
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కడి తెలుగువారు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కదలిక పత్రిక సంపాదకుడు ఇమామ్... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకాన్ని రచించారు. ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఉన్న సీఎం జగన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై (యూఎస్) విభాగం గవర్నింగ్ కౌన్సిల్ సలహాదారు వల్లూరు రమేశ్‌రెడ్డి ఈ పుస్తకాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment