‘ఏ కష్టం లేకుండా వచ్చిపడిన ఊబకాయాన్ని తగ్గించాలంటే మాత్రం కచ్చితంగా కష్టపడాలి’ అనేది ఒకప్పటి మాట. ఎంత సులభంగా పెరిగారో అంతే సౌఖ్యంగా తగ్గొచ్చంటోంది ఇప్పటి టెక్నాలజీ. సౌఖ్యమంటే అట్టాంటి ఇట్టాంటి సౌఖ్యం కాదు. దర్జాగా పడుకుని, ఫోన్ లేదా పేపర్ చూస్తూ హ్యాపీగా బరువు తగ్గొచ్చన్న మాట. ఈ స్టీమింగ్ బాడీ బ్లాంకెట్.. ఫార్ ఇన్‌ఫ్రారెడ్ డిజిటల్ హీట్ థెరపీతో బాడీలోని కొవ్వుని ఇట్టే కరిగించేస్తుంది. అదనంగా శరీరానికి సరికొత్త నిగారింపునూ అందిస్తుంది. దీన్ని ఒకవైపు నుంచి ఓపెన్ చేసి, చిత్రంలో ఉన్న విధంగా ఉపయోగించాలి. చేతులు బయటికి తీసుకునేందుకు ఇరువైపులా రెండు జిప్పులు ఉంటాయి.
చదవండి: వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులు...
ముప్ఫై నిమిషాలు ఈ బ్లాంకెట్‌లో రెస్ట్ తీసుకుంటే.. ఒక గంట స్విమ్మింగ్‌కు, ఒక గంట రన్నింగ్‌కు.. ఒక గంట సైకిల్ రైడ్‌కు.. వంద సిటప్స్‌కు.. లేదా 30 నిమిషాల యోగాకు సమానమట. ఈ బ్లాంకెట్ ఇన్‌ఫ్రారెడ్ లేయర్, వాటర్ ప్రూఫ్ లేయర్, షీల్డ్ లేయర్, థర్మల్ లేయర్, టెంపరేచర్ కంట్రోల్ లేయర్, హీట్ లేయర్, ఇన్సులేషన్ లేయర్ వంటి 7 సమర్థవంతమైన లేయర్స్‌తో రూపొందింది. దీన్ని వినియోగించే సమయంలో.. ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుందని గుర్తించిన వెంటనే.. ఒక నిమిషం పాటు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
ఈ థెరపీని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కొవ్వు తగ్గి.. చర్మకణాలు పునరుత్తేజం చెంది, రోగనిరోధక శక్తి, జీవక్రియ మెరుగుపడతాయి. అలసట తగ్గుతుంది. చిత్రంలోని బ్లాంకెట్‌తో పాటు ఇంటెలిజెంట్ కంట్రోల్ బాక్స్, ఒక రిమోట్ లభిస్తాయి. బాక్స్ మీద టైమ్ డిస్‌ప్లే, స్టార్ట్ బటన్, టెంపరేచర్ కంట్రోల్, టెంపరేచర్ డిస్‌ప్లే, సేఫ్టీ స్విచ్.. ఇలా సెట్టింగ్స్ ఉంటాయి. ఈ డివైజ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇదొక హోమ్ స్పా లాంటిది. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు.. తీరిక దొరికినప్పుడు ఆన్ చేసుకుని ఓ వైపు సేదతీరుతూనే ఇంకో వైపు కొవ్వు కరిగించుకోవచ్చు. అందంతో పాటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment