ramesh reddy
-
జేసీ కక్ష.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేత
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ రమేష్ రెడ్డి ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్సార్సీపీ కార్యకర్త పొలానికి మళ్లీ నిప్పు మరో ఘటనలో రాప్తాడు మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఓబులేష్, వసంత్‌కు చెందిన పొలానికి మళ్లీ నిప్పు పెట్టారు. మండలంలోని గొందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి (పులల్లరేవు) పరిధిలోని సర్వే నంబర్ 103–2 (88–3)లో 4.90, 103–3 (88–3)లో పెద్ద ఓబులేష్, వసంత్ తమకున్న 7.76 ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపుగా 400 అల్ల నేరేడు మొక్కలను నాటారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఓబులేష్‌కు చెందిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈ ఏడాది జనవరి 17న 15 చెట్లు, అలాగే జనవరి 21న 40 చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. మళ్లీ ఈ నెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఓబులేష్ తోటకు నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి.వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్ పరికరాలు, మోటర్ సెల్ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా 4 ఎకరాల్లో పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంప కాలిపోయింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
షర్మిల, సునీత అసత్య ప్రచారాలు మానుకోవాలి: రమేష్ రెడ్డి
సాక్షి, కడప: వివేకా కుమార్తె సునీతను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట అదికార ప్రతినిధి రమేష్ రెడ్డి మండిపడ్డారు. క్రిమినల్ బ్రెయిన్ తో ప్రవర్తించే వ్యక్తి చంద్రబాబని నిప్పులు చెరిగారు. కుంటుంబాల్లో చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని అని విమర్శించారు. ఎల్లో మీడియాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి సాయంతో బురద జల్లిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయని రమేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ఎంపీగా గెలవాలని వివేకానందరెడ్డి కూడా ప్రచారం చేశారన్నారు. అయితే వివేకా కేసును బాబు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎవరిపై కక్ష సాధించేందుకు షర్మిల ఏపీ వచ్చారని ప్రశ్నించారు. షర్మిల, సునీత అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. అవసరం తీరాకా తిట్టడం ‘చంద్రబాబుది నీచ రాజకీయం. వ్యవస్దలను ధ్వంసంచేసి అనుకూలంగా వాడుకునే వ్యక్తి. లక్ష్మీపార్వతిని ఉపయోగించి ఎన్టీఆర్‌ను వెన్నుపొటు పొడవటమే కాకుండా అయన మరణానికి కారకుడై పార్టీని అక్రమించి కుటుంబ పార్టీగా మలచుకున్నాడు. ప్రతిసారి కూటమి ఏర్ఫాటు చెయ్యడం, అవసరం తీరాకా అదే పార్టీలను తిట్టడం అలవాటు. అందుకే నేడు షర్మిల పీసీసీ అద్యక్షురాలైంది. కేసును పక్కదారి పట్టిస్తున్నాడు చంద్రబాబు సృష్టించిన వ్యవస్దల ద్వారా కేసును పక్కదారి పట్టిస్తున్నాడు. కేసు కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వివేకం సినిమాను ఎంతో నీచంగా చిత్రీకరించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని చిన్నప్పటి నుంచి షర్మిల, సునీతలు చూశారు. ఎనాడైనా నేరప్రవర్తన కనపడిందా? స్దానికంగా ఫ్యాక్షన్‌తో సంబంధం ఏమైనా ఉందా? కేవలం వైఎస్ జగన్‌ను ఎదుర్కొనేందుకే షర్మిల, సునీతను పావులుగా వాడుకుంటున్నారు. షర్మిల, సునీత రాజకీయ పోరాటం కోసం వచ్చారా? న్యాయపోరాటం చేసేటప్పుడు రాజకీయ పోరాటం అపాలి. ? లేదంటే తప్పుడు సంకేతాలు పోతాయి’ అని అన్నారు. వివేకా హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్ధాలే వివేకా హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్దాలేనని, దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్ మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదన్నారు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుందని మండిపడ్డారు. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పిందని గుర్తు చేశారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు? - దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్‌కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది? దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని చైతన్యరెడ్డి మండిపడ్డారు. -
వైఎస్ఆర్ సీపీ లో చేరనున్న రమేష్ రెడ్డి
-
పటేల్ రమేష్‌రెడ్డికి హామీ ఇచ్చినా.. కుందూరు రఘువీర్‌రెడ్డికే టికెట్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేసింది. కుందూరు రఘువీర్‌రెడ్డి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో నల్లగొండ అభ్యర్థి పేరును కూడా వెల్లడించింది. భువనగిరి ఎంపీ సీటు విషయాన్ని పెండింగ్‌లో పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ అభ్యర్థిత్వాల విషయంలో నల్లగొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. జానారెడ్డి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని తన చిన్న కుమారుడు జయవీర్‌రెడ్డికి నాగార్జునసాగర్ టికెట్ ఇప్పించుకున్నారు. జయవీర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత జానారెడ్డి లేదా రఘువీర్రెడ్డిలలో ఎవరో ఒకరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం సాగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట టికెట్ కోసం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి పోటీపడ్డారు. అధిష్టానం మాత్రం దామోదర్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో రమేష్‌రెడ్డి అలకబూనగా ఎంపీ టికెట్ ఇస్తామని మల్లు రవితోపాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా అప్పుడు హామీ ఇచ్చారు. అయితే, పటేల్ రమేష్‌రెడ్డికి టికెట్ ఇస్తారని భావించినా ఆ తరువాత జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి పేర్లే తెరపైకి వచ్చాయి. వీరితో పాటు పలువురు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డికి జానారెడ్డి, అయన కుమారులతో మంచి సంబంధాలు ఉండటంతో అధిష్టానం రఘువీర్‌రెడ్డి అభ్యర్థితాన్ని ఖరారు చేసింది. జానారెడ్డి తాను అనుకున్నట్లుగా పెద్ద కుమారుడికి నల్లగొండ ఎంపీ టికెట్‌ను ఇప్పించుకోవడం ద్వారా తన ఇరువురు కుమారులకు రాజకీయంగా బాటలు వేసినట్లయింది. పెండింగ్‌లో భువనగిరి అభ్యర్థి పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు. దానిని ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టింది. భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. కోమటిరెడ్డి సోదరులు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నాలు చేశారు. కోమటిరెడ్డి సూర్యపవన్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి పోటీచేస్తారన్న చర్చ సాగింది. ఆ తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు టీపీసీసీ నాయకుడు పున్నా కై లాష్ నేత, చెవిటి వెంకన్న, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీజేపీ అక్కడ బీసీ అభ్యర్థి, గౌడ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ఆలోచనల్లో పడ్డాయి. అక్కడ బీసీ అభ్యర్థిని పోటీలో నిలుపాలా.. ఓసీ అభ్యర్థిని నిలపాలా అన్న ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ పడింది. ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారన్నది నాలుగైదు రోజుల్లో తేలనుంది. పేరు: కుందూరు రఘువీర్ రెడ్డి తండ్రి: కుందూరు జానారెడ్డి వయస్సు: 44 (02–01–1980) విద్యార్హత: డిగ్రీ, వృత్తి: వ్యాపారం భార్య పేరు: లక్ష్మి పిల్లలు: ఈశాన్వి, గౌతమ్‌రెడ్డి పార్టీ పదవులు : 2009లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ సభ్యుడు 2014, 2018లో పీసీసీ సభ్యుడు 2021లో పీసీసీ జనరల్ సెక్రటరీ -
Rayachoty: ఔను ఆయనకు టికెట్ లేదు !
-
పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ నేతల బుజ్జగింపు
-
కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. రంగంలోకి ఏఐసీసీ పెద్దలు!
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. దీంతో, నామినేషన్లు వేసిన వారిపై ప్రధాన పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ నేతలు అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నారు. దీంతో, కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి రెబల్స్‌ను బుజ్జగిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పెద్దలు.. సూర్యాపేటలో రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డిని కలిశారు. వివరాల ప్రకారం.. సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ పెద్దలు వెళ్లారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో తాను వేసిన నామినేషన్ ఉపసంహరించుకోవాలని వారు సూచించారు. ఇదే సమయంలో సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని రమేష్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏఐసీసీ పెద్దలను చూడగానే రమేష్ రెడ్డి మరోసారి బోరున విలపించారు. వారితో తన ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి కూడా తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. తగ్గేదేలే.. ఇక, కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపులను రమేష్ రెడ్డి పట్టించుకోలేదు. రమేష్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. రమేష్ ఇంటికి వెళ్లిన వారిలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, మల్లు రవి ఉన్నారు. మరోవైపు.. పటేల్ మద్దతుదారులు రోహిత్ చౌదరీ, మల్లు రవిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా రోడ్డుపై బెఠాయించి నిరసనలు తెలిపారు. తెలంగాణలో ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు నేతలు టికెట్లు ఆశించగా, అందులో టికెట్లు రాని అసంతృప్తులు రాష్ట్రవ్యాప్తంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 24 మందిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కనీసం 10 చోట్ల ఆ పార్టీకి రె‘బెల్స్’మోగక తప్పదని గాంధీ భవన్ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, బాన్సువాడ, వరంగల్ వెస్ట్, డోర్నకల్, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. రెబల్ అభ్యర్థులు వీరే.. ఈసారి కాంగ్రెస్ రెబెల్స్‌గా జంగా రాఘవరెడ్డి (వరంగల్ వెస్ట్), నరేశ్ జాదవ్ (బోథ్), గాలి అనిల్‌కుమార్ (నర్సాపూర్), ఎస్.గంగారాం (జుక్కల్), కాసుల బాలరాజు (బాన్సువాడ), నాగి శేఖర్ (చొప్పదండి), దైద రవీందర్ (నకిరేకల్), రామ్మూర్తి నాయక్ (వైరా), ప్రవీణ్ నాయక్, చీమల వెంకటేశ్వర్లు (ఇల్లందు), విజయ్‌కుమార్‌రెడ్డి (ముథోల్), లక్ష్మీనారాయణ నాయక్ (పాలకుర్తి), సున్నం వసంత (చేవెళ్ల), నెహ్రూ నాయక్ (డోర్నకల్), భూక్యా మంగీలాల్ (మహబూబాబాద్), పటేల్ రమేశ్‌రెడ్డి (సూర్యాపేట), చిమ్మని దేవరాజు (పరకాల), సిరిసిల్ల రాజయ్య (వర్ధన్నపేట)తోపాటు మరికొంత మంది రంగంలోకి దిగారు. -
సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి
-
ఆశలకు గండి.. టికెట్ రాకపోవడంతో రమేష్ రెడ్డి ఫ్యామిలీ కన్నీరు..
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంతో మంది నేతలు సిద్ధమయ్యారు. గత ఐదేళ్లుగా పార్టీనే నమ్ముకుని.. ప్రజలతో మమేకమై ఉన్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్ కేటాయింపు ఎంతో ఆశగా ఉన్న క్రమంలో చివరి సమయంలో టికెట్ దక్కకపోవడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక, తాజాగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేశ్‌రెడ్డికి సైతం నిరాశ ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రమేశ్ రెడ్డికి టికెట్ నిరాకరించింది. అక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఖరారు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ సన్నిహితుడైనప్పటికీ పటేల్ రమేశ్ రెడ్డికి టికెట్ దక్కలేదు. దీంతో, రమేశ్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేశారని బోరున విలపించారు. మరోవైపు పటేల్ రమేశ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేడు సూర్యాపేటలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. -
కాంగ్రెస్‌ను ఓడించేందుకే ఆయనకు టికెట్.. రమేష్ రెడ్డి ఫైర్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీ హైకమాండ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమకే టికెట్ వస్తుందని ఆశించిన నేతలు.. చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో ఫైరవుతున్నారు. టికెట్ దక్కకపోవడంతో తాజాగా పటేల్ రమేష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాను. నాకే టికెట్ ఇస్తానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నాను. చివరకి నాకు అన్యాయం చేశారు. సూర్యాపేట టికెట్ దామోదర్ రెడ్డికి కేటాయించడం కుట్రలో భాగమే. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించడం కోసమే ఇదంతా చేశారు. బీఆర్ఎస్తో ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. కార్యకర్తలతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీని సూర్యాపేటలో బ్రతికించేలా నిర్ణయం తీసుకుంటాం. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం కావడం లేదు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీలో కోల్డ్‌వార్ ప్రారంభమైంది. ఇది కూడా చదవండి: హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అద్దంకి దయాకర్ రియాక్షన్ ఇదే.. -
తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల పంచాయితీ
-
మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాలానికి వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రా మగుండం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, కరీంనగర్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, సిరిసిల్ల, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటల్లోని మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థి వయసు 69 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం 5 గంటలకల్లా అవసరమైన డాక్యుమెంట్లతో dmerecruitment.contract@mail.com కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలని రమేశ్‌రెడ్డి కోరారు. అదే నెల 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రొఫెసర్, అసో సియేట్ ప్రొఫెసర్లకు ఆ రోజు ఉదయం 10 గంటలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు అదే నెల 24వ తేదీ నాటికి వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1.25 లక్షలుగా ఖరారు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫ్యాకల్టిలకు రెమ్యునరేషన్‌తోపాటు అదనంగా నెలకు రూ. 50 వేల ప్రోత్సాహకం ఇస్తారు. వీరి ఎంపిక దేశవ్యాప్తంగా వచ్చే అభ్యర్థుల నుంచి ఉంటుంది. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారిని తీసుకుంటారు. -
మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల భర్తీకి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి కోఠీలో ఉన్న డీఎంఈ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు పారదర్శకంగా కౌన్సిలింగ్ పద్ధతిలో పోస్టింగ్‌లు ఇస్తామని తెలిపారు. మల్టీ జోన్ –1 అభ్యర్థులకు 15, 16 తేదీల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. మల్టీ జోన్ –2 అభ్యర్థులకు 17, 18 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మల్టీ జోన్ 1, 2 రెండింటిలోని సూపర్ స్పెషాలిటీ అభ్యర్థులకు 19వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులందరికీ ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా సమాచారం పంపిస్తారు. అభ్యర్థులందరూ డీఎంఈ వెబ్సైట్లో పేర్కొన్న సూచనలు పాటించాలని, ఆ ప్రకారం సంబంధిత ధ్రువీకరణపత్రాలతో పాటు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. జోన్ వారీగా, సబ్జెక్ట్ వారీగా వివరాల షెడ్యూల్ వివరాలను అధికారిక వెబ్సైట్ https://dme.telangana.gov.in లో ఉంచామని తెలిపారు. 1442 పోస్టుల భర్తీ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 34 స్పెషాలిటీలకు చెందిన 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను మెడికల్ – హెల్త్ సర్వి సెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 8వ తేదీన ప్రకటించారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమవెంట తప్పనిసరిగా ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకొని రావాలి. బోర్డుకు అందజేసిన దరఖాస్తు ఫారం కాపీ, బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన నాన్ క్రిమీలేయర్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలి. అలాగే ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని రావాలి. సీట్ మ్యాట్రిక్స్‌ను కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ప్రదర్శిస్తారు. ఉదయం పూట కౌన్సిలింగ్ ఉన్న అభ్యర్థులు 10 గంటలకు కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం సమయం కలిగిన అభ్యర్థులు 1.30 గంటల కల్లా చేరుకోవాలి. ఏ రోజు ఎవరికి కౌన్సిలింగ్? ♦ 15వ తేదీన మల్టీ జోన్–1 అభ్యర్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, రేడియాడయాగ్నసిస్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, డీవీఎల్, జనరల్ మెడిసిన్, టీబీసీడీ విభాగాల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. ♦ 16వ తేదీన మల్టీ జోన్–1 అభ్యర్థులకే జనరల్ సర్జరీ, ఆప్తాల్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, ఈఎన్టీ విభాగాల్లో నిర్వహిస్తారు. ♦ 17వ తేదీన మల్టీ జోన్–2 అభ్యర్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, డీవీఎల్, టీబీసీడీ, జనరల్ సర్జరీ విభాగాల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. ♦ 18వ తేదీన ఆప్తాల్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, ఈఎన్టీ రేడియో డయాగ్నసిస్ విభాగాల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ♦ 19వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మల్టీ జోన్ –1 అభ్యర్థులకు... మధ్యాహ్నం 12 గంటల నుంచి మల్టీ జోన్–2 అభ్యర్థులకు ఈఎండీ, రేడియేషన్ ఆంకాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ ఎఈడీ, హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్, కార్డియాలజీ, సీటీవీఎస్, ఎండోక్రైనాలజీ, ఎంఈడీ గ్యాస్ట్రో, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
గాంధీ ఆసుపత్రిలో డీఎంఈ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
-
జూడాల సమ్మె బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, పలు డిమాండ్లపై వినతులు ఇచ్చినా స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. వీటిని ఈనెల 10వ తేదీ నాటికి పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 11వ తేదీ నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మిగతా విధులను బహిష్కరించనున్నట్లు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డికి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కౌషిక్ కుమార్ పింజర్ల, డాక్టర్ ఆర్.కె.అనిల్ కుమార్ నోటీసులు అందించారు. ♦ జూనియర్ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చేసే ప్రతి వైద్యుడు తప్పకుండా డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం(డీఆర్పీ) తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వంద పడకల ఆస్పత్రిలో కనీసం 3 నెలల పాటు సేవలందించాలి. వైద్య విధాన పరిషత్ అధికారులు జూనియర్ డాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో అక్కడ డ్యూటీలు వేస్తారు. ఈ క్రమంలో జూడాలు నిర్దేశించిన ఆస్పత్రి పరిధిలోనే ఉండాలి. అయితే ఈ కార్యక్రమం అమలు లోటుపాట్లపై జూడాలు ఫిర్యాదులు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించి వసతి, భోజనం, భద్రత సౌకర్యా లు కల్పించాలని కోరుతున్నారు. ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ♦ ఇక జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోంది. నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదు. బిల్లులు ఆమోదించినప్పటికీ ఆర్థిక అనుమతులు లేకపోవడంతో నిధులు విడుదల కావడం లేదని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ♦ స్టైఫండ్ పెంపు ప్రతి రెండేళ్లకోసారి చేపట్టాలి. ఏళ్లు గడుస్తున్నా స్టైఫండ్ పెంపు లేకపో వడం పట్ల జూడా సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
మెడికల్ కాలేజీల్లో 147 ప్రొఫెసర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 147 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. జాతీయ మెడికల్ కమి షన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల మేరకు.. 69 ఏళ్ల వయసున్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి నోటిఫికే షన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అదే రోజున తుది జాబితా ప్రకటిస్తారు. ఎంపికైనవారు ఈ నెల 23వ తేదీ నాటికి ఆయా చోట్ల చేరాల్సి ఉంటుంది. ఏడాది పాటు ఆయా కాలేజీలు, ఆస్పత్రుల్లో ప్రొఫె సర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికలో తెలంగాణకు చెందినవారికి ప్రాధాన్యమిస్తారు. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థుల వయసు 69 ఏళ్లు దాటకూడదు. రూ. లక్షా 90 వేల వరకు వేతనం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు రూ.50 వేలు వేత నం ఇస్తారు. మిగతా విభాగాల అసోసియేట్ ప్రొఫె సర్లకు రూ.లక్షన్నర, ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు ఇస్తారు. ఇవి కాంట్రాక్టు నియామకాలు కావడం వల్ల.. ఆయా పోస్టులకు ప్రమోషన్లు, రెగ్యులర్ నియామకాలు జరిగితే వీరిని తొలగిస్తారు. అనాట మీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున భర్తీ చేస్తారు. ఫిజియాలజీలో 9 ప్రొఫె సర్, ఏడు అసోసియేట్ ప్రొఫెసర్.. బయోకెమి స్ట్రీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున.. ఫార్మకాలజీలో ఏడు అసోసియేట్, పాథాలజీలో 9 అసోసియేట్, మైక్రోబయాలజీలో ఏడు అసోసియేట్, జనరల్ మెడిసిన్‌లో 9 ప్రొఫె సర్, డెర్మటాలజీలో 4 అసోసియేట్, సైకియాట్రీలో 9 అసోసియేట్, రెస్పిరేటరీ మెడిసిన్‌లో ఐదు అసోసియేట్, జనరల్ సర్జరీలో 9 ప్రొఫెసర్, ఆర్థోపెడిక్స్‌లో 9 అసోసియేట్, గైనకాలజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 9 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. -
అఖిల మృతిపై డీఎంఈ విచారణ
నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన బాలింత అఖిల మృతి చెందిన ఘటనపై సోమవారం డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కలిసి విచారణ నిర్వహించారు. మగశిశువుకు జన్మనిచ్చిన అఖిల తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేం«ద్రంలో ఉన్న వార్డులను డీఎంఈ పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది తమను కించపరిచేవిధంగా దుర్భాషలాడుతున్నారని పలువురు ఆయనకు ఫిర్యాదు చేయగా ఆస్పత్రి వర్గాల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంఈ మీడియాతో మాట్లాడుతూ అఖిల మృతిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని తమ ప్రాథమిక విచారణంలో తేలిందని తెలిపా రు. కాన్పుల సందర్భంగా సిబ్బంది తీరుపై తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. మరోవైపు మృతు రాలి అత్త, మామ, భర్త, కుటుంబసభ్యులు శిశువుతోపా టు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్నవారిని డీఎంఈ కనీసం పలకరించకపోవడం గమనార్హం. ధర్నా లో కాంగ్రెస్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా పాల్గొన్నారు. న్యాయంచేయాలని అఖిల మామ పోలీసు ల కాళ్లపైపడి ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. -
Sagubadi: ఒక్కసారి మొక్క నాటితే 20-30 ఏళ్లు పంట.. ఎకరాకు 14 లక్షల ఆదాయం!
Dragon Fruit Farming: సంప్రదాయ పంటలకు సస్తి చెప్పి తమకు లాభాలను, ప్రజలకు ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. సరికొత్త ఆలోచనలతో వినూత్న పద్ధతుల్లో పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు వేగంగా విస్తరిస్తుండగా, ప్రస్తుతం తెలంగాణలో డ్రాగన్ ఫ్రూట్ సుమారు 700 ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనా. సంగారెడ్డి జిల్లా రంజోల్ గ్రామానికి చెందిన యువరైతు బి.రమేశ్‌రెడ్డి తన తండ్రి నర్సింహ్మరెడ్డి ప్రోత్సహంతో డ్రాగన్ ఫూట్‌ను రెండెకరాల్లో సాగు చేస్తున్నారు. తొలి ఏడాది ఎకరానికి రూ. 6 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. అయినప్పటికీ, సుమారు 30 ఏళ్లపాటు అధిక లాభాలనిస్తుంది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నానని రమేశ్‌రెడ్డి తెలిపారు. రెండో ఏడాది నుంచి ఎకరానికి ఏడాదికి రూ. లక్షకు మించి ఖర్చు అవ్వదన్నారు. ప్రేరణ ఇచ్చిన పండ్ల రసం రమేశ్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఎంబీఏ (మార్కెటింగ్) చదివి హైదరాబాద్‌లో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ సమయంలో ఆరేళ్ల క్రితం స్నేహితులతో కలిసి రమేశ్‌రెడ్డి మణికొండలోని పండ్ల రసం సెంటర్‌కు వెళ్లినప్పుడు, గ్లాస్ డ్రాగన్ పండు రసం ధర రూ.120 అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి ఈ పండు గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. 2016లో మహారాష్ట్రకు ని ఔరంగ్‌బాద్‌కు వెళ్లి 8 మొక్కలు తెచ్చి ప్రయోగాత్మకంగా నాటారు. మొక్కలు ఏపుగా పెరిగి మంచి కాపు వచ్చింది. ఈ అనుభవంతో మూడేళ్ల క్రితం రెండు ఎకరాల్లో పంట వేశారు. మెరోగన్ రెడ్ రకానికి చెందిన ఒక్కో మొక్క రూ. 70 చొప్పున 2 వేల మొక్కలు నాటారు. తండ్రి సాగుచేస్తున్న అల్లం, అరటి, చెరకు పంటల వల్ల లాభాలు అంతగా రావటం లేదని భావించి డ్రాగన్ ఫ్రూట్ సాగు వైపు రమేశ్‌రెడ్డి అడుగులు వేశారు. ఆఫ్ సీజన్లో ఎల్ఈడీ వెలుగుతో అదనపు పంట పంట సాగు చేసిన మొదటి సంవత్సరంలోనే ఎకరాకు ఒకటిన్నర టన్నుల దిగుబడి వచ్చింది. రెండో సంవత్సరం 5 టన్నులు వచ్చింది. మొదటి సంవత్సరం టన్నుకు రూ. 1.5 లక్షల ధర పలికింది. పెట్టుబడులు పోగా మొదటి ఏడాదిలోనే ఎకరానికి రూ. 10 లక్షల ఆదాయం వచ్చిందని రైతు రమేశ్‌రెడ్డి తెలిపారు. పంట సాగు కోసం ఎకరానికి రూ. 50 వేలు పెట్టుబడి సరిపోతుందన్నారు. ఒకసారి మొక్క నాటితే 20 నుంచి 30 సంవత్సరాల వరకు క్రాప్ వస్తుందన్నారు. సాధారణంగా జూన్ నుంచి నవంబర్ వరకు 45 రోజులకో దఫా డ్రాగన్ పండ్ల దిగుబడి వస్తుంది. ఆర్నెల్లకోసారి పశువుల ఎరువు, ఎన్‌పికె, సూక్ష్మపోషకాలు అందిస్తున్నారు. రెండు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ తోటలో 100 ఎల్ఈడీ బల్పులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ. 2 లక్షలు వెచ్చించారు. పంటకు 12 గంటల పాటు వెలుతురు ఉన్నప్పుడే పంట నాణ్యతతో వస్తుంది. పగలు తక్కువగా ఉండే నవంబర్ తర్వాత కాలంలో ప్రతి నిత్యం 4 గంటల పాటు ఎల్ఈడీ బల్పులను వెలిగించారు. ఎకరానికి నెలకు విద్యుత్ ఖర్చు రూ. 4 వేల వరకు అదనంగా ఖర్చు వచ్చిందని రమేశ్‌రెడ్డి చెప్పారు. ఎకరానికి 16 టన్నులు.. రూ. 14 లక్షలు.. మొక్కలు నాటి మూడేళ్లకు గత సంవత్సరంలో జూన్–నవంబర్ వరకు సీజన్లో మూడో ఏడాది ఎకరానికి 12 టన్నుల దిగుబడి వచ్చిందని రమేశ్ రెడ్డి చెప్పారు. ఎల్ఈడీ బల్పులు ఏర్పాటు చేయటంతో ఆఫ్ సీజన్లో నవంబర్ నుంచి మార్చి వరకు కూడా ఎకరానికి 4 టన్నుల వరకు అదనపు దిగుబడి వచ్చిందన్నారు. జూన్–మార్చి వరకు మొత్తం కలిపి ఎకరానికి 16 టన్నుల డ్రాగన్ పంట దిగుబడి వచ్చిందన్నారు. ఎకరానికి రూ. లక్ష వరకు ఖర్చు పోగా.. ఎకరానికి రూ. 14 లక్షల నికరాదాయం వచ్చిందని వివరించారు. ఇప్పుడు నాలుగో సీజన్ ప్రారంభం కావటంతో కాపు మొదలైంది. 80 రకాల డ్రాగన్ మొక్కలు పొలంలో 80 రకాల డ్రాగన్ మొక్కలను ప్రయోగాత్మకంగా నాటించానని, ఏ రకం బాగా దిగుబడి వస్తే అదే రకం పంట పండించాలన్న ఆలోచన వచ్చిందన్నారు. రెడ్ అండ్ రెడ్, రెడ్ అండ్ వైట్, ఎల్లో అండ్ వైట్ బేసిక్ కలర్లన్నారు. ఎల్లోవైట్ తీపిగా ఉంటుందని, ఇదే ఖరీదైన పండన్నారు. నాలుగు నెలకు ఒకసారి పండ్ల దిగుబడి వస్తుందని, కిలో ధర రూ. 1000 నుంచి రూ. 1200 వరకు పలుకుతుందన్నారు. ఆమెరికా, వియత్నాం దేశాల్లో పర్యటించి డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు. ముదురు డ్రాగన్ మొక్కల నుంచి కాండాన్ని కత్తిరించి మొక్కల్ని తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులకు సుమారు 300 ఎకరాలకు సరిపడా డ్రాగన్ మొక్కల్ని సరఫరా చేశానన్నారు. భవిష్యత్తులో డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్, సౌందర్య సాధన ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవాలని రమేశ్ రెడ్డి ఆశిస్తున్నారు. – వై.శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి, జహీరాబాద్ యాజమాన్యం ముఖ్యం! రోజూ పంటను గమనించుకుంటూ రైతువారీగా తగిన శ్రద్ధ తీసుకుంటూ ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే డ్రాగన్ ఫ్రూట్ పంటలో మొదటి ఏడాది నుంచే మంచి దిగుబడులు వస్తాయి. అయితే, రైతు స్వయంగా కాకుండా పూర్తిగా పనివారిపై ఆధారపడి సరిగ్గా యాజమాన్య పద్ధతులు పాటించకపోతే రెండేళ్లయినా సరైన దిగుబడి తియ్యలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. వ్యక్తిగత శ్రద్ధతో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే డ్రాగన్ ఫ్రూట్ రైతుకు ఆశ్చర్యకరమైన దిగుబడితోపాటు అదే స్థాయిలో ఆదాయమూ వస్తుంది. – బి.రమేశ్‌రెడ్డి (96666 66357), రంజోల్, సంగారెడ్డి జిల్లా చదవండి: ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల పాటు పంట: ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం -
గుట్టు రట్టు: ఐదుసార్లు కళ్లుగప్పారు.. ఆరోసారికి దొరికిపోయారు
సాక్షి, హైదరాబాద్: తూర్పు తీరంలోని నర్సీపట్నం సమీపంలో ఉన్న నక్కపల్లి క్రాస్ రోడ్స్ నుంచి పశ్చిమాన మహారాష్ట్రలో ఉన్న అహ్మద్‌నగర్‌కు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.30 లక్షల విలువైన 300 కేజీల సరుకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరు ఇప్పటికే ఐదుసార్లు గంజాయిని అక్రమ రవాణా చేశారని, ఆరో విడతలో దొరికిపోయారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం తెలిపారు. జేసీపీ ఎం.రమేశ్‌రెడ్డి, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలసి ఆయన మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన విలాస్ భావ్‌సాహెబ్ తన వాహనంలో ఏపీకి కూరగాయలు రవాణా చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన ధ్యానేశ్వర్ మోహితే ఇతడికి సహకరించేవాడు. ఈ వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో వీరిద్దరూ కలసి గంజాయి అక్రమ రవాణా చేయాలని నిర్ణయించారు. దీంతో విశాఖ ఏజెన్సీలో ఉన్న కొందరు గంజాయి వ్యాపారులు, రైతులతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి కూరగాయలకు వినియోగించే ఖాళీ ట్రేలతో బయలుదేరేవాళ్లు. నక్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద గంజాయిని లోడ్ చేసుకుని ఆ ఖాళీ ట్రేల మధ్యలో ఉంచేవాళ్లు. తనిఖీల్లో ఎవరైనా అడిగితే కూరగాయలు అన్లోడ్ చేసి వస్తున్నామని చెప్పేవారు. హైదరాబాద్ మీదుగా అహ్మద్‌నగర్‌కు.. సరుకును తమ వాహనంలో అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్, జహీరాబాద్– హమ్నాబాద్ (కర్ణాటక) మీదుగా వారు అహ్మద్‌నగర్‌కు చేర్చేవాళ్ళు. కేజీ గంజాయిని రూ.1,500 కొనుగోలు చేసి, మహా రాష్ట్రలో కేజీ రూ.10 వేలకు విక్రయించే వారు. పుణే, ముంబై, నాసిక్‌లలో ఉన్న గంజాయి వ్యా పారులకు ఎక్కువగా సరఫరా చేసేవారు. మా ర్గం మధ్యలో ఉన్న మరికొందరు గంజాయి వ్యా పారులతోనూ వీళ్లు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రధానంగా జహీరాబాద్‌లోని ఓ దాబా వద్ద ఆగి ఆ ప్రాంతంలో పాటు హైదరాబాద్‌కు చెంది న వ్యాపారులకు కిలోల లెక్కన అమ్మే వాళ్లు. వీరి ద్వారా ఆ సరుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతా లకు చేరేది. విలాస్, ధ్యానేశ్వర్లు తమ వాహనంలో ఒక్కో దఫా 200 నుంచి 400 కేజీల చొ ప్పున ఐదుసార్లు మహారాష్ట్రకు తరలిం చారు. వీరి దందాపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.అశోక్‌రెడ్డి, జి.శివానందం, మలక్‌పేట ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్‌తో కలసి శనివారం ముసారాంబాగ్ చౌరస్తా వద్ద స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. -
‘కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు’
సాక్షి, హిమాయత్‌నగర్: ఆక్సిజన్ అందక కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో ఎవరూ మరణించలేదని వైద్య విద్య డైరెక్టర్ రమేశ్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఆదివారం మరణించిన ముగ్గురివీ సహజ మరణాలని స్పష్టం చేశారు. ఈ విపత్తు వేళలో ఆక్సిజన్ లేక మరణించారన్న వార్తలు పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో వస్తే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని చెప్పారు. ఆదివారం ఆక్సిజన్ అందక ముగ్గురు మరణించిన ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు సోమవారం ఆయన కింగ్‌కోఠి ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్ ఓపీ వద్ద పరిస్థితి, ఎంతమంది చికిత్స పొందుతున్నారనే విషయాలను వైద్య బృందం నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా అవుతున్న గదిని, ఆక్సిజన్ నింపే ప్రక్రియను సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, నోడల్ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజతో కలసి పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఆస్పత్రుల్లో సహజ మరణాలు జరుగుతూనే ఉంటాయని, ఆదివారం చనిపోయిన ముగ్గురు కూడా సహజంగానే చనిపోయారని పునరుద్ఘాటించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నయం కాకపోవడంతో చివరి నిమిషంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని, అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు ఎవరూ రాని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరాపై ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఉందని, ఆ కమిటీ ఆక్సిజన్ నిల్వలు, అవసరాలపై నిత్యం మానిటరింగ్ చేస్తుందని పేర్కొన్నారు. కాగా, కింగ్‌కోఠి ఆస్పత్రికి 46 కేజీల ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, మరో 50 సిలిండర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. త్వరలో ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ జెనరేటర్ నిర్మాణం పూర్తవుతుందని, అలాగే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చదవండి: కరోనా రోగులకు రాష్ట్రంలోకి నో ఎంట్రీ -
ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీగా రమేష్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డిని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ)కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీగా రమేష్‌రెడ్డిని తప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సిఫారసు చేయడంతో ఆయన్ను ప్రభుత్వం వెయిటింగ్లో పెట్టింది. రమేష్‌రెడ్డిని ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. -
హైటెక్ వ్యభిచారం: వాట్సాప్‌లో ఫొటోలు.. ఓకే అయితే
చిత్తూరు జిల్లాలో హైటెక్ వ్యభిచారం గుట్టుగా సాగుతోంది. కొంతమంది బలహీనతలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు విచ్చలవిడిగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం నిర్వాహకులు సోషల్ మీడియాను దర్జాగా వాడుకుంటున్నారు. తిరుపతిలో ఇటీవల పట్టుబడిన ఉందతమే దీనికి ఉదాహరణ. సాక్షి, తిరుపతి క్రైం: కొంతమంది సులభంగా డబ్బు సంపాధించేందుకు వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అపార్ట్మెంట్లను ఎంచుకుంటున్నారు. జిల్లాతోపాటు నెల్లూరు, తమిళనాడు నుంచి మహిళలు, యువతులను రప్పించి యథేచ్ఛగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్లలో ప్రకటనలిస్తూ విటులను ఆకర్షిస్తున్నారు. నేరుగా తిరుపతి కాల్‌గరŠల్స్తోనే ఈ వెబ్‌సైట్స్ క్రియేట్ అవ్వడం గమనార్హం. వాటిని చూసి ఫోన్ ద్వారా సంప్రదించిన వారికి యువతుల ఫొటోలు, మొత్తం, బ్యాంక్ ఖాతా నంబర్ పంపిస్తారు. డబ్బు ఖాతాలోకి రాగానే ఎంపిక చేసుకున్న లాడ్జీలకు రమ్మని విటులకు చెబుతున్నారు. అలా కాదనుకుంటే ఆ యువతలను వారు చెప్పిన చోటికి వారి సిబ్బంది ద్వారా పంపిస్తున్నారు. అదేవిధంగా లాడ్జీలో గదులు తీసుకున్న వారు అమ్మాయిలను కావాలని అడిగితే నిర్వాహకులతో లావాదేవీలు జరిపి సరఫరా చేస్తున్నారు. చదవండి: (పూటుగా తాగి లైంగిక దాడి) సోషల్ మీడియా ద్వారా విటులకు వల వ్యభిచార గృహాల నిర్వాహకులు సామాజిక మాధ్యమాలను బాగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా బ్రోకర్లు యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో అందమైన యువతులు, మహిళల ఫొటోలను పోస్టు చేస్తున్నారు. నచ్చిన వారు సంప్రదించాలంటూ కాంటాక్ట్ నంబర్‌ను సైతం పెడుతున్నారు. గంటకు రూ.1000 నుంచి రూ.5,000లు, యువతులను ఒక్కరోజు తీసుకువెళితే రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పేదరికంలో ఉన్న యువతులే టార్గెట్ పేదరికంలో ఉన్న మహిళలు, విద్యార్థినులు, యువతులకు డబ్బు ఆశ చూపించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు సమాచారం. పక్క రాష్ట్రాల బ్రోకర్లతో సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడి అమ్మాయిలను అక్కడికి, అక్కడి అమ్మాయిలను ఇక్కడికు తరలిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా జిల్లాతోపాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు, లాడ్జీలు, ఊరు శివార్లలో ఇళ్లు తీసు కుని విటులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. చదవండి: (మాట వినడం లేదని అత్తను హత్యచేసిన అల్లుడు) చెక్ పడేనా? కొద్దిరోజుల క్రితం తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో ముగ్గురు విటులతో పాటు నిర్వాహకులు, అమ్మాయిలు పట్టుబడ్డారు. తాజాగా గత శుక్రవారం తిరుపతి నగరంలో పలమనేరుకు చెందిన వ్యక్తి వ్యభిచారానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. పోలీసుల విచారణలో ముగ్గురు కీలక వ్యక్తుల పేర్లు వెల్లడయ్యాయి. ఇందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉండడం గమనార్హం. ఈ దందాలో మహిళ కీలకంగా వ్యహరించడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. వారి ఫోన్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిఘా పెట్టాం ఆన్లైన్లో విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలపై నిఘా పెట్టాం. త్వరలోనే వీరిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. లాడ్జీలపైన పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాం. వ్యభిచారాన్ని కూకటి వేళ్లతో నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాం. ఆధ్యాత్మిక నగర పవిత్రతను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. – ఆవుల రమేష్‌రెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ -
టీడీపీలో ‘రాజీనామా’ ప్రకంపనలు..
జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ల రాజీనామాల బ్లోఅవుట్ ఎగిసిపడుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా ఒకలా.. అధికారం కోల్పోయాక మరోలా వ్యవహరించడం పరిపాటే అని మరోమారు తన నిజరూపాన్ని చాటుకుంది. అధికారంలో ఉన్నప్పుడు బీసీ, మైనార్టీలను అణగదొక్కిన ఆ పార్టీ తాజాగా పార్టీ సంస్థాగత పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇటీవల బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలకు వైఎస్సార్సీపీ అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా టీడీపీ బీసీలకు విలువలు, ఉపయోగాలు లేని పదవులు కట్టబెట్టింది. జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న రెడ్డి్డ సామాజిక వర్గ సీనియర్ నేతలను పక్కన పెట్టడంతో అసంతృప్తి రాజుకుంది. (చదవండి: టీడీపీ నేతల కుట్ర భగ్నం..) సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రతిపక్ష టీడీపీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. జిల్లాలో పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన నేతలకు మొండి చేయి చూపారు. తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ, పార్లమెంట్ అధ్యక్షుల ప్రకటన అసమ్మతి రేపింది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్న వారిని, గత ఎన్నికల్లో పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయిన వారిని సైతం పార్టీ పూర్తిగా పక్కన పెట్టింది. జిల్లా పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతల కనుసన్నల్లోకి పార్టీ వెళ్లడంతో తీవ్ర గందరగోళం రేగింది. 1982 నుంచి పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనూరాధ పార్టీ క్రియా శీలక సభ్యత్వాలకు రాజీనామాలు చేయడం జిల్లాలో ప్రకంపనలు మొదలయ్యాయి. ♦టీడీపీ ఆవిర్భావం నుంచి దివంగత ఎన్టీఆర్ కుటుంబంతో తాళ్లపాక రమేష్‌రెడ్డికి అనుబంధం ఉంది. అఖిల భారత ఎన్టీ రామారావు సంఘం జాతీయ అధ్యక్షుడిగా రమేష్‌రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావంతో క్రియా శీలక రాజకీయాల్లోకి రమేష్‌రెడ్డి వచ్చారు. ♦ప్రస్తుతం జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు ఒకరిద్దరు మినహా మిగిలిన వారెవరూ అప్పట్లో పార్టీలో కూడా లేని వారే. ఇలాంటి తరుణంలో జిల్లాలో పార్టీని నమ్ముకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. ♦రమేష్‌రెడ్డి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, రమేష్‌రెడ్డి భార్య అనురాధ నెల్లూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ♦ఆ తర్వాత పదవులు లేకపోయినప్పటికీ నిస్వార్థంగా పార్టీలో పని చేసి ఆర్థికంగా కూడా పూర్తిగా నష్టపోయారు. ♦ఇలాంటి తరుణంలో పార్టీని వదలకుండా రమేష్‌రెడ్డి, ఆయన భార్య అనూరాధ«లు పార్టీలో కొనసాగారు. ♦ప్రస్తుతం రమేష్‌రెడ్డి భార్య అనూరాధ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. గడిచిన ఎన్నికల్లో మంత్రి నారాయణ గెలుపు కోసం పని చేశారు. ♦2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా పార్టీ కార్యక్రమాలు నిర్వహిసూ్తనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో రెండు రోజుల క్రితం టీడీపీ ప్రకటించిన సంస్థాగత రాష్ట్ర కమిటీలో ఇద్దరికి చోటు దక్కలేదు. ♦క్రియాశీలకంగా పనిచేయకుండా గతంలో పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించిన వారికి మాత్రం కమిటీలో పెద్దపీట వేశారు. ♦ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు దిష్టిబొమ్మలు దహనం చేసి, ఆయన్ను అనేక పర్యాయాలు తీవ్రంగా విమర్శలు చేసిన నేతకు మాత్రం కీలక పగ్గాలు అప్పగించారు. ♦తాజా రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తితో రమేష్‌రెడ్డి, ఆయన భార్య అనూరాధ శనివారం పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌అజీజ్‌కు లేఖ పంపారు. ♦ఇక నెల్లూరు రూరల్ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న ఆనం జయకుమార్‌రెడ్డికి కూడా పార్టీ మొండిచేయి చూపింది. ఆయన కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ♦2019 ఎన్నికలప్పుడు రూరల్ అభ్యర్థిగా ఖరారు చేసి చివరి నిమిషంలో టికెట్ నిరాకరించి అబ్దుల్ అజీజ్‌కు ఇచ్చారు. ♦అయితే పార్టీలో కీలక ప్రాధాన్యంతో పాటు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పలు పర్యాయాలు హామీ ఇచ్చారు. ♦కానీ తాజా కమిటీలో కనీసం నామమాత్రపు పదవి కూడా రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ♦వారం రోజుల్లో కార్యాచరణ ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ♦ఇప్పటికే జిల్లాలో ఇదే రీతిలో అనేక మంది ముఖ్యనేతలు అసమ్మతి వ్యక్తం చేసి పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. ♦జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు కూడా అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద టీడీపీలో పదవుల పందారం కొత్త తలనొప్పులకు దారి తీసింది. -
కరోనా: తెలంగాణలో బీ కేర్ ఫుల్
-
కరోనా : చేదు వార్త వినిపించిన టీ సర్కార్
సాక్షి, హైదరాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్‌తో ఇప్పటికే తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజలకు తెలంగాణ సర్కార్ మరో చేదు వార్తను వినిపించింది. వైరస్ ప్రభావం వచ్చే నాలుగైదు వారాలు చాలా సంక్లిష్టంగా ఉంటుందని.. కరోనా వైరస్ కమ్యూనిటీలోకి వెళ్లిందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉండబోతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతమున్న స్థితిని కమ్యూనిటీ స్ప్రెడ్ అనలేమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయని, కరోనాకు త్వరగా చికిత్స చేస్తే చాలా మంచిదని సూచించారు. (‘ఈ ఏడాది లడ్డూ వేలం లేదు’) రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్ట్‌లకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. టెస్టుల నిర్వహణకు ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. కోర్టులో రోజుకో పిల్ వేయడం మంచి పరిణామం కాదని రమేష్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మెడికల్ సిబ్బందికి అందరూ మద్దతుగా నిలబడాలని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటికీ 6,500 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని, అన్ని జిల్లా కేంద్రాల్లో చికిత్స చేస్తున్నారని, అత్యవసరమైతేనే హైదరాబాద్ రావాలని తెలిపారు.(కూల్చివేతల బులిటెన్ విడుదల చేయొచ్చుగా..) -
కరోనా నియంత్రణకు వైద్య సిబ్బంది ప్రత్యేక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నివారించేందుకు జీహెచ్ఎంసి పరిధిలోని టీచింగ్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి సూపరింటెండెంట్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 1)ప్రతి ఆస్పత్రిలోని వైద్యులతో పాటు ఇతర సిబ్బందిని రెండుగా విభజించాలి. 2)ప్రతి బ్యాచ్‌కు 7రోజులు క్వారంటైన్లో ఉంచాలి. ఒక బ్యాచ్ ముగిసిన వెంటనే మరో బ్యాచ్‌ను క్వారంటైన్ చేయాలి. 3)కరోనా విజృంభణ నేపథ్యంలో సెలవులు రద్దు చేయాలి. 4)డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్, కరోనా టెస్టులు చేసి ట్రీట్మెంట్ అందించాలి. 5)ప్రతి ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న వాళ్లందరు విధిగా వ్యక్తిగత రక్షణ కోసం పీపీఈ కిట్, మాస్కు ధరించాలి. -
‘తిరుమలలో ఏర్పాట్లు సంతృప్తికరం’
సాక్షి, తిరుమల : తిరుమలలో ఎస్పీ రమేష్‌రెడ్డి తనిఖీలు నిర్వహించారు. క్యూలైన్లు, శ్రీవారి ఆలయం, దుకాణ సముదాయాలు, లడ్డూ కౌంటర్లను పరిశీలించారు. దర్శన క్యూలైన్లలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. (సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు) ప్రసాద విక్రయ కేంద్రాలు, దుకాణ సముదాయాల వద్ద మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రమేష్ రెడ్డి అన్నారు. ఆలయంలో ఆర్చకులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.(నాడు-నేడు దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది..) లాక్డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరిగి పునఃప్రారంభించనున్న విషయం తెలిసిందే. మొదట ప్రయోగాత్మక పరిశీలన కింద ట్రయల్ రన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతిచ్చింది. టీటీడీ ఆలయ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వినతి మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ అనుమతి తెలియజేస్తూ మంగళవారం మెమో ఉత్తర్వులు జారీచేశారు. భౌతికదూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లుచేయాలని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో మూడ్రోజులపాటు ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ పద్ధతిలో దర్శనాలను టీటీడీ ప్రారంభించనుంది. ఈ ట్రయల్ రన్ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ కూడా సమ్మతి తెలియజేసినట్లు జేఎస్వీ ప్రసాద్ ఆ మెమోలో తెలిపారు. అనంతరం 10 లేదా 11 నుంచి సాధారణ భక్తులను అనుమతించే అవకాశముంది. (తిరుమల శ్రీవారి దర్శనానికి 8 నుంచి ట్రయల్ రన్) -
బోధనాసుపత్రుల్లో పూర్తిస్థాయి వైద్య సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాస్పత్రులు, స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలను పునరుద్ధరించాలని వైద్య విద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఎలెక్టివ్ సర్జికల్ సేవలతో సహా ఆస్పత్రుల్లోని అన్ని సేవలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్క్‌లను ఉపయోగించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి సిబ్బంది సరైన భద్రత చర్యలు తీసుకుని వైద్య సేవలందించాలని కోరారు. రోగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వార్డుల్లో రద్దీ లేకుండా చూడాలని, పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరైనా రోగి కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వస్తే, వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచాలని తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఛాతి ఆస్పత్రులు కరోనా నోడల్ కేంద్రాలుగా ఉంటాయని, సరోజినీ కంటి ఆస్పత్రిలో కొంత భాగం ఐసోలేషన్ సెంటర్‌గా ఉంటుందని వెల్లడించారు. -
వరినాట్లు వేస్తున్న ఎస్పీ
సాక్షి, చిత్తూరు: ఏందబ్బా! ఈయనెరో పోలీసాయన్లా ఉండాడే.. వరినాట్లేస్తాండేందబ్బా.. అని అట్లా కళ్లార్పకుండా చూస్తాండారా!? పైన కనిపిస్తున్న ఫొటోలో ఉండేదంతా నిజమే..ఆ సారు తిరుపతి ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి. మంగళవారం మిట్ట మజ్జానం ఎలబారి ఏర్పేడు మండలానికొచ్చినాడు..రాజులపాలెం ఊర్లో సరుకులు పంచేదానికి. ఆ ఊరికాడ రోడ్డు పక్కనే మడికయ్యల్లో వరినాట్లేస్తున్న కూలోల్లు, రైతుల్ని ఆయన్జూసినాడు. అప్పుడు టయిం ఒకటీ ముక్కాలైంది. నడినెత్తిన ఎండ సుర్రుమంటున్నా పనులు చేసేది చూసినాడు. ఆయన ఇస్కూలు సదివే టయింలో పొలం కాడ చేసిన పనులు గాపకం వచ్చినాయేమో!? కాలిబూట్లు తీసేసినాడు. మోకాలిదాకా ప్యాంటు ఎగదీసి, కయ్యలో దిగినాడు. పగ్గాలు పట్టుకుని ఎస్పీ సారు అదిలించేకాడికి కాడెద్దులు ముందుకు కదిలినాయి. కొంచేపు నల్లమాను పనులు చేసినాడు. కొంచేపటికి వరినాట్లు ఏసేది మొదలుబెట్టినాడు. ఆడ పనికొచ్చిన కూలీలు ఎస్పీతో కలిసి ఖుషీగా నాట్లేసినారు. ఆ తర్వాత ఎస్పీ వాళ్లందరికీ నిత్యావసర సరుకులు, అరటిపండ్లు, మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. తానూ వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానన్నారు. పుట్టుకతో పిల్లలకు భాష నేర్పించేందుకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో వ్యవసాయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ పల్లెలన్నీ పచ్చదనంతో కరోనాకు దూరంగా ఉండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. వ్యవసాయ కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎస్పీ రమేష్ రెడ్డి -
‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం కావడం సంతోషం
సాక్షి, తిరుపతి: కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం కావడం సంతోషంగా ఉందని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి అన్నారు. ఆయన తిరుపతి నగర వీధుల్లో పర్యటించి ‘జనతా కర్ఫ్యూ’ను పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర దేశాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను దాచడం మంచిది కాదన్నారు. సోషల్ మీడియాలో వైరస్‌పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలతో పాటు చట్టాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. బయట ప్రదేశాల నుంచి వచ్చిన వారిని రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ డేటాబేస్ ఆధారంగా విచారణ చేపడతామని ఆయన అన్నారు. విదేశాల నుంచి వస్తున్నవారు పారాసిటమాల్ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల థర్మో స్కానర్‌లో టెంపరేచర్ తెలియక ఎయిర్‌పోర్టు తనిఖీల్లో వైరస్ లక్షణాలు ఉన్నవారు బయటపడటం లేదన్నారు. కరోనా వైరస్ అరికట్టడానికి చేస్తున్న ప్రచారంలో మీడియా పాత్ర చాలా బాగుందని ఆయన అభినందించారు. -
నీ సంకల్పానికి సెల్యూట్!
తిరుపతి :తిరుపతి అర్బన్ ఎస్పీ తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనకు హోదా అవసరం లేదు. మన, తన అన్న భేదం లేదు. ఉన్నది ఒక్కటే. అదే సేవాతత్వం. అదే ఆయన అభిమతం. ఆధ్యాత్మిక నగరంలో నా అన్నవారు లేని ఓ అభాగ్యుడు యాచక వృత్తి సాగిస్తూ ఫుట్‌పాత్‌పై బతుకు సాగించేవాడు. తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయం ఎదుటే పడుకునేవాడు. నిత్యం ఆ దారిన ఎంతో మంది తిరుగుతున్నా పట్టించుకునే వారే కాదు. అతని దుస్థితిని చూసి తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి హోదాను సైతం పక్కనపెట్టేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యాచకుడిని పలకరించారు. సాదకబాధకాలు తెలుసుకున్నారు. అతన్ని మామూలు మనిషిని చేయాలని సంకల్పించారు. వెస్ట్ సీఐ నేతృత్వంలో అతనికి జుట్టు కత్తిరించి, కొత్తబట్టలు వేసి, భోజనం పెట్టి ఆశ్రమంలో చేర్పించారు. ప్రతి ఒక్కరూ ఒకపూట అనాథలకు భోజనం పెట్టాలని కోరారు. ఆ మేరకు పోలీసులు ఎస్పీ బాటలో పయనిస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి ముందు, ఇప్పుడు -
సీఎంకు ‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకం
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కడి తెలుగువారు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కదలిక పత్రిక సంపాదకుడు ఇమామ్... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకాన్ని రచించారు. ప్రస్తుతం వాషింగ్టన్లో ఉన్న సీఎం జగన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై (యూఎస్) విభాగం గవర్నింగ్ కౌన్సిల్ సలహాదారు వల్లూరు రమేశ్‌రెడ్డి ఈ పుస్తకాన్ని అందజేశారు. -
దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
దుబాయ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్(యూఏఈ) తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు స్థానిక నాయకులు రమేశ్ రెడ్డి, సోమి రెడ్డి, దిలీప్‌కుమార్‌లు చెప్పారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఒక పార్టీని నడిపించాలంటే ఎన్నో వ్యవప్రయాసలతో కూడుకున్నదని, ఎంతో ఓపిక ఉండాలని అది వైఎస్ జగన్‌కే సాధ్యమైందన్నారు. సుమారు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి నిరంతరం ప్రజాసమస్యలు తెలుసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. ఇన్ని రోజులు కష్టాలు పడ్డాం.. ఇంకొక 30 రోజులు కష్టపడండి.. ఆ తర్వాత జగనన్న రాజ్యం వస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మీ ఊళ్లలో, మీ కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఓటు హక్కు లేకపోతే దగ్గరుండి వారికి ఓటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు నాయకులు సూచించారు. అలాగే వైఎస్ జగన్ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఏపీలో అవినీతి రాజ్యమేలుతుందని, మనం చేతగాని వాళ్లలా ఊరుకుంటే మరో ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఉత్సాహమున్న కార్యకర్తలు సంప్రదించాలని ఎన్ఆర్ఐ విభాగం నాయకులు కోరారు. -
దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
-
మెడికల్ కాలేజీలకు నేరుగా అధ్యాపకుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలల అధ్యాపకులను ఇకనుంచి నేరుగా నియామకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి కానుంది. ఇప్పటివరకూ ఈ నియామకాలను భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సంబంధం లేకుండా భర్తీ చేపట్టాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో నల్లగొండ, సూర్యాపేటల్లో మరో రెండు కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా 40 నుంచి 50 మంది ప్రొఫెసర్లు పదవీ విరమణ చేస్తుంటారు. దీంతో కళాశాలల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలో 2,700 మంది అధ్యాపకులు ఉన్నారు. వీరిలో 2019 చివరి నాటికి మరో 50 మంది పదవీ విరమణ చేయనున్నారు. దీంతో అధ్యాపకుల కొరత 48 శాతానికి చేరుకుంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో 459 మంది వైద్య విద్య అధ్యాపకుల భర్తీని టీఎస్పీఎస్సీ చేపట్టగా కొందరు వైద్యులు హైకోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. అధ్యాపకుల కొరతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న కొందరు వైద్యులను వారి సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని డీఎంఈ పరిధిలో విలీనమయ్యే వెసులుబాటు కల్పించారు. అయినా కొరతను పూర్తి స్థాయిలో అధిగమించలేకపోతున్నారు. తగ్గిపోతున్న వైద్య విద్య ప్రమాణాలు.. అధ్యాపకుల కొరత కారణంగా వైద్య విద్య ప్రమాణాలు తగ్గిపోవడంతోపాటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అధ్యాపకుల పదవీవిరమణ వయసును పెంచాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు అధ్యాపకులు ఆందోళనకు దిగడంతో సీఎం ఆదేశాల తో తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుంది. పరిస్థితిని అధిగమించాలంటే నేరుగా నియామకాలు చేపట్టడం ఒక్కటే మార్గమని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు ఆలస్యమవుతున్నందున ఆయా శాఖలకు నియామక అనుమతులు కల్పిస్తానని చెప్పారు. దీని దృష్ట్యా వైద్య విద్య అధ్యాపకులను నేరుగా నియమించుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వానికి డీఎంఈ ఇటీవల లేఖ రాశారు. -
బోధనా వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు ఇక నుంచి నిర్ణీతకాలంలో పదోన్నతులు లభించనున్నాయి. ఈ మేరకు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేష్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలోనే మార్గదర్శకాలు విడుదల అవుతాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. డీఎంఈ ప్రతిపాదనల ప్రకారం బోధనాసుపత్రుల్లో నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ఆరేళ్ల సర్వీసు పూర్తయిన అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించనుంది. దీంతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్‌గా మూడేళ్లు పూర్తయిన వారి పే స్కేల్లో మార్పు తీసుకొస్తారు. తాజా ప్రతిపాదనలు బోధన వైద్యులకు ప్రయోజనం కల్గిస్తాయని అధికారులు చెబుతున్నారు. 2,700 మందికి ప్రయోజనం... ప్రస్తుతం బోధన వైద్యుల పదోన్నతులు అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైర్ అయితేనే పదోన్నతులు లభిస్తున్నాయి. దీంతో కొందరికి మాత్రమే పదోన్నతులు లభిస్తుండగా చాలా మందికి లభించడం లేదు. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వచ్చిన పరిస్థితులున్నాయి. కొందరికైతే 20 ఏళ్లకు గాని పదోన్నతి వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలుచేస్తున్నాయి. డీఎంఈ తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 2,700 మంది వైద్యులకు ప్రయోజనం కలగనుంది. అంతేకాక వారికి పదోన్నతి వచ్చిన ప్రతిసారి స్కేల్స్‌ల్లోనూ మార్పులు చేయనున్నారు. అంటే ఆర్థికంగా కూడా వారికి మరింత ప్రయోజనం కలుగనుంది. ఇక ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా నిర్ణీత సమయం ప్రకారం వారి స్కేల్స్‌లో మార్పులు చేయనున్నారు. -
వైఎస్సార్సీపీ నేత రమేష్‌రెడ్డిపై కేసు నమోదు
తాడిపత్రి : ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు హత్యా రాజకీయాలకు తెర లేపుతున్నారు. తమకు అడ్డుగా ఉన్నవారిని అంతమొందించేందుకు కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే తాడిపత్రిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డిపై బుధవారం అర్ధరాత్రి ఓ అగంతకుడు హత్యాయత్నం చేశాడు. రమేష్‌రెడ్డి తన ప్రాణాలను కాపాడుకునేందుకు తన లైసెన్స్ పిస్టల్‌తో ఆ అగంతకునిపై కాల్పులు జరిపారు. అయితే పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆగంతకుడికి మతిస్థిమితం లేదంటూ, రమేష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... రమేష్‌రెడ్డి క్రిష్ణాపురం ఐదవ రోడ్డులోని తన నివాసంలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో కారిడార్లోకి తలారి బాలచంద్ర అనే అగంతకుడు చొరబడ్డాడు. మూడో అంతస్థులో రమేష్‌రెడ్డి నిద్రిస్తున్న గది కిటికీ తలుపును తెరిచేందుకు ప్రయత్నించాడు. అలికిడి కావడంతో ఆయనకు మెలకువ వచ్చి లైసెన్స్ రివాల్వర్ తీసుకుని బయటకు వచ్చాడు. అగంతకుడు హత్యాయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాడు. బుల్లెట్ గోడకు తగిలి కాలిలోకి చొచ్చుకుపోవడంతో అగంతకుడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఇంతలో రమేష్‌రెడ్డి గన్‌మెన్ కింద ఫ్లోర్లో నుంచి మూడో అంతస్తులోకి చేరుకున్నాడు. రమేష్‌రెడ్డి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పట్టణ సీఐ సురేందర్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అగంతకుడు బాలచంద్రను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతని ఎడమ కాలి పాదంలో ఉన్న బుల్లెట్‌ను తొలగించారు. పోలీసులు అగంతుకుడిని అదుపులోకి తీసుకుని విచారించకుండా కేసు నమోదు చేసుకుని మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పి వదిలిపెట్టేశారు. కాల్పులు జరిపినందుకు రమేష్‌రెడ్డిపై కేసు నమోదు చేసి నోటీసులు అందజేశారు. ఆయన లైసెన్స్ పిస్టల్‌ను స్వాధీ నం చేసుకున్నారు. రాజకీయ ఒత్తిడితో కేసును తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ఆ అగంతకుడికి మతిస్థిమితం లేదని ధృవీకరించారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో మూడో అంతస్తులోకి చొరబడ్డ వ్యక్తిని విచారించకుండా మతిస్థిమితం లేనివాడని పోలీసులే నిర్ధారించి ఇంటికి పంపడమే దీనికి నిదర్శమని చెప్పారు. రమేష్‌రెడ్డిపై హత్యాయత్నంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
వైఎస్సార్ సీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం
-
తాడిపత్రిలో కాల్పుల కలకలం
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా తాడిప్రత్తిలో వైఎస్సార్ సీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రమేష్ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్ లైసెన్స్ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపాలని ఆయన డిమాండ్ చేశారు. -
తండ్రి కాటికి.. తల్లి ఆసుపత్రికి..
సాక్షి,వేమనపల్లి(బెల్లంపల్లి): ఆదివారం సాయంత్రం సిరొంచలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్, వరంగల్‌లో పట్టణాల్లో ఉండి చదువుకుంటున్న కూతురు సుష్మ, కుమారుడు ప్రణీత్‌కు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. లైన్మెన్గా పనిచేస్తున్న వేమునూరి రమేశ్‌రెడ్డి మృతి చెందగా, ఆయన భార్య శారదను స్థానికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్చారు. దహన సంస్కారాలకు ఆయన మృతదేహాన్ని స్వగ్రామం నీల్వాయికి తరలించారు. శారద నడవలేని స్థితిలో ఉండి కూడా ఆసుపత్రి నుంచి భర్త కడచూపు కోసం నీల్వాయికి వచ్చింది. భర్త మృతదేహం పక్కనే గాయాలతో ఆమె కదల్లేని స్థితిలో విలపించడం పలువురిని కలచివేసింది. నిత్యం ఫోన్లో యోగక్షేమాలు తెలుసుకునే తమ తండ్రి ఇకలేడనే విషయం తెలిసిన చిన్నారులు గుండెలవిసేలా రోదించారు. ఆ దృశ్యాలు అక్కడున్న జనం గుండెలను పిండేశాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు ప్రణీత్ తండ్రికి అంతిమ సంస్కారాలు చేశాడు. అనంతరం శారదను ఉన్నత వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. జెడ్పీటీసీ ఆర్.సంతోశ్‌కుమార్, ఏఎమ్‌సీ వైస్‌చైర్మన్ కోళి వేణుమాధవ్, ఎంపీపీ కుర్రువెంకటేశ్, సర్పంచ్‌లు మల్లిక, కుబిడే వెంకటేశ్ తదితర నాయకులు, సహచర ఉద్యోగులు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. రమేశ్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని డీఈ నాగేశ్వర్రావు తెలిపారు. -
మీహయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి
లక్కిరెడ్డిపల్లె: మీ తండ్రి హయాం నుంచి లక్కిరెడ్డిపల్లెకు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిపై వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.గురువారం మండలంలోని లక్కిరెడ్డిపల్లె జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అభివృద్ధి పేరుతో బురదజల్లే ప్రయత్నం చేశారు. అందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.దీంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ హయంలో లక్కిరెడ్డిపల్లె మండలానికి వేల పక్కాగృహాలు మంజూరు చేసిన విషయం మీరు మరిచారా అని ప్రశ్నించారు.నాలుగేళ్లలో మీరెన్ని పక్కాగృహాలు మంజూరు చేశారో ప్రజలకు తెలుసన్నారు. మండలంలో కస్తూర్బా,వెలుగు,ఆదర్శ పాఠశాలలు ఎవరి హయాంలో వచ్చాయో మీకు తెలియదా అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి నిధులతో రూ.40 లక్షల మేర బోర్లు వేసి ప్రజలకు దాహార్తి తీర్చిన విషయాన్ని మీరు గర్తుంచుకోవాలన్నారు. తాను ఎనిమిదిన్నరేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అధికారంలో ఆరు నెలలు మాత్రమే ఉన్నామన్నారు.ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు రావాల్సిన ఏసీడీపీ నిధులను కూడా ఇవ్వలేదని, అవి తీసుకునే అర్హతలు ముఖ్యమంత్రి మీకు కల్పించినా ఎంత వరకు అభివృద్ధి చేశారో తెలుపాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.ఏనాడైనా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చాడా అన్ని అడిగారు. పార్టీలకతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తూ టీడీపీ కార్యకర్తలకు మేలు జరిగేలా చూస్తోంది మీరు కాదా అని అన్నారు.అంతేకాక తమ ఎంపీ నిధుల ద్వారా వస్తున్న లక్షలాది రూపాయల పనులకు పంచాయితీ తీర్మానం ఇవ్వకుండా అడ్డుకుంటోంది మీరు కాదా అని అన్నారు. అభివృద్ధి విషయంలో సీఎంతోనైనా పోరాడేండుకు సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమైతే తేదీని ఖరారు చేయండంటూ సభ సాక్షిగా సవాల్ విసిరారు. సాక్షిపై అక్కసు వెళ్లగక్కిన ఆర్ఆర్ జన్మభూమి గ్రామసభల్లో గత నాలుగు సంవత్సరాలుగా ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాలేదంటూ సాక్షి మీడియా ఎత్తి చూపించడం పట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ కుమార్‌రెడ్డి(ఆర్ఆర్) అక్కసు వెళ్లగక్కారు. జన్మభూమి గ్రామ సభల పేరుతో అధికారులు ప్రభుత్వ పథకాలు వివరించి చేతులు దులుపుకొని పోతున్న విషయం పాలకులకు తెలిసినా ఒక్క సాక్షి మాత్రం ప్రజల దృష్టికి తీసుకొస్తోందని, అలాంటి సాక్షిపై టీడీపీ నాయకుడు అక్కసు వెళ్లగక్కడం దారుణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి,ఎంపీపీ రెడ్డెయ్య,ఎంపీటీసి సభ్యులు సైయ్యద్ అమీర్, రాజేంద్రారెడ్డి, సర్పంచ్ రవి రాజు,తదితరులు పాల్గొన్నారు. -
అనంతపురంలో టీడీపీ నేతల అరాచకం
అనంతపురం: అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. జేసీ బ్రదర్స్ నేమ్ స్టిక్కర్లను వాహనాలకు తగిలించుకొని టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. భాగ్యలక్ష్మి అనే రిటైర్డ్ టీచర్ ఆస్తిపై కన్నేసిన టీడీపీ నేత రమేష్‌రెడ్డి.. ఒంటరిగా ఉంటున్న ఆమెను కిడ్నాప్ చేశాడు. బెదిరించి ఆస్తి రాయించుకోవడంతో పాటు.. ఆమె అకౌంట్ నుంచి రూ. కోటి డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకను గమనించిన రమేష్ రెడ్డి, అతడి అనుచరులు బ్యాంకు వద్ద నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారంలో రమేష్‌రెడ్డి ఉపయోగించిన బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంపై జేసీ బ్రదర్స్ నేమ్ స్టిక్కర్స్ ఉన్నాయి. ప్రస్తుతం భాగ్యలక్ష్మి పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. -
ఓ గుండె వ్యధ..
పూటగడవని స్థితిలో అభాగ్యుడు గుండె మార్పిడికి రూ. 30 లక్షలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు రెండు ఎకరాల పొలం... వరుస కరువులు.. పంట నష్టాలు... ఓ రైతును కుదేలు చేశాయి. కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాడు. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఒక్కొక్కటిగా తీరుతున్నాయి. పిల్లాపాపలతో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి చిన్న చూపు చూసింది. గుండె జబ్బు చేసి ఆస్పత్రుల పాలయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం గుండె మార్పిడి తప్పనిసరి అని తేలింది. రూ. లక్షల వ్యయంతో కూడుకున్న ఈ శస్త్రచికిత్సకు డబ్బు సమకూర్చుకోవడం అతనికి తలకు మించిన భారమైంది. కళ్లముందు కట్టుకున్న భార్య, లోకం తెలియని ఇద్దరు చిన్నారులు కనిపించారు. తాను ఈ లోకం వీడిపోతే వారి పరిస్థితి ఏమిటనేది అతన్ని మరింత కుంగదీసింది. తనకు పునర్జన్మను ప్రసాదించే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. పామిడి మండలం, గజరాంపల్లి గ్రామానికి చెందిన డి.రమేష్‌రెడ్డి.. రెండు ఎకరాల సన్నకారు రైతు. ఇతనికి భార్య రమాదేవి, కుమార్తె డి.హారిక (6వ తరగతి), కుమారుడు లిఖిత్‌రెడ్డి (3వ తరగతి) ఉన్నారు. కుటుంబ పోషణ కోసం వ్యవసాయంపైనే ఆధారపడిన రమేష్‌రెడ్డి.. వరుస కరువులతో అప్పుల పాలయ్యాడు. ఇక పంట సాగుతో లాభం లేదనుకున్న అతను ఐషర్ వాహనం డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కుటుంబం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. మూడేళ్ల క్రితం... మూడేళ్ల క్రితం ఐషర్ వాహనంలో లోడు తీసుకుని బయలుదేరుతుండగా రమేష్‌రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయిస్తే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో చికిత్సలు మొదలు పెట్టించాడు. ఫలితం లేకుండా పోయింది. వైద్యుల సూచన మేరకు కర్నూలులోని వైద్య నిపుణులను సంప్రదించి చికిత్సలు మొదలు పెట్టించాడు. వారాలు.. నెలలు గడుస్తున్నా ఆరోగ్యం మెరుగు పడలేదు. అప్పటికే కుటుంబ పోషణ భారమైంది. ఏనాడూ గడప దాటి ఎరుగని ఇల్లాలు.. చివరకు కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీగా మారారు. అరకొర పనులతో వస్తున్న కూలీ డబ్బుతో కుటుంబ పోషణ భారమైంది. ఉన్న ఇద్దరు పిల్లల్లో అమ్మాయిని పామిడి వద్ద ఉన్న మోడల్ స్కూల్లో చేర్పించారు. కుమారుడిని యాడికిలోని తన అక్కబావ నాగేంద్రమ్మ, సూర్యనారాయణరెడ్డి వద్దకు రమాదేవి వదిలారు. సజావుగా సాగిపోతున్న రమేష్‌రెడ్డి కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధి తీవ్ర కల్లోలాన్ని సష్టించింది. ఆస్తులు అమ్ముకున్నా... తీవ్ర అనారోగ్యంతో బలహీన పడుతున్న రమేష్‌రెడ్డి చివరకు హైదరాబాద్‌లోని కిమ్స్ వైద్యశాలకు చేరుకున్నాడు. అక్కడ పలు రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం అతని గుండె బలహీన పడుతోందని వైద్యులు గుర్తించారు. గుండె మార్పిడి చికిత్స ఒక్కటే మార్గమని అందుకు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని తేల్చి చెప్పారు. ఈ విషయం రైతు కుటుంబాన్ని కుదేలు చేసింది. ఇప్పటికే చికిత్సల కోసం ఉన్న రెండు ఎకరాల పొలాన్ని కూడా అమ్ముకున్నారు. శస్త్రచికిత్స కోసం రూ. 30 లక్షలు సమకూర్చుకోవడం ఆ కుటుంబానికి తలకు మించిన భారమైంది. ప్రస్తుతం రమేష్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. తీవ్ర ఆయాసంతో బాధపడుతూ కనీసం రెండు అడుగులు కూడా వేయలేకపోతున్నాడు. ఓ రేకుల షెడ్లో ఉంటూ భార్య కూలీ పనుల ద్వారా తీసుకువచ్చే అరకొర సొమ్ముతో బతుకునీడుస్తున్నారు. కనీసం మందుల కొనుగోలు చేసేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన శస్త్రచికిత్సకు అవసరమైన సొమ్మును దాతలు సమకూర్చాలంటూ వేడుకుంటున్నాడు. సాయం చేయదలిస్తే... రమేష్‌రెడ్డి, గజరాంపల్లి, పామిడి మండలం బ్యాంక్ ఖాతా నంబర్ ః 04221 001 1080 154 బ్యాంక్ ః ఆంధ్రాబ్యాంక్, పామిడి ఐఎఫ్ఎస్సీ కోడ్–అNఈఆ 0000 422 (ఇంగ్లీష్ అక్షరాలున్నాయి) సెల్ నంబర్ ః 94916 80909 -
పీఈటీ అసోసియేషన్ నూతన కార్యవర్గం
అనంతపురం ఎడ్యుకేషన్ : నవ్యాంధ్ర పీఈటీ అసోసియేషన్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం ఉపాధ్యాయ భవనంలో ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎం. రమేష్‌రెడ్డి, అధ్యక్షుడిగా బి.ప్రసాద్, ప్రధానకార్యదర్శిగా కె. రాజశేఖర్, ఆర్థికకార్యదర్శిగా ఎం. ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా రిజ్వానా, గోవిందప్ప, సంయుక్తకార్యదర్శులుగా ఆర్. లస్కర్‌నాయక్, కళా సుధాకర్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బి. మల్లోబన్న, కృష్ణారెడ్డిని ఎన్నుకున్నారు. ముఖ సలహాదారులుగా ఎం. శేషాద్రి, బి. చంద్రమోహన్, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం. రవీంద్ర, హరుణ్‌బాషాతో పాటు మరో 8 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. -
అవయవదానంపై ఆదర్శ ‘మార్గం’
460 కి.మీ. నడుచుకుంటూ గుంటూరుకు వచ్చిన కడప వాసి గుంటూరు మెడికల్: రమేష్‌రెడ్డి.. అవయవదానం వల్ల ఈ రోజు ప్రాణాలతో ఉన్నాడు. తన లాగా ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని రక్షించడానికి.. ప్రాణాలు పోయిన తరువాత కూడా ‘ఇతరుల్లో’ బతకడానికి అవయవదానం ఎంత అవసరమో తెలియజేయడానికి నడుం బిగించాడు ఈ వైఎస్సార్ జిల్లా వాసి. ప్రజల్లో అవయవదానంపై ఉన్న అపోహలు తొలగించి వారికి అవగాహన కల్పించేందుకు ప్రొద్దుటూరుకు చెందిన కొవ్వూరు రమేష్‌రెడ్డి కాలినడకన తిరుపతి నుంచి బయలుదేరి దారిపొడవునా ప్రతి ఒక్కరికీ అవయవదానంపై అవగాహన కల్పిస్తూ మంగళవారం గుంటూరు వచ్చారు. ఫిబ్రవరి 12న తిరుపతిలో బయలుదేరిన రమేష్‌రెడ్డి 460 కిలోమీటర్ల ‘స్ఫూర్తి మార్గం’ అనంతరం గుంటూరు రావడంతో పలువురు వైద్యులు ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ లివర్ వ్యాధితో బాధపడుతున్న తాను 2003లో లివర్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నానని నేటికి 13 ఏళ్లు గడుస్తున్నా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. 2009లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా జరిగిందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని, ప్రజలు అవయవదానంపై అపోహలు వీడాలని పిలుపునిచ్చారు. సన్మాన కార్యక్రమంలో వేదంత మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతా రామకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ గొంది శివరామకృష్ణ, డాక్టర్ డేగల వాణి తదితరులు పాల్గొన్నారు. -
పోస్ట్‌మ్యాన్ పోరాటం
తెలంగాణ పోరాట నేపథ్యంలో 1969- 72 మధ్య కాలంలో జరిగిన ఓ ప్రేమకథతో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ పోస్ట్‌మ్యాన్’. అజయ్‌కుమార్, వేద జంటగా రమేశ్‌రెడ్డి స్వీయదర్శక త్వంలో నిర్మిస్తున్నారు. సాయిచంద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని న రసింహారెడ్డి ఈ చిత్రం పాటలను ఆవిష్కరించారు. ‘‘కేవలం 50 లక్షల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇప్పటికే ఇంగ్లీషు వెర్షన్‌కు కోటి రూపాయాలకు పైగా బిజినెస్ జరుగుతోంది’’ అని రమేశ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాతలు రఫీ, పులి అమృత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో ప్రొద్దుటూరు డీఐ
ప్రొద్దుటూరు : అభిలాష్ అనే వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ (డీఐ) రమేష్ రెడ్డి బుధవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. దాంతో అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేల్‌కు చెందిన అభిలాష్ అనే వ్యక్తి మెడికల్ షాప్ పెట్టాలని నిర్ణయించాడు. అందుకు అనుమతి కోసం డీఐ రమేష్ రెడ్డిని సంప్రదించారు. అయితే రూ. 20 వేలు లంచం ఇస్తే వెంటనే అనుమతి మంజూరు చేస్తానని రమేష్‌రెడ్డి... అభిలాష్‌కు తెలిపారు. దాంతో అతడు ఏసీబీని ఆశ్రయించి... విషయాన్ని వివరించాడు. దీంతో వల పన్ని బుధవారం డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అభిలాష్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రమేష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. -
‘యాదాద్రి’ అథారిటీ కార్యదర్శిగా రమేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శిగా ఎం. రమేశ్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రమేశ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. -
వైఎస్సార్సీపీ నేతకు బెదిరింపు కాల్స్
ప్రాణ హాని ఉందని ఎస్పీ, డీజీపీ, హోంమంత్రికి రమేష్‌రెడ్డి ఫిర్యాదు తాడిపత్రి : వైఎస్సార్సీపీ యువజన నాయకుడు, తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ రమేష్‌రెడ్డికి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఆయన పోలీసులను ఆశ్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. గత సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఇటీవల పార్టీలో క్రియశీలకంగా పని చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతల దృష్టి రమేష్‌రెడ్డిపై పడ్డంతో ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత 20 రోజుల క్రితం కూడా ఆయన ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాక్కోని ఉండటాన్ని గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు వచ్చే లోపే దుండగులు పారిపోయారని స్థానికులు పోలీసులకు తెలిపారు. అత్యంత సమస్యాత్మక మైన తాడిపత్రి ప్రాంతంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రమేష్‌రెడ్డికి చెందిన కళాశాల, ఆస్తుల విషయంలో అధికార పార్టీ నేతలు స్వయంగా కరపత్రాలను పంచి దుష్ర్పచారం చేశారు. అలాగే వారం క్రితం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, దీంతో తనకు ప్రాణహాని ఉందని రమేష్‌రెడ్డి జిల్లా ఎస్పీ, డీజీపీ, హోంశాఖ మంత్రిని కలిసి వివరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ లిస్టు ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
తాడిపత్రిలో ఉద్రికత్త
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జేసీ దివాకరరెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేశ్ రెడ్డి బహిరంగం చర్చ నిర్వహించారు. జేసీ సోదరుల అరాచకాలపై ధ్వజమెత్తారు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన జేసీ కుటుంబం ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. -
బూచమ్మ బూచోడు మూవీ స్టిల్స్
-
‘ఉపాధి’లో అక్రమాల వెల్లువ
కోటపల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ఏడోవిడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉపాధి సిబ్బంది అక్రమాలు బయటపడ్డాయి. ఆరు నెలల్లో చేపట్టిన రూ.1.22 కోట్ల విలువైన పనులపై సామాజిక తనిఖీ బృందాలు చేసిన తనిఖీ వివరాలు వెల్లడించాయి. ప్రజావేదికకు అడిషనల్ పీడీ గణేష్‌జాదవ్, విజిలెన్స్ మేనేజర్ రమేష్‌రెడ్డి, అడిషనల్ పీడీ అంజయ్య, ఏపీడీలు సురేష్, అనిల్‌చౌహాన్ హాజరయ్యారు. స్థానిక ఎస్సార్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీ బృందం వివరాలు వెల్లడించింది. షట్పల్లి క్షేత్రసహాయకుడు రాజబాపు మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడ్డాడ ని వెల్లడి కావడంతో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏపీడీ చెప్పారు. లబ్ధిదారులకు తెలియకుండా బినామీ పేర్లతో డబ్బులు స్వాహా చేశాడని పేర్కొన్నారు. ఆయన నుంచి రూ.90 వేలు రికవరీ చేయనున్నట్లు వివరించారు. కొండంపేట గ్రామపంచాయతీలో రూ.20 వేల నిధులు దుర్వినియోగమయ్యాయని, రికవరీకి ఆదేశాలిచ్చామని తెలిపారు. రికార్డుల నిర్వహణ సరిగా లేనందుకు 12 మంది ఎఫ్‌ఏలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించామన్నారు. వీటితోపాటు పింఛన్ల పంపిణీలో అక్రమాలు బయటపడగా నిధుల రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించిన తనిఖీ వివరాలను డీఆర్పీలు చదివి వినిపించారు. ప్రజావేదికలో ఎంపీడీవో శంకరమ్మ, ఏపీవోలు వెంకటేశ్వర్లు, రామ్మోహన్, ఏపీఎం ఉమారాణి, సర్పంచులు దుర్గం మహేష్, విద్యాసాగర్‌గౌడ్, వెంకటస్వామి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీలో ఇంటిపోరు
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరుకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడి నేతలు నిత్యం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుంటారు. ఇక్కడి రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి. అందుకే జిల్లా కేంద్రమైన నెల్లూరు సిటీ నియోజకవ ర్గంపై అందరి దృష్టి పడింది. ఇది టీడీపీలో ఇంటిపోరుకు దారితీసింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పలువురు నేతలు భావిస్తుండటంతో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. 2009 ఎన్నికల్లో బాలకృష్ణ సహకారంతో టికెట్ తెచ్చుకుని పోటీచేసిన తాళ్లపాక రమేష్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. అనంతరం ఆ పార్టీలో నిస్తేజం ఆవహించింది. అడపాదడపా మొక్కుబడిగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించినా, కాంగ్రెస్ వ్యతిరేకంగా పెద్దగా ఉద్యమించిన దాఖలాలు లేవు. కొంతకాలంగా టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురె డ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ సేవాసమితి పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్న ఆయన టికెట్ విషయంలో తనకు బాలకృష్ణ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. రమేష్‌రెడ్డి సైతం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన రాకను కోటంరెడ్డి, రమేష్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీనే నమ్ముకుని ఉన్న తమను కాదని మరోపార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయడం తగదని వాదిస్తున్నారు. ఇది పార్టీ కేడర్‌కు ప్రతికూల సంకేతాలు వెళ్లే పరిస్థితికి దారితీస్తుందని ఇప్పటికే చంద్రబాబు దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే కోటంరెడ్డి, రమేష్‌రెడ్డిని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అంచెల వాణిని రంగంలో దింపాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కౌన్సిలర్, కార్పొరేటర్‌గా పనిచేసిన అంచెల వాణి ఇప్పటికే చంద్రబాబును కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మేయర్ భానుశ్రీ పోటీ చేసే అవకాశం ఉన్నందున, బీసీ మహిళనే బరిలో నిలపాలని ఆమె కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమిరెడ్డి సైతం ఇదే సమీకరణాలను అధినేతకు వివరించినట్లు తెలిసింది. వాణికి నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణతో బంధుత్వం ఉంది. ఆయన అండ కూడా తోడవడంతో వాణి అభ్యర్థిత్వం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి రమేష్‌రెడ్డి, కోటంరెడ్డిని సోమిరెడ్డి విభే దిస్తూ వస్తున్నారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలోనే ఆయన మధ్యేమార్గంగా అంచెల వాణిని ప్రతిపాదిస్తూ వ్యూహం పన్నినట్లు సమాచారం. బీద రవిచంద్ర సైతం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తోంది. అంచెల వాణి సామాజిక వర్గం ఓటర్లు నెల్లూరులో అధికంగా ఉండడం, టీడీపీ ముఖ్య నేతలతో పాటు నారాయణ మద్దతు నేపథ్యంలో ఆమెకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. బాలకృష్ణ భరోసాతో టికెట్ తనదేనన్న ధీమా కోటంరెడ్డిలో కనిపిస్తోంది. ముఖ్య నేతల మద్దతు లేకపోవడం ఆయనకు మైనస్. అంచెల వాణి అభ్యర్థి అయితే రమేష్‌రెడ్డి, కోటంరెడ్డికి కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఉంది. మొత్తంగా నగరంలో టికెట్ గొడవ టీడీపీలో కుమ్ములాటలను పతాకస్థాయికి తీసుకెళ్లింది. -
రగిలిన పగ..!
మన్నాపూర్(మద్దూరు), న్యూస్‌లైన్: ప్రతీకారం ఎంతటి దారుణానికైనా వెనుకాడబోదు. ద్వేషభావం మనిషిలో మానవత్వాన్ని మంట కలుపుతుంది. ఆధిపత్య పోరు అనర్థాలకు దారితీస్తుంది. మద్దూరు మండలం మన్నాపూర్‌లో ఇదే జరిగింది. గ్రామ ప్రథమ పౌరురాలు మాణిక్యమ్మ (60) హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న మాణిక్యమ్మకు గ్రామంలో మంచి పేరుంది. దీంతో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఆమెకు మద్దతు నిచ్చారు. ఆయా పని మానుకోని ఆమె ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన పోరులో ఆమె తన సమీప ప్రత్యర్థి సులోచనమ్మపై 36 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో అప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు దాడులు చేయడం మొదలు పెట్టారని హతురాలి భర్త వెంకట్‌రెడ్డి తెలిపారు. నెలరోజుల వ్యవధిలోనే తన భార్యను అంతమొందించేందుకు అనేక వ్యూహాలు పన్నారని, ఇందులో భాగంగా కల్లులో పురుగుల మందు కలిపారని చెప్పారు. గమనించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. ఇదిలా ఉండగా కక్షలతో గ్రామంలో శాంతికి విఘాతం కలుగుతుందని గ్రామ పెద్దలు ఇరువర్గాలతో రాజీ కుదిర్చారు. కలిసి మెలిసి ఉండాలని వారికి హిత బోధ చేశారు. అయితే మాణిక్యమ్మపై దాడులు ఆగలేదు. కొందరు మహిళలు ఆమెపై దాడి చేశారు. బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లివస్తున్న ఆమెపై ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామ సమీపంలోని ఊరకుంట కట్ట వద్ద ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకున్నారు. గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనలు మొదలయ్యాయి. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదంతా ప్రత్యర్థుల పనేనని హతురాలి భర్త ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు. నేడు మండల బంద్ మన్నాపూర్ సర్పంచ్ మాణిక్యమ్మను దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా మండల బంద్‌కు టీడీపీ మండల శాఖ పిలుపు నిచ్చింది. గ్రామంలోని ప్రత్యర్థులే ఈ హత్య చేశారని మండల టీడీపీ అధ్యక్షుడు శివరాజ్, టీడీపీ నాయకులు వీరేష్‌గౌడ్, నర్సింహ, రమేష్‌రెడ్డి ఆరోపించారు. నిందుతులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. -
కాంట్రాక్టు పనులిస్తాం రండహో..!
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏం సుబ్బాడ్డీ యాడికి పోతాండావ్.. రమేశన్న కాడికిపో చెక్ డ్యాం కావాలని ఆర్జీ ఈపో... సీఎం వచ్చాండాడు చేయిచ్చాడు... ఓ రామిరెడ్డన్న ఈమధ్య కన్పించడం లేదే... అటుమన్నాడు రచ్చబండ పెడ్తాండారు కదా... ఏదన్నా పని చూసుకోపో.. చేయిచ్చారు. ఎంతకాలమని ఊరికే తిరుగుతాంటావ్...హలో లక్ష్యుమయ్యా! మీ ఊర్లో చెరువు కట్ట తెగిపోయిందంటా కదా... ఊర్లో జనంతో సంతకాలు చేయించుకోనిరా..సీఎంకు చెప్పి పనిచేయిస్తాం...అదేందన్నా మేమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదా...పార్టీలతో పనేముంది లక్షుమయ్య నువ్వు నాచేతికి ఆర్జీ తెచ్చియ్యి... ఆపని నీకు మంజూరయ్యేలా చూసుకునే బాధ్యత నాది’..ఇటీవల కాలంలో రాయచోటి నియోజకవర్గంలో నిత్యం చోటుచేసుకుంటున్న సంభాషణ ఇది. నియోజకవర్గ నాయకులు మొదలుకొని వారి అనుచరుల దాకా గ్రామస్థాయి నాయకులతో ప్రతిరోజు ఇలా మాట్లాడటం దినచర్యగా మారింది. ప్రస్తుతం ఈ పరిణామం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈనెల 25న సోమవారం రాయచోటిలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని వర్గ సమీకరణ చేసేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి ఇరువురు ఎవరికివారు తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ఊవ్విళ్లూరుతున్నారు. ముఖ్యమంత్రి తమ నాయకున్నే రచ్చబండ సభ నిర్వహణ ఏర్పాట్లను చూడమన్నారు, మీకేం కావాలో ముందే చెప్పండి. ప్రతిపాదనల్లో ఆ పనులు చేర్చుతారంటూ ముందుగా మాజీ ఎమ్మెల్యే రమేష్ అనుచరులు తెరపైకి వచ్చారు. ఈ పరిణామంతో తాము వెనుకబడి పోతామని భావించిన రాంప్రసాద్ అనుచరులు కూడా ఎవ్వరికి ఏం కావాలో చెప్పండంటూ పనులు రూపొందించే ప్రక్రియలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఒకరిపై మరొకరు ఫిర్యాదులు సైతం చేసుకోవడం తెలిసిందే. మునిసిపాలిటీకే రూ.4కోట్లతో ప్రతిపాదనలు.. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి ఒక్క రాయచోటి మున్సిపాలిటికే వివిధ పనుల నిమిత్తం రూ.4 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. రిటైర్డు ఇంజనీర్లచే పనులు రూపొందిస్తూ ఎవ్వరికి వారు విడివిడిగా జాబితాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మండలాల వారిగా ఎవ్వరి కోర్కెల జాబితాను వారు తయారుచేస్తున్నట్లు సమాచారం. గ్రామస్థాయి నాయకుల విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని మరీ తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా చెరువుల మరమ్మతులు, చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేసినట్లు సమాచారం. ఇలా ఇరువురి నాయకుల కోర్కెలు తీర్చాలంటే సుమారు రూ.25కోట్లు వెచ్చించాల్సి వస్తోందని సమాచారం. ప్రతిపాదనలు పంపే పనులు మంజూరైనా, కాకపోయినా ముందుజాగ్రత్తగా రిజర్వు చేసుకోవడమే మంచిదనే ఉద్దేశంలో నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ సమీకరణలో భాగంగానే... రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజకీయ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎవ్వరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి పర్యటనను సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీ పడుతున్నట్లు స్పష్టమవుతోంది. రచ్చబండలో పనులు చేజిక్కినా, చేజిక్కక పోయినా ‘మేము మీకు, మీ గ్రామానికి అవసరమైన పనులు చేయించాలనుకున్నాం’, అని చెప్పుకునేందుకు ఆరాట పడుతున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టులు దక్కితే మా సిఫార్సు వల్లేనని, దక్కకపోతే ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు యోగ్యంగా ఉంటుందని ఎవరి ఎత్తుగడల్లో వారు ఉన్నట్లు సమాచారం. గతంలో ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాయచోటికి ఇండోర్ స్టేడియం ఏర్పాటు, రోడ్డు విస్తరణ పనులకు హామీ ఇచ్చారు. దానిని అమలు చేయడంలో స్థానిక నాయకులు కానీ, సీఎం కానీ ఏమాత్రం చొరవ చూపలేదన్న విషయం జగమెరిగిన సత్యం. అయినప్పటికీ ఇరువురు నాయకులు కూడా భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకొని సరికొత్త జాబితా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇరువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడేందుకే సుముఖంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే చురుగ్గా పావులు కదుపుతూనే అధికారంలో ఉండగా పనులు చక్కబెట్టుకోవాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకే కాంట్రాక్టు పనుల పేరుతో గ్రామస్థాయి నాయకులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని పలువురు పేర్కొంటున్నారు. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా కూడా గ్రామీణులను ప్రోత్సహించడం వెనుక అసలు కారణం ఇదేనని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఎస్పీ, ఏఎస్పీ బదిలీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా నూతన ఎస్పీగా మస్తీపురం రమేష్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. జిల్లా ఎస్పీగా పనిచేస్తోన్న ఎస్.శ్యాంసుందర్‌పై బదిలీ వేటు పడింది. ఏఎస్పీ(పరిపాలన) నవదీప్ సింగ్‌ను కూడా బదిలీ చేయడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు జిల్లా ఎస్పీగా ఎస్.శ్యాంసుందర్‌ను నియమిస్తూ జూలై 11న సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. మూడున్నర నెలలు తిరగక ముందే ఆయనపై బదిలీ వేటు పడటం గమనార్హం. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎస్పీ శ్యాంసుందర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. ఇటీవల సీఎం కిరణ్‌పై మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఆరోపణలు చేసిన సందర్భంలోనూ శ్యాంసుందర్ పేరును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు పడుతుందనే ఊహాగానాలు ఈ నెల ఎనిమిది నుంచి విన్పిస్తున్నాయి. అవి ఆదివారం వాస్తవరూపం దాల్చాయి. ఇక ఎస్పీ శ్యాంసుందర్ కన్నా పక్షం రోజులు ముందు ఏఎస్పీగా నియమితులైన నవదీప్‌సింగ్‌పై కూడా సర్కారు బదిలీ వేటు వేసింది. ఈయనను మల్కాజిగిరి డీసీపీగా నియమించింది. ఏఎస్పీగా నియమితులైన నాలుగు నెలల్లోగానే నవదీప్‌సింగ్‌ను బదిలీ చేయడం గమనార్హం. ఐపీఎస్ అధికారులను ఒక పోస్టులో నియమించాక కనీసం రెండేళ్లపాటు బదిలీ చేయకూడదన్నది నిబంధన. దాన్ని ఉల్లంఘించి ఎస్పీ, ఏఎస్పీలపై బదిలీవేటు వేయడం గమనార్హం. శ్యాంసుందర్ స్థానంలో కొత్త ఎస్పీగా నియమితులైన ఎం.రమేష్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మస్తీపురం గ్రామానికి చెందిన వారు. 1996 గ్రూప్-1 బ్యాచ్‌కు చెందిన ఈయన.. డీఎస్పీగా పోలీస్ శాఖలో ప్రవేశించారు. అప్పాలో పని చేసిన ఈయన 2001లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. రామగుండం, వరంగల్‌లో ఓఎస్డీగాను, 2004 నుంచి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. 2009లో ఇంటెలిజెన్స్ ఎస్పీగా చేరిన ఆయన అదే ఏడాది డిసెంబర్లో అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) జాయింట్ డెరైక్టర్(తెలంగాణ రీజియన్)గానూ విధులు నిర్వర్తించారు. 2011లో ఐపీఎస్ హోదా పొందారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆ జిల్లాలో 18 నెలల పాటు సేవలందించారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే రమేష్‌రెడ్డికి నిజాయితీ అధికారిగా పేరుంది. ఆయన బుధవారం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పోలీసువర్గాలు వెల్లడించాయి. -
మొహం చాటేసిన ‘మార్క్‌ఫెడ్’
జడ్చర్ల, న్యూస్‌లైన్: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు, పాలకవర్గం కనిపించకుండాపోయింది. కొనుగోళ్లపై మార్క్‌ఫెడ్ మోహం చాటేయడంతో ప్రభుత్వ మద్దతుధరలు దక్కుతాయని ఆశించిన రైతుకు భంగపాటు ఎదురైంది. వారంరోజలుగా మార్కెట్‌యార్డుకు బంద్ ప్రకటించి కొనుగోళ్లు నిలిపేయగా, గురువారం మార్కెట్లో క్రయవిక్రయాలను ఊపందుకున్నాయి. దీంతో రెండురోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా మొక్కజొన్న విక్రయానికి తరలొచ్చింది. అంతేగాక మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ప్రారంభమవుతుందని స్వయంగా మార్కెట్ కమిటీ చెర్మైన్ రమేశ్‌రెడ్డి ప్రకటించడంతో మద్దతు ధరలు దక్కుతాయన్న ఆశతో రైతులు ఇక్కడికి వేలకొద్దీ బస్తాల మొక్కజొన్నను తీసుకొచ్చారు. గురువారం 21,380 బస్తాలు, శుక్రవారం మరో 26,350 బస్తాలు మార్కెట్‌కు విక్రయానికి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. అయితే క్వింటాలుకు గరిష్టంగా రూ.1233, కనిష్టంగా రూ.1000 ధరలు పలికినట్లు వారు పేర్కొన్నారు. ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు అసంతృప్తితోనే వెనుదిరగాల్సి వచ్చింది. గురువారమే మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న అధికారులు శుక్రవారం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో తాము ఎంతో ఆశపడి మొక్కజొన్నను మార్కెట్‌కు తీసుకొచ్చామని, తీరా మార్క్‌ఫెడ్ జాడేలేదని అన్నదాతలు పెదవివిరిచారు. వారం రోజులుగా మొక్కజొన్నను ఎండబెట్టినా మద్దతుధరలు దక్కకపోవడం శోచనీయం. ఇకనైనా అధికారులు, పాలకులు స్పందించి మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మద్దతు ధరలు దక్కేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయోమయంలో పత్తి రైతు అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అనే చందంగా మారింది పత్తిరైతు పరిస్థితి. సాగు ప్రారంభంతో విత్తనాలు, ఎరువులు..ఆ తరువాత తెగుళ్ల బెడద.. తీరా పంటకొచ్చే సమయంలో ఆశించిన ధరలు లేకపోవడంతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో పత్తి క్వింటాలుకు కనీసంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలైనా దక్కే నా? అని కలవరం మొ దలైంది. జిల్లాలో ఈ ఏ డాది 1.84లక్షల హెక్టార్లలో పత్తి పంటను సాగుచేశారు. ఎకరా సాగుకు విత్తనాలు,ఎరువులు, పు రుగు మందులు, కూలీ ల ఖర్చులు కలిపి ఒక్కో ఎకరాపై రూ.20వేల వరకు వెచ్చించారు. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు రావాల్సి ఉండగా, కనీసం ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్లకు మించి దిగుబడిరావడం లేదు. ఇదిలాఉండగా పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర తక్కువగానే ఉంది. గతేడాది ధరలతో పోల్చితే ఈ ఏడాది పత్తి క్వింటాలుకు ప్రభుత్వం పెంచిన మద్దతుధర కేవలం రూ.100 మాత్రమే ఉంది. దీంతో గరిష్ట మద్దతుధరగా రూ.4000, కనిష్టంగా రూ.3800 పలుకుతుంది. జిల్లాలో పేరుగాంచిన బాదేపల్లి పత్తి మార్కెట్లో ఈనెల 23వ తేదీ నుంచి పత్తి క్రయవిక్రయాలు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది బాదేపల్లి మార్కెట్లో 2.10 లక్షల క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరిగాయి. ఇదే మార్కెట్ పరిధిలో నాఫెడ్ ద్వారా 1.50లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఈ మార్కెట్ పరిధిలో సుమారు రూ.136కోట్ల పత్తివ్యాపారం జరిగింది. దళారుల రంగప్రవేశం పత్తి కొనుగోళ్లకు సంబంధించి మధ్య దళారులు అప్పుడే రంగప్రవేశం చేశారు. గ్రామాల్లో తక్కువ ధరకు కొనుగోళ్లు చేసేందుకు ఇప్పటికే రైతులకు కొంత నగదు ముట్టజెప్తున్నారు. రైతుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు రైతుల నుంచి నాణ్యత గల పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటికే వందలారీలకు పైగా పత్తిని కొనుగోలుచేశారు. ఇదిలాఉండగా తూకాల్లో మోసాలకు పాల్పడుతూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ప్రభుత్వ రంగసంస్థలైన సీసీఐ, నాఫెడ్ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే జిల్లాలో షాద్‌నగర్ మినహా ఎక్కడా సీసీఐ కొనుగోలు కేంద్రం లేదు. గతేడాది జడ్చర్లలో మాత్రం నాఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రభుత్వ మద్దతుధరలకు కొనుగోళ్లు జరిపారు.