imam
-
ఆగాఖాన్ అస్తమయం
పారిస్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ‘ఇస్మాయిలీ’ వర్గం ముస్లింల ఆధ్యాత్మిక గురువు, వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ఆగాఖాన్ కన్నుమూశారు. షియా ఇస్మాయిలీ ముస్లింల 48వ ఇమామ్ హోదాను యుక్తవయసులో వారసత్వంగా పొంది దశాబ్దాలపాటు వేల కోట్ల రూపాయల దాతృత్వ కార్యక్రమాలు చేసి గొప్ప వితరణశీలిగా పేరు తెచ్చుకున్నారు. ఆగాఖాన్ పోర్చుగల్‌లో మంగళవారం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబం బుధవారం ప్రకటించింది. ఆగా ఖాన్ అంత్యక్రియలు పోర్చుగల్ రాజధాని నగరం లిస్బన్లో జరుగుతాయని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్, ఇస్మాయిలీ రిలీజియన్ కమ్యూనిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగాఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొహమ్మద్ ప్రవక్త వారసులుగా షియా ముస్లింలలో ఉప వర్గమైన ఇస్మాయిలీ వర్గానికి ఆగాఖాన్ కుటుంబం ఆధ్యాత్మిక గురువులుగా శతాబ్దాలుగా కొనసాగుతోంది. 1936 డిసెంబర్ 13న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించిన ఈయన అసలు పేరు ప్రిన్స్ కరీమ్ అల్ హుస్సేనీ. ఆగాఖాన్ తండ్రి ప్రిన్స్ అలీఖాన్ విలాస పురుషుడు. దీంతో అలీఖాన్‌ను కాదని తాత సర్ సుల్తాన్ మొహ మ్మద్ షా (ఆగాఖాన్– 3).. కరీమ్ అల్ హు స్సేనీను డిగ్రీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఆగా ఖాన్–4గా 1957 అక్టోబర్ 19వ తేదీన ప్రకటించారు. టాంజాని యాలోని దారెస్స లామ్‌లో ఈ కార్య క్రమం జరిగింది. గతంలో ఇదే దారెస్సలామ్ వేదికగా ఆగాఖాన్–3ను ఇస్మాయిలీ వర్గీయులు ఆయనంత బరువు వజ్రాలను కానుకగా సమర్పించిన వార్త అప్పట్లో సంచలనమైంది. ఆనాటి నుంచి ఆధ్యాత్మిక గురువుగా కొనసాగుతూనే వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. వీళ్ల ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పలు ప్రపంచ దేశాల్లో వందలాది ఆస్పత్రులు సేవలందిస్తున్నాయి. ఏటా ఒక బిలియన్ డాలర్ల మేర లాభాపేక్షలేని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆగా ఖాన్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు ప్రపంచదేశాల అధినేతలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మరోవైపు ఇస్మాయిలీ ముస్లింల నూతన ఆధ్యాత్మిక గురువుగా ఆగాఖాన్4 కుమారుడు రహీమ్ అల్ హుస్సేనీ పేరును ప్రకటించారు. 50వ గురువుగా ఈయనను ఇకపై ఆగాఖాన్–5గా పిలవనున్నారు. -
ఇమామ్ కజిన్ : ఓ సిటీలోని ఒక కాలనీలో..
ఓ సిటీలోని ఒక కాలనీలో.. ‘మేజ్..అరటి పళ్లూ..’ అంటూ పళ్ల బండి తోసుకుంటూ ఓ బంగ్లా ముందు నుంచి వెళ్తున్నాడో వ్యక్తి. ‘రేయ్.. ఈ ఏరియాల నిన్నెప్పుడు జూడ్లే! యేడి నుంచి ఒచ్చినవ్ బే?’ అంటూ ఆ బంగ్లా ముందున్న ఒక నడి వయసు వ్యక్తి బెదిరింపు స్వరంతో అడిగాడు. అతని పేరు శంకర్. ఆ బంగ్లా యజమాని అయిన మల్లేశ్‌కి కుడి భుజం లాంటివాడు. ఆ ప్రశ్నకు ఆ వ్యాపారి ఆ ఇంటి ముందు తన బండి ఆపి, తన పిల్లి గడ్డాన్ని సవరించుకుంటూ ‘నేను మార్కెట్ల పనిజేసే ఇమామ్ కజిన్‌ని భాయ్’ అని చెప్పాడు.బండిలోంచి ఓ పండును తీసుకుంటూ ‘ఏ మార్కెట్లయినా ఈ శంకర్‌కి పహచానత్ ఉంటది. నాకు దెల్వని ఇమామ్.. గాయన కజిన్ ఏడికెంచొచ్చె..’ అన్నాడు అరటి పండు తొక్కతీస్తూ! ‘నాది కరీంనగర్. కామ్‌కే లియే భాయ్‌కే పాస్ ఆయా. భాయ్ ఈ మేజ్ బండి ఇప్పిచ్చిండు’ చెప్పాడు ఇమామ్ కజిన్ అమాయకంగా. ‘అచ్ఛా..’ అని అరటి పండు తింటూ ఇమామ్ కజిన్‌ని ఇంకేదో అడగబోతుండగా.. అప్పుడే రాజ్‌దూత్ మీద ఎవరో ఆ ఇంటికి వచ్చేసరికి అరటి పండు తొక్కను అదే బండిలో విసిరేసి లోపలకు వెళ్లిపోయాడు శంకర్.పది రోజులు గడిచాయి..ఇమామ్ కజిన్ రోజూ ఆ కాలనీకి వస్తున్నాడు అరటి పండ్ల బేరానికి. కాలనీ అంతా తిరిగి మల్లేశ్ ఇంటి ముందున్న చెట్టు కిందే బండి పెట్టుకుంటున్నాడు చీకటి పడేవరకు. బంగ్లా యజమాని మల్లేశ్ ల్యాండ్ సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్‌లో ఆరితేరినవాడు. వడ్డీ వ్యాపారి కూడా. ఆ పనుల్లో మల్లేశ్ సహాయార్థం బిజీ అయిపోయాడు శంకర్. ఇమామ్ని, అతని కజిన్‌ని పట్టించుకునే తీరికలో లేడు. ఆ పదిరోజుల్లో ఇమామ్ కజిన్.. ఆ బంగ్లా సెక్యురిటీ గార్డ్ లాంటివాడైన శ్రీశైలానికి అరటి పండ్లు ఇస్తూ, రిలీజైన సినిమాలు, చిరంజీవి డాన్స్‌లు, సంజయ్ దత్ యాక్షన్ గురించి మాట్లాడుతూ క్లోజ్ అయ్యాడు.ఆ దోస్తానా ఎక్కడిదాకా వెళ్లిందంటే రెండు రోజులకోసారి ఆ ఇద్దరూ బిర్యానీ, మందు పార్టీ చేసుకునేదాకా! అయితే తాను ముస్లిం ధర్మాన్ని నిష్ఠగా పాటిస్తాడు కాబట్టి మందు ముట్టనని ముందే శ్రీశైలంతో చెప్పాడు ఇమామ్ కజిన్. ‘దాందేముంది భయ్యా.. నేను మందు తాగుతా.. నువ్వు కూల్‌డ్రింక్ సప్పరియ్’ అంటూ ఇమామ్ వ్రతం చెడకుండా జాగ్రత్తపడ్డాడు శ్రీశైలం. ఆ ఫ్రెండ్షిప్ అక్కడితోనే ఆగలేదు.. ఇమామ్ కజిన్‌కి మల్లేశ్ ముఖ్యమైన అనుచరులనూ పరిచయం చేసే వరకు వెళ్లింది.తరచుగా వాళ్లనూ తమ పార్టీకి తీసుకొచ్చేవాడు శ్రీశైలం. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో వాళ్లందరినీ ఆకట్టుకుంటూ వాళ్లకూ మాలిమయ్యాడు ఇమామ్ కజిన్. ఆ చనువుతో అతను తనకు కుదిరినప్పుడల్లా మల్లేశ్ ఇంటికి వెళ్లేవాడు వాళ్లను కలవడానికి. అలా ఇంకో పది రోజులు గడిచాయి. ఇప్పుడు అతను.. మల్లేశ్ ఇంటికి ఎన్ని ద్వారాలున్నాయి, ఆ ఇంట్లో ఏ మూల ఏం ఉంది.. మల్లేశ్ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏ గదిలో ఉంటారు లాంటి వివరాలన్నిటితో కళ్లు మూసుకుని ఆ ఇంటి నకలు గీసి చూపించగలడు!ఇరవై రెండో రోజు..రాత్రి ఇమామ్ కజిన్.. మల్లేశ్ అనుచరుల్లోని అతి విశ్వాసపాత్రులు, తన దోస్తులూ అయిన ఓ ఇద్దరికి దావత్ ఇచ్చాడు. తన భాయ్ ఇమామ్ తనకు పండ్ల దుకాణం పెట్టించబోతున్నాడనే ఖుష్ ఖబర్ను పంచుకుంటూ! ఆ అనుచరులిద్దరూ ఇమామ్ కజిన్‌ని గుండెకు హత్తుకున్నారు. అన్నేళ్ల నుంచి మల్లేశ్ ఇంట్లో ఉంటున్నా తమకు ఒరగని లాభాన్ని, చేస్తున్న చాకిరీని ఏకరువు పెట్టుకున్నారు. వచ్చిన నెలలోపే ఇమామ్ తన కజిన్‌కి దందా పెట్టివ్వడాన్ని పొగిడారు. అందుకు అర్హత సాధించిన ఇమామ్ కజిన్ నిజాయితీకి సలాం చేశారు. ఆ మత్తులో ఇంకా.. తమ బాస్ ఎలా సంపాదిస్తున్నాడో.. ఆ సంపదను దాచే ఆ ఇంట్లోని సీక్రెట్ ప్లేసెస్ ఏంటో డీటేయిల్డ్‌గా చెబుతూ మల్లేశ్ మీదున్న కసిని వెళ్లగక్కారు. అంతేకాదు ఆ రోజు ఉదయమే మల్లేశ్కున్న డెయిరీ ఫామ్‌లోని గడ్డివాముల్లో దాచిన డబ్బు సంగతీ చెప్పారు. నెమ్మదిగా కూల్‌డ్రింక్ సిప్ చేస్తూ విన్నాడు ఇమామ్ కజిన్!తెల్లవారి..ఆరు గంటలకు ఇన్కమ్ టాక్స్ సిబ్బంది ఆ సిటీలోని శంకర్ ఇల్లు సహా అతని స్థావరాలన్నిట్లోకి అడుగుపెట్టారు సెర్చ్ వారెంట్‌తో! ఇంటి గరాజ్లోని నేల మాళిగ, స్టోర్ రూమ్, డెయిరీ ఫామ్ గడ్డి వాములు.. అన్నిచోట్లా నాలుగు గంటల్లో.. లెక్క, పత్రాల్లేని ఆదాయం కొన్ని పదుల కోట్లలోనే దొరికింది. బంగారు ఆభరణాలు, బిస్కట్లు సహా!ఇమామ్ లేడు..ఇది దాదాపు 20 ఏళ్ల కిందటి సంగతి. మల్లేశ్ వాళ్ల కాలనీలోని ఒక గవర్నమెంట్ టీచర్ ఐటీ డిపార్ట్మెంట్కు అందించిన టిప్‌తో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది డిపార్ట్మెంట్. మామూలుగా ఆ కాలనీ అంతా మల్లేశ్ మనుషులే కాపలా కాస్తుంటారు. సాదాసీదా వ్యక్తిగా వెళితే వివరాలు దొరికే ఆస్కారం లేదు. అందుకే ఇమామ్ అనే ప్రాతను సృష్టించి, అతని కజిన్‌గా పెట్టుడు పిల్లి గడ్డంతో, అరపటి పండ్ల వ్యాపారిగా మల్లేశ్ ఉంటున్న కాలనీలోకి ఎంటర్ అయ్యాడు ఆ ఉద్యోగి. 20 రోజుల్లోనే మల్లేశ్ అనుచరులు అతని గురించిన సీక్రెట్స్ అన్నీ కక్కడంతో ఆ ఆపరేషన్ అనుకున్నదాని కంటే ముందే అయిపోయింది. ఆ రోజు రెయిడ్ చేయకపోతే మరుసటి రోజు గడ్డివాముల్లో దాచిన డబ్బు బెంగళూరుకు రవాణా అయిపోయేది. అదీ ఆ రాత్రి పార్టీలోనే తెలియడంతో వెంటనే రాత్రికిరాత్రే సెర్చ్ వారెంట్ సిద్ధమైపోయింది. రెయిడ్ సక్సెస్ అయింది.(‘ద రెయిడ్’ అనే కొత్త శీర్షిక కింద.. ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు ఇవ్వలేదు. వ్యక్తుల పేర్లు మార్చాం. ఇక నుంచి వారం వారం ఇక్కడ ఇలాంటి ఆసక్తికర కథనాన్ని చదవొచ్చు.) – శరాదిఇవి చదవండి: దయ్యాల పండుగ..! ఒక రకంగా ఇది..? -
జనం అండగా నిలవాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఆ పార్టీ ప్లీనరీ చారిత్రాత్మక మైందిగా భావించవచ్చు. ఈ సందర్భంగా వైసీపీ పాలనను సమీక్షించు కోవడం అవసరం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న అనేక పథకాలూ; ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల భాగస్వామ్యంతో ఆయన తన ప్రభుత్వాన్ని నడపడం విశిష్టత సంతరించుకున్న విషయాలు. ఏలూరు బీసీ డిక్లరేషన్, ధర్మవరం చేనేత సదస్సు, కర్నూలు జలదీక్ష తదితర మహత్తరమైన కార్యక్రమాలు జగన్ పరిణతికి అద్దం పడతాయి. సీఎంగా అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల పాలనా కాలంలో తాను ఎన్నికల ముందు విడుదల చేసిన మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖూరాన్, బైబిల్‌గా ప్రకటించి; అందులోని అన్ని అంశాలనూ అమలు చేస్తున్న అరుదైన సీఎం జగన్. దేశమంతా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణకు గురవుతుంటే... ఆర్టీసీని కార్పొరేషన్ పరిధి నుండి తప్పించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం గొప్ప నిర్ణయం. గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న జాతిపిత గాంధీ ఆశయాన్ని సచివాలయ వ్యవస్థ రూపంలో ప్రజల వద్దకు చేర్చాడు. లక్షలమంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాడు. వాలంటీర్ వ్యవస్థపై తొలిదశలో అనేక విమర్శలు ఎదురైనప్పటికీ వెనుకడుగు వేయకుండా ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య అనుసంధానంగా దానిని మార్చాడు. ‘అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యాకానుక’, ఫీజు రీయింబర్స్మెంట్, పాఠశాలల ఆధునికీకరణ, ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు తదితర విప్లవాత్మకమైన నిర్ణయాలు రాష్ట్ర విద్యావ్యవస్థలో గొప్ప మలుపుగా నిలుస్తాయి. వైఎస్సార్ మానస పుత్రిక ‘ఆరోగ్యశ్రీ’ని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా జగన్ ప్రజల ఆరోగ్య విషయంలో ఎంత బాధ్యతా యుతంగా ఉన్నదీ తెలుస్తుంది. (క్లిక్: ‘రాజనీతి’లో రేపటి చూపు!) రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిబద్ధతగా కృషి చేస్తున్న సీఎంపై ఎల్లో మీడియా పనిగట్టుకొని దుష్ప్రచారానికి పూనుకోవడం అనైతికం. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కేంద్రంతో ఘర్షణ పూరితంగా కాకుండా సయోధ్యగా ఉంటూ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. జగన్ మోహన్ రెడ్డి వంటి అరుదైన నాయకుణ్ణి ప్రజలే కాపాడుకోవాలి. ఆయనిచ్చిన ‘175కు 175 సీట్లు గెలవాల’నే నినాదం కార్యరూపం దాల్చడానికి ప్రజలు అండగా నిలవాలి. భావి తరాల కోసం మరింత విస్తృత ప్రాతిపాదికన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నిర్ణయాలకు వైఎస్సార్సీపీ ప్లీనరీ వేదిక కావాలని ఆశిద్దాం. - ఇమామ్ ‘కదలిక’ సంపాదకులు, అనంతపురం -
రాజధానుల బిల్లు మళ్లీ పెట్టండి!
నేడు రాష్ట్రంలో చాలా ఆందోళనకరమైన పరిణామాలు నెలకొన్నాయి. ప్రత్యేకించి ఇటీవల హైకోర్టు... రాజధాని విషయంగా తీర్పునిస్తూ... అమరావతి ప్రాంతంలోనే రాజ ధానిని కొనసాగించాలని తీర్పు నిచ్చింది. ఈ తీర్పు రాయల సీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ఆశని పాతం లాంటిది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. పరిపాలన వికేంద్రీకరణకు ఇంతటి చక్కని ఉదాహరణ మరొకటి లేదు. అయితే అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణతో కలసి 1956లో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ సందర్భంలో కర్నూలులోని రాజధానీ, గుంటూరులోని హైకోర్టూ హైదరాబాదుకు మారాయి. ఇటీవల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవటంతో 1953 నాటి ఆంధ్రరాష్ట్రం తిరిగి పునరావృతం అయింది. విభజన చట్టం ప్రకారం పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే వీలున్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఓటుకు నోటు’ కేసు ఒత్తిడిలో హైదరాబాద్ ను వదిలి అమరావతికి చేరారు. శివరామన్ కమిటీ సిఫారసులను కూడా లెక్కచేయకుండా అమరావతినే రాజధానిగా ప్రకటించారు. ఆ సందర్భంలో రాయలసీమ వాసుల అభిప్రాయా లను, శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తిని పట్టించుకోకుండా అమరావతినే ఏకపక్షంగా రాజధాని అన్నారు. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధీ సమాంతరంగా జరగటానికి... రాజధానిలోనే అన్ని పాలనా వ్యవస్థలను కేంద్రీకరించకుండా... మూడు ప్రాంతాలలో మూడు పాలనా వ్యవస్థ లను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ ద్వారా సీఎం జగన్ చట్టం చేశారు. ఈ ప్రజాస్వామిక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న మూడు రాజధానుల నిర్ణయం చరిత్రాత్మకమైంది. ఈ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వెంటనే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును సమగ్రంగా ప్రవేశపెట్టి వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నాం. - ఇమామ్ ‘కదలిక’ సంపాదకుడు, అనంతపురం -
ముస్లిం మైనారిటీలకు శుభవార్త
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ముస్లీం మైనారిటీలకు శుభవార్త. రాష్ట్రంలోని ఇమామ్, మౌజిస్‌లకు ఏపీ ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేసినట్లు వక్ఫ్ బోర్డు సీఈఓ అలీం బాషా మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 23 కోట్ల రూపాయలకు పైగా నిధులను రెండు రోజులుగా ఆయా వక్ఫ్ సంస్థల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ఇమాంలకు రూ. 5 వేలు, మౌజిస్‌లకు రూ. 3వేల చొప్పున విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలోని 10వేల మంది లబ్దిదారులకు నిధులు విడుదల చేశామన్నారు. అలాగే గత ఏడాదిలో కూడా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తం 49.6 కోట్ల గౌరవ వేతనం అందించినట్లు అలీం బాషా తెలిపారు. -
జనం మద్దతే జగన్ బలం
వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టి నేటికి సరిగ్గా మూడేళ్లయింది. గతంలో రాజశేఖరరెడ్డి లేపాక్షి నుండి పోతిరెడ్డి వరకు రాయలసీమ సాగు, తాగు నీటికోసం, హంద్రీనీవా, గాలేరు నగరి వెలిగొండ ప్రాజెక్టుల కోసం పాదయాత్ర,లు తలపెట్టారు. ఆ తరువాత ప్రజాప్రస్థానం పేరుతో చేవెళ్ళ నుండి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ చరిత్రనే తిరగరాసింది. తరువాత జగనన్న వదలిన బాణాన్ని నేను అంటూ అన్నకు మద్దతుగా వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు విజయవంతంగా కొనసాగింది. వైఎస్సార్, షర్మిల చేపట్టిన పాదయాత్రలు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు జరిగినవి. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర మాత్రం రాష్ట్ర విభజనానంతరం జరిగింది. ఇది ప్రజలు పడే బాధలను తీర్చడానికి జరిపిన పాదయాత్ర. వారి బాధలు అక్కడికక్కడే తీర్చడానికి ఆయన చెప్పిన అంశాలు తరువాత ఒక ప్రజా మేనిఫెస్టోకు రూపమిచ్చాయి. ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరాలు తీర్చడానికి ఆ మేనిఫెస్టో ఎంతగానో ఉపయోగపడింది. వ్యవసాయరంగం, సంక్షేమరంగం, ఫీజు రీయింబర్స్ మెంట్, పింఛన్, ఆరోగ్యశ్రీ... ఇలా సంక్షేమం, సుపరిపాలన పేరుతో వైఎస్ జగన్ అమలుచేస్తున్న అనేక పథకాలను నేడు జాతీయంగా చర్చిస్తున్నారు. ఏపీలో అవలంబిస్తున్న విధానాలు పరిపాలనా, వికేంద్రీకరణ కోసం గ్రామ స్వరాజ్యం పేరిట జగన్ ఏర్పాటుచేసిన నూతన పాలనా వ్యవస్థ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత, వారికి కల్పించిన సంక్షేమ కార్యక్రమాలు, వారి అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు ఏరకంగా చూసినా వినూత్నమైనవి. దేశచరిత్రలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిం చడం, గ్రామీణ పరిపాలనా వికేంద్రీకరణను అట్టడుగు ప్రజలకు పరిపాలనను అందించే విధంగా చేయడం గొప్ప విషయం. ఇవన్నీ జగన్‌కు పాదయాత్ర కాలంలో స్ఫురించినవి.. పైగా ఆయన అర్థం చేసుకుని తీసుకొచ్చిన పాలనా సంస్కరణలే. ఆరోజు జగన్ వదలిన బాణాన్ని నేను అంటూ వైఎస్సార్ తనయ షర్మిల జరిపిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నిలదొక్కుకోవడానికి, వైఎస్ కుటుంబం ప్రతిష్ఠ పెంచడానికి, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడానికి ఇతోధికంగా దోహదపడింది. మరోవైపున సోనియాగాంధీ వత్తాసుతో కాంగ్రెస్, టీడీపీలు రెండూ కుమ్మక్కై చేసిన నేరారోపణల ఫలితంగా 16 నెలలు జైలులో గడిపారు వైఎస్ జగన్. కనీవినీ ఎరుగని కష్టాలకు, బాధలకు ఓర్చి తట్టుకున్న జగన్ మనోనిబ్బరం, మనోస్థైర్యం ప్రజల నుండి వచ్చినవే. వైఎస్సార్ తనయుడిని కడగండ్ల పాలు చేసి తండ్రి వారసత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ చేసిన కుట్రపూరిత ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించి వైఎస్సార్ తనయుడి వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. 2019లో జరిగిన విభజనానంతర ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని కూడా ప్రజలు తిరస్కరించారు. స్వల్పతేడాతో 2014లో అధికారానికి దూరమైన వైఎస్ జగన్‌కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి 151 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం ఆయన చేసిన పాదయాత్రల ఫలితమే. గ్రామ స్వరాజ్యం పేరుతో పరిపాలన సాగించడం వైఎస్ జగన్ సాధించిన పరిణతికి నిదర్శనం. పాదయాత్ర ద్వారా ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించిన జగన్ వారి నుంచి స్ఫూర్తి పొందిన ఫలితమే నేడు ఏపీలో సంక్షేమ పథకాలు ఆకాశమే హద్దు లాగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు నాయకులు ఒకే కుటుంబం నుంచి వేలాది కిలోమీటర్ల దూరం పాదయాత్ర జరపడం ఒక విశేషం కాగా, వైఎస్ జగన్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పరిణామానికి కారణమైంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో సంక్షేమానికి చిరునామాగా జగన్ మారారు. రాయలసీమలో ఈ రోజు ఇన్ని సేద్యపు నీటి పథకాలు రూపుదిద్దుకున్నాయి అంటే ఆనాడు రాజశేఖరరెడ్డి లేపాక్షి నుండి పోతిరెడ్డి పాడు వరకు చేపట్టిన పాదయాత్రకు కొనసాగింపు ఫలితమే అని గుర్తించాలి. రాష్ట్రం అభివృద్ధిలో నూతన మలుపు తిరగడానికి ఉపయోగపడిన పాదయాత్ర వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర. ఈ సందర్భంగా జగన్‌కు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు ‘ మొబైల్: 99899 04389 -
సుపరిపాలన వైఎస్ సంతకం
రాజశేఖరరెడ్డి గారి ప్రత్యేకత ఏమిటంటే ముఖ్యమంత్రిగా పార్టీకి విధేయుడిగా ఉంటూనే, పార్టీ ప్రయోజనాల పరిధిని దాటి ప్రజల కోసం పరిపాలన సాగించారు. ఆయన పాలన కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలలో అమలు పరుస్తున్న విధానాలకు భిన్నంగా సాగింది. 108,104, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ముస్లింలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో కలగల అనే గ్రామంలో ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రజలకు ఒక ప్రశ్న వేశారు. ‘ఈ గ్రామంలో మా పార్టీ అభ్యర్థి వేణుగోపాల్‌రెడ్డికి తక్కువ ఓట్లు వచ్చాయి; తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా వృద్ధాప్య పెన్షన్లు గానీ, ఆరోగ్యశ్రీ గానీ, ఇంకా ఏ సంక్షేమ పథకాలు గానీ తెలుగుదేశం వారికి అందడం లేదు, కేవలం కాంగ్రెస్ వారికే అందాయి అనిపిస్తే తెలుగుదేశం వారు, పథకాలు అందని వారు మాకు ఓట్లు వేయకపోయినా సరే చేతులెత్తండి’అంటే ఆశ్చర్యంగా ఎవరూ చేతులెత్త లేదు. అన్నిపథకాలు లబ్ధిదారులకు చేరేటట్లు ఆయన చూశారు. (చదవండి: తండ్రివి నీవే చల్లగ కరుణించిన దీవెన నీవే) ఆయన గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ చేయాలని సంకల్పించారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం గొప్పవిషయం. చంద్రబాబు, రామోజీ లాంటి వారు బట్టలు ఆరేసుకోవడానికి కరెంటు వైర్లు పనికోస్తాయని కార్టూన్లు వేసినా ఆయన దాన్ని రిసీవ్ చేసుకున్న తీరు ప్రశంసనీయం. ప్రతి ఎకరం భూమికి నీటిని అందించాలన్న ఆశయంతో జలయజ్ఞం సంకల్పించారు. దాదాపు 23 ప్రాజెక్టులు చేపట్టారు. ప్రాణహిత– చేవెళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, అలాగే చివరి రోజుల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కూడా కృషిచేశారు. హంద్రీ నీవాకు పునాది వేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారు. పోలవరం ప్రాజెక్టువైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేటటువంటి కాలంలో పోలవరంకు అన్ని అనుమతులు సంపాదించారు. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యం కల్పించే దీక్షా దక్షత ఎవరికైనా ఉంటాయా? కాకినాడకు తాగునీటి స్కీము, ఇటువైపు గుంటూరు జిల్లా సేద్యపు నీటి వసతులు, తరువాత రాయలసీమ, ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీరు లేని ప్రాంతాల్లో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సేద్యపు నీటిని అందించాలని బృహత్తరమైన ఆలోచన చేసిన సాహసి రాజశేఖరరెడ్డి. రాయలసీమను, ఉత్తరాంధ్రను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని ఆరోజుల్లో 1937లో పెద్దలు శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు. ఇది ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే రాజశేఖరరెడ్డి హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని రోడ్ నం.2లో ఒక ఇల్లు నిర్మించుకుని, ఆ ఇంటిపేరును శ్రీబాగ్ అని పెట్టుకున్నారు. ఇటీవల జగన్మోహన్రెడ్డి రెడ్డిని సినీ ప్రముఖులు కలిసినపుడు విశాఖపట్టణంలో సినీ పరిశ్రమను నిర్మించుకునేందుకు వైఎస్ ఆనాడే స్థలం కేటాయించారని ఒక వార్త వచ్చింది. (చదవండి: ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్ ఫొటో ఎందుకుండకూడదు?) నేడు వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్టణాన్ని రాజధానిగా చేయాలనే ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. ఇది రాజశేఖరరెడ్డి విజ్ఞత, ముందుచూపు. ఆయన తెలుగు ప్రజలకు అందించిన అపురూప కానుక మరొకటి ఉంది. ప్రజల సంక్షేమానికి కట్టుబడి వ్యవసాయానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ఒక నాయకున్ని మనకు అందించారు. వైఎస్ ఎలాగైతే దేశంలో ఒక నూతన ఒరవడి సృష్టించారో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా తండ్రి అడుగుజాడలలోనే నడుస్తూ సంక్షేమం, అభివృద్ధి కేంద్ర బిందువులుగా గొప్ప పాలన అందిస్తున్నారు. (రేపు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా) వ్యాసకర్త: ఇమామ్, ‘కదలిక’ పత్రిక సంపాదకుడు -
భార్య స్ర్తీ కాదని తెలిసి..
జకార్తా : కొత్తగా పెళ్లయిన ఉగాండా ఇమాం రెండు వారాల తర్వాత తన భార్య స్త్రీ కాదని, పురుషుడని తేలడంతో షాక్‌లో మునిగిపోయారు. ఇమాం మహ్మద్ ముతుంబా సరిగ్గా పదిహేను రోజుల కిందట తన ‘భార్య’తో వివాహ ఒప్పందం చేసుకున్నారు. పెళ్లికి ముందు తాము శారీరకంగా కలవలేదని, వివాహానంతరం కూడా వధువు తనకు రుతుక్రమం నడుస్తోందని చెప్పారని ఇమాం డైలీ నేషన్ పత్రికతో మాట్లాడుతూ వాపోయారు. ఇంతచేసి ఆమె స్ర్తీ కాదని గుర్తించింది ఇమాం కాకపోవడం గమనార్హం. ఇమాం భార్య గోడ దూకి మరీ తమ ఇంట్లో వస్తువులను చోరీ చేయడంతో ఈ విషయం వెల్లడైందని పొరుగింటి వారు తేల్చిచెప్పారు. తమ ఇంట్లో నుంచి ఆమె టీవీ, దుస్తులను దొంగిలించారని అప్పుడే తాము ఆమెను అతడుగా కనుగొన్నామని వారు చెప్పుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇమాం ఆమె ‘భార్య’ ను పిలిపించి విచారణ చేపట్టారు. మహిళా పోలీస్ అధికారి అనుమానితురాలిని పరిశీలించగా ఆమె కాస్తా స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడని తేలడంతో అవాక్కయ్యారు. ఇమాంను మోసం చేసినందుకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమాంను డబ్బు కోసమే స్త్రీలా నటించి పెళ్లి చేసుకున్నానని నిందితుడు పేర్కొన్నాడు. కాగా ఓ మసీదులో బురఖా ధరించిన నిందితుడిని చూసి తాను మోసపోయానని, ఆ సమయంలో ఆమెకు ప్రపోజ్ చేయగా అంగీకరించిందని, అయితే తన తల్లితండ్రులకు వధువు కట్నం చెల్లించేవరకూ తాము శారీరకంగా కలవద్దని తనతో చెప్పినట్టు బాధిత ఇమాం వాపోయారు. నిందితుడిపై చీటింగ్, చోరీ కేసులను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
‘పోలవరం’ నిండా బాబు అక్రమాలే...
గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు పాలనలో సేద్యపు నీటి ప్రాజెక్టుల నిండా అవినీతి అక్రమాలు అంచనాల పెంపు పేరుతో వేల కోట్ల దోపిడీకి తెర లేపారు. నేడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానం చేపట్టి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి దశలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు ఎడమగట్టు కాలువ రీ టెండరింగ్‌లో వందల కోట్లు ఆదాయం ప్రభుత్వ ఖాతాలోకి చేరేలా ప్రాజెక్టు పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. దీనిపై సహజంగానే అవినీతి అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పార్లమెంట్ ఆమోదం పొంది న తర్వాత రెండేళ్లు నిర్మాణం చేపట్టకుండా విపరీ తమైన నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా అవినీతి అక్రమాలకు పాల్పడిన అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ తప్పుబట్టిన విషయాన్ని ఇక్కడ గుర్తిం చుకోవాలి. ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టు అథా రిటీ పరిధిలో నుండి రాష్ట్ర పరిధిలోకి బదలా యించుకోవడంలో తనదైన అవినీతి అక్రమాలు చేపట్టి చివరి మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, ప్రాజెక్టు అంచనాకు సంబంధించి పునరావాస ప్యాకేజీ అంచనా రూ.16,010.45 కోట్ల నుండి రూ.58,319.06 కోట్లకు పెంచుకున్నారు. దాదాపు ఇదే ప్రహసనాన్ని 24 ప్రాజెక్టులలో తొలి అంచనాల్ని రూ.37,952.92 కోట్ల నుండి రూ.95,060.78 కోట్లకు పెంచుకున్నారు. పెంపు అంచనాల వ్యయాన్ని ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవీఆర్ కృష్ణారావు, అజయ్ కల్లామ్, ఎస్పీ సత్య ప్రకాష్ టక్కర్, దినేష్ అంగీక రించలేదు. చంద్రబాబు క్యాబినెట్ తీర్మానాలతో ఈ అంచనాల పెంపును అంగీకరింపచేసు కున్నారు. ఈ విషయాలను కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. నేడు జగన్మోహన్రెడ్డి, రీ టెండరింగ్ విధానాన్ని విన్నూత పద్ధతిలో ఏ రాష్ట్ర ప్రభ్వుతం చేపట్టని రీతిలో చేపట్టి ప్రభుత్వ సొమ్మును ఆదా చేయడానికి నడుం బిగించారు. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టుతో పాటు అనేక సేద్యపు నీటి ప్రాజెక్టుల్లో వేల కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సేద్యపు నీటి ప్రాజెక్టులలో అవినీతి అక్రమాలు చేపట్టకుండా, తప్పులు చేసి నిర్లక్ష్యంగా ప్రాజెక్టులలో నేరస్తులుగా నిరూ పించ బడిన వారికి దేశం గుర్తించుకునే విధంగా చర్యలు తీసుకొని ఒక నూతన ఒరవడిని ఆంధ్రప్రదేశ్ చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వాలు చట్టం, న్యాయం ఆధారంగా ఇటువంటి నేరస్తులపై చర్యలు తీసుకొని నూతన ఒరవడిని సృష్టించాలి. గోదావరి జలాలలో ఉమ్మడి రాష్ట్రానికి గుల్హాతి కమిషన్ కేటాయించిన 1,496 టీఎంసీల నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యన పంపిణీ చేసుకోవడానికి తద్వారా కృష్ణా నదిలోకి నీటిని తరలించుకోవడానికి చంద్రబాబు ఏ రోజూ ప్రయ త్నించలేదు. కానీ నేడు జగన్, కేసీఆర్ సాహ సోపేతంగా గోదావరిలో దిగువన ఈ రాష్ట్రాలకు కేటాయించిన జలాలనే కాకుండా సముద్రం పాలవుతున్న నీటిని, కృష్ణా నదిలోని నీటిని తెలంగాణ, రాయలసీమ, ఖమ్మం, మహ బూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు పంపిణీ చేయడమే కాకుండా.. రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కరించుకోవడానికి కూడా జరుపుతున్న చర్చలు జయప్రదం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు తన ఎల్లో మీడియా దన్నుతో ఇరు రాష్ట్రాల మధ్య అనుమానాలు, అపోహలు, సందేహాలు కల్పించే వాతావరణాన్ని సృష్టించి తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి విద్రోహం తలబెట్టే దుర్మార్గమైన ఆలోచనలకు పునాదులు వేస్తున్నారు. గతంలో ఏ ప్రాజెక్టులోనూ లేదా ఏ ప్రభుత్వ పథకంలోనూ చంద్రబాబు అవినీతి లేకుండా కార్యా చరణ చేపట్టింది లేదు. చివరికి హైకోర్టు.. విద్యుత్ ఒప్పందాలలో రూ. 2,500 కోట్లు ఆదా చేస్తూ. చంద్రబాబు చేసుకున్న అక్రమ ఒప్పందాలను రద్దు చేస్తూ తక్కువ ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బలపరిచింది. రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాకుండా ఎగువన శ్రీశైలం నుండి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా లభించే నీటితో శరవేగంగా అవినీతి రహిత ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని జగన్ ప్రభుత్వం విజయవంతంగా ప్రజల మద్దతుతో పురోగమించాలని ఆశిద్దాం. ఇమామ్ వ్యాసకర్త కదలిక ఎడిటర్ మొబైల్ః 9989904389 -
ఆదర్శ సాహిత్యం చదివిన వ్యక్తి
కరపత్రం ఆయనకు చూపిస్తే, కమ్యూనిస్టు ప్రణాళికలోని మార్క్స్ చెప్పిన ‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అనే అంశాన్ని ఇలా మార్చి రాశావు అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిరంతరం తెలుగుదనం ఉట్టిపడే రీతిలో తన దుస్తులలోనూ, అలోచన సరళిలోనూ, నడకలోనూ, హావభావాలలోనూ మనకు కనిపించేవారు. తెల్లటి ఖద్దరు బట్టల వెనుక ఉన్న వెన్నెల లాంటి హృదయం సన్నిహితంగా ఆయనతో తిరిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఆయన చిన్న వయస్సులో పులివెందులలోని ఆదర్శ కమ్యూనిస్టు వెంకటప్పయ్య ఇంటిలోనే ఒక బడి నివాసంలో విద్యను అభ్యసించారు. సోమవారం ఉదయమే తన ఇంటి నుండి వెంకటప్పయ్య పాఠశాలకు వెళ్లి అక్కడే చదువు, భోజనం, నిద్రతో శనివారం వరకు గడిపి, ఇంటికి తిరిగి వచ్చేవారు. వెంకటప్పయ్య కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంతో చాలా నిరాడంబరంగా ఉంటూ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తూనే సామాజిక అంశాలను కూడా చెప్పేవారు. వేమన, శ్రీశ్రీ, గురజాడ లాంటి కవుల గురించీ, కమ్యూనిస్టు ప్రణాళిక గురించీ, శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’, మక్సీమ్ గోర్కీ ప్రఖ్యాత నవల ‘అమ్మ’ గురించీ చెప్పేవారు. వీరందరినీ వైఎస్ చదివినట్టుగా ఆయన జరిపే సంభాషణల్లో రుజువులు కనబడతాయి. వెంకటప్పయ్య దగ్గరికి రాజశేఖరరెడ్డిని వైఎస్ రాజారెడ్డి తీసుకెళ్లి, మీ స్కూల్లో మా వాడిని చేర్చుకోమని అడిగి, వీడిని నాయకుడిని చేయాలనుకుంటున్నామనీ, స్వామీ మీరు వాడికి రాజకీయాలు కూడా ఒక నాయకుడిలా ఎదగడానికి కావాల్సినంతగా చెప్పండి అని అన్నారు. అందువల్లే రాజశేఖరరెడ్డికి చక్కటి అ«ధ్యయన పద్ధతులు అబ్బాయి. ఈ రచయిత ఒక సందర్భంలో ‘రైతులారా, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆలుబిడ్డలున్నారని మరువవద్దు. మీకు పోయేదేమీ లేదు భూమి తప్ప’ అని ఒక కరపత్రం రాసి ఆయనకు చూపిస్తే, కమ్యూనిస్టు ప్రణాళికలోని మార్క్స్ చెప్పిన ‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అనే అంశాన్ని ఇలా మార్చి రాశావు అన్నారు. ఇటువంటిదే మరో సంఘటన. విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాటలోని కొన్ని చరణాలను తరతరాల రాయలసీమ పుస్తకం వెనుక అట్ట మీద వాడటం జరిగింది. అందులో ఒక చరణం సరిగాలేదనీ, తప్పుగా రాశాననీ నన్ను సవరించారు. ఆయన రాయలసీమ కావ్యం పెన్నేటి పాటను అంతగా చదివారని నాకు అర్థం అయింది. ఒక సందర్భంలో శ్రీశ్రీని కూడా ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. వైఎస్ తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించడంలో భాగంగా ప్రముఖ పత్రికా విలేకరి ఏబీకే ప్రసాద్‌ను తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించి ప్రాచీన హోదా సాధించడంలో విజయవంతం అయ్యారు. తిరుపతిలో రాయలసీమ ఎడిషన్ విశాలాంధ్ర ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ హాజరయ్యారు. తాను జీవితంలో మొట్టమొదటి సారిగా 8వ తరగతి చదువుతున్నప్పుడు తన ఇంటికి రోజూ వచ్చే విశాలాంధ్రను చదివేవాడిననీ, విశాలాంధ్ర నిర్వహించిన చారిత్రక బాధ్యత గొప్పదనీ ప్రస్తావించారు. వైఎస్ ఒక రూపాయి డాక్టరుగా ఉన్నా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం, ఆ తర్వాత పత్రికలు క్షుణ్ణంగా చదవడం, జరిగిన సంఘటనలు నోట్ చేసుకొని ఆ అంశాల పై తగు విధంగా కార్యాచరణకు మలచుకోవడం జరిగేవి. ఆయన బైబిల్‌ను ఎంత అర్థం చేసుకున్నారో అచరణలో జీవితాన్ని కూడా బైబిల్లోని సారాంశంతో కలగలిపి గొప్ప మానవతావాదిగా ఎదిగాడు. అంత మాత్రం చేత హిందూ మతం పట్ల, ఇస్లాం పట్ల గాని ఆయనకి గౌరవం తగ్గలేదు. బైబిల్, ఖురాన్, భగవద్గీతను అర్థం చేసుకొని అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా ఆయన ఎదిగాడు. చాలా ఆశ్చర్యము, ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే– 1983లో ఆయన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో నిర్మించుకున్న ఇంటికి శ్రీబాగ్ అని పేరు పెట్టుకోవడం. ఇది ఆయన రాజకీయ పరిణతికి చిహ్నం. చరిత్రలో శ్రీబాగ్ ఒడంబడిక ప్రాముఖ్యతను ఆయన గుర్తించినట్లుగా మరెవరూ గుర్తించలేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారు, తెలుగు రాష్ట్రం కొరకు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడాలని జరిపిన ఉద్యమంలో కోస్తా నాయకులకూ, రాయలసీమ నాయకులకూ 1937లో మధ్య జరిగిన ఈ ఒప్పందం... నేడు రాష్ట్రంలో కేంద్రీకృత అభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలకమైనది. రాయలసీమలో సేద్యపునీటి ప్రాజెక్టులను కోరుతూ లేపాక్షి నుండి పోతిరెడ్డిపాడుకు 1986లో వైఎస్ జరిపిన పాదయాత్రలో నడవడంతో ఆయనలో పట్టుదలను నేను గమనించాను. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు జరిగిన ప్రజాప్రస్థానం తెలుగు రాజకీయాలను ఒక ఊపు ఊపింది. రాజకీయాల మార్పునకు పునాది వేసింది. ఆ పాదయాత్రలోనూ ఆయనను సన్నిహితంగా చూసే భాగ్యం నాకు దక్కింది. ప్రజలతో ఆయన మాట తీరు సులువుగా వారి గుండెలకు హత్తుకునేలా ఉండేది. వెంకటసుబ్బయ్య పాఠశాలలో ఆయనలో గొప్ప అభివృద్ధి కాంక్షకు బీజాలు పడ్డాయి. ప్రజలలో నిరంతరం సంబంధాలు కలిగి ఉండడంతో మరింతగా ఆలోచనలు పదునెక్కాయి. ఒక మంచి కార్యకర్త ఒక మంచి నాయకుడు అవుతాడు. ఒక నాయకుడే ఒక మహా నాయకుడు అవుతాడు. నిరంతర పఠనం, పరిస్థితులను ఆకళింపు చేసుకునే విధానం ఆయన్ని మహానాయకుడిగా చేశాయి. మంచి సాహిత్యాన్ని జీర్ణం చేసుకున్న వ్యక్తి సమాజాన్ని అర్థం చేసుకోగలడు అనేదానికి మారుమూల పులివెందుల నుండి జాతీయ స్థాయికి ఎదిగి వచ్చిన వైఎస్ జీవితం ఓ తార్కాణం. -‘కదలిక’ ఇమామ్ -
సీఎంకు ‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకం
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కడి తెలుగువారు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కదలిక పత్రిక సంపాదకుడు ఇమామ్... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకాన్ని రచించారు. ప్రస్తుతం వాషింగ్టన్లో ఉన్న సీఎం జగన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై (యూఎస్) విభాగం గవర్నింగ్ కౌన్సిల్ సలహాదారు వల్లూరు రమేశ్‌రెడ్డి ఈ పుస్తకాన్ని అందజేశారు. -
ఇమాంకు అరుదైన కానుక పంపిన వైఎస్ షర్మిల
-
నయవంచనపై హస్తినలో సమరభేరి
విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించా లని, రాజధానిని సజా వుగా నిర్మించాలని, పోల వరం ప్రాజెక్టులో అవకత వకలు లేకుండా అవినీతి రహితంగా నిర్మించాలని, సేద్యపు నీటి ప్రాజెక్టు లను తగు ప్రాధాన్యతతో నిర్మించాలని రైతు ప్రయోజనాలు కాపాడాలని నిత్యం నినదించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్సీపీ శ్రేణులు నేడు ఢిల్లీ కేంద్రంగా నరేంద్ర మోదీ, చంద్రబాబు రాష్ట్రా నికి ప్రత్యేక హోదా గురించి అవలంబించిన మోసంపై సమర శంఖారావం పూరించను న్నారు. ప్రత్యేక హోదా ప్రాముఖ్యతను వైఎస్ జగన్ గుర్తించినంతగా రాష్ట్రంలో ఏ పార్టీ నాయ కుడు గుర్తించలేదు. హోదా సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెడుతూ.. కొన్ని సందర్భా లలో ఆమరణ దీక్ష కూడా చేపడుతూ ఆయన పోరాటాలు చేశారు. తన ప్రజాసంకల్ప యాత్రలో ప్రత్యేక హోదా ప్రాముఖ్యతపై, కేంద్రంలో నాలుగేళ్లు అధికారంలో కొనసాగి హోదా సాధించని బాబు వైఫల్యంపై ప్రసం గాలు చేశారు. మోదీ, వెంకయ్య, పవన్‌కల్యాణ్, బాబు జోడీ కట్టిన 2014 ఎన్నికలలో హోదాని ఎన్నికల వాగ్దానంగా తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు. ఈ నలుగురూ తమకు మాత్రమే సాధ్యమైనరీతిలో అవకాశవాద కపట రాజకీయాలకు పాల్పడి ప్రత్యేక హోదాను అట కెక్కించడానికి వివిధ పద్ధతులలో ప్రయత్నాలు చేశారు. ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ, పవ న్‌కల్యాణ్ ఈమధ్య ఒక వేదికగా కొనసాగిన సమయంలో.. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పార్లమెంట్లో మోదీకి వ్యతిరేకంగా అవి శ్వాస తీర్మానం ప్రవేశపెడితే, వివిధ రాష్ట్రాలలో పర్యటించి 50 మంది పార్లమెంట్ సభ్యులకు మించి మద్దతు కూడబెడతానంటూ పవన్ కల్యాణ్ ప్రధాన ప్రతిపక్ష నేతకు సవాల్ విసి రారు. దానికి ప్రతిపక్ష నేత తనదైన శైలిలో, తమ పార్టీ ఎంపీలతో అవిశ్వాస తీర్మానాన్ని మోదీకి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రవేశ పెట్టడా నికి సిద్ధమేనని, అయితే పవన్‌కల్యాణ్ హోదా అంశంపై తన రాజకీయ స్నేహితుడైన చంద్ర బాబు మద్దతు కూడగట్టాలని లేదా బాబుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా, దానికి తాము మద్దతు ఇస్తామని జగన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ నిజాయితీకి హోదా పట్ల నిబ ద్ధతకు ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా? ఆ సవాల్‌ను బాబు, ఆయన రాజకీయ కవచమైన పవన్‌కల్యాణ్ ఇద్దరూ స్వీకరించలేదు. పైగా వైఎస్సార్సీపీ లోక్‌సభలో అనేక పార్టీల మద్దతు కూడగట్టి అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చి లోక్‌సభలో జరిపిన ఆందోళనకు మద్దతు ఇవ్వ కుండా బాబు తనదైన విద్రోహకరమైన నైపు ణ్యంతో పలాయనవాదం చేపట్టారు. పంచపాం డవుల్లా ఏపీ భవన్లో ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలను బాబు కానీ నేటి ఆయన రాజకీయ స్నేహితుడు రాహుల్‌గాంధీ పార్టీ సభ్యులుగానీ పరామర్శిం చలేదు. మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ కాగా, ఆ పార్టీ తీర్మా నాన్ని అంగీకరించి చర్చించడానికి మోదీ ప్రభుత్వం సాహసం చేయలేదు. పైగా వైఎ స్సార్సీపీ ఎంపీల రాజీనామాలను అంగీకరించ డంలో విపరీతమైన జాప్యం చేసి హోదాపై ఉప ఎన్నికలలో ప్రజాభిప్రాయం తమకు వ్యతిరే కంగా ఉంటుందని వారి రాజీనామాలు అల స్యంగా అంగీకరించారు. ఈ చర్య తమ పార్టీ తప్పిదమని ఈ అంశం పై తమ పార్టీలో చర్చ జరిగిందని, చర్చకు అవకాశం ఇచ్చి రాజీనామా లకు ఆమోదం తెలిపి ఉండాల్సి ఉందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు ఓ సందర్భంలో బాహాటంగానే అంగీకరిం చారు. ఒకవైపు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ తన రాజకీయ పోరాట ప్రస్థానం కొనసాగి స్తూనే ఉంది. మరోవైపు విద్రోహాలలో ఆరితేరిన బాబు హోదాపై.. విభజన హామీలు అమలు పరచడంలో మోదీ వైఫల్యంపై తానూ పోరాడు తున్నాననే భావన కల్పించడానికి విపరీతంగా శ్రమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో నాణ్యత ప్రమా ణాలు పాటించలేదని ఇనుము, ఉక్కు నాసిరక మైనవి వాడారని కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం రాత పూర్వకంగా ఇచ్చిన నివేదిక బాబు నిజాయితీ బండారాన్ని తెలియజేస్తుంది. (రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మోసంపై నేడు ఢిల్లీలో వైఎస్సార్సీపీ సమర శంఖారావం సందర్భంగా) -ఇమామ్ (వ్యాసకర్త కదలిక సంపాదకులు) మొబైల్ : 99899 04389 -
నయవంచనపై నాలుగో సమరభేరి
ఒక వైపు తెలుగుదేశం మరోవైపు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ప్రాణాధార మైన ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఈ నేపథ్యంలో తొలినుంచి ప్రత్యేక హోదా అవసరాన్ని నొక్కి చెబుతూ వైఎస్సార్ సీపీ సాగించిన అలుపెరగని పోరాటం చారిత్రక ప్రాధాన్యతను సంతరించు కుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వంపై ధర్మ పోరాటం ముసుగులో చంద్రబాబు సాగిస్తున్న నయ వంచక రాజకీయాలను తూర్పారపడుతూ వైఎస్సార్ సీపీ కాకినాడలో రేపు గర్జన సభను నిర్వహస్తోంది. ఈ నెల 30న ‘నయవంచన’ పై గర్జన కాకి నాడలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనే వైఎస్సార్ సీపీ గోదావరి జిల్లాల సమన్వయకర్త మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం లోక్‌సభలో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన పంచపాండవులలాంటి ఎంపీలలో ఒక రైన వైవీ సుబ్బారెడ్డి సభను పర్యవేక్షించడం ఈ సంద ర్భంగా ప్రస్తావించుకోవాలి. ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ వేదికగా వైఎస్సార్సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా ప్రస్తుత పరిస్థితులలో ప్రాధా న్యత సంతరించుకుంది. మోదీ ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం హోదా కోసం జరుపుతున్న క్రమం లోనే ఆమరణ నిరాహార దీక్ష సైతం ఢిల్లీ వేదికగా నిర్వహించి సమరశీలంగా పోరాడిన పార్టీ వైఎస్సార్ సీపీ. విభజన హామీల అమలు కొరకు పోరాటం అంటూ చంద్రబాబు దొంగ దీక్షలను మనం గుర్తుం చుకోవాలి. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై పోరు, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ, విశాఖలో రైల్వే జోన్, పోలవరం, నాణ్యతతో అవినీతి రహితంగా నిర్మించాలని చెబుతూనే రాజధాని పేరుతో సాగి స్తున్న అవినీతి, అక్రమాలు రైతుల భూములు ప్రభు త్వం కబ్జా చేసుకోవడం లాంటి సమస్యలపై జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ పోరాటాలు చేసింది. జగన్ సంవత్సర కాలంపైగా జరుపుతున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు అపూర్వ మద్దతు ప్రకటించారు. ప్రజలలో తన పాలన పట్ల వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తం కావడం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సంఘీభావం ప్రకటించడంతో చంద్ర బాబు కూడా ప్రత్యేకహోదాపై యూటర్న్ తీసుకో వడం, విభజన హామీలు అమలు పరచాలని మోదీ ప్రభు త్వంపై పోరాటం అంటూ నయవంచన ఉద్య మాలు చేయడం మనం గమనించాం. మైనార్టీలకు దగ్గర అయ్యేందుకు గుంటూరులో మైనార్టీలతో సదస్సు పెట్టి అభాసుపాలయ్యారు. ఆ సభలో మైనార్టీ సమ స్యలను ప్రస్తావించిన ముస్లిం యువకులపై దేశ ద్రోహ నేరం బనాయించడం చంద్రబాబు దిగజారు డుతనానికి నిదర్శనం. నాలుగు సంవత్సరాల పాల నలో నలుగురు రాష్ట్ర చీఫ్ సెక్రెటరీలు కృష్ణా రావు, అజయ్‌కల్లామ్, ఎస్పీ టక్కర్, దినేష్ కుమార్ బాబు పంపిన అనేక ఫైళ్లలో సంతకాలు చేయడానికి గానీ, తమ ఆమోద ముద్ర వేయడానికి గానీ తిరస్క రించారు. తెలుగుదేశం పార్టీకి కంచు కోటలాగా ఉన్న ఉత్తరాంధ్రలో జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల విశేష స్పందన, మద్దతు లభించడంతోపాటు, ప్రతి పక్ష నాయకుడిపై హత్యాయత్నం సంఘటనను పాల కులే ప్రేరేపించారు అని నేడు ప్రజలు అర్థం చేసు కున్నారు. జగన్ ప్రత్యేక హోదా కోసం విశాఖలో జరప బోయిన సభను అడ్డుకోవడం కోసం విశాఖ ఎయిర్ పోర్టులోనే నియనిబంధనలకు వ్యతిరేకంగా జగన్‌తో పాటు మరో ఇద్దరు ఎంపీలను నిర్బంధించి పోలీ సులు హైదారాబాద్‌కు వెనుతిరిగేటట్లు చేయడం మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రతిపక్ష నేతపై విమానా శ్రయంలో జరిగిన హత్యా ప్రయత్నాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి స్థాయిలో బాబు కోడి కత్తి అంటూ వెటకా రంగా ఖండించడం సరైనది కాదని, కనీసం ప్రతిపక్ష నాయకుడిని ఫోన్లో అయినా పలకరించకపోవడం పెద్ద తప్పు అని నిన్ననే సీనియర్ సీపీఐ నాయకుడు నారాయణ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, అసలు ప్రతిపక్షాన్నే లేకుండా చేయాలని 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను అనేక మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కొనుగోలు చేయడం ఎంతటి బరితెగింపో మనం గమనించవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్సీపీ గర్జన కాకినాడలో 30 తేదీన చేపడుతోంది. ప్రత్యేక హోదాపై, విభజన హామీలపై ఎంతో నిర్ణయాత్మ కమైన పోరాటాన్ని పరిపక్వతతో, విజ్ఞతతో, దూర దృష్టితో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ జరుపుతున్న పోరాటం చారిత్రకత ప్రాధాన్యత సంత రించుకుంది. వైఎస్సార్సీపీ జరుపుతున్న నయ వంచన దీక్ష చంద్రబాబు మోసాలను, కుట్రలను, కుతంత్రాలను ఎండగట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాకినాడ సభకు జేజేలు. (నవంబర్ 30న కాకినాడలో వైస్సార్సీపీ గర్జన సందర్భంగా) వ్యాసకర్త : ఇమామ్, కదలిక సంపాదకులు మొబైల్ : 99899 04389 -
ప్రజల ఆశాజ్యోతి జగన్
ఓ ప్రజానాయకుడు అనేక ప్రతికూల రాజకీయ పరిణామాలు ఎదురుర్కొంటూ సంవత్సరం పాటు జరిపిన ప్రజాసంకల్పయాత్ర భారతదేశ రాజకీయ చిత్రపటంలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గది. వైఎస్ కుటుంబం ప్రజా సమస్యల పరిష్కారానికి పలు పోరాటాలు చేయడం మనం గమనించాం. అదే కుటుంబం నుంచి నేడు జననేత జగన్ రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం లిఖించారు. తన ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజా నాయకుడిగా ఎదిగి సమకాలీన రాజకీయ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్నారు. పాదయాత్ర సందర్భంగా జగన్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలకు ఇసుక వేస్తే రాలనంత జనం హాజరవుతున్నారు. పాదయాత్రలో ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించక ముందు చంద్రబాబు శాసనసభను తన నియంతృత్వ పోకడతో ఒక నిర్జీవమైన సభగా మార్చుకున్నారు. శాసనసభ్యులను కొనుగోలు చేశారు. వ్యవస్థలన్నింటినీ భ్రష్ట్పుట్టించారు. అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. ప్రాజెక్టుల్లో అవినీతి వరదలై పారింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రశ్నించేవారిని నిర్భందిస్తున్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా దోపిడీకి పూనుకున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేశారు. ఈ పరిస్థితుల్లో జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు. ప్రతిపక్షనేతగా నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతూ ఒక పరిపక్వత కలిగిన నేతగా తన రాజకీయ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ప్రజలకు జగన్ ఒక ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు. తమను కష్టాల నుంచి నవరత్నాల ద్వారా గట్టెక్కించగలరని నమ్ముతున్నారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న తెలుగుదేశం నేతలు జగన్‌పై హత్యాయత్నం కుట్ర చేశారు. జగన్‌పై దాడి రాష్ట్ర ప్రభుత్వ దాడి. ఈ దాడికి చంద్రబాబుగారే బాధ్యత వహించాలి. ఒక ముఖ్యమంత్రిగా బాబు ఈ ఘటనపై స్పందించిన తీరు ప్రజాస్వామిక వ్యవస్థకు సిగ్గుచేటు. రాజకీయ లబ్ధి కోసం జగనే దాడి చేయించుకున్నాడని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటనలు చేయడం నీచాతినీచం. వారి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ పతనావస్థకు అద్దం పడుతుంది. చంద్రబాబు వెకిలి నవ్వులు సినిమాలోని క్రూరమైన విలన్‌లాగా ఉన్నాయి. పాదయాత్రలో ప్రజలు జగన్‌కు జేజేలు పలకడం చంద్రబాబు భరించలేకపోయారు. కుట్రతో జగన్‌ను భౌతికంగా అడ్డు తొలగించుకోవడానికి వ్యూహం పన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై నేటికీ ప్రజల్లో అనుమానాలు బలంగా ఉంది. నేడు వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులే నాడు వైఎస్‌కు వ్యతిరేకంగా పనిచేశారని ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాలి. ఆ శక్తులు మరోరూపంలో ఆంధ్రప్రదేశ్‌లో సమీకృతం అవుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నంపై లోతుగా పరిశోధించి దోషులను శిక్షించాలి. థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని చేస్తున్న పోరాటం విజయవంతం కావాలి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఒక బలమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక రకంగా చంద్రబాబు గారికి బహిరంగంగా సిగ్గు ఎగ్గు లేక.. బాధ్యత మరిచి ఆయన్ను బలపరుస్తూ పగలును రాత్రిగా, ఎండలను నీడగా, చీకటిని వెలుతురుగా చూపించడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. జగన్‌ను రాజకీయంగా ఎదగనీయకుండా చేయడం, చంద్రబాబును స్థాయికి మించి మోయడం ఒక చీకటి అధ్యాయం. ప్రజలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఎల్లో మీడియా కుట్రలను, కుతంత్రాలను అర్థం చేసుకుంటున్నారు. రాజకీయ ప్రజాక్షేత్రంలో ఈ శక్తులకు తగిన గుణపాఠం ప్రజలే చెబుతారు. - ఇమామ్, కదలిక ఎడిటర్ -
ఆ అమ్మాయి అమాయకురాలు!
లక్నో: ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఈద్ అల్ ఫితర్(రంజాన్) రోజున ఓ యువతి వరుసబెట్టి కౌగిలింతలు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఈ సంఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. ఇది ఇస్లాం సంప్రదాయానికి వ్యతిరేకమని కొందరు మత పెద్దలు విమర్శించారు. దీంతో మొరదాబాద్ జిల్లా ఇమామ్ మౌలానా ముఫ్తీ మొహమద్ రంగంలోకి దిగారు. ‘మేం ఆ యువతితో మాట్లాడాం. ఆ యువతి చేసిన చర్య పట్ల అసహనం వ్యక్తం చేశాం. అయితే అమాయకత్వంతో తెలీకుండానే ఆమె అలా చేసింది. ఇలాంటి చర్యలను ఇస్లాం అంగీకరించదు. ఇదే విషయాన్ని ఆమెకు వివరించి .. మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త ఉండాలని చెప్పాం’ అని మౌలానా మీడియాకు వివరించారు. మరోవైపు ఆ యువతితో అలింగనంలో పాల్గొన్న వారిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షరియత్ చట్టాలను అతిక్రమించారని, ఇంకోసారి ఇలాంటి జరిగితే ఉపేక్షించబోమని వారిని ఆయన హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ నెల 16న రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ యువతి నగరంలోని ఓ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చింది. అనంతరం మాల్ ఎదుట నిల్చోని యువకులకు ఆత్మీయ ఆలింగనం ఇవ్వడం మొదలుపెట్టింది. ఓ అమ్మాయి స్వయంగా అలాంటి అవకాశం ఇస్తుంటే యువకులు చూస్తూ ఉండిపోతారా..? యువతి హగ్ కోసం పోటీ పడ్డారు. సుమారు అరగంటపాటు చాలా మంది యువకులకు ఆ యువతి ఆత్మీయ ఆలింగనం చేసింది. ఆమెతోపాటు వచ్చిన మరో ఇద్దరు యువతుల యువకుల సంఖ్యను లెక్కపెడుతూ.. పెద్దగా కేకలు పెట్టారు. దీన్నంతటిని అక్కడున్న కొంత మంది మొబైల్ ఫోన్లలో బంధించారు. 50 మందిని కౌగిలించుకున్న ఆ యువతి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. -
దేశంలో తొలి మహిళా ఇమామ్!
మలప్పురం: ఇటీవల దళితుల్ని ఆలయాల్లో పూజారులుగా నియమించిన కేరళలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశచరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ శుక్రవారం ప్రార్థనల(జుమ్మా నమాజ్)కు ఇమామ్‌గా వ్యవహరించింది. మలప్పురంలోని ఖురాన్ సున్నత్ సొసైటీ కార్యదర్శి జమిథా(34) తమ సంస్థ కార్యాలయంలో శుక్రవారం నమాజ్‌కు నేతృత్వం వహించారు. ఈ ప్రార్థనలకు పలువురు మహిళలు సహా 80 మంది హాజరయ్యారు. ఈ విషయమై జమిథా స్పందిస్తూ.. పవిత్ర ఖురాన్ పురుషులు, స్త్రీల మధ్య ఎలాంటి వివక్ష చూపదని చెప్పారు. మహిళలు ఇమామ్ కాకూడదని ఖురాన్లో ఎక్కడా లేదని వెల్లడించారు. -
‘చంద్రబాబు ముస్లింలను నిలువునా ముంచారు’
సాక్షి, కర్నూలు : ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుట్లూరు సమీపంలో ముస్లింల ఆత్మీయ సదస్సుకు హాజరయ్యారు. ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే వైఎస్ఆర్ పాలన కొనసాగించాలని వైఎస్ జగన్‌కు మైనార్టీలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘ ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశాడు. ఎనిమిది శాతం రిజర్వేషన్లు అంటూ ముస్లింలను నిలువునా ముంచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే మసీదు, చర్చి, దేవాలయాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.15 వేలు, మసీద్ ఇమమ్‌లకు నెలకు రూ.10వేల వేతనం ఇస్తాం.’ అని హామీ ఇచ్చారు. -
రాజధానికి మాహిష్మతి సోకులు
‘అమరావతి’ ఇటీవల కాలంలో ఎక్కువ వివాదాస్పదంగా మారుతోంది. రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే తమ భూములను బలవంతంగా చంద్రబాబు లాక్కుంటున్నారని ఆ ప్రాంతంలోని రైతులు ఇటీవల ప్రపంచ బ్యాంకు పర్యటన సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచ బ్యాంకు సైతం మూడు పంటలు పండే భూములను సందర్శించింది. ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన రాజేంద్రసింగ్ రాజధాని ప్రాంతంలో నదీగర్భానికి భంగం కలిగించే విధంగా భూములను రైతుల నుంచి తీసుకోవడాన్నీ, అలాగే నదీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు జరిగిన తీరునూ ఎండగడుతూ నదులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడటానికి తాను ఉద్య మించగలనని స్పష్టంగా చెప్పారు. చిన్న నీటి వనరులను, నదులను పరిరక్షించి నదులు సజీవంగా తయారు కావడానికి విశేష కృషి చేసిన కారణంగా ఆయనకు ప్రతిష్టాత్మకమైన ‘రామన్ మెగసెసె’ అవార్డును బహూకరించారు. అలాంటి విశిష్ట వ్యక్తి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తే పచ్చ చొక్కాల నాయకులు ఆయనపై దాడి చేయడం సభ్య సమాజానికే అవమానం. ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేస్తున్న లింగమనేని అతిథిగృహంతో సహా దాదాపు 51 మందికి అక్రమంగా నదీ గర్భంలో నివాసముంటున్నారని ఇటీవలే హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే రాజధాని ప్రాంతంలో పచ్చని పంటలను కబళించి పర్యావరణానికి అంతరాయం కలిగిస్తున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఓ కేసు నడుస్తోంది. ఇది కాక రాజధాని ప్రాంతంలో రైతులు తమకు జరుగుతున్న అన్యాయాలపై హైకో ర్టును ఆశ్రయించి అనేక కేసులు వేశారు. ఇదంతా ఎందుకు జరిగింది? రాజధాని ప్రాంతం ఎన్నుకోవడంలో చంద్రబాబు అన్యాయమైన ఆలోచనలు పునాదిగా ఉండటం వల్లనే జరిగాయి. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం ఎంతటి వినాశనాన్ని తెచ్చిపెట్టిందో మనకు నేడు అనుభవంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పులివెందులలో వైఎస్సార్ కుటుంబం ప్రకటించిన సందర్భంగా గ్రామస్థాయిలో సచివాలయాలు ఏర్పాటు చేస్తామని, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు అక్కడి నుంచే ప్రజల భాగస్వామ్యంతో జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందులో ప్రజలు భాగ స్వామ్యం కావాలి. ఈ రాష్ట్రం నాది, మనది అనే అభిప్రాయం ప్రజలు భావించాలి. రాష్ట్రంలో జరిగే పారిశ్రామికాభివృద్ధి అన్ని ప్రాంతాల్లో విస్తరించాలి. బాబు ఈ చర్యలేవీ పాటించకుండా అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆయన జపాన్, సింగపూర్, చైనా తదితర దేశాలన్నీ పర్యటించి సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపి రాజధానిపై ఓ అవగాహన కుదిరిందనే సంకేతాలు మనకు చెబుతూ వచ్చారు. మరి నేడు సినీ దర్శకుడు రాజమౌళితో ఈ చర్చలేమిటి? రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపించి ప్రజల కళ్లకు గంతులు కట్టడానికి తప్ప మరేమీ కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు, నిర్మాత అయిన కేవీరెడ్డి మాయాబజార్‌తో రాజమౌళి నిర్మించిన బాహుబలి చిత్రాన్ని పోలుస్తూ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఒక దేశ ఉప రాష్ట్రపతిగా కాకుండా సంకుచిత భావంతో బాబు గౌరవాన్ని కాపాడటానికి ఒక దినపత్రికలో వ్యాసం రాయడం గర్హనీయం. సీమవాసుల, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా అభివృద్ధి అంతా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగ చేసుకుపోతూ రాజధాని కోసం సేకరించిన భూములతో చెలగాట మాడటం చంద్రబాబు మానుకోవాలి. లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఏర్పడి భవిష్యత్తులో విభజనోద్యమాలకు పునాదులు వేసిన పాపం కూడా బాబు మూటగట్టుకోగలరు. - ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు 99899 04389 -
అమ్మకానికి ‘అమరావతి’
రాజధాని నిర్మాణానికి సింగపూర్ కంపెనీతో ఒప్పందం జాతి విద్రోహం. ఎంచేతంటే సుప్రీంకోర్టు, హైకోర్టుతో సహా మన రాజ్యాంగ పరిధిని దాటి ఆ కంపెనీతో లావాదేవీలు జరిపే అమానుషమైన ఒప్పందం అది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో 30 వేల ఎకరాలు రైతుల నుండి లాక్కున్నారు. రాజధానిని మూడు పంటలు పండే ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం అంటూ అనేక మోసపూరితమైన మాటలను వల్లవేస్తూ రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు ధారదత్తం చేశారు. అసలు రాజధాని అనేది పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకొనే ఒక ప్రాంతం. మెుత్తం పరిశ్రమలు, కార్యాలయాలు ఒకే చోట కేంద్రీకరించడం సబబా? శివరామకృష్ణన్ కమిషన్ హెచ్చరించినట్లు అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరిస్తే భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలకు, విద్వేషాలకు పునాదులుగా ఉద్యమాలు వస్తాయని చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టడం వల్ల రాబోయే రోజుల్లో ప్రమాదకర పరిణామాలు సంభవించబోతున్నాయి. మద్రాసు నుండి విడిపోవడానికి ముందుగా పెద్దమనుషులు చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజధానిని కోస్తాంధ్రలో ఏర్పాటు చేస్తే హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలనే శ్రీబాగ్ ఒప్పం దాన్ని అటకెక్కించి సీమకు ద్రోహం చేయడం రాయలసీమ వాసులను నేటికి కలవరపరుస్తున్న అంశం. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తప్పుల్ని సవరించుకొని అభివృద్ధిని 13 జిల్లాలలో వికేంద్రీకరించి పరిపాలన చేపట్టడం పాలకుల కనీస ధర్మం. చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ తన పాలనంతా కృష్ణా, గుంటూరు జిల్లాలో అమరావతి ప్రాంతంలో కేంద్రీకరించి పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్రకు రైల్వేజోన్ కోసం ఈ మూడు సంవత్సరాలలో బాబు జరిపిన కృషి ఏమిటి? అలాగే ప్రత్యేక హోదా కోసం ఆయన చేసిన నిర్వాకం ఏమిటి? ప్రత్యేక హోదా వస్తే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధి దానికదే జరుగుతుంది. అలా చేయకుండా రాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక హోదా తరహా రాయితీలను కేంద్ర ప్రభుత్వంతో ఒనగూర్చుకోవాలని అమరావతి ప్రాంతాల్లోనే విద్య, వైద్యం ఇతర అభివృద్ధికర అంశాలను, అనేక కార్యక్రమాలను ఆ ప్రాంతంలోనే నెలకొల్పాలనుకోవడం దాంట్లో భాగంగా ఉత్తరాంధ్ర, రాయలసీమను నిర్లక్ష్యం చేయడం సహించరానిది. దేశంలోని ఏ ముఖ్యమంత్రీ మూడేళ్లపాటు దాదాపు జోలి పట్టుకొని నిధుల కోసం చంద్రబాబులా పర్యటనలు చేయలేదు. అభివృద్ధి భావనపై మనం అనుసరించే, ఆచరించే విధానాల ద్వారా ఒక సామాజిక వాతావరణం ఏర్పడడం ద్వారా పరిశ్రమలు వాటంతటవే వస్తాయి. నాటి సీఎం వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఒక సానుకూల అభివృద్ధి విధాన సంకేతాలు భారతదేశం నలుమూలలకు వీచాయి. పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వారంతట వారే క్యూ కట్టారు. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా నెలకొల్పనటువంటి రాజకీయ వాతావరణం ద్వారా ఏపీకి పరిశ్రమలు వచ్చాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా అదే పరిస్థితి. నేడు చంద్రబాబు అమెరికా పర్యటనలో పరిశ్రమల కోసం వెంపర్లాడడం తెలుగు ప్రజల గౌరవాన్ని మంటకలపడం చూస్తూంటే ఆవేశం, ఆవేదన కలుగుతున్నాయి. మన రాష్ట్రంలో మూడు పంటలు పండే ప్రాంతాల్ని మెట్ట ప్రాంతాలుగా చూపించి అక్కడ రాజధాని నిర్మాణం కోసం, పరిశ్రమల కోసం విదేశీయులకు ఎర్ర తీవాచి పరుస్తూ ఆహ్వానించడం కన్నా అన్యాయమైనది మరొకటి లేదు. ప్రత్యేకించి రాజధాని నిర్మాణానికి సింగపూర్ కంపెనీతో ఒప్పందం జాతి విద్రో హం. ఎంచేతంటే సుప్రీంకోర్టు, హైకోర్టుతో సహా మన రాజ్యాంగ పరిధిని దాటి ఆ కంపెనీతో లావాదేవీలు జరిపే అమానుషమైన ఒప్పందం అది. దాంతో లావాదేవీలు జరపాలంటే ఇంగ్లండ్‌లో మనం కేసులు వాదించాల్సి ఉంటుంది. దీనికన్నా అన్యాయమైనది, దుర్మార్గమైనది మరొకటి లేదు. నేడు అమరావతి ప్రాంతంలో భారతదేశంలో ఉని కిలో ఉన్న అన్ని చట్టాలనూ అతిక్రమిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి తెలుగుదేశానికి వంతపాడుతున్నది. రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీకి తోబుట్టువులాగా కొనసాగుతున్నది. ప్రస్తుత పరిస్థితిలో న్యాయ వ్యవస్థలు ఇచ్చిన తీర్పులను సైతం అమరావతి ప్రాంతంలో లెక్కించని పరిస్థితుల్లోకి చంద్రబాబు వెళ్లిపోయారు. అమరావతి పేరుతో జరుగుతున్న ప్రపంచస్థాయి రాజధాని అనే మోసపూరిత నినాదాల పేరుతో రాజధానికి ప్రత్యేక రైలు మార్గాలు, బస్సు మార్గాలు పేరుతో వేల ఎకరాల భూమిని బలవంతంగా సమీకరించుకొని ఒక కొత్త తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చంద్రబాబు తెర లేపారు. నేడు దాదాపు అమరావతి ప్రాంతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితులు 13 జిల్లాల్లోని ప్రజలందర్నీ కలవరపరుస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు అన్నీ కలసి ఒకతాటిపైకి వచ్చి త్వరగా మేలుకోవాలి. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలకు పునాదులు వేసి విభజనోద్యమాలను నివారించడానికి నడుం బిగించాలి. - ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు మొబైల్: 99899 04389 -
అసాధారణం ఆయన ప్రజాప్రస్థానం
సందర్భం దేశ రాజకీయ చరిత్రలోనే అపూర్వమైన రీతిలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పద్నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురానికి సాగిన ఆ పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ కీయాలనే మలుపు తిప్పింది. కుల బలం, ధనబలం, గ్రూప్ రాజకీ యాలు, ప్రాంతీయతత్వాల ముద్ర వేయించుకుని, అప్రతిష్టపాలైన కాంగ్రెస్ పార్టీకి నూతన జవ సత్వాలనిచ్చి, దాన్ని బడుగు బలహీన వర్గాల పార్టీగా, రైతుల సంక్షేమాన్ని కోరే పార్టీగా, జల సిరులతో జన సమైక్యతను సాధించే పార్టీగా మలచింది. ఆ పాదయాత్రలో ఆయన ఎన్నో అనుభవాలు చవి చూశారు. బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూసి చలించారు, పరిష్కారాలను అన్వేషించారు. మండుటెండల్లో తూర్పు గోదావరి జిల్లాలో సాగిన యాత్రలో ఆయన ఎండ దెబ్బకు తీవ్రంగా జబ్బు పడ్డారు. అయినా తన సంకల్పాన్ని వీడలేదు. ఆయన పరిస్థితి ప్రజలకు, అభిమానులకు అందోళన కలిగించింది. కానీ విశాఖ ప్రాంత పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం ఉండవల్లి సూచనను తిరస్కరించి, ఆయనను పరామ ర్శించకుండానే తిరిగి వెళ్లారు. పార్టీ నాయకత్వం నుంచి ఇలాంటి బాధాకరమైన అనుభవాలను ఎన్నిటినో వైఎస్ అనుభవించారు. అయినా ప్రజాశీర్వాదంతో, జేజేలతో ప్రాణాలను లెక్క పెట్ట కుండా తన ప్రజా ప్రస్థానాన్ని విజయవంతంగా సాగిం చారు. చంద్రబాబు జన కంటక పాలనతో విసుగెత్తి, నిరాశలో ఉన్న ప్రజలకు ఆత్మ విశ్వాసాన్ని, నూతనోత్తేజాన్ని కల్పిస్తూ వైఎస్ పాదయాత్ర సాగింది. ఆయన పాద యాత్రను హేళన చేసి, విమ ర్శించిన శక్తులే ప్రజాప్రస్థానం రాష్ట్ర ప్రజల హృదయాలపై వేస్తున్న చెరగని ముద్రను గుర్తించక తప్పలేదు. రాజశేఖర్‌రెడ్డి నిజానికి 35 ఏళ్ల వయస్సులో, 1986లోనే రాయలసీమ అభివృద్ధి సమస్యలపై లేపాక్షి నుండి పోతిరెడ్డిపాడు వరకు 300 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. చేవెళ్ల నుండి ఇచ్చాపురానికి జరిపిన ప్రజాప్రజాస్థానాన్ని 55 ఏళ్ల వయస్సులో ఏప్రిల్ మాసపు ఎండల్లో ప్రారంభించారు. పైగా ఇది దాదాపు 1,600 కిలోమీటర్లు. మండుటెండల్లో ఆ వయస్సులో ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన జరిపిన ఈ పాదయాత్ర నూతన సాంప్రదాయానికి నాంది పలికింది. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాల రాజకీయాలు వైఎస్ ప్రజాప్రస్థానం ముందు తలవంచక తప్పలేదు. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సాను కూల వాతావరణం కల్పించింది. ప్రజల కోసం చేసిన ప్రజా ప్రస్థానం తనలోని కోపం అనే నరాన్ని తెంచేసిందని వైఎస్ స్వయంగా శాసనసభా ముఖంగా తెలిపారు. ఆయన జరిపిన పాదయాత్రలే మహ త్తరమైన జలయజ్ఞానికి పునాది వేశాయి. వింతువులకు, విక లాంగులకు పింఛన్లు, ఆరో గ్యశ్రీ, 108, 104, ఫీజు రీయిం బర్స్మెంట్, ఉచిత వివాహాలు, మైనార్టీలకు రిజర్వేషన్లను పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను కల్పించడానికి కావాల్సిన సంకల్ప బలాన్ని, సాహసాన్ని చేకూర్చాయి. ప్రజాప్రస్థానం ఇచ్చా పురానికి చేరుకోబోతుండగా వైఎస్ తన చేతుల మీదగా ‘నదుల అనుసంధానం’ అనే ఒక విశిష్ట సంచికను ఆవిష్కరించడం వ్యక్తి గతంగా నాకు వరం. నేటి విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ పాలన ప్రజా సంక్షేమమే పరమ ధ్యేయంగా ఒక స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది. వైఎస్ ఎన్నికల ప్రణాళికలోని వాగ్దానాలనేగాక మరెన్నో సంక్షేమ పథకాలను విజ యవంతంగా అమలుపరచారు. ప్రజల పట్ల ఆయనలో అంతటి బాధ్యత, ప్రేమ, వాత్సల్యం, దయ, నిబద్ధత ఏర్పడటానికి ప్రజా ప్రస్థానమే ప్రధాన స్ఫూర్తి. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు రాష్ట్రం లోనే కాదు కేంద్రంలో సైతం అధికారంలోకి తీసుకు రావడానికి అవిరళ కృషి జరిపిన వైఎస్‌కు, ఆయన కుటుంబానికి రుణపడి ఉండాల్సినవారే, ఆయన మరణానంతరం ఆయన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు చేసి, తప్పుడు కేసులు వేశారు. ఆయన తనయుడిని కూడా ఆ కేసులలో ఇరికించారు. చంద్రబాబుతో కలసి కాంగ్రెస్ పెద్దలు చేసిన ఈ అక్రమ అరోపణలను, వేధింపులనూ, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పట్ల, వైఎస్సార్సీపీ పట్ల అనుసరించిన దుర్మార్గ విధా నాన్ని ప్రజలు తిరస్కరించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాజశేఖర్‌రెడ్డి ప్రాంతాలకు అతీతమైన జన సమైక్యతను సాధిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా చీల్చివేసింది. వైఎస్ బతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదని బీజేపీ, వామ పక్షాలు, కాంగ్రెస్ సైతం నేడు వైఎస్ పాలనను గుర్తుకు తెచ్చు కుంటుండటమే ఆయన గొప్పదనానికి నిదర్శం. వైఎస్‌ను అంతటి అసమాన ప్రజానేతగా నిలిపిన ప్రజాప్రస్థానం స్ఫూర్తితో ఆయన బాటన సాగడమే ఆయనకు నిజమైన నివాళి. ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు-9989904389 -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఫత్వా జారీ
మమతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు.. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమతను జుట్టు పట్టి ఈడ్చి పారేసి ఉండాల్సిందని దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పశ్చిమ్ మెద్నిపూర్ జిల్లా జార్గ్రామ్ లో ఆదివారం జరిగిన పార్టీ యువజన విభాగం భేటీలో మాట్లాడుతూ ఘోష్ ఇలా మమతపై నోరు పారేసుకున్నారు. 'పెద్దనోట్ల రద్దుతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వేలకోట్ల రూపాయల నష్ట పోయారు. , అందుకే ఆమెకు మతి భ్రమించింది. ఢిల్లీలో ఆమె డ్రామా (ఆందోళన) చేస్తున్నపుడు జుట్టు పట్టి లాగి విసిరి పారేసి ఉండవచ్చు.. అక్కుడన్న పోలీసులు మన వాళ్లే.. కానీ తాము అలా చేయలేదు' అంటూ దిలీప్ ఘోష్ చెప్పుకొచ్చారు. నోట్ల రద్దుతో పిచ్చి పట్టిన మమత ఢిల్లీ, పట్నా చుట్టూ చక్కర్లు కొడుతోందని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై టీఎంసీ తీవ్రంగా తప్పుబట్టగా.. తాజాగా దిలీప్‌ఘోష్ వ్యాఖ్యలను కోల్‌కతాకు చెందిన టిప్పు సుల్తాన్ మసీదుకు చెందిన ఇమామ్ కూడా ఖండించారు. మమతా బెనర్జీపై దిలీప్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇమామ్ సోమవారం ఫత్వా జారీచేశారు. -
ఆత్మ విశ్వాసంతో ఆరో అడుగు
సందర్భం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఐదేళ్లు గడిచి, ఆరో సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులు ప్రత్యేకమైనవి. కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే వైఎస్సార్సీపీ అసెంబ్లీలో ప్రతిపక్షంగా ప్రవేశించింది. పదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పదవులు చేపట్టిన చంద్రబాబు నేడు రాజకీయంగా, నైతికంగా పతనావస్థలో కనిపించడం విశేషం. ఆయనకు ప్రతిపక్షం అంటే అసహనం. వైఎస్సార్సీపీ జెండాతో నెగ్గిన నంద్యాల, అరకు ఎంపీలను ప్రమాణ స్వీకారానికి ముందే తెలుగుదేశంలో చేర్చుకున్నారు. కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అక్రమ పద్ధతిలో, పోలీసుల సహకారంతో పార్టీలో చేర్చుకోవడం వంటి చర్యలకు సైతం చంద్రబాబు పాల్పడ్డారు. టీడీపీ పాలన మీద పెద్ద ఎత్తున ప్రజావ్యతిరేకత చోటుచేసుకుంది. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఆయన ఈ వికృత విధానాలను ఆశ్రయిస్తున్నారు. కాకినాడలో జరిగిన యువభేరి, కాపు గర్జన విజయవంతం కావ డంతో సహనం కోల్పోయి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలో భాలకు గురిచేసి తెలుగుదేశంలో చేర్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న తరువాత చంద్రబాబు వైఖరి మరింత పతనమైంది. ప్రతిపక్షం లేకుండా చేయడమే ధ్యేయంగా, ఈ రెండేళ్ల అక్రమ సంపాదనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, పార్టీలో చేర్చుకున్నారు. ఈ తీరుతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని నైతికంగా దెబ్బ తీయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోరాట సంప్రదాయానికి కేంద్రమైన వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్రెడ్డి రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు కనుసన్నలలో జరిగిన భూదందా, భూ దోపిడీలను కనీవినీ ఎరుగని రీతిలో ఎండగట్టడం జరిగింది. రాజధాని మాటున జరుగుతున్న అక్రమాలూ, అవినీతిపై సీబీఐ విచారణకు ప్రతిపక్ష నేత అసెంబ్లీలో డిమాండ్ చేశారు. అధికార పార్టీ అక్రమాలను, అవినీతిని ప్రశ్నిస్తే రాజధానిని వ్యతిరేకిస్తున్నారనే అసత్య ప్రచారానికి ఒడిగడుతున్నారు. రాజధాని చుట్టూ అభివృద్ధి, కేంద్రీకరణ అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చంద్రబాబు బాటలు వేశారు. రాజధాని తాగునీటి అవసరాలకీ పరిశ్రమల కోసం పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి, రాయలసీమ కరువు తీర్చడానికంటూ అబద్ధాలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం, విశాఖపట్నం రైల్వేజోన్ కోసం, విభజన చట్టంలో పేర్కొన్నట్టు రాష్ట్ర బడ్జెట్ లోటు భర్తీకి ఇచ్చిన హామీల అమలుకు చంద్రబాబు కృషి చేయడం లేదు. గుంటూరు జిల్లాలో రాజధానిని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడే, మిగిలిన జిల్లాల కోసం అనేక పథకాలను ప్రకటించారు. వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం కూడా లేదు. అంటే అభివృద్ధినంతా రాజధాని చుట్టూనే కేంద్రీకరిస్తున్నారు. రాయలసీమ సేద్యపు నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. తన అనుచరులు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తే విధంగా విధానాలు చేపడుతున్నారు. ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చిన అధికార పక్షం కారణంగా ప్రతిపక్షం, జగన్మోహన్రెడ్డి అనేక ఇక్కట్లు ఎదు ర్కొంటున్నారు. అపనిందలను, అపవాదులను, అవినీతి ఆరో పణలను, కుట్రలను, కేసులను ఎదుర్కొంటూ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతోంది. గడిచిన రెండేళ్లలో జగన్ రైతు సమస్యల మీద, ప్రాజెక్టుల ఆవశ్యకత మీద, ప్రత్యేక హోదా సాధన కోసం అనేక సభలు, సమావేశాలు జరిపారు. రైతుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా భరోసా యాత్ర చేపట్టి విసృ్తతంగా పర్యటించారు. అసెంబ్లీలో కానీ, బయట కానీ ప్రజాసమస్యలపై నిరంతరం జగన్ గళం విప్పుతూనే ఉన్నారు. వైఎస్సార్సీపీని రెండేళ్లలోనే సమరశీల పార్టీగా, ప్రతిపక్ష పార్టీగానే కాకుండా ప్రజాపక్షం వహించే స్థాయిని కల్పించారు. నేడు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రబల రాజకీయశక్తులు. ప్రజల ఆశాజ్యోతులు. నిరుద్యోగ యువతకు భరోసా, రైతులకు ఒక చేయూత, మహిళలకు ఒక విశ్వాసం. అందుకే అధికార పక్షం కుట్రలను, సవాళ్లను అధిగమించి వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోగలుగుతున్నది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించిన పోరాట పంథాను వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలి. తెలుగుదేశం విసురుతున్న సవాళ్లను దీటుగా ఎదు ర్కొనడానికి సమాయత్తం కావాలి. రాష్ట్రంలో రాజకీయ పరిణా మాలు ఒక కీలక దశకు చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితులను జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధిగమించడానికి ప్రజలు అండదండలు చేకూర్చాలి. ప్రజలకు వైఎస్ జగన్ ఒక అండ. ప్రజలే జగన్‌కు అండా దండ. వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు ఇమామ్ మొబైల్ :9989904389 -
మక్కా మసీదు కతీబ్ కన్నుమూత
♦ అనారోగ్యంతో మౌలానా హాఫేజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ మృతి ♦ కేసీఆర్, చంద్రబాబు, మహమూద్ అలీ సంతాపం హైదరాబాద్: మక్కా మసీదు కతీబ్, ఇమామ్ మౌలానా హాఫేజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ అల్ జహాదీ(80) మంగళవారం మృతిచెందారు. హైదరాబాద్ పాతబస్తీ పంచమహాల్లాకు చెందిన ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన మరణించిన విషయం తెలుసుకున్న పలువురు మత పెద్దలతో పాటు అధికార, అనధికార ప్రముఖులు సంతాపం తెలిపారు. 1935 సెప్టెంబర్ 19న దుండిగల్‌లో జన్మించిన ఆయన గత 24 ఏళ్లుగా మక్కా మసీదు కతీబ్‌గా కొనసాగుతున్నారు. అలాగే జామే నిజామియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా కూడా పని చేశారు. ప్రతి శుక్రవారం ఆయన సామూహిక ప్రార్థనల సందర్భంగా మక్కా మసీదులో కుత్బా నిర్వహించేవారు. అల్ హజ్ అబ్దుల్ రహీంకు రెండో కుమారుడైన అబ్దుల్లా ఖురేషీ మెట్రిక్లేషన్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి, డిగ్రీ ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పూర్తి చేశారు. జామే నిజామియా నుంచి ఫజిల్ కోర్సు పూర్తి చేశారు. ‘దావతుల్ ఇస్లామియా అల్ ముసైరా ఫిల్ హిందూ’పై ఎంఫిల్ చేశారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులందుకున్న ఆయన అంత్యక్రియలు బుధవారం జొహర్ కి నమాజ్ అనంతరం మిశ్రీగంజ్‌లో ముగియనున్నాయి. కేసీఆర్, బాబు సంతాపం... అబ్దుల్లా ఖురేషీ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మక్కా మసీదు ఇమామ్‌గా, జామియా నిజామియా వైస్ ఛాన్సలర్‌గా ఆయన సేవలను కొనియాడారు. అబ్దుల్లా ఖురేషీ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఖురేషీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖురేషీ మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఖురేషీ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. -
మమతల రాజధాని నిర్మించాలి
రాజధాని నిర్మాణ సందర్భంగా నేడు రాష్ట్రంలో చాలా ఆందోళనకర పరిణామాలు గమనిస్తున్నాం. విభజన తరువాత ఏర్పడ్డ సంక్షోభ నివారణకు నవ్యాంధ్రలో తగిన సవరణ లతో సమతుల్యతతో కూడిన అభివృద్ధికి గ్రేటర్ రాయల సీమ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో పునాదులు వేసుకోవడానికి మారుగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో రాజధాని పేరుతో అభివృద్ధిని కేంద్రీకరిం చడం, మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడంతో గ్రేటర్ రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాజధాని ప్రాంతాల్లో తాగునీటి, పారిశ్రామిక అవసరాల కోసం చేపట్టిన పట్టిసీమ ఎత్తి పోతల పథకం రాయలసీమ వాసుల తాగునీటి కోసం, సాగునీటి కోసమని బుకాయిస్తూ చేస్తున్న ప్రకటనలు మరింతగా సీమవాసుల మనోభావాలను గాయపరుస్తున్నాయి. రాజధాని అనేది ఒక పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించుకొనే ప్రాంతం. నేడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంతో మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో ఒకే ప్రాంతంలో లక్ష ఎకరాల్లో అభివృద్ధిని కేంద్రీకరిస్తూ ఇతర ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కల్పించడమే.. రాజధాని ఎందుకు నిర్మిస్తున్నారు? టూరిజం, పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు, ఎయిమ్స్ తదితర నిర్మాణాలను రాజధాని ప్రాంతంలోనే కేంద్రీకరించడం ఎందుకు? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏవీ కూడా రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు రుచించడం లేదు. జాతీయ హోదా కలిగిన పోలవరం నిర్మాణం నిర్లక్ష్యానికి గురికావడం, కేంద్రం ఇచ్చిన నిధులు పట్టిసీమ పేరుతో అవినీతికి గురికావడం, రాజమండ్రి పుష్కరాలలో జరిగిన అవినీతిపై కేంద్రం నిర్లక్ష్యం వహించడం లాంటి ఘటనలపై ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని బీజేపీ నేతలు పురంధరేశ్వరి, సోము వీర్రాజు చేస్తున్న డిమాండ్లను చంద్రబాబు లెక్కించడం లేదు. అత్యంత వివాదాస్పదమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న సందర్భంలో నరేం ద్రమోదీ ఆంధ్ర పరిణామాలపై నిర్మాణాత్మకంగా స్పం దించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశాలపై మోదీ తెలుగు ప్రజలకు నిజంగా దసరా శుభాకాంక్షలు చెబు తారా? అనే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు దాదాపు 15 లక్షల ఎకరాల రైతుల భూముల్ని ప్రభుత్వ అధీనంలోకి తెచ్చుకొని వ్యాపారం చేయాలనుకుంటున్నారు. రాజధాని నిర్మాణాలు ఆపా లని గ్రీన్ టిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా చంద్ర బాబు ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. ‘వ్యవసా యం దండగ’ అన్న ముఖ్యమంత్రి నేడు రైతుల భూము లతో వ్యాపారం చేస్తున్నారు. ఇంత దుస్సాహసానికి మరే రాజకీయ నాయకుడు పూనుకోలేదు. ల్యాండ్ బ్యాంకు కింద ప్రభుత్వం, ఏపీఐఐసీ ఇప్పటి వరకూ సేకరించిన భూముల వివరాలు: శ్రీకాకుళం 4,493.37, విజయనగరం 16,913.39, విశాఖపట్నం 63,332.99, తూర్పు గోదావరి 64,228.24, పశ్చిమగోదావరి 1,388.15, కృష్ణా జిల్లా 15,384.74, గుంటూరు 48, 534.73, ప్రకాశం 43,996.11, నెల్లూరు 62,112.86, కడప 1,06,829.04, చిత్తూరు 1,60,938.58, కర్నూలు 45,166.18, అనంతపురం 1,30,842.17, మొత్తం 7,64,260.52 ఎకరాలు. రాజధాని ప్రాంతంలో బాబు సేకరిస్తున్న లక్ష ఎకరాలు దీనికి అదనం. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నిరుపేదలకు దాదాపు ఐదు లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారు. అది కాక ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాలలో గిరిజనులు, పేదలు సాగు చేసుకుంటున్న ఏడు లక్షల ఎకరాలకు కేంద్ర ప్రభుత్వంతో అటవీశాఖ అనుమతులు సాధించి పంపిణీ చేయించారు. ఆ భూములను చదును చేసుకో వడానికి ఇందిరప్రభ పథకం పేరుతో వందల కోట్లు కేటాయించారు. చంద్రబాబు భూములు లాక్కోవడం, వైఎస్ భూములు పంచడం ఈ సందర్భంగా గమనించాలి. నేడు రాజధాని నిర్మాణం కోసం వందల కోట్లు వెచ్చించి సంబరాలు జరుపుకుంటున్న ఘటన ఇతర ప్రాంతాల ప్రజలకు ఏ రకమైన ఉత్సాహం కలిగించ లేదనేది చంద్రబాబు గుర్తించాలి. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జరుగుతున్న పరిణామాలను నిర్మాణాత్మకమైన సూచనల ద్వారా ఎప్పటికప్పుడు అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బయటా తగు విధంగా సూచిస్తూ వచ్చారు. ఆయన ఆందోళనలు కూడా చేప ట్టారు. వాటినేమీ బాబు పట్టించుకున్నట్లు లేదు. చివరకు పట్టిసీమలో అవినీతి, రాయలసీమ సేద్యపునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం గురించి రాయలసీమ ప్రాజెక్టులకు నికరజలాలు కేటాయించాలని కోరుతున్న మిత్రపక్షం బీజేపీని కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు. వామ పక్షాలు, లోక్‌సత్తా లాంటి పార్టీలు అనేక ప్రజాసం ఘాలు, రైతు సంఘాలు వెలిబుచ్చుతున్న అభిప్రాయా లను ఆయన పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి జరుగుతున్న ఈ పరిణామా లలో తమకు భవిష్యత్తులో, చరిత్రలో దోషులుగా చేర్చే పరిస్థితులనుండి వేరుకావడం కోసం రాజధాని శంకు స్థాపన కార్యక్రమాలను బహిష్కరించారు. మరో చారి త్రక తప్పిదంలో తాము భాగస్వాములు కావడానికి తిర స్కరించడం ద్వారా ప్రతిపక్ష నేత తీసుకున్న నిర్ణయం ఒక హెచ్చరికలాగ తీసుకొని చంద్రబాబు ఏ మేరకు తన తప్పిదాలు సవరించుకుంటారో ఆ మేరకు ఆయనకు, రాష్ట్రానికి ఫలితాలుంటాయి. -ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు మొబైల్: 99899 04389 -
అజరామరం ఆయన కీర్తి
సందర్భం తెలంగాణ, రాయలసీమలలోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి సదుపాయాల కోసం కేంద్ర సహాయం లేకుండా రాష్ట్ర వనరుల నుంచే వేల కోట్లు వెచ్చించడం అపూర్వం కాదా? ప్రజా సంక్షేమానికి వైఎస్ పట్టంగట్టిన తీరు నేడు ఎక్కడైనా కనబడుతోందా? నిరంతర కరువు పీడిత ప్రాంతం నుంచి ఎదిగివచ్చిన రాజకీయవేత్తగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నీటి కోసమే అనుక్షణం పరితపించారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా నీటి పారుదలకే ప్రథమ ప్రాధాన్యాన్నిచ్చారు. ప్రజా సంక్షేమమే పాలనకు ప్రధాన కేంద్రంగా చేసుకొని అహరహం కృషిచేసిన వైఎస్... ఎన్ని కష్టనష్టాలు, అపనిందలు, అపవాదాలు ఎదురైనా ప్రజల పట్ల ఆ అంకిత భావాన్ని సడలించలేదు. నేటి పాలకుల తీరుతెన్నులను, విధానాలను చూస్తుంటే ప్రజ ల పట్ల అలాటి అంకిత భావం కొరవడటం కనిపిస్తుంది. దేశ ప్రధానిలోనూ, ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల లోనూ దీన్ని ప్రస్ఫుటంగా గమనించవచ్చు. జలవనరు ల వినియోగానికి వారు తగు ప్రాధాన్యం ఇవ్వకపోవడ మే కాదు... నిరుద్యోగ యువతను, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించారు. ఇది చూస్తుంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టంగట్టిన వైఎస్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల తెలుగు ముఖ్యమంత్రులు అట్టహాసంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో దార్శనికత, పారదర్శకత కొరవడ్డాయని, అక్రమ పద్ధతులకు చోటిచ్చాయని విమర్శలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ నీటి పారుదల ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యం, ప్రత్యేకించి వెనుకబడిన తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీరందించాలని, కృష్ణా డెల్టాను స్థిరీకరించాలని చేసిన కృషి అజరామరం. తెలంగాణ, రాయలసీమలలోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి సదుపాయాల కోసం కేంద్ర సహాయ, సహకారాలు లేకుండా రాష్ట్ర వనరుల నుంచే వేల కోట్ల రూపాయలను వెచ్చించిన ఘనత వైఎస్‌దే. ఆయనను విమర్శించే చంద్రబాబు, కేసీఆర్‌లు దానికి సాటిరాగల కృషిని ఆచరణలో చూపారా? మహిళా సంక్షేమానికి వైఎస్ పట్టంగట్టిన తీరు నేటి రాజకీయాల్లో ఎక్కడైనా కనబడుతోందా? జాతీయ ప్రాజెక్టు పోలవరంపట్ల నేడు ప్రధాని మోదీ ఉదాసీనతను, నిర్ల క్ష్యాన్ని ప్రదర్శించడం వైఎస్ బతికి ఉంటే జరిగేదా? ఇందిరాగాంధీ కుటుంబం అంటే గౌరవంతో వైఎస్ పలు పథకాలకు ఇందిర, రాజీవ్‌ల పేర్లు పెట్టారు. అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ మరణానంతరం తెలుగుదేశంతో, దాని ప్రచార మాధ్యమాలతో చేయిగలిపి ఆయనను దుమ్మెత్తిపోసింది. టీడీపీతో కలిసి ఆయనపైనా, ఆయన కుటుంబంపైనా, ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైనా సీబీఐ కేసులు పెట్టి వేధించడానికి నీచమైన పద్ధతులకు పాల్పడింది. ప్రజలు ఆ ప్రయత్నాలను తిరస్కరించారు, ఛీత్కరించారు. అయినా నేడు చంద్రబాబు అసెంబ్లీలోని వైఎస్, టంగుటూరి ప్రకాశం చిత్రపటాలను తొలగించడం లాంటి దివాలాకోరుతనానికి తెరలేపారు. ప్రజల హృదయాల నుంచి వైఎస్‌ను ఎవరూ దూరం చేయలేరని గుర్తించలేని అజ్ఞానం ఆయనది. మానవ వనరుల అభివృద్ధికి వైఎస్ ఇచ్చినంతటి ప్రాధాన్యాన్ని మరెవరూ ఇవ్వలేదు. ఇడుపులపాయ, నూజివీడు, బాసరలలో గ్రామీణ విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టేందుకు స్థాపించిన విద్యాలయాలు ఆయన దార్శనికతకు నిదర్శనాలు. రైతు సంక్షేమానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం అంతకు ముందు ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేదు. భూమిలేని నిరుపేదలకు నాలుగు విడతలుగా భూ పంపిణీ కార్యక్రమాలు చేపట్టి ఐదు లక్షల ఎకరాలు, దాదాపు ఏడు లక్షల ఎకరాలకు గిరిజనులకు పట్టాలను పంపిణీ చేశారు. అంతేగాక ఆ భూములను చదును చేసుకోవడానికి ‘ఇందిరప్రభ’ ద్వారా వందల కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత ఆయనది. అనంతపురం, ప్రకాశం జిల్లాలలో వైఎస్ హయాంలో ప్రభు త్వం పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చినా అందుకు రైతులు అంగీకరించలేదు. రైతుల బాగోగులను ఆయన అంతగా పట్టించుకొని పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి పునాదులు వేశారు. తెలు గు ప్రజల సమైక్యతకు, సంక్షేమానికి ఆయన ఎంతగానో తపించారు. నేటి తెలంగాణలో, ఏపీలో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, రాయలసీమలలో జరుగుతున్న పరిణాలమాలను చూస్తే వైఎస్ కార్యక్రమాలు ఎంత ముందు చూపు తో చేపట్టినవో అర్థమవుతుంది. వైఎస్ బాటలోనే అభి వృద్ధి-సంక్షేమ సాధన కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన నాయకత్వంలోని వైఎస్సార్సీపీ చేస్తున్న రాజకీయ పోరాటాలను ప్రజలు ఆదరిస్తున్నారు, వెంట నడు స్తున్నారు. తెలంగాణలో వైఎస్ తనయ వైఎస్ షర్మిల జరుపుతున్న ఓదార్పుయాత్రను ప్రజలు ఆదరిస్తుండటం గమనార్హం. నేటి దౌర్భాగ్యకర పరిస్థితులను చూస్తుంటే ప్రజలకు వైఎస్ గుర్తొకొస్తున్నారు. 108, 104 సర్వీసులు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత వివాహాలు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, ఇందిరమ్మ ఇల్లు, జలయజ్ఞం, వ్యవసాయ రంగానికి విశేష ప్రాధాన్యం ఆయన కృషిని గుర్తుకు తెస్తున్నాయి. ఇక రుణాల రద్దు, ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు, మున్సిపాలిటీలలో పన్నుల పెంపుదల లేకపోవడం, ఆర్టీసీ చార్జీల మోతలు లేకుండా చేయడం, కేంద్ర గ్యాస్ ధర పెంచితే పెంచిన గ్యాస్ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించడం అపూర్వం. పన్నులు వేయకుండా, ఆదా యం సమకూర్చుకుంటూ కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను పెంచిన అసాధారణ పాలనాదక్షుడు వైఎస్. రాష్ట్ర సంపదను పెంచారు, దాన్ని ప్రజలకు పంచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ అభిమానులు ఆయన కలలను సాకారం చేయడానికి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇమామ్ - వ్యాసకర్త కదలిక సంపాదకులు: 99899 04389 -
'సీమ సమస్యలపై ఉద్యమిస్తాం'
కడప కల్చరల్ : రాయలసీమ ఇప్పటికే అనేకమార్లు పలువురి వంచనకు గురై తీవ్రంగా నష్టపోయిందని, నేటికీ ఆ మోసం పునరావృతమవుతోందని, ఇకనైనా 'సీమ' సమస్యలపై తీవ్రంగా ఉద్యమించకపోతే మరింత నష్టపోవాల్సి ఉంటుందని కదలిక పత్రికా సంపాదకులు ఇమాం హెచ్చరించారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్.శివరామిరెడ్డి రచించిన 'ది స్టోరీస్ ఆఫ్ 13 జెమ్స్ ఆఫ్ ది నేషన్' పుస్తకావిష్కరణ సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటి గాలేరు - నగరితోపాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో, నేడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంతోపాటు సీమకు ప్రత్యేకించి ప్రస్తుత నాయకులు నష్టం చేకూరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమకు ప్రాజెక్టులు దక్కకుండా తాగునీటికి సైతం ముఖం వాచేలా కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఇకనైనా సీమ నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు మేల్కొని తీవ్ర స్థాయిలో ఉద్యమించకపోతే ఇక తేరుకునే ప్రసక్తే ఉండదన్నారు. -
అభివృద్ధికి ఆయనే చిరునామా!
సందర్భం తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రమించినంతగా మరెవరూ శ్రమించలేదు. యావద్దేశం ఆశ్చర్యపోయేలా వినూత్న పథకాలతో తెలుగు ప్రజలు జీవించడానికి ఒక ఆశావహ వాతావరణం కల్పించారు. ఆయన నేడు ఒక వ్యక్తిగా మన ముందులేరు. కానీ.. ఒక శక్తిగా, ఆదర్శంగా, ప్రజల మనోభావాలకు, అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు చిరునామాగా, చిరంజీవిగా ప్రజల హృదయాల్లో వెలుగొందుతున్నారు. కాలమాన పరిస్థితులకు తగ్గ ట్టుగా ప్రజల కోసం పనిచేయ డానికి ముందుకు వచ్చే నాయ కులు తమని తాము పరిస్థితు లకు అనుకూలంగా మరల్చు కుంటారు. ఆ కోవకు చెందిన అరుదైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజల నుండి ప్రజల కొరకు పనిచేసే నాయ కత్వం ఎలా ఉండాలంటే మనకు గుర్తుకు వచ్చేది వైఎస్ రాజకీయ జీవితం. తాను ఏ ప్రజల కోసం పనిచేశాడో... ఆ ప్రజలు ఆయనను తరచూ గుర్తుంచుకోవడం, ఆయన ఉంటే... ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉండేవి కావు అను కోవడం జరుగుతోంది. విచిత్రమేమిటంటే... ఆయనను తరచూ విమర్శిస్తూ... విభేదించి ఆయనను తమ రాజ కీయ ప్రత్యర్థిగా భావించిన వారు సైతం.. నేడు రాజశేఖ రరెడ్డి బతికుంటే తెలుగునాట పరిస్థితులు ఇలా ఉండేవి కాదని అంగీకరించారు. తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ శ్రమించినంతగా మరెవరూ తెలుగునాట శ్రమించలేదు. కొందరు కొన్ని రంగాలలో కృషి చేసి ఉండొచ్చు. కానీ సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పారిశ్రామిక రంగాల అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలుపరచిన తీరు తన రాజకీయ పరిణతికి, దక్షతకు, అకుంఠిత పట్టుదలకు నిదర్శనాలుగా నిలుస్తాయి. పోల వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా రూపుదిద్దుకోవడా నికి వైఎస్ పట్టుదలే అసలు సిసలు కారణం. ఆ ప్రాజెక్టు అనుమతులు సాధించడంలో వైఎస్ కనబర్చిన ఆసక్తి మరే నాయకుడిలోనూ మనకు కనపడదు. అంతేకాదు పోలవరం కుడికాలువకు 4 వేల కోట్లకు మించి వెచ్చిం చారు. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాలకు భిన్నంగా కృష్ణా డెల్టా రైతాంగం చింతలు తీర్చడానికి పులిచింతల ప్రాజెక్టు చేపట్టి దాదాపు 4 వేల కోట్లు ఖర్చు పెట్టి కాలు వలు చేపట్టారు. అదే ఒరవడిలో గాలేరు-నగరి, వెలి గొండ ప్రాజెక్టులు ఇటు రాయలసీమ, నెల్లూ రు, ప్రకాశం జిల్లాల అవసరాల కోసం అటు తెలంగాణలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, తదితర పథకా లకు వేల కోట్లు కేటాయిం చారు. ప్రస్తుతం కేసీఆర్ రూ.3 వేల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులన్నీ ఆచరణలోని కి వస్తాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సాగు, తాగునీటి అవసరా లు తీరతాయి. అవి చేపట్ట కుండా కేసీఆర్ ఆలమూరు ప్రాజెక్టు ఒకటి చేపట్టి వివా దంలోకి వచ్చారు. చంద్రబా బు రూ.2 వేల కోట్లు ఖర్చు పెడి తే హంద్రీనీవా పథకం పూర్తి అవు తుంది. అలాగే గాలేరు-నగరి, వెలి గొండ లాంటి ప్రాజెక్టులు పూర్తి అవడానికి 4 వేల కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇక్కడ కరువు ప్రాంతాలకు ఈయన చేయడు. అక్కడ కరువు ప్రాంతాలకు ఆయన పనిచేయడు. ఒకరు పట్టిసీమ... మరొకరు ఆలమూరు ప్రాజెక్టు చేపట్టి ఇరు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు పెంచడా నికి ఆజ్యాలు పోయడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ తనకు అండగా నిలిచిన లేదా, తనను ఆదు కున్నవారి కోసం శ్రమించారు, తపించారు. ఆయన పోల వరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధించటమే కాకుం డా, ఆరోగ్యశ్రీ లాంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకా నికి నాంది పలికారు. అలాగే ఆకాశమే హద్దుగా లక్షలాది మంది పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ పథకం అమలు చేశారు. వైఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిలు రద్దు తదితర కార్యక్ర మాలు ప్రకటించారు. ఆయన అధికా రం చేపట్టాక ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, మైనార్టీల సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లు, పా వలా వడ్డీ, రైతుల రుణమా ఫీ.. ఒకమాటలో చెప్పాలం టే తెలుగు ప్రజలకు జీవిం చడానికి ఒక ఆశావహ వాతావరణం కల్పించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతుల ఆత్మహ త్యలు, వలసలు, అప్పులు, నిరుద్యోగ సమస్యలు తది తర విధానాలతో శ్మశాన వాతావరణం నుండి ప్రజలను బయటకు తీసుకొచ్చారు. దేశం లోకి పెద్ద ఎత్తున చొచ్చుకు వచ్చిన ప్రపంచ బ్యాంకు అనుకూల విధానాల నుండి ఏర్పడ్డ దుష్పరిణామాలను అర్థం చేసుకుని వాటిని ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఒక ప్రత్యేక విధానం అమలు పరిచారు. మన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విదేశాల నుండి పెట్టుబడులు, దిగుమతులు, ఎగుమతు లు ఉండాలి. ప్రస్తుతం మన ప్రధాని, ముఖ్యమంత్రి విదే శాలలో పర్యటిస్తూ... మన దేశంలో, రాష్ట్రంలో పెట్టుబ డులు పెట్టండి... షరతులు లేకుండా మీకు అన్ని రకా లైన సౌకర్యాలు కల్పిస్తాం అంటూ... ప్రాధేయ పూర్వ కంగా పర్యటనలు చేయడం గమనిస్తే, రాజశేఖరరెడ్డి లాంటి రాజకీయ నాయకుల నుండి వీరు ఎంతో నేర్చు కోవాల్సి ఉంది. వైఎస్ ఎప్పుడూ విదేశీపర్యటనలు చేయ లేదు. ఆయన విదేశీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తు లకు ఎర్రతివాచీలు పరచలేదు. మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న శక్తివంతులైన స్థితిమంతులతోనే ఆయన ఎక్కువగా పనిచేశారు. వైఎస్ నేడు ఒక వ్యక్తిగా మనముందు లేడు. ఒక శక్తిగా ఆదర్శంగా ప్రజల మనోభావాలకు, అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు చిరునామాగా చిరంజీవిలా వెలుగొందుతూ... తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం ఏర్పరచుకున్నారు. వైఎస్‌ను, వైఎస్ కుటుంబాన్ని వేధిం చడానికి జరిపిన ప్రయత్నాలను తెలుగు ప్రజలు తిప్పికొ ట్టారు. చంద్రబాబు అనేక తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను వంచించి అధికారం చేపట్టారు. ఇచ్చిన వాగ్దా నాలు రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, చేనేత రుణమాఫీ, విద్యార్థులకు నిరుద్యోగ భృతి లాంటి వాగ్దా నాలు అమలు పరచడంలో వైఫల్యం చెందారు. ఆయన దృష్టి అంతా రాజధాని చుట్టూ కేంద్రీకృతమై ఉంది. తాను ఒక్కడే నిజాయితీకి పేటెంటునని విపరీతంగా ప్రచారం చేసుకునే చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి విభజన చట్టంలోని సెక్షన్-8 గురించి ఆప సోపాలు పడటం చూస్తే మనకు నవ్వు, జాలి కలుగు తాయి. నేడు దేశంలో వైఎస్ విధానాలు, పథకాలు పదే పదే చర్చకు వస్తున్నాయి. ఆయన కుటుంబంపై అక్రమ కల యికతో జరుగుతున్న రాజకీయ సమీకరణలను అవి కేం ద్రంలో జరిగిన, రాష్ర్టంలో జరిగిన ప్రజలు పసిగడు తున్నారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామా లను ప్రజలు అంతే వేగంగా అర్థం చేసుకుంటున్నారు. డాక్టర్ వైఎస్ నడిచిన దారిలో పయనించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇరు రాష్ట్రాలలో తెలుగు ప్రజల సర్వ తోముఖాభివృద్ధికి వైఎస్ చూపిన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు, వైఎస్సార్సీపీ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జయంతి సందర్భంగా తమని తాము ఉన్నతీకరించుకుని వైఎస్ ఆశయాల కోసం నడుంబిగించి పోరాడటమే వైఎస్‌కు మనం అర్పించే నిజమైన నివాళి. ఇమామ్ (వ్యాసకర్త కదలిక సంపాదకులు) మొబైల్: 99899 04389 -
చిరస్మరణీయుడు శివరామకృష్ణన్
నవ్యాంధ్రప్రదేశ్‌లో అభి వృద్ధి వికేంద్రీకరణ, వెను కబడిన ప్రాంతాల అభి వృద్ధి, ప్రత్యేకించి నూతన రాజధాని తదితర అంశా లపై చాలా శాస్త్రీయమైన పద్ధతిలో ప్రాంతీయ రాగ ద్వేషాలకు అతీతంగా నివే దిక సమర్పించినవారు శివరామకృష్ణన్. నవ్యాంధ్ర ప్రదేశ్‌లోని ప్రజల సర్వతోముఖాభివృద్ధిపై ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ సమర్పించిన నివేది కను ప్రతి తెలుగువాడు అధ్యయనం చేయాలి. గతం లో కృష్ణా జలాల పంపిణీ సందర్భంగా పరీవాహక రాష్ట్రాల మధ్య తగాదాలు తీర్చడానికి ఏర్పాటైన బచావత్ కమిషన్, అలాగే గోదావరీ జలాల విని యోగంపై ఏర్పాటు చేసిన గుల్హాతి కమిషన్, ఇటీ వల రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిషన్ నివేదికలు చాలా విలువైనవి. తెలుగు రాష్ట్రాల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలపై ఎంతో బాధ్య తతో అధ్యయనం జరిపి ఇచ్చిన నివేదికలవి. ఆ నివే దికల ఆధారంగా మన తెలుగు పాలకులు బాధ్య తగా స్పందించి ఉంటే నేడు ఏర్పడబో తున్న సంక్షోభాలను పరిష్కరించి ఉండ వచ్చు. కేంద్రంలో నాటి సోనియాగాంధీ, మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఆంధ్రప్ర దేశ్ విభజనానంతర పరిస్థితులను, ఏర్పడబోయే పరిణామాలను సక్రమం గా అంచనా వేయకుండా చేసిన విభజన తో జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదు. విభ జన జరిగిన తీరు కూడా భారత పార్లమెంట్ చరి త్రలో చీకటి రోజుగా నిలిచిపోయింది. శ్రీకృష్ణ కమి షన్ నివేదికలను ఆనాటి పాలకులు చెత్తబుట్టలోకి నెట్టివేస్తే, శివరామకృష్ణన్ నివేదికను నేడు చంద్ర బాబు ప్రభుత్వం కనీస చర్చను కూడా చేపట్టకుండా అసెంబ్లీలో ఏకపక్షంగా రాజధాని నిర్మాణ ప్రాంతా లను ఎంపిక చేసింది. కనీసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. రాజధాని నిర్మాణ ఎంపిక పరిణామా లపై చర్చించనూ లేదు. రాష్ట్రంలో చాలా విలువైన పంట భూములను రైతన్నల నుంచి సేకరించ డం సరైంది కాదని ప్రభుత్వం భూము లు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉన్నా యని, తరచుగా వరదలు తుఫానులకు గురయ్యే ప్రాంతాల ఎంపిక సరికాదని, పైగా ఆ ప్రాంతాలకు భూకంప ప్రభా విత చరిత్ర కలదని శివరామకృష్ణన్ హెచ్చరిక చేశారు. అంతటి విలువైన నివేదికను నిర్లక్ష్యం చేసి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశా రు. ఆయన ప్రధాని నరేంద్రమోదీ నుంచి కనీస రాజకీయ విజ్ఞత నేర్చుకోవాలి. దేశంలో నేడు ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను మోదీ ఆహ్వానించి మరీ చర్చలు జరిపారు. కనీస రాజకీయ విజ్ఞత ఉంటే రాజధాని ప్రాంతాల సమ స్యలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చర్చలకు ఆహ్వానించాలి. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమస్యలు, ప్రత్యేకించి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల అభివృద్ధి సమస్యలపై ప్రతిపక్ష నేత అభిప్రాయా లను పరిగణనలోకి తీసుకోవాలి. చంద్రబాబు విపరీతమైన అభివృద్ధిని ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తుండటం వల్ల శివరామకృష్ణన్ హెచ్చరికలు చేసినట్లు భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తే ప్రమాదముంది. దీనికి భిన్నంగా శివరామకృష్ణన్ నివేదిక అమలుపరిస్తే విభజన ఉద్య మాలు పుట్టుకొచ్చేవని చంద్రబాబు ప్రకటించడం వింతగొల్పుతుంది. ఎంతో బాధ్యతతో కూడిన కమి షన్ నివేదికపై బురదజల్లాలని, తిమ్మినిబమ్మిని చేయాలని చంద్రబాబు ప్రయత్నించటం పెద్దలు శివరామకృష్ణన్గారిని కించపర్చడానికి చేసిన ప్రయ త్నమే. ఎంతో విజ్ఞులు, వివేకవంతులైన శివరామ కృష్ణన్ ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగకుండా తమ నివేదికను తెలుగు ప్రజల ముందు ఉంచారు. ఇవ్వాళ ఆయన భౌతికంగా మన ముందు లేకపో వచ్చు. కాని తన నిష్పాక్షిక నివేదికతోపాటు ఆయన కూడా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, అమరజీవిగా నిలిచిపోతారు. (శివరామకృష్ణన్ మృతికి నివాళి) వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు ఇమామ్ -
హంద్రీ-నీవా ప్రాజెక్టు సాధనకు చంద్రబాబు తిలోదకాలు
సందర్భం సాగునీటి రంగంలో సం క్షోభాన్ని పరిష్కరించడా నికి మారుగా చంద్రబాబు ప్రాంతాలు, జిల్లాల మధ్య వివాదాలు రగల్చడానికి ప్రయత్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీ ర్యం చేస్తూ... గోదావరి, కృష్ణా జిల్లాల రైతాంగం భవిష్యత్‌నూ ప్రశ్నార్థకం చేసే దిశగా ఆయన తన రాజకీయ గమనం కొనసాగించారు. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన హంద్రీ-నీవా కాలువకు ఇరువైపుల సేద్యపు నీటి వసతులు కల్పిం చే కాలువల పనులను ఆపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. నేడు హంద్రీ- నీవాను కుదించి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, కుప్పం తదితర ప్రాంతాలకు నీటిని తీసుకుని వెళ్లాలని బాబు ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలు అనంతపురం జిల్లా వాసులను కలవరపెడు తున్నాయి. అనంతపురం ప్రజలు ఏ రోజూ చిత్తూరు జిల్లా తాగు, సాగునీటి అవసరాలకు వ్యతిరేకం కాదు. హంద్రీ-నీవా ప్రాజెక్టులో కేటాయించిన జలా లతో ఈ ప్రాంత అవసరాలను తీర్చి చిత్తూరు, కడప జిల్లాల అవసరాలకు కృష్ణా జలాలను తరలించాలని మాత్రమే ఈ జిల్లా వాసులు కోరుకుంటున్నారు. ఒక ఏడాదిలో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి 80 టీఎంసీల నీటిని కృష్ణా నదిలోకి తరలించడం జరు గుతుందని, ఆ మేరకు అదే సామర్థ్యపునీటిని ఎగువ శ్రీశైలం నుంచి రాయలసీమ అవసరాలు తీర్చడానికి జరుగుతున్న కృషిని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అడ్డుకుంటున్నారని బాబు ఆరోపణలు చేశారు. పట్టి సీమ నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణాలోకి తరలిం చడం జరిగినప్పుడు ఎగువన శ్రీశైలం నుంచి ఆ మేరకు నీటిని హంద్రీ-నీవాకు, గాలేరు-నగరికి శ్రీశై లం కుడికాలువ ద్వారా మరియు కేసీ కెనాల్‌కు నీటిని కేటాయించి రాయలసీమ అవసరాలు తీర్చ గలిగే అవకాశమున్నప్పుడు హంద్రీ-నీవాను కుదిం చాల్సిన అవసరమేమిటి? పట్టిసీమను జగన్ మోహ న్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారని విషప్రచారం చేసిన బాబు తానెందుకు పోలవరం ప్రాజెక్టును ఆలస్యం చేస్తు న్నారు? ఒక ప్రాజెక్టుకు మార్పులు, చేర్పులు జరిపే టప్పుడు రైతు సంఘాలతో, ప్రతిపక్ష నాయకులతో, కేబినెట్ మంత్రులతో చర్చలు జరిపే సంప్రదాయా లు ఎందుకు వదులుకుంటున్నారు? 1972 కేంద్ర ఇరిగేషన్ కమిషన్ గుర్తించిన నిరంతర కరువు పీడిత ప్రాంతాలు కేవలం వర్షాధా రిత ప్రాంతాలు. ఈ ప్రాంతాల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వ్యవసాయం అటకెక్కింది. రైతులు దివాళా తీశారు. లక్షల సంఖ్యలో అనంతపు రం, చిత్తూరు, కడప, కర్నూలు, మెట్ట ప్రాంతాల లోని వ్యవసాయ కూలీలు, రైతులు, మహిళలు పొట్ట చేత పట్టుకుని కూలి పనుల కోసం నగరాలకు వలస బాట పట్టారు. వేల గ్రామాలలో తాగునీటి ఎద్దడి తీవ్రత మనం ఎదుర్కొంటున్నాం. అనంతపురం జిల్లాలో 2 లక్షల బోరు బావులు భూగర్భ జలాలను లాగివేశాయి. అలాగే కడప జిల్లాలోని రాయచోటి తదితర ప్రాంతాలలో తాగు నీరే దొరకని పరిస్థితి. ఇంత సంక్షోభం ఉన్న ప్రాంతాల అవసరాలు తీర్చ డానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేల కోట్లు వెచ్చిం చి ఎవరూ సాహచించని ఎత్తిపోతల పథకం, హంద్రీ నీవా గురించి చేసిన ఆలోచన ఎంత గొప్పది. ఆ ప్రాజెక్టు పట్ల నిరంతరం విషం కక్కుతూ... వైఎస్‌పై, జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పిం చిన బాబు చేస్తున్నది ఏమిటి? నిజంగా చంద్రబా బులో ఏ మాత్రం ప్రజాస్వామిక విలువలు ఉన్నా సేద్య పు నీటి ప్రాజెక్టులపై ఓ శ్వేతపత్రం విడుదల చేయడానికి సాహసించగలరా? సీమవాసుల, ప్రత్యే కించి అనంతపురం జిల్లావాసుల అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయగలరా? (వ్యాసకర్త కదలిక సంపాదకులు) మొబైల్: 99899 04389 -
ఉత్తరాంధ్ర శోభ- పోలవరం, సుజల స్రవంతి
సందర్భం రాష్ట్ర విభజన పెను సవా ళ్లను మిగిల్చింది. ఈ 13 జిల్లాల్లో 7 జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించి, రా యలసీమలో 4, ఉత్తరాం ధ్రలో 3 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజె క్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే పూర్తి చేయడం ఇందులో భాగ మే. కానీ జరుగుతున్న పరిణామాలు ప్రజానీకాన్ని నివ్వెరపరుస్తున్నాయి. పోలవరంతో ప్రయోజనాలు ఎన్నో: గోదావరి డెల్టా ఆయకట్టులో 10.5 లక్షల ఎకరాలకు 2 పంట లకు నీరు అందుతుంది. ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో 7.2 లక్షల ఎకరాలలో కొత్తసాగుకు నీరందుతుంది. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటిని తరలించి 13 లక్షల ఎకరాల సాగు స్థిరీకరణకు దోహ దం చేయవచ్చు. విశాఖపట్నం ఇంకా 540 గ్రామా లకు తాగు, పారిశ్రామిక అవసరాలకు 25 టీఎంసీల నీరు ఇవ్వవచ్చు. 80 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి చేర్చడం ద్వారా, శ్రీశైలం నుంచి నీటి విడు దలను తగ్గించి, ఆదా అయిన 45 టీఎంసీల నీటిని తెలంగాణ, రాయలసీమలకు వినియోగించుకోవచ్చు. ఇంకా 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 308 టీఎంసీలు మనం వినియోగంలోకి తీసుకురా వచ్చు. తూర్పు గోదావరి జిల్లాలో 2.57 లక్షల ఆయ కట్టుకు, విశాఖజిల్లాలో 2.67 ఎకరాల ఆయకట్టుకు నీటిని; కాకినాడ, విశాఖలకు పోలవరం ద్వారా తాగునీటిని అందించడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల సేద్యపు నీటి రంగం అవసరాలకు 7,214 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ‘సుజల స్రవంతి’ పథకానికి 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. మొదటి విడ తగా రూ. 50 కోట్ల నిధులు విడుదల చేశారు. టెం డర్లు పిలవడం కూడా జరిగింది. ఆ తరువాత వచ్చి న కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ దీనికి తిలోదకాలిచ్చింది. అయినా పోలవరం మనం పేర్కొన్న 7 జిల్లాలకు వరప్రసాదమే. ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు అం దిస్తుంది. కానీ నేడు చంద్రబాబు పోలవరానికి ఒక గ్రహణంలా మారారు. ఆయన ప్రభుత్వం పట్టిసీమ పథకాన్ని తలకెత్తుకున్నది. ఆయనకు పోలవరం చేపట్టడం ఇష్టంలేదు. బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించడం వల్ల కృష్ణానది వైపు ఉన్న ఆయకట్టు, రాయలసీమలకు సేద్యపు నీటి అవసరాలు నిలిచిపోతాయి. ఉమ్మడి రాష్ట్రంలో మన వనరులన్నీ హైదరాబాద్ చుట్టూ తిరిగాయి. ఇప్పుడు ఒక మహానగరంగా అభివృద్ధి అయ్యే లక్షణాలు విశాఖపట్టణానికి ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు పరిశ్రమలను నెల కొల్పి విశాఖను అభివృద్ధి చేయవలసిన సమయం లో పోలవరం ప్రాజెక్టును కనుమరుగు చేయడానికి ప్రయత్నించడం ఉత్తరాంధ్రకు ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ముఖ్యమంత్రి ఉరుకులూ, పరుగులూ రాజధాని దిశగానే సాగుతున్నాయి. అంటే రాజధాని యోచనను వ్యతిరేకించడం ఇక్కడ ఉద్దేశం కాదు. అభివృద్ధినంతా రెండు, మూడు జిల్లాలకే పరిమితం చేస్తే ఎంత ముప్పో విభజనతో చూశాం. కాబట్టి రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక హోదా కల్పిం చడానికి చంద్రబాబు కేంద్రంతో పోరాడే ప్రయత్నం చేయకపోవడం పుండు మీద కారం చల్లినట్టే. పోల వరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేపట్టి పూర్తి చేయడం ద్వారా ఆ ప్రాంతాల అభి వృద్ధికి పునాదులు వేసుకోవచ్చు. వనరులు ఉన్న ప్పటికీ అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురి కావడం ఎవ రికైనా ఆవేదన కలిగిస్తుంది. దీనినే ఉత్తరాంధ్ర సామాజిక కార్యకర్తలు, మేధావులు, నిపుణులు తీవ్రంగా పరిగణించాలి. ఈ ప్రాంతం పట్ల జరిగిన నిర్లక్ష్యం వల్లనే తీవ్రవాద ఉద్యమాలు ముందుకొ చ్చాయి. సహజ సిద్ధమైన పోరాట సంప్రదాయం కలిగిన ఉత్తరాంధ్ర ప్రజలు, చైతన్యవంతమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజానీకంలో చోటు చేసుకున్న అసంతృప్తిని గమనించి మరో విభ జన ఉద్యమానికి దోహద ం చేయాలి. ఇప్పుడిప్పుడే గ్రేటర్ రాయలసీమ వాసుల్లో ఇలాంటి భావనే చోటు చేసుకుంటున్నది. ప్రత్యేక తెలంగాణ వలెనే మరో ‘గ్రేటర్ రాయలసీమ’ మరో ‘ఉత్తరాంధ్రప్ర దేశ్’ ఉద్యమాలు రాకుండా పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలు చేపట్టాలి. (ఉత్తరాంధ్ర నీటి సమస్యలపై రేపు విశాఖపట్నంలో విస్తృతస్థాయి సమావేశం జరుగుతున్న సందర్భంగా) (వ్యాసకర్త ‘కదలిక ’సంపాదకుడు) -
మాటల జలధారలతోనే సీమకు ‘సౌభాగ్యం’
సందర్భం కృష్ణా బ్యారేజ్ ద్వారా గోదావరి జలాలను సముద్రానికి చేర్చే మహా విద్రోహం కాంట్రాక్టర్లను బాగుపరచడానికే తప్ప కృష్ణా డెల్టా రైతాంగ ప్రయోజనాల కోసం కాదు. సీమ రైతులకు అసలు ఒరిగేదే లేదు. ఒక రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనిక తకు, ప్రజల పట్ల బాధ్యతకు అద్దం పడుతుంది. చంద్రబా బు నాయుడిగారి ఈ వార్షిక బడ్జెట్ మాత్రం బాధ్యతారాహి త్యానికి పరాకాష్ట! సీమను, మెట్ట ప్రాంతాలను ఉద్ధరిస్తా నని అంటూనే చంద్రబాబు ఈ బడ్జెట్లో కరువు ప్రాంతాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల బడ్జెట్లో ఘోర నిర్లక్ష్యం చూపారు. దాదాపు ఆరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల తాగు నీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన చర్యలు శూన్యం. ఉదాహరణకు ఒక్క అనంతపురం జిల్లా నుంచే 6 లక్షల గ్రామీణ ప్రజలు వలస బాట పట్టా రు. దాదాపు 1,000 గ్రామాలకు తాగునీటి ఎద్దడి ఉంది. ఇక వ్యవసాయం సరే.. సరి. దాదాపు ఇదే పరిస్థితి కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలది కూడా. గ్రేటర్ రాయలసీమలోని తెలుగుగంగ, వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, శ్రీశైలం కుడి కాలువ, గండికోట తదితర ప్రాజెక్టులకు నిధులను సమకూర్చాల్సి ఉన్నా బాబు బడ్జెట్‌కు పట్ట లేదు. పోలవరం ప్రాజెక్టుపై శ్రద్ధ చూపిందీ లేదు. ఇటీ వల ఆయన చేపట్టిన రాజధాని పట్టిసీమ ప్రాజెక్టులపై రైతు సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. విజయ వాడలో జరిగిన రాష్ట్ర రైతు సంఘాల సమావేశంలో 13 జిల్లాల రైతు ప్రతినిధులు, సీపీఐ, సీపీఎం, టీడీపీల ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా నేత కుమారస్వామి అధ్యక్షత వహించారు. ‘‘పోలవరం ముద్దు... పట్టిసీమ వద్దు’’ అనీ, రాయలసీమలోని సేద్యపు నీటి ప్రాజెక్టులకు రూ. 2,500 కోట్లు కేటాయిం చాలని, వాటిని పూర్తి చేసేవరకు మరే ఇతర ప్రాజెక్టులు చేపట్టరాదనీ ఆ సమావేశం రెండు తీర్మానాలు చేసింది. అనంతపురం సమావేశానికి 13 జిల్లాల రైతాంగం, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టీడీపీ, బీజేపీ, సీపీఎంల రైతు నేతలు పాల్గొన్నారు. బడ్జెట్లో రాయల సీమ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును కోరారు. పట్టి సీమకు వ్యతిరేకంగా తీర్మానించారు. పోలవరంకు నిధుల కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు ఎంతగా నెత్తీనోరూ కొట్టుకున్నా బాబు పట్టిసీమ ప్రాజె క్టుకు అధిక ప్రాధాన్యమిచ్చి దాదాపు రూ. 1,700 కోట్ల ను ఖర్చు పెట్టడానికి పూనుకున్నారు. పైగా పుండుకు కారం రాసినట్టు.. ‘‘సీమకు సేద్య పు నీటిని అందించడానికి పట్టిసీమను చేపట్టినందుకు నన్ను వ్యతిరేకిస్తున్నారు’’ అంటూ ఎదురు నీచ ప్రచారం ప్రారంభించారు. రాయలసీమ రైతులు ఏ రోజూ పోల వరం, పులిచింతల ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు. కాక పోతే పట్టిసీమ ద్వారా ఏవో ప్రయోజనాలు సమకూర బోతున్నాయని చెబుతున్న కల్లబొల్లి కబుర్లను వ్యతి రేకిస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల్లో గాలేరు- నగరికి రూ. 1,400 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవు తాయి. బడ్జెట్లో కేటాయించింది రూ. 196 కోట్లు మాత్రమే. తెలుగు గంగకైతే రూ. 62 కోట్లే. హంద్రీ- నీవాకు రూ. 2,820 కోట్లు కావాలి. రూ. 212 కోట్లు దులపరించారు. వెలిగొండకు కావాల్సింది రూ. 2,981 కోట్లు. కానీ రూ. 153 కోట్లు విదిలించారు. పట్టిసీమకు రూ. 257 కోట్లు, పోలవరానికి రూ. 725 కోట్లు కేంద్రం అందిస్తుందని అంచనాలు వేశారు. పులిచింతల ప్రాజె క్టుకు రూ. 20 కోట్లు చాలన్నారు. శ్రీశైలం కుడికాలువకు కావాల్సింది రూ. 80 కోట్లు కాగా రూ. 10 కోట్లు కేటా యించారు. ఈ నిర్లక్ష్యం వల్లనే నీటికి కటకటలాడు తున్న ఈ ఏడాది కూడా 150 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రం పాలయ్యాయి. ఈ నిర్వాకం కప్పిపుచ్చు కోడానికి గోదావరి వరదతో పట్టిసీమ నీటిని కృష్ణా బ్యారేజి దగ్గరికి చేర్చి రాయలసీమకు నీళ్లు ఇస్తామని చెబుతున్నారు. ఇంతకు మించిన దగా లేదు. కృష్ణా వరద జలాలు ఎగువనున్న శ్రీశైలం నుంచే రావాలి. అవే సీమకు అందేవి. కానీ, చంద్రబాబు పుణ్యమాని దాదా పు రూ.1,700 కోట్లు పట్టిసీమకు ఖర్చుపెట్టి మరీ.. కృష్ణా బ్యారేజ్ ద్వారా గోదావరి జలాలను సముద్రానికి చేర్చే మహా విద్రోహం కాంట్రాక్టర్లను బాగుపరచడానికే తప్ప కృష్ణా డెల్టా రైతాంగ ప్రయోజనాల కోసం కాదు. సీమ రైతులకు అసలు ఒరిగేదే లేదు. చంద్రబాబుది అసత్య ప్రచారమని, కపట నాటకమని ఆయన బడ్జెట్ కేటా యింపులే చెబుతున్నాయి. గ్రేటర్ రాయలసీమ వాసులు మద్రాసు నుంచి విడి పోయినది ఆదిగా నేడు తెలంగాణ ఏర్పడే వరకు అడుగ డుగునా దగాపడ్డారు. కృష్ణా, పెన్నార్ నదీ జలాలు పోయాయి. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తర్వాతే ఇతర ప్రాంతాల సాగునీటి గురించి యోచించాలన్న శ్రీబాగ్ ఒప్పందానికి తిలోదకాలిచ్చారు. నేడు శ్రీశైలం కృష్ణా జలాలపై సీమకు హ క్కే లేదంటున్నారు. సీమ కరువును రాజకీయ పెట్టుబడిగా వాడుకోవడం పార్టీలకు, నాయకులకు అలవాటైంది. రాయలసీమ కోసమే చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టును సీమ వాసులే అడ్డుకోయత్నిస్తున్నారంటూ చంద్రబాబు.. ‘‘దొంగే దొం గ, దొంగ’’ అని అరిచినట్టు గావుకేకలు పెడుతున్నారు. గోదావరి, కృష్ణా జలాలతో 13 జిల్లాల ప్రయోజనాలను నెరవేర్చేందుకు తీవ్ర కృషికి అంకురార్పణ జరగాల్సి ఉం ది. అది వదలి హంద్రీ-నీవా నేనే ప్రారంభించానని, గాలేరు-నగరి, గండికోట రిజర్వాయర్లకు పునాది రాళ్లు వేశానని, ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాల రుణం తీర్చుకుంటానని ఊకదంపుడు ఉపన్యా సాలు, మోసపూరిత బడ్జెట్ కేటాయింపులు బాబుకున్న అంతంత మాత్రం విశ్వసనీయతకు సైతం గండి కొడ తాయని ఆయన ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. ఇమామ్, కదలిక పత్రిక సంపాదకులు. మొబైల్ నం: 9989904389 -
శ్రీబాగ్ స్ఫూర్తిని మళ్లీ మరిచారా?
మద్రాస్ ప్రెసిడెన్సీలోని రాయలసీమ, ఆం ధ్ర ప్రాంతాలలోని తెలుగువారు, నిజాం ఏలుబడిలోని తెలంగాణ ప్రాంత తెలుగు వారు ఐక్యంగా ఉండి సర్వతోముఖాభివృద్ధి చెందాలని నాటి స్వాతంత్య్ర సమరయోధులు ఆకాంక్షించారు. 1956లో ఈ కల నెర వేరడానికి ముందునుంచే గ్రేటర్ రాయల సీమ వాసులను ఒక భయం వెంటాడుతూ ఉండేది. ఆంధ్రప్రాంతంతో కలిస్తే సీమకు న్యాయం జరగదన్నదే ఆ భయం. ఈ భయాలను నివృత్తి చేయడానికి జరిగిన ప్రయత్నాలలో ఒకటే శ్రీబాగ్ ఒడంబడిక. మద్రాస్‌లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుగారింట ఈ ఒప్పందం జరిగి (నవంబర్ 16, 1937) నేటికి 77 ఏళ్లు. మళ్లీ అనేక పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చీలిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి చూస్తే శ్రీబాగ్ ఒడంబడిక గురించి పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదు. సీమకు మళ్లీ అన్యాయమే జరు గుతోందన్న భావన బలపడుతోంది. బ్రిటిష్ కాలం నుంచి రాయలసీమ ప్రాంతం కోసం ప్రతిపాదిం చిన పథకాలేవీ మోక్షం సాధించలేదు. దాని ఫలితమే సీమవాసుల భయాలు. వీటిని నివృత్తి చేస్తే తప్ప తెలుగువారి మధ్య సఖ్యత సాధ్యం కాదని నాటి పెద్దలు గుర్తించారు. అందుకే శ్రీబాగ్ ఒడం బడిక మీద సంతకాలు చేశారు. ఇవీ అందులో ముఖ్యాంశాలు: ఆంధ్రులలో సంస్కృతి, సాంఘిక ఐకమత్యం పెంపొందించేం దుకు, వైజ్ఞానిక కేంద్రాలను ఆంధ్రదేశానికంతటికీ ఉపయోగిం చడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వాల్తేరులో ఒక కేంద్రాన్ని, అనంతపురంలో ఒక కేంద్రాన్ని అభివృద్ధి పరచాలని, ఇతర కళా శాలలను తత్సంబంధమైన విషయపరిజ్ఞానానికి అనువైన చోట్ల నెలకొల్పవలసినదని ఈ కమిటీవారు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో వ్యవసాయ, ఆర్థికాభివృద్ధి కోస్తా జిల్లాలతో సరిసమానంగా కలిగించేందుకు పదేళ్ల వరకు అవసరమైతే అంతకంటే ఎక్కువకాలం నీటి పారుదల స్కీము లకు ముఖ్యంగా తుంగభద్ర, కృష్ణా, పినాకిని నీటిని గుర్తించడా నికి పైన పేర్కొన్న జిల్లాల మేలు కోసం ప్రాధాన్యమీయవల సిందని, మేజరు ప్రాజెక్టుల విషయమున కూడా పదేళ్లకాలం ఈ జిల్లాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని, ఎప్పుడైనా పై నదులతోటి పంపకం విషయమై సమస్య తలెత్తి నపుడు, పైన పేర్కొన్న ఈ జిల్లాల అవసరాన్నే మొదట తీర్చా లని, నేటి నుంచి ప్రభుత్వం ఈ విధానం అమలుకు ప్రయత్నిం చాలని ఈ కమిటీవారు తీర్మానించుచున్నారు. జిల్లాకి ఇంతమంది అని సమాన సంఖ్య కల ప్రాతినిధ్యం శాసన సభలో ఉండాలని ఈ కమిటీవారు అంగీకరిస్తున్నారు.విశ్వవిద్యాలయం, హైకోర్టు, ముఖ్యనగరం- ఈ మూడును ఒక చోటనే చేర్చి ఒక ప్రదేశానికే ప్రాముఖ్యం కల్పించడం కంటే, వేరు వేరు ప్రదేశాలలో అవి ఉండడం బాగుంటుందని ఈ కమిటీవారు తలపోస్తున్నారు. కాబట్టి విశ్వవిద్యాలయం ఉన్న చోటనే ఉండవ చ్చుననీ, హైకోర్టు, ముఖ్య నగరం (రాజధాని) కోస్తాజిల్లా లోనూ, రాయలసీమలోనూ ఉచిత ప్రదేశాలలో ఉండాలని, ఇం దులో తమకు ఏది కావాలో రాయలసీమ వారే కోరుకోవాలని ఈ కమిటీ అభిప్రాయం. నీరు, రాజధాని విషయంలో సీమవాసుల అభిమతం ముఖ్య మని శ్రీబాగ్ ఒడంబడికలో గుర్తించిన మాటవాస్తవం. కానీ గడచిన 63 ఏళ్లుగా సీమ సేద్యపు నీటి హక్కుల సాధనకు ఉద్యమాలు జరు గుతూనే ఉన్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో నీటి పథకాల సాధనకు అనేక పోరాటాలు జరిగాయి. ఆయన ముఖ్య మంత్రి అయినాక జలయజ్ఞం ద్వారా ఈ లోటును, అన్యాయాన్ని సవరించాలని శతథా ప్రయత్నించారు. ఆయన అకాల మరణంతో ఇవన్నీ అటకెక్కాయి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం బద్దలైంది కానీ, సీమ నీటి సమస్యలు పరిష్కారం కాలేదు.కృష్ణా జలాలలో రాయలసీ మకు హక్కు ఎక్కడిదని తెలంగాణ నాయకులు అంటున్నారు. శ్రీశై లం ఎడమగట్టున మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రాజెక్టు లకు, ప్రత్యేకించి పాలమూరు ప్రాజెక్టుకు నీరు తీసుకువెళతామని తెలంగాణ సీఎం దబాయిస్తున్నారు. శ్రీశైలం నీటి సామర్థ్యం 854 అడుగులు ఉండాలని వైఎస్ జీవో విడుదల చేసినపుడు కోస్తాంధ్ర నేతలు, కాంగ్రెస్ వాదులు కృష్ణా బ్యారేజి దగ్గర రైతులతో కలసి ధర్ణా చేశారు. శ్రీశైలం నీటిని ఎగువన రాయలసీమ ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకుంటే కృష్ణా డెల్టా ఎడారి అవుతుందని వీరి వాదన. ఇందులో నేటి సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఈ మద్దెల దరువును సీమవాసులు భరించలేకుండా ఉన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు ఇప్పుడు రాజధానిని సీమలోనే ఏర్పాటు చేయాలి. కృష్ణాజలాలలో సీమకు తగినవాటా ఇవ్వాలి. కానీ జరుగుతున్నదేమిటి? రాజధాని, విద్య, పరిశ్రమలు కోస్తాంధ్ర లోనే కేంద్రీకరిస్తున్నారు. సోనియా శ్రీకృష్ణ కమిషన్‌ను గౌరవించ కుండా ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టారు. చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గాలికి వదిలి అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం చేపట్టేందుకు మంకు పట్టుపట్టారు. ఇప్పటికైనా శ్రీబాగ్ స్ఫూర్తిని గౌరవించకుంటే, కొత్త ఉద్యమాలు తప్పవు. (వ్యాసకర్త ‘కదలిక’ పత్రిక సంపాదకులు) ఇమామ్ -
బుఖారీ బడాయి మాటలు
ఢిల్లీ జామా మసీదులో వారసత్వ పాలన కొనసాగుతున్నది. ఇది ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధం. అహ్మద్ బుఖారీ వంటి వ్యక్తి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వ్యవహరించే తీరును...అతనికి ఎనలేని ప్రాముఖ్యమిచ్చే వైఖరిని మీడియా, రాజకీయ నాయకులు కూడా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన తనకు తాను తప్ప ఎవరికైనా ప్రాతినిధ్యం వహించగలడా? తన నివాస ప్రాంతంలోని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం చేయగలడా? అలా చేస్తే ఆ ప్రాంతంలో ఆయనకెంత మద్దతు ఉన్నదీ తెలిసిపోతుంది. అజ్ఞానం, ఆగ్రహం కలగలిస్తే మిగిలేది తప్పుల కుప్పే. దారీ తెన్నూ లేని తీరుకైనా ఏదో రకమైన నియంత్రణ అవసరం. కానీ, దుర్భల మానసిక స్థితిలో జనించే అహంకారానికి మానవనైజం బానిసై పోతుంది. ఎడారి నగరం మక్కాలో ప్రవక్త మహమ్మ ద్‌కు వచ్చిన సందేశం పర్యవసానంగా మానవజాతిని పీడిస్తున్న అజ్ఞానం (జహిలియా) అంతరించిందని ముస్లింలు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ అజ్ఞానం ఇవాళ కొందరిలో రాజ్యమేలుతోంది. ప్రస్తుతం భారత ముస్లింలకు ప్రతీక అయిన ఢిల్లీ జామా మసీదులో అది తాత్కాలికంగా తలదాచుకుంది. ఇమామ్ పదవి వంశపారంపర్యమా? జామా మసీదు ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీది అకారణ ఆగ్రహం అయినప్పుడు దానికంత ప్రాము ఖ్యత ఉండకూడదు. కానీ, ఆయనగారి స్థానంవల్ల మీడియాలో దానికి చోటు దొరుకుతున్నది. అందువల్ల భారతీయ ముస్లింలపై ఒక అభిప్రాయం ఏర్పడటానికి ఆస్కారం కలుగుతున్నది. తన కుమారుడు 19 ఏళ్ల షాబాన్ బుఖారీని ఇమామ్‌గా ప్రతిష్టించే ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని పిలువబోనని, కానీ పాక్ ప్రధానికి ఆహ్వానం పంపిస్తానని అహ్మద్ బుఖారీ ప్రకటించారు. ఇలా చెప్పడం ద్వారా అనేక రకాలైన మూర్ఖత్వాన్ని ఆయన ప్రదర్శించారు. భారతీయ ముస్లింలు తమ దేశ నాయకులను తమవారిగా భావిస్తారు తప్ప పరాయి దేశంవారిని కాదు. అయితే, ఈ సందర్భంలో మరో ప్రశ్న అడగాల్సి ఉంది. ఇస్లాం సిద్ధాంతంలో మసీదు ప్రైవేటు ఆస్తి ఎప్పుడైంది? దేశం గర్వించదగ్గ మసీదుపై బుఖారీకి వారసత్వ హక్కులు ఎవరిచ్చారు? సంస్థకొచ్చే ఆదాయాన్నంతా సొంతంచేసుకునే హక్కు ఎవరిచ్చా రు? ఆ మసీదు వక్ఫ్ ఆస్తి. కనుక అది ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. ఆ మసీదును కట్టించిన షాజహాన్ చక్రవర్తి తన పూర్వీకుడొకరికి ఇమామ్ పదవినిచ్చాడు గనుక ఆ పదవి తమ సొంతమని బుఖారీ భావిస్తుం టారు. మత సంప్రదాయం ప్రకారం చూసినా, ప్రజా స్వామ్య వాతావరణాన్నిబట్టి చూసినా ఇది తప్పుడు వాదన. ఈ వాదననే అంగీకరిస్తే షాజహాన్ వారసు లు తమను ఢిల్లీ పాలకులుగా నియమించమని దరఖాస్తు చేసుకోవచ్చుననుకోవాలి. చరిత్రలోకెళ్తే... ఏ మసీదునైనా ముస్లింలందరూ తమ సొంతమని భావిస్తారు. మదీనా నగరంలో ప్రవక్త మహమ్మద్ అంతటి విశిష్ట వ్యక్తి తొలి మసీదు నిర్మించారు. ప్రపంచంలో ఏమూల నివసించే ముస్లింలకైనా అది ఇప్పటికీ పవిత్రమైన ప్రాంతం. ఆ మసీదును ప్రవక్త తన అల్లుడు హజరత్ అలీకి, కుమార్తె బీబీ ఫాతిమాకు సంక్రమింపజేశాడా? లేదు. ప్రవక్త నిర్దేశించిన నియమా న్ని భారతీయ ముస్లింలు ఎందుకు వదులుకుంటారు? ముస్లింలు హజ్ యాత్ర కెళ్లే మక్కా, మదీనా రెండూ కూడా పవిత్ర మసీదులు. ఖలీఫాలు, సుల్తాన్లు పద్నా లుగు శతాబ్దాలపాటు బయటి దాడులనుంచి, ఆంత రంగిక కల్లోలాలనుంచి వాటిని కాపాడారు. ఇస్లాం సంప్రదాయానికి ఇది విరుద్ధం ప్రతి పాలకుడూ మసీదుకు సేవకుణ్ణి లేదా సంరక్ష కుడిని అని మాత్రమే ప్రకటించుకున్నాడు. మామె లూక్స్ను ఓడించి తొలి ఖలీఫ్ అయ్యాక ఒటోమాన్ సుల్తాన్ సలీమ్ అలెప్పోలోని మసీదు కు వెళ్లి శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొ న్నాడు. ఆ సందర్భంగా తడబా టుకులోనైన ఇమామ్... సలీం ను దైవంగా సంబోధించిన ప్పుడు తాను సేవకుడిని మాత్రమేనని వెనువెంటనే ఆయన సరిదిద్దాడు. మక్కా, మదీనా ఇమామ్‌లు తమ కు వారసత్వ హక్కులున్నాయని చెప్పరు. వారిని సౌదీ కోర్టు నియమిస్తుంది. ఎప్పుడైనా వారిని మార్చవచ్చు. ఖురాన్, సునాలకు సంబంధించిన పరిజ్ఞానం, ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారు ఆ పదవికి అర్హులు. కానీ, ఢిల్లీ జామా మసీదులో వారసత్వ పాలన కొనసాగుతున్నది. ఇది ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధం. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి ఎందుకిలా? ఎవరికీ తెలియదు. బహుశా ఇక్కడి ముస్లింలలో ఉన్న పట్టించుకోని తత్వం కారణం కావొచ్చు. దేశంలోని అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మసీదులున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ముస్లిం సమాజం మసీదుకు చెందిన కమిటీ ద్వారా ఆ మసీదులకు ఇమామ్‌లను ఎంపిక చేసుకుంటుంది. అదే సూత్రం ఢిల్లీ జామా మసీదుకూ వర్తిస్తుంది. ఆ మసీదు ప్రార్థనలు చేయించేవారిది కాదని, అది పాత ఢిల్లీలోని ముస్లిం సమాజానికంతకూ చెందుతుందని వారు నొక్కిచెప్పాలి. మసీదు నిర్వహణకు ప్రజాస్వామ్య బద్ధంగా ఒక కమిటీని ఎన్నుకుని... ఇమామ్‌ను ఎంపిక చేసే అధికారాన్ని ఆ ఎన్నికైన కమిటీకి ఇవ్వాలి. బుఖారీకి అంత ప్రాముఖ్యతా? అహ్మద్ బుఖారీ వంటి వ్యక్తి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వ్యవహరించే తీరును...అతనికి ఎనలేని ప్రాముఖ్యమిచ్చే వైఖరిని మీడియా, రాజకీయ నాయకు లు కూడా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన తనకు తాను తప్ప ఎవరికైనా ప్రాతినిధ్యం వహించగలడా? తన నివాస ప్రాంతంలోని ఒక నియో జకవర్గాన్ని ఎంచుకుని ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం ఆయన చేయగలడా? అలా చేస్తే ఆ ప్రాంతంలో ఆయ నకెంత మద్దతు ఉన్నదీ తెలిసిపోతుంది. అంతేకాదు తన మతస్తుల్లో ఆయన ఎందరి విశ్వాసం చూరగొన్నా రో కూడా మనం పరీక్షించవచ్చు. ఆయన ఓటమిపై నాకెలాంటి సందేహమూ లేదు. సంస్థాగత విధానాల ద్వారానే సంస్థల పరిరక్షణ సాధ్యమవుతుంది. అయితే సయ్యద్ అహ్మద్ బుఖారీ తనను తాను ప్రజలకు సేవకుడైన ఇమామ్‌గా కాక జామా మసీదు నవాబులా భావించుకుంటున్నారు. ఏం చేయాలో, ఎలా ముందు కెళ్లాలో తెలియక చాలామంది ఇందులో జోక్యం చేసుకో వడానికి సందేహిస్తున్నారు. ఫలితంగా కబ్జాదా రులే హక్కుదారులుగా చలామణి అవుతున్నారు. ఎవరు మంచి ముస్లిమో నిర్ణయించే అధికారాన్ని వంచక ఇమామ్ చేతుల్లో పెట్టడం మాని ఎవరు మంచి ఇమామో తామే తేల్చాల్సిన సమయం ఆసన్నమైందని నిజమైన భారతీయ ముస్లింలు గ్రహిస్తే మంచిది. ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు -
గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని...
దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లుగా విడిపోయిన నేపథ్యంలో, విభ జన.. అనేక సంక్లిష్ట రాజకీయ పరిస్థితు లను తీసుకువచ్చింది. సీమాంధ్రలో రాజ ధాని ఏర్పాటుపై కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీకి రాయలసీమకు సంబంధించిన చారిత్రక వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, సీమాంధ్ర ఒక రాష్ట్రంగా కొనసాగటం అని వార్యమైంది. ఈ ప్రాంతానికి రాజధానిని నిర్ణయించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సందర్భంగా గతంలో శ్రీ కృష్ణ కమిషన్.. ‘రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు తెలంగాణ, కోస్తాంధ్రలో ఉండవచ్చు కాని, ఒక ప్రాంతంగా రాయలసీమ మొత్తంగా వెనుకబడి ఉంది..’ అని పేర్కొనడం గుర్తుంచుకోవాలి. అందుకే అయి దున్నర దశాబ్దాల పైబడిన తర్వాత కూడా వెనుకబాటు తనం నుంచి బయటపడని రాయలసీమలో రాజధానిని నిర్మిం చడం ఈ ప్రాంత మనుగడకు తప్పనిసరి. 1953లో రాయలసీమలో రాజధానిని ఏర్పర్చాక మూడేళ్లలోనే రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చినప్పుడు గ్రేటర్ రాయలసీమ వాసులు విశాల దృక్ప థంతో అంగీకరించారు. ప్రస్తుతం రాష్ట్రం రెండుగా విడిపో యింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి. దక్షిణ భారత దేశంలోనే రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. నీటిపారుదల సౌకర్యాలు, పరిశ్రమలు, రాజధాని ఏర్పాటు ద్వారానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. గతంలో గ్రేటర్ రాయలసీమ అభివృద్ధికి మద్రాసు ప్రెసిడెన్సీలో చేపట్టిన మెకంజీ పథకం, 1951 కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టు, సిద్ధేశ్వరం ప్రాజెక్టు, ఖోస్లా కమిటీ ఈ ప్రాంతంలో సాగునీటి కోసం ప్రతిపాదించిన అనేక విలువైన పథకాలు నేటికీ ఆచరణకు సాధ్యం కాలేదు. తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, వెలిగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా, గాలేరు నగరితోపాటు కేసీ కెనాల్ ఆధునీకరణ పనులు కూడా నేటికీ పరిపూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ రాయలసీమవాసులు (ప్రకాశం జిల్లాలో నేడు కొనసాగు తున్న గిద్దలూరు, కంబం, మార్కాపురం, పొదిలి, దర్శి, కనిగిరి, కందుకూరు, నెల్లూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలు) రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కోరుకోవడం సమంజసమే. పైగా మార్కాపురం రెవెన్యూ డివిజన్ ప్రాంతం లోని దొనకొండ వద్ద దాదాపు 50 వేల ఎకరాల భూమి ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇది నూతన రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. కాబట్టి సారవంతమైన భూమిని వృథా చేయనవసరం లేదు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇక్కడ విమానా శ్రయం నిర్మించతలపెట్టారు. కాబట్టి అంతర్జాతీయ విమానా శ్రయానికి సీమాంధ్రలో ఎక్కడా లేని అనుకూలత ఉంది. రాజధాని ఏర్పాటు సందర్భంగా గ్రేటర్ రాయలసీమలోని ఆరు జిల్లాల పరిస్థితిపై ప్రభుత్వం చర్చించడం లేదు. పోలవరం, పులిచింతల, రాజధాని.. ఇలా అన్నింటికీ ఏలూ రు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలపైనే సీమాంధ్ర ప్రభుత్వం కేంద్రీకరించినట్లు కనబడుతోంది. భవిష్యత్తులో మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునాదులు వేయకుండా గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు జరగాలి. చంద్రబాబు పరిపాలనలో ప్రత్యేక తెలంగాణ వాదం పుట్టింది, పెరిగింది అనే అంశం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అభివృద్ధిని వికేంద్రీకరించకుండా పాలన సాగించిన పరిణామాల్లో భాగంగానే తెలంగాణ ఉద్యమం బలపడింది. కాబట్టి గతంలో జరిగిన తప్పులను సవరించాలంటే గ్రేటర్ రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలి. విశాలమైన మంచి రవాణా వ్యవస్థ, పారిశుధ్యానికి తగిన సౌకర్యాలు, విశాలమైన పార్కులు, చండీగఢ్ తరహాలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్ణయం జరగాలి. రాజధాని ఏర్పాటుకు సుదీర్ఘ కాలం పడుతుంది. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి వేల ఎకరాలను సేకరించాల్సిన అవసరం ఉంది. అంతేకాని కావాల్సింది సింగపూర్లు కాదు. 70 శాతం ప్రజలు పల్లెల్లో నివసించే మన రాష్ట్రంలో సింగపూర్ తరహా రాజధాని ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదు. (వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు) ఇమామ్ -
రాయలసీమ రాజకీయ ‘శోభ’
నిజానికి ఆమె సేవలు నేడు రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా రాయసీమలో, విభజన నేపథ్యంలో సమర్థులైన నేతల అవసరం ఎంతో ఉందన్న మాట కాదనలేనిది. కానీ శోభానాగిరెడ్డి అలాంటి సేవలు అందించకుండానే చిన్నతనంలోనే సీమను విడిచి వెళ్లిపోయారు. శోభా నాగిరెడ్డి అంటే..చిరునవ్వుకు, సమర్ధతకు, పట్టుదలకు, విశ్వసనీయతకు మారుపేరు. సహజ సిద్ధమైన శాంత స్వభావంతో కూడిన సీమ అంత ః సౌందర్యం శోభా నాగిరెడ్డిని చూసినప్పుడు తలపునకు వచ్చేది. ఫ్యాక్షన్ నేపథ్యమున్న కర్నూలు జిల్లాలో, అతి సున్నితమైన ఆళ్లగడ్డ, డోన్, పత్తికొండ, కర్నూలు ప్రాంతాలలో పుట్టినింటికీ, మెట్టినింటికీ వన్నె తేవడం శోభా నాగిరెడ్డిలో గమనించగలం. సీమలో ఫ్యాక్షనిజం తప్ప ఇంకేమీ లేదనీ, సీమవాసులంటే క్రూరులు, దయాదాక్షిణ్యాలు లేనివారనీ, బాంబు సంసృ్కతి తప్ప వేరొకటి తెలియనివారనీ హత్యలు, ద్వేషాలు మినహా వేరేవీ అక్కడ లేవనే అపోహలూ, భావనలూ శోభా నాగిరెడ్డి వ్యక్తిత్వం ముందు తలొంచాయి. శోభా నాగిరెడ్డి నాయకత్వ లక్షణాలు గమనించిన వారికి అవన్నీ ఎంత దారుణమైన కల్పనలో అవగతమవుతుంది. రాయలసీమ నాయకులలో ఇంత చక్కటి వాగ్ధాటి, సరళమైన వ్యక్తీకరణ, తెలుగుదనం, కృష్ణమ్మ పరవళ్ల లాగా, గోదావరి గలగల లాగా, కోనసీమ పచ్చదనం లాగా శోభాయమనంగా కన్పించే అరుదైన వ్యక్తిత్వం శోభానాగిరెడ్డిది. ఆమె పెద్ద చదువులు చదవలేదు. కానీ సామాన్యంగా కన్పిస్తూ వైవిధ్య, వైరుధ్య వ్యక్తిత్వం గల భిన్నమైన రాజకీయ వ్యవస్థల మధ్య తనకు నచ్చిన పార్టీకి మాత్రమే సన్నిహితంగా కొనసాగుతూనే పార్టీలకు, వర్గాలకూ అతీతంగా అందరి మన్నన పొందిన అరుదైన నేత ఆమె. పార్టీ ఏదైనా -తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీ- నాయకత్వం అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నేరవేర్చిన నేర్పరి శోభ. ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేసి కడు సమర్థవంతంగా నెగ్గుకొచ్చారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల తరఫున శాసనసభ్యురాలిగా పనిచేసి, చివరిగా వైఎస్సార్సీపీలో తన ప్రయాణం సాగిస్తూ, కర్తవ్య నిర్వహణలోనే కన్నుమూశారు. వైఎస్ మరణానంతరం ప్రజారాజ్యం పార్టీని వీడి జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరి, క్రమశిక్షణ కలిగిన నేతగా వ్యవహరించారు. పార్టీలో ముఖ్యనేతగా ఎదిగి శాసన సభ్యుత్వం వదులుకుని, తిరిగి గెలిచి జగన్ కుటుంబం ఆదరణకు నోచుకున్నారు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించే ప్రతి కుటుంబం ఓ అక్కను, ఓ ఆడపడుచునుపొగొట్టుకున్నామన్నట్టు బాధపడడం కనిపిస్తున్నది. ఒక రాజకీయ నేత మరణం ఇంతగా కదిలించడం అరు దు. ఏ పార్టీకి చెందినవారైనా ఆమె మరణం పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మహిళల ప్రాతినిద్యం రాజకీయాల్లో పెరుగుతున్నది. ఇది ఆహ్వానిం చదగిన పరిణామం. రాజకీయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగాలి. అలాగే రాజకీయ వ్యవస్థలోకి వచ్చిన మహిళలు శక్తిసామర్థ్యల్లో పురుషులకు తీసిపోమని కూడా నిరూపించుకోవాలి. ప్రస్తుత పురుషాధిక్య సమాజంలో అధికార రాజకీయాల్లో మహిళలు వ్యక్తిత్వం నిలుపుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి గహనమైన సమస్యను శోభానాగిరెడ్డి ఎలా అధిగమించారో నేడు రాజకీయాలలోకి వస్తున్న మహిళలందరూ గమనించాలి. నిజానికి ఆమె సేవలు నేడు రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా రాయసీమలో, విభజన నేపథ్యంలో సమర్థులైన నేతల అవసరం ఎంతో ఉందన్న మాట కాదనలేనిది. కానీ శోభానాగిరెడ్డి అలాంటి సేవలు అందించకుండానే చిన్నతనంలోనే సీమవాసులను విడిచి వెళ్లిపోయారు. శోభానాగిరెడ్డి శక్తియుక్తులు ఎన్నో సందర్భాలలో రుజువైనాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనడంలో అగ్రభాగాన నిలిచి వైఎస్ కుటుంబాన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ, జగన్మోహన్రెడ్డినీ సమర్థించి నిలిచిన నేత శోభానాగిరెడ్డి. ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శరవేగంతో మారిపోతున్నాయి. ప్రజలు జగన్‌రెడ్డికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హారతి పడుతున్నారు. దీనిని చూడలేని ప్రత్యర్థులు కూడా హద్దు మీరుతున్నారు. కానీ, ఈ విపరిణామాలను ఎదిరించి నిలిచేందుకు సన్నద్ధమైన ఒక యోధురాలు నిన్న ప్రమాదంలో మరణించింది. అదే విషాదం. ఏ ఆశయం కోసమైయితే శోభానాగిరెడ్డి చివరి నిమిషం వరకు పోరాడారో ఆ పోరాటం మనందరికీ స్పూర్తి కావాలి. వైఎయస్సార్సీపీ అధికారంలోకి రావాలని ఆమె కలగన్నారు. అది నెరవేరాలి. ఆ కలను సార్థకం చేయడమే శోభానాగిరెడ్డికి అర్పించే నిజమైన నివాళి. ఇమామ్ (వ్యాసకర్త ‘కదలిక’ ఎడిటర్) -
జలయజ్ఞానికి అబద్ధాల అడ్డుకట్ట!
తెలంగాణ ప్రాజెక్టుల సాధనకు ఏ రోజూ పాటుపడకుండా, కేవలం ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లిస్తే అదే నిజం అవుతుందని నమ్మే కేసీఆర్ తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ నీటిని రాయలసీమకు అక్రమంగా తరలిస్తున్నారని విష ప్రచారం చేశారు. రాజకీయాలు ఇంత అధఃపాతాళానికి చేరాయా? అనిపించేటట్టు నేటి నాయకుల ప్రవర్తన ఉన్నది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన హంద్రీ-నీవా, గాలేరు నగరి, వెలిగొండ తదితర ప్రాజెక్టులన్నీ అక్రమంగా నిర్మిస్తున్నవని, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ అవసరాలకు చేపట్టిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ, నెట్టెంపాడు, కల్వకుర్తి భీమా తదితర ప్రాజెక్టులు అవసరాలు తీరిన తరువాతనే నీటి విడుదల ఉంటుందని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దారుణం. ఒక పాలకుడి దార్శనికతకు, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఒక నేత నిబద్ధతకు తాగునీరు, సాగునీరు పథకాలు అద్ధం పడతాయి. 1972లో ఇరిగేషన్ కమిషన్ గుర్తించిన ‘నిరంతర కరువుపీడిత ప్రాంతాల’ అవసరాలు తీర్చడానికి ప్రయత్నించి, పరిణత నేతగా నిలిచిన వారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని మెట్ట ప్రాంతాలకు కృష్ణా జలాలు అందించాలని అన్ని పార్టీలూ ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో నల్లగొండ మహబూబ్‌నగర్ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ తప్పిదాన్ని సవరించడానికి డాక్టర్ వైఎస్ జల‘యజ్ఞం’తో ప్రయత్నించారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే కోయిల్‌సాగర్ స్టేజ్-1, స్టేజ్-2, నెట్టెంపాడు, కల్వకుర్తి బీమా పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆయన తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి పోతిరెడ్డిపాడు, రాయలసీమలోని ఇతర ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని ఎవరైనా నిరూపించగలరా? తెలంగాణ ప్రాజెక్టుల ప్రాధాన్యతలను గుర్తించకుండా, వాటి సాధనకు ఏ రోజూ పాటుపడకుండా కేవలం ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లిస్తే అదే నిజం అవుతుందని నమ్మే కేసీఆర్ తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ నీటిని రాయలసీమకు అక్రమంగా తరలిస్తున్నారని విష ప్రచారం చేశారు. జలయజ్ఞం రాష్ట్రంలో అమలు పరచగలిగితే కోస్తాలో 88 శాతం, తెలంగాణలో 60 శాతం, రాయలసీమలో 32 శాతం సేద్యపునీటి వనరులు అందుబాటులోకి వస్తాయి. జలయజ్ఞం ప్రాజెక్టులను విశ్లేషిస్తే ఇది సులభంగానే అర్థమవుతుంది. ఈ వ్యయాలలో ప్రాంతీయ వివక్ష ఉందా? వైఎస్ జలయజ్ఞంలో చేపట్టిన పోలవరం, దుమ్ముగూడెం, నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్, ప్రాణహిత- చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దేవాదుల, యల్లంపల్లిలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని వైఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వీటిలో రాయలసీమ ప్రాజెక్టులు లేకపోవడం గమనార్హం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ద్వారానే జలవనరులను అన్ని ప్రాంతాల అవసరాలు తీర్చడానికి ఉపయోగించుకునేఅవకాశం ఉందని వైఎస్ కుమారుడు జగన్ చెబుతూనే ఉన్నారు. కానీ పర్యవసానాల గురించి ఆలోచించకుండా జగన్మోహన్రెడ్డినీ, వైఎస్సార్సీపీనీ నిలువరించడానికి రాష్ట్రాన్ని విభజించారు. సీమాంధ్రులకు ఏ విధమైన హామీలూ హక్కులూ దక్కకుండానే విభజన ప్రక్రియ ఊపందుకుంటున్నది. రెచ్చగొట్టే ప్రకటనలతో ఒక ప్రాంతాన్ని దిగజార్చి మాట్లాడడం కేసీఆర్‌కే చెల్లింది. కేసీఆర్ స్థానం ఎక్కడో 2009లో వైఎస్ చూపించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరచడానికి తెలంగాణ ఉద్యమాన్ని బలపరచి నిలబెట్టింది. కిరణ్‌కుమార్‌రెడ్డి అవకాశవాద పద్ధతుల్లో విభజనకు కేంద్రానికీ, సోనియాకూ సహాయం అందించారు. వీళ్లంతా సీమాంధ్రకే కాదు తెలంగాణకు కూడా తీవ్రమైన ద్రోహం చేశారు. ప్రత్యామ్నాయాలు సూచించక, ఏర్పడబోయే పరిణామాలు ఆలోచించకుండా రాష్ట్రాన్ని విడగొట్టారు. కేసీఆర్ రాజకీయ ఉన్మాదంతో చేస్తున్న వ్యాఖ్యలకు వీరే బాధ్యత వహించాలి. జలయజ్ఞంలో గత ఐదేళ్లలో వివిధ ప్రాంతాలకు చేసిన వ్యయం(రూ. కోట్లలో) ప్రాంతం పాలనాపరమైన మంజూరు చేసిన వ్యయం ఆంధ్రా 45,375.98 13,575.35 రాయలసీమ 24,394.81 14,300.69 తెలంగాణ 1,10,120.95 25,330.25 సందర్భం: ఇమామ్ (వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకుడు) -
రామోజీ అవినీతిపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది
-
తెలుగు ప్రజల ఆవేదనే 'తెలుగోడి సమైక్య ప్రస్థానం'
అనంతపురం : కదిలిక సంపాదకులు ఇమామ్ రచించిన 'తెలుగోడి సమైక్య ప్రస్థానం' పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఆవిష్కరించారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రచయిత ఇమామ్ మాట్లాడుతూ తెలుగోడి సమైక్య ప్రస్థానం పుస్తకాన్ని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. పలు వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం అన్నారు. ఎనిమిది కోట్ల మంది తెలుగు ప్రజల ఆవేదనే ఈ తెలుగోడి సమైక్య ప్రస్థానమని ఇమామ్ అన్నారు. -
‘నీళ్లొ’దిలిన కమలం, కాంగ్రెస్
సందర్భం ఇమామ్ అంబానీ అడుగులకు మడుగులొత్తే బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్ కుటుంబానికీ, వైఎస్సార్సీపీకీ ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నాయో మూడేళ్ల చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించే వారందరూ ఒక్కటై తెలుగు ప్రజలను చీల్చారు. రాష్ట్ర విభజన రాజకీయాల్లో బీజేపీ, ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు అనుసరిం చిన తీరు వారి విశ్వసనీయతకు గండి కొట్టింది. ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ, రాయలసీమ అభివృద్ధి... ఏ పేరుతో ఇక్కడ ఉద్యమం జరిగినా జలవనరుల పం పిణీ అంశం బలంగా ఉండేది. రాయలసీమ సంయుక్త కార్యాచరణ కమిటీ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రాయలసీమ జిల్లాల సేద్యపునీటి సౌకర్యాల కోసమే కాక, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, జిల్లాలోని కరువు ప్రాంతాలకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల ప్రాజెక్టుల కోసం కూడా ఉద్యమాలు చేసింది. నిరంతర కరువు పీడిత ప్రాంతాలు చిత్తూరు, కడప, కర్నూలు, మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని కొంత ప్రాంతం.. దాదాపు 60 తాలూకాలను దుర్భిక్ష ప్రాంతాలుగా గుర్తించి సేద్యపు నీటి సౌకర్యం కల్పించాలని 1986లో బీజేపీ తీర్మానం చేసింది. పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ పథకాలు చేపట్టి కృష్ణా నదిలోకి నీటిని దాదాపు 200 టీఎంసీలు మళ్లించాలనీ, ఆ రకంగా రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాజెక్టులకు సాధికారత కల్పించాలని నేటి ఆందోళనల నేపథ్యంలో సీమాంధ్ర బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ, రాయలసీమలోని ఆరు ప్రాజెక్టులకు సేద్యపునీటి వసతులు కల్పించి ప్రత్యేకించి ప్లానింగ్ కమిషన్ గుర్తిం పును సాధించే చర్యలు అమలు పరిచినపుడే విభజనకు మద్దతిస్తామని అనేక సందర్భాల్లో వెంకయ్యనాయుడు చెప్పారు. 371-డీ అధికరణను సవరించాలని ఒక ముఖ్యమైన డిమాండు చేశారు. కానీ జరిగిందేమిటి? బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో మిగు లు జలాల మీద, వరద జలాల మీద నీటి వినియోగ హక్కు ప్రశ్నార్థకంగా మారబోతోంది! ఇందుకు విరుగుడుగా గోదావరీ జలాలను కృష్ణాలోకి మళ్లించి ఎగువన కృష్ణా జలాలకు, కరువుపీడిత ప్రాంతాల అవసరాలు తీర్చవచ్చని ఒక గొప్ప ఆశయం తో వైఎస్ తలపెట్టి ప్రారంభించి అమలుపరుస్తున్న పథకాల పూర్తికి చట్టబద్ధత, నిధులు, కాలవ్యవధి నిర్ణయించి అమలు పరిచిన తర్వాత తెలంగాణ విభజనకు మద్దతు ఇచ్చి ఉంటే వెంకయ్య, ఆయన పార్టీ నిజాయితీ ఏమిటో వెల్లడయ్యేవి. ఇటీవల దేశంలో సంచలనాత్మక ప్రకటనలు వెలువడ్డాయి. గోదావరి, కృష్ణా బేసిన్లో చమురు నిక్షేపాల తవ్వకాలలో వెలుగులోకి వచ్చిన అవినీతి ఆరోపణల గురించి ఆమ్ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావించారు. లక్షా రెండువేల కోట్ల రూపాయల మేర అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేజ్రీవాల్ రిలయన్స్ అధినేత అంబానీ సహా కొందరు కాంగ్రెస్ ప్రముఖలపై కేసులు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ కంగుతిని కేజ్రీవాల్‌ను పదవీచ్యుతుడిని చేశాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని చమురు నిక్షేపాల వెలికితీత ఒప్పందాలలో అవినీతి, అక్రమాలపై మొట్టమొదటిసారిగా ప్రశ్నించి తమ అధినాయిక సోని యాతో, ప్రధాని మన్మోహన్‌తో తలపడ్డ మహానాయకుడు డాక్టర్ వైఎస్. అంబానీ అడుగులకు మడుగులొత్తే బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్ కుటుంబానికీ, వైఎస్సార్సీపీకీ ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నాయో మూడేళ్ల చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించే వారందరూ ఒక్కటై తెలుగు ప్రజలను చీల్చారు. జగన్‌కు వ్యతిరేకంగా ఇంకా కుట్రలు చేస్తున్నారు. చేసిన వాగ్దానాలకు బీజేపీ ఎందుకు తిలోదకాలిచ్చింది? 2జీ స్పెక్ట్రం, కోల్గేట్, బోఫోర్స్ వంటి కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై పార్లమెంటును నెలల తరబడి దద్దరిల్లజేసిన బీజేపీ తోక ముడవడానికి కారణాలేమిటి? వైఎస్ జీవించి ఉండగా విభజన గురించి సోనియా ఎందుకు మాట్లాడలేదు? ఆయ నతో లభించే అధికారం కోసం సోనియా, మన్మోహన్లు ఆ రోజుల్లో మిన్నకుండిపోయారు. ఇప్పుడు అధికారం కోసం కేవ లం ఓట్లు, సీట్ల ఆధారంగా రాష్ట్రాన్ని విభజించి లబ్ధి పొందాలనుకుంటున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ పోరాటాలు చేసిం ది. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా, ఇతర ప్రచార మాధ్యమాలు, రాష్ట్ర కాం గ్రెస్ అనుసరించని వికృత చేష్టలంటూ లేవు. అందరి ధ్యేయ మూ ఒక్కటే. వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్రెడ్డిని రాజకీయం గా నిలువరించడమే. (వ్యాసకర్త కదలిక సంపాదకులు, అనంతపురం) -
కరవు నేలకో కదలిక... రవూఫ్
నివాళి: ఇమామ్ ఆయన హృదయం ఎంత సున్నితమో ఆయన సిద్ధాంత నిబద్ధత అంత కఠినం. కమ్యూనిస్టు ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేశారు. ఒక కమ్యూనిస్టుగా, త్యాగమయ జీవిగా ప్రజలు గుర్తుపెట్టుకొనే రీతిలో ఆయన జీవితం గడిచింది. ఒక సామాన్య మానవుడిలా కనిపించే రవూఫ్ అంత పెద్ద విప్లవం కోసం కల కన్నాడని చెబితే గానీ తెలియదు. త్యాగానికీ, ఆత్మవిశ్వాసానికీ పీడిత ప్రజ ల పట్ల అవ్యాజ ప్రేమాభిమానాలకూ, ధైర్య సాహసాలకూ మారు పేరు మా రవూఫ్. అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగిన కామ్రేడ్ రవూఫ్ ఏ రోజూ తన రాజకీయ కార్యాచరణను, ఆలోచనలను ప్రాంతాలకు, మతాలకు, కులాలకు వర్తింపజేసుకొని రాజకీయాలు చేయలేదు. మార్క్స్ లెనిన్ మావో సిద్ధాంతాల ప్రాతిపదికన జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ పరి ణామాలను అధ్యయనం చేస్తూ ఆకళింపు చేసుకొని తన కార్యాచరణను ఎప్పుడూ జాతీ యస్థాయిలో ఒక విప్లవ పార్టీ నిర్మాణానికి అంకితం చేశారు. జీవితాంతం కమ్యూనిస్టుగా జీవించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ చిరునవ్వుతో వాటిని స్వీకరించేవారు. ఆ స్థాయికి ఆయన్ను తీసుకువెళ్లినది కమ్యూనిస్టు సిద్ధాంతంలో ఉన్న విశ్వాసమే. కమ్యూనిస్టు శ్రేణులకు ఆయన కామ్రేడ్ రవూఫ్. ప్రజలకు ‘రవూఫ్ సార్’. ఆయనకు కలకత్తా, పశ్చిమబెంగాల్, కేరళ, ఒరిస్సా, ఉత్తర భారతదేశంలో గణనీయమైన అనుచర వర్గం ఉంది. ప్రజ్ఞాపాటవాలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు, ఆదాయం సమకూర్చే న్యాయవాద వృత్తి ఉంది. కానీ ప్రజల కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం వాటిని త్యజించారు రవూఫ్. టంగుటూరి ప్రకా శం గారిని గుర్తుకు తెస్తూ ఉంటారు. ఆయన హృద యం ఎంత సున్నితమో ఆయన సిద్ధాంత నిబద్ధత అంత కఠినం. కమ్యూనిస్టు ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేశారు. ఒక కమ్యూనిస్టుగా, త్యాగమ య జీవిగా ప్రజలు గుర్తుపెట్టుకొనే రీతిలో ఆయన జీవితం గడిచిగింది. అనంతపురం జిల్లాలో అత్యధిక కాలం జైలు జీవితం గడిపిన వ్యక్తిగా కూడా కామ్రేడ్ రవూఫ్ గుర్తుండి పోతారు. తరిమెల నాగిరెడ్డి తర్వాత ఎక్కువ కాలం రహస్య జీవితం గడిపిన వ్యక్తి రవూఫ్. కదిరి సబ్ జైలు నుండి కలకత్తాలోని అలీపూర్ జైలు వరకు ఆయన జైలు జీవిత ప్రస్థానం సాగింది. అనేక కేసుల్లో ఆయనకు శిక్షలు పడ్డాయి. దేశంలోనే పేరుగాంచిన తరిమెల నాగిరెడ్డి కుట్ర కేసులాగే పార్వతీపురం కుట్ర కేసు ఒకటి. ఈ కుట్ర కేసులో దేశంలోని నక్సలైట్ నాయకులు కానూ సన్యాల్, సౌరెన్బోస్, నాగభూషణ పట్నాయక్, భువన్మోహన్ పట్నాయక్‌లతో పాటు మన రాష్ట్రానికి చెందిన చౌదరి తేజేశ్వరరావు, వసంతాడ రామలింగాచారి లాంటి అనేక వం దల మందిపై ఈ కేసు నమోదైంది. ఆ కేసుతో సంబంధం ఉన్న పలువు రిని కాల్చిచంపారు. అనంతపురం కరవు సహజంగానే రవూఫ్‌ను కదిలించింది. నల్లచెరువు దగ్గర ఒక భూస్వామి ఇంటి మీద ఆయుధా లతో జరిగిన దాడిలో ఆయన ఉన్నారు. వడ్డీ వ్యాపారుల పీడ నుంచి ప్రజలను రక్షించడం ఆయన జీవితంలో ఎన్నోసార్లు జరిగింది. రాష్ట్రంలో నక్సల్బరీ ఉద్యమ నిర్మాతలలో ఆయన ఒకరు. ఆయనది చారు మజుందార్ మార్గం. సీపీఐ ఎంఎల్‌తో విభేదించి సీపీఐ ఎంఎల్ రెడ్ ఫ్లాగ్ అనే పార్టీని స్థాపించారు. కమ్యూనిస్టు కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీలు ఎలా ఉండాలి? ఇలాంటి ప్రశ్నలకు రవూఫ్ జీవితం నుంచి సమాధానాలు లభి స్తాయి. ఎవరైనా తాను కమ్యూనిస్టు అని అను కుంటే చాలదు. ఏ కొందరో మాది కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకుంటే సరిపోదు. కమ్యూనిస్టు పార్టీల్లో సభ్యులుగా నమోదు కావడంతోనే సరిపోదు. ఒక వ్యక్తి కమ్యూనిస్టని, అది కమ్యూనిస్టు పార్టీ అని ప్రజలు భావించాలి. ప్రజల ఆలోచనలలో అలా కమ్యూనిస్టు నాయకుడిగా, విప్లవ యోధుడిగా, త్యాగమూర్తిగా చిరకాలం నిలిచి ఉండి, ఇప్పుడు ధన్యజీవిగా నీరాజనాలందుకుం టున్న నాయకుడు రవూఫ్. ఆయన ఆరోగ్యం అందరినీ కలవరానికి గురి చేసినప్పటి మాట... రవూఫ్ ైవె ద్యసేవలకు అయ్యే వ్యయం గురించీ, వ్యక్తిగత బాగో గుల కోసం కొందరు వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడ్డారు. జిల్లాలో పేరు పొందిన స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో అండగా నిలుస్తామని ప్రతిపాదించారు. అందుకు ఆయన చిరునవ్వు నవ్వి... సున్నితంగా తిరస్కరిం చారు. నిజానికి ఆయన కుటుంబమూ లేదు. అయినా ‘నన్నూ నా బాగోగులు చూసుకోవడానికి నా మిత్రులు... ప్రజలు ఉన్నా’రంటూ కామ్రేడ్ రవూఫ్ తన ఆత్మస్థైర్యాన్ని చాటాడు. జీవితాంతం కమ్యూనిస్టుగానే ఉన్నాడని చెప్ప డం అందుకే. అనంతపురం జిల్లా చరిత్రలో చివరి సీనియర్ విప్లవ యోధుడు అస్తమిం చాడు. ఆయనకు నా సలామ్! (వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు) -
నాడు వంచన... నేడు వక్రభాష్యం...
ఇమామ్ సంపాదకులు, కదలిక గతంలో చేసుకున్న ఒప్పందాలు, అమలుచేయాలనుకున్న పథకాలు సాకారం కాలేదు కాబట్టి నేడు రాయలసీమకు కృష్ణాజలాల్లో హక్కే లేదంటూ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్‌రావు ‘సాక్షి’లో రాశారు. నేడు రాయలసీమలో అమలు జరుగుతున్న తెలుగు గంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, గండికోట ప్రాజెక్టు కేటాయింపులు, అనంతపురం జిల్లాకు నీటి మళ్లింపు- వీటన్నింటి మీద సీమవాసులకు ఉన్న హక్కు కాదనలేనిది. 1956లో ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ముందు, పైపథకాలన్నీ అమలు కాలేదు కాబట్టి, నేడు ఆ పథకాలకు నీటి కేటాయింపులన్నీ మిగులు జలాలతో ముడిపడి ఉన్నందున, వాటి కోసం కోస్తా, తెలంగాణ ప్రజల దయాదాక్షిణ్యాల మీద సీమ ఆధారపడి ఉండాలని విద్యాసాగర్‌రావు అభిప్రాయంగా కనిపిస్తోంది. హామీలన్నీ నీటి మూటలే! తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం ఉండాలని కర్నూలు రాజధానిగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడే సీమకు సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతున్న దశలో 1956లో తెలంగాణను ఆంధ్రలో విలీనం చేశారు. రాజధానిని హైదరాబాద్‌కు తరలించారు. మెకంజీ (తుంగభద్ర పథకం 1901), శ్రీభాగ్ (1936) ఒప్పందం, కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టు, సిద్ధేశ్వరం నిర్మించాలంటూ ఖోస్లా కమిషన్ చేసిన ప్రతిపాదన, గండికోట ప్రాజెక్టును 60 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని, కేసీ కెనాల్ 6 వేల టీఎంసీల సామర్థ్యంతో ఆధునీకరణ సిఫార్సులు- అన్నీ బుట్టదాఖలయ్యాయి. కానీ 1956కు మునుపు రాయలసీమకు నికర జలాల కేటాయింపులు చారిత్రక వాస్తవం. ఈ అంశాలేవీ ప్రస్తావించకుండా రాయలసీమలో నిరంతరం కరవులు ఉన్నాయని, కాబట్టి సీమవాసులు ఆ దుస్థితిలోనే జీవించాలని విద్యాసాగర్‌రావు సెలవిచ్చారు. అందుకు ఆయన ‘కదలిక’ ప్రత్యేక సంచిక ‘తరతరాల రాయలసీమ’లోని వ్యాసాలను సాక్ష్యంగా చూపుతున్నారు. ఆ సంచికలో కరవుల గురించి మాత్రమే వ్యాసాలు లేవు. కరవు పరిష్కారాలు, సీమతోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల నీటి అవసరాలను ఎలా తీర్చవచ్చో చెప్పే వ్యాసా లూ ఉన్నాయి. రాష్ట్రంలోని జలవనరుల వినియోగం ద్వారా తెలంగాణ, కోస్తాం ధ్ర, రాయలసీమలోని ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు ఎలా తీర్చవచ్చో వివిధ సందర్భాలలో ప్రచురించడం జరిగింది. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాల గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సూచనతో వ్యాసాలు ప్రచురించడం, ఉద్యమాలు చేపట్టడం కూడా జరిగింది. ఇక్కడ ఒక ఒక ఉదాహరణ. 1990లో డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి రాష్ట్రంలోని పది మంది రిటైర్డు చీఫ్ ఇంజనీర్లను సమావేశపరిచి, కృష్ణ నీటిని ఎగువన ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, రాయలసీమ జిల్లాల అవసరాలు తీర్చడంతోపాటు ఆధునిక వ్యవసాయ పద్ధతిలో పంటమార్పిడి ద్వారా దాదాపు 190 టీఎంసీల నీటిని ఎలా ఆదా చేయ వచ్చునో, ఆ నీటిని నికరజలాలుగా రూపొందించవచ్చునో చెప్పే నివేదికను రూపొందించారు. ఆ నివేదికలో శ్రీశైలం ఎడమగట్టుకు 30, గాలేరు-నగరికి 40, హంద్రీ-నీవాకు 40, భీమా ఎత్తిపోతల పథకానికి 20, వెలిగొండ ప్రాజె క్టుకు 40, తుంగభద్ర సమాంతర కాలువకు 20 టీఎంసీలు కేటాయించవచ్చనే విలువైన ఆయుధం రాయలసీమ, తెలంగాణ ప్రజల చేతికి అందించారు. నల్ల గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చాలని డాక్టర్ వైఎస్ గౌరవాధ్యక్షులుగా కొనసాగిన రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తీర్మానాలు చేశారు. వాస్తవాలు ఇలా ఉండగా, సీమ వాసులు నేడు కృష్ణా నీటిపై హక్కు కేవలం తెలంగాణ, సీమాంధ్రవాసుల ఔదా ర్యంపై ఆధారపడాలని విద్యాసాగర్‌రావు సెలవివ్వడం ఏ రకమైన విజ్ఞత? గోదావరి జలాల మళ్లింపు ద్వారా రాయలసీమ, తెలంగాణ సేద్యపు నీటి అవసరాలు ఎలా తీర్చవచ్చో డాక్టర్ వైఎస్ జలయజ్ఞంలో చూపించారు. పోలవరం, పులిచింతల, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 230 టీఎంసీల నీటిని కృష్ణలోకి మళ్లించి శ్రీశైలం, నాగార్జునసాగర్ ద్వారా దిగువకు విడుదలవుతున్న నీటిని ఎగువన రాయలసీమ, తెలంగాణలకు వినియోగించవచ్చునన్న సదాశయంతో జలయజ్ఞం చేపట్టారు. ఆత్మద్రోహం తగునా! 2004 నుండి 2013 జూన్ వరకూ జలయజ్ఞంలోని ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల వివరాలు పరిశీలిద్దాం. ఆంధ్రలో రూ.20 వేల 230, తెలంగాణలో రూ.35 వేల 28, రాయలసీమలో రూ.18 వేల 180 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే వైఎస్ ఐదు ప్రాజెక్టులను చేపట్టారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని కృష్ణ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కరవు పీడిత ప్రాంతాలకు తరలించిన సందర్భాన్ని ఈ విద్యాసాగర్‌రావే విప్లవాత్మకమైన చర్యగా డాక్టర్ వైఎస్ జయంతి సందర్భంగా ‘సాక్షి’ టీవీలో పేర్కొన్నారు. చీఫ్ ఇంజనీర్‌గా ఇది సాధ్యమని తాను భావించలేదని, అయితే అది సాధ్యమేనని వైఎస్ రుజువు చేశారని సెలవిచ్చిన విద్యాసాగర్‌రావు, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమవాసులు దొంగతనంగా నీటిని మళ్లిస్తున్నారని ఆరోపించ డం ఆత్మద్రోహం కాదా? ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల అభ్యంతరాలు ఇప్పటికే ఉన్నాయి. వీటికి తోడు తెలంగాణ ఏర్పాటు పేరుతో ఇప్పటికే సంకుచితంగా వ్యవహరిస్తూ సీమాంధ్రులను అవహేళన చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్న కొందరు స్వార్థపరులు తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ, తెలంగాణలో ప్రాజెక్టులన్నీ సమైక్య రాష్ట్రం ద్వారానే సాకారం చేసుకోవచ్చు. ఒక సాంకేతిక నిపుణుడిగా ఆలోచిస్తే విద్యాసాగర్‌రావుకి అన్ని అంశాలు అవగతమవుతాయి. -
జలకళతోనే ఐక్యత
అభిప్రాయం: కోస్తా, తెలంగాణ జిల్లాలకు సాగునీటి కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తూ అలనాటి ప్రధాని నెహ్రూ సాగర్ కుడి, ఎడమ కాలువలు తెలంగాణ, ఆంధ్ర ప్రజల స్నేహ వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. భాషా ప్రాతిపదికపై తెలుగు ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఏర్పడినంత మాత్రాన తెలుగునాట నెలకొన్న అసమాన అభివృద్ధి సమస్యలు పరిష్కారం కావని ఆదిలోనే గుర్తించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. సంకుచిత ప్రాంతీయ తత్వాన్ని అధిగమించి ఆ సమస్యలను పరిష్కరించడానికి వారు చిత్తశుద్ధితో కృషిచేశారు. జలవనరుల సద్వినియోగం ఆ కృషిలోకెల్లా ప్రధానాంశమని వారు భావించారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయే సందర్భంగా రాయలసీమ ప్రజలు శ్రీభాగ్ ఒడంబడికను కుదుర్చుకున్నారు. అలాగే తెలంగాణ నైజాం పాలన నుంచి విముక్తి చెందిన తదుపరి పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటూ, ఎదురుదెబ్బలు తింటూ కూడా తెలుగు వారి వికాసం కొనసాగింది. వెనుకబాటుతనం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలనే సమస్యలు ఎప్పటికప్పుడు తలెత్తుతూనే ఉన్నా సమన్యాయం ప్రాతిపదికపై వాటిని పరిష్కరించు కుంటూ తెలుగు ప్రజల ఐక్యతను పదిలం చేయడం సాధ్యమేననే విశ్వాసం అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ ఏర్పడింది. ప్రాంతీయతత్వమన్నదే లేకుండా నీలం, ఎన్టీఆర్, వైఎస్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు జలకళతో సస్యశ్యామలంగా మారాలని తాపత్రయపడ్డారు.వైఎస్ ప్రజాప్రస్థానం ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 1956కు మునుపే రాయలసీమతోపాటూ, నెల్లూరు, మద్రాసుల సాగునీటి, తాగునీటి అవసరాల కోసం కృష్ణా-పెన్నార్, గండికోట, గాలేరు-నగరి ప్రాజెక్టులకు పథకాలు రూపొందాయి. కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీటి కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. డాక్టర్ నీలం సంజీవరెడ్డి ఎనలేని కృషితో సాధ్యమైన ఆ ప్రాజెక్టుకు అలనాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా నెహ్రూ... నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలు తెలంగాణ, ఆంధ్ర ప్రజల స్నేహ వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి కోసం నీలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునాదులు వేశారు. కృష్ణా నీటిని రాయలసీమ, తెలంగాణలకు వినియోగించుకోలేని చారిత్రక తప్పిదాన్ని ఆయన గ్రహించారు. నెహ్రూ వద్ద తనకున్న పలుకుబడినంతా ప్రయోగించి శైలం ప్రాజెక్టుకు పునాదిని వేయించారు. శ్రీశైలం నుంచి మద్రాస్‌కు తాగు నీటిని అందించే ప్రతిపాదన ఎట్టకేలకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుగంగ రూపంలో సాకారమైంది. కృష్ణా పరీవాహక రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు ఒక్కొక్కటి 5 టీఎంసీల చొప్పున మొత్తం 15 టీఎంసీలను కేటాయించే ప్రాతిపదికపై ఆ పథకం రూపొందింది. ఆయన చేతుల మీదుగానే గాలేరు-నగరి, హంద్రీ-నీవా, శ్రీశైలం కుడికాలువ, తెలుగుగంగ తదితర ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయి. 1983-1989 మధ్య సాగిన సీమ సాగునీటి ఉద్యమానికి వైఎస్ గౌరవాధ్యక్షులుగా నేతృత్వం వహించారు. ఆ ఉద్యమం గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులతోపాటూ, తెలుగు గంగ, శ్రీశైలం కుడికాలువల పొడిగింపును కూడా కోరింది. అనంతపురం జిల్లాకు కేసీ కెనాల్, తుంగభద్ర జలాలను కేటాయించాలని డిమాండు చేసింది. అంతేగాక తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా నీటిని అందించాలని కూడా వైఎస్ పోరాడారు. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు శ్రీశైలం ప్రాజెక్టు నీటి కోసం ఆందోళన సాగించారు. ప్రాంతీయతత్వమన్నదే లేకుండా నీలం, ఎన్టీఆర్, వైఎస్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు జలకళతో సస్యశ్యామలంగా మారాలని తాపత్రయపడ్డారు. సంకుచిత ప్రాంతీయ ప్రయోజనాలకు తావులేని తెలుగువారి ఐక్యతకు ప్రతీకలై నిలిచారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ సాగించిన చరిత్రాత్మక ప్రజాప్రస్థానాన్ని తెలంగాణ నుంచి ప్రారంభించడంలో కూడా అదే ఐక్యతాభావం కనిపిస్తుంది. ఎన్ని ఒత్తిడులు, అభ్యం తరాలు ఎదురైనా వైఎస్ తెలంగాణలోని చేవెళ్లలోనే దాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. నాయకుల తీవ్ర నిర్లక్ష్యం, తీవ్రవాదం, మతోన్మాదం కారణంగా తెలంగాణ ప్రజల్లో తీవ్ర నిరక్ష్యానికి గురయ్యామన్న అసంతృప్తి నెలకొన్నదని వివరించారు. ఆయన చేపట్టిన ప్రతి కొత్త పథకం చేవెళ్లలోనే ప్రారంభమైంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఏడు తెలంగాణ జిల్లాలలోని 17 లక్షల ఎకరాలకు నీటిని అందించే పథకం ఇది. ముఖ్యమంత్రిగా వైఎస్ మొదటి విలేకరుల సమావేశంలో పులిచింతల ప్రాజెక్టుపై మాట్లాడుతూ ఎగువన ఉన్న రాయలసీమ, తెలంగాణ జిల్లాల ప్రాజెక్టులకు చెందాల్సిన నీటిని దిగువన ఉన్న కృష్ణా డెల్టా రైతాంగం లాక్కుంటుం దన్న భయాలు నిరాధారమని తేల్చిచెప్పారు. పోలవరం, దుమ్ముగూడెం, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టులతో కృష్ణా-డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల ఆవసరాలను తీర్చి ఆయకట్టును పెంచవచ్చని తెలిపారు. శ్రీశైలం నుండి సాగర్, కృష్ణా-డెల్టాలకు విడుదల చేసేంత నీటిని నాలుగు రాయలసీమ జిల్లాలకు, నెల్లూరు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు కేటాయించ్చునని విశదం చేశారు. నాటి ఆ ఆలోచనలే జలయజ్ఞంగా రూపుదిద్దుకున్నాయి. గోదావరిపై పోలవరం, దుమ్ముగూడెం, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ల నిర్మాణంతోపాటూ తెలంగాణ లోని నాలుగు ప్రాజెక్టులను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును కలిపి ఏడింటికీ జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపును కోరారు. ఒక సందర్భంలో తెరాసకు చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలు నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ను కలిసి మాట్లాడారు. ఆ సమావేశం చివర్లో హరీష్‌రావు 610 జీవో గురించి ప్రస్తావించారు. అందుకు వైఎస్ వెంటనే ‘చూడండి హరీష్రావుగారూ, నేను వెనుకబడిన ప్రాంతాల నుండి ఎదిగి వచ్చిన వ్యక్తిని. వెనుకబడిన ప్రాంతాల మనోభావాలు, సమస్యలు ఏమిటో అర్థం చేసుకోగలను. 610 జీవోను అవసరమైతే సవరించి, ఇంకా విస్తరించి ప్రైవేట్, కార్పొరేట్ సెక్టార్లకు కూడా ఆ జీవో ప్రయోజనాలను విస్తరింపజేయడానికి ప్రయత్నించడానికి సైతం నేను సిద్ధంగా ఉన్నాను’ అన్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఒక పాత్రికేయుని ప్రశ్నకు సమాధానంగా ఆయన... తెలంగాణ అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేసేవారిని, తెలంగాణ ప్రజలను మనం వేరువేరుగా చూడాలి. తెలంగాణ ప్రజల వైపు చూడు. అనేక సమస్యలు అర్థమవుతాయి అని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వైఎస్ లేఖ ఇచ్చారని నేడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, చంద్రబాబు ఒక్క గొంతుకతో అసత్య ప్రచారం సాగిస్తున్నారు. దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్‌లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిలుగా ఉండగా వైఎస్ తెలంగాణ పట్ల, రాష్ట్ర సమైక్యత సమగ్రతల పట్ల వ్యక్తపరచిన అభిప్రాయాలేమిటో అందరికీ తెలుసు. తెలంగాణ అంశం తేల్చడానికి ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రిగా ఆయన హాజరయ్యారు. తెలంగాణ విభజన జరిగితే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని, దాంతో మరి మూడు, నాలుగు రాష్ట్రాలు కావాలని ఉద్యమాలు తలెత్తుతాయని తెలిపారు. ‘‘విభజనపై వైఎస్ అభిప్రాయాలను మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆయన వైఖరి సరైనదే’’ అంటూ నాడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రణబ్‌ముఖర్జీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నేడు కేవలం ఓట్లు, సీట్ల లెక్కలతోనే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నదనేది రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలతోపాటూ, తెలంగాణ ప్రజలకు కూడా తెలిసిందే. సహజంగానే నేడు వైఎస్ అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలకు గుర్తుకు వస్తున్నారు. వైఎస్ బతికుంటే ఇలా జరిగేదా? వైఎస్ కుటుంబంపై కక్ష సాధింపునకు తెలుగు ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయడం సమంజసమేనా? అనే ప్రశ్న పార్టీలకు అతీతంగా అందరినీ వేధిస్తోంది. రాష్ట్ర అభివృద్ధిపై నెలకొన్న అపోహలన్నీ తొలగిపోయేలా శ్రీకృష్ణ కమిషన్ గత ఆరు దశాబ్దాల కాలంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆర్థిక, సామాజిక అభివృద్ధి చిత్రాన్ని కళ్లకు గట్టింది. రాష్ట్ర ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చి, సమస్యలకు తగు పరిష్కారాలను సూచించింది. సమైక్య రాష్ట్రంలో తెలుగు వారి సర్వోతోముఖాభివృద్ధిని ఆకాంక్షిం చిన పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణారావు, నీలం, ఎన్టీఆర్, వైఎస్‌ల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ తెలుగు ప్రజల ఐక్యతను పరిరక్షించుకోవాల్సిన సమయమిది. - ఇమామ్ సంపాదకులు, ‘కదలిక’ -
విభజనతో సాగునీటికి ఎసరు!
చర్చ: కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, మహబూబ్‌నగర్, నల్లగొండ వంటి జిల్లాలకు విభజన వల్ల నీటి సమస్యలు తీవ్రతరం కానున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు లేదు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీటిని అందించే కల్వకుర్తి, నెట్టెంపాడు, నల్లగొండలోని ఎస్ఎల్బిసి, రాయలసీమ జిల్లాలకు సాగునీటికి ఉద్దేశించిన గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వెలిగొండ వంటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. నిరంతర కరువులకు, వెనుకబాటుతనానికి కేంద్రబిం దువుగా కొనసాగుతున్న ప్రాంతం రాయలసీమ అని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది. జలయజ్ఞం లాంటి ప్రతిష్టాత్మకమైన పథకం అమలుపరిచిన తర్వాత కూడా రాష్ట్రంలో అత్యంత తక్కువ సేద్యపు నీటి వసతి గల జిల్లా అనంతపురం జిల్లాయే. రాయలసీమలో తుంగభద్ర నుంచి పొందాల్సిన జలాల వాటా క్రమేపీ తగ్గిపోతున్నది. తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ, కె.సి.కెనాల్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ తీవ్రమైన నీటి లభ్యత సంక్షోభాన్ని ఎదు ర్కొంటున్నాయి. వైఎస్ మరణం తర్వాత తెలుగుగంగ, మద్రాసుకు తాగునీరు అందించే పథకం, శ్రీశైలం కుడి కాలువ, దాని పొడిగింపుగా గండికోట ప్రాజెక్టు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీరందించే పథకాలు నత్తనడకన నడుస్తున్నాయి. మరోవైపు గాలేరు-నగరి పథకం తీవ్ర జాప్యాన్ని చవిచూస్తున్నది. ఇక కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల తాగునీటికి, సాగునీటికి ఉద్దేశించిన హంద్రీ-నీవాకు కేటాయించిన నిధులు వందల కోట్ల మేర మురిగిపోయాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసే క్రమంలో రాయలసీమవాసులు లెక్కకుమిక్కిలిగా త్యాగాలు చేశారు. 1901లో మెకంజీ పథకం కుదింపు, 1937లో చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం అమలుకు నోచు కోకపోవడం, కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టు స్థానే సిద్ధేశ్వరం ప్రాజెక్టు మొదలుకుని, కోస్తా-తెలంగాణల ప్రయోజనాల కోసం నాగార్జునసాగర్‌ను సమ్మతించడం అరుదైన త్యాగం. ఆ తర్వాత ఖోస్లా కమిటీ సిఫార్సుల మేరకు సిద్ధేశ్వరం ప్రాజెక్టు, గండికోట ప్రాజెక్టు నిర్మించకపోయినా సహించారు, భరించారు. చరిత్రలో సీమకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి వైఎస్ ఎనలేని కృషి చేశారు. ఈ ప్రాంతంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు త్యాగధనులు. విశాల దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలను చూశారే కానీ, తమ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందనే ధ్యాసే వారికి లేదు. త్యాగం స్వార్థం ఎరుగదు. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం శ్రమిస్తూనే ఇతర ప్రాంతాల బాగుకు వారు కృషి చేశారు. రాష్ట్రంలో నిర్మించిన, నిర్మిస్తున్న సేద్యపు నీటి ప్రాజెక్టులు దాదాపు 80 శాతం నీలం సంజీవరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిల కృషి ఫలితమే. రైతు బాంధవులుగా పేరుగాంచిన వీరు అనంతపురం, కడప జిల్లాలకు చెందిన వారు కావడం గమనార్హం. రాయలసీమవాసుల విశాల మనస్తత్వానికి నిదర్శనాలు ఎన్నో. తెలంగాణకు చెందినవాడనే అంశం పరిగణనలోకి తీసుకోకుండా పీవీ నరసింహారావును నంద్యాల నుంచి రికార్డు మెజారిటీతో గెలిపించడం. అలాగే ఎన్.టి.రామారావును 15 ఏళ్లకు పైగా హిందూపురం ఎంఎల్ఏగా బలపరచడం. జన్మనిచ్చిన ప్రాంతంలో ప్రజలు ఛీకొట్టి ఓడించిన నటుడు చిరంజీవిని అక్కున చేర్చుకొని తిరుపతి నుంచి గెలిపించిన ఘనత కూడా సీమవాసులదే. స్వాతంత్య్ర పోరాటంలో సమరశీల చరిత్ర కలిగిన ప్రాంతం అనంతపురం. జాతీయ నాయకులు నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డిలను అందించింది ఈ జిల్లాయే. కల్లూరు సుబ్బారావు, పప్పూరి రామాచార్యులు, విద్వాన్ విశ్వం, నీలం రాజశేఖరరెడ్డి వంటి మహానాయ కుల్ని తెలుగు జాతికి అందించింది కూడా రాయలసీమే. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమచరిత్రను, త్యాగా లను, రాజకీయ ఔన్యత్యాన్ని, అస్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాయల తెలంగాణ, సీమాంధ్రల పేరిట సీమ ప్రత్యేక అస్తిత్వాన్ని మంట గలిపే కుట్ర ఒకటి జరుగుతున్నది. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో బళ్ళారి నుంచి వెళ్లగొట్టారు. ప్రకాశం జిల్లా ఏర్పాటు కోసం గిద్దలూరు, కంభం, మార్కాపురం, కనిగిరి, పొదిలి, ఉదయగిరి ప్రాంతాలను రాయలసీమ ప్రాంతం నుంచి కుదించారు. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ పేర కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేయాలని, కడప, చిత్తూరు జిల్లాలను కోస్తాంధ్రలో కలిపి సీమాంధ్ర పేర మరో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రహస్య వ్యూహ రచన సాగుతున్నది. రాయలసీమలో ఎదుగుతున్న రాజకీయ నాయకత్వాన్ని, ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ ఎదుగుదలను నిలువరించడమే ఏకైక లక్ష్యంగా ఈ కుట్ర జరుగుతున్నది. సమైక్య రాష్ట్రం కోసం తెలుగు ప్రజల సర్వతో ముఖాభివృద్ధి కోసం కృషి చేసిన ముందుతరం నేతల కుమారులు, రాజకీయ వారసులు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి రాయల సీమను చీల్చడానికి జరుగుతున్న కుట్రను బహిరంగంగా వ్యతిరేకించకపోవడం దారుణం. విభజనలు కోరేవారు తెలంగాణవారు కావచ్చు. రాయలసీమవారు కావచ్చు. రాష్ట్రాన్ని విడదీసే ప్రక్రియలో సాగునీటి పంపకాలపైనే ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కరువు పరిస్థితులను ఎదు ర్కొంటున్న రాయలసీమ, మహబూబ్‌నగర్, నల్లగొండ వంటి జిల్లాలకు విభజన వల్ల నీటి సమస్యలు తీవ్రతరం కానున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు లేదు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీటిని అందిం చే కల్వకుర్తి, నెట్టెంపాడు, నల్లగొండలోని ఎస్ఎల్బిసి, రాయలసీమ జిల్లాలకు సాగునీటికి ఉద్దేశించిన గాలేరు - నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వెలిగొండ వంటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే సుమారు 227 టిఎంసీల నీరు అవసరమవుతుంది. అయితే బ్రిజేష్‌కుమార్ ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే... మిగులు జలాలను వాడుకునే అవకాశం మనకు ఉండదు. ఈ నీటిని ఎగువ రాష్ట్రాలకు కూడా ట్రిబ్యునల్ పంపిణీ చేసింది. దాంతో వరద నీటిపై ఆధార పడ్డ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు సాధ్యం కాదు. ఫలితంగా ఈ ప్రాజెక్టులపై ఆధార పడ్డ మహబూబ్‌నగర్, నల్లగొండతో పాటు రాయలసీమ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. సాగునీటికే కాదు.... తాగునీటికి కటకట లాడుతున్న ఈ ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదంలో పడతాయి. అలాగే గోదావరి జలాలను కృష్ణలోకి ప్రత్యేకించి కృష్ణా-డెల్టా, పులిచింతల, నాగార్జునసాగర్ లోకి తరలించుకోవడం అతిపెద్ద సవాలు కాబోతున్నది. పోలవరం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ రాష్ట్ర ప్రజలకు గుండెకాయ లాంటిది. గోదావరి నదిపై వైఎస్ ప్రతిపాదిం చిన మరో నాలుగు బృహత్తర ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా తెలుగు ప్రజల సర్వతోముఖాభి వృద్ధికి ఉద్దేశించినవే. వైఎస్ చేపట్టిన జలయజ్ఞంలోని 83 ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం తెలంగాణకే కేటాయించారు. ఇందులో ప్రాణహిత-చేవేళ్ల, కంతనపల్లి, దేవాదుల, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టులు చెప్పుకోదగ్గవి. పోలవరం, నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ పథకం ద్వారా ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సాగునీటి అవసరాలు కూడా తీరుతాయి. గత నాలుగేళ్లుగా జలయజ్ఞం ప్రాజెక్టులను రోశయ్య, కిరణ్ సర్కారులు నిర్లక్ష్యం చేశాయి. నేడు వారే సమైక్య రాష్ట్రం విడిపోతే ప్రాజెక్టులు పరిపూర్తి కావని, అప్పడు తెలుగు ప్రజలు నష్టపోతారని చెపుతున్నారు. మరోవైపు ప్రత్యేక తెలంగాణ అంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ ప్రాజెక్టుల సాధనకు, పరిపూర్తికి జరిపిన కృషి ఏమీలేదు. సకాలంలో ప్రాజెక్టులు నిర్మించక, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని రెండు లేదా మూడు రాష్ట్రాలుగా విభజించే దిశగా తమ రాజకీయ పావులు కదుపుతున్నారు. విభజన వాదు లకు ఓట్లు-సీట్లు కేంద్రబిందువుగా ఉండటం తెలుగు వారంతా గమనిస్తున్నారు. తెలుగుప్రజల సర్వోతోముఖా భివృద్ధితో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలంగాణవాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ, కోసాంధ్రల్లో ఏకకాలంలో తెరవెనుక నుంచి ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు నడుపుతున్నారు. స్వార్థరాజ కీయ ప్రయోజనాల సాధనకు అనైతిక, కూట్రపూరిత పద్ధతులు అవలంబిస్తున్నారు. రాయలసీమ రాజకీయ, సాంస్కృతిక అస్తిత్వాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు. వీరి దురాలోచనలను, కుతంత్రాలను ప్రజలు గమని స్తున్నారు. అర్థం చేసుకుంటున్నారు. -
‘జనం చెక్కిన శిల్పం వైఎస్’
ఇచ్ఛాపురం, న్యూస్‌లైన్: ‘కదలిక’ సంపాదకుడు ఇమామ్ రచించిన ‘జనం చెక్కిన శిల్పం వైఎస్’ పుస్తకాన్ని షర్మిల ఆదివారం పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆవిష్కరించారు. డాక్టర్ వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని విడుదల చేసి ఫోరం ప్రతినిధులకు, రచయిత ఇమామ్‌కు అందించారు. ఇమామ్‌ను అభినందించారు. అక్కడికక్కడే సుమారు 300 కాపీలు పంపిణీ చేశారు. మార్చి నెలలో ఈ పుస్తకాన్ని మొదటిసారి ప్రచురించామని, 60 పేజీలు అదనంగా చేర్చి రెండోసారి ప్రచురించామని ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు శాంతమూర్తి, సువర్ణరాజు తెలిపారు. అది సానుభూతి కాదు.. వైఎస్‌పై ప్రేమ ‘‘షర్మిలను చూడ్డానికి, కరచాలనం చేయడానికి, ఆమె మాటలు వినడానికి, కష్టాలు చెప్పుకోడానికి లక్షలాది మంది పాదయాత్రకు తరలివచ్చారు. రాజకీయ నాయకులు అంటున్నారు ఇది సానుభూతి గాలి అని.. అది సానుభూతి కాదు, వాళ్లలో నాకు కనిపించింది కృతజ్ఞత. ఆ మహానాయకుడి కుటుంబం మీద ఉన్న ప్రేమ, అభిమానం. ఆరోజు వైఎస్సార్ పాదయాత్ర చేసి వాళ్ల కష్టాల కన్నీళ్లు తుడిచారు.. ఆ అభిమానంతోనే ఈ రోజు ప్రజలు షర్మిల వస్తున్నారని తెలుసుకొని పరుగుపరున వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఈ పాదయాత్రలో పాల్గొనటం నిజంగా నా అదృష్టం.’’ - కాపు భారతి, రాయదుర్గం, అనంతపురం