regulations
-
బంగారం వేలం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
న్యూఢిల్లీ: బంగారం వేలం విషయంలో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బంగారం తనఖాపై రుణం తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే, బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) ఆ బంగారాన్ని వేలంలో విక్రయించి రుణ బకాయిలతో సర్దుబాటు చేసుకుంటుంటాయి. ఇందుకు నిర్దేశిత ప్రక్రియలు, నిబంధనలను బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు అనుసరించాల్సి ఉంటుంది. ఈ విషయమై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నకు ఆర్థిక మంత్రి బదులిచ్చారు. ఎన్బీఎఫ్సీలు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లకు ఈ విషయంలో నిబంధనలు ఒకే విధంగా ఉన్నట్టు చెప్పారు. రుణ చెల్లింపులు సరిగ్గా లేవంటూ ఖాతాదారులకు బ్యాంక్‌లు తగినన్ని సార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ రుణ గ్రహీత చెల్లింపులకు ముందుకు రాకపోతే అప్పుడు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ బంగారం వేలానికి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. నిబంధనలను బ్యాంక్‌లు ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బంగారానికి డిమాండ్: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గలేదని, పెరుగుతూ వెళుతోందని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సీతారామన్ బదులిచ్చారు. ‘‘దేశంలో వ్యక్తులు, చిన్న వర్తకులు సురక్షితమైన, లిక్విడ్ సాధనమన్న ఉద్దేశ్యంతో బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు’’అని వివరించారు. -
పీజీ వైద్య విద్య నిబంధనల సవరణ సబబే
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా చేరిన వారికి పీజీ వైద్య విద్యను అభ్యసించే నిమిత్తం కేటాయించే ఇన్‌సర్వీస్ కోటా నిబంధనలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 20న జారీ చేసిన జీవో–85లోని పలు నిబంధనలను హైకోర్టు సమర్థించింది. ఇన్‌సర్వీస్ కోటా కింద రిజర్వేషన్ సీటు పొందాలంటే నీట్ పీజీ, సూపర్ స్పెషాలిటీ పరీక్ష నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి 50 ఏళ్లు దాటి ఉండకూడదన్న నిబంధన విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. అలాగే పీజీ కోర్సు పూర్తి చేసిన తరువాత రాష్ట్రంలో పదేళ్ల పాటు సేవలు అందించాలన్న నిబంధనను కూడా సమర్థించింది. అంతేకాక ఇన్‌సర్వీస్ కోటా ఒప్పందాన్ని ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచడాన్ని కూడా హైకోర్టు సమర్థించింది. జీవో–85లోని ఈ నిబంధనలను ఎంతమాత్రం ఏకపక్షంగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలు వరించింది. కాల వ్యవధి, జరిమానా పెంపు వంటి సవరణలను సవాల్ చేస్తూ మేదరమెట్ల ప్రైమరీ హెల్త్ సెంటర్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ జి.చిట్టిబాబు పిటిషన్ దాఖలు చేశారు. -
న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో... సడలింపులు
వెల్లింగ్టన్: కార్మికుల కొరత తదితరాల నేపథ్యంలో వీసా నిబంధనలను న్యూజిలాండ్ సరళతరం చేసింది. ఇమిగ్రేషన్ ప్రక్రియను క్రమబద్దీకరిస్తూ గణనీయమైన మార్పులు చేసింది. పని అనుభవం, వేతనాలు, వీసా వ్యవధి తదితరాలను మార్చింది. న్యూజిలాండ్‌లో ఉపాధి పొందాలనుకునే కార్మికులకు కనీస అనుభవ అర్హతను మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. దాంతో ఇకపై ఆ దేశంలో ఉపాధి పొందడం మరింత సులభతరం కానుంది. న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వీసాల్లో మార్పు.. సీజనల్ వర్కర్లు న్యూజిలాండ్‌లో ఉండేందుకు రెండు కొత్త మార్గాలను కూడా ప్రవేశపెట్టారు. అనుభవజు్ఞలైన సీజనల్ కార్మికులకు మూడేళ్ల మల్టీ–ఎంట్రీ వీసా, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల సింగిల్–ఎంట్రీ వీసాలు ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన ఎంప్లాయర్ వర్క్ వీసా (ఏఈడబ్ల్యూవీ), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (ఎస్పీడబ్ల్యూవీ)లకు సగటు వేతన ప్రమాణాలను తొలగించారు. కొత్త నిబంధనల ప్రకారం యజమానులు ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ రేటు ప్రకారం జీతాలివ్వాల్సి ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ఏఎన్జెడ్ఎస్సీఓ) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 పరిధిలోకి వచ్చే ఉద్యోగాలకు రెండేళ్ల వీసా వ్యవధిని మూడేళ్లకు పెంచారు. ఇప్పటికే రెండేళ్ల వీసా ఉన్న ఉద్యోగులు ఏడాది పొడిగింపు కోరవచ్చు. వలసదారులు తమ పిల్లలను వెంట తీసుకొచ్చేందుకు కనీస వార్షిక వేతనాన్ని 55,844 డాలర్లకు పెంచారు. విద్యార్థుల వీసాలో సవరణ పోస్ట్ స్టడీ వర్క్ వీసా (పీఎస్ డబ్ల్యూవీ)ను కూడా న్యూజిలాండ్ సవరించింది. దీని ప్రకారం విద్యార్థులు అర్హతలను బట్టి అక్కడ మూడేళ్ల పాటు ఉండటానికి, పని చేయడానికి అనుమతిస్తారు. పీజీ డిప్లొమా తర్వాత మాస్టర్స్ పూర్తి చేసిన విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు అర్హత కోల్పోకుండా ఉండేందుకూ ఈ నిబంధనలు వీలు కలి్పస్తాయి. శ్రామిక రంగ కంపెనీలకు కార్మికులను తీసుకోవడం మరింత సులభతరం కానుంది. స్టూడెంట్ వీసా తదితరాల నుంచి ఏఈడబ్ల్యూవీకి మారాలనుకునే వలసదారులకు వచ్చే ఏప్రిల్ నుంచి మధ్యంతర పని హక్కులు కూడా ఇస్తారు. -
ఏక్ పోలీస్ విధానం అమలు చేయండి
సిరిసిల్లక్రైం: రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ బెటాలియన్‌లో విధులు నిర్వర్తించే పోలీసుల భార్యలు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌చౌక్‌లో గురువారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే విధానంలో పరీక్ష పెట్టి పోలీస్ ఉద్యోగాలకు ఎంపిక చేసి, విధుల్లో ఒక్కో రకమైన నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. బెటాలియన్ విధుల్లోకి వెళ్లిన తమవారు ఇంటికి రావడానికి నెలల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాన్న ఎక్కడ.. అమ్మా’అని పిల్లలు అడుగుతుంటే కన్నీళ్లు వస్తున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. ధర్నా విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అక్కడకు చేరుకొని ఆందోళన విరమించాలని సూచించగా, వారు వినకపోగా నినాదాలు చేస్తూ నిరసనను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే వారిని వ్యాన్‌లో సర్దాపూర్ బెటాలియన్‌కు తరలించారు. 17వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్‌రావును వివరణ కోరగా ఏదైనా సమస్య ఉంటే వినతిపత్రం ఇస్తే ఉన్నతాధికారులకు చెబుతామని, కానీ ఎవరూ వినతిపత్రం ఇవ్వలేదన్నారు. పదో బెటాలియన్ పోలీస్ కుటుంబసభ్యులు కూడా.. ఎర్రవల్లి: బీచుపల్లి పదో బెటాలియన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని జాతీయ రహదారి–44 కూడలిలో గురువారం బైఠాయించారు. ఏక్ స్టేట్– ఏక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న అలంపూర్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో ఇటిక్యాల, కోదండాపురం ఎస్ఐలు వెంకటే‹Ù, స్వాతి సిబ్బందితో అక్కడికి చేరుకొని పోలీస్ కుటుంబీకులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భంగా పలువురు టీజీఎస్పీ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బెటాలియన్ పోలీసులకు ఐదేళ్లు ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు. -
KTR: పేదలకు కాంగ్రెస్ పెట్టనున్న కరెంట్ మంటలు
-
జైళ్లలో కుల వివక్ష వద్దు
న్యూఢిల్లీ: కులం ఆధారంగా మనుషులపై వివక్ష చూపడం అనే సామాజిక నేరం దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఆధునిక యుగంలోనూ సమాజంలో కుల వివక్ష కనిపిస్తోంది. ఆఖరికి ఖైదీలను సంస్కరించడానికి ఉద్దేశించిన జైళ్లలోనూ కుల వివక్ష తప్పడం లేదు. కింది కులాల ఖైదీలకు కష్టమైన పనులు అప్పగించడం, వేరే వార్డులు కేటాయించడం, వారిపై దాడులు, హింస సర్వసాధారణంగా మారిపోయింది. ఈ పరిణామంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కుల ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపడడం తగదని తేల్చిచెప్పింది. కారాగారాల్లో ఖైదీలందరినీ సమానంగా చూడాలని ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్) దాఖలు చేశారు. స్టేట్ ప్రిజన్ మాన్యువల్ నిబంధనలను పిటిషనర్ సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఖైదీలపై వివక్షను అంతం చేసేలా అన్ని రాష్ట్రాలూ జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాల్సిందేనని తేల్చిచెప్పింది. జైళ్లలో చోటుచేసుకున్న కుల వివక్ష ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మూడు నెలల తర్వాత వీటిని ‘విచారించాల్సిన కేసుల జాబితా’లో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తమ తీర్పుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక సమర్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిర్బంధంలో ఉన్నవారికి సైతం గౌరవంగా జీవించే హక్కు ఉందని ధర్మాసనం ఉద్ఘాటించింది. మానవులంతా సమానంగా జన్మించారని ఆర్టికల్ 17 చెబుతున్నట్లు గుర్తుచేసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాలని స్పష్టంచేసింది. పని విషయంలో సమాన హక్కు ఉండాలి ‘‘జైలు మాన్యువల్‌లో కులం కాలమ్ అవసరం లేదు. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం, ట్యాంక్‌లు శుభ్రం చేయించడం వంటి పనులు, అగ్ర కులాల ఖైదీలకు సులభమైన వంట పనులు అప్పగించడం ముమ్మాటికీ వివక్షే అవుతుంది. ఇలాంటి చర్యలు అంటరానితనం పాటించడం కిందకే వస్తాయి. కులం ఆధారంగా ఖైదీలను వేరే గదుల్లో ఉంచడం సమంజసం కాదు. వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం వలసవాద వ్యవస్థకు గుర్తు. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే పారిశుధ్య పనులు అప్పగించడం తగదు. పని విషయంలో అందరికీ సమాన హక్కు ఉండాలి. కేవలం ఒక కులం వారినే స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకం. కింది కులాల ఖైదీలకు మాత్రమే ఇలాంటి పనులు అప్పగించడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 15ను ఉల్లంఘించడమే అవుతుంది’’ అని సుప్రీంకోర్టు తీన తీర్పులో వెల్లడించింది. -
ఆ లెక్కలూ చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చేసే కొనుగోళ్ల విషయంలో ఇకపై అత్యంత కఠిన నిబంధనలను అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ డిస్కంలు తాము పరికరాలను కొనే ముందు, లేదా ఆ తర్వాత టెండర్ వివరాలను ఏపీఈఆర్సీకి పంపిస్తున్నాయి. కానీ ఆ టెండర్‌తో కొంటున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, ఇతర సామాగ్రి వంటి ధరలను విడివిడిగా వెల్లడించడం లేదు. ఇకపై ప్రతి పరికరానికి సంబంధించి ధరల జాబితాను మండలికి సమర్పించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ, సేకరణ, ప్రసార ప్రణాళికలపై ఏపీఈఆర్సీ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కాగా 2024–25 నుంచి 2028–29 (5వ నియంత్రణ కాలం) వరకూ, 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకూ విద్యుత్ ప్రణాళికలను డిస్కంలు, ఏపీ ట్రాన్స్‌కో ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వాటిపై విచారణ జరిపిన మండలి ప్రతిపాదనల్లో చాలావరకు తిరస్కరించింది. కొన్నిటికి మాత్రమే అనుమతినిచ్చింది. మరికొన్నిటిపై మరింత సమాచారం కావాలని అడిగింది. అందులో వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ల అంశం ఒకటి. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజన పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు అందిస్తుంది. అలాగే వినియోగదారులకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. అదీగాక ఇందుకు అయ్యే ఖర్చును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ప్రభుత్వమే భరిస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు ఏపీఈఆర్సీ ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. అలాగే జగనన్న కాలనీల విద్యుద్దీకరణకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే, తాను ఆమోదించిన విలువల కంటే డిస్కంలు లెక్కల్లో చూపించిన వ్యయం ఎక్కువ అని గుర్తించిన ఏపీఈఆర్సీ తాజా ఆర్డర్లో గతంలో ఆమోదించిన విలువలకే ఓకే చెప్పింది. అలాగే విద్యుత్ కొనుగోళ్ల అంచనాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున.. దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నిటినీ తిరస్కరించింది. -
వరికి ని‘బంధనాలు’
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయాలని నిర్ణయించిన పంటల బీమా పథకంలోని నిబంధనలు వరి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒక జిల్లాలో మొత్తం సాగువిస్తీర్ణంలో 25 శాతానికి మించి విస్తీర్ణమున్న పంటలను మాత్రమే గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం అమలు చేయాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం సంగారెడ్డితోపాటు, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏ ఒక్క పంట కూడా 25 శాతానికి మించి సాగు కావడం లేదు. దీంతో ఈ జిల్లాల్లో గ్రామం యూనిట్‌గా అమలు చేసే అవకాశం లేకుండాపోతోంది. ఈ వానాకాలం నుంచే కొత్త పథకం అమలు అధిక వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా పంటల బీమా పథకం అమలు చేస్తారు. ఐదేళ్ల క్రితం నిలిపివేసిన ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో భాగంగా ఈ వానాకాలం నుంచే రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. నిర్మల్‌లో వరితోపాటు, సోయా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో ఈ పంటల బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వరి పంటను గ్రామం యూనిట్‌గా అమలు చేసేందుకు నిబంధనలు కలిసొస్తున్నాయి. నిర్మల్ జిల్లా వరితోపాటు, సోయా పంట కూడా గ్రామం యూనిట్‌గా అమలు చేసేందుకు వీలు కలుగుతోంది. మండలం యూనిట్ అయితే వరి రైతుకు నష్టం పంటల బీమా పథకం గ్రామం యూనిట్‌గా అమలు చేస్తేనే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు క్లెయిమ్ (పరిహా రం) అందుతుంది. మండలం యూనిట్‌గా అమలు చేస్తే చాలామంది రైతులకు ఈ క్లె యిమ్ అందదు. ఎలాగంటే.. మండలం యూనిట్‌గా తీసుకుంటే అధిక వర్షాలుగానీ, వడగండ్ల వానగానీ, ఈదురుగాలుల వర్షం కారణంగా మండలవ్యాప్తంగా అన్ని గ్రామా ల్లో మొత్తం వరి పంట నష్టపోతే మాత్రమే రైతులకు పరిహారం అందుతుంది.మండలంలో కొన్ని గ్రామాల్లో పంట నష్టం జరిగి, మరికొన్ని గ్రామాల పరిధిలో నష్టం జరగకపోతే పంట నష్టపోయిన గ్రామాల రైతులకు కూడా పరిహారం అందదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ నిబంధనపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాలకు ఒకే విధంగా నిబంధనలను సరళీకృతం చేయాలని కోరుతున్నారు. -
పద్ధతి ప్రకారం పరిహారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రక్రియలో దేనికైనా ఓ పద్ధతి అనుసరించడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం నడుచుకుంటే వ్యవస్థలూ సజావుగా పనిచేస్తాయి. రైతన్నలకు ఓ రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా టంఛన్‌గా క్యాలండర్ ప్రకారం అందుతున్నాయంటే ఇదే కారణం! గతేడాది దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. 2023 రబీలో కరువు బారిన పడ్డ ప్రాంతాల జాబితాను నిబంధనల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రకటించాలి. ఇందుకు ఆరు ప్రామాణికాలను పాటించడం తప్పనిసరి.ఈ క్రమంలో రబీ సీజన్లో రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు నిర్ధారించారు. 63 మండలాల్లో తీవ్రంగా, 24 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు లెక్క తేల్చారు. 2.37 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. 2.52 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు తేలింది. ఈ మేరకు మార్చి 16వతేదీన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కరువు మండలాలను గుర్తించిన సమయంలోనే ప్రాథమిక నష్టాన్ని అంచనా వేశారు. నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.చంద్రబాబు బృందం ఫిర్యాదుతో రెండు నెలల పాటు ర్యాండమ్ శాంపిల్ సర్వేను ఎన్నికల సంఘం నిలిపివేసింది. పోలింగ్ ముగిశాక ఈసీ ఆంక్షలు సడలించడంతో ర్యాండమ్ శాంపిల్ సర్వే జరిపి తుది అంచనాల నివేదిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. మరి ఇందులో అలసత్వానికి ఎక్కడ తావుంది? రైతుల నోటి కాడ ముద్దను నేల పాలు చేస్తూ చంద్రబాబు బృందం ఫిర్యాదు చేయడం వల్లే కదా ఈసీ అడ్డుకుంది? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఏంఏ) విధివిధానాల ప్రకారమే కరువు మండలాలను ప్రకటిస్తారు. అంతేగానీ డ్రైస్పెల్స్ ఆధారంగా కాదు. దీని ప్రకారమే 2023 ఖరీఫ్ సీజన్లో 80 మండలాల్లో తీవ్రంగా, 23 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు గుర్తించారు. రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన బాబు కరువు మండలాల్లో ఆ సీజన్లో తీసుకున్న పంట రుణాలను ఆర్నెళ్ల పాటు రీ షెడ్యూల్ చేస్తారు. పంటలు కోల్పోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) చెల్లిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్ చివరిలో ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకుంటోంది. గత ఖరీఫ్‌లో కరువు ప్రభావిత మండలాల్లో పంట నష్టపోయిన 6.60 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే ఎన్నికల కోడ్ సాకుతో చంద్రబాబు బృందం రెండు నెలల పాటు అడ్డుకుంది.పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరువు సాయాన్ని జమ చేసి సీఎం జగన్ ప్రభుత్వం రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ సీజన్లో కరువు మండలాలను ప్రకటించిన పాపాన పోలేదు. సకాలంలో పరిహారం జమ చేసి రైతులకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. 24.80 లక్షల మంది రైతన్నలకు రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదే. ఈసీని పలుమార్లు అభ్యర్థించాం.. ⇒ ప్రాథమిక అంచనా ప్రకారం ఆరు జిల్లాల్లో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు గుర్తించాం. ప్రాథమిక నివేదిక తయారీ సమయంలోనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించాలని ఆదేశించాం. ఏప్రిల్‌లో పలుమార్లు ఎన్నికల కమిషన్‌ను కలిసి అనుమతి కోసం అభ్యరి్థంచాం. పంట కోతలు పూర్తయినప్పటికీ పొలంలో పంట ఉన్నప్పుడు సేకరించిన వివరాల ఆధారంగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి సామాజిక తనిఖీతో జాబితాలు సిద్ధం అవుతాయి. తద్వారా రైతులెవరూ నష్టపోయే ఆస్కారం ఉండదు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ ఎలాంటి జాప్యం జరగలేదు.. ⇒ కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ 2020 ప్రకారం ఖరీఫ్ కరువు మండలాలను అక్టోబర్ 31వ తేదీలోగా, రబీ కరువు మండలాలను మార్చి 31లోపు ప్రకటించాలి. దీని ప్రకారమే రబీ కరువు మండలాలను మార్చి 16న ప్రకటించారు. ఇందులో ఎలాంటి జాప్యం జరగలేదు. కరువు మాన్యువల్ ప్రకారం డ్రైస్పెల్ ఒక్కటే పరిగణలోకి తీసుకోడానికి వీల్లేదు. దేశవ్యాప్తంగా దశల వారీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర బృందం పర్యటన కొంత ఆలస్యమైంది. – కూర్మనాథ్, ఏపీ విపత్తుల సంస్థ ఎండీ -
స్పేస్ స్టార్టప్‌లకు కొత్త జోష్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడంతో స్పేస్ స్టార్టప్‌లకు మరింత ఊతం లభించగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాల తయారీ, అసెంబ్లింగ్ మొదలైన విభాగాల్లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం దక్కగలదని పేర్కొన్నారు. అలాగే, భారతీయ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష రంగ సరఫరా వ్యవస్థల్లో మరింతగా భాగం అయ్యేందుకు కూడా ఇది తోడ్పడగలదని డెలాయిట్ పార్ట్నర్ శ్రీరామ్ అనంతశయనం, నాంగియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ మయాంక్ ఆరోరా తదితరులు చెప్పారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనలను కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం ఉపగ్రహాల సబ్–సెక్టార్‌ను మూడు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఉపగ్రహాల తయారీ.. కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన వాటిలో 74 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో, అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి. అలాగే, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్‌లు మొదలైన వాటిలో 49 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అది దాటితే ప్రభుత్వ ఆమోదం ఉండాలి. శాటిలైట్ల కోసం విడిభాగాలు, సిస్టమ్స్ మొదలైన వాటిలోకి 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంటుంది. గణాంకాల ప్రకారం దేశీయంగా స్పేస్ విభాగంలో దాదాపు 200 పైచిలుకు స్టార్టప్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష ఎకానమీలో భారత ప్రైవేట్ స్పేస్ రంగం వాటా కేవలం రెండు శాతంగా ఉంది. 2040 నాటికి ఇది 10 శాతానికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. -
ఆర్టీసీ ఉద్యోగుల అర్జీలు సకాలంలో పరిష్కారం
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలపై అప్పీళ్ల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ వారి అర్జీల పరిష్కారానికి విధి విధానాలను ఖరారు చేసింది. ఈమేరకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలిలా ఉన్నాయి.. ► ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను సకాలంలో మంజూరు చేయాలి ► క్రమశిక్షణ చర్యలపై అర్జీలను వెంటనే పరిష్కరించాలి ► సిక్ లీవుకు సంబంధించిన జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మంజూరు చేయాలి ► ఉద్యోగులపై దాడికి పాల్పడ్డవారిపై సత్వరం కఠిన చర్యలు తీసుకునేలా పర్యవేక్షించాలి ► కేఎంపీఎల్, ఈపీకేలపై ఉద్యోగులను కౌన్సెలింగ్‌కు పంపించడం నిలిపివేయాలి ► తక్కువ రాబడి వచ్చే బస్ షెడ్యూళ్లను రీ షెడ్యూల్ చేయాలి ► బీఎస్ 4, బీఎస్ 6 వాహనాల వీల్‌బోల్ట్ మెషిన్లు, మయాటిక్ గన్స్, ఎలక్ట్రికల్ పరికరాలను అన్ని గ్యారేజీలలో అందుబాటులో ఉంచాలి ► ఉద్యోగులు పనిచేసే ప్రదేశాలు, భోజనశాలలు పరిశుభ్రంగా ఉంచాలి ► మూడు, నాలుగు షెడ్యూళ్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి ► వైఫల్యాలను కారణంగా చూపుతూ గ్యారేజ్ ఉద్యోగులను బదిలీ చేయకూడదు ► తగిన శిక్షణ లేకుండా డ్రైవర్లకు టిమ్ డ్యూటీలను అప్పగించకూడదు ► జీతాల కోత విధిస్తూ సెలవులు మంజూరు చేయకూడదు. -
డీప్‌ఫేక్‌ల అడ్డుకట్టకు ప్రత్యేక అధికారులు: కేంద్రం
న్యూఢిల్లీ: డీప్‌ఫేక్‌ల పరిశీలనలకు ఫిర్యాదులకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్‌మీడియా సంస్థలతో సమావేశం తరువాత కేంద్రం ఈ నిర్ధారణకు వచ్చింది. రెండు రోజుల కీలక సమావేశాల సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా విధి విధానాల రూపకల్పనకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఏడు రోజుల సమయం ఇస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్య తీసుకునేలా అధికారిని నియమిస్తామని సోషల్ మీడియా కంపెనీలను కలిసిన తర్వాత రాజీవ్ చంద్రశేఖర్ ఈ అంశాన్ని చెప్పారు. ఏఐ ద్వారా సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు చాలా ప్రమాదకరమని, నకిలీ సమాచారంతో ప్రజలను ఇవి తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు కఠినంగా వ్యవహించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘‘ఐటి రూల్స్ 2021 ప్రకారం నిర్దేశించిన వ్యవధిలోపు , లేదా రిపోర్టింగ్ చేసిన 36 గంటలలోపు ఆ కంటెంట్‌ను తొలగించాలి. లేదంటే చర్యలు తప్పవు’’ అని స్పష్టం చేశారు. డీప్‌ఫేక్‌లను సృష్టించినా, వ్యాప్తి చేసినట్టు రుజువైనా లక్ష రూపాయల దాకా జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన డీప్ ఫేక్ వీడియోల వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా స్పందిస్తోంది. డీప్‌ఫేక్‌ను సృష్టించి వ్యాప్తి చేసే వారితోపాటు, సోషల్ మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్లో పనిచేస్తున్న కంపెనీల సాయంతో డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి వివరణాత్మక మార్గదర్శకాలను తీసుకొచ్చేందుకు కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భగా ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా పుట్టుకొస్తున్న డీప్‌ఫేక్‌లను వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకువస్తామని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. -
డీప్‌ఫేక్‌లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్ చర్యలకు సిద్ధమవుతోంది. డీప్‌ఫేక్‌ను సృష్టించి వ్యాప్తి చేసే వారితోపాటు, సోషల్ మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. డీప్‌ఫేక్‌ల సమస్యపై చర్చించేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో నిర్వహించిన సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహించారు. డీప్‌ఫేక్ సమాజంలో కొత్త ముప్పుగా మారిందని వైష్ణవ్ అన్నారు. అనంతరం అశ్విన్ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా డీప్‌ఫేక్‌లు ఉద్భవించాయన్నారు. వీటిన సృష్టించి, వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. డీప్‌ఫేక్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని వీటి నియంత్రణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. అంతేకాదు సంఘవిద్రోహ శక్తులు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. రానున్న పదిరోజుల్లోనే నిబంధనల ముసాయిదాను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్లో పనిచేస్తున్న కంపెనీల సాయంతో డీప్‌ఫేక్ డీడియోల కట్టడికి వివరణాత్మక మార్గదర్శకాలను తీసుకురానున్నట్టు తెలిపారు. (ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు ) కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గార్బా నృత్యం చేస్తున్నట్టు వచ్చిన నకిలీ వీడియోతోపాటు, సినీ హీరోయిన్లు రష్మికా మందాన, కాజోల్ పేరుతో కొన్ని అభ్యంతర వీడియోలు నెట్టింట హల్ చేసిన నేపథ్యంలో ఐటీ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. -
స్టార్టప్‌లకు 5 వేల్యుయేషన్ విధానాలు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు అన్‌లిస్టెడ్ అంకుర సంస్థలు జారీ చేసే షేర్ల విలువను మదింపు చేసే విధానాలకు సంబంధించి కొత్త ఏంజెల్ ట్యాక్స్ నిబంధనలను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని 11యూఏ నిబంధనలో ఈ మేరకు సవరణలు చేసింది. దీని ప్రకారం అన్‌లిస్టెడ్ స్టార్టప్‌లు జారీ చేసే ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (సీసీపీఎస్) వేల్యుయేషన్‌ను సముచిత మార్కెట్ విలువ (ఎఫ్‌ఎంవీ)కి పది శాతం అటూ ఇటూగా లెక్క కట్టవచ్చు. ప్రవాస ఇన్వెస్టర్లు అయిదు రకాల వేల్యుయేషన్ విధానాలను ఉపయోగించవచ్చు. ఆప్షన్ ప్రైసింగ్ విధానం, మైల్స్టోన్ అనాలిసిస్ విధానం మొదలైనవి వీటిలో ఉంటాయి. దేశీ ఇన్వెస్టర్లకు ఈ అయిదు విధానాలు వర్తించవు. రూల్ 11 యూఏ ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లకు ప్రస్తుతమున్న డీసీఎఫ్ (డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో), ఎన్ఏవీ (అసెట్ నికర విలువ) విధానాలు వర్తిస్తాయి. ఎఫ్ఎంవీకి మించిన ధరకు షేర్లను విక్రయించడం ద్వారా స్టార్టప్‌లు సమీకరించిన నిధులపై వేసే పన్నును ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది తొలుత దేశీ ఇన్వెస్టర్లకే పరిమితమైనప్పటికీ 2023–24 బడ్జెట్లో విదేశీ పెట్టుబడులను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చే దిశగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. అయిదు రకాల వేల్యుయేషన్స్ విధానాలను అందుబాటులోకి తేవడం వల్ల ఇన్వెస్టర్లకు పన్నులపరంగా కొంత వెసులుబాటు పొందే వీలు లభించగలదని డెలాయిట్ ఇండియా, నాంగియా అండ్ కో తదితర సంస్థలు తెలిపాయి. -
...
నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝళిపిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా మూడు ప్రభుత్వం రంగ బ్యాంకులకు భారీ పెనాల్టీ విధించింది. ఈ మేరకు సోమవారం (సెప్టెంబర్ 25) ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో దేశీయ అతిపెద్ద పీఎస్బీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ఉన్నాయి. నిబంధనలు పాటించడంలో విఫలమైనట్లు గుర్తించిన క్రమంలో వీటిపై భారీ జరిమానా విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ సహా మూడు బ్యాంకులకు షాక్ రుణాలు, అడ్వాన్సులు- చట్టబద్ధ ఇతర పరిమితులు, ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్లు, రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలు పాటించ లేదంటూ ఎస్బీఐకి రూ. 1.30 కోట్లు ద్రవ్య జరిమానా విధించింది. ఆర్బీఐ తెలిపింది. రుణాలు- అడ్వాన్సులతో పాటు కేవైసీ, 2016లో ఆర్బీఐ డిపాజిట్ల వడ్డీ రేట్లకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైందని గుర్తించింది. దీంతో ఇండియన్ బ్యాంకుకు రూ. 1.62 కోట్ల ద్రవ్య పెనాల్టీ వేసింది.. డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్ విషయంలో నిబంధనలు పాటించలేదన్న కారణంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుకు రూ. 1 కోటి జరిమానా చెల్లించాల్సిదిగా ఆదేశించినట్టు ఆర్బీఐ తెలిపింది. దీంతోపాటు ఎన్‌బిఎఫ్‌సిలలో అక్రమాలను గుర్తించి ఆర్బీఐ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌పై రూ. 8.80 లక్షల పెనాల్టీని కూడా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందున బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సిలపై ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. -
బడా, లోకల్ మిల్లింగ్ కంపెనీలు కొనేలా!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టెండర్ల ద్వారా రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ బిడ్డింగ్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ఈ–వేలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి బడా కంపెనీలతో పాటు రాష్ట్రంలోని మిల్లింగ్ కంపెనీలు పాల్గొనేలా సరళమైన విధానాలను టెండర్ నిబంధనల్లో చేర్చారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి టెండర్ రాష్ట్రంలోని 2వేలకు పైగా రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న సుమారు 70 ఎల్ఎంటీ ధాన్యం నుంచి తొలి విడతగా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గత నెల 19వ తేదీన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆసక్తి గల సంస్థలు, వ్యాపారులు దరఖాస్తులు చేసుకోవడంతో ప్రి బిడ్డింగ్ సమావేశాలను సంస్థ నిర్వహించింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విధించిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నిబంధనల ద్వారా స్థానిక వ్యాపారులు, మిల్లర్లకు అవకాశం దక్కదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే విడతలో 4లక్షల లేదా 5 లక్షల మెట్రిక్ టన్నుల లాట్లలో ధాన్యం వేలం వేయడం వల్ల బడా కంపెనీలే తప్ప రాష్ట్రంలోని మిల్లర్లు గాని, మిల్లర్ల సిండికేట్ గానీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిబంధనల్లో పలు మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రతీ లాట్‌ను ఒక లక్ష టన్నులుగా మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు వేలం వేయాలని తొలుత నిర్ణయించగా... దాన్ని పూర్తిగా కేవలం 6 లాట్స్‌లో «వేలం వేయాలని టెండర్ నోటిఫికేషన్లో పొందుపరిచారు.. ఇందులో ఐదు లాట్స్‌లో 4లక్షల టన్నుల చొప్పున ఉండగా ఒక లాట్లో ఐదు లక్షల టన్నుల ధాన్యం ఉంది. ప్రి బిడ్ మీటింగ్ అనంతరం ఇందులో మార్పులు చేశారు. ప్రతీ లాట్‌ను ఒక లక్ష టన్నులుగా నిర్ణయించారు. అంటే 25 లాట్స్‌లో ధాన్యం వేలం వేయనున్నారు. లక్ష టన్నుల కెపాసిటీ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రతి కంపెనీ ఈ వేలంలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. వార్షిక టర్నోవర్‌లోనూ భారీ మార్పులు తొలుత ప్రకటించిన టెండర్ నిబందనల ప్రకారం టెండర్లలో పాల్గొనే కంపెనీకి గడిచిన మూడేళ్లలో ప్రతిఏటా రూ.వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్‌తో పాటు రూ.100 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అయితే రూ. 1000 కోట్ల టర్నోవర్ ఉన్న బియ్యం కొనుగోలు కంపెనీలు దేశంలో అతి తక్కువగా ఉంటాయన్న వాదనల మేరకు ప్రి బిడ్డింగ్ సమావేశంలో ఈ నిబంధనలు కూడా మార్చారు. రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను రూ.100 కోట్లకు, నెట్‌వర్త్ విలువ ను రూ.100 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు తగ్గించారు. ఇక వేలం తర్వాత ధాన్యం తీసుకెళ్లాల్సిన గడువును 30 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. నిబంధనల్లో మార్పులు చేయడంతో దరఖాస్తు, వేలం తేదీల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దీంతో ఈ నెల 11న జరగాల్సిన వేలం ప్రక్రియను 16వ తేదీకి వాయిదా వేశారు. నిబంధనల్లో మార్పుతో స్థానిక వ్యాపారులు, మిల్లర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం లభించనుంది. నిబంధనల సడలింపుతో ఎక్కువ మంది బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఏర్పడింది. -
Fact Check: ‘బోలో’ శంకరా.. నిబంధనలు పాటించరా?
సాక్షి, అమరావతి : సినిమా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. అదీ.. సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి, రూపొందించిన నిబంధనలే. గతంలో విడుదలైన సినిమాలకు ఈ నిబంధనల మేరకు సమాచారాన్ని, ఆధారాలను సమర్పించి, ఆ సినిమాల నిర్మాతలు రేట్లు పెంచుకున్నారు. చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలకు నచ్చలేదట. వెంటనే అవి ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. నిబంధనలు పాటించకపోయినా, ఆధారాలు సమర్పించకపోయినా సరే.. టిక్కెట్ రేట్లు పెంచాలంటూ అడ్డగోలుగా వాదిస్తున్నాయి. నిబంధనలు పాటించినట్టు ఆధారాలు సమర్పించినందునే గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు టిక్కెట్ రేట్లను తొలి వారం రోజుల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో నిబంధనలను పాటించినట్టు ఆధారాలు సమర్పించాలని చెబితే మాత్రం భోళా శంకర్ సినిమా నిర్మాణ సంస్థ ముఖం చాటేసింది. పైగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు నిజాలివీ.. టిక్కెట్ రేట్ల పెంపునకు నిబంధనలు ఇవీ... సినిమా టికెట్ల రేట్లను తొలి వారం, పది రోజులపాటు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారుచేసింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చర్చించి మరీ ఈ విధి విధానాలను రూపొందించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 11న మెమో జారీ చేసింది. ఆ ప్రకారం హీరో హీరోయిన్, డైరెక్టర్ల పారితోíÙకాలు కాకుండా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యయం కలిపి రూ.100 కోట్లు దాటాలి. సినిమా షూటింగ్లో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో చేయాలి. సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించాలి. దాన్ని చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ధ్రువీకరించాలి. సినిమా నిర్మాణానికి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ/ ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలి. మొత్తం 12 రకాల సాధారణ పత్రాలను సమర్పించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా టిక్కెట్ రేట్లు పెంచమంటే ఎలా? భోళా శంకర్ సినిమాను నిరి్మంచిన అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ నిబంధనలను ఏవీ పట్టించుకోలేదు. తొలి వారం రోజులు టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వాలని ఆ సంస్థ రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ)కి జులై 30న దరఖాస్తు చేసింది. దానిని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ పరిశీలించింది. జీవో నంబర్ 2 ప్రకారం ఇచ్చి న ఉత్తర్వుల్లో నిబంధనలను పాటించాలని, ఆధారాలు చూపాలని ఈ నెల 2న లిఖితపూర్వకంగా చెప్పింది. కానీ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటివరకు ఆ ఆధారాలను సమర్పించలేదు. వైజాగ్ పోర్టు, అరకు ప్రాంతాల్లో 25 రోజలపాటు భోళా శంకర్ సినిమా షూటింగ్ చేసినట్టు అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అంతకు ముందు దరఖాస్తులో తెలిపింది. అందుకు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ కోరింది. దీనిని సినిమా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. నిర్మాణ వ్యయం అఫిడవిట్, జీఎస్టీ చెల్లింపులు, ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి పత్రాలు వేటినీ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పించనే లేదు. ఇవేవీ లేకుండా టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది?. ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఇదే రీతిలో అనుమతి చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఈ నిబంధనల ప్రకారమే టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ సినిమాల నిర్మాణ సంస్థలు నిర్ణీత పత్రాలతో సహా దరఖాస్తు చేశాయి. వాటిని పరిశీలించి సక్రమంగా ఉండటంతో టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం భోళా శంకర్ చిత్రం నిర్మాణ సంస్థ కూడా ఇదే రీతిలో నిబంధనలను పాటిస్తే రేట్ల పెంపునకు అనుమతిస్తామని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ స్పష్టం చేసింది. కానీ కొందరు దురుద్దేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భోళా శంకర్ సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వడం లేదంటూ కొన్ని మీడియాలతోపాటు సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారు. -
వైన్ షాపుల లైసెన్సులకు లాటరీ.. ఉత్తర్వులు జారీ.. రూ.2 వేల కోట్ల ఆదాయం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండేళ్లకు ఏ4 (వైన్) షాపులకు లైసెన్సులు కేటాయించే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు లైసెన్సుల జారీకి సంబంధించిన నిబంధనలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సీఎస్ శాంతికుమారి జారీ చేసిన జీఓ నంబరు 86 ప్రకారం పాత పాలసీలోని నిబంధనల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి, నవంబర్ 30, 2025 వరకు మద్యం విక్రయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2,620 షాపులకు లైసెన్సులు జారీ చేస్తారు. ఇందుకు లాటరీ పద్ధతినే పాటిస్తారు. దరఖాస్తు ఫీజు కూడా గతంలో లాగానే రూ.2లక్షలుగా ఉంటుంది. ఎక్సైజ్ ఫీజు శ్లాబులూ, ఇతర నిబంధనలన్నీ గత పాలసీ మేరకే ఉంటాయి. గతంలో మాదిరిగానే గౌడ సామాజికవర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్ల ప్రకారమే జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలో ఎన్ని షాపులు కేటాయించాలో బుధవారమే నిర్ణయించారు. ఈ షాపుల సంఖ్య ప్రకారం గురువారం ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రాలు నిర్వహించి ఏ షాపులు ఏ ఏ వర్గాలకు కేటాయించాలో నిర్ణయిస్తారు. ఇతర షాపులకు కూడా లాటరీ పద్ధతిలోనే లైసెన్సులు ఇస్తారు. లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో గతంలో నిర్వహించిన విధంగానే జరుగుతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైన్ షాపుల కేటాయింపు ద్వారా ఈసారి కూడా రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏ4 షాపుల కేటాయింపు నిబంధనలు ఇలా... ♦ లైసెన్సులకు గత పాలసీ మాదిరిగానే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజులోనూ ఎలాంటి మార్పు లేదు. రూ.2లక్షలు దరఖాస్తు కోసం చెల్లించాలి. లాటరీ వచి్చనా రాకపోయినా ఆ డబ్బులు ప్రభుత్వానికే జమవుతాయి. ఒకరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు. ♦ రెండేళ్ల పాటు మద్యం విక్రయించుకునే ఫీజు గతంలోలాగే ఉంచారు. పాత స్లాబుల ప్రకారమే ఫీజులు నిర్ధారించారు. 5వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.50 లక్షలు, 5–50వేల జనాభా వరకు రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి 5లక్షల జనాభా వరకు రూ.65లక్షలు, 5 నుంచి 20లక్షల జనాభా వరకు రూ.85లక్షలు, 20లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో షాపులకు రూ.1.10 కోట్లు ఎక్సైజ్ ఫీజుగా నిర్ణయించారు. ♦ జీహెచ్ఎంసీ పరిధిలోని షాపులకు వర్తించే స్లాబు, జీహెచ్ఎంసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే షాపులకు, ఇతర కార్పొరేషన్లకు వర్తించే స్లాబులను కూడా ఐదు కిలోమీటర్ల పరిధిలోని షాపులకు వర్తింపజేస్తారు. మున్సిపాలిటీలకు వర్తించే స్లాబును ఆయా మున్సిపాలిటీలకు రెండు కిలోమీటర్ల దూరంలోని షాపులకు కూడా వర్తిస్తుంది. ♦ లైసెన్స్ ఫీజు ప్రతి ఏడాది ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చు. అంటే రెండేళ్లలో 12 సార్లు ఫీజు చెల్లించాలి. ఇందుకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ కింద మొత్తం ఫీజులో 25 శాతానికి ఇస్తే సరిపోతుంది. ♦ గతంలో మాదిరిగానే దరఖాస్తుతోపాటు ధరావతు (ఈఎండీ) చెల్లించాల్సిన అవసరం ఉండదు. ♦ మద్యం విక్రయాల ద్వారా లైసెన్సీలకు కమిషన్ (మార్జిన్) కూడా గతంలో ఉన్న విధంగానే నిర్ణయించారు. వార్షికఫీజు కంటే 10 రెట్ల టర్నోవర్ వరకు 27 శాతం మార్జిన్ ఇస్తారు. మీడియం, ప్రీమియం బ్రాండ్లపై 20 శాతం, బీర్లపై 20 శాతంగా మార్జిన్ నిర్ధారించారు. పదిరెట్ల టర్నోవర్ దాటిన తర్వాత మాత్రం అన్ని బ్రాండ్లకు 10శాతం మార్జిన్ మాత్రమే ఇస్తారు. ♦ పర్మిట్రూం కోసం అదనంగా ఏడాదికి రూ.5లక్షలు చెల్లించాలి. వాకిన్‌స్టోర్ కావాలంటే మరో రూ.5లక్షలు చెల్లించాలి. ♦ జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. మద్యం బాటిల్ లేబుల్‌పై ఉన్న ధరకు మాత్రమే విక్రయించాలి. ప్రతి షాపులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ద్వారా కేటాయింపబడని షాపులకు మళ్లీ టెండర్లు పిలవాలా లేక అవుట్లెట్లు ఏర్పాటు చేయాలా అనే దానిపై ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు. -
చెప్పులే ధరించాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షలకు హాజరయ్యేవారికి గురుకుల బోర్డు 28 రకాల నిబంధనలు విధించింది. ప్రధానంగా ఎగ్జామ్‌హాల్‌లోకి వచ్చే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని, బూట్లు ధరించిన అభ్యర్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 23వ తేదీ వరకు వరుసగా(సెలవులు మినహా) పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) విడుదల చేసింది. ఇప్పటివరకు 88 శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా, పరీక్ష సమయానికి గంటముందు వరకు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు టీఆర్‌ఈఐఆర్‌బీ కల్పించింది. ముందస్తుగా హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకుని నిబంధనలు పాటించాలని, పరీక్ష కేంద్రాలను ముందస్తుగా పరిశీలించుకుంటే ఇబ్బందులు ఉండవని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్యబట్టు తెలిపారు. అర్హత పరీక్షలు రోజుకు మూడు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు మొదటి సెషన్, రెండోసెషన్ మధ్యాహ్నం 12.30గంటల నుంచి 2.30గంటల వరకు, మూడోసెషన్ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. పరీక్ష సమయంకంటే గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తారు. పరీక్ష సమయం 15 నిమిషాల వరకు మాత్రమే గేట్లు తెరిచి ఉంచుతారు. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. అధికారుల పరిశీలనలో సంతృప్తి చెందితేనే లోనికి పంపిస్తారు. అభ్యర్థులు తమ వెంట ఏదేని ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డు (పాస్‌పోర్టు, ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్) వెంట తీసుకెళ్లాలి. ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లిన తర్వాత అభ్యర్థి బయోమెట్రిక్ సమాచారం సేకరిస్తారు. ప్రతి పరీక్ష 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు. నిర్దేశించిన గడువు తర్వాతే అభ్యర్థిని బయటకు పంపిస్తారు. ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌లో సాంకేతిక కారణాలతో ఫొటో ముద్రితం కాకుంటే ఒరిజినల్ ఫొటో అతికించి నిబంధనలకు అనుగుణంగా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి హాజరుకావాలి. బోర్డు కార్యాలయం వద్ద అభ్యర్థుల ఆందోళన పరీక్ష కేంద్రాల కేటాయింపు గందరగోళంగా జరిగిందంటూ కొందరు అభ్యర్థులు సోమవారం ఉదయం దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో ఆందోళనకు దిగారు. దాదాపు 50 మంది అభ్యర్థులు బోర్డు కార్యాలయ ఆవరణకు చేరుకుని అధికారులను నిలదీశారు. ఒక్కో పరీక్షకు ఒక్కోచోట కేంద్రం కేటాయించడం, సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణించడం కత్తిమీద సాముగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా ఎలా రాయగలమని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాల కేటాయింపులో అధికారులు, ఉద్యోగుల ప్రమేయం ఏమీ లేదని, అభ్యర్థులకు సర్దిచెప్పి పంపించారు. -
స్టాఫ్ నర్స్ పరీక్షకు కఠిన నిబంధనలు.. చెప్పులు మాత్రమే వేసుకోవాలి!
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల రెండో తేదీన నిర్వహిస్తోన్న స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షకు కఠిన నిబంధనలు విధించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 40,936 మందికి 40 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 24, ఖమ్మంలో 6, నిజామాబాద్‌లో 2, వరంగల్‌లో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ కాబట్టి ఆన్లైన్ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే రోజు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం సెషన్ పరీక్ష 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు 7.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 గంటలకు గేట్ మూసేస్తారు. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 11 గంటలకే చేరుకోవాలి. 12.15 గంటలకు గేట్ మూసేస్తారు. ఇక మూడో సెషన్ పరీక్ష సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి. 3.45 గంటలకు గేట్ మూసేస్తారు. అభ్యర్థుల సమాచారాన్ని బయోమెట్రిక్ పద్ధతిలో సేకరిస్తారు. కాబట్టి ముందస్తుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను ఏ–4 సైజు పేపర్‌పై ప్రింటవుట్ తీసుకోవాలి. అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. హాల్ టికెట్, ఫొటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే అభ్యర్థి 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను తప్పనిసరిగా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన ఒక హామీతో పాటు తీసుకురావాలి. పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. లేని పక్షంలో అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు పాస్‌పోర్ట్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ/ఆధార్ కార్డ్/ ప్రభుత్వ ఉద్యోగి ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒక చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ వద్ద అభ్యర్థుల బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంక్, టాటూలు వంటివి వేయించుకోవద్దు. గేట్ మూసివేసే సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రం, సెషన్లో మాత్రమే పరీక్ష రాయాలి. పరీక్షా కేంద్రం, సెషన్ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపలకు హాల్ టికెట్, నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకెళ్లాలి. పారదర్శకమైన వాటర్ బాటిల్ తీసుకురావచ్చు. పరీక్ష హాలులో రఫ్ షీట్లను ఇన్విజిలేటర్ అందజేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పోలీస్ కేసు అభ్యర్థులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తే, అనర్హత వేటు వేయడమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, టాబ్స్, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్‌లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్లు లేదా మరే ఇతర గాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదు. అలాగే ఇతర రికార్డింగ్ సాధనాలను అనుమతించరు. అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించి పరీక్షా కేంద్రానికి రావాలి. బూట్లు ధరించకూడదు. నిరీ్ణత సమయానికి ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపడానికి అనుమతించరు. ఖమ్మంలో ఓ పరీక్ష కేంద్రం మార్పు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని మార్పు చేశారు. ప్రియదర్శిని మహిళా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్ష నిర్వహించే స్థితిలో లేదు. కాబట్టి దానికి బదులుగా స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లలో పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ నంబర్లు అలాగే ఉంటాయి. పరీక్షా కేంద్రం మార్పును సూచించే సవరించిన హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. -
సోలార్ పవర్ ఉత్పత్తికి కొత్త నిబంధనలు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా సోలార్ రూఫ్‌టాప్ సిస్టంను మరింతగా విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పలు కొత్త నిబంధనలు రూపొందించింది. వాటితో సమగ్ర గ్రిడ్ ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ రెగ్యులేషన్–2023ను ప్రతిపాదించింది. సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్లు, డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఈ నిబంధనలను రూపొందించినట్లు ఏపీఈఆర్సీ తెలిపింది. రాష్ట్రంలోని డిస్కంల పరిధిలో ఇన్స్టాల్ చేసిన, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లేని అన్ని గ్రిడ్–ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. ఇవీ నిబంధనలు ♦ సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకునేవారికి డిస్కంలు నెట్ మీటరింగ్ సదుపాయాన్ని కల్పించాలి. ♦ గృహవిద్యుత్ వినియోగదారులు ఏర్పాటుచేసే రూఫ్‌టాప్ సిస్టమ్ ప్రాజెక్టు నుంచి 25 ఏళ్ల పాటు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ తీసుకునేలా డిస్కంలు ఒప్పందం చేసుకుంటాయి. ♦ ఇంటరాక్టివ్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారుకు అర్హత ఉంది. ♦ సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసినవారే దాన్ని సురక్షితంగా చూసుకోవాలి. ఆపరేషన్, నిర్వహణ బాధ్యత వహించాలి. ♦ ప్రమాదంగానీ, పంపిణీ వ్యవస్థకు ఏదైనా నష్టంగానీ వాటిల్లినప్పుడు తమ నెట్వర్క్ నుంచి సోలార్ నెట్‌వర్క్‌ను డిస్కనెక్ట్ చేసే హక్కు డిస్కంలకు ఉంటుంది. వాణిజ్య ఒప్పందం ద్వారా రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తే ఆ ఒప్పందం కాపీని డిస్కంలకు ఇవ్వాలి. ♦ అన్ని లిమిటెడ్ కంపెనీలు, ప్రభుత్వసంస్థలు, వ్యక్తులు, సంఘాలు, వినియోగదారులు సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ఏర్పాటుకు అర్హులే. ఎవరు ఎక్కడైనా పెట్టుకుని విద్యుత్‌ను వాడుకోవచ్చు, విక్రయించవచ్చు. -
ఏసీబీకి చేతికి చిక్కిన వీసీ.. ఇంతకూ తొలగించే అధికారం ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఏసీబీ వలలో చిక్కిన తర్వాత రాజ్యాంగ పరమైన అనేక అంశాలపై విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి వీసీ నియామకం, తొలగింపుపై పూర్తి అధికారాలు గవర్నర్‌కు మాత్రమే ఉంటాయి. నియామకానికి సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా, తొలగింపు విషయంలో మాత్రం ఏ అధికారం ఉండదని నిబంధనలు పేర్కొంటున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలోనూ వీసీ ఈ అంశాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కాలేజీ విద్య కమిషనర్‌కు తనను ప్రశ్నించే అధికారమే లేదని ఆయన అన్నట్టు మీడియాలో వచ్చింది. ఆ త ర్వాత కూడా తనను తీసివేసే అధికారం ప్రభుత్వాని కి ఎక్కడుందనే వాదన పరోక్షంగా వీసీ లేవ నెత్తారు. ఇదే క్రమంలో యూనివర్సిటీ పాలన వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేయడం, తాజాగా ఓ వ్యవహారంలో ఏసీబీ ప్రత్యక్షంగా వీసీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం ఈ ఎపిసోడ్లో కొత్త మలుపు. ఇప్పు డు జరగబోయేదేంటనేది హాట్ టాపిక్‌గా మారింది. వీసీ నియామకం ఎలా...? ఏదైనా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను నియమించేటప్పుడు ముందుగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ ప్రక్రియ కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, వీసీ నియామకం జరిగే విశ్వవిద్యాలయం నుంచి ఒకరిని ఈ కమిటీలో చేరుస్తారు. యూజీసీ ఎవరినైనా నిపుణుడిని సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యాశాఖ కార్యదర్శి సభ్యుడిగా ఉంటారు. యూనివర్సిటీ తరపున పదవీ విరమణ చేసిన నిపుణుడైన మాజీ వీసీని సాధారణంగా చేరుస్తారు. నోటిఫికేషన్ తర్వాత వచ్చే దరఖాస్తులను కమిటీ పరిశీలించి, ముగ్గురి పేర్లను గవర్నర్‌కు పంపుతుంది. ఇందులోంచి గవర్నర్ ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత గవర్నర్ నియామకానికి సంబంధించిన నియామకపు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి ఇస్తారు. తొలగింపు ఎలా? గవర్నర్ నియమించిన వైస్ చాన్స్‌లర్ ప్రభుత్వానికి ఇష్టం లేదనుకుంటే రెండింట మూడొంతుల అసెంబ్లీ మెజారిటీ తీసుకుని వీసీ తొలగింపు ఉత్తర్వులు ఇవ్వొచ్చు. ఇక్కడ కూడా అసెంబ్లీ నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపాల్సి ఉంటుంది. నేరుగా గవర్నర్‌కు కూడా వీసీని కారణాలు లేకుండా తొలగించే అధికారం ఉండదు. అయితే, తెలంగాణ యూనివర్సిటీ వీసీ వివాదం భిన్నమైంది. ఇలాంటి సంక్లిష్ట సమస్య గతంలో ఎప్పుడూ ఎదురవ్వలేదు. ఏసీబీ దాడి చేయడంపైనా పలు ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. ఇలా దాడి చేయాలన్నా, ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలా? అనే విషయమై ఉన్నతాధికారులు ముందుగా న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. వీసీ వేతనం తీసుకుంటున్నాడు కాబట్టి, ప్రజా సేవకుడిగానే చూడాలని నిపుణులు తెలిపారు. కాబట్టి ఏసీబీ చట్టం పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు. ఏసీబీ దాడి, అరెస్టు జరిగిన తర్వాత వీసీని కూడా సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విచారణ పూర్తయి నేరం రుజువైతే శాశ్వతంగా తొలగించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని చెబుతున్నారు. కాకపోతే ప్రతీ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళా్లల్సిన అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
వేరబుల్ గ్యాడ్జెట్స్‌కి నిబంధనలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టం విధి విధానాలకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తొలిసారిగా పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు నిర్వహించారు. స్పై కెమెరా గ్లాసెస్, వేరబుల్ డివైజ్‌లు వంటి గ్యాడ్జెట్లు సేకరించే డేటాను హ్యాండిల్ చేయడానికి సంబంధించి నిబంధనలపైనా చర్చించారు. వీటిని విక్రయించే దశలోనే కేవైసీ (కస్టమర్ల వివరాల సేకరణ) నిబంధనలను వర్తింపచేయడం తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. మరో రెండు విడతల సంప్రదింపుల తర్వాత డిజిటల్ ఇండియా చట్టం ముసాయిదా పూర్తి కాగలదని, ఏప్రిల్‌లో దీన్ని జారీ చేసే అవకాశం ఉందని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సుమారు 45–60 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత జూలై నాటికల్లా చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే 10 ఏళ్లలో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ చట్టాన్ని తీర్చిదిద్దాల్సి ఉందని మంత్రి చెప్పారు. -
భారత చట్టాలకు లోబడి పని చేయాల్సిందే
న్యూఢిల్లీ: భారత్‌లో పని చేసే సంస్థలన్నీ ఇక్కడి చట్టాలకు, నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సిందేనని బ్రిటన్‌కు కేంద్రం స్పష్టం చేసింది. రెండు రోజుల జీ–20 మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ బుధవారం విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. బీబీసీపై పన్ను ఎగవేత ఆరోపణలు, ఢిల్లీ, ముంబైల్లోని ఆ సంస్థ కార్యాలయాల్లో సీబీఐ సర్వే ఉదంతాన్ని ఈ సందర్భంగా క్లెవర్లీ ప్రస్తావించారు. ఏ సంస్థలైనా ఇక్కడి పూర్తిగా చట్టాలకు లోబడి పని చేయాలని జై శంకర్ గట్టిగా బదులిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పలు అంతర్జాతీయ పరిణామాలపైనా తామిద్దరం లోతుగా చర్చలు జరిపామంటూ అనంతరం జై శంకర్ ట్వీట్ చేశారు. -
కేంద్రం సంచలన నిర్ణయం..! ఆ కార్ల తయారీ నిలిపివేత?
త్వరలో కేంద్రం రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) నిబంధనల్ని అమలు చేయనుంది?. దీంతో భారత్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని కంపెనీలకు చెందిన కార్లు, ఎస్‌యూవీలు కనుమరుగు కానున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కొత్త ఉద్గార నిబంధనలు డ్రైవింగ్ సమయంలో కార్ల నుంచి విడుదలయ్యే ఎన్ఓఎక్స్ వంటి కాలుష్య కారకాల్ని కొలవడం, వేగం వృద్ధి, క్షీణతలో తరచూగా వచ్చే మార్పులను పరిణగలోకి తీసుకోనున్నాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, కార్ల తయారీదారులు తమ ఇంజిన్లను తక్కువ ఉద్గారాలకు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. ఇంజన్ అప్డేషన్ ప్రక్రియ ఖరీదైంది. కాబట్టే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో పలు కంపెనీల 27 డీజిల్ కార్లు, ఎస్‌యూవీల కార్యకలాపాల్ని నిలివేసే అవకాశం ఉంది. ఆర్డీఈ నిబంధనల ప్రకారం వాహనాలు డ్రైవింగ్ సమయంలో విడుదలయ్యే ఉద్గార స్థాయిలను గుర్తించేలా పరికరాన్ని కలిగి ఉండాలి. ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉత్ప్రేరక కన్వర్టర్లు, ఆక్సిజన్ సెన్సార్ల వంటి క్లిష్టమైన భాగాలను పరికరం పర్యవేక్షిస్తుంది. కార్మేకర్లు క్రాంక్‌షాఫ్ట్ పొజిషన్లు, థొరెటల్, ఇంజన్ ఉష్ణోగ్రతను స్కాన్ చేయడానికి వాహనాల సెమీకండక్టర్లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కార్లు, ఎస్‌యూవీలలో ఇంధనం మండే స్థాయిని నియంత్రించడానికి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్లను కూడా అమర్చాలి. అన్ని డీజిల్ ఇంజిన్లు ఉద్గారాల నియంత్రణ ఖరీదైన 'సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్' (ఎస్ఈఆర్) సాంకేతికతకు మారవలసి ఉంటుంది. కాబట్టి, డీజిల్ కార్ల ధర గణనీయంగా పెరుగుతుంది. కార్ల తయారీకి భారీగా ఖర్చు చేయడం, తయారీ ఖర్చు.. కార్ల ధరల్ని పెంచడం.. పెరిగిన ధరలతో వాటి డిమాండ్ పడిపోవడం వంటి పరిణామలత నేపథ్యంలో సంస్థలు కార్ల తయారీని, అమ్మకాల్ని నిలివేయనున్నాయి. వాటిలో హోండా సిటీ 4వ జెన్, సిటీ 5వ జెన్ (డీజిల్), అమేజ్ (డీజిల్), జాజ్ డబ్ల్యూఆర్ -వీ, మరాజు, అల్ట్రాస్ జీ4, కేయూవీ 100, మహీంద్రా, హ్యుందాయ్, స్కోడా ఒక్కొక్కటి రెండు మోడళ్లను నిలిపివేయనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ ఐ20, వెర్నా డీజిల్ మోడళ్లను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తే, స్కోడా ఆక్టావియా, సూపర్బ్ కార్లు మార్కెట్లో కనుమరుగు కానున్నాయి. టాటా ఆల్ట్రోజ్ (డీజిల్), రెనాల్ట్ క్విడ్ 800, నిస్సాన్ కిక్స్, మారుతి సుజుకి ఆల్టో 800 నిలిపివేయనున్న జాబితాలో ఉన్నాయి. చదవండి👉 టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
ఆటో సంస్థలకు నిబంధనల భారం
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ కంపెనీలు పాటించాల్సిన చట్టాలు, నిబంధనలు అనేకానేకం ఉంటాయి. అయితే, ఆయా కంపెనీల మేనేజ్మెంట్లోని కీలక హోదాల్లో ఉన్న వారికి (కేఎంపీ)వీటిపై అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. టీమ్‌లీజ్ రెగ్‌టెక్ నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఆటోమొబైల్ పరిశ్రమ పాటించాల్సిన నిబంధనలను సరళతరం చేయాల్సిన ఆవశ్యకతపై రెగ్‌టెక్ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం చిన్నపాటి వాహనాల తయారీ సంస్థ ఒక రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించాలంటే వన్‌టైమ్, ఏటా పాటించాల్సిన నిబంధనలు కనీసం 900 పైచిలుకు ఉంటున్నాయి. వన్‌టైమ్ అంశాలైన రిజిస్ట్రేషన్లు, అనుమతుల్లాంటివి పక్కన పెడితే కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితా కింద పాటించాల్సిన నిబంధనలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందల కొద్దీ చట్టాలు, నిబంధనలను తెలుసుకుని, పాటించడంపై కేఎంపీల్లో అవగాహన అంతంతమాత్రంగానే ఉంటోంది. అనేకానేక నిబంధనలు, తేదీలు, డాక్యుమెంటేషన్ మొదలైనవన్నీ పాటించడం కష్టతరమవుతోంది. ఫలితంగా అనూహ్యంగా షోకాజ్ నోటీసులు అందుకోవడం, పెనాల్టీలు కట్టడం, లైసెన్సులు రద్దు కావడం వంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్య కాలంలో 34 ఆటోమొబైల్ కంపెనీలపై రెగ్‌టెక్ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం గడిచిన ఏడాది కాలంలో తాము పాటించడంలో విఫలమైన కీలక నిబంధన కనీసం ఒక్కటైనా ఉంటుందని 95 శాతం మంది కేఎంపీలు తెలిపారు. అలాగే జరిమానాలు కట్టాల్సి వచ్చిందని 92 శాతం మంది వెల్లడించారు. నియంత్రణపరమైన నిబంధనల అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం సవాలుగా ఉంటోందని 52 శాతం మంది తెలిపారు. -
దాదాపు 24 లక్షల అకౌంట్లకు షాకిచ్చిన వాట్సాప్
న్యూఢిల్లీ: సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ జూలైలో భారతదేశంలో 23.87 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా ఈచర్చ తీసుకుంది. ఇదే ఏడాది జూన్‌లో 22 లక్షలకు పైగా ఖాతాలను, మేలో 19 లక్షల ఖాతాలు బ్యాన్ చేసింది. ఇది చదవండి : 100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా! మార్గదర్శకాలు,నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాలను బ్యాన్ చేసినట్టు ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021 నిబంధనల కింద తాజా నివేదికలో వాట్సాప్ఈవివరాలను అందించింది. అలాగే యూజర్ల ఫిర్యాదులు దానిపై తాము తీసుకున్న చర్యల వివరాలు కూడా పొందుపరిచామని వాట్సాప్ తెలిపింది. ఇదీ చదవండి: WhatsApp:బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు జూలైలో అందిన 574 ఫిర్యాదుల నివేదికల్లో 392 నివేదికలు 'బ్యాన్ అప్పీల్' గాను, మిగిలినవి ఖాతా,ప్రొడక్ట్స్, భద్రత లాంటివి వచ్చాయని చెప్పింది. జూలై 1, 2022 , జూలై 31, 2022 మధ్య, 23,87,000 వాట్సాప్ ఖాతాలు నిషేధించామని, వీటిలో 14,16,000 ఖాతాలు ముందుగా బ్యాన్ చేశామని నెలవారీ నివేదిక పేర్కొంది. అంతకుముందు జూన్‌లో వాట్సాప్‌కు 632 ఫిర్యాదుల నివేదికలు అందగా, మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాటిలో 64పై చర్య తీసుకున్న సంగతి తెలిసిందే. -
8 సహకార బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా
ముంబై: నియంత్రణా పరమైన నిబంధనలు పాటించని కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది సహకార బ్యాంకులపై జరిమానాలు విధించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు బ్యాంకులు ఉండగా, తెలంగాణా, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఆర్బీఐ జరిమానాకు గురైన బ్యాంకులు ఉన్నాయి. ఈ మేరకు వెలువడిన ప్రకటనల ప్రకారం... ► ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సహకార బ్యాంకుపై రూ.55 లక్షల జరిమానా. ► నెల్లూరు కో–ఆపరేటివ్ అర్బన్‌బ్యాంక్‌పై రూ.10 లక్షలు. ► కాకినాడ కో–ఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌పై రూ.10 లక్షలు. ► తెలంగాణ, హైదరాబాద్ దారుసల్లాం సహకార అర్బన్ బ్యాంక్‌పై రూ.10 లక్షలు. ► తమిళనాడు, తిరుచిరాపల్లి, కైలాసపురంలో ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.10 లక్షల జరిమానా. ► కేరళ, పాలక్కాడ్ జిల్లా, ది ఒట్టపాలెం కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 5 లక్షలు. ► ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.5 లక్షలు. ► ఒడిస్సాలోని కేంద్రపారా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై రూ. లక్ష. -
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది. ముందు జాగ్రత్తలు పాటిస్తూ, ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. దీంతోపాటు, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోని ఒక ప్రముఖ ప్రాంతంలో పదిహేను, నెల రోజులపాటు కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కూడా కోరింది. -
పేదల నడ్డి విరుస్తున్న అడ్డగోలు వడ్డీ వసూళ్లు, ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: డిజిటల్‌గా రుణాల మంజూరుకు సంబంధించి నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక వసూళ్ల విధానాలకు చెక్ పెట్టే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల కింద.. బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు/ఆర్ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ముఖ్యంగా థర్డ్ పార్టీ సంస్థల అగడాలను అరికట్టడానికి ఆర్బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. రుణ ఉత్పత్తులను అడ్డగోలుగా మార్కెటింగ్ చేయడం, డేటా గోప్యతను ఉల్లంఘించడం, అనైతిక వ్యాపార విధానాలు, భారీ వడ్డీ రేట్లు, అనైతిక వసూళ్ల విధానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలన్నది ఆర్బీఐ కార్యాచరణగా ఉంది. నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలు.. ► రుణ ఒప్పందానికి ముందు రుణ గ్రహీతకు కీలకమైన వాస్తవ సమాచార స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్) ఇవ్వాలని ఆర్బీఐ నిర్ధేశించింది. ఆర్బీఐ నియంత్రణల కింద పనిచేసే సంస్థలు, డిజిటల్ లెండింగ్ యాప్‌లు, వీటి కింద పనిచేసే రుణ సేవల సంస్థలు (థర్డ్‌పార్టీ) దీన్ని తప్పక పాటించాలి. ► రుణ గ్రహీత ఆమోదం లేకుండా ఆటోమేటిక్‌గా రుణ పరిమితి పెంచడాన్ని నిషేధించింది. ► డిజిటల్ రుణాలను అసలుతోపాటు, అప్పటి వరకు వడ్డీతో చెల్లించి (ఎటువంటి పెనాల్టీ లేకుండా) క్లోజ్ చేసేందుకు వీలుగా కూలింగ్ ఆఫ్/ లుక్ అప్ పీరియడ్‌ను కల్పించాలి. ► రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపకపోతే.. అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ► డిజిటల్ లెండింగ్ యాప్‌లు, రుణ సేవల సంస్థలు రుణ గ్రహీత అనుమతితో, కావాల్సిన వివరాలను మాత్రమే తీసుకోవాలి. డేటా వినియోగంపై రుణ గ్రహీత అనుమతి తీసుకోవాలి. ► ఫిన్‌టెక్, డిజిటల్ లెండింగ్ సేవలపై ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా నియంత్రిత సంస్థలు, వాటి కింద రుణ సేవలను అందించే సంస్థలు తగిన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అందించే రుణాలను డిజిటల్ లెండింగ్‌గా పరిగణిస్తారు. -
భారత మార్కెట్‌పై అమెజాన్ బుల్లిష్
న్యూఢిల్లీ: భారత మార్కెట్ పట్ల తాము సానుకూలంగా (బుల్లిష్) ఉన్నట్టు అమెరికాకు చెందిన ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేసింది. ఉద్యోగాల కల్పన, ఎగుమతులు, ఎంఎస్ఎంఈల డిజిటైజేషన్ లక్ష్యాలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ‘‘వచ్చే ఆరు నెలల్లో మేము ఎంత పెద్ద, మెరుగైన సంస్థో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. భారత్‌లో కొనుగోళ్లు, విక్రయాలను పూర్తిగా మార్చాలన్న మా లక్ష్యం దిశగా పనిచేస్తూనే ఉన్నాం’’అని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ (కన్జ్యూమర్ బిజినెస్) మనీష్ తివారీ పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూపులో అమెజాన్ పెట్టుబడుల ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధం అంటూ సీసీఐ ఇచ్చిన తీర్పును అమెజాన్ ఎన్సీఎల్టీలో సవాలు చేయగా.. అక్కడ ప్రతికూల తీర్పు రావడం తెలిసిందే. సీసీఐ తీర్పును సమర్థిస్తూ, అమెజాన్ పిటిషన్‌ను ఎన్సీఎల్టీ తిరస్కరించడం తెలిసే ఉంటుంది. సీసీఐ రూ.200 కోట్ల పెనాల్టీని కూడా ఎన్సీఎల్టీ సమర్థించింది. దీనిపై మాట్లాడేందుకు తివారీ తిరస్కరించారు. కోర్టు ఆదేశాలను సంబంధిత వ్యక్తులు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. వేగంగా వృద్ధి అమెజాన్ 9 ఏళ్ల క్రితం 100 విక్రయదారులు, ఒక గోదాముతో సేవలు మొదలు పెట్టింది. ఇప్పటికి తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయదారుల సంఖ్యను 11 లక్షలకు పెంచుకుంది. 23 కోట్ల ఉత్పత్తులను విక్రయానికి ఉంచింది. గోదాములు 60కి చేరాయి. -
‘సెబీ’ సైబర్ సెక్యూరిటీ నిబంధనలు కఠినతరం
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్చంజీలు, ఇతరత్రా మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు పాటించాల్సిన సైబర్ సెక్యూరిటీ నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింత కఠినతరం చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు మొదలైన మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐ) ఇకపై ప్రతీ ఆర్థిక సంవత్సరంలో కనీసం 2 సార్లు సమగ్రమైన సైబర్ ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సైబర్ ఆడిట్ నివేదికలతో పాటు నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామంటూ ఆయా సంస్థల ఎండీ, సీఈవోలు ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో తెలిపింది. సవరించిన నిబంధనల ప్రకారం వ్యాపార కార్యకలాపాలు, డేటా మేనేజ్మెంట్, సర్వీసుల నిర్వహణలో కీలకమైన అసెట్లను వాటి ప్రాధాన్యత ప్రకారం వర్గీకరించాలి. సైబర్ ఆడిట్ల (వీఏపీటీ) నిర్వహణ పూర్తయిన నెల రోజుల్లోగా సెబీకి నివేదిక సమర్పించాలి. -
వర్క్‌ఫ్రమ్ హోం.. శాలరీ స్ట్రక్చర్ ఓ కొలిక్కి!
దేశంలో వర్క్‌ఫ్రమ్ హోం విధానంలో కొనసాగే ఉద్యోగుల జీతభత్యాల రూపకల్పనకు సంబంధించిన కసరత్తులు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్రం కార్మిక మంత్రిత్వ శాఖ, పరిశ్రమల విభాగం జరుపుతున్న చర్చలు ‘శాలరీ స్ట్రక్చర్’ని ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు సమాచారం. వర్క్‌ఫ్రమ్ హోంలో కొనసాగే ఉద్యోగులకు బేసిక్ శాలరీ, హైకులు, బోనస్‌ల నిర్ణయాలు పూర్తిగా కంపెనీవే. తాజాగా ‘తక్కువ ఇంటి అద్దె భత్యం నుంచి కొత్త తగ్గింపుల వరకు’.. కొన్ని ప్రతిపాదనలపై కేంద్రం, కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు నడిచాయి. కొత్త వర్క్ మోడల్‌కు సరిపోయేలా ఒక లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే క్రమంలోనే ఇలా పారిశ్రామిక ప్రతినిధులతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వరుస భేటీలు నిర్వహిస్తోందని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. హెచ్ఆర్ఏ మీదే.. వర్క్‌ఫ్రమ్ హోం ఎఫెక్ట్‌తో సొంతూళ్లకే పరిమితమైన ఉద్యోగుల కారణంగా ఇంటి అద్దె భత్యంలో తగ్గింపు, వైఫై-కరెంట్ బిల్లులపై రీయంబర్స్మెంట్ను ప్రవేశపెట్టడం గురించి తాజా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే House Rent Allowance శాతం తగ్గించడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, మరో భేటీలో ఈ అంశంపై స్పష్టత రావొచ్చని చెప్తున్నారు. ఆపై సిద్ధం చేసిన డ్రాఫ్ట్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. తద్వారా ట్యాక్స్ చట్టాలకు అవసరమైన సవరణలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ మేరకు బడ్జెట్-2022లో ఈ విషయాల్ని పొందుపరుస్తారనే ప్రచారం నడుస్తున్నప్పటికీ.. అంత సమయం లేకపోవడంతో జరిగేది కష్టమేననే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇబ్బందులు లేకుండా చూడండి ఇదిలా ఉంటే జనవరి 13న భారత్‌కు చెందిన కొన్ని కంపెనీల హెచ్ఆర్ హెడ్స్, సీఈవోలతో కార్మిక మంతత్రిత్వ శాఖ భేటీ జరిపింది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. ఉపాధి కల్పనను పెంపొందించడం, శ్రామిక శక్తి యొక్క భవిష్యత్తు నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు వర్క్‌ఫ్రమ్ హోం విధి విధానాలపై చర్చ జరిగిందని సమాచారం. యజమానులు- ఉద్యోగుల మధ్య వివాదాల పరిష్కారం, ఏర్పడబోయే ఇబ్బందుల్ని తొలగించడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ కోసం ‘‘సమగ్ర’’ నియమాలు, నిబంధనలను రూపొందించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదివరకే.. గత ఏడాది జనవరిలో ప్రభుత్వం స్టాండింగ్ ఆర్డర్ ద్వారా సర్వీస్‌సెక్టార్‌కి ఇంటి నుండి పనిని లాంఛనప్రాయంగా చేసింది. యజమానులు మరియు ఉద్యోగులు పని గంటలు మరియు ఇతర సేవా పరిస్థితులపై పరస్పరం నిర్ణయించుకునేలా చేసింది. అయితే కరోనా పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు అన్ని రంగాలకు సమగ్ర అధికారిక నిర్మాణాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వం తన ప్రీ-బడ్జెట్ మెమోరాండమ్‌లో పని నుండి ఇంటి ఖర్చులపై పన్ను మినహాయింపు ఇవ్వాలని సిఫారసు చేసింది. ‘‘ఫర్నీచర్/ఇతర సెటప్ ఛార్జీల కోసం అయ్యే ఖర్చులు ప్రత్యేకంగా మినహాయింపొచ్చు’’ అని ICAI సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా యొక్క ప్రీ-బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ 2022 నివేదిక ఉద్యోగుల కోసం ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్’’ ఖర్చులపై మరిన్ని తగ్గింపులను సూచించింది. ‘‘ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ఉద్యోగులు వ్యాపారాలలో ఇంటి నుండి పని చేస్తున్నారు’’’అని అకౌంటింగ్ విభాగం పేర్కొంది, ఉద్యోగులకు అదనంగా రూ. 50,000 WFH భత్యాన్ని సిఫార్సు చేసింది. మరోవైపు పరిశ్రమల సంస్థ నాస్కామ్.. వర్క్‌ఫ్రమ్ హోంకు మద్దతుగా ప్రభుత్వం లేబర్ చట్టాల్లో చేయగల ఆరు చర్యలను సిఫార్సు చేసింది. పని గంటలు, షిఫ్ట్ సమయాలను మార్చేయడం లాంటి కార్మిక చట్టాలలో మార్పుల్ని నాస్కామ్ పేర్కొంది. అంతేకాదు ఉద్యోగులు చేసే ఖర్చుల నుండి ఆదాయపు పన్ను చట్టాలలో మార్పులను సిఫార్సు చేసింది. ప్రధానంగా ఇంటి నుండి పనిని వ్యాపార ఖర్చులుగా పరిగణించాలని సూచించింది. నాస్కామ్ సమర్పించిన సిఫార్సుల నివేదికను కిందటి ఏడాది మే నెలలోనే.. పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వ అధికారుల చర్చించి.. ఆపై ఆ నివేదికను కార్మిక మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు పంపారు. చదవండి: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐటీ కంపెనీల కీలక నిర్ణయం! -
Twitter: ట్విటర్ కొత్త పాలసీ, కఠిన నిబంధనలు ఇవే..
Twitter New Rules 2021: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఇకపై ప్రైవసీ నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంపై ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోనుంది. ట్విటర్ కొత్త పాలసీ నవంబర్ 30, 2021 నుంచి అమలులోకి వచ్చిందని ప్రకటించుకుంది. ఒక యూజర్ లేదంటే అథారిటీ కావొచ్చు.. అవతలి వాళ్ల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారం పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాంటి పోస్టుల మీద గనుక ఫిర్యాదులు అందితే.. ప్రైవసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి ఆ పోస్ట్‌ను తొలగిస్తుంది ట్విటర్ . అయితే.. ఇదివరకే ట్విటర్లో ఇలాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. చిరునామాలు, ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్స్, మెడికల్‌బిల్లులు, సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, జీపీఎస్ లొకేషన్, గుర్తింపు ఐడెంటిటీ కార్డులు, మెడికల్ రికార్డులు.. ఇలాంటి సమాచారం ట్విటర్లో షేర్ చేయడానికి వీల్లేదు. వీటికి తోడు ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం కూడా ఉల్లంఘనే అవుతుంది. ఇక కొత్త పాలసీ అప్డేట్ ప్రకారం.. పబ్లిక్ ఫిగర్స్, ప్రజా ప్రయోజనాల కోసం ఇతరులకు(నాన్ సెలబ్రిటీస్) సంబంధించి మీడియా షేర్ చేసే పోస్టులకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. కానీ, అవి అభ్యంతరకరంగా ఉండి.. ఫిర్యాదులు అందితే మాత్రం వాటిని కూడా ట్విటర్ పరిశీలించి మరీ తొలగిస్తుంది. చర్యల్లో భాగంగా వ్యవహారం తీవ్రతను బట్టి అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయడమో లేదంటే పర్మినెంట్‌గా సస్పెండ్ చేయడమో జరుగుతుందని ట్విటర్ తెలిపింది. అమెరికాలో పబ్లిక్ ప్లేసుల్లో ఫొటోలు తీసి.. ట్విటర్లో అనుమతులు లేకుండా పోస్ట్ చేయడంలాంటి వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. ఇక యూరోపియన్ చట్టాలు మాత్రం.. ఇలా ఫిర్యాదులు అందితే ఫొటోలు, వీడియోలను తొలగించేందుకు ఎప్పటి నుంచో అనుమతిస్తున్నాయి. అయితే యూజర్ల వ్యక్తిగత భద్రతను (Privacy) కాపాడేందుకు.. ఆయా దేశాల చట్టాలను అనుసరించి ఈ అప్డేట్ తీసుకొచ్చినట్లు ట్విటర్ ప్రకటించుకుంది. ట్విటర్లో ప్రైవసీ నిబంధనల అమలు అసలు ఉంటుందా? అనే అనుమానాలకు ట్విటర్ పైవిధంగా క్లారిటీ ఇచ్చింది. Beginning today, we will not allow the sharing of private media, such as images or videos of private individuals without their consent. Publishing people's private info is also prohibited under the policy, as is threatening or incentivizing others to do so.https://t.co/7EXvXdwegG — Twitter Safety (@TwitterSafety) November 30, 2021 -
అంతర్జాతీయ నిబంధనలను కొన్ని దేశాలే నిర్దేశించలేవు
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అగ్రరాజ్యం అమెరికాపై మరోసారి పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన అంతర్జాతీయ చట్టానికి ప్రపంచ దేశాలన్నీ ఎలాంటి మినహాయింపులు లేకుండా కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ నిబంధనలను ఏవో కొన్ని దేశాలు నిర్దేశించలేవని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అధికారాన్ని అందరూ ఆమోదించాలని, సమితి పట్ల నిబద్ధులై ఉండాలని హితవు పలికారు. చైనాను ఒక దేశంగా ఐక్యరాజ్యసమితి గుర్తించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రత్యేక సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. అంతర్జాతీయ నిబంధనలను ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు మాత్రమే కలిసికట్టుగా రూపొందిస్తాయని అన్నారు. ఇందులో మరో మాటకు తావు లేదని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు లేదా కొన్ని దేశాల కూటములు ఈ పని చేయలేవని పరోక్షంగా అమెరికాకు చురక అంటించారు. సమితిని గౌరవించాలని ప్రపంచ దేశాలకు జిన్‌పింగ్ సూచించారు. సమితిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు దూరంగా ఉండాలని అన్నారు. -
సెజ్‌ల నిబంధనల సరళతరంపై కసరత్తు
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) నిబంధనలు సరళతరం చేయడంపైనా, వీటి నుంచి యూనిట్లు వైదొలిగే ప్రక్రియను సులభతరం చేయడంపైనా కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ ఈ విషయాలు తెలిపారు. డిమాండ్ అంతగా లేని ప్రాంతాల్లోని ప్రస్తుత సెజ్‌ల గుర్తింపును పాక్షికంగా ఉపసంహరించి, ఆయా స్థలాలను పారిశ్రామిక.. ఇతరత్రా అవసరాలకు వినియోగించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు. సెజ్‌లకు పన్ను రాయితీల గడువు ముగిసిపోతున్నందున వీటిలో యూనిట్లను ఏర్పాటు చేయడానికి కొత్త వ్యాపారవేత్తలు పెద్ద స్థాయిలో ఆసక్తి చూపకపోవచ్చని గోయల్ తెలిపారు. ముంబైలోని శాంటాక్రూజ్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎగుమతిదారులతో భేటీ సందర్భంగా గోయల్ ఈ విషయాలు వివరించారు. 2020 మార్చి 31లోగా కార్యకలాపాలు ప్రారంభించిన కొత్త సెజ్ యూనిట్లకు మాత్రమే ఆదాయ పన్నుపరమైన ప్రయోజనాలు లభిస్తాయంటూ 2016–17 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం షరతు పెట్టింది. ఎగుమతి హబ్‌లుగా ఎదిగిన సెజ్‌లు.. ప్రత్యామ్నాయ పన్ను వడ్డన, రాయితీల ఉపసంహరణ గడువు విధింపు వంటి అంశాల కారణంగా క్రమంగా ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లాజిస్టిక్స్ సెంటర్ ప్రారంభం.. మరోవైపు, ముంబైలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను గోయల్ ప్రారంభించారు. అంతర్జాతీయంగా పోటీ, ఆర్థిక సంక్షోభపరమైన సవాళ్ల కారణంగా సరఫరా వ్యవస్థలను నిర్వహించడం మరింత సంక్లిష్టంగా మారిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అధునాతన పరిశోధనలు, లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపు తదితర అంశాల్లో పరిశ్రమకు కేంద్రం తగు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. -
కృష్ణపట్నం: ఆనందయ్య బృందం అత్యుత్సాహం
సాక్షి, నెల్లూరు: కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మందు పంపిణీ చేస్తూ ఆనందయ్య బృందం అత్యుత్యాహం ప్రదర్శించింది. కృష్ణపట్నంలో ఆనందయ్య బృందం ఆదివారం ప్రజలకు మందు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి మందు కోసం జనం భారీగా తరలివచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఆనందయ్య బృందం మందు పంపిణీ చేస్తుండడంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి మందు పంపిణీని నిలిపి వేయించారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పలు ప్రాంతాల ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి వస్తూనే ఉన్నారు. చదవండి: Covid-19: కరోనా మిగిల్చిన కన్నీటి కథలు -
ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం
సాక్షి, విజయవాడ: కోవిడ్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కర్ఫ్యూని పోలీసులు కట్టుదిట్టం చేశారు. 12 గంటల తర్వాత ఈ-పాస్ ఉన్న వారికే ఏపీలోకి అనుమతిస్తున్నారు. ఆసుపత్రుల్లో అధికారులు బెడ్ల శాతాన్ని పెంచుతున్నారు. అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో వాక్సినేషన్ ప్రక్రియలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. కేంద్రం నుంచి వాక్సిన్ వచ్చేలోపు ఉన్న సమయాన్ని సద్వినియోగించుకునే విధానాలను అమలు చేస్తోంది. వాక్సిన్ కేంద్రాల సంఖ్య పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రతీ సెంటర్ వద్ద రెండు వెయిటింగ్ హాల్స్, 45 ఏళ్ళు నిండిన వారికి ముందు సెకండ్ డోస్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వలంటీర్ల ద్వారా స్లిప్పుల పంపిణి చేస్తోంది. వాక్సిన్ కేంద్రం, రావలసిన తేదీ , సమయం వివరాలతో స్లిప్పుల పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలు అమలు చేసేలా ప్రత్యేక సిబ్బందిని నియమించింది. చదవండి: ప్రజలకు వాస్తవాలు వివరిద్దాం.. చంద్రబాబు కుట్ర బట్టబయలు -
బీమా ప్రకటనల నిబంధనల్లో మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: బీమా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కీలకమైన అడుగులు వేసింది. కొనుగోలుదారుల సహేతుకమైన అంచనాలకు మించి క్లెయిములు చేసే ప్రకటనలు జారీ చేయకూడదని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. అన్యాయమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలలో పాలసీని గుర్తించడంలో, నిబంధనలకు సరిపోని ప్రయోజనాలను వివరించడంలో విఫలమవుతాయని ఐఆర్డీఏఐ తెలిపింది. బీమా రంగంలో కొత్త ప్రకటనల నిబంధనలు తీసుకురావాలని ఐఆర్డీఏఐ తెలిపింది. ఈ మేరకు నవంబర్ 10 లోగా స్టేక్హోల్డర్లు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలను ఇవ్వాలని కోరింది. ప్రతిపాదిత నిబంధనల ముఖ్య ఉద్దేశం బీమా సంస్థలు, మధ్యవర్తులు ప్రకటనలు జారీ చేసేటప్పుడు న్యాయమైన, నిజాయితీ, పారదర్శక విధానాలను పాటించాలని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే పద్ధతులను నివారించడమేనని తెలిపింది. బీమా ప్రస్తుతం పనితీరుతో పాటు భవిష్యత్తు ప్రయోజనాలు, అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని లేని పక్షంలో ఇది కూడా తప్పుదోవ పట్టించే ప్రకటనలుగానే పరిగణించ బడతాయని తెలిపింది. ప్రస్తుతం బీమా ప్రకటనల నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉందని, గత రెండు దశాబ్ధాలుగా ప్రకటనల పరిణామ పోకడలు, మాధ్యమం, సాంకేతిక పరిణామాలు, అభివృద్ధి తదితరాలను సమీక్షించాలని తెలిపింది. అడ్వర్టయిజ్మెంట్ నిర్వచనం, తప్పుదోవ పట్టించే ప్రకటన అనే పదం పరిధిని విస్తరించడం, థర్డ్ పార్టీ బీమాదారులను కూడా బాధ్యులను చేయడం వంటివి ప్రస్తుతం నిబంధనల మార్పులలో కీలకమైనవని తెలిపింది. -
ఒక్కరికి ఓకే
సాక్షి,హైదరాబాద్: గుంపులుగా వస్తే నేరం.. పాటించాలి భౌతిక దూరం.. ఒక్కరికి ఓకే... లేదంటే చిక్కే... ఇవీ పోలీసుస్టేషన్లలో అమలు కానున్న కఠిన నిబంధనలు. మాస్కు లేకుండా వస్తే రిస్కే. ఫిర్యాదు నిమిత్తం వచ్చేవారిలో ఇకపై ఒక్కరినే ఠాణాలోకి అనుమతించనున్నారు. రాష్ట్రంలో రోజురోజులకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఎవరినీ వదలడంలేదు. ఇప్పటికే దాదాపు 300 సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అందుకే పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. ఇకపై స్టేషన్లోకి ఎవరైనా ఇష్టానుసారంగా వస్తే కేసులు పెట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. లాక్డౌన్ నిబంధనలు సడలించాక రాష్ట్రంలో నేరాలు, గొడవలు పెరిగాయి. దీంతో పోలీసుస్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక్కడికి వచ్చేవారిలో చాలామంది భౌతిక దూరం పాటించడం లేదు. కనీసం మాస్కు కూడా ధరించడం లేదు. వారిలో ఎవరైనా లక్షణాలు బయటికి కనిపించని కరోనా పేషెంట్ ఉంటే, వారి ద్వారా పోలీసులకు కూడా కోవిడ్ సోకే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ఎవరైనా ఠాణాలోకి ప్రవేశించే ముందు విధిగా మాస్కు ధరించాలని, లేకుంటే రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా పోలీసుస్టేషన్లోకి వస్తే విపత్తు నిర్వహణ చట్టం 51(బి) కింద కేసులు కూడా నమోదు చేస్తారు. ఫిర్యాదుదారులు ఠాణాలోకి ప్రవేశించేముందు చేతులను అక్కడే శానిటైజర్‌తో శుభ్రం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. -
కార్పొరేట్ దోపిడీ అంతింత కాదయా!
నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో ఒకటో తరగతి చదువుతున్న విద్యారి్థ దగ్గర పుస్తకాల పేరుతో యాజమాన్యం రూ.6,200 వసూలు చేసింది. ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో బుక్స్ వాడడం లేదు కదా అని ప్రశి్నస్తే ఆన్లైన్లో క్లాసులు వింటూ బుక్స్ ఉపయోగించాలని సమాధానమిచ్చారు. గత్యంతరం లేక తల్లిదండ్రులు డబ్బులు చెల్లించారు. మినీబైపాస్‌లో ఉన్న మరో కార్పొరేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి (ఒలంపియాడ్)కి ప్రమోషన్ పేరుతో రూ.5 వేలతో పాటు బుక్స్‌కు రూ.8,160 వసూలు చేశారు. అసలే కరోనా కష్టకాలంలో చేతిలో డబ్బులేకపోయినా అప్పు చేసి మరీ బుక్స్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందులో టెక్ట్స్‌బుక్స్ లేవు. కేవలం నోట్ బుక్స్ పేరుతో వేలకు వేలు గుంజుతున్నారు. టెక్ట్స్ బుక్స్‌కు అదనం. సాక్షి, నెల్లూరు: కరోనా విపత్తుతో ప్రజలు అల్లల్లాడుతుంటే మరో వైపు కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీలకు తెగబడుతున్నాయి. వీరి ఆగడాలకు కళ్లెం వేసేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతున్నా, జిల్లా విద్యాశాఖ అధికారుల అవినీతిని అడ్డం పెట్టుకుని కార్పొరేట్ విద్యా మాఫియా చెలరేగిపోతోంది. ►కరోనా కారణంగా తల్లిదండ్రులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి అరకొర వేతనాలతో బతుకు బండి లాగించడం కష్టంగా ఉన్న సమయంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ►నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణ పేరుతో గతం కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ►ఆయా పాఠశాలల్లో పనిచేసే ప్రైవేట్ ఉపాధ్యాయులతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా అడ్మిషన్లకు టార్గెట్లు విధించి విద్యార్థులను చేరి్పంచే పని చేయిస్తున్నారు. ►విద్యార్థులను చేర్చుకొనే సమయంలో టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్ అంటూ ఆకర్షణీౖయెన పేర్లు చూపి గతేడాది మాదిరిగానే అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. ►కొత్త, పాత విద్యార్థులు తమ విద్యాసంస్థల్లోనే నోట్ బుక్‌లు, యూనిఫాం, షూస్, ఇతర మెటీరియల్ కొనాలని వేలకు వేలు గుంజుతున్నారు. టెక్ట్స్ బుక్స్‌కు మాత్రం అదనం. అనుమతి లేకున్నా.. జిల్లాలో 1,065 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 385 ప్రాథమిక, 287 ప్రాథమికోన్నత, 385 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితో పాటు అనుమతి లేని మరో 500 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. విద్యా సంస్థలకు లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పదో తగరతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేశారు. ఈ తరుణంలో జిల్లాలోని పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల కోసం వేట మొదలు పెట్టారు. ►ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్‌్ట, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి ఆకర్షణీమైన పేర్లతో నిర్వహిస్తున్న అధిక విద్యాలయాల్లో పాఠశాల విద్యాశాఖ నిబంధనలు పాటించడం లేదు. ►కనీస వసతులు కూడా లేకుండా అపార్ట్మెంట్లలో పాఠశాలలు, కళాశాలల నిర్వహణ చేస్తున్నారు. అనుమతులు ఒక చోట ఉంటే.. మరో చోట విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ►గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ స్కూళ్ల మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోయింది. వీరు నిర్ణయించిందే స్కూల్ ఫీజు. నిబంధనలకు విరుద్ధంగా నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ విక్రయాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. నోట్ బుక్స్ వ్యాపారమే రూ.100 కోట్లు! జిల్లాలో విద్యా సంస్థలు విద్యార్థుల చేత ఏటా కొనిపించే నోట్ బుక్స్ వ్యాపారం రూ.150 కోట్ల పైమాటే. ఒలంపియాడ్ స్థాయి పాఠశాలల్లో 6,7 తరగతులకు రూ.8,160, 8 నుంచి 10వ తరగతులకు రూ.8,800 వంతున వసూలు చేస్తున్నారు. ►ఇక ఈ–టెక్నో, టెక్నో స్థాయి విద్యా సంస్థలు 6, 7 తరగతులకు రూ.6,200, 8 నుంచి 10వ తరగతులకు రూ.6,750 లెక్కన ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ►ఆయా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ప్రకారం వారి వద్ద వసూలు చేస్తున్న మొత్తాన్ని లెక్కిస్తే సుమారు రూ.100 కోట్ల పైమాటే ఉంటుంని అంచనా. యూనిఫాం, షూస్ వ్యాపారం డబుల్ ఆయా పాఠశాలల్లో చదివే పిల్లలు తమ యూనిఫాం మాత్రమే కొనాలని షరతులు పెడుతున్నాయి. ఇందు కోసం ఏటా ఒక్కొ విద్యారి్థకి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. ఫీజుల గుంజుడు జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అధికంగా ఫీజులను గుంజుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ తదితర ఆకర్షణీయ పేర్లతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ►కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఒలంపియాడ్ పేరుతో 6వ తరగతి చదివే విద్యారి్థకి రూ.80 వేలు వంతున వసూలు చేస్తున్నారు. ►ప్లేక్లాస్ చదివే విద్యార్థి నుంచి స్కూల్‌ను బట్టి రూ.20 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఫీజులు పిండుతున్నారు. ►ఆరో తరగతి విద్యార్థికి అయితే రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ►విద్యార్థి జాయిన్ చేసిన వారం రోజుల నుంచే అడ్మిషన్ నంబర్ కోసం 60 శాతం ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నారు. ►సామాన్యులు సకాలంలో ఫీజులు చెల్లించకపోతే వారిని నానా రకాలుగా మాటలతో ఇబ్బందులు పెడుతున్న ఘటనలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్ కోసం గత్యంతరం లేక కార్పొరేట్ మాఫియా ఒత్తిడితో అప్పులు తెచ్చి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. ఫీజులకు ప్రభుత్వం కళ్లెం వేస్తున్నా.. వివిధ రకాల పేర్లతో రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థల భరతం పట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ►వసతులు ఏర్పాటు చేయకుండా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విద్యాసంస్థలు నిర్వహిస్తూ ఆగడాలకు పాల్పడుతున్న యాజమాన్యాలకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ►కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో వసతులు, వనరుల సమగ్ర సమాచారాన్ని ఫొటోలతో అన్లైన్లో అప్లోడ్ చేయాలని ఏపీ పాఠశాలల ఫీజు రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ ఆదేశించింది. ►అయితే తమ బండారాలు బయట పడతాయన్న సాకుతో కార్పొరేట్ మాఫియా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తోంది. ►ప్రభుత్వం కార్పొరేట్‌పై చర్యలు తీసుకుంటుంటే జిల్లా విద్యాశాఖ అ«ధికారులు మాత్రం ఆ సెక్టార్‌కు దాసోహమై తనిఖీలు చేయడం మానేశారు. దీంతో ఆ విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం తమ తీరును మార్చుకోకుండా యథావిధిగా దోపిడీ చేస్తున్నారు. అమలు కానీ నిబంధనలు పదో తరగతి లోపు విద్యార్థుల నుంచి ఏటా రూ.15 వేల వరకు ఫీజులు వసూలు చేసేందుకు అవకాశం ఉంది. పలు పాఠశాలల్లో రూ.80 వేలు కూడా వసూలు చేస్తున్నారు ►జీఓ నంబర్ 1 1984 ప్రకారం విద్యార్థులకు వసతులు క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి ►జీఓ నంబర్ 88/2008 ప్రకారం 200 మంది విద్యార్థులు ఉంటే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాల నుంచి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. ►2009 విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి. పుస్తకాలు అమ్మితే చర్యలు నెల్లూరు (టౌన్): కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని డీఈఓ జనార్దనాచార్యులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొంత మంది అమ్ముతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకు వచ్చారని చెప్పారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వులను ఏ పాఠశాల యాజమాన్యమైన ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అవసరానికి తగ్గట్టు సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉత్తమ వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. గురువారం హాకా భవన్లో వ్యవసాయ విధానంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో చర్చించిన.. తీసుకున్న నిర్ణయాలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఓ ప్రకటన విడు దల చేశారు. సమావేశంలో ప్రజల ఆహార అవసరాలు, ఉత్పత్తులు, ప్రాసెసింగ్, విత్తన పంపిణీ, ఎరువులు, మద్దతు ధర, కొనుగోళ్ల అంశాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు తగినట్లు పంటల సాగును ప్రోత్సహించాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని అన్నారు. ఆ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారన్నారు. ఈ సమావేశంలో ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్‌పై ఉత్తమ విధానం రూపొందించేలా సూచనలు వచ్చాయన్నారు. ఉల్లి విషయంలో రైతులకు మద్దతు ధర ఇచ్చి ప్రోత్సహిస్తే ప్రస్తుత పరిస్థితి రాదన్నది మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల ఆలోచనగా ఉందన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్‌కు నివేదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉల్లి విత్తనాలను రైతులకు సబ్సిడీపై ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. కాగా, 10 రోజుల తర్వాత తదుపరి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. -
ఆ బ్యాంకుపై ఆంక్షలు : కస్టమర్లకు షాక్
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) టాప్ కార్పొరేషన్ బ్యాంకుపై ఆంక్షలు విధించింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్(పీఎంసీ) పై ఆరు నెలల పాటు ఆంక్షలు విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949, సెక్షన్ 35 ఎ కింద ఈ చర్య తీసుకున్నట్టు ఆర్బీఐ మంగళవారం జారీ చేసిన ఒక నోటీసులో పేర్కొంది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం డిపాజిటర్లు, ఖాతాదారులు వెయ్యి రూపాయలుమాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉందని బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాల్ వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా వేలాది మంది బ్యాంకు ఖాతాదారులు ఇబ్బందుల్లో పడ్డారు. ప్రధానంగా ముంబై బ్రాంచ్ వద్ద కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఒకవైపు రానున్నపండుగ సీజన్.. మరోవైపు వెయ్యి రూపాయలకు మించి నగదు ఉపసహంరణ కూడదనే నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాన్య జనులపై తీరని భారమని పేర్కొన్నారు. తాను 3లక్షల ఆర్డీ డిపాజిట్ చేశానని, ఇపుడు వెయ్యి రూపాయలకు మించి డ్రా చేయకూడదంటే.. తన కుమార్తె ఫీజు ఎలా కట్టాలని ఒక ఖాతాదారుడు వాపోయాడు. ఆర్బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పొదుపు బ్యాంకు ఖాతా లేదా కరెంట్ అకౌంట్ లేదా మరేదైనా పీఎంసీ ఖాతాదారుడు తన మొత్తం బ్యాలెన్స్‌లో వెయ్యి రూపాయలు మించి విత్ డ్రా చేసుకునే అవకాశం. అలాగే బ్యాంకు ఎలాంటి రుణాలను మంజూరు చేయలేదు. దీంతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేసే అవకాశం కూడా లేదు. మరోవైపు ఈ వ్యవహారంపై బ్యాంకు స్పందించింది. గడుపులోపే పరిస్థితిని చక్కదిద్దుతామని పీఎంసీ బ్యాంకు ఎండీ జాయ్ థామస్ వినియోగదారులకు రాసిన ఒక లేఖలో వివరణ ఇచ్చారు. ఇది డిపాజిటర్లకు, కస్టమర్లందరికీ కష్టమైన సమయం అంటూ క్షమాపణలు చెప్పారు. దయచేసి తమతో సహకరించమని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ఈ పరిస్థితిని అధిగమించి బలంగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు. కాగా 1984లో ముంబైలో ప్రారంభమైన ఈ బ్యాంకు పలు రాష్ట్రాల్లో, 137 బ్రాంచ్‌లతో తన సేవలను అందిస్తోంది. కోపరేటివ్ బ్యాంకుల్లో టాప్ 10లో చోటు సంపాదిస్తున్న పీఎంసీ మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి), మధ్యప్రదేశ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
తాగి నడిపితే..ఇకపై రూ.10 వేలు ఫైన్!
సాక్షి, న్యూఢిల్లీ : వాహనదారులు ఇక మీదట జాగ్రత్తగా నిబంధనలను పాటించాల్సిందే. లేదంటే జరిమానాల మోత మోగనుంది ఈ మేరకు మోటారు వాహనాల (సవరణ) బిల్లులో ప్రతిపాదిత మార్పులను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, రహదారి భద్రత, నిబంధనల ఉల్లంఘనపై జరిమానాతో పాటు అవినీతిని అరికట్టడం లాంటి అంశాలను ప్రధానంగా ఈ బిల్లు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిపాదిత సవరణ ప్రకారం మద్యం తాగి వాహనం నడిపితే జరిమానాను ఐదు రెట్లు పెంచనుంది. అలాగే ప్రమాదకరమైన రేసింగ్‌లు, అతివేగంగా నడిపితే జరిమానాను ఏకంగా పది రెట్లు పెంచేందుకు ప్రతిపాదించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో సవరణ బిల్లును రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనుంది తాజా నిబంధనల ప్రకారం జరిమానా తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపితే రూ. 5వేలుగా ఉండనుంది. రోడ్డు ప్రమాద మృతులకు రూ. పది లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలు పరిహారం మరో ముఖ్యమైన నిబంధన. ప్రైవేటు రవాణా సంస్థలు లైసెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని ఈ సవరణ ప్రతిపాదించింది. ఓవర్ లోడింగ్ వాహనాలు రూ. 20 వేల పెనాల్టీ కట్టేలా బిల్లులో నిబంధనల్ని చేర్చారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరిమానా విధించేలా బిల్లును రూపొందించారు. అంతేకాదు రహదారి ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారికి, లేదా సమాచారం అందించిన వ్యక్తులు వేధింపులకు గురికాకుండా ఉండేలా ప్రతిపాదిత సవరణ చేసింది. అలాగే థర్డ్‌పార్టీ బీమాను గరిష్టంగా రూ.10 లక్షలు పరిమితం చేయాలనేది మరో ప్రతిపాదన. కొత్త వాహనాల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ , వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ తప్పనిసరి అని తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ విషయంలో కూడా మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం 50 సంవత్సరాల వయస్సున్న ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ 20 వరకు సంవత్సరాలు చెల్లుతుంది. అయితే దీంట్లో వివిధ కేటగిరీలను చేర్చాలని భావిస్తోంది. ఉదాహరణకు, లైసెన్స్ హోల్డర్ వయస్సు 30-50 సంవత్సరాల మధ్య ఉంటే 10 సంవత్సరాల వరకు మాత్రమే( ప్రస్తుతం 20 ఏళ్ళతో పోలిస్తే) చెల్లుతుంది. కాగా ఈ సవరణలకు సంబంధించిన ఈ బిల్లుకు లోక్‌సభలో 2017 లో ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభ మద్దతు పొందడంలో విఫలమైంది. ఈ ప్రతిపాదనలతో కూడిన బిల్లు చట్టం రూపం దాల్చాలంటే ఉభయ సభల అనుమతి పొందాల్సి ఉంటుంది. -
సమర్థత ఉంటేనే స్వీయ వాదనలు
సాక్షి, హైదరాబాద్ : ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సహా వివిధ కేసుల్లో కనీస న్యాయ పరిజ్ఞానం లేకుండానే ‘పార్టీ ఇన్ పర్సన్’ల పేరిట స్వీయ వాదనలకు దిగుతున్న కక్షిదారుల కట్టడికి హైకోర్టు కొత్త నిబంధనలు విధించింది. సొంతంగా వాదనలు వినిపించుకునే సామర్థ్యం ఉందని నిరూపించుకున్న వ్యక్తులనే ఇకపై ‘పార్టీ ఇన్ పర్సన్’లుగా అనుమతిం చాలని నిర్ణయించింది. అలాగే ‘పార్టీ ఇన్ పర్సన్’లు కోర్టులో ఇష్టారీతిన మాట్లాడేందుకు, ఆరోపణలు చేసేందుకు వీల్లేకుండా కఠిన నిబంధనలు రూపొందించింది. కోర్టులో గౌరవ, మర్యాదలతో నడుచుకుంటానని స్వీయ వాదనలు వినిపించాలనుకునే వ్యక్తుల నుంచి హామీ తీసుకోనుంది. ఒకవేళ వారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవడంతోపాటు నిర్దిష్ట కాలంపాటు ‘పార్టీ ఇన్ పర్సన్’లుగా హాజరు కాకుండా నిషేధం విధించనుంది. ఈ మేరకు అప్పిలేట్ సైడ్ నిబంధనలకు సవరణలు చేసిన హైకోర్టు... అందులో కొత్తగా చాప్టర్ 3ఏను చేర్చింది. ఈ నిబంధనలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇటీవల గెజిట్‌లో ప్రచురించాయి. కఠిన నిబంధనలు ఎందుకంటే... గత కొన్నేళ్లుగా హైకోర్టులో ‘పార్టీ ఇన్ పర్సన్’లు దాఖలు చేస్తున్న కేసులు పెరుగుతున్నాయి. స్వీయ వాదనలు వినిపించే వ్యక్తికి ఇప్పటివరకు ఎటువంటి అర్హతలు నిర్దేశించకపోవడంతో నామమాత్రంగా చదువుకున్న వ్యక్తి సైతం హైకోర్టులో కేసు దాఖలు చేసి (చట్ట నిబంధనలు తెలిసిన వ్యక్తుల సాయంతో) వాదనలు వినిపించే వీలు కలుగుతోంది. దీంతో కనీస న్యాయ పరిజ్ఞానం లేకుండా పత్రికల్లోని కథనాలను ఆధారంగా చేసుకుంటూ పిటిషన్లు వేస్తూ కొందరు సొంతంగా వాదనలు వినిపిస్తున్నారు. అయితే విచారణ సమయంలో న్యాయమూర్తులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతుండటం, న్యాయపరంగా కాకుండా మానవతా దృక్పథంతో ఆదేశాలు జారీ చేయాలని కోరడం పరిపాటిగా మారింది. దీంతో న్యాయమూర్తులే చట్ట నిబంధనల గురించి వారికి ఎదురు వివరించాల్సి వస్తోంది. మరికొందరు ఏకంగా న్యాయమూర్తులతో వాదనలకు దిగడంతోపాటు భావోద్వేగాలను ప్రదర్శిస్తూ సానుభూతి ఆధారంగా కోర్టు నుంచి ఆదేశాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ న్యాయమూర్తులతో వితండ వాదం చేస్తున్న పరిస్థితులూ ఎదురవుతున్నాయి. దీంతో కోర్టు సమయంతా ఇలాంటి పంచాయితీలకే సరిపోతోందని భావించిన హైకోర్టు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ‘పార్టీ ఇన్ పర్సన్’లపై పలు నిబంధనలు రూపొందించింది. కొత్త నిబంధనలు ఇవే... – ‘పార్టీ ఇన్ పర్సన్’లుగా వాదించాలనుకునే వ్యక్తి ముందు అందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. అందులో తాను న్యాయవాదిని నియమించుకోకుండా స్వయంగా వాదనలు వినిపించుకోవాలని భావిస్తున్నానో కారణాలను వివరించాలి. – ఆ దరఖాస్తును రాష్ట్ర జుడీషియల్ సర్వీసుల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులతో కూడిన కమిటీ పరిశీలిస్తుంది. వారిని డెప్యుటేషన్‌పై ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేస్తారు. – దరఖాస్తుదారుడు దాఖలు చేయలనుకుంటున్న కేసుకు సంబంధించిన పత్రాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదోనని ద్విసభ్య కమిటీ పరిశీలిస్తుంది. – కేసులో కోర్టుకు సహాయ సహకారాలు అందించే సమర్థత ఆ వ్యక్తికి ఉందో లేదోననే విషయాన్ని కమిటీ తేల్చి అభిప్రాయాన్ని ఆఫీస్ రిపోర్ట్ రూపంలో కోర్టుకు తెలియచేస్తుంది. – స్వీయ వాదనలకు ఆ వ్యక్తి సమర్థుడని కమిటీ తేలిస్తే అప్పుడు వాదనల సమయంలో ఎటువంటి అభ్యంతరకర, అసభ్య పదజాలాన్ని ఉపయోగించబోనని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. – ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైతే ఆ వ్యక్తిపై కోర్టు ధిక్కారం కింద చర్యలు, జరిమానా కూడా విధిస్తారు. నిర్ధిష్ట కాలంపాటు ఆ వ్యక్తి ‘పార్టీ ఇన్ పర్సన్’గా హాజరు కాకుండా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తుంది. – ఈ నిబంధనలు తాత్కాలిక బెయిల్, పెరోల్, హెబియస్ కార్పస్ వంటి కేసులకు వర్తించవు. పైన పేర్కొన్న నిబంధనలతో సంబంధం లేకుండా తమ ముందున్న కేసుల్లోని కక్షిదారుడిని ‘పార్టీ ఇన్ పర్సన్’గా అనుమతించే విచక్షణాధికారం సంబంధిత కోర్టుకు ఉంటుంది. పార్టీ ఇన్ పర్సన్ అంటే... న్యాయవాదితో సంబంధం లేకుండా తానే కేసు దాఖలు చేసి కేసును సొంతంగా వాదించుకునే వ్యక్తిని న్యాయ పరిభాషలో పార్టీ ఇన్ పర్సన్ అంటారు. సాధారణంగా న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని వ్యక్తి, న్యాయవాదికన్నా కేసును తానే సమర్థంగా వాదించుకోగలనన్న నమ్మకంగల వ్యక్తి ‘పార్టీ ఇన్ పర్సన్’రూపంలో కోర్టు ముందు హాజరవుతారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ఎక్కువగా ‘పార్టీ ఇన్ పర్సన్’లు వాదనలు వినిపిస్తుంటారు. న్యాయవాదులు సైతం తామే పిటిషనర్లుగా ఉంటూ కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో వాదిస్తుంటారు. -
జియో సమ్మర్ స్ట్రోక్: ట్రాయ్ వివరణ
న్యూఢిల్లీ: జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ నిలుపుదలపై టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ వివరణ ఇచ్చింది. జియో తాజా ఆఫర్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ట్రాయ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ శుక్రవారం వివరించారు. అందుకే ఈ ఆఫర్ నిలిపివేయాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. పరిశీలన అనంతరం జియో ఆఫర్ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా లేదని గుర్తించామని పీటీఐకి చెప్పారు. రిలయన్స్ జియో ఖాతాదారులకు రూ.303 రీచార్జ్‌పై అపరిమిత డేటా వినియోగంతోపాటు ఉచిత ఆఫర్లను అందించిన మూడు నెలల కాంప్లిమెంటరీ ఆఫర్‌ను ఉపసంహరించుకోవాలని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోను ట్రాయ్ గురువారం ఆదేశించింది. దీనిపై స్పందించిన జియో ట్రాయ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెప్పింది. తమ ఆఫర్ నిబంధనలను లోబడే ఉందని పేర్కొంది. కాగా అయితే ప్రధాన టలికం కంపెనీలు జియో ఆఫర్లను తీవ్రంగా తప్పుబడుతున్నప్పటికీ ఇప్పటివరకూ సమర్ధిస్తూ వచ్చిన ట్రాయ్ అనూహ్యంగా సమ్మర్ సర్ ప్రైజ్‌ను నిలిపివేయాలని ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. ప్రైమ్ మెంబర్షిప్ పథకం రిజిస్ట్రేషన్‌ను గడువును ఏప్రిల్ 15వరకు పొడిగించడంతో పాటు రూ.303 రీచార్జి సేవలను మూడు నెలలపాటు ఉచితంగా అందిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అక్రమ ఇటుక బట్టీలు
► నిబంధనలు బేఖాతరు ► ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న వ్యాపారులు ► పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్ టౌన్ : ఆదిలాబాద్ నియోజక వర్గంలో ఇటుక బట్టీలు ఇష్టారీతిగా వెలుస్తున్నాయి. ఇటుకలకు పెరుగుతున్న డిమాండ్‌తో ఆయా మండలాల్లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా బట్టీలు వెలుస్తున్నాయి. ప్రజలు నివసించే ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇటుకలను తయారు చేయాలని నిబంధనలు ఉన్నా వాటిని వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు. నివాస ప్రాంతాలకు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో 1/ 70 చట్టం ప్రకారం తవ్వడానికి వీలు లేనప్పటికీ అవేం పట్టకుండా గ్రామాల్లో లక్షల వ్యాపారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఇటుకల తయారీ చేయడంతో వాతావరణం కాలుష్యమవుతుంది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రూ. లక్షల్లో గండి.. ఆదిలాబాద్ రూరల్, మావల మండలంలోని బట్టీసావర్గాం, బంగారుగూడ, మావల, అంకోలి, తంతోలి, చించూగాట్, యాపల్‌గూడ, జైనథ్ మండలంలోని పెన్ గంగా సమీపంలోని డోలార వద్ద ఇటుకల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటుకల విక్రయాలతో ప్రధానంగా వాణిజ్య పన్నుల శాఖ ఎక్కువగా ఆదాయం కోల్పోతుంది. సంవత్సరానికి రూ. లక్షల్లో నష్టపోవాల్సివస్తోంది. ఒక్కో ఇటుకకు రూ. 3 చొప్పన వ్యాపారులు వసూలు చేస్తున్నా చాలామంది వ్యాపారులు ప్రభుత్వానికి నయాపైసా కూడా చెల్లించడం లేదు. వ్యాపారులు 5 శాతం వ్యాట్ చెల్లించడం గాని, అనుమతులు పొందడం లాంటివి చేయడంలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడుతోంది. ఇటుకల తయారీకి మట్టి అవసరం. చేన్లో, గుట్టల్లో, అటవీ ప్రాంతంలోని మట్టిని తవ్వి ఇటుకలు తయారు చేస్తున్నారు. మట్టిని తవ్వాలంటే భూగర్భ శాఖ, గ్రామపంచాయతీ అనుమతి కూడా ఉండాలి. ఆదిలాబాద్ రూరల్, మావల మండలాల్లో కుప్పలు తెప్పలుగా ఇటుక బట్టీలు వెలసినా ఏ ఒక్కదానికి అనుమతులు లేదని తెలుస్తోంది. ఇటుకలు విక్రయించాక అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విలువ అధారిత పన్ను (వ్యాట్) వీటికి ఐదుశాతం ఉంది. ఈ విక్రయాలకు పన్ను చెల్లించాల్సి ఉన్నా అది కూడా అమలు కావడం లేదు. పట్టించుకోని అధికారులు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అనుమతి లేని ఇటుక బట్టీలు వెలుస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మట్టికోసం గుట్టలను తవ్వుతున్నా అటవీశాఖ అధికారుల్లో చలనం కన్పించడం లేదు. రోజురోజుకు ఈ వ్యాపారం ఊపందుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులుస్పందించి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి్సన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. బట్టీల్లో మగ్గుతున్న బాల్యం 6–14 సంవత్సరాల లోపు పిల్లలంతా విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లోనే ఉండాలి. కానీ ఇటుకలు తయారు చేసే కార్మికుల పిల్లల బాల్యం బట్టీల్లోనే మగ్గుతోంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా మట్టి పనిలోనే నిమగ్నమవుతున్నారు. విద్యాశాఖ, కార్మిక శాఖ అధికారుల పట్టింపు లేనితనంతో వారి బాల్యం బుగ్గిపాలవుతోంది. ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయ పాఠశాలలు లేక పోవడంతో చదువుకు దూరమవుతున్నారు. చర్యలు తీసుకుంటాం ఇటుక వ్యాపారం కొనసాగించాలంటే గ్రామపంచాయతీతో పాటు మైనింగ్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణ కొనసాగిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా ఇటుక వ్యాపారం సాగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారి వివరాలు సేకరించాం. నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. – శ్రీదేవి, ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ -
టీఎస్పీఎస్సీ నిబంధనలతో నష్టం: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిరుద్యోగులకు నష్టం కలిగించే నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం కోరింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ విధించిన నిబంధనల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఇంగ్లిష్ మీడియంలోనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామనే నిబంధనలు హేతుబద్ధంగా లేవని ఆ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య తెలిపారు. వీటి వల్ల గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు నష్టం జరుగుతుందన్నారు. -
‘కాసు’పత్రులకు చెక్!
- కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్డగోలు వసూళ్లకు కళ్లెం - కేంద్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టుకు అనుగుణంగా - రాష్ట్రంలో చట్టం తేనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకు వసూలు చేస్తున్న భారీ ఫీజులను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు చట్టం తేవాలని యోచిస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్) చట్టం– 2010 ఉంది. దాన్ని రాష్ట్రానికి వర్తింపచేస్తూ మరో చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర చట్టాన్ని తెలంగాణకు వర్తింపజేసేలా ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ఆమోదించాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర చట్టాన్ని రాష్ట్రానికి వర్తింపచేస్తూ కొన్ని మార్పులు చేర్పులతో మరో చట్టం తీసుకొస్తే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగంలో కీలకమైన మార్పులు వస్తాయని అంటున్నారు. రోగులకు నిర్దిష్ట ప్రమాణాల మేరకు వైద్యం, వసతులు, సేవలు అందించాలన్నదే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ప్రమాణాలకు పెద్దపీట: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజుల వసూలుకు ఇప్పటిదాకా ఒక కొలమానం అంటూ లేదు. ఒకే చికిత్సకు ఒక్కో ఆస్పత్రి ఒక్కోరకంగా రోగుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. వాటిపై ఎలాంటి నియంత్రణా లేదు. దీంతో రోగులు గత్యంతరం లేక తమ ఆస్తులను ప్రైవే టు ఆస్పత్రులకు ధారపోస్తున్నారు. అంతేకాదు.. అవ సరమున్నా లేకున్నా వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయ డం పరిపాటిగా మారింది. ఎందుకు శస్త్రచికిత్స చేస్తు న్నారో కూడా అంతుపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక క్లినిక్‌లైతే ఇరుకు సందుల్లో ఎలాంటి ప్రమాణాలు లేకుండానే నడిపించేస్తున్నారు. మరోవైపు డయాగ్నస్టిక్ సెంటర్లు గల్లీకొకటి పుట్టుకొస్తున్నాయి. వీటిల్లోని దాదాపు సగానికిపైగా కేంద్రాల్లో ప్రమాణాలు పూజ్యం. ఇలా ప్రతీ అంశానికి సంబంధించి మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఇప్పటివరకు దేశంలో నాలుగు రాష్ట్రా లు కేంద్ర చట్టాన్ని వర్తింపజేసుకొని కొత్త చట్టాన్ని తీసు కొచ్చాయి. ప్రతీ ప్రధానమైన శస్త్ర చికిత్సలకు కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని ఇక రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా కొనసాగిస్తారు. కొత్త ముసాయిదా బిల్లులో ముఖ్యమైన అంశాలివీ.. కొత్త చట్టం రూపొందించాక రాష్ట్రస్థాయిలో ఒక కౌన్సిల్ నియమిస్తారు. దానిద్వారా మొత్తం చికిత్సలను ఆన్లైన్ చేస్తారు. ∙కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీ హెచ్ఎస్), ఆరోగ్యశ్రీలో మాదిరిగా ఏకీకృత ఫీజులను నిర్ధారిస్తారు. ∙క్లినిక్‌లు, ఆçస్పత్రులు, నర్సింగ్‌హోంలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఏవైనా ఈ కౌన్సిల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నిర్ణీత ప్రమాణాల ప్రకారం ఉన్న వాటికే అనుమతి ఇస్తారు. ∙ప్రతీ ఆçస్పత్రిపై 15 రోజులకోసారి సమీక్ష జరుగుతుంది. ఒక చికిత్స అనవసరంగా చేస్తే తగు చర్య తీసుకునే అధికారం రాష్ట్రస్థాయిలో ఏర్పాటయ్యే కౌన్సిల్‌కు ఉంటుంది. ∙చిన్న చిన్న గల్లీల్లో ఎలాంటి కనీస వసతులు లేకుండా క్లినిక్‌ల ఏర్పాటుకు అనుమతించరు. ∙ప్రస్తుతం సీజీహెచ్, ఆరోగ్యశ్రీ ధరల కంటే రెండింతలకు మించి కార్పొరేట్ ఆస్పత్రులు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొత్త చట్టంతో ఇలాంటి పరిస్థితికి చెక్ పడుతుంది. ∙ప్రతీ రోగి వివరాలను.. అతనికి అందిన శస్త్రచికిత్స వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో పొందుపరచాలి. -
పెట్రోలు బంకుల్లో భధ్రత కరువు
నిబంధనలు పాటించని యజమానులు అందుబాటులో లేని ఎయిర్ ఫిల్లింగ్ యంత్రాలు వాహనదారులకు అసౌకర్యం పట్టించుకోని అధికారులు మెదక్:పెట్రోల్ బంకుల యజమానులు నిబంధనలు పాటించడం లేదు. ఈ బంకులను అడ్డగోలుగా నడుపుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. భద్రత చర్యలూ పాటించడం లేదు.మెదక్ పట్టణంతోపాటు మండల పరిధిలో మొత్తం 10 వరకు ఉంటాయి. అనేక బంకుల్లో పైన కప్పు ఉండదు. దీంతో వర్షం వచ్చిన, ఎండకొట్టినా సిబ్బందితోపాటు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల టైర్లలో గాలి నింపుకోవడానికి కొన్ని బంకుల్లో ఎయిర్ ఫిల్లింగ్ మెషిన్లు లేకపోవడంతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. బంకుల యజమానులు నిబంధనలు పాటించకపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పలు చోట్ల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయడం లేదని వారంటున్నారు. ఇప్పటికైనా స్పందించి బంకుల్లో సౌకర్యాలు కల్పించేలా చూడాలని వారు కోరుతున్నారు. -
విమాన టికెట్ రద్దుపై భారీ రుసుములకు చెక్
ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు న్యూఢిల్లీ: విమాన ప్రయాణ టికెట్ల రద్దుపై అనవసర చార్జీల భారం తొలగిపోనుంది. ఈ మేరకు సవరించిన నిబంధనలు ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం ఇక్కడ తెలిపారు. టికెట్ రద్దు చేసుకుంటే విధించే చార్జీలు.... కనీస టికెట్ చార్జీ, ఇంధన సర్‌చార్జీని మించకూడదని, అన్ని రకాలు లెవీలు, పన్నులను తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశాలు కూడా జారీ చేసింది. వాటి ప్రకారం... టికెట్‌ను రద్దు చేసుకుంటే ఎంత మొత్తం వెనక్కి వస్తుందో ఎయిర్‌లైన్ సంస్థలు బుకింగ్ సమయంలోనే స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన విధానం, నిబంధనల వివరాలను తమ వెబ్సైట్లలోనూ ప్రదర్శించాలి. ఇటీవలి కాలంలో టికెట్ల రద్దుపై చార్జీలను ఎయిర్‌లైన్ సంస్థలు ఇష్టారీతిగా పెంచడంతో తాజా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. టికెట్ రద్దు చేసుకుంటే టికెట్ ధర, ఇంధన సర్‌చార్జీ పోను... విమానాశ్రయ అభివృద్ధి రుసుం (ఏడీఎఫ్), ప్రయాణికుల సేవా రుసుములను (పీఎస్ఎఫ్) ఎయిర్‌లైన్ సంస్థలు వెనక్కిచ్చేయాల్సి ఉంటుంది. టికెట్‌ను రద్దు చేసుకుంటే ఆ చార్జీలను ఎయిర్‌లైన్ సంస్థ ప్రయాణికుల ప్రమేయం లేకుండా తన ఖాతాలోనే ఉంచేసుకోరాదు. ప్రయాణికుడి ఇష్టం మేరకే ఇది జరగాలి. అలాగే, టికెట్‌పై పేరులో తప్పు దొర్లితే సరి చేసేందుకు చార్జీ వసూలు చేయరాదు. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్ బుక్ చేసుకుని... రద్దు చేసుకుంటే ఆ చార్జీలు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఎయిర్‌లైన్ సంస్థపైనే ఉంటుంది. రద్దు రుసుముల చెల్లింపు ప్రక్రియ 30 పని దినాల్లో పూర్తి కావాలి. -
అక్కడ నివాసం ఉంటేనే స్థానికత
- ఎమ్మార్వో సర్టిఫికెట్ ఇస్తారు - సీఎస్‌కు చేరిన ఫైలు - నేడో రేపో మార్గదర్శకాలు హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్లి అక్కడ నివాసం ఉంటేనే స్థానికత కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) మార్గదర్శకాలను రూపొందించింది. మార్గదర్శకాలతో కూడిన ఫైలు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్‌కు చేరింది. స్థానికతకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి. రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి అంటే 2014 సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి 2017 సంవత్సరం జూన్ 2వ తేదీలోగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివెళ్లే వారికి స్థానికత కల్పించేందుకు ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, అలాగే ఉద్యోగాలకు స్థానికత వర్తించనుంది. 2017 జూన్ 2వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నవారు స్థానిక సరిఫికెట్ కోసం ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మార్వో ఆ దరఖాస్తు ఆధారంగా పరిశీలన చేసి అక్కడే నివాసం ఉంటే స్థానికత సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. స్థానికత సర్టిఫికెట్ వ్యక్తి ఆధారంగా జారీ చేయనున్నారు. ఉద్యోగులకే కాకుండా అక్కడికి తరలివెళ్లే ఎవరికైనా స్థానికత కల్పించనున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు వెళితే అతనికి స్థానికత కల్పిస్తారు. ఆ ఉద్యోగి పిల్లలు హైదరాబాద్‌లోనే ఉంటే వారు హైదరాబాద్‌లోనే స్థానికులుగా కొనసాగుతారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో జూన్ 2, 2017లోగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కడకు తరలివెళ్లినా స్థానికత వర్తిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా మాత్రమే మార్గదర్శకాలను రూపొందించారు. -
11న ప్రభుత్వ రంగ బ్యాంకు ఆఫీసర్ల సమ్మె!
హైదరాబాద్, బిజినె?స బ్యూరో: సంస్కరణల పేరుతో ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, దీన్ని అడ్డుకోవడానికి ఒకరోజు సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా డిసెంబర్ 11న పీ?సయూ బ్యాంకుల ఆఫీసర్లు ఒకరోజు దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్లు ఆలఖ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషనఖ(ఏఐబీవోసీ)ప్రకటించింది. పి.జే నాయక్ కమిటీ సిఫార్సులు గ్రామీణ బ్యాంకింగ్ రంగాన్ని దెబ్బతీసేటట్లు ఉన్నాయని, జ్ఞాన సంగం, ఇంద్రధనస్సు పేరుతో పీ?సయూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను విక్రయించడానికి ప్రయత్నిస్తోందని ఏఐబీవోసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ బ్యాంకుల నుంచి భారీగా డివిడెండ్లను అందుకుంటున్న కేంద్రం మూలధనం సమకూర్చడానికి మాత్రం ముందుకు రావడం లేదని ?సబీఐ ఆఫీసర్స్ అసోసియేషనఖ హైదరాబాద్ సర్కిలఖ కార్యదర్శి జి.సుబ్రమణ్యం అన్నారు. ఇప్చడు ఐడీబీఐ బ్యాంకులో మెజార్టీ ప్రభుత్వ వాటాను విక్రయించడాన్ని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది విజయవంతమైతే మిగిలిన బ్యాంకుల్లోనూ అమలు చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది ఆఫీసర్లు ఒక రోజు సమ్మెకు పిలుపు నిచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సమ్మెను ఆపడానికి కేంద్ర కార్మిక శాఖ రంగంలోకి దిగింది. మంగళవారం ఇండియనఖ బ్యాంక్ అసోసియేషనఖ, ఏఐబీవోసీతో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం విఫలమైతే 11వ తేదీ సమ్మె యథాతథంగా కొన సాగుతుందని సుబ్రమణ్యం తెలిపారు. -
ఆశల ఊసుల్లోనే క్రమబద్ధీకరణ
⇒ జూన్‌లో ఇస్తామన్న ఉత్తర్వులకు ఇంకా దిక్కులేదు ⇒ స్క్రీనింగ్ పరీక్షకు నోటిఫికేషన్ ఎప్పుడు..? ⇒స్థానికులు, స్థానికేతరులతోనే కొత్త పీటముడి ⇒ ఆర్థిక భారం పడుతుందని దాటవేస్తున్న సర్కారు ⇒ 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఇంకా మోక్షం సిద్ధించలేదు. తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జూన్‌లోనే ఉత్తర్వులు ఇచ్చి... జూలై నుంచి క్రమబద్ధీకరించే కార్యక్రమం చేపడతామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అవతరణ దిన వేడుకల్లో ప్రకటించారు. ఈ సంవత్సరంలోనే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజులు దాటినా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడ లేదు. జూన్‌లో జరిగిన రాష్ర్ట మంత్రివర్గ సమావేశంలోనూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చ జరిగింది. స్థానికులైన కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, తెలంగాణ స్థానికేతరులను గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సర్కారు ఊసెత్తకపోవటంతో 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే విషయంలోనే ప్రభుత్వం తమ విధానాన్ని వెల్లడించలేదు. ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు పాటించిన నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులనూ విభజించే వీలుంది. కానీ.. అందుకు సంబంధించిన మార్గదర్శకాల షెడ్యూలును ముందుగా విడుదల చేయాలి. ఆ దిశగా సర్కారు కసరత్తు చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది. స్థానికేతరుల గుర్తింపే సమస్య ప్రధానంగా స్థానికులు, స్థానికేతరులను గుర్తించాలనే నిర్ణయమే రెగ్యులరైజేషన్‌కు పీటముడిగా మారిందని, అందుకే జాప్యం అవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించటంలో ఇబ్బంది లేదని.. అదే సమయంలో ప్రస్తుతం ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలా.. వద్దా.. అనే సందిగ్ధత కూడా కొనసాగుతోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. స్క్రీనిం గ్ పరీక్షకు నోటిఫికేషన్ వేసే సమయంలో రెండు రాష్ట్రాల్లో పని చేస్తున్న వారికీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తే ఈ చిక్కుముడి తొలగిపోతుందని కాంట్రాక్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం పంపించాలని తెలంగాణ ఆర్థిక శాఖ అన్ని విభాగాలను కోరింది. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం 28 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే ప్రతి నెలా దాదాపు రూ.9 కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది. ఆర్థికం గా రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉం ది. ఈ నేప థ్యంలో కాం ట్రాక్టు ఉద్యోగు ల రెగ్యులరైజేషన్ను వేగవంతంగా పూర్తి చేస్తే అంతకంతకు భారం పడుతుంది. అందుకే సర్కారు ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టి సాగదీస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పరిశీలనలో అంశం ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సారథ్యంలో సర్కారు నియమించిన ఉన్నతాధికారుల కమిటీ కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్‌కు మార్గదర్శకాలను సిఫారసు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి అంటే గత ఏడాది జూన్ 2 నాటికి అయిదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను మొదటగా రెగ్యులరైజ్ చేయాలని సూచించింది. ఈ కమిటీ నివేదికతో పాటు ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది. ఈలోగా తెరపైకి వచ్చిన స్క్రీనింగ్ పరీక్ష, స్థానికత అంశాలతో ఈ ఫైళ్లు ఎక్కడివక్కడే అన్నట్లుగా ఆగిపోయాయి. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు మళ్లీ కొంతకాలం కంచికి చేరినట్లయింది. -
సంజయ్‌దత్‌కు నిబంధనలు వర్తించవా?
* బాలీవుడ్ నటునికి సెలవులు, పెరోల్‌ను సవాలుచేస్తూ పిటిషన్ * ప్రభుత్వాన్ని సమాధానం కోరి బొంబాయి హైకోర్టు సాక్షి, ముంబై: అక్రమ ఆయుధాలు కల్గి ఉన్న కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు తరుచుగా లభిస్తున్న పెరోల్, సెలవులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సమాధానం ఇవ్వాలని బొంబాయి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పుణే జైలు సూపరింటెండెంట్, పుణే డివిజనల్ కమిషనర్లు తమకు గల విచక్షణాధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ తుషార్ పబాలే అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు వీఎం కనాడే, రేవతి మోహితే డేరేల ధర్మాసనం విచారణ జరిపింది. డిసెంబర్ 2013-మార్చి 2014 మధ్య కాలంలో సంజయ్‌దత్ పెరోల్‌పై విడుదలైన సమయంలో పబాలే ఈ పిటిషన్ దాఖలు చేశారు. పబాలే తరఫు న్యాయవాది నిఖిల్ చౌదరి తన వాదనలు వినిపిస్తూ, ఓ ఖైదీ సెలవుపై బయటకు వచ్చిన తరువాత కనీసం ఒక సంవత్సరం పాటు జైలులో ఉండాలన్నారు. అంటే మరోసారి సెలవు మంజూరు కావాలంటే 365 రోజుల పాటు ఆ ఖైదీ శిక్షను అనుభవించాలి. ఒకవేళ మధ్యలో అతడు పెరోల్‌పై విడుదలైతే, ఆ రోజులను శిక్షా కాలంగా లెక్కించకూడదని పేర్కొన్నారు. సంజయ్‌దత్‌కు అక్టోబర్ 2013లో 28 రోజుల పాటు సెలవు మంజూరైంది. తిరిగి డిసెంబర్ 2013లో నెల రోజుల పెరోల్ లభించింది. ఆ తరువాత ఆ పెరోల్‌ను మరో నెల రోజులు అనగా ఫిబ్రవరి 21 వరకు పొడిగించారు. తన భార్యకు అనారోగ్యంగా ఉందంటూ దత్ తన పెరోల్‌ను మరో నెల రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అతని విజ్ఞప్తిని పుణే డివిజనల్ కమిషనర్ ఆమోదించడంతో సంజయ్ దత్ 2014 మార్చి 21న తిరిగి జైలుకు వెళ్లారు. దీంతో అక్టోబర్ 2013 నుంచి డిసెంబర్ 2014 మధ్య దత్ సెలవు, పెరోల్‌పై మొత్తంగా నాలుగు నెలలు జైలు వెలుపల ఉన్నారు. తిరిగి డిసెంబర్ 24, 2014లో దత్ సెలవుపై బయటకు వచ్చారు. రెండోసారి సెలవు మంజూరు కావడానికి సంజయ్ దత్ జైలులో 365 రోజులు గడపలేదని న్యాయవాది ఆరోపించారు. పెరోల్‌పై విడుదలైన కాలాన్ని శిక్షా కాలంగా పరిగణించరాదని చెప్పారు. మే 16, 2013లో లొంగిపోయిన నాటి నుంచి సంజయ్ దత్ జైలు వెలుపల 134 రోజులు ఉన్నారని పేర్కొంటూ ఖైదీల పెరోల్, సెలవుల విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. -
రైల్వే టెండర్ల ప్రక్రియలో సంస్కరణలు
న్యూఢిల్లీ: రైల్వేలో పారదర్శకతను పెంచేందుకు, టెండర్ల ప్రక్రియ వేగవంతమయ్యేందుకు ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు కీలక నిర్ణయం తీసుకున్నారు. టెండర్ల ప్రక్రియలో తన జోక్యం లేకుండా తప్పుకొన్నారు. వాటి ఖరారు బాధ్యతను రైల్వే జోన్లకు, ఉత్పత్తి విభాగాల అధిపతులకే అప్పగించారు. ప్రస్తుతం రైల్వే టెండర్ల ఖరారులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైల్వేల్లో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ టెండర్ల ప్రక్రియను మంత్రి సులభతరం చేశారు. ప్రతి దాన్ని రైల్వే బోర్డు ఆమోదానికి పంపకుండా, సోర్స్ అండ్ వర్క్స్ విభాగ పనులకు టెండర్లను ఆమోదించే బాధ్యతను జోనల్ రైల్వేలకు, ఉత్పత్తి విభాగాలకు కట్టబెట్టారు. ఆయా విభాగాల జనరల్ మేనేజర్, డెరైక్టర్ జనరల్‌కే పూర్తి అధికారాలు ఉంటాయని శుక్రవారం రైల్వే శాఖ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇకపై రూ. 500 కోట్లకంటే ఎక్కువ విలువ గల పనులకు సంబంధించిన టెండర్లను మాత్రమే బోర్డు స్థాయిలో ఆమోదిస్తారు. -
ఎన్‌బీఎఫ్‌సీల నిబంధనలు కఠినతరం
ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ కఠినతరం చేసింది. తాజా మార్పుల ప్రకారం ఎన్బీఎఫ్సీలు 2017 నాటికల్లా నెట్ ఓన్డ్ ఫండ్ (ఎన్వోఎఫ్)ను దశలవారీగా రూ. 2 కోట్లకు పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 25 లక్షలుగా ఉంది. ఇందుకు సంబంధించి నిర్దేశిత మైలురాళ్లను అధిగమించలేని పక్షంలో వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు చేసే ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే, బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే సంస్థలు ఈక్విటీ మూలధనాన్ని కనీసం 12 శాతం మేర ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఇది 10 శాతంగా ఉంది. డిపాజిట్లు స్వీకరించే ఎన్‌బీఎఫ్‌సీలయితే ఈక్విటీ మూలధనాన్ని రెండేళ్లలో ప్రస్తుతం ఉన్న 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఇక 0.25 శాతంగా ఉన్న ప్రొవిజనింగ్‌ని 2018 మార్చి నాటికి 0.4 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుంది. -
‘ఆహార భద్రత’ దరఖాస్తులపై అయోమయం!
పౌరసరఫరాల శాఖలో సిబ్బంది కొరత ఒకవైపు మారుతున్న నిబంధనలు దర ఖాస్తుల పరిశీలన టెస్టింగ్‌లకే పరిమితం వారం గడిచినా..ఆరంభం కాని వైనం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో ఆహారభద్రత (రేషన్) దరఖాస్తుల పరిశీలనపై స్తబ్ధత నెలకొంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసి వారం కావస్తున్నప్పటికీ ఇంటింటి పరిశీలన మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కేవలం డీలర్లు స్వీకరించిన దరఖాస్తులు, రికార్డులను సేకరించిన సివిల్ సప్లై అధికారులు కంప్యూటరీకరణ చేయడంలోనే మునిగితేలుతున్నారు. వాస్తవంగా సివిల్ సప్లై శాఖలో ఒకవైపు సిబ్బంది కొరత వెంటాడుతుండగా, మరోవైపు మారుతున్న నిబంధనలపై స్పష్టత లేక దరఖాస్తుల పరిశీలనకు అధికారులు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు డీలర్ల నుంచి సేకరించిన దరఖాస్తులు, రికార్డులను సర్కిల్ ఆఫీస్‌ల వారీగా ప్రైవేట్ డేటాబేస్ ఆపరేటర్ల సహాయంతో కంప్యూటరీకరిస్తున్నారు. నగరంలో తొమ్మిది సర్కిల్స్ ఉండగా, వాటిలో ఏ ఒక్కదానిలో కూడా పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. దరఖాస్తులను కంప్యూటరీకరించి డివిజన్, ఏరియా వారీగా విభజించి సమగ్ర కుటుంబ సర్వే నివేదికలతో సరిపోల్చుతూ విచారణ జరపాల్సి ఉంటుంది. డేటాబేస్ ఆపరేటింగ్ కోసం ప్రైవేట్ సిబ్బందిని డైలీ వేజ్ కిందతీసుకున్నప్పటికీ దరఖాస్తులపై ఇంటింటి పరిశీలనకు మాత్రం సిబ్బంది కొరత తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖలో 70 మందికి మించి సిబ్బంది లేరు. ఆహార భద్రత కార్డుల కోసం అందిన సుమారు 8.89 లక్షల దరఖాస్తులపై విచారణ జరపాల్సి ఉంటుంది. ఇటీవల రెండు మూడు సర్కిల్స్‌లో దరఖాస్తుల పరిశీలనపై ‘టెస్టింగ్’ నిర్వహించారు. ఒక ఇంటికి దరఖాస్తు పరిశీలన పూర్తయ్యేవరకు ఎంత సమయం పడుతుంది. రోజుకు సిబ్బంది ఎన్ని దరఖాస్తులను పరిశీలించవచ్చు అనేదానిపై టెస్టింగ్ నిర్వహించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బంది దరఖాస్తుల పరిశీలనకు సరిపోని పరిస్థితి నెలకొంది. తాజాగా నిబంధనల్లో మార్పు చేస్తున్నట్లు సంబంధిత మంత్రి వెల్లడించారు. దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాతనే దరఖాస్తుల పరిశీలనకు రంగంలోకి దిగాలని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పెన్షన్, ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తికావస్తుండటంతో రెవెన్యూ సిబ్బందిని ఆహార భద్రత దరఖాస్తుల పరిశీలన కోసం వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రజల ప్రాణాలు పట్టవా ?
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏమిటి... ప్రమాదం సంభవించాక నెత్తినోరూ బాదుకుంటే వచ్చే దేమిటి... ప్రాణాలు పోయాక నిబంధనలు గుర్తుకు వస్తే చేయగలిగెదేమిటి... ఇలాంటి ప్రశ్నలకు ‘ఏమీ లేదు’అనే సమాధానమే వస్తోంది. మరి ఈ విషయాలు తెలియని అధికారులు ఉన్నారా అంటే ‘లేరు’ అని సమాధానమే వస్తోంది. ఇవన్నీ తెలిసి నిబంధనలను కాలరాస్తున్న అధికారులు ఎవరైనా ఉంటారా అని అడిగితే ‘ఉంటారు కాదు ఉన్నారు’ అని వినిపిస్తోంది... ఎక్కడో కాదు అవినీతి ముసుగేసుకుని, ప్రజల ప్రాణాల కన్నా దీపావళి వ్యాపారులు ఇచ్చే డబ్బులే మిన్న అనుకుంటూ మన మధ్యే తిరుగుతున్నారు. ఇది నిజమో కాదో మీరే చదవండి...! సాక్షి, గుంటూరు ప్రతి దీపావళికి ఎక్కడ పేలుడు సంభవిస్తుందోననే భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. నిబంధనలు పాటించాల్సిన వ్యాపారులు, వాటిని సరిచూడాల్సిన అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడమే ఇందుకు కారణం. నిన్నగాక మొన్న తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలోని బాణ సంచా తయారీ కేంద్రంలో విస్ఫోటం సంభవించి 17 మంది మృతి చెందిన దుర్ఘటన అందరి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అక్కడ అంతటి ఘోరం జరిగినా ఇక్కడి అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం శోచనీయం. జిల్లాలో అక్రమంగా మందు గుండు నిల్వ చేసిన గోడౌన్లపై తనిఖీలు లేవు, అక్రమ వ్యాపారులపై చర్యలూ లేవు. కాకతాళీయంగా బయటపడితే మినహా అక్రమ నిల్వలను బయటకు తీయడం లేదు. నిబంధనలను పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్, నగరపాలక సంస్థ, అగ్నిమాపక శాఖ ఇన్ని శాఖల అధికారులు పర్యవేక్షించాల్సి ఉన్నా జిల్లాలో అక్రమంగా బాణసంచా తయారీ, అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోవడం అధికారుల లోగుట్టును బయటపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా 23 హోల్‌సేల్ బాణ సంచా దుకాణాలు ఉన్నాయి. అందులో మూడు షాపులు గుంటూరు నగరంలోనే ఉన్నాయి. నరసరావుపేటలోని ఒక దుకాణం మాత్రమే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కలిగి ఉంది. ఈ వ్యాపారుల్లో ఒకరైన మలిశెట్టి సుబ్బారావు రూ. కోట్ల విలువ చేసే బాణ సంచాను వివిధ గోడౌన్లలో అక్రమంగా నిల్వ చేసినట్టు వెల్లడైంది. చౌడాయ పాలెం వద్ద ఒక్క గోడౌన్లో తనిఖీ చేసిన పోలీసులకు రూ.2.88 కోట్ల విలువ చేసే బాణ సంచా అక్రమ నిల్వలు దొరికాయి. ఆదివారం నాడు అదే ప్రాంతంలో శివరామకృష్ణ గోడౌన్స్‌లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.2 కోట్ల విలువ చేసే బాణ సంచా స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్‌ను సీజ్ చేశారు.ఇలా మొత్తం రూ.4.8 కోట్ల విలువ చేసే బాణ సంచా అక్రమ నిల్వలు బయటపడ్డాయి. ఈ వ్యాపారికి నగరంలో పలు గోడౌన్లు ఉన్నాయని, స్థానిక చుట్టుగుంట సెంటర్లో హోల్‌సేల్ దుకాణం ఉందని సమాచారం. ఈ దుకాణానికి అగ్నిమాపక శాఖ అనుమతి లేదని ఆ శాఖ జిల్లా అధికారి జిలాని తెలిపారు. నెలరోజుల కిందట నోటీసులు జారీ చేసినా స్పందించ లేదని చెప్పారు. గత శుక్రవారం పోలీసు, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులతో కలసి అగ్నిమాపక శాఖ అధికారులు మలిశెట్టి సుబ్బారావు షాపును తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించినా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆయన ఓ మాజీ మంత్రికి సన్నిహితుడు కావడం వల్లే అధికారులు వెనకంజ వేస్తున్నారని సమాచారం. అనుమతి పొందాలంటే నిబంధనలు తప్పనిసరి బాణ సంచా హోల్‌సేల్ దుకాణాలు నిర్వహించే వారు తమ దుకాణాల చుట్టుపక్కల జనావాసాలు, ఇతర వ్యాపార సముదాయాలు లేకుండా చూసుకోవాలి. దుకాణానికి చుట్టూ అగ్నిమాపక శకటం తిరిగేందుకు వీలుగా ఆరు మీటర్ల వరకు స్థలం వదలాలి. దుకాణం చుట్టుపక్కల హైడ్రిన్ సిస్టమ్ పైపులైను, గోడౌన్ లోపల హోజ్‌రీల్ సిస్టమ్ వాటర్ పైపులైను, స్పింక్లర్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి. బాణ సంచా వ్యాపారులు ఇలాంటివీ ఏవీ పాటించడం లేదు. ఇవన్నీ ఉంటేనే అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇలాంటివి ఏవీ లేకున్నా అనుమతులు ఎందుకు ఇస్తున్నారో తెలియందే కాదు. ప్రమాదం జరిగితే అధికారుల అవినీతికి అనేక ప్రాణాలు బలికాక తప్పదని తెలిసినా ధనార్జనే ధ్యేయంగా అక్రమ వ్యాపారులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా అక్రమ బాణసంచా వ్యాపారంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. -
కౌలు రైతుకు హామీ మాఫీ
నట్టేట ముంచిన నిబంధన జీవో 174లో కౌలు రైతుకు దక్కని స్థానం కౌలు కార్డు లేకుంటే అంతే సంగతులు సర్కార్ మెలికపై మండిపాటు గుడివాడ : రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు కౌలు రైతు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికార పీఠమెక్కిన అనంతరం మడమ వెనక్కి తిప్పారు. వ్యవసాయానికి మాత్రమే తీసుకున్న బంగారు రుణాలు కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున రద్దు చేస్తానని ఆర్భాటంగా ప్రకటించారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమనుకున్న రైతులు అయిన కాడికన్నా తీసుకోవచ్చని బ్యాంకుల వద్ద బారులు తీరారు. తీరా బ్యాంకు అధికారుల వద్దకు వచ్చిన కౌలు రైతులకు ‘కౌలు కార్డు’ ఉంటేనే రుణమాఫీకి అర్హులవుతారని చావు కబురు చల్లగా చెబుతుండడంతో అక్కడే కూలబడిపోతున్నారు. అయితే రుణమాఫీపై ప్రభుత్వం వేసిన కోటయ్య కమిటీ చేసిన సిఫార్సుల్లో కూడా లేని నిబంధనలు పెట్టి రుణమాఫీని తప్పించుకునేందుకు ప్రభుత్వం అడ్డదారులు వెదుకుందనడానికి ఇదే నిదర్శనమని రైతుసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. వడపోతతో భారం తగ్గించుకుంటున్నారు.. ‘మీరు తీసుకున్న పంట రుణాలన్నీ రద్దు అవుతాయి.. ఒక్కపైసా చెల్లించ వద్దు తమ్ముళ్లు’ అని చెప్పిన చంద్రబాబు మాటలతో ఆనందించిన చిన్న సన్నకారు, కౌలు రైతులు వాస్తవ పరిస్థితి చూసి నివ్వెరపోతున్నారు. రుణమాఫీపై విడుదల చేసిన జీవో నంబరు 174లో కౌలు రైతులు, జేఎల్‌జీ గ్రూపులు, రైతుమిత్ర గ్రూపుల ఊసులేకుండా చేశారు. జిల్లాలో దాదాపు లక్షమందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు కార్డులు తీసుకున్న వారు కేవలం 20శాతం మందే. వ్యవసాయరుణం, బంగారంపై వ్యవసాయ రుణం పొందిన రైతులు తమ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పట్టాదార్ పాస్‌పుస్తకం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కౌలు రైతు అయితే భూయజమాని పట్టాదార్ పాస్‌పుస్తకంతోపాటు, కౌలు కార్డు ఇవ్వాలని చెబుతున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్‌తోపాటు ఒరిజినల్ పుస్తకం చూపించాలని బ్యాంకు అధికారులు అంటున్నారు. దీనికి తోడు రుణమాఫీ జరిగితే సంబంధిత పట్టాదార్ పాస్పుస్తకంపై రుణమాఫీ జరిగినట్లు ముద్రవేస్తాం.. మీ రైతు ఒప్పుకుంటాడా? అని బ్యాంకు అధికారులు ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతుకు పట్టాదార్ పాస్‌పుస్తకం ఒరిజినల్ ఇవ్వటానికి ఏ రైతు ఒప్పుకోని పరిస్థితి ఉంది. కేవలం కౌలు కార్డు ఉంటేనే కౌలు రైతుగా గుర్తిస్తామని లేదనంటే కుదరదని బ్యాంకు అధికారులు తెగేసి చెబుతున్నారు. కౌలు కార్డులు తీసుకోవడానికి నిరాసక్తి చూపిన వైనం... 2010లో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి నేరుగా బ్యాంకుల్లో పంట రుణాలు ఇవ్వాలని అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట్లో కౌలు రైతులు పెద్ద సంఖ్యలోనే కార్డులు పొందారు. అనంతర కాలంలో కౌలు రైతులకు అనేక బ్యాంకులు పంట రుణాలు ఇవ్వటానికి నిరాసక్తి చూపాయి. దీంతో కౌలు కార్డులు ఉన్నా ఉపయోగం లేదనే తీరుతో రానురాను కౌలు గుర్తింపు కార్డులు తీసుకోవటానికి కౌలు రైతులు ముందుకు రాలేదు. రుణానికి సరిపడా పొలం చూసితేనే.. రైతు తీసుకున్న రుణానికి సరిపడా పొలాన్ని చూపితేనే రుణమాఫీ ఉంటుందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఒక రైతు ఎకరం పొలానికి మూడేళ్లుగా వరుసగా రూ.25వేలు చొప్పున రూ.75వేలు బంగారు రుణం తీసుకున్నా అది కేవలం రూ 25వేలకే పరిమితమవుతుందని అంటున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. -
మాఫికర్!
అయోమయం ముంచుకొస్తున్న గడువు రైతుల్లో ఆందోళన రుణమాఫీ.. ఎన్నికల ఫలితాల వచ్చేవరకూ రైతులను ఆనందడోలికల్లో తేలియాడించిన పథకం. అధికారమే పరమావధిగా ఎన్నికల్లో సునాయాసంగా ఇచ్చేసిన హామీ. తీరా సవాలక్ష కొర్రీల కారణంగా అమలు విషయం అయోమయంగా మారింది. ఇందుకు నిర్ణయించిన గడువుతో ముంచుకొస్తుండడంతో రైతన్నలకు భయం పట్టుకుంది. విశాఖ రూరల్ : రుణమాఫీ వ్యవహారం అయోమయంగా మారింది. అమల విషయంలో రైతుల్లో భయం పట్టుకుంది. ప్రభుత్వం చెబుతున్నది ఒక రకంగా ఉంటే బ్యాంకుల తీరు మరో విధంగా ఉంటోంది. అసలు బ్యాంకులు, సహకార సంఘాలు వేర్వేరు నిబంధనలు అమలు చేస్తుండడమే ఈ గందరగోళానికి కారణమవుతోంది. మరోవైపు అర్హుల జాబితా తయారీకి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఆధార్ సీడింగ్‌కు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. పాస్ పుస్తకంలో ఉన్న పేరు 1బీ అడంగల్‌లో ఉంటేనే కంప్యూటర్ స్వీకరిస్తుంది. లేనివి పక్కనపెడుతున్నారు. గతంలో అధికారులు నిర్లక్ష్య ధోరణితో రికార్డుల్లో సవరణలు చేయని కారణంగా ప్రస్తుతం తాము నష్టపోవాల్సి వ స్తోందని రైతులు వాపోతున్నారు. ఆధార్ వివరాల సమర్పణకు ఈ నెల 15 ఆఖరు తేదీగా ప్రకటించడంతో కార్డులు లేని వారు కలవరానికి గురవుతున్నారు. అనేక ఇబ్బందులు జిల్లాలో రైతులకు సంబంధించి భూ యాజమాన్య హక్కు పత్రాలను (పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్) రెవెన్యూ అధికారులు చాలా వరకు అందజేశారు. అయితే ఆ తర్వా యజమాని మరణం, భాగం పంపిణీ తదితరాలకు సంబంధించి వెంటనే క్లయిమ్ చేసుకుని తదుపరి హక్కు పొందాల్సి ఉంటుంది. దీనిపై సరైన అవగాహన లేక కొత్త పాస్‌పుస్తకాలు పొందని వారు అనేక మంది ఉన్నారు. అదే విధంగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో యజమాని పేరు మార్చేటప్పుడు వీఆర్వోలు, ఆర్ఐలు, తహశీల్దార్లు, ఆర్డీఓ క్షేత్ర స్థాయిలో అందరి సంతకాలు అవసరమవుతాయి. అయితే కొన్ని చోట్ల యజమాని ఫొటోపై కొత్తగా ఎవరికి కేటాయిస్తున్నారో వారి ఫొటో అంటించి పేరు మార్చి వదిలేశారు. అడంగల్, 1బీలలో పేరు మార్పు జరగలేదు. అలాంటివి ప్రస్తుతం వందల సంఖ్యలో ఉన్నాయి. ఆధార్ సీడింగ్‌లో పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నప్పటికీ 1బీ, అడంగల్‌లో పేరు మార్పు జరగని కారణంగా సీడింగ్ జరగడం లేదు. దీంతో తాము రుణమాఫీకి అర్హులంకామేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నకిలీల నేపథ్యంలో నిశిత పరిశీలన : గతంలో అనేక చోట్ల నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు చూపి బ్యాంకులకు టోకరా వేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా నిబంధనల మేరకు పుస్తకాలుంటేనే వాటిని పరిగణలోకి తీసుకోవాలని బాంకర్లు నిర్ణయించడంతో, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాస్తవానికి ఆధార్ అనుసంధానం అయితే సదరు పట్టాదారు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలు పొందితే ఆ విషయం బయటపడుతుంది. కానీ సాంకేతికపరమైన అంశాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ అవస్థలు : గడువు ముగుస్తున్నా అనేక మంది రైతులకు నేటికీ ఆధార్‌కార్డులు లేవు. దీంతో మీసేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం ప్రతి పథకం, సంక్షేమ కార్యక్రమానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో కేంద్రాల వద్ద జనాలు క్యూలు కడుతున్నారు. అందుకు అనుగుణంగా ఆయా కేంద్రాల వద్ద ఏర్పాట్లు లేవు. గడువులోగా కనీసం ఆధార్ రసీదు నంబర్ కూడా ఇవ్వలేని పరిస్థితులు కొన్ని చోట్ల నెలకొన్నాయి. నిర్ణీత వ్యవధిలోపు రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఉంటుంది. అయితే రుణమాఫీ ప్రకటనలో అనేక మంది రైతులు రుణాలు చెల్లించలేదు. రుణమాఫీ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే రైతులపై వడ్డీ భారం పడింది. ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
సీఎస్ ఔత్సాహికులకు సరైన సమయమిదే..
గెస్ట్ కాలమ్ కంపెనీ సెక్రటరీ.. వ్యాపార, వాణిజ్య రంగాల్లో దేశం శరవేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో చక్కటి కెరీర్‌కు అవకాశం కల్పించే కోర్సు. ప్రభుత్వ తాజా నిబంధనలు కూడా కెరీర్ పరంగా కంపెనీ సెక్రటరీలకు ఎన్నో అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు దీన్ని అందిపుచ్చుకోవాలి. కంపెనీ సెక్రటరీ కోర్సు అంటే కామర్స్, మేనేజ్మెంట్ సంబంధితమని, ఆ నేపథ్యం ఉన్న వారికే అనుకూలమనే భావన సరికాదు. నిరంతర అధ్యయన దృక్పథం, పరిశీలనాత్మక దృష్టితో వ్యవహరిస్తే.. అన్ని అకడమిక్ నేపథ్యాల విద్యార్థులు సీఎస్ కోర్సులో రాణించగలరు అంటున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఆల్ ఇండియా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీధరన్‌తో ఇంటర్వ్యూ.. ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం ఐసీఎస్ఐ ప్రెసిడెంట్‌గా తొలి ప్రాధాన్యం ఇచ్చే అంశం.. ఉద్యోగం లేదా ప్రాక్టీస్‌లో ఉన్నవారిని మరింత నిబద్ధతగా వ్యవహరించేలా చేయడమే. ఇక సీఎస్ విద్యార్థుల విషయానికొస్తే అకడమిక్ సామర్థ్యాలను మరింత పెంచడం మా లక్ష్యం. ఈ క్రమంలో కంపెనీస్ లా- 2013లో కంపెనీ సెక్రటరీ విధుల పరంగా పేర్కొన్న అన్ని నిబంధనలను కచ్చితంగా అమలయ్యేలా చేస్తాం. కంపెనీ సెక్రటరీ.. పెరుగుతున్న ప్రాధాన్యం కంపెనీ సెక్రటరీ ప్రొఫెషన్‌కు ప్రాధాన్యం దినదిన ప్రవర్థమానం అవుతోంది. రూ. 5 కోట్ల పెయిడ్-అప్ క్యాపిటల్ ఉన్న ప్రతి సంస్థ కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలనే నిబంధన కారణంగా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు డిమాండ్ పెరుగుతోంది. ఆయా సంస్థల్లో పూర్తిస్థాయిలో కంపెనీ సెక్రటరీ ఉద్యోగంతోపాటు, ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీగా స్వయం ఉపాధికి కూడా ఎంతో అవకాశం ఉంది. కానీ ఏటా సర్టిఫికెట్లు అందుకుంటున్నవారి సంఖ్యతో పోల్చితే సీఎస్‌కు డిమాండ్ - సప్లయ్ మధ్య ఎంతో వ్యత్యాసం నెలకొంది. ఔత్సాహిక విద్యార్థులు ప్రొఫెషన్లో ప్రవేశించి చక్కటి కెరీర్ అందుకోవడానికి ఇదే సరైన సమయం. సంస్థల్లోనూ కీలక పాత్ర పోషించే సీఎస్‌లు మూడు దశల సీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు ఆయా సంస్థల కార్యకలాపాల్లోనూ ముఖ్య హోదాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. సదరు సంస్థ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెక్రటేరియల్ ప్రమాణాలు పాటించేలా చూడటం, ఆ మేరకు అవసరమైతే ఉన్నతాధికారులకు తగిన సిఫార్సులు చేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కంపెనీ లా - 2013 ప్రకారం మొత్తం తొమ్మిది కీలక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత కంపెనీ సెక్రటరీలదే. ఇలా.. ఒక సంస్థలో సీఈఓ, ఎండీ తర్వాత ఆ స్థాయీ ప్రాధాన్యం సీఎస్‌లకు లభిస్తుంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాకు చేరుకోవచ్చు. అదేవిధంగా సెక్రటేరియల్ ఆడిట్, లేబర్ ఆడిట్, లీగల్ ఆడిట్ తదితర విభాగల్లోనూ సీఎస్‌లకు అవకాశాలు లభిస్తాయి. ఇదే సమయంలో రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఎక్కువగా ఉండే ఉద్యోగం కంపెనీ సెక్రటరీ. ఒకవైపు సంస్థలోని ఉన్నతాధికారులకు, మరోవైపు స్టేక్ హోల్టర్లు, నియంత్రణ సంస్థలకు మధ్య వారధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సెమినార్లు, వర్క్‌షాప్‌లతో అవగాహన వృత్తి పరంగా ఎంతో కీలకమైన కంపెనీ సెక్రటరీ కోర్సుపై విద్యార్థులకు ఆశించిన రీతిలో అవగాహన లేదనే మాట వాస్తవం. కోర్సుకు నమోదు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతున్న ప్పటికీ ఆ సంఖ్య వాస్తవ అవసరాలకు సరితూగట్లేదు. ఈ క్రమంలో విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు సెమినార్లు నిర్వహించాలని నిర్ణయించాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 400 సెమినార్లు నిర్వహించాలని నిర్దేశించుకున్నాం. అదేవిధంగా ఇప్పటికే కోర్సు పూర్తి చేసి అసోసియేట్, ఫెలో మెంబర్స్‌గా దాదాపు 35 వేల మందికిపైగా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలు ఉన్నారు. వీరికి కూడా తాజా పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించ నున్నాం. సీఏ, సీఎస్, సీఎంఏ మూడు.. వేర్వేరు ప్రాధాన్యత కలిగిన కోర్సులు చాలా మంది సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల మధ్య పోలికలు, తేడాలు బేరీజు వేయాలని చూస్తున్నారు. కానీ ఇది సరికాదు. రెండు కోర్సులు వేర్వేరు ప్రాధాన్యతలు కలిగున్నాయి. కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తిగా సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, కంపెనీ లా ఆధారంగా ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు ఆర్థికపరమైన అంశాలు (అకౌంటింగ్, ఆడిటింగ్) ఎక్కువగా ఉండే కోర్సు. ఉద్యోగ విధుల విషయంలోనూ రెండింటికీ వేర్వేరు ప్రాధాన్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి సంస్థకు కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్ ఇద్దరూ అవసరం. అదే విధంగా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగ సంస్థల్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశాలున్నాయి. మొత్తంమీద ఒక సంస్థను సమర్థంగా, ప్రగతి పథంలో పయనించేలా చేయడంలో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులు ముగ్గురూ ముఖ్యమే. ఆ అభిప్రాయం అపోహ మాత్రమే కంపెనీ సెక్రటరీ కోర్సు.. కేవలం కామర్స్, లా, మేనేజ్మెంట్ అకడమిక్ నేపథ్యాలు ఉన్న విద్యార్థులకే అనుకూలం అనే అభిప్రాయం అపోహ మాత్రమే. తులనాత్మక పరిశీలన, విశ్లేషణ నైపుణ్యం ఉంటే అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా ఎలాంటి విద్యార్థులైనా సులువుగా రాణించగల కోర్సు కంపెనీ సెక్రటరీ. కోర్సులో చేరాక నిర్దేశిత సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయడంతోపాటు దానికి సంబంధించిన తాజా మార్పులపై అవగాహన పొందుతూ ముందుకు సాగాలి. సరైన సమయం.. మూడు దశలు (ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్)గా ఉండే కంపెనీ సెక్రటరీ కోర్సులో చేరడానికి సరైన సమయం అనేది విద్యార్థుల వ్యక్తిగత లక్ష్యాలు, అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుతో ఫౌండేషన్ కోర్సులో; బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. ఏ దశలో చేరినా పూర్తి స్థాయిలో సమయం కేటాయించేట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. సీఎస్ కోర్సు ఔత్సాహికులకు సలహా.. సీఎస్ కోర్సు ఔత్సాహికులు, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కెరీర్లో గుర్తుంచుకోవాల్సిన రెండు ప్రధాన అంశాలు కఠోర శ్రమ, ఓర్పు. ఈ రెండూ ఉంటే విజయాలు వాటంతటే వరిస్తాయి. అదే విధంగా నిత్య నూతన ఆలోచన దృక్పథం కూడా ఈ రంగంలో విజయానికి ఎంతో కీలక సాధనం. దీంతోపాటు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకునే లక్షణాన్ని సొంతం చేసుకోవాలి. -
పన్ను వేసుకో.. అభివృద్ధి చేసుకో
పంచాయతీ ఆదాయాలతోనే గ్రామాల్లో వసతులు వికేంద్రీకృత అభివృద్ధి పేరిట సంస్కరణలు ఐదే ళ్ల ప్రణాళికల రచనకు ఏర్పాట్లు ఏలూరు : గ్రామ స్వపరిపాలనలో సం స్కరణలు మొదలయ్యాయి. ప్రతి లావాదేవీని ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా ఆదాయం, వ్యయా ల విషయంలో పంచాయతీ పాలకవర్గాలు, ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెంచనున్నారు. ఇప్పటికే ఆ కసరత్తు మొదలైంది. సెప్టెంబర్ నెల నుంచి పంచాయతీ పాలన ఆన్లైన్ కానున్న నేపథ్యంలోనే మౌలిక వసతుల కల్పన ఆయూ గ్రామాలకు వచ్చే ఆదాయాలతోనే చేపట్టేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పన్నుల భారం పెరగనుంది. దాంతోపాటు అదనంగా ఆదాయ వనరులను దశలవారీగా అన్వేషించుకుని ఆ మొత్తాలతోనే గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ జీవో నంబర్-464ను జారీ చేసింది. దీంతో జిల్లాలోని 884 పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికల రూపక ల్పనకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకు పంచాయతీలను సమాయత్తం చేసే దిశగా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం కుళాయి, ఆస్తిపన్నులే గ్రామాలకు ఆధారంగా ఉన్నాయి. మరిన్ని ఆదాయ వనరులు సమకూర్చుకునే దిశగా సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, ఈవోఆర్డీలకు అవగాహన కల్పించేం దుకు డివిజన్‌స్థాయిలో అవగాహన, శిక్షణ కార్యక్రమాలను పంచాయతీ శాఖ చేపట్టింది. అనంతరం మూడు నెలల్లో వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉన్న ట్టు అధికారులు చెబుతున్నారు. నాలుగు దశల్లో అభివృద్ధి ప్రణాళిక అన్ని గ్రామాల్లో వికేంద్రీకృత ప్రణాళిక అమలు చేయనున్నారు. తొలుత ఆ గ్రామంలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తా రు. రెండో దశలో తాగునీరు, పారిశుధ్యం, ప్రజారోగ్యం, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, వ్యవసా యం, ఆరోగ్యం, పశు సంవర్థకం, గృహనిర్మాణం, పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణ రహదారులు, పర్యాటక రంగం వంటి అంశాలకు సంబంధించి సమాచారం సేకరి స్తారు. మూడో దశలో ఆర్థిక వనరుల సమీకరణ చేస్తారు. తప్పనిసరి, ఐచ్ఛిక పన్నులను గుర్తిస్తారు. ఇంటి పన్ను, నీటి పన్ను, వీధిదీపాల పన్ను, డ్రెనేజీ పన్ను ,గ్రంథాలయ పన్ను, కొలగారం, ప్రకటన పన్నులతోపాటు పన్నేతరాలైన కుళాయి, చెరువులు, మార్కెట్లు, సంతలు, లే-అవుట్ ఫీజు, సేవా రుసుం, ఆక్రమణ పన్నులు, ప్రభుత్వ కేటాయింపులు, ప్రభుత్వ గ్రాంట్లు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి విడుదలయ్యే ఆదాయూలను గుర్తిస్తారు. వీటన్నింటినీ క్రోఢీకరించి నాలుగో దశలో మండల స్థాయి, గ్రామ స్థాయి సిబ్బంది కలిసి గుర్తించిన గ్రామస్థాయి అవసరాలపై చిత్తు ప్రతిని తయారు చేస్తారు. తరువాత గ్రామసభల్లో చర్చించి మార్పులు చేర్పులకు అనుగుణంగా అంతిమ ప్రణాళికను తయారు చేస్తారు. ఇదంతా పూర్తయ్యాక అన్ని గ్రామాల్లో తయారైన వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికను కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో మండలస్థాయి సమావేశంలో అభివృద్ది ప్రణాళికలను సిద్ధం చేస్తారు. 2015-16 నుంచి కొత్త ప్రణాళికతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రంగం సిద్ధం చేయనున్నట్టు పంచాయతీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
అతివేగమే ప్రాణం తీసింది..
మంత్రి ఎస్కార్ట్ జీపు ప్రమాదం ఒకరు మృతి, ఇద్దరికిగాయాలు సోమవారం తెల్లవారుజామున బందరులో ఘటన బాధిత కుటుంబానికి నాయకుల పరామర్శలు ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు మచిలీపట్నం క్రైం : ప్రభుత్వం రూపొం దించిన నిబంధనలు అందరితో అమలు చేయించాల్సిన అధికారులు, ఉద్యోగులు తమకు అవి వర్తించవన్నట్లు వ్యవహరిం చారు. ప్రధాన కూడళ్లలో నిదానంగా వాహ నాలు నడపాలని ప్రచారం చేసే వారే అతివేగంతో వాహనం నడి ఓ నిండు ప్రాణం బలి తీసుకున్నారు. మరో ఇద్దరిని ఆస్పత్రులపాలు చేశారు. గుండెలను పిండే ఈ ఘట న సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు మచిలీపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొని, రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు బయలుదేరారు. ఆయనతో పాటు ఎస్కార్ట్ జీపులో డ్రైవర్, మరో ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నారు. మంత్రి రవీంద్రను జిల్లా సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్టు వరకు తీసుకెళ్లిన ఎస్కార్ట్ సిబ్బంది ఆయన్ను అక్కడ దించి. రాత్రి 12 గంటల సమయంలో తిరిగి మచిలీపట్నం బయలుదేరారు. ఎస్కార్ట్ జీపు మచిలీపట్నంలోని చలరాస్తాసెంటర్ సమీపానికి చేరుకున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జీపు అదుపుతప్పి రోడ్డుపక్కన నిలబడిన ముగ్గురిని ఢీ కొంది. ఈ ఘటనలో పట్టణంలోని నిజాంపేటకు చెందిన శేగు రామకృష్ణ (39)తీవ్రగాయాలు అయ్యాయి. అతనితో పాటు ఉన్న నిజాంపేట వాసి శేగు నాగవెంకటశివరామప్రసాద్, ఈడేపల్లికి చెందిన చొప్పరపు గోపాలకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో జీపు పల్టీలు కొట్టటంతో దానిలో ఉన్న కానిస్టేబుల్ ఎల్.హెచ్.కుమార్‌కు గాయాలయ్యాయి. షాక్ నుంచి వెంటనే తేరుకున్న ఎస్కార్ట్ సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన బందరు ప్రభుత్వాస్పత్రికి తలించారు. గాయాలపాలైన వారిలో రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు కుటుంబసభ్యులు అతన్ని విజయవాడ టైమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రామకృష్ణ విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో మృతి చెందాడు. బాబాయి మృతదేహాన్ని చూసేందుకెళ్లి.. ప్రమాదంలో మృతి చెందిన రామకృష్ణ పట్టణంలోని ఓ ఫ్యాన్సీ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం రామకృష్ణ బాబాయి తమ్మన రమేష్ అనారోగ్యంతో మృతి చెందారు. బాబాయి భౌతికకాయాన్ని చూసి, ఆ కుటుంబాన్ని పరామర్శిచేందుకు రామకృష్ణ చల్లరాస్తాసెంటర్లోని బాబాయి ఇంటికి వెళ్లాడు. అతనితో పాటు నాగవెంకటశివరామప్రసాద్, గోపాలకృష్ణ అక్కడికి వెళ్లారు. చనిపోయిన రమేష్ రామకృష్ణకు సొంత బాబాయి కావడంతో రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. రామకృష్ణతో పాటు శివరామకృష్ణ, గోపాలకృష్ణ కూడా రాత్రికి అక్కడే ఉన్నారు. సుమారు మూడు గంటల సమయంలో నిద్ర వస్తుండటంతో టీ తాగేందుకు ఆ ముగ్గురు రోడ్డుపైకి వచ్చారు. అదే సమయంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వేగంగా వస్తున్న మంత్రి ఎస్కార్ట్ జీపు ప్రమాదవశాత్తు వారిపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన శివరామకృష్ణ, గోపాలకృష్ణ తృటితో తప్పించుకున్నారు. రామకృష్ణ మాత్రం ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ప్రభాకరరావు మంత్రి ఎస్కార్ట్ జీపు ప్రమాదానికి గురైందన్న విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు సోమవారం ఘటనాస్థలికి చేరుకున్నారు. జరిగిన ప్రమాదంపై డీఎస్పీ డాక్టర్ కె.వి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన చోట పరిస్థితులను పరిశీలించారు. అనంతరం డీఎస్పీతో జరిగిన ప్రమాదంపై తీసుకోవాల్సిన చర్యలు గురించి మాట్లాడారు. ఎస్పీతో పాటు ఓఎస్డీ హృషికేశ్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బందరు తహశీల్దార్ బి.నారదముని ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుడు రామకృష్ణ పూర్తి వివరాలు సేకరించారు. ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. మృతుని కుటుంబానికి ఆపద్బంధు పథకం కింద నష్ట పరిహారాన్ని అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
గుర్తింపు లేని స్కూళ్లు 145
అనుమతిలేకుండా తరగతులు నిర్వహిస్తే రూ.లక్ష జరిమానా పబ్లిక్ పరీక్షలకు పంపేది లేదు డీఈవో వెల్లడి మచిలీపట్నం : జిల్లాలో గుర్తింపులేని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కొరఢా ఝుళిపించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తే లక్ష రూపాయలు జరిమానా విధించనున్నారు. రెండేళ్ల కిందట 235పైగా గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది ఆ సంఖ్య 145కు చేరింది. వాటిలో 33 ప్రాథమిక, 34 ప్రాథమికోన్నత, 78 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వేసవి సెలవుల అనంతరం గుర్తింపు లేని పాఠశాలలను తెరిస్తే లక్ష రూపాయలు జరిమానా విధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో పాటు అదనంగా రోజుకు రూ.10వేలు చొప్పున జరిమానా వసూలు చేయనున్నట్లు డీఈవో డి.దేవానందరెడ్డి తెలిపారు. గుర్తింపు లేని పాఠశాలలకు నోటీసులు జారీ చేశామని, యాజమాన్యాలు త్వరగా గుర్తింపు పొందాలని సూచించారు. ఆ జాబితా ఎంఈవోలకు పంపామని, డీఈవో వెబ్సైట్లో కూడా ఉన్నాయని తెలిపారు. పబ్లిక్ పరీక్షలకు ప్రవేశం లేదు... ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి సిలబస్ మారింది. ఈ నేపథ్యంలో పాఠశాల ఉపాధ్యాయులు 20 ఇంటర్నల్ మార్కులు ఇవ్వాల్సి ఉంది. గుర్తింపు లేని పాఠశాలల్లో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ఇంటర్నల్ మార్కులు వేసే అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గుర్తింపు లేని పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు పంపే అవకాశం ఉండదని డీఈవో తెలిపారు. ప్రైవేటు విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నుంచి రెగ్యులర్‌గా పబ్లిక్ పరీక్షలు రాసే వెసులుబాటును ప్రభుత్వం తొలగించినట్లు చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే చేర్చాలని ఆయన కోరారు. -
ఇదో పే.......ద్ద F1 ‘ఫార్ములా’
రేసు కార్ల రూటే సెపరేట్ యుద్ధాన్ని తలపించేలా పోటీలు ట్రాక్ నుంచి కారు వరకు అన్నింటిలోనూ ప్రత్యేకమే నిర్వాహకులకు కాసుల పంట నిగనిగలాడే ఓ నల్లటి ట్రాక్... మధ్య మధ్యలో ఊహించని మలుపులు... వాయు వేగంతో దూసుకుపోయే రేసు గుర్రాల్లాంటి కార్లు... రయ్య్‌మని మోత పెట్టే ఇంజిన్లు... అకస్మాత్తుగా తగ్గిపోయే వేగం...క్షణంలోనే మళ్లీ రాకెట్ వేగం... అనుక్షణం ఉత్కంఠ.. రెప్పపాటులో తారుమారయ్యే ఫలితాలు... రెండొందల దేశాల్లోని ప్రేక్షకుల ఆదరణ... వేల కోట్ల రూపాయల పెట్టుబడి... అంతకుమించిన ఆదాయం... ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకత చాటుకుంటున్న ఒకే ఒక్క క్రీడాంశం ‘ఫార్ములావన్’. ఒళ్లు గగుర్పొడ్చే వేగంతో డ్రైవర్లు చేసే సాహస కృత్యాలు, విన్యాసాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. అలాంటి ఎఫ్-1 నియమ నిబంధనలు, జట్లు, డ్రైవర్లు, రేసు, ట్రాక్‌ల విశేషాల గురించి తెలుసుకుందాం! - చిలుక హరిప్రసాద్ 1906 నుంచే మొదలు మొదటి గ్రాండ్ ప్రి రేసును 1906లో నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక 1946లో అన్ని కార్లు తప్పక పాల్గొనాలనే కొత్త నిబంధనను ఆమోదిస్తూ ‘ఫార్ములావన్’ అనే పేరును ఖరారు చేశారు. దీంతో అదే ఏడాది నాన్-చాంపియన్‌షిప్ రేసులను ఏర్పాటు చేశారు. 1950లో అధికారికంగా తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సిల్వర్‌స్టోన్‌లో నిర్వహించారు. 1951లో జువాన్ మాన్యూల్ ఫాంగియో తన అల్ఫా రోమియో-159ను అత్యంత వేగంగా నడిపి వరల్డ్ టైటిల్‌ను అందుకున్నాడు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ మాత్రం 1958 నుంచి ప్రారంభమైంది. దీంతో అప్పటికే జరుగుతున్న మోటార్ రేసింగ్‌కు ఫార్ములావన్ చాలెంజ్ విసిరింది. యూకే, దక్షిణాఫ్రికాలో 1960, 70లతో జాతీయ చాంపియన్‌షిప్‌లను కూడా ఏర్పాటు చేసేవారు. చాలా ఏళ్లు నాన్ చాంపియన్‌షిప్ రేసులు జరిగినా ఆర్థిక భారం పెరిగిపోవడంతో 1983లో వీటికి ముగింపు పలికారు. 20వ శతాబ్దంలో ఈ రేసులు ప్రజాదరణ పొందడంతో పాటు బలమైన స్పాన్సర్లు ఆర్థికంగా చేయూత నిచ్చారు. 1950లో కేవలం 7 గ్రాండ్ప్రిలతో మొదలైన ఎఫ్-1 నేడు ప్రపంచవ్యాప్తంగా 19 రేసులతో అలరారుతోంది. వరల్డ్ చాంపియన్ రేసులో నిలవాలంటే కనీసం 8 పోటీల్లోనైనా పాల్గొనాలి. గ్రాండ్ ప్రిలకు సంబంధించి అత్యంత అధునాతనంగా నిర్మించిన ప్రత్యేక సర్క్యూట్లు ఉంటాయి. రెండు చాంపియన్‌షిప్‌లు సీజన్ చివర్లో జరిగే రేసు అనంతరం ఆధిక్యంలో ఉన్న డ్రైవర్ ఎఫ్-1 విజేతగా నిలుస్తాడు. ఇందులో డ్రైవర్స్, కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లు ఉంటాయి. కారు ‘చాసిస్’ తయారు చేసే కంపెనీకి కన్స్ట్రక్టర్ లభిస్తుంది. ప్రతి రేసులో డ్రైవర్లకు పాయింట్లు కేటాయిస్తారు. తొలి 10 స్థానాల్లో నిలిచిన వారికి పాయింట్లను విభజిస్తారు. అగ్రస్థానంలో నిలిచిన డ్రైవర్‌కు 25, తర్వాతి స్థానాల్లో వారికి వరుసగా 18, 15, 12, 10, 8, 6, 4, 2, 1 పాయింట్లు ఇస్తారు. ప్రతి కారుకు నంబర్ ఉంటుంది. గత సీజన్లో చాంపియన్‌గా నిలిచిన డ్రైవర్‌కు ‘నంబర్‌వన్’, అతని సహచరుడికి రెండో నంబర్‌ను ఇస్తారు. మిగిలిన ప్రతి జట్టుకు గత సీజన్లో కన్స్ట్రక్టర్ చాంపియన్‌షిప్‌లో నిలిచిన స్థానాలను బట్టి నంబర్లను జారీ చేస్తారు. {పధాన రేసు ఆరంభం ఇలా.... ఆదివారం జరిగే ప్రధాన రేసుకు నాలుగున్నర గంటల ముందు వార్మప్ ఉంటుంది. రేసు ప్రారంభమయ్యే అరగంట ముందు అన్ని కార్లు పిట్‌లైన్‌ను దాటుతాయి. ఈ సమయంలో వేగం చాలా తక్కువగా ఉంటుంది. స్టార్టింగ్ గ్రిడ్‌కు వచ్చిన తర్వాత ఇంజిన్‌ను ఆపేయాలి. పోటీ 15 నిమిషాలు ఉందనగా పిట్‌లైన్‌ను మూసివేస్తారు. 15 సెకన్ల ముందు అన్ని కార్లు గ్రిడ్‌ను వదిలి వెళ్లాలి. గ్రీన్ లైట్ వెలగగానే ఫార్మేషన్ ల్యాప్ మొదలవుతుంది. అది ముగిశాక తిరిగి గ్రిడ్ వద్దకు వచ్చి ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచుతారు. అన్ని కార్లు తమ ఆరంభ స్థానాల్లోకి వచ్చిన తర్వాత.. ముందుగా ఏర్పరిచిన పద్ధతిలో రేసు దానంతట అదే ప్రారంభమవుతుంది. ఐదు ఎర్ర లైట్లు ఒక దాని తర్వాత ఒకటి (సెకన్ వ్యవధి అంతరం) వెలుగుతాయి. తర్వాత ఒకేసారి ఈ లైట్లన్నీ వెలుగుతాయి. ఇదే రేసు ఆరంభానికి సూచిక. నలుగురు డ్రైవర్లు ప్రతి గ్రాండ్ ప్రిలో రెండు కార్లను పోటీకి దించాలి. కాబట్టి ఇందుకోసం ప్రతి జట్టు నలుగురు డ్రైవర్లను సిద్ధంగా ఉంచుకుంటుంది. ప్రాక్టీస్ కోసం అదనంగా మరో ఇద్దర్ని ఉపయోగిస్తారు. వీరందరికీ ‘సూపర్ లెసైన్స్’ ఉండాలి. గ్రాండ్ ప్రిలో బరిలోకి దిగాలంటే ఇది తప్పనిసరి. జూనియర్ మోటార్ స్పోర్ట్స్ విభాగంలో నైపుణ్యం, ఫార్ములావన్ కారును 300 కిలోమీటర్లు నడిపిన అనుభవంతో పాటు ఎఫ్-1 జట్టుతో కుదుర్చుకున్న ఒప్పందం, డ్రైవర్ గత చరిత్రను పరిగణనలోకి తీసుకుని వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఈ లెసైన్స్ జారీ చేస్తుంది. ఒక గ్రాండ్ ప్రి టోర్నీకి ప్రతి డ్రైవర్ సగటున 2 కిలోల బరువు తగ్గుతాడు. వేడి అధికంగా ఉంటే 1.2 లీటర్ల ఫ్లూయిడ్స్‌ను కోల్పోతాడు. 2010 నిబంధనల ప్రకారం ప్రతి జట్టు రెండు కార్లను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక్క సీజన్లో డ్రైవర్ ఎనిమిది ఇంజిన్ల కంటే ఎక్కువగా నడిపి ఉండరాదు. ఒకవేళ ఎక్కువ ఉపయోగిస్తే పది గ్రిడ్ల పెనాల్టీ విధిస్తారు. వరుసగా ఐదు ఈవెంట్లకు ఒకే ఒక్క గేర్‌బాక్స్‌ను ఉపయోగించాలి. గేర్‌బాక్స్ మార్చాల్సి వస్తే డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ఐదు స్థానాల పెనాల్టీ వేస్తారు. ఎకెల్ శకం... 1970లో బెర్నీ ఎకెల్‌స్టోన్ రాకతో ఎఫ్-1 కొత్త పుంతలు తొక్కింది. పక్క వ్యాపార ప్రణాళికలతో వేల కోట్ల రూపాయలను టర్నోవర్ చేస్తూ అత్యంత ఖరీదైన క్రీడగా మలిచాడు. దీని కోసం వినూత్నమైన పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. 1971లో ‘బ్రాబమ్’ జట్టును ఎఫ్-లోకి తేవడం ద్వారా కన్స్ట్రక్టర్ అసోసియేషన్‌లో స్థానం లభించింది. తర్వాత 1978లో ఎఫ్ఐఏ అధ్యక్షుడయ్యాడు. అప్పటిదాకా జట్ల, ఆటగాళ్ల ఆదాయ వ్యవహారాలను సర్క్యూట్ యజమానులే చూసుకునేవారు. దీనికి సంబంధించి ఓ సమగ్రత తేవాలన్న ఉద్దేశంతో ‘ఫార్ములావన్ టూ సర్క్యూట్ ఓనర్స్ ప్యాకేజీ (ఎఫ్ఓసీఏ)’ పద్ధతిని ఎకెల్‌స్టోన్ ప్రతిపాదించారు. ఏ జట్టును తీసుకోవాలన్నా.. వదులుకోవాలన్నా ప్యాకేజీ రూపంలో చెల్లించాలి. దీని ప్రకారం అడ్వర్టైజింగ్, స్పాన్సర్షిప్, రేసు నిర్వహణ, ట్రాక్‌ల నిర్మాణం, లెసైన్స్‌ల జారీ, డ్రైవర్ల కాంట్రాక్టులు, సాంకేతిక నిబంధనలు ఇలా అన్ని వ్యవహారాలతో కూడిన ప్యాకేజీ ఉంటుంది. దీంతో రేసు వ్యాపారం కళకళలాడుతోంది. చెకర్డ్ ఫ్ల్లాగ్ ఊపితే అడ్డు, నిలువు గీతలతో కూడిన చెకర్డ్ ఫ్లాగ్‌ను ఊపడం రేసు ముగింపుకు సంకేతంగా భావిస్తారు. రెడ్ ఫ్లాగ్‌ను వాడితే రేసు నిలిపి వేయాలని అర్థం. ఎల్లో ఫ్లాగ్ ప్రమాదాన్ని తెలుపుతుంది. ఒకసారి మాత్రమే ఎల్లో ఫ్లాగ్ ఊపితే కారు వేగం తగ్గించమని అర్థం. రెండుసార్లయితే వేగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు అవసరమైతే ఇంజిన్ ఆపి వేయడానికి సిద్ధంగా ఉండమని సూచన. గ్రీన్ కలర్ జెండా చూపితే ప్రమాదం తొలగిపోయిందని, నలుపు రంగు జెండాను ఏ నంబర్‌కు చూపితే ఆ కారు డ్రైవర్ వెంటనే పిట్ స్థానానికి రావాలని హెచ్చరించడం జరుగుతుంది. ఒక్కొసారి పోటీదారుడిని రేసు నుంచి తప్పించడానికీ ఉపయోగిస్తారు. స్టీవార్డులదే పెత్తనం పోటీల నిర్వహణకు ఎఫ్.ఐ.ఏ ఓ సాంకేతిక ప్రతినిధిని నియమిస్తుంది. ఇతను ఓ పోలీసులాగా పని చేస్తారు. ప్రాక్టీస్ సెషన్‌కు ముందు రోజు రేసులో పాల్గొనే కార్లు సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేవో పరీక్షించడం ఇతని పని. ఇందుకోసం అత్యంత అధునాతనమైన ఎలక్ట్రానిక్స్ ల్యాబోరేటరీ, సాంకేతిక పరికరాలు, నిపుణులతో జట్టు ఉంటుంది. ఇంజిన్, ఏరో డైనమిక్స్, టైర్లు, సస్పెన్షన్, ఇంధనం ఇలా ప్రతి విభాగాన్ని పరిశీలిస్తారు. స్పాట్ చెకింగ్స్ వీటికి అదనం. క్రికెట్ మాదిరిగానే ఎఫ్-1లో ముగ్గురు అంపైర్లు ఉంటారు. వీరిని ‘స్టీవార్డ్సు’ అంటారు. డ్రైవర్ చేసే తప్పిదాన్ని బట్టి స్టీవార్డు కారుకు ‘స్టాప్ అండ్ గో’ శిక్ష విధిస్తారు. దీని ప్రకారం డ్రైవర్ తన పిట్‌స్టాప్ వద్ద 10 సెకన్ల పాటు కారును నిలపాలి. ఈ సమయంలో ఇంధనం నింపుకోవడం, టైర్లను మార్చడం చేయరాదు. గుండెకాయ ‘చాసిస్’ ఫార్ములావన్ కారుకు ‘చాసిస్’ గుండెకాయలాంటిది.. చిన్నచిన్న విడి భాగాలను వేల బోల్ట్‌ల ద్వారా బిగిస్తారు. దీన్నంతటిని ‘మోనోకాక్ (మొత్తం కారు బాడీని ఒకే షీట్‌తో తయారు చేయడం)’ రూపంలో నిర్మిస్తారు. 1962లో లోటస్ కంపెనీ సాంప్రదాయక డిజైన్లను పక్కనబెట్టి అల్యూమినియం షీట్ ఆధారిత చాసిస్‌ను రూపొందించింది. ప్రస్తుత తరంలో పటిష్టమైన కార్బన్ సమ్మేళనాలను వాడుతున్నారు. రెసిన్లో పొందుపర్చిన స్పన్ కార్బన్ ఫైబర్స్‌ను అల్యూమినియం మెష్‌పై పోతగా పోస్తున్నారు. దీనివల్ల లైట్ వెయిట్, కఠినత్వం, గాలిలో సులువుగా పరుగెత్తే సామర్థ్యం పెరుగుతుంది. సింగిల్ డ్రైవర్ కూర్చోవడానికి వీలుగా కాక్‌పిట్, దాని చుట్టూ మందమైన బాడీ ఉంటుంది. డ్రైవర్ కొలతలకు సరితూగినట్లుగా సీట్‌ను ఏర్పాటు చేస్తారు. మిడ్ ఇంజిన్‌తో మొదలు... 1961లో మిడ్-ఇంజిన్‌తో కార్లు వచ్చాయి. 2006కు ముందు బలమైన 3-లీటర్ బీ10 ఇంజిన్‌ను వాడారు. కానీ ఎఫ్-1 నిబంధనలు మారడంతో ఇప్పుడు 2.4 లీటర్ వీ-8 ఇంజిన్‌ను వాడుతున్నారు. ఇది 900 హార్స్పవర్ శక్తిని విడుదల చేస్తుంది. 500 మైల్స్ పరుగెత్తిన తర్వాత ఇంజిన్‌ను పునర్నిర్మించాలి. ఒక్క కారు రెండు రేసులకు మాత్రమే ఉపయోగపడుతుంది. డ్రైవర్, ఫ్యూయెల్, కారు అన్నీ కలిపి మొత్తం బరువు 691 కేజీలు ఉండాలి. ఏడు సెకన్ల వ్యవధిలో కారు గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఓవరాల్‌గా కారు ‘ఇంజిన్ సామర్థ్యం, ఏరో డైనమిక్స్, సస్పెన్షన్, టైర్ల గ్రిప్’ ఇలా నాలుగు కీలక అంశాలపై ఆధారపడి పని చేస్తుంది. ట్రాక్‌పై కారు ఎంత వేగంతో పరుగెత్తించినా.... మలుపుల వద్ద పూర్తి కంట్రోలు ఉండేలా చూస్తారు. కారు ముందు, వెనుక ఉండే రెక్కలతో పాటు కింది భాగం నుంచి వచ్చే అధిక ఒత్తిడికి ఒక్కొక్కసారి కారు ట్రాక్‌పై నుంచి బయటకు వెళ్లిపోతుంది. అలా జరగకుండా కాపాడటానికి బాగా గ్రిప్ నిచ్చే టైర్లతో పాటు అధునాతన ఏరో డైనమిక్స్‌ను ఉపయోగిస్తారు. పిట్‌స్టాప్ వద్ద కారులో సెకన్‌కు 75 లీటర్ల ఇంధనం నింపుతారు. మంచి నీళ్లలా వేల కోట్లు రాకెట్ స్పీడ్‌తో కార్లు దూసుకుపోవాలంటే అంతకు రెట్టింపు వేగంతో డబ్బులు ఖర్చు చేయాలి. 2006 లెక్కల ప్రకారం రేసులో పాల్గొన్న 11 జట్లకు అయిన ఖర్చు అక్షరాలా 200.9 మిలియన్ డాలర్లు (దాదాపు 8030 కోట్ల రూపాయలు). ఇందులో టయోటా (418.5 మిలియన్ డాలర్లు), ఫెరారీ (406.5 మిలియన్ డాలర్లు)... ఇలా ప్రతి జట్టుకు బడ్జెట్ వేర్వేరుగా ఉంటుంది. ఎఫ్-1లోకి కొత్త జట్టు ప్రవేశించాలంటే 47 మిలియన్ డాలర్లు ఎఫ్.ఐ.ఏకు చెల్లించాలి. ఆదరణ అదరహో... భారత్‌లో ఇప్పుడు కాస్త అవగాహన పెరిగినా... యూరోప్‌లో ఎఫ్-1 అంటే పడి చస్తారు. గంటకు 320 కి.మీల స్పీడ్‌తో దూసుకుపోవడం నయనానందంగా అనిపిస్తుంది. ప్రత్యేక ట్రాక్‌ల నిర్మాణంతో పాటు కార్ల వైవిధ్యం.. వందల కి.మీల వేగానికి ప్రధాన కారణం. ఈ పోటీలను ప్రత్యక్షంగా లేక రికార్డు చేసిన టేపులను ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలోనూ వీక్షిస్తారని అంచనా. ప్రపంచంలో అత్యధిక ప్రేక్షకులను కలిగిన క్రీడగా ఎఫ్-1ను పరిగణిస్తారు. 2006 బ్రెజిల్ గ్రాండ్ ప్రి పోటీలో ఒక భాగాన్ని కనీసం 16 కోట్ల మంది తిలకించారు. ఇదే లెక్కన 2001 సీజన్లో జరిగిన ఏదో ఓ రేసును చూసిన వారందర్ని లెక్క కడితే 540 కోట్లుగా తేలింది. యుద్ధ సన్నాహమిది ఎఫ్-1 రేసుకు అన్నీ సకాలంలో సమకూర్చాలంటే పెద్ద యజ్ఞమే చేయాలి. ఒక్కో జట్టు ఏడాదిలో 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి రావడంతో సామాగ్రిని తరలించడం కత్తిమీద సామే. రేసింగ్ సామగ్రిని రోడ్డు, ఆకాశ, సముద్ర మార్గాల్లో తరలిస్తారు. సముద్ర మార్గంలో అయితే మూడు నెలల ముందే సామగ్రిని తరలిస్తారు. ఏడాదిలో జరిగే 19 గ్రాండ్‌ప్రిలలో ఒక్కొక్కసారి ఈవెంట్ల మధ్య వారం మాత్రమే విరామం ఉంటుంది. ఒక్కో జట్టు నాలుగు భారీ ట్రక్ల నిండా 25 టన్నులకు మించి సామగ్రిని తీసుకెళ్తుంది. యంత్ర, రక్షణ, దుస్తులతో పాటు ప్రతీ రేసుకు మూడు కార్లు అదనంగా రెండు చాసిస్‌లు తీసుకెళ్తారు. యూరోప్‌లో అయితే కొద్దిగా మేలుకానీ ఇతర దేశాల్లో రవాణా చాలా కష్టంతో కూడుకుంటుంది. అలాంటప్పుడు మేనేజ్మెంట్ ప్రత్యేక విమానాలను సమకూరుస్తుంది. వివిధ రేసులకు సామగ్రిల్లో కాస్త తేడా ఉంటుంది. కొన్నిసార్లు అవసరమైన సామగ్రి రేసు వేదికల్లో లభించకపోతే వాటిని ముందే అక్కడికి తరలించాల్సి వస్తుంది. 143కు పైగా సిబ్బంది, 18 కిరాయి కార్లు, సామాన్లతో కూడిన 11 ట్రక్లు, 19 రకాల విమానాల్లో ప్రయాణం, ఏడు నక్షత్రాల హోటల్లో 104 గదుల్లో బస.. ఇంత కార్యక్రమం జరిగితే 2006 హంగేరి గ్రాండ్ ప్రిలో బటన్ ట్రాక్‌పైకి వచ్చాడు. ప్రతి జట్టు వెంట కనీసం 65 నుంచి 75 వరకు సభ్యులు ఉంటారు. భారత్‌లో ‘బుద్ధ’ సర్క్యూట్ భారత్‌లో ఎఫ్-1 రేసుకు తలమానికంగా నిలిచిన బుద్ధ సర్క్యూట్‌ను జేపీ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ గ్రూప్ నిర్మించింది. దేశ రాజధాని న్యూఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలో గ్రేటర్ నోయిడా (గౌతమ్ బుద్ధ నగర్ డిస్ట్రిక్ట్)లో దీన్ని ఏర్పాటు చేశారు. 2011లో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి రేసుతో ప్రపంచవ్యాప్తంగా దీనికి గుర్తింపు వచ్చింది. 2500 ఎకరాల్లో ఉన్న జేపీ గ్రీన్ స్పోర్ట్స్ సిటీలో భాగంగా 874 ఎకరాల్లో ఈ సర్క్యూట్‌ను నిర్మించారు. 400 మిలియన్ డాలర్ల ఖర్చుతో 5.14 కిలో మీటర్ల సర్క్యూట్‌ను ప్రఖ్యాత జర్మన్ ఆర్కిటెక్చర్ హెర్మన్ టిల్కీ రూపొందించారు. ప్రస్తుతం దీని సీటింగ్ సామర్థ్యం 2 లక్షలు. ఎఫ్-1 డ్రైవర్ల సత్తాకు పరీక్షగా ఈ ట్రాక్ నిర్మాణం జరిగింది. జేపీ గ్రీన్ స్పోర్ట్స్ సిటీలో లక్ష మంది సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, 18 హోల్ గోల్ఫ్ స్టేడియం, 25 వేల మంది సామర్థ్యంతో ఫీల్డ్ హాకీ మైదానం, ఓ అధునాతన అకాడమీలను ఏర్పాటు చేయనున్నారు. మాల్యా ‘ఫోర్స్’ అక్టోబర్ 2007లో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... యూకేకు చెందిన ‘స్పైకర్ ఎఫ్-1 జట్టు’ను 90 మిలియన్ యూరోలకు కొనుగోలు చేశారు. భారత్ నుంచి లెసైన్స్ తీసుకుని ‘ఫోర్స్ ఇండియా ఫార్ములావన్ టీమ్’గా నామకరణం చేశారు. ఫోర్స్ కారు చాసిస్‌ను ‘వీజేఎం’గా పిలుస్తారు. ఎఫ్-1లో ఫోర్స్ జట్టు బరిలోకి దిగడంతో భారత్‌లో ఈ రేసులపై కాస్త అభిమానం ఏర్పడింది. 2011లో సహారా పరివార్ గ్రూప్.. ఫోర్స్‌లో 42.5 శాతం వాటా కొనుగోలు చేసింది. ఐదేళ్ల ఒప్పందంలో భాగంగా మెర్సిడెజ్ బెంజ్ ఫోర్స్‌కు వీజేఎం-2 ఇంజిన్, గేర్‌బాక్స్, హైడ్రాలిక్ వ్యవస్థ, కేఈఆర్ఎస్ ఫ్యూచర్స్‌ను సరఫరా చేస్తోంది. ముచ్చటగా మూడు రోజులు ఏ గ్రాండ్ప్రిలోనైనా రేసు మూడు రోజుల పాటు మూడు భాగాలుగా జరుగుతుంది. శుక్రవారం జరిగే ప్రాక్టీస్ రెండు సెషన్ల పాటు జరుగుతుంది. శనివారం క్వాలిఫయింగ్ రేసు ఉంటుంది. మూడు రౌండ్ల పాటు నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. క్యూ-1... 18 నిమిషాల పాటు జరుగుతుంది. వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసే డ్రైవర్లు రెండో రౌండ్‌కు అర్హత పొందుతారు. ఇందులో ఇద్దర్ని ఎలిమినేట్ చేస్తారు. 15 నిమిషాల పాటు జరిగే క్యూ-2లో 6 మందిని ఎలిమినేట్ చేస్తారు. క్యూ-3లో 10 గ్రిడ్ పొజిషన్లకు మిగిలిన 10 కార్లు పోటీపడతాయి. వేగవంతమైన ల్యాప్‌ను నమోదు చేసిన డ్రైవర్‌కు ‘పోల్ పొజిషన్’ లభిస్తుంది. ఫార్ములావన్‌కు సంక్షిప్త నామం ఎఫ్-1. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్ (ఎఫ్.ఐ.ఏ) ఆధ్వర్యంలో రేసులు జరుగుతాయి. ‘ఫార్ములా’ అంటే... ‘పోటీదారులందరితో పాటు అన్ని కార్లు తప్పక పాల్గొనే రేసుకు సంబంధించిన నిబంధనల సమాహారం’. సాధారణంగా ఎఫ్-1 సీజన్ మార్చిలో ఆరంభమవుతుంది. ఏడాది పొడవునా సిరీస్‌లా రేసులు జరుగుతాయి. వీటిని గ్రాండ్‌ప్రిలు అంటారు. ఫార్ములావన్‌లో భాగంగా ఆయా దేశాల పేరుతో ఈ గ్రాండ్ ప్రిలు రేసులను నిర్వహిస్తారు. ఒకే దేశంలో ఒకటి కంటే ఎక్కువ గ్రాండ్ ప్రిలు నిర్వహిస్తే ప్రత్యేక పేర్లు కేటాయిస్తారు. బ్రిటన్, జర్మనీ, స్పెయిన్‌లో రెండో గ్రాండ్‌ప్రి పోటీలను ‘యూరోపియన్ గ్రాండ్ ప్రి’గా వ్యవహరిస్తారు. -
సబ్‌ప్లాన్‌పై నీలినీడలు
అట్టహాసంగా చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది అమలులోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా.. ఇప్పటి వరకు ఎటువంటి నియమ, నిబంధనలు రూపొందించలేదు. సాధారణ నిధులు రూపాయి కూడా విడుదల చేయలేదు. సబ్‌ప్లాన్ నిధులు వస్తాయని భావించిన వివిధ ప్రభుత్వ శాఖలు ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించలేదు. ఫలితంగా జిల్లాలో ఆయా ఆవాసాల్లో మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేస్తుందోనన్న అనుమానాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం గత ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ను రూపొందించిం ది. సరైన విధి విధానాలు లేకుండానే గతేడాది జనవరి 24న ఈ చట్టానికి ఆమోద ముద్ర వేసింది. రూ. కోట్లు ఖర్చు పెట్టి జిల్లాలో దీనిపై ప్రచారం చేసింది. ఈ చట్టం వచ్చి సుమారు 16 నెలలు కావస్తోంది. రాష్ట్ర స్థాయిలో 26 శాఖలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు కాగితాల్లో ప్రకటించిన ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఇప్పటికీ పైసా విదల్చలేదు. సోషల్ వె ల్ఫేర్‌కు రూ.2170.28 కోట్లు, గ్రామీణాభివద్ధికి రూ.వెయ్యి కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.1050 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కు రూ.600 కోట్లు, హౌసింగ్‌కు రూ.600 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.350 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.200 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.100 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూ.453 కోట్లు, ఫ్యామిలీ వెల్ఫేర్‌కు రూ.311 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ.198 కోట్లు, విద్యుత్‌కు రూ.100 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.210 కోట్లు, ప్లానింగ్‌కు రూ.120 కోట్లు ఇలా 26 శాఖలకు మొత్తంగా 7927.45 కోట్లు మంజూరు చేసింది. సబ్‌ప్లాన్ వచ్చిన 9 నెలలు తరువాత చట్టం అమలు, నిధుల కేటాయింపులు, వాటిని ఏ విధంగా ఖర్చు చేయాలి వంటి విషయాల పర్యవేక్షణకు నవంబర్‌లో జిల్లా స్థాయి మోనిటరింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా ఐటీడీఏ పీవో, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను సభ్యులుగా చేర్చింది. చట్టం అమలుకు సంబంధించిన విధి విధానాలను ఇప్పటికీ పూర్తి స్థాయిలో రూపొందించలేదు. సౌకర్యాలు కొరవడిన ఎస్సీ, ఎస్టీ ఆవాసాలు జిల్లాలో దాదాపుగా 175 ఎస్సీ, 3696 ఎస్టీ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 693 కాలనీలకు రోడ్డు సదుపాయం లేదు. 390 ఆవాసాలు విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్నాయి. ఏజెన్సీలో 245 ఎస్టీ కాలనీలకు డ్రైనేజీ సదుపాయం లేక అధ్వానంగా ఉన్నాయి. 47 గ్రామాలకు తాగు నీటి సదుపాయం లేదు. ఇలా అనేక ఎస్సీ, ఎస్టీ హేబిటేషన్లు సదుపాయాలకు దూరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సబ్‌ప్లాన్ ద్వారా నిధుల కేటాయిం పులు జరిగితే ఈ గ్రామాలు అభివద్ధికి నోచుకుంటాయని ఎ స్సీ, ఎస్టీలు సంబరపడ్డారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ని ధులు కేటాయించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, పనులు ఒక్కటి కూడా ముం దుకు సాగలేదు. చట్టం రాకముందు సాధారణ నిధులలో కొం తైనా వీరి సంక్షేమానికి వినియోగించేవారు. ఈ సబ్‌ప్లాన్ అమలులోకి వచ్చిన తరువాత దీని కింద కేటాయింపులు జరగకపోవడం, సాధారణ నిధులను వీరి అభివద్ధికి వినియోగించకపోవడంతో ఎస్సీ, ఎస్టీల పరిస్థితి దయనీయంగా మారింది. -
నామినేషన్ వేసే ముందు ఇవి పాటించాలి
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఈ నెల 12న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, నిబంధనలు, విధివిధానాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించింది. లోక్‌సభకు, అసెంబ్లీకి పోటీ చేసే వ్యక్తికి నామినేషన్ వేసే చివరి తేదీ నాటికి 25 ఏళ్లు పూర్తి అయి ఉండాలి. లోక్‌సభకు డిపాజిట్ రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12,500 చెల్లించాలి. అసెంబ్లీకైతే రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు డిపాజిట్ చేయాలి. అభ్యర్థి గుర్తింపు గల రాజకీయపార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లయితే అదే నియోజకవర్గానికి చెందిన మరొకరు ప్రతిపాదించాలి. రిజిష్టర్డ్ పార్టీకి చెందిన వారు పోటీ చేసినట్లయితే 10 మంది ప్రతిపాదించాలి. లోక్‌సభకు ఫారం-2ఏ పూరించాలి. అసెంబ్లీకైతే ఫారం-2బీ పూరించాలి. బుద్ధిమాంద్యం గల వారు పోటీకి అనర్హులు. ఎన్నికల కమిషన్ అనర్హుల జాబితా ప్రకటించిన వారు పోటీకి అనర్హులు. గతంలో నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికల ఖర్చు వివరాలు తెలపని అభ్యర్థులు, అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి అనర్హులుగా తేలినవారు పోటీకి అనర్హులు. రూ.10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపరు మీద అఫిడవిట్లు తయారు చేసి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ లేదా నోటరీ ద్వారా ధ్రువీకరించాలి. అలాగే రెండు రకాల అఫిడవిట్లు దాఖలు చేయాలి. అఫిడవిట్లో ఫొటో తప్పనిసరిగా అతికించాలి. అందులో ప్రతి కాలాన్నీ పూరించాలి. అభ్యర్థికి సంబంధించిన కేసుల వివరాలు, కుటుంబ సభ్యుల కేసుల వివరాలు ఫారం-1లో తప్పనిసరిగా పొందుపర్చాలి. ఫారం-26లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు పూరించాలి. పాన్‌కార్డు, స్థిర చరాస్తులు కనబర్చాలి. ఆదాయపుపన్ను చెల్లింపు వివరాలు అందజేయాలి. విద్యార్హతలు తప్పనిసరిగా నమోదు చేయాలి. పోటీ చేస్తున్న అభ్యర్థి నియోజకవర్గ ఓటరు జాబితాలో ఉన్నట్లు తహశీల్దార్ ద్వారా సర్టిఫైడ్ ఓటరు కాపీ అందజేయాలి. పార్లమెంట్ అభ్యర్థులు రూ.70లక్షల వరకే ఖర్చు చేయాలి. అసెంబ్లీ అభ్యర్థులైతే రూ.28లక్షల లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోటీ చేసే ప్రతి అభ్యర్థీ కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. నామినేషన్ తరువాత నుంచి అభ్యర్థి ఖాతాలో ఎన్నికల ఖర్చు నమోదు చేయాలి. అంతకు ముందు వరకు రాజకీయ పార్టీ ఖర్చులో నమోదు చేయాలి. స్టార్ క్యాంపెయిన్ (ప్రముఖులు) ప్రచారానికి వచ్చినప్పుడు పోటీ చేస్తున్న వారు నలుగురు అభ్యర్థులు లేదా పది మంది అభ్యర్థులు వారి వెంట ఉన్నట్లయితే ఆ ఖర్చులో అందరికీ సమానంగా ఎన్నికల ఖర్చులో నమోదు చేస్తారు. అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతించాలి. 100 మీటర్లలోపు 3 వాహనాలను మాత్రమే అనుమతించాలి. -
ప్రచారానికి తెర.. ప్రలోభాలతో ఎర
సాక్షి, నల్లగొండ,మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో యథేచ్ఛగా అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఓ వైపు పోలీసులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా గుట్టుచప్పుడు కాకుండా అభ్యర్థులు తమ పని చేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల ప్రచార తీరును చూస్తే... అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉందా అన్న సందేహం కలగకమానదు. ప్రచారానికి శుక్రవారం చివరిరోజు కావడంతో ఆయా పార్టీల ప్రధాన నేతలు ఓటర్లను కలిసి అభ్యర్థించారు. ప్రతి వార్డులో పెద్ద ఎత్తున ర్యాలీలతో హోరెత్తించారు. పలుచోట్ల రోడ్‌షోలు నిర్వహించారు. పల్లెల నుంచి కూలీలను తీసుకొని ప్రచారం లో నిమగ్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జులు అభ్యర్థుల తరఫున ప్రచారం కొనసాగించారు. ఇంకోవైపు గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు, మద్యం ముట్టజెప్పారు. పోటీ గట్టిగా ఉన్న చోట, చైర్మన్ పీఠం ఆశిస్తున్న నేతలు ఒక్క ఓటుకు రూ.4 వేలు ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదు. మిగిలిన చోట్ల హీనపక్షం రూ. వెయ్యి ముట్టజెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్న మద్యాన్ని ఎన్నికలకు కొన్ని గంటల ముందు వరద పారించేందుకు అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. సర్దుబాటు... రెబల్ అభ్యర్థులున్న చోట బుజ్జగింపులు జరుగుతున్నాయి. వీలైతే ఆర్థికంగా సహాయపడతామని హామీ ఇస్తున్నారు. దీంతో కొంతమంది అభ్యర్థులు సద్దుమణిగినట్లు సమచారం. వీరికి పడాల్సిన ఓట్లన్నీ.. పార్టీ అభ్యర్థులకు వేసే బాధ్యతలను కూడా రెబల్ అభ్యర్థుల భుజానే వేసినట్లు వినికిడి. కోడ్ ఉల్లంఘన.... అభ్యర్థులు అడుగడుగునా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. అక్రమాల పర్వానికి తెరతీశారు. ముఖ్యం గా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆయా పార్టీలు దాదాపు నాలుగైదు వందల మందితో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. వాస్తవంగా ర్యాలీలు తీయడానికి పోలీసుల అనుమతి తీసుకున్నా.. కొద్దిపాటి మందికే పరిమితం కావాలి. డబ్బు.. మద్యంతో గాలం.. జిల్లాకేంద్రంలో మెజార్టీ వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. అధికార యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించినా అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని ముందుగానే నిల్వ చేసుకున్నారు. తమ నివాసాల్లో మద్యం ఉంటే పట్టుబడతాయన్న ముందుచూపుతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో భద్రపరుచుకున్నారు. సూర్యాపేటలో ఒక్కో ఓటుకు అత్యధికంగా రూ.5 వేలు ఇస్తామని అభ్యర్థులు ఆశచూపారు. చైర్ పర్సన్ పీఠం కోసం బరిలో ఉన్న నాయకులు ఎంతైనా ఇవ్వడానికి వెనకాడడం లేదు. ప్రధాన పార్టీలు పోటాపోటీగా డబ్బు పంచడంలో తలమునకలయ్యాయి. దీనికి తోడు వెండి బరిణెలు, బిర్యానీ, ఒక మద్యం ఫుల్ బాటిల్ ముట్టజెప్పారు. ఓ వార్డులో ఐదు ఓట్లకు కలిపి ఫ్రిజ్ అందజేశారని సమాచారం. భువనగిరిలో ఓటుకు గరిష్టంగా రూ.3 వేలు చెల్లిస్తున్నారు. ఐదారు వార్డుల్లో హోరాహోరీగా పోటీ ఉండడంతో గెలుపు కోసం అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచుతున్నారు.మిర్యాలగూడలో ఓ పార్టీ నాయకులు కర్ణాటక నుంచి మద్యం దిగుమతి చేసుకున్నారు. ఆ పార్టీ అనుయాయుల ఇళ్లలో నిల్వ చే శారు. వీరు ఓటర్లకు పంచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఇస్తున్నారు.కోదాడలో నాలుగు రోజుల నుంచే మద్యం అందజేస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ. 2500 వరకు అప్పజెప్పుతున్నారు. కుంకుమ బరిణెలు, ముక్కు పుడకల పంపిణీ పరిపాటిగా మారింది. హుజూర్‌నగర్‌లో ఎక్కడా చూసినా నోట్ల కట్టలు, మద్యం బాటిళ్లే దర్శనమిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో కొత్త కళ సంతరించుకుంది. ఇక్కడ అధికార పార్టీకి, విపక్షాలకు చావోరేవో అన్నట్లుగా ఉంది. విపక్షాలు ఏకం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీంతో డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఓటుకు గరిష్టంగా రూ. 3 వేలు ఇచ్చేస్తున్నారు. దేవరకొండలోనూ అభ్యర్థులు పోటాపోటీగా తలపడుతున్నారు. ఒక్కో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. -
పరీక్ష పెడుతున్న నిబంధనలు!
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మరింత పారదర్శకత, నాణ్యమైన నిర్వహణ కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన నిబంధనలు విద్యార్థులకు శాపంగా మారాయి. పరీక్షా పత్రాల పంపిణీకి తక్కువ సమయం కేటాయించడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రశ్నపత్రాలు పంపిణీ చేయవలసిన సమయం తగ్గించడం వల్ల ఇటు విద్యార్థులు, అటు నిర్వాహకులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్ష ప్రారంభానికి కేవలం 30 నిమిషాల ముందు మాత్రమే ప్రశ్నపత్రాల బండిళ్లను పోలీసుస్టేషన్ నుంచి తీసుకు వెళ్లవలసి ఉంది. పశ్నపత్రాలను విద్యార్థికి ఇచ్చిన రెండు నిమిషాల ముందు మాత్రమే బండిళ్ల సీల్‌ను ఓపెన్ చేయాలి. అయితే ఈ నిబంధనలను అమలు చేసేం దుకు సమయం ఏమాత్రం సరిపోవడం లేద ని నిర్వాహక సిబ్బంది వాపోతున్నారు. సమీప పోలీసుస్టేషన్ నుంచి తీసుకురావడానికి కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుందని చెబుతున్నారు. ముందుగా తీసుకొచ్చినా ఉదయం 9 గంటలకు రెండు నిమిషాల ముందు మాత్రమే విద్యార్థులకు ప్రశ్నపత్రాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే పత్రాల సీల్ ఓపెన్ చేసి పరీక్షా కేంద్రంలోని రెండు నిమిషాల్లో అన్ని గదుల విద్యార్థులకు పంపిణీ చేయడం సాధ్యమయ్యే పనికాదని అంటున్నారు. చివర ఉన్న గదుల్లో పంపిణీ చేసేసరికి 5 నుంచి 10 నిమిషాల సమయం దాటిపోతుంది. దీంతో విద్యార్థులకు చివర్లో సమయం చాలడం లేదు. పరీక్ష చివరిలో అదనంగా సమయాన్ని ఇచ్చే అధికా రం స్థానిక అధికారులు ఉన్నా... సమయాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ముగిసిన సంస్కృతం, హిందీ పరీక్షలకు గదిలో అందరూ ఒకేసబ్జెక్ట్కు చెందిన వారు పరీక్ష రాశారు. దీంతో సమస్య అంతజటిలం కాలేదు. అయితే రానున్న రోజుల్లో 4 గ్రూప్ సబ్జెక్టులకు చెందిన ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల పేపర్లు ప్రతి గదిలోనూ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కుదించిన సమ యం విద్యార్థులకు శాపంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రెండో రోజు 92 శాతం హాజరు జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండో రోజు గురువా రం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 69 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సర సంస్కృతం, తెలుగు పరీక్షలు జరిగాయి. ద్వితీయ సం వత్సరానికి చెందిన 22,135 మంది విద్యార్థులలో 92 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో సాధార ణ కోర్సుల ఇంటర్ విద్యార్థులు 17,997 (95.3 శాతం) మంది హాజరయ్యారు. అదేవిధంగా వృత్తి విద్యాకోర్సు ఇంటర్ విద్యార్థులు 2,893 మంది విద్యార్థులు మాత్ర మే హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆర్ఐఓ ఎల్ఆర్ బాబాజీ ‘న్యూస్‌లైన్’కి తెలిపారు. -
గీత దాటితే వాతే..!
సాక్షి, ముంబై: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై నిబంధనలను అతిక్రమించేవారి ఆగడాలకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర హైవే పోలీసులు భారీ కసరత్తే చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించినవారిపై రూ.800 జరిమానా విధించాలని నిర్ణయించారు. 94 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిపై క్రమశిక్షణ పాటించనివారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ మార్గంపై పోలీసులను మోహరించడమేకాకుండా వైర్లెస్ ఇంటర్నెట్ పరికరాలు, ఇతర సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. మాల్వాణి, పన్వేల్, రసయాని, భట్నే గ్రామాలలో వాహన దారులు క్రమశిక్షణ పాటించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. అయితే వాహన నిబంధనలు ఉల్లఘించిన వారికి మోటాలు వాహనాల చట్టం ప్రకారం.. రూ.800 జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా లైన్ కటింగ్ చేసిన వారికి రూ.100 జరిమానా విధించనున్నారు. మితిమీరిన వేగంతో నడిపిన వారి నుంచి రూ.200, నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వారి నుంచి రూ.500 జరిమానాగా వసూలు చేయనున్నారు. ఇదిలాఉండగా కుడివైపు ఉన్న లేన్ ఓవర్ టేక్ చేసే వారి కోసం కేటాయించగా, కుడి వైపు ఉన్న లైన్ భారీ వాహనాలకు, మధ్య లైన్‌ను ఇతర వాహనాలకు కేటాయించినట్లు పుణే జిల్లా కలెక్టర్ జారీ చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది. సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (హైవే) దిలీప్ భుజ్‌బల్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోజుకు సగటున 34,000 వాహనాలు నడుస్తూ ఉంటాయన్నారు. ఇందులో 80 శాతం వాహనదారులు క్రమశిక్షణను పాటించడం లేదనే విషయం తమ పరిశీలనలో వెల్లడైందని చెప్పారు. దీంతో ఈ హైవేపై ఘోరమైన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, మోటార్ వెహికల్ చట్టం ప్రకారం.. ప్రస్తుతం ఫామ్‌లో లేన్ కట్టింగ్‌కు సంబంధించి స్పష్టమైన చట్టాలు లేవని, దీంతో హైవే, ఎక్స్‌ప్రెస్ హైవేపై వివిధ వాహనాలు లేన్ నిబంధనలు పాటించడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్‌కు అందజేసిన నివేదికలో స్పష్టంగా తెలియజేశామని భుజ్‌బల్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా లైన్ కట్టింగ్లపట్ల డ్రైవర్లకు, వాహన యజమానులకు అవగాహన కల్పించేందుకు లేన్ డిసిప్లిన్ డ్రైవ్‌ను చేపట్టామని, కొన్నిరోజుల తర్వాత నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానా విధిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్ హైవేపై 38 ఓవర్ బ్రిడ్జలు ఉన్నాయి. లేన్ డిసిప్లిన్ గురించి అక్కడక్కడ ఫ్లెక్సీ బోర్డులను అమర్చనున్నారు.అంతేకాకుండా ఠాణే, పుణే రీజియన్లలో స్పీడ్ గన్లను ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకొని ఉన్న సీసీటీవీ కెమెరాలను ఈ మార్గాలపై ఏర్పాటు చేయనున్నారు. దీంతో నిబంధనలు అతిక్రమించిన వారిని సులువుగా పట్టుకునే వీలు ఉంటుంది.