యువకులకు హగ్ ఇస్తున్న యువతి (ఫైల్‌ఫోటో)
లక్నో: ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఈద్ అల్ ఫితర్(రంజాన్) రోజున ఓ యువతి వరుసబెట్టి కౌగిలింతలు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఈ సంఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. ఇది ఇస్లాం సంప్రదాయానికి వ్యతిరేకమని కొందరు మత పెద్దలు విమర్శించారు. దీంతో మొరదాబాద్ జిల్లా ఇమామ్ మౌలానా ముఫ్తీ మొహమద్ రంగంలోకి దిగారు. ‘మేం ఆ యువతితో మాట్లాడాం. ఆ యువతి చేసిన చర్య పట్ల అసహనం వ్యక్తం చేశాం. అయితే అమాయకత్వంతో తెలీకుండానే ఆమె అలా చేసింది. ఇలాంటి చర్యలను ఇస్లాం అంగీకరించదు. ఇదే విషయాన్ని ఆమెకు వివరించి .. మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త ఉండాలని చెప్పాం’ అని మౌలానా మీడియాకు వివరించారు. మరోవైపు ఆ యువతితో అలింగనంలో పాల్గొన్న వారిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షరియత్ చట్టాలను అతిక్రమించారని, ఇంకోసారి ఇలాంటి జరిగితే ఉపేక్షించబోమని వారిని ఆయన హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ నెల 16న రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ యువతి నగరంలోని ఓ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చింది. అనంతరం మాల్ ఎదుట నిల్చోని యువకులకు ఆత్మీయ ఆలింగనం ఇవ్వడం మొదలుపెట్టింది. ఓ అమ్మాయి స్వయంగా అలాంటి అవకాశం ఇస్తుంటే యువకులు చూస్తూ ఉండిపోతారా..? యువతి హగ్ కోసం పోటీ పడ్డారు. సుమారు అరగంటపాటు చాలా మంది యువకులకు ఆ యువతి ఆత్మీయ ఆలింగనం చేసింది. ఆమెతోపాటు వచ్చిన మరో ఇద్దరు యువతుల యువకుల సంఖ్యను లెక్కపెడుతూ.. పెద్దగా కేకలు పెట్టారు. దీన్నంతటిని అక్కడున్న కొంత మంది మొబైల్ ఫోన్లలో బంధించారు. 50 మందిని కౌగిలించుకున్న ఆ యువతి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment