
మతిస్థిమితం లేని వ్యక్తిని పలకరిస్తున్న ఎస్పీ (ఫైల్)
తిరుపతి :తిరుపతి అర్బన్ ఎస్పీ తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనకు హోదా అవసరం లేదు. మన, తన అన్న భేదం లేదు. ఉన్నది ఒక్కటే. అదే సేవాతత్వం. అదే ఆయన అభిమతం. ఆధ్యాత్మిక నగరంలో నా అన్నవారు లేని ఓ అభాగ్యుడు యాచక వృత్తి సాగిస్తూ ఫుట్‌పాత్‌పై బతుకు సాగించేవాడు. తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయం ఎదుటే పడుకునేవాడు. నిత్యం ఆ దారిన ఎంతో మంది తిరుగుతున్నా పట్టించుకునే వారే కాదు. అతని దుస్థితిని చూసి తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి హోదాను సైతం పక్కనపెట్టేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యాచకుడిని పలకరించారు. సాదకబాధకాలు తెలుసుకున్నారు. అతన్ని మామూలు మనిషిని చేయాలని సంకల్పించారు. వెస్ట్ సీఐ నేతృత్వంలో అతనికి జుట్టు కత్తిరించి, కొత్తబట్టలు వేసి, భోజనం పెట్టి ఆశ్రమంలో చేర్పించారు. ప్రతి ఒక్కరూ ఒకపూట అనాథలకు భోజనం పెట్టాలని కోరారు. ఆ మేరకు పోలీసులు ఎస్పీ బాటలో పయనిస్తున్నారు.
మతిస్థిమితం లేని వ్యక్తి ముందు, ఇప్పుడు
Comments
Please login to add a commentAdd a comment