Therapy
-
LED Light Therapy: అన్ని రోగాలకు దివ్యౌషధం..!
ముడతలు, సోరియాసిన్, మచ్చలు, ఎండతాకిడికి దెబ్బతిన్న చర్మానికి మంచి చికిత్సగా ‘లెడ్‌లైట్ థెరపీ’ ఉత్తమమని చెబుతున్నారు ఆధునిక పరిశోధకులు. కొందరైతే ‘లెడ్‌లైట్ థెరపీ’ అనేది అన్ని రకాల రోగాలకు దివ్యౌషధం అని ప్రచారం చేస్తున్నారు. లెడ్‌లైట్ థెరపీని లో–పవర్డ్ లేజర్ థెరపీ, కోల్డ్ లేజర్ థెరపీ, ఎల్ఈడీ లైట్ థెరపీ అని కూడా పిలుస్తారు.నొప్పి, మంట, కణజాల నష్టాన్ని తగ్గించడంలో, నోటిపూతలు, మచ్చలు, కాలిన గాయాలను నయం చేయడానికి, కొన్ని రకాల అల్సర్లను నయం చేయడానికి లెడ్‌లైట్ థెరపీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.పార్కిన్సన్, అల్జీమర్స్, మల్టిపుల్ స్లిరోసిస్, ఆర్థరైటిస్, ఆటిజం ఉన్న రోగులకు కూడా లెడ్‌లైట్ థెరపీ ఉపయోగపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ఈ చికిత్స సులువైనది. నొప్పి ఉండదు.లెడ్‌లైట్ థెరపీలో కూర్చున్న లేదా పడుకున్న పేషెంట్‌ను పదిహేను నిమిషాల పాటు లెడ్లైట్కు ఎక్స్పోజ్ చేస్తారు.‘సరిగ్గా వినియోగించినప్పుడు లెడ్‌లైట్ చికిత్స చాలా సురక్షితం’ అంటున్నారు నిపుణులు.‘అన్నిరకాల సమస్యలకు లెడ్లైడ్ థెరపీ పనిచేయకపోవచ్చు’ అంటున్నారు వైద్య అవసరాల కోసం లైట్, లేజర్ల ఉపయోగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్, వోరల్ బయాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ప్రవీణ్ అరణి.ఆందోళన నుంచి ఉపశమనం, కండరాల పనితీరును మెరుగుపరచడం, ఆటల వల్ల అయిన గాయాల నుంచి కోలుకోవడం, చర్మానికి యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు...మొదలైన వాటికి సంబంధించి లెడ్‌లైట్ థెరపీని ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల ఎంత మేలు జరుగుతుందనే విషయంలో లోతైన అధ్యయనాల కొరత కనిపిస్తుంది. (చదవండి: ఆ... భరణం అచ్చం అలాగే!) -
ఆ థెరపీ పేరెంట్స్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడింది..!
అమీర్ ఖాన్- రీనా దత్త కూతురుగా ఇరా ఖాన్ సినీ ప్రియులకు సుపరిచితమే. ఆమె‘మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్’ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో కూడా. తన మానసిక ఆర్యోగ్యం(Mental health) గురించి బహిరంగంగానే మాట్లాడుతంటంది. తాను చాలా డిప్రెషన్‌కి గురయ్యానని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చింది కూడా. దేని వల్ల తాను డిప్రెషన్‌కి గురయ్యింది, బయటపడేందుకు తీసుకన్న చికిత్స తన జీవితాన్ని ఎలా మార్చేసిందో సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అమీర్ ఖాన్(Aamir Khan) రీనా దత్తాలు 1986లో వివాహం చేసుకున్నారు. దగ్గర దగ్గర 16 ఏళ్ల వైవాహిక బంధానికి 2002లో స్వస్తి పలికి విడిపోయారు. ఇక వారి ఇద్దరికి కలిగిన సంతానమే జునైద్ ఖాన్, ఇరా ఖాన్. ఇలా ఈ దంపతులు విడిపోవడం వారి కూతురు ఇరాఖాన్(Ira Khan)పై తీవ్ర ప్రభావమే చూపించింది. నిజానికి తల్లిదండ్రులు విడిపోతే ఆ ప్రభావం పిల్లలపై గట్టిగానే పడుతుంది. అయితే అది కొందరిలో ఆత్మనూన్యత భావానికి లేదా నిరాశ నిస్ప్రుహలకి దారితీస్తుంది. ఇక్కడ ఇరాఖాన్ కూడా అలానే తీవ్రమైన డిప్రెషన్ బారిన పడింది. తాను ఆ సమస్యతో బాధపడుతన్నానని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. దీన్నుంచి బయటపడేందుకు ఎంతగానో పోరాడింది. అందుకోసం ఆమె తీసుకున్న థెరపీ(Therapy) మెదట తాను ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంగీకరించేలా చేసింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులు బాంధవ్యం గురించి ఓ స్పష్టమైన అవగాహన కలిగించింది. వాళ్లు కేవలం తన తల్లిదండ్రులుగా మాత్రమే చూడకూడదని, వాళ్లూ మనుషులే, తమకంటూ వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. వారి సంతానంగా తాను గౌరవించాలని తెలుసుకుంది ఇరా. అలా తల్లిదండ్రులను పూర్తిగా అర్థం చేసుకుని డిప్రెషన్‌ను జయించే ప్రయత్నం చేశాను. పిల్లలకు వారి పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండమని ఎవ్వరూ చెప్పారు. ఆ పని మనమే చేయాలి. అదే మనకు మనో ధైర్యాన్ని, శక్తిని అందిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా, ఇటీవలే ఇరాఖాన్ తన ప్రియడు ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను పెళ్లిచేసుకుని వివాహం బంధంలోకి అడుగు పెట్టింది. (చదవండి: Maha Kumbh 2025: నాగ సాధువుగా తొలి విదేశీయుడు..!) -
ఆ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు లామా థెరపీని అందిస్తుందట..!
సాధారణంగా కొందరికి ప్రయాణాలంటే ఒక విధమైన యాంగ్జైటీ ఉంటుంది. దీంతో ఆందోళనగా చెమటలు పట్టేసి ఒక విధమైన ఒత్తిడికి గురవ్వుతుంటారు. ఈ జర్నీ ఎప్పుడు పూర్తి అయ్యి ఇంటికి చేరుకుంటామా..! అని అనుకుంటుంటారు. అలాంటి వారికి ఈ ఎయిర్పోర్ట్ ఒత్తిడిని దూరం చేసేలా లామా థెరఫీని అందిస్తుంది. ఇదేంటి అనే కదా..!ఏం లేదండి మనకిష్టమైన వ్యక్తులు లేదా పెంపుడు జంతువులను చూడగానే రిలీఫ్‌గా ఉంటుంది. ఏ విధమైన భయాందోళనలు దరిచేరవు. పైగా ధైరంగా ఉంటుంది. అలాంటి ఆలోచనతోనే లోరీ గ్రెగోరీ, షానన్ జాయ్చే అనే తల్లికూతుళ్ల బృందం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ ఎయిర్‌పోర్ట్‌లో విచిత్రమైన థెరపీని అందిస్తుంది. ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేలా లామాస్, అల్పాకాస్ అనే ఒంటె జాతికి చెందిన జంతువులతో లామా అనే థెరపీని అందిస్తోంది. అలాంటి జంతువులు ఈ ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం ఐదు లామాలు, ఆరు అల్పాకస్లు ఉన్నాయి. వాటితో ఈ థెరపీని అందిస్తుంది. ఈ జంతువులు మెడలకు "ఐ హార్ట్ PDX" నెక్కర్చీఫ్లు, పాంపమ్ హెడ్‌బ్యాండ్‌లతో ప్రయాణికులకు దర్శనమిస్తాయి. అసలు ఇవి ఎలా ప్రయాణికులకు థెరపీని అందిస్తాయనే కదా సందేహం..లామా థెరపీ అంటే..ఏం లేదండి ఇవి అందంగా ముస్తాభై ఎయిర్పోర్ట్ అంత కలియతిరుగుతాయి. అక్కడకు వచ్చిన ప్రయాణికుల దగ్గరికి వచ్చి అటు ఇటు తిరుగతుంటాయి అంతే..!. అయితే ఆ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన ప్రయాణికులు.. వాటిని చూడగానే జర్నీ వల్ల కలిగిన యాంగ్జైటీ అంతాపోయి ముఖంపై చిరునవ్వు వస్తుందట. దీన్నే లామా థెరపీ అంటారు. ఆ ఒంటె జాతికి చెందిన జంతువుల పేరు మీదుగా ఆ థెరఫీకి పేరు పెట్టారు. అంతేగాదు అక్కడకు వచ్చిన ప్రయాణికులంతా వాటిని చూడగానే ప్రశాంతత వస్తుందని, సంతోషంగా ఉంటామని చెబుతున్నారట. దీన్ని ఎలాంటి లాభప్రేక్ష లేకుండా ప్రయాణికుల సౌకర్యార్థం ఆ తల్లి కూతుళ్లు నిర్వహించడం విశేషం. అంతేగాదు విమానాశ్రయ ప్రతినిధి అల్లిసన్ ఫెర్రే ఈ జంతువుల కారణంగా ప్రయాణికుల ముఖాల్లో ఒత్తడి మాయం అయ్యి ప్రశాంతంగా కనిపిస్తున్నాయి అని చెబుతున్నారు కూడా. ఈ పోర్ట్‌ల్యాండ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులకు శాంతియుత వాతావరణాన్ని అందించేలా సహజమైన కాంతిని అందించే లైట్లు, ఆహ్లాదభరితమైన అందమైన పూల కుండీలు తదితరాలతో టెర్మినల్ని రీ డిజైన్ చేశారట అక్కడ అధికారులు. అందులో భాగంగానే ఈ జంతువులను కూడా ఏర్పాటు చేశారట. ఇలా జంతువులతో సర్వీస్ అందించటం తొలిసారి కాదు గతంలో శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోని "వాగ్ బ్రిగేడ్"లో డ్యూక్ అనే 14 ఏళ్ల పిల్లిని కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారట. ఆ పిల్లి పైలట్ టోపీ చొక్కా కాలర్ ధరించి ప్రయాణికుల ఆందోళన భయాలను పోగొట్టేలా ఆ ఎయిర్‌పోర్ట్‌లో కలియతిరుగుతుండేదట. View this post on Instagram A post shared by Portland International Airport (@pdxairport) (చదవండి: కల నెరవేర్చే..అమ్మ అభిమానిక..) -
టైటానిక్ మూవీ నటి 48 ఏళ్ల వయసులో థెరపీ! మహిళలకు మంచిదేనా..?
టైటానిక్ మూవీ నటి, ఆస్కార్ గ్రహిత కేట్ విన్స్లెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ వన్నే తరగని అందం, గ్లామర్‌తో యంగ్ హీరోయిన్లకు తీసుపోని విధంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇటీవల ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే ఆ కార్యక్రమంలో ప్రేకక్షుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..టెస్టోస్టెరాన్ రీప్లెస్‌మెంట్ థెరపీ చేయించకున్నట్లు తెలిపింది. అసలేంటిది? ఇది మహిళలను ఎలా ప్రభావితం చేస్తుంది అంటే.?. ఈ థెరపీ ఎందుకంటే..నిజానికి మూడు పదుల వయసు దాటేప్పటికీ కొందరిలో హర్మోన్ల అసమతుల్యత వల్ల లైంగిక కోరికలు తగ్గిపోతుంటాయి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానం, పనుల్లో ఉండే ఒత్తిడి తదితర వాటి వల్ల ఈ సమస్యను పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఎదర్కొంటుంటారు. ఇది వారి వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీయొచ్చు.పూర్తి దాంపత్య జీవితాన్ని అనుభవించక మునుపే చాలా తొందరగా ఈ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. ప్రస్తుత జీవన విధానంలోని లోపాల కారణంగా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాన్ని మెరుగుపరుచుకునేందుకే ఈ టెస్టోస్టెరాన్ థెరపీ చేయించకుంటారు. ఇది కేవలం శారరీక ఆనందం కోసమే గాక, ఆరోగ్యపరంగానూ ఈ థెరపీ మహిళలకు అవసరం. ఎలా ప్రభావితం చేస్తుందంటే.. టెస్టోస్టెరాన్ అనేది ప్రతి ఒక్కిరిలో ఉండే లైంగిక హార్మోన్. అయితే పురుషలలో ఈ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ ఆండ్రోజెన్ మహిళల్లో కేవలం లైంగిక సామర్థ్యాన్నే గాక మొత్తం ఆరోగ్యాన్నే ప్రభావితం చేస్తుంది. ఇది సంతానోత్పోత్తని నిర్ణయించడంలో, కొత్త రక్తకణాలు తయారు చేయడంలో, మానసిక ఆరోగ్యం, కండరాలు, ఎముకల పనీతీరు బలోపేతం చేయడంలోనే కీలకంగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఈ టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. మహిళలు కూడా దీన్ని తేలిగ్గా తీసుకుంటారు. అది క్రమేణ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎముకల సాంద్రత తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత, మూడ్స్వింగ్ల నుంచి లైంగిక వాంఛలు తగ్గడం వరకు పలు ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే..?టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ (TRT) అనేది తక్కువ టెస్టోస్టెరాన్ ఉన్న వ్యక్తులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి రూపొందించబడిన వైద్య చికిత్స. దీన్ని తీసుకోవడం వల్ల మెరుగైన మానసిక స్థితి ఉంటుంది. ఆందోళన దూరం అవుతుంది. అలాగే ఎముకల సమస్యల నుంచి బయటపడతారు. కండరాలు బలోపేతం అవుతాయి కూడా. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్న మహిళలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షలోనే తీసుకోవాల్సి ఉంటుంది. (చదవండి: వాపింగ్ ఇంత ప్రమాకరమైనదా..? ఆ మహిళ ఊపిరితిత్తుల్లో ఏకంగా..!) -
రెడ్‌లైట్ థెరపీ అంటే ఏంటీ..? నటి సమంత బ్యూటీ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం మాయ చేశావే సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి సమంత ఎప్పటికప్పుడూ ఫిట్నెస్, ఆరోగ్యం సంబంధిత వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈసారి తన చర్మ సంరక్షణ కోసం తన రోజువారి దినచర్యలో భాగంగా తీసుకునే థెరపీ గురించి ఇన్‌స్టాలో చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోకి "లైఫ్ గోల్డెన్" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేసింది. సమంత మచ్చలేని చర్మ రహస్యం ఏంటో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. తన చర్మం ప్రకాశవంతంగా డిస్కోబాల్ మాదిరిగా మెరుస్తూ ఉండేందుకు తాను ఉదయపు సూర్యకాంతిని తన ముఖంపై పడేలాచేసుకుంటానని అంటోంది. అంతేగాదు ఆయిల్ పుల్లింగ్, గువాషా, రెడ్‌లైట్ థెరపీలతో ముఖ వర్చస్సును కాపాడుకుంటానని చెబుతోంది. అలాగే తన రోజువారీ వెల్నెస్ రొటీన్లో భాగంగా రెడ్‌లైట్ థెరపీని తీసుకుంటానని తెలిపింది. ఇది కంటి సంరక్షణ తోపాటు చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుందని చెబుతోంది. ఈ రెడ్‌లైట్ థెరపీకి సంబంధించిన ఐ మాస్క్‌ల, ఫేస్ మాస్క్‌లు, ఫుల్ బాడీ ప్యానెల్ వంటి అనే సాధనాలు మార్కెట్లో ఉన్నాయి. దీని కోసం బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లోనే చర్మ వ్యాధుడి నిపుణుడి సలహాలతో తీసుకోవచ్చని అంటోంది సమంత. దీన్ని ఉదయం సాయంత్రంలో తీసుకుంటుంటే క్రమేణ చర్మం ఆకృతి మెరుగుపడుతుందని చెప్పింది. ఈ థెరఫీని ఇంట్లోనే పొందేలంటే ఉపయోగించాల్సిన పరికరాలు గురించి కూడా వెల్లడించింది. ఫోరో యూఎఫ్ఓ 2 పరికరం అనేది కొల్లాజెన్‌ని పెంచేలా చేసే రెడ్‌లైట్ థెరపీ పరికరం. ఇది క్రియోథెరపీని కలిగి ఉంటుంది. చర్మాన్ని విశ్రాంతి తీసుకునేలా చేసి గొంతు కండరాలకు ఉపశమనం కలిగించే హ్యాండ్‌హెల్డ్ పరికరం. ఇక మరొకటి డెన్నిస్ గ్రాస్ డీఆర్ఎక్స్ స్పెక్ట్రాలైట్ ఫేస్వేర్ప్రో అనేది నాలుగు రకాల లైట్లను కలిగి ఉన్న అత్యంత ప్రసిద్ధ హ్యాండ్స్ ఫ్రీ రెడ్‌లైట్ పరికరం. ఇది ముఖ ఆకృతులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడమే గాక మొటిమలు, దాని తాలుకా గుర్తులను రీమూవ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అలాగే ముఖం, మెడను లక్ష్యంగా చేసుకుని మాన్యువల్‌గా పనిచేసే పోర్టబుల్ రెడ్‌లైట్ థెరపీ కావాలనుకుంటే సోలావేవ్ 4 ఇన్ 1 రేడియంట్ రెన్యూవల్ స్కిన్‌కేర్ బెస్ట్ అని చెబుతోంది. ఇది ఎర్రటి కాంతిని చర్మంపై ప్రసరించేలా చేసి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా ముఖం ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) ఈ థెరపీతో కలిగే ప్రయోజనాలు..రెడ్‌లైట్ థెరపీ చర్మంపై ముడతలు, ఫైన్‌లైన్స్, వయసు సంబంధిత మచ్చలను తగ్గిస్తుంది. ముఖ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. టోన్డ్ స్కిన్‌ను ప్రోత్సహిస్తుంది. చర్మం ఉపరితలంపై మచ్చలు, సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని మెరుగుపడేలా చేస్తుంది.(చదవండి: ఫరా ఖాన్ ఇష్టపడే వంటకం: ఇడ్లీలో ఇన్ని రకాలా..!) -
దీపికా పదుకొణె, అలియా భట్ల బ్యూటీ సీక్రెట్ ఇదే..!
సినీ తారలు ఎంతలా గ్లామర్ మెయింటెయిన్ చేస్తారో మనకు తెలిసిందే. మూడు పదుల వయసులో వన్నె తరగని అందం, గ్లామర్ వారి సొంత. ముఖ్యంగా వయసు పైనబడినట్లు కనిపించకుండా యవ్వనపు మేని ఛాయాలా కనిపించేందుకు ఏం చేస్తారో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటారు అభిమానులు. వారిలా ఉండేలా రకరకలుగా అందానికి సంబంధించిన ప్రయోగాలు చేస్తుంటారు. ఇంతకీ అందాల భామలు బ్యూటీ రహస్యం ఏంటంటే..బాలీవుడ్ అగ్ర తారలు దీపకా పదుకొణె దగ్గర నుంచి అలియా భట్ వరకు అంతా ఐస్ ఫేషియల్‌కి ప్రాధాన్య ఇస్తారు. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందట. ముఖం తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ముడతలను మాయం చేస్తుందట. ఉబ్బిన కళ్లకు మంచి ఫలితం ఉటుందట. కళ్లు చుట్టూతా ఉన్న ఉబ్బిన భాగ్నాన్ని నార్మల్‌గా మారుస్తుందట. ఇదెలాగంటే..ఏం లేదు ఉదయాన్నే చక్కగా ముఖాన్ని ఫేస్‌వాష్ లేదా సబ్బుతో క్లీన్ చేసుకుని చక్కగా ఫ్రీజ్‌లోని ఐస్ క్యూబ్లతో థెరఫీ చేయించుకుంటారు. ఇది కళ్ల చుట్టు ఉన్న వలయాన్ని, ఉబ్బిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది. క్యూబ్ చేతితో పట్టుకుని ముఖంపై అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఐస్నిఒక పల్చటి క్లాత్‌లో చుట్టి ముఖంపై అప్లై చెయ్యొచ్చు. ఈ థెరపీ ముఖంపై రంధ్రాలను దగ్గర చేసి, మృదువుగా మారుస్తుంది. అలాగే ముఖంపై ఉండే మంట, ఇరిటేషన్ల నుంచి కూడా మంచి ఉపశమనం ఇస్తుంది.అలాగే ముఖమంతా రక్తప్రసరణ జరిగి..చర్మానికి సహజమైన మెరుపుని ఇస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్యను నివారిస్తుందిగ్రీన్ టీ, దోసకాయ రసం వంటి వాటిని ఐస్ క్యూబ్లకు జోడించి అప్లై చేస్తే చర్మానికి అవసరమయ్యే యాంటిఆక్సిడెంట్లు అందుతాయి. అబ్బా చలి..చలిగా.. ఉండి ముఖంపై పెట్టేకునేందుకు వామ్మో..! అనిపించేలా ఉన్నా..ఈ కోల్డ్ థెరపీ చర్మ సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. (చదవండి: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్: నీతా అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా..!) -
కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్డీ..?
కోటి దీపోత్సవంలో దీపాల శిఖలు మిలమిలలాడుతుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుంది! అలాగే చిదిమి దీపం పెట్టుకోవాల్సిన చిన్నారులు ఆటిజమ్‌తో చిన్నబోకుండా ఆ అమాయకపు ముఖాలపై చిరునవ్వుల మిలమిలలను అలాగే ఉంచడానికి పూనుకుంది ‘పినాకిల్’ సంస్థ. లక్షణాల్ని బట్టి ఒక్కో ఆటిజమ్ చిన్నారికి ఒక్కో థెరపీ అవసరమవుతుంది. అలాంటి ‘కోటి థెరపీ’లను పూర్తి చేసింది ఈ సంస్థ,‘ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్’ (ఏఎస్డీ) అని పిలిచే ఈ రుగ్మత ఉన్న పిల్లలకు జ్ఞానేంద్రియాల నుంచి మెదడుకు సమాచారం చేరడమూ... అక్కణ్ణుంచి తాము స్పందించాల్సిన రీతిలో స్పందించక΄ోవడమనే సమస్య ఉంటుంది. సెన్సెస్(జ్ఞానేంద్రియాల)కు సంబంధించిన సమస్య కాబట్టి దీన్ని ‘సెన్సోరియల్ సమస్య’గా చెబుతారు. ఆ పిల్లలు తమదైన ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. కళ్లలో కళ్లు కలిపి చూడలేరు. స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకు నేర్చుకున్న ఒకే పదాన్ని పదే పదే అదే ఉచ్చరిస్తూ ఉంటారు. తోటి పిల్లలతో కలవడానికీ, ఆడుకోడానికి పెద్దగా ఆసక్తి చూపరు.అలాంటి పిల్లలకు అవసరమైన చికిత్స (థెరపీలు) అందిస్తోంది పినాకిల్ సంస్థ. లోపాల్ని చక్కదిద్దడానికి అవసరాన్ని బట్టి స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, డాన్స్ థెరపీ... ఇలాంటి అనేక థెరపీలు అందిస్తోంది. లక్షణాలూ, తీవ్రతలను బట్టి ఒక్కో చిన్నారికి నాలుగైదేసి థెరపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కోటి థెరపీలను ఇటీవలే పూర్తి చేసిందీ సంస్థ. తాము ఈ అసిధారా క్రతువు చేపట్టడం వెనక ఓ నేపథ్యముందంటున్నారు ‘పినాకిల్’ వ్యవస్థాపకురాలు శ్రీజారెడ్డి సరిపల్లి.తొలిచూలు పంటగా పుట్టిన పిల్లాడు మొదట్లో అంతా బాగున్నట్టే కనిపించినా... ఏడాదిన్నర గడిచాక కూడా మాటలు రాక΄ోవడం చూసి ఆందోళన పడ్డారు కోటిరెడ్డి, శ్రీజారెడ్డి దంపతులు. డాక్టర్‌కు చూపిస్తే వినలేక΄ోతున్నాడనీ, బహుశా ఆటిజమ్ కావచ్చని చెప్పారు. చికిత్స కోసం అనేకచోట్ల తిరిగారు. పరిష్కారం దొరకలేదు. వ్యాధి నిర్థారణ సరిగ్గా జరగలేదు.- శ్రీజా రెడ్డి సరిపల్లిపదిహేను రోజులకు అసలు విషయం తెలిసింది. ఆటిజమ్ కాదు, చెవి సమస్య అని తేలింది. అందుకు అవసరమైన శస్త్రచికిత్సలను రెండు చెవులకూ ఒకేసారి చేయించారు. పరిస్థితి పరిష్కారమైందనుకున్నారు. కానీ కేవలం శస్త్రచికిత్స సరి΄ోదు, స్పీచ్ థెరపీ కూడా అవసరమని వైద్యులు చెప్పారు.అన్నీ ఉండి కూడా తమలాంటివారికే ఇంత కష్టంగా ఉంటే, ఏమీ తెలియని వారికి ఇంకెంత కష్టం ఉంటుందన్న ఆలోచన వారిలో రేకెత్తింది. ఆ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న సంస్థే ‘పినాకిల్’. ఆ ఆటిజమ్ సమస్యను ఎదుర్కొనే పిల్లల తల్లిదండ్రుల దుఃఖం తీర్చడానికీ, ఆ పిల్లలు తమ పనులు తామే చేసుకునేలా, దాదాపుగా మిగతా పిల్లల్లాగే ఆడుకునేలా, నడచుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అది!‘‘పినాకిల్ సంస్థకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 70కి పైగా సేవాకేంద్రాలున్నాయి. ఆటిజమ్ పిల్లలకు అవసరమైన రకరకాల థెరపీలను అక్కడ అందిస్తుంటారు. లోపల జరుగుతున్న చికిత్సను తల్లిదండ్రులు బయట ఉండి స్క్రీన్ మీద చూడవచ్చు. కేవలం భారత్‌లోనే కాదు... యూఎస్ఏ, సింగపూర్, దుబాయ్‌లలోనూ ఈ సేవలున్నాయి. త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిటేర్స్లోనూ పినాకిల్ సేవలు అందనున్నాయి. ఖర్చు భరించలేనివారికి ‘సేవా’ విభాగం కింద వారు తాము చెల్లించగలిగేంత లేదా కేవలం ఒక్క రూపాయి చెల్లించి సేవలు ΄÷ందవచ్చు. పద్ధెనిమిది భాషల్లో మా హెల్ప్‌లైన్ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా భాషల్లో సమాచారం తెలుసుకునేలా మా ‘థెరపాటిక్ ఏఐ’ రూ΄÷ందుతోంది. మా హెల్ప్‌లైన్ 9100 181 181 కు ఏ టైమ్‌లో ఫోన్ చేసినా ఆటిజమ్ పిల్లల తల్లిదండ్రులకుప్రాథమిక సమాచారం ఎల్లవేళలా అందుతుంది.ఏఐ ఎందుకంటే..?ఇలాంటి ఓ రుగ్మత ఉందని కనుగొన్న నాటినుంచి నేటికి దాదాపు 133 ఏళ్లు. ఇంతటి చరిత్రా, వేర్వేరు థెరపీల నేర్పూ, నైపుణ్యాలు ఒక్కోచోట ఒక్కొక్కరిలో ఇలా పరిమితంగానే దొరుకుతుండవచ్చు. ఆ అంతటినీ సమగ్రంగా సమీకరించడం, ఒక్కచోటే అందేలా క్రోడీకరించడం అవసరం. అది ‘ఏఐ’తోనే సాధ్యం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నాం.’’ అంటూ తమ సేవల గురించి వివరించారు పినాకిల్ సంస్థ ఫౌండర్, చీఫ్ స్ట్రాటజిస్ట్ శ్రీజా సరిపల్లి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: చక్కని ‘ఫాంగ్’కు చాంగు భళా.. ఇదే! -
స్పీచ్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఒక్క రోజులో ఏం జరుగుతుంది?
ఊరుకున్నంత ఉత్తమం లేదని మన పెద్దలు అంటుంటారు. అతిగా మాట్లాడటం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తడమే కాకుండా మానసిక శక్తి బలహీనపడుతుంది. కొన్నిసార్లు అతిగా మాట్లాడటం పెద్దపెద్ద వివాదాలకు దారితీస్తుంది. మౌనం వహించడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ షౌనక్ అజింక్యా మౌనం గొప్పదనాన్ని వివరించారు. ఒక రోజంతా నిశ్శబ్దంగా ఉంటే అది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. ‘స్పీచ్ ఫాస్టింగ్’ గొంతులోని స్వర తంతువు (వాయిస్ రీడ్స్)లకు విశ్రాంతిని ఇస్తుంది. రోజంతా నిశ్శబ్దంగా ఉంటడం ఒత్తిడిని తగ్గిస్తుంది. అలసటను తొలగిస్తుంది. కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. శరీరానికి విశ్రాంతినిస్తుంది. ప్రశాంతమైన నిద్రకు దోహదపడుతుంది. రోజంతా మౌనంగా లేదా అధికంగా మాట్లాడకుండా ఉండగలిగితే మానసిక స్వాంతనను పొందుతారు. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినగలుగుతారు. మౌనంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి. పలు మతాలలో మౌనవ్రతం అనేది భగవంతుడిని చేరుకునేందుకు ఒక మార్గంగా చెబుతారు. మౌనవ్రతం అంతర్గత బలాన్ని పెంచుతుంది. మనలోని అంతరంగాన్ని అర్థం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. రోజంతా మౌనంగా ఉండటం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుందని డాక్టర్ అజింక్య తెలిపారు. స్వర తంతువులు, గొంతు కండరాలు, ముఖ కండరాలు రిలాక్స్ అవుతాయి. అధికసమయం మౌనంగా ఉండటం, గాఢమైన శ్వాస తీసుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవడమే కాకుండా రక్తపోటు అదుపులో ఉంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. తక్కువగా మాట్లాడటం వల్ల మెదడుకు పదును పెట్టినట్లవువుతుంది. అలాగే పరధ్యానం తొలగి, మరింత ఏకాగ్రత ఏర్పడుతుందని అజింక్య వివరించారు. -
రెడ్‌లైట్ థెరఫీతో షుగర్‌కి చెక్! పరిశోధనలో షాకింగ్ విషయాలు
చక్కెర వ్యాధి పేరు చెబితేనే అందరికి భయం వేస్తుంది. అదీగాక ఇటీవల కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీన్ని అదుపులో పెట్టుకోవడమే గానీ తగ్గడమనేది ఉండదు. అలాంటి చక్కెర వ్యాధిని జస్ట్ ఎరుపు రంగు కాంతితో అడ్డుకట్టవేయొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేగాదు చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. దీన్ని రెడ్ లైట్ థెరఫీ అని పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏంటీ థెరఫీ? ఎలా తగ్గించొచ్చు?.. శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో డయాబెటిస్‌ని ‘రెడ్‌లైట్ థెరపీ’(ఎరుపు రంగు కాంతి)తో నియంత్రించొచ్చని వెల్లడయ్యింది. ఈ రెడ్ లైట్ స్టిమ్యులేటెడ్ ఎనర్జీ ప్రొడక్షన్లో నాన్-ఇన్వాసివ్, నాన్-ఫార్మాకోలాజికల్ అనే టెక్నిక్ గ్లూకోజ్ వినియోగాన్ని పెంచుతుందని, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని నిరూపితమయ్యింది. ఈ పరిశోధనలో రెడ్‌లైట్ థెరపీ ద్వారా మైటోకాండ్రియాలో 670 నానోమీటర్ల ఉత్తేజిత శక్తి (స్టిమ్యులేటెడ్ ఎనర్జీ)ని ఉత్పత్తి చేయగలిగినట్లు గుర్తించారు. అది గ్లూకోజ్ వినియోగానికి దారితీస్తుందని తేలింది. ఈ అధ్యయనంలో ముఖ్యంగా గ్లూకోజ్ తీసుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో అనూహ్యంగా 27.7% తగ్గడమే కాకుండా గ్లూకోజ్ స్పైకింగ్ను గరిష్టంగా 7.5%కి తగ్గించింది. ఈ మైటోకాండ్రియా కీలకమైన సెల్యులార్ ప్రక్రియలకు శక్తిని అందిస్తుంది. ఫలితంగా ఆక్సిజన్ గ్లూకోజ్‌ని ఉపయోగించి శక్తి అధికంగా ఉండే న్యూక్లియోసైడ్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ (ATP)ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏటీపీ ఉత్పత్తిలో మెరుగుదల కారణంగా మైటోకాండ్రియా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తుందని చెప్పారు పరిశోధకులు. అందుకోసం సుమారు 30 ఆరోగ్యవంతమైన వ్యక్తులపై పరిశోధనలు చేశారు. ఒక 15 మందికి 670 nm రెడ్ లైట్ థెరఫీ ఇవ్వగా మిగిలిన వాళ్లకు ఈ థెరపీ ఇవ్వలేదు. వారందరి దగ్గర నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నోటి గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్షను తీసకున్నారు. అలాగే గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయో కూడా పరీక్షించారు. ఈ అధ్యయనంలో సుమారు 45 నిమిషాలు రెడ్‌లైట్ ఎక్స్‌పోజర్‌ని పొందిన వ్యక్తుల రక్తంలో గణనీయంగా గ్లూకోజ్ స్థాయిలు తగ్గగా, మిగిలిన వారిలో చక్కెర నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ థెరఫీ తీసుకున్న వారిలో భోజనం తర్వాత శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన గ్లూకోజ్ స్పైక్‌లు కూడా తగ్గినట్లు గుర్తించారు. అలాగే మనం ఉపయోగించే ఈ ఎల్ఈడీ లైట్లలలో కూడా నీలం రంగే ఉంటుంది కానీ అస్సలు ఎరుపు రంగు ఉండదని అన్నారు. అందువల్ల మైటోకాండ్రియా ఏటీపీ ఉత్పత్తి ఫంక్షన్‌ని తగ్గిస్తోందని చెప్పారు. ఇలా శరరీం ధర్మానికి విరుద్ధంగా పనిచేయడం వల్లే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లు తెలిపారు పరిశోధకులు. ఇది క్రమేణ దీర్ఘకాలిక మధుమేహనికి దోహదం చేసి బలహీననపరుస్తుందని అన్నారు. ఈ పరిశోధన కాంతి ప్రాముఖ్యతను తెలియజేసింది. అలాగే ఈ ఎరుపు రంగ కాంతిలో జస్ట్ 15 నిమిషాలు ఉంటే చాలు మంచి ఫలితాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన మొత్తం జర్నల్ ఆఫ్ బయోఫోటోనిక్స్లో ప్రచురితమయ్యింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఎల్ఈడీ లైట్లు వినియోగం పెరగుతున్నందువల్ల త్వరితగతిన అందరూ ఈ ముప్పుని గుర్తించాలని అన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: వర్కౌట్లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్ టైమ్ లేదు!) -
'మీరు తప్పకుండా మా సలహా పాటించండి'.. స్టార్ హీరో విజ్ఞప్తి!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. దంగల్ సినిమాతో దక్షిణాదిలోనూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్లో సినిమాలతో బిజీగా అన్న హీరో.. తాజాగా తన కూతురు ఐరా ఖాన్‌తో కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు సలహాలు ఇచ్చారు. ఎవరైనా సరే మానసిక ఆరోగ్య సమస్యలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. అంతేకాకుండా మెరుగైన సలహాల కోసం నిపుణులను సంప్రదించమని విజ్ఞప్తి చేశారు. కాగా.. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. అమీర్ ఖాన్ మాట్లాడుతూ..' వైద్యుడైనా, ఉపాధ్యాయుడు, వడ్రంగి అయినా రంగాల్లో నైపుణ్యం ఉన్న వారి సహాయం కోసం మనం వెళ్లాల్సిందే. ఈ ప్రపంచంలో మనం చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. వాటికి నిపుణుల సహాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాదే ప్రతి మనిషి తమ మానసిక పరిస్థితి బాగా లేకపోతే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో సిగ్గపడొద్దు. మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం పొందండి. గతంలో నా కుమార్తె ఇరా, నేను ఇలాంటి సమస్య ఎదుర్కొన్నాం. అందుకే చికిత్స తీసుకున్నాం. మీరు కూడా తప్పకుండా నా సలహా పాటిస్తారని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్' అని అన్నారు. కాగా.. ఐరా ఖాన్ కొన్నేళ్ల క్రితమే ఆమె అగాట్సు అనే ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణను పెంపొందించడం ఐరా ఖాన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు ఇరా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇరా గతంలో డిప్రెషన్‌తో తన బాధపడినట్లు తన అనుభవాన్ని పంచుకుంది. అగట్సు ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా కష్ట సమయాల్లో అవసరమైన వారికి సహాయం చేయడమే లక్ష్యమని ఐరా చెబుతోంది. కాగా.. అమీర్ ప్రస్తుతం లాపటా లేడీస్, లాహోర్ 1947 చిత్రాలను నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
తాగితే మా ఆయన చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు.. ఏం చేయాలి?
వ్యసనాల బారిన పడిన వ్యక్తిని ఆ కుటుంబంలోని వారు మొదట్లో గుర్తించరు. తమ వాళ్లు మంచివాళ్లని, చెడు అలవాట్లకు బానిసలు కారని నమ్ముతారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్నేహితుల ప్రభావమో, మరొకటో అనుకుంటారు తప్ప సమస్యను పెద్దగా పట్టించుకోరు. ఈ సమస్యను ఫ్యామిలీ డినైల్ అంటున్నారు నిపుణులు. అడిక్షన్స్ గురించి అసలు మన కుటుంబాలు ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నాయి..? ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నాయి? ఈ అంశం పై ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’ ► అపార్ట్మెంట్లో దాదాపు అన్ని ఫ్లాట్స్ ఒకేలా ఉంటాయి. ఒకబ్బాయి రాత్రి టైమ్‌లో బాగా తాగేసి తమ ఇల్లు అనుకొని, వేరేవాళ్ల ఇంటి బెడ్రూమ్కి వెళ్లి పడుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్లు పెద్ద గొడవ చేశారు. ఆ అబ్బాయి వాళ్ల తల్లితండ్రులు తమ పిల్లవాడిని తిట్టకుండా ఏదో పొరపాటున జరిగి ఉంటుందంటూ ఆ కుటుంబంతో గొడవ పడ్డారు. ► ఫ్యామిలీ ఫంక్షన్‌కి భర్త రాలేదు. ‘ఏమైంది..’అని ఎవరైనా అడిగితే ఆరోగ్యం బాగోలేదు అంటారు. ఆ సదరు వ్యక్తి ఇంట్లో ఉండి తాగుతుంటాడు. ► మల్టిపుల్ అడిక్షన్స్‌కు అలవాటుపడిన ఓ అబ్బాయి వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటానంటే, తల్లి ఒప్పుకోలేదు. ‘నీకేమైంది, బాగానే ఉన్నావ్ కదా! పై చదువుల కోసం అమెరికా వెళుతున్నావ్. బాధ్యత తెలిస్తే సెట్ అవుతావులే’ అంటుంది. ► ఒక భార్య ‘మా ఆయన తాగినప్పుడు చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు. మిగతా సమయాల్లో చాలా చాలా బాగుంటాడు’ అని సరిపెట్టుకుంటుంది. ► ‘మా వాడు చాలా మంచోడు సార్, చాలా జాగ్రత్తగా ఉంటాడు. మొన్ననే తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయ్యింది’ అంటాడు తండ్రి. ► కజిన్స్ రిలేటివ్ ఫంక్షన్లో ఒకబ్బాయి ఓవర్‌గా తాగాడు. మనవాడు కదా అని మరుసటి రోజు తల్లికి ఫోన్ చేసి ‘అక్కా, మీ అబ్బాయి పార్టీలో ఓవర్‌గా తాగాడు’ అని చెబితే ‘మా అబ్బాయి అలాంటోడు కాదు, ఫ్రెండ్స్, కజిన్స్ బలవంతం చేసుంటారు’ అని వెనకేసుకొచ్చింది. విషయం చెప్పిన వ్యక్తితో మాట్లాడటమే మానేసింది. బంధుమిత్రులు ఎవరైనా ‘మీ అబ్బాయి తాగుతుండగా ఫలానా చోట చూశాం’ అని చెబితే వాళ్లతోనూ మాట్లాడటం మానేసింది. ఒకసారి కాలేజీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. తల్లిదండ్రులని పిలిస్తే ‘మా అబ్బాయిని కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. మీదే అసలు సమస్య అనేసింది.’ ఇలాంటి సమర్థింపులు ఎన్నో .. ఎన్నెన్నో మీకూ తెలిసే ఉంటాయి. వెరీ డేంజర్!! చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు వ్యసనాల బారినపడ్డారనే విషయం తెలిసినా వారు ఒప్పుకోరు. వ్యసనపరులకు కుటుంబాల నుంచి ఇలాంటి రక్షణ దొరికితే ఎప్పటికీ మార్పు రాదు సరికదా సర్దుకుపోవడం, కొట్టిపారేయడం చేస్తుంటే మీ కుటుంబం బీటలు వారడానికి సిద్ధంగా ఉందని గ్రహించాల్సిందే! అడిక్షన్ వెరీ వెరీ డేంజర్ డిసీజ్. ఈ సందర్భంలో కుటుంబంలో ఎవరిలోనైనా అడిక్షన్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించడం మేలు. ధైర్యమే ఆయుధం వ్యసనాల బారిన పడ్డవారు నమ్మబలికే మాటలు చెబుతారు. సంఘటన తర్వాత ‘సారీ..’ అనేస్తారు. చిన్న చిన్న కానుకలు ఇచ్చి, తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేవారుంటారు. దీంతో అమ్మ/భార్య/అక్క/ మన వాళ్లే కదా, మన పిల్లలే కదా.. మరోసారి ఇలా చేయరులే అనుకుంటారు. ఇదే విధమైన ప్రవర్తన కొన్నాళ్లకు ముదిరి ఇంట్లో భయోత్పాతాలను సృష్టిస్తుంటారు. కుటుంబం ప్రవర్తన మారాల్సిందే! కొడుకు/కూతురు/హజ్బెండ్/ఫాదర్ కి అడిక్షన్ పట్ల సపోర్ట్ ఇవ్వకూడదు. ఇంట్లో డబ్బులివ్వకపోతే బయట అప్పులు చేస్తారు. పదివేలు, ఇరవైవేలు అప్పు చేసినప్పుడు ఎవరైనా ఇంటి మీదకు వస్తే కుటుంబంలో ఉన్నవారిని బెదిరియ్యకుండా ఆ అప్పు తీర్చేస్తారు. సదరు వ్యక్తికి ఇబ్బంది కలగనీయకుండా అడ్డుగా నిలబడతారు. ఆ సమస్యను ఫేస్ చేయనీయకుండా వెనకేసుకొస్తారు. కాలేజీలో సమస్య వచ్చినా, మరోచోట సమస్య వచ్చినా తల్లిదండ్రులు కొడుకును కాపాడటానికి ట్రై చేస్తారు. దీనివల్ల పిల్లవాడు మరిన్ని తప్పులు చేసేలా ఆ కుటుంబంలోని వారు ప్రోత్సహిస్తున్నట్లే. మందలించాల్సిందే! ముందు తప్పించుకోవడం, సర్దుబాటు చేసుకోవడం నుంచి కుటుంబాల్లో ఉన్నవారు బయటకు రావాలి. కౌన్సెలింగ్ సమయంలో ముఖ్యంగా ఆడవాళ్లకు బలంగా ఉండాలని చెబుతాం. గట్టిగా మందలించమని చెబుతాం. ‘ఇది మా వ్యక్తిత్వం కాదు కదా’ అంటారు. కానీ, మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అని గుర్తించరు. సమస్యను భరిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మిమ్మల్ని వ్యసనపరులు నిస్సహాయ స్థితికి తీసుకెళతారు. కుటుంబం బలంగా ఉండాలంటే మేజర్ రోల్ భార్య/తల్లిదే. ఆమె గట్టిగా ఉండాల్సిందే. కుటుంబం బాగుండాలంటే మంచిగవ్వాల్సిందే! అని చెప్పాలి. ఒకతను ఆల్కహాల్/ డ్రగ్స్ వాడుతున్నాడంటే అతని మైండ్ నిలకడగా లేదని అర్ధం చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, శ్రేయోభిలాషుల సాయంతోనైనా సమస్యను చక్కదిద్దాలి. ‘థెరపీ అవసరం లేదు, సదరువ్యక్తికి తెలియకుండా మందులు ఇప్పిద్దాం’ అనుకుంటారు. కానీ, యాంటీ క్రేవింగ్ మెడిసిన్స్ వాడటం వల్ల బ్రెయిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు. అవగాహన, బిహేవియరల్ థెరపీ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుంది. ముందుగా కుటుంబాల వాళ్లు... 1. ఇదొక వ్యసనం అని అంగీకరించాలి. 2. పూర్తి చికిత్స ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకోవాలి. 3. చికిత్సకు కావాల్సినంత టైమ్ ఇవ్వాలి. నలుగురిలో తెలిస్తే పరువు పోతుందని భయపడుతుంటారు. ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్‌కు ఎలా వెళతామో సైకలాజికల్ సమస్య వస్తే అందుకు సంబంధించిన డాక్టర్ని కలవడానికి ఇబ్బంది పడకూడదు. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ -
గుర్రాలతో ఆందోళన తగ్గించే సరికొత్త థెరపీ
-
గుర్రాలతో కొత్త తరహా థెరపీ మీ కోసమే
-
క్యాట్ థెరపీ: లవ్యూ అంటూ ముచ్చటపడుతున్న నెటిజన్లు
ఎన్నిసార్లు రైల్లో ప్రయాణం చేసినా,రిజర్వేషన్ ఉన్నాకూడా ట్రాఫిక్ మహా సముద్రాన్ని ఈది స్టేషన్‌కు చేరి, ట్రైన్ ఎక్కి మన సీట్లో మనం కూర్చునేదాకా మహా గొప్ప టెన్షన్.. అలాగే ఎంత అనుభవం ఉన్నా.. ఎన్నిసార్లు గాల్లో విహరించినా ఎక్కిన ఫ్లైట్ దిగేదాకా విమాన ప్రయాణం అంటే అదో అలజడి. ఎలాంటి వారికైనా కొద్దో.. గొప్పో..ఈ ఒత్తిడి తప్పదు కదా. బహుశా అందుకేనేమో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. USA టుడే ప్రకారం బ్లాక్ అండ్ వైట్ రెస్క్యూ క్యాట్ ఇటీవలే విమానాశ్రయంలోని వాగ్ బ్రిగేడ్‌లో చేరింది. విమాన ప్రయాణీకుల ఒత్తిడిని, ఆందోళనను తగ్గించేందుకు ఈ అందమైన పిల్లి సిద్ధంగా ఉంటుంది. ఈ తరహా థెరపీని అందిస్తున్న మొదటి పిల్లి డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్. 14 ఏళ్ల థెరపీ క్యాట్ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సరికొత్త ఉద్యోగి. మా డ్యూక్ అసలు ఎవర్నీ నిరాశపర్చదు. ఒక్క క్షణం డ్యూక్‌ని పలకరిస్తే ప్రయాణ టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, ఎలాంటి భయం, బెరుకూ లేకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకులతో ఎలా మెలాగాలో, వారిలో ఒత్తిడిని పొగొట్టి, నవ్వులు ఎలా పూయించాలో కూడా ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారట. యానిమల్ థెరపిస్ట్‌గా సర్టిఫికేట్ కూడా పొందిందట. ఎయిర్‌పోర్ట్‌లో ఊపుకుంటూ తిరుగుతూ, పలకరిస్తూ, నవ్వులు పూయిస్తున్న డ్యూక్‌ని చూసిన ప్రయాణికులు, అందులోనూ క్యాట్ లవర్స్ తెగ మురిసిపోతున్నారట. దీంతో డ్యూక్‌ని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో యానిమల్ కేర్ అండ్ కంట్రోల్ 2010లో ఆకిలితో ఉన్న ఈ పిల్లిని గుర్తించడంతో ఒక కుటుంబం దీన్ని దత్తత తీసుకుంది శాన్ ఫ్రాన్సిస్కో సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ ద్వారా డ్యూక్ థెరపీ యానిమల్ శిక్షణ పొందింది. కాగా శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం ఈ కార్యక్రమాన్ని 2013లో ప్రారంభించింది. సర్టిఫైడ్ థెరపీ జంతువులను టెర్మినల్స్‌లో ఉంచుతుంది. తద్వారా ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చడమే లక్ష్యమని విమానాశ్రయ అధికారుల మాట. -
అశ్వాలు ఆందోళన తగ్గిస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి బయట పడేందుకు వివిధ రకాల చికిత్సా పద్ధతులను పాటించే ఉంటారు. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు మరో కొత్త తరహాలో సాంత్వన అందించవచ్చని సైకాలజిస్ట్ నిమ్రా మీర్జా చెబుతున్నారు. దాని పేరు ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’... అంటే గుర్రాలతో స్నేహం చేయడం, వాటితో సహవాసం వల్ల కూడా మానసిక సమస్యలకు చికిత్స అందించవచ్చు. యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే దీనికి గుర్తింపు ఉండగా, మన దేశంలో బెంగళూరు, చెన్నైల్లో ఈ పద్ధతి వచ్చేసింది. ఇక తెలంగాణలో తొలిసారి ఈ థెరపీని నిమ్రా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన నిమ్రా ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. ఈ థెరపీలోనూ లోతైన అధ్యయనం చేశారు. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ (ఈఎఫ్‌టీ)లో కూడా పట్టా పొందిన ఆమె హార్స్ రైడర్‌గా పలు పోటీల్లో పాల్గొన్నారు. తొలిసారి రానున్న ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నగరంలో జరిగింది. అజీజ్ నగర్‌లోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ)లో నిమ్రా మీర్జా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హార్స్ రైడింగ్‌కు సంబంధించి ప్రాథమికాంశాలు, గుర్రాల మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ మంచి రైడర్‌గా మారేందుకు అవసరమైన సూచనలతో పాటు థెరపీకి సంబంధించిన పలు అంశాలను నిమ్రా వివరించారు. ‘హార్స్ రైడింగ్ అంటే చాలా మంది ఒక ఆటగా మాత్రమే చూస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను కరిగించి శారీరకంగా మంచి ఫలితాలు అందించడం రైడింగ్‌లో సహజంగా కనిపించే ప్రయోజనం. కానీ రైడింగ్‌తో పాటు గుర్రాలను మచ్చిక చేసుకోవడం ద్వారా మానసిక సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వారిపై, కొన్ని రకాల మానసిక వ్యాధులతో బాధడుతున్నవారిపై కూడా ఈ థెరపీ బాగా పని చేస్తుంది. ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన వారు సైతం ఈ ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీతో కోలుకున్న అనుభవం నా ముందుంది. కొత్తగా వచ్చిన ఈ చికిత్స ఎక్కువ మందికి చేరాలనేదే మా ప్రయత్నం’అని నిమ్రా వివరించారు. మున్ముందు కూడా హెచ్పీఆర్సీ కేంద్రంగా ఈ చికిత్స అందిస్తామని ఆమె వెల్లడించారు. -
Dr. Shilpi Reddy: డ్యాన్సింగ్ మామ్స్
ముహూర్తాలు చూసి సిజేరియన్లు చేయించుకుంటున్న ఈ రోజుల్లో డ్యాన్సింగ్ థెరపీ ద్వారా నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పిరెడ్డి. మారిన జీవనశైలి కారణంగా పెరుగుతున్న సిజేరియన్ రేషియో తగ్గించడానికి ఏడేళ్లుగా ఈ డాక్టర్ చేస్తున్న కృషి ఎంతో మంది కాబోయే తల్లులకు వరదాయినిగా మారింది. ఈ విషయాల గురించి డాక్టర్ మరింతగా ఇలా వివరించారు. ‘ఈ మధ్య కాలంలో గర్భిణులు చేసే పనుల్లో ఫోర్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజులు బాగా తగ్గిపోయాయి. గతంలో నీళ్లు చేదడం, ముగ్గులు పెట్టడం, ఇండియన్ టాయిలెట్లు వాడటం, కూర్చొని బట్టలు ఉతకడం, దంచడం, రుబ్బడం, వంటలు చేయడం.. ఇలాంటి పనులన్నీ డెలివరీ అయ్యే దారిని అనువుగా మార్చేవి. ఇప్పుడు ఈ పనులన్నీ తగ్గిపోయాయి. ఫలితంగా డెలివరీ అయ్యే దారి ఇరుకుగా మారి ప్రసవం కష్టమైపోయింది. గర్భవతి అని తెలిసిన రోజు నుంచి ఆహారం బాగా తీసుకోవాలనే విధానం పెరిగింది. కూర్చొని వర్క్ చేసుకునే గ్యాడ్జెట్స్ పెరిగిపోయాయి. శారీరక శ్రమ తగి, క్యాలరీలు పెరగడంతో లోపల బేబీ కూడా పెరుగుతుంది. ఇక ప్రసవ సమయానికి నొప్పి లేకుండా డెలివరీ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే, ప్రసవం నొప్పి అనేసరికి ఒక విధమైన స్ట్రెస్ ఉంటుంది. దీని నుంచి బయటకు రాలేక ‘ఎందుకు రిస్క్...’ సిజేరియన్ అయితేనే బెటర్ అనుకుంటారు. సాధారణంగా వ్యాయామాలు, ఆహార నియమాలు గురించి చెబుతాం కానీ, ప్రసవం సమయానికి నొప్పి భయంతో కూడిన స్ట్రెస్ ఎక్కువ పెట్టేసుకుంటారు. ఈ వలయం నుంచి బయటకు తీసుకురావాలంటే ముందు నుంచీ భయం పోగొడుతూ వారి మనసును ఆహ్లాదంగా ఉంచాలి. అందుకే మంచి పాటలతో చిన్న చిన్న డ్యాన్సింగ్ మూమెంట్స్ చేయిస్తుంటాం. గర్భవతిగా ఉన్నన్ని రోజులూ దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వ్యాయామాలు, జుంబా క్లాసులు కూడా ఉంటాయి. సహజ ప్రసవానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ ఇది. సిజేరియన్ల రేషియో పెరగడంతో నార్మల్ డెలివరీల వైపు ప్రభుత్వాలు కూడా మొగ్గు చూపుతున్నాయి. అందరిలోనూ సహజ ప్రసవాల విషయంలో ఆలోచనలు పెరిగాయి. దీంతో దీని వెనక ఉన్న కారణాలనూ కూడా అవగాహనలోకి తీసుకొని చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్లానింగ్ అమల్లోకి రావాలంటే మంచి టీమ్, నిపుణులు అందుబాటులో ఉండాలి. ఎవరికి వారు సొంతంగా చేయలేరు. అలా చేస్తే, ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. నాలో పుట్టిన ప్లానింగ్ కాబట్టి ఎక్కడైనా సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించాలో కూడా నాకు తెలుసు. ఇక్కడ మా కడల్ హాస్పిటల్లో పెద్ద యోగా హాల్, ఫిజియోథెరపిస్టులు, ఎమర్జెన్సీ టీమ్, గైనకాలజిస్టులు .. ఈ సెటప్‌ను మాకు అనుగుణంగా మార్చుకున్నాం. దీనిని కాపీ చేయడం కూడా సులువు కాదు. నాలాగా చేయాలంటే సేమ్ సెటప్‌ను ఫాలో అవ్వాలి. ఈ ప్లానింగ్‌గా అమలు చేస్తే నాలుగైదేళ్లకు సక్సెస్ రావచ్చు. కోవిడ్ తర్వాత జనాల్లో చాలా మార్పు వచ్చింది. ముందు నుంచీ ప్లానింగ్ విషయంలో శ్రద్ధ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి, గ్రామీణ స్థాయి నుంచి కూడా మా సేవలు పొందడానికి వస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా కావల్సిన సేవలు అందిస్తున్నాం’ అని వివరించారు ఈ డాక్టర్. రోజువారీ పనులు అధిక ఆహారం తీసుకోకుండా, ఆర్గానిక్ ఫుడ్, మిల్లెట్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, బామ్మల కాలం నాటి బలవర్ధకమైన ఆహారం తయారీ, చేయాల్సిన రోజువారీ పనులు.. ఇలాంటివన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ చేశాం. ఈ ప్లాన్‌ను పూర్తిగా ఫాలో అయితే ప్రసవానికి వచ్చినప్పుడు భయమనేది లేకుండా గర్భిణిలో ఒక నిశ్చింత కలుగుతుంది. ఏడేళ్లుగా చేస్తున్న కృషి క్రమం తప్పకుండా ఏడేళ్లుగా చేయడంతో మంచి స్పందన వస్తోంది. గతంలో నోటి మాట ద్వారా వచ్చిన వారే ఎక్కువ. సోషల్‌మీడియా ద్వారా రెండేళ్లుగా చాలా మందిలోకి వెళ్లింది. మనకు వచ్చిన ఆలోచనను సరిగ్గా అమల్లో పెట్టినప్పుడు ‘ఎవరో నవ్వుతారు, ఏదో అంటారు’ అని దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. అప్పుడే సరైన ఫలితాలు పొందుతాం. ఈ ప్లానింగ్ విషయంలో జరిగినది అదే. గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె ఎప్పుడు డెలివరీకి వస్తుందో తెలిసిపోతుంది. అయితే, కొంతమంది మాత్రం మంచి ముహూర్తం అని చెప్పిన టైమ్‌కి సిజేరియన్ చేయమని అడుగుతుంటారు. ఇది సరైనది కాదని, నార్మల్ డెలివరీయే మేలైనదని చెబుతాం. సమాజంలో ఒక చిన్నమార్పు రావడానికి చేస్తున్న కృషి ఇది. – నిర్మలారెడ్డి -
Health: సౌండ్ బాత్.. ప్రయోజనాలెన్నో! ఒత్తిడి మాయం.. మూడ్స్ మారతాయి! కానీ..
తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహ్లాదకరమైన సంగీతం విని, దాన్ని తగ్గించుకోవడం చాలామందికి అలవాటే. ఇందుకోసం కొందరు లలితమైన సంగీతం ఆలకిస్తుంటారు. మరికొందరు బీట్ బాగా ఉండే హుషారు, ఊపు పాటలను వింటారు. ఈ భిన్న ఆసక్తులు ఉన్నవారికి ఒకరి సంగీతం మరొకరికి అంత ఇంపుగా అనిపించదు. కేవలం ఇలా సంగీత మాధ్యమంలోనే కాకుండా... కొన్ని నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలలో వెలువడే శబ్దాలతో ఒత్తిడి తగ్గించే ప్రక్రియే సౌండ్‌బాత్. ఇది కూడా ఒక ధ్యానం (మెడిటేషన్) లాంటి లేదా యోగాలాంటి ఫలితాలనిచ్చే ప్రక్రియ. కొన్ని రకాల శబ్దాలు ఓ క్రమపద్ధతిలో ఒకేలాంటి ఫ్రీక్వెన్సీ స్థాయుల్లో మంద్రంగా వెలువడుతూ... మన దేహాన్ని కండరాల ఒత్తిడి ఉన్నప్పుడు వాటిని రిలాక్స్ చేసేలా, మానసిక ఒత్తిడి నుంచి విముక్తం చేసేందుకు ఉపకరించే ఈ ప్రక్రియ ఒక యోగాలాంటిదని క్లివ్లాండ్ క్లినిక్‌లోని మేరిమైంట్ మెడికల్ సెంటర్, బ్రాడ్‌వ్యూ హైట్‌కు చెందిన ఇంటర్నల్ మెడిసిన్ వైద్య సహాయకురాలు కరేన్‌బాండ్ చెప్పారు. ఇలా ఒత్తిడి మాయం దీనికి ఆమె భారతీయ యోగా ప్రక్రియలో ఉచ్చరించే ‘ఓమ్’ శబ్దాలు, చైనా సంప్రదాయ వైద్యం (ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్–టీఎమ్సీ)లో ఉచ్చరించే ‘చి’ లాంటి శబ్దాలను (చైనీస్ అక్షరమైన దీని స్పెల్లింగ్ ఇంగ్లిష్‌లో ‘క్యూఐ’ కాగా దీన్ని (సీహెచ్ఐ గా ఉచ్చరిస్తారు) ఉదాహరణలుగా చూపుతున్నారు. అవి శరీరంలోని శక్తిప్రవాహాన్ని ఏర్పరచడం, క్రమబద్ధ పద్ధతిలో ప్రవహింపజేయడం ద్వారా ఒత్తిడిని తొలగించేందుకు సహాయపడతాయని పేర్కొంటున్నారు. అధ్యయనాల ఫలితంగానే ఇదెలా జరుగుతుందనేది చెబుతూ ‘‘ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి తన జీర్ణవ్యవస్థ క్రమబద్ధంగా లేకపోవడాన్ని కంప్లెయింట్‌గా చెబితే... వారిలో ఆ ప్రాంతాన్ని నయం చేసేలా ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో శబ్దాలు వినిపించడం జరుగుతుంది’’ అని తెలిపారు. శబ్దాలతో కలిగే వైద్య ప్రయోజనాలపై 2014 నుంచి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయనీ, ఈ తరహా శబ్దచికిత్సలు చవకైనవి మాత్రమే గాక... సురక్షితమైనవని ఆమె తెలిపారు. చిన్న చిన్న సమస్యల్లోనే కాకుండా దీర్ఘకాలిక వెన్నునొప్పులు, క్యాన్సర్‌తో బాధపడేవారిలో కలిగే నొప్పుల ఉపశమనానికి కూడా ఈ శబ్ద చికిత్సలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఇవే కాకుండా ఈ తరహా పరిశీలనలు జరుగుతున్నప్పుడు నిదర్శనాలు, ఫలితాల ఆధారంగా వాస్తవాలు తెలుసుకునే పరిశోధన జరుగుతోందని వెల్లడించారు. అనేక నిదర్శనాలు, ఫలితాలను పరిశీలించినప్పుడు సౌండ్ బాత్ తర్వాత తమ క్లయింట్లను ప్రశ్నించినప్పుడు... కొందరు ఒత్తిడి తగ్గిందనీ, మరికొందరు తమ కండరాలు వదులుగా, రిలాక్స్డ్గా మారాయనీ, నొప్పి తగ్గిందనీ, నిద్ర బాగా పట్టిందని, మూడ్స్ మెరుగుపడ్డాయని, తమ శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులు తమకు బాగా తెలిసినట్లుగా అనుభూతి కలిగిందనీ వివరించినట్లు కరేన్ బాండ్ తెలిపారు. సౌండ్ బాత్ కోసం ఏయే పరికరాలు ఉపయోగిస్తారంటే...? ►జేగంటలు (గాంగ్) ►జలతరంగిణిలో ఉపయోగించేలాంటి గిన్నెలు ►టిబెటన్ పాటల్లో ఉపయోగించేలాంటి గిన్నెలు ►ట్యూనింగ్ ఫోర్క్‌లు ►ఫెంగ్ షుయీ పద్ధతుల్లో ఇంట్లో వేలాడదీసినప్పుడు ఆహ్లాదకరంగా మోగుతుండే స్తూపాకారపు అలంకరణ వస్తువులు (చిమ్స్) ►కొన్ని చిరుమువ్వలు ►ఆహ్లాదకరమైన శబ్దాలను వెలువరించే చిరు గంటలను సౌండ్ బాతింగ్ కోసం ఉపయోగిస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా.. దీని ఫలితాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. చాలా తక్కువమందిలోనే అయినా కొందరిలో సౌండ్‌బాత్ తర్వాత కొందరు కాస్త అలసట ఫీలవుతారు. దీనికి భిన్నంగా మరికొందరు బాగా శక్తిపుంజుకున్నట్లు అనుభూతి చెందుతారు. అందుకే సౌండ్బాతింగ్ ప్రక్రియకు ముందు మంచి ఆహారం, తగినన్ని నీళ్లతో పాటు కంటినిండా నిద్ర అవసరమని సూచించారు. మానసిక (సైకియాట్రిక్) సమస్యలతో బాధపడేవారు సౌండ్ బాత్కు ముందు తమ డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు. చదవండి: నోటి నుంచి దుర్వాసన వస్తోందా? నీటిలో తౌడు వేసి.. తెల్లారి పరగడుపున వీటిని కలిపి తాగితే.. -
అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్..
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోను రిలీజ్ చేసిన బీజేపీ కేజ్రీవాల్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే ఆప్ దీనికి కౌంటర్ ఇచ్చింది. సత్యేందర్ జైన్ చేయించుకుంది మసాజ్ కాదని, ట్రీట్మెంట్అని వివరణ ఇచ్చింది. జైలులో ఉన్న ఆయన 4 నెలలుగా ఆహారం తీసుకోలేదని, కేవలం పండ్లు మాత్రమే తింటున్నారని తెలిపింది. ఈ కారణంగానే ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స అందించాలని కోర్టు ఆదేశించిందని చెప్పింది. సత్యేందర్ జైన్ నరాల సమస్యతో బాధుపడుతున్నారని, ఆక్సీజన్ తీసుకోలేక ఇబ్బందిపడుతున్నారని పేర్కొంది. అందుకే ఆక్యుప్రెషర్ థెరపీ ద్వారా చికిత్స అందించినట్లు చెప్పుకొచ్చింది. సత్యేందర్ జైన్ రోజు గుడికి వెళ్లకుండా ఆహారం తీసుకోరని, జైలులో ఉన్న కారణంగా పండ్లపైనే ఆదారపడ్డారని ఆప్ వివరించింది. ఆయనకు చేసింది మసాజ్ కాదని, థెరపీ అని స్పష్టం చేసింది. #WATCH | CCTV video emerges of jailed Delhi minister Satyendar Jain getting a massage inside Tihar jail. pic.twitter.com/VMi8175Gag — ANI (@ANI) November 19, 2022 రూ.16 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్‌ను మే 30న అరెస్టు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. బెయిల్ కోసం రెండుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ నిరాశే ఎదురైంది. అయితే బీజేపీ విడుదల చేసిన సత్యేందర్ జైన్ మసాజ్ వీడియో పాతదని, ఇప్పటికే ఈ ఘటనతో సంబంధం ఉన్న జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. చదవండి: ఆప్ మంత్రికి తీహార్ జైల్లో మసాజ్.. వీడియో వైరల్ -
Cuddle Therapy: కష్టాలను తీర్చే కౌగిలింత..
లండన్: మనసుకు కష్టంగా ఉన్నప్పుడు అక్కున చేర్చుకునే మనిషి, ధైర్యాన్నిచ్చే ఓ భుజం, తలనిమిరి ప్రేమ పంచే స్పర్శ కావాలనిపిస్తుంది. కానీ పెరిగిన ఆధునికత మనిషిని ఒంటరి చేసింది. ఓదార్పునిచ్చేవారు, ప్రేమ పంచేవారు కరువయ్యారు. అలాంటివారికి తానున్నానంటున్నాడు యూకేలోని బ్రిస్టల్‌కు చెందిన ట్రెవర్ హూటన్ (ట్రెజర్). బాధల్లో ఉన్నవారికి కౌగిలినందిస్తున్నాడు. గంటకు రూ.7 వేల చొప్పున చార్జ్ చేస్తూ ‘కడిల్ థెరపీ’ పేరుతో సేవలందిస్తున్నాడు. ‘బాధను పంచుకునే మనిషిలేక మదనపడే వాళ్లుచాలా మంది ఉంటారు. అలాంటి చోట నా అవసరం ఉంటుంది. హగ్ అంటే.. కేవలం కౌగిలి మాత్రమే కాదు, అంతకుమించిన ఆత్మీయ స్పర్శ. నీకు నేనున్నాననే ధైర్యం, అభిమానం, ఓదార్పును ఓ స్పర్శద్వారా పంచడం’ అని చెబుతున్నాడు ట్రెజర్. పదేళ్ల కిందటినుంచే మానవ అనుబంధాల శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న ట్రెజర్.. ఈ బిజినెస్‌ను మే 2022 నుంచి ప్రారంభించాడు. కౌగిలింత అనగానే అభద్రతకు లోనయ్యేవాళ్లు, అపార్థం చేసుకున్నవాళ్లూ ఉన్నారు. అందుకే పూర్తిగా నాన్–సెక్సువల్ అని చెబుతున్నాడు. భారమైన మనసుతో తనదగ్గరకు వచ్చినవాళ్లు దాన్ని దించేసుకుని, సంతోషంగా వెళ్లిపోవడమే ట్రెజర్ మోటో అట. అంతేకాదు.. రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరి మధ్య వచ్చిన అపార్థాలను తొలగించి అనుబంధాన్ని పెంచే ‘కనెక్షన్ కోచింగ్’ కూడా ఇస్తానంటున్నాడు. ఇదీ చదవండి: ఐఏఎస్‌కు సిద్ధమవుతూ.. అజ్ఞాతంలోకి -
దర్జాగా పడుకోండి.. ఫోన్ చూస్తూ, పేపర్ చదువుతూ బరువు తగ్గండి! ఎలాగంటారా?
‘ఏ కష్టం లేకుండా వచ్చిపడిన ఊబకాయాన్ని తగ్గించాలంటే మాత్రం కచ్చితంగా కష్టపడాలి’ అనేది ఒకప్పటి మాట. ఎంత సులభంగా పెరిగారో అంతే సౌఖ్యంగా తగ్గొచ్చంటోంది ఇప్పటి టెక్నాలజీ. సౌఖ్యమంటే అట్టాంటి ఇట్టాంటి సౌఖ్యం కాదు. దర్జాగా పడుకుని, ఫోన్ లేదా పేపర్ చూస్తూ హ్యాపీగా బరువు తగ్గొచ్చన్న మాట. ఈ స్టీమింగ్ బాడీ బ్లాంకెట్.. ఫార్ ఇన్ఫ్రారెడ్ డిజిటల్ హీట్ థెరపీతో బాడీలోని కొవ్వుని ఇట్టే కరిగించేస్తుంది. అదనంగా శరీరానికి సరికొత్త నిగారింపునూ అందిస్తుంది. దీన్ని ఒకవైపు నుంచి ఓపెన్ చేసి, చిత్రంలో ఉన్న విధంగా ఉపయోగించాలి. చేతులు బయటికి తీసుకునేందుకు ఇరువైపులా రెండు జిప్పులు ఉంటాయి. చదవండి: వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులు... ముప్ఫై నిమిషాలు ఈ బ్లాంకెట్‌లో రెస్ట్ తీసుకుంటే.. ఒక గంట స్విమ్మింగ్‌కు, ఒక గంట రన్నింగ్‌కు.. ఒక గంట సైకిల్ రైడ్‌కు.. వంద సిటప్స్కు.. లేదా 30 నిమిషాల యోగాకు సమానమట. ఈ బ్లాంకెట్ ఇన్ఫ్రారెడ్ లేయర్, వాటర్ ప్రూఫ్ లేయర్, షీల్డ్ లేయర్, థర్మల్ లేయర్, టెంపరేచర్ కంట్రోల్ లేయర్, హీట్ లేయర్, ఇన్సులేషన్ లేయర్ వంటి 7 సమర్థవంతమైన లేయర్స్‌తో రూపొందింది. దీన్ని వినియోగించే సమయంలో.. ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుందని గుర్తించిన వెంటనే.. ఒక నిమిషం పాటు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ థెరపీని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కొవ్వు తగ్గి.. చర్మకణాలు పునరుత్తేజం చెంది, రోగనిరోధక శక్తి, జీవక్రియ మెరుగుపడతాయి. అలసట తగ్గుతుంది. చిత్రంలోని బ్లాంకెట్‌తో పాటు ఇంటెలిజెంట్ కంట్రోల్ బాక్స్, ఒక రిమోట్ లభిస్తాయి. బాక్స్ మీద టైమ్ డిస్ప్లే, స్టార్ట్ బటన్, టెంపరేచర్ కంట్రోల్, టెంపరేచర్ డిస్ప్లే, సేఫ్టీ స్విచ్.. ఇలా సెట్టింగ్స్ ఉంటాయి. ఈ డివైజ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇదొక హోమ్ స్పా లాంటిది. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు.. తీరిక దొరికినప్పుడు ఆన్ చేసుకుని ఓ వైపు సేదతీరుతూనే ఇంకో వైపు కొవ్వు కరిగించుకోవచ్చు. అందంతో పాటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. -
ఒత్తిడిని తగ్గించుకోవడానికి... వాడండి.. ఈ అరుపు మాత్రలు
Scream To Release Stress: డాక్టర్ రాసే మాత్రలు వేరు. మనం వాడుకోవాల్సిన మాత్రలు కూడా ఉంటాయి. అమెరికాలో స్త్రీలు ఇప్పుడు ‘స్క్రీమ్ గేదరింగ్స్’లో పాల్గొంటున్నారు. అంటే ఒక మైదానంలో చేరి పెద్ద పెద్దగా అరిచి తెరిపిన పడుతున్నారు. ఎందుకు? ఒత్తిడి దూరం చేసుకోవడానికి. మన దేశంలో కూడా కోవిడ్ వల్ల, కుటుంబ సభ్యుల అనారోగ్యాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల స్త్రీలు లోలోపల వొత్తిడి పేరబెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు. డాబా మీదకో, గ్రౌండ్లోకో వెళ్లి ‘స్క్రీమ్’ చేయడం ఒత్తిడికి ఒక మందు. ‘లాఫింగ్ థెరపీ’లా ఈ థెరపీ ఇప్పుడు అవసరమే సుమా. సంప్రదాయ చైనీయ వైద్యంలో కొండ చిటారుకో, ఏదైనా ఏకాంత ప్రదేశానికో వెళ్లి పెద్ద పెద్దగా అరవడం కూడా ఒక ఆరోగ్య సాధనం అని నమ్ముతారు. చైనా సంగతేమో కాని అమెరికాలోని స్త్రీలు మా అసహనాన్ని పెద్దగా అరచి పారదోలుతాం అని ఇటీవల ఏదో ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్లోనో పార్క్‌లోనో ‘స్క్రీమ్ గేదరింగ్స్’ నిర్వహిస్తున్నారు. అంటే ఒక పదీ పదిహేను నిమిషాల సేపు పెద్దగా అరిచి తమ మనసులో, శరీరంలో ఉన్న అలజడిని తగ్గించుకోవడం అన్నమాట. దానికి కారణం గత రెండేళ్లుగా కోవిడ్ వారిపై ఏర్పరుస్తున్న ఒత్తిడిని వాళ్లిక సహించలేని స్థాయికి చేరడమే. కోవిడ్‌ను పూర్తిగా నిర్మూలించే వాక్సిన్ ఇంకా రాకపోవడం, వాక్సిన్ వేసుకున్నా దాని బారిన పడుతూ ఉండటం, చంటి పిల్లలకు ఇంకా వాక్సిన్ లేకపోవడం, కోవిడ్ వల్ల అందరూ ఇంట్లో ఉండిపోవాల్సి రావడం, ఉద్యోగాలు ఊడటం, రెట్టింపు పని చేయాల్సి రావడం... ఇవన్నీ పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా గూడు కట్టుకుని పోతున్నాయి. అవి అలాగే లోపల సాంద్రపడటం ప్రమాదం అని నిపుణులు అంటారు. వొత్తిడిని సాటివారితో పంచుకుని రిలీఫ్ పొందాలి. కాని సాటివారు కూడా అలాంటి వొత్తిడిలో ఉంటే ఏమిటి చేయడం. ‘పదండి... అందరం కలిసి అరుద్దాం’ అని అమెరికాలోని స్త్రీలు స్క్రీమ్ థెరపీని సాధన చేస్తున్నారు. అయితే ఈ అరుపులు ఇతరులు వినకపోవడమే మంచిది. పెద్దగా గట్టిగా అరిచే మనిషిని చూడటం, వినడం ఎదుటి వారికి ఆందోళన కలిగించవచ్చు. అందుకే వీలైనంత ఏకాంత ప్రదేశంలో వీటిని సాధన చేయడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. యోగాలో కూడా ‘జిబ్రిష్’ వంటివి సాధన చేయిస్తుంటారు. అంటే ఒక ఐదు పది నిమిషాలు గొంతులో నుంచి ఏ పిచ్చి అరుపులు వస్తే ఆ అరుపులను అలౌ చేస్తూ వెళ్లడం. దీని వల్ల సబ్కాన్షియస్ మైండ్‌లో గూడు కట్టుకుని ఉన్న గాఢమైన భావాలు వదిలిపోతాయని చెబుతారు. మరో పద్ధతి ‘ట్రీ షేక్’. అంటే ఒక చెట్టు గాలికి ఎలా గలగలలాడిపోతుందో అలా మూడు నాలుగు నిమిషాలు నిటారుగా నిలబడి ఒళ్లంతా గలగలలాడించాలి (కదిలించాలి). దాని వల్ల ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు అంటారు. మన దేశంలో అమ్మలు, పెద్దవాళ్లు ఏదైనా ఒత్తిడి పెరగడం వల్ల గట్టిగా తిట్టడం, అరవడం చూస్తూ ఉంటాం. అది ఒక రకంగా స్ట్రెస్ నుంచి దూరమవడమే. ఎన్నో చేదు సంఘటనలు, అయిష్టమైన పరిణామాలు చూసిన స్త్రీలు ‘గయ్యాళి’ ముద్రతో ఉండటం కూడా మన సమాజంలో ఉంది. నిజానికి అదంతా లోపలి ఒత్తిడికి ఒక బయటి ప్రతిఫలనం. ఆ ఒత్తిడి ఏమిటో కనుక్కుని దూరం చేయగలిగితే వారు కూడా శాంత స్వభావులు అవుతారు. గత రెండేళ్లుగా ఇళ్లల్లో ఉగ్గ పట్టుకుని ఉన్న స్త్రీలు ఏ మేరకు ఒత్తిడిలో ఉన్నారో కుటుంబం మొత్తం పట్టించుకోవాలి. ఇవాళ రేపూ అంటూ కోవిడ్ ముగింపు వాయిదా పడే కొద్దీ వారి మనసులో ఎలాంటి భావాలు చెలరేగుతున్నాయో కూడా పరిశీలిస్తూ ఉండాలి. వారు విసుక్కుంటూ ఉంటే, ఒక్కోసారి పని వైముఖ్యం చూపుతుంటే కుటుంబం సంపూర్ణంగా ఆ మూడ్స్‌ను అర్థం చేసుకోవాలి. మగవాళ్లు స్ట్రెస్‌ను తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు. వారికి కనీసం బయట ఒకరిద్దరు స్నేహితులను కలిసే వీలు ఉంటుంది. స్త్రీలు ఇళ్లకే పరిమితమయ్యే అనివార్య పరిస్థితులు ఈ రెండేళ్లలో వచ్చాయి. అందుకే వారి మానసిక ఆరోగ్యం కూడా శ్రద్ధ పెట్టక తప్పదు. మంచి నిద్ర, ఉల్లాసం, ఆశావహమైన భవిష్యత్తు కనిపించకనే తాము పార్కుల్లో చేరి కేకలేస్తున్నాం అంటున్నారు అమెరికా వనితలు. ‘మా మీద మేము అరుచుకోలేము. కుటుంబం మీద అరవలేము. పిల్లల చదువు సరిగ్గా సాగకపోవడం మాకు చాలా వొత్తిడి కలిగిస్తోంది. వాళ్ల మూడ్స్ కూడా మాకు కష్టమే. మాకు వొత్తిడిగా ఉంది. అందుకే ఏడ్చి తెప్పరిల్లే బదులు అరిచి తెరిపిన పడుతున్నాం’ అని బోస్టన్‌లో స్క్రీమ్ థెరపీలో పాల్గొన ఒక గృహిణి అంది. ‘కోపం పోవడానికి పంచింగ్ బ్యాగ్‌ను పంచ్ చేయడం ఎలాగో ఒత్తిడి పోవడానికి ఇలా పెద్దగా అరవడం అలాగా’ అని కొందరు నిపుణులు అంటున్నారు. యుద్ధ సైనికుడు గెలుపు నినాదం ఇచ్చినట్టు, కుంగ్‌ఫూ ఫైటర్ పంచ్ ఇచ్చే ముందు అరిచినట్టు, కింగ్ కాంగ్ శత్రువు మీద దాడి చేసే ముందు గుండెలు చరుచుకున్నట్టు మామూలు మనుషులు కూడా ఏదో ఒక పార్కులో చేరి తమ లోపల ఉన్న ఒత్తిడి అనే శత్రువును ఈ పద్ధతుల్లో ఓడించవచ్చని నిపుణులు అంటున్నారు. స్క్రీమ్ థెరపీ వల్ల ప్రయోజనం ఎలా ఉన్నా దాని వంకతో తమ లాంటి కొంతమంది స్త్రీలతో ఏదో ఒక మేరకు కొత్త స్నేహం, సంభాషణ కూడా ఒత్తిడి తగ్గిస్తాయి. కాబట్టి కొత్త మార్గాలు వెతకండి. ఆరోగ్యంగా ఉండండి. ఒత్తిడిని ఒంట్లో నుంచి ఖాళీ చేయండి. -
వెరైటీ థెరపీలు... విలువైన ప్రయోజనాలు!
రాతి పనిముట్ల వాడకం మొదలెట్టడంతో మానవ పరిణామ క్రమంలో నూతనాధ్యాయం ఆరంభమైంది. క్రమంగా చక్రం, నిప్పు కనుగొనడం ఈ పరిణామ క్రమాన్ని మరింత వేగవంతం చేసింది. జంతు లక్షణాల నుంచి బయటపడ్డ మనిషి ఇతర జంతువుల్లాగా కాకుండా తమలో తాము సంభాషించుకోవడానికి భాషను సృష్టించాడు, అలాగే తాను చూసిన వాటిని పాతరాతియుగం నాటి మానవుడు కొండగుహల్లో చిత్రీకరించడం ఆరంభించాడు. క్రమంగా సంచార జీవనం వదిలి స్థిరజీవనం దిశగా ఆదిమ సమాజాలు పయనించడంతో మనిషిలో మరిన్ని కళలు బయటపడ్డాయి. భాష నుంచి సంగీతం, దానికనుగుణంగా నాట్యం వంటి అనేక కళలు మానవ జీవితంలోకి ప్రవేశించాయి. తర్వాత కాలంలో కళారూపాలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఇలాంటి కళా రూపాలు కేవలం మానసికోల్లాసానికే కాదని, వీటిని సరిగా ఆచరిస్తే ఆరోగ్యం కూడా మెరుగవుతుందని మనిషి కనుగొన్నాడు. ఆధునిక యుగంలో కూడా ఈ కళా రూపాలను ఉపయోగించి పలు దీర్ఘకాల వ్యాధులను, చికిత్స దొరకని రోగాలను ఉపశమింపచేసే థెరపీలు అనేకం ఉన్నాయి. కళలే కదా అని కొట్టి పారేయకుండా ఈ థెరపీలతో పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నది నిపుణుల అభిప్రాయం. ఆధునిక వైద్యం ఈ థెరపీలను సమర్థించదు కానీ వీటి వాడకాన్ని వద్దనలేదు. సైడ్ ఎఫెక్టులు ఉండని కొన్నిరకాల ప్రత్యామ్నాయ థెరపీల గురించిన వివరాలు... పెట్ థెరపీ మనిషి జీవితంలో జంతువులను మచ్చిక చేసుకోవడం ఎంతో కలిసివచ్చింది. దీనివల్ల నాగరికతలు దూసుకుపోయాయి. మనిషి మనసును అర్ధం చేసుకొనే పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు మధ్య ఒక మానసిక బంధం ఏర్పడుతుంది. దీని ఆధారంగా యానిమల్ అసిస్టెడ్ లేదా పెట్ థెరపీ పుట్టుకొచ్చింది. సాధారణంగా మనిషి పెంచుకునే కుక్క, పిల్లి, గుర్రం, పంది, పక్షులతో ఈ థెరపీ ప్లాన్‌ను రూపొందిస్తారు. ఆటిజం, బిహేవియరల్ సమస్యలు, మెంటల్ కండీషన్స్, స్క్రీజోఫ్రీనియా ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే పెట్ అలెర్జీ ఉన్నవారు, జంతువులంటే అసహ్యం ఉన్నవారు ఈ థెరపీకి దూరంగా ఉండడం మంచిది. ఈ విధానంలో మన పెంపుడు జంతువుతో మనకు ఎమోషనల్ బంధం బలపడేలా థెరపిస్టు చేస్తాడు. దీనివల్ల మనిషి మనసులో సున్నితత్వం మెరుగుపడుతుంది. ఇతర జీవులపై ప్రేమ పెరుగుతుంది. దీనివల్ల మెదడులో కరుణ, జాలి భావాలకు ప్రాధాన్యం పెరిగి మానసికంగా బలోపేతం అవుతాడు. ఈ థెరపీలో కేవలం వైయుక్తిక విధానమే ఉంటుంది. గ్రూప్ థెరపీ ఉండదు. మ్యూజిక్ థెరపీ శిశుర్వేత్తి పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః అన్నాడు ప్రవచనకారుడు. సంగీతానికి పరవశించని జీవం ఉండదన్నది అందరికీ తెలిసిన సంగతే! అలాంటి సంగీతాన్నే ఆధారంగా చేసుకొని స్వాంతన చేకూర్చేది మ్యూజిక్ థెరపీ. పిల్లలో, పెద్దల్లో ఎదురయ్యే యాంగై్జటీ, డిప్రెషన్, నొప్పులు, ఆటిజం, ఆల్జీమర్స్, డిమెన్షియా, మెదడుకు దెబ్బతగలడం తదితర అనేక రకాల ఇక్కట్లకు ఈ థెరపీ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతారు. ఇందులో రెండు రకాలున్నాయి. వినడం(రెసెప్టివ్ విధానం), పాడడం(యాక్టివ్ విధానం)లో మనకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. భారతీయ సంస్కృతిలో సంగీతానికి ప్రాధాన్యత మెండు. వివిధ రకాల మానసిక స్థితులకు తగినట్లు సంగీతంలో వివిధ రాగాలను సృష్టించారు. ఉదాహరణకు కరుణ రసాన్ని గాంధారం ప్లస్ నిషాధం అలాగే గాంధారం ప్లస్ షడ్జమం శౌర్య రసాన్ని ప్రేరేపిస్తాయి. రస, రాగ సమ్మిళితంతో మానసికోల్లాసమేకాకుండా, ఆరోగ్యం కూడా లభిస్తుందని భారతీయులు గుర్తించారు. పాశ్చాత్య సంగీతంలో కూడా ఆయా స్థితులకు తగ్గట్లు నోట్స్‌ను సృష్టించారు. ఇలా పనిచేస్తుంది... మనిషి పుట్టినప్పటి నుంచి చివరివరకు శబ్దమయ జీవితం గడుపుతాడు. శబ్దాలను క్రమపద్ధతిలో పేరిస్తే సంగీతమవుతుంది. సంగీతం వినడం ఒకలాగా, సొంతంగా పాడడం ఒకలాగా ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు మతిమరుపు, అల్జీమర్స్ లాంటి వ్యాధులతో బాధపడేవాళ్లకు గతంలో విన్న సంగీతం కారణంగా మెదడులో గత న్యూరాన్లకు ప్రేరణ కలుగుతుంది. అలాగే సొంతంగా హమ్మింగ్ లేదా పాడుతూ పనిచేయడం శ్రమ తెలియనివ్వదు. మ్యూజిక్ థెరపీ చేసేవాళ్లు ముందుగా క్లయింట్ కండీషన్ బట్టి ఎలాంటి విధానం అవలంబించాలో నిర్ణయించుకుంటారు. అలాగే క్లయింట్‌కు మ్యూజిక్‌లో, సంగీత వాయిద్యాల్లో ప్రవేశం ఉన్నట్లయితే అందుకు తగిన విధానాన్ని సూచిస్తారు. అలాగే క్లయింట్ అవసరాన్ని బట్టి గ్రూప్ థెరపీని లేదా వైయుక్తిక సిట్టింగ్‌ను సూచిస్తారు. శ్రావ్య సంగీతం వినేప్పుడు శరీరంలోని రక్తపోటు, హదయ స్పందన రేటు నెమ్మదిస్తాయి. ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుంది. ఉద్రేకపూరిత సంగీతం వింటే ఈ మార్పులు రివర్సులో జరుగుతాయి. పేషెంటు కండీషన్‌ను బట్టి థెరపిస్టు సంగీతాన్ని ఎంచుకుంటాడు. ఒక పాటను విన్నప్పుడు, పాడినప్పుడు మనసులో కలిగే స్పందనలను గుర్తించేలా థెరపిస్టులు ప్రేరేపిస్తారు. తద్వారా ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైన టెక్నిక్స్‌ను వాడతారు. ఆర్ట్ థెరపీ ఆదిమమానవ కాలం నుంచి మనిషిలో ఉండే క్రియేటివిటీ చిత్రాల రూపంలో బయటపడుతోంది. మనలోని సైకలాజికల్, ఎమోషనల్ ఆలోచనలకు ఒక రూపాన్నివ్వడంలో చిత్రలేఖనం ఉపయోగపడుతుంది. దీన్ని ఆధారంగా తీసుకొని ఆర్ట్ థెరపీ అభివృద్ధి చేశారు. ఇందులో చిత్రలేఖనం(పెయింటింగ్), రేఖాలేఖనం(డ్రాయింగ్), రంగులద్దడం(కలరింగ్), శిల్పాలు చెక్కడం(స్కల్ప్టింగ్)వంటివి మనిషిలో గూడుకట్టుకున్న భావాలను డీకోడ్ చేసేందుకు ఉపయోగపడతాయి. ఏ వయసు వారిలోనైనా ఆత్మస్థైర్యం పెంచడానికి, వ్యసనాలను దూరం చేయడానికి, ఒత్తిడి నివారణకు, యాంక్జైటీ, డిప్రెషన్ తగ్గించడానికి ఆర్ట్ థెరపీని వాడతారు. పైనవాటిలోలాగానే ఇందులో కూడా గ్రూప్ థెరపీ, వైయుక్తిక థెరపీ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి థెరపిస్టు సరైన విధానం సూచిస్తాడు. ఆర్ట్ థెరపీ అంటే మనలో ఆర్టిస్టిక్ ట్యాలెంట్ ఉండాల్సిన పనిలేదు. ఇది మన అంతఃచేతనలోని ఆలోచనలను బయటపెట్టడానికి చేసే ప్రయత్నమని గుర్తించాలి. థెరపీలో క్లయింట్ ఫీలింగ్స్‌ను థెరపిస్టు గమనించి తగిన టెక్నిక్స్ నేర్పుతాడు. వివిధ రంగుల సమ్మిళితాలను చిత్రీకరించడం, చూడడం వంటివి మనిషి మనసును తేటపరుస్తుందని అమెరికన్ ఆర్ట్ థెరపీ అసోసియేషన్ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మానవతాత్మక థెరపీ ప్రపంచంలో జరిగే సంక్షోభ కారణాలను గుర్తించి నివారించడానికి యత్నించడమే మానవత్వం. సాటివారి బాధను అర్థం చేసుకున్నవాడే అసలైన మానవుడు అన్న సూక్తి ఆధారంగా హ్యూమనిస్టిక్ థెరపీ ఆరంభమైంది. మనం చూసే, వినే, అనుభవించే వాటిని మరింతగా అర్థం చేసుకోవడంలో ఈ థెరపీ ఎంతో పయ్రోజనకారి. ఆత్మనూన్యత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధలు పడుతుండడం, ఇతరులతో సరైన సంబంధాలు లేకపోవడం, సున్నిత భావనలకు స్పందించకపోవడం వంటి పరిస్థితుల్లో ఈ థెరపీ ఉపయోగపడుతుంది. జీవితానికి అర్థం చెప్పడం ద్వారా మానవ జీవిత విలువను క్లయింట్‌కు థెరపిస్టు తెలియజేస్తాడు. జీవన విలువ తెలిసిన తర్వాత ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన మనసుకు రాదు. అదేవిధంగా సర్వమానవ సౌభ్రాతృత్వ దృష్టి అలవడుతుంది. నెగిటివ్ జడ్జిమెంట్ చేసే గుణం తొలగిపోతుంది. ఇది ఎక్కువగా థెరపిస్టుకు, క్లయింట్‌కు మధ్య సంభాషణల ద్వారా జరుగుతుంది. క్లయింట్ ఆలోచనా విధానంలో లోపాలను సున్నితంగా ఎత్తి చూపడం, వాటిని సరైన దారికి మళ్లించడం, ఎదుటివారిని నొప్పించకుండా సంభాషించడాన్ని అలవాటు చేయడం ద్వారా క్లయింట్‌ను థెరపిస్టు సరైన మార్గంలోకి తీసుకుపోతాడు. దీనివల్ల క్లయింట్ క్రమంగా తనతో, ఇతరులతో సత్సంబంధాలు పెంచుకుంటాడు. డ్యాన్స్ థెరపీ పదంతో కలిసి కదం తొక్కినప్పుడు శరీరానికి నూతనోల్లాసం కలుగుతుంది. దీని ఆధారంగా డ్యాన్స్ థెరపీ ఆరంభమైంది. అందుకే ఆధునిక కాలంతో దీన్ని అనేక మొండి వ్యాధులకు స్వాంతనకోసం వాడుతున్నారు. నొప్పులు, ఒత్తిళ్లు, మానసిక చింత, కుంగుబాటు, కండరాల్లో బాధ, స్ట్రెస్, ఊబకాయం తదితర పలు ఇబ్బందులకు ఈ థెరపీ ఉపయోగపడుతుంది. కరోనా కాలంలో పిల్లల్లో పెరిగిన ఒత్తిడి తగ్గించడంలో దీని పాత్ర అమోఘమని అమెరికాకు చెందిన స్టెస్ర్ల్యాబ్ పేర్కొంది. సాంకేతికత పెరిగి శారీరక శ్రమ తగ్గుతూ వస్తున్న ఈ రోజుల్లో నృత్య సాధనతో శరీరానికి తగినంత వ్యాయామం కూడా లభిస్తుంది. డ్యాన్స్ థెరపీతో అటు మానసిక, ఇటు శారీరక ప్రయోజనాలు కలుగుతాయన్నది నిపుణుల మాట. నృత్యాల్లో అభినయించే ముద్రలు, స్టెప్పులు మూవ్మెంట్ థెరపీలో కీలక పాత్ర పోషిస్తాయి. దీన్ని క్రమపద్ధతిలో పాటించడం వల్ల శరీరంలో ఒక రిథమ్ పెరగడంతోపాటు ఆత్మవిశ్వాసం మెరుగుపడడం గమనించవచ్చు. చిన్నపిల్లలకు అలవాటు చేయడం వల్ల వారి మానసిక, శారీరకోన్నతికి తోడ్పాటు లభిస్తుంది. ఇందులో కూడా గ్రూప్, వైయుక్తక థెరపీలుంటాయి. మన అవసరాన్ని బట్టి కావాల్సిన విధానాన్ని థెరపిస్టు సూచిస్తాడు. యోగాలో జరిగినట్లే డ్యాన్స్ థెరపీలో శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వల్ల వంట్లో ఉండే వేగస్ నరం చురుగ్గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని అతిపెద్ద నరం. దీని ప్రభావం పలు జీవ క్రియలపై ఉంటుంది. దీన్ని చురుగ్గా ఉంచడమంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే! (చదవండి: అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్.. చూపు తిప్పుకోలేరు!) వినూత్న థెరపీలను ఎంచుకోవడమే కాదు, వాటిని ఆచరించే చిత్తశుద్ధి కూడా అవసరం. లేకుంటే ఎన్ని థెరపీలు చేపట్టినా ఏ ప్రయోజనం ఉండదు. అలాగే నకిలీలను ఎంచుకోకుండా సర్టిఫైడ్ థెరపిస్టుల వద్దకు వెళ్లడం మరువకూడదు. ఇప్పుడు ఇండియాలో పలు యూనివర్సిటీలు, కాలేజీలు ఇలాంటి థెరపీల్లో డిగ్రీలను ఆఫర్ చేస్తున్నాయి. అందువల్ల ఇలాంటి థెరపిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అవగాహన, అనుభవం ఉన్న థెరపిస్టు వద్ద తీసుకునే థెరపీ ఎప్పటికీ ప్రయోజనమే! – శాయి ప్రమోద్ (చదవండి: ఈ కాఫీ తాగితే బరువు తగ్గొచ్చు.. ఇంకా) -
కరోనా వార్డులో డాన్స్ థెరపీ
-
'కౌ'గిలింత
ఆవు మనకు గోమాత.కాని ఆవు యాంగ్జయిటీని తగ్గించే డాక్టర్ కూడా అని హాలెండ్వాసులే ముందు కనిపెట్టి దశాబ్దం నుంచి‘కౌ హగింగ్’ను సాధన చేస్తున్నారు. ఆవును కావలించుకుని కొంతసేపు గడిపితే యాంగ్జయిటీ పోతుందనివారు చెబుతున్న అనుభవం ఇప్పుడు మన దేశానికి కూడా వ్యాపించింది. కోవిడ్ సమయంలో ఆందోళనలు పోగొట్టుకోవడానికికౌ హగింగ్ను ప్రయత్నిస్తున్నారు. ‘కో నఫ్లెన్’ అంటారట డచ్‌లో ‘ఆవు కావలింత’ని. మన దేశంలో ఆవును గోమాతగా తలిచే వారుంటే ఆ దేశంలో ఆవును ఒక డాక్టర్‌గా చూసే వారున్నారు. ఆవును కావలించుకుని కాసేపు గడిపితే, ఆవును నిమిరితే, ఆవుతో బాధలు చెప్పుకుంటే, ఆవు నిర్మలమైన కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే, ఆవుకు ప్రేమ ఇస్తే, ఆవు నుంచి ప్రేమ పొందితే మనసు, శరీరం స్వస్థత పొందుతాయని కౌ హగింగ్ని ఒక థెరపీగా వారు భావిస్తారు. పదేళ్ల నుంచి ఉన్న సాంత్వన వైద్య భావన ఇప్పుడు అమెరికాకు మిగిలిన దేశాలకు కూడా ఒక నమ్మకంలా విస్తరిస్తోంది. అమెరికాలో అయితే కౌ హగింగ్ కోసం గోశాలలు నిర్వహిస్తున్నారు. కొన్ని గోశాలల్లో ఒక గోవును పట్టుకుని కూచోవడానికి దాదాపు 75 డాలర్లు (5 వేల రూపాయలు) వసూలు చేస్తున్నారు. అయితే అక్కడి గోశాలలు చాలా శుభ్రంగా, వాసన లేకుండా మెయింటెయిన్ చేస్తున్నారు. గరిక మీద తిరిగే ఆవులను అక్కడ చూడవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి కనుక కౌగిలింత మంచి ఫలితాలిస్తుందని సైకియాట్రిస్ట్‌లు కూడా చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన సైకియాట్రిస్ట్ ‘పసిపిల్లలనో, గోవు, శునకం వంటి పెంపుడు జంతువులనో కావలించుకుంటే ఆక్సీటోసిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు విడుదలయ్యి వత్తిడి కలిగించే కార్టిసోల్ హార్మోన్‌ను అదుపు చేస్తాయి’ అంటున్నారు. భారతదేశంలో విశ్వాసాల వల్ల కాని విధానాల వల్లగాని ప్రతి జీవి నుంచి, జీవజాలం నుంచి స్వస్థత పొందడానికే చూస్తారు. పశువులున్న వారి ఇళ్లల్లో పశువులతో అనుబంధం వల్ల పొందే ఆనందం తెలుసు.. -
సాల్ట్..హాల్ట్
కాలుష్యభూతం నగరాల్ని వణికిస్తూ సృష్టిస్తున్న సమస్యల్లోశ్వాసకోశ వ్యాధులే ప్రధానమైనవి. దగ్గో, జలుబో, మరొకటో... సిటిజనుల శ్వాసకోశ సమస్యలు ఒకప్పుడు వృద్ధులు, చిన్నారులకే పరిమితమైనా ఇప్పుడు యువతలోనూ సాధారణమైపోయాయి. వీటిలో కొన్ని మందులకూ లొంగని పరిస్థితి ప్రత్యామ్నాయ మార్గాలను మనకు పరిచయం చేస్తోంది. అలాంటిదే సాల్ట్ రూమ్ థెరపీ. శ్వాస కోస వ్యాధులతో పాటు మరిన్ని ఆరోగ్యలాభాలనూ ఇది అందిస్తుందంటున్నారు సాల్ట్రూమ్ నిర్వాహకులు. సాక్షి, సిటీబ్యూరో: వరల్డ్ వార్ సమయంలో పోలండ్‌లో సైనికులు అనుకోకుండా సాల్ట్ గుహలో దాక్కుటారు. అప్పుడు తమ శరీరంలో కలిగిన ఆరోగ్యకరమైన మార్పులతో వారు సాల్ట్ రూమ్స్ వృధ్ది చేయడం ప్రారంభించారట. సాల్ట్ థెరపీని యూరప్ దేశాల్లో హెలో థెరపీ అని పిలుస్తారు. సాల్ట్‌కు గ్రీకు పదం హెలో. ఇప్పటికే యూరప్‌తో పాటు విదేశాల్లో మంచి ప్రాచుర్యంలో ఉన్న ఈ థెరపీ ఇటీవలే మన దేశానికి కూడా వచ్చింది. ముంబై, బెంగుళూర్ తర్వాత ఇటీవలే నగరంలోనూ సాల్ట్రూమ్స్ ఏర్పాటు షురూ అయింది. ఫీల్ తెలుస్తుంది... క్లయింట్స్ వచ్చి క్లైమేట్ కంట్రోల్ రూమ్‌లోకి ఫుట్‌వేర్ లేకుండా, హెడ్ గార్డ్‌తో వెళ్లి రిలాక్స్‌గా కూర్చున్న తర్వాత హెలో జనరేటర్ మెషిన్ ద్వారా రూమ్‌లోకి సాల్ట్‌ని స్ప్రెడ్ చేస్తారు. తద్వారా ఊపిరి పీల్చినప్పుడు సదరు ఉప్పు కణాలు లోపలికి ప్రవేశిస్తాయి. ఆ గదిలో ఎటువంటి ప్రత్యేక పరిమళం ఉండదు. శరీరానికి చెమట పట్టదు. అయినప్పటికీ సాల్ట్ శరీరంలో ప్రవేశించిన తర్వాత కలిగే వ్యత్యాసం మనకు తెలుస్తుంది. ఇది మనం ఆహారంలో ఉపయోగించే సాల్ట్ లాంటిది కాదు కాబట్టి బీపీ ఉన్నప్పటికీ ఈ సాల్ట్ థెరపీకి అదేమీ అడ్డంకి కాదు. ప్రతి సెషన్ 55 నుంచి 60 నిమిషాల పాటు పూర్తయ్యాక స్నానం వంటివి ఏమీ చేయనక్కర్లేదు. తిన్నగా మన పనులకు మనం వెళ్లిపోవచ్చు. శ్వాసకోశ సమస్యలకు చెక్... సాల్ట్ రూమ్ థెరపీ పూర్తి సహజమైనదని, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది స్వస్థత చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు. స్వల్ప పరిమాణంలో గాలి నిరంతరం సరఫరా అవుతున్న గదిలో కూర్చున్న తర్వాత గాలిలో కలిసే ఉప్పు రేణువులు నాసిక ద్వారా లోపలికి వెళ్లిన అడ్డంకులను తొలగిస్తాయని బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయని అంటున్నారు. మ్యూకస్ సాధారణంగా ప్రయాణించేలా చేసి అస్తమా ను నియంత్రిస్తాయని చెబుతున్నారు. అస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనసైటిస్, అలర్జిక్, చర్మ వ్యాధులకు ఇది ఒక ప్రత్యామ్నాయ చికిత్సగా పనిచేస్తుంది. హై ఇంటెన్సిటీవర్కవుట్ చేసినా... ఫిట్నెస్ ఇంట్రెస్ట్ అధికంగా ఉన్నవాళ్లు హై ఇంటెన్సిటీ వర్కవుట్ చేసి అలసిపోయిన శరీరం మళ్లీ తిరిగి యథాతధ స్థితికి రావడానికి ఇది ఉపకరిస్తుందని సాల్ట్ రూమ్ నిర్వాహకులు చెప్పారు. అలాగే గర్భవతులకు, మారథాన్ రన్నర్స్, క్రీడాకారులకు మాత్రమే కాకుండా సింగర్స్‌కి తమ గొంతు సమస్యల నివారణకు... ఇలా విభిన్న రకాలుగా ఇది ఉపకరిస్తుందని అంటున్నారు. వెల్నెస్కు సాల్ట్ స్పా.. ఎంబిఏ చేసి ఆ తర్వాత ఫిట్నెస్ రంగంలోకి వచ్చాను. అయితే ఇప్పుడు ఫిట్నెస్ కూడా వెల్నెస్లో భాగమైపోయింది... సాల్ట్ థెరపీ గురించి తెలిసి మన సిటీలో లేదని ఇక్కడ ఏర్పాటు చేశాం. ప్రతి వాతావరణం, ప్రతి వయసుకూ ఈ థెరపి వల్ల ఉపయోగమే. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అద్భుతమైన పరిష్కారంగా ఇది పనిచేస్తుంది. –మిథాలి, సాల్ట్ వరల్డ్ -
కేన్సర్ చికిత్సలో కాంబినేషన్ థెరపీ
సాక్షి, సంగారెడ్డి: కేన్సర్ మహమ్మారిని నిర్మూలించేందుకు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు చేసిన పరిశోధనల్లో ముందడుగు పడింది. కేన్సర్ చికిత్స కోసం సమర్థవంతమైన కాంబినేషన్ థెరపీని అభివృద్ధి చేశారు. కేన్సర్‌కు ఎలాంటి మందులు లేకపోవడంతో చికిత్స ద్వారానే నిర్మూలించేందుకు తాము మెరుగైన చికి త్స కోణంలో పరిశోధనలు జరిపిన ట్లు ఐఐటీ హైదరాబాద్ బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్‌కుమార్ రెంగన్ తెలిపారు. యాంటీ కేన్సర్ ఏజెంట్‌ను ఉపయోగించి ఫొటోథర్మల్ థెరపీ (పీటీటీ), కీమోథెరపీ సినర్జెటిక్ కలయికను గుర్తించినట్లు వివరించారు. పరిశోధన వివరాలతో మంగళవారం ఐఐటీ హెచ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కాంబినేషన్ థెరపీపై ఐఐటీ బాంబే, కోల్‌కతా బోస్ విశ్వవిద్యాలయం సహకారంతో పరిశోధనలు నిర్వహించినట్లు డాక్టర్ అరవింద్‌కుమార్ రెంగన్ పేర్కొన్నారు. హోస్ట్ కణాలను నాశనం చేస్తారిలా.. ఫొటోథర్మల్ థెరపీలో కాంతిని వేడిగా మార్చే పదార్థం కణతి (గడ్డ) ఉన్న ప్రాంతానికే నేరుగా వెళ్తుందని.. తద్వారా హోస్ట్ కేన్సర్ కణాలను తొలగించడం, నాశనం చేయడం చాలా సులువవుతుందని అరవింద్‌కుమార్ రెంగన్ తెలిపారు. ఐఆర్ 780 ఇన్ఫ్రారెడ్ కాంతిని గ్రహించడంతో పాటు కణతి వద్ద ఉండే కేన్సర్ కణాలను చంపేస్తుందని పేర్కొన్నారు. ఐఆర్ 780 హోస్ట్ కేన్సర్ కణాలను నశింపజేసే ఆక్సిజన్ జాతులను ఉత్పత్తి చేస్తుందని పరిశోధన ద్వారా తెలుసుకున్నామన్నారు. -
ఆల్‌ఫ్రీ పేరుతో.. సరికొత్త మోసం
సాక్షి, గోదావరిఖని : ఆల్‌ఫ్రీ పేరుతో సరికొత్త మోసానికి తెరలేపింది ఓ ముఠా. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉచితంగా థెరపీ చేస్తామని ఎలాంటి రోగాన్ని అయినా నయం చేస్తామంటూ ప్రజలను నమ్మబలికించారు. కానీ థెరపీకి కావాల్సిన కిట్స్ కొంటే ఇంటికే వచ్చి థెరపీ చేస్తామన్నారు. ఆశపడి ప్రజలు రూ.20 వేల నుంచి 60 వేలు చొప్పున ఆడ్వాన్సులు చెల్లించి చికిత్సకు కావాల్సిన వస్తువులను కొన్నారు. థెరపీకి అవసరమైన మ్యాట్, స్టీమ్, స్టోన్స్‌లను భారీ ధరలకు విక్రయించి ప్రజలకు టోకరా ఇచ్చారు. థెరపీ ఉచితమేకదా అని ప్రజలకు కిట్స్‌ను కొన్నారు. కానీ రెండు రోజుల నుంచి ఆ సెంటర్ మూసి ఉండటంతోపాటూ ప్రచార బోర్డు తొలగించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ. 60 లక్షలు కాజేసి బోర్డు తిప్పేసినట్టు తెలుస్తోంది. -
గోదావరిఖనిలో ఉచితంగా థెరపీ పేరుతో మోసం
-
క్యాన్సర్ – చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు అన్నవి వయసు, క్యాన్సర్ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాల మీద ఆధారపడి ఉంటాయి. శరీర తత్వాన్ని బట్టి కూడా ఈ చికిత్స విధానాలు మారుతూ ఉంటాయి. సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు క్యాన్సర్‌కు నేడు సెల్ టార్గెటెడ్ థెరపీ, ఫొటోడైనమిక్, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటి అనేక కొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికి ఇవి ఖరీదైనవే అయినా మున్ముందు కొంతవరకు తగ్గవచ్చు. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి గుండె, మూత్రపిండాలు, కాలేయం పనితీరు సరిగా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ మందుల ప్రభావం మిగతా అవయవాల మీద కూడా ఉంటుంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు, నిర్ణీత కాల వ్యవధిలో బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలతో పాటు, ఆయా అవయవాల పనితీరును తెలుసుకునేందుకు అవసరమైన ఇతర పరీక్షలూ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే క్యాన్సర్ చికిత్సతో గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని, అవి ఫెయిల్యూర్ స్థితికి వెళ్లి, ఒక్కోసారి రోగి మరణించడం కూడా జరగవచ్చు. అందుకే క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై వీటి దుష్ప్రభావం ఉండకుండా చూసేందుకు, వీలైనంతగా తగ్గించేందుకు ఇప్పుడు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్‌ఏటీ రేడియేషన్ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. శస్త్రచికిత్స : రక్తానికి సంబంధించిన క్యాన్సర్ తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలను ముందే తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్‌ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా చేయగలుగుతున్నారు. ఆ సందర్భాలివే... ప్రివెంటివ్ సర్జరీ : పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ము క్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్‌స్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. ఇవన్నీ ముందే అనుమానించి జాగ్రత్తపడటానికి చేసే శస్త్రచికిత్సలు. క్యూరేటివ్ సర్జరీ : క్యాన్సర్‌ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో థెరపీ లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి. పాలియేటివ్ సర్జరీ : క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. ఒక్కోసారి ఇతర చికిత్సలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండేలా కూడా, ఈ తరహా సర్జరీలను... సపోర్టివ్ సర్జరీలుగా కూడా చేస్తారు. రిస్టోరేటివ్ (రీకన్స్ట్రక్టివ్) సర్జరీ: క్యాన్సర్ సర్జరీలలో క్యాన్సర్ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్నోడ్స్నీ, ఇతర కణజాలాన్నీ తొలగించడం జరుగుతుంది. కానీ బయటకు కనిపించే అవయవాలైన రొమ్ము, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, ఆయా అవయవాల పనితీరు మెరుగుపడటానికీ, దాంతోపాటు రోగుల్లో ఆత్మన్యూనతా భావం రాకుండా ఉండటానికి శరీరంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్నీ, ఎముకలనూ సేకరించి, అలాగే వాటికి ఇతర మెటల్, ప్లాస్టిక్స్‌తో చేసిన ప్రోస్థటిక్స్ను ఉపయోగించి, ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలను చేస్తారు. వీటిని వెంటనే చేయవచ్చు లేదా చికిత్స పూర్తయ్యాక కూడా చేయవచ్చు. కీమోథెరపీ : క్యాన్సర్ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, గొంతు రంగుమారడం, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో థెరపీ అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ తాత్కాలికమే. ఒక్కోసారి చికిత్స పూర్తయ్యాక పూర్తిగా ఇంతకు ముందులాంటి పరిస్థితే ఏర్పడుతుంది. ఈ థెరపీని 1950వ సంవత్సరం నుంచి చేస్తున్నారు. దాదాపు వందరకాలకు పైగా ఉన్న ఈ క్యాన్సర్ మందులను పిల్స్, లిక్విడ్స్, రక్తనాళంలోకి ఇచ్చే మందులు (ఐవీ), ఇంజెక్షన్స్, చర్మంపైన రుద్దేమందులు, వెన్నులోకి, పొట్టలోకి ఇచ్చే ఇంజెక్షన్లు... ఇలా అనేక రకాలుగా ఇస్తుంటారు. క్యాన్సర్ కణాలను చంపడానికి, మళ్లీ మళ్లీ అది తిరగబెట్టకుండా ఉండటానికి ఈ మందులను రకరకాల కాంబినేషన్లలో కూడా ఇస్తారు. ఇటీవలి కొత్త టార్గెటెడ్ థెరపీలతో కొంతవరకు సైడ్ఎఫెక్ట్స్ తగ్గినా ఈ చికిత్సలు అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. రేడియేషన్ థెరపీ : వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఒక్కో క్యాన్సర్‌కు రేడియేషన్‌తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్సల వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. పై చికిత్సలే గాక... స్టెమ్‌సెల్ థెరపీలో, సర్జరీలలో లేజర్ ఉపయోగించడం, లైట్‌ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనోథెరపీలు, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీలు క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
నడుం నొప్పికి యోగా మందు!
మన చుట్టూ ఉన్న వారిలో కనీసం సగం మందికి నడుం నొప్పి సమస్య ఉండే ఉంటుంది. అటు ఇటూ కదల్లేనంత తీవ్రస్థాయిలో కొందరిని బాధిస్తూంటే.. మిగిలిన వారిలో నొప్పి తక్కువగా ఉండవచ్చు. అయితే వీరందరూ పెయిన్ కిల్లర్లను వాడటం కంటే యోగాను నమ్ముకోవడం మేలని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ శాస్త్రవేత్తలు. యోగాతోపాటు కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీలను వాడటం వల్ల నొప్పిని గుర్తించే పరిస్థితి రాదని వీరు అంటున్నారు. కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలను రెండు గుంపులుగా విడగొట్టి తాము ప్రయోగాలు నిర్వహించామని.. రోజూ రెండు గంటలపాటు మైండ్‌ఫుల్‌నెస్ బేస్డ్ స్ట్రెస్ రిడక్షన్ (ఎంబిఎస్‌ఆర్) అనే పద్ధతిలో భాగంగా యోగా ప్రాక్టీస్, కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చేపట్టామని... 26 వారాల తరువాత రెండు వర్గాల్లోని 60 శాతం మంది తమ నడుం నొప్పి చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గినట్లు చెప్పారని శాస్త్రవేత్తలు తెలిపారు. 1979లో యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఎంబిఎస్‌ఆర్ పద్ధతిని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 ఆసుపత్రుల్లో ఉపయోగిస్తున్నారని, ఆన్లైన్ ద్వారా కూడా ఈ పద్ధతి అందుబాటులో ఉందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. -
కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మిగతావారికి రిస్కా?
మా తాతగారు, నానమ్మ, పెద్దనాన్న, మా నాన్నగారు క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్ బారిన పడి ఉంటే, ఆ కుటుంబ వారసులూ జాగ్రత్తగా ఉండాలని చదివాను. మా కుటుంబ వైద్య చరిత్రలో క్యాన్సర్ ఉంది కాబట్టి నేనూ క్యాన్సర్‌తో చనిపోతాననే ఆందోళన ఉంది. దయచేసి నా అనుమానాలకు తగిన సమాధానాలు ఇవ్వండి. – రఘు, విజయవాడ మీరిలా అనుమానించడం కరెక్టే. క్యాన్సర్ వ్యాధి బారిన పడి చనిపోయిన కుటుంబ చరిత్ర ఉంటే వాళ్ల వారసులకు ఈ వ్యాధి సోకే ముప్పు కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. దీనికి స్త్రీ, పురుషులు, వయసు వంటి అంశాలతో సంబంధం లేదు. ఎవరికైనా రావచ్చు. అయితే మీ తాతగారి కాలంలో క్యాన్సర్ వ్యాధికి సరైన చికిత్సే కాదు... దానిని ముందుగా కనిపెట్టేందుకు తగినంత వైద్యపరిజ్ఞానం కూడా లేదు. దాంతో అప్పట్లో క్యాన్సర్ పదం వింటేనే ఆ వ్యాధి బారిన పడ్డవారిపై ఆశలు వదలుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో పాటు నిపుణులైన డాక్టర్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. అంతేకాదు, ముఖ్యంగా ఈ క్యాన్సర్ వ్యాధిని ముందే గుర్తించే అధునాతనమైన వైద్య పరికరాలు, ఉపకరణాలు, వైద్య పరీక్షలు, ఇతరత్రా అనేక ప్రక్రియలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఏ రకమైన క్యాన్సర్‌నైనా మొదటిదశలోనే గుర్తిస్తే దాన్ని సమూలంగా రూపుమాపవచ్చు. సకాలంలో గుర్తిస్తే దాదాపు 75 శాతం వరకు దీనిని ఎదుర్కొనే వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ దీని బారిన పడ్డవారు చివరిదశలో చికిత్సకోసం వస్తే మాత్రమే వారి జీవితానికి 25 శాతం హామీ ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే... మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న అలవాట్లను బట్టి మీరు వెంటనే కొన్ని వైద్యపరీక్షలు చేయించుకుంటే మీకు క్యాన్సర్ వస్తుందా, రాదా అని కూడా చెప్పవచ్చు. మీకు ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చు. ఒకవేళ చెడు అలవాట్లకు లోనైతే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే అందరూ గుర్తించి, పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి... ∙పొగతాగే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మానేయాలి ∙విపరీతంగా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు ∙క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ∙తాజా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు తినాలి ∙చిన్నప్పుడు ఇవ్వాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లను పిల్లలకు ఇవ్వాలి. కాంబినేషన్ కీమోథెరపీతో క్యాన్సర్‌కు చెక్ నా వయసు 33 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతుంటే చెన్నై వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్ అని తేలింది. వెంటనే కీమోథెరపీ మొదలుపెట్టాలని డాక్టర్లు చెప్పారు. కానీ కొందరు బంధువులు, స్నేహితులు కీమోథెరపీ అంటే భయపెడుతున్నారు. అసలు కీమోథెరపీ అంటే ఏమిటి? క్యాన్సర్ చికిత్సలో దాని ప్రయోజనాలు ఏమిటి? – భానుప్రసాద్, కర్నూలు మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు. సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా శరీరంలోని కొన్ని ప్రాంతాలలో తిష్టవేసిన క్యాన్సర్ కణజాలాన్ని తొలగించగలుగుతాం లేదా నాశనం చేయగలం. కీమో ద్వారా శరీరంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ క్యాన్సర్ కణజాలాన్ని నిర్మూలించవచ్చు. కీమోథెరపీ ద్వారా శరీరంలో ముందుగా ఏర్పడిన క్యాన్సర్ కణితి మొదలుకొని శరీరంలోని అనేక భాగాలకు విస్తరించిన క్యాన్సర్ కణజాలాన్ని సైతం ధ్వసం చేయవచ్చు. కీమోథెరపీలో 100కు పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి క్యాన్సర్ చికిత్స కోసం వీటిలో ఒకే మందును సైతం వాడవచ్చు. అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక క్రమపద్ధతిని అనుసరించి అందించే విధానాన్ని కాంబినేషన్ కీమోథెరపీ అని వ్యవహరిస్తారు. పలు రకాల మందులు, వాటి ప్రభావాల తీరు వల్ల ఉమ్మడిగా క్యాన్సర్ కణాలపై పోరాడి వాటిని సమూలంగా సంహరించగలుగుతాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్ కణాలు ఆ మందుకు లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కాంబినేషన్ కీమోథెరపీని వినియోగిస్తారు. మీ విషయంలో ఏ విధానం అవలంబించాలన్నది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. అలాగే కీమోథెరపీలో భాగంగా మందులను ఎంత మోతాదులో, ఏవిధంగా, ఎప్పుడెప్పుడు, ఎంతకాలం ఇవ్వాలన్నది కూడా చికిత్సలో భాగమే. ఈ నిర్ణయాలన్నీ కూడా మీరు ఏ రకమైన క్యాన్సర్ కణితితో బాధపడుతున్నారు, శరీరంలో అది ఏ భాగంలో ఉంది, ఎంత పెద్దగా ఉంది, అది మీ శరీర కార్యకలాపాలను, ఆరోగ్యాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తోంది అన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీలో భాగంగా ఇచ్చే మందులను బట్టి మీ శరీరంలో అనేక విధాలుగా అతివేగంతో విస్తరించే క్యాన్సర్ కణాల విధ్వంసం జరుగుతుంది. క్యాన్సర్‌లో చాలా రకాలున్నాయి. అవి శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా పెరుగుతుంటాయి. కాబట్టి అవి పెరిగే విధానాన్ని అనుసరించి, వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక కీమోథెరపీ మందులను రూపొందించడం జరిగింది. డాక్టర్ నిఖిల్ గడియాల్ పాటిల్, సీనియర్ మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
ప్చ్..మర్చిపోయా!
♦ ముంచుకొస్తున్న ‘మతిమరుపు’ ♦ సహజ జ్ఞానంపై ‘సాంకేతిక’ ప్రభావం ♦ వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న రుగ్మత ♦ యువతలో అధికమవుతున్న పరిస్థితి ♦ నానాటికీ పెరుగుతున్న బాధితులు ♦ సకాలంలో చికిత్స చేయించకపోతే ♦ ప్రమాదమేనంటున్న వైద్య నిపుణులు ‘వీడు మతిమరుపునకు బ్రాండ్ అంబాసిడర్’... ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో హీరో నానీ గురించి హీరోయిన్ తండ్రి చెప్పిన మాటలివి. మతిమరుపుతో బాధపడే కథానాయకుడిగా నాని కష్టాలు, దాన్ని కప్పి పుచ్చుకునేందుకు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్టం అనుభవించే వాళ్లకే అర్థమవుతుంది. ఏ మాత్రం శారీరక శ్రమలేని యాంత్రిక జీవనం.. మనిషి నడవడికను పూర్తిగా మార్చేస్తోంది. సెల్‌ఫోన్, కంప్యూటర్ల వాడకం పెరిగి ప్రతి సమాచారానికీ వాటిపైనే ఆధారపడుతుండడంతో క్రమంగా మెదడు పదును తగ్గుతోంది. – అనంతపురం మెడికల్ నాడీ కణాల సంఖ్య తగ్గిపోవడంతో సాధారణంగా వచ్చే రుగ్మతల్లో మతిమరుపు ఒకటి. నాడీ వ్యవస్థ కుంచించుకుపోవడం, మానసిక సామర్థ్యం తగ్గిపోవడం, మెదడు పూర్వభాగంలోని నాళాలలో అస్తవ్యస్త స్థితి తలెత్తడం వల్ల ఇది ఏర్పడుతుంది. ప్రపంచంలో ప్రతి నాలుగు సెకన్లకు ఒకరు ఈ రుగ్మత బారిన పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మతిమరుపు బాధితులు సుమారు 50వేల మందికి పైగా ఉన్నారంటే తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరంతా ఏదో ఒక చోట ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారే. అసలు వైద్యులను సంప్రదించని వాళ్లు.. ఏమౌతుందిలే అని నిర్లక్ష్యం చేసే వాళ్లు వేలల్లో ఉంటారని అంచనా. జుట్టుపీక్కుంటున్న యువత పట్టుమని పదెంకెలు కూడా గుర్తించుకోలేని స్థితిలో నేటి యువతరం జుట్టు పీక్కుం టోంది. నిన్న ఇంట్లో తిన్న కూర ఏంటంటే కూడా తడుముకుంటున్నారు.. టీస్టాల్కు వెళ్లి గంట గడిపి చివరకు బిల్లు ఎంతైందోనని సెల్‌ఫోన్‌లోని క్యాలిక్యులేటర్ తీస్తున్నారు. మారుతున్న జీవన శైలిలో మెదడుకు ఏ మాత్రం పని చెప్పక సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తిగా ఆధారపడితే మున్ముందు ప్రమాదకర లక్షణాలు చవిచూడాల్సిందేని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలు ఇవీ..: జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, ప్రవర్తనలో మార్పులు రావడం, ప్రతి చిన్న విషయానికీ ఆవేశ పడడం. ఈ రుగ్మత బారిన పడిన వారిలో కొందరు పగలు, రాత్రి తేడాలను కూడా గుర్తించలేరు. వస్త్ర ధారణ సరిగ్గా చేసుకోరు. ‘మతిమరుపు’ కారణాలివే..: మానసిక ఆందోళన, తీరిక లేని పనులతో తీవ్ర ఒత్తిడికి లోనవడం, ప్రతి చిన్న విషయానికీ సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లపై ఆధారపడడం వల్ల మెదడుకు పని లేకుండాపోతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న నేటి విద్యా విధానం కూడా ఈ రకమైన పరిస్థితికి దారి తీస్తోంది. ఎల్కేజీ నుంచే కంప్యూటర్ ముందు కూర్చోబెడుతుండడంతో పిల్లల్లో సహజ సిద్ధమైన తెలివి తేటలు ఆవిరవుతున్నాయి. విరామం లేని పని, నిద్రలేమి, అదే పనిగా టీవీ చూడడంతో పాటు మద్యం, ధూమపానం, గుట్కా వంటి అలవాట్లు మెదడుపై దుష్ప్రభావం చూపుతున్నాయి. తగ్గించడం ఎలా? డైమన్షియా (మతిమరుపు) అనేది వయసును బట్టి సాధారణంగా వచ్చే రుగ్మత కాదు. సాధారణంగా వృద్ధులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం యువతలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మెదడులో ఏర్పడే తీవ్రమైన మార్పుల వల్ల జ్ఞాపక శక్తి, ఆలోచన, ప్రవర్తన, సామర్థ్యం తగ్గుతూ నిత్య జీవన వ్యవహారాల్లో ఇబ్బందిగా మారుతుంది. త్వరగా వైద్యుల సలహాలు తీసుకుని చికిత్స చేయించుకుంటే మంచి ఫలితాలుంటాయి. నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు నష్టమే స్కూల్‌కు వెళ్లే పిల్లల జ్ఞాపక శక్తి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గుర్తిస్తూ ఉండాలి. ఒకవేళ అంతంత మాత్రమే అయితే ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వారు పెరిగే కొద్దీ అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు పాఠశాల నుంచి వచ్చాక వారు నేర్చుకున్న వాటిని పలక, పుస్తకాలపై రాయించాలి. సృజనాత్మకతను పెంచే చిత్రలేఖనం, క్విజ్, చెస్ వంటివాటిని ప్రోత్సహించాలి. తీసుకునే ఆహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. రోజూ ఉడకబెట్టిన కోడి గుడ్డు అందించాలి. మెదడుకు రక్షణ కల్పించే ఆమ్ల రహిత, తక్కువ కొవ్వు పదార్థాలున్న ఆహారం తీసుకోవాలి. బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్, పండ్లు ఎక్కువగా తినాలి. ఫలితంగా మానసిక సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. కూరగాయల్లో టమోటా, క్యారెట్, బీన్స్, ఆకుకూరలు ఇవ్వడం ద్వారా జ్ఞాపక శక్తి పెంపొందుతుంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి ప్రస్తుత కాలంలో చాలా మంది మతిమరుపుతో బాధపడుతున్నారు. ఈ రుగ్మత బారిన పడకుండా ఉండాలంటే ప్రధానంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడడం తగ్గించుకుని సొంతంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మాటిమాటికీ సెల్‌ఫోన్ వాడకం తగ్గించాలి. నడక, యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి. తద్వారా శరీరం, మనసుకు విశ్రాంతి, ఏకాగ్రతను పెంపొందిస్తాయి. – ప్రొఫెసర్ డాక్టర్ యండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణులు, సర్వజనాస్పత్రి -
ది ఛాలెంజ్!
ఒక్క అడుగు ముందుకు వేయాలంటేవంద మీమాంసలు వెనక్కులాగుతుంటాయి. ఒక సాహసం చేయాలంటే లక్ష భూతాలు అడ్డుపడుతుంటాయి. అలా అని... అడుగు వేయడం మానకూడదు. సాహసం చేయడం ఆపకూడదు. మరో జన్మలోకి తొంగి చూసి మన లోపాన్ని అర్థం చేసుకునేకన్నా ఈ జన్మలోనే మన భయాలను అర్థం చేసుకొని పోరాడితేనే జీవితం ఒక లక్ష్యం అవుతుంది. కష్టం ఒక ఛాలెంజ్ అవుతుంది. రాత్రి పది దాటింది. శేఖర్‌కి నిద్రపట్టడం లేదు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. బయట అంతా చీకటి. లోపలంతా చీకటి. తనలోనూ చీకటే. ‘నన్నెవరూ అర్థం చేసుకోరు. నాకెవరూ అండగా ఉండరు. అయినా ఈ అవిటివాడిని ఎవరు ప్రేమిస్తారు? చివరకు అమ్మ కూడా అన్నయ్యవైపే. నా గురించి ఆలోచించేదైతే ఇలా నన్ను ఒంటరిని చేసి వెళుతుందా!’ దుఃఖం పొగిలి పొగిలి వస్తోంది శేఖర్‌కి. కళ్ల నిండా నీళ్లు. ‘నేనే ఎందుకు ఇలా పుట్టాను. నా కన్నా ముందు పుట్టిన అన్నయ్య బానే ఉన్నాడు. నా తర్వాత పుట్టిన చెల్లీ ఆరోగ్యంగా ఉంది. నేనే ఎందుకిలా? నాకిలా అవడానికి అమ్మే కారణమట. అన్నయ్య పుట్టాక అప్పుడే పిల్లలు వద్దనుకొని ఏవో ముందులు వాడిందట అమ్మ. ఆ మందుల వల్లే నాకీ అవిటితనం వచ్చిందట. మేనత్త చెప్పిన మాటలు శేఖర్ చెవుల్లో గింగురుమంటున్నాయి. ‘పుట్టుకతోనే రెండు కాళ్లు చచ్చుపడిపోయి పుట్టాను. పాతికేళ్లు వచ్చినా ఇంకా చంటిపిల్లాడిలా పాకుతూనే ఉన్నాను. పాకుతూనే బాత్రూమ్కి వెళ్లాలి. పాకుతూనే పనులన్నీ చేసుకోవాలి. పాకుతూనే పదేళ్లపాటు బడికి వెళ్లాను. ఇక ఈ జీవితం అంతా ఇంతే. ఏం పనిచేయగలను? ఎలా బతకగలను? నడిచే అదృష్టం నాకు లేదా’.. ఆ ఆలోచనకు మళ్లీ దుఃఖం ఎగదన్నుకొచ్చింది. వెక్కివెక్కి ఏడుస్తూ రెండు చేతులతో ముఖం కప్పుకున్నాడు శేఖర్ వెలుగు నింపేవారెవ్వరు? ‘శేఖర్.. శేఖర్..’ అంటూ భుజం పట్టి ఊపేసరికి ఉలిక్కిపడి చూశాడు శేఖర్... ఈ టైమ్‌లో ఎవరా అని. లైట్ స్విచ్ వేస్తూ కనిపించాడు వెంకట్. మేనత్త కొడుకు వాడు. తన కన్నా ఏడాది చిన్న. గదిలో అప్పటి వరకు ఉన్న చీకటిని.. బల్బు తన వెలుతురుతో తరిమేసింది. ‘‘నువ్వొక్కడివే ఉన్నావని తెలిసి ఈ రాత్రి ఇక్కడే ఉండిపోదామని వచ్చాను బావా. ఏంటిలా... చీకటింట్లో.. తలుపు కూడా వేసుకోకుండా..’’ అన్నాడు వెంకట్... శేఖర్ మంచం పక్కనే కుర్చీ లాక్కుని కూర్చుంటూ. ‘‘నువ్వెందుకొచ్చావ్?! అవిటివాడిని. నేనుంటే ఎంత, పోతే ఎంత. భూమికి భారమే తప్ప నాలాంటివాడు ఎవరికి ఉపయోగం?’’ శేఖర్ గుండెలోని బాధంతా గొంతు దాటి వచ్చేస్తోంది.‘‘అదేంటి బావా అలా అంటావు. మా అందరికీ నువ్వంటే ఎంతో అభిమానం. నీకు నువ్వుగా కదల్లేకపోవచ్చు. కానీ, నీకున్న తెలివితేటలు మాలో ఎవరికున్నాయి..’’ వెంకట్ మాటలకు అడ్డుపడ్డాడు శేఖర్. ‘‘చాల్లే ఇన్నాళ్లూ చావలేక బతికున్నాను. ఇప్పుడు చస్తూ బతుకుతున్నాను. నేను అవిటివాడినని అన్నయ్యకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. వాడికి పుట్టే పిల్లలకూ నాలా అవిటితనం రావచ్చని భయపడుతున్నారట. నేనిలా ఉండటం వల్లే చెల్లికీ పెళ్లి కావడం లేదట. మంచి సంబంధాలు నామూలంగా చెడిపోయాయని అన్నయ్య నోటికొచ్చిన మాటల్లా అని వెళ్లిపోయాడు. నన్ను ఎప్పుడో వదిలించుకుని ఉంటే ఈ రోజు ఈ తిప్పలు వచ్చేవి కాదట. వాడు అన్నేసి మాటలు అంటుంటే అమ్మ, చెల్లి ఒక్కరైనా అడ్డుచెప్పలేదు రా! పైగా ‘ఏం చే యగలం, మన కర్మ’ అని ఏడుస్తూ కూర్చున్నారు. అంటే నేను ఇక్కడ ఉండకూడదనేగా వీళ్లంతా కోరుకునేది. ఇలా పుట్టడం నా తప్పా! నా మనసెంత గాయపడిందో అని కూడా చూడకుండా అన్నయ్యను సముదాయించి తీసుకురావడానికి వెళ్లారు ఇద్దరూ! నాన్నే ఉండి ఉంటే ఇలా జరిగేదా! అడుగు కూడా వేయలేని నేను ఏం పని చేయగలను. నాకు నిజంగా బతకాలని లేదురా. చచ్చేమార్గం చెప్పు’’ అని పెద్దగా ఏడ్చేశాడు శేఖర్! భారం ఎప్పటికి దిగుతుంది? శేఖర్ చిన్నతనంలోనే తండ్రి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని ఆసరా చేసుకుని ముగ్గురు పిల్లలను తల్లి విమల సాకుతూ వచ్చింది. శేఖర్ని రోజూ తనే స్కూల్‌కి తీసుకెళ్లి, ఇంటికి తీసుకువచ్చేది. కాస్త పెద్దయ్యాక స్కూల్లో స్నేహితులే తీసుకెళ్లేవారు. కొన్నాళ్లకి తనే కాళ్లతో, చేతులతో పాక్కుంటూ స్కూల్‌కి అతికష్టంగా వెళ్లి వచ్చేవాడు. ఊళ్లో హై స్కూల్ వరకే ఉంది. ఎవరో ఒకరు దగ్గర లేకపోతే అవసరాలు తీర్చుకోవడానికే కష్టపడేవాడు. అందుకే విమల కొడుకును టౌన్‌కి పంపించలేదు. తర్వాత ఏం చేయాలో తోచక శేఖర్ని ఇంట్లోనే ఉంచింది. ఊళ్లో అందరూ శేఖర్ని జాలిగా చూసేవారు. ‘విమలమ్మా! ఎన్నాళ్లో నీకీ కష్టం’ అనేవారు! ఆమె మౌనంగా వినేది. మౌనంగా ఉండేది. మిగతా ఇద్దరు పిల్లలు పట్టణంలో ఉండి చదువుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి అంటే కుటుంబం వివరాలన్నీ ఇరువైపుల వాళ్లు చూస్తారు. శేఖర్ని అవిటివాడిగా చూసినవాళ్లు ‘వీళ్ల కుటుంబంలో అవిటితనం ఉంది. పుట్టబోయే వాళ్లు కూడా అవిటితనంతో పుడితే..’ అనే అనుమానం వ్యక్తం చేసిన వాళ్లు ఈ సంబంధం వద్దన్నారు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఎవరి మనసులూ ప్రశాంతంగా లేవు. ‘వికల భావన’లకు థెరపీ ‘‘శేఖర్ మీ వేదన ఈ నాటిది కాదని అర్థం అవుతోంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడం మీ చేతుల్లోనే ఉంది..’’కౌన్సెలర్ మాటలకు.. ‘‘నాకేం చేతనవుతుంది, కాలు కూడా కదపలేనివాడిని’’ అని నిస్సహాయంగా అన్నాడు శేఖర్.వెంకట్ బలవంతం మీద కౌన్సెలింగ్‌కి వచ్చాడు శేఖర్. ‘‘రిగ్రెషన్ థెరపీ మనలోని నిస్సహాయతను దూరం చేస్తుంది. జీవితాన్ని అర్థం చేసుకునే తత్త్వాన్ని పెంచుతుంది’’ అని చెప్పి శేఖర్ని వెంట తీసుకొచ్చాడు వెంకట్. పట్టణంలో ఉండి చదువుకున్న వెంకట్‌కి రిగ్రెషన్ థెరపీ గురించి తెలుసు. ధ్యానంలో అంతర్యానం శేఖర్ ప్రయాణం మొదలైంది. అది వర్తమానం నుంచి గతం వైపుగా పరుగులు తీయడం మొదలుపెట్టింది. బాల్యం నుంచీ ఎదురైన సమస్యలు, అందరూ చూసే జాలి చూపులను కళ్లు మూసుకొని మనోనేత్రంతో పరిశీలిస్తూ వెనక్కి వెనక్కి ప్రయాణిస్తున్నాడు. తన నిస్సహాయతకు కారణాలను అన్వేషిస్తున్నాడు. తల్లి గర్భం నుంచి గత జన్మలోకి అతని ప్రయాణం సాగింది. అక్కడ తనను తాను చూసుకున్నాడు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న తనను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తను ఆటలు ఆడుతున్నాడు. స్నేహితులతో, కుటుంబంతో కలిసి ఆనందంగా ఉన్నాడు. ఉన్నట్టుండి పెద్ద కుదుపు అకస్మాత్తుగా తన ఆప్త మిత్రుడు మర ణించాడు. ఈతకని మోట బావిలోకి దిగి శవమై తేలాడు. ఆ దృశ్యాన్ని తను తట్టుకోలేకపోతున్నాడు. ఎన్నో కష్టాల నుంచి తనను గట్టెక్కించాడు ఆ స్నేహితుడు. ఇప్పుడా స్నేహితుడు బావి గట్టున విగతజీవుడై ఉన్నాడు! ఇప్పుడు అతను లేడు. ఇక నా కష్టాలను తీర్చేవారు లేరు. నాకు అండగా ఉండేవారు లేరు. ఏ పనిచేద్దామన్నా చేతులు సహకరించడం లేదు. అడుగు వేద్దామన్నా కాలు ముందుకు పడటం లేదు. బాధ, భయం తొలుస్తూనే ఉన్నాయి. కొన్నాళ్లకు తను పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. ఆ దిగులుతోనే మరణించాడు. ఆ దిగులుతోనే ఈ జన్మ తీసుకున్నాడు. పేరుకుపోయిన భయం, ఒంటరితనం.. అవే అవయవలోపానికి దారి తీసాయి..’ అని చెబుతున్న శేఖర్.. తనలో ఎక్కడ సమస్య ఉందో గమనించాడు. తనను ఎప్పుడూ ఎవరో ఒకరు దగ్గరుండి చూసుకోవాలనే ఆలోచనను కలిగి ఉండటాన్ని గమనించాడు. థెరపీ నుంచి బయటకు వచ్చాడు. నిస్సహాయితకు స్వస్తి వెంకట్ సాయంతోనే పట్టణంలోని హాస్టల్లో చేరాడు శేఖర్. తల్లి, అన్న, చెల్లెలు తమ పొరబాటును మన్నించి ఇంటికి రమ్మన్నారు. ‘‘అసలు మీమీద నాకెలాంటి కోపం లేదు. నేను నేనుగా ఎదగాలి. బయట ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటాను. నా స్వశక్తితో ఎదిగి ఆ తర్వాతే మిమ్మల్ని కలుస్తాను’’ అని వారికి నచ్చచెప్పి పంపాడు శేఖర్. ఐదేళ్ల సమయంలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఆగిపోయిన చదువును దూరవిద్య ద్వారా పూర్తిచేశాడు. వీల్‌చైర్ వాలీబాల్ సాధన చేస్తూ పారాలింపిక్ గేమ్స్‌లో నేషనల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. బ్యాంకు పరీక్షలు రాసి, ఉద్యోగం సంపాదించుకున్నాడు. తల్లికి అండగా నిలిచాడు. అంగవైకల్యం తన తప్పు కాదని, ఆదర్శవంతమైన జీవనాన్ని దిద్దుకోకపోవడమే తప్పని తెలుసుకున్నాడు. లోపం ఉందని బాధపడకుండా ఉన్న అవయవాలను, చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకుంటే జీవితాన్ని ఎంత అందంగా మలుచుకోవచ్చో తెలియజేస్తూ నలగురికి ఆదర్శంగా నిలిచాడు. అష్టవంకరలను అధిగమించిన అష్టావక్రుడు ఇతిహాసాలలో అష్టావక్రుడు జీవితం ఎంతో గొప్పగా కనిపిస్తుంది. మహర్షి ఏకపాదుడి కుమారుడు ఎనిమిది వంకరలు గల దేహంతో జన్మించాడు. అందుకే అతనికి అష్టావక్రుడు అని పేరు వచ్చింది. ఇతను పుట్టే సమయానికి తండ్రి జనకమహారాజు దగ్గర ఉన్న వందితో వాదించలేక ఓడిపోయి, జలబంధీగా ఉన్నాడు. అష్టావక్రుడు తన అంగవైకల్యం గురించి చింతించక వేదవిద్యలను అభ్యసించాడు. పన్నెండేళ్ల వయసులోనే తన వాదనతో వందిని ఓడించి బంధీగా ఉన్న తండ్రిని, మిగతావారిని విడిపించి తీసుకొచ్చిన ఘనుడు. ఆ విధంగా అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించింది. బతికినన్నాళ్లూ ధర్మనిష్టకుడిగా, మహామునిగా ఖ్యాతి గడించాడు. వివాహం చేసుకొని పుత్ర పౌత్రులను పొందాడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహితగా ప్రపంచానికి తెలిసింది. థెరపీతో ఉపయోగాలు ⇒ ఉన్న అవయవాలను సక్రమంగా ఉపయోగించుకోకపోవడమే అంగవైకల్యం అని తెలుస్తుంది. ⇒ పూర్ణంగా ఉన్నాను. పూర్ణంగా జీవిస్తున్నాను అనే భావన పెరుగుతుంది.. ⇒ ‘జీనియస్’ అంటే వంశపారంపర్యంగా జ్ఞానం ఉంటుంది అని కాదు. అన్నింటినీ పరిపూర్ణంగా వాడుకోవడంలో ముందుండేవాడు అని తెలుసుకుంటారు. ⇒ తమ శక్తిని సరైన దృక్కోణంలో చూసి వాడుకోవాలనే జ్ఞానం పెరుగుతుంది. ⇒ తమకు లేదని బాధపడటం కన్నా ఉన్న పనినే పరిపూర్ణంగా చేయగలిగితే అదే పూర్ణత్వానికి దారి తీస్తుందని అర్థమవుతుంది. అనుభవాల ప్రవాహం అర్థమైతే వైకల్యం దూరం అంగవైకల్యం ఉన్నవారు కుటుంబం, సమాజం తమను చిన్నచూపు చూస్తున్నాయన్న భావనలో ఉంటారు. సమాజంలోనూ ఇలాంటి దృష్టికోణం ఉంది. అలాగే అంగవైకల్యంతో బాధపడేవారు భగవంతుడు శిక్ష వేశాడనో, తను గర్భంలో ఉన్నప్పుడు తల్లి సరైన జాగ్రత్తలు తీసుకోలేదనో, వంశపారంపర్య లోపం అనో కుంగిపోతుంటారు. కానీ, తాము పాఠాన్ని నేర్చుకోవడం కోసమే ఈ జన్మ తీసుకున్నామని గ్రహించరు. అంగవైకల్యంతో బాధపడేవారికి రిగ్రెషన్ థెరపీ చేస్తే ‘గత జన్మలో యుద్ధంలో కానీ, జీవన ప్రయాణంలో కానీ తమకు కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తులను కోల్పోయి ఆ బాధ, భయంతోనే జీవించినవారు అధికంగా ఉన్నారు. దీంతో తమ కుడి భుజం పోయిందనో, తాము నడవలేకపోతున్నామనో బతికినన్నాళ్లూ భయం భయంగా జీవించి ఉంటారు. మరణ సమయంలోనూ అదే భయంతో శరీరాన్ని విడిచి ఉంటారు. తిరిగి, గర్భంలో ప్రవేశించినప్పుడు కూడా ఆ భావన బలంగా ఉండటం వల్ల అలాగే ముడుచుకుపోతారు. దీంతో అవయవాల ఎదుగుదల సరిగ్గా ఉండదు. ‘నాకీ అవయవం లేదు’ అని బలంగా మస్కిస్తంలో ఉండటం వల్లే అంగవైకల్యానికి దారి తీస్తుంది. అనుభవాల ప్రవాహం అర్ధమైతే ఉన్న విభాగాలన్నీ సరిగ్గా వినియోగించుకోవచ్చు. – డా.హరికుమార్, జనరల్ సర్జన్, ఫ్యూచర్ థెరపిస్ట్, హైదరాబాద్ – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
కోరికలే గుర్రాలైతే... ఆత్మలు సవారీ చేయవూ?
ఇప్పటిదాకా ఉన్న అన్ని రూల్సూ బ్రేక్ అయిపోతున్నాయా? జన్మకు సార్థకత ఉంటుందనేది ఇప్పటి దాకా రూల్. కాదు బిలీఫ్.. నమ్మకం. అంటే ఈ లైఫ్‌లో బాగా జీవిస్తే మరో లైఫ్‌లో మంచి జన్మ దొరుకుతుందని. అంతకంటే బాగా జీవిస్తే అసలు జన్మే ఉండదని. దాన్నే ‘మోక్షం’ అంటారు. వీటన్నిటినీ తిరగరాస్తున్న కొత్త ఆలోచన ఇది. ఈ జన్మ మన పూర్వజన్మ కోరిక. ఎక్కడ పుట్టాలి? ఎవర్ని చేసుకోవాలి? ఎవర్ని కనాలి? ఎలా అస్తమించాలి? ఈ మొత్తం ప్రాసెస్ ఒక పాఠం. కాదు.. కాదు.. ఎన్నో పాఠాల... ఒక పుస్తకం. అంటే.. ఈ జీవితాన్ని మనం ఎంచుకున్నది నేర్చుకోడానికి. కష్టాన్ని కౌగలించుకోడానికి. ఛాలెంజ్‌ని అర్థం చేసుకోడానికి. మర్మాన్ని విడమర్చుకోడానికి. మనం ఇలా, ఇక్కడ ఉన్నామంటే అదొక ఆక్సిడెంట్ కాదు. లైఫ్ ఈజ్ ఎ సోల్ ప్లాన్. అదొక ప్రణాళిక. కమాన్. లెటజ్ లివ్. లెటజ్ లెర్న్. లివ్ హ్యాపీ. డోన్ట్ వర్రీ. కోరికలు గుర్రాలైతే ఆత్మలు సవారీ చేస్తాయి. కాదా మరి? ‘‘హలో.. శేఖర్! కరెక్ట్ టైమ్‌కి ఫోన్ చేశావురా, ఆఫీసుకు స్టార్ట్ అవుతున్నా. ఈ రోజు ఆఫీసులో ప్రెజెంటేషన్ ఫైల్ అంతా రెడీ! ఈ సారి ఎలాగైనా ప్రమోషన్ నాదేరా, ఇది జరిగి తీరుతుంది చూడు. మనం ఎదిగితేనే కదా, పిల్లలక్కూడా మంచి లైఫ్‌ని ఇవ్వగలం..’’ ఫ్రెండ్ శేఖర్‌తో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు వెంకట్ కృష్ణ. భార్య లక్ష్మి చూసి చూసి ‘‘ఏమండీ, అత్తయ్య ఫోన్ చేశారు. ఓసారి వెళ్లి వాళ్లను చూసి... ’’ ఫోన్ మాట్లాడుతున్న వెంకట్ ఆమె మాటలను చేత్తోనే వారించాడు ... తర్వాత అంటూ! ‘ఫ్రెండ్స్‌తో అయితే గంటలు గంటలు టైముంటుంది. ఇంటి విషయం ఏదైనా చెబితే మాత్రం అడ్డుపడుతున్నట్టు ఉంటుంది’ మనసులోనే గొణుక్కుంటూ పిల్లలను స్కూల్‌కి రెడీ చేసింది. భార్య మొహం ముడుచుకుని ఉండటం చూసిన వెంకట్æ‘‘ఏంటిది, ఆఫీసుకు వెళుతున్నప్పుడు కాస్త నవ్వు మొహం పెట్టుకోవాలనీ ఉండదా నీకు’’ విసుగ్గా అన్నాడు వెంకట్. ‘‘అది కాదండీ, పాపం అత్తయ్య మామయ్య ఆ ఊళ్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో. పొద్దున్నే ఫోన్ చేశారు అత్తయ్య. వాళ్లకసలే ఒంట్లో బాగుండదు. అక్కడే సౌకర్యాలు ఉండవు. ఇక్కడకు తీసుకువద్దామంటే మీరు వినిపించుకోరు. వాళ్లు లేని లోటు ఉన్నప్పుడు తెలియదండి. మా అమ్మానాన్నంటే నా చిన్నప్పుడే చనిపోయారు. పెళ్లి చూపులప్పుడు అత్తయ్య నన్ను చూసి ‘మహలక్ష్మిలా ఉన్నావురా! ఈ రోజు నుంచి అమ్మ లేదని బాధపడకు. నేనున్నాను’ అన్నారు. ఎంత సంతోషమేసిందో. కానీ, కూతురిలా ఆమెను చూసుకోలేకపోతున్నాను. ఈ వయసులో మనం కాకపోతే వారిని ఇంకెవరు చూసుకుంటారు...’ చెబుతూనే ఉన్న లక్ష్మి మాటలకు అడ్డుపడుతూ ‘‘ఆపుతావా! నీ సెంటిమెంట్ల గోల. వాళ్లు ఊర్లో ఉంటేనే సంతోషంగా ఉంటారు. అక్కడైతేనే అందరూ ఉంటారు. ఇక్కడుంటే అస్తమానూ నసగా ఉంటుంది. పైగా పెద్ద ఇల్లు తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. అవన్నీ తట్టుకోగలమా!’’ సలహాలు ఇవ్వడం మానుకొని నీ పని చూసుకో టిఫిన్ బాక్స్ తీసుకొని హడావిడిగా వెళ్లిపోయాడు వెంకట్. భవిష్యత్తు ఏమిటి? ‘‘ఈ ప్రకారంగా.. ఇప్పుటి యూత్‌ని అట్రాక్ట్ చేస్తే బిజినెస్ డబల్ కాదు త్రిబుల్ అవ్వడం గ్యారెంటీ సార్! ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే, యూత్ డే.. మన గిఫ్ట్ కంపెనీకి వీళ్లు మంచి మార్కెట్.. ’’ మీటింగ్ హాల్లో వెంకట్‌కృష్ణ తన ప్రెజెంటేషన్ పూర్తి చేయగానే అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. అందరివైపు గర్వంగా చూసిన వెంకట్ బాస్ ముఖంలో ఏ భావం కనిపించకపోవడంతో కంగుతిన్నాడు. బాస్ శంకర్రావు మౌనంగా ఉండటంతో మిగతా అందరి నోళ్లు మూతపడ్డాయి. ఏడుపదుల వయసు దాటిన శంకర్రావ్ సీరియస్‌గా ‘‘వెంకట్.. నీ ప్రెజెంటేషన్‌లో ఓ లోపం ఉంది. అదేంటో నీకు తెలుసా! ఫ్యామిలీ మిస్ అవడం. యూత్ బిజినెస్.. గురించి నువ్వు చెప్పింది ఈ కొద్ది రోజుల వరకే. నాకు నా కంపెనీ భవిష్యత్తు కావాలి. తల్లిదండ్రులు, పిల్లలు, నానమ్మ తాతయ్యలు.. కుటుంబంలోని ఈ రిలేషన్స్ గురించి నీ ప్రెజెంటేషన్‌లో లేదు. మనం చేసే పనిలో మనదేశపు విలువలు కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. మన దేశపు ప్రాచీన సంపదైన వేదాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రం, ఆత్మీయ అనుబంధాలలోని గొప్పదనం కోసం జర్మనీ, రష్యా, ఈజిప్ట్, టిబెటన్.. వంటì ఎన్నో దేశాలు మన వైపు చూస్తున్నాయి. పరిశోధనలు చేస్తున్నాయి. వాళ్లు మన నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఇలాంటప్పుడు మనం మన మూలాలు మర్చిపోతే ఎలా?! ఇలాగైతే ముందుతరాలకు ఏం మిగులుస్తాం మరోసారి ట్రై చేయి. ఈ సెషన్ వేస్ట్’’ అంటూ అక్కణ్ణుంచి వెళ్లిపోయారు శంకర్రావు. థెరపీతో ఆత్మ చైతన్య వృద్ధి నేను పై చదువులకు పట్నం వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఆరోగ్యం బాగోలేదు. బెంగుళూరులో టాప్ టెన్ కంపెనీలో మంచి పోస్ట్‌కి సెలక్ట్ అయ్యాను. కానీ, ఆ సమయంలో నాన్నకు హార్ట్ ఆపరేషన్. నాతో చదువుకున్నవాళ్లు నాకన్నా మంచి హోదాలో ఉన్నారిప్పుడు. ఈ రోజు ఉదయం ఆఫీసులో ప్రెజెంటేషన్‌కి వెళుతుంటే అమ్మ ఏదో ప్రాబ్లమ్ అంటూ ఫోన్. ఇరవై ఏళ్లుగా నా ప్రతీ ఎదుగుదలకు ఏదో విధంగా అమ్మనాన్నలు అడ్డుపడుతూనే ఉంటున్నారు. నేను నా ఉన్నతి గురించి ఆలోచిస్తున్నాను. నా భార్య, నా బాస్ తల్లిదండ్రులు వారి గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. నాకిది చాలా చిరాకుగా ఉంటోంది..’ అన్నాడు వెంకట్. ‘‘మీ తల్లిదండ్రులు మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారనేది మీ భావన. మీ జీవితంలో ఎందుకు వృద్ధి లేదో మీరే చూడండి’’ అన్నారు కౌన్సెలర్. థెరపీ మొదలయ్యింది. కళ్లు మూసుకొని ధ్యానముద్రలో కూర్చుకున్న వెంకట్‌కి మనోనేత్రంలో తన గత జీవితం 70 ఎమ్.ఎమ్ సినిమా దృశ్యంలా ఆవిషృతమైంది. ప్రస్తుతం నుంచి వెనక్కి ఆ ప్రయాణం సాగుతోంది. పెళ్లి, ఉద్యోగం, కాలేజీ రోజులు, బాల్యం.. అమ్మ గర్భంలో ఉన్న స్థితి.. అన్నీ దర్శిస్తున్నాడు. అక్కడ్నుంచి ఇంకా వెనక్కి వెళుతున్నాడు. టైమ్ మిషన్‌లో కాలాన్ని వెనక్కి తిప్పినట్టు సూక్ష్మ కాంతిగోళం నుంచి గత జన్మలోకి ప్రవేశించాడు. ఆ గత జన్మ గురించి వెంకట్ చెప్పడం మొదలు పెట్టాడు. ‘ఉద్యోగం కోసం విదేశాలలో నేను, తల్లిదండ్రులు ఊళ్లో. వృద్ధాప్యంలో వారు పడుతున్న అవస్థలను చూస్తున్నాను. తల్లిదండ్రి చనిపోయినప్పుడు కూడా నేను వారి దగ్గర లేను. చివరకు వారిని మట్టిచేసేటప్పుడు కూడా! వారికోసం దేశాలు దాటుకొని వచ్చేసరికి అంతా అయిపోయింది. ఎంతో ప్రేమగా జీవితమంతా కళ్లలో పెట్టుకుని నా కోసమే అన్నట్టు బతికిన నా తల్లిదండ్రులకు నేను ప్రేమను ఇవ్వలేకపోయాను. ఆ అపరాధ భావన నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ అనంతమైన ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవాలి. మళ్లీ జన్మ ఉంటే ఈ తల్లిదండ్రులకే పుట్టి, వాళ్లను ప్రేమగా చూసుకుంటాను. ఆనందాన్ని ఇస్తాను’ అనుకున్నాను. తల్లిదండ్రులే వంతెన లక్ష్మీ! నా ఫ్రెండ్ శేఖర్ ద్వారా గతజన్మ ప్రతిగమన చికిత్స తీసుకున్నాను. ఎందుకోసమైతే ఈ జన్మ తీసుకున్నానో ఆ విషయమే మర్చిపోయాను. నా ఎదుగుదలకు నా తల్లిదండ్రి అడ్డు అనుకున్నాను. కానీ, వాళ్లే నా జీవితానికి వంతెన అని గుర్తించలేకపోయాను. చేసిన తప్పునే మళ్లీ మళ్ళీ చేస్తున్నాను. ఇక అలా చేయను. తప్పు దిద్దుకొని మన పిల్లలకు ఓ మంచి కానుక ఇస్తాను. అదే తాతయ్యను నానమ్మను. అంటూ ఊరుకు ప్రయాణమయ్యాడు వెంకట్. తల్లీదండ్రి, భార్య, పిల్లలతో తన జీవితం నిండుగా ఉన్న ఆనందాన్ని పొందుతున్నాడు వెంకట్. ఆ సంతోషం, తృప్తి వెంకట్ పనిచేసే చోటా వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల్లోనూ తను ఏ ఉన్నతిని ఆశించాడో దానిని చేరుకున్నాడు. ఆత్మ వికాసం రంగులరాట్నంతో పోల్చవచ్చు. ఊర్ధ్వ్యలోకాలలో అంటే రాట్నం పై స్థాయిలో ఉన్నప్పుడు ఆత్మ జన్మ ఎంపిక ఉంటుంది. కిందకు వస్తున్న కొద్దీ పుట్టుకకు సంబంధించిన పాఠాన్ని నిర్ధారించుకుంటుంది. జన్మ తీసుకున్న తర్వాత తిరిగి పైకి వెళ్లడానికి అంటే వృద్ధి సాధించడానికి నిరంతర సాధన చేస్తుంటుంది. ఆత్మచైతన్యం చేసే సాహసోపేతమైన నిర్ణయాలన్నీ జ్ఞానం కోసమే. నల్లగా, తెల్లగా, పొట్టిగా, పొడుగ్గా... ఎలా పుట్టాలన్నది కూడా ఆత్మచైతన్యం నిర్ణయించుకున్నదాన్ని బట్టే ఉంటుంది. అవ్యాజమైన ప్రేమను పంచడానికే ఆత్మ జన్మలు తీసుకుంటుంది. మానసిక, శారీరక వికలాంగులుగా జన్మ తీసుకునే చైతన్యాలు ఆ కుటుంబాలలో ప్రేమను నేర్పడానికే! నేర్చుకోవడానికే ప్రయాణం ప్రతి ఒక్క ఆత్మచైతన్యం తను ఎందుకు జన్మ తీసుకోవాలో ముందు నిర్ణయించుకుంటుంది. అందుకు ఎలాంటి పాఠం నేర్చుకోవాలి, ఎలాంటి సవాళ్లను అధిగమించాలి, ఏ ప్రదేశంలో, ఏ కుటుంబంలో పుట్టాలి? .. అనేది ఈ ప్రణాళికలో భాగం. కానీ, ఒక్కసారి తల్లి గర్భంలో చేరిపోయాక ‘మాయ’ అనేది ఇనుప తెరలా అడ్డుపడిపోతుంది. అప్పుడు మరపు వచ్చేస్తుంది. దాంతో నేర్చుకోవాల్సిన పాఠాలను మధ్యలోనే ఆపేస్తాం. దీంతో ఆత్మ చైతన్యం వృద్ధి పొందదు. ఎరుకతో గ్రహించేలా ఉన్నతికి సాయం చేసేదే గత జన్మ ప్రతిగమన చికిత్స. – డాక్టర్ న్యూటన్, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చ్ అకాడమీ, హైదరాబాద్ ఆత్మ ప్రణాళికలో 7 సిద్ధాంతాలు 1. ఆత్మ చైతన్యం పొందడం 2. స్వీయ స్వేచ్ఛతో బుద్ధిని వికసింపజేసుకోవడం. 3. పునర్జన్మ ద్వారా పై లోకాలలో ఉండే ఏకత్వస్థితిని భూమండలంలో పొందగలగడం. 4. కర్త, క్రియలు కర్మకారణ శక్తికి దారి తీయడం. 5. ప్రతిజన్మలోనూ మంచి చెడులను తెలుసుకుంటూ పురోగమనిస్తూ ఉండటం. 6. పురోగమనాన్ని ఎరుకతో వేగవంతం చేసుకోవడం. అంటే, త్వరితంగా పాఠాలు నేర్చొకొని ముందుకు సాగడం. 7. మనమంతా విశ్వలోకం నుంచి వచ్చిన జీవాత్మలం. ఏకత్వంలోని ప్రేమతత్త్వాన్ని నింపుకొని చివరకు తిరిగి అక్కడకే చేరుకోవడం. – నిర్మల చిల్కమర్రి -
పగిలిన గతం
అందం ఒక అద్దాల మేడ అయితే... గత జన్మలో విసిరిన రాయి ఈ అద్దాల మేడను పగలగొడితే... మనసు ముక్కలవుతుంది. పొగిలిన మనసు... పగలిన అద్దం.. మళ్లీ అతుక్కుంటాయా? ‘‘హరిణీ నాన్నగారు చూడు నీకోసం ఏం తెచ్చారో..’’ సంబరంగా చెప్పింది కాత్యాయని కూతురుతో. పడుకుని ఉన్న హరిణి లేచి తల్లి వంక చూసింది. తల్లి చేతిలో కొత్త చీర.. ‘‘డాడీ ఆఫీసు పనిమీద ఊరెళ్లారు కదరా! అక్కడ నుంచి మనకోసం బట్టలు తెచ్చారు. లేచి ఈ చీరకట్టుకొని తయారవ్వు. అలా బయటకు వెళ్దాం..’’ కూతురుని హుషారుపరుస్తూ ఆమె చేతిలో చీరపెట్టి తనూ రెడీ అవడానికి వెళ్లింది కాత్యాయని.భళ్లుమని ఏదో గ్లాస్ పగిలిన శబ్దం రావడంతో పరిగెత్తుకు వచ్చింది కంగారుగా! ‘‘హరిణీ ఏంటే నువ్వు చేసిన పని. బంగారం లాంటి అద్దం పగలగొట్టావ్’’ కంగారుగా అడిగింది కాత్యాయని. ‘‘ఈ మొహం చూడు, అద్దంలో ఎలా ఉందో’’ ఏడుస్తూ మంచమ్మీద కూలబడింది హరిణి. కూతురు ప్రవర్తనకి ఏం చేయాలో అర్థంకాలేదామెకు. రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ, అమ్మాయి నల్లగా ఉందంటూ పెళ్లి వారు కారణం చూపుతున్నారు. హరిణి చామనఛాయే కానీ కళగా ఉంటుంది. ఏడాది క్రితం టైఫాయిడ్ వచ్చి జుట్టు బాగా రాలిపోయింది. అస్తమానూ ఏదో పోగొట్టు కున్నట్టు ఆలోచిస్తూ కూర్చుంటుంది. సమయానికి తినదు. మనిషి బాగా పీక్కు పోయినట్టయ్యింది. కూతురుని ఏమీ అనలేక∙కోపాన్ని దిగమింగుకుంది కాత్యాయని. ‘... నన్నిలా చావనీయ్’ హరిణీ.. బాగా లేటయిపోయింది. కాస్త తిందువుగానీ లే..! ప్లేట్లో అన్నం కలుపుకొచ్చి కూతురుని లేపింది కాత్యాయని. ‘నాకొద్దు..’ అంది హరిణి లేవకుండానే!తిండి సరిగ్గా తినక ఇలా పడి ఉంటే ఎలాగే! ఆ కళ్లు చూడు ఎలా గుంటలు పడ్డాయో! కళ్లకింద అంతా నలుపు వచ్చేసింది. తల్లిమాటలకు అంతెత్తున లేచింది హరిణి. ‘‘నేను బాగాలేను కదా! నేను కురూపిని కదా. నన్ను ఇలా చావనీయ్’’ విసురుగా ప్లేట్‌ను తోసేయడంతో గదంతా అన్నం మెతుకులు పడ్డాయి. రోజూ ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. హరిణి ప్రవర్తన కాత్యాయనిని భయపెడుతుంది. వయసు పాతిక.. లేదు పోలిక! ‘‘డాక్టర్.. మా హరిణి. ఎలా ఉందో చూశారుగా! వయసు పాతికేళ్లు. కానీ, మరో పదేళ్లు పైబడినదానిలా తయారైంది. తను అందంగా లేనని ఇంటికే పరిమితం అయ్యింది. తనలో తను కుమిలిపోతోంది. దేని మీదా ఆసక్తి చూపడం లేదు. తన గురించి బెంగగా ఉంది..’’ కృష్ణారావు చెప్పాడు డాక్టర్‌కి. కృష్ణారావు ఆఫీసు పని మీద ఊరెళ్లినప్పుడు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణలో ‘గత జన్మ ప్రభావం ఈ జన్మ మీద ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన థెరపీలు ఏమున్నాయి? ఎలా సమస్య నుంచి బయటపడచ్చు అనేది తెలుసుకున్నాడు. అందంగా లేనని బాధపడుతూ ఇంటికే పరిమితమైపోయిన కూతురుని థెరపీకి తీసుకెళ్లాలనుకున్నాడు. థెరపీ మొదలయ్యింది ధాన్యముద్రలో ఉన్న హరిణికి ఓ కొత్త ప్రపంచం చూస్తున్నట్టుగా ఉంది. ఆ ప్రపంచం తనలోనే ఉందని తను తనలోకే ప్రయాణిస్తుందని.. తన ప్రయాణాన్ని అర్థం చేసుకుంటూ వెళుతోందని గ్రహిస్తోంది ఆమె మస్కిష్తం. కౌన్సెలర్ సూచనలు మొదలయ్యాయి....‘‘హరిణీ... ఈ సమయం నుంచి మీ బాల్యం వరకు మీ మనసుకు బాధను కలిగించిన, అత్యంత సంతోషాన్ని కలిగించిన విషయాలపై దృష్టి నిలపండి. ఏ సంఘటన మిమ్మల్ని అతిగా కలచివేసిందో దర్శించండి.. ’’ అని చెప్పడంతో హరిణి తన అంతర్నేత్రంతో అంతటినీ సమీక్షించుకుంటుంది. తన కాలేజీ రోజులు, స్కూల్, బాల్యంలో స్నేహితులతో ఆడుకున్న విషయాలను ఆనందంగా ఉన్న సంఘటనలను దర్శిస్తోంది. అటు నుంచి తల్లి గర్భంలో ఉన్న స్థితిని, ఆ తర్వాత గతజన్మ ప్రయాణాన్నీ కొనసాగిస్తోంది. ఆ ప్రయాణంలో... ఒక చోట ఆగిపోయింది హరిణి. అంతులేని దుఃఖ సముద్రమేదో ఆమెను కుదిపేసినట్టు వణికిపోతోంది.‘‘చెల్లీ వద్దు.. చచ్చిపోవద్దు...’’ అని ఏడుస్తోంది.‘‘ఏమైంది హరిణీ! ఎవరామె, ఎందుకు మీకు అంత దుఃఖం ’అన్నారు కౌన్సెలర్. దుఃఖంతోనే హరిణి చెప్పడం మొదలుపెట్టింది. కదిలించిన గతం ‘‘నాతోడ పుట్టిన చెల్లెలు. తనకి మచ్చలు వచ్చాయి. జుట్టు తెల్లబడింది. నేను నవ్వుతున్నాను. తను ఏడుస్తోంది. చెల్లెలికి అమ్మనాన్న కొత్త డ్రెస్ తెచ్చారు. ‘దాని మొహానికి కొత్త డ్రెస్ అవసరమా?’ అని నేను ఎగతాళి చేశాను. కొన్నాళ్లకు చెల్లి పెళ్లి ఖాయం అయింది. తను చాలా సంతోషంగా ఉంది. కానీ, తను అందంగా లేదని ఆ పెళ్లి క్యాన్సల్ అయిపోయింది. చెల్లి ఆత్మహత్య చేసుకుంది..’’ హరిణి చెబుతూ ఏడుస్తోంది. ఏడుస్తూ చెబుతోంది. హరిణి దుఃఖం ఆగేంతవరకు ఎదురుచూసిన కౌన్సెలర్ తన సూచనలు ప్రారంభించారు. ‘‘మీ చెల్లిలి ఆ స్థితికి మీరు కారణమయ్యారా!’’ అని అడిగారు. ‘‘కాదు... కానీ, తనను బాధించినవారిలో నేనూ ఉన్నాను. తనని ఎగతాళి చేశాను. మనోవేదనతో కుమిలిపోయే తనకు ఆసరా ఇవ్వకపోగా నా ప్రవర్తనతో బాధించాను...’ దుఃఖం ఉపశమిస్తుండగా చెప్పింది హరిణి. ‘హరిణీ.. మీ మనసు చాలా అందమైనది. మీ చెల్లి మరణానికి మీరు కారణం కాకపోయినా ఎప్పుడో తనను ఎగతాళి చేశాననే అపరాధనా భావం మిమ్మల్ని తొలుస్తోంది. ఆమె మరణంతో ‘శారీరక అందం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదా?’ అనే సంశయం అప్పుడు మీలో పడింది. దీనిని తెలుసుకోవడాకే మీరు ఛాయ తక్కువగా పుట్టి 23 ఏళ్లు చాలా ఆనందంగా జీవించారు. కానీ, ఎప్పుడైతే మీరు అందంగా లేరని పెళ్లిచూపుల పేరుతో వచ్చినవారు అన్నారో అప్పుడు మీకు గత జన్మ తాలూకు శేషం బాధించడం మొదలుపెట్టింది. దీంతో, మెల్ల మెల్లగా డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. అంటే, అప్పుడు మీ చెల్లెలు అనుభవించిన స్థితిని ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. దీనిని గట్టెక్కి ఈ జీవితం అందమైనది అని నిరూపించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ చెల్లెలిని ఎగతాళి చేసినందుకు ఆమెను క్షమించమని అడగండి’’ అన్నారు. కౌన్సిలర్ సూచనలతో పశ్చాత్తాపంతో తన హృదయాన్ని కyì గేసుకోవడం మొదలుపెట్టింది హరిణి. నిదానించిన మస్కిస్తం తాలూకు ప్రశాంతత ఆమె మొహంలో కనిపిస్తోంది. ‘‘హరిణీ.. ఇప్పుడు గతం నుంచి వర్తమానంలోకి రండి. ఇక్కడ నుంచి మరో పదేళ్ల తర్వాత మీ జీవితాన్ని దర్శించండి. ఆ జీవితం ఎలా ఉందో చెబుతూ ఉండండి..’ అన్నారు కౌన్సెలర్. గతం నుంచి వర్తమానంలో తనను తాను చూసుకుంటోంది హరిణి. ఎంతో అందంగా ఉన్న తన జీవితం ఎలా కృంగిపోయిందో అర్థం చేసుకుంది. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంది. అటు నుంచి కౌన్సెలర్ సూచనలను అనుసరిస్తూ భవిష్యత్తును దర్శించింది. తల్లీతండ్రి, భర్త, బిడ్డలు కుటుంబంతో తన జీవితం ఎంతో కళవంతంగా ఉండటం చూసి అమిత ఆనందాన్ని పొందింది. తేలికపడిన మనసుతో మేల్కొంది. చీకటి నుంచి వెలుతురులోకి.. కౌన్సిలర్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ రోజువారీ దినచర్యను మార్చుకుంది. తనకు తానే చీకటి ప్రపంచాన్ని ఎలా సృష్టించుకుందో.. అక్కడ నుంచే వెలుతురులోకి రావడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు కలలను నిజం చేస్తూ తన భవిష్యత్తును అందంగా మలుచుకుంది. డాక్టర్ దీపక్చోప్రా ఇండియన్ ఎయిమ్స్‌లో ఎం.డిగా చేశారు. అమెరికాలో ఉంటున్న ఈ ఆల్టర్నేట్ మెడిసిన్ అడ్వకేట్, రచయిత, వక్త.. ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. సౌందర్యం అంటే ఏమిటి, వయసు పైబడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, మనసును అందంగా ఉంచుకోవడం ఎలా..అనే విషయాల పై ‘ఏజ్‌లెస్ బాడీ, టైమ్‌లెస్ మైండ్’ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. 1993లో వచ్చిన ఈ పుస్తకం 4 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయాయి. గమనిక : ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ అంతర్జాతీయంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియకు విస్తృతమైన ఆమోదం లభించకపోయినా.. థెరపీ ప్రయోజనాలపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని. – నిర్మల చిల్కమర్రి -
ఆ అవకాశం నాకు లేదా?
నా వయసు 18. నేనింతవరకూ మెచ్యూర్ కాలేదు. డాక్టర్లకు చూపించే స్తోమత లేక అమ్మానాన్నలు నన్నిలా వదిలేశారు. ఒకవేళ నేను వైద్యం చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? నాకు కూడా అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకుని సుఖపడాలని అనిపిస్తోంది. అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండే అవకాశం నాకు లేనే లేదా? రజస్వల కావాలంటే నేను ఏం చేయాలి? - మృణాళిని, ఖమ్మం మీరు మీ ఎత్తు, బరువు రాయలేదు. సాధారణంగా అమ్మాయిలు పదకొండు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల లోపు... వారి వారి బరువు, హార్మోన్ల నిష్పత్తిని బట్టి రజస్వల అవుతారు. పద్దెనిమిదేళ్లు దాటినా మీరు రజస్వల కాలేదు అంటే కచ్చితంగా ఏదో సమస్య ఉండి ఉండవచ్చు. థైరాయిడ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, ప్రొలాక్టిన్ వంటి పలు హార్మోన్లలో లోపం... గర్భాశయం, అండాశయాలు లేకపోవడం లేదంటే వాటి పరిమాణం చిన్నగా ఉండటం, జన్యు పరమైన సమస్యలు, మరీ సన్నగా లేక లావుగా ఉండటం, గర్భాశయ టీబీ, యోనిభాగం మూసుకుపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఇలా పదహారేళ్లు దాటిన తర్వాత కూడా మెచ్యూర్ కాకపోవడం జరుగుతుంది. మీకు పరిష్కారం చెప్పాలంటే ముందు మీలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకోవాలి. దాన్నిబట్టి తగిన చికిత్స చేస్తే మీరు తప్పకుండా మెచ్యూర్ అవుతారు. అందరు అమ్మాయిల్లాగే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. మీకు ఖర్చుపెట్టే స్తోమత లేకపోయినా ఫర్వాలేదు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పెద్దాసుపత్రులు ఉన్నాయి. అక్కడి గైనకాలజిస్టును సంప్రదిస్తే స్కానింగ్, రక్తపరీక్షల వంటివి ఉచితంగా చేస్తారు. కారణాన్ని బట్టి తగిన చికిత్స అందిస్తారు. నాకు ఇద్దరు పిల్లలు. సిజేరియన్ ద్వారా పుట్టారు. రెండో సిజేరియన్ అయ్యి రెండేళ్లు అయ్యింది. ఆరు నెలల నుంచి పీరియడ్స్ సమయంలో నా పొట్ట మీద, కుట్ల మధ్యలో చిన్న గడ్డలాగా అవుతోంది. అది బాగా నొప్పి పుడుతోంది. పీరియడ్స తగ్గాక మళ్లీ పది రోజులకు మెత్తబడిపోతోంది. ఎందుకలా అవుతోంది? - స్వర్ణ, విజయవాడ సిజేరియన్ చేసేటప్పుడు గర్భసంచి మీద గాటు పెట్టి, అందులో నుంచి బిడ్డను బయటకు తీస్తారు. ఆ సమయంలో మాయను, గర్భసంచి లోపలి పొర అయిన ఎండోమెట్రియమ్ను కూడా బయటకు తీసివేయడం జరుగుతుంది. ఒక్కోసారి పొరపాటుగా చిన్న ఎండోమెట్రియమ్ ముక్క పొట్టమీద పైన పొరలో కుట్ల కింద ఉండిపోవచ్చు. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి అది అక్కడే కరిగిపోతుంది. కొందరిలో మాత్రం అలా జరగదు. హార్మోన్ల ప్రభావం వల్ల నెలనెలా పీరియడ్స్ సమయంలో గర్భసంచి నుంచి బ్లీడింగ్ ఎలా అవుతుందో, పొట్టమీద కుట్ల కింద ఉన్న ఎండోమెట్రియమ్ ముక్క ఉత్తేజితం అయ్యి అక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది. ఆ రక్తం గడ్డకట్టి అక్కడ మీరు చెప్పినట్టుగా గట్టిగా తయారవుతుంది. మళ్లీ వారం పది రోజులకు ఆ గడ్డ దానంతటదే కరిగిపోతుంది. అందువల్లే నెలసరి సమయంలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. మీరు కొంతకాలం డాక్టర్ పర్యవేక్షణలో హార్మోన్ ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లు వాడి చూడండి. అలా కూడా తగ్గకపోతే... ఆ గడ్డకట్టే ప్రాంతం వరకు చిన్నగా కట్ చేసి, ఎండోమెట్రియమ్ పొరను తొలగించాల్సి ఉంటుంది. నా వయసు 25. రెండేళ్లక్రితం పెళ్లయ్యింది. ఇంతవరకూ గర్భం దాల్చలేదు. డాక్టర్‌కి చూపిస్తే... గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయన్నారు. ఏవో మందులు వాడమంటే వాడుతున్నాను. ఎన్నాళ్లు ఇలా వాడాలి, ఎప్పటివి అవి తగ్గుతాయి అని అడిగితే డాక్టర్ కచ్చితంగా చెప్పడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. అసలు నాకు పిల్లలు పుడతారా? - వనజ, కర్నూలు గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన మార్పులు... ఇలా ఎన్నో కారణాల వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ (నీటి తిత్తులు) ఏర్పడతాయి. ఇవి పదేళ్ల వయసు నుంచి నలభయ్యేళ్ల వయసు వారి వరకు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. వాటి వల్ల ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అవాంఛిత రోమాలు, గర్భం దాల్చడంలో ఇబ్బంది, అబార్షన్ అయిపోవడం వంటి సమస్యలు రావొచ్చు. సమస్యను బట్టి చికిత్స ఎంతకాలం అవసరం అనేది తెలుస్తుంది. ఎవరికీ కూడా మందుల వల్ల నీటి బుడగలు తగ్గిపోవు. కాకపోతే ఆరు నెలల పైన వాడటం వల్ల అవి ఇంకా పెరగకుండా చూడొచ్చు. వాటివల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యత కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. నీటి బుడగల వల్ల కొందరిలో అండం సక్రమంగా పెరగదు. కాబట్టి మీరు వ్యాయామం చేస్తూ, నీటి బుడగలు పెరగకుండా మందులు వాడుతూ ఉండాలి. అండం తయారవడానికి మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ ఆరు నుంచి పన్నెండు నెలల వరకూ ప్రయత్నించవచ్చు. అయినా కూడా గర్భం రాకపోతే... లాపరోస్కోపి అనే చిన్న ఆపరేషన్ ద్వారా నీటి బుడగలను తొలగించుకుని, తర్వాత మందులు వాడితే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. -
ఆటిజం తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. - నిహారిక, కొత్తగూడెం ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య.యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం నలుగురిలో కలవడలేకపోవడం ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ కొలెస్ట్రాల్ అదుపు చేసుకోవడం ఎలా? కొలెస్ట్రాల్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. ఇటీవల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే రక్తంలో పెరిగిందని రిపోర్డు వచ్చింది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వస్తాయని అందరూ అంటున్నారు. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్‌ను ఎలా అదుపు చేసుకోవాలో సలహా ఇవ్వండి. - యాదగిరి, నకిరెకల్లు కొలెస్ట్రాల్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇందులోని ఎల్డీఎల్ అనే రకాన్ని చెడుకొలెస్ట్రాల్గా చెబుతారు. ఎందుకంటే సాధారణంగా రక్తనాళాలు ఒక మంచి రబ్బర్ ట్యూబ్‌లా ఎటుపడితే అటు ఒంగేలా మంచి ఎలాస్టిసిటీతో ఉంటాయి. కానీ ఈ ఎల్డీఎల్ అనేది రక్తనాళంలోపల గారలాగా పట్టేస్తూ ఉంటుంది. దాంతో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగగలిగే రక్తనాళం బిరుసుగా మారడమేగాక లోపలి సన్నబారుతుంది. ఈ కండిషన్‌ను అథెరోస్క్లిరోసిస్ అంటారు. దీని వల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు రావచ్చు. కానీ ఇందులోనే మరో రకం కొలెస్ట్రాల్ ఉంది. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇది మంచి కొలెస్ట్రాల్ అన్నమాట. ఇది రక్తనాళంలోపల గారలా పేరుకుపోతున్న చెడుకొలెస్ట్రాల్‌ను తొలుచుకుంటూ, ఒలుచుకుంటూ పోతుంటుంది. అంటే రక్తనాళాల్లోని పూడికను తొలగించే పనిచేస్తుందన్నమాట. అందుకే హెచ్‌డీఎల్ పాళ్లు పెరుగుతున్నకొద్దీ గారలా పేరుకునే చెడుకొలెస్ట్రాల్ చెక్కినట్లుగా తీసేస్తుంటుంది. అందుకే ఇది గుండెపోటు రాకుండా చూసే కొలెస్ట్రాల్ అన్నమాట. ఇక కొవ్వుల్లో మరో రకం కూడా ఉన్నాయి. వాటిని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. మనం తిన్న ఆహారంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే ప్రక్రియలో ఈ రకం కొవ్వు పుడుతుంది. అది మళ్లీ రక్తనాళాలు సన్నబడటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది. ఇది కేవలం ఆహారపు శక్తిని నిల్వచేసే సమయంలోనే గాక... మన శరీర బరువు పెరిగినా, స్థూలకాయం వచ్చినా, తగినంత శారీరక శ్రమ చేయకపోయినా, సిగరెట్లు, మద్యం తాగినా పెరుగుతాయి. కాబట్టి ఈ కొవ్వు మంచిది కాదు. ఇక మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకూ, మన గుండెను హార్ట్ఎటాక్ రిస్క్‌నుంచి తప్పించుకునేందుకు చేయాల్సిన పని ఏమిటంటే... మనం తీసుకునే ఆహారంలో ఎల్డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాలంటే కరిగే పీచు ఎక్కువగా ఉండే సోయాప్రోటీన్ల వంటి ఆహారంతో పాటు వారానికి కనీసం 150 నిమిషాలు (రోజుకు అరగంట చొప్పున ఐదు రోజులు) వ్యాయామం చేయాలి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ అయినా హెచ్‌డీఎల్ పెరుగుతుంది. అదే వ్యాయామం చెడుకొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్‌లన్నీ ఒకేలాంటివి కావని గ్రహించడంతో పాటు... వ్యాయామం చేయడం అనే ఒకే చర్య అటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని గ్రహించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
శీతాకాలంలో పొడిచర్మానికి చికిత్స!
బ్యూటిప్స్ {పతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాయాలి. అలాగే పొడిబారిన మోచేతులు, పాదాలు వంటి శరీర భాగాల్లోనూ రాయాలి. పొడిచర్మాన్ని రోజుకు పదినిమిషాలు హాట్‌థెరపీ ఇవ్వాలి. గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇదే హాట్‌థెరపీ. ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్ కమలారసం, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడ నల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపు వదులుతుంది. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. ఆయిల్‌ను యథాతథంగా ఒంటికి రాసి మర్దన చేస్తే సరిపోతుంది. ఇది ఇప్పుడు అన్ని సూపర్మార్కెట్లలోనూ దొరుకుతోంది. ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. రకరకాల కాంబినేషన్లతో ప్యాక్‌లు తయారు చేసుకోవడానికి సాధ్యం కానప్పుడు చర్మానికి స్వచ్ఛమైన ఆముదం లేదా అవొకాడో ఆయిల్ రాసి సున్నితంగా మర్దన చేయాలి. -
మాదన్నపేట్‌లో దారుణం చిన్నారిపై కుక్కలదాడి
-
మాదన్నపేట్‌లో దారుణం చిన్నారిపై కుక్కలదాడి
మాదన్నపేట్: మాదన్నపేట్‌లో దారుణం చోటు చేసుకుంది , రెండేళ్ల చిన్నారి లావణ్యపై అర్థరాత్రి కుక్కలదాడి చేశాయి. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది అన్ని, చిన్నానారిని దగ్గరలోని ఆస్సత్రికి తరలించి చిక్సిత అందిస్తున్నారు. -
ప్రకృతి వైద్యం రోగం నయం
ఆల్వాల్‌కు చెందిన జగదీశ్వర్‌కు పక్షవాతం వచ్చింది. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళితే వారం రోజులకే లక్ష రూపాయల బిల్లు చేతిలో పెట్టారు. సరే... జబ్బు నయం అయ్యిందా అంటే అదీ లేదు. నేచురోపతితో ఫలితం ఉంటుందని దగ్గర బంధువు చెప్పడంతో బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2 లోని రెడ్‌క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్‌లో చేరాడు. పది రోజుల్లోనే ఎవరి సహాయం లేకుండా నడుస్తున్నాడు. దీనికి ఆయనకు అయిన ఖర్చు ఐదు వేలు. జీడిమెట్లకు చెందిన సుమిత్ర కొద్దిసేపు నడిచినా, మాట్లాడినా ఆయాసం కమ్మేసి నిస్సాహాయస్థితిలోకి వెళ్తుంది. పలు ఆస్పత్రులు తిరిగి రూ. 70 వేల వరకు ఖర్చు చేసింది. ప్చ్...ప్రయోజనం లేదు. తెలిసిన వారి ద్వారా అదే రెడ్‌క్రాస్‌లో చేరింది. నాలుగు రోజుల తరువాత సోమవారం సాధారణ మనిషిలా డిశ్చార్జ్ అయ్యింది. అందుకు ఆమెకు అయిన ఖర్చు మూడు వేలు. ఇవి జగదీశ్వర్, సుమిత్రల జీవితాల్లో ఎదురైన అనుభవాలు. వీరిద్దరికే కాదు... నిత్యం ఎందరికో రెడ్ క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్ సెంటర్ ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. ప్రకృతి వైద్యానికి చిరునామాగా నిలుస్తోంది. బంజారాహిల్స్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వైద్యం కోసం వస్తుంటారు. ప్రకృతి చికిత్సకు సమాంతరంగా యోగా శిక్షణ ఇస్తూ నగరవాసుల ఒత్తిడిని దూరం చేసే కేంద్రంగా విరాజిల్లుతోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2 (ఎల్వీ ప్రసాద్ మార్గ్)లో 1994 సెప్టెంబర్ 15న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ చేతుల మీదుగా ప్రారంభమైన యోగా అండ్ నేచర్‌క్యూర్ సంస్థ పేద ప్రజలకు సంజీవనియే అయ్యింది. 30 పడకల వసతితో అటు ఇన్ పేషెంట్స్‌కు, మరోవైపు ఔట్ పేషెంట్స్‌కు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి ప్రకృతి చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చారు. చికిత్సలివే... డైట్ థెరపీ (ఆహార చికిత్స): ఫలానా జబ్బుతో వచ్చిన వారికి ఎలాంటి పోషకాహారం ఇవ్వాలి. ఏది తింటే వారికి త్వరగా క్యూర్ అవుతుందనే అంశాలను పరిగణనలోకి ఈ థెరపీని అందిస్తారు. ముఖ్యంగా పండ్లు, గ్రీన్ వెజిటెబుల్స్ అందిస్తుంటారు. మసాజ్ థెరపీ (మర్ధన చికిత్స): ట్యూబర్క్యులసిస్, ట్యూమర్ ఆఫ్ ది స్పైన్, ఆస్టియోమిలిటీ తదితర వ్యాధులతో బాధపడేవారికి ఈ చికిత్స ద్వారా ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లేమేషన్‌ను తగ్గిస్తారు. హైడ్రో థెరపీ (జల చికిత్స): ప్రధానంగా బ్యాక్ పెయిన్‌తో బాధపడే వారికి హాట్ స్పైనల్ బాత్, స్టీమ్ బాత్ (ఆవిరి స్నానం) ద్వారా తగ్గిస్తారు. మాగ్నిటో థెరపీ (అయస్కాంత థెరపీ): పవర్ఫుల్ అయస్కాంతం ద్వారా వెన్నెముక, కాళ్లు, చేతులు, కీళ్ల నొప్పులను తగ్గిస్తారు. ఏయే జబ్బులకు చికిత్స అధిక రక్తపోటు, పెరాలసిస్, గుండె జబ్బులు, ఒత్తిడిని తగ్గిం చడం, వెన్నెముక నొప్పులు, హెపటైటిస్, అన్ని రకాల చర్మ వ్యా ధులు, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గర్భకోశ వ్యాధులు, సెర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలిటిస్, ఆస్టియో ఆర్ధరిటిక్స్, యాక్సైటిక్-న్యూరోసిస్, మైగ్రేన్ తదితర వాటికి సంబంధించి ఇక్కడ ప్రకృతి చికిత్సను అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో యోగా శిక్షణకు దాదాపు 500 మంది హాజరవుతున్నారు. శిక్షణ వేళలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రెండు బ్యాచ్‌లు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మరో బ్యాచ్ చొప్పున యోగా శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా మహిళల కోసం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు రెండు బ్యాచ్‌ల్లో శిక్షణ ఇస్తున్నారు. వార్డుల సమాచారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇన్‌పేషెంట్‌గా చేరే వారి కోసం జనరల్ వార్డు, షేరింగ్ రూమ్ (ముగ్గురు లేక నలుగురు), స్పెషల్ రూమ్(ఒకరు లేక ఇద్దరు)లను కేటాయిస్తారు. జనరల్ వార్డుకు ట్రీట్మెంట్తో కలిపి రూ.400, షేరింగ్ రూమ్‌కు రూ. 500, స్పెషల్ రూమ్‌కు రూ. 700 ప్రకారం ఫీజు వసూలు చేస్తారు. పది రోజుల కోర్సుకు రూ. 2500, 15 రోజుల కోర్సుకు రూ. 3500 వసూలు చేస్తారు. శరీరం చాలా తేలికైంది మోకాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతూ ఇక్కడికి వచ్చాను. నాలుగు రోజుల క్రితం చేరాను. ఇక్కడ చికిత్సతో శరీరం చాలా తేలికయ్యింది. ఇక్కడ స్నేహపూరిత వాతావరణం ఉంది. 15 రోజుల కోర్సులో చేరాను. ట్రీట్మెంట్ బాగుంది. రీజినబుల్ రేట్లు ఉన్నందున అందరికీ అందుబాటులో ఉంది. - కె.మంజుల, గృహిణి బాగా కోలుకున్నా కడుపునొప్పితో బాధపడుతూ ఇక్కడ చేరాను. మల విసర్జన కూడా కష్టంగా ఉండేది. 15 రోజుల క్రితం చేరి డైట్, మసాజ్, యోగా చికిత్సలు తీసుకున్నాను. ఇప్పుడు బాగా కోలుకున్నాను. మలమూత్ర విసర్జనలు తేలికయ్యాయి. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు ఉండటంతో త్వరగా కోలుకుంటున్నారు. - జి.శరత్‌బాబు ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి చికిత్స ఎంతో మేలు ప్రకృతి చికిత్స ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరితగతిన వ్యాధి నయం చేయవచ్చు. వ్యాధిని బట్టి వారికి ఆహారం అందిస్తూ నయం అయ్యేవరకు డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. బయట ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు అయ్యే ఖర్చు ఇక్కడ వందలు, వేలల్లోనే అయిపోతుంది. అయితే డాక్టర్లు చెప్పిన విధంగా ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. - టి.కృష్ణమూర్తి, సూపరింటెండెంట్, రెడ్‌క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్ వ్యాధి మూలాల్లోకి... ఇక్కడ వ్యాధికి సంబంధించిన మూలాల్లోకి వెళ్లడం జరుగుతుంది. రోగ మూలాలను తీసివేస్తేనే వ్యాధి నయమవుతుంది. అందుకే ఇక్కడ ప్రకృతి చికిత్స అందిస్తున్నాం. తక్కువ రేట్లలో నాణ్యమైన చికిత్సలు లభ్యమవుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు నేర్పిస్తాం. - డాక్టర్ దినేష్ రాజ్, డెరైక్టర్ -
రెండు తరాలకు రక్షణ..!
ఒట్టి మనిషికి ఇన్ఫెక్షన్ వస్తే ఒక్కరికే జబ్బు. కానీ గర్భవతికి ఇన్ఫెక్షన్ వస్తే అది ఇద్దరు వ్యక్తులకు వచ్చిన రుగ్మతతో సమానం. అందుకే కాబోయే అమ్మకు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకుంటున్నామంటే రెండు తరాలను రక్షిస్తున్నామని అర్థం. కాబట్టే గర్భవతికి వచ్చే ఇన్ఫెక్షన్లు... వాటి నుంచి రక్షించుకునే మార్గాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అలా తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ ప్రత్యేక కథనం. గర్భవతికి ఇన్ఫెక్షన్లు ఎలా వస్తాయి? మిగతావారిలాగే గర్భణికీ ఇన్ఫెక్షన్లు పలు మార్గాల నుంచి సోకే అవకాశం ఉంది. ఒక వ్యక్తి నుంచి మరొకరికి, జంతువుల నుంచి, దోమల వంటి కీటకాలు, కలుషితమైన కొన్ని రకాల ఆహారాల వంటి వాటి నుంచి కూడా గర్భిణికి ఇన్ఫెక్షన్లు రావచ్చు. గర్భవతిని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడం ఎందుకు? ఒకవేళ గర్భవతికి ఇన్ఫెక్షన్లు వస్తే సమస్య రెట్టింపు అయినట్లే భావించాలి. ఎందుకంటే అది వారిలో సాధారణ మహిళలతో పోలిస్తే సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. అది కాబోయే తల్లికి ప్రమాదం మాత్రమే కాదు... వారికి చికిత్స చేయడమూ కష్టమే. కేవలం తల్లికి మాత్రమే పరిమితం కాకుండా బిడ్డకూ సంక్రమించవచ్చు. పుట్టిన తర్వాత చిన్నారికీ ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తీసుకురావచ్చు. అందుకే సాధారణ మహిళతో పోలిస్తే ఇన్ఫెక్షన్ల విషయంలో గర్భవతికి రెండింతలు జాగ్రత్త అవసరం. ఏయే ఇన్ఫెక్షన్లు తల్లికీ,బిడ్డకూ సమస్యగా పరిణమిస్తాయి? చాలా రకాల ఇన్ఫెక్షన్లు అటు తల్లికీ, ఇటు బిడ్డకూ... ఇలా ఇరువురికీ సమస్యగా పరిణమించవచ్చు. సాధారణ ఇన్ఫెక్షన్లతో పోలిస్తే ఇద్దరికీ ప్రమాదకరంగా మారే కొన్ని ఇన్ఫెక్షన్ల జాబితా ఇది. సైటోమెగాలోవైరస్ అనే ఇన్ఫెక్షన్ను సంక్షిప్తంగా ‘సీఎమ్‌వీ’ అని పిలుస్తారు. ఇది సెక్స్, లాలాజలం, మూత్రం, ఇతర శరీర ద్రవపదార్థాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సీఎమ్‌వీ సోకినవారిలో జ్వరం, గొంతు బొంగురుపోవడం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఇతర ఇన్ఫెక్షన్ పచ్చిమాంసాన్ని తిన్నప్పుడు లేదా ఇంట్లో పెంపుడు పిల్లులు ఉండి, వాటి తాలూకు వ్యర్థాలను తీసివేసినప్పుడు రావచ్చు. పర్వోవైరస్ అనే ఇన్ఫెక్షన్ను ఫిఫ్త్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఇది వచ్చిన వారిలో ముఖంపైనా, ఛాతీమీద, వీపు, భుజాలు, కాళ్లపై ర్యాష్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో కీళ్లనొప్పులు, ఒంటినొప్పులు కనిపిస్తాయి. పర్వోవైరస్ ఉన్నవారి దగ్గరకు వెళ్లివచ్చిన తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మీ డాక్టర్ సంప్రదించాలి. లిస్టేరియా ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం, చలి, వెన్నునొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది చెడిపోయిన ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఒక్కోసారి మనకు ఆహారం చెడిపోయిందన్న విషయమే తెలియక తీసుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. అందుకే డాక్టర్లు గర్భవతిని పచ్చిపాలు, సాఫ్ట్చీజ్, శాండ్విచ్ వంటి వాటి కోసం పొరలుపొరలుగా కోసిన మాంసం (డెలీ మీట్) వంటివి తీసుకోవద్దని చెబుతారు. గర్భిణి తీసుకోవలసిన / తెలుసుకోవలసిన వ్యాక్సిన్లు ఇవి... ఒక మహిళ తాను గర్భవతినని తెలియగానే తనకు వచ్చే అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్ల గురించి, తాను తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఈ వ్యాక్సిన్ల వల్ల గర్భివతికి చాలా తీవ్రంగా పరిణమించగల కొన్ని ఇన్ఫెక్షన్లను ముందుగానే ప్రభావపూర్వకంగా నివారించడం సాధ్యమవుతుంది. పైగా ఆ సమయంలో వీటిని తీసుకోవడం గర్భవతికి పూర్తిగా సురక్షితం కూడా. గర్భిణి తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇవి... ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్ : ఫ్లూ వల్ల గర్భవతిలో జ్వరం, చలిగా ఉండటం, కండరాల నొప్పులు, దగ్గు, గొంతుబొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భవతి విధిగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. సాధారణ ప్రజలు కూడా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే. టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ (డీపీటీ) వ్యాక్సిన్ : టెటనస్ వచ్చిన రోగిలో కండరాలు చాలా అసాధారణంగా ప్రవర్తిస్తాయి. డిఫ్తీరియా వస్తే గొంతులోపల వెనక భాగంలో ఒక మందపాటి పొరగా ఏర్పడవచ్చు. ఇలా జరిగినప్పుడు అది శ్వాస సమస్యలకు కారణమవుతుంది. ఇక పెర్టుసిస్ను ‘కోరింత దగ్గు’ అని కూడా పిలుస్తాయి. ఈ మూడు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోడానికి గర్భవతి విధిగా డీపీటీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రతిసారీ గర్భధారణలో మహిళలందరూ తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు... ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాక్సిన్ : గర్భవతులకు ఫ్లూ వ్యాధి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందుకే ప్రతి సీజన్లో మహిళలందరూ దీన్ని తీసుకోవడంతో పాటు, గర్భవతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక గర్భధారణ సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల పిండంపై పడే దుష్ర్పభావం గురించి అధ్యయనాలు లేనప్పటికీ గర్భం ధరించి ఉన్నప్పుడు తీసుకుంటే బిడ్డ పుట్టాక మొదటి ఆర్నెల్లపాటూ చిన్నారికీ అది రక్షణ ఇస్తుందని ఒక ఊహ. ఇక ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ముక్కుతో పీల్చడం ద్వారా కూడా తీసుకోవచ్చు. కానీ ఈ తరహా ముక్కుతో పీల్చే వ్యాక్సిన్‌ను లైవ్వైరస్తో తయారు చేస్తారు కాబట్టి గర్భవతులు మాత్రం ఈ తరహా పీల్చే వ్యాక్సిన్‌ను వాడకూడదు. టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ (డీపీటీ) వ్యాక్సిన్ : టీ డాప్ అంటూ సంక్షిప్తంగా పిలిచే ఈ వ్యాక్సిన్‌ను గర్భధారణ జరిగిన ప్రతిసారీ తీసుకోవాలి. దీన్ని గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు తీసుకోవాలి. ఇక 27వ వారం నుంచి 36వ వారం మధ్యలో తీసుకోవడం కూడా మంచిదే. ఇలా చేయడం వల్ల పుట్టిన చిన్నారికి కూడా ఆయా వ్యాధుల నుంచి కొంతకాలం పాటు రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లను తప్పించు కోవడానికి ఏ జాగ్రత్తలు పాటించాలి? ఇన్ఫెక్షన్లు వచ్చే పలు మార్గాల గురించి అవగాహన పెంచుకుంటే వాటిని రాకుండానే నివారించుకునే అవకాశం ఎక్కువ. గర్భవతి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి... తరచూ చేతులు కడుక్కుంటూ ఉండాలి. ముఖ్యంగా వంట చేసే ముందు, బాత్రూమ్ నుంచి బయటికి వచ్చాక, డయాపర్స్ మార్చాక, తోటపని చేశాక, చెత్త లేదా జంతువుల వ్యర్థాలను తాకిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. బట్టలను ఉతికిన తర్వాత, పెంపుడు జంతువులను తాకాక, చిన్నపిల్లల ఆటవస్తువులను స్పర్శించాక తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. స్నేహితులతో ఆహారాలను కలిసి తీసుకునే సమయంలో ఎంగిలి పదార్థాలను తీసుకోకూడదు. గర్భవతి తన ప్లేట్లు, పాత్రలు, స్పూన్ల వంటి ఉపకరణాలను వేరుగా ఉంచుకోవడమే మేలు. ఆహారం కలుషితం కాకుండా చూసుకుంటూ పరిశుభ్రమైన వాటినే తీసుకోవాలి. దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఒళ్లంతా కప్పేలా దుస్తులు ధరించడం మేలు. బగ్ స్ప్రేలను ఉపయోగించవచ్చు. అయితే వాటి ఘాటైన వాసన పోయే వరకు ఆ గది నుంచి దూరంగా ఉండాలి. వాసన ఘాటు తగ్గాకే గదిలోకి వెళ్లాలి. సెక్స్ సమయంలో తప్పనిసరిగా జీవిత భాగస్వామి కండోమ్ వాడేలా చూసుకోవాలి. ఎందుకంటే అతడినుంచి గర్భవతికి ఇన్ఫెక్షన్లు సోకవచ్చు. దూరప్రాంతాలకు, ఇతర దేశాలకు ప్రయాణం చేసే సమయంలో ఆ ప్రాంతాల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్లు వ్యాపించి లేవని నమ్మకంగా తెలిశాకే ప్రయాణం పెట్టుకోవాలి. ఎలుకల నుంచి ఎంత దూరం ఉంటే అంత మేలు. వృత్తిపరంగానూ / పిల్లలతోనూ జాగ్రత్త వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) : గర్భం ధరించాక మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తి నుంచి వ్యక్తికి సాంక్రమిక ఇన్ఫెక్షన్లు వ్యాపించవచ్చు కాబట్టి... ముద్దుపెట్టడం, సెక్స్‌లో పాల్గొనడం వంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తిపరంగా వైద్యులు లేదా వ్యక్తుల రక్తం లేదా శరీర ద్రవపదార్థాలతో (లాలాజలం, మూత్రం వంటివి) డీల్ చేసే నర్సుల వంటి వృత్తుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ ద్రవపదార్థాలను కళ్లకు, ముక్కుకు, నోటికి సోకకుండా జాగరూకత వహించాలి. ఇలాంటి సందర్భాల్లో గ్లౌవ్స్ ధరించడం, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ఆహారం, పానీయాలను షేర్ చేసుకోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తమకు మరో చిన్న బిడ్డగానీ లేదా స్కూల్‌కు వెళ్లే వయసు పిల్లలు గానీ ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తమ ఒక్కరికే కాకుండా పిల్లలనూ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడినవారవుతారు. ఇక ఈ పిల్లలు స్కూల్ నుంచి/బయటి నుంచి రాగానే తమను తాకకుండా చూసుకోవాలి. వాళ్లు కాళ్లూ చేతులు కడుక్కుని వచ్చాకే దగ్గరికి రానివ్వాలి. ఎందుకంటే స్కూల్/డేకేర్ సెంటర్స్/ఆటస్థలాలనుంచి రాగానే వాళ్ల చేతుల్లో హానికరమైన ఇన్ఫెక్షన్ను కలిగించే కారకాలు (ఉదా: సైటోమెగాలోవైరస్ వంటివి) ఉండవచ్చు. ఇవి చిన్నపిల్లల్లో దగ్గరే ఎక్కువ కాబట్టే ఈ జాగ్రత్త. ఇంట్లో పెంపుడు పిల్లులు ఉంటే వాటి వ్యర్థాలను తాకకూడదు. ఒకవేళ తాకాల్సి వస్తే తప్పనిసరిగా గ్లౌవ్స్ ధరించాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గర్భవతికి ఇతర ఇన్ఫెక్షన్లు ఉంటే... గ్రూప్-బి స్ట్రెప్టోకాకస్ : చాలామంది మహిళలకు ఈ గ్రూప్-బి స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా అవి పుట్టిన చిన్నారికి సోకే అవకాశం ఉంది. దాంతో నవజాతశిశువుకు అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అందుకే ప్రసవం అయ్యే కొద్దివారాల ముందు డాక్టర్లు గర్భవతికి ఈ బ్యాక్టీరియా ఉందా, లేదా అని పరీక్ష చేస్తారు. ఇకవేళ ఉంటే ప్రసవానికి ముందరే తగిన యాంటీబయాటిక్స్ వాడతారు. జెటెనల్ హెర్పిస్: కొంతమంది మహిళలకు తమ మర్మావయవాల వద్ద హెర్పిస్ ఉంటే బిడ్డ పుట్టే సమయంలో అది పాపాయికీ సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి మర్మావయవాల వద్ద చీరుకుపోయినట్లుగా (హెర్పిస్ ఉన్నట్లు) అనుమానిస్తే డాక్టర్ ఈ విషయాన్ని చెప్పాలి. అప్పుడు డాక్టర్ ప్రసవానికి ముందే కొన్ని మందులు ఇచ్చి ప్రసవ సమయంలో గర్భవతికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చూస్తారు. హెచ్ఐవీ: ఒకవేళ కాబోయే తల్లికి హెచ్ఐవీ ఉంటే అది తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి హెచ్ఐవీ ఉన్నట్లు తెలిస్తే తప్పనిసరిగా డాక్టర్ ఆధ్వర్యంలో మందులు వాడాల్సి ఉంటుంది. దీంతో తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకే అవకాశాన్ని గణనీయంగా తగ్గించే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యగమనిక: ఇంట్లో గర్భవతి మాత్రమే గాక... మిగతా కుటుంబ సభ్యులంతా ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలో అవన్నీ తగిన సమయానికి తీసుకోవాలి. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటే గర్భవతికీ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు చాలా తక్కువ. చేతులు కడుక్కోవడం ఎలా? ఆరోగ్యకరమైన రీతిలో చేతులు కడుక్కోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి... సబ్బు రాసుకున్న తర్వాత మీ చేతులు రెండింటినీ ఒకదానికొకటి కనీసం 15 నుంచి 30 సెకన్ల పాటు రుద్దుకుంటూ ఉండాలి. చేతుల్ని సబ్బుతో శుభ్రపరచుకునే సమయంలో మీ మణికట్టు వరకూ శుభ్రపడేలా చూసుకోవాలి. దాంతోపాటు మీ గోళ్లు, వేళ్ల మధ్యన ఎలాంటి మురికీ లేకుండా శుభ్రమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. రెండు అరచేతులనూ నురగ వచ్చేలా సబ్బుతో రుద్దుకోవాలి. చేతులు కడుక్కున్న తర్వాత విధిగా టవల్‌తో చేతుల్ని పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. చేతులు కడుక్కోవడానికి ఆల్కహాల్ ఉండే జెల్ అయితే మంచిది. ఇది సూక్ష్మజీవులన్నింటినీ తొలగించేలా చేతుల్ని శుభ్రపరుస్తుంది. ఇప్పుడు ఈ తరహా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్‌వాష్‌లు మీ హ్యాండ్‌బ్యాగ్‌లో పట్టేంత సైజుల్లోనూ లభ్యమవుతున్నాయి. వీటిని ఎప్పుడూ దగ్గరుంచుకోవాలి. ఒకవేళ చేతులు దుమ్ముతో మురికిపట్టినప్పుడు మాత్రం మురికిపోయేలా సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు అవి ఆనే చోట్లు... డోర్నాబ్స్, కాలింగ్బెల్స్ వంటి ప్రదేశాలూ శుభ్రంగా ఉంచుకోవాలి. కీటకాలతో జాగ్రత్త చాలారకాలైన ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు డెంగ్యూ, మలేరియా వంటివి దోమల నుంచి వ్యాప్తిచెందుతాయి. అందుకే గర్భవతులు దోమకాటు నుంచి తమను తాము రక్షించుకుంటూ ఉండాలి. దీనికోసం ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు వాడటం మేలు. ఇక ఇంట్లో ఉన్నప్పుడు దోమతెరలు వాడాలి. బయటికి వెళ్తున్నప్పుడు ‘డీట్’ ఆధారిత కీటక నాశనుల(ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్)ను వాడాలి. ఇటీవల ఈ ‘డీట్’ ఆధారిత కీటక నాశనులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ ‘డీట్’ ఆధారిత ఉత్పాదనలలో 10 నుంచి 35 శాతం ‘డీట్’ ఉన్న కీటక నాశనులు లభ్యమవుతున్నాయి. డాక్టర్ సిఫార్సు మేరకు వాటిని తీసుకుని వాడితే వాటి వల్ల గర్భవతులకు గాని / పాలిచ్చే తల్లులకు గాని ఎలాంటి ప్రమాదం ఉండదు (డీట్ అంటే... ఎన్ ఎన్ డై ఇథైల్ మెటా టాల్వమైడ్ అనే రసాయనానికి సంక్షిప్త రూపం. పసుపురంగులో చిక్కటి ద్రవంలా ఉండే దీన్ని రాసుకుంటే ఇది వ్యక్తులకు హాని కలిగించకుండా కీటకాలను దూరం చేస్తుంది). వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? వాస్తవానికి వ్యాక్సిన్‌లో నిర్వీర్యం చేసిన రోగ కారక క్రిమి గానీ లేదా చనిపోయిన రోగ కారక క్రిమి ఉంటుంది. దీన్ని ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలో ప్రవేశపెట్టడం వల్ల రోగ కారక క్రిమిని ఎదుర్కోడానికి తగిన వ్యాధినిరోధకత శరీరంలో పుడుతుంది. మన శరీరంలోకి ప్రవేశపెట్టిన నిర్వీర్యమైన/చనిపోయిన క్రిమి ఎలాగూ జబ్బును కలగజేయదు. పైగా దీన్ని ప్రవేశపెట్టగానే దాంతో పోరాడే యాంటీబాడీలు మన శరీరంలో పుడతాయి. ఒకసారి ఆవిర్భవించిన ఆ యాంటీబాడీలు వ్యాధి కారకాన్ని గుర్తుంచుకుని, మళ్లీ అవి ఎప్పుడు శరీరంలో ప్రవేశించినా, దాన్ని ఎదుర్కొంటాయి. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిని తాను తీసుకున్న వ్యాధి వ్యాక్సిన్ కారణంగా సదరు జబ్బు నుంచి రక్షణ కలుగుతుందన్నమాట. ఇవ్వకూడని వ్యాక్సిన్ జోస్టర్ వ్యాక్సిన్‌ను గర్భవతికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది జీవించి ఉండే వైరస్‌తో తయారు చేసే వ్యాక్సిన్ కాబట్టి. సాధారణంగా దీన్ని 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి సిఫార్సు చేస్తుంటారు. ఆ సమయానికి గర్భధారణ వయసు ఎలాగూ మించిపోతుంది కాబట్టి దీని ప్రభావం గర్భధారణపై ఉండటానికి సాధారణంగా ఆస్కారం ఉండదు. గర్భం దాల్చడానికి ముందుగానే ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలి? గర్భం ధరించడానికి సిద్ధమవుతున్న మహిళలు తాము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోగానే కొన్ని వ్యాక్సిన్లను విధిగా తీసుకోవాలి. అవి... మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్‌పాక్స్ వ్యాక్సిన్లు. గర్భం దాల్చిన తర్వాత ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం గర్భవతికి ప్రమాదం. ఒకవేళ వ్యాధి నిరోధకత అంతగా లేని గర్భవతికి ఈ ఇన్ఫెక్షన్లు సోకితే అది చాలా ప్రమాదకరంగా పరిణమించేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీటిని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకన్నప్పుడు ఇంకా గర్భం దాల్చకముందరే తీసుకోవడం మేలు. ఒకవేళ మీజిల్స్, మంప్స్, రుబెల్లా (ఎమ్ఎమ్ఆర్): ఈ వ్యాక్సిన్ చిన్నప్పుడే రొటిన్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్నారా లేదా అనే సందేహం ఉంటే మీ డాక్టర్‌తో చెప్పాలి. అప్పుడు వారు ఒక రక్తపరీక్ష ద్వారా మీరు ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నారా, లేదా అన్నది నిర్ధారణ చేస్తారు. దాన్ని బట్టి అవసరమైతే ఆ వ్యాక్సిన్ ఇస్తారు. ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్ తీసుకోని మహిళలకు గర్భం దాల్చాక అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో గనక ఆ వ్యాధులు సోకితే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. ఇక రుబెల్లా వైరస్ గనక అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో సోకితే అది బిడ్డలో పుట్టుకతోనే వచ్చే తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. రుబెల్లా వైరస్ సోకవడం వల్ల పుట్టిన బిడ్డలకు వినికిడి సమస్యలు, కళ్లు, గుండె, మెదడు సమస్యల వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. వారిసెల్లా (చికెన్‌పాక్స్) వైరస్: ఈ గర్భవతికి సోకడం వల్ల (ముఖ్యంగా అర్లీ ప్రెగ్నెన్సీలో) బిడ్డలో పుట్టుకతోనే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న రక్తపరీక్ష ద్వారా గర్భిణి గతంలోనే చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి గర్భం ధరించాలనుకునే వారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందరే ఈ పరీక్ష చేయించుకుని, ఒకవేళ చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉండకపోతే గర్భం దాల్చడానికి నెల రోజుల ముందే దాన్ని తీసుకోవడం మేలు. హ్యూమన్ పాపిలోమా వైరస్: హెచ్‌పీవీ అని సంక్షిప్తంగా పిలిచే ఈ వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదో ఏటి నుంచి 26 ఏళ్ల వయసు మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే గర్భం దాల్చకముందే దీన్ని తీసుకోవాలి. కొందరు గర్భవతులు నిర్దిష్టంగా వాడాల్సిన వ్యాక్సిన్లు కొంతమంది గర్భవతులకు కొన్ని అంశాల నుంచి ఎక్కువ ప్రమాదం (హైరిస్క్) ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరంగా దూరప్రయాణాలు చేయాల్సిన వారు ఈ గ్రూపునకు చెందుతారు. ఇలాంటి వారు వారి పరిస్థితికి అనుగుణంగా మరికొన్ని అదనపు వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన ఉంటుంది. అవి... హెపటైటిస్ బి వ్యాక్సిన్ : హెపటైటిస్ బి వైరస్ చాలా తీవ్రమైనది. ఇది కాలేయానికి ఇన్ఫ్లమేషన్ కలగజేస్తుంది. అందుకే దీన్ని నివారించడానికి ఇప్పుడు బిడ్డ చిన్నతనంలోనే వరసగా మూడు మోతాదుల వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ వ్యాక్సిన్ తీసుకోని వారు చాలామందే ఉన్నారు. ఇలా వ్యాక్సిన్ తీసుకోని గర్భవతులు తప్పనిసరిగా దీన్ని తీసుకోవాలి. న్యూమోకాకస్ వ్యాక్సిన్ : న్యూమోకాక్సీ అనేది ఒక రకం బ్యాక్టీరియా. దీని వల్ల నిమోనియాతో పాటు మరెన్నో ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఉదాహరణకు ఒటైటిస్ (చెవి ఇన్ఫెక్షన్స్), మెనింజైటిస్ (మెదడువాపు) వంటివి. కొందరు హైరిస్క్ మహిళలకు న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఈ వ్యాక్సిన్ వాడాలి. ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ : ఇది దోమల ద్వారా వ్యాపించే ఒక రకం వైరల్ జ్వరం. మన దేశంలో లేకపోయినా ఈ వ్యాధి దక్షిణ అమెరికా, ఆఫ్రికాలోని సహారా ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉంది. గర్భధారణ సమయంలో వృత్తిపరంగా ఆయా దేశాలకు వెళ్లాల్సి వస్తే, వీలైతే ఆ ప్రయాణాలను మానుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా దేశాలకు వెళ్లాల్సిన మహిళలు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇందుకోసం సాంక్రమిక వ్యాధుల (ఇన్ఫెక్షియస్ డిసీజెస్)కు చికిత్స చేసే నిపుణుల ఆధ్వర్యంలో తీసుకోవడం మంచిది. ఇతర ఇమ్యూనైజేషన్ ప్రక్రియలు : పైన పేర్కొన్న వ్యాక్సిన్లతో పాటు పరిస్థితులను బట్టి, వారి వారి వ్యక్తిగత వృత్తి వ్యవహారాలను బట్టి మరికొన్ని ఇతర వ్యాక్సిన్లను తీసుకోవడం కూడా అవసరం కావచ్చు. ఉదాహరణకు కలరా, మెనింగోకోకస్, రేబీస్, జపనీస్ ఎన్కెఫలైటిస్, టైఫాయిడ్, హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా బీ వంటి వ్యాక్సిన్లు. మీ గురించి పూర్తిగా తెలిసిన మీ డాక్టర్ మీ వ్యక్తిగత, వృత్తిగత అవసరాలను బట్టి ఆయా వ్యాక్సిన్లు మీకు అవసరమో, కాదో నిర్ణయించి, అవి మీకు ఇస్తారు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
కాకినాడలో బీచ్ శాండ్ ధెరపి