hug
-
3 నిమిషాలు మించి హత్తుకోకండి
వెల్లింగ్టన్: తమను విడిచి విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టుల్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు గుంపులుగా వచ్చి వీడ్కోలు చెబుతుండటం మనం చూసే ఉంటాం. ఇలా ఒక్కో ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పే వారి సంఖ్య పెరుగుతుండటం, వచీ్చపోయే ద్వారాల వద్ద రద్దీ ఎక్కువవడంతో న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ‘‘మీ ఆప్తులకు హత్తుకుని వీడ్కోలు పలకాలంటే గరిష్టంగా మూడు నిమిషాలే హగ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ సమయం మనసారా వీడ్కోలు పలకాలంటే కారు పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోండి’అని ఒక పెద్ద బోర్డ్ తగిలించింది. తమ నిర్ణయాన్ని ఎయిర్పోర్ట్ సీఈఓ డేనియర్ బోనో సమర్థించుకున్నారు. ‘‘విరహవేదన కావొచ్చు ఇంకేమైనా కావొచ్చు. ఆప్తులు దూరమవుతుంటే కౌగిలించుకుంటే ఆ బాధ కాస్తయినా తీరుతుంది. అందుకే కౌగిలించుకుంటే కేవలం 20 సెకన్లలోనే ప్రేమ హార్మోన్ ‘ఆక్సిటాసిన్’విడుదలవుతుంది. బాధ తగ్గుతుంది. అంతమాత్రాన దారిలో అడ్డుగా ఉండి అదేపనిగా హత్తుకుంటే ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. డ్రాప్ జోన్ల వద్ద అడ్డుగా ఉండటం సబబు కాదు’అని ఆయన వాదించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమ వారికి ప్రశాంతంగా కాస్తంత ఎక్కువ సమయం వీడ్కోలు చెప్పడం కూడా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందా? అని కొందరు విమర్శలకు దిగారు. ఎయిర్పోర్ట్ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు. ‘‘మిగతా దేశాల్లో కారులో లగేజీ దింపి హత్తుకుని, ఏడ్చి సాగనంపితే ఆ కొద్ది సమయానికే ‘కిస్ అండ్ ఫ్లై’చార్జీల కింద చాలా నగదు వసూలుచేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఎంతో మంచిది. తొలి 15 నిమిషాలు పార్కింగ్ ఉచితం’’అని ఒక ప్రయాణికుడు మెచ్చుకున్నాడు. ప్రయాణికుల వెంట వచ్చే వారిని తగ్గించేందుకు చాలా దేశాల ఎయిర్‌పోర్ట్‌లు ఆ కొద్దిసేపు కారు ఆపినందుకు కూడా చార్జీలు వసూలుచేస్తుండం గమనార్హం. బ్రిటన్‌లోని ఎస్సెక్స్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఇందుకు 15 నిమిషాలకు దాదాపు రూ.768 వసూలుచేస్తోంది. -
ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ
టోక్యో: భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు జీ7 సదస్సుకు ప్రత్యేక అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే.. మోదీతో జెలెన్ స్కీ సమావేశమయ్యారు. ఉక్రెయిన్ కోసం, అలాగే శాంతి కోసం భారత్ ఎలాంటి ప్రయత్నానికైనా సిద్ధమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 2022, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దురాక్రమణ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ-జెలెన్స్కీల తొలిసారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ తో రష్యా సంబంధాల దృష్ట్యా .. ఉక్రెయిన్, రష్యాల మధ్య రాజీ చర్చలకు ప్రస్తుత పరిస్థితుల్లో మోదీకి మించిన నాయకుడు ఇంకొకరు లేరు. రెండు పక్షాలు నమ్మదగిన ఏకైక దేశం, వ్యక్తి మోదీనే. ఇప్పటికే యుద్ధం వల్ల లక్షలాది మంది చనిపోవడం, గాయపడడం లేదా శరణార్థులుగా మారిన దృష్ట్యా.. అర్జంటుగా యుద్ధం ఆపాల్సిన సమయం ఆసన్నమయింది. ఇదిలా ఉంచితే, మోదీపై తన ఆప్యాయతను ప్రదర్శించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. శనివారం హిరోషిమా(జపాన్)లో జీ7 సదస్సు సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది జీ7 సదస్సుకు ప్రత్యేక అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే.. బైడెన్ రాకను గమనించి కుర్చీలోంచి లేచి మరీ ఆలింగనం చేసుకున్నారాయన. ఈ సందర్భంగా బైడెన్‌తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే వేదికగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను సైతం ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని పలకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో సైతం మోదీ భేటీ అయ్యారు.జీ7 సదస్సు కోసం ఒకరోజు ముందుగానే జపాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని కిషిదాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. #WATCH | Prime Minister Narendra Modi and US President Joe Biden share a hug as they meet in Hiroshima, Japan. pic.twitter.com/bbaYMo1jBL — ANI (@ANI) May 20, 2023 Prime Minister Narendra Modi met Indonesian President Joko Widodo and his wife in Hiroshima, Japan. "India attaches great priority to strong ties with Indonesia," the Prime Minister tweets. pic.twitter.com/l7xcCpC1Uo — ANI (@ANI) May 20, 2023 Ukrainian President Volodymyr Zelensky arrives in Japan's Hiroshima for #G7Summit (Picture source: AFP News Agency) pic.twitter.com/AJc6fJWh7J — ANI (@ANI) May 20, 2023 #G7HiroshimaSummit | British PM Rishi Sunak and PM Narendra Modi share a hug as they meet in Hiroshima, Japan. (Pic source: Rishi Sunak's Twitter handle) pic.twitter.com/fVM91pe4cW — ANI (@ANI) May 20, 2023 -
అన్న తముళ్ల ఫోటో క్షణంలో వైరల్...ఎందుకంటె?
-
పాపం! సహోద్యోగి గట్టిగా కౌగిలించుకున్నాడని కోర్టుకెక్కిన మహిళ..
తనను గట్టిగా కౌగిలించుకోవడంపై కోపగించుకున్న ఓ మహిళ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. ఈ వింత ఘటన చైనాలో చోటుచేసుకుంది. యుయాంగ్ నగరంలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ ఆఫీసులో ఉండగా మగ సహోద్యోగి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని కౌగిలింతతో ఆమె నొప్పితో విలవిల్లాడిపోయి గట్టిగా కేకలు వేసింది. అతను విడిచిపెట్టిన తర్వత కూడా ఛాతీలో నొప్పి రావడంతో తాత్కాలికంగా ఆయిల్ మసాజ్ చేసుకొని ఉపశమనం పొందింది. అయితే అయిదు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు ఎక్స్‌రేలో మహిళకు మూడు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. కుడి వైపున రెండు, ఎడమ వైపున ఒకటి విరిగిపోయాయి. మహిళ ఆసుపత్రి బిల్లులకు భారీగా డబ్బు ఖర్చైంది. అంతేగాక ఆమె ఉద్యోగానికి కూడా వెళ్లేని పరిస్థితి రావడంతో ఆదాయాన్ని కోల్పోయింది. అనంతరం కోలుకుంటున్న సమయంలో సదరు మహిళ తనను హగ్ చేసుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి తన పరిస్థితిని తెలిపింది. అయితే ఆ వ్యక్తి తన కౌగిలింత వల్ల ఇంత గాయం అయ్యిందా? రుజువు ఏంటని ఆమెనే ఎదరు ప్రశ్నించాడు. చదవండి: షాకింగ్: సామాన్య పౌరుడిగా.. లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు దీంతో చివరికి ఆ మహిళ చివరికి తన సహోద్యోగిపై కోర్టులో దావా వేసింది, తన ఆర్థిక నష్టాలకు పరిహారం ఇవ్వాల్సిందిగా కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు 10,000 యువాన్లు (రూ. 1.16 లక్షలు) పరిహారంగా చెల్లించాలని సహోద్యోగిని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ అయిదు రోజుల్లో ఎముకలు విరగడానికి కారణమయ్యే ఏ కార్యకలాపంలో కూడా మహిళ పాల్గొన్నట్లు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. -
హీరోయిన్ రేంజ్లో పరుగెత్తి... చివరికి నేలకి అతుక్కుపోయింది
మనకు ఇష్టమైన వాళ్లని అనుకోకుండా కలిసినా లేదా మనకు ఎదురైనా పట్టరాని సంతోషం వస్తుంది. వాళ్లను చూడగానే హయ్ అని పలకరించడం లేదా కరచలనం చేయడం వంటి పనులు చేస్తాం. బాగా నచ్చిన వాళ్లయితే వెంటనే వాళ్లను హగ్ చేసుకోవడం వంటివి చేయడం సహజం. అచ్చం అలానే ఇక్కడొక ఆమె అత్యుత్సహంతో పరిగెట్టి అబాసుపాలైంది. వివరాల్లోకెళ్తే...ఒక అమ్మాయి తన భర్తను ఎయిర్ పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవానిడానికి వస్తుంది. ఐతే చాలా రోజుల తర్వాత ఒకరినొకరు కలుసుకుంటున్నారు. దీంతో ఆమె ఎయిర్ పోర్ట్‌లో తన భర్త కనిపించగానే ఆనందంతో హగ్ చేసుకోవడానికి పరిగెట్టింది. అచ్చం సినిమాలోని హిరోయిన్ మాదిరి పరిగెడుతుంది. ఇంతలో అనుకోకుండా భర్త స్లిప్ అయి కిందపడిపోవడంతో వేగంగా వస్తున్న ఆమె కూడా భర్తని గుద్దుకుని పడిపోతుంది. ఈ హఠాత్పరిణామానికి అక్కడే ఉన్న కొంతమంది ప్రయాణికులు షాక్ అవుతారు. ఆ జంటకు సాయం చేసేందుకు అక్కడే ఉన్న మిగతా ప్రయాణికులు రాకమునుపే వారికివారే సర్దుకుని లేగిసిపోవడం జరిగిపోతుంది. పైగా సదరు మహిళ జంప్త చేసి మరీ తన భర్తను గట్టిగా ప్రేమతో ఆలింగనం చేసుకుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజనల్లు మొదట ఆ జంటకు మంచి చెప్పులు కొనివ్వాలి ఇలా పడిపోకుండా ఉండేందుకుని అని కామెంట్లు చేస్తు ట్వీట్ చేశారు. 'Falling' in love! 😂 pic.twitter.com/1m2Ojg2uOY — Harpreet (@CestMoiz) August 8, 2022 (చదవండి: వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..) -
Cuddle Therapy: కష్టాలను తీర్చే కౌగిలింత..
లండన్: మనసుకు కష్టంగా ఉన్నప్పుడు అక్కున చేర్చుకునే మనిషి, ధైర్యాన్నిచ్చే ఓ భుజం, తలనిమిరి ప్రేమ పంచే స్పర్శ కావాలనిపిస్తుంది. కానీ పెరిగిన ఆధునికత మనిషిని ఒంటరి చేసింది. ఓదార్పునిచ్చేవారు, ప్రేమ పంచేవారు కరువయ్యారు. అలాంటివారికి తానున్నానంటున్నాడు యూకేలోని బ్రిస్టల్‌కు చెందిన ట్రెవర్ హూటన్ (ట్రెజర్). బాధల్లో ఉన్నవారికి కౌగిలినందిస్తున్నాడు. గంటకు రూ.7 వేల చొప్పున చార్జ్ చేస్తూ ‘కడిల్ థెరపీ’ పేరుతో సేవలందిస్తున్నాడు. ‘బాధను పంచుకునే మనిషిలేక మదనపడే వాళ్లుచాలా మంది ఉంటారు. అలాంటి చోట నా అవసరం ఉంటుంది. హగ్ అంటే.. కేవలం కౌగిలి మాత్రమే కాదు, అంతకుమించిన ఆత్మీయ స్పర్శ. నీకు నేనున్నాననే ధైర్యం, అభిమానం, ఓదార్పును ఓ స్పర్శద్వారా పంచడం’ అని చెబుతున్నాడు ట్రెజర్. పదేళ్ల కిందటినుంచే మానవ అనుబంధాల శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న ట్రెజర్.. ఈ బిజినెస్‌ను మే 2022 నుంచి ప్రారంభించాడు. కౌగిలింత అనగానే అభద్రతకు లోనయ్యేవాళ్లు, అపార్థం చేసుకున్నవాళ్లూ ఉన్నారు. అందుకే పూర్తిగా నాన్–సెక్సువల్ అని చెబుతున్నాడు. భారమైన మనసుతో తనదగ్గరకు వచ్చినవాళ్లు దాన్ని దించేసుకుని, సంతోషంగా వెళ్లిపోవడమే ట్రెజర్ మోటో అట. అంతేకాదు.. రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరి మధ్య వచ్చిన అపార్థాలను తొలగించి అనుబంధాన్ని పెంచే ‘కనెక్షన్ కోచింగ్’ కూడా ఇస్తానంటున్నాడు. ఇదీ చదవండి: ఐఏఎస్‌కు సిద్ధమవుతూ.. అజ్ఞాతంలోకి -
Bigg Boss 5 Telugu: అసలు బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోంది?
అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదా? అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడటం తప్పా? ‘హగ్’ ఇచ్చిపుచ్చుకోవడం తప్పా? ‘బిగ్‌బాస్ 5’లో కంటెస్టెంట్లు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలో జడ్జిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ జడ్జిమెంట్స్ చేస్తున్నది అమ్మాయిలే కావడం గమనార్హం. అసలు బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోంది? ఇన్నేళ్ల స్త్రీ ఉద్యమాలు, మహిళా చైతన్యం, జెండర్ సెన్సిటివిటి ప్రయత్నాలు... ఇవన్నీ చాలామంది సెలబ్రిటీల వరకూ చేరినట్టు లేదు. స్త్రీ, పురుషుల వ్యక్తిగతాల ప్రస్తావన ఎంత చేయాలో కూడా తెలుస్తున్నట్టు లేదు. నటుడు నాగార్జున యాంకర్‌గా పని చేస్తున్న ‘బిగ్‌బాస్ 5’లో కీచులాటలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇంతకు మునుపు లేని తకరార్లు కనిపిస్తున్నాయి. ఒక ఎపిసోడ్లో కంటెస్టెంట్లు రవి, కాజల్‌లు రిపోర్టర్లుగా మారి ప్రతి కంటెస్టెంట్ తో ‘హౌస్ లో ఎవరు భార్య, ఎవరు ప్రియురాలు, ఎవరు పని మనిషి’గా ఉండాలనుకుంటున్నారు అని అడిగితే ‘పనిమనిషి’గా అందరూ మహిళా కంటెస్టెంట్ల పేర్లే చెప్పారు, సరదాగానే. వీరందరికీ ‘పనిమనిషి’ స్త్రీయే. ఒక్కరు కూడా ‘పనివాడు’ కోరలేదు... ఫలానా మగ కంటెస్టెంట్‌ను పనివాడుగా పెట్టుకుంటాను అనలేదు. ‘ఇంటి పని’, ‘పని మనిషి’ స్త్రీకే కేటాయించబడుతోంది ఇంకా. (చదవండి: మిడ్నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్) బిగ్‌బాస్ హౌస్‌లో వంట విషయం కూడా ప్రతిసారి స్త్రీల వ్యవహారంగా మారుతూ ఉంటుంది. మగ కంటెస్టెంట్లు హౌస్‌కు సంబంధించిన ఇతర పని పంచుకున్నా వంటను స్త్రీల పనిగానే స్టీరియోటైప్ చేస్తూ వెళ్లడం కొనసాగుతోంది. గత బిగ్‌బాస్ షో లో నటుడు బాలాజీ వంట పని చేశాడు. ఎన్.టి.ఆర్ బిర్యానీ వండాడు. మగవారిని వంటకు ప్రోత్సహించే ఇలాంటి చర్యలు తక్కువయ్యాయి. ఇక సోమవారం (సెప్టెంబర్ 20) నామినేషన్ సందర్భంగా నటి ప్రియ కొన్ని అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసింది. నటి లహరి కేవలం అబ్బాయిలతోనే మాట్లాడుతోందని ఫిర్యాదు. యాంకర్ రవికి హగ్ ఇస్తూ కనిపించిందని మరో ఫిర్యాదు. ఈమె ఈ రెండు మాటలను ‘క్యాజువల్’గా కాక ‘ఫిర్యాదు’ టోన్‌తో ‘చేయకూడని’ పనిగా చెప్పడంతో హౌస్‌లోని అందరూ హతాశులయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌లో హగ్ ఇవ్వడం సర్వసాధారణమే అయినా ప్రియా చెప్పిన తీరు ‘నింద’ ను వేసేలా, ‘కంట్రోల్’ చేసేలా దానికి లహరి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చేట్టుగా మార్చింది. అమ్మాయిలు పూర్తిగా అబ్బాయిలతో మాట్లాడటం, స్నేహం చేయడం తప్పు అనే ధోరణిని నటి ప్రియ వ్యక్తపరిచింది. ఇంకా ఆమె ‘లహరి సింగిల్ కనుక ఆమె ఎలా అయినా వ్యవహరించవచ్చు... కాని రవి వివాహితుడు కనుక అలా చేయడానికి లేదు’ అని వ్యక్తిగత ప్రవర్తనలు ఎలా ఉండాలో తీర్పులు వ్యక్తం చేసింది. దాంతో నెటిజన్లు భారీగా ప్రియను ట్రోల్ చేస్తున్నారు. -
పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని..
జకార్తా: ప్రేమించిన వారంతా పెళ్లి చేసుకోవాలని లేదు. వేర్వేరు కారణాల వల్ల ప్రేమికులు విడిపోవడం.. వేరే వ్యక్తులతో వివాహం కావడం సాధారణంగా జరుగుతుంది. ఇక ఇలాంటి పెళ్లికి మాజీ ప్రియుడు, గర్ల్ ఫ్రెండ్ వస్తే.. ఆ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక వారి ఎదుటే మరో వ్యక్తిని జీవిత భాగస్వామిగా అంగీకరించడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఓ యువతికి ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరోకరితో వివాహం జరిగింది. మాజీ ప్రియుడు ఆ పెళ్లికి హాజరయ్యాడు. దాంతో యువతి భర్త అనుమతితో అతడిని హగ్ చేసుకుంది. ఇండోనేషియాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఈ వీడియోలో ఓ యువతికి ప్రేమించి వ్యక్తితో కాకుండా మరొకరితో వివాహం అవుతుంది. ఇక ఈ వేడుకకి ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ హాజరవుతాడు. అతడు వేదిక మీదకు ఎక్కి నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తాడు. తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వాలనకుంటాడు. కానీ ఆమె అతడికి చేయి ఇవ్వకుండా.. భర్త వైపు చూసి.. ఒక్కసారి నేను తనను హగ్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. (చదవండి: దట్టమైన సుడిగాలిలో క్రికెట్) ఊహించని ఈ సంఘటనకి వరుడు తొలుత షాక్ అయినా.. ఒప్పుకుంటాడు. దాంతో వధువు తన మాజీ ప్రియుడిని హత్తుకుంటుంది. ఆ తర్వతా సదరు వ్యక్తి వరుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. హగ్ చేసుకుని అభినందనలు తెలపుతాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక నెటిజనలు వధువును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘నీ భర్త ఎంత మంచి వాడైనా.. మరీ ఇలా అతడి ముందే.. తన అనుమతితోనే హగ్ చేసుకోవడం దారుణం’’.. ‘‘నీవ్వు అతడి భార్యగా తగవు’’.. ‘‘బ్రో నీ కళ్లు నిజం చేప్తున్నాయి... నీ భార్య ప్రవర్తన నిన్ను బాధపెట్టింది’’.. ‘‘భర్త ముందే మాజీ ప్రియుడ్ని హగ్ చేసుకున్నావ్.. నీకు అతడంటే ఏ మాత్రం గౌరవం లేదు’’ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. -
ఏం మాటలివి!
చాక్లెటీ ఫేస్.. ప్రియాంక. పెద్ద బొట్టు.. స్మృతీ ఇరానీ. తళుకులు.. జయప్రద. కులుకులు.. హేమమాలిని. సోగ్గత్తె.. మాయావతి. ఇవా రాజకీయ విమర్శలు! ఇప్పుడొకాయన.. మమతకు కరోనా అంటిస్తానంటున్నాడు! ఎలాగంటే.. ఆవిణ్ణి హగ్ చేసుకుంటాడట! ఏం మాటలివి? ఇష్యూ మీద ఢీకొనాలి గానీ.. మనిషి మీదా వెళ్లి పడటం?! రాజకీయాల్లోకి మహిళలు రాలేకపోవడం ఉండదు. వాళ్లను రానివ్వకపోవడం, వచ్చాక నిలదొక్కుకోనీయక పోవడం ఉంటుంది. నానా మాటలు అంటారు. అయితే ఆ మాటలు ‘నువ్వు నీ హామీలు నెరవేర్చలేక పోయావు’ అనే ఆరోపణలతో ఆగేవి కావు. ‘నువ్వేంటో నాకు తెలుసు’ అనేంత వరకు వెళ్తాయి. బీజేపీ కొత్త జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రా కూడా అంతవరకూ వెళ్లారు. ‘కూడా’అని అనడం దేనికంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. యూనివర్శిటీ ప్రొఫెసర్! కార్యదర్శిగా అనుపమ్ శనివారం పదవీ బాధ్యతలు చేపట్టగానే ఆదివారం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరూయ్‌పూర్‌లో ప్రెస్ మీట్ పెట్టి.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా బాధితుల విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన గానీ, అనుచరులు గానీ మాస్క్‌లతో లేరు. మీడియా ప్రతినిధులు ఆ విషయమే అడిగారు. ‘‘మా కార్యకర్తలకు కరోనా అంటే భయం లేదు. ఎందుకంటే.. అంతకంటే ప్రమాదకరమైన మమతా బెనర్జీతో తలపడుతున్నారు’’ అని అన్నారు అనుపమ్. అక్కడితో ఆగిపోలేదు. ‘‘నాకు గానీ కరోనా రావాలీ.. వెళ్లి మమతను హత్తుకుంటాను’’ అన్నారు! ఒక మహిళను అనకూడని మాట. వివేకం నశించినప్పుడు నాలుక కట్టడి తప్పుతుంది. ఇలా కట్టడి తప్పి, మహిళా రాజకీయనేతలను తప్పుగా మాట్లాడిన నాలుకల క్లబ్బులో అనుపమ్ తాజా సభ్యుడు. ఎన్నికల ప్రచారంలో, పార్లమెంటు సమావేశాలలో మహిళా నేతలతో మాటా మాటా వచ్చినప్పుడు వారిని ఎదుర్కోలేక, విమర్శల్ని వారి ఒంటి మీదకో, ఇంటి మీదకో మళ్లిస్తుంటారు పురుష నాయకులు. పురుషులపై పురుషులు, పార్టీలపై పార్టీలు చేసుకునే ఆరోపణలు, విమర్శల్లో కూడా వాళ్లు తిరగడం.. స్త్రీల చుట్టూనే! నాయకుల ఈ నోటి దుడుకుపై ఎన్నికల సంఘం, జాతీయ మహిళా కమిషన్, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఎంతగా అభిశంసించినా, పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు నమోదైనా, సోషల్ మీడియాలో వేల కామెంట్లుగా నిరసనలు వ్యక్తం అయినా.. అవేవీ హెచ్చరికలు కావడం లేదనడానికి తాజా నిదర్శనమే మమతా బెనర్జీపై అనుపమ్ హజ్రా చేసిన వ్యాఖ్యలు. ఆయన కన్నా ముందు అదుపు తప్పిన వారు ఎందరో ఉన్నారు. వారిలో ఎవరు ఎవర్ని ఏమన్నారో ఒకసారి గతంలోకి వెళ్దాం. ‘‘రాంపూర్ ప్రజలారా.. ఉత్తర ప్రదేశ్ ప్రజలారా.. భారతదేశ ప్రజలారా.. ఆ మనిషి ఏమిటో తెలుసుకోడానికి మీకు 17 ఏళ్లు పట్టింది. నేను పదిహేడు రోజుల్లో కనిపెట్టేశాను. ఆమె లోదుస్తులు ఖాకీ రంగువి.’’ (జయప్రద గురించి ఆజమ్‌ఖాన్, సమాజ్‌వాది పార్టీ) ‘‘ఆమె తన తళుకుబెళుకుల వస్త్రాలతో, ఆటపాటలతో రాంపూర్ సాయంత్రాలను రంగులమయం చేయడానికి వచ్చారు.’’ (జయప్రద గురించి ఫిరోజ్‌ఖాన్, సమాజ్‌వాది పార్టీ) ‘‘ఊర్మిళను పార్టీలో చేర్చుకున్నారు. ఆమెకేం తెలుసు పాపం. అమాకురాలు. భోలీ భాలీ లడికీ. పాలిటిక్స్‌లో జీరో నాలెడ్జ్. ఆ కళ్లు బాగుంటాయని కాంగ్రెస్ తెచ్చుకుంది.’’ (గోపాల్‌శెట్టి, బీజేపీ) ‘‘స్మృతీ ఇరానీ గడ్కారి పక్కన కూర్చొని రాజ్యాంగాన్ని మార్చే విషయం మాట్లాడుతోంది. ఆమె గురించి ఓ విషయం చెబుతా వినండి. ఆమె తన నుదుటిపై పెద్ద బొట్టు పెట్టుకుంటుంది. నాకొకరు చెప్పిందేమిటంటే అంత పెద్దబొట్టు పెట్టుకుని కనిపించేవారు తరచు భర్తలను మార్చేవారు అయుంటారని! మారే భర్తల సంఖ్య పెరిగే కొద్దీ బొట్టూ పెద్దది అవుతుందట.’’ (జయదీప్ కవాడే, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ) ‘‘ఆమె ప్రతిరోజూ ఫేషియల్ చేయించుకుంటుంది. మన నాయకుణ్ణి సోగ్గాడు అంటోంది. ఆయన కాదు సోగ్గాడు. ఆరవై ఏళ్ల వయసులో తలకు రంగు వేసుకునే ఆమే సోగ్గత్తె. జుట్టంతా ముగ్గు బుట్ట అయ్యాక కూడా రంగు వేసుకుంటోంది.’’ (మాయావతి గురించి సురేంద్ర నారాయణ సింగ్). ‘‘రాహుల్ గాంధీ మీద నమ్మకం లేదు కాబట్టే, చాక్లెటీ ఫేస్‌లను తెచ్చుకుంటున్నారు.’’ (ప్రియాంక గురించి కైలాశ్ విజయ్‌వర్గియా, బీజేపీ). ‘‘స్కర్ట్లు వేసుకునే పిల్ల చీర కట్టి గుళ్లు తిరుగుతోంది. గంగాజలం అంటే గిట్టని అమ్మాయి గంగానదిని పూజిస్తోంది.’’ (ప్రియాంక గురించి జయకరణ్ గుప్తా, బీజేపీ) ‘‘ఈ సంగతి అందరికీ తెలుసు. ప్రియాంక ఢిల్లీలో ఉన్నప్పుడు జీన్స్, టాప్ వేసుకుంటుంది. నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటుంది.’’ (హరీష్ ద్వివేదీ, బీజేపీ) ‘‘వ్హావ్.. 50 కోట్ల రూపాయల విలువైన గర్ల్ ఫ్రెండ్‌ని ఎక్కడైనా చూశారా!’’ (ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను విమర్శించేందుకు, అతడి భార్య సునంద పుష్కర్‌ను ఉద్దేశించి నరేంద్ర మోదీ). ‘‘బీజేపీలో అందమైన ముఖం ఒక్కటీ లేదు. వాళ్లకున్న ఒకే ఒక్క ఆకర్షణీయమైన ముఖం హేమమాలిని. వోట్ల కోసం ఆమె చేత డ్యాన్స్ చేయిస్తున్నారు. పాటలు పాడిస్తున్నారు. ఆమె కూడా పార్టీకి ఓట్లు రాబట్టడానికి ఆడి, పాడుతున్నారు.’’ (సజ్జన్ సింగ్ వర్మ, యు.పి.ఎ.). -
నెట్లో వైరల్‌గా మారిన ప్లాస్టిక్ హగ్
-
కరోనా హగ్ టైం : వైరల్ వీడియో
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర మరోసారి ఆసక్తికరమైన విషయాన్ని ట్విటర్ లో షేర్చేశారు. కరోనా వైరస్ కోరల్లో చిక్కి ప్రపంచమంతా ఇంకా అల్లాడుతూనే ఉంది. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు, ఊరటలు లభించినప్పటికీ, మనుషులంతా భౌతిక దూరాన్ని పాటిస్తూ..కనీస సామాజిక సంబంధాలకు దూరంగా బతకాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఈ మహమ్మారి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పెద్ద వాళ్ల ఆలింగనాలకు, ఆప్యాయతకు చిన్నారులు, చిన్నారులు, సన్నిహితులు స్పర్శకు పెద్దవాళ్లు నోచుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి అనుభవాన్ని మిస్ కాకుండా కనిపెట్టిన ఒక విలక్షణమైన పరికరానికి సంబంధించిన ఒక వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. (మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!) ఈ పరికరాన్ని సృష్టించడానికి నోబెల్ బహుమతి విజేత కానవసరంలేదు.. కానీ ఆప్తుల ఆలింగనాన్ని కోల్పోయిన వృద్ధుల జీవితాలను ఈ ఆవిష్కరణ మార్చేసింది.... మనం ఎంతో ఎదురు చూస్తున్న వైరస్ టీకా అంత ముఖ్యమైనది ఇది కూడా అని ఆయన ట్వీట్ చేశారు. (కరోనా: వారికి ఎం అండ్ ఎం బంపర్ ఆఫర్లు) -
టైటన్ స్మార్ట్ వాచ్, ధర ఎంతంటే
సాక్షి, ముంబై: కంజ్యూమర్ గూడ్స్ రంగ సంస్థ టైటన్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ, వేరబుల్స్ కంపెనీ హగ్ ఇన్నోవేషన్స్‌ను కొనుగోలు చేసింది. హగ్ ఫౌండర్ రాజ్ నేరావటితోపాటు 23 మంది ఉద్యోగులు జనవరి 1న తమ సంస్థలో చేరారని టైటాన్ వాచెస్, వేరబుల్స్ విభాగం సీఈవో ఎస్.రవికాంత్ తెలిపారు. దీనిని టైటన్ హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్‌గా మార్చినట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌ల సెగ్మెంట్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేప్రణాళికలో భాగంగా హగ్‌ను సొంతం చేసుకుంది. అయితే డీల్ విలువ వివరాలను రవికాంత్ వెల్లడించలేదు. అలాగే ‘కనెక్టెడ్ ఎక్స్ ’ పేరుతో టైటన్ ఫుల్ టచ్ స్మార్ట్‌వాచ్‌ను ప్రవేశపెట్టింది. టైటన్ పోర్ట్‌ఫోలియోలో ఇది టైటాన్ యొక్క 13 వ ఉత్పత్తి. మార్చి నుంచి ఈ స్మార్ట్ వాచ్ అన్ని ప్రముఖ టైటాన్ స్టోర్లలో లభిస్తుంది. 1.2 అంగుళాల ఫుల్ కలర్ టచ్‌స్క్రీన్ , స్మార్ట్ వాచ్ అనలాగ్ హ్యాండ్స్, యాక్టివిటీ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఫోన్, కెమెరా కంట్రోల్, స్లీప్ ట్రాకింగ్, వెదర్ అలర్ట్స్ లాంటి 13 టెక్ ఫీచర్లతో లోడ్ చేయబడిన మూడు వేరియంట్లలో వస్తుంది. ఈ వాచ్ ధర రూ.14,995గా కంపెనీ నిర్ణయించింది. కాగా అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసుకునే నేరావటి 2012లో నిర్భయ ఘటన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి మహిళల భద్రతా సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో హైదరాబాద్ లోని గచిబౌలిలో స్టార్టప్ సంస్థ హగ్ ఇన్నోవేషన్స్‌ను ప్రారంభించారు. ఫాక్స్‌కాన్, ఫిట్నెస్ బ్యాండ్ల సహకారంతో భద్రతా లక్షణాలతో పలు స్మార్ట్ వాచ్‌లను హగ్ రూపొందించిది. 30వేల మంది కస్టమర్లను హగ్ సొంతం. -
‘అందుకే మోదీని కౌగిలించుకున్న’
న్యూఢిల్లీ : కాంగ్రెస్ జాతీయాధ్యక్షడు రాహుల్ గాంధీ శనివారం జేఎన్‌యూ స్టేడియంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుల్వామా దాడితో పాటు.. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకున్న అంశం గురించి కూడా మాట్లాడారు. తొలుత పుల్వామా దాడి గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం వీర జవాన్ల కుటుంబీకులు పడుతున్న బాధ ఎలాంటిదో నేను ఊహించగలను. ఉగ్రవాదం నా కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీసింది. అయితే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హింస ఎన్నటికి సమాధానం కాదు. ప్రేమ మాత్రమే హింసను నాశనం చేయగల్గుతుంద’ని తెలిపారు. ఈ సందర్భంగా లోక్‌సభలో మోదీని ఆలింగనం చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. ‘మోదీ ప్రేమ రాహిత్యంతో బాధపడుతున్నారని నాకు అనిపించింది. ఆత్మీయ ఆలింగనంలోని మాధుర్యాన్ని ఆయనకు తెలియజేయాలని అనుకున్నాను. అందుకే మోదీని ఆలింగనం చేసుకున్నాను. నేను అలా చేస్తానని మోదీ కూడా ఊహించలేదు. ఈ షాక్ నుంచి తేరుకోవడానికి ఆయనకు కాస్తా సమయం పట్టింది’ అని తెలిపారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. దేశ సంపద అంతా కొందరి చేతుల్లోనే ఉందని.. ఇది మంచి పద్దతి కాదని తెలిపారు. -
సిద్ధూకి మద్దతుగా బీజేపీ సీనియర్ ఎంపీ
సాక్షి, కోలకతా: బీజేపీ సీనియర్ నేత శతృఘ్న సిన్హా మరోసారి సొంత పార్టీపై తనదైన శైలిలో స్పందించారు. పాక్ ఆర్మీ చీఫ్‌తో హగ్ వివాదంలో మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి మద్దుతుగా నిలిచారు. దేశ మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో పాకిస్తాన్ ప్రధానమంత్రులను ఆలింగనం చేసుకోలేదా అని సిన్హా ప్రశ్నించారు. పాక్ పర్యటనల సందర్భంగా దేశ ప్రధానులు పాక్ ప్రధానులను హగ్ చేసుకున్నారని గుర్తుచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు, ప్రస్తుత ప్రధాని మోదీ పాక్ పర్యటనల సందర్భంగా అప్పటి ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను కౌగిలించుకోలేదా అని ప్రశ్నించారు. అలాగే ఈ విషయంపై ఇప్పటికే సిద్ధూ వివరణ ఇచ్చిన తరువాత ఇంకా వివాదం ఉంటుందని తాను భావించలేదన్నారు. కోల్‌కతాలో జరిగిన ఒక సదస్సులో శతృఘ్నసిన్హా మాట్లాడుతూ, బిజెపికి వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని, పార్టీకి అద్దంలా వ్యవహరించానని పేర్కొన్నారు. అయితే పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన పార్టీకి వ్యతిరేకమైనట్టు కాదని పేర్కొన్నారు. వ్యక్తుల కంటే పార్టీ గొప్పదనే సూత్రాన్ని నానాజీ దేశ్‌ముఖ్, అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ లాంటి బీజేపీ అగ్రనేతల నుంచి తాను నేర్చుకున్నానని గుర్తు ఆయన చేసుకున్నారు. అంతేకాదు జీఎస్టీ చట్టంపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంక్లిష్టమైన చట్టంగా పేర్కొన్న సిన్హా, దీనిమూలంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొన్నారన్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీపై నోరు విప్పడం తన బాధ్యత అని చెప్పారు. కాగా గత వారం పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ 22వ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన క్రికెటర్ టర్న్డ్ పొలిటీషియన సిద్ధూ పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సిగ్గుమాలిన చర్యగా శివసేన మండిపడగా, కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ బీజేపీ కాంగ్రెస్‌పార్టీపై విరుచుపడిన సంగతి తెలిసిందే. -
పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్‌పై దేశద్రోహం కేసు
-
‘ముందు పెళ్లి చేసుకుని ఆ పని చెయ్’
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాహుల్ కౌగిలింత’ వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. తనని చూస్తే ఎక్కడ కౌగిలించుకుంటానో అని భయంతో బీజేపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారంటూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ నిశికాంత దుబే.. రాహుల్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. (‘లోఫర్లే అలా చేస్తారు’), (అదో రకం షాక్) ‘మేం ఆయన్ని ఎందుకు కౌలిగించుకోవాలి?. పైగా స్వలింగసంపర్కానికి సంబంధించి సెక్షన్ 377ను ఇంకా రద్దు కాలేదు కదా. ఈ సమయంలో రాహుల్‌ను కౌగిలించుకుంటే మా భార్యలు మాకు ఖచ్ఛితంగా విడాకులు ఇస్తారు. అయితే రాహుల్‌కి ఓ సలహా. ఆయన గనుక ముందు వివాహం చేసుకుంటే మంచిది. అప్పుడు నిరభ్యరంతంగా కౌగిలించుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. అయితే దుబే చేసిన ‘తేడా వ్యాఖ్యల’పై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గొడ్డా(జార్ఖండ్)లోని నిశికాంత్ ఇంటి బయట ధర్నాకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
వాళ్ల ఐకమత్యం మాకు మహాబలం
షాజహాన్‌పూర్: ప్రతిపక్షాల ఐకమత్యం తమకే లాభం చేకూరుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే కౌగిలింతతో సరిపుచ్చారని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో శనివారం జరిగిన రైతు ర్యాలీలో మోదీ ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విపక్షాల ఐక్యత, అవిశ్వాసంపై చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ వచ్చి హఠాత్తుగా తనని కౌగిలించుకోవడం తదితర విషయాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక విపక్షాలు పార్లమెంట్లో అవిశ్వాసం పేరిట కాలక్షేపం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘దేశంలో ఇప్పుడు ఒక్కటే దళ్(రాజకీయ పార్టీని ఉద్దేశించి) లేదు. ఎన్నో దళ్లు కలవడం వల్ల ఏర్పడే దల్దల్(బురద) ‘కమలం’ వికసించడానికే దోహదపడుతుంది’ అని మోదీ చమత్కరించారు. ‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణమేంటని ప్రశ్నిస్తే వారు బదులివ్వలేదు. కౌగిలింతతో సరిపెట్టారు’ అని రాహుల్‌నుద్దేశించి అన్నారు. ప్రధాని పీఠంపైనే కళ్లన్నీ.. పేదలు, యువతను విస్మరిస్తూ ప్రతిపక్షాలన్నీ ప్రధాని పీఠం కోసం పాకులాడుతున్నాయని మోదీ మండిపడ్డారు. ‘లోక్‌సభలో శుక్రవారం జరిగిన చర్చను చూశారా? తప్పెవరిదో తెలిసిందా? ప్రతిపక్షాలు దేశం, పేదల గురించి ఆలోచించడం లేదు. ప్రధాని కుర్చీపైనే వాళ్ల కళ్లన్నీ ఉన్నాయి. అవినీతితో పోరాడుతూ దేశం, ప్రజల కోసం పనిచేయడమేనా నా నేరం? ప్రతిపక్షాల కుతంత్రాలు నాకు తెలుసు. సైకిలు(సమాజ్‌వాదీ పార్టీ), ఏనుగు(బీఎస్పీ)తో జతకట్టినా వారిని గెలవనీయం. భారత ప్రజాస్వామ్యంలో 125 కోట్ల మంది ఓటు ద్వారా ఇచ్చిన తీర్పే శిరోధార్యమని, దానికి వ్యతిరేకంగా వెళ్తే మూల్యం చెల్లించుకోక తప్పదని వారిని హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ వారు నన్ను పదవి నుంచి తొలగించాలని ఆరాటపడుతున్నారు’ అని మోదీ మండిపడ్డారు. నాటి ప్రధాని రాజీవ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..ఆనాడు రూపాయి ప్రయోజనంలో పేదలకు కేవలం 15 పైసలే చేరాయని అన్నారు. కానీ తమ ప్రభుత్వం సాంకేతికత సాయంతో పూర్తి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే వేస్తోందని చెప్పారు. ఆ చీకట్లకు బాధ్యులెవరు.? ఎన్డీయే నాలుగేళ్ల పాలనకాలంలోని సంక్షేమ కార్యక్రమాలను పేర్కొంటూ..తాము 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినా, కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా కొన్ని గ్రామాలు చీకట్లోనే ఉన్నాయంటే దానికి కారణమెవరని ప్రశ్నించారు. రైతుల సంక్షేమానికి గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయలేదన్న మోదీ..సాగును లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు. ఈ డిసెంబర్ నుంచి మొలాసిస్, చెరకు రసం నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు మిల్లులకు అనుమతి ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. చెరకు కనీస ధరను క్వింటాలుకు రూ.20 పెంచామని తెలిపారు. -
కౌగిలింత.. కన్నుకొట్టడం... ఏంటది?
సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన పని.. చర్చనీయాంశంగా మారింది. ప్రసంగం ముగిశాక ప్రధాని మోదీ వద్దకు వెళ్లిమరీ కౌగిలించుకుని, షేక్ హ్యాండ్ ఇవ్వటం.. ఆపై తన కుర్చీలో కూర్చుని కన్నుకొట్టడం.. సోషల్ మీడియా మొత్తం అదే చర్చ నడిచింది. సభా వేదికగా జరిగిన ఈ ఊహించని పరిణామంతో ప్రధానితోసహా సభలో ఉన్నవాళ్లంతా విస్మయం వ్యక్తం చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా రాహుల్ చేసిన పనిని తప్పుబట్టారు. ఇక ఈ వ్యవహారంపై యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కూడా తనయుడు రాహుల్‌ను ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఓటింగ్ ముగిశాక బయటకు వచ్చే క్రమంలో రాహుల్‌ను పిలిపించుకుని ఆమె ఓ ఐదు నిమిషాలు మాట్లాడారని, అలా చేయటానికి గల కారణాలను గట్టిగానే నిలదీశారంట. ఈ మేరకు రాహుల్ కూడా వివరణ ఇచ్చుకున్నట్లు ఓ ప్రముఖ వెబ్సైట్ శనివారం ఓ కథనం ప్రచురించింది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ కథనాన్ని తోసిపుచ్చుతూ.. అధ్యక్షుడు చేసిన పనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది స్క్రిప్ట్కాదని ‘జ్యోతిరాదిత్య సింధియా’ చెబుతుండగా.. రణ్‌దీప్ సూర్జెవాలా స్పందిస్తూ... ‘రాహుల్ గాంధీ చేసిన పనికి బీజేపీ ఎందుకంతలా ఊగిపోతుందని’ ప్రశ్నించారు. ‘అదో మ్యాజికల్ హగ్. ద్వేషాలను దూరం చేసేందుకు రాహుల్ అలా చేశారు. అది అప్పటికప్పుడు అలా వచ్చేసింది. దీనిపై రాజకీయం చేయటం సరికాదు’ అని రణ్‌దీప్ తెలిపారు. ఇక రాహుల్ చేసిన పనితో చిప్కో ఉద్యమం గుర్తొచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేయటం తెలిసిందే. బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్.. రాహుల్ డ్రామా బాగుందని.. బాలీవుడ్లో చేరితే ఇంకా బావుంటుందని సలహా ఇస్తున్నారు. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో.. అదేం గ్యాలెరీ షో కాదని, ప్రధానితో పరాచికాలు చేయటం నైతికత అనిపించుకోదని వ్యాఖ్యానించారు. నటనకు నటనే సమాధానం అని వామపక్ష పార్టీకి చెందిన ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. -
లోక్‌సభలో అనూహ్య పరిణామం
-
‘ఓయ్ పిల్లాడా ! ప్రియా వారియర్ కంటే..’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా వివిధ దేశాధినేతలను ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలి ఆలింగనంతో (బేర్ హగ్) చిత్తు చేస్తే, ఆయనకు విపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రూపంలో ఆలింగనంలో పోటీ ఎదురైందనే సరదా చర్చ సాగుతోంది. శుక్రవారం లోక్‌సభలో ఎన్డీఏ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ తన ప్రసంగంతో, ఆ తర్వాత మోదీని ఆప్యాయంగా కౌగిలించుకుని, ఆ వెంటనే సహచర ఎంపీలను ఉత్సాహపరుస్తూ కొంటెగా కన్నుగీటడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాహుల్ చేష్టలన్నింటినీ వివిధ జాతీయ టీవీ ఛానళ్లు పదేపదే చూపాయి. ఈ ఘట్టాలు ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో హాస్యపూర్వక వ్యాఖ్యలు, చర్చలకు దారితీశాయి. ► ‘ఓయ్ పిల్లాడా ! ప్రియా ప్రకాష్ వారియర్ (కన్నుగీటిన సీన్ల ద్వారా పాపులర్ అయిన మలయాళీ నటి) కంటే మెరుగ్గా రాహుల్ కన్నుగీటారు. మున్నాభాయ్ కంటే బాగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి ఆస్కార్ అవార్డ్ రావొచ్చేమో?’ నంటూ గౌతమ్ జోషి ట్వీట్ చేశారు. ► ‘ప్రియా వారియర్ కంటే కూడా నిట్టనిలువునా మనిషిని పడగొట్టేలా కన్నుకొట్టడమంటే ఇదే’నని ఆకాష్ సిన్హా పేర్కొన్నారు ► ఈ కౌగిలింత ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండబోతోంది. ప్రియా వారియర్ కంటే కూడా ఈ కన్నుగీటడం మరింత ఎక్కువగా అంటురోగంగా వ్యాపిస్తుందేమోనన్న సందేహాన్ని గీతాశర్మ వెలిబుచ్చారు. ► అయితే రాహుల్ కన్నుగీటడంపై స్వయంగా ప్రియా వారియర్ ‘ఈ విధంగా కన్నుగీటడం తియ్యటి సంజ్ఞ, చేష్ట. ఇది నాకు సంతోషాన్ని కలిగించింది’ అంటూ స్పందించింది. ► అవిశ్వాసంపై చర్చను పక్కన పెట్టి మోదీపై దాడే రాహుల్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రసంగం బదులు ప్రదర్శన ఇచ్చారు. చిన్నపిల్లాడి మాదిరిగా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేయడం తప్ప ఓ విజనూ లేదూ, రోడ్డు మ్యాపూ లేదు’ అంటూ మరో ట్విటరాటీ సంజూ శర్మ విరుచుకుపడ్డారు ► ప్రధానిని రాహుల్‌గాంధీ ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత చౌకబారుగా కన్నుగీటడం ఆయన అపరిపక్వతను, స్థాయి లేమి తనాన్ని స్పష్టం చేస్తోంది’ అంటూ ఘోస్ స్పాట్ అకౌంట్ ట్వీట్ చేశారు. ► ముఖ్యమైన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ మర్యాదను, నిబంధనలను రాహుల్ తక్కువచేశారు. జప్పీ (కౌగిలింత) తర్వాత కన్నుగీటడం చూస్తుంటే ఆయన ప్రతిపక్ష నేతా లేక మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి పాత్రా? సిగ్గుచేటు...షెహజాద్ జై హింద్ ట్విటర్ అకౌంట్ నుంచి పేర్కొన్నారు ► ఆలింగనం తర్వాత కన్నుకొట్టడమా? భారతీయులను మూర్ఖులను చేయాలనే యత్నం వద్దు రాహుల్. పార్ల మెంట్లో కామెడీ షో ఏం జరగడం లేదు. పార్లమెంట్లో వాస్తవాలు మాట్లాడేటపుడు సీరియస్‌గా వ్యవహరించు. ప్లీజ్ పరిణతి ప్రదర్శించు...బర్ఖా ట్రెహాన్ ట్వీట్ చేశారు. ► ‘వావ్..వావ్ ! ఏమి హగ్ అండీ. ఎంత అద్భుతమైన రోజు ఇది’ అని సంజుక్త బసు వ్యాఖ్యానించారు. ► ‘న్యూ వైల్డ్ స్టోన్ యాడ్ మాదిరిగా ఉంది ఇది’ అని ఓజాస్ ట్వీటారు. ► రాహుల్ తన ప్రసంగంలో బీజేపీ వైఫల్యాలు ఎండగట్టి, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడం ద్వారా మోదీ, బీజేపీ కంటే తాను, కాంగ్రెస్‌పార్టీ ఏ విధంగా భిన్నమైందో చెప్పారు అని శ్రీవత్స పేర్కొన్నారు. -
ఆ అమ్మాయి అమాయకురాలు!
లక్నో: ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఈద్ అల్ ఫితర్(రంజాన్) రోజున ఓ యువతి వరుసబెట్టి కౌగిలింతలు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఈ సంఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. ఇది ఇస్లాం సంప్రదాయానికి వ్యతిరేకమని కొందరు మత పెద్దలు విమర్శించారు. దీంతో మొరదాబాద్ జిల్లా ఇమామ్ మౌలానా ముఫ్తీ మొహమద్ రంగంలోకి దిగారు. ‘మేం ఆ యువతితో మాట్లాడాం. ఆ యువతి చేసిన చర్య పట్ల అసహనం వ్యక్తం చేశాం. అయితే అమాయకత్వంతో తెలీకుండానే ఆమె అలా చేసింది. ఇలాంటి చర్యలను ఇస్లాం అంగీకరించదు. ఇదే విషయాన్ని ఆమెకు వివరించి .. మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త ఉండాలని చెప్పాం’ అని మౌలానా మీడియాకు వివరించారు. మరోవైపు ఆ యువతితో అలింగనంలో పాల్గొన్న వారిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షరియత్ చట్టాలను అతిక్రమించారని, ఇంకోసారి ఇలాంటి జరిగితే ఉపేక్షించబోమని వారిని ఆయన హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ నెల 16న రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ యువతి నగరంలోని ఓ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చింది. అనంతరం మాల్ ఎదుట నిల్చోని యువకులకు ఆత్మీయ ఆలింగనం ఇవ్వడం మొదలుపెట్టింది. ఓ అమ్మాయి స్వయంగా అలాంటి అవకాశం ఇస్తుంటే యువకులు చూస్తూ ఉండిపోతారా..? యువతి హగ్ కోసం పోటీ పడ్డారు. సుమారు అరగంటపాటు చాలా మంది యువకులకు ఆ యువతి ఆత్మీయ ఆలింగనం చేసింది. ఆమెతోపాటు వచ్చిన మరో ఇద్దరు యువతుల యువకుల సంఖ్యను లెక్కపెడుతూ.. పెద్దగా కేకలు పెట్టారు. దీన్నంతటిని అక్కడున్న కొంత మంది మొబైల్ ఫోన్లలో బంధించారు. 50 మందిని కౌగిలించుకున్న ఆ యువతి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. -
ఆమె హగ్ కొసం పోటీ పడ్డారు..!
-
వామ్మో.. వరుసబెట్టి హగ్ ఇచ్చిన యువతి.!
లక్నో: రంజాన్ సందర్భంగా ఆలింగనాలు చేసుకోవడం సాధారణమే. అయితే దానిని మగవారు మాత్రమే చేసుకుంటారు. ముస్లిం సాప్రదాయం ప్రకారం ఆ వర్గానికి చెందిన మహిళలు తెలియని వారికి ఆలింగనాలు ఇవ్వడం చాలా తప్పు. అయితే వీటికి భిన్నంగా చేసి ఓ అమ్మాయి మాత్రం అందరిని షాక్‌కి గురిచేస్తూ ఏకంగా 50మందికి పైగా వరుసబెట్టి హగ్ ఇచ్చింది. ఇలా హగ్ ఇస్తున్న అమ్మాయిని చూసి అబ్బాయిలు క్యూ కట్టారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఈ నెల 16న రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ యువతి నగరంలోని ఓ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చింది. అనంతరం మాల్ ఎదుట నిల్చోని యువకులకు ఆత్మీయ ఆలింగనం ఇవ్వడం మొదలుపెట్టింది. ఓ అమ్మాయి స్వయంగా అలాంటి అవకాశం ఇస్తుంటే యువకులు చూస్తూ ఉండిపోతారా..? యువతి హగ్ కోసం పోటీ పడ్డారు. సూమారు అరగంటపాటు చాలా మంది యువకులకు ఆ యువతి ఆత్మీయ ఆలింగనం చేసింది. ఆమెతోపాటు వచ్చిన మరో ఇద్దరు యువతుల యువకుల సంఖ్యను లెక్కపెడుతూ.. పెద్దగా కేకలు పెట్టారు. దీన్నంతటిని అక్కడున్న కొంత మంది మొబైల్ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆ యువతి ఎవరనే అనే విషయం తెలియదు. -
‘హగ్’ ఇచ్చిన పూరి..!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తొలి అంతర్జాతీయ షార్ట్ ఫిలింను రిలీజ్ చేశాడు. తన గురువు రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో తొలి పోస్టర్ రిలీజ్ చేసిన పూరి, షార్ట్ ఫిలిం కూడా అదే రేంజ్ లో రూపొందించాడు. పెద్దగా కంటెంట్ ఏమీ లేకుండానే.. కేవలం వాయిస్ ఓవర్ తో మూడున్నర నిమిషాల షార్ట్ ఫిలింను నడిపించాడు. చెట్ల వల్ల కలిగే లాభాలు.. వాటిని మనం ఎందుకు కాపాడుకోవాలి అనే విషయాలను ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు. చివర్లో.. పోస్టర్ లో రిలీజ్ చేసిన న్యూడ్ స్టిల్ తో తన మార్క్ చూపించాడు పూరి. క్వాలిటీ పరంగా మాత్రం హగ్ ఆకట్టుకుంటుంది. ఇసాబెల్లా అందాలు, సందీప్ చౌత నేపథ్యం సంగీతం.. పూరి టేకింగ్ ఇలా అన్నీ కలిసి హగ్ షార్ట్ ఫిలింకు అంతర్జాతీయ స్థాయి తీసుకువచ్చాయి. My 1st international short film #HUG They don’t need us , We need them ... here’s the link 👇🏻https://t.co/rf6S6Ni0UU#PCfilm@PuriConnects @Charmmeofficial @Sandeep_Chowta @junaid_editor @anilpaduri — PURI JAGAN (@purijagan) 31 December 2017 -
పూరి జగన్నాథ్ షార్ట్ ఫిలిం ‘హగ్’
-
పూరి ‘హగ్’పై వర్మ ఏమన్నాడంటే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ మొదటిసారి ‘హగ్’ అనే ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కంచడం విశేషం. ఇటీవల పూరి ‘నా తొలి షార్ట్ ఫిల్మ్ ‘హగ్’ ఆ నెల 31న ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నాం. రెడీగా ఉండండి అని’ ‘హగ్’ పోస్టర్ కూడా పోస్టు చేసిన విసయం తెలిసిందే. ఈ షార్ట్ ఫిల్మ్‌పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఆయన తన ఫెస్‌బుక్‌లో ‘ నేను పూరి జగన్ ‘హగ్’ షార్ట్ ఫిల్మ్‌ను చూశాను. వారి పనితీరు చాలా అద్భుతంగా ఉంది. ఈ ‘హగ్’ సానుభూతి, గిల్ట్, ప్రేరణ వంటి రకరరాల భావోద్వేగాలను కలిగిస్తుంది’ అని వర్మ పోస్టు చేశాడు. బాలకృష్ణతో ‘పైసా వసూల్’ సినిమా తర్వాత పూరి కొడుకు ఆకాశ్‌తో ‘మెహబూబా’ సినిమా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. -
పూరి హగ్...
చిన్న చిత్రాల ద్వారా తమ ప్రతిభ నిరూపించుకుని ఫీచర్ ఫిల్మ్స్ డైరెక్టర్ అయిన వారు టాలీవుడ్లో ఉన్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ తొలిసారి ‘హగ్’ అంటూ ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించడం విశేషం. ఇప్పటివరకూ డైరెక్టర్‌గా తనలోని ఒక కోణం మాత్రమే చూపించిన ఆయన ఈ నెల 31న మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. బాలకృష్ణతో ‘పైసా వసూల్’ సినిమా తర్వాత తనయుడు ఆకాశ్‌తో ‘మెహబూబా’ సినిమా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు పూరి. ‘ఈరోజు (శనివారం) సాయంత్రం 5 గంటలకు పూరి ఓ వార్త చెప్పబోతున్నారు’ అంటూ చార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనయుడితో తీస్తున్న ‘మెహబూబా’ సినిమా గురించి చెబుతారా? లేక మరో విషయం ఏదైనా ఉంటుందా? అనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. ‘‘నా తొలి షార్ట్ ఫిల్మ్ ‘హగ్’. ఈ నెల 31న ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నాం. రెడీగా ఉండండి’ అంటూ ‘హగ్’ పోస్టర్ కూడా పోస్ట్ చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు పూరి. -
పూరి మరో సంచలనం; తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్: తాను రూపొందించిన షార్ట్ ఫిలిమ్ ‘హగ్’ ఈ నెల 31 విడుదల చేయనున్నట్టు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం ట్విటర్లో పోస్ట్ చేశారు. సాయంత్రం 5 గంటలకు పూరి జగన్నాథ్ ఆసక్తికర ప్రకటన చేయనున్నారని ఈ రోజు ఉదయం నటి ఛార్మి ట్వీట్ చేశారు. అయితే తన కుమారుడు హీరోగా తెరకెక్కిస్తున్న మెహబూబా సినిమాకు సంబంధించిన ప్రకటన ఉంటుందని అభిమానులు అనుకున్నారు. ఊహించనివిధంగా షార్ట్ ఫిలిమ్ విడుదల తేదీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు పూరి జగన్నాథ్. అయితే ‘హగ్’ పోస్టర్‌పై ట్విటర్లో విమర్శలు వెల్లువెత్తాయి. కామెంట్లు, ఫొటోలు, వీడియోలతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ‘మీరు కూడా రాంగోపాల్ వర్మలా తయారయ్యారు, ఆర్జీవీ ఫ్యామిలీ అంతా ఇంతే. పోస్టర్ విషయంలో మరోసారి ఆలోచించుకోండి’ అంటూ కామెంట్లు పెట్టారు. ‘హగ్’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అభిమానులు పేర్కొన్నారు. ఏదిఏమైనా పూరి జగన్నాథ్ మరోసారి సంచలనానికి తెర తీశారు. -
మహిళను ఆలింగనం చేసుకున్న రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక మహిళ ఆవేదన విని.. తట్టుకోలేక అనూహ్య రీతిలో ప్రతిస్పందించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్ సహా మరికొందరు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు తమ కష్టాలను రాహుల్‌గాంధీకి వివరిస్తున్నారు. ఈ సమయంలో.. రంజనా అశ్వతి అనే మహిళ లేచి తన కష్టాలను రాహుల్‌గాంధీకి వివరించడం మొదలు పెట్టారు. ‘నేను 1994 నుంచి పార్ట్ టైమ్ టీచర్‌గా కెరీర్ మొదలు పెట్టాను. అప్పట్లో నాకు రూ. 2500 జీతం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ. 12000 వేలు జీతం వస్తోంది. ప్రతి మహిళకు ప్రసూతి సెలువు తప్పక ఇస్తారు. అయితే ఈ ప్రభుత్వం నాకు ప్రసూతి సెలవు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది’’ అని ఉద్వేగంతో చెప్పారు. అప్పటివరకూ వేదిక మీద నిలబడి ఆమె బాధలు వింటున్న రాహుల్ గాంధీ ఒక్కసారిగా వేదిక దిగి వచ్చి.. ఆమెను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక చర్య.. పది మాటలకంటే ఎక్కువ ధైర్యాన్నిస్తుంది.. అని చెప్పారు. రాహుల్ గాంధీ ఆమెను ఆలింగనం చేసుకున్న సమయంలో సభలో ఉన్నవారంతా.. గట్టిగా చప్పట్లు కొట్టడం విశేషం. ఒక మహిళ ఆవేదన విని.. తట్టుకోలేక స్పందించిన రాహుల్ -
‘మరిన్ని కౌగిలింతలు కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆలింగనం చేసుకున్న సమయంలో విమర్శలు గుప్పించిన రాహుల్.. మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేశారు. ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గృహనిర్భంధం నుంచి విడుదలైన నేపథ్యంలో.. ట్విటర్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ వ్యంగ్య విమర్శలు చేశారు. ‘ప్రధాని మోదీజీ.. సత్వరం మరిన్ని ఆలింగనాలు కావాలి.. త్వరపడండి’ అంటూ ట్వీట్ చేశారు. ‘నరేంద్ర భాయ్.. ముంబై సూత్రధారి బయటకు వచ్చాడు. లష్కరే తోయిబా నుంచి పాక్ మిలటరీ ఫండింగ్‌ను ట్రంప్ వేరు చేశాడు. మీ ఆలింగనాల దౌత్యం విఫలమైంది (హగ్‌ప్లోమసీ). కాబట్టి సత్వరం మరిన్ని ఆలింగనాలు కావాలి’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. Narendrabhai, बात नहीं बनी. Terror mastermind is free. President Trump just delinked Pak military funding from LeT. Hugplomacy fail. More hugs urgently needed.https://t.co/U8Bg2vlZqw — Office of RG (@OfficeOfRG) November 25, 2017 -
ఒక్క కౌగిలి... నేరస్థుడిని మార్చింది..!
-
ఒక్క కౌగిలి... నేరస్థుడిని మార్చింది..!
స్నేహం మనిషిని మారుస్తుందా? హంతకుడిని మానిషిని చేస్తుందా? ఇటువంటి ప్రశ్నలకు సజీవ సాక్ష్యాలుగా.. ఇయాన్ మాన్యుయేల్, డెబ్బీ బెగ్రీ నిలుస్తారు. స్త్రీ పురుష సంబంధాలు బలహీనమవుతున్న ఈ కాలంలో స్నేహం విలువను కాపడడమేకాక కొత్త విలువలు చాటారు. వీరిద్దరి గురించి చెప్పుకోవాలంటే దాదాపు రెండున్నర దశాబ్దలు వెనక్కు వెళ్లాలి. అది 1991 సంవత్సరం. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతం. నిత్యం రద్దీగా ఉండే పార్క్ ఏరియా. అక్కడ తన ఇద్దరు పిల్లలతో కలిసి డెబ్బీ (28) అక్కడకు వచ్చింది. అంతలోనే దారి దోపిడీ చేసేందుకు 13 ఏళ్ల ఇయాన్ మాన్యుయేల్ అక్కడకు వచ్చాడు. చూస్తున్నంతలోనే ఇయాన్ చేతిలోని తుపాకి బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. డెబ్బికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఇయాన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చారు. దోపిడీ, హత్యా నేరాలపై విచారణ జరిపిన కోర్టు.. ఇయాన్కు యావజ్జీవ శిక్ష విధించింది. శిక్ష పడే నాటికి ఇయాన్కు 14 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులోనే జీవితం జైలుకు అంకితం కావడంతో ఇయాన్ విలవిల్లాడాడు. ఏడాది తరువాత పశ్చాత్తాపం మొదలై.. డెబ్బీతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. మొదట్లో ఇయాన్‌తో మాట్లాడేందుకు డెబ్బీ అంగీకరించలేదు. అయితే ఇయాన్ పట్టుదల చూసి క్షమించి అతనితో మాట్లాడడం మొదలు పెట్టింది. ఇది క్రమంగా స్నేహంగా మారింది. ఆ తరువాత ఈ స్నేహం మరింత గట్టిపడింది. ఇక్కడ నుంచే కథ మరో మలుపు తిరిగింది. ఇయాన్‌ను విడిపిచడం కోసం డెబ్బీ.. ఈక్వల్ జస్టిస్ ఇన్షియేటివ్ సంస్థను కలిసింది. ఆ సంస్థ లాయర్ బ్రెయాన్ స్టావెన్సన్.. ఇయన్ తరఫున వాదించేందుకు అంగీకరించాడు. వాదనలు.. ప్రతివాదనలు సుదీర్ఘంగా సాగాయి. చివరకు ఇయాన్కు క్షమాభిక్ష పెట్టేందుకు కోర్టు అంగీకరించింది. చిట్టచివరకు ఇయాన్ 39 ఏళ్ల వయసులో జైలు నుంచి 2016 ఆఖరులో విడుదల అయ్యారు. జైలు నుంచి విడుదల అయిన తరువాత కూడా ఇయాన్-డెబ్బీలు తమ పవిత్ర స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇయాన్ నా పిల్లలతో సమానం అంటోంది డెబ్బీ. ఈ పరిణామాల క్రమాన్ని ఇద్దరు కలసి ఒక వీడియో రూపొందించి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మోదీ ఆలింగనంపై విపరీతార్థాలు
హైదరాబాద్: ప్రముఖులు కలిసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిని ఆలింగనం చేసుకోవడంపై ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనను మోదీ హత్తుకోవడంపై సోషల్ మీడియాలో కొందరు చేసిన విపరీతార్థాలు, వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తన వెబ్ సైట్ లో చిలువలు పలువలుగా చూపించి హల్ చల్ చేసే ప్రయత్నం చేసింది. సాధారణంగా చిన్నవ్యక్తి కావొచ్చు.. పెద్ద వ్యక్తి కావచ్చు.. చిరుద్యోగి కావొచ్చి.. పెద్ద హోదాలో ఉన్న ఉద్యోగి కావొచ్చు.. గల్లీ నాయకుడు కావొచ్చు.. ప్రపంచ నేత అయ్యుండొచ్చు.. వీళ్లలో ఎవరూ ప్రత్యేకంగా ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు వెళ్లినా, మోదీ వారిని కలిసేందుకు వెళ్లినా అక్కడ జరిగే మొట్టమొదటి పని ప్రధాని నరేంద్రమోదీ వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం. ఇలా చేయడం ద్వారా వాత్సల్యంతో పాటు సందర్భానుసారం అర్థం ఉంటుంది. ఒకరికొకరం భరోసా అని చెప్పుకోవడం కూడా దాని ఉద్దేశం అయి ఉంటుంది. భారతీయ సంప్రదాయంలో ఇమిడి ఉన్న ఈ అంశాన్ని పెద్దగా బయటకు కనిపించకపోయినా చాలామంది పాటిస్తూనే ఉంటారు. అయితే, ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ కాస్త వక్రీకరించిన రీతిలో వాషింగ్టన్ పోస్ట్ తన వెబ్ సైట్ లో ఒక కథనాన్ని వెలువరించింది. మోదీ అభ్యంతరకరంగా అనిపించేలా ఏ నేతను వదిలిపెట్టకుండా అందరినీ హగ్ చేసుకుంటున్నారంటూ అందులో పేర్కొంది. అయితే ఇది తన సొంత ఉద్దేశం కాదని చెప్పేందుకు... మోదీ ఇతర దేశాల నేతలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలపై కొందరు వ్యక్తుల నెగెటివ్ స్పందనను జత చేసి ట్యాగ్స్ ఆ కథనానికి తగిలించింది. ముఖ్యంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయను ఆలింగనం చేసుకున్నప్పటి ఫొటోలను ఉద్దేశిస్తూ కొందరు ట్విట్టర్లో చేసిన కామెంట్లను ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. అందులో మోదీ ఆలింగనం చేసుకున్న విధానం ఎబ్బెట్టుగా ఉందన్నారు.. దీంతో హోలాండే తప్పించుకునేందుకు వెనక్కి తిరిగారు కానీ... అంటూ రాశారు. మరో ఫొటోలో మోదీ, హోలాండే గుర్రం ఎక్కి ఉన్నట్లుగా ఒక ఫొటో చూపిస్తూ మిస్టర్ అండ్ మిసెస్ హోలాండ్ పానిపట్‌కు వెళ్లే మార్గంలో... అని సోషల్ మీడియాలో ఒకరిద్దరి కామెంట్స్ ఆధారంగా కథనం అల్లేశారు. హోలాండే వెనుక భాగంలో మోదీ ఉన్న ఫోటోను టైటానిక్ లో హీరో హీరోయిన్ ఫొటోతో పోల్చారు. షిప్ లేకుండా నేలపై టైటానిక్ చిత్రంలోని ఫేమస్ సీన్ చూపించిన ఏకైక వ్యక్తి మోదీ ఒక్కరే.. మరో ఫొటోను చూపిస్తూ.. ఇంత దగ్గరిగానా ఇక చాలు.... అంటూ కామెంట్స్ పోస్టు చేశారు. మరొకరు మాత్రం ఆలింగనం అనేది ఫ్రెంచ్ సంస్కృతి కాదని మోదీకి ఎందుకు తెలియజేయలేదు.. అది కూడా వెనుక నుంచి.. వెనుక నుంచి హోలాండ్ను హగ్ చేసుకోవడం ఏవగింపుగా అనిపించడం లేదా అంటూ మరో వ్యక్తి చేసిన ట్వీట్‌ను అందులో పేర్కొంది. దీంతోపాటు ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు ఆయా నాయకులను ఆలింగనం చేసుకున్న ఫొటోలను పెట్టారు. -
'హత్తుకున్నాక.. 4 రోజులు స్నానం చేయలేదు'
బెంగళూరు: జీవితంలో తాను సాధించిన విజయాలు, పేరు ప్రతిష్ఠలు తన తండ్రి, కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్‌కు అంకిత మిస్తున్నట్టు ఆయన కుమారుడు శివరాజ్ కుమార్ ప్రకటించారు. కర్ణాటక చలనచిత్ర అకాడమీ, బెంగళూరులో నిర్వహించిన బెళ్లి హెజ్జి కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ దంపతులకు నిర్వాహకులు ఘన సన్మానం చేశారు. అనంతరం శివరాజక్ కుమార్ తన జీవితంలోని కొన్ని సంగతులను మీడియాతో పంచుకున్నారు. తండ్రి అడుగు జాడల్లోనే తాను నడుస్తున్నానని, ఆయనే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. . ఆయన తన నటజీవితంలో చిన్నా, పెద్దా నటులందరితోనూ కలిసి పనిచేశారని ఈ స్టార్ హీరో గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా శంకర్ నాగ్, అనంత్ నాగ్, విష్ణువర్ధన్, అంబరీష్ అందరితో నటించారన్నారు. తాను కూడా భవిష్యత్తులో కన్నడ సినీ పరిశ్రమలో హీరోలందరితోనూ నటించే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పారు. తాను చిన్నప్పటినుంచి స్టార్ కొడుకుగా కాకుండా సాధారణ పిల్లాడిలా పెరిగానని చెప్పుకొచ్చారు. కాలేజీకి బస్ లో వెళ్లేవాడినన్నారు. తాను సినిమాల్లోకి రాకుండా ఉండి వుంటే మంచి క్రికెటర్ అయి వుండేవాడినని తెలిపారు. కాలేజీలో చదువుకునే సమయంలో క్రికెట్ బాగా ఆడేవాడిననీ, దాన్ని అలా కొనసాగించి ఉండి ఉంటే దేశం కోసం మంచి క్రికెటర్‌గా మిగలేవాడినన్నారు. కానీ విధి మరోలా ఉండి యాక్టింగ్ స్కూలుకు వెళ్లాల్సి వచ్చిందంటూ చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనొక ఆసక్తికర విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే తనకు చాలా ఇష్టమని, వల్లమాలిన అభిమానమని చెప్పారు. అందుకే ఒకసారి కమల్ హాసన్ తనను ఆలింగనం చేసుకున్నపుడు నాలుగు రోజులు స్నానం చేయలేదన్నారు. ఎందుకంటే ఆయన్ని హత్తుకున్న పరిమళం తనను వీడిపోవడం ఇష్టంలేక అలా చేశానని వెల్లడించారు. కాగా ఇప్పటికే 100 సినిమాల మార్క్ ను దాటి విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న శివరాజ్ కుమార్, యువహీరో సందీప్‌తో కలిసి 'కుంభ మేళా'లో నటించనున్నారు. దీంతోపాటు సోదరుడు, మరో టాప్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. -
అవినీతితో నీతి బిగి కౌగిలి...
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం నెటిజెన్లకు కూడా ముచ్చటేసింది. అయితే అవినీతి కేసులో ఇప్పటికే దోషిగా తేలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అర్హత కోల్పోయిన లాలూ ప్రసాద్ యాదవ్ వేదికపై చేసిన హంగామా నచ్చలేదు. అవినీతిని కూకటి వేళ్లతో సహా నిర్మూలిస్తామని శపథం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాలూను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అంతకన్నా నచ్చలేదు. దీనిపై సోషల్ వెబ్సైట్లలో, ముఖ్యంగా ట్విట్టర్లో ఎవరికి వారు తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. వ్యంగ్యోక్తులు విసిరారు. ‘అవినీతిని నీతి కౌగిలించుకున్న వేళ....లాలూను కేజ్రీవాల్ కౌగలించుకున్నారు. ఇక దేశం అవినీతి అనేది సమస్సే కాదు...అవకాశవాదానికి హద్దులు లేవు....అత్మవంచనకు పరాకాష్ట....కేజ్రివాల్ మెదడుకు ఇన్ఫెక్షన్ సోకినా ఆప్ కార్యకర్తలు ఇప్పటికీ ఆయన్ని ప్రేమిస్తారు....దాణా కేసులో కోట్లు కూడబెట్టి పాతిక లక్షల ఫైన్, కొన్నేళ్లు జైలు శిక్షతో సరిపెట్టుకున్న లాలూ ఇది మంచి డీల్....అవినీతి భరితమైన వ్యవస్థ దానంతట అదే ప్రక్షాళన అవుతుంది. కాకపోతే మనం కోరుకున్నట్టు కాదు....ఇదేమి వైచిత్రి, భారత రాజకీయాలే అంత...’ సోషల్ వెబ్సైట్లలో విమర్శల వర్షం కురిసింది. -
‘నన్ను నమ్మితే కౌగిలివ్వండీ!’
పారిస్: నగరమంతా విషాధం అలుముకున్న సమయం అది. ఇటీవల టెర్రరిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 129 మంది అమాయక ప్రజలకు నివాళి అర్పించేందుకు కూడలి వద్దకు వచ్చిన ప్రజలంతా కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఇంతలో అక్కడికి కళ్లకు గంతలు కట్టుకున్న ఓ ముస్లిం యువకుడు వచ్చి నిలబడ్డాడు. అతని చేతిలో ఓ ప్లే కార్డ్ ఉంది. దానిపై ‘నేను ఒక ముస్లింను. నన్నంతా టెర్రరిస్టు అని అంటున్నారు. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. మీరు నన్ను నమ్మితే నా వద్దకు వచ్చి నన్ను ఆలింగనం చేసుకోండి’ అని రాసింది. నివాళి అర్పిస్తున్న పిన్నలు, పెద్దలంతా ఆ యువకుడి వద్దకు వెళ్లి, వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆ యువకుడిని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆ యువకుడు కళ్లకు కట్టుకున్న గంతలు విప్పేసి, తనను నమ్మి ఆలింగనం చేసుకున్న వారందరికి ధన్యవాదాలు తెలిపాడు. ‘ఇలా అడిగినందుకు నన్ను క్షమించండి. ఓ సందేశం ఇవ్వడం కోసమే నేను ఇలా చేయాల్సి వచ్చింది. నేను ముస్లింను. అయినంతమాత్రాన నేను టెర్రరిస్టును కాను. నేనెప్పుడూ ఎవరినీ చంపలేదు. మారణహోమం జరిగిన గత శుక్రవారం నాడు నా పుట్టిన రోజు. కానీ జరుపుకోలేదు. కనీసం బయటకు కూడా రాలేదు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. టెర్రరిస్టు అంటే టెర్రరిస్టే. ఏ కారణం లేకుండా అమాయకులను చంపేవాడు. ముస్లిం అయినంత మాత్రాన టెర్రరిస్టు కాడు. ముస్లిం అనేవారు ఎవరినీ చంపరు. చంపడాన్ని ముస్లిం మతం నిషేధిస్తోంది’ అని యువకుడు వ్యాఖ్యానించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా, ఒక్క ఫేస్‌బుక్‌లోనే ఇప్పటి వరకు కోటి మంది యూజర్లు వీక్షించారు. లక్షా యాభై వేల మంది లైక్స్ కొట్టారు. -
ఆ ధీమా వెనుక రహస్యం విశ్వాసమే!
సువార్త మన హృదయాల్లో నింపే ‘విశ్వాసం’ సజీవమైనది. అది పనిచేయకుండా ఉండదు. కొద్దిపాటి విశ్వాసముంటే పరలోకానికి చేరవచ్చు కానీ గొప్ప విశ్వాసం పరలోకాన్నే తెచ్చి మన జీవితాల్లో, కుటుంబాల్లో నింపుతుంది. యేసుక్రీస్తు అక్కడెక్కడో దూరంగా పరలోకంలో ఉండేవాడుగా చూడటం మతం. కాని నావాడంటూ ఆయన్ను ఆలింగనం చేసుకోవడం నిజమైన విశ్వాసం. కటిక చీకట్లో ఒకాయన కొండపై నుండి జారి లోయలో పడుతూ అనుకోకుండా ఒక చెట్టు కొమ్మ చేతికి తగిలితే దానికి వేలాడుతున్నాడట. పైన ఆకాశం, కింద లోయ. చుట్టూ చీకటి. ‘నన్ను కాపాడు దేవా’ అంటూ ప్రార్థిస్తున్నాడు. ‘ఫరవా లేదు, కొమ్మను వదిలేయ్’ అన్నాడు దేవుడు. కానీ ధైర్యం చాలక దేవుణ్ణి వదిలేసి కొమ్మనే పట్టుకున్నాడు. కాసేపటికి పట్టుసడలి కొమ్మను వదిలేశాడు. ఆశ్చర్యం! మరు క్షణం భూమ్మీదున్నాడు. నేలకు కేవలం గజం దూరంలో తానున్నానన్న విషయం చీకట్లో అతనికి తెలియలేదు. దేవుని ప్రతి మాటనూ నమ్మడమే విశ్వాసం. నీ దోనెను లోతునకు నడిపించి వలలు వేయమని యేసు ప్రభువు పేతురుతో అన్నాడు. చేపలు పట్టడంలో ఎంతో అనుభవం ఉన్న పేతురు అంతకు ముందు రాత్రి ఎంత కష్టపడ్డా ఒక్క చేప కూడా దొరకలేదు. గలిలయ సరస్సులోని చేపలన్నీ కలిసి అతన్ని వెక్కిరించినట్లనిపించి అవమాన భారంతో కృంగిపోయాడు. మరునాడు పేతురు దోనెలోకి యేసు ఎక్కి కూర్చొని అక్కడున్న వారికి బోధ చేశాడు. ఆయన మాటలు పేతురులో ధైర్యాన్ని నింపాయి. ‘ఈసారి తన ప్రతిభను పక్కనపెట్టి ‘యేసు మాట’ చొప్పున వలలు వేస్తే చేపలు విస్తారంగా పడ్డాయి. ముందు రాత్రి ఘోర పరాజయం, మరునాడే ఘన విజయం. పరాభవాల్ని విజయంగా, సమస్యను ఆశీర్వాదంగా, కొరతను సమృద్ధిగా మార్చే శక్తి విశ్వాసం అనే కాలువ ద్వారా మన జీవితంలోకి ప్రవహిస్తుంది. అయితే నీళ్లు లేని కాలువలాగే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయమంటుంది బైబిలు (యాకోబు 2:7). కంటికి కనబడని విద్యుత్తు బల్బును వెలిగించి కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతినిచ్చినట్టే, లోకానికి మన విశ్వాసం తాలూకు సత్క్రియలు కనిపించాలి. పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో నింపే ‘విశ్వాసం’ సజీవమైనది. అది పనిచేయకుండా ఉండదు. కొద్దిపాటి విశ్వాసముంటే పరలోకానికి చేరవచ్చు కానీ గొప్ప విశ్వాసం పరలోకాన్నే తెచ్చి మన జీవితాల్లో, కుటుంబాల్లో నింపుతుంది. యేసుక్రీస్తు అక్కడెక్కడో దూరంగా పరలోకంలో ఉండేవాడుగా చూడటం మతం. కాని నా వాడంటూ ఆయన్ను ఆలింగనం చేసుకోవడం నిజమైన విశ్వాసం. అలా యేసును విశ్వసించిన వారు తమ అడుగులు శూన్యంలో, చీకట్లో వేసినా అవి స్థిరమైన బండ మీదే పడ్తాయి. విశ్వాసంతో అసాధారణమైన విజయాలు మన సొంతమవుతాయి. మనుషులు చేసేదే దేవుడూ చేస్తే అందులో దేవుని మహిమ ఏముంది? ‘నన్ను బలపరుచువానియందే నేను సమస్తం చేయగలను’ అన్న పౌలు ధీమా వెనుక రహస్యం ఆయన విశ్వాసమే’ (ఫిలిఫ్పీ 4:13). - రెవ టి.ఎ. ప్రభుకిరణ్ -
'రండి.. నన్ను కౌగిలించుకోండి'
ముంబై: 'ఇస్లామోఫోబియా'.. ఇస్లాం ధర్మం పట్ల, దాన్ని అనుసరించేవారి పట్ల అపనమ్మకం లేదా భయం కలిగి ఉండటమే ఈ పదానికి అర్థం అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వివరిస్తోంది. ప్రపంచం కుగ్రామంగా మారినప్పటికీ... మనుషుల మధ్య మతం అడ్డుగోడగా నిలిచిన సంద్భాలు అనేకం. 'ఫలానా కులం వారికైతేనే ఇల్లు అద్దెకిస్తాం', 'ఫలానా మతం వారికి ఫ్లాట్ ఇవ్వలేం' అని అభివృద్ధి చెందిన నగరాల్లో సైతం బోర్డులు కనిపించడం ఇందుకు నిదర్శనం. ఇకనైనా ఇలాంటివి కనిపించొద్దని కోరుకుంటూ వింత ప్రయోగానికి సిద్ధమయ్యాడు మాజిమ్ ముల్లా అనే యువకుడు. ముంబైలో అత్యంత రద్దీగా ఉండే గేట్ వే ఆఫ్ ఇండియాకు సమీపంలో ఫుట్‌పాత్ వద్ద మాజిమ్ కళ్లకు గంతలు కట్టుకుని నిల్చున్నాడు. చేతిలో ఓ ప్లకార్డు. అందులో ఇలా రాసుంది.. 'నేను ముసల్మాన్‌ను. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. నన్ను కూడా మీరు నమ్ముతారా? అయితే రండి.. నన్ను కౌగిలించుకోండి' అని. మాజిమ్ చర్య కొందరిని ఆశ్చర్యానికి గురి చేయగా, చాలా మంది అతడ్ని కౌగిలించుకుని వెళ్లారు. ఇంకొందరు అతడితో ముచ్చట పెట్టారు. ఎందుకిదంతా? అని అడిగితే.. 'జనం ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికే.. ' అంటూ మొత్తం కథంతా వివరిస్తాడు. గత ఫిబ్రవరిలో ఓ కెనడియన్ ముస్లిం యువకుడు కూడా ఇలా కళ్లకు గంతలు కట్టుకుని నన్ను కౌగిలించుకోండంటూ తెలిపిన ఆగ్రహపూరిత నిరసన అప్పట్లో సంచలనం రేపింది. -
ధృతరాష్ట్ర కౌగిలి
నానుడి కురుసార్వభౌముడైన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయినా, వేదవ్యాసుడి వరం వల్ల అతడికి పదివేల ఏనుగుల బలం ఉంది. కురుక్షేత్ర సంగ్రామంలో వందమంది కొడుకులనూ పోగొట్టుకున్నాడు. నిండుసభలో చేసిన ప్రతిజ్ఞ మేరకు వందమందినీ భీముడే మట్టుబెట్టాడు. కొడుకులు మరణించినందుకు దుఃఖంతో, వాళ్లందరినీ పొట్టన పెట్టుకున్న భీముడిపై కోపంతో రగిలిపోసాగాడు. అలాంటి సమయంలో పట్టాభిషేకానికి ముందు పెదనాన్న ఆశీస్సుల కోసం ధర్మరాజు సపరివార సోదర సమేతంగా ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. వారితో కృష్ణుడు కూడా ఉన్నాడు. ఆశీస్సులు తీసుకుంటున్న ఒక్కొక్కరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ, భీముడి వద్దకు ‘రా నాయనా.. భీమసేనా..’ అంటూ వచ్చాడు ధృతరాష్ట్రుడు. అతడి పగను, పన్నాగాన్ని ఎరిగిన కృష్ణుడు ముందే ఏర్పాటు చేసిన ఇనుప విగ్రహాన్ని ముందుకు నెట్టమని భీముడికి సైగ చేశాడు. భీముడు అలాగే చేశాడు. విగ్రహాన్ని భీముడనుకున్న ధృతరాష్ట్రుడు తన బిగికౌగిలిలో బంధించాడు. అతడి బలానికి ఆ విగ్రహం పిండి పిండిగా రాలిపోయింది. అందుకే పాత పగలు మనసులో పెట్టుకుని, ఆప్యాయంగా చేరదీసి, కదల్లేని పరిస్థితులు కల్పించి నాశనం చేయడాన్ని ధృతరాష్ట్ర కౌగిలిగా అభివర్ణిస్తారు. -
కౌగిలింతలోని మహత్యం
నేడు హగ్ డే ఎవరైనా ఎదురు పడినప్పుడు పలకరింపు... కలత చెందిన మనసుకు ఓదార్పు... ప్రేమ వెల్లువలా పొంగినప్పుడు పులకరింపు... వీటిన్నిటినీ ప్రదర్శించడానికి పెద్ద నేర్పు అవసరం లేదు. మనసు మూగబోయినప్పుడు, మాటలు కరువైనప్పుడు కంగారు పడాల్సిన పని అంతకన్నా లేదు. మెల్లగా వెళ్లి మెత్తగా హత్తుకుంటే చాలు... ఆ స్పర్శ మీ మనసులో ఏముందో వారికి చెప్పేస్తుంది. మీ భావాలను వారి మనసుకు పదిలంగా చేరుస్తుంది. అదే కౌగిలింతలోని మహత్యం! ప్రేమంటే శరీర స్పర్శ కాదు అంటారు. అవును నిజమే. ప్రేమ మనసుకు సంబంధించినది. దానికి స్పర్శతో సంబంధం లేదు. అయితే ప్రేమను వ్యక్త పరిచే ప్రక్రియలో స్పర్శ కూడా భాగమే. అది మాత్రం కాదనలేని వాస్తవం. బాధ కలిగినప్పుడు ఎవరైనా దగ్గరకు తీసుకుని ఓదారిస్తే బాగుణ్ను అనిపిస్తుంది. ఆనందం కలిగినప్పుడు అయినవారిని అల్లుకుపోవాలని అనిపిస్తుంది. తన చేతుల్ని మన చేతుల్లోకి తీసుకుని మాట్లాడటంలో ఆనందం ఉంటుంది. భుజాలపై చేతులు వేసి నడవడంలో సంతోషం ఉంటుంది. ఒక్కో స్పర్శలో ఒక్కో అనుభూతి ఉంటుంది. అన్ని అనుభూతులనూ అందించేందుకు ఓ సుతిమెత్తని కౌగిలింత పనికొస్తుంది. తనువుల దగ్గరతనం మనసుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. అమ్మ కౌగిట్లో అనురాగం ఉంటుంది. నాన్న కౌగిలిలో ధైర్యం ఉంటుంది. ప్రేమికుని కౌగిలిలో ప్రేమతో కూడిన భరోసా ఉంటుంది. అది అనుభవంలోనే తెలుస్తుంది. ఆ అనుభవం ప్రేమ మీద గౌరవాన్ని పెంచుతుంది. అవతలి వ్యక్తి మన మనిషి అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ ‘హగ్ డే’ని మీ అనుబంధాన్ని బలపర్చుకోవడానికి ఉపయోగించుకోండి. మీరు ప్రేమించిన వ్యక్తిని దగ్గరకు తీసుకుని, మీరిద్దరూ ఒక్కటేనన్న విషయాన్ని తన మనసులో పాతుకుపోయేలా చేయండి. తనను మీ గుండెలకు హత్తుకుని... చివరి శ్వాస వరకూ ఆ గుండెల్లో ఉండేది తనేనని బాస చేసుకోండి. ఇక మీ ప్రేమయాత్రలో ప్రతి మజిలీ ఓ మధురానుభవంగా మిగిలిపోతుంది చూడండి! కౌగిలి భాష: ఎవరి మీద చూపించే ప్రేమ అయినా ఒకటే. అయితే ఎవరినైనా కౌగిలించుకునే విధానం మాత్రం ఒకటి కాదు. కౌగిలికి ఓ భాష ఉంది. ఒక్కొక్కరికి కౌగిలించుకోవడానికి ఒక్కొక్క విధానం ఉంది. మీ పిల్లలనో లేక మీ తల్లిదండ్రులనో కౌగిలించుకునేటప్పుడు.. వారిని దగ్గరకు తీసుకుని, వీపు మీద రెండు చేతులూ వేసి హత్తుకుంటారు. పలకరింపుగా హత్తుకున్నప్పుడు రెండు చేతులూ భుజాల మీద వేసి, దగ్గరకు తీసుకున్నట్టే తీసుకుని చప్పున వదిలేస్తారు. ఇది క్షణంపాటు ఉంటుందంతే. కృతజ్ఞత తెలిపే కౌగిలింతకు ఒక చెయ్యే ఉపయోగిస్తారు. చేతిని భుజం చుట్టూ వేసి, దగ్గరకు తీసుకుని చెంపకు చెంపను రాసి వదిలేస్తారు. ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఓదార్పుగా దగ్గరకు తీసుకుంటే... ఒక చెయ్యి వారి భుజమ్మీద, మరో చెయ్యి వారి తలమీద ఉంటుంది. తల నిమిరితే అవతలివారు ఎంత ఓదార్పు పొందుతారో తెలిసిందే కదా! ప్రేమికుల కౌగిలింతలో... చేతులు నడుము మీద గానీ, మెడ చుట్టూగానీ ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయి మెడ చుట్టూ వేస్తారు. అబ్బాయిలైతే ఆమె నడుము చుట్టూ చేతులు వేసి బంధిస్తారు. భార్యాభర్తల కౌగిలింతలో మరింత దగ్గరతనం ఉంటుంది. ఒక చేయి మెడ చుట్టూ, మరొక చేయి నడుము చుట్టూ వేసి, గాలి చొరబడనట్టుగా కౌగిలించుకుంటారు. మన మధ్యకు ఎవరూ రాలేరు అని చెబుతున్నట్టుగా ఉంటుంది ఈ భంగిమ. - సమీర నేలపూడి కౌగిలింతకు ఎంత శక్తి ఉందంటే... అది ఎంత బాధనైనా తగ్గిస్తుందని వైద్యులు చెబుతుంటారు. అందుకే 2004లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ‘ఫ్రీ హగ్ క్యాంపెయిన్’ని ప్రారంభించాడు. కొందరు వాలెంటీర్లు పబ్లిక్ ప్లేసుల్లో నిలబడతారు. ఓదార్పు కోరుకునేవారు ఎవరైనా వారి దగ్గరకు వెళ్తే హత్తుకుని ఓదారుస్తారు. ఇది విపరీతమైన ప్రజాదరణ పొందింది. నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. -
ముద్దులు, కౌగిలింతలతో ప్రేమికుల నిరసన
తిరువనంతపురం: 'మోరల్ పోలీసింగ్' పేరుతో గతవారం కేరళలోని కోజికోడ్ రెస్టారెంట్ లో యువ మోర్చా కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా కోచి మెరైన్ డ్రైవ్ వద్ద యువతీ, యువకులు పెద్ద ఓ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 2 తేదిన నిర్వహించే కార్యక్రమంలో బహిరంగంగా ప్రేమ జంటలు ముద్దులు, కౌగిలింతలు పెట్టుకుని నిరసన తెలుపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ నిరసన కార్యక్రమానికి సంబందించిన విషయాలను తెలిపేందుకు సోషల్ మీడియాను కూడా ఆసరా చేసుకోనున్నారు. త్వరలోనే ఫేస్ బుక్ పేజ్ ను ప్రారంభించనున్నట్టు నిరసనకారులు తెలిపారు. అక్టోబర్ 23 తేదిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కోజికోడ్ లోని రెస్టారెంట్ పై యువ మోర్చా కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈకేసులో కొంతమంది యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చంద్రబాబు, కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం
-
చంద్రబాబు, కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం
హైదరాబాద్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలిశారు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్-బలయ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కలుసుకున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ కొద్దిగా తటపటాయించినా దత్తాత్రేయ చొరవతో ముఖ్యమంత్రులిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. గర్నవర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ముద్దు వద్దు... మోచేతి తాటింపే బెస్టు
చేతులు కలపొద్దు. కావిలించుకోవద్దు. చెంప పై ముద్దు పెట్టవద్దు. పెక్ కూడా వద్దు. అంతగా కావాలంటే పిడికిళ్లు పరస్పరం ఆనించుకొండి. కుదిరితే కేవలం మోచేతులను ఒకరికొకరు తాకించుకొండి అంటున్నారు వైద్యులు. బ్రిటిష్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మిగతా రకాల అభివాదాల వల్ల బ్యాక్టీరియాలు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తాయి. కేవలం మోచేతులు కలుపుకోవడాన్ని ఫిస్ట్ బంప్ అంటారు. షేక్ హ్యాండ్స్ కంటే ఫిస్ట్ బంప్ చేసుకుంటే పది శాతం తక్కువ బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయట. హాయిగా షర్టులు వేసుకుని కేవలం మోచేతులు తాటించుకుంటే మినిమమ్ రిస్క్ అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే స్పృశించుకునే ప్రదేశం తక్కువ. స్పృశించుకునే సమయం మరీ తక్కువ. ఈ అధ్యయనం అబెరిస్ట్విత్ యూనివర్సిటీ చేసింది. ఈ కోలై వంటి బాక్టీరియా వ్యాపిస్తే జీర్ణకోశసంబంధిత ఇన్ ఫెక్షన్ వస్తుందని వారంటున్నారు. వారి అధ్యయనం ప్రకారం మోచేతి తాటింపు బెస్టు. పిడికిలి స్పర్శ పరవాలేదు. హ్యాండ్ షేక్ వద్దు. ఆలింగనం అసలు వద్దు. ముద్దు పెట్టుకుంటే ముప్పు. ఇంత అధ్యయనం చేసిన వారు భారతీయుల నమస్కారాన్ని లెక్కలోకి తీసుకోలేదు. నమస్కారం మరీ మంచిది ఎందుకంటే ఒకరి చేయి మరొకరికి తాకే ప్రసక్తే లేదు మరి. -
ఇఫ్తార్ విందులో అరుదైన దృశ్యం