
లండన్: మనసుకు కష్టంగా ఉన్నప్పుడు అక్కున చేర్చుకునే మనిషి, ధైర్యాన్నిచ్చే ఓ భుజం, తలనిమిరి ప్రేమ పంచే స్పర్శ కావాలనిపిస్తుంది. కానీ పెరిగిన ఆధునికత మనిషిని ఒంటరి చేసింది. ఓదార్పునిచ్చేవారు, ప్రేమ పంచేవారు కరువయ్యారు. అలాంటివారికి తానున్నానంటున్నాడు యూకేలోని బ్రిస్టల్‌కు చెందిన ట్రెవర్ హూటన్ (ట్రెజర్). బాధల్లో ఉన్నవారికి కౌగిలినందిస్తున్నాడు. గంటకు రూ.7 వేల చొప్పున చార్జ్ చేస్తూ ‘కడిల్ థెరపీ’ పేరుతో సేవలందిస్తున్నాడు.
‘బాధను పంచుకునే మనిషిలేక మదనపడే వాళ్లుచాలా మంది ఉంటారు. అలాంటి చోట నా అవసరం ఉంటుంది. హగ్ అంటే.. కేవలం కౌగిలి మాత్రమే కాదు, అంతకుమించిన ఆత్మీయ స్పర్శ. నీకు నేనున్నాననే ధైర్యం, అభిమానం, ఓదార్పును ఓ స్పర్శద్వారా పంచడం’ అని చెబుతున్నాడు ట్రెజర్. పదేళ్ల కిందటినుంచే మానవ అనుబంధాల శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న ట్రెజర్.. ఈ బిజినెస్‌ను మే 2022 నుంచి ప్రారంభించాడు. కౌగిలింత అనగానే అభద్రతకు లోనయ్యేవాళ్లు, అపార్థం చేసుకున్నవాళ్లూ ఉన్నారు. అందుకే పూర్తిగా నాన్–సెక్సువల్ అని చెబుతున్నాడు. భారమైన మనసుతో తనదగ్గరకు వచ్చినవాళ్లు దాన్ని దించేసుకుని, సంతోషంగా వెళ్లిపోవడమే ట్రెజర్ మోటో అట. అంతేకాదు.. రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరి మధ్య వచ్చిన అపార్థాలను తొలగించి అనుబంధాన్ని పెంచే ‘కనెక్షన్ కోచింగ్’ కూడా ఇస్తానంటున్నాడు.
ఇదీ చదవండి: ఐఏఎస్‌కు సిద్ధమవుతూ.. అజ్ఞాతంలోకి
Comments
Please login to add a commentAdd a comment