krishnapatnam
-
కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
-
కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్‌వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే, నాగ్‌పూర్–విజయవాడ కారిడార్‌వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని.. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించామని ఆయన చెప్పారు. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీ ఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు.. ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయని ఆయన వివరించారు. ఇక దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని.. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. పాలమూరు పర్యటనకు ఆదివారం వచ్చిన మోదీ.. తెలంగాణ రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. మరోవైపు.. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నామని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ఇక రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుటుంబం కోసమే అన్నట్లుగా వాటి తీరు ఉందని పరోక్షంగా విమర్శించారు. అలాగే, రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు కేవలం అవినీతి కోసమే అన్నట్లుగా ఉన్నాయని.. తప్పుడు హామీలతో రైతులను మోసగిస్తున్నారని మోదీ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
అద్భుతంగా రూపుదిద్దుకున్న ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్
సాక్షి ప్రతినిధి కడప: రాయలసీమ–కోస్తా జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ పెరిగేందుకు అరుదైన రైల్వే మార్గం..ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద టన్నెల్ ఏర్పాటు చేసి దీనిని నిర్మించారు. న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్‌తో సాంకేతిక పనులు పూర్తి చేశారు. వెలుగొండ అడవుల్లో 7.560 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌ను ఈ మార్గం కోసం ఏర్పాటు చేశారు. దీంతో ఓబులవారిపల్లె–కృష్ణపట్నం మార్గంలో గూడ్స్ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అద్భుతమైన ఈ లైన్లో ప్రయాణికుల కోసం రైళ్లు నడిపితే విజయవాడ, విశాఖపట్నం తదితర కోస్తా జిల్లాలకు కనెక్టివిటీ బాగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి అందాల నడుమ కాశ్మీర్ తరహాలో ఏర్పాటు చేసిన ఈ మార్గం గుండా ప్రయాణం మరుపురాని అనుభూతినిస్తుంది. ఎగుమతుల కోసం.. ఈ రైలు మార్గాన్ని ఎస్ఆర్ఎస్పీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు నుంచి పలు రకాలైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఏర్పాటు చేశారు. ఏపీఎండీసీ పరిధిలో మంగంపేట నుంచి బైరెటీస్, బళ్లారి నుంచి ఐరన్ ఓర్ కూడా ఇదే మార్గంలో వెళుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో నూతనంగా ఈ మార్గంలో 35 కిలోమీటర్లు, నెల్లూరుజిల్లాలో 58 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ నడుమ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మంగంపేట, నేతివారిపల్లె, చెర్లోపల్లె రైల్వేస్టేషన్లుండగా..నెల్లూరు జిల్లాలో ఎనిమిది స్టేషన్ల ద్వారా గూడ్స్ రైళ్లు కృష్ణపట్నం చేరుకుంటున్నాయి. రూ.470 కోట్లతో టన్నెల్.. ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వే లైన్ ఏర్పాటుకు 7.56 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటు చేశారు. న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్‌తో సాంకేతికపనులు చేపట్టారు. స్కాట్లాండ్ మిషనరీతో నిర్మించారు. పెనుశిల అభయారణ్యం కొండల్లో ఈ నిర్మాణం జరిగింది. 2006లో అప్పటి రైల్వేశాఖ మంత్రి నితీశ్‌కుమార్ రైల్వేలైన్‌కు పచ్చ జెండా ఊపారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చొరవ కారణంగా సకాలంలో భూసేకరణ, పర్యావరణ అనుమతులు లభించాయి. రూ.1646 కోట్లతో ఈమార్గం రూపుదిద్దుకుంది. రెండు గుహల మధ్య పచ్చని లోగిళ్లలో రైల్వే లైన్ వెళుతుంది. చుట్టూ కొండలు, పెనుశిల అభయారణ్యం మధ్యన టన్నెల్లో రైల్వే ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైల్వే మార్గాన్ని ఉప రాష్ట్రపతి హోదాలో 2019 సెప్టెంబర్, 1వ తేదీన ఎం.వెంకయ్యనాయుడు జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి కృష్ణపట్నం పోర్టుకు గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగుతున్నాయి. కనెక్టివిటీకి సులువు కడప–విజయవాడ మధ్య రైల్వే రాకపోకలు చాలా అరుదుగా ఉన్నాయి. కడప నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్(కడప–విశాఖపట్నం).. యర్రగుంట్ల, ప్రొద్దుటూరుల నుంచి ధర్మవరం–విజయవాడ రైళ్ల ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంది. లేకపోతే తిరుపతి, రేణిగుంటల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే నేరుగా కడప నుంచి విజయవాడకు ప్రత్యేకించి రైళ్లు లేవు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి నిత్యం వేలాది మంది విజయవాడకు వెళ్తున్నారు. ప్రత్యేకించి అక్కడి ప్రాంతాల్లోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఇక్కడి విద్యార్థులు దాదాపు 20వేల మంది వరకు విద్యను అభ్యసిస్తున్నారు. పేరెంట్స్ రాకపోకలు సాగించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. కడప, రాజంపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వెళ్లేందుకు ఈ మార్గం సులభతరంగా ఉంటుందని రైల్వే నిపుణులు వివరిస్తున్నారు. ఎంతో ఉపయోగకరం ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వే మార్గం గుండా రైళ్ల రాకపోకలు నిర్వహిస్తే ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు ఎంతో ఉపయోగకరం. రైల్వే బోర్డు దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాం. – తల్లం భరత్‌కుమార్‌రెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ పంట ఉత్పత్తులు రవాణా చేసుకోవచ్చు ఈ రైలు మార్గం గుండా రాక పోకలు నిర్వహిస్తే ప్రయాణికులకు వెసులుబాటు లభి స్తుంది. నిత్యం వేలాది మంది విజయవాడకు ప్రయాణాలు సాగిస్తున్నారు. పంట ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవడానికి ఉపయో గకరమే. – శంకర్‌రెడ్డి, నాగవరం, చిట్వేలి -
క్రిస్ సిటీ తొలి దశలో 78,900 మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యాధునిక వసతులతో కూడిన భారీ పారిశ్రామిక నగరం అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఈ పారిశ్రామిక నగరాన్ని మూడు దశల్లో నిరి్మస్తోంది. ఇందులో తొలి దశ అభివృద్ధికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కృష్ణపట్నం నోడ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (నిక్‌డిక్ట్) ఏపీఐఐసీతో కలిసి నిక్‌డిక్ట్ కృష్ణపట్నం ఇండ్రస్టియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ (క్రిస్ సిటీ) పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. క్రిస్ సిటీలో భారీ పరిశ్రమలతో పాటు వాక్ టు వర్క్ విధానంలో అక్కడే నివాసముండేలా ఓ నగరాన్ని కూడా నిరి్మస్తుంది. పరిశ్రమలకు, నివాస ప్రాంతానికి కూడా అత్యాధునిక వసతులు సమకూరుస్తుంది. మొత్తం 10,834.5 ఎకరాల విస్తీర్ణంలో క్రిస్ సిటీ ఏర్పాటవుతుంది. తొలి దశలో రూ.1,503.16 కోట్లతో సుమారు 2,500 ఎకరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచి్చంది. ఈపీసీ విధానంలో క్రిస్ సిటీలో కీలక మౌలిక వసతుల కల్పనకు రూ.1,021.41 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ త్వరలో టెండర్లు పిలవనుంది. 2022–23 ఎస్‌వోఆర్ ధరల ప్రకారం టెండర్లను పిలుస్తున్నట్లు ఏపీఐఐసీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ టెండర్లను న్యాయ పరిశీలన కోసం జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపినట్లు చెప్పారు. కాంట్రాక్టు పొందిన సంస్థ ఇక్కడ రహదారులు, విద్యుత్, నీరు, మురుగు నీరు, వరద నీరు నిర్వహణ, శుద్ధి, పరిశ్రమల వ్యర్థాలు, నివాస వ్యర్థాల శుద్ధి వంటి కనీస మౌలిక వసతులు అభివృద్ధి చేసి వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ టెండర్లపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే జ్యుడిషియల్ ప్రివ్యూకు తెలియజేయాలని ఏపీఐఐసీ పేర్కొంది. వాక్ టు వర్క్ విధానంలో అభివృద్ధి పనిచేసే చోటే నివాసం ఉండేలా అత్యంత పర్యావరణ అనుకూల పారిశ్రామిక నగరంగా క్రిస్ సిటీని నిర్మిస్తున్నారు. తొలి దశలో అభివృద్ధి చేసే 2,500 ఎకరాల్లో రహదారులు వంటి వసతులకు సుమారు 494 ఎకరాలు పోగా 2,006 ఎకరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో 872.7 ఎకరాలు పారిశ్రామిక అవసరాల కోసం, మిగిలిన ప్రాంతాన్ని నివాసానికి అవసరమైన మౌలిక వసతుల కోసం వినియోగిస్తారు. తొలి దశ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 78,900 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇందులో సుమారు 77,300 మంది ఇక్కడే నివాసముంటూ పనిచేస్తారని, దీనికి అనుగుణంగా 21,870 కుటుంబాలు నివాసం ఉండేలా గృహ సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, స్కూల్స్, హాస్పిటల్స్, రవాణా వంటి కీలక మౌలిక వసతులను కలి్పంచనున్నారు. 36 నెలల్లో తొలి దశ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మూడు దశలు పూర్తయితే ఒక్క క్రిస్ సిటీనే 4,67,800 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆ నగరంలో 2,91,000 మంది నివాసముంటారని ఏపీఐఐసీ అంచనా వేస్తోంది. -
కృష్ణపట్నంలో మినీ హార్బర్
ఆటుపోట్ల మధ్య జీవనం సాగించే కడలి పుత్రులు ప్రాణాలను పణంగా పెట్టి ఎగసి పడే అలలను దాటుకుని సముద్రంలో వేట సాగిస్తేనే కడుపులు నిండుతుంది. ప్రకృతి విపత్తులు, వేట నిషేధిత కాలంలో రోజుల తరబడి వాటిని భద్రపరుచుకోవడం తలకు మించిన భారంగా మారింది. దీంతో పాటు వేట సమయంలో రోజుల తరబడి సముద్రంలో రెక్కలు ముక్కలు చేసుకుని మత్స్య సంపదను ఒడ్డుకు చేర్చినా నిల్వ చేసుకునే పరిస్థితులు లేక దళారులకు తెగనమ్ముకునే పరిస్థితి నెలకొంది. ఈ దయనీయ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కృష్ణపట్నం తీర మండలాల మత్స్యకారులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఇప్పటికే సుమారు రూ.288 కోట్లతో జిల్లాలో జువ్వలదిన్నె వద్ద భారీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉంది. తాజాగా కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తెరపైకి వచ్చింది. ఈ దిశగా అధికారులు పరిశీలన చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లా పరిధిలోని ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. 14 ఏళ్ల క్రితం కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందు ఇక్కడి జెట్టీల కేంద్రంగా మత్స్యకారులు సముద్రంలో చేపలవేట చేపట్టారు. వలలకు చిక్కిన మత్స్య సంపదను ఆరబెట్టుకోవడం, నిల్వ చేసుకోవడం ద్వారా వందల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందారు. కృష్ణపట్నం పోర్టు ప్రారంభమైన తర్వాత జెట్టీలు అదృశ్యమయ్యాయి. ఇక్కడి మెకనైజ్డ్ బోట్లు ఇతర రేవులకు తరలిపోయాయి. ఎక్కడికీ వెళ్లలేని మోటారు బోట్లు, నాన్ మోటారు బోట్లు మాత్రం నానా కష్టాల మధ్య సముద్రంలో వేట సాగిస్తున్నాయి. వేటాడిన తర్వాత మత్స్యసంపదను అపరిశుభ్ర వాతావరణంలో ఎండబెట్టుకుంటూ, అమ్మకాలు చేసుకునే దుస్థితి కొనసాగుతోంది. 15 ఏళ్ల క్రితమే సర్వే కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందే బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. ఉప్పు కాలువలో పడవల ద్వారా పర్యటించిన నిపుణులు హార్బర్ నిర్మాణానికి రూ.300 కోట్లు అవసరమైనట్టు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. అయితే, ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. 1996లో తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టును నాట్కో అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. కాగా, ఆ సంస్థ ఒక్క ఇటుక కూడా వేయలేకపోయింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పోర్టును నాట్కో సంస్థ నుంచి నవయుగ సంస్థకు అప్పగించారు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఈ సంస్థ పోర్టు నిర్మాణం పూర్తి చేసింది. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలన్న అంశానికి అప్పుడే బీజం పడింది. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే.. కృష్ణపట్నం తీరంలో ఏర్పాటు కావల్సిన ఫిషింగ్ హార్బర్ తర్వాత బోగోలు మండల పరిధిలోని జువ్వలదిన్నెకు తరలించారు. రూ.288 కోట్లతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. పూర్వ నెల్లూరు జిల్లాలో కావలి మండలం చెన్నాయపాళెం నుంచి తడ వరకూ 169 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. సుమారు రెండు లక్షల మంది మత్స్యకారులు సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏడాదికి 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నారు. ఇందులో కేవలం 40 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. సరైన వసతులు, స్టోరేజీ సామర్థ్యం లేని కారణంగా మిగిలిన 60 శాతం సరుకు దళారుల చేతుల్లో పడుతోంది. మత్స్యకారుల నుంచి అతి తక్కువ ధరకు చేపలు, రొయ్యలను సొంతం చేసుకుంటున్న దళారులు చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం 40 శాతం ఎగుమతులపైనే ఏడాదికి జిల్లా నుంచి రూ.200 కోట్లు విదేశీ మారకం వస్తున్నట్లు అధికారుల అంచనా. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్ చేపడితే జిల్లాలో ప్రస్తుతం లభిస్తున్న 1.05 లక్షల టన్నులు రెట్టింపు మత్స్య సంపదను మత్స్యకారులు చేజిక్కించుకునే అవకాశం ఉంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం రెట్టింపు కానుందని నిపుణులు వివరిస్తున్నారు. మరింత వెసులుబాటు కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్ ఏర్పాటైతే కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, సర్వేపల్లి పరిధిలోని తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలాల మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. మినీ హార్బర్ నిర్మాణంతో మత్స్యకార మహిళలకు సైతం సమృద్ధిగా జీవనోపాధి లభిస్తుంది. తద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పలువురు వివరిస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మినీ హార్బర్ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్ ఉంటుంది. సముద్రతీరం వెంబడి మత్స్యకారులు అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడుతుంది. వారికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. మార్కెట్ వంటి వసతులు చెంతకు వస్తాయి. – పామంజి నరసింహ, జిల్లా ఆక్వా సొసైటీ డైరెక్టర్ మత్స్యకారులకు ఎంతో మేలు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. అధునా«తన, బోట్లు, వలలతో వేటాడే అవకాశం ఉంటుంది. దీంతో మత్స్య సంపద పెరగడంతో పాటు ఎగుమతులకు మంచి అవకాశం ఉంటుంది. తీరం వెంబడి ఉన్న గంగపుత్రులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. – శ్రీహరికోట శ్రీనివాసులు, మైపాడు తూర్పుపాళెం కాపు -
‘క్రిస్ సిటీ’ తొలి దశకు టెండర్లు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (క్రిస్ సిటీ) తొలి దశ పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు నివాసయోగ్యంగా ఉండేలా నిర్మిస్తున్న క్రిస్ సిటీలో రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, మురుగు, వరద నీరు పారుదల, మురుగునీటి శుద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.1,190 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ 36 నెలల్లో పనులను పూర్తి చేయాలన్న నిబంధన విధించింది. అలాగే పనులు పూర్తయిన తర్వాత నాలుగేళ్ల పాటు క్రిస్ సిటీ నిర్వహణ బాధ్యతలను కూడా చూడాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు నవంబర్ 4 మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. సీబీఐసీ కారిడార్‌లో భాగంగా మొత్తం 12,944 ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్‌ను అభివృద్ధి చేయనుండగా తొలిదశ కింద 2,134 ఎకరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్ డిట్) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,139.44 కోట్లను నిక్‌డిట్ కేటాయించింది. ఈ క్రిస్ సిటీ నిర్మాణం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. -
టీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ
తిరుమల: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు శనివారం కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల చాలా మంది టీటీడీ ఉద్యోగులు మరణించినట్లు తెలిపారు. ఇక టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకుడు చీర్ల కిరణ్ మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగులు ఆనందయ్య మందు కాలాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆనందయ్య మందును టీటీడీ ఉద్యోగులకు, రిటైర్డ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. టీటీడీ ఉద్యోగుల తరపున ఆనందయ్యకు చీర్ల కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: రైతుకు జరిమానా.. కట్టకపోతే బహిష్కరణ.. ఏం జరిగిందంటే? -
ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం
-
కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ
-
కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆదివారం కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. గతంలో తయారీ, పంపిణీ జరిగిన ఆనందయ్య భూముల్లోనే ఈ దఫా కూడా పంపిణీ చేపట్టారు. ఓ వైపు సీవీఆర్ కాంప్లెక్స్‌లో ఆనందయ్య మందు తయారు చేస్తుండగా, మరో వైపు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఆయన సోదరుడు దానిని పంపిణీ చేశారు. ఎప్పటిలానే జనం క్యూలో కిక్కిరిసి పోయారు. పోలీసులు 144 సెక్షన్ ఉందని ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ రద్దీని నియంత్రించారు. ఇదిలా ఉండగా కరోనా నివారణ మందు కోసం ఎవరూ కృష్ణపట్నం గ్రామానికి రావద్దని ఆయుర్వేద నిపుణుడు బొనిగి ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ద్వారా ఆయుర్వేద మందు పంపిణీ చేసిన తర్వాత మిగిలిన జిల్లాల వారికి అందజేస్తామన్నారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వ ర్యం లో మందు తయారీ
-
నెల్లూరుజిల్లాలో పేదలకు పక్కా ఇళ్లు
-
కృష్ణపట్నం: ఆనందయ్య బృందం అత్యుత్సాహం
సాక్షి, నెల్లూరు: కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మందు పంపిణీ చేస్తూ ఆనందయ్య బృందం అత్యుత్యాహం ప్రదర్శించింది. కృష్ణపట్నంలో ఆనందయ్య బృందం ఆదివారం ప్రజలకు మందు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి మందు కోసం జనం భారీగా తరలివచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఆనందయ్య బృందం మందు పంపిణీ చేస్తుండడంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి మందు పంపిణీని నిలిపి వేయించారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పలు ప్రాంతాల ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి వస్తూనే ఉన్నారు. చదవండి: Covid-19: కరోనా మిగిల్చిన కన్నీటి కథలు -
ఆనందయ్య సోదరుని అత్యుత్సాహం
-
Krishnapatnam Medicine: ఎంత ఆనందమయ్యా ఈ నిర్ణయం!
కరోనాకు మా పతంజలి మందు తయారు చేసిందని రామ్‌దేవ్ బాబా అట్టహాసంగా కొరోనిల్ మాత్రలను కేంద్ర ఆరోగ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేశాడు. ఎంత పని చేస్తుందో తెలియని మందు కరోనాను నిల్ ఎట్లా చేస్తుందని కోర్టుకెక్కితే అల్లోపతి మీద, ఆధునిక డాక్టర్ల మీద అడ్డగోలు కామెంట్లు చేశాడు. ఈ దుర్మార్గ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెయ్యి కోట్ల జరిమానా కట్టమని ఆందోళన చేస్తున్నారు డాక్టర్లు. కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వందల మంది డాక్టర్లు చనిపోతుంటే వాళ్ళనే కాపాడుకోలేని దద్దమ్మ అల్లోపతి అదో హంతకపతి అన్నాడు రామ్‌దేవ్. ఉత్తర భారతాన పెద్ద దుమారం రేగుతున్నా ఉలుకూ పలుకూ లేని కొన్ని తెలుగు మాధ్యమాలు... పెరటి మొక్కల్ని, సాధారణ మూలికల్ని మందుగా నూరి, కరోనాకు చెక్ పెట్టే అవకాశం ఉందని కృష్ణపట్నంలో ఆనందయ్య చెబుతుంటే మాత్రం ఏవేవో ప్రచారాలు, ఫిర్యాదులు, నానా రభస. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నీ ఏదో ఓ నిర్ణయం తీసుకో వాల్సిన ఒత్తిడి. వేలమంది మందు కోసం బారులు కట్టి ఎదురు చూస్తుండగా బలవంతంగా ఆపి వేయాల్సిన పరిస్థితి. ఒక నిర్ణయం కోసం ఆయుష్ డైరెక్టర్ రాములు కృష్ణపట్నం వెళ్ళి మందులో మూలికలు, పరిమాణం, తయారీ విధానం తెలుసుకుని, రోగుల నుండి అభిప్రాయాలు తీసుకుని, ఆయుర్వేద పరిశోధన కేంద్ర సంస్థలో మూలికల శాస్త్రీయ విశ్లేషణ జరిగి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వడం చకచకా జరిగింది. కోర్టు తీర్పులకు ముందే తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపి ఏ మందులు అనుమతి ఇవ్వాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టం చేస్తూ, ఆనందయ్య చెప్పిన పి.ఎల్.ఎఫ్. అనే మూడు మందులకు అనుమతి ఇచ్చారు. ఆయుష్ రాములు మాట్లాడుతూ దీన్ని ఆయుర్వేదంగా గుర్తించడం లేదు, నాటుమందుగానే పరిగణించాలన్నారు. సన్నాయినొక్కు మెరుగైన సమాజాలు నిన్న చనిపోయిన కోటయ్య హెడ్మాస్టర్ను ఎన్నోసార్లు చంపేశారు. ఇప్పుడు కూడా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది కనుక ఎంత ఆనందమయ్యా ఈ నిర్ణయం అని చాలామంది అనుకుంటు న్నారు. ప్రభుత్వం ప్రజల్ని భ్రమల్లో ముంచడం కోసం, తమ వైఫ ల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం అనుమతి ఇచ్చిందని అనేవాళ్లూ ఉన్నారు. చికిత్స ఇంత చవకగా దొరికితే ఎట్లా? రెండు రాళ్ళు వేద్దామని కొందరు ఏవేవో విషయాలు ముందుకు తెస్తారు. ఆయుర్వేద వాత, కఫ, పిత్త సిద్ధాంతం, శుద్ధీకరణకు ముందే దేశవాళి మూలవాసు లది మూలికా వైద్యం. గ్రంథస్తం కాకున్నా కంఠస్తంగా, అనువం శికంగా కొనసాగుతున్నది. కరోనాకు అడ్డుకట్ట వేసిన చైనా ఆధునిక వైద్యంతో పాటు మూలికా వైద్యానికి కూడా పెద్దపీట వేసింది. హోమియోలోనూ మెటీరియా మెడికాకు మూలికలే సృజన. మూలికల నుండి చురుకైన మందును అల్లోపతికి ముందే సంగ్రహిం చడం మొదలుపెట్టారు. చెట్ల ఆల్కలాయిడ్స్‌ను ఇప్పటికీ సంగ్రహి స్తూనే ఉన్నారు. ఇన్ని తెలిసి మూలికా వైద్యాన్ని ఆయుర్వేదం కంటే, అల్లోపతి కంటే తక్కువ చేయడం హేతుబద్ధత ఎట్లవుతుంది? అన్ని శాస్త్రాల కంటే ముందు ఈ నాటువైద్యమే మేటి వైద్యమై మనుషుల్ని, జంతువుల్ని అనేక రోగాల నుండి కాపాడుకున్నది. కరోనా కష్టకాలంలో గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన ఆనందయ్య మందు తప్పకుండా అన్ని కరోనా కేసులకు పని చేస్తుందని చెప్పలేకపోయినా, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఇమ్యూనిటీ బూస్టర్ల కంటే బాగా పని చేస్తుందేమో. ఇప్పటికీ కామెర్లకు ఇచ్చే మూలికా వైద్యం, గాయాలు మాన్పడానికి ఇచ్చే పూత మందు అద్భుతంగా పనిచేస్తాయి. శరీర ప్రకృతిలో రోగ వికృతిని సృష్టిలో భాగమైన ఆకులు, అలములు సరి చేసినంత ప్రభావశీలంగా ఇతర పదార్థాలు చేయవని మనకు అర్థమ వ్వాలి. ఒక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, దేశవాళీ వైద్యానికి ఆధునిక పరిశోధన తోడై గొప్ప ఫలితాలు సాధించాలి. చండీగడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్లో బెటాడిన్ బదులుగా వేపరసం వాడి అద్భుత ఫలితాలు రాబట్టినారు. లక్షల సంవత్సరాల మనిషి నాగరిక క్రమంలో తినే పంట చెట్లు, శరీర ధర్మాన్ని వ్యాధిని ఎదుర్కోవడానికి సిద్ధం చేసే మందుచెట్లను గుర్తించడంతో ఆధునికయుగం సారవంతం అయింది. నడమంత్రపు పెట్టుబడి శాస్త్రాలు తిమ్మిని బమ్మి చేయాలని చూసినా, ప్రతి దేశంలో తమకు అందుబాటులోని మూలికా వైద్యాన్ని ఆధునీకరించడం, వందల ఆనందయ్యలకు ప్రభుత్వాలే ప్రోత్సాహాన్నివ్వడం ఇప్పుడు అవసరం. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం దాక, చెట్లలో, పుట్లలో, నదీజలాల్లో, దూసర క్షేత్రాల్లో సంజీవనీ పర్వతాలు అడుగడుగునా ఉంటాయి. అందుకే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందమయ్యా! పక్క రాష్ట్రాలకైనా తన మందు సరఫరా చేస్తానంటున్నాడు ఆనందయ్య. తెలంగాణలోనూ కృష్ణపట్నం మందుతో కుదుట పడినవాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. నిన్నటి జగన్ నిర్ణయం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం కావాలి. - డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు. 9848472329 -
ఆనందయ్య మందు: తయారీ కేంద్రం మార్పు
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకి మార్చారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్ సెక్యూరిటీ అకాడమీకి మందు తయారీ కేంద్రాన్ని తరలించారు. ఇప్పటివరకు పంపిణీ జరిగిన ప్రాంతంలోనే మందు తయారీ చేయాలని ఆనందయ్య భావించారు. అయితే జిల్లా యంత్రాంగంతో కలిసి ఆనందయ్య చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పటికే మందు తయారీకి కావల్సిన ముడి సరుకులు, ఇతర వంట సామాగ్రిని సీవీఆర్‌కు తరలించారు. కృష్ణపట్నంలో తయారు చేస్తే అక్కడకు కూడా ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందని, ఎటువంటి సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో తయారీ కేంద్రాన్ని మార్చినట్లు అధికారులు తెలిపారు. మందు తయారీ సమయంలో భద్రత తదితర విషయాల్లో సహకరించాలని జిల్లా కలెక్టర్‌కు ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. తయారీకి కావలసిన మూలికలు ఔషధాలు సమకూర్చుకునే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని ఆనందయ్య కోరారు. అవసరమైతే గిరిజన కార్పొరేషన్ సొసైటీ నుంచి తేనే సప్లై చేస్తామని కలెక్టర్ చక్రధర బాబు తెలిపారు. నేటి నుంచి childeal.in పేరుతో ఆనందయ్య మందుకు సంబంధించిన వెబ్సైట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెబ్సైట్లో కస్టమర్ దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆనందయ్య బృందం తెలిపింది. సోమవారం నుండి ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆనందయ్య మందుల తయారీ ఇలా -
7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ!
నెల్లూరు (అర్బన్): నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందును సోమవారం (ఈనెల 7వ తేదీ) నుంచి పంపిణీ చేసే అవకాశం ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. మందు తయారీ, పంపిణీ గురించి మంగళవారం నెల్లూరులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్, జేసీలు హరేందిరప్రసాద్, గణేష్‌కుమార్, మందు తయారీదారు ఆనందయ్య తదితరులతో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వనమూలికలు సమకూర్చుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లో మందు తయారు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారన్నారు. కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకేచోట కాకుండా డీ సెంట్రలైజ్డ్ పద్ధతిలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మందును ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, పోస్టల్, కొరియర్ ద్వారా కూడా పంపిస్తామని తెలిపారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారికి కూడా ఇదే విధానంలో పంపిణీ చేస్తామన్నారు. కోవిడ్ సోకిన వారికి నయం చేసేందుకు మాత్రమే తొలిదశలో మందు పంపిణీ చేస్తామని తెలిపారు. తర్వాత దశలో కరోనా రాకుండా ఉండేందుకు మందు ఇస్తామన్నారు. ఎవరూ మందు కోసం కృష్ణపట్నం, నెల్లూరు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల మనోభావాలను అనుసరించి మందును పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. కంట్లో చుక్కల మందు పంపిణీకి సంబంధించి కోర్టు తుది తీర్పునకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరూ కృష్ణపట్నం రావద్దు కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు ఇతర ప్రాంతాల్లో లాగానే కృష్ణపట్నంలోనూ అమలవుతాయని తెలిపారు. ఇతర ప్రాంతాల వారు రాకుండా పోలీసు, రెవెన్యూ శాఖలు పని చేస్తాయన్నారు. ప్రజల కోసం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ డీ సెంట్రలైజ్డ్ పద్ధతిలో మందును పంపిణీ చేస్తామన్నారు. సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దన్నారు. మరో ఐదురోజుల్లో మందు పంపిణీ మొదలవుతుందన్నారు. వ్యక్తిగతంగా ఆన్లైన్లో మందు కోసం బుక్ చేసుకోవచ్చన్నారు. కోర్టు తుది తీర్పునకు అనుగుణంగా మందు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆనందయ్యను సత్కరించిన ఎంపీ మాగుంట ముత్తుకూరు: కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన మందుకు ప్రపంచ అగ్రదేశాల గుర్తింపు లభించిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశంసించారు. ఆయన మంగళవారం కృష్ణపట్నం గ్రామానికి వచ్చి ఆనందయ్యను సత్కరించారు. ఎంపీ మాట్లాడుతూ ఆనందయ్య మందు తయారీకి మాగుంట కుటుంబం అండగా ఉంటుందన్నారు. ఆనందయ్య ప్రకాశం జిల్లాకు కూడా వచ్చి ప్రజలకు కరోనా మందు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆనందయ్య మాట్లాడుతూ కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారీ మాత్రమే జరుగుతుందని, పంపిణీ ఉండదు కనుక ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ద్వారా ఆయుర్వేద మందుకు అనుమతులు లభించే విషయంలో సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, జిల్లాకు చెందిన మంత్రులకు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
శాస్త్రీయ పరీక్షల్లోనూ ఎలాంటి దుష్పలితాలు కనిపించలేదు: రాములు
-
నమ్మకం ఉన్నవారు ఆనందయ్య మందు తీసుకోవచ్చు: వైవీ సుబ్బారెడ్డి
-
ఆనందయ్య మందు: ‘ప్రజలు నమ్మకంతో తీసుకుంటున్నారు’
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పంపిణీకి కసరత్తు ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ఆయుర్వేదిక్ మందుగా కేంద్ర, రాష్ట్ర ఆయుష్ సంస్థలు గుర్తించలేదని తెలిపారు. ఒకవేళ ఆయా సంస్థలు గుర్తింపు ఇస్తే టీటీడీ తరఫున పంపిణీ చేద్దామనుకున్న విషయం వాస్తవమే అని చెప్పారు. కానీ.. గుర్తింపు లేని కారణంగా టీటీడీ పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో తీసుకుంటున్నారు కనుకే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని వివరించారు. ఇప్పుడు అది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమని, నమ్మకం ఉన్నవారు ఆనందయ్య మందు తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని, ఈ విషయంలో మేం కల్పించుకోమని చెప్పారు. ఆనందయ్య మందు తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని అన్నారు. చదవండి: ఆనందయ్య మందుల తయారీ ఇలా -
ఆనందయ్య మందుల తయారీ ఇలా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణకు 5 రకాల మందులు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. 1. పి: ఈ మందు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. పాజిటివ్ వచ్చిన వారు రోజుకు రెండుసార్లు చొప్పున మూడు రోజులు, పాజిటివ్ లేనివారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం కో సం ఒక్కరోజు రెండుసార్లు వినియోగించాలి. తెల్లజిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్ దంగిలే 5 బకెట్లు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, తోకమిరియాలు, పచ్చకర్పూరం, ఫిరంగిచెక్క పొడి ఒక బకెట్ మిక్సీవేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిపి 4 గం టలు ఉడికించి మందును తయారు చేస్తున్నారు. 2. ఎఫ్: ఈ మందును పాజిటివ్ ఉన్న వారికి ఇస్తున్నారు. భోజనం తర్వాత రెండుసార్లు చొప్పున మూడురోజులు తీసుకోవాలి. పుప్పిం టి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కిలోల వరకు సిద్ధం చేసి అన్నింటిని కలిపి మిక్సీవేసిన తరువాత చూర్ణంగా ఈ మందు తయారు చేస్తున్నారు. 3. ఎల్: ఇది కూడా పాజిటివ్ ఉన్న వారికే. పి, ఎఫ్ రకాల మందుతోపాటు రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. నేల ఉసిరి, గుంటగలగర ఆకులు ఒక బకెట్, మిరి యాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె రెండు మూడు కిలోలు తీసుకుని దీన్ని తయారు చేస్తున్నారు. 4. కె: ఇది కూడా పాజిటివ్ ఉన్న వారికే. రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కిలోలు తీసుకుని కలిపి తయారు చేస్తున్నారు. 5. ఐ: ఇది ఆక్సిజన్ తగ్గిన వారికి కంటి డ్రాప్స్. పల్స్‌ను బట్టి ఒక్కో కంట్లో ఒక్క డ్రాప్ వేయాలి. దీన్లో తేనె, ముళ్లవంకాయ గుజ్జు, తోకమిరియాలు,కిలో తేనెతో ఈ డ్రాప్స్‌ను తయారు చేస్తున్నారు. -
సంప్రదాయ మందుగా వాడవచ్చు
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేసిన మందును సంప్రదాయ మందుగా వాడవచ్చని, దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడంలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు.మందు వాడకం వల్ల లాభం గురించి కాకుండా, ఎలాంటి నష్టాలు జరగలేదని భావించి ఆమోదం ఇచ్చామన్నారు. సోమవారం ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములుతో కలిసి మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. మందులో వాడుతున్న పదార్థాల్లో హానికారకాలు లేవని తేలిందని చెప్పారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు పనిచేస్తుందన్న ఆధారాలు కూడా ఏమీ లేవని, ఎవరి నమ్మకాన్ని బట్టి వారు వాడుకోవచ్చని పేర్కొన్నా రు. ఇతర మందులు వాడుతున్న వారు వాటిని వాడుతూనే ఈ మందును కేవలం సప్లిమెంట్‌గా వాడాలని సూచించారు. పాజిటివ్ పేషెంట్లెవరూ క్యూలలో లేకుండా వారి సహాయకులు వచ్చి మందు తీసుకెళ్లడం మంచి దని,కంట్లో వేసే మందుకు అనుమతి లేదన్నారు. కర్ఫ్యూతో కేసులు తగ్గుముఖం కర్ఫ్యూ కారణంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గతంలో కొన్ని పత్రికలు 144 సెక్షన్ అమలు, కర్ఫ్యూపై మీడియాలో విమర్శలు చేశాయని, కానీ ఇప్పుడు ఈ విధానమే మంచి ఫలితాలనిచ్చిందని చెప్పారు. అందుకే జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగించామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ఇదే మొదటిసారి అని తెలిపారు. రూ.7,880 కోట్లతో నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో 14 కాలేజీలకు సోమవారం శంకుస్థాపన చేశారని, రెండు కాలేజీలకు ఇంతకుముందే శంకుస్థాపన చేశారని చెప్పారు. రాష్ట్రంలో 1,179 మంది బ్లాక్‌ఫంగస్ బాధితులున్నారని, వీరిలో 97 మంది పూర్తిగా కోలుకోగా, 14 మంది మృతిచెందారని తెలిపారు. 1,179 మందిలో 40 మంది మినహా మిగతావారు కరోనా సోకినవారేనని చెప్పారు. బ్లాక్‌ఫంగస్ కేసుల్లో 370 మంది ఆక్సిజన్ సపోర్టు తీసుకున్న వారు, 687 మంది స్టెరాయిడ్స్ వాడిన వారు ఉన్నారని తెలిపారు. మధుమేహ బాధితులు 743 మంది ఉన్నారన్నారు. కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు బాగా డిమాండు తగ్గిందన్నారు. ఆక్సిజన్ స్టోరేజీ సామర్థ్యం తక్కువగా ఉండటంతో రోజుకు 590 మెట్రిక్ టన్నులు మాత్రమే తెస్తున్నామని, ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గిందని తెలిపారు. 10 రోజుల్లోనే ప్రక్రియ పూర్తిచేశాం ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములు మాట్లాడుతూ కృష్ణపట్నం మందుపై తమశాఖ ఈనెల 21, 22 తేదీల్లో పరిశీలన మొదలుపెట్టిందని చెప్పారు. చెప్పినట్లుగానే అన్ని పరిశీలనలు పూర్తిచేసి 10 రోజుల్లో ఫలితాలు ఇచ్చామన్నారు. దీన్నిబట్టి ఈ మందుపై ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చట్టం, శాస్త్రం ప్రకారం దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించలేదని, స్థానిక, సంప్రదాయ మందుగానే ఇవ్వాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ మందును పంపిణీ చేయాలన్నారు. ఆనందయ్యతో మాట్లాడిన తరువాత మందు పంపిణీపై తేదీలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. -
మందు తయారీకి కసరత్తు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆనందయ్య కరోనా మందు పంపిణీకి కసరత్తు ప్రారంభమైంది. భద్రత కారణాల రీత్యా ఇప్పటి వరకు కృష్ణపట్నం పోర్టులోని అతిథి గృహంలో ఉన్న ఆనందయ్య.. సోమవారం సాయంత్రం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కాకాణి మందు తయారీ, పంపిణీపై ఆనందయ్యతో చర్చించారు. మందుకు కావాల్సిన వనమూలికలు, దినుసులు సమకూర్చుకునేందుకు రెండు, మూడు రోజుల సమయం పట్టనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేచోట కాకుండా మూడు, నాలుగు కేంద్రాల ద్వారా మందు పంపిణీ చేయాలని యోచిస్తున్నారు. దినుసులు సేకరించాలి ఆనందయ్య మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు సేకరించాల్సి ఉందని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. జిల్లా యంత్రాంగంతో చర్చించి మందు ఎక్కడ తయారు చేయాలి, ఏ ప్రాంతంలో పంపిణీ చేయాలనే అంశాల్ని నిర్ణయిస్తామన్నారు. ఇదంతా పూర్తికావడానికి మూడు, నాలుగు రోజులు పడుతుందని చెప్పారు. మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని విజ్ఞప్తి చేశారు. పంపిణీకి అన్ని అనుమతులు వచ్చాక ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తన మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పరిశోధన ద్వారా నిరూపితమైందని ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తెలిపారు. మందు పంపిణీకి అనుమతి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చాం
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు బి.ఆనందయ్య కోవిడ్ మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించకపోవడంతో పంపిణీని తాత్కాలికంగా ఆపామని, భవిష్యత్తులో ఇబ్బందులు ఉం డకూడదని మందు శాస్త్రీయతను నిపుణులతో పరిశీలింప చేశామని పేర్కొన్నారు. కంట్లో వేసే ఐ డ్రాప్స్‌తో సహా పి, ఎఫ్, ఎల్, కె పేరుతో ఆనంద య్య మొత్తం 5 రకాల మందులు తయారు చేస్తున్నారని తెలిపారు. ఇందులో ఐ డ్రాప్స్, కె రకం మందు మినహా మిగిలిన 3 రకాల మందుల పంపిణీకి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. పి, ఎఫ్, ఎల్ మందుల వల్ల దుష్ప్రభావాలు కలగడం లేదని ఆయుష్ విభాగం నివేదిక ఇచ్చిందన్నారు. ఐ డ్రాప్స్‌పై తుది పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. కె రకం మందు శాంపిల్స్‌ను ఆనందయ్య ఇవ్వలేదని, అందువల్ల ఆ మందును పరీక్షించలేదని చెప్పారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఐ డ్రాప్స్‌తో పాటు కె మందు పంపిణీకి అనుమతులిచ్చే విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఐ డ్రాప్స్, కె రకం మందుపై పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. మందు పంపిణీ చేసే చోట కోవిడ్ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని, ఆ మందు పంపిణీకి తక్షణమే అనుమతులిచ్చేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా, తనకు భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలంటూ ఆనందయ్య పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ విజయలక్ష్మి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ మందు తయారీకి లైసెన్స్ అవసరం లేదు ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ ఆనందయ్య మందు తయారీకి లైసెన్స్ అవసరం లేదన్నారు. ఫార్ములా చెప్పాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పా రు. శాంతిభద్రతల పేరుతో మందు పంపిణీని అధికారులు అడ్డుకుంటున్నారని, మందు పంపిణీకి అనుమతినిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సి.సుమన్ వాదనలు వినిపిస్తూ ఆనందయ్య మందు తీసుకున్న వారిలో దాదాపు 130 మంది నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆనందయ్య ఐ డ్రాప్స్ తీసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు కోటయ్య తరువాత ప్రభుత్వాస్పత్రిలో చేరి సోమవారం మరణించారని చెప్పారు. ఆనందయ్య వద్ద పనిచేస్తున్న వారిలో కూడా కొందరు కోవిడ్ బారిన పడ్డారన్నారు. ఔషధాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేయాలని, లేకపోతే బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన పీవీ కృష్ణయ్య స్పందిస్తూ.. కోటయ్య మృతిపై సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరారు. మరో పిటిషనర్ న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ.. కోవిడ్‌కు నిర్దిష్టంగా మందు లేదని, అందువల్ల ఆనందయ్య తయారుచేసే సంప్రదాయ మందు పంపిణీకి అనుమతించాలని కోరారు. ఐ డ్రాప్స్ విషయంలోనే సమస్య కె రకం మందు, ఐ డ్రాప్స్ విషయంలో నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందని ధర్మాసనం ప్రశ్నిం చింది. కె రకం మందు శాంపిల్స్ ఆనందయ్య ఇచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని సుమన్ తెలిపారు. ఐ డ్రాప్స్ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం చెబుతామన్నారు. ఐ డ్రాప్స్ నేరుగా కంటి నరాల్లోకి వెళతాయని, అందువల్ల అత్యంత శుభ్రమైన వాతావరణంలో తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆనందయ్య న్యాయవాది అశ్వనీకుమార్.. ఐ డ్రాప్స్ వల్ల ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని, అందువల్ల వాటికి అనుమతి ఇవ్వాలని కోరారు. తుది పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చెబుతున్నప్పుడు అంత తొందర ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు మూడు వారాలు వేచి చూడటంలో తప్పేమీ లేదంది. ఐ డ్రాప్స్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదుపరి విచారణలో చెప్పాలని ధర్మాసనం సుమన్‌కు సూచించింది. ఐ డ్రాప్స్, కె రకం మందు విషయంలో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అడ్డుకోవడం లేదు.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ స్పం దిస్తూ.. ఆనందయ్య మందు పంపిణీని అడ్డుకోవ డం లేదన్నారు. పంపిణీ సమయంలో కోవిడ్ మార్గదర్శకాలు అమలు కాకపోవడంతో తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆనందయ్యను కోరామని చెప్పారు. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి విషయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం కొనసాగుతోందని, ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేయాలని కోరారు. దర్మాసనం అంగీకరిస్తూ విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణలో.. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సుమన్ తెలిపారు. 688 మందితో ఆయుర్వేద నిపుణులు మాట్లాడారని, ఆనందయ్య మందు వల్ల దుష్ప్రభావాలు కలగలేదని వారు చెప్పారని పేర్కొన్నారు. మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీకి తగిన మార్గదర్శకాలు జారీచేస్తారని తెలిపారు. -
రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి
కోట/నెల్లూరు (అర్బన్): కృష్ణపట్నంలోని ఆనందయ్య మందు తీసుకుని కరోనా నుంచి కోలుకున్నానని చెప్పిన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడికి చెందిన విశ్రాంత హెచ్ఎం బైనా కోటయ్య(62) సోమవారం మృతి చెందారు. ఆ మందు కరోనాకు బాగా పని చేస్తుందంటూ కోటయ్య మాటల వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఈ నెల 22న ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్ల సూచనల మేరకు కుటుంబ సభ్యులు నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ‘ఊపిరితిత్తులు క్షీణించడంతోనే.. ’ కోటయ్యకు ఆస్పత్రికి వచ్చేటప్పటికే ఊపిరితిత్తులు 80 శాతం వరకు దెబ్బతిన్నాయని పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ సోమవారం చెప్పారు. ఆనందయ్య మందు తీసుకున్న తరువాత నాలుగు రోజులకు కోటయ్య ఆరోగ్యం బాగలేదంటూ పెద్దాస్పత్రిలో చేరాడని చెప్పారు. అప్పటికే కోటయ్య మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా ఉండటంతో తాము మరింత కేర్ తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో తాము చేసిన వైద్యం వల్ల కొంత మెరుగైనప్పటికీ మళ్లీ ఆరోగ్యం విషమించి మృతి చెందాడని తెలిపారు. -
ఆనందయ్య మందుకు ప్రభుత్వం అనుమతి
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందులతో దుష్ప్రభావాలు లేవని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్), ఇతర సంస్థలు ఇచ్చిన నివేదికల మేరకు ఈ మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఇస్తున్న 5 రకాల మందుల్లో 3 రకాలకు అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి నివేదికలు రావాల్సి ఉంది. మరో మందు తయారీ అధికారుల ముందు చూపించనందున అనుమతి ఇవ్వలేదు. ఆనందయ్య మందుపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఆర్ఏఎస్ సహా పలు సంస్థలు ఇచ్చిన నివేదికల్లోని అంశాలను ఆయుష్ కమిషనర్ వి.రాములు, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నివేదికల ఆధారంగా ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఆనందయ్య మందు వాడితే కోవిడ్ తగ్గిందనడానికి నిర్ధారణలు లేవని, ఈ మందులో వాడే పదార్థాలు హానికరం కాదని ఈ నివేదికల్లో తేలిందని అధికారులు వివరించారు. దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడానికి లేదని తెలిపారు. ఆనందయ్య 5 (పి, ఎల్, ఎఫ్, కె, ఐ) రకాల మందులు తయారు చేస్తున్నారు. వీటిలో ముడిపదార్థాలు లేనందున కె మందు తయారీని అధికారులకు చూపించలేదు. మిగిలిన 4 రకాల మందుల తయారీ చూపించారు. కంట్లో వేసే ఐ డ్రాప్స్ మందుకు సంబంధించి కొన్ని నివేదికలు రావాల్సి ఉంది. అందువల్ల దీనికి అనుమతించలేదు. కె మందు తయారీ చూపించనందున దానికి అనుమతి ఇవ్వలేదు. మిగిలిన పి, ఎల్, ఎఫ్ రకాల మందుల పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనాకు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్ట్రపకారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఆనందయ్య మందును వాడినంతమాత్రాన మిగిలిన మందులు ఆపవద్దని స్పష్టం చేసింది. ఆనందయ్య మందు తీసుకోవడానికి కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు రాకుండా చూడాలని ఆదేశించింది. రోగులకు బదులు వారి సంబంధీకులు వచ్చి మందు తీసుకెళ్తే.. కోవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని పేర్కొంది. మందు పంపిణీ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని స్పష్టం చేసింది. ఆనందయ్య దీన్ని ఆయర్వేద మందుగా గుర్తించాలని దరఖాస్తు చేస్తే చట్ట పరిధిలో పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. -
ఆనందయ్య మందును ౫ రకాలుగా వాడుతున్నారు
-
మళ్లీ రహస్య ప్రాంతానికి ఆనందయ్య
సాక్షి, నెల్లూరు: వారం రోజుల తర్వాత నిన్న కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్న ఆనందయ్య.. మళ్లీ రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిన ఆనందయ్య.. కాసేపట్లో వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లారు. ఆనందయ్యను పోలీసులే తీసుకెళ్లినట్లు సమాచారం. కృష్ణపట్నం నుంచి ఆనందయ్యను రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు భద్రత కల్పించినట్లు తెలిసింది. ఆనందయ్య మందుపై నేడు తుది నివేదిక నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, సోమవారం విచారణ జరగనుందని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయని, శనివారం తుది నివేదిక వస్తుందని తెలిపారు. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందన్నారు. డ్రగ్ లైసెన్స్ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేస్తోందన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద రాములు విలేకరులతో మాట్లాడారు. కేంద్రం సంస్థ అధ్యయన నివేదిక శనివారం వచ్చే అవకాశం ఉందన్నారు. చదవండి: జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! -
అనుమతులొచ్చిన అనంతరమే మందు పంపిణీ
ముత్తుకూరు: కరోనా నివారణకు తాను తయారు చేసిన ఆయుర్వేద మందుపై అధ్యయనం జరుగుతుందని, ప్రభుత్వ అనుమతి రాగానే మందు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగి ఆనందయ్య తెలిపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం మందు పంపిణీ జరుగుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతానికి తమ వద్ద మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు లేవని చెప్పారు. ప్రభుత్వం ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేసిన తర్వాత సీవీఆర్ కాంప్లెక్స్‌లో ఉంటున్న బొనిగి ఆనందయ్య శుక్రవారం కృష్ణపట్నంలోని తన ఇంటికి చేరాడు. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. దీంతో పోలీసులు ఆయనకు రక్షణగా నిలిచారు. -
ఆనందయ్య మందుపై నేడు తుది నివేదిక
సాక్షి, అమరావతి: నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, సోమవారం విచారణ జరగనుందని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయని, శనివారం తుది నివేదిక వస్తుందని తెలిపారు. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందన్నారు. డ్రగ్ లైసెన్స్ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేస్తోందన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద రాములు విలేకరులతో మాట్లాడారు. కేంద్రం సంస్థ అధ్యయన నివేదిక శనివారం వచ్చే అవకాశం ఉందన్నారు. నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక మందు పంపిణీపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అంతిమ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందుల్లేని విధంగా మందు పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారన్నారు. ఇప్పటి వరకు వచి్చన విచారణ నివేదికలు అన్నీ పాజిటివ్‌గా వచ్చాయని పేర్కొన్నారు. మందుపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభించలేదని చెప్పారు. ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకుంటే త్వరగా ప్రాసెస్ చేస్తామని చెప్పారు. -
ఆనందయ్య మందు పై రేపు నివేదిక వస్తుంది
-
కోదిరోజుల నుంచి మందు పంపిణి జరగడం లేదు
-
ఆనందయ్య మందు: కృష్ణపట్నంలో టీడీపీ హడావుడి
సాక్షి, ముత్తుకూరు: కృష్ణపట్నంలో మంగళవారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ నేతలు ఆనందయ్య మందు తయారీ ప్రాంతంలో హడావుడి చేశారు. సోమిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు తొలుత ఆనందయ్య ఇంటికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో సతీమణి ఇంద్రావతితో మాట్లాడారు. ఆనందయ్య వెన్నంటి ఉన్న యువకులను సత్కరించారు. మందు తయారీ ప్రాంతంలో కలయదిరిగి హడావుడి చేశారు. మందు పంపిణీ నిలిపి వేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. చుక్కల మందు డ్రామా కరోనా నియంత్రణకు ఆనందయ్య మందు పేరుతో టీడీపీ నేతలు డ్రామా నిర్వహించారు. కృష్ణపట్నంలో మందు తయారీ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోపాలపురం వద్ద స్థానికేతరులను ఎవరినీ కృష్ణపట్నంలోకి వెళ్లనీయకుండా పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం తెలంగాణకు చెందిన ప్రకాష్ అనే కరోనా పేషెంట్ తల్లి మల్లీశ్వరితో గ్రామంలోకి నడుచుకుని వస్తుండగా చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలిపివేశారు. మరో మార్గంలో తల్లితో కలిసి కృష్ణపట్నంలోకి వచ్చేశాడు. సమీపంలోని ఒక చెట్టు కింద సేద దీరుతున్నాడు. అదే సమయంలో సోమిరెడ్డి నేతృత్వంలోని టీడీపీ బృందం అక్కడికి చేరుకుంది. ఆ పేషెంట్‌తో మాట్లాడారు. డ్రామాను రక్తికట్టించే విధంగా తల్లితో పాటు నడుచుకుంటూ వచ్చిన యువకుడి పరిస్థితిని విషమంగా ఉన్నట్లు చూపిస్తూ, కంట్లో రెండు చుక్కలు మందు వేయించారు. నిమిషాల్లో ఆ యువకుడు లేచి కూర్చొని, ఒళ్లు విరుచుకుంటూ నిలబడి సాధారణంగా మాట్లాడడం చూస్తే సినిమా ట్రిక్‌లా అనిపించింది. అయితే అక్కడ జరుగుతున్న తంతును చూసి స్థానికులు సైతం ఒకింత ఆశ్చర్యపోయారు. నాలుగు రోజులుగా గ్రామంలో మందు తయారీ లేకపోవడం గమనార్హం. అయితే ఎక్కడి నుంచి కంటి మందు తెచ్చారో తెలియదు. ఆనందయ్య మందుపై ప్రజల్లో మరింత ఆసక్తి పెంచేలా డ్రామా వెనుక రాజకీయ కోణం కనిపిస్తోంది. ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందుపై ఆయుష్ శాఖ చేపట్టిన పరిశోధనలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే దశలో టీడీపీ ప్రజలను మరింత రెచ్చగొట్టే విధంగా ఉందని స్థానికులు సైతం విమర్శించడం కనిపించింది. చదవండి: కృష్ణపట్నంలో ఐసీఎంఆర్ బృందం -
ఆనందయ్య మందుపై రేపు హైకోర్టు విచారణ
సాక్షి, అమరావతి: కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు బొణిగి ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ఈనెల 27న (రేపు) విచారణ జరపనుంది. న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపే అవకాశం ఉంది. కరోనా మందు పంపిణీకి తక్షణమే ఆనందయ్యకు అనుమతినిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ గుంటూరు జిల్లా, పిడుగురాళ్లకు చెందిన న్యాయవాది పొన్నెకంటి మల్లికార్జునరావు, కోవిడ్ రోగుల కోసం ఆనందయ్య మందును ఆయుర్వేద ముందుగా గుర్తించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ అనంతపురము జిల్లా, కళ్యాణదుర్గంకు చెందిన ఎం.ఉమామహేశ్వర నాయుడు సోమవారం హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఈనెల 27న వెకేషన్ కోర్టులో ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరపనుంది. -
ఆనందయ్య మందులో ఎలాంటి హానికారక పదార్థాలు లేవు
-
ఆనందయ్య మందుపై ఫలితాలు రాగానే నిర్ణయం
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందులకు సంబంధించి ‘సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్’ (సీసీఆర్ఏఎస్)కు పంపిన శాంపిళ్ల ఫలితాలు రాగానే నిర్ణయం తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కోవిడ్–19 నియంత్రణ, చికిత్సపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం ఆనందయ్య మందులో వినియోగిస్తున్న పదార్థాల గురించి రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు ముఖ్యమంత్రికి వివరించారు. ఆనందయ్య మందుల్లో కంట్లో వేసే డ్రాప్స్‌పై కంటి వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కంట్లో డ్రాప్స్‌పై పరిశీలన ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఆనందయ్య మందుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపామని, కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయని, కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని కమిషనర్ వివరించారు. ఈ మందు శాంపిళ్లను సీసీఆర్ఏఎస్కు పంపామని, వాళ్లు 500 మందికి ఇచ్చి పూర్తిస్థాయి పరిశీలన చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మందు వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లో నివేదిక వస్తుందని అధికారులు చెప్పారు. 30–35 ఏళ్లగా మందులు ఇస్తున్నారు కృష్ణపట్నంలో ఆనందయ్య 30–35 సంవత్సరాలుగా మందులు ఇస్తున్నారని ఆయుష్ కమిషనర్ రాములు సమావేశంలో తెలిపారు. కరోనాకు నోటి ద్వారా 4 రకాల మందులు, కళ్లలో డ్రాప్స్.. ఇలా 5 రకాల మందులు ఇస్తున్నారని తెలిపారు. ఈ మందుల్లో ఆనందయ్య 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారని చెప్పారు. పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె.. ఇలా 18 రకాలను ఆనందయ్య 5 రకాల మందుల్లో వాడుతున్నారని వివరించారు. అన్నీ సహజంగా దొరికే పదార్థాలేనని, వేరే ఏ ఇతర పదార్థాలను ఆయన వాడడం లేదని చెప్పారు. మందుల తయారీ విధానాన్ని తమకు చూపించారని, ఫార్ములా కూడా చెప్పారని తెలిపారు. -
ఆనందయ్య కు భద్రతపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని సమీక్ష
-
ఆనందయ్య మందుతో కరోనా నయం అవుతుందనే భావన ప్రజల్లో ఉంది
-
ఆనందయ్య మందుపై అపోహలొద్దు
-
నేడు కృష్ణపట్నంకు ఐసీఎంఆర్ బృందం
-
కృష్ణపట్నంకు నేడు ఐసీఎంఆర్ బృందం
ముత్తుకూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన ఆయుర్వేద మందును క్షుణ్ణంగా పరీక్షించే నిమిత్తం సోమవారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బృందం రానుంది. ఈ మందులో శాస్త్రీయత నిర్ధారించి, మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తాత్కాలికంగా మందు పంపిణీ నిలిపివేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆయుష్ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు మందు నమూనాలు సేకరించారు. ఈ మందు వల్ల ఎటువంటి నష్టం ఉండదని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానికంగా, కరోనా బాధిత కుటుంబాల్లో ఆసక్తి అధికమైంది. -
ఆనందయ్య మందు: ఆరోపణలొద్దు
-
కెఎస్ఆర్ లైవ్ షో 23 may 2021
-
ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం
-
కరోనా ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి తిరుపతి/ముత్తుకూరు/సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం కోసం ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఆయుష్ కమిషనర్ రాములు, ఆయన బృందం కృష్ణపట్నంలో పర్యటించింది. మందు తయారీకి వినియోగించే దినుసులను పరిశీలించడంతోపాటు మందు విని యోగించిన వారి వివరాలు తెలుసుకుంది. మందు ను వాడిన 500 మందితో మాట్లాడి వారిచ్చిన వివరాలను నివేదికలో పొందుపర్చనుంది. శనివారం తెలుసుకున్న వివరాలతో ప్రభుత్వానికి వెంటనే నివేదిక ఇస్తామని.. వారం నుంచి పది రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పిస్తామని రాములు తెలి పారు. తర్వాత ప్రభుత్వ అనుమతి మేరకు ఆయుర్వేద మందు పంపిణీ ఉంటుందని చెప్పారు. అప్పటివరకు పంపిణీని నిలిపివేస్తున్నామన్నారు. ఆనందయ్య తయారుచేసిన మందు నమూనాలను ఉత్తరప్రదేశ్‌లోని సీసీఆర్ఏఎస్ (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్) ల్యాబ్‌కు పంపుతున్నామని తెలిపారు. అంతకుముందు నెల్లూరు పట్ట ణంలో రాములుకు.. ఆనందయ్య మందు తయారీని వివరించి.. చేసి చూపించారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో మందు తయారీకి వినియోగించే వస్తువులు అన్నీ శాస్త్రబద్ధమైనవేనని, వాటివల్ల ఎలాంటి చెడు ప్రభావం లేదని ఆయుష్ నిర్ధారించింది. ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. కాగా, భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బృందం ఆయుర్వేద మందు శాస్త్రీయతపై అధ్యయనం కోసం ఈ నెల 24న కృష్ణపట్నానికి రానుంది. ఇదిలా ఉండగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మందు పంపిణీ నిలిపివేయడంతోపాటు పోలీసులు పహారా కాస్తుండడంతో కృష్ణపట్నం నిర్మానుష్యంగా మారింది. కరోనా కట్టడిపై టీటీడీ దృష్టి కరోనా నియంత్రణకు ఆయుర్వేద మందును తయారుచేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆనందయ్య తయారుచేస్తున్న మందుపై ఆసక్తి చూపుతోంది. ఐసీఎంఆర్ నివేదిక అనుకూలంగా వస్తే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఆయుర్వేద మం దును ప్రపంచానికి అందించాలని భావిస్తోంది. శేషాచలం అడవుల్లో అపార ఔషధ గుణాలు కలిగిన 1,300 మొక్కల జాతులు ఉన్నాయి. వీటిలో అపార ఔషధ గుణాలున్న పెర్రూత, తంబ జాలరీ, కొండ సామ్రాణి, అడవి నీలిమందు, ఎరచ్రందనం, అడవి కంది, అడవి బిల్లు, తెల్ల కరక, మోగి, అడవి కొత్తివీుర, చిన్న పూలతుమ్మి లాంటి 11 రకాల మొక్కలకు శేషాచలం ప్రత్యేకం. ఈ నేపథ్యంలో ఆనందయ్య తయారుచేస్తున్న మందు ముడిసరుకును పరిశీలించేందుకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల వైద్య బృందం శనివారం కృష్ణపట్నంలో పర్యటించింది. అక్కడ మందు మందు తయారీ విధానం, ముడిసరుకును పరిశీలించారు. మందు పనితీరుపై స్థానికులతో మాట్లాడారు. ఈ మందుకు ప్రభుత్వ అనుమతి వస్తే టీటీడీ వద్ద ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆయుర్వేద మందును తయారు చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. టీటీడీ పరిధిలో అధునాతన ఫార్మా విభాగంతోపాటు సీనియర్ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఉన్నారన్నారు. ఈ మందుపై టీటీడీ పాలకమండలి ఆసక్తిగా ఉందని చెప్పారు. ఔషధ మొక్కలకు నెలవు శేషాచలం అనేక ఔషధ మొక్కలకు శేషాచలం నిలయం. అన్ని మొక్కలు పెంచేందుకు శేషాచలం అనువైన ప్రాంతం కూడా. ఐసీఎంఆర్ నివేదిక అనుకూలంగా వస్తే టీటీడీ ఆధ్వర్యంలో మందు తయారీ మొదలుపెడతాం. ఇందుకు వారం పట్టొచ్చు. మందు తయారీకి ఔషధ మొక్కలు భారీ మొత్తంలో సేకరించాల్సి ఉంటుంది. – డాక్టర్ రమేష్‌బాబు, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, తిరుపతి -
‘ఆనందయ్య మందును నాటు మందుగా పరిగణిస్తాం’
సాక్షి, నెల్లూరు: ఆనందయ్య చేస్తున్న కరోనా మందు తయారీలో ఆయుర్వేద ప్రోటోకాల్స్ లేవని అధ్యయనం చేస్తున్న ఆయుష్ కమిషనర్ రాములు బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందును ఆయుర్వేద మందుగా కాకుండా నాటు మందుగా పరిగణిస్తామని రాములు తెలిపారు. మందు తయారీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆనందయ్య కరోనా మందు తయారీ విధానాన్ని నిశితంగా పరిశీలించాం. మందు తయారీలో ఆయుర్వేద మందు ప్రోటోకాల్స్ లేవని పేర్కొన్నారు. అలాగే ఆనందయ్య తయారు చేసిన మందు హానికరం కాదని కూడా తెలిపారు. ఈ మందు కోసం వాడే పదార్ధాలన్నీ వంటింటి ఔషధాలు, ప్రకృతి వనమూలికలేని, కోవిడ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తోందని అన్నారు. కాకపోతే ఈ మందును అనేక ఆరోగ్య సమస్యల కోసం తయారు చేశానని ఆనందయ్య చెప్పారు. కరోనా కోసం తయారు చేశానని చెప్పలేదని' వెల్లడించారు. త్వరలోనే ఆనందయ్య మందుపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రాములు తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్‌పై ప్రధానికి మరోసారి సీఎం జగన్ లేఖ -
ఆనందయ్య మందు శాస్త్రీయతపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. రాములు బృందం ఎదుట ఆయుర్వేద మందు తయారీని ఆనందయ్య చేసి చూపించారు. ఈ మందుపై వివిధ కోణాల్లో ఆయుష్ కమిషనర్ రాములు బృందం అధ్యయనం చేస్తునున్నారు. అయితే మీడియాకు దూరంగా అజ్ఞాత ప్రదేశంలో ఇదంతా జరిగింది. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు. 24న కృష్ణపట్నంకు వెళ్లనున్న ఐసీఎంఆర్ బృందం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి వెళ్లనుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది. అధ్యయన సంస్థల నివేదిక తర్వాత మందు పంపీణిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా కృష్ణపట్నంలో వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ బృందం పర్యటన పూర్తయ్యింది. చదవండి: కరోనా మందు: మళ్లీ క్షీణించిన కోటయ్య ఆరోగ్యం -
మ్యాగజైన్ స్టోరీ 21 may 2021
-
Krishnapatnam: చెట్లక్రియ కమాల్... కరోనా ఢమాల్?
కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపి, రెమ్‌డెసివిర్, ఐవర్‌మెక్టిన్, హెచ్‌సీక్యూ అంతా ఒడిసిన ముచ్చట. కొత్త ప్రొటోకాల్ వేరే వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేల్చిన బాంబు కరోనా రోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నది. ఆక్సిజన్ లేక, వెంటిలేటర్లు లేక వణుకుతున్న జనానికి అనుభవంతో కొందరు, అత్యుత్సా హంతో కొందరు చిత్రమైన వైద్యం చెబుతున్నారు. హైదరాబాద్ డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ (2డి ఆక్సీ గ్లూకోజ్) ఎప్పుడు చేతికి వస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో... ఎక్కడో నెల్లూరు జిల్లా కృష్ణపట్టణంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు కలలోనో, నేరుగానో ఒక సాధువు సూచించిన ఫార్ములా ఇది అని పెరట్లో మొలిచే మొక్కలతో తయారు చేసిన మందు కరోనా రోగులకు ఇవ్వడం, కొంత మందికి కంట్లో చుక్కలుగా వేయడంతో వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతున్నా యనీ, ఆయాసం తగ్గుతుందనీ వచ్చిన వార్త కొత్త ఆశలు రేపింది. సామాజిక మాధ్యమాల ప్రచారం ఊపందుకుని అరలక్ష మంది ప్రజలు బారులు తీరి చికిత్స చేయించుకుంటున్నప్పుడు ఎవరో ఫిర్యాదు చేస్తే జిల్లా వైద్యాధికారి, ఇతరులు మందుకు శాస్త్రీయత, కోవిడ్ నిబంధనల పేరుతో ఆపివేసినారు. వెంటనే వైసీపీ స్థానిక ఎంఎల్ఏ చొరవ తీసు కొని ఉచితంగా ఇస్తున్న ప్రభావవంతమైన మందును ఎట్లా ఆపుతారని అధికారులను ప్రశ్నించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రికి కూడా తెలియజేయడంతో అధికార యంత్రాంగం కదిలి, కొంత విచారణ చేసి, అనుకూల అభిప్రాయాలను చెప్పింది. ఇప్పుడే అందిన వార్త, మందు పనితీరు, శాస్త్రీయత, సురక్షత గురించి ఐసీఎంఆర్ కదిలినట్లు. బహుళ జాతి కంపెనీలే ఏమీ చేయలేకపోతున్నాయని పెదవి విరుస్తున్న వాళ్ళకు ఒక విషయం తెలియాలి. కరోనా కాలంలో ఇన్ని మందులను జనానికి అంటగట్టి ఇప్పుడు పనికి రావని ఎలా అంటున్నారు? ప్రపంచంలో ఫార్మా స్యూటికల్స్‌తో పోటీ పడుతూ ఫైటోస్యూటికల్స్ ఎదుగుతోందని, మనం అల్లోపతిలో వాడుతున్న డిగాగ్జిన్ గుండె మందు, విషం విరుగుడుకు అట్రోపిన్ , క్యాన్సర్‌కు వాడే విన్ క్రిస్టిన్ మన పెరటిచెట్ల నుండి సంగ్రహించినవే అని తెలియాలి. హోమియోపతిలో కూడా చెట్టు క్రియను ఆల్కహాల్‌తో పోటెన్సీ పెంచి ఔషధంగా వాడుతారు. చైనాలో హెర్బల్ మెడిసిన్ తారస్థాయిలో ఉంది. మలేరియాకు క్లోరోక్విన్, క్వినైన్ , ఆర్టిమెస్మన్, శారీరక బలహీనతకు జిన్ సెంగ్, పక్షవాతం, ఇతర నరాల జబ్బులకు జింకోబా చేనా, ఇతర దేశాలు అందించిన చెట్టు ఉత్పత్తులే. ఆనందయ్య మందులోని మూలకాలను, మూలికలను స్పష్టంగా బహిర్గతం చేయడం గొప్ప విషయం. సాధారణంగా ఉచితంగా మందులు ఇచ్చినా ఫార్ములా చెప్పేది లేదంటారు. సీదా సాదా ఆనందయ్య పదిమందికి ఈ ఫలితం అందాలని ఉవిళ్ళూరుతున్నారు. ఏఏ మూలికలతో ఈ మందు తయారయ్యిందో వాటి నిష్పత్తి తెలియజేస్తే ఆయుష్ విభాగాలు వాటిని ప్రయోగ ప్రాతిపది కన కరోనా రోగులకు అంద జేయాలి. ఫలితాలను శాస్త్రీయంగా రికార్డు చేయాలి. అంతర్జాతీయ ఎపిడెమాలజిస్టు శ్రీనాథ్‌రెడ్డిని వైద్య, ఆరోగ్య సలహాదారుడిగా సేవలందించమని అడిగి, చేర్చుకొని ఫలితాలు రాబడుతున్న జగన్ మోహన్‌రెడ్డి యుద్ధప్రాతిపదికన ఆనందయ్య మందు మీద దృష్టి సారించి కేంద్రానికి కూడా నివేదిక అందించాలని కోరుకుందాం. బ్లాక్ ఫంగస్‌కు యునానీ వైద్యం పనిచేస్తుందని ఆ డాక్టర్లు ప్రకటించారు. కరోనా నయమైతే బ్లాక్, వైట్ ఏ ఫంగస్ సమస్య ఉండదు. 2డీజీతో సంచలనమైన తెలుగు రాష్ట్రాల పరిశోధన ఈ కరోనా కాక్ టెయిల్‌తో విశ్వవ్యాపితమవ్వాలని ఆశిద్దాం. - డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు మొబైల్ : 98484 72329 -
ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. ఆనందయ్య.. రాములు ఎదుట ఆయుర్వేద మందు తయారీని చూపించనున్నారు. ఈ సందర్భంగా రాములు మీడియాతో మాట్లాడుతూ, నిన్న(శుక్రవారం) ముత్తుకూరులో కొంతమందితో, ఆనందయ్య వద్ద పనిచేసేవారితో మాట్లాడామని తెలిపారు. ఆనందయ్య మందును ఎలా తయారు చేస్తారో పరిశీలిస్తామని రాములు పేర్కొన్నారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని.. మందు తయారీ పదార్థాలపై ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్టే వచ్చిందని రాములు వెల్లడించారు. ఆనందయ్య మందును తీసుకున్నవారి అభిప్రాయాలనూ సేకరిస్తామన్నారు. ఐసీఎంఆర్ బృందం పరిశీలిన తర్వాత వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటామని ఆయన తెలిపారు. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు. కృష్ణపట్నానికి టీటీడీ బృందం.. తిరుమల: ఈవో ఆదేశంతో టీటీడీ బృందం కృష్ణపట్నానికి వెళ్లింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ ఆయుర్వేద డాక్టర్‌తో కూడిన బృందం కృష్ణపట్నం చేరుకున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న టీటీడీ ఉద్యోగులకు ఆయుర్వేద మందు ఇవ్వాలనే ఆలోచనలో టీటీడీ ఉంది. అప్పటివరకు కృష్ణపట్నం రావొద్దు: జేసీ ఆనందయ్య ఆయుర్వేద మందుపై సీఎంఆర్, ఆయూష్ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని జేసీ హరేంద్రప్రసాద్ తెలిపారు. నివేదిక వచ్చేందుకు వారం, 10 రోజులు పట్టొచ్చని.. ఫైనల్‌గా ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతే మందు పంపిణీ చేపడతామని ఆయన వివరించారు. అప్పటి వరకు ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని జేసీ స్పష్టం చేశారు. చదవండి: ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్ కరోనాకు ఆనందయ్య మందు! -
కరోనా మందుకు వారం పాటు బ్రేక్
-
ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్ పడింది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నేడో రేపో కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం రానుంది. ఇప్పటికే ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. నేడు రాములు ఎదుట ఆనందయ్య.. ఆయుర్వేద మందు తయారుచేసి చూపించనున్నారు అధ్యయనం పూర్తైతే ఆనందయ్యకు మందు పంపిణీకి అనుమతి వచ్చే అవకాశం ఉంది. కాగా, కరోనా నియంత్రణకు ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు కోసం ప్రజలు కృష్ణ పట్నం బాటపట్టారు. ఒక వైపు కరోనా వచ్చిన రోగులు, మరో వైపు కరోనా రాకుండా ఉండేందుకు మందు తీసుకునేందుకు వచ్చిన వేలాది మందితో కృష్ణపట్నం శుక్రవారం కిక్కిరిసింది. కృష్ణపట్నం ఆయుర్వేదం మందుకు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో దేశ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ఆనందయ్య ఇస్తున్న మందుతో కరోనా తగ్గిపోతుందనే నమ్మకంతో జనం కిలో మీటర్ల వరకు క్యూ కట్టారు. రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి ప్రజలు కృష్టపట్నంకు చేరుకున్నారు. జనాల రద్దీతో కిటకిటలాడింది. ఒక్కసారిగా జనాలు రావడంతో కృష్ణపట్నంకు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మందు కోసం సీరియస్ కండీషన్లో ఉన్న కరోనా బాధితులను అంబులెన్స్‌ల్లో సైతం తీసుకువచ్చారు. మందు కోసం గురువారం రాత్రి నుంచే జనం అక్కడికి చేరుకుని గంటల కొద్దీ నిరీక్షించారు. అయితే తగినంత స్థాయిలో వనమూలికలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. కొన్ని రహదారుల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల్లో జనాలను రాకను కొంత వరకు నియంత్రించారు. అయితే ఆనందయ్య తయారు చేసే మందుకు ఇంత ప్రాధాన్యత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఉపయోగం జరుగుతుందా అనే ఉద్దేశంతో ఆయుష్ శాఖను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి విదితమే. కరోనా మందు కోసం ఎవరూ రావొద్దు: ఎస్పీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మందు తయారీ, పంపిణీ ఆలస్యం అవుతుందని, ఇతర ప్రాంతాల నుంచి ప్రజల ఎవరూ కృష్ణపట్నంకు రావొద్దని నెల్లూరు రూరల్ డీఎస్పీ వై. హరినాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మందు పంపిణీకి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లా అధికారులు తెలియజేస్తారన్నారు. ఈ మధ్యలో మందుకోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు కృష్ణపట్నంకు వచ్చి కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పెద్దాస్పత్రి క్యాజువాలిటీ ఖాళీ ప్రతి రోజు కరోనా రోగులు పెద్ద సంఖ్యలో పెద్దాస్పత్రికి చేరుకుని అయ్యా ఒక బెడ్ ఇప్పించడంటూ కనిపించిన వారందరిని కాళ్లావేళ్లా పడి వేడుకునే వారు. పెద్దాస్పత్రికి ప్రతి రోజూ సుమారు 200 వరకు అడ్మిషన్లు వస్తాయి. వాస్తవానికి పెద్దాస్పత్రిలో 864 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. వచ్చే వారిని కాదనలేక 1,000 నుంచి 1,100 మందిని అడ్మిషన్ చేర్చుకుని ఎక్కడో ఒక చోట మంచాలు వేసి సర్దుబాటు చేస్తూ వైద్యం చేసేవారు. బెడ్లు చాలక జర్మన్ షెడ్లు కూడా వేసి వైద్యం చేస్తున్నారు. అయితే కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు కరోనా జబ్బుకు బాగా పని చేస్తోందని ప్రచారం రావడంతో ప్రజలతో పాటు బాధితులు నమ్మడంతో పెద్దాస్పత్రికి శుక్రవారం ఒక్క సారిగా అడ్మిషన్ల సంఖ్య పడిపోయింది. కిక్కిరిసి ఉండే క్యాజువాలిటీ ఖాళీ అయింది. ఖాళీ మంచాలు దర్శన మిచ్చాయి. పలువురు బాధితులు ప్రత్యేక వాహనాల్లో కృష్ణపట్నం మందుకు ఉరుకులు, పరుగులు తీశారు. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు కేవలం 40 అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. ఈ 40 అడ్మిషన్లలో కూడా ఆక్సిజన్ పడిపోయిన వారు, ఐసీయూలో ఉండాల్సి వారే అధికం. వార్డుల్లో ఆక్సిజన్ బెడ్స్‌పై ఉన్న రోగుల బంధువులు పలువురు కృష్ణపట్నం నుంచి మందు తెచ్చి రోగులకు వినియోగించినట్టు సమాచారం. అయితే కృష్ణపట్నం పోయిన రోగులు మందులు తీసుకుని సాయంత్రానికి మళ్లీ కొంతమంది తిరిగి క్యాజువాలిటీకి రావడంతో కొంత హడావుడి కనిపించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆయుర్వేద మందు అధ్యయనానికి సీఎం జగన్ ఆదేశం వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.50 కోట్లు -
కృష్ణపట్నం: ఆయుర్వేదం మందు నిలిపివేత
-
కరోనాకు నేటినుంచి ఆయుర్వేద మందు పంపిణీ
-
ఏపీ: కరోనాకు నేటినుంచి ఆయుర్వేద మందు పంపిణీ
సాక్షి అమరావతి/ముత్తుకూరు: కరోనాను నివారించే ఆయుర్వేద మందు పంపిణీకి రంగం సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో మూడు రోజులపాటు నిలిపివేసిన మందు తయారీ తిరిగి మొదలైంది. శుక్రవారం నుంచి పంపిణీ చేసేందుకు నిర్వాహకుడు బొనిగి ఆనందయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నివారణకు మందు బాగా పనిచేస్తుందని తెలియడంతో వేలాది మంది దీని కోసం తరలివచ్చారు. అక్కడ కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని, ప్రజలు గుంపులు గుంపులుగా ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతుందని అధికారులు మందు పంపిణీని సోమవారం నిలిపివేశారు. పత్రికల్లో వచ్చిన వార్తను లోకాయుక్త సుమోటాగా స్వీకరించి.. నివేదిక పంపాల్సిందిగా కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబును ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ, నెల్లూరు ఆర్డీవో, జిల్లా పంచాయతీ అధికారి, ఆయుర్వేద వైద్య నిపుణులతో కూడిన బృందం సోమవారం మందు ఇస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి.. తయారీ విధానం, వినియోగించే దినుసుల వివరాలు తెలుసుకుని కొంత మందును పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఇదిలావుండగా.. మందు పంపిణీ నిలిపివేతపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారులతో మాట్లాడారు. లోకాయుక్త ఆ మందుకు పరీక్షలు నిర్వహించి, ల్యాబ్ రిపోర్టులు పంపాలని మాత్రమే ఆదేశించిందని, పంపిణీ నిలిపివేయాలని ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ మందు పంపిణీ చేయిస్తామని ఎమ్మెల్యే కాకాణి ప్రకటించారు. మందులో వినియోగించే దినుసులివీ.. అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండ పల్లేరు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింట ఆకులు, తెల్ల జిల్లేడు పూల మొగ్గలు, ముళ్ల వంకాయలు. అన్నీ మోతాదుకు లోబడే ఉన్నాయి కృష్ణపట్నంలో కరోనా నియంత్రణకు ఆనందయ్య ఇస్తున్న మందు నమూనాలను సేకరించి హైదరాబాద్‌లో గుర్తింపు పొందిన ల్యాబొరేటరీలో పరీక్ష చేయించినట్టు ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఆ మందులో ఉన్న పదార్థాలు మోతాదుకు లోబడే ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తిస్థాయి ల్యాబ్ ఫలితాలు రావడానికి వారం రోజులు పడుతుందన్నారు. -
క్రిస్ సిటీ టెండర్లకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ(క్రిస్ సిటీ) మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. మొత్తం 12,944 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న కృష్ణపట్నం నోడ్‌లో తొలిదశలో 2,134 ఎకరాలకు సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలపడంతో సుమారు రూ.1,200 కోట్లతో ఈపీసీ టెండర్లను ఏపీఐఐసీ పిలవనుంది. ఈ టెండర్లను న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపుతున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి జూన్‌లో పనులు మొదలు పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రెండేళ్లలో అందుబాటులోకి... క్రిస్ సిటీ పనులు జూన్‌లో మొదలు పెట్టి రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని ఏపీఐఐసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 12,944 ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, 5.15 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాజెక్టు రిపోర్టు రూపొందించిన జాకబ్ సంస్థ అంచనా వేసింది. 99,400 మంది నివాసం ఉండేలా ఈ పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తున్నారు. మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్న క్రిస్‌సిటీలో ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఫైబర్ తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా అభివృద్ధి చేస్తున్నారు. పోర్టుల ఆధారంగా అభివృద్ధి చెందిన చెన్నై, కోల్‌కతా లాంటి నగరాల మాదిరిగా పరిశ్రమలతోపాటు నివాసయోగ్యంగా ఉండేలా ఫ్యూచర్ వర్క్‌లైఫ్ అనే ట్యాగ్‌లైన్‌తో క్రిస్ సిటీ బ్రాండింగ్ చేస్తున్నట్లు రవీన్‌కుమార్ తెలిపారు. అభివృద్ధి చేస్తున్న మొత్తం ప్రాంతంలో 46 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. 13.9 శాతం ఉద్యోగులు అక్కడే నివసించేలా గృహ సముదాయాల నిర్మాణానికి వినియోగిస్తారు. లాజిస్టిక్ అవసరాలకు 5.6 శాతం కేటాయిస్తారు. 10.9 శాతం పర్యావరణ పరిరక్షణ కోసం ఖాళీగా ఉంచుతారు. క్రిస్ సిటీ తొలిదశ ద్వారా సుమారు రూ.18,548 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 98,000 మందికి ఉపాధి లభిస్తుందని ఏపీఐఐసీ అంచనా వేసింది. ఎస్పీవీకి భూమి బదలాయింపు.. కృష్ణపట్నం నోడ్ తొలిదశ పనులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపి రూ.2,139.44 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏర్పాటైన ఎస్పీవీకి భూమి బదలాయింపులో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పనులు ప్రారంభించేందుకు ఆటంకాలన్నీ తొలగిపోయినట్లు ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. -
కృష్ణపట్నంలో ‘పోస్కో’ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్!
సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి దక్షిణ కొరియాకు చెందిన ఉక్కు దిగ్గజం పోస్కో స్టీల్ ఆసక్తి వ్యక్తం చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. తదుపరి చర్చల కోసం సియోల్ నుంచి ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కోరుతూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్ పోస్కో ఇండియా సీఎండీ సంగ్ లేకి లేఖ రాశారు. కృష్ణపట్నంలో యూనిట్ నెలకొల్పే ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఎంపిక చేయడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు విషయంపై చర్చిద్దామని పేర్కొన్నారు. పోస్కో ఇండియా బృందం గతేడాది డిసెంబర్ 18న కృష్ణపట్నం రావడంతో పాటు ఫిబ్రవరి 10న సంగ్లే స్వయంగా కృష్ణపట్నం వచ్చి పోర్టు అధికారులతో చర్చలు జరపడం ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేసిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై తమ చిత్తశుద్ధిని తెలియచేస్తోందన్నారు. దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉంటుందన్నారు. కృష్ణపట్నం.. రాష్ట్ర అభివృద్ధి కేంద్రం రానున్న కాలంలో చెన్నై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాలతో పోటీ పడుతూ పారిశ్రామికాభివృద్ధి జరిగే అవకాశాలు కృష్ణపట్నంలో పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కేంద్రంగా ఎదగనుందని కరికల్ వలవన్ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం వ్యూహాత్మక ప్రాంతంలో ఉందన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన పోర్టు పక్కనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం ఎగుమతులు, దిగుమతులకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. దక్షిణాసియాలోనే పూర్తి ఆటోమేటెడ్ పోర్టు కావడంతోపాటు భారీ నౌకలు రావడానికి అనుగుణంగా ఈ పోర్టును నిర్మించారన్నారు. ఒప్పందం కుదుర్చుకుంటే సాధ్యమైనంత త్వరగా భూమి అప్పగించేలా చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ ఉక్కు కర్మాగారం యాంకర్ పరిశ్రమగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందన్నారు. పారిశ్రామిక పాలసీ 2020–23 ఇప్పటికే అమల్లో ఉందని, ఇవికాకుండా పెట్టుబడి విలువ, ఉద్యోగ అవకాశాలు, అనుబంధ కంపెనీల వృద్ధి లాంటి ప్రతిపాదనలతో వస్తే అవసరమైన రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
రూ.1,200 కోట్లతో కృష్ణపట్నం నోడ్ పనులు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా 12,944 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న కృష్ణపట్నం నోడ్ (కృష్ణపట్నం పారిశ్రామికవాడ)కు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం లభించడంతో పనులు ప్రారంభించడానికి ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి దశలో 2,134 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కింద రూ.2,139.44 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో కృష్ణపట్నం నోడ్‌లో సుమారు రూ.1,200 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ఈపీసీ విధానంలో టెండర్లు పిలవడానికి ఏపీఐఐసీ రంగం సిద్ధం చేసింది. రహదారుల నిర్మాణం, నీటి వసతి, మురుగు నీటి శుద్ధి, విద్యుత్ వంటి కీలక మౌలిక వసతుల కల్పనకు రూ.1,200 కోట్ల విలువైన పనులకు ఈ నెలాఖరులో ఏపీఐఐసీ టెండర్లు పిలవనుంది. ఇందులో రహదారుల నిర్మాణానికి రూ.432 కోట్లు, విద్యుత్ సౌకర్యం కోసం రూ.420 కోట్లు, నీటి వసతి కల్పన, మురుగునీటి శుద్ధి వంటి పనులకు రూ.348 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. జూలై మొదటి వారంలో కృష్ణపట్నం నోడ్ పనులు ప్రారంభించాలని ఏపీఐఐసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. నివాసయోగ్యంగానూ అభివృద్ధి: కేవలం పారిశ్రామిక యూనిట్లే కాకుండా నివాస యోగ్యంగా కృష్ణపట్నం నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పోర్టు ఆధారంగా అభివృద్ధి చెందిన చెన్నై, కోల్‌కతా నగరాల మాదిరిగానే పరిశ్రమలతో పాటు నివాస యోగ్యంగా కూడా ఉండేలా అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అభివృద్ధి చేస్తున్న మొత్తం ప్రాంతంలో 46 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. ఉద్యోగులు అక్కడే నివసించే విధంగా గృహ సముదాయాలు నిరి్మంచడానికి 13.9 శాతం వినియోగించనున్నారు. లాజిస్టిక్ అవసరాలకు 5.6 శాతం కేటాయించి, పర్యావరణ పరిరక్షణ కోసం 10.9 శాతం ఖాళీగా ఉంచుతారు. తొలి దశలో అభివృద్ధి చేసే ఈ నోడ్ ద్వారా సుమారు 18,548 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 98,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ప్రధానంగా టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్, ఆప్టికల్ వంటి తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. పనులు మొదలుపెట్టిన నాటి నుంచి మూడేళ్లలో పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేలా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ ఎగుమతికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీలోని కృష్ణపట్నం, కర్ణాటక తూముకూరులో పారిశ్రామిక కారిడార్లతో పాటు గ్రేటర్ నోయిడాలోని మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్ & మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ లకు కేంద్రం అనుమతి తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. మూడు పారిశ్రామిక కారిడార్లకు కలిపి కేంద్ర ప్రభుత్వం రూ. 7,725 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక కారిడార్లను నిర్మించడం ద్వారా 2.8 లక్షల మందికి ఉపాది లభించనున్నట్లు అంచనా వేసినట్లుగా పేర్కొన్నారు. కాగా కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదిత వ్యయం రూ.2,139 కోట్లుగా ఉందని తెలిపారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల పెద్దఎత్తున ఉపాధి అవకాశాల కల్పనతో పాటు, తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ వల్ల లాజిస్టిక్ ఖర్చు తగ్గింపుతో పాటు, నిర్వహణ సామర్థ్యం మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వీటితో పాటు భారత్, భూటాన్ దేశాల మధ్య శాంతి భద్రతలకు సంబంధించి ఎంవోయూకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
కృష్ణపట్నం వద్ద ఫిషింగ్ హార్బర్
రూ.300 కోట్లతో అంచనాలు 'సైసెఫ్' బృందం పర్యటన ముత్తుకూరు: మండలంలోని కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుపై అధ్యయనం చేసే నిమిత్తం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ అధికారుల (సైసెఫ్–బెంగళూరు) బృందం శుక్రవారం పర్యటించింది. ఈ సందర్భంగా సైసెఫ్ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఇంజినీర్ మురళీధర్, ఫిషరీస్ ఏడీ హరికిరణ్, తదితరులు విలేకరులతో మాట్లాడారు. రూ.300 కోట్ల అంచనాలతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుపై ప్రాథమిక అధ్యయనం చేయనున్నామన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 40, రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నిధులను సమకూరుస్తుందన్నారు. సముద్రతీరంలో హార్బర్ నిర్మాణంలో బ్రేక్ వాటర్స్ నిర్మాణానికే రూ.200 కోట్ల వ్యయమవుతుందని వివరించారు. బకింగ్‌హామ్ కెనాల్ క్రీక్‌లో హార్బర్ నిర్మాణానికే రూ.30 కోట్లు సరిపోతుందన్నారు. హార్బర్ నిర్మాణానికి ముందు టోఫోగ్రపీ సర్వే, సాయిల్ టెస్టింగ్, తదితర పరీక్షలను నిర్వహించాల్సి ఉందని, అధ్యయనంలో వెల్లడయ్యే అంశాలను సైసెఫ్ డైరెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. 20 రోజుల తర్వాత రెండో సర్వే జరుగుతుందన్నారు. తహశీల్దార్ చెన్నయ్య, ఎఫ్డీఓ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. ‘పోర్టు నుంచి అభ్యంతరం?’ కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి పోర్టు నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయేమోనని సైసెఫ్ డీడీ కృష్ణమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. ఆర్కాట్పాళెం వద్ద మత్స్యకారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనికి స్థానిక నాయకులు ఈదూరు రామ్మోహన్‌రెడ్డి, ఏకొల్లు కోదండయ్య, మత్స్యకార పెద్దలు యల్లంగారి రమణయ్య, తదితరులు స్పందిస్తూ.. 11 మత్స్యకార గ్రామాలకు అవసరమైన ఫిషింగ్ హార్బర్ కోసం కలెక్టర్, ఎమ్మెల్సీ, అవసరమైతే ముఖ్యమంత్రితోనైనా చర్చిస్తామన్నారు. హార్బర్ లేక చేపల వేట, అమ్మకాలు కోల్పోయి, ఆర్థికంగా దెబ్బతిన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు ఏర్పాటుకు ముందే ఇక్కడ హార్బర్ ఉందని, మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే మహిళలకు ఉపాధి లభిస్తుందని, మత్స్యకార గ్రామాలకు పూర్వ వైభవం వస్తుందన్నారు. జువ్వలదిన్నెకు ఇటువైపు ఉన్న గ్రామాలకు ఇక్కడ నిర్మించే ఫిషింగ్ హార్బర్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఆవుల గోవిందు, అక్కయ్యగారి మొలకయ్య, మత్స్యకారులు పాల్గొన్నారు. -
ఏపీజెన్‌కోలో కాలిన ట్రాన్స్ఫార్మర్లు
ఒకే కన్వేయర్ నుంచి బొగ్గు రవాణా ట్రయల్ రన్ దశలో అవాంతరాలు ముత్తుకూరు: కృష్ణపట్నంపోర్టు నుంచి నేలటూరులోని ఏపీజెన్కో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు బొగ్గు రవాణా చేసే కన్వేయర్ బెల్టు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. దీనితో బొగ్గు రవాణా భారమంతా ఒక్క కన్వేయర్‌పై పడడంతో దీనికి తరచూ అంతరాయం ఏర్పడుతోంది. పోర్టు నుంచి బొగ్గును ఇటీవల వరకు టిప్పర్ల ద్వారా రవాణా జరిపారు. బొగ్గు తరలింపునకు రెండు కన్వేయర్ల నిర్మాణం పూర్తయితే, ట్రయల్ రన్ ప్రారంభించారు. ఒక్కొక్క కన్వేయర్ నుంచి గంటకు 1,300 టన్నుల బొగ్గు రవాణా జరుగుతుంది. ఈ విధంగా ప్రాజెక్ట్‌కు ఒక రోజుకు 15,000 టన్నుల బొగ్గు రవాణా జరగాలి. ఒక్కొక్క కన్వేయర్ బెల్టు మోటారు పనిచేసేందుకు రెండు ట్రాన్స్ఫార్మర్లు పనిచేయాలి. గుజరాత్ నుంచి తెచ్చిన వీటితో కన్వేయర్లను ట్రయల్‌రన్ జరుపుతున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం ఒక కన్వేయర్‌కు సంబంధించి రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. డిజైన్లలో లోపం వల్ల ఇవి కాలిపోయినట్టు నిపుణులు చెబుతున్నారు. దీంతో రెండో కన్వేయర్‌పై రవాణా ఒత్తిడి పెరగడంతో తరచూ సాంకేతిక లోపం ఏర్పడి, రవాణా నిలిచిపోతోంది. ఫలితంగా ప్రాజెక్టలో అవసరమైన మేరకు బొగ్గు నిల్వ చేయలేకపోతున్నారు. ఈ నెల 22 నాటికి ట్రాన్స్ఫార్మర్లు రాక: కాలిపోయిన కన్వేయర్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చే ప్రక్రియ ప్రారంభమైనట్టు జెన్కో ఎస్ఈ దేవప్రసాద్ తెలిపారు. డిజైన్లలో మార్పు చేసి ఇప్పటికే ఒక ట్రాన్స్ఫార్మర్ రప్పించామన్నారు. రెండవది ఈ నెల 22వ తేదీనాటికి చేరుతుందన్నారు. వీటిని అమర్చడం పూర్తిచేసి, 25 తేదీకల్లా బొగ్గు రవాణా ప్రారంభిస్తామన్నారు. ట్రయల్ రన్ దశలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు బిల్లుల చెల్లింపులు ఉండవన్నారు. -
రైల్వే జీఎం గుప్తా రాక నేడు
రైల్వేస్టేషన్ల ముస్తాబు కోళ్లమిట్ట క్రాసింగ్‌కు గేటు ముత్తుకూరు : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా శనివారం కృష్ణపట్నంపోర్టుకు వస్తున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. జీఎం రాక సందర్భంగా వెంకటాచలం–పోర్టు మధ్య ఉన్న నిడిగుంటపాళెం, కృష్ణపట్నం రైల్వే స్టేషన్లను ముస్తాబు చేశారు. విజయవాడ–గూడూరు «మధ్య రైల్వే శాఖ 3వ రైలుమార్గం మంజూరు చేసింది. త్వరలో రైలు మార్గం నిర్మాణం జరిగే ప్రాంతాలను పరిశీలించే నిమిత్తం జీఎం వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పోర్టు ద్వారా రవాణా జరిగే సరుకులు, అవసరమయ్యే సదుపాయాలు, ఆదాయ వనరులు తదితర అంశాలను కృష్ణపట్నంపోర్టు అధికారులతో జీఎం సమీక్ష చేస్తారని తెలియవచ్చింది. కోళ్లమిట్ట క్రాసింగ్‌కు గేటు మంజూరు కృష్ణపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో కోళ్లమిట్ట వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్‌కు గేటు నిర్మించేందుకు అనుమతి లభించిందని రైల్వే వర్గాలు తెలిపాయి. గేటు లేని ఈ రైల్వే క్రాసింగ్‌పై సాక్షి దినపత్రికలో పలుమార్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. -
2019 నాటికి జెన్కో మూడో యూనిట్
స్వదేశీ బొగ్గుతో విద్యుదుత్పత్తి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బాలాజీ ముత్తుకూరు: మండలంలోని నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్కో సూపర్‌క్రిటికల్ థర్మల్ కేంద్రంలో మూడో యూనిట్ కింద తలపెట్టిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు మరో 32 నెలల్లో పూర్తి కానుంది. ఈ యూనిట్ ద్వారా 2019 జూన్ 14వ తేదీన విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇదివరకే సేకరించిన భూముల్లో లెవలింగ్ పనులు పూర్తిచేసి, ఫౌండేషన్ పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బాయిలర్, టర్బైన్ పనులను రూ.2,307 కోట్లతో బీహెచ్ఈఎల్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సంస్థ కాంట్రాక్టు గత డిసెంబరు నుంచి మొదలైంది. మరో వైపు బ్యాలెన్స్ ఆఫ్ ప్రాజెక్టు(బీఓపీ) పనులను రూ.2,660 కోట్లతో టాటా సంస్థ చేపడుతోంది. ఈ సంస్థ 36 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. మంచినీటి ద్వారా విద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో మంచినీటి ద్వారా విద్యుదుత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. దీంతో పాటు ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న 1, 2 యూనిట్లు కూడా మంచినీటితోనే విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తాయి. ఇందుకోసం ప్రప్రథమంగా రూ.600 కోట్లతో ‘ఫ్యూడైజ్డ్ డీ సల్ఫర్’(ఎఫ్‌జీడీ) ప్లాంటు నిర్మించనున్నారు. ఇప్పటి వరకు యాష్‌పాండ్‌లో సముద్రపునీటి రూపంలో విడుదలయ్యే బూడిద ఈ ప్లాంటు ద్వారా మంచినీటి రూపంలో విడుదలవుతుందన్న మాట. స్వదేశీ బొగ్గుతో మూడో యూనిట్ –బాలాజీ, చీఫ్ ఇంజనీరు జెన్కో ప్రాజెక్ట్‌లో నిర్మించే మూడో యూనిట్ ద్వారా పూర్తి స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీనికి తగిన టెక్నాలజీతో ప్రాజెక్ట్ నిర్మాణమవుతోంది. త్వరలో కోల్ లింకేజీ ఖరారవుతుంది. ఈ యూనిట్లో కాలుష్యం పరిమాణం కూడా చాలా తగ్గుతుంది. అనుకున్న గడువు కంటే ముందుగానే ఈ యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది. -
కృష్ణపట్నంలో ఎరువుల తయారీ పరిశ్రమ
సాక్షి, న్యూఢిల్లీ: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఎన్పీకే ఎరువుల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఓసీపీ(మొరాకో), ప్రభుత్వ రంగ కో-ఆపరేటివ్ ఎరువుల సంస్థ క్రిబ్కో సంయుక్త భాగస్వామ్యంతో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి మన్సుక్ ఎల్ మాండవ్య సమక్షంలో ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇరు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2019 ఏప్రిల్ నాటికి పరిశ్రమను ఏర్పాటు చేసి, ఉత్పత్తిని ప్రారంభిస్తామని క్రిబ్కో ఎండీ ఎన్.సాంబశివరావు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలంతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకొచ్చిందని చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. -
ఏపీ జెన్కోలో ఆడిటింగ్ బృందం
ముత్తుకూరు: టీఈసీ విద్యాసాగర్ అంతర్జాతీయ భద్రతా ఆడిట్ నిపుణులు మంగళవారం నేలటూరులోని ఏపీజెన్కో ప్రాజెక్టులోని పలు కీలక విభాగాలను తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలు సమీక్షించారు. భద్రతా ఆడిటర్లు జీ సాయినా«ద్, లక్ష్మీనారాయణ్ నాయక్, ప్రియభారత్ మహంతీ, జ్యోతిప్రియ, మహేంద్ర తదితరులు ప్రాజెక్టులోని బొగ్గు సంభాళింపు, బూడిద, రసాయనిక, పరికరాల నియంత్రణ తదితర విభాగాలను నిశితంగా పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వాహకులు చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, తీసుకొన్న చర్యలను సమీక్షించారు.ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించి, ప్రాజెక్టు ఇంజనీర్లు పలు సూచనలు అందచేశారు. భద్రతా అధికారి శేషాద్రిశేఖర్, ఎస్ఈ దేవప్రసాద్, సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు వీరి వెంట పర్యటించారు. ప్రాజెక్టులో పరిశీలించిన అంశాలను ఆడిటర్లు ఒక నివేదిక రూపంలో డైరెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్కి అందచేస్తారని జెన్కో ఇంజనీర్లు తెలిపారు. 04ఎస్సార్పీ26: జెన్కో ప్రాజెక్టులో ఆడిటింగ్ బృందం పర్యటిస్తున్న దృశ్యం -
పరిశ్రమలకు అనుకులమైన ప్రాంతం
నెల్లూరు(పొగతోట) : పరిశ్రమల ఏర్పాటుకు నెల్లూరు జిల్లా ఎంతో అనుకూలమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు ఉందని, త్వరలో దగదర్తిలో విమానాశ్రయం వస్తుందని తెలిపారు. జాతీయ రహదారికి సమీపంలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయన్నారు. దీంతో పరిశ్రమలు అధికంగా ఏర్పాటుచేసే అవకాశం ఉందని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు 40 వేల ఎకరాల అనుకులమైన భూములను గుర్తించి బ్యాంకింగ్ చేయడం జరిగిందన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో 70 రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. వాటిన్నింటిని ఒకేచోటకు తరలిస్తే కాలుష్కం తగ్గుతుందన్నారు. రైస్‌మిల్లుల ఏర్పాటుకు 500 ఎకరాల భూములు అవసరమవుతాయని కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో ఫార్మసి కంపెనీలు ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నయని తెలిపారు. దగదర్తి విమానాశ్రయ భూసేకరణ ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. -
యూనిట్ బ్రేకర్లు ప్యాడ్ల మార్పు
హాట్‌లైన్ సిబ్బంది సాహసం ముత్తుకూరు నేలటూరులోని ఏపీజెన్కో ప్రాజెక్టులోని 800 మెగావాట్ల స్విచ్‌యార్డులో కరిగిపోయి, దెబ్బతిన్న యూనిట్ బ్రేకర్ ప్యాడ్లను బుధవారం సాహసంతో హాట్‌లైన్ సిబ్బంది తొలగించి, కొత్తవి అమర్చారు. విజయవాడ £ý ర్మల్ విద్యుత్కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక హాట్‌లైట్ సిబ్బంది శ్రీనివాసరావు, శ్రీనివాస్‌లు విద్యుత్ సరఫరా జరుగుతుండగానే ఈ సాహసం ప్రదర్శించారు. రూ.2 లక్షల విలువైన ప్రత్యేక సూట్ ధరించి, ఎల్తైన చోట ఉత్కంఠ పరిస్థితిలో ఆన్లైన్లో కరిగిపోయిన ప్యాడ్లను తొలగించి, కొత్తవి అమర్చారు. ఈ సాహసకృత్యాన్ని సీఈ చంద్రశేఖరరాజు, ఎస్ఈలు దేవప్రసాద్, రమేష్ముని, సంబంధిత విభాగపు ఇంజనీరు శ్రీనివాసరావు, ముఖ్యసంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పరిశీలించారు. హాట్‌లైన్ సిబ్బంది నైపుణ్యాన్ని ప్రశంసించారు. -
నిర్మాణ పనుల్లో మెళకువలు పాటించాలి
ఏపీ జెన్కో ప్రాజెక్టు సీఈ బాలాజీ ముత్తుకూరు: ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మెళకువలు పాటించాలని ఏపీజెన్కో ప్రాజెక్టు సీఈ (నిర్మాణం) పీ బాలాజీ అన్నారు. సమావేశ మందిరంలో సోమవారం జరిగిన సూపర్వైజర్ల అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. 3వ యూనిట్ కింద మరో 800 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం మొదలవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్ట్రక్చర్ల నిర్మాణ పనుల్లో నిర్ధేశించిన జాగ్రత్తలు పాటించాలని, భద్రతా నియమాలు ఉల్లంఘించవద్దని సూచించారు. విశ్రాంత పర్యవేక్షక ఇంజనీర్ కోటేశ్వరావు మాట్లాడుతూ, నేల పరీక్షలు, నీటి నమూనాల పరీక్షల అవసరాన్ని వివరించారు. ప్లాస్టరింగ్, క్యూరింగ్‌లో తీసుకోవాల్సిన చర్యలపై దృశ్య, శ్రవణ విధానం ద్వారా విశదీకరించారు. కార్యక్రమంలో ఎస్ఈలు రమణారెడ్డి, కోటేశ్వరావు, ముఖ్య సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ, టాటా ప్రాజెక్టు ప్రతినిధి ఎల్ కాళేశ్వరావు పాల్గొన్నారు. -
1వ యూనిట్లో 650 మెగావాట్లు
ముత్తుకూరు : నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్టులో 1వ యూనిట్ కింద 650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ప్రాజెక్టు సీఈ చంద్రశేఖరరాజు మంగళవారం తెలిపారు. 2వ యూనిట్ ఓవర్ ఆయిలింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ యూనిట్ నుంచి 25, 26వ తేదీల్లో విద్యుత్ ఉత్పత్తి జరగవచ్చని తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 3.50 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయని పేర్కొన్నారు. -
6 నుంచి విద్యుత్ ఉత్పత్తి
ముత్తుకూరు : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరులోని ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్ట్‌లో ఓవర్ ఆయిలింగ్ కారణంగా ఉత్పత్తి నిలిపి వేసిన 1వ యూనిట్లో ఈ నెల 6వ తేదీ నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుందని ప్రాజెక్ట్ ఇంజనీర్లు బుధవారం తెలిపారు. 2వ యూనిట్లో ప్రస్తుతం 650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్‌లో బొగ్గు నిల్వలు 3.80 లక్షల టన్నులున్నాయన్నారు. -
బాయిలర్‌పై నుంచి పడి కార్మికుడి మృతి
ఏపీ జెన్కో ప్రాజెక్టులో విషాదం ముత్తుకూరు: నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీ జెన్కో ప్రాజెక్టులో 1వ యూనిట్ బాయిలర్‌పై నుంచి గురువారం ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు కింద పడి మృతి చెందాడు. ఇంజనీర్ల కథనం ప్రకారం..1వ యూనిట్లో ఇటీవల ఓవర్ ఆయిలింగ్ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా బాయిలర్‌లోని ప్రైమరీ ఏర్ డస్ట్ వద్ద బ్రదర్స్ సంస్థ తరపున పనులు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన బోనా రామదాసు(24) వెల్డింగ్ పనులు చేసేందుకు సిద్ధమవుతూ ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రామదాసు అక్కడికక్కడే చనిపోయాడు. ఇటీవల మాదరాజుగూడూరుకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు బాయిలర్‌పై నుంచి పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని ప్రాజెక్టులోని నాగాలమ్మ గుడిలో ఇటీవల అధికారులు పూజలు చేశారు. వరుస ప్రమాదాలతో జెన్కో ఇంజనీర్లు తలలు పట్టుకుంటున్నారు. -
శరవేగంగా రైల్వే సొరంగం పనులు
8 కిలోమీటర్లు పొడవు రూ.470.29 కోట్ల వ్యయం రాపూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి కడప జిల్లా ఓబులవారిపల్లి వరకు నిర్మించనున్న రైల్వే మార్గంలో భాగంగా నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మాధవయ్యపాళెం( రాపూరు సమీపంలోని వెలుగొండల్లో ) వద్ద రైల్వే సొరంగమార్గ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వెలుగొండల్లో అటువైపు వైఎస్సార్ జిల్లా ఇటు వైపు నెల్లూరు జిల్లా ఉండడం తెలిసిందే. ఇప్పటికే రెండు జిల్లాలను కలుపుతూ రాపూరు–చిట్వేలి మార్గమధ్యలో ఘాట్ రోడ్డు నిర్మించారు. నూతనంగా రైల్వే సొరంగ మార్గానికి ప్రభుత్వం రూ.470.29 కోట్లు కేటాయించడంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మార్గం సుమారు 8 కిలోమీటర్ల పోడవు ఉంటుందని రైల్వే వికాస్ నిగామ్ లిమిటెడ్ అధికారులు తెలిపారు. చెర్లోపల్లి వద్ద పనుల నిర్వహణ: వైఎస్సార్ జిల్లా చిట్వేలి మండలం చెర్లోపల్లి గ్రామ వెలుగొండల్లో రైల్వే సొరంగం మార్గ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు కిలో మీటరు, రాపూరు సమీప అడవుల్లో 750 మీటర్లు పూర్తయ్యాయి. రెండేళ్లల్లో పూర్తికావచ్చు: రాపూరు–చిట్వేలి మార్గ మధ్యలో నిర్మిస్తున్న సొరంగం సుమారు 2 సంవత్సరాల్లో పూర్తి కావచ్చని రైల్వే అధికారులు చెప్పారు. పనులు పూర్తయితే ఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నంకు ఇనుపఖనిజం, ముగ్గురాళ్లు నేరుగా కృష్ణపట్నంకు తరలించవచ్చన్నారు. -
5 రోజుల్లోనే..కృష్ణపట్నం టు బంగ్లాదేశ్
♦ 42 ఏళ్ల తర్వాత నేరుగా కార్గో సేవలు ఆరంభం ♦ 30 నుంచి 5 రోజులకు తగ్గిన రవాణా సమయం ♦ 25-50 నుంచి శాతం తగ్గనున్న వ్యయం ♦ పత్తి రైతులకు లాభం: పోర్టు సీఈఓ కృష్ణపట్నం పోర్టు నుంచి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి ; బంగ్లాదేశ్-భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ఘట్టానికి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవు వేదికగా నిలిచింది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కుదుర్చుకున్న జల రవాణా ఒప్పందం 42 ఏళ్ల తర్వాత సోమవారం వాస్తవ రూపం దాల్చింది. గతేడాది ప్రధాని నరేంద మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించటం తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ నుంచి ‘నీసా పారిబాహన్’ సంస్థకు చెందిన ఎం.వి హార్బర్ నౌక ఈ నెల 23న బయలుదేరి సోమవారం కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. దీని ద్వారా తొలిసారిగా 40 టీఈయూ (ట్వంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్) పత్తిని బంగ్లాదేశ్‌లోని ఐసీటీ పన్గాన్ రేవుకు పంపుతున్నారు. పత్తి బేళ్ల లోడింగ్ అనంతరం ఈ నౌక మంగళవారం బయలుదేరి, ఏప్రిల్ 3న పన్గాన్ పోర్టుకు చేరుతుంది. నౌకలోకి పత్తి లోడింగ్ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.జానకి లాంఛనంగా ప్రారంభించారు. బంగ్లా ఎంపీ నూర్ ఏ అలామ్ చౌదురీ, ‘నీసా పారిబహాన్’ ఎండీ నాసిర్ అహ్మద్ చౌదురి, సీఈఓ సిరాజుర్ రెహ్మాన్, పన్గాన్ పోర్టు ఇన్‌ల్యాండ్ కంటైనర్ టెర్మినల్ మేనేజర్ అహ్మదుల్ కరీమ్ చౌదురి, కృష్ణపట్నం పోర్టు సీఈఓ అనిల్ యెండ్లూరి, కస్టమ్స్ అధికారులు కేక్ కట్ చేసి, ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి విలేకరులతో మాట్లాడారు. మాట్లాడుతూ... ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌కు నౌకల ద్వారా సరుకులు పంపించాలంటే శ్రీలంక, సింగపూర్ దేశాలు మీదుగా వెళ్లాల్సి వచ్చేదని, ఇందుకు 25 నుంచి 30 రోజుల సమయం పట్టేదని తెలియజేశారు. ‘‘ఇప్పుడు నేరుగా సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల కేవలం ఐదు రోజుల్లో బంగ్లాదేశ్‌కు చేరుకోవచ్చు. దీనివల్ల సమయంతో పాటు రవాణా వ్యయం కూడా 25 నుంచి 50 శాతం వరకు కలసి వస్తుంది’’ అని తెలియజేశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ రేవు ద్వారా తూర్పు తీర రాష్ట్రాలకు నేరుగా సరుకు రవాణా చేసే వెసులుబాటు కలిగిందన్నారు. వస్త్రాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న బంగ్లాదేశ్ భారీగా పత్తిని దిగుమతి చేసుకుంటోందని, ఇలా దిగుమతి చేసుకుంటున్న పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా 14 శాతంగా ఉందని తెలియజేశారు. ఈ జల రవాణా లింకు ఏర్పడటం వల్ల స్థానిక పత్తి రైతులకు ప్రయోజనం క లుగుతుందన్నారు. అలాగే మిరప, పప్పు దినుసులు ఎగుమతి చేయడమే కాకుండా నేరుగా జనపనార బస్తాలను దిగుమతి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు నూర్ ఆలమ్ చౌదరి మాట్లాడుతూ ఢాకాకు సమీపంలో టెక్స్టైల్ కంపెనీలకు కావాల్సిన ముడిసరుకును పన్గాన్లోని నదీ రేవు మార్గం వరకు నేరుగా దిగుమతి చేసుకునే వెసులుబాటు ఏర్పడిందన్నారు. రోడ్డు రవాణా వ్యయం తగ్గడమే కాకుండా, విలువైన సమయం కాపాడుకుంటూ తక్కువ రేటుతో సరుకు రవాణా చేసుకోవచ్చన్నారు. ఇండియాలోని ఇతర రేవు పట్టణాలతో నేరుగా రవాణా పెంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. అనంతరం ‘నీసా పారిబహాన్’ ప్రతినిధులు తమ దేశంలో ఓడ రేవుల ద్వారా సాధిస్తున్న ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎగుమతిదారుల సందేహాలను పోర్టు సీఈఓ నివృత్తి చేశారు. -
సంక్రాంతిపల్లిలో ఇళ్ల కూల్చివేత
రాపూరు : కృష్ణపట్నం-ఓబులవారిపల్లి రైల్వేలైను నిర్మాణం కోసం సంక్రాంతిపల్లి ఎస్సీ కాలనీ వద్ద ఇళ్లను మంగళవారం అధికారులు భారీబందోబస్తు మధ్య కూల్చివేశారు. అధికారుల చర్యలను స్థానికులు ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. వివరాల్లోకెళితే.. సంక్రాంతిపల్లి పున రావాస ప్రాంతంలో 32 మంది ఎస్సీలకు 1996లో ప్రభుత్వం నివేశన స్థలాలను కేటాయించింది. అక్కడ వాతావరణం సరిగా లేదంటూ లబ్ధిదారులు సమీపంలోని భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. ఇటీవల తమకు కేటాయించిన పట్టాభూముల్లో 46 ఇళ్లు కట్టారు. రైల్వే లైను నిర్మాణానికి ఈ 46 ఇళ్లు అడ్డుగా ఉన్నాయని రైల్వే అధికారులు జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించారు. వీటి తొలగింపు విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని స్థానికులు పలుమార్లు అధికారులతో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ జానకి మంగళవారం స్వయంగా ఈ ప్రాం తాన్ని పరిశీలించారు. ఇటీవల కట్టిన ఇళ్లను కూల్చేయాలని అధికారులను ఆదేశించి వెళ్లిపోయారు. ఆ వెంటనే నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇళ్ల కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. దీనిని నిర్వాసితులు అడ్డుకోవడంతో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్సైలు, 100 మంది పోలీసులను మోహరించారు. తమకు నష్టపరిహారం చెల్లించాకే ఇళ్లు కూల్చుకోవాలని బాధితులు భీక్ష్మించారు. చివరు పోలీసుల సహకారంతో ఇళ్లను తొలగించారు. ఎవరూ లేని సమయంలో తమ ఇళ్లు కూల్చివేయడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కట్టుకుంటున్నప్పుడు పట్టించుకోని అధికారులు ఇప్పుడు వచ్చి కూల్చేయడం అన్యాయమన్నారు. ఇళ్లలోని వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయని వాపోయారు. అక్రమ కట్టడాలే: వెంకటేశ్వర్లు ఆర్డీఓ ప్రభుత్వం సర్వే నంబర్6లో గతంలో 32 మంది ఎస్సీలకు పట్టాలు మంజూరు చేసిందని ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ స్థలాలు బాగలేవని పక్కనే అదే సర్వే నం బర్లోని ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకున్నారని, దీంతో పాత పట్టాలను రద్దు చేశామన్నారు. రైల్వేలైను వస్తుం దని మళ్లీ ఆ స్థలాల్లో ఇళ్లు కట్టారని, ఖాళీ చేయమని పలుమార్లు సూచించినా వినకపోవడంతో కలెక్టర్ స్వయంగా పరిశీలించి అక్రమ కట్టడాలని నిర్ధారించారని చెప్పారు. ఆయన వెంట తహశీల్దార్ నిర్మలానందబాబా, సీఐలు ర త్నయ్య, సుబ్బారావు, శ్రీనివాసులు, ఎస్సైలు ఉన్నారు. -
27న ‘కృష్ణపట్నం’ జాతికి అంకితం
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య విద్యుత్ కేంద్రాన్ని(కృష్ణపట్నం) ఈ నెల 27న జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో కృష్ణపట్నంలో 2 థర్మల్ యూనిట్లను నెలకొల్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ఇటీవలే వాణిజ్య ఉత్పత్తిలోకి అడుగు పెట్టింది. -
టీపీసీఐఎల్ కృష్ణపట్నం ప్లాంటులో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: థర్మల్ పవర్‌టెక్ కార్పొరేషన్ ఇండియా (టీపీసీఐఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ పట్నం వద్ద ఉన్న 1,320 మెగావాట్ల సామర్థ్యపు బొగ్గు విద్యుత్ ప్లాంటులో పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ఇంతవరకు నిర్మాణ దశలో ఉన్న 660 మెగావాట్ల సామర్థ్యపు రెండవ యూనిట్ పనులు పూర్తవడంతో కంపెనీ తన పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ బొగ్గు విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించిన 660 మెగావాట్ల సామర్థ్యపు మొదటి యూనిట్ నిర్మాణ పనులు ఫిబ్రవరిలో పూర్తి అయ్యాయి. ఈ యూనిట్లో ఇప్పటికే 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. -
రూ.40 కోట్లు పెరిగిన కృష్ణపట్నం వ్యయం
- పెరిగిన వ్యయానికి బోర్డు ఆమోదం - దిగుమతి కోల్‌పై సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం) ప్రాజెక్టు వ్యయం మరో రూ. 40 కోట్లు పెరిగింది. పెరిగిన వ్యయానికి మంగళవారం జరిగిన కృష్ణపట్నం పాలక మండలి సమావేశం ఆమోదం తెలిపింది. ఏపీ జెన్కో ఎండీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు. 1600 మెగావాట్లతో ఏర్పాటు చేసిన కృష్ణపట్నం ప్రాజెక్టు ప్రతిపాదిత వ్యయం రూ. 8,500 కోట్లు. ఆ తర్వాత దీన్ని రూ. వెయ్యి కోట్లకు పెంచారు. తాజా పెరుగుదలతో నిర్మాణ వ్యయం రూ. 9,500 కోట్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రాజెక్టు వ్యయం మెగావాట్‌కు 5.95 కోట్లకు చేరింది. పూర్తయ్యే నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ సాధికార సంస్థ (సీఈఏ) నిబంధనల మేరకు మెగావాట్ రూ. 5.5 కోట్లే ఉండాల్సి ఉన్నా, దీనిపై సమగ్ర వివరాలతో సీఈఏను ఒప్పించాలని నిర్ణయించారు. కృష్ణపట్నం రెండో దశ వాణిజ్య ఉత్పత్తి తేదీ (సీవోడీ)పై సమావేశంలో చర్చించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విదేశీ బొగ్గును ఢిల్లీకి చెందిన ఎంఎంటీసీ సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. కోల్ ఇండియా నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? ఎంత ధరకు అందిస్తాడనే అంశాలపై చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. మీ వాటా మీకిస్తాం... ప్రాజెక్టు వదిలేయండి ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్టు తెలిసింది. కృష్ణపట్నం విద్యుత్ వాటా అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో షెడ్యూల్ కూడా చేయడం లేదు. భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి, కృష్ణపట్నం నిర్మాణ వ్యయంలో తెలంగాణ వాటా ఇస్తామని, ప్రాజెక్టును ఏపీ పరం చేయాలని ఏపీ జెన్కో ఎండీ సూచించినట్టు తెలిసింది. అయితే, దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చించాల్సి ఉందని తెలంగాణ అధికారులు అన్నట్టు సమాచారం. -
కృష్ణపట్నం వద్ద లోహియా గ్రూప్ ప్లాంటు
గోల్డ్‌డ్రాప్ బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న లోహియా గ్రూప్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ప్లాంటును నెలకొల్పనుంది. మొత్తం రూ.500 కోట్లు వ్యయం చేయాలని కంపెనీ భా విస్తోంది. స్థలం చేతిలోకి రాగానే 10 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని లోహియా గ్రూప్ ఎండీ మహావీర్ లోహియా తెలిపారు. -
కృష్ణపట్నం వద్ద లోహియా గ్రూప్ ప్లాంటు
రూ.500 కోట్ల పెట్టుబడి కంపెనీ ఎండీమహవీర్ లోహియా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోల్డ్‌డ్రాప్ బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న లోహియా గ్రూప్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ప్లాంటును నెల కొల్పనుంది. మొత్తం రూ.500 కోట్లు వ్యయం చేయాలని కంపెనీ భావిస్తోంది. స్థలం చేతిలోకి రాగానే 10 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని లోహియా గ్రూప్ ఎండీ మహావీర్ లోహియా తెలిపారు. గోల్డ్‌డ్రాప్ బ్రాండ్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త ప్యాక్‌లతో ఉత్పత్తులను కంపెనీ బుధవారమిక్కడ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కన్హయాలాల్ లోహియా, ఇతర డెరైక్టర్లతో కలిసి మీడియాతో మా ట్లాడారు. రోజుకు 500 టన్నుల సామర్థ్యంతో కొత్త ప్లాంటు రానుందని చెప్పారు. ‘కంపెనీకి ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంట్లు హైదరాబాద్ వద్ద 2, కాకినాడ వద్ద ఒకటి ఉంది. వీటి సామర్థ్యం రోజుకు 1,400 టన్నులు. ముడి నూనెల కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడాల్సి రావడంతో ఒప్పంద వ్యవసాయం ద్వారా పామాయిల్, పొద్దుతిరుగుడు సాగులోకి వచ్చే ఆలోచన ఉంది. 2014-15లో రూ.2,200 కోట్ల టర్నోవర్ సాధించాం. ఈ ఏడాదిలో రూ.3,000 కోట్లు ఆశిస్తున్నాం’ అని తెలిపారు. రానున్న రోజుల్లో నూనెల ధరలు పెద్దగా పెరగకపోవచ్చని అన్నారు. -
కృష్ణపట్నం, హిందూజా విద్యుత్‌కు ఓకే
డిస్కంల అంచనాలకు ఈఆర్సీ ఆమోదం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 52,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం ఉంటుందని తెలంగాణ ఈఆర్సీ అంచనా వేసింది. కృష్ణపట్నం నుంచి 5,600 మిలియన్ యూనిట్లు, హిందూజా నుంచి 3,650 మిలి యన్ యూనిట్ల విద్యుత్తు వస్తుందని డిస్కంలు వేసిన అంచనాలకు ఈఆర్సీ ఆమో దం తెలిపింది. ఏపీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల పేచీ ఉన్న కృష్ణపట్నం, హిందూజా, దిగువ సీలేరు నుంచి 53.89 శాతం విద్యుత్తు వాటా తమకే దక్కుతుందని డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో స్పష్టం చేశాయి. జనవరి నుంచి కృష్ణపట్నం మొదటి యూని ట్ 431 మెగావాట్లు, ఏప్రిల్‌లో రెండో యూనిట్ నుంచి మరో 431 మెగావాట్లు సమకూరుతుంది. ఏప్రిల్ 15 నుంచి హిందూజా మొదటి యూనిట్ ద్వారా 280 మెగావాట్లు, జులై 15 నుంచి రెండో యూనిట్ ద్వారా 280 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని డిస్కంలు ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. వీటిని పరిశీలించి ఆమోదం తెలిపినట్లుగా ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ వెల్లడించారు. ఏపీ ఇచ్చే విద్యుత్తు వాటాలు తీసుకోవాలా.. వద్దా.. అని రాష్ట్ర ప్రభుత్వం వెనుకా ముందాడుతున్న తరుణంలో ఈఆర్సీ అనుమతి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
గుదిబండగా కృష్ణపట్నం..!
- విద్యుత్ ప్లాంట్‌పై 5,250 కోట్ల అదనపు వ్యయం - పెట్టుబడిని అమాంతం పెంచి చూపిన ఏపీ జెన్కో - యోగదారులపై చార్జీల మోతకు కుట్ర - తెలంగాణకూ భారం కానున్న విద్యుత్ కొనుగోలు -సీఈఆర్సీకి చిక్కకుండా ఏపీ సర్కారు దొంగాట హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ అంచనా వ్యయం తడిసి మోపెడైంది. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) నిర్దేశించిన అంచనాలతో పోల్చితే దాదాపు రూ. 5,250 కోట్ల వ్యయం అధికంగా అయినట్లు ఏపీ జెన్కో తాజాగా లెక్కలేసింది. దీన్నే సాకుగా చూపించి ప్రజలపై విద్యుత్ చార్జీల వాత పెట్టేందుకు రంగం సిద్ధంచేసింది. రాష్ర్ట విభజన చట్టం ప్రకారం ఈ ప్లాంట్ నుంచి తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ రావాల్సి ఉంది. దీంతో కృష్ణపట్నంలో అదనపు వ్యయం ఫలితంగా అక్కడినుంచి వచ్చే విద్యుత్ కొనుగోలు చార్జీలు కూడా పెరిగి భవిష్యత్తులో తెలంగాణ వినియోగదారులపైనా భారం పడే ప్రమాదముంది. కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల సామర్థ్యం గల తొలి యూనిట్లో చేపట్టిన వాణిజ్య ఉత్పత్తి గత వారంలో విజయవంతమైంది. రెండో యూనిట్లో మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఇందులో న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన వాటాను పంపిణీ చేసేందుకు ఏపీ మోకాలడ్డుతోంది. మరోవైపు దొంగదెబ్బ తీసినట్లుగా ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం పెంచేయడంతో రెండు రాష్ట్రాల వినియోగదారులపై పెనుభారం పడటం ఖాయమైంది. సీఈఆర్సీ 2011 అక్టోబర్‌లో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అంచనా వ్యయం ఒక్కో యూనిట్‌కు సగటున రూ. 4.59 కోట్లకు మించకూడదు. రైల్వే లైన్లు, లింకింగ్ పాయింట్, లోకోమోటివ్ లైన్లు, అన్లోడింగ్ పాయింట్లు తదితరాలను పరిగణించినా ఈ ఖర్చు యూనిట్‌కు రూ. 4.75 కోట్లకు మించదని విద్యుత్ నిపుణులు లెక్కతేల్చారు. ఈ లెక్కన కృష్ణపట్నంలో తొలి రెండు యూనిట్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 7,600 కోట్లకు మించకూడదు. కానీ ఇప్పటికే రూ. 12,850 కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ జెన్కో లెక్కలేసుకుంది. అంటే రూ. 5,250 కోట్ల అదనపు వ్యయాన్ని చూపింది. ఎందుకింత ఖర్చయిందన్నది అంతుచిక్కకుండా ఉంది. నిబంధనల ప్రకారం రెండు వేల మెగావాట్ల సామర్థ్యాన్ని మించిన ప్లాంట్లను కేంద్రం మెగా పవర్ ప్లాంట్లుగా గుర్తిస్తుంది. వీటి నిర్మాణానికి ప్రత్యేక రాయితీలు ఇస్తుంది. మూడు యూనిట్లుగల కృష్ణపట్నం ప్లాంటు సామర్థ్యం 2,400 మెగావాట్లు. దీంతో దీనికి కేంద్రం నుంచి రాయితీలను ఏపీ అందుకుంది. కేంద్ర ఇంధన శాఖ నిబంధనల ప్రకారం మెగా పవర్ ప్లాంట్లలో 10 శాతం విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. కృష్ణపట్నం నుంచి కేరళకు పదిశాతం కరెంట్ ఇచ్చే ప్రతిపాదనలున్నాయి. ఇప్పటికే తెలంగాణకు 53.89 శాతం వాటా ఉండటం, కేరళకు 10శాతం వాటా ఇవ్వనుండటంతో విద్యుత్ చట్టంలోని సెక్షన్ 79(2) ప్రకారం కృష్ణపట్నం కేంద్రం అంతర్రాష్ట్ర ప్లాంటుగా సీఈఆర్సీ పరిధిలో ఉంటుంది. ఈ లెక్కన కృష్ణపట్నం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు.. చార్జీలు నిర్ణయించే అధికారం సీఈఆర్సీ పరిధిలోనే ఉంటుంది. కానీ దీన్ని ఏపీఈఆర్సీ పరిధిలోనే ఉంచాలని, తద్వారా చేసిన తప్పులన్నింటినీ కప్పి పుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. గత ఏడాది ఏపీఈఆర్సీకి ఏపీజెన్కో సమర్పించిన పీపీఏల కవరింగ్ లెటర్‌లోనే ఈ ప్లాంటు సీఈఆర్సీ పరిధికి చెందినదని నివేదించింది. అదే విషయాన్ని వేలెత్తి చూపిన ఏపీఈఆర్సీ ఈ ప్లాంటు పీపీఏలు తమ పరిధిలోకి రావంటూ ఆగస్టులోనే తిప్పిపంపాయి. ఆరు నెలలు గడచినా ఈ ఫైలును సీఈఆర్సీకి పంపించకుండా ఏపీజెన్కో తొక్కిపెట్టింది. ఈలోగా అంచనా వ్యయం రూ. 5,250 కోట్లకుపైగా పెంచడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయనేది అనుమానాస్పదంగా మారింది. వినియోగదారులపై చార్జీల భారం పెంచే హైడ్రామాలో భాగంగానే పెట్టుబడులను పెంచారన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. కృష్ణపట్నం ప్లాంటుకు సంబంధించిన కొనుగోలు ఒప్పందాలు, చార్జీల నిర్ణయాన్ని సీఈఆర్సీకి అప్పగించకపోతే పెట్టుబడుల భారంతో ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు గుదిబండగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మా కరెంటులో తెలంగాణకు వాటా
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో తెలంగాణకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది! ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో తెలంగాణకు వాటా ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది! ఏపీఈఆర్సీకి తాజాగా సమర్పించిన వార్షిక ఆదాయ, అవసర నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కమ్‌లు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కృష్ణపట్నం తదితర కేంద్రాల్లో ఉత్పత్తయ్యే కరెంటును తెలంగాణకు ఇచ్చేది లేదని ఇప్పటిదాకా ఏపీ వాదిస్తుండటం, దీనిపై న్యాయ పోరాటానికి తెలంగాణ సిద్ధమవడం, పీపీఏల వివాద పరిష్కారానికి నీరజా మాథుర్ కమిటీ వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు విద్యుత్ వాటా ఇస్తామంటూ ఏకంగా ఏఆర్‌ఆర్‌లో ఏపీ డిస్కంలు పొందుపరచడం రాష్ట్రానికి సానుకూల పరిణామమని నిపుణులు అంటున్నారు. ఏం జరిగింది? రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ప్రభుత్వం జీవో నంబర్ 20 ద్వారా విద్యుదుత్పత్తిని పంపిణీ చేసింది. తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం కేటాయించారు. విభజన తర్వాత అప్పటికి ఉమ్మడిగానే ఉన్న ఏపీఈఆర్సీ పీపీఏలపై తీర్పు చెప్పింది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రం పీపీఏ మినహా మిగతా అన్ని పీపీఏలనూ ఆమోదించినట్టుగానే భావించాలని కేంద్రానికి తెలిపింది. కానీ ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టాక కొత్త వివాదానికి తెర తీశారు. పాత ఈఆర్సీ ఆదేశాలు చెల్లవని, రాష్ట్రంలో ఉత్పత్తయ్యే కరెంటంతా తమకే దక్కుతుందని వాదించారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. పీపీఏలను ఏపీ అంగీకరించకపోవడం వల్ల తమకు 462 మెగావాట్ల వాటా రాకుండా పోతుందని, కృష్ణపట్నం, హిందూజా వాటాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ కరెంటులో తెలంగాణకు వాటా ఇస్తామని ఏఆర్‌ఆర్‌లోనే డిస్కంలు తాజాగా పేర్కొనడం కోర్టులో కూడా తెలంగాణ వాదనకు బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అలాగే కృష్ణపట్నం కరెంటులోనూ తెలంగాణ తన వాటాను మరింత గట్టిగా డిమాండ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. పీపీఏలు ఆమోదం పొందలేదని ఏపీ ప్రభుత్వం కోర్టులో వాదించినా అది నిలబడబోదని అభిప్రాయపడుతున్నారు. -
కృష్ణపట్నంపై మళ్లీ మొదటికి..
విద్యుత్ ఉత్పత్తిపై మాట మార్చిన ఏపీ ప్రాజెక్టులో విజయవంతమైన వాణిజ్య ఉత్పత్తి బొగ్గు నిల్వలు లేవంటూ ప్లాంట్ షట్‌డౌన్ చేసిన ఏపీ కేంద్రం జోక్యం కోరిన తెలంగాణ సర్కారు సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుత్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. ఇంతకాలం ప్రయోగాత్మక ఉత్పత్తి అంటూ ప్రాజెక్టులోని మొత్తం విద్యుత్‌ను వాడుకుంటూ వచ్చిన ఆ రాష్ట్రం. తాజాగా వాణిజ్యోత్పత్తి ప్రారంభమైనా, బొగ్గు నిల్వలు లేవంటూ ప్లాంటును షట్‌డౌన్ చేసిం ది. వాటా ప్రకారం న్యాయంగా రావాల్సి న విద్యుత్‌ను పంపిణీ చేయాలని పట్టుపడుతున్న తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపింది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తొలి యూనిట్ ద్వారా బుధవారం అధికారికంగా వాణిజ్య ఉత్పత్తి (సీవోడీ) ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం 72 గంటల పాటు నిర్విరామంగా ప్లాంట్‌ను నడిపి... విజయవంతంగా సీవోడీ ప్రక్రియను ఏపీ జెన్కో పూర్తి చేసింది. 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్ నుంచి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 53.89 శాతం విద్యుత్ తెలంగాణకు, 46.21 శాతం ఏపీకి పంపిణీ చేయాలి. అధికారిక ఉత్పత్తి ప్రారంభం కావడంతో.. అందులోంచి తమకు రావాల్సిన వాటా అందుతుందని టీజెన్‌కో, రాష్ట్ర సర్కారు ఎదురుచూశాయి. కానీ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన రోజునే.. బొగ్గు కొరత పేరు చెప్తూ కృష్ణపట్నం తొలి యూనిట్‌ను ఏపీ జెన్కో షట్‌డౌన్ చేయడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ‘సీవోడీ విజయవంతంగా పూర్తయింది. తర్వాత అరగంట సేపు ప్లాంటు నడిచింది. బొగ్గు కొరత కారణంగా యూనిట్‌ను షట్‌డౌన్ చేయాల్సి వచ్చింది. ఈ ప్లాంటుకు మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి నెలకు నాలుగు లక్షల టన్నుల బొగ్గు అందాలి. కానీ రెండు లక్షల టన్నులే అందింది. బొగ్గు లేని కారణంగా ప్లాంట్‌ను షట్‌డౌన్ చేయడం అనివార్యమైంది..’ అని ఏపీ జెన్కో వర్గాలు వెల్లడించాయి. దీంతో కృష్ణపట్నం విద్యుత్ వస్తుందని ఆశపడిన తెలంగాణ సర్కారు మళ్లీ భంగపడింది. కావాలనే..! వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌లోనే కృష్ణపట్నంలో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. కానీ ఇంతకాలం ట్రయల్న్,ర ఇన్ఫర్మ్పవర్ పేరుతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు షెడ్యూల్ చేయకుండా ఏపీనే వినియోగించుకుంది. విద్యుత్ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోగాత్మక విద్యుత్ అంటూ పంపిణీకి నిరాకరించింది. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమయ్యాక ఒప్పందాలు అమల్లోకి వస్తాయని గత నెలలో జరిగిన కృష్ణపట్నం పాలకమండలి సమావేశంలో ఏపీ జెన్కో అధికారులు ప్రకటించారు. తీరా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన రోజునే షట్‌డౌన్ చేయటం అంటే.. తెలంగాణకు విద్యుత్ పంపిణీ చేయకుండా అడ్డుకోవడమేనని ఇక్కడి అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఆ రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉంది. అందువల్ల కృష్ణపట్నం ప్లాంట్‌ను షట్‌డౌన్ చేసినా వారికి నష్టమేమీ లేదు. కానీ తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణను మరింత చిక్కుల్లోకి నెట్టేయాలనే ఏపీ సర్కారు ఈ కుట్రకు పాల్పడిందని తెలంగాణ జెన్కో అధికారులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారని, సీఎం తన ఢిల్లీ పర్యటనలోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశముందని వారు తెలిపారు. -
కృష్ణపట్నంలో క్రిబ్కో ఎరువుల ప్లాంటు!
రూ.1000 కోట్ల పెట్టుబడికి సన్నాహాలు న్యూఢిల్లీ: క్రిషక్ భారతీ సహకార సంస్థ (క్రిబ్కో) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వద్ద రూ.1000 కోట్ల పెట్టుబడితో ఫాస్ఫరస్ అండ్ పొటాష్ (పీఆండ్‌కే) ఎరువుల ప్లాంటును ఏర్పాటుచేయనుంది. ఇప్పటివరకూ యూరియా ప్లాంట్లు మాత్రమే కలిగివున్న తాము తొలిసారిగాఫాస్ఫరస్, పొటాష్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు క్రిబ్కో ఎండీ ఎన్.సాంబశివ రావు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్లాంటు ఏర్పాటుకు భూముల్ని కేటాయించిందన్నారు. ప్లాంటు వార్షిక సామర్థ్యం 6 లక్షల టన్నులు ఉంటుందని తెలిపారు. దీన్ని భవిష్యత్తులో రెట్టింపు(12 లక్షల టన్నులు) చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. క్రిబ్కో ఇప్పటికే 22 లక్షల వార్షిక సామర్థ్యమున్న యూరియా ప్లాంటును గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటుచేసింది. అలాగే శ్యాం గ్రూప్ భాగస్వామ్యంతో 10 లక్షల వార్షిక సామర్థ్యమున్న ఒక ప్లాంటు ఉత్తరప్రదేశ్‌లో, మరో ప్లాంటు ఒమన్‌లో ఉన్నాయి. -
కృష్ణపట్నం తరలనున్న ఓసీటీఎల్!
ప్లాంటు తరలింపునకు రూ.200 కోట్ల వ్యయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్రిల్లింగ్ పైపుల తయారీలో ఉన్న కామినేని గ్రూప్ కంపెనీ ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ (ఓసీటీఎల్) నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఉన్న ప్లాంటును తరలిస్తోంది. కొన్ని నెలలుగా కార్మికులతో తలెత్తిన సమస్యల కారణంగా ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. దీంతో ప్లాంటును తరలించడం తప్ప మరో మార్గం లేదని సంస్థ నిర్ణయించింది. ఎటువంటి నోటీసు, సరైన కారణం లేకుండా కార్మికులు మూకుమ్మడిగా సమ్మెకు దిగారని బీఎస్ఈకి నవంబర్ 10న ఓసీటీఎల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చమురు, సహజ వాయు నిక్షేపాల వెలికితీతలో ఉపయోగించే అయిదు రకాల భాగాలను తయారు చేసే కంపెనీ ప్రపంచంలో ఇదొక్కటే. ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.5 లక్షల టన్నులు. ఓఎన్జీసీ, షెల్ తదితర కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీకి ప్రధాన మార్కెట్ అయిన అమెరికా యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం కూడా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఓసీటీఎల్కు రూ.5.87 కోట్ల నష్టం వాటిల్లింది. ప్లాంటులో సుమారు 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 9 నెలల్లో కొత్త ప్లాంటు.. ఓసీటీఎల్కు ఇప్పటి వరకు రూ.500 కోట్లు వెచ్చించామని కామినేని గ్రూప్ డెరైక్టర్ కామినేని శశిధర్ తెలిపారు. ప్లాంటు సామర్థ్యంలో 10-20 శాతంలోపే ఉత్పత్తి నమోదవుతోందని పేర్కొన్నారు. ప్లాంటు తరలింపు అంశంపై ఈ నెలలో బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త ప్లాంటుకై కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాలను కంపెనీ పరిశీలిస్తోంది. కృష్ణపట్నం వద్దే ఇది ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. పైపులను కంపెనీ ఈ పోర్టు నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ప్లాంటు తరలింపు, కొత్త ప్రదేశంలో ఏర్పాటుకు రూ.200 కోట్ల వ్యయం అవుతుందని శశిధర్ తెలిపారు. 75 శాతం మెషినరీ పనికొస్తుందని చెప్పారు. పరిస్థితుల్లో మార్పు లేకపోతే నార్కట్‌పల్లిలో ఉన్న కామినేని స్టీల్ అండ్ పవర్, యునెటైడ్ సీమ్‌లెస్ ట్యూబ్యులర్ యూనిట్లను కూడా తరలించడం ఖాయమన్నారు. ఈ రెండు కంపెనీల కోసం సంస్థ రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. రూ.3,000 కోట్లతో విస్తరణ చేపట్టాలని గతంలో భావించినప్పటికీ, తాజాగా ప్లాంట్లనే మరోచోటుకు తరలించాలని నిర్ణయించడం కొసమెరుపు. -
భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం
ఉప్పు రైతులతో కలెక్టర్ శ్రీకాంత్ ముత్తుకూరు : కృష్ణపట్నం పోర్టు విస్తరణ కోసం సేకరించే ఉప్పు భూములకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. గోపాలపురం వద్ద గురువారం ఉప్పు సాగు నిలిపివేసిన కేంద్రప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్ అక్కడే ఉప్పు సాగు లీజుదారులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వానికి చెందిన 741 ఎకరాల్లో ఏళ్ల తరబడి 108 మంది లీజుదారులు ఉప్పు సాగు చేస్తున్నారు. ఇటీవల ఈ భూములను పోర్టు కోసం సేకరించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో లీజుదారులు పరిహారం కోసం పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు, పోర్టు నిర్వాహకులతోనూ తమ ఆవేదనను పంచుకున్నారు. ఉప్పు భూములకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం లీజుదారులకు ఎంత పరిహారం ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ ఈ సందర్భంగా నెల్లూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరెడ్డిని ఆదేశించారు. ఈ భూమికి బదులుగా సాల్ట్ కమిషన్ మరో చోట భూములు కోరుతోందంటూ రైతులు కలెక్టర్‌తో చెప్పారు. ఇందుకోసం కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం వద్ద భూములు పరిశీలించారని రైతులు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోర్టు పీఆర్వో వేణుగోపాల్, సాల్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ చట్టం, కృష్ణపట్నం, శ్రీకాంత్ -
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పై-లిన్ తుపాను పట్ల తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. తుపాన్ ప్రభావం ఉండే 21 మండలాల్లో 23 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కావలి, విడవలూరుకు ఇద్దరు చొప్పున అధికారులు నియమితులయ్యారు. 21 మండలాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జిల్లాలో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే మండలాల అధికారులతో కలెక్టర్ శ్రీకాంత్ తరచూ సంప్రదిస్తున్నారు. మండలాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వారికి సూచనలు ఇస్తున్నారు. ప్రత్యేక అధికారులు రాత్రి వేళలో మండలాల్లోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారులు చేపల వేటకెళ్లకుండా చర్యలు చేపట్టారు. తీరప్రాంత గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోలు రూం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన నిత్యావసర సరుకులు సిద్ధమయ్యాయి. తుపాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూంకు తెలియచేయాలని అధికారులు సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు నంబర్లు: 1800 425 2499, 08612-331477 శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
ఒప్పందం బాబుది.. భూములిచ్చింది రోశయ్య..