![Anandayya Team Distribution Ayurvedic Medicine Not Follow Covid 19 Rules - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/6/anandayya.jpg.webp?itok=XlAwwKXj)
సాక్షి, నెల్లూరు: కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మందు పంపిణీ చేస్తూ ఆనందయ్య బృందం అత్యుత్యాహం ప్రదర్శించింది. కృష్ణపట్నంలో ఆనందయ్య బృందం ఆదివారం ప్రజలకు మందు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి మందు కోసం జనం భారీగా తరలివచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఆనందయ్య బృందం మందు పంపిణీ చేస్తుండడంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి మందు పంపిణీని నిలిపి వేయించారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పలు ప్రాంతాల ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి వస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment