
తిరుమల: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు శనివారం కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల చాలా మంది టీటీడీ ఉద్యోగులు మరణించినట్లు తెలిపారు. ఇక టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకుడు చీర్ల కిరణ్ మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగులు ఆనందయ్య మందు కాలాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆనందయ్య మందును టీటీడీ ఉద్యోగులకు, రిటైర్డ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. టీటీడీ ఉద్యోగుల తరపున ఆనందయ్యకు చీర్ల కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: రైతుకు జరిమానా.. కట్టకపోతే బహిష్కరణ.. ఏం జరిగిందంటే?