
సాక్షి, తిరుమల : తిరుమలలో ఎస్పీ రమేష్‌రెడ్డి తనిఖీలు నిర్వహించారు. క్యూలైన్లు, శ్రీవారి ఆలయం, దుకాణ సముదాయాలు, లడ్డూ కౌంటర్లను పరిశీలించారు. దర్శన క్యూలైన్లలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. (సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు)
ప్రసాద విక్రయ కేంద్రాలు, దుకాణ సముదాయాల వద్ద మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రమేష్ రెడ్డి అన్నారు. ఆలయంలో ఆర్చకులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.(నాడు-నేడు దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది..)
లాక్‌డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరిగి పునఃప్రారంభించనున్న విషయం తెలిసిందే. మొదట ప్రయోగాత్మక పరిశీలన కింద ట్రయల్ రన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతిచ్చింది. టీటీడీ ఆలయ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వినతి మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ అనుమతి తెలియజేస్తూ మంగళవారం మెమో ఉత్తర్వులు జారీచేశారు. భౌతికదూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లుచేయాలని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో మూడ్రోజులపాటు ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ పద్ధతిలో దర్శనాలను టీటీడీ ప్రారంభించనుంది. ఈ ట్రయల్ రన్ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ కూడా సమ్మతి తెలియజేసినట్లు జేఎస్వీ ప్రసాద్ ఆ మెమోలో తెలిపారు. అనంతరం 10 లేదా 11 నుంచి సాధారణ భక్తులను అనుమతించే అవకాశముంది. (తిరుమల శ్రీవారి దర్శనానికి 8 నుంచి ట్రయల్ రన్)
Comments
Please login to add a commentAdd a comment