వేసవిలో వేసవిలో ఉపశమన చర్యలను కట్టుదిట్టుంగా అమలు చేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. గత ఏడాది వడదెబ్బ నుంచి ప్రజలను కాపాడటం కోసం పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినా క్షేత్ర స్థాయిలో మాత్రం ఇది సరిగా అమలు కాలేదు. ప్రస్తుతం అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అన్ని గ్రామాలతో పాటు నగరాలు, పట్టణాల్లో ఎద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మార్చి ఒకటి నుంచి జూన్ 30 వరకు చలివేంద్రాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుని చలివేంద్రాల్లో తాగునీటితో మజ్జిగ కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటే మరింత మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్చి ఒకటో తేదీ నుంచి వేసవి తీవ్రత అధికమైన పరిస్థితిలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎక్కడా కార్యాచరణ ప్రారంభం కాలేదు. వెంటాడుతున్న నిర్లక్ష్యం.. వేసవిలో ప్రజలను వడగాలులు, వేడిమి నుంచి కాపాడటంలో వైద్య, ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మేరకు వైద్య బృందాలను ఏర్పాటు ఉంటుంది, వేసవిలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనులను నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చేపట్టవద్దన్న ఆదేశాలున్నా ఇంత వరకు కూలీలకు అమలు చేసినా దాఖలాలు లేవు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. స్థానికంగా వీరికి మజ్జిగ ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ప్రతి సారీ నిధుల గోల... వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, తాగునీరు, మజ్జిగ అందజేయండి. అని ఉన్నతాధికారులు సూచిస్తున్నా మండల స్థాయిలో దీని అమలు మాత్రం అగ్యగోచరంగా మారుతోంది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని మండల స్థాయి అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వీటి అమలులో వారు వెనుకంజ వేస్తున్నారు. గత ఏడాది కూడా మండలాలు, పురపాలక సంఘాలకు బాధ్యతలు అప్పజెప్పగా తూతూ మంత్రంగా నిర్వహించారు. రెండు రోజులు కేంద్రాలు పెట్టి మూడో రోజు ఎత్తేశారు. అసలే పరీక్ష కాలం.. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. త్వరలో పదో తరగతి, డిగ్రీ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంపై నిర్వాహకులు దృష్టి సారించాల్సి ఉంది. -
కరెంటు బ్యాటరీ కాదు... వేడి కోసం బ్యాటరీ!
బ్యాటరీల్లో కరెంటు నిల్వ ఉంటుందని అవసరమైనప్పుడు అవసరమైనంత మేరకు ఈ కరెంటును వాడుకోవచ్చునని మనకు తెలుసు. చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మొదలుకొని బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి దీనికి. ఇప్పుడిదంతా ఎందుకు అంటే యూనివర్శిటీ ఆఫ్ మాసాచూసెట్స్ శాస్త్రవేత్తలు ఇంకో వినూత్నమైన బ్యాటరీని సిద్ధం చేశారు కాబట్టి! ఇది కరెంటుకు బదులుగా ఉష్ణాన్ని నిల్వ చేసుకుంటుంది. అయితే ఏంటి దీంతో ప్రయోజనమని ఆశ్చర్యపోతున్నారా? బోలెడున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే వేడిని ఈ బ్యాటరీలో బంధించి రాత్రిళ్లు వంటకు వాడుకోవచ్చు. లేదంటే కార్ల నుంచి వచ్చే వేడిని విద్యుత్తుగానూ మార్చుకొవచ్చు. అజోబెంజీన్ ఆధారిత పాలీ మెథాక్రలైట్ అనే కొత్త పదార్థంతో ఈ బ్యాటరీ తయారవుతుంది. వేడి సోకితే చాలు ఇందులోని అణువులు తమ స్థితిని మార్చేసుకుని శక్తిని మొత్తం తమలోనే దాచుకుంటాయి. చల్లబరిస్తే వేడి మొత్తం బయటకు వస్తుంది. ఈ కొత్త బ్యాటరీలను భారత్ లాంటి దేశాల్లో పొగరాని పొయ్యిల మాదిరిగా కూడా వాడుకోవచ్చునని తద్వారా ఎందరో మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చునని అంటున్నారు ఈ పదార్థాన్ని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన భారతీయ సంతతి శాస్త్రవేత్త్త వెంకట్రామన్ దండపాణి. -
మంట లేకుండానే వేడి చేస్తుంది...
ఆఫీసుకు క్యారియర్ పట్టుకొచ్చారా? భోజనం వేళకు.. అయ్యో ఆహారం చల్లగా ఉందని బాధపడుతున్నారా? ఇంకొన్ని నెలలు ఆగితే ఈ ఇబ్బందికి సరికొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చేస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్, స్టవ్ వంటివి అవసరం లేకుండానే ఆహారాన్ని వెచ్చబెట్టుకునేందుకు సరికొత్త టెక్నాలజీని సిద్ధం చేసింది యాబూల్. ఫొటోలో కనిపిస్తోందే.. అదే యాబూల్ కుక్కర్. సిలికాన్ రబ్బరుతో తయారు చేసిన ఓ బాక్స్.. మూతపై చిన్న వాల్వ్ లాంటివి ఉంటాయి దీంట్లో. వంటెలా వండాలి? అంటున్నారా? చాలా సింపుల్. ఈ కుక్కర్‌తోపాటు మీకు కొన్ని హీటింగ్ ప్యాడ్స్ అవసరమవుతాయి. కవర్లోంచి వాటిని తీసి కుక్కర్ అడుగున పెట్టాలి. పైన జిప్ బ్యాగ్‌లో వండాల్సిన ఆహారం ఉంచి.. మూత వేసేయాలి. ఒకవైపు నుంచి మూత కొంచెం మాత్రం తీసి నీళ్లుపోసి.. మళ్లీ మూత పెట్టేయాలి. అంతే. పది నిమిషాల్లో కుక్కర్ నుంచి ఆవిరి రావడాన్ని మీరు గమనించవచ్చు. కొంచెం ఆగి జిప్బ్యాగ్లో ఉన్న ఆహారాన్ని లాగించేయడమే. హీటింగ్ బ్యాగ్‌లో ఉండే రసాయనాల కారణంగా చుట్టూ ఉన్న నీరు వేడెక్కి కుత కుత ఉడికే స్థాయికి చేరుతుంది. ఈ క్రమంలోనే బ్యాగ్‌లలో ఉంచిన ఆహారం కూడా సిద్ధమవుతుందన్నమాట. ఒక్కో హీటింగ్ ప్యాడ్‌ను ఒక్కసారి మాత్రమే వాడుకోవచ్చు. కొరియాకు చెందిన యాబూల్ ఈ వినూత్నమైన ఐడియాను మార్కెట్లోకి తెచ్చేందుకు కిక్‌స్టార్టర్ ద్వారా నిధులు సేకరిస్తోంది. దాదాపు పదివేల డాలర్లు సేకరించాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే 23 వేల డాలర్లకుపైగా వచ్చేశాయి. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో నెల రోజుల్లో ఈ వినూత్నమైన కుక్కర్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. -
మండుతోన్న తిరుమల కొండలు
-
హీట్ పోయి కూల్ వచ్చె...
హోమ్‌టెక్ ఫ్రిజ్‌లు ఎలా పనిచేస్తాయి..? కరెంటు లేని కాలంలో మన పూర్వికులు ఎలా జీవించారోనని ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడైతే ఫ్యాను, ఫ్రిజ్, టీవీ లేని ఇంట్లో ఉండేందుకు పిల్లలు కూడా ఇష్టపడడం లేదు. వేసవిలో అయితే ఫ్యాను, టీవీల కన్నా కూడా ఫ్రిజ్ నిత్యావసర, అత్యవసర ఉపకరణంలా మారిపోతుంది. ఒక్క వేసవి లోనే కాదు, అన్ని కాలాల్లోనూ మనకు ఆప్తబంధువు అయింది ఫ్రిజ్. వస్తువుల నుంచి వేడిని తీసేయడం ద్వారా వాటిని చల్లగా ఉంచడమే ఫ్రిజ్ (రిఫ్రిజిరేటర్) లోని టెక్నాలజీ. ప్రధానంగా ఇది పరిసరాల పీడనంపై ఆధారపడి పనిచేస్తుంది. ఎలాగంటే – ఒక పదార్ధం ద్రవస్థితి నుంచి ఆవిరిగా మారేటప్పుడు కొంత వేడిని గ్రహిస్తుంది. అలాగే వాయువు ద్రవంగా మారేటప్పుడు వేడిని విడుదల చేస్తుంది. ఫ్రిజ్ పని తీరు వెనుక ఉన్న సూత్రం ఇదే. ఫ్రిజ్ లోపలి నుంచి వేడిని లాగేయడం వల్ల ఫ్రిజ్ లోపలి వస్తువులు చల్లగా మారతాయి. (చల్లటి వాతావరణంలో ఆహార పదార్ధాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయన్న విషయం తెలిసిందే). ఆహార పదార్థాలను పాడవకుండా నిల్వ చేయడానికి ప్రధానమైన ప్రక్రియలు... రిఫ్రిజిరేషన్, ఫ్రీజింగ్. ఇవి కాక కేనింగ్, ఇర్రేడియేషన్, పాశ్చరైజేషన్ వంటి విధానాలూ అవసరాన్ని బట్టి వాడుకలో ఉన్నాయి. అయితే వీటన్నిటిలోనూ రిఫ్రిజిరేషన్ ఒక్కటే సాధారణ సాధనం అయింది. చల్లని నీటి కోసం ఫ్రిజ్, తాజా పెరుగు కోసం ఫ్రిజ్; పచ్చని ఆకుకూరలు, కూరగాయల కోసం ఫ్రిజ్... ఇలా మన దైనందిన జీవనశైలిని ఫ్రిజ్ ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో ఫ్రిజ్ పని తీరు గురించి, దాన్ని జాగ్రత్తగా వాడుకునే పద్ధతుల గురించి తెలుసుకోవడం అవసరం. ఫ్రిజ్‌లో భాగాలు ముందే చెప్పినట్లు ద్రవాన్ని ఆవిరిగా మార్చి వేడిని పీల్చుకునే సూత్రం మీద ఆధారపడి ఫ్రిజ్ పనిచేస్తుంది. ఇందులో వాడే ద్రవాన్ని ‘రిఫ్రిజిరెంట్’ అంటారు. ఈ ద్రవాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరయ్యేలా చూస్తారు. ఇందుకోసం ఫ్రిజ్‌లో 5 భాగాలు ఉంటాయి. అవి: 1. కంప్రెసర్ 2. వేడిని మార్పులకు లోనుచేసే గొట్టాలు (చుట్టలు చుట్టినట్లు ఫ్రిజ్ వెనుక భాగంలో ఇవి కనిపిస్తాయి). 3. వ్యాకోచం చెందే వాల్వ్ 4. వేడిని మార్పిడి చేసే లోపలి గొట్టాలు (ఇవి ఫ్రిజ్ లోపల ఉంటాయి) 5. రిఫ్రిజిరెంట్ (తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆవిరయ్యేద్రవం). ఇవికాక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే థర్మోస్టాట్ ఒకటి వుంటుంది. మొదట్లో అమ్మోనియా వాయువును స్వచ్ఛమైన రూపంలో తీసుకొని రిఫ్రిజరేటర్గా వాడేవారు. ఎందుకంటే, స్వచ్ఛమైన అమ్మోనియా వాయువు –27 డిగ్రీల ఫారన్‌హీట్ (–32 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత దగ్గర ఆవిరౌతుంది. ప్రస్తుతం ‘ఫ్రియాన్’ వాయువును వాడుతున్నారు. ఫ్రియాన్ అనేది క్లోరోఫ్లోరో కార్బన్ అనే రసాయనానికి వ్యవహారనామం. ఫ్రిజ్ ఎలా పనిచేస్తుంది? స్థూలంగా చెప్పాలంటే – ఫ్రిజ్‌లో ఉండే కంప్రెసర్ రిఫ్రిజరెంట్గా వున్న వాయువును కుదిస్తుంది. ఈ కుదించడాన్నే కంప్రెసింగ్ అంటారు. ఆ వాయువు ఇలా కుదింపునకు లోనవడం వల్ల దాని పీడనం, ఉష్ణోగ్రత పెరుగుతాయి. ఫ్రిజ్కి లోపలా బయటా చుట్ట చుట్టిన గొట్టాలుంటాయి కదా! వాటిలో బయట ఉండే గొట్టాలు ఈ వాయువులో ఒత్తిడి వల్ల పెరిగిన ఉష్ణోగ్రతను గ్రహించి బయటకు పంపుతాయి. దాంతో వాయువు ఘనీభవించి ద్రవరూపాన్ని పొందుతుంది. ఈ ద్రవరూపంలో ఉండే వాయువు వ్యాకోచం చెందే వాల్వు ద్వారా హెచ్చు పీడన ప్రాంతం నించి తక్కువ పీడనం ఉండే ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. అప్పుడు ఆ ద్రవం కాస్తా వ్యాకోచం చెంది ఆవిరిగా మారుతుంది. ఆవిరిగా మారేటప్పుడు వేడిని గ్రహించి లోపల మొత్తంగా ‘చల్ల’ బరుస్తుంది. అలా గ్రహించిన వేడిని ఫ్రిజ్‌లోపల ఏర్పాటు చేసిన చుట్ట చుట్టబడ్డ గొట్టాలు గ్రహిస్తాయి. ఇదీ ఫ్రిజ్‌ను ‘చల్ల’బరిచే చక్రం. ఎంత ఉష్ణోగ్రత మేలైనది? అసలు ఫ్రిజ్ ఉద్దేశం ఏమిటి? ఆహార పదార్థాలు పాడుకాకుండా, వాటిని ఎక్కువ కాలం నిలవ ఉంచడం. అంటే బ్యాక్టీరియా ఎదుగుదల వేగాన్ని తగ్గించడం. అందుకు బ్యాక్టీరియాని అస్సలు ఎదగనీయకుండా చేయాలి. అప్పుడు ఆహారపదార్థాలు గడ్డకడతాయి. అదే ఫ్రీజింగ్! దీని కోసం ఫ్రిజ్‌లలో ఫ్రీజర్ కంపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. వివిధ పదార్థాలను ఎక్కువకాలం నిల్వ ఉంచాలంటే 35–38 డిగ్రీల ఫారన్‌హీట్ (1.7–3.3 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత తప్పనిసరి. అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగితే ఆహారపదార్థాలు చెడిపోతాయి. అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతకు పడిపోతే ఫ్రీజింగ్ సమస్యగా మారుతుంది. పాత మోడల్ రిఫ్రిజిరేటర్లలో ఫ్యాన్లుండేవి కావు కానీ, నేడు వచ్చే ఫ్రాస్ట్–ఫ్రీ రిఫ్రిజిరేటర్లలో ఒకటి లేదా రెండు చిన్న ఫ్యాన్లు ఉంటున్నాయి. ఫ్రీజర్ కేబినెట్లో మైనస్ 18డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా జీరో డిగ్రీల ఫారిన్‌హీట్ వుంటే, ఫ్రిజ్ కంపార్ట్మెం ట్లలో 5 డిగ్రీల సెంటీగ్రేడ్ (40 డిగ్రీల ఫారన్ హీట్)ఉంటుంది. కూరగాయల క్యాబిన్లో 10డిగ్రీల సెంటీగ్రేడ్ (50 డిగ్రీల ఫారన్ హీట్) ఉంటుంది. జీవనశైలిపై ప్రభావం మధ్యతరగతి ఇళ్ళలో ఫ్రిజ్ ఒక తప్పనిసరి ఉపకరణం అయింది. దీనికి మనమంతా 18వ శతాబ్దానికి చెందిన విలియం కల్లెస్కీ, మైకేల్ ఫారడేకీ ఆజన్మాంతం ఋణపడి ఉన్నాం. విలియం కల్లెస్ 1748లో తొలిసారిగా గ్లాస్గో విశ్వవిద్యాలయంలో కృత్రిమ పద్ధతిలో రిఫ్రిజిరేషన్ చేసే విధానాన్ని ప్రదర్శించారు. దానికి మైకేల్ ఫారడే పరిశోధనా ఫలితాలెంతో ఉపకరించాయి. 1805 ప్రాంతాల్లో ఆలివర్ ఇవాన్స్ తొలి రిఫ్రిజిరేటర్ని ద్రవంతోగాక ఆవిరితోపనిచేసేలా రూపొందిస్తే, 1902లో విలియం హవిలేండ్ క్యారియర్ తొలి ఏర్ కండిషనర్‌ని రూపొందించాడు. 1915లో తొలి ‘గార్డియన్’ యూనిట్‌కి జనరల్ ఎలక్ట్రిక్ అంకురార్పణ చేస్తే, 1916లో కెల్వినేటర్, సెర్వెల్లు కలిసి రెండు కొత్త మోడల్స్‌తో వచ్చాయి. 1918 నాటికి కెల్వినేటర్ ఆటోమేటిక్ కంట్రోల్స్‌తో పనిచేసే ఫ్రిజ్‌తో వూర్కెట్లోకొచ్చింది. ఫ్రిజ్‌లలో ఫ్రియాన్ వాయువును వాడటం 1930లలో ఆరంభమైంది. ఐతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే ఫ్రిజ్ అనేది ఇళ్ళలోకి ప్రవేశించింది. నిజానికి ఆటోమేటిక్ డీ ఫ్రాస్టింగ్ 1960ల్లోనే మెుదలైంది. వునం ఆటో డీఫ్రాస్ట్ ఫ్రిజ్‌లను వాడటం మెుదలెట్టింది మాత్రం 1980 తర్వాతే! 1970, 80 దశాబ్దాల్లో రిఫ్రిజిరేటర్ రూపు రేఖలూ, పనితీరూ, పరిజ్ఞానం అన్నిట్లోనూ ఎంతో అభివృద్ధి జరిగింది. ఐతే ఫ్రీయాన్ వాయువ#ను సీల్డు కంప్రెసర్లలో వాడటంవల్ల ఓజోన్ పొరకు, పర్యావరణానికి వుుప్పు వాటిల్లుతోందన్న భయాలున్నాయి. గ్లోబల్ వార్మింగ్కీ ఇది కారణం అవుతోందన్నది శాస్త్రవేత్తల వాదన. కార్బన్‌డై ఆక్సైడ్ చేసే హాని తర్వాత అంత హాని ఈ ఫ్రీయాన్ (సిఎఫ్సి) వాయువ# చేస్తుందనీ, ఈ క్లోరోఫ్యూరో కార్బన్ కన్నా హైడ్రో క్లోరోఫ్యూరో కార్బన్ లేదా హైడ్రోఫ్లూరో కార్బన్స్ పదార్ధాల సమ్మేళన వాయువ#లు వాడటం వుంచిదని కొందరంటున్నారు. కొత్త కొత్త పరిజ్ఞానాలు రూపొందిస్తున్నారు కూడా! పోషకాలు కోల్పోకుండా... ⇒ ఫ్రిజ్‌లో లేదా షెల్ఫ్‌లలో పదార్థాలను ఒకే పాకెట్లో 3–4 రకాలవి వేసి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆయా పదార్థాలకున్న ప్రత్యేక వాసన, పోషకాలు కోల్పోతాయి. ⇒ పదార్థాలను కట్‌చేసేటప్పుడు, వేరు చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి. ⇒ కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మాంసాహారాన్ని శుభ్రపరిచేటప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటిని ఉపయోగించాలి. ⇒ కటింగ్ బోర్డులు, గిన్నెలు ఉపయోగించడానికి ముందు, తర్వాత తప్పనిసరిగా సబ్బు నీటితో శుభ్రపరచాలి. నీచు వాసన రాకుండా ఉండటానికి ఘాటువాసనలు లేని బ్లీచ్‌ని ఉపయోగించవచ్చు. ⇒ వంటగదిలో పాత్రలు, స్టౌ, ఉపయోగించే ఇతర పరికరాలు సురక్షితమైనవే ఎంచుకోవాలి. ⇒ రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన మాంసం గానీ, కూరగాయలు గానీ 30 నిమిషాల లోపు వండాలి. ⇒ మిగిలిపోయిన పదార్థాలను రెండు గంటలకన్నా మించి బయట ఉంచకూడదు. ఫ్రిజ్‌లో అయితే ఒక రోజులోనే వాటిని పూర్తి చేయాలి. ⇒ ఫ్రిజ్‌లో కూరగాయలు, ఆకుకూరలు నిల్వచేసే బాక్స్ అడుగున పేపర్ టవల్ వేయాలి. ఇలా చేయడం వల్ల తేమ పేపర్ టవల్ పీల్చుకుంటుంది. కూరగాయలు త్వరగా పాడవవు. ⇒ మష్రూమ్స్ పేపర్ టవల్లో చుట్టి, బాక్స్‌లో పెట్టి ప్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఫ్రాస్ట్ఫ్రీ అంటే ఏమిటి? రిఫ్రిజిరేటర్లో మనం సాధారణంగా ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవడానికి వీలుంటుంది. దాని ప్రకారం చల్లగా అవుతుంది. ఆ ఉష్ణోగ్రతను నియంత్రించేం దుకు ఒక ధర్మోస్టాట్ ఉంటుంది. ముఖ్యంగా అది ఫ్రీజర్ ఛాంబర్‌ను నియంత్రిస్తుంది. ఐతే కొన్ని గంటలు అదే పనిగా పనిచేశాక నీరు గడ్డకట్టడం ఆరంభమై ఐస్ తయారవుతుంది. దాన్ని నివారించడానికి రోజూ రాత్రిళ్ళు ‘డీఫ్రాస్ట్’ బటన్ని నొక్కి పడుకోవాల్సి వచ్చేది. ఏరోజైనా అలా డీఫ్రాస్ట్ చేసి ఐస్‌ను తొలగించకపోతే ఫ్రిజ్ సరిగా పనిచేసేది కాదు. లేదా బయటకు నీళ్ళు కారిపోయి చికాకు పెట్టేది. ఈ ఇబ్బందులను అధిగమించడానికే ఆటో డీఫ్రాస్ట్ లేదా ఫాస్ట్ఫ్రీ రిఫ్రిజిరేటర్లు రూపొందాయి. అంటే, ఫ్రీజర్ లోపలే చిన్నపాటి ఫ్యాన్‌ను ఏర్పాటు చేసి తద్వారా ఐసు ఏర్పడకుండా చూస్తారన్న మాట. దీనికి టెంపరేచర్ కంట్రోలర్, టైమర్, హీటింగ్ కాయిల్ వంటి భాగాలు తోడ్పడతాయి. ఆటో డీఫ్రాస్ట్ చేయడం వల్ల రోజూ మనకు ‘డీఫ్రాస్ట్’ బటన్ నొక్కే పని తప్పుతుంది. వస్తువులు పాడవవు. వాసనలూ రావు. లోపలి ఐసును తొలగించే క్రమంలో ఉత్పత్తి అయ్యే వేడిని ఫ్రిజ్... క్యాబినెట్ ద్వారా బయటకు పంపడం వల్లనే ఈ వేడి. అందువల్ల ఫ్రిజ్‌ను గోడలకు మరీ దగ్గరగా కాకుండా కొంత ఎడంగా ఉంచడం మంచిది. -
మండే ఎండలు..అప్రమత్తత అవసరం
-
కారు అద్దం పగులగొట్టి హీరో అయ్యాడు..
ఒంటారియో: పార్కింగ్‌లో ఉన్న ఓ కారు అద్దాన్ని బండరాయితో పగులగొట్టి, ఓ వ్యక్తి హీరో అయ్యాడు. ఈ సంఘటన కెనడాలో ఒంటారియోలోని గ్రాండ్ బెండ్లో చోటు చేసుకుంది. గ్రాండ్ బెండ్ లో జరుగుతున్న ఓ ఫెస్ట్‌కు చాలా మంది వచ్చారు. అక్కడికి వచ్చిన ఇద్దరు దంపతులు తమ కుక్కను కారులోనే వదిలేసి వెళ్లారు. లాక్ చేసి ఉన్న కారులోనే ఆ కుక్క చాలా సమయం నుంచి ఉంది. అక్కడ ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటంతో అప్పటికే ఆ శునకం నీరసించిపోయింది. అయితే కుక్క కారులో ఉందని, యజమానులు రావల్సిందిగా ముందుగా ఓ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అక్కడికి ఎవరూ రాకపోవడంతో చివరకు అక్కడే ఉన్న బండ సాయంతో కారు అద్దం పగులగొట్టి కుక్కను బయటకు తీశాడు ఓ బాటసారి. 'ఆ కుక్క పరిస్థితి చూసి చాలా జాలేసింది. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో కారులో మరింత వేడికి కుక్క మగ్గిపోయింది. కారు అద్దాలు పగుల గొట్టిన మరో గంట వరకు అక్కడికి కారు యజమానులు రాలేదు. ఒక వేళ ఆ వ్యక్తి అలా చేసి ఉండకపోతే కుక్క పరిస్థితి మరింత విషమంగా మారేది..'అని ప్రత్యక్ష సాక్షి విల్ కోస్టా తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుక్క యజామానులను స్టేషన్ కు తీసుకువెళ్లారు. బాటసారి కారు అద్దం పగులగొడుతున్న సంఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంతో అతన్ని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పడు ఆ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యజమానుల నిర్లక్ష్య ధోరణితో ఎన్నో పెంపుడు శునకాలు కార్లలోనే వదిలి వెళ్లడంతో వేడిమికి, ఊపిరాడక బలవుతున్నాయి. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఈ కూలర్‌కు కరెంట్‌తో పనిలేదు
రోజు రోజుకు పెరుగుతున్న ఎండల వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఏసీలు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు కూడా కొనుగోలు చేయలేని వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. వీరిని దృష్టిలో పెట్టకుని బంగ్లాదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో ఇప్పుడు తక్కువ ఖర్చుతోపాటూ, విద్యుత్ అవసరం కూడా లేని 'ఎకో కూలర్' వాడకం పెరిగిపోతోంది. ‘గే ఢాకా’, ‘గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్’ సంస్థలు అభివృద్ధి చేసిన ఎకో కూలర్ కరెంట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. మన దేశంలో కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఈ ఎకో కూలర్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇది చాలా చిన్న ఐడియానే కానీ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి, కరెంట్ కోతలతో ఇబ్బందులు పడే గ్రామీణ ప్రజలకు ఇదో మంచి అవకాశం. ఈ ఎకో కూలర్‌ను చాలా సులభంగా తయారు చేసుకొని కరెంట్ అవసరం కూడా లేకుండా దాదాపు 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు. దీనికి ఉపయోగించే పరికరాలు కూడా మనం సాధారణంగా వాడి పడేసే వాటర్ బాటిల్లు, వాటిని గ్రిడ్‌లా అమర్చడానికి ఉపయోగపడే ఓ పరికరం. తయారు చేసే విధానం: ముందుగా సగం కట్ చేసిన కొన్ని వాటర్ బాటిళ్లను తీసుకోవాలి. వాటి మూత పరిమాణంలో ఓ కార్డ్‌బోర్డు అట్టకు సమాన దూరాల్లో బాటిల్‌ను అమర్చాడానికి వీలుగా రంధ్రాలు చేయాలి. వీటికి బయట వైపు వాటర్ బాటిల్లు ఉండేలా, లోపలి వైపు మూత భాగం ఉండేలా కార్డు బోర్డుకు బిగించాలి. ముఖ్యంగా బయటి వేడిగాలి లీకయ్యి లోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని గది కిటికీకి అమర్చాలి. ఈ ఎకో కూలర్... బాటిల్ బయటివైపు భాగం నుంచి ప్రయాణించిన వేడిగాలిని కంప్రెస్ చేసి మూత భాగం గుండా చల్లని గాలిని పంపిస్తుంది. దీంతో గదిలో ఉష్ణోగ్రత దాదాపు 5 డిగ్రీల వరకు తగ్గి చల్లదనాన్నిస్తుంది. -
నేడూ రాష్ట్రంలో వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో పలుచోట్ల తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం ఆదిలాబాద్, హన్మకొండల్లో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. హైదరాబాద్‌లో బుధవారం గరిష్టంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. వడదెబ్బతో 48 మంది మృతి సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు వడదెబ్బ బారిన పడి 48 మంది మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లాలో 12 మంది, కరీంనగర్ జిల్లాలో ఏడుగురు, ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, నిజామాబాద్ జిల్లాలో ఒకరు, వరంగల్‌లో 6, పాలమూరు జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో 8, రంగారెడ్డిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇలా.. ప్రాంతం ఉష్ణోగ్రత ఆదిలాబాద్ 44.3 హన్మకొండ 44.2 నిజామాబాద్ 43.5 మెదక్ 42.9 భద్రాచలం 42.8 రామగుండం 42.8 నల్లగొండ 42.0 ఖమ్మం 41.4 హైదరాబాద్ 40.8 ఆంధ్రప్రదేశ్ తిరుపతి 40.2 విజయవాడ 39.6 విశాఖపట్నం 37.2 కడప 34.5 -
'ఎండ'కు కరిగిన స్టార్ హీరో.. సీఎంతో భేటీ
ఎండ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నీళ్లు, నీడ లేక జనం విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి పిల్లల్లా రాలిపోయే ప్రమాదం పొంచిఉంది. ఈ పరిస్థితులను చూసి సూపర్ స్టార్ మమ్ముటి మనసు కరిగింది. ఎండలో బాధపడుతున్నవారికోసం సహాయక చర్యలు చేయాలనుకున్నారాయన. పరిచయస్తులు, తెలిసినవాళ్లకు ఫోన్లుచేసి, వ్యక్తిగతంగా కలిసి.. తనతో కలిసిరావాలని కోరారు మమ్ముటి. అందుకు వారూ సరేనన్నారు. తన ప్రణాళికకు ప్రభుత్వ సాయం కూడా బాగుంటుందని భావించిన ఆయన బుధవారం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కలిసి, సహకరించాలని కోరారు. మమ్ముటి ఆలోచనలు విన్న సీఎం అప్పటికప్పుడే ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. రేపు (గురువారం) అధికార కార్యక్రమాలన్నీ రద్దుచేసుకుని ఎండల తీవ్రతపైనే సమీక్షలు నిర్వహిస్తానని, ఇదే అంశం ఎజెండాగా మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తానని సీఎం చాందీ వెల్లడించారు. మమ్ముటి చెప్పిన విషయాలను కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని సమాచారం. కేరళలో గత నాలుగు రోజులుగా ఎండలు తీవ్రస్థాయికి ఎగబాకాయి. పాళక్కడ, కన్నూర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను దాటాయి. శనివారం నాటికి 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఎండతీవ్రతతో బాధపడుతున్నవారికి సహాయం అందించేందుకు ముందుకొచ్చారు మమ్ముటి. అయితే ఆయన చేపట్టబోయే చర్యలు ఏమిటనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఏడాది కేరళలో మునుపెన్నడూలేని విధంగా ఎండ అధికంగాఉంది. -
ఎండా.. వానా.. ఎక్కువే..
- ఇదీ ఈ ఏడాది వాతావరణ పరిస్థితి - జూన్ వరకూ ఎల్‌నినో.. జూలై నుంచి లానినా - మండే ఎండలతో చెమటలు కక్కించనున్న ఎల్‌నినో - పదేళ్ల రికార్డులను దాటనున్న ఉష్ణోగ్రతలు - భారీ వర్షాలతో ముంచెత్తనున్న లానినా... ఆశాజనకంగా నైరుతి రుతుపవనాలు - ఇప్పటికే తీవ్ర వడగాడ్పులు.. రాష్ట్రంలో హెచ్చరికలు జారీ - ఖమ్మం జిల్లా బయ్యారంలో 46.3 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత - పెరుగుతున్న వడదెబ్బ మరణాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి.. ఉదయం పది దాటితేచాలు వడగాడ్పులు పంజా విసరబోతున్నాయి.. నోరు తెరిస్తే చాలు గొంతెండిపోనుంది. అదే మూడు నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోనుంది.. కుండపోత వానలతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం కానుంది.. భారీ వర్షాలతో కొత్త ఆశలకు బీజం వేయనుంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులకు కారణం ఎల్‌నినో, లానినా పరిస్థితులే. భూమధ్యరేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. దీనికి విరుద్ధంగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలుంటే లానినా అంటారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సాధారణం కంటే 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలున్నాయి. దీంతో బలమైన ఎల్‌నినో ఏర్పడింది. దీని కారణంగానే తెలంగాణ, ఏపీల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే, జూన్లలో గత పదేళ్లలో లేనంత స్థాయిలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. జూన్ చివరి నాటికి ఎల్‌నినో ప్రభావం తగ్గిపోయి.. అది లానినాగా మారుతుంది. దీనివల్ల రుతుపవనాలు మరింత ప్రభావవంతమై భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఎల్‌నినో కారణంగా ఈసారి నైరుతి రుతుపవనాలు నెల రోజులు ఆలస్యంగా వస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంటోంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాలి. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల జూలైలో నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముంది. అయితే ఈసారి మంచి వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. రెండు నెలలు నిప్పుల కొలిమే బలమైన ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఇప్పటికే వడగాడ్పులు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఆరేడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా బయ్యారంలో ఏకంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ 40 నుంచి 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. బుధవారం సాయంత్రానికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 44.87, అక్కినేపల్లిలో 44.75, మామిడాలలో 43.88, ఖమ్మం జిల్లా రామారంలో 44.27, పెనుబల్లిలో 43.08, దుమ్ముగూడెంలో 43, రంగారెడ్డి జిల్లా ఆలియాబాద్‌లో 43.46, షాపూర్‌నగర్‌లో 43.11, హైదరాబాద్‌లోని షేక్‌పేట, మారేడుపల్లిలో 42.31 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని అనంతపురంలో 42, కర్నూలులో 42.1 తిరుపతిలో 41.4, నందిగామలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్‌నినోతో ఈ వేసవిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజులు తీవ్రంగా వడగాడ్పులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు తీవ్రంగా వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి, ఆ శాఖ సీనియర్ అధికారి నర్సింహారావు హెచ్చరించారు. బుధవారం ప్రపంచ వాతావరణ దినం సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ప్రధానంగా తెలంగాణలోని నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వడగాడ్పులు మరింత తీవ్రంగా ఉంటాయని చెప్పారు. వచ్చే రెండు నెలల పాటు వడగాడ్పులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్చిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదుకావడం అరుదని, ఖమ్మంలో ఇప్పటికే సాధారణం కంటే ఐదు డి గ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. ఈసారి 45 నుంచి 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతాయన్నారు. మధ్యాహ్నం బయట తిరగొద్దు ఈ ఏడాది ఎక్కువ రోజులు వడగాడ్పులు నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆరు బయట తిరగకూడదని సూచించారు. ఒకవేళ తిరగాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ ధరించాలని... నీరు ఎక్కువగా తాగాలని చెప్పారు. నలుపు, ముదురు రంగు వస్త్రాలు ధరించవద్దన్నారు. వడదెబ్బ తగిలినట్లు గుర్తిస్తే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. ఎండలో తిరిగాక వడదెబ్బ తగిలిన విషయాన్ని వెంటనే గుర్తించే పరిస్థితి ఒక్కోసారి ఉండదని... ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవడమే పరిష్కారమని చెప్పారు. భారత వాతావరణ శాఖ వెబ్సైట్లో కూడా వడగాడ్పులపై హెచ్చరికను పెట్టారు. -
ఈ శీతాకాలమంతా వెచ్చనే!
* ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం * నామమాత్రంగా చలి ప్రభావం * ఎల్‌నినో, యాంటీ సైక్లోన్ కారణం * 2015, డిసెంబర్‌ను హాటెస్ట్ వింటర్‌గా తేల్చిన ఐఎండీ సాక్షి, విశాఖపట్నం: శీతాకాలమంటేనే వణికించే సీజన్.. సాధారణంగా నవంబర్ రెండోవారం నుంచి ఆరంభమై డిసెంబర్, జనవరిల్లో గజగజలాడిస్తుంది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి ఎక్కడుంది? చలికాలం అనుభూతి కలిగించకుండానే నిష్ర్కమిస్తోంది. వెచ్చని శీతాకాలంగా రికార్డులకెక్కింది. ఈ ఏడాది తెలుగురాష్ట్రాల్లో శీతాకాలంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 3 నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. చలి తీవ్రంగా ప్రభావం చూపే డిసెంబర్ తొలి రెండువారాల్లోనైతే ఏకంగా 6 నుంచి 10 డిగ్రీలదాకా అధికంగా నమోదయ్యాయి. ఎల్ నినో ప్రభావం, రాజస్థాన్‌పై బలమైన యాంటీ సైక్లోన్ కొనసాగడం, ఉత్తర భారత పర్వత శ్రేణుల్లో పశ్చిమ ఆటంకాలు ప్రభావం చూపకపోవడం వంటివి ఈ పరిస్థితికి కారణంగా వాతావరణ నిపుణులు విశ్లేషించారు. 2015 వేసవిలో ఎల్‌నినో వల్ల తెలుగురాష్ట్రాల్లో 45-48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో 2015 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నిలిచింది. దీనికితోడు రాజస్థాన్‌లో యాంటీ సైక్లోన్‌వల్ల పశ్చిమదిశ నుంచి వేడితో కూడిన పొడిగాలులు వీచాయి. మరోవైపు ఉత్తరాదిన పశ్చిమ ఆటంకాలు బలంగా లేక అక్కడ మంచు అధికంగా కురవలేదు. ఉత్తర భారతంలో అధిక పీడనం(హై ప్రెషర్) ప్రభావం చూపింది. ఇవన్నీ ఉష్ణోగ్రతలు పెరిగి శీతల ప్రభావాన్ని తగ్గించడానికి కారణమయ్యాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన విభాగపు పూర్వ విభాగాధిపతి భానుకుమార్ ‘సాక్షి’తో చెప్పారు. 114 ఏళ్లలో హాటెస్ట్ డిసెంబర్‌గా రికార్డు.. 2015 డిసెంబర్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టించినట్టు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పేర్కొంది. 1901 నుంచి 2015(114 ఏళ్ల) వరకు డిసెంబర్ నెల ఉష్ణోగ్రతల్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ధారణకొచ్చింది. సాధారణంగా శీతాకాలంలో డిసెంబర్ నెల అత్యంత చలిగా ఉంటుంది. దీంతో ఆ నెలనే లెక్కల్లోకి తీసుకుంది. ఆ మేరకు 2006 డిసెంబర్లో 0.82 డిగ్రీలు, 2012లో 1.0, 2009లో 1.04, 2008లో 1.10, 2015లో 1.20 డిగ్రీలు చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినట్టు గుర్తించింది. ఇకపై పెరగనున్న ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా శీతాకాలంలో తెలంగాణలోని ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా లంబసింగిలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 2014లో ఆదిలాబాద్‌లో 4 డిగ్రీలు, లంబసింగిలో సున్నా డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కానీ ప్రస్తుత శీతాకాలం(2015-16)లో ఆదిలాబాద్‌లో 8, లంబసింగిలో 3 డిగ్రీలకంటే తక్కువ నమోదు కాలేదు. ‘‘సంక్రాంతి నుంచి సూర్యుడు మకరరేఖలోకి వెళ్లడంతో ఉష్ణోగ్రతలు ఊపందుకుంటాయి. ఇకపై కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశంలేదు’ అని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త ఆర్.మురళీకృష్ణ తెలిపారు. -
పగలు వేడి.. రాత్రి చలి..!
మేఘాల్లేకపోవడమే కారణం.. కొన్నాళ్ల పాటు ఇదే వాతావరణం సాక్షి, విశాఖపట్నం: వాతావరణంలో సరికొత్త మార్పులు సంతరించుకుంటున్నాయి. కొద్ది రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలూ తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు క్షీణిస్తుండగా, పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి. ఫలితంగా పగటి వేళ ఎండ ప్రభావం, రాత్రి పూట చలితీవ్రత అధికం కానుంది. ఈ పరిస్థితికి ఆకాశంలో మేఘాలు లేకపోవడమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగనుందని వీరు పేర్కొంటున్నారు. మరోవైపు సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, అటు తెలంగాణలోనూ 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగాను, గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగాను రికార్డవుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు విశాఖ ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. -
పుడమి తల్లి చల్లగా!
-
ఇంకా మండిపోద్ది!
లండన్: ఈ ఏడాది భానుడి భగభగలకు మండిపోవడం ఖాయం అని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతల కన్నా అత్యధిక ఉష్ణోగ్రత 2015-2016 మధ్య కాలంలో రికార్డు కానుందని తెలిపారు. ప్రస్తుతం భౌగోళిక వాతావరణంలో మార్పులు వేగవంతమయ్యాయని, ఇవి జన జీవనాన్ని మరింత ఇబ్బంది పెట్టనున్నాయని హెచ్చరించారు. తాజాగా చేసిన అధ్యయనాల్లో భూమి ఉపరితలం ఉండాల్సిన సగటు ఉష్ణోగ్రత స్థాయిని మించిపోయిందని, అది మరింత పెరిగే దిశగా వెళుతోందని వెళ్లడైనట్లు చెప్పారు. గత ఏడాదిలోనే ఎంతో ఆందోళనకరమైన పరిస్థితి కనిపించిందని, అది ఈ ఏడాది కూడా అలాగే ఉండి ఈ రెండు సంవత్సరాలు కచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. -
సలి కోటు...
మెట్రో కథలు సలిగా ఉందా సిన్నీ అంది. వాడేం మాట్లాడలేదు. తల్లికి తెలియకూడదు అని అనుకున్నాడేమో లోపల ఉన్న వొణుకును అణచుకోవడానికి చూశాడు. కాని బక్కగా ఉన్న పక్కటెముకలు కొంచెం అదిరాయి. ఏడేళ్ల పిల్లవాడు. సన్నగా బలహీనంగా అయిదేళ్ల పిల్లవాడిలా కనిపిస్తున్నాడు. సలిగా ఉందా నాయనా అని మళ్లీ కొంచెం దగ్గరికి జరిగి మొత్తం శరీరాన్ని ఒంటికి కరుచుకుని ఒంట్లో ఉన్న వేడి ఇవ్వడానికి చూసింది. కళ్లు మూసుకుని ఉన్నాడు. పెదాలు కొంచెం ఎండిపోయి ఉన్నాయి. గాలి ఒదులుతుంటే ముక్కు నుంచి వేడిగా వచ్చి తగులుతూ ఉంది. బయట లారీలు చాలా వేగంగా అప్పుడొకటి అప్పుడొక్కటి వెళుతున్న రొద తప్ప చీమ చిటుక్కుమనడం లేదు. కాంట్రాక్టర్‌కి స్థలం చూపవయ్యా అంటే ఇదే చూపించాడు. మైదానం. ఇక్కడ పాలిథిన్ షీట్లను కట్టుకుని ఇంకో వారం రోజులు ఉండాలి. పది రోజుల కేబుల్ వర్క్ పనికి ఇంత అని ఇస్తాడు. తీసుకొని ఊరికి వెళ్లిపోవడమే. పనుంటే మళ్లీ రావాలి. ఇంతకు ముందు ఈ పని తెలియదు. పొలం పనులకు వెళ్లేది. మొగుడు కూడా వెళ్లేవాడు. కాని రానురాను పనులు తగ్గాయి. జగానంతా రొయ్యలూ సేపలే తింటున్నట్టున్నారు... నేల కానరాకుండా తవ్వి నీళ్లు నింపి మురికి సేత్తున్నారు... రొయ్యలే కావాలంటే గోదారి లేదా... అంతలావు సవుద్రం లేదా అన్నాడు మొగుడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా వచ్చే కూలి పోయింది. ఉనికీ పోయింది. అదీ కోపం. ఎవరో ఈ పని చెప్పారు. సిటీలో పని. అక్కడితో పోలిస్తే మూడింతలు కూలి. మూడేళ్లుగా ఇందులో దిగారు. కుటుంబాలతో సహా ఎక్కడకు రమ్మంటే అక్కడకు దిగిపోవడం. చూపించిన చోట ఉండిపోవడం. గుంతలు తవ్వి కేబుల్ పరిచి వెళ్లిపోవడం. పోయినసారి కంటే ఈసారి ఈ స్థలం నయంగానే ఉందనిపించింది. పోయినసారి ఉప్పల్ దగ్గర ఏదో పాడుబడ్డ స్థలం చూపించారు. సరే ఏదో ఒకటి అది దిగితే రెండు రోజులు బాగానే ఉంది. మూడోరోజు తెల్లారి పక్క పాలిథిన్ గుడిసె నుంచి ఒకటే ఏడుపు. మూడేళ్ల పిల్లవాణ్ణి పాము కరిచి పోయింది. రాత్రి ఎప్పుడు దూరిందో. తల్లి ఏడుస్తుంటే తండ్రి కూడా గుండెలు బాదుకున్నాడు. ఇంకో గంటకి తండ్రి కూడా పోయాడు. ఇద్దరిని కరిచిపోయింది ఆ మాయదారి పాము. అందుకే ఈసారి జాగ్రత్తగా చూసి మరీ మొగుడి చేత పాలిథిన్ షీట్లు గట్టిగా కట్టించింది. వెతికి వెతికి ఇటుకరాళ్లు తెచ్చి అంచులు లేవకుండా బరువుతో బంధించింది. వస్తూ వస్తూ సుబ్రహ్మణ్య స్వామి పటం తెచ్చుకోవడం కూడా మర్చిపోలేదు. కాని ఈసారి చలి పాములా బుస కొడుతుందని మాత్రం ఊహించలేదు. ఈ టైమ్‌లో ఆ పక్కంతా సలంట కదయ్యా అంది బయల్దేరే ముందు. ఎహె... ఏం సలి. పోదాం పదా. నాలుగు డబ్బులొస్తే పండక్కి పనికొస్తాయి అన్నాడు. ఆ మాట నిజమే. సంక్రాంతి ఇంకో రెండు మూడు వారాల్లో ఉంది. డబ్బులొస్తే పండక్కి నిజంగానే అక్కర కొస్తాయి. బయల్దేరింది. తీరా ఇక్కడికొచ్చాక ఈ చలి దాక్షారామం, రామచంద్రాపురం చలిలా లేదు. అసలు ఇలాంటి చలి ఎరగదు. ఇలాంటి చలికి ఏం కప్పుకోవాలో తెలియదు. ఒకవేళ తెలిసినా అలాంటి ఒక్క గుడ్డముక్క కూడా లేదు. నేల మీద రెండు చాపలు పరిచింది. ఒకదాని మీద మొగుడు స్వాధీనం లేకుండా పడి నిద్ర పోతున్నాడు. ఎనిమిది నుంచి నాలుగు దాకా పని చేసి వచ్చాక పెందలాణ్ణే కొంచెం తిని తినేముందు ఒళ్లు నొప్పులకు కాసింత తాగి పడుకుంటాడు. ఇక పిడుగులు పడినా లేవడు. ఒంటి మీద ఉండేది పెద్ద చెడ్డీ చొక్కానే. కాని సలి అనే మాటే అనడు. అంత మొద్దయిపోయాడు. కాని పిల్లవాడు? మళ్లీ ఒణికాడు. సలిగా ఉందా బంగారూ కప్పిన పాత చీరనే మళ్లీ కప్పుతూ ఇంకా దగ్గరకు జరిగింది. మూమూలుగా అయితే ఐద్రాబాదు వస్తున్నారంటే పిల్లలందరికీ హుషారు. పోయిన వేసవిలో వచ్చినప్పుడు బాగా ఆడుకున్నారు. ఉదయాన్నే మగవాళ్లంతా పనికి పోతారు. ఆడవాళ్లు వంటలో పడతారు. అదిలించేవాళ్లు ఒక్కరూ ఉండరు. ఇక చెట్ల కింద మట్టిలో పుల్లలేరుకుంటూ గోలీలాడుకుంటూ వాళ్లిష్టం. అలా అనుకునే ఈసారి వచ్చారు. రెండు రోజులు గడిచే సరికి మెత్తగా అయిపోయారు. ప్రతి పిల్లదీ పిల్లవాడు తెల్లారాక గుడిసె నుంచి బయటికొచ్చి ఎండలో మజ్జుగా కూచోవడమే. రాత్రంతా చలి వాళ్ల గొంతు పిసికిందని వాళ్లకేం తెలుసు? ఒణకడం ఆపలేదు. తెల్లారి మోపెడ్ డాక్టర్ని పంపించేసి తప్పు చేశానా అనిపించింది. అమా... ఒళ్లెచ్చగా ఉందిమా అని అంటుండగానే మోపెడ్ డాక్టర్ వచ్చాడు. ఇలా కూలి పనుల కోసం వచ్చి దిగేవాళ్ల గుడిసెల చుట్టూ తిరుగుతూ వాళ్లకు మందూ మాకూ ఇస్తుంటాడట. ఆర్ఎంపి అయి ఉండాలి. చూపిస్తే ఇది చలిజ్వరము ఇంజెక్షన్ చేయాలి నూటేబై అవుతుంది అన్నాడు. యాబై ఇస్తాను ఏం చేస్తావో చేయి అంది. ఎగాదిగా చూసి వెళ్లి పోయాడు. కాస్త వేడివేడి అన్నం రెండు ముద్దలు తినిపించింది. ఎండలో కూచోబెట్టింది. బజారుకు నడుచుకుంటూ వెళ్లి మాత్ర తెచ్చి మింగించింది. తగ్గుతుందిలే అనుకుంది. తగ్గలేదు. నిన్న ఒంటి నిండుగా స్వెటర్ వేసుకొని మంకీ క్యాప్ పెట్టుకుని చేతిలో పొన్నుకర్రతో ఆ దారిన వాకింగ్‌కు వెళుతున్న ఒక పెద్దాయన ఆ తెల్లారి పూట అంత చలిలో ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా గుడిసెల బయట మందకొడిగా తిరుగుతున్న పిల్లలను చూసి ఇంతకు మించి చోద్యముందా అన్నట్టుగా ఆగిపోయాడు. రాత్రి ఎంత చలి కొట్టిందో తెలుసు. ఇంత చలిలో ఈ పిల్లల్నేసుకొని ఎలా ఉన్నారమ్మా? ఏం చేస్తాం సామీ. రాత. ఆయన వాకింగ్ మానేసి వెనక్కు వెళ్లిపోయి గంట తర్వాత తెచ్చాడు. ఇంట్లోవి తెచ్చాడో వాళ్లనూ వీళ్లనూ అడిగి తెచ్చాడో పిల్లల బట్టలు కొన్ని ఒకటి రెండు దుప్పట్లు ఇంకేవో మగవాళ్ల బట్టలు తెచ్చాడు. కాని పిల్లలకు మాత్రం చేతిలో ఉన్న మూడు నాలుగు స్వెటర్లే కనిపించాయి. పరిగెత్తుకుంటూ వెళ్లి చొక్కాలు చడ్డీలు ఇస్తుంటే కాదని స్వెటర్ల కోసం వెంట బడ్డారు. గబగబా పంపించింది. పో సిన్నీ... నువ్వు కూడా తెచ్చుకోపో. అందరూ మూగారు. అయ్యా... సలికోటు.... నాక్కావాలి సలికోటు.... నాకు... నాకు.... అయ్యా... ఒక్క సలికోటు... ఉన్నవి అయిపోయాయి. ఒక కనకాంబరం రంగు చొక్కా మాత్రం దక్కింది. కొంచెం లూజుగా ఉన్నా అందులో అందంగా ఉన్నాడు. ముద్దు పెట్టుకుంది. జవాబు చెప్పడని తెలిసినా మళ్లీ అడిగింది... సలిగా ఉందా సిన్నీ... బయట చీకటి చలిలా ఉంది. చలి చీకటిలా ఉంది. బాగా పెరిగిందో ఏమో తిరిగే లారీలు కూడా ఎక్కడివక్కడ ఆగిపోయినట్టున్నాయి. ఎప్పుడోగాని రొద వినిపించడం లేదు. అమా... అన్నాడు. సెప్పు సిన్నీ..... అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. ఒణుకుతున్నాడు. మొగుడివైపు చూసింది. ఇద్దో... నిన్నే.... కదిలితే కదా. గురక పెడుతున్నాడు. ఒణుకు పెరిగింది. లేచి ట్రంకుపెట్టెలో ఉన్న ఒకటి అరా గుడ్డల్ని కూడా వాడికి చుట్టింది. ఎన్ని చుడితే మాత్రం ఏం లాభం. పైన ఉన్నది ఒక పలుచటి పాలిథిన్ షీట్. కాని ఆకాశం కింద పడుకున్నట్టే. ఊ.. ఊ... మూలుగుతూ ఉన్నాడు. సిన్నీ... సిన్నీ.... నేల జిల్లుమంటోంది. చాప జిల్లుమంటోంది. చుట్టబెట్టిన గుడ్డముక్కలు జిల్లుమంటున్నాయి. సిన్నీ... బంగారూ.... ఏం చేయాలో తోచక వెచ్చగా ఉన్న బుగ్గల మీద వెర్రిగా ముద్దుల మీద ముద్దులు కురిపించింది. బయట ఆకాశం మీద అతి శీతలంగా ఉన్న గండభేరుండం ఒకటి ఎగురుతూ ఉంది. అది ఇవాళ తన బిడ్డను ముక్కున కరుచుకుపోనుంది. కుదరదు. తన కంఠంలో ప్రాణం ఉండగా కుదరదు. ఏం మిగిలి ఉందో తెలుసు. దానిని విప్పేసింది. పిల్లాడి ఒంటి నిండా చుట్టేసింది. తిను... నన్ను తినవే... నగ్నంగా ఉన్న ఒంటిని చూసుకుంటూ చలిని దెప్పి పొడిచింది. ఇప్పుడు తన బిడ్డకు తనే సలికోటు. మోకాళ్ల మీద ఒంగి అటోకాలు ఇటో కాలు వేసి మొత్తంగా మీదకు వాలుతూ ఒక గొడుగులాగా దుప్పటిలాగా కప్పులాగా వెచ్చటి రగ్గులాగా మీదకు వాలిపోయింది. తెల్లారింది. మరో గంటలో చాలా న్యూస్చానళ్లకు మంచి మేత దొరికింది. జనం తండోపతండాలుగా వచ్చారు. లీడర్లు వచ్చారు. ఎన్.జి.ఓలు వచ్చారు. నిజంగా మామూలు మనుషులు కూడా ఇళ్లల్లో ఉన్న స్వెటర్లు రగ్గులు తెచ్చి ఆ గుడిసెలన్నీ నింపేశారు. పిల్లవాడికి వైద్యం అందింది. ఎవరో పూలపూల సలికోటు కూడా అందించారు. కాని- ప్రాణమున్న సలికోటును మాత్రం ఎవ్వరూ తెచ్చివ్వలేకపోయారు. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండల వేడిమికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా విజయవాడలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా కరీంనగర్ జిల్లా రామగుండంలో 46.1 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో ప్రధానమైన నగరాలు పట్టణాల్లో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నంలో 46.9, కాకినాడలో 44.7, ఒంగోలులో 44.3, తిరుపతిలో 42, నెల్లూరులో 42.1, అనంతపురంలో 41.2, కర్నూలులో 41.5, కళింగపట్నం 36, విశాఖపట్నంలో 34.1, హన్మకొండ 45.8, రామగుండం 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
'సాధ్యమైనంతవరకూ ఇంట్లోనే ఉండండి'
-
దంచి కొడుతున్న ఎండలు
-
బాబోయ్.. ఎండలు మండిపోతున్నాయ్!!
-
సెగభగలు
మండిపోతున్న ఎండలు బెంబేలెత్తిస్తున్న వడగాలులు ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు మచిలీపట్నం, గుడివాడ, గన్నవరంలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో గత మూడు, నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరి గాయి. రెండు రోజులుగా వడగాలులు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపటంతో బయటకు వచ్చేందుకే ప్రజలు జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 11 గంటలకే జనం లేక దుకాణాలను మూసివేయాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 43, 44 డిగ్రీలుగా నమోదవుతుండగా, రాత్రి సమయంలోనూ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు తగ్గకపోవటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆదివారం జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోహిణీ కార్తె శనివారంతోనే ముగిసిపోవడం.. ఆదివారం నుంచి మృగశిర కార్తె ప్రవేశించటంతో ఎండలు తగ్గుముఖం పడతాయని ప్రజలు భావించగా, మరింత పెరుగుతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఓ వైపు కరెంటు కోతలు, మరోవైపు వడగాడ్పుల కారణంగా ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ఎండలు, వడగాలులను తట్టుకోవడమెలాగో అర్థంగాక ఆందోళనకు గురవుతున్నారు. -
అమ్మో... ఎండలు !
-
వేసవి ముందే బానుడి భగభగ
-
సీమాంధ్ర ప్రజల ఆందోళనను అర్ధం చేసుకోగలం:దిగ్విజయ్