సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలపై అప్పీళ్ల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ వారి అర్జీల పరిష్కారానికి విధి విధానాలను ఖరారు చేసింది. ఈమేరకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలిలా ఉన్నాయి..
► ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను సకాలంలో మంజూరు చేయాలి
► క్రమశిక్షణ చర్యలపై అర్జీలను వెంటనే పరిష్కరించాలి
► సిక్ లీవుకు సంబంధించిన జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మంజూరు చేయాలి
► ఉద్యోగులపై దాడికి పాల్పడ్డవారిపై సత్వరం కఠిన చర్యలు తీసుకునేలా పర్యవేక్షించాలి
► కేఎంపీఎల్, ఈపీకేలపై ఉద్యోగులను కౌన్సెలింగ్‌కు పంపించడం నిలిపివేయాలి
► తక్కువ రాబడి వచ్చే బస్ షెడ్యూళ్లను రీ షెడ్యూల్ చేయాలి
► బీఎస్ 4, బీఎస్ 6 వాహనాల వీల్‌బోల్ట్ మెషిన్లు, మయాటిక్ గన్స్, ఎలక్ట్రికల్ పరికరాలను అన్ని గ్యారేజీలలో అందుబాటులో ఉంచాలి
► ఉద్యోగులు పనిచేసే ప్రదేశాలు, భోజనశాలలు పరిశుభ్రంగా ఉంచాలి
► మూడు, నాలుగు షెడ్యూళ్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి
► వైఫల్యాలను కారణంగా చూపుతూ గ్యారేజ్ ఉద్యోగులను బదిలీ చేయకూడదు
► తగిన శిక్షణ లేకుండా డ్రైవర్లకు టిమ్ డ్యూటీలను అప్పగించకూడదు
► జీతాల కోత విధిస్తూ సెలవులు మంజూరు చేయకూడదు.
Comments
Please login to add a commentAdd a comment