సాక్షి, హైదరాబాద్: యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యదర్శిగా ఎం. రమేశ్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రమేశ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.