ఫైల్ ఫోటో
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ముస్లీం మైనారిటీలకు శుభవార్త. రాష్ట్రంలోని ఇమామ్, మౌజిస్‌లకు ఏపీ ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేసినట్లు వక్ఫ్ బోర్డు సీఈఓ అలీం బాషా మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 23 కోట్ల రూపాయలకు పైగా నిధులను రెండు రోజులుగా ఆయా వక్ఫ్ సంస్థల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ఇమాంలకు రూ. 5 వేలు, మౌజిస్‌లకు రూ. 3వేల చొప్పున విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలోని 10వేల మంది లబ్దిదారులకు నిధులు విడుదల చేశామన్నారు. అలాగే గత ఏడాదిలో కూడా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తం 49.6 కోట్ల గౌరవ వేతనం అందించినట్లు అలీం బాషా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment