service
-
వస్తు ఎగుమతులను సేవలు అధిగమించాలి
న్యూఢిల్లీ: సేవల రంగం ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 450 బిలియన్ డాలర్లను (సుమారు రూ.39లక్షల కోట్లు) చేరుకోవాలని.. తద్వారా వస్తు ఎగుమతుల విలువను అధిగమించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ లక్ష్యంతో పనిచేయాలని పరిశ్రమకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వస్తు ఎగుమతులు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. కనుక సేవల రంగం ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 385–390 బిలియన్ డాలర్ల నుంచి 2025–26లో 450 బిలియన్ డాలర్లను చేర్చేందుకు పరిశ్రమ కృషి చేయాలని కోరారు.2023–24లో సేవల ఎగుమతులు 341 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో సేవల ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 14 శాతం పెరిగి 355 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో వస్తు ఎగుమతులు 3.1 శాతం క్షీణించి 437 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో మరింత పెద్ద లక్ష్యాలతో పనిచేయాలంటూ ‘నాస్కామ్ గ్లోబల్ కన్ఫ్లూయెన్స్’ ఆరంభ సమావేశంలో భాగంగా మంత్రి పరిశ్రమకు పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ఐపీవోకు ఫిజిక్స్వాలాజీసీసీల తోడ్పాటు..దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) పెద్ద ఎత్తున ఏర్పాటవుతుండడం, కొత్త టెక్నాలజీలతో సేవల ఎగుమతుల్లో ఏటా 15–18 శాతం వృద్ధి సాధించగలమన్నారు. దేశంలో 1,650 జీసీసీలు పనిచేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పర్యాటకం, ఫైనాన్షియల్ రంగాల్లో అవకాశాలు దేశ సేవల ఎగుమతుల్లో 200 బిలియన్ డాలర్ల మేర ఐటీ, ఐటీ సంబంధిత సేవలే ఉన్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. అదే సమయంలో పర్యాటకం, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోనూ సేవల ఎగుమతుల వృద్ధికి పెద్ద మొత్తంలో అవకాశాలు రానున్నట్టు చెప్పారు. అయినప్పటికీ సేవల ఎగుమతుల్లో ఐటీ, ఐటీఈఎస్ ముందుంటాయన్నారు. క్లయింట్ లొకేషన్ నుంచి కాకుండా, మారుమూల ప్రాంతాల నుంచి మరిన్ని సేవలను అందించడంపై ఐటీ పరిశ్రమ దృష్టి పెట్టాలని కోరారు. దీనివల్ల పోటీతత్వం పెరిగి, వ్యయాలు తగ్గుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, భారత్‌లో వేతనాలు చెల్లించడం ఇందులో ఉన్న మరో ప్రయోజనంగా పేర్కొన్నారు. -
దివ్యాంగుల్లో కొత్త వెలుగులు, మన ‘సారా’ సేవకే అంకితం
తమ కోసం ఏదైనా పని చేసుకుంటే స్వార్థం.. అదే సమాజం కోసం చేస్తే సేవ. ఇందులోనూ ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. కొంత మంది వృద్ధులకు సహాయం చేస్తే, మరి కొందరు అనాథలకు, పేద పిల్లలకు సహకారం అందిస్తారు. ఇలా పేద విద్యార్థులు, దివ్యాంగులు, అనాథ వృద్ధుల సంక్షేమం కోసం పరితపిస్తూ, తనకు తోచిన సేవలు అందించడమే కాకుండా, తన లాంటి ఎంతో మందికి దక్సూచిలా నిలుస్తున్నారు. అంగవైకల్యం కలిగిన వారికి భరోసా కల్పిస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయూతనిస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 200 మంది విద్యార్థులు, 150 మంది దివ్యాంగులకు అండగా ఉన్నారు డాక్టర్ సారథామురుగన్. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు ఈ సేవకురాలు.. – అడ్డగుట్ట కేరళకు చెందిన ఈమె పదిహేను ఏళ్ల క్రితం నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లోని తన బంధువులతో కలిసి ఉంటున్నారు. మొదట ఐటీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగించిన సారా అనంతరం, ఉద్యోగం మానేసి పేద విద్యార్థులు, దివ్యాంగుల సేవకు 2016లో సెవెన్ రేస్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె సేవలను గుర్తించి ఇటీవల డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెలలో మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు డాక్టర్ సారా. దివ్యాంగుల్లో స్ఫూర్తి నిపుతూ.. దివ్యాంగుల్లో స్ఫూర్తిని నింపి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తోంది. సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులతో చిరు వ్యాపారాలు పెట్టించడం, కుట్టు మిషన్లు పంపిణీ వంటి ఉపాధి మార్గాలను కల్పిస్తున్నారు. మురికివాడల్లోనూ, రోడ్లపైనా ఎలాంటి ఆసరా లేని వారికి ఆహారం పంపిణీ చేస్తారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కుట్టు మిషన్లతో పాటు 200 వీల్ చైర్లు పంపిణీ చేశారు. 30 వేల గ్రాసరీ కిట్ల పంపిణీ.. కోవిడ్ మహమ్మారి సమయంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు సెవెన్ రేస్ ఫౌండేషన్ ద్వారా 30 వేల నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఎంతో ముఖ్యమైన ఆక్సిజన్ సిలిండర్లు కూడా సప్లై చేశారు. సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎందరికో అండగా నిలిచారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం.. ప్రస్తుత సమాజంలో ధనిక, పేద అనే భేదాలు లేకుండా ఉండాలంటే అది విద్యతోనే సాధ్యమని నమ్ముతాను. అందుకే మా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు, వికలాంగులకు సహాయ సహకారాలు అందించే దాతల సహాయంతో విద్యార్థులను చదివిస్తాం. ఇటీవల బాబా సాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం గర్వంగా ఉంది. – డాక్టర్ సారా, సెవెన్ రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పేదలకు ఉన్నత విద్య లక్ష్యంగా..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించేందుకు సారా నిరంతరం శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఓల్డ్ సఫీల్‌గూడ, మౌలాలి ప్రాంతాల్లోని 6 ప్రభుత్వ పాఠశాలను సెవెన్‌రేస్ ఫౌండేషన్ దత్తత తీసుకుంది. ప్రతి ఏడాదీ ఉచితంగా నోటు పుస్తకాలు, స్టేషనరీ, విద్యారి్థనులకు శానిటరీ కిట్స్ పంపిణీ చేస్తుంటారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సెవెన్‌రేస్ సంస్థ సొంతంగా చదివిస్తుంది. -
ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్
ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నాము. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నా కుమార్తె ఆండ్రాయిడ్ ఫోన్లో కంటే.. నా యాపిల్ ఐఫోన్లో రైడ్ ధర ఎక్కువగా చూపిస్తోందని 'సుధీర్' అనే ఎక్స్ (Twitter) యూజర్ పేర్కొన్నాడు. బుక్ చేసుకునే టైమ్, దూరం, డిమాండ్ వంటి వాటిని బట్టి ధరలలో మార్పు ఉంటుంది. కానీ బుక్ చేసుకునే మొబైల్ ఫోన్‌ను బట్టి ఛార్జీలు ఉండవని ఉబర్ వెల్లడించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024మొబైల్ ఛార్జ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రేటుగతంలో ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది.ఒక ఐఫోన్లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ.1,498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ.1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!ఈ కామర్స్ సైట్లలో..సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. కానీ సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.Android vs iOS - different prices on @Flipkart App??same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024 -
‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!
ఒకరోజు శ్రీరంజనికి తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ ట్యాక్సీ బుక్ చేయాల్సి వచ్చింది. పురుష డ్రైవర్ వెనుక కూర్చొని ప్రయాణించడానికి ఆమె పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ‘ఎవరైనా చూస్తారేమో...ఏమైనా అనుకుంటారేమో’ ‘ఈ డ్రైవరు ఉన్నట్టుండీ అసభ్యంగా ప్రవర్తిస్తాడేమో...’ ఇలా ఎన్నో ఆలోచనలతో ఆమె ప్రయాణం అత్యంత భారంగా గడిచింది. ఇప్పుడు శ్రీరంజనిలాంటి మహిళలకు బైక్ ట్యాక్సీ ప్రయాణం భారం కాబోదు...‘పింక్’ యాప్‌లో బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లు మాత్రమే వస్తారు. ‘పింక్’ ద్వారా మహిళల సౌకర్యం, భద్రతా అనేది ఒక కోణం అయితే ఎంతోమంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారనేది మరో కోణం. చెన్నై నగరంలో ఎంటీసీ బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్లు, ఎంఆర్టీఎస్ రైళ్లు, మెట్రో రైలులాంటి రవాణా సేవలు ఉన్నా, ఆటో, ట్యాక్సీల మీద ఆధారపడే ప్రయాణీకులు కూడా ఎక్కువే. ఆయా సంస్థల యాప్‌లలో బైక్ టాక్సీ కోసం బుక్ చేస్తే పురుషు డ్రైవర్లే ఎక్కువగా వచ్చేవారు. వారి వెనుక కూర్చుని ప్రయాణించడం మహిళలకు అసౌకర్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో ‘పింక్’ బైక్‌లు వారి చింతను దూరం చేసి నిశ్చింతగా ప్రయాణం చేసేలా చేస్తున్నాయి. ప్రముఖ బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ‘ర్యాపిడో’ చెన్నైౖలో ‘బైక్ పింక్’ను ప్రారంభించింది. ‘బైక్ పింక్ సర్వీస్ అనేది మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించాం. ఇది మహిళా ప్రయాణికులకు భద్రతను ఇవ్వడమే కాదు, ఎంతో మంది మహిళలకు డ్రైవర్లుగా ఉపాధిని ఇస్తుంది’ అని ‘ర్యాపిడో’ ప్రకటించింది. మహిళా డ్రైవర్లను ‘వుమెన్ కెప్టెన్’గా వ్యవహరిస్తారు. ర్యాపిడోతోపాటు ఉబర్, వోలలాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా మహిళలు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు.అనకాపుత్తూరుకు చెందిన మంగ ఉమెన్ కెప్టెన్. ఆమెకు ఐదేళ్ల కుమార్తె ఉంది. పాపను ఉదయం స్కూల్‌కు బైక్‌పై డ్రాప్ చేసిన తర్వాత ఆమె పని మొదలవుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు బైక్ రైడింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఇంటి పనుల్లో నిమగ్నమైపోతుంది. కొన్నిసార్లు రాత్రి 9 గంటల వరకు బైక్ రైడింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో పాపను తన తల్లి ఇంటి దగ్గర వదలి పెట్టి వస్తుంది. తొమ్మిది గంటలకు రైడింగ్ యాప్‌ను ఆఫ్ చేస్తుంది. ఒక క్లాత్‌స్టోర్‌లో పనిచేసిన శ్వేత జీతం సరిపోకపోవడంతోబైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. రోజుకు రూ. 1000 వరకు సంపాదిస్తోంది. ‘మొదట్లో నేను చేయగలనా? అని భయపడ్డాను. ఎంతోమంది ఉమెన్ బైక్ ట్యాక్సీ డ్రైవర్లతో మాట్లాడాను. వారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు’ అంటుంది శ్వేత. ఇక మహిళా డ్రైవర్ల దారి రహదారేనా! కావచ్చేమో కాని... ఆ దారిలో రకరకాల అడ్డంకులు వస్తుంటాయి. ‘ఒక ప్రయాణికుడు కావాలని పద్నాలుగు సార్లు నా బైక్ బుక్ చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి సంస్థకు ఫిర్యాదు చేస్తే తక్షణం అతడి ఖాతాను రద్దు చేశారు’ అంది ఒక మహిళా డ్రైవర్. ‘డ్రైవింగ్ సమయంలో మేము అభద్రతగా ఫీల్ అయితే సంస్థకు ఫిర్యాదు చేసే, పోలీసులను సంప్రదించే వీలు ఉంది’ అంటుంది మరో మహిళా డ్రైవర్. కొందరు పురుష ప్రయాణికులు మహిళా డ్రైవర్‌ను చూడగానే తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. ‘డ్రైవర్ మహిళ అనే విషయం తెలియక బుక్ చేశాను. సారీ’ అంటూ ప్రయాణాన్ని ఆకస్మికంగా రద్దు చేసుకుంటున్నారు. మహిళలు సరిగ్గా డ్రైవ్ చేయరనేది అనేది వారి అపోహ. ఇలాంటి అపోహల అడ్డుగోడలను కూల్చేస్తూ, లింగ వివక్షతను సవాలు చేస్తూ విమెన్ కెప్టెన్ల బండి వేగంగా దూసుకుపోతోంది.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై (చదవండి: అగ్గిపుల్లలాంటి ఆడపిల్లకు ఫైర్‌తో భయం ఏమిటి..?) -
Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్ బంద్
రాంచీ: జార్ఖండ్‌లో నేడు (శనివారం) రేపు (ఆదివారం) ఐదు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (జేజీజీజీఎల్‌సీసీఈ)దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది.పరీక్ష సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకే శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని, అలాగే ఆదివారం కూడా ఇదే పరిమితి కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా పరీక్ష ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రత్యేకంగా చర్చించారు. పరీక్ష సమయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సోరెన్ హెచ్చరించారు. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాష్ట్రంలోని 823 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తుండగా, దాదాపు 6.39 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని సంబంధిత అధికారి తెలిపారు.జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ ‘ఇప్పుడే సీనియర్ అధికారులతో మాట్లాడి, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాను. అధికారులకు అవసరమైన మార్గదర్శకాలను అందించాను. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు’ అని దానిలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకం -
24 గంటలు ఓపీ వైద్యసేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతాలో యువ పీజీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపి వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర వైద్య సేవలను మినహాయించింది. కోల్‌కతాలో వైద్యురాలి హత్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నేత డాక్టర్ నరహరి తీవ్రంగా ఖండించారు.శనివారం తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా అవసరమైతే ఒక గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలన్నారు. కోల్‌కతా ఘటనను తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల ఖండించారు. జూడాలు చేస్తున్న ధర్నాలకు హాజరు కావాలని నిర్ణయించామన్నారు. మంత్రి దామోదర సంఘీభావం డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ఒక ప్రకటనలో సంఘీభావం తెలిపారు. డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని ఆయన ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. ఇందిరా పార్కు వద్ద నేడు ధర్నా సుల్తాన్‌బజార్: మహిళా వైద్యురాలిపై అత్యాచారం,హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి.కాళీప్రసాద్‌రావు డాక్టర్ జె.విజయరావులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కూడా ధర్నాను విజయవంతం చేయాలన్నారు.నల్లబ్యాడ్జీలు ధరించి నేడు నిరసన వ్యక్తం చేయాలన్న నర్సుల సంఘంఉత్తరాఖండ్లో నర్సింగ్ ఆఫీసర్‌పై అత్యాచారం, హత్య, షాద్‌నగర్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నర్సింగ్ ఆఫీసర్‌పై జరిగిన దాడితోపాటు కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను తెలంగాణ ప్రభుత్వ నర్సుల సంఘంప్రధాన కార్యదర్శి మరియమ్మ తీవ్రంగా ఖండించారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ తమ షిఫ్ట్ డ్యూటీలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
అయోధ్య: నేటి నుంచి మరో 20 మంది పూజారుల సేవలు
అయోధ్య: రామనగరి ఆయోధ్యలో నేటి నుంచి (జూలై 1) మరో 20 మంది పూజారులు సేవా విధుల్లో చేరారు. వీరికి బాధ్యతలు అప్పగించే ముందు వివిధ పూజలకు సంబంధించిన శిక్షణ అందించారు. ఇకపై వీరు ఇప్పటికే నియమితులైన పూజారులతో పాటు పూజాదికాలు నిర్వహించనున్నారు. నూతనంగా చేరిన పూజారులకు డ్రెస్ కోడ్ కూడా జారీ చేశారు. రామాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇతర సిబ్బందికి కూడా త్వరలోన్ డ్రెస్ కోడ్ జారీ చేయనున్నారు.ఈ సందర్భంగా సహాయక పూజార్ అశోక్ మాట్లాడుతూ 20 మంది పూజారులకు ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని తెలిపారు. అరంతరం నియామక పత్రాలు అందజేశారన్నారు. ఒక్కో ఉన్నతస్థాయి పూజారి దగ్గర కొత్తగా నియమితులైన ఐదుగురు పూజారులు విధులు నిర్వహించనున్నారన్నారు. పూజారులెవరూ ఆండ్రాయిడ్ ఫోన్లను ఆలయంలోనికి తీసుకురాకూడదనే నిబంధన విధించారన్నారు.రామాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్ గుప్తా మాట్లాడుతూ కొత్త పూజారులకు శిక్షణ పూర్తయ్యిందని, వీరంతా ఇకపై ఆలయంలో జరిగే పూజాదికాలలో పాల్గొంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మరికొన్ని ఆలయాలు నిర్మితం కానున్నాయని, వాటిలో కూడా పూజారుల అవసరం ఉంటుందని అన్నారు. ఆలయ పూజారులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఇవ్వడం ద్వారా భక్తులు వారిని సులభంగా గుర్తు పట్టగలుగుతారన్నారు. -
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా'.. తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పెద్ద ఫర్నిచర్‌ను.. ఒక చిన్న స్కూటర్ మీద తీసుకెళ్లడం చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది ఫుడ్ కాదు, కిరాణా సామాగ్రి కాదు.. సర్వీస్ అంటే ఇలా ఉంటుందా అని నేను ఊహిస్తున్నాను అంటూ ఓ ఎమోజీ యాడ్ చేశారు.నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూవ్స్ పొందింది. రెండు వేలు కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో చూపరులను తప్పకుండా ఆశ్చర్యానికి గురి చేస్తుందని భావిస్తున్నాము.So I guess this is what a 10 minute furniture (not food or groceries) service would look like… 🙂 pic.twitter.com/0GqY39ty2F— anand mahindra (@anandmahindra) May 3, 2024 -
Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు
రాత్రి వేళల్లో మహిళలు, బయటికి వెళ్లాలంటేనే భయపడే రోజులు. మెట్రోలు, క్యాబ్ లాంటిసేవలు ఎన్ని అందుబాటులో ఉన్నా భద్రత ఎపుడూ ఒక సవాల్‌గానే ఉంటుంది. ప్రతీ పదిమంది ఏడుగురు వేధింపులకు లోనవుతున్నారు. ఈ తరుణంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలనుకునే మహిళల కోసం నగరంలో డోవ్లీ సేవలు విశేషంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మహిళలు, బాలికల భద్రత, సౌకర్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వీసును ప్రారంభించారు సోదరీమణులు. భారతదేశంలోనే తొలిసారిగా మహిళలకోసం మహిళా డ్రైవర్లతో మహిళలే నిర్వహిస్తున్న సేవలు కావడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ద్వయం మహిళల కోసమే ఈ బైక్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించింది. జైనాబ్ కాతూన్,ఉజ్మా కాతూన్ ప్రత్యేక బైక్టాక్సీ సర్వీస్ ప్లాట్‌ఫారమ్ ‘డవ్‌లీ’ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. డోవ్లీలో రైడర్లు, కస్టమర్లు మహిళలే ఉంటారు. ఓలా, ర్యాపిడో తరహాలో రెంటల్ బైక్ (బైక్ ట్యాక్సీ) సర్వీసులు డోవ్లీఅందిస్తుంది. వీరికి మహమ్మద్ ఒబైద్ ఉల్లా ఖాన్, మసరత్ ఫాతిమా సహకారం అందించారు.భద్రతకు పెద్ద పీట‘డవ్‌లీ’ వ్యవస్థాపకురాలు,సీఈవో జైనాబ్ ఖాతూన్ మాటల్లో చెప్పాలంటే నగరంలోని మహిళలు , బాలికలకు రోజువారీ ప్రయాణాన్ని సురక్షితంగా, సులభంగా ,సౌకర్యవంతంగా సేవలందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. భద్రతకు పెద్ద పీట వేస్తూ రైడ్ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి క్షణం ప్రయాణాన్ని మానిటర్ చేస్తుంటారు. అయితే రైడర్ ప్రయాణం ముగిసేవరకు లైవ్ లొకేషన్‌ను ఆన్‌లోనే ఉంచాల్సి ఉంటుంది. వాట్సాప్ వేదికగా మొదలైన డోవ్లీ సేవలు చాలా తక్కువ సమయంలోనే బాగా విస్తరించాయి. వందలమంది మహిళా డ్రైవర్లకు ఉపాధి లభించింది. ప్రస్తుతం పరిమిత ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలను పెంచి, భవిష్యత్తులో రైడర్ల సంఖ్య పెంచి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని భావిస్తున్నారు. విరివిగా సేవలు అందించే యోచనలో డోవ్లీ ఫౌండర్లు ఉన్నారు. దీంతో వీరి స్టార్టప్ మరింత విజయం సాధించాలని నెటిజన్లు వ్యాఖ్యానించారు. -
ఆర్టీసీ ఉద్యోగుల అర్జీలు సకాలంలో పరిష్కారం
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలపై అప్పీళ్ల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ వారి అర్జీల పరిష్కారానికి విధి విధానాలను ఖరారు చేసింది. ఈమేరకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలిలా ఉన్నాయి.. ► ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను సకాలంలో మంజూరు చేయాలి ► క్రమశిక్షణ చర్యలపై అర్జీలను వెంటనే పరిష్కరించాలి ► సిక్ లీవుకు సంబంధించిన జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మంజూరు చేయాలి ► ఉద్యోగులపై దాడికి పాల్పడ్డవారిపై సత్వరం కఠిన చర్యలు తీసుకునేలా పర్యవేక్షించాలి ► కేఎంపీఎల్, ఈపీకేలపై ఉద్యోగులను కౌన్సెలింగ్‌కు పంపించడం నిలిపివేయాలి ► తక్కువ రాబడి వచ్చే బస్ షెడ్యూళ్లను రీ షెడ్యూల్ చేయాలి ► బీఎస్ 4, బీఎస్ 6 వాహనాల వీల్‌బోల్ట్ మెషిన్లు, మయాటిక్ గన్స్, ఎలక్ట్రికల్ పరికరాలను అన్ని గ్యారేజీలలో అందుబాటులో ఉంచాలి ► ఉద్యోగులు పనిచేసే ప్రదేశాలు, భోజనశాలలు పరిశుభ్రంగా ఉంచాలి ► మూడు, నాలుగు షెడ్యూళ్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి ► వైఫల్యాలను కారణంగా చూపుతూ గ్యారేజ్ ఉద్యోగులను బదిలీ చేయకూడదు ► తగిన శిక్షణ లేకుండా డ్రైవర్లకు టిమ్ డ్యూటీలను అప్పగించకూడదు ► జీతాల కోత విధిస్తూ సెలవులు మంజూరు చేయకూడదు. -
యూజర్లకు పెద్ద దెబ్బే .. మరో సర్వీస్‌ను షట్‌డౌన్ చేయనున్న గూగుల్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారస్థులకు లాభదాయకంగా ఉండే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ వెబ్‌సైట్‌ను శాస్వతంగా షట్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి నెలలో ఈ వెబ్‌సైట్‌ను తొలగిస్తున్నట్లు తెలిపింది. అనంతరం ఎవరైనా ఈ బిజినెస్ ప్రొఫైల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా కస్టమర్ల బిజినెస్ ప్రొఫైల్లోకి వెళ్తారని పేర్కొంది. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటే ఏమిటి? గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది గూగుల్ సెర్చ్, మ్యాప్స్‌లో వారి వ్యాపారానికి సంబంధించిన అడ్రస్‌లు డిస్ప్లే చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని గూగుల్ వ్యాపారాలు నిర్వహించే వారికి ఉచితంగా అందిస్తుంది. బిజినెస్ ప్రొఫైల్‌తో వినియోగదారులు కస్టమర్లతో కనెక్ట్ అవ్వవచ్చు. అప్డేట్లను పోస్ట్ చేయవచ్చు. వారి ప్రొడక్ట్‌లు, అందిస్తున్న సేవల గురించి చెప్పొచ్చు. ప్రత్యామ్నాయం ఏంటి? గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ షట్‌డౌన్ అవుతుంది. మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటనే అంశంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్‌ను వినియోగించే బదులు సొంతంగా కొత్త వెబ్‌సైట్‌ను తయారు చేసుకోవడంతో పాటు అందులో మీ బిజినెస్ అడ్రస్‌తో పాటు బిజినెస్ ప్రొఫైల్‌ను అప్డేట్ చేసుకోవడం మంచిదని గూగుల్ యూజర్లకు సూచించింది. -
‘గాడ్ డిపార్ట్మెంట్’ అంటే ఏమిటి? యూదుల లేఖల్లో ఏముంటుంది?
ఇజ్రాయెల్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అక్కడి యూదుల జీవితాల్లో మతం, ఆధ్యాత్మికత అనేవి లోతుగా నాటుకుపోయాయి. దీనికి ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ‘దేవుని ప్రత్యేక విభాగం’ ఉదాహరణగా నిలుస్తుంది. దీనినే ‘గాడ్ డిపార్ట్మెంట్’ అని అంటారు. ‘గాడ్ డిపార్ట్మెంట్’కి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ఉత్తరాలు వస్తుంటాయి. ఇజ్రాయెట్ 21సీ. ఓఆర్జీ తెలిపిన వివరాల ప్రకారం ఈ దేవుని విభాగానికి ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఉత్తరాలు వస్తుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉంటున్న యూదులు తమ ప్రార్థనలు, కోరికలు, బాధలు, సంతోషాలను ప్రస్తావిస్తూ దేవునికి లేఖలు పంపుతారు. వీటన్నింటికీ ఒకే చిరునామా ఉంటుంది. అదే.. కోటెల్ లేదా వెస్ట్రన్ వాల్. ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లోని ‘గాడ్ డిపార్ట్మెంట్’కు వచ్చే ఉత్తరాలన్నీ జెరూసలేంలొని ‘వెస్ట్రన్ వాల్’ రంధ్రాలలో ఉంచుతారు. ఇక్కడ పశ్చిమ గోడను కోటెల్ అని కూడా అంటారు. ఇది ‘వాల్ ఆఫ్ ది మౌంట్’లో ఒక భాగం. ఒకప్పుడు ఈ ప్రదేశంలోనే తమ పవిత్ర దేవాలయం ఉండేదని యూదులు గాఢంగా నమ్ముతారు. దీన్నే ‘హోలీ ఆఫ్ ది హోలీస్’ అని అంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది యూదులు తమ వారసత్వాన్ని గుర్తు చేసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇది కూడా చదవండి: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
ఆర్టీసీలో రెండు కేటగిరీలుగా పదోన్నతులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజారవాణా విభాగం(ఆర్టీసీ) ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన సానుకూలతను మరోసారి చాటుకుంది. ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కీలక డిమాండ్‌పై సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు కేటగిరీల ప్రకారం పదోన్నతులు కల్పించేలా కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వంలో విలీనం చేయకముందు అంటే.. 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు గతంలో అమలు చేసిన ఆర్టీసీ సర్వీస్ నిబంధనలనే వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరినవారికి ప్రజా రవాణా విభాగం(పీటీడీ) సర్వీసు నిబంధనలను అమలు చేస్తారు. ఈ మేరకు పీటీడీ సర్వీసు నిబంధనల్లోని సెక్షన్ 5ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఆర్డినెన్స్ ఇచ్చింది. అనంతరం సవరణ బిల్లునూ ఆమోదించింది. దీనిపై త్వరలోనే తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువరించాలని నిర్ణయించింది. రెండు కేటగిరీలుగా పదోన్నతులు 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉన్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు మొదలైనవన్నీ ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకే కల్పిస్తారు. ఎందుకంటే గతంలో ఆర్టీసీలో ఉద్యోగులుగా నియమితులైవారికి పదోన్నతులకు సంబంధించి విద్యార్హతల నిబంధనలు ప్రత్యేకంగా ఉండేవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలనే.. ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేశారు. దీంతో గతంలో తక్కువ విద్యార్హతతో ఉద్యోగాలు పొంది.. పదోన్నతులకు అర్హత కలిగిన ఉద్యోగులు తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలతో నష్టపోయే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా సరైన విధాన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేనాటికి(2020, జనవరి 1) ఉద్యోగులుగా ఉన్నవారికి ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. దాంతో 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉద్యోగులుగా ఉన్న దాదాపు 50 వేల మందికి ఆర్టీసీ సర్వీసు నిబంధనలే వర్తిస్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తారు. ప్రస్తుతం ఆ కేటగిరీలో ఆర్టీసీలో 311 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
ఎయిర్‌పోర్టుపై గాలి వార్తలు
కడప సిటీ : ఎల్లో మీడియా కడప ఎయిర్‌పోర్టుపై తప్పుడు రాతలు రాసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నంలో ముందు వరుసలో ఉంది. ఉన్న వాస్తవాలను వక్రీకరించి విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేసే విధంగా వార్తలను ప్రచురిస్తున్నారు. విమానయాన సంస్థ ఇండిగో ఆదివారం నుంచి కడప–హైదరాబాదు విమాన సర్వీసులను నిలిపి వేసిందని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వల్లనే నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు. వాస్తవ పరిస్థితి చూస్తే.. నెట్వర్క్ ప్లానింగ్‌లో భాగంగా విమాన రాకపోకల షెడ్యూల్ మారుతుంటుందని ఇండిగో సంస్థ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. మార్చి 31వ తేది నుంచి యథావిధిగా ఈ సర్వీసు ఉంటుందని తెలియజేశారు. అంతవరకు కనెక్టింగ్ ఫైట్ల ద్వారా కడప నుంచి హైదరాబాదుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. సర్వసాధారణంగా ప్రతి ఫ్లైట్ సర్వీసు మార్చే క్రమంలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని వివరించారు. వక్రీకరించి... పరిస్థితి ఇలా ఉంటే అందుకు భిన్నంగా ఎల్లో మీడియా వక్రీకరించి విషయాన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ఉన్న విషయాన్ని ప్రయాణికులకు చెప్పకుండా ఎయిర్‌పోర్టు ఉంటుందో? లేదోనన్న అపోహాను కలిగించే విధంగా ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని, అందువల్లనే ఈ సర్వీసు రద్దు చేశారని రాసుకొచ్చారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంటే మొత్తం అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తారు గానీ.. కేవలం ఒకే ఒక సర్వీసును ఎలా రద్దు చేస్తారని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని సెప్టెంబరు 15 వరకు విమానాలు నడుస్తాయని, ఆ తర్వాత బుకింగ్ ఉండదని రాశారు. కలెక్టర్ జోక్యంతో సెప్టెంబరు చివరి వరకు రాకపోకలు కొనసాగిస్తారని, అందులో వారే చెప్పారు. కానీ విమానాల రాకపోకలు ఆగిపోయింది లేదు.. ప్రయాణికులు ఇబ్బంది పడింది లేదు. నిరంతరాయంగా బుకింగ్ చేసుకుంటున్నారు. విమాన సర్వీసులు కొనసాగుతూనే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కేవలం ప్రభుత్వంపై చెడ్డపేరు తీసుకొచ్చి ప్రజల్లో ఒక విధమైన భావన కలిగించేలా చేసే ప్రయత్నమేనని పలువురు మండిపడుతున్నారు. -
అరరే... ఎంత పనైపాయే!
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రియాంక మిశ్రా ఊరకనే ఉండి ఉంటే వైరల్ అయ్యేది కాదు. సదరు కానిస్టేబుల్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి వైరల్ అయింది. ఈ రీల్లో ప్రియాంక మిశ్ర ‘కర్తవ్యం’ సినిమాలో విజయశాంతిని గుర్తు తెచ్చేలా ఓ లెవెల్లో నటించింది. సహజత్వం కోసం సర్వీస్ గన్ను ఉపయోగించి మరీ నటించింది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ‘చాల్లేండి సంబడం’ అంటూ ఆమెను సస్పెండ్ చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయడానికి ప్రియాంక దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తు ఆమోదం పొందింది. ఆగ్రాలో పోస్టింగ్ కూడా ఇచ్చారు. అయితే 48 గంటల్లోనే ఆమె నియామకాన్ని పోలీస్ కమిషనర్ ప్రీతిందర్సింగ్ రద్దు చేశారు. ప్రియాంక మిశ్రాపై సోషల్ మీడియాలో సానుభూతి చూపుతున్నవారితో పాటు, సానుభూతి చూపుతూనే ‘స్వయంకృతాపరాధం’ అని విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు. -
స్కై బస్సు సర్వీస్ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం?
భారతదేశంలో స్కై బస్సు రవాణా సౌకర్యంపై మరోమారు చర్చ మొదలైంది. దేశంలో స్కై బస్సు వ్యవస్థను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారత్‌లో స్కై బస్సు సర్వీస్ ప్రారంభమైతే పలునగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. స్కై బస్సు సర్వీసుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్కై బస్సు అనేది మెట్రో మాదిరిగానే చౌకైన, పర్యావరణ అనుకూల పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ. ఇది ఎలివేటెడ్ ట్రాక్‌ను కలిగి ఉంటుంది. స్కై బస్సులు సుమారుగా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఇవి విద్యుత్ శక్తితో నడుస్తాయి. వీటి నిర్వహణకు మెట్రో కంటే తక్కువ ఖర్చు అవుతుంది. స్కై బస్ అనేది విలోమ కాన్ఫిగరేషన్ వాహనం. దీని చక్రాలు, ట్రాక్‌లు ఒక మూసివున్న కాంక్రీట్ బాక్స్ మధ్య అమరి ఉంటాయి. ఈ వ్యవస్థలో పట్టాలు తప్పడం లాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 2003లో నూతన సంవత్సర కానుకగా గోవాకు స్కై బస్సు ప్రాజెక్టును ప్రకటించారు. రూ.100 కోట్లతో ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్ట్ మపుసా నుండి పనాజీకి అనుసంధానించాలనుకున్నారు. దీని ప్రారంభ మార్గం 10.5 కి.మీ. అయితే 2016లో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ స్కై బస్ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది. ఆ సమయంలో అది లాభదాయకం కాదని, ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ‘అగ్నివీర్’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్ ఆర్మీ ఏమంటోంది? -
ఇజ్రాయెల్-గాజా: ఒక్కరోజులో 704 మంది బలి
రఫా/టెల్అవీవ్/న్యూఢిల్లీ: గాజారస్టిప్లో హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు మరింత ఉధృతం చేసింది. గత 24 గంటల వ్యవధిలో 400 వైమానిక దాడులు నిర్వహించామని మంగళవారం ప్రకటించింది. బాంబు దాడులతో హమాస్ స్థావరాలను, సొరంగాలను ధ్వంసం చేశామని పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు హమాస్ కమాండర్లు హతమయ్యారని వెల్లడించింది. కానీ, ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 704 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలియజేసింది. వీరిలో 305 మంది చిన్నారులు, 173 మంది మహిళలు ఉన్నారని వివరించింది. సోమవారం రాత్రి ఇజ్రాయెల్ దాడుల్లో ఖాన్ యూనిస్ సిటీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 32 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ భవనంలో 100 మంది నివసిస్తున్నారు. వీరిలో చాలామంది ఉత్తర గాజా నుంచి వచ్చినవారే. గాజాలో 2,055 మంది చిన్నారులు మృతి ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో పెద్ద సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారని స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి. ఈ మారణహోమం ఆపేందుకు అంతర్జాతీయ సమాజం వెంటనే చొరవ చూపాలని కోరాయి. సామాన్య ప్రజల ప్రాణాలు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని, కాల్పుల విరమణ పాటించాలని, ఘర్షణకు తెరదించాలని ఇజ్రాయెల్ సైన్యానికి, హమాస్ మిలిటెంట్లకు విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మంగళవారం 18వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటిదాకా గాజాలో 5,087 మంది మృతిచెందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 2,055 మంది చిన్నపిల్లలు ఉన్నారని పేర్కొంది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా చనిపోయారు. మిలిటెంట్ల అదీనంలో 200 మందికిపైగా బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో సాధారణ నివాస గృహాలు, పాఠశాలలు, మసీదులు నేలమట్టయ్యాయి. ఎటుచూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. గాజాలో 10 లక్షల మందికిపైగా మైనర్లు నిర్బంధంలో చిక్కుకుపోయారని ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లో 27 మంది బాలలు మరణించారని వెల్లడించింది. ఇజ్రాయెల్ విచక్షణారహితంగా దాడులు చేస్తోందని, చిన్నారుల్ని బలి తీసుకుంటోందని ఆరోపించింది. ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో సేవలు బంద్ ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల వల్ల గాజాలో క్షతగాత్రుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా, మరోవైపు ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే మూడింట రెండొంతుల ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఎలాంటి సేవలు అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. 72 ఆరోగ్య కేంద్రాలకు గాను 46, 35 ఆసుపత్రులకు గాను 12 ఆసుపత్రుల్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయని మంగళవారం ప్రకటించింది. ఔషధాలు, విద్యుత్, ఇంధన కొరత కారణంగా క్షతగాత్రులకు సేవలందించలేకపోతున్నామని పాలస్తీనా అరోగ్య శాఖ అంటోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కొన్ని ఆరోగ్య కేంద్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీనికితోడు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాలో ఆరోగ్య వ్యవస్థ అత్యంత అధ్వాన స్థితికి చేరుకుందని ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. బందీల సమాచారం ఇవ్వండి గాజాపై భూతల దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ప్రస్తుతానికి వైమానిక దాడులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భూతల దాడులు ప్రారంభమైతే గాజాలో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లకి హమాస్ మిలిటెంట్లు స్పందిస్తున్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు బందీలను ఇప్పటికే విడుదల చేయగా, సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు వృద్ధ మహిళలను విడుదల చేశారు. బందీల సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని సూచిస్తూ ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కరపత్రాలు జారవిడిచింది. సమాచారం అందజేసేవారికి ఆపద రాకుండా కాపాడుతామని హామీ ఇచ్చింది. నిండిపోయిన శ్మశాన వాటికలు ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ ప్రారంభమైన తర్వాత గాజాలో 14 లక్షల మంది ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. వీరిలో దాదాపు 5.80 లక్షల మంది ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్టు నుంచి గాజాలోకి ఆహారం, ఇతర సహాయక సామాగ్రిని అనుమతిస్తున్న ఇజ్రాయెల్ పెట్రోల్, డీజిల్‌ను మాత్రం అనుమతించడం లేదు. గాజాలో మరణాల సంఖ్య పెరుగుతుండడంతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. ఒకే సమాధిలో ఐదు మృతదేహాలను ఖననం చేస్తున్నారు. పాత సమాధులను తవ్వేసి, కొత్త మృతదేహాలను సమాధి చేస్తున్నారు. -
ప్రాణదాతలు 108 అంబులెన్స్‌లు గర్భిణులకు, దీర్ఘకాలిక రోగులకు 108 అంబులెన్సులు వరంగా మారాయి
-
అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం!
పూర్వం ‘విద్యానగరం’ అను పట్టణంలో కుబేర వర్మ అను గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతని వద్ద అపారమైన సంపద ఉండేది. అదంతా తన పూర్వీకుల నుండి సంక్రమించిందే. తన వద్ద ఉన్న సంపదనంతా దానధర్మాలు చేసి తాను ఒక అపర కర్ణుడిగా పేరు సంపాదించుకోవాలనే కీర్తి కాంక్ష కలిగింది అతనికి. ఆ ఉద్దేశంతోనే అడిగిన వారికి లేదనకుండా ధన, కనక, వస్తు, వాహనాలను దానం చేస్తూ వచ్చాడు. అంతేకాదు గుళ్ళు గోపురాలు కట్టించి వాటి మీద తన పేరు చెక్కించుకున్నాడు. తాను చేసిన ప్రతి దానం అందరికీ తెలియాలని తాపత్రయపడ్డాడు. అలా పూర్వీకుల ఆస్తిని దానం చేసి అతను కోరుకున్నట్టుగానే అపారమైన కీర్తిని సంపాదించుకున్నాడు. అది దేవలోకానికీ చేరింది. ఈ విషయంలో దేవలోకం కుబేర వర్మను పరీక్షించాలనుకుంది. ఒకసారి ఒక సన్యాసి కుబేర వర్మ వద్దకు వచ్చి ‘నాకు ఆకలిగా ఉంది. మూడు రోజులైంది తినక కాస్త భోజనం పెట్టించండి’ అని అడిగాడు. అందుకు కుబేర వర్మ నవ్వి ‘అన్నదానం ఏముంది.. ఎవరైనా చేస్తారు. మీకు వెండి.. బంగారం.. డబ్బు.. ఏం కావాలన్నా ఇస్తాను. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న దానాలు చేసి నా ప్రతిష్ఠ తగ్గించుకోను. అన్నమే కావాలంటే ఇంకో ఇంటికి వెళ్ళండి’ అని చెప్పాడు. సన్యాసి ‘నేను సన్యాసిని. నాకెందుకు అవన్నీ? భోజనం లేదంటే వెళ్ళిపోతాను’ అంటూ అక్కడి నుండి కదిలాడు. పక్క వీథిలోని దేవదత్తుడి ఇంటికి వెళ్లాడు ఆ సన్యాసి. దేవదత్తుడు సామాన్య కుటుంబీకుడు. గొప్ప దయా గుణం కలవాడు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టేవాడు. అంతేకాదు సాటివారికి తనకు ఉన్నంతలో సాయం చేసేవాడు. తను చేసే దానధర్మాల వల్ల తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఏనాడూ ఆశించలేదు. అలాంటి దేవదత్తుడి ఇంటికి వచ్చిన సన్యాసి తనకు ఆకలిగా ఉందని.. భోజనం పెట్టించమని కోరాడు. దేవదత్తుడు ఆ సన్యాసిని సాదరంగా ఆహ్వానించి కడుపునిండా భోజనం పెట్టించాడు. అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సన్యాసి. కొంతకాలం తర్వాత వయసు మీద పడి దేవదత్తుడు చనిపోయాడు. ఆ తర్వాత కుబేర వర్మ కూడా చనిపోయి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ స్వర్గంలో.. చాలామందితో పాటు తనకంటే ముందుగానే చనిపోయిన దేవదత్తుడూ ఉన్నాడు. ప్రథమస్థానంలో ప్రత్యేక ఆసనంపై కూర్చొని. కుబేర వర్మకు పదకొండవ స్థానం లభించింది. అది సహించలేని కుబేర వర్మ మండిపడుతూ దేవదూతలతో వాగ్వివాదానికి దిగాడు.. ‘నా ముందు దేవదత్తుడెంత? మా పూర్వీకులు సంపాదించిన అపార సంపదనంతా ప్రజలకు పంచిపెట్టాను. ధన,కనక, వస్తు, వాహనాలు దానం చేశాను. అలాంటి నాకంటే పట్టెడన్నం పెట్టిన దేవదత్తుడు గొప్పవాడు ఎలా అవుతాడు? అసలు నాకంటే ముందున్నవాళ్లంతా ఎవరు?’ అంటూ. అందుకు దేవదూతలు ‘అందరికంటే ముందున్న దేవదత్తుడు ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాడు. అన్నిటికన్నా అన్నదానం గొప్పది. అతనిలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలం జాలి,దయ, ప్రేమతోనే అన్నార్తుల ఆకలి తీర్చాడు. సాటివారికి సహాయం చేశాడు. ఇకపోతే మిగిలినవారిలో.. ఆసుపత్రులను కట్టించి ఎంతోమంది రోగులకు ఉపశమనం కలిగించినవారు కొందరు. వికలాంగులను ఆదరించి పోషించిన వారు మరికొందరు. ఇంకా కొందరు చెరువులు తవ్వించి ప్రజలకు, పశువులకు నీటి కొరత లేకుండా చేశారు. వాటన్నిటినీ ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండానే చేశారు. కాబట్టే నీకంటే ముందున్నారు. ఇక నువ్వు కీర్తి కోసం స్వార్థంతో మీ పూర్వీకుల సంపదనంతా అపాత్రదానం చేశావు. అందుకే నీకు పదకొండవ స్థానం లభించింది. ఎప్పుడైనా దానం అనేది గుప్తంగా ఉండాలి. కాని నువ్వు అలా చేయలేదు’ అని చెప్పారు. అంతా విన్నాక కుబేర వర్మకు జ్ఞానోదయం అయింది. తన పూర్వీకులు సంపాదించిన సంపదనంతా కీర్తి కాంక్షతో దుర్వినియోగం చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. (చదవండి: ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా! ఎక్కడుందంటే..) -
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కారుణ్య నియామకం వర్తించదు
సాక్షి, హైదరాబాద్: సర్వీ సులో ఉన్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేదని ఆర్టీసీ తేల్చి చెప్పింది. ఆయా కేసుల్లో మానిటరీ బెనిఫిట్ కింద కుటుంబ సభ్యులకు నగదు మాత్రమే అందిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగి సర్విసులో ఉండగా సహజ మరణం పొందితేనే కారుణ్య నియామకం (బ్రెడ్ విన్నర్ స్కీం) కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 2008లో జారీ చేసిన సర్క్యులర్‌ను ఉటంకిస్తూ కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. అలాగే స్టాఫ్ బెనెవలెంట్ ట్రస్ట్ (ఎస్బీటీ) పథకం కింద చనిపోయిన ఉద్యోగుల కు అందించే ఎక్స్‌గ్రేషియాను సైతం సర్విసులో ఉండగా ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు అందించడం సాధ్యం కాదని ఆ సర్క్యులర్‌లో ఆర్టీసీ పునరుద్ఘాటించింది. ఇవి మినహా ఎస్ఆర్బీఎస్, ఈడీఎల్‌ఐఎఫ్, ఇతర బెనిఫిట్స్‌ను సెటిల్మెంట్ రూపంలో అందించనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్న తరుణంలో పాత సర్క్యులర్లను కోట్ చేస్తూ ఆర్టీసీ కొత్తగా సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నాడు అనుమతించి... సాధారణంగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో కారుణ్య నియామకానికి వెసులుబాటు ఉంది. ఆర్టీసీలో కూడా అది అమలులో ఉంది. కొన్నేళ్లుగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవటంతోపాటు ఖాళీలు లేవన్న సాకుతో కారుణ్య నియామకాలను సంస్థ పెండింగ్‌లో పెట్టింది. కానీ ఆ వెసులుబాటు మాత్రం అమలులోనే ఉంది. 2019లో దీర్ఘకాలం ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో కొందరు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులకు అప్పట్లో కారుణ్య నియామకాలకు సంస్థ అనుమతించింది. కానీ ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. ఎస్బీటీ పథకం ఉన్నా... ఆర్టీసీ ఉద్యోగులు ఎస్బీటీ పథకం కింద ప్రతినెలా వేతనంలో రూ.100 చొప్పున ఆ పథకం ట్రస్టుకు జమ చేస్తారు. ట్రస్టును ఆర్టీసీనే నిర్వహిస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు వారు నెలనెలా చెల్లిస్తూ పోగు చేసిన మొత్తాన్ని వడ్డీతో కలిపి సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీసు పూర్తి కాకుండానే మరణిస్తే ఆ మొత్తంతోపాటు రూ. లక్షన్నర ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లిస్తుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం సాధ్యం కాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇందుకు 1983లో జారీ చేసిన సర్క్యులర్‌ను కోట్ చేసింది. -
డిజిటల్ విలేజ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఆన్లైన్ సేవలు ఎలా వృద్ధి చెందుతాయి?
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. భారతదేశం ఒక వ్యవసాయ దేశం. అయినప్పటికీ దేశం సమాచార, సాంకేతికరంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయడంతోపాటు టెక్నాలజీని గ్రామాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. కాగా భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రజలు రోజువారీ పనుల కోసం స్మార్ట్ఫోన్లపై అధికంగా ఆధారపడుతున్నారు. దేశప్రజలు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేస్తారు. ఇది భారతదేశంలో మొబైల్-కామర్స్ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. భారతదేశం అనేది పట్టణ, గ్రామీణ ప్రాంతాలుగా విభజితమైవుంది. డిజిటల్ ఇండియాకు మరింత ప్రోత్సాహం గ్రామీణ భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యతను పెంచే లక్ష్యంతో పలు కార్యక్రమాలను ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం గణనీయమైన ప్రయత్నాలు సాగిస్తోంది. దీనిలో భాగంగానే ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారతదేశంలోని పౌరులందరికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండేలా, చెల్లింపు వ్యవస్థ ఆన్లైన్ లేదా నగదు రహితంగా ఉండేలా చూడటం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. పౌరులు డిజిటల్ అక్షరాస్యులు కావడం వల్ల ఇటు ప్రభుత్వ రంగం, అటు ప్రభుత్వ సంస్థలు డిజిటల్‌గా యాక్టివ్‌గా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా పౌరులు ప్రభుత్వ సేవలను విరివిగా అందుకోగలుగుతారు. డిజిటల్ విలేజ్ ప్రాజెక్టు డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారత ప్రభుత్వం చేపడుతున్న అతి ముఖ్యమైన పథకం డిజిటల్ విలేజ్. దీని ద్వారా కొన్ని గ్రామాలు డిజిటల్ యాక్టివ్ క్యాష్‌లెస్ గ్రామాలుగా రూపొందుతాయి. అప్పుడు గ్రామీణ ప్రాంతాలవారు తమ రోజువారీ పనులను పూర్తిగా ఆన్లైన్లో చేసుకునేందుకు వీలు ఏర్పడుతుంది. డిజిటల్ విలేజ్ మొదటి లక్ష్యం గ్రామీణ సంస్థల పనిని ఇంటర్నెట్ ద్వారా నియంత్రించడం. డిజిటల్ విలేజ్ ప్రోగ్రామ్‌లోని ప్రాథమిక లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికత అభ్యాసం,రోజువారీ వినియోగాన్ని ప్రోత్సహించడం. సీఎస్ఈ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ డిజిటల్ విలేజ్‌కు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తోంది. సీఎస్ఈ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ గ్రామీణ భారతదేశాన్ని మరింత డిజిటల్‌గా యాక్టివ్‌గా మార్చడానికి వివిధ సేవలను అందిస్తుంది. సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా గ్రామీణ భారతదేశానికి ఇంటర్నెట్ సేవలు, సౌరశక్తి, విద్య, డిజిటల్ ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక సేవలను అందిస్తుంది. ఇది కూడా చదవండి: 40 ఖాతాల్లోకి ఉన్నట్టుండి లక్షలు.. బ్యాంకుకు పరుగులు తీసిన జనం! -
ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్!
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ దాని 'ఈట్స్ ఆన్-బోర్డ్' క్యాటరింగ్ సర్వీస్‌లో మార్పులు చేసింది. ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన మెనూ నుంచి ప్రయాణికులు తమకు ఇష్టమైన ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఈ ప్రత్యేక మెనూను తమ అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ప్రవేశపెట్టినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. రుచికరమైన ప్రాంతీయ వంటకాలతో మొదలుకొని స్ట్రీట్ ఫుడ్స్ వరకూ సరికొత్త ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రయాణానికి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. “ఇండియా ప్రముఖ క్యారియర్‌గా మా కస్టమర్ల కోసం సేవలను మెరుగుపరిచే మార్గాలను నిరంతరం పరిశీలిస్తున్నాం. కస్టమర్లు, క్యాబిన్ సిబ్బంది, సర్వీస్ పార్టనర్ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా మా కొత్త 6ఈ ఈట్స్ మెనూ కొత్త ఆప్షన్లను అందిస్తుంది” అని ఇండిగో కస్టమర్ సర్వీసెస్, ఆపరేషన్స్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాందాస్ అన్నారు. ఇదీ చదవండి: పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా? -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమో దు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులు శాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. -
300 కోట్ల ట్రిప్పులు.. సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే అవాక్కవుతారు!
భారతదేశంలో ఉబర్ సర్వీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమర్లు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న కారుని బుక్ చేసుకుని గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. ఇంతలా పాపులర్ అయిన ఉబర్ ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉబర్ ప్రారంభమైనప్పటి నుంచి డ్రైవర్లు ఇప్పటి వరకు ఏకంగా 300 కోట్ల ట్రిప్పులు తిరిగి రూ. 50,000 కోట్లకు పైగా సంపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మనషి నిత్యజీవితంలో ఒక భాగమైపోయిన రవాణాలో ఉబర్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుండటం చాలా గర్వంగా ఉందని ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ 'ప్రభ్‌జీత్ సింగ్' తెలిపారు. ఇదీ చదవండి: నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్! భూమి నుంచి చంద్రునికి 86,000 సార్లు.. ఇప్పటి వరకు ఉబర్ ప్రయాణించిన దూరం 'భూమి నుంచి చంద్రునికి' దాదాపు 86,000 సార్లు ప్రయాణించడంతో సమానమని కంపెనీ చెబుతోంది. సుమారు 30 లక్షల మంది డ్రైవర్లు ఉబర్ ద్వారా డ్రైవర్ భాగస్వాములుగా ఉన్నారు. కంపెనీ భారతదేశం అంతటా 125 నగరాల్లో తమ కార్య కలాపాలను నిర్వహిస్తోంది. ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఇప్పుడు తమ గమ్యస్థానాలను ఉబర్ సర్వీస్ ద్వారా సురక్షితంగా చేరుకుంటున్నారు. చాలామంది ఉబర్ వినియోగించుకోవడానికి ప్రధాన కారణం కారు మెయింటెనెన్స్ & డ్రైవర్ జీతం నుంచి తప్పించుకోవడమే అని తెలుస్తోంది. ఈ సర్వీసుల వల్ల మరికొందరు సొంత వాహనాలు కొనుగోలు కూడా వాయిదా వేసుకుంటున్నారు. -
30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్‌ను మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)కు తీసుకువచ్చారు. అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చి.. హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. 29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. -
తండ్రి ఆశయాలతో..పేద పిల్లల కోసం ఫ్రీ బోర్డింగ్ స్కూల్
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే పిల్లల్లో ఒకరిగా మారి ఆనందించేవాడు.పేదపిల్లల కోసం ఏదైనా చేయాలనేది ఆయన కల. ఆ కల సాకారం కాకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.తండ్రి కలను నెరవేర్చడానికి సేవాపథంలోకి వచ్చింది పోర్షియా పుటతుండ... ఝార్ఖండ్‌లోని రాంచీలో పుట్టిన పోర్షియా పుటతుండ కోల్‌కతా, దిల్లీ, నోయిడా, ముంబైలలో పెరిగింది. పోర్షియా తండ్రికి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలతో కలిసి నర్సరీ రైమ్స్ పాడడం ఇష్టం. ఆటలు ఆడుతూ పాఠాలు చెప్పడం ఇష్టం. గ్రామీణ ప్రాంతాలలోని పేదపిల్లలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంచేవాడు.పేద పిల్లల కోసం తనవంతుగా ఏదైనా చేయాలని నిరంతరం తపించేవాడు. తన కలలు సాకారం కాకుండానే ఆయన చనిపోయారు. తండ్రి జ్ఞాపకాల స్ఫూర్తితో ఆయన ఆశయాలను నెరవేర్చే క్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని కోమిక్ అనే గ్రామంలో అక్కడి అట్టడుగు వర్గాల పిల్లల కోసం ఫ్రీబోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది పోర్షియా. ‘హైయెస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా’గా పేరున్న కోమిక్లోని ఎంతోమంది పేద పిల్లలకు పోర్షియా ఇప్పుడు తల్లి, గురువు, సంరక్షకురాలు. జర్నలిజంలో డిగ్రీ చేసిన పోర్షియా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో పనిచేసింది. ఆ తరువాత ‘సీఎన్ఎన్’లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహించింది. కొంతకాలం తరువాత జర్నలిజాన్ని వదులుకొని సేవాదారిలోకి వచ్చింది. పోర్షియా ఈ గ్రామాన్ని ఎంచుకోవడానికి కారణం? ఆమెకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. తొలిసారిగా హిమాచల్‌ద్రేశ్‌లోని స్పితి లోయకు వచ్చినప్పుడు తనకు ఎంతో మనశ్శాంతిగా అనుభూతి చెందింది. ఆ ప్రాంతంతో ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపించింది. తండ్రి చనిపోయిన తరువాత పోర్షియాపై కుంగుబాటు నీడలు కమ్ముకున్నాయి. చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి తనకు ఇష్టమైన ప్రదేశం గురించి పోర్షియా ఆలోచిస్తున్నప్పుడు స్పితి గుర్తుకు వచ్చింది. అక్కడి పేదపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు స్వయంగా తండ్రితో మాట్లాడినట్లే అనిపించింది. వారి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. స్కూల్ ప్రారంభానికి ముందు కజా ప్రాంతంలోని ఒక స్థానిక కుటుంబంతో నెలరోజులు గడిపింది. ఆ కుటుంబంలోని పిల్లలకు పాఠాలు చెప్పింది. ప్రకృతి సోయగాలను ఆస్వాదించడం కోసం ఊళ్ల వెంట తిరుగుతున్నప్పుడు చదువుకు దూరమైన, సరైన చదువు లేని ఎంతోమంది పేదపిల్లలు కనిపించారు. వారిని విద్యావంతులను చేయాల్సిన అవసరం కనిపించింది. ‘ఉద్యోగాన్ని, ముంబైని విడిచి ఇక్కడకు రావడం అనేది సాహసంతో కూడుకున్న పని. కాని నేను ఇష్టంతో ఇక్కడకు వచ్చాను. ముంబైని విడిచి రావాలనే ఆలోచన నా స్నేహితులు, సన్నిహితులు ఎవరికీ నచ్చలేదు. తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నావు అని ముఖం మీదే చెప్పారు. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తావు అని కూడా అన్నారు. అయితే అవేమీ నా నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఇక్కడికి వచ్చిన తరువాత నా జీవితానికి ఒక పరమార్థం దొరికినట్లు అనిపించింది’ అంటుంది పోర్షియా. తొలి అడుగులో భాగంగా.... పిల్లలు ఆడుకునే చోటుకు వెళ్లేది. ‘మీకు బొమ్మలు ఎలా వేయాలో నేర్పిస్తాను’ ‘కొత్త ఆటలు నేర్పిస్తాను’ ‘ఇంగ్లీష్‌లో మాట్లాడడం నేర్పిస్తాను’ అంటూ వారితో స్నేహం చేసేది. చెట్టు కింద కూర్చొని బొమ్మలు గీయడం, రైమ్స్ పాడడం నేర్పేది. ఒక్కరొక్కరుగా నలభై మంది పిల్లల వరకు ఆమెకు దగ్గరయ్యారు. ఆ సమయంలో తనకు ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ఆలోచన వచ్చింది. కోమిక్‌లో ఒక ప్రదేశాన్ని అద్దెకు తీసుకొని ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు పెద్ద సమస్య వచ్చింది. ‘ఇప్పుడు మా పిల్లలు చదువుకొని ఏం చేయాలి? చిన్నాచితకా పనులు చేసుకుంటే ఏదో విధంగా బతుకుతారు’ అంటూ పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు నిరాకరించేవారు. వారి ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావడానికి పోర్షియా చాలా కష్టపడాల్సి వచ్చింది.పాఠాలతో పాటు తోటపని నుంచి నృత్యం వరకు పిల్లలకు ఎన్నో నేర్పుతోంది పోర్షియా. ‘నా కల సాకారం అవుతుందా, లేదా అనుకునేదాన్ని. స్కూల్ ప్రారంభించిన తరువాత నా మీద నాకు, నా పై పిల్లల పేరెంట్స్‌కు నమ్మకం వచ్చింది. ఇది తొలి అడుగు మాత్రమే’ అంటుంది పోర్షియా పుటతుండ. -
ప్రముఖ వ్యాపారులను బురిడీ కొట్టించిన ఘనుడు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో తమను మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ కె.శ్రీనివాసరావును నగరంలోని ప్రముఖ వ్యాపారులు ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఆయన కేసును బుక్కరాయసముద్రం పోలీసులకు బదిలీ చేశారు. బాధితులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా కడప మండలం రూకవారిపల్లికి చెందిన పసుపులేటి అంకుశం 24 రోజుల క్రితం బీకేఎస్ పరిధిలోని పసుపులేటి మాతా గోదాములో నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. నగరంలోని ప్రముఖ వ్యాపారులను పిలిపించి ప్రారం¿ోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపించాడు. తన వ్యాపారం గురించి వివరించాడు. తనతో కలసి వ్యాపారం చేయడం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందని నమ్మబలికాడు. సరుకును విక్రయించిన అనంతరం తన కమీషన్ పట్టుకుని మిగులు మొత్తాన్ని అందజేస్తానని అంకుశం తెలపడంతో అందరూ ఒప్పుకున్నారు. అతని మాయలో చిక్కుకున్న వ్యాపారులు తమ వద్ద సరుకులను అప్పగించారు. వీటితో గోదాము నిండిపోయింది. అది చూసిన వ్యాపారులు వ్యాపారం బాగా చేస్తున్నాడని మురిసిపోయారు. అయితే రాత్రికి రాత్రే లారీల కొద్ది సరుకును తీసుకుని అంకుశం మాయమయ్యాడు. దీంతో మోసపోయిన వ్యాపారులు ముందుగా అతని గురించి ఆరా తీశారు. అనంతలోనే రూ.70 లక్షలకు పైగా సరుకుతో ఉడాయించిన అంకుశం అక్రమాలకు నెల్లూరు జిల్లాలో రూ.3 కోట్లు, కర్నూలు జిల్లాలో రూ. కోటికి పైగా వ్యాపారులు మోసపోయినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే అంకుశం జాడ తెలుసుకుని అతని ఇంటికి వెళితే కుటుంబసభ్యులు ఎదురు దాడికి దిగడంతో చేసేది లేక అనంతపురం తిరిగి వచ్చి ఎస్పీ శ్రీనివాసరావును కలసి జరిగిన మోసాన్ని వివరించారు. వ్యాపారుల ఆవేదనపై స్పందించిన ఎస్పీ కేసును బుక్కరాయసముద్రం పోలీసులకు బదిలీ చేశారు. మోసగాడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్ అవ్వొచ్చు!
ఇంతవరకూ అద్దెకు సామాన్లు ఇవ్వడం గురించే వినివుంటాం. ఇకపై మనుషులను కూడా ఆద్దెకు ఇచ్చే రోజులు వచ్చేశాయి. కాలం కన్నా ప్రపంచం వేగంగా ముందుకు దూసుకుపోతున్నట్లుంది. ఆ మధ్య అద్దెకు బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ దొరుకుతారనే విషయం విని విస్తుపోయాం. అయితే ఇప్పుడు అద్దెకు డాడీ దొరుకుతాడని తెలిస్తే మనమంతా ఏమైపోవాలి? ఏమనుకోవాలి? కన్న తండ్రిలా సంరక్షిస్తూ.. అద్దెకు దొరికే డాడీ కన్న తండ్రిలా పిల్లలను చూసుకుంటుంటే మమ్మీ ఎంచక్కా చిల్ అవ్వొచ్చు. ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందిస్తున్నారు. అలాగే ఉద్యోగ వ్యాపకాల్లో ఉంటూ పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు నిశ్చింగా అప్పగించి, తాము చిల్ అవగలుగుతున్నారు. ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు ఇలా.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టును అనుసరించి చైనాలోని ఒక బాత్‌హౌస్ అద్దెకు తండ్రులను అందించే సేవలను ప్రారంభించింది. చైనాలో బాత్ హౌస్‌లు ఎంతో ఆదరణ పొందుతుంటాయి. జనం రిలాక్స్ అయ్యేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ బాత్‌హౌస్‌లకు పురుషులతో పాటు మహిళలు కూడా వస్తుంటారు. ఇక్కడ పురుషులకు, మహిళలకు వేర్వేరుగా సెక్షన్లు ఉంటాయి. అయితే ఇక్కడికు వచ్చే కొందరు మహిళలు తమ చిన్నపిల్లలను తీసుకుని స్నానం చేయించుకునేందుకు, మసాజ్ చేయించుకునేందుకు వస్తుంటారు. వీరి ఇళ్లలో పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతోనే వారు పిల్లలను తీసుకుని ఇక్కడికి వస్తుంటారు. అయితే పిల్లలను పక్కనే ఉంచుకుని స్నానం చేయడం, మసాజ్ చేయించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. పిల్లలను పట్టుకునేందుకు.. ఆ సమయంలో పిల్లలను పట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. మహిళల ఇటువంటి ఇబ్బందులను గ్రహించిన ఒక బాత్‌హౌస్ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలను ప్రారంభించింది. మహిళలు బాత్‌హౌస్‌కు వచ్చినప్పుడు వారి పిల్లలను ఈ అద్దె డాడీలు చూసుకుంటారు. అప్పుడు ఆ చిన్నారుల మమ్మీ హాయిగా బాత్‌హౌస్‌లో చిల్ అవుతారు. ఈ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారాయి. పిల్లల కోసం సౌకర్యాలు ఈ సేవలు అందుకునేందుకు తల్లులతో పాటు వచ్చే పిల్లలను అద్దె డాడీలు సంరక్షిస్తారు.పిల్లలకు స్నానాలు చేయించడం, దుస్తులు మార్పించడం, ఆహారం వడ్డించడం లాంటి సేవలను అద్దె డాడీలే చూసుకుంటారు. ఇటీవలనే ఈ సేవలను ప్రారంభించిన బాత్‌హౌస్ అద్దె డాడీలుగా నియమితులయ్యేవారికి శిక్షణ అందిస్తోంది. అలాగే ఈ సేవలకు సంబంధించిన గైడ్‌లైన్స్ రూపొందించింది. ఇది కూడా చదవండి: 9 ఏళ్ల అనాథ అనుకుంటే.. 22 ఏళ్ల యువతి.. దత్తత తీసుకుంటే చుక్కలు చూపించింది -
ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!
'సేవ' అంటే ఆయా వ్యక్తుల వారికి తోచిన రీతిలో అనాథలకు, అభాగ్యులకు తమ సర్వీస్‌ని అందిచడం. కొందరూ కొన్ని స్వచ్ఛంద సంస్థల మద్దతు కూడా సేవలందిస్తారు. అలా ఇలా కాకుండా యావత్తు సమజాన్ని మహత్తర సేవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అంటే మాటలకందని విషయం. అలా సాధ్యమా! అనిపిస్తుంది కూడా. ఔను! సాధ్యమే అంటూ కేరళకు చెందిన ఓ యువజన సంస్థ చేసి చూపించింది. కేరళలో వేలాది మహిళలు తమ కుంటుంబానికి సరిపడా వంట కంటే అదనంగా వండుతారు. ఒకరికో లేదా ఇద్దరికో సరిపడే ఆహారం అయ్యి ఉండొచ్చు. అయితే వారు చేసిన భోజనం పొట్లం ఏ అతిధికి చేరుతుందో ఎవరో తింటారో వారికి తెలియదు. అయినా వారంతా తమ వంతుగా ఈ సేవలో భాగమవుతున్నారు. దీన్ని కేరళలో 'పోతిచూరు' అంటారు. 'పోతిచోరు' అంటే భోజనం పొట్లం అని అర్థం. అలా అందించేవాళ్లు ధనవంతులు కారు. వారంతా సామాన్య ప్రజలు. వారు వండుకునే దానిలో కొంచెం ఇలా ప్యాక్‌చేసి పొట్లాల రూపంలో అందిస్తారు. ఇలా మొత్తం 40 వేల పోతిచోరు(భోజనం పొట్లాలు) వస్తాయంటే నమ్ముతారా?. ఔను} స్వచ్ఛందంగా చిన్న చితక పనులుచేసుకునే ప్రజల దగ్గర నుంచి యువత వరకు అందరూ ఇలా తమకు తోచినన్ని ఆహార పొట్లాలను ఇవ్వడం జరుగుతోంది. ఇలా కేరళలో 2017 నుంచి జరుగుతోంది. ఆ భోజన పోట్లాలన్ని ఆయా జిల్లాలోని ప్రభుత్వా ఆస్పత్రులకు వచ్చే పేదలకు, ప్రయాణికులకు, వృద్ధులకు చేరతాయి. దీన్ని సీపీఐ(ఎం) యువజన సంస్థ అయిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) 2017లో తిరువనంతపురం మెడికల్ కాలేజ్‌లో 300 పోతిచోరు ప్యాకెట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని "హృదయపూర్వం" అని కేరళలో పిలుస్తారు. దీని అర్థం హార్టీ మీల్ పార్సెల్ అని. ఆ తర్వాత ఆరేళ్లకు క్రమక్రమంగా కేరళలోని 14 జిల్లాలోని 50 ఆస్పత్రులకు ప్రతి రోజు 40 వేల పోతిచోరులు పంపిణీ చేసే స్థాయికి వచ్చిందని డీవైఎఫ్ఐ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్ చెప్పారు. ఈ హృదయపూర్వం కార్యక్రమం కోసం ప్రత్యేక కిచెన్ కమ్యూనిటీఏమి లేదు. ఆ ఆహారపు పొట్లాలన్ని ఒక్కక్కొరి ఇళ్ల నుంచి సేకరించినవేనని చెబుతున్నారు. ఈ డీవైఎఫ్ఐ కార్యకర్తలు పక్కా ప్రణాళికతో హృదయపూర్వం కార్యక్రమం కోసం పోతిచోరు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది ఆహార పంపిణీకి సంబంధంచిన క్యాలెండర్ ముందుగానే పక్కాగా సిద్ధం చేస్తారు. ఆ జాబితా ఆధారంగా డీవైఎప్‌ఐ మండలి కమిటీలతో పంచుకుంటారు. ఆ తర్వాత మండల కమిటీలు ఒకదాని తర్వాత మరొకటి ఆహార పంపిణీ బాధ్యతలను తీసుకుంటాయి. ముందుగా డీవైఎఫ్ఐ కార్యకర్తలు వారి ప్రాంతంలోని ఇళ్లను సందర్శించి మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం కోసం అదనంగా ఒకరికి భోజనం వండమని కోరతారు. కానీ వారంతా ఇద్దరు లేదా మూడు నుంచి ఐదు వరకు ఆహారపొట్లాలు సమకూర్చడం విశేషం. ఇక ఆ తర్వాత కార్యకర్తల ఈ సేకరించిన అదనపు ఆహారాన్ని నియమించిన ప్రభుత్వ ఆస్పత్రులలో పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం మొత్తం సమాజం మద్దుతునే జయప్రదంగా జరుగుతోంది. ఈ కార్యకర్తలు, వరదలు, లాక్డౌన్ సమయంలో ఆకలితో అలమటించే అభాగ్యులకే గాక డ్యూటీలో ఉండే పోలీసు సిబ్బందికి, ప్రయాణికులకు ఆ ఆహారపొట్లాలను అందిస్తారు. ఇలా పంపిణీ చేసే కార్యక్రమంలో చాలా ఆసక్తికరమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో ఓ ఆసక్తికరమైన ఘటన.. మలప్పురం మంపాడ్ ఎంఈఎస్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజేష్ మోంజీ ఈ ఏడాది జనవరిలో తన తల్లి చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీలో ఉన్నారు. ఆయనకు ఈ పోతిచోరు పొట్లం అందింది. ఆయన ఆ పొట్లం విప్పి చూడగా.. ఒక చిన్నారి రాసిన చిన్న కాగితపు నోటు కనిపించింది. ఆ నోట్లో ఇలా ఉంది.."చెట్టా, చెచీ, ఉమ్మా, తథా, అమ్మా..అని ఉంది. అంటే ఈ ఫుడ్ పార్శిల్ ఎవరికి అందుతుందో వారు ముందుగా నన్ను క్షమించండి. మా అమ్మ ఇంట్లో లేదు. నేను స్కూల్‌కి వెళ్లే తొందరలో దీన్ని సిద్ధం చేశాను. ఆహారం రుచిగా లేదు. అలాగే మీరు త్వరగా కోలుకోండి." అని రాసి ఉంది. ఆ పోతిచూరులో ఉన్న ప్రతి బియ్యపు గింజలో ఆ చిన్నారి ప్రేమతో నిండిపోయింది అని ఉపాధ్యాయుడు తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. నిజానికి ఇది కేవలం ఆహార కాదు అంతకుమించినది. ఈ భోజన పంపిణీని దాతృత్వంగా భావించొద్దు ఎందుకంటే ప్రస్తుతం యువతో పెరుగుతున్న స్వార్థాన్ని అంతం చేసేందుకు ఇది చక్కగా దోహదపడుతోంది అన్నారు సీపీఎం రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్. కాగా, ఈ ఆహారపొట్లాల సేకరణలో భాగం పంచుకుంట్ను ఓ గృహిణి మాట్లాడుతూ..పోతిచోరు సేకరణ తేది ఎప్పుడూ అని తెలుసుకుని...ఇలా పిడికెడు అన్నం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను చేయగలిగినంతలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని ఆమె చెబుతోంది. -
సహాయక చర్యల్లో పాలుపంచుకున్న ఏపీ ప్రభుత్వం
-
శభాష్ వాలంటీర్ నువ్వు సేవా వారియర్..!
-
ఉబర్‌లో సరికొత్త సేవలు.. తొలుత ఆ మూడు నగరాల్లో ప్రారంభం
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల, సుస్థిర వ్యాపార విధానానికి మద్దతుగా ఉబర్ గ్రీన్ పేరుతో కొత్త సేవలకు రైడ్ హెయిలింగ్ యాప్ ఉబర్ శ్రీకారం చుట్టింది. ప్రయాణం కోసం ఉబర్ యాప్‌లో కస్టమర్లు ఎలక్ట్రిక్ కారును ప్రత్యేకంగా కోరవచ్చు. జూన్ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ప్రారంభం కానున్నాయి. దశలవారీగా ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లోని 100కుపైగా నగరాల్లో ఉబర్ గ్రీన్ ఆన్ డిమాండ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని సంస్థ ప్రకటించింది. 2040 నాటికి పూర్తిగా.. ‘ఈవీల వాడకం ఊపందుకోవడంతో భారత మార్కెట్ కంపెనీకి ప్రాధాన్యతగా నిలిచింది. 2040 నాటికి సంస్థ వేదికగా ప్రతి రైడ్ ఎలక్ట్రిక్ వాహనం ఆధారంగా ఉండాలన్నదే మా లక్ష్యం’ అని ఉబర్ మొబిలిటీ, బిజినెస్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 8 లక్షల పైచిలుకు యాక్టివ్ డ్రైవర్ పార్ట్నర్స్ ఉన్నట్టు చెప్పారు. బుకింగ్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా సంస్థకు భారత్ మూడవ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్ వృద్ధిని నడిపించడానికి పెట్టుబడులను కొనసాగిస్తామని వివరించారు. భారత్‌లో 125 నగరాల్లో ఉబర్ సేవలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లోని 10,000 నగరాల్లో ఉబర్ వాహనాలు పరుగెడుతున్నాయి. పెద్ద ఎత్తున భాగస్వామ్యం.. ఉబర్ భారత్‌లో ఎలక్ట్రిక్ రైడ్ చేస్తోంది. తాజాగా పలు ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో కొత్తగా 25,000 ఎలక్ట్రిక్ కార్లను తన వేదికపై జోడించనుంది. ఉబర్ చేతులు కలిపిన కంపెనీల్లో లిథియం అర్బన్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ ఫ్లీట్, మూవ్ ఉన్నాయి. అలాగే 2024 నాటికి ఢిల్లీ నగరంలో 10,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టేందుకు జిప్ ఎలక్ట్రిక్‌తోనూ ఒప్పందం చేసుకుంది. ఉబర్ ఈవీల ఫాస్ట్ చార్జింగ్ కోసం జియో–బీపీ, జీఎంఆర్ గ్రీన్ ఎనర్జీతోనూ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. రుణ సౌకర్యం కోసం.. డ్రైవర్ పార్ట్నర్స్, ఇతర భాగస్వాములకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కావాల్సిన రుణ సౌకర్యం కల్పించేందుకు సిడ్బీతో రూ.1,000 కోట్ల డీల్ కుదుర్చుకుంది. పూర్తిగా ఈవీలకు మళ్లడం ఒక సవాల్. ఈవీలకు మారే ప్రక్రియలో ఆర్థిక భారం డ్రైవర్లపై పడకూడదు అని ఉబర్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభజీత్ సింగ్ అన్నారు. ‘ఈవీ రంగంలోని ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా రైడ్–షేరింగ్ పరిశ్రమలో డ్రైవర్లు వేగంగా ఎలక్ట్రిక్‌కు మారేందుకు సాయం చేస్తున్నాం. 2030 నాటికి యూరప్, ఉత్తర అమెరికాలో సున్నా ఉద్గార స్థాయికి చేరాలని లక్ష్యంగా చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఈ లక్ష్యానికి చేరుకుంటాం’ అని వివరించారు. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
డిశ్చార్జికి.. రీచార్జికి మధ్య ‘ట్రాన్సిషనల్ కేర్’.. కొత్త వైద్యసేవలకు డిమాండ్
నాగేందర్ (55) దిల్సుఖ్నగర్ నివాసి. తీవ్రమైన నరాల వ్యాధికి గురై ఖైరతాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత డిశ్చార్జయి ఇంటికి వెళ్లారు. కానీ నాలుగైదు రోజుల్లోనే సమస్యలు తిరగబెట్టి ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేవల లోపం దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వైద్యుల సూచనలను కచ్చితంగా అమలు చేస్తే.. ఈ పరిస్థితి వచ్చేదికాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటి నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ‘ట్రాన్సిషనల్ కేర్’అవసరమని గుర్తించారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు రోగులు చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యాక తిరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. వైద్యుల సూచనలను సరిగా పాటించలేకనో, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనో.. అనారోగ్య సమస్యను మొదటికి తెచ్చుకుంటున్నారు. చికిత్స తర్వాత జాగ్రత్తలు లోపిస్తే అత్యంత అధునాతనమైన చికిత్స సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రాన్సిషనల్ కేర్ సేవలు పుట్టుకొచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స ముగిసినప్పటి నుంచి పూర్తిస్థాయిలో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టేవరకు మధ్యలో అవసరమైన సేవలే ట్రాన్సిషనల్ కేర్. కొందరికి చికిత్స తర్వాత నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ వంటివి అవసరం. వ్యాధి సమస్యల కారణంగా ఎదుర్కొనే మానసిక క్షోభను తగ్గించేందుకు మానసిక పర్యవేక్షణ కావాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, న్యూరోసైన్స్, కార్డియాలజీకి సంబంధించిన సర్జరీల తర్వాత చికిత్సానంతర సమస్యలను తగ్గించడానికి, పూర్తిగా రికవరీ కావడానికి ట్రాన్సిషనల్ కేర్ మంచి పరిష్కారమని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి వారికి? ఎప్పుడు? ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ప్రతి లక్ష మంది బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 120కిపైగా మళ్లీ స్ట్రోక్ బారిన పడే చాన్స్ ఉందని అంచనా. వారు డిశ్చార్జి తర్వాతా ఆస్పత్రులకు, ఇంటికి తిరగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ, ఆస్పత్రి ఖర్చుల్ని తగ్గించుకోవడం, జాగ్రత్తల కోసం ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు ఉపయుక్తమని నిపుణులు చెప్తున్నారు. న్యూరో సర్జరీ, వెన్నెముక గాయాలు, హిప్, మోకాలి మారి్పడి వంటివాటిల్లో చికిత్సానంతరం ఇంటికి వెళ్లేందుకు పట్టే రెండు–మూడు వారాల వ్యవధిలో ప్రత్యేక ట్రాన్సిషనల్ కేర్ అవసరమని వివరిస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కొందరికి ఫిజియోథెరపీ, మానసిక కౌన్సెలింగ్ వంటివి సుదీర్ఘకాలం చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోగిని ఇంటికి తీసుకెళ్లడానికి బదులుగా కేర్ సెంటర్‌ను ఎంచుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అల్జీమర్స్ సమస్య ఉన్నవారికీ ట్రాన్సిషనల్ కేర్ అవసరమని అంటున్నారు. ఇక స్వాలో, స్పీచ్ థెరపిస్ట్, మసు్క్యలోస్కెలెటల్ ఫిజియోథెరపిస్ట్ సేవలు, ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావడం, ట్యూబుల ద్వారా ఆహారం అందించాల్సి రావడం, కదలికలకు తోడ్పడే పరికరాలు, మెషీన్లు, కొన్ని రకాల ప్రత్యేక బెడ్లు అవసరం ఉన్నప్పుడు ఈ సేవలను ఎంచుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. కేర్ సెంటర్లు ఏం చేస్తాయి? ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లలో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్ట్‌లు, డైటీíÙయన్లు, సైకాలజిస్టులు, ఆక్యుపేషనల్, స్పీచ్, రెస్పిరేటరీ థెరపిస్ట్‌లు, న్యూరో, కార్డియాక్ ఫిజియో థెరపిస్టులు, సైకోథెరపిస్టులు, రోగి పూర్తిగా కోలుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆధునిక సౌకర్యాలు, అనుభవజు్ఞలైన, మల్టీడిసిప్లినరీ రీహ్యాబ్ కేర్ టీమ్ రోగులను పూర్వస్థితికి తీసుకురావడానికి సాయపడుతుంది. రోగి డిశ్చార్జి సమ్మరీని పరిశీలించి, వైద్యులతో మాట్లాడి అవగాహన ఏర్పరుచుకుని, అవసరమైన సేవలను అందిస్తారు. రోగుల పొజిషన్లను మార్చే బెడ్‌సైడ్ అసిస్టెంట్లు, ఆహారాన్ని అందించే నర్సులు కేర్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. ఇంటర్నల్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. వ్యయ ప్రయాసలు తగ్గించే క్రమంలో.. దేశంలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వారికి తరచూ ఆరోగ్య సమస్యలు రావడం, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఎక్కువ. కొందరి విషయంలో ఇంట్లోనే ఉంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ల అవసరం ఏర్పడింది. సర్జరీ/ ప్రధాన చికిత్స వంటివి జరిగాక.. పూర్తిగా కోలుకోవడానికి ఆస్పత్రిలోనే ఉండటం తీవ్ర వ్యయ భారంతో కూడుకున్నది. అంతేగాకుండా ఇతర రోగులకు చికిత్స అందడంలో ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఈ సపోర్టివ్ కేర్ సేవలు అందిస్తుంది. – డాక్టర్ రామ్ పాపారావు, చైర్మన్, ఉచ్ఛా్వస్ ట్రాన్సిషనల్ కేర్ చదవండి: డాక్టర్లూ పదండి పల్లెకు పోదాం! -
సెలవిక.. శత్రుంజయ! ‘ఐఎన్ఎస్ మగర్’ యుద్ధ నౌక నిష్క్రమణ
సాక్షి, విశాఖపట్నం: నీటిలోనే కాదు.. నేలపైనా దాడిచేసే స్వభావం ఉన్న మొసలి (మగర్) లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న ఆ యుద్ధ నౌక వస్తుందంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేది. ఆయుధ సంపత్తిని మోసుకొస్తున్న ఆ నౌక కనిపిస్తే చాలు.. శత్రు సైన్యంతో పోరాడుతున్న బలగాలకు కొండంత ధైర్యం పోగవుతుంది. ఆపదలో ఉన్నవారికి ఆత్మీయత పంచుతూ.. విపత్తులో ఉన్నవారిని ఒడ్డుకు చేర్చుతూ.. 36 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన ఐఎన్ఎస్ మగర్ ఆదివారంతో విధులకు స్వస్తి పలకనుంది. వార్ఫేర్ వెసెల్‌గా అంతర్జాతీయ విన్యాసాల్లో సత్తా చాటిన మగర్‌కు భారత నౌకాదళం ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతోంది. ఒడ్డుకు వచ్చి మరీ.. భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఉభయచర యుద్ధ నౌకల్లో కీలకమైనదిగా ఐఎన్ఎస్ మగర్ ఖ్యాతి ఆర్జించింది. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డు సహకారంతో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ)లో మగర్ని యాంఫిబియాస్ షిప్‌గా తీర్చిదిద్దారు. అంటే.. సాధారణంగా షిప్‌లు ఒడ్డు వరకూ రాలేవు. కానీ.. మగర్ మాత్రం ఒడ్డు వరకూ వచ్చి.. సైన్యానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అందుకే.. దీనికి మగర్ (తెలుగులో మొసలి అని అర్థం) అనే పేరుపెట్టారు. 1987 జూలై 15న భారత నౌకాదళంలో ఈ షిప్ ప్రవేశించింది. విశాఖ నుంచి సుదీర్ఘ సేవలు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నానికి ఐఎన్ఎస్ మగర్ని కేటాయించారు. ల్యాండింగ్ షిప్ ట్యాంక్(ఎల్ఎస్టీ) హోదాలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. నలుగురు ల్యాండింగ్ క్రాఫ్ట్ వెహికల్ సిబ్బంది, అత్యవసర సమయంలో దళాల్ని మోహరించేందుకు మగర్ యుద్ధ నౌకను వినియోగించేవారు. శ్రీలంకలో ఎల్టీటీఈని నిరోధించే సమయంలో నిర్వహించిన ఆపరేషన్ పవన్‌లో మగర్ కీలక పాత్ర పోషించింది. నిరంతర పోరాటం చేసిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్(ఐపీసీకే)కు అవసరమైన సామగ్రిని అందించింది. వివిధ దేశాల్లో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లో మగర్ సత్తా చాటింది. 2006 ఫిబ్రవరి 22న విశాఖ తీరానికి 70 కి.మీ. దూరంలో మగర్ యుద్ధ నౌకలో ఘోర ప్రమాదం సంభవించింది. షిప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు నావికులు మృతి చెందారు. మరో 19 మంది గాయాల పాలయ్యారు. 2018వ సంవత్సరం వరకూ విశాఖ కేంద్రంగా సేవలందించిన మగర్‌ను 2018 ఏప్రిల్‌లో కొచ్చికి తరలించి.. మార్పులు చేర్పుల అనంతరం మొదటి స్క్వాడ్రన్ శిక్షణ నౌకగా సేవలు అందించింది. సునామీలో విశిష్ట సేవలు మగర్ అందించిన సేవల్లో ముఖ్యంగా 2004లో వచ్చిన సునామీ సమయమనే చెప్పుకోవాలి. ఎప్పుడు మళ్లీ సముద్రం ఉప్పొంగి.. విలయం వస్తుందో తెలీని సమయంలో ధైర్యంగా సాగర జలాల్లో ప్రయాణించిన మగర్.. అండమాన్ నికోబార్ దీవుల్లో చిక్కుకున్న 1,300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చింది. అంతేకాకుండా.. అక్కడి నుంచి వివిధ విపత్తు ప్రాంతాలకు తరలివెళ్లి నిరాశ్రయులుగా మిగిలిన వారికి సహాయక సామగ్రి అందజేయడంలోనూ కీలకంగా వ్యవహరించిన మగర్‌కు భారత రక్షణ దళం నుంచి అద్భుత ప్రశంసలందాయి. కోవిడ్ సమయంలో నిర్వహించిన ఆపరేషన్ సముద్ర సేతులోనూ మగర్ విశిష్ట పాత్ర పోషించింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడం, స్నేహపూర్వక దేశాలకు వైద్యసామగ్రి అందించడం మగర్ ద్వారానే సాధ్యమైంది. నౌకాదళంలో సేవలు ప్రారంభం:15 జూలై, 1987 పొడవు: 390 అడుగులు వెడల్పు: 57 అడుగులు డ్రాఫ్ట్: 13 అడుగులు వేగం: గంటకు 28 కి.మీ. ప్రయాణ సామర్థ్యం: ఏకధాటిగా 3 వేల మైళ్ల ప్రయాణం ఆయుధ సామర్థ్యం: బీఈఎల్–1245 రాడార్ నావిగేటర్, నాలుగు బోఫోర్స్ 40 ఎంఎం గన్స్, 2 మల్టిపుల్ బ్యారెల్ రాకెట్ లాంచర్స్, ఒక సీ కింగ్ హెలికాప్టర్ వార్ ఫేర్ యూనిట్: 15 యుద్ధ ట్యాంకులు, 13 బీఎంపీ పదాతిదళ పోరాట వాహనాలు, 10 ట్రక్కులు, 8 భారీ మోటార్ వెహికల్స్‌తోపాటు 500 మంది సైనికుల్ని ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. నేడు కొచ్చిలో నిష్క్రమణం నౌకాదళానికి 36 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించిన మగర్ యుద్ధ నౌకకు కొచ్చి పోర్టులో భారత నౌకాదళం ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించే డీకమిషన్ కార్యక్రమంలో ఐఎన్ఎస్ మగర్‌లో సేవలందించిన కెప్టెన్లు, అధికారులకు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘అవర్ బోల్డ్ అండ్ బ్రేవ్ మగర్’ పేరుతో షార్ట్ ఫిల్మ్‌ని ప్రదర్శించి యుద్ధ నౌకకు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. (చదవండి: మరింత వేగంగా వీసీఐసీ అభివృద్ధి) -
పేదరికాన్ని జయించి భాషా సాహిత్యాలలో రాణించిన ఆచార్య రవ్వా శ్రీహరి
నల్లగొండ జిల్లా వెల్వర్తి లోని పేద చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టిన (1943) ఒక కుర్రవాడు యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి సంస్మృత విద్యా పీఠంలో చేరడమే విశేషమైతే అందులోని అంతా బ్రాహ్మణ సహ విద్యార్థులతో పోటీపడి ఉన్నత స్థానంలో నిలవడం మరో విశేషం. కష్టపడి డీవోఎల్, బివోఎల్, బిఏ, ఎంఏ వంటి ఎన్నో మెట్లు ఎక్కి డాక్టరేట్ కూడా చేసి (1973), హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం లో బహుకాలం బోధనచేసి, ద్రావిడ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు కాగలిగాడు (2002), ఉత్తమ పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సంస్కృతంలో,తెలుగులో భాషా సాహిత్యాలపై ఎన్నో పరిశోథనాత్మకమైన రచనలు చేసి 'మహా మహోపాధ్యాయ' అనిపించుకున్న మహనీయుడు ఆచార్య రవ్వా శ్రీహరి ఇక లేరు అన్న వార్త వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులనే కాదు నా లాంటి ఎంతో మంది వారి అభిమానులను కూడా శోక సాగరంలో ముంచింది. అన్నమయ్య పదకోశాన్ని తయారుచేసిన, శ్రీహరి నిఘంటువు రూపొందించిన, నల్లగొండ జిల్లా మండలికాలు అక్కడి ప్రజల భాషపై ఎన్నో గ్రంధాలు రచించిన అంతటి గొప్ప పండితుడు. వరంగల్ కు చెందిన, సహకార శాఖలో నా సీనియర్ అయిన డాక్టర్ ఏ.సురేంద్ర కుమార్ గారి ద్వారా మా అన్న కీశే వేముల పెరుమాళ్ళు గారి ప్రసిద్ధ గ్రంథం 'తెలంగాణ జాతీయాలు' పుస్తకం గురించి విని తెప్పించుకొని చదివి ప్రశంసించడం ఇంకా గొప్ప విషయం. 2005లో 'మానవతా పరిమళాలు' పేరుతో మా అన్నగారి స్మారక సంచిక ప్రచురించి నప్పుడు దానికి సందేశం పంపుతూ ' రాజకీయ రంగంలో ఉంటూ ప్రజాహిత కార్యాల్లో తలమునకలౌతూ కూడా భాషా, సాహిత్య రంగాల్లో కృషి చేయడం ప్రశంసనీయం. పెరుమాళ్ళు గారి 'తెలంగాణ జాతీయాలు' అన్న గ్రంధం భాషా రంగంలో వారు చేసిన కృషికి అద్దం పడుతుంది.తెలంగాణ భాష ప్రత్యేకతను విశిష్ట తను చాటుతుంది కూడా ' అని అభినందించారు. అంతేకాదు 12 సెప్టెంబర్ 2009 నాడు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆ గ్రంధావిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -వేముల ప్రభాకర్, రచయిత , రిటైర్డ్ ప్రభుత్వ అధికారి -
సచివాలయాల ద్వారా ట్యాబ్‌లకు రిపేర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందజేసిన ట్యాబ్‌లలో ఏదైనా సమస్య వస్తే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమా ణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 8వ తరగతి చదువుతున్న 5,18,750 మంది పిల్లలకు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. అయితే వాటిలో ఏదైనా సమస్య వస్తే.. విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశముంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ట్యాబ్‌ల సర్వీసు అంశాల పర్యవేక్షణ కోసం సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యు కేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలను నోడల్ అధికారులుగా నియమించారు. అలాగే ట్యాబ్‌ల సర్వీస్ అంశాల పర్యవేక్షణకు గ్రామ, వార్డు సచి వాలయాల శాఖ ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను కూడా రూపొందించింది. ట్యాబ్ రిపేర్ ప్రక్రియపై కలె క్టర్లు, సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్లతో పాటు అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏ సచివాలయంలోనైనా ట్యాబ్ సర్వీస్ పొందే వీలు.. ♦ సమస్య ఏర్పడిన ట్యాబ్‌ను విద్యార్థి గానీ తలిదండ్రులు లేదా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధా నోపాధ్యాయులు ఎవరో ఒకరు తమకు సమీపంలోని సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు అందజేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఏ సచివాలయంలోనైనా ఈ సేవను విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. ♦ ట్యాబ్ రిపేరు ప్రక్రియకు సంబంధించిన సమాచారం కోసం ఫోన్ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు. ట్యాబ్ సమస్య పరిష్కారమైన తర్వాత సంబంధిత సచివాలయ సిబ్బందే దానిని సేకరించి.. తిరిగి విద్యార్థికి అందజేస్తారు. ♦ ట్యాబ్ రిపేర్ చేయడానికి వీలుపడకపోతే ‘వారంటీ’ నిబంధనలకు లోబడి ఆ సర్వీసు సెంటర్ నుంచే కొత్త ట్యాబ్‌ను సంబంధిత సచివాలయ సిబ్బంది సేకరించి విద్యార్థికి అప్పగిస్తారు. కాగా, ఈ ప్రక్రియపై అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు 8 విడతలలో శిక్షణ ఇచ్చారు. -
జనాభా పెరుగుదల కోసం ఆ దేశం పాట్లు.. నిబంధనను బ్రేక్ చేసి మరీ..
దక్షిణ కొరియాలో గత నెలలో దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు నమోదయ్యింది. దీంతో అక్కడి పాలక సంప్రదాయ పీపుల్ పవర్ పార్టీ జనన రేటుని పెంచే సంప్రదాయేతర మార్గాలపై దృష్టిసారించింది. వాస్తవానికి దక్షిణ కొరియాలో 18 నుంచి 28 ఏళ్ల వయసులోపు పురుషులు తప్పనసరిగా మిలటరీ సేవ చేసేలా కఠినమైన నిబంధన ఒకటి ఉంది. ఐతే అక్కడి ప్రభుత్వం ఆ నిబంధనను సైతం బ్రేక్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అక్కడ పురుషులకు 30 ఏళ్లు వచ్చేలోపు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే తప్పనిసరి అయిన మిలటరీ సేవ నుంచి మినహాయింపు ఇస్తానని చెబుతోంది. ఈ మేరకు సియోల్ ఆధారిత మిలటరీ హ్యుమన్ రైట్స్ సెంటర్ కో ఆర్డినేటర్ చో క్యు సుక్ మాట్లాడుతూ..ఈ ప్రతిపాదన యువకులు ఇష్టపడతారని, పైగా జననాలకు అడ్డంకి తొలుగుతుందని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుక్త వయస్కులను పిల్లలను కనమని ప్రోత్సహిస్తున్నారా అని మండిపడుతున్నారు. అయినా మిటలటరీకి వెళ్లకుండా ఉండేందుకు ముగ్గురు పిల్లలను ఎవరు కలిగి ఉంటారు, ఆ ఖర్చులను ఎలా భరిస్తారు అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. మరికొంత మంది నిపుణులు ఇది చాలా ప్రమాదకరం, హాస్యస్పదమైనది అని చెబుతున్నారు. ఈ క్రమంలో సియోల్ విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ అడ్మినస్ట్రేషన్ అసోసియేట్ ప్రోఫెసర్ ఎరిక్ హై వాన్ కిమ్ మాట్లాడుతూ..జాతీయ ఆర్థిక వృద్ధి లేదా దేశ స్థిరత్వం కోసం పిల్లలను కనమని ప్రజలను అడగలేం. సంతానోత్పత్తిని అలాంటి సాధనంగా భావించకూడదు. అలాగే ముసాయిదా మినహాయింపు విధానం కూడా ప్రమాదకరమేనని ప్రొఫెసర్ జెఫ్రీ రాబర్ట్సన్ హెచ్చరించారు. దీని వల్ల ఉద్యోగం చేసే తల్లులకు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ వంటివి మరింత భారమయ్యే అవకాశం ఉంది. అలాగే ఆ ఖర్చులను భరించగలిగేలా మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు పొందడం కూడా కష్టమే అని నిపుణులు చెబుతున్నారు. కాగా, దక్షిణ కొరియా ఇంకా ఈ నిబంధనను ఖరారు చేయలేదని, అమలు చేయాలా? లేదా అని అంశంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం. (చదవండి: అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు..ఇద్దరికి తీవ్ర గాయాలు) -
బదిలీ నిబంధనపై గుబులు
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎప్ఓ) పరిధిలో ఉద్యోగులకు సంబంధించి సంస్థ తీసుకొచ్చిన నూతన బదిలీ విధానం–2022 క్లరికల్ స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈపీఎఫ్ఓలో క్లర్క్(సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్) లేదా సీనియర్ క్లర్క్ (సీనియర్ సొషల్ సెక్యూరిటీ అసిస్టెంట్) ఒకేచోట మూడు సంవత్సరాల సర్విసు పూర్తి చేసుకుంటే వెంటనే ఇతర కార్యాలయానికి బదిలీ చేయాలనేది పాలసీలోని ప్రధానాంశం. ఈపీఎఫ్ఓ కార్యక్రమాల అమలులో పారదర్శకత పాటించడంతో పాటు పనుల్లో వేగం పెంచేందుకు ఈ తరహా మార్పు తప్పనిసరి అని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 12న కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న వారికి ఏటా నిర్వహించే బదిలీలకు సంబంధించిన నిబంధనలను వివరించింది. అయితే ఎలాంటి నిర్ణయాధికారాలు లేని క్లర్క్ స్థాయి ఉద్యోగికి కూడా ఈ నిబంధన వర్తింపజేసి మూడేళ్లకోసారి బదిలీ చేయడం వల్ల వారి కుటుంబాల భవిష్యత్ ఇబ్బందికరంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కావాలంటే సెక్షన్లు మార్చండి.. ఈపీఎఫ్ఓకు సంబంధించి తెలంగాణలో ఎనిమిది చోట్ల కార్యాలయాలున్నాయి. హైదరాబాద్‌లోని బర్కత్‌పురా, మాదాపూర్, కూకట్పల్లి, పటాన్‌చెరుతో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేటలో ఇవి కొనసాగుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో కడప, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరులో ఈ కార్యాలయాలున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 2 వేల వరకు క్లరికల్ ఉద్యోగులుంటారు. కాగా ఈపీఎఫ్ఓ తాజా నిబంధనతో వీరు ఆ రాష్ట్ర పరిధిలోని ఏ కార్యాలయానికైనా బదిలీ అయ్యే అవకాశం ఏర్పడింది. దీన్ని అమలు చేస్తే తమ పిల్లల చదువులు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయని, భవిష్యత్తులో స్థానికత అంశం పెద్ద సమస్యగా మారుతుందని ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. బదిలీ చేయాలనుకుంటే ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి కాకుండా.. ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయంలోనే సెక్షన్ల మార్పు చేస్తే ఉద్యోగికి వెసులుబాటు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనివల్ల ఉద్యోగికి బదిలీ సమయంలో ఇచ్చే ఒక నెల అదనపు వేతనానికి సంబంధించిన నిధులు కూడా సంస్థకు మిగులుతాయని చెబుతున్నారు. ఈ మేరకు క్లరికల్ కేడర్ ఉద్యోగులు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. మరోవైపు నూతన పాలసీ అమల్లోకి వచ్చి రెండు నెలలు కావస్తుండడం, త్వరలోనే బదిలీలు చేసే అవకాశం ఉండటంతో.. ఉద్యోగుల సంఘం న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతోంది. -
మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ చైల్డ్ కేర్ లీవ్‌ను పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని నిబంధన ఉంది. దీనిని సవరించి.. మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత సోమవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ సమస్యను సీఎం దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన టీచర్ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి అలాగే ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ను 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని కోరగా.. దీనిపైనా సానుకూలంగా స్పందించిన సీఎం ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తాము కోరిన వెంటనే సీఎం జగన్ మహిళా ఉద్యోగులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
దక్షిణ కొరియా 6జీ ఫ్యూచర్ ప్లాన్స్ అదుర్స్: చైనాకే షాకిస్తుందా..?
సియోల్: టెలికం రంగంలో 5జీ నెట్వర్క్ ఒక సంచలనం అని చెప్పాలి. ఇప్పటికే మన దేశంలో చాలా ప్రాంతాల్లో 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా దక్షిణ కొరియా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా అనుకున్న దానికంటే రెండు సంవత్సరాల ముందుగానే అందు బాటులోకి తేనున్నామని, దక్షిణ కొరియా సైన్స్, ఐసీటీ మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది.రాబోయే 6జీ నెట్వర్క్ పేటెంట్ పోటీలో ఈ సంఖ్యను 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచనున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది. ఎలెక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, రోబోటిక్ నూతన సాకేంతికత, ఉత్పత్తులతో దూసుకుపోతున్న దక్షిణ కొరియా 2028లో ప్రపంచంలోనే తొలి 6జీ నెట్వర్క్ సేవను ప్రారంభించాలని యోచిస్తోంది. వైర్లెస్ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా కే-నెట్వర్క్ 2030 ప్రణాళికలో భాగంగా నెక్ట్స్ జెన్ నెట్వర్క్ కోసం రానున్న రెండేళ్లలో మరింత వేగవంతం చేయనుంది. బెర్నామా నివేదిక ప్రకారం ప్రపంచస్థాయి 6జీ టెక్నాలజీ ద్వారా సురక్షితమైన మొబైల్ నెట్‌వర్క్‌ను దక్షిణ కొరియా ఆవిష్కరించనుంది. కౌంటీ నెట్వర్క్ సరఫరా గొలుసును బలోపేతం చేయాలనే ప్రణాళికలో భాగంగా, దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 625.3 బిలియన్ వోన్ లేదా 481.7 బిలియన్ డాలర్ల విలువైన కోర్ 6జీ సాంకేతికతలపై పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా, దేశంలో తదుపరి తరం మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీ ఉత్పత్తులపై దేశీయ కంపెనీలను ప్రోత్సహించాలని భావిస్తోంది. మొబైల్ పరికరానికి అనుకూలంగా ఉండే ఓపెన్ RAN లేదా ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం స్థానిక కంపెనీలను ప్రోత్సహించనుదని Yonhap నివేదించింది. కాగా ఆసియాలో నాల్గవ-అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గత సంవత్సరం 5జీ పేటెంట్ల సంఖ్యలో 25.9 శాతంగా ఉంది. ఈ విషయంలో మార్కెట్ లీడర్ చైనాను 26.8 శాతం మాత్రమే అనేది గమనార్హం. -
జర్నలిస్టులపై బ్యాన్,ట్విటర్ స్పేసెస్‌కు బ్రేక్..బైడెన్‌పై సెటైర్లు
న్యూఢిల్లీ: ట్విటర్లో ఆడియో లైవ్ సర్వీస్ స్పేసెస్ పనిచేయక పోడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. గురువారం అర్థరాత్రి నుంచి స్పేసెస్ పనిచేయడం మానేసింది. దీంతో ట్విటర్ ద్వారా ఏమైంది స్పేసెస్‌కు అంటూ వాకబు చేయడం మొదలుపెట్టారు. దీంతో ట్విటర్ బాస్, ఎలాన్ మస్క్ స్పందించారు.లండన్‌లోని సోహోలో తన మొదటి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఇటీవల ఏదీ కూడా ఉచిత ఉత్పత్తులను అందించలేదు. Good fun while it lasted. Great knowing everyone on Twitter Spaces. Bear market feels. pic.twitter.com/APzBPyoa4T — Shash (@shashxg) December 16, 2022 కొంతమంది జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేసిన తర్వాత ట్విటర్ స్పేసెస్ నిలిచిపోవడం చర్చకు దారి తీసింది. సస్పెండ్ అయిన పలువురు జర్నలిస్టులు ఇప్పటికీ అందులో పాల్గొనవచ్చనే అనుమానంతో మస్క్ అలా చేశారంటైటూ విమర్శలు చెలరేగాయి. దీంతో ట్వీపుల్ ట్వీట్లకు స్పందించిన ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ట్విటర్ ద్వారానే వివరణ ఇచ్చారు.ఇందులోని లెగసీ బగ్ (పాతబగ్)ను పరిష్కరిస్తున్నాం అని బహుశా రేపటికి పని చేస్తుందంటూ వివరణ ఇచ్చారు. #TwitterSpaces Will Be working Tomorrow ✌🏻 pic.twitter.com/nwqRdaFGai — Ayyappan (@Ayyappan_1504) December 16, 2022 Holy Shit. Elon Musk just popped into a Twitter Spaces chat with a bunch of journalists. He was called out by journalist Drew Harrell, who he banned, for lying about posting links to his private information, then leaves almost immediately after being pressed. Here is the exchange pic.twitter.com/wVA9Gb5MVJ — Bradley Eversley (@ForeverEversley) December 16, 2022 కాగా సీఎన్ఎన్ నెట్వర్క్, న్యూయార్క్ టైమ్స్ ,వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన డ్రూ హార్వెల్ , Mat Binder Mashable సహా పలువురు జర్నలిస్టుల ఖాతాలను ట్విటర్ గురువారం సస్పెండ్ చేసింది. తన ప్రైవేట్ జెట్ విషయాలను బహిర్గంతం చేసినందుకు ఏడు రోజుల సస్పెన్షన్‌లో పెట్టినట్టు మస్క్ ప్రకటించారు. డాక్సింగ్ నియమాలు అందరితోపాటు జర్నలిస్టులకు కూడా వర్తిస్తాయనీ తనను నిరంతరం విమర్శించడం తప్పు కాదు. కానీ తన రియల్ టైం వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేయడం ట్విటర్ నిబంధనలకు విరుద్ధమని, తన ఫ్యామిలీకి ఉనికికి ప్రమాదమని పేర్కొన్నారు. If anyone posted real-time locations & addresses of NYT reporters, FBI would be investigating, there’d be hearings on Capitol Hill & Biden would give speeches about end of democracy! — Elon Musk (@elonmusk) December 16, 2022 అంతేకాదు సదరు జర్నలిస్టుల రియల్ లొకేషన్, చిరునామా లాంటివి రివీల్ చేస్తే ఎఫ్‌బీఐ విచారణ చేస్తుంది.. ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ బైడెన్ స్పీచ్ లిస్తారు అంటూ అమెరికా అధ్యక్షుడి పైనే సెటైర్లు వేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Hyderabad: మీరూ అవ్వొచ్చు ట్రాఫిక్ పోలీసు.. ఎలాగంటే!
సాక్షి హైదరాబాద్: ‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’ అనే కాన్సెప్ట్ కాదు వీళ్లది. సమాజానికి తమ వంతు సహాయం, బాధ్యతగా వ్యవహరించాలనుకునే గుణం! కార్యాలయాలు, విద్యా సంస్థల పునఃప్రారంభంతో సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవటంతో నియంత్రణ, క్రమబద్దీకరణలో వీళ్లూ భాగస్వామ్యులవుతున్నారు. వారే ట్రాఫిక్ పోలీసులతో సమానంగా రోడ్ల మీద విధులు నిర్వరిస్తున్న ట్రాఫిక్ వలంటీర్లు! ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగులు గత తొమ్మిదేళ్లుగా సైబరాబాద్ పరిధిలో మేము సైతం అంటూ ట్రాఫిక్ సేవ చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఉత్త మ ప్రతిభ కనబర్చిన ట్రాఫిక్ వలంటీర్లను బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణా యెదుల తదితరులు పాల్గొన్నారు. 2013 నుంచి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 4,500 మంది ట్రాఫిక్ వలంటీర్లు సేవలందిస్తున్నారు. వలంటీర్లుగా సేవలు అందించాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్లు ఏడీఎట్దిరేట్ఎస్సీఎస్సీ.ఇన్ కు మెయిల్ లేదా 9177283831 నంబరులో సంప్రదించాలి. వలంటీర్లు ఏం చేస్తారంటే... తొలుత సాధారణ ట్రాఫిక్ సమయంలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులకు వలంటీర్లు మద్దతు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వారాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ (డీడీ), ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించి చలాన్లు జారీ చేయించడం, రోడ్డు ప్రమాదాలలో బాధితులను ఆసుపత్రికి చేర్చడంలో వంటి వాటిల్లో కూడా సహాయం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఈ ట్రాఫిక్ వలంటీర్లు 5,500 గంటలు పని చేశారు. 8,200 ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించారు. వీరిలో 6,100 మంది వాహనదారులకు చలాన్లు జారీ అయ్యాయి. (క్లిక్ చేయండి: మెట్రో స్టేషన్లో బ్యాగులు తారుమారు.. ట్వీట్ చేయడంతో..) ఒత్తిడి తగ్గుతుంది అన్ని వర్గాల ప్రజల నుంచి ట్రాఫిక్ వలంటీర్లకు ఆసక్తిగా కనబర్చటం హర్షణీయం. కొన్ని ఐటీ కంపెనీలైతే వారి సెక్యూరిటీ గార్డులను వలంటీర్లగా నియమిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల రాకపోకల సమయంలో వాళ్లే ఆయా మార్గంలోని ట్రాఫిక్‌ను నియంత్రించుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులపై పని ఒత్తిడి తగ్గుతుంది. – టీ.శ్రీనివాస రావు, డీసీపీ, ట్రాఫిక్ సైబరాబాద్ -
హెలికాప్టర్ సర్వీస్ అని రూ.17 వేలు టోపీ
మైసూరు: మైసూరు నగరంలో ఆన్లైన్ మోసాలకు హద్దు లేకుండా పోతుంది. ప్రతిరోజూ ఒకరో ఇద్దరో వంచనకు గురవుతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం దర్శనం కోసం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెబ్సైట్లో గాలించి రూ. 17,000 పోగొట్టుకున్నాడు. మైసూరు గాయత్రి పురంలో నివాసం ఉంటున్న జీ బసవణ్ణ (32) వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం జమ్ములో నుంచి ఆలయం వరకు హెలికాప్టర్ సర్వీసు ఉన్నదని, బుక్ చేసుకోవచ్చని హిమాలయ హెలిప్యాడ్ అనే సంస్థ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయుడు వెబ్సైట్ ద్వారా రూ. 17,000 చెల్లించాడు. ఆ తరువాత ఎన్నిరోజులైనా స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు మైసూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: వరదలపై సమీక్ష సమావేశం... నిద్రపోయిన మంత్రి) -
తైవాన్‌లో పెరుగుతున్న టెన్షన్... ఉక్రెయిన్‌లా పోరు సాగించలేం
Taiwan's previous government reduced compulsory service from one year: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ తైవాన్ పర్యటన ఎంతటి ఉద్రిక్తలకు దారితీసిందో తెలిసిందే. నాన్సీ పర్యటనతో చైనా యుద్ధానికి సై అంటూ వార్నింగ్‌లు ఇస్తూ.. తైవాన్ సరిహద్దు, జలసంధిలో పెద్ద ఎత్తున్న సైనిక కసరత్తులు, సైనిక విన్యాసాలు చేపట్టింది. ప్రపంచ దేశాలకు మరో యుద్ధం మొదలవుతుందేమో అన్నంత భయాన్ని కలిగించింది చైనా. సాక్షాత్తు అమెరికానే ఇది తమ వ్యక్తిగత సందర్శనని చెబుతున్నప్పటికీ చైనా శాంతించ లేదు. పైగా అక్కడ తైవాన్ సరిహద్దుల వెంబడి తమ సైనికులను మోహరింపచేసి.... అన్ని పనులు పూర్తి చేశాం, ఏ క్షణమైన యుద్ధానికి రెడీ అంటూ పెద్ద బాంబు పేల్చింది. దీంతో తైవాన్‌లో సర్వత్ర భయాలు, ఆందోళనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఎప్పటికైన చైనా తమ దేశంపై దండయాత్ర చేసి లాగేసుకుంటుందని భయపుడుతూనే ఉంది తైవాన్. కానీ ఇప్పుడూ చైనా తైవాన్ సరిహద్దుల్లో సాగిస్తున్న తాజా పరిణామాలతో ఆ భయాలు మరింత అధికమయ్యాయి. గతంలో తైవాన్ స్వచ్ఛంద దళాన్ని సృష్టించే లక్ష్యంతో ఒక ఏడాది నిర్బంధ సేవను అమలు చేసింది. కానీ ఇప్పుడు ఆ నిర్బంధ సేవను నాలుగు నెలలకు తగ్గించింది. వాస్తవానికి ఈ నాలుగు నెలల సమయం నిర్బంధ సైనిక శిక్షణకు సరిపోదు. ఈ మేరకు ఒక హెన్నీ చెంగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంజెంట్ మాట్లాడుతూ..తాను నాలుగు నెలల సైనిక శిక్షణ పూర్తి చేశాను కానీ ఎక్కువ కాలం రాత పనిలోనే గడిపినట్లు చెబుతున్నాడు. తమ పని యుద్ధం చేయడం కాబట్టి తుపాకి పట్టుకుని కాల్చడం నేర్పిస్తే సరిపోతుంది కానీ ఆ శిక్షణ ఇవ్వలేదని వాపోయాడు. అదీగాక ప్రస్తుతం తైవాన్‌లో సైనిక బలగం కూడా తక్కువగానే ఉంది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు యంత్రాంగం త్సాయ్ ఇంగ్-వెన్ సైనిక సేవనను పునరుద్ధరించాలా లేదా అనేదానిపై తీవ్ర సందిగ్ధంలో ఉంది. తైవాన్ నేషనల్ డిఫెన్స్ ప్రకారం సైనిక శిక్షణను పెంచడం తోపాటు జెట్ విమానాలు, యాంటీ షిప్ క్షిపణులు పెద్ద మొత్తంలో ఇప్పటికే తైవాన్ కొనుగోలు చేసింది కానీ అవి ఏ మాత్రం సరిపోవని తేల్చి చెప్పింది. అదీగాక ఉక్రెయన్లా యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తైవాన్ ప్రజలు సిద్ధంగా లేరని తైపీ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ చెబుతున్నారు. అంతేకాదు రైఫిల్ పట్టుకోవడమే కాదు, శిక్షణ ద్వారా సముహంగా యుద్ధ పరిస్థితులను ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి అప్పుడే వారికి భవిష్యత్తులో ప్రతిఘటించాలనే ఆశ ఉంటుందన్నారు. ఏది ఏదీమైన చైనా తైవాన్‌ని తీవ్ర భయాందోళనలు గురిచేసి సంకటస్థితిలోకి నెట్టేసింది, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలయడం లేదని తైవాన్ ఆర్మీ ఆవేదనగా పేర్కొంది. (చదవండి: -
హైదరాబాద్: మెట్రో రైల్లో సాంకేతిక లోపం
-
సొంతూరికి బస్సు వచ్చేలా చేసిన బిగ్‌బాస్ గంగవ్వ..
Bigg Boss Gangavva Initiative For Bus Service To Lambadipally: యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది. 'మై విలేజ్ షో'లో తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణలతో ఐదో వారంలోనే బిగ్‌బాస్ హౌజ్ నుంచి నిష్కమించిన గంగవ్వ.. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, రాజ రాజ చోర చిత్రాల్లో నటించి అలరించింది. ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా తన సొంతూరికి తిరిగి బస్సు సర్వీసును తీసుకొచ్చింది. గంగవ్వది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. ఈ గ్రామానికి మొదట్లో బస్సు సర్వీసు ఉండేది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లికి ఆర్టీసీ బస్సు రావట్లేదు. దీంతో గ్రామస్థులు, వ్యవసాయ దారులు, కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లి రావడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన చార్జీలతో తలకుమించిన భారమైంది. తమ సమస్యలకు పరిష్కారంగా బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలనుకున్నారు లంబాడిపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు. ఇందుకోసం బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ సహాయం కోరారు. చదవండి: తన కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ లంబాడిపల్లికి తిరిగి బస్సు తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామస్థులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను కలిసింది గంగవ్వ బృందం. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించారు అధికారులు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పలుగా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. లంబాడిపల్లికి తిరిగి బస్సు రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులను కలిసిన గంగవ్వ బృందంలో 'మై విలేజ్ షో' టీం నటులు అనిల్, అంజి మామ తదితరులు ఉన్నారు. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1571342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వివాహేతర సంబంధాన్ని దుష్ప్రవర్తనగా పరిగణించలేం!: కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు
Court Cancels Cop’s Sacking: సమాజ దృక్కోణం నుంచి వివాహేతర సంబంధాన్ని "అనైతిక చర్య"గా చూడగలిగినప్పటికీ, దానిని "దుష్ప్రవర్తన"గా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కానిస్టేబుల్ తన కుటుంబంతో కలిసి నివసించే పోలీస్ హెడ్‌క్వార్టర్‌లోనే వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు తనను సర్వీస్ నుంచి తొలగించడంతో అతను సవాలు చేస్తూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు. "అయితే పిటిషనర్ క్రమశిక్షణలో భాగంగా వివాహేతర సంబంధం దుష్ప్రవర్తనే. సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత వ్యవహారమని బలవంతపు ఒత్తిళ్లు లేదా దోపిడీ ఫలితంగా కాదు అని" కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రవర్తనా నియమాలు 1971 ప్రకారం దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురాలేం అని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు అతన్ని ఒక నెలలోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అతను విధుల నుంచి తొలగించబడినప్పటి నుంచి అతని వేతనంలో 25 శాతం చెల్లించాలని జస్టిస్ సంగీతా విషెన్ సంచలన తీర్పు వెలువరించారు. మరోవైపు పిటిషనర్ కానిస్టేబుల్ తన అభ్యర్థనలో సంబంధం ఏకాభిప్రాయమని, ప్రతిదీ తమ స్వంత ఇష్టపూర్వకంగా జరిగిందని వాదించాడు. అంతేకాదు పోలీసు డిపార్ట్మెంట్ సరైన విచారణ ప్రక్రియను అనుసరించలేదని, తనను తొలగిస్తూ వచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సదరు మహిళతో కానిస్టేబుల్ అక్రమ సంబంధానికి సంబంధించిన సీసీఫుటేజ్‌ని 2012లో నగర పోలీసు ఉన్నతాధికారులకు అందించి మరీ వితంతువు కుటుంబం అతని పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనికి షోకాజ్ నోటీసులు పంపారు. ఆ జంట కూడా సంబంధాన్ని అంగీకరించడంతో పోలీసులు విచారణ చేయడం ఇరు పార్టీలను ఇబ్బంది పెట్టడమే అవుతుందని భావించి పూర్తి విచారణ జరపలేదు. ఆ తర్వాత జాయింట్ పోలీస్ కమీషనర్ అతను డిపార్ట్మెంట్లో కొనసాగితే ప్రజలకు పోలీస్‌శాఖ పై విశ్వాసం సన్నగిల్లుతుందంటూ 2013లో అతన్ని విధుల నుంచి తొలగించారు. అయితే కోర్టు మాత్రం విచారణ జరపకపోవడంతోనే అతన్ని విధుల నుంచి తొలగించి రద్దు చేసి పక్కన పెట్టిందని ఉత్తర్వులో పేర్కొంది. అంతేకాదు పోలీసు సర్వీస్ నిబంధనల చట్టం ప్రకారం ఒక పోలీసును తొలగించడానికి ఇది కారణం కాదని, పైగా అది అతని వ్యక్తిగత వ్యవహారమని కోర్టు స్పషం చేసింది. (చదవండి: రవిదాస్ దేవాలయంలో ప్రార్థనలు చేసిన మోదీ) -
ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త, ఉచిత డేటా ఆఫర్..ఎంతకాలం అంటే?
ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ బ్రాండ్ బ్యాండ్ సర్వీస్ సంస్థ టాటా ప్లే ఫైబర్ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఆ సంస్థ రూ.1150 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను దాని కొత్త సబ్స్క్రైబర్లకు ఒక నెల పాటు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ‘ట్రై అండ్ బై’ పథకం కింద ఈ ప్లాన్ వినియోగదారులకు ఒక నెలపాటు ఉచితంగా బ్రాండ్ బ్యాండ్ ను వినియోగించుకోవచ్చు. అయితే కంపెనీ వినియోగదారులు ముందుగా సర్వీస్ నాణ్యతను పరీక్షించి, ఆపై కనెక్షన్‌ని కొనుగోలు చేస్తే ఈ ప్లాన్‌ను ఉచితంగా పొందొచ్చని టాటా ప్లే ఫైబర్ నిర్వాహకులు తెలిపారు. రూ.1150 ప్లాన్ కింద రూ.1150 ప్లాన్ కింద వినియోగదారులకు 200 ఎంబీపీఎస్ డౌన్లోడ్, అప్లోడ్ వేగంతో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను పొందవచ్చు. కొత్త సబ్స్క్రైబర్లకు ఈ ప్లాన్ ఉచితంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ వినియోగదారులు రూ.1500 ఒక్కసారి రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రై అండ్ బై స్కీమ్ కంపెనీ అందించే ఈ ప్రమోషనల్ ఆఫర్ న్యూ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గ్రేటర్ నోయిడా, ముంబైతో పాటు దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉండనుందని ఆ సంస్థ నిర్వహాకులు ప్రకటించారు. ట్రై అండ్ బై ఇనిషియేటివ్ కస్టమర్లు 1000జీబీ హై స్పీడ్ డేటాను ఉచితంగా పొందుతారు. కంపెనీ నుండి పూర్తి రీఫండ్ పొందడానికి అర్హత పొందడానికి 30 రోజులలోపు కనెక్షన్‌ని రద్దు చేయాల్సి ఉంటుంది. 30 రోజుల తర్వాత రద్దు చేస్తే రూ.500 సర్వీస్ ఛార్జ్ విధించి, మిగిలిన రూ.1000 వాపస్ ఇస్తుంది. ఆఫర్ పొందాలంటే కనెక్షన్‌తో పాటు టాటా ప్లే ఫైబర్ ట్రయల్ వ్యవధిలో వినియోగదారులకు ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను కూడా అందిస్తుంది. దీంతో పాటు కనీసం 3 నెలల పాటు 100 ఎంబీపీఎస్ ప్లాన్ ను ఎంపిక చేసుకుంటే పూర్తి రూ.1500 రీఫండ్ లభిస్తుంది. 3 నెలల పాటు 50 ఎంబీపీఎస్ ప్లాన్‌ని ఎంచుకుంటే రూ. 500 మాత్రమే వాపస్ పొందవచ్చు. మిగిలిన రూ.1000 సెక్యూరిటీ డిపాజిట్ వాలెట్లో ఉంటుంది. నెలవారీ ప్లాన్‌ను పొందినట్లయితే, మూడు నెలల వినియోగ తర్వాత రూ.1000 వాపసు చేయబడుతుంది. మిగిలిన రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ వాలెట్లో ఉంటుందని టాటా ప్లే ఫైబర్ వెల్లడించింది. -
ఓలా, ఉబెర్ సర్వీసులను నిలిపివేసిన డ్రైవర్లు..
-
ఏపీ సీఎస్‌గా సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలం పొడిగిస్తూ తాజాగా కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. సమీర్‌శర్మను మరో 6 నెలలు పాటు ఏపీ సీఎస్‌గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. వచ్చే ఏడాది మే నెల వరకు ఆయన సీఎస్‌గా పనిచేయనున్నారు. కాగా, సమీర్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. చదవండి: ప్లేట్లెట్ థెరపీ కిట్‌కు పేటెంట్.. రెండు తెలుగు రాష్టాల్లో ఇదే తొలిసారి పొడిగింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ సంబంధిత ఉత్తర్వులను జారీచేసింది. కాగా, రెండు నెలల క్రితం ఏపీకి సీఎస్‌గా సమీర్‌శర్మ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈనెల 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో సమీర్‌శర్మ మరో ఆరునెలలు ఏపీకి చీఫ్ సెక్రెటరీగా సేవలందించనున్నారు. -
నాట్స్ ఆధ్వర్యంలో బ్యాక్ టూ స్కూల్
బోధన్: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో కూడా విసృత్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని బోధన్ మండలంలో ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్ధులకు బ్యాక్ ప్యాక్ లు, నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిల్లు జామెట్రీ బాక్స్‌లను పంపిణీ చేసింది. నాట్స్ సభ్యులు శశాంక్ కోనేరు, గోపి పాతూరి స్థానిక పాఠశాలలతో సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఎత్తోండ, సాలంపాడు, అక్బర్ నగర్ పాఠశాలల్లో విద్యార్ధులకు 300 బ్యాక్ ప్యాక్‌లను అందించారు. ఈ సందర్భంగా బోర్డ్ డైరెక్టర్ కిషోర్ వీరగంధం మాట్లాడుతూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం అమెరికాలో మాత్రమే కాకుండా ఇండియా లో మారుమూల గ్రామాల్లో చేస్తున్న సేవలని కొనియాడారు. నాట్స్ సేవా కార్యక్రమాలకి మద్దతుగా నిలిచిన శశాంక్ కోనేరు, గోపి పాటూరిలను ఆయన అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో పేద విద్యార్ధుల కోసం నాట్స్ చేసిన ఈ మంచి ప్రయత్నం ఇక ముందు కొనసాగుతుందని, విద్యార్ధులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే కోరారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కిషోర్ వీరగంధం, నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నేలు ఈ కార్యక్రమానికి తొలి నుంచి మద్దతు అందించడంతో పాటు నాట్స్ సాయం చివరి వరకు చేరేలా పర్యవేక్షణ చేశారు. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్ ప్రైమ్ సర్వీసులు
జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికలు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది జీఎంఆర్ సంస్థ. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా రాకపోకలు సాగించే వారి కోసం అదనపు సౌకర్యాలు ప్రైమ్ సర్వీసుల పేరిట అందిస్తోంది. జీఎంఆర్ ప్రైమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ఫోన్లో నుంచే ఈ సర్వీసులను బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్‌ప్రెస్ చెక్ ఇన్, పర్సనలైజ్డ్ ప్యాసింజర్ అసిస్టెన్స్ సర్వీస్, పోర్టల్ సర్వీస్, లాంగ్ యాక్సెస్, ఫాస్ట్ ట్రాక్ సెక్యూరిటీ క్లియరెన్స్ తదితర సేవలు ఉన్నాయి. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు. ఏ విమానంలో ఈ క్లాసులో టిక్కెట్ బుక్ చేసుకున్నారనే అంశాలతో సంబంధం లేకుండా జీఎంఆర్ ఎయిర్పోర్ట గుండా ప్రయాణం చేసే వారు ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ రెండు టెర్మినళ్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఒకటి. సుమారు ఆరు వేల కోట్లతో దీన్ని మరింతగా విస్తరించనున్నారు. దేశీయంగా ప్రధాన నగరాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ కంట్రీలోని నగరాలకు నేరుగా విమానాలు నడిపే దిశగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు కస్టమర్ సర్వీసులు అందించేందుకు జీఎంఆర్ ప్రైమ్‌ని ప్రవేశపెట్టింది. చదవండి: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి ఫైన్.. కారణం ఇదే! -
ఆమెకు గర్భసంచితోపాటు.. ప్రేమ సంచి కూడా ఉంది..
స్త్రీలందరికీ గర్భసంచి ఉంటుంది. కాని అమెరికా టీచరమ్మ క్రిస్టిన్ గ్రేకు ప్రేమ సంచి ఉంది. జీవితంలో మగతోడు లేకుండా జీవించాలనుకున్న క్రిస్టిన్ అనాథ ఆడపిల్లలకు అమ్మ కాదలుచుకుంది. మున్ని, రూప, మోహిని, సోనాలి, సిగ్ధ... 2013తో మొదలయ్యి 2020లోపు ఐదుమంది మన దేశపు అనాథ ఆడపిల్లలను దత్తత తీసుకుంది క్రిస్టిన్. ఆడపిల్లలు అనాథాశ్రమంలో కంటే ఇళ్లల్లో కూతుళ్లుగా పెరగడం మంచిది అంటుందామె. ఆ కూతుళ్లను సొంత కూతుళ్లుగా అడాప్ట్ చేసుకునే అమ్మను మించిన ప్రేమ అందరికీ ఉండొద్దూ... 2015. గుజరాత్. కచ్‌లోని అనాథ బాలికల కేంద్రం ‘కచ్ మహిళా కల్యాణ్ కేంద్ర’లోని మూడున్నరేళ్ల బాలికను దత్తత తీసుకోవడానికి అమెరికా నుంచి క్రిస్టిన్ వచ్చింది. ఆ బాలిక పేరు రూప. సాధారణంగా అనాథ బాలికలను దత్తత తీసుకునేవారు మన దేశంలో చాలామంది ఉన్నారు. కాని వారంతా రూపను దత్తత తీసుకోవడానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఆ పాపకు ముక్కు లేకపోవడమే. ఆ పాపను కన్నతల్లి చెత్త కుప్పలో పారేస్తే కుక్కలు ముక్కును కొరికేశాయి. కొనప్రాణంతో ఉన్న రూపను కాపాడి పెంచారు. ఇప్పుడు ఆ పాపను ఎంతో ప్రేమగా దత్తత తీసుకోవడానికి వచ్చింది క్రిస్టిన్. ‘ఈ పాపకు కూడా ఒక కుటుంబం ఉండే హక్కు ఉంది’ అందామె. ‘పాపకు తగిన వయసు వచ్చాక అమెరికాలో ముక్కుకు సర్జరీ చేయిస్తాను’ అని కూడా అంది. ఆమె గొప్పతనానికి అందరూ తల వొంచి నమస్కరించారు. రూపకు ఒక గొప్ప తల్లి దొరికింది. 2013. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటీలో సెకండరీ టీచర్‌గా పని చేస్తున్న క్రిస్టిన్ గ్రేకు 39 ఏళ్లు వచ్చాయి. జీవితంలో తారసపడిన మగవారు ఎవరూ ఆమెకు పెళ్ళి బంధంలోకి వెళ్లదగ్గ గట్టివాళ్లుగా కనిపించలేదు. ‘నేను నా శేషజీవితాన్ని ఒంటరిగా గడపదలుచుకున్నాను’ అని నిర్ణయం తీసుకుందామె. జీవించడానికి కావలసినవి ఆమె వద్ద ఉన్నాయి– మాతృత్వ భావన తప్ప. ‘అమ్మను కాలేకపోయాను కదా’ అనుకుంది. కొన్నాళ్లు ఆలోచించాక ‘నేనే కనాలా? ఎంతమంది అనాథ పిల్లలు ఉన్నారు. వారిని దత్తత తీసుకుంటాను’ అని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆమె అన్వేషణ మొదలైంది. మొదట నేపాల్ నుంచి తీసుకోవడానికి బోలెడు డబ్బు ఖర్చు పెట్టింది. తీరా అడాప్ట్ చేసుకునే సమయానికి అమెరికాలో నిబంధన వచ్చింది– నేపాల్ నుంచి దత్తత తీసుకోరాదని. ఆ తర్వాత ఆమె ఇండియాను ఎంచుకుంది. రెండేళ్ల ప్రయత్నం తర్వాత ఇక్కడి దత్తత ఏజెన్సీ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ‘పాప ఉంది. అయితే ఆమెకు ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. తీసుకుంటారా?’ అని. ఆ పాప పేరు మున్నీ. వెంటనే సంతోషంతో క్రిస్టిన్ అంగీకరించింది. కాని తండ్రి ‘ఆ తీసుకునేదేదో మన దేశంలోని తెల్లమ్మాయిని తీసుకోవచ్చు కదా’ అన్నాడు. క్రిస్టిన్ ఆ మాటకు నొచ్చుకుంది. తండ్రి సర్దుకున్నాడు. అంతే కాదు మున్నీని అమెరికా తీసుకురావడంలో కావలసిన ధన సహాయం చేస్తూ ‘మున్నీ గ్రే’ కోసం అని చెక్ రాసి ఇచ్చాడు. అలా క్రిస్టిన్ జీవితంలో మొదటిసారి అమ్మ అయ్యింది. రెండేళ్లు గడిచాయి. మళ్లీ భారత్ నుంచి ఫోన్ వచ్చింది– ముక్కు లేని అమ్మాయి ఉంది తీసుకుంటారా అని. ముక్కు లేకపోతే పాప పాప కాకుండా పోతుందా... నేను అమ్మనవుతాను అంది క్రిస్టిన్. అలా రూప ఆమె జీవితంలోకి వచ్చింది. కాని రూప కొన్నాళ్ల పాటు రోజంతా ఏడుస్తూ ఉండేది. అప్పటికే దత్తతకు వచ్చిన మున్నీకి, రూపకు అసలు పడేది కాదు. ‘రూపను దత్తత తీసుకుని తప్పు చేశానా?’ అని అనుకుంది క్రిస్టిన్. కాని ఒకరోజు హటాత్తుగా మున్ని,రూప బెలూన్‌తో ఆడుకోవడం మొదలెట్టారు. క్రిస్టిన్ కన్నతల్లి వారితో జతయ్యింది. సంతోషాలు క్రిస్టిన్ జీవితంలో మొదలయ్యాయి. మన దేశంలో అనాథలకు కొదవలేదు. కని వదిలిపెట్టేవారు, ఇళ్ల నుంచి పారిపోయేవారు, భిక్షాటన కోసం ఎత్తుకు రాబడ్డవాళ్ళు, అయినవారిని కోల్పోయిన వారు... అలా మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు... దత్తత తీసుకుంటారా అంటే సరే అంది క్రిస్టిన్. మోహిని, సోనాలి ఆమె జీవితంలోకి వచ్చారు. ‘ఇప్పుడు నా కుటుంబం నిజంగానే కొంచెం పెద్దదయ్యింది’ అంది క్రిస్టిన్. అప్పటికే స్కూల్ జీతం చాలదని రియల్ ఎస్టేట్‌లో దిగిన క్రిస్టిన్ తన పిల్లల కోసం ఎక్కువ సంపాదించడానికి కావలసిన పనులన్నీ చేయసాగింది. నలుగురు ఆడపిల్లల తల్లి తను. ఎంత ఖర్చు ఉంటుంది. ‘నేను ఇంట్లో నుంచి ఒక్క క్షణం బయటకు వెళ్లడానికి ఇష్టపడను. నా పని కంప్యూటర్ మీదే చేస్తాను. నా సమయం అంతా ఆ నలుగురు పిల్లల నవ్వుల్ని, కొట్లాటల్ని చూడటమే సరిపోతుంది’ అంటుంది క్రిస్టిన్. ఇంతవరకు కూడా ఆమె సగటు స్త్రీ అనే అనుకోవచ్చు. కాని ఆమెకు డౌన్ సిండ్రోమ్ ఉన్న అనాథ అమ్మాయిల పరిస్థితి ఏమిటి... అలాంటి ఒక అమ్మాయిని దత్తత తీసుకుందాం అని ఎంచి మరీ డౌన్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిని 2020లో అమెరికా తెచ్చుకుంది. ఐదుగురు పిల్లల తల్లి క్రిస్టిన్ ఇప్పుడు. అమ్మల్ని మించిన అమ్మ. సంతోషంగా జీవించాలని ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఆ సంతోషం కోసం కొందరు పిల్లల్ని వద్దు అనుకుంటుంటే క్రిస్టిన్లాంటి వాళ్లు తమకు పుట్టకపోయినా పిల్లలు కావాలనుకుంటున్నారు. జీవితం అర్థవంతం చేసుకోవడం ఇలాంటి వారి వల్లే అవుతుంది. వెల్డన్ క్రిస్టిన్. -
ఏపీ: ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు రేపటి నుంచే..
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ కారణంగా ఆర్టీసీకి ప్రజారవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే భాగంగా కార్గో సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వీటిని ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవడంతో మంచి లాభాలు వస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే గుంటూరు జిల్లా పరిధిలో కొరియర్ సర్వీసు ద్వారా వచ్చే ఆదాయం 75 శాతం పెరిగింది. మరింత ఆదాయం పొందడంలో భాగంగా కార్గో రవాణాను డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కార్గో డోర్ డెలివరీ అందిస్తున్న ప్రైవేటు కొరియర్ సంస్థలకు భిన్నంగా మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో రోజుకు రూ.3 లక్షల ఆదాయం సాధించడం లక్ష్యంగా సెప్టెంబర్ 1 నుంచి కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. రేపటి నుంచి.. ఆర్టీసీ కొరియర్ సేవలను ఇళ్లకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తొలుత పైలెట్ ప్రాజె క్టుగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరంలో డోర్ డెలివరీ సేవలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తేవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ పార్శిళ్లను ఇతర ప్రాంతాలకు పంపాలన్నా.. వచ్చిన వాటిని తీసుకెళ్లాలన్నా బస్టాండ్‌లోని కొరియర్ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. ఇకపై వినియోగదారులు అందరూ తమ ఇళ్ల వద్దే సేవలు పొందడానికి అవకాశం ఏర్పడింది. డోర్ డెలివరీని ప్రస్తుతానికి బుకింగ్ ఏజెంట్ కాంట్రాక్టర్లే చేయనున్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. తద్వారా జవాబుదారీతనం పెరగనుంది. ఇక పార్శిళ్లకు ట్రాకింగ్ సదుపాయం ఏర్పాటు చేయనుంది. దాంతో బుక్ చేసిన పార్సిల్ ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. బీమా సదుపాయం కల్పిస్తోంది. పొరపాటున పార్శిల్ కనిపించకుండా పోతే ఖాతాదారులకు ఈ మేరకు పరిహారం లభిస్తుంది. పెరుగుతున్న ఆదాయం... జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు హైదరాబాద్, బెంగళూరుకు ప్రస్తుతం కొరియర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రసిద్ధి చెందిన చేనేత, వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు, ఆటో మొబైల్ పరికరాలు, చిన్నతరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులు తదితరాలు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకుంటున్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది. గతేడాది ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో రూ.98.28 లక్షల ఆదాయం వస్తే ఈ ఏడాది అదే సమయంలో రూ.172.17 లక్షలకు పైగా సమకూరింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా కార్గో కొంత వరకుఆ నష్టాన్ని భర్తీ చేస్తోంది. అందుకే సేవలను మరింత విస్తృతం చేయాలన్న లక్ష్యంతో డోర్ డెలివరీని కూడా అందుబాటులోకి తేవడానికి సిద్ధమయ్యారు. రోజుకు రూ.3 లక్షల ఆదాయమే లక్ష్యం సెప్టెంబర్ 1 నుంచి ఇంటింటికీ కార్గో సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తొలుత నగరం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో 10 కేజీల వరకు డోర్ డెలివరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. విడతల వారీగా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకూ అందించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. డోర్‌డెలివరీ సేవలను కూడా వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఆర్టీసీకి కార్గో ద్వారా ప్రస్తుతం సరాసరి రోజుకు రూ.2 లక్షల ఆదాయం వస్తోంది, దీన్ని రూ.3 లక్షలకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – ఎస్టీపీ రాఘవ కుమార్, ఆర్ఎం, గుంటూరు -
స్విగ్గీ న్యూ డెసిషన్... ఇవి కూడా డెలివరీ చేస్తుందట
హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ సిగ్గీ మరిన్ని సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీలో తన మార్క్ చూపించిన ఈ సంస్థ ప్రజలకు మరింతగా చేరువ అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకు తగ్గట్టే ఇటీవల భారీగా నిధుల సమీకరణ కూడా చేసింది. గ్రోసరీస్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్‌కి సంబంధించి స్విగ్గీ మంచి పట్టు సాధించింది. జిల్లా కేంద్రాల నుంచి కాస్మాపాలిటన్ సిటీస్ వరకు డెలివరీ సర్వీసెస్‌లో దూసుకుపోతుంది. అయితే స్విగ్గీ వచ్చే ఆర్డర్లలో ఎక్కువ శాతం లంచ్, డిన్నర్‌కి సంబంధించినవే ఉంటున్నాయి. బ్రేక్‌ఫాస్ట్ టైంలో అంతగా డెలివరీ ట్రాఫిక్ ఉండటం లేదు. దీంతో ఉదయం సమయంలో కూడా సేవలు అందించేలా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. కిరణా, పాలు, కూరగాయలు తదితర ఉదయాన్నే ఉపయోగించే సరుకులను కూడా డెలివరీ చేసేలా ప్లాన్ వేసింది. త్వరలోనే ఇన్‌స్టామార్ట్ పేరుతో గ్రోసరీస్ సేవలు అందివ్వనున్నట్టు స్విగ్గీ కో ఫౌండర్ శ్రీహర్ష తెలిపారు. దూకుడుగా కంపెనీ కార్యకలాపాలు విస్తరించేందుకు ఇటీవల స్విగ్గీ ఇన్వెస్టర్ల నుంచి 1.25 బిలియన్ డాలర్ల నిధులు సేకరించింది. వీటి సాయంతో మార్కెట్లో దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. మరోవైపు జోమాటో సైతం భారీగా నిధులు సేకరించి తమ సేవలను మరింతగా విస్తరించే పనిలో ఉంది. -
బంపర్ ఆఫర్: ఆపిల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు కొనండి .. తర్వాతే పే చేయండి
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. డబ్బులు చెల్లించకుండా మనకు కావాల్సిన యాపిల్ ఉత్పత్తుల్ని సొంతం చేసుకునే సదుపాయం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019లో యాపిల్ సంస్థ యాపిల్ క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ కార్డ్ ద్వారా యాపిల్ సంస్థకు చెందిన గాడ్జెట్స్ కొనుగోలు చేసుకునే సౌకర్యం ఉంది. అయితే తాజాగా యాపిల్ సంస్థ 'యాపిల్ క్రెడిట్ కార్డ్'తో సంబంధం లేకుండా ఏదైనా ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి, వాటికి మనీని తర్వాత పే చేసే అవకాశం కల్పించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమచారం. ఇందుకోసం యాపిల్ సంస్థ పేమెంట్ గేట్‌వే గోల్డ్ మెన్ సాచ్స్ తో జతకట్టనుంది. 'యాపిల్ పే ఇన్ 4' 'యాపిల్ పే ఇన్ మంత్లీ సిస్టమ్ పేరుతో ఈ స్కీమ్‌లో భాగంగా యాపిల్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసిన కష్టమర్లు పేమెంట్ గేట్ వే గోల్డ్ మెన్ సాచ్చ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ఉత్పత్తులపై యాపిల్ విధించిన వారాల గడువులోపు పే చేస్తే వడ్డీ ఉండదు. నెలల వ్యవధి ఉంటే వాటిపై ఇంట్రస్ట్‌ను చెల్లించాల్సి ఉంది. ఈ సదుపాయం ప్రస్తుతం రీటైల్, ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉందని యాపిల్ సంస్థ ప్రతినిథులు తెలిపారు. యాపిల్ పే లేటర్ సేవను ఉపయోగించాలనుకునే వినియోగదారులు ఐఫోన్ యాప్‌లో అప్లయ్ చేసి అనుమతి పొందాల్సి ఉంటుందాఇ. అప్పుడే యాప్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాదు కొన్ని ఉత్పత్తులపై అడిషనల్ ఛార్జెస్ , ప్రాసెసింగ్ ఫీజుల్ని మినహాయింపు, క్రెడిట్ కార్డ్ స్కోర్ అవసరం లేకుండా ఉత్పత్తుల కొనుగోళ్లపై చర్చిస్తోంది. -
ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’
పేరున్న కుటుంబం.. ఊరంతా బంధువులే.. కానీ కరోనా వచ్చి మృత్యువాత పడితే పట్టించుకునే వారే ఉండరు. అయినవారే కాదనుకుని వెళ్లిపోతుండగా.. ముక్కూమొహం తెలియని వారే మానవత్వం చూపుతున్నారు. అన్నీతామై అంతిమసంస్కారాలు చేస్తున్నారు. ఏ జన్మసంబంధమో తెలియదు గానీ చితికి నిప్పుపెట్టో.. గుప్పెడు మట్టి పోసో ఆత్మబంధువులవుతున్నారు. ముదిగుబ్బ/కదిరి/నల్లమాడ: బంధాలను కరోనా మహమ్మారి చిన్నాభిన్నం చేస్తోంది. మానవత్వం మంట గలుస్తోంది. అంతవరకూ తామున్నామంటూ భరోసా ఇచ్చిన వారే పాజిటివ్ వచ్చిందనగానే దూరమైపోతున్నారు. ఇక కరోనా కాటుకు బలైపోతే అంత్యక్రియలు చేసేందుకూ వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు యువకులు ఆత్మబంధువులయ్యారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి అంతిమసంస్కారాలు నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కృష్ణమ్మకు ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ముదిగుబ్బకు చెందిన కృష్ణమ్మ (65) కరోనాతో పోరాడి బుధవారం తుదిశ్వాస విడించింది. అయితే ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ‘ఇస్లామిక్ హెల్పింగ్ హ్యాండ్స్’ ప్రతినిధులు అమీర్, బాబా, తలహ, ఆదిల్, సుజార్లు ముందుకొచ్చారు. వృద్ధురాలి అంత్యక్రియలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. భార్యా కుమారుడు ముఖం చాటేసినా... కదిరి రూరల్ మండలం నాగూరుపల్లికి చెందిన ఆంజనేయులు(45) కొన్నేళ్లుగా నల్లమాడలో ఒంటరిగా ఉంటూ భవన నిర్మాణ కారి్మకుడిగా జీవనం సాగించేవాడు. కొన్నిరోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం అధికం కావడంతో బుధవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లి కరోనా పరీక్ష చేయించుకున్నాడు. అనంతరం ఆస్పత్రి బయట అరుగుపై కూర్చొని మధ్యాహ్నం 3 గంటల సమయంలో అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న భార్య, కుమారుడు నల్లమాడకు చేరుకున్నారు. కరోనా సోకవడం వల్లే ఆంజనేయులు మృతిచెందినట్లు ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రామకృష్ణ తెలిపారు. నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. భయాందోళన చెందిన వారు ఆంజనేయులు మృతదేహాన్ని అక్కడి వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆ రాత్రి, గురువారం ఉదయం వరకు సుమారు 20 గంటల పాటు మృతదేహం ఆస్పత్రి ఆవరణలోనే ఉండిపోయింది. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, స్థానిక పోలీసుల సహకారంతో ఓడీ చెరువుకు చెందిన ‘హెల్పింగ్ హ్యాండ్స్ తలబా’ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పంచాయతీ పారిశుధ్య కారి్మకులతో కలిసి ఆంజనేయులు అంత్యక్రియలను నిర్వహించారు. కుటుంబీకులే భయపడినా.... కదిరి: కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన ఓ వ్యక్తి బుధవారం కరోనాతో మృతి చెందాడు. అయితే వైరస్ భయంతో కుటుంబీకులు ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుకాడారు. విషయం తెలుసుకున్న కదిరి పట్టణానికి చెందిన నిజాంవలీ, ఇర్ఫాన్‌ఖాన్, ఆషిక్, సాదిక్ బాషా, ఇర్షాద్, అక్బర్‌ఖాన్ మరికొందరు వెంటనే అక్కడికి చేరుకుని ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజుల క్రితం కూడా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోవడంతో అంతిమ సంస్కారాలు చేశారు. తమకు కుల, మత భేదాలు లేవని ఎవరైనా తమను సాయం అర్థిస్తే తమ సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బృందంలోని సభ్యుడు అక్బర్ ‘సాక్షి’ తెలియజేశారు. చదవండి: వ్యాక్సిన్ కోసం ఎంత ఖర్చుకైనా సిద్ధమే 1.81 లక్షల ఎకరాలకు ‘సత్వర’ ఫలాలు -
ఇక రెండుగా ఐబీఎం..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఐబీఎం తన వ్యాపార కార్యకలాపాలను రెండుగా విభజించనుంది. ఇందులో భాగంగా మేనేజ్డ్ ఇన్ఫ్రా సేవల విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయనుంది. ఇకపై ఐబీఎం పూర్తిగా హైబ్రీడ్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వ్యాపారాలపై దృష్టి పెట్టనుండగా, రెండో సంస్థ సర్వీస్ డెలివరీ, ఆటోమేషన్ తదితర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియ 2021 ఆఖరు నాటికి పూర్తి కావచ్చని అంచనా. తాత్కాలికంగా ’న్యూకో’ పేరుతో వ్యవహరిస్తున్న ఇన్ఫ్రా సేవల విభాగానికి భారత్‌లోని ఉద్యోగుల్లో సుమారు మూడో వంతు సిబ్బందిని బదలాయించనున్నట్లు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ తెలిపారు. 2019 ఆఖరు నాటికి ఐబీఎంలో మొత్తం 3.83 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. దేశాలవారీగా ఉద్యోగుల సంఖ్యను కంపెనీ వెల్లడించనప్పటికీ.. భారత్‌లో సుమారు 1 లక్ష పైచిలుకు సిబ్బంది ఉంటారని అంచనా. -
‘అమెజాన్’లో రైలు టికెట్లు.. 10% డిస్కౌంట్
సాక్షి, అమరావతి: రైల్వే ప్రయాణికులకు త్వరలోనే అమెజాన్ పేయాప్ ద్వారా సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఐఆర్సీటీసీ, అమెజాన్ మధ్య టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే అమెజాన్ పేయాప్ ద్వారా విమాన, బస్సు టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అమెజాన్ పే యాప్ ద్వారా మొదటిసారి టికెట్లు బుక్ చేసుకునే వారికి 10 శాతం నగదు రాయితీ లభించనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 శాతం వరకు రాయితీ ఉంటుంది. కాగా రైల్వే అధికారులు ఈ–కామర్స్ కంపెనీలతో సరుకు రవాణాకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. త్వరలోనే ఫ్లిప్ కార్ట్ కంపెనీ దక్షిణ మధ్య రైల్వేతో ఒప్పందం కుదుర్చుకోనుంది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో బంపర్ ఆఫర్ సేల్స్) అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఆఫర్ అక్టోబర్ 17న ప్రారంభం న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘‘గ్రేట్ ఇండియా ఫెస్టివల్’’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 17న ప్రారంభమవుతుంది. సుమారు 6.5 లక్షల మంది పైగా విక్రేతలు కోట్లలో తమ ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఆఫర్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సుమారు 900కి పైగా తమ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి. ఈ పండుగ సీజన్లలో తమ కస్టమర్లకు కావల్సిన వస్తువులను సరైన సమయంలో, సురక్షితంగా అందించడం తమ కర్తవ్యమని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీశ్ తివారీ తెలిపారు. -
రెండేళ్లకే ‘పదోన్నతి’?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతి సర్వీసు కాలాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పదోన్నతి పొందాలంటే సదరు ఉద్యోగి కనీసం 3 ఏళ్లు ప్రస్తుత హోదాలో పనిచేసి ఉండాలనే నిబంధన ఉండేది. దీని ప్రకారం మూడేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులకే పదోన్నతు లకు అవ కాశం ఉండేది. ఇప్పుడు ఆ సర్వీసు కాలాన్ని రెండేళ్లకు తగ్గించే ప్రతి పాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనికి వచ్చే ఉద్యోగుల్లో ఎంత మంది రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు, అందులో ఎంత మంది పదోన్న తులకు అర్హులవుతారో వివరాలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆర్థిక శాఖ కోరింది. ఈ వివరాలను పంపాలని ఇటీవల శాఖల హెచ్వోడీలకు లేఖ రాసింది. -
టిమ్స్‌లో ప్రారంభమైన వైద్య సేవలు
-
మానవత్వం డ్యూటీ చేస్తోంది
ముంబయిలోని డిజేబులిటీ యాక్టివిస్ట్ విరాళీ మోదీకి డీసీపీ నుంచి ఫోన్ వచ్చింది. ‘నిన్నటి మీ ట్వీట్ చూశాం. మా పోలీసులు వస్తారు. ఏం కావాలో వారికి తెలియచేయండి’ అని చెప్పారు విరాళితో డీసీపీ. అన్నట్లుగానే కొంత సేపటికే ఇద్దరు పోలీసులు విరాళి ఇంటికి వచ్చారు. విరాళి ట్వీట్లో సారాంశం ‘మా çసహాయకురాలు రోజూ మా ఇంటికి రావడానికి అనుమతించండి’ అని. విరాళి దివ్యాంగురాలు కావడంతో ఆమెకు సహాయకురాలి ఆసరా రోజూ అవసరమే. లాక్డౌన్ కారణంగా డొమెస్టిక్ హెల్పర్లు కూడా తమ ఇళ్ల నుంచి కదలకూడదనేది నిబంధన. కానీ విరాళికి ఒకరి ఆసరా తప్పని సరి. అదే విషయాన్ని ఆమె పోలీసులకు తెలియచేశారు. పోలీసుల సూచన మేరకు విరాళి తన డొమెస్టిక్ హెల్పర్‌ను, డ్రైవర్‌ను డ్యూటీకి అనుమతించాల్సిందిగా కోరుతూ పోలీస్ డిపార్ట్మెంట్కు ఉత్తరం రాశారు. మాస్కులు, గ్లవుజ్‌లు ధరించి, శానిటైజర్ వాడి పరిశుభ్రంగా విధులకు హాజరు కావాలనే నిబంధనతో పోలీసులు అధికారికంగా అనుమతి జారీ ఇచ్చారు. విరాళి డొమెస్టిక్ హెల్పర్, డ్రైవర్లకు లాక్డౌన్ పాస్‌లు కూడా జారీ చేశారు. ఊరికో శ్రీమంతుడు లాక్డౌన్లో పనులు లేక అవస్థలు పడుతున్న వాళ్ల కోసం ముందుకొచ్చిన దాతలకు పోలీసులు స్నేహహస్తం అందిస్తున్నారు. దాతలు విరాళంగా ఇచ్చిన సరుకులను ఆపన్నులకు చేరవేయడంలో ముందడుగు వేస్తున్నారు. నెల్లూరు జిల్లా, జలదంకి మండలం ఎస్ఐ ప్రసాద్ రెడ్డి... బ్రాహ్మణక్రాక పంచాయితీ, వంటేరు వరదారెడ్డి గిరిజన కాలనీలోని గిరిజనులకు శనివారం నాడు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న పారిశ్రామిక వేత్త వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తన సొంత గ్రామం కోసం చేస్తున్న సహాయానికి తాను చేయూతనిచ్చానని చెప్పారాయన. ‘‘ఈ గిరిజన కాలనీని ఇరవై ఏళ్ల కిందటే వేణుగోపాల్‌రెడ్డి తన తండ్రి పేరుతో దత్తత తీసుకుని అందరికీ ఇళ్లు కట్టించారు. ఇప్పుడు కరోనా సంక్షోభంలో ఈ గిరిజన కాలనీలోని మొత్తం 135 కుటుంబాల కోసం వెయ్యి కిలోల బియ్యం, రెండు వందల కిలోల కందిపప్పు, తొమ్మిది రకాల వంట దినుసులు, సబ్బుల కిట్‌తోపాటు ఇతర అత్యవసరాల కోసం కొంత నగదు కూడా ఇచ్చారు. ఊరిని దత్తత తీసుకునే శ్రీమంతులు సినిమాలో మాత్రమే కాదు. నిజ జీవితంలోనూ ఉంటారు. జీవితంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ ఈ కష్టకాలంలో తమ గ్రామాన్ని తలుచుకుంటే... దాదాపుగా అన్ని గ్రామాలకూ సహాయం అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా మేము మా విధిని నూటికి నూరు పాళ్లు నిర్వహిస్తున్నాం. ఇలాంటి శ్రీమంతులు ముందుకొస్తే మా వంతుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటాం’’ అని చెప్పారు ఎస్ఐ. పురుడు పోసిన పోలీసులు లాక్డౌన్ ఉన్నప్పుడు గడప దాటకూడదని తల్లికి తెలుస్తుంది కానీ, తల్లి కడుపులో ఉన్న బిడ్డకు తెలుస్తుందా! ‘అమ్మా నన్ను కనూ’ అని ఆ బిడ్డ తల్లిని తొందర పెట్టాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మూసి ఉంది. నడుచుకుంటూనే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు భార్యాభర్తలు. ‘ఇప్పుడు కాదు’ అన్నారు వాళ్లు! మరింకెప్పుడో?! ‘నొప్పులెక్కువయ్యాయి నేనిక నడవలేను’ అని ఆ తల్లి దారిలోనే కూలబడింది. పంజాబ్‌లోని ధరమ్‌కోట్ అది. లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను, అసహాయంగా ఉన్న ఆమె భర్తను చూశారు. రోడ్డు పక్కన ఉన్న రెండు చెక్క బల్లల్ని పక్కపక్కనే కలిపి వేసి, ఆమెను పడుకోబెట్టారు. నర్స్ ఎవరైనా ఉంటే అర్జెంటుగా పంపమని ఫోన్ చేశారు. ఆమె వచ్చే లోపు దుప్పటిని తెప్పించి బల్లల చుట్టూ కప్పారు. నర్సు వచ్చి డెలివరీ చేసింది. అబ్బాయి పుట్టాడు. ఆ పోలీసులు తల్లీబిడ్డల్ని ఇంటికి చేర్చారు. ఆ పోలీసులు ఎ.ఎస్.ఐ. బిక్కర్ సింగ్, కానిస్టేబుల్ సుఖ్జిందర్ సింగ్. ఈ కరోనా కాలంలో డ్యూటీ చేస్తున్నది యూనిఫామ్‌లో ఉన్న మానవత్వమే. గర్భిణికి సహాయం చేసిన పోలీసులు -
మానవత్వం చాటిన వియ్ ఫర్ ఆర్పాన్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు లాన్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలు, దినసరి కూలీల పరిస్థితి దీనంగా మారింది. చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక బాధ పడుతున్నారు. మరోవైపు అత్యవసర ఇబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ పలు స్వచ్ఛంద సంస్థలు అన్నపానీయాలు సమకూరుస్తున్నాయి. తెలంగాణలో సేవలు అందిస్తున్న వియ్ ఫర్ ఆర్పాన్ ఫౌండేషన్ సభ్యులు శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో తమ వంతు సాయం చేశారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది, రోడ్డుపై ఉన్న పేదలు, దినసరి కూలీలకు అల్పాహారం, మంచినీళ్లు అందించి మానవత్వం చాటుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ అనుమతి తీసుకుని సీహెచ్ రాజేశ్, జైహింద్, రాము తదితరులు ఈ సేవ కార్యక్రమం చేపట్టారు. మార్టిన్, సంపత్, రవికాంత్, అడ్వొకేట్ తేజ, మాలికార్జున్, రమేష్, యాదగిరి, అరుణ్ సహాయ సహకారాలు అందించారు. -
రూ.5కే ఆటో బుకింగ్..
రాజేంద్రనగర్: మహిళలు, చిన్నారులు, యువతులపై రోజురోజుకూ పెరుగుతున్న అఘాయిత్యాలతో అతడి మనసు చలించింది. రాత్రి సమయాల్లో ఉద్యోగాలు, కళాశాలలు, ఇతర పనుల మీద వస్తున్న వారి భద్రత కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్యతో చర్చించి పర్యావరణానికి హాని కలగని ఈ– ఆటోలను సమకూర్చుకున్నాడు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేయడానికి ఓ యాప్‌ను రూపొందించాడు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ అభ్యుదయనగర్ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగుల నరేందర్, స్రవంతి దంపతులు గతంలో పంచాయతీ వార్డు సభ్యులుగా పనిచేశారు. బండ్లగూడ జాగీర్ గ్రామంలోని 30 కాలనీలవాసులు ఉద్యోగాలు, కళాశాలలు, పాఠశాలలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతంలో బస్సు సౌకర్యం ఎక్కువగా లేకపోవడంతో పాటు అంతర్గత కాలనీలకు ఆటోల సౌకర్యం అసలే లేదు. దీంతో రాత్రి సమయాల్లో మహిళలు, పురుషులు, విద్యార్థినులు, వికలాంగులు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి నరేందర్ దంపతులు ఓ మార్గం కనుగొన్నారు. ఢిల్లీలో ఈ– ఆటోలు దొరుకుతాయని తెలుసుకొని వాటి గురించి వాకబు చేశారు. మొదట రూ.2.5 లక్షలు వెచ్చించి ఓ ఆటోను కొనుగోలు చేసి కొన్నిరోజుల క్రితం ప్రారంభించారు. మంచి స్పందన రావడంతో మరో 4 ఆటోలను కొనుగోలు చేసి ప్రారంభించారు. ప్రస్తుతం ఐదు ఆటోల్లో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ప్రయాణికులు ఇస్తే రూ. 5 లేదంటే ఉచితంగా సేవ చేస్తున్నారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ– ఆటోలు అందుబాటులో ఉంటాయి. మొదటిసారి యాప్ ద్వారా.. ప్రతి ప్రయాణికుడు రోడ్లపై ఈ– ఆటోల కోసం నిరీక్షించడం సరికాదని భావించిన నరేందర్ తన స్నేహితులతో ‘గణపతి ఎక్స్‌ప్రెస్’ పేరిట యాప్‌ను రూపొందించాడు. ఈ యాప్‌ను ఓపెన్ చేయగానే ఐదు ఆటోల వివరాల ఆప్షన్ వస్తుంది. తాము ఏ రూట్లో వెళ్లాలో నిర్ణయించుకొని దానిపై క్లిక్ చేయగానే ఆటో అక్కడికి వస్తుంది. జీపీఎస్ సౌకర్యం ఉండడంతో ఈ యాప్ ద్వారా ఆటో ఎక్కడ ఉంది, ఎంత సమయంలో చేరుతుంది తదితర వివరాలు వస్తాయి. అంతేకాకుండా ప్యాసింజర్లు ఎంతమంది ఉన్నారు.. ఖాళీ సీట్లు ఎన్ని ఉన్నాయి అందులో కనిపిస్తుంది. ఫోన్‌నంబర్ సైతం ఉండడంతో డ్రైవర్‌తో నేరుగా మాట్లాడవచ్చు. భద్రతకు ప్రథమ ప్రాధాన్యం.. ఈ– ఆటోల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. జీపీఎస్ కూడా ఉండడంతో ప్రయాణికులకు పూర్తి భద్రత ఉంటుంది. ఆటోలో ఎవరెవరు ప్రయాణిస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఆటో డ్రైవర్ ఆయా గమ్యస్థానాల్లో ప్రయాణికులను దింపుతున్నాడా.. వారి నుంచి ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నాడా..? తదితర అంశాలను ఎప్పటికప్పుడు నరేందర్ పరిశీలించవచ్చు. సీసీ కెమెరా బ్యాకప్ 15 రోజులు ఉంటుంది. రోగుల సేవకు.. ప్రస్తుతం ఐదు ఆటోల ద్వారా సేవలందిస్తున్న నరేందర్ ఇందులో ఇంటి వద్ద నుంచి రోగులను తీసుకువెళ్లేదుకు ఓ ఆటోను ఏర్పాటు చేశాడు. 24 గంటల పాటు సేవలు అందించే ఈ వాహనాన్ని అత్యవసర సమయాలకు వినియోగిస్తున్నాడు. ఆస్పత్రులకు వెళ్లే వారు యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే వచ్చి తీసుకువెళ్లి తిరిగి తీసుకొచ్చే బాధ్యత డ్రైవర్‌దే. ఇందుకోసం రెండుసార్లకైతే (రానుపోను) రూ. 20 నామమాత్రంగా వసూలు చేస్తున్నారు. ఒకసారికి అయితే పూర్తిగా ఉచితం. పూర్తిగా పర్యావరణహితం పర్యావరణ పరిరక్షణ కోసం నరేందర్ ఈ– ఆటోలను కొనుగోలు చేశారు. నిత్యం 8 గంటల పాటు చార్జీ చేస్తే 80 కి.మీ దూరం ప్రయాణిస్తాయి. ఆటోలకు సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేశాడు. దీంతో అదనంగా మరో 40 కిమీ నిత్యం తిరుగుతున్నాయి. మొత్తమ్మీద ఒక్కో ఆటో రోజూ 120 కి.మీ తిరుగుతోంది. ఆదివారం సెలవు.. ఈ– ఆటోలకు ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు ఉపశమనం ఉండడంతో పాటు ఆదివారం కళాశాలలు, కార్యాలయాలు, పాఠశాలలు బంద్ ఉండడంతో ఇబ్బందులు ఉండవని సెలవును ఏర్పాటు చేసినట్లు నరేందర్ వెల్లడించాడు. ప్రభుత్వ, పండగ సెలవు దినాల్లో కూడా ఆటోలు అందుబాటులో ఉండవని చెబుతున్నారు. -
నౌకాదళానికి మరో రక్షణ కవచం
భారత నౌకాదళంలో మరో రక్షణ కవచం చేరనుంది. భారత రక్షణ రంగం అమ్ముల పొదిలో మరో అధునాతన అస్త్రం రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలందించేందుకు సిద్ధమవుతోంది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్ నిర్మాణంతో విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ స్థానం సంపాదించింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది. సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్.. యుద్ధ విమాన వాహక నౌకల విషయంలో మాత్రం వెనకబడి ఉంది. ఈ రంగంలోనూ బలీయమైన శక్తిగా ఎదగాలన్న కాంక్షతో భారత్.. విక్రాంత్ తయారీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్ క్లాస్ యుద్ధనౌక సిద్ధమైంది. భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ నౌక ఇది. 1997లో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక సిద్ధమవుతోంది. నిర్మాణానికి పదేళ్లు.. విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. కొచ్చి షిప్‌యార్డులో తుది మెరుగులు దిద్దుకుంటోంది విక్రాంత్. జయమ్ సమ్ యుద్ధి స్పర్థః అనే రుగ్వేద శ్లోకాన్ని స్ఫూర్తిగా దీనిని రూపొందిస్తున్నారు. ‘నాతో యుద్ధమంటే నాదే గెలుపు’ అని ఈ శ్లోకానికి అర్థం. ►1999లో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ నౌకా డిజైన్ మొదలు పెట్టారు. ►2009లో కీలక భాగాల్ని పూర్తి చేశారు. ►2011లో డ్రైడాక్ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. ►2015 జూన్ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ►సముద్రంలో కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయి సేవలకు ఉపయోగించనున్నారు. ►2020లో భారత నౌకాదళంలో సేవలు ప్రారంభించనుంది. – ఐఎన్ఎస్ విక్రాంత్‌ని ఇండియన్ నేవీలో కీలకమైన తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది. ఇక భారత్‌దే పైచేయి.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మహా సముద్రం.. హిందూ మహాసముద్రం. రక్షణ పరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన ఈ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ రాకతో రక్షణ పరంగా దుర్భేధ్యంగా నిలవనుంది. 7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హిందూ మహా సముద్రంలో ఎలాంటి అడ్డు లేకుండా ముందుకు దూసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని విక్రాంత్ సొంతం చేసుకుంది. విక్రాంత్‌కు కీలక బాధ్యతలు.. విక్రాంత్ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ యుద్ధ విమాన వాహక నౌక అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో తీర ప్రాంత భద్రతకు సంబంధించిన కీలక బాధ్యతలు భుజానికెత్తుకుంటుంది. ముఖ్యంగా నౌకాదళంలో చేరనున్న మిగ్–29 యుద్ధ విమానాలకు విక్రాంత్ ఉపయుక్తమవుతుంది. – వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, తూర్పు నౌకాదళాధిపతి -
ట్రీలకూ అంబులెన్స్
తుఫాను గాలికి వేర్లతో సహా చెట్లు పడిపోయాయా? చెదలు పట్టి చెట్టు బలహీనమవుతోందా? నీళ్లు అందక ఎండిపోతోందా? ఒక చోటు నుంచి తీసి ఇంకో చోటుకి మార్చాలా? మొక్కలు నాటాలా? విత్తనాలు కావాలా? చెట్ల గురించి సర్వే చేపట్టాలా? చచ్చిపోయిన చెట్టును తీసేయాలా? గార్డెన్ టూల్స్, ఎరువు, పురుగుల మందు, నీళ్లు కావాలా? అయితే ట్రీ అంబులెన్స్‌కు కబురు పెట్టడమే. క్షణాల్లో వచ్చి చెట్టుకు కావల్సిన చికిత్స చేసి.. సలహాలు, సూచనలు ఇచ్చి మరీ వెళ్తారు అంబులెన్స్ సిబ్బంది. ఆశ్చర్యపోకండి మీరు కరెక్ట్‌గానే చదువుతున్నారు.. నిజాన్నే తెలుసుకుంటున్నారు. అయితే ట్రీ అంబులెన్స్ సౌకర్యం ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు తమిళనాడులో. ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ అబ్దుల్ ఘనీ అండ్ టీమ్ ఈ ట్రీ అంబులెన్స్ సేవను ప్రారంభించారు. డాక్టర్ అబ్దుల్ ఘనీ ఈ పదేళ్లలో దాదాపు యాభై లక్షల మొక్కలు నాటి గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే కీర్తి తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెట్ల బాగోగుల బాధ్యతనూ తీసుకున్నాడు స్వచ్ఛందంగా. ఈ అంబెలెన్స్‌లో ప్లాంట్ ఎక్స్పర్ట్స్, వలంటీర్లూ ఉంటారు. ఈ అంబులెన్స్ సర్వీస్ ద్వారా దేశం మొత్తాన్ని పచ్చగా మార్చాలనుకుంటున్నాడు డాక్టర్ అబ్దుల్ ఘనీ. ప్రస్తుతం తమిళనాడులో మొదలైన గ్రీన్ సర్వీస్ ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుడుతూ ఢిల్లీ బాట పడ్తుంది. దార్లో ఉన్న చెట్లకు సర్వీస్ చేస్తూ! -
విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: దీపావళి పండగ వేళ విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం నుంచి మరో కొత్త సర్వీస్‌ను స్పైస్ జెట్ ప్రారంభించింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య స్పైస్ జెట్ సర్వీసు ను విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. స్పైస్‌జెట్ విమాన సంస్థ విశాఖ నుంచి గన్నవరానికి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు పాటు సర్వీసులు నడపనుంది. వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.50 గంటలకు బయలుదేరి 10.50కు వైజాగ్ చేరుకుంటుంది. నేటి నుంచి చెన్నై, సింగపూర్‌లకు కూడా నూతన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల సమయంలో అనివార్య కారణాల వల్ల రద్దయిన విమాన సర్వీసుల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. -
108 సేవలకు 432 కొత్త వాహనాలు
-
సేవకు సంసిద్ధం
సాక్షి , కడప : వలంటీర్లు సేవకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందించడానికి సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాలలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా పథకాల ఫలాలతోపాటు రేషన్ సరకులను ఇంటింటికీ చేరవేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈనెల 15నుంచి వీరంతా విధులలోకి రానున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ పనిచేయనున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్నారు. నియామక పత్రాలు అందుకున్నారు. మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో తొమ్మిది లక్షల మేర కుటుంబాలకు సంబంధించి 15,040 మంది వలంటీర్ల నియామకం చేపట్టారు. ప్రజాసాధికారిక సర్వే తరహాలో ముందుగా వలంటీర్ బయో మెట్రిక్ మిషన్ ద్వారా కుటుంబ వివరాలు సేకరించి పెట్టుకుంటారు. తదనంతరం ఇల్లు, రేషన్, పెన్షన్, స్థలం, నీరు, విద్యుత్, ఇతర కార్డు ఏదైనా అంతా వలంటీర్ ద్వారానే జరగాల్సి ఉంది. సచివాలయ వ్యవస్థ అక్టోబరు నుంచి అమలులోకి వస్తే వలంటీర్ ద్వారా ప్రజల సమస్యలకు సంబంధించి 72 గంటల్లోనే సమస్యను పరిష్కారం చూపేలా ప్రభుత్వం సిద్దమైంది. రేషన్ చేర్చడం మొదలుకొని ప్రతి సేవలోనూ వీరు కీలకంగా వ్యవహారించనున్నారు. వలంటీర్ల వ్యవస్థతో గ్రామాల్లో పూర్తి స్థాయిలో అన్ని సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కానుంది. వలంటీర్‌కు ప్రభుత్వం రూ.5 వేలు గౌరవ వేతనం అందిస్తుంది. సేవాభావంతో పనిచేసేలా వీరికి దిశా నిర్దేశం చేశారు. మరో పది రోజుల్లో ప్రజల్లోకి వలంటీర్ల వ్యవస్థ రానుంది. జిల్లా సమాచారం జిల్లాలో మొత్తం మండలాలు - 50 రెవెన్యూ గ్రామాలు - 4,032 మున్సిపాలిటీలు- 08 కార్పొరేషన్ - 01 మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పనిచేయనున్న వలంటీర్లు- 4483 గ్రామాల్లో సేవలు అందించనున్న వలంటీర్లు- 10,557 -
కాస్త పాజిటివ్‌గా ఆలోచించాలి
జీవితం కొట్టిన చావు దెబ్బలను తట్టుకుని నిలబడ్డ ఓ సాధారణ గృహిణి ఆమె. తమ జీవితం ముగిసిపోయిందనుకుంటున్న ఎందరికో పునర్జీవితం అందిస్తున్న ఆత్మబంధువు ఆమె. తన కష్టాలను అధిగమిస్తూ.. తన లాంటి వారి కన్నీళ్లను తుడుస్తున్న ఆమె ఎందరికో స్ఫూర్తి.. మరెందరికో ధైర్యం. ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం... నా పేరు మజ్జి పద్మావతి.. ‘విజయ పాజిటివ్ పీపుల్’ అనే స్వచ్ఛంద సంస్థలో 2005లో నేను మొదటగా కౌన్సిలర్‌గా జాయిన్ అయ్యాను. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్నాను. మా దగ్గర 7300 మంది హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు నమోదు చేసుకుని ఉన్నారు. వాళ్లలో ఎక్కువ మంది యంగ్ విడోస్‌తో పాటు పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలే. ఆ సమస్య నుంచి వారు బయట పడేందుకు, వారికి ఒక ఆశ కల్పించేందుకు గత ఏడాది అక్టోబరు 28న అధికారికంగా హెచ్ఐవి మ్యారేజ్ బ్యూరో ఒకటి ఆరంభించాం. ఇప్పటికే దాదాపు 150 పైగా జంటలను ఒకటి చేశాం. ఆధారం లేని జంటలను కలిపి వారికి ఒక కొత్తకుటుంబాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నానో చెప్పాలంటే ముందు నా గురించి మీకు తెలియాలి.. మా సొంతూరు పార్వతీపురం. పదవతరగతి అయిన వెంటనే పెళ్లి అయ్యింది. ఆరు నెలల తరువాత నా భర్తకు ప్రాణాంతక వ్యాధి ఉందనే విషయం తెలిసింది. అప్పటికి నేను గర్భవతిని. పెళ్లైన మూడేళ్లకే ఆయన చనిపోయారు. ఆ షాక్‌లో నేను మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయాను. అప్పటికి పాప పుట్టింది. ఒకసారి ప్రభుత్వాసుపత్రిలో టెస్టులు చేయించుకున్నాను. టెస్టుల్లో నేను పాజిటివ్ అనే భయంకర నిజం తెలిసింది. ఆశ ప్రోగ్రామ్‌కు వెళ్లాను. అక్కడ హెచ్ఐవీ పాజిటివ్స్ 30 మంది ఉన్నారు. అత్తవారింట్లో ఆదరణ కరువైంది. న్యాయంకోసం లోక్ అదాలత్‌లో కేసు వేశాను. మూడు సంవత్సరాలు పాటు కోర్టు చుట్టూ తిరిగాను. ప్రతి కలెక్టర్‌ను, ప్రతి జడ్జిని కలిశాను. ఫలితం లేదు. అయితే ఈ పోరాటంతో నా జీవితంలో మరో మజిలీ మొదలైంది. ‘విజయ పాజిటివ్ పీపుల్’తో బంధం ఏర్పడింది. హెచ్ఐవి వాళ్లను గుర్తించడం, వారికి మెరుగైన జీవితం అందించడంపై కృషి చేయడం, ప్రభుత్వ పథకాలతో వారిని అనుసంధానించడం వంటివి చేస్తున్నాను. పాజిటివ్స్‌పై ఎవరైనా వివక్ష చూపిస్తే వెంటనే అక్కడకు వెళతాం. వారికి కోర్టు ద్వారా గాని పోలీస్‌ల ద్వారా గాని రక్షణ కల్పిస్తాం. 2008లో నా జీవితం మరో మలుపు తిరిగింది. నేను ప్రతీ ఊరు వెళ్లి హెచ్ఐవీ గురించి అవగాహన తరగతులు చెప్పేదాన్ని.. శ్రీకాకుళం, బెంగుళూరు, ఒరిస్సా వరకు మీటింగ్‌లకు వెళ్లేదాన్ని. ఆ సమయంలో నన్ను చూసి, నా గురించి అన్నీ తెలిసి, మంచి వ్యక్తి ఒకరు నాకు కొత్తజీవితాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆయన మెడికల్ రిప్రంజెటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇష్టపూర్తిగా నన్ను ద్వితీయవివాహం చేసుకున్నాను. మా కుటుంబం, అత్త, మామ అందరూ ఇప్పుడు విజయనగరంలోనే ఉంటున్నాం. హెచ్ఐవీతో ఉన్న వారే ‘విజయ పాజిటివ్ పీపుల్’ అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యులుగా ఉంటారు. 2003లో బీఎస్ఆర్ మూర్తి ద్వారా ఈ సంస్థను ఏర్పాటయ్యింది. అన్ని మందుల కంటే మనోధైర్యమే హెచ్ఐవికి మందు. సేవ చేసినందుకు మేం డబ్బులు తీసుకోం.. పాజిటివ్స్ ముఖంలో చిరునవ్వు చూడటమే మా లక్ష్యం.. రాష్ట్రంలో 3.60 లక్షల మంది హెచ్ఐవీ పీడితులుంటే విజయనగరం జిల్లాలో 14 వేల మంది పైగానే మా సంస్థలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు కాకుండా, ప్రైవేట్‌గా మందులు వాడే వాళ్లు చాలా మందే ఉన్నారు. క్లాసుల మూలంగా కొంత కాలంగా అవగాహన, జాగ్రత్తలు పెరిగి వ్యాధి వ్యాప్తి 30 శాతం వరకు తగ్గింది. మా దగ్గరకు మ్యారేజ్ కోసం ఎక్కువగా అబ్బాయిలు వస్తుంటారు. వారి బయోడేటా తీసుకుని మూడు నెలలనుంచి మూడు సంవత్సరాలు వరకు వారిని పరిశీలిస్తాం. వారి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం తదితర అంశాలను గుర్తిస్తాం. భార్యను చూసుకోగలరా లేదా అని తెలుసుకుంటాం. అన్నీ బాగున్నాయంటే వారికి సంబంధం కుదిర్చి పెళ్లి చేస్తాం. వాటిలో కొన్ని కులాంతర వివాహాలు కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సొంత ఖర్చులతోనే ఈ వివాహాలు చేస్తున్నాం. మాకు వీహాన్ ప్రోగ్రాం ద్వారా రోజుకి రూ. 300 జీతం వస్తుంది. ఇంతకుమించి మాకు ఎలాంటి ఫండ్స్‌గానీ.. ప్రాజెక్టులు కానీ లేవు.. బడ్జెట్లు కూడా లేవు. వీటన్నిటినీ మించి ప్రాణం పోతుందని తెలిసిన తర్వాత కూడా ఆ భయాన్ని వీడి బతికే ధైర్యాన్ని కల్పిస్తున్నాం అన్న ఆత్మసంతృప్తి మాత్రం చాలా ఉంది. అది చాలు మాకు. – బోణం గణేష్, సాక్షిప్రతినిధి, విజయనగరం -
టిఫిన్ బాక్స్
అతడు ఉద్యోగి. ఆమె గృహిణి. ఆ ఉద్యోగికి ఇవాళ్లే రిటైర్మెంట్! రేపట్నుంచి అతడి జీవితం ఎలా ఉండబోతోంది?! ఆ సంగతి వదిలెయ్యండి. ఆ గృహిణికి ఎలా ఉండబోతోంది? ఈ క్షణంలో ఆమె ఏం ఆలోచిస్తోంది? అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇంకా ఈమధ్యనే కొత్తగా మావారు ఉద్యోగంలో జాయినయినట్టుగా ఉంది! అప్పుడే ముప్ఫై ఐదేళ్ల సర్వీసు అయిపోతోందా? ‘ఆగదు ఏ నిమిషం నీకోసము, ఆగితే సాగదు ఈలోకము’ పాట గుర్తుకొచ్చింది. ఆ.. ఇంకా ముప్ఫై ఏళ్ల సర్వీసు ఉందీ, ఇరవై ఏళ్ల సర్వీసు ఉందనుకుంటుండగానే పదవీ విరమణ కాలం వచ్చేసింది. ఇంకో ఏడాది రిటైర్మెంటుకి టైముందనుకున్నప్పటి నుంచీ ఆ గోడకున్న కేలెండరు కి కూడా తొందరొచ్చేసింది. ఎడాఫెడా బొమ్మలు మార్చేసింది.గోరువెచ్చని నిమ్మరసంతో మొదలవుతూ వచ్చింది ఇన్నేళ్ల మా రోజూ వారీ కార్యక్రమం. ఆయన వాకింగు చేసొచ్చి, వెంటనే న్యూస్పేపర్లో తలదూర్చి, ఆ కబురూ ఈ కబురూ చూడడం, ఎడిటోరియల్ చదవడం, స్నానానికి వెడుతూ ‘టిఫిన్ రెడీ చెయ్యవోయి, రెండు నిమిషాల్లో వచ్చేస్తా‘! అంటూ, ఉరకలు పరుగులతో బ్రేక్‌ఫాస్ట్ చెయ్యడం ఇక మీదట ఉండదేమో! ‘ఫ్లాస్కోలో ఇచ్చిన మజ్జిగ తాగడం మరచిపోకండి. పదకొండింటికి కీరాదోస ముక్కలూ, నాలుగు గంటలకి యాపిల్ పండు తినండి. మీటింగులు, పార్టీల పేరు చెప్పి టీలూ కాఫీలూ తాగకండి. జీడిపప్పులూ, సమోసాలూ ససేమిరా ముట్టుకోకండి’ అని ఏళ్ల తరబడి నే చెప్పే పాఠాలకింక స్వస్తి చెప్పే ఘడియలు దగ్గరకొస్తున్నాయి! అయ్యగారి ప్రతి పుట్టినరోజుకి ఓ పాంటు చొక్కా తో పాటూ ఓ లేటెస్ట్ మోడల్ టిఫిను బాక్సూ, ఓ థర్మాస్ తప్పనిసరిగా కొంటూవచ్చాను. ఇంక ఆ అవసరం ఉండదేమో!మూడుగిన్నెల కారియర్లో పైగిన్నెలో మూడు రోటీలు, మధ్య గిన్నెలో కూర, ఆఖరు గిన్నెలో ఆకుకూర పప్పు పెడతూవచ్చాను. అడపాదడపా పూరీలు, బిరియానీ, చైనీస్ కూడా వెరైటీగా పెడ్తూ వున్నాను. ఈ మధ్యనే తృణ ధాన్యాలతో కొత్త కొత్త రెసిపీలు నేర్చుకుని నా వంటకాలను ఆయనపై ప్రయోగిస్తున్నాను. ఎండా కాలంలో ధర్మాసులో చిక్కటి మజ్జిగలో నిమ్మకాయ పిండి, అల్లం తురిమి, రవ్వంత రాళ్ల ఉప్పు వేసి, ఏ పుదీనా ఆకో, కొత్తిమీరో వేసి గిలక్కొట్టి ఇస్తే ఆయనకి హ్యాపీ. అదే చలి కాలంలో వేడివేడి వెజిటెబుల్ సూపో, లెంటిల్ సూపో ధర్మాసులో నింపితే నేను ఆయన పక్కనున్నట్టుగా నులివెచ్చని ఫీలింగుట! ఇంటికొచ్చి మురిసి పోతారు. ఆయన టిఫిన్ కారియర్ ని ఎంతో ప్రేమతో, ఓపిగ్గా సర్దుతుంటే చెప్పలేనంత తృప్తిగా ఉంటుంది. ఏ మాత్రం పనిలా అనిపించదు. ఆ టిఫిన్ కారియర్ని రకరకాల అందమైన జూట్ బ్యాగ్గుల్లో ముస్తాబు చేయడం ఓ జ్ఞప్తిగా మిగిలిపోతుంది. ఆ బ్యాగులన్నీ కిచెన్ షెల్ఫ్‌లో వేళ్లాడాల్సిందేనా? రేపటి రోజున టిఫిన్ బాక్స్‌లో ఏం ఫుడ్ అరేంజ్ చెయ్యాలో అన్న ఆలోచనకు కామా నుండి ఫుల్ స్టాపేనేమో! వచ్చే ఏడాది ఈయన పుట్టిన రోజుకేం గిఫ్టు ఇవ్వాలో? ఇద్దరం కలసి లంచ్ ఇంట్లోనే చేస్తాం కాబట్టి టిఫిన్ బాక్సూ, థర్మాసు గిఫ్టు రూల్డౌట్!టింగు టింగు మని కాలింగ్ బెల్ మోగడంతో నా ఆలోచనలకి బ్రేకు పడింది.‘ హే గుడ్ న్యూస్ సత్యా’ అంటూ కేను కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చుని బూట్లు విప్పుకుంటూ ‘నా సిన్సియర్ హార్డ్‌వర్క్‌కి, ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీలలో నాకున్న అవగాహనకి, నాకు ఆ విషయంలో ఉన్న ఎక్స్పర్టీస్కి ప్రభుత్వం వారు మెచ్చి, రానున్న తరాలవారికి, దేశానికి నా అనుభవం ఉపయోగపడాలని నాకు మరో మూడేళ్ల కోసం సర్వీస్‌లో ఎక్స్టెండ్ చేశారోయి. నెక్స్ట్ బర్త్ డేకి టిఫిన్ బాక్సూ, థర్మాసూ కొనొచ్చు డియర్. ఈగర్లీ వెయిటింగ్ ఫార్ మోర్ డెలీషియస్ లంచెస్‘ అన్నారు, నా మనసు చదివినట్టుగా! ఆయన ఇంటికి తెచ్చిన టిఫిన్ బాక్స్‌ని లోపలికి తీసుకెళ్లి మెత్తగా ఓ ముద్దు పెట్టుకున్నా. ఇంకో మూడేళ్లు టిఫిన్ బాక్స్ తో ప్రేమానుబంధం కంటిన్యూ అవుతుందన్నమాట! ఆయన కోసం నేను తయారు చేసుంచిన పళ్లరసంతో, శుభ సమాచారానికి కంగ్రాట్స్ చెప్పేందుకు ఆయన దగ్గరకి వెళ్లా. సత్యశ్రీ నండూరి -
అనంతపురం జిల్లాలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు
-
చేతులెత్తేసిన జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: కొన్ని త్రైమాసికాలుగా భారీ నష్టాలను చవిచూస్తూ... ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి సైతం ఇబ్బందులు పడుతున్న జెట్ ఎయిర్వేస్కు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. తీసుకున్న రుణాలకు వాయిదాలను చెల్లించడంలో సంస్థ విఫలమైంది. ఎస్బీఐ ఆధ్వర్యంలోని దేశీయ బ్యాంకుల కన్సార్షియానికి రుణంలో అసలును, వడ్డీని కలిపి డిసెంబరు 31న చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించలేకపోయింది. తాత్కాలిక నగదు ప్రవాహాల్లో తారతమ్యాలే దీనికి కారణమని జెట్ ఎయిర్వేస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. రుణ చెల్లింపులకు సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపింది. జెట్ ఎయిర్వేస్ ఖాతాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్బీఐ ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించింది. వరుసగా గత మూడు త్రైమాసికాలుగా జెట్‌ఎయిర్‌వేస్ రూ.1,000 కోట్లకుపైగా నష్టాలను ప్రకటిస్తూ వస్తోంది. నష్టాల తగ్గింపు చర్యల్లో భాగంగా కొంత మంది ఉద్యోగులను తొలగించింది. లాభదాయకం కాని మార్గాల్లో సర్వీసులను కూడా నిలిపివేసింది. కాగా, మూలధన అవసరాల కోసం, కొన్ని రకాల చెల్లింపులకు రూ.1,500 కోట్ల మేర స్వల్పకాలిక రుణం తీసుకునే ప్రయత్నాలను సంస్థ ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. రేటింగ్ తగ్గింపు జెట్‌ఎయిర్‌వేస్ దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ సదుపాయాల రేటింగ్‌ను తగ్గిస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం ప్రకటించింది. ‘‘యాజమాన్యం నుంచి లిక్విడిటీ పెంపు చర్యల అమలులో జాప్యం నెలకొంది. దీంతో లిక్విడిటీ సమస్య తీవ్రతరం అయింది. కంపెనీ ఇప్పటికే ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, విమానాల అద్దె చెల్లింపులనూ ఆలస్యం చేస్తోంది’’అని ఇక్రా తన నిర్ణయం వెనుక కారణాలను తెలియజేసింది. జెట్ ఎయిర్వేస్ 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు రూ.1,700 కోట్ల మేర, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,444 కోట్లు, రూ.2020–21లో రూ.2,167 కోట్ల మేర బకాయిలను తీర్చాల్సి ఉందని ఇక్రా తెలియజేసింది. షేరుకు అమ్మకాల ఒత్తిడి జెట్ ఎయిర్వేస్ రుణ చెల్లింపుల్లో విఫలమైందన్న సమాచారం బయటకు రావడంతో... కంపెనీ షేర్ల అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈలో 6 శాతానికి పైగా నష్టపోయి రూ.263.75 వద్ద క్లోజయింది. ఎన్ఎస్ఈలో 7 శాతం వరకు నష్టపోయింది. -
మీ సేవలకు ధన్యవాదాలు
సాక్షి, సిటీబ్యూరో: రోటీన్‌కు భిన్నంగా నగర పోలీసు వార్షిక విలేకరుల సమావేశాన్ని పాతబస్తీలోని చౌ మొహల్లా ప్యాలెస్‌లో ఏర్పాటు చేయాలని కొత్వాల్ అంజనీకుమార్ నిర్ణయించారు. ఈ బాధ్యతల్ని ఇన్చార్జ్ డీసీపీగా ఉన్న ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేష్‌కు అప్పగించారు. బుధవారం ఈ కార్యక్రమం జరుగనుండటంతో ఆయన మంగళవారం ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా ఓ చిన్నారి ఆయన వద్దకు వచ్చింది. షేక్ హ్యాండ్ ఇస్తూ ‘«థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్’ అంటూ చెప్పింది. అది విన్న ఆయన ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ పాప వెంటే వచ్చిన ఆమె కుటుంబీకులు అసలు విషయం డీసీపీ రమేష్‌కు వివరించారు. బెంగళూరుకు చెందిన ఐదేళ్ల ఆ చిన్నారి పేరు శివాని. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న ఆమెకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పోలీసులను గౌరవించడం నేర్పారు. సమాజం కోసం వారు చేస్తున్న సేవల్ని వివరించారు. దీంతో శివానీకి పోలీసులంటే వల్లమానిన గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. యూనిఫాంలో ఉన్న అధికారులు, సిబ్బంది ఎక్కడ కనిపించినా వారి వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ‘థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్’ అని చిరునవ్వుతో చెప్తుంది. మంగళవారం చౌమొహల్లా ప్యాలెస్‌లో ఉన్న డీసీపీ రమేష్‌ను ఈ అనుభవం ఎదురైంది. నగరంలో నివసిస్తున్న తాత–నానమ్మల దగ్గరకు శివానీ తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. వారంతా కలిసి ప్యాలెస్ చూడటానికి అక్కడకు వచ్చారు. ఈ చిన్నారికి తల్లిదండ్రులు నేర్పిన విషయాన్ని గమనించిన డీసీపీ రమేష్ వారి కుటుంబంలో ఎవరైనా పోలీసులు ఉండి ఉంటారని, అందుకే ఇలా నేర్పించి ఉంటారని భావించారు. ఈ విషయంపై ఆరా తీయగా శివాని తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు సైతం ప్రొఫెసర్లు, టీచర్లుగా పని చేసిన, చేస్తున్న వారే. అయినప్పటికీ పోలీసుల విధులు అంటే వారికి అత్యంత గౌరవం. దీన్నే శివానీకి ఆ తల్లిదండ్రులు నేర్పారు. -
నో సర్వీస్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనదారులు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంటారు. రోడ్డు నిర్మాణం.. నిర్వహణలో సరైన ప్రమాణాలు పాటించక జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. అయితే, హెచ్ఎండీఏ ఔటర్ రింగ్ రోడ్డు విభాగ అధికారులు సర్వీసు రోడ్ల విషయంలోనూ అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓఆర్ఆర్ను తాకుతూ వెళుతున్న రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపి మూడేళ్లుగా సర్వీస్ రోడ్లలోబ్రిడ్జిల నిర్మాణాన్ని పక్కనపెట్టేసి ఆ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నారు. రెండు, మూడు కిలోమీటర్లు అదనం గా చుట్టూ తిరిగి గమ్యం చేరుతున్నారు. చేపట్టిన సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఎక్కడికక్కడే నిలిపివేశారు. పైగా రైల్వే ట్రాక్ ఉన్న ప్రాం తంలో బ్రిడ్జిలు కడితే ‘టోల్ కలెక్షన్’ తగ్గిపోతుం దని చెబుతున్నారు. 2012లోనే ఓఆర్ఆర్తో పాటు సర్వీసు రోడ్డు నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి. కానీ ఇప్పటికీ ఘట్కేసర్, మేడ్చల్, ఈదులనాగులపల్లి, శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ను తాకుతున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లపై వంతెనల నిర్మాణం చేపట్టలేదు. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతిచ్చినా ఇప్పటికీ పనులను చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గౌడవెల్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మాణం చేయక.. ఘట్కేసర్ మండలంలోని గౌడవెల్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో సర్వీసురోడ్డులో వాహనదారులు 3.5 కిలోమీటర్ల అదనంగా తిరగాల్సి వస్తోంది. గౌడవెల్లి పరిధిలో ఉన్న సికింద్రాబాద్–నాందేడ్ రైలు మార్గంలోనే రింగురోడ్డు నిర్మించారు. గౌడవెల్లి స్టేషన్ నుంచి రింగు రోడ్డు వెళుతోంది. ఘట్కేసర్ నుంచి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్చెరు వైపు నుంచి వచ్చే రోడ్డులో గౌడవెల్లి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్ వరకు సర్వీసు రోడ్డు వేసి వదిలేశారు. దీంతో వా హనదారులు సుతారిగూడ టోల్ ప్లాజా నుంచి గౌడవెల్లి గ్రామం మీదుగా 3.5 కి.మీ తిరిగి జ్ఞానాపూర్ బ్రిడ్జి వద్ద సర్వీస్ రోడ్డు తేరుతున్నారు. ఈదులనాగులపల్లిలో.. ఈదూలనాగులపల్లి, వెలమల శివారుల్లో రైల్వేట్రాక్ కారణంగా సర్వీసు రోడ్డును అంసపూర్తిగా వదిలేశారు. తాత్కాలికంగా మట్టి పోశారు. ఆ రోడ్డుపై నిత్యం ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. నాగులపల్లి రావాలంటే చాలా దూరం తిరిగాల్సిందే. గతంలో స్థానికులు ఆందోళన చేసినా హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగ అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మేడ్చల్.. శంషాబాద్‌లో ఇలా.. కీసర నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో పెద్ద అంబర్పేట్ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వరకు సర్వీస్ రోడ్డులో ప్రయాణించి అక్కడి నుంచి యంనంపేట్ గ్రామం నుంచి ఘట్కేసర్ బైపాస్ రోడ్డు కూడలి దాటి సర్వీస్ రోడ్డుకు చేరాలి. ఇక్కడా సర్వీస్ రోడ్డు నిర్మించక అదనంగా 3 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిందే. పెద్ద అంబర్పేట్ నుంచి కీసర పోవాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాలి. ఓఆర్ఆర తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్దగోల్కొండ వైపు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఇరువైపులా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఉందానగర్–తిమ్మాపూర్ స్టేషన్ల రైల్వే ట్రాక్ ఉండడంతో సర్వీసు రోడ్డును అర్ధాంతరంగా నిలిపేశారు. అలాగే చెన్నమ్మ హోటల్ సమీపంలోని కొత్వాల్‌గూడ వద్దా రెండు కిలోమీటర్ల వరకు సర్వీసు రోడ్డు పనులు చేపట్టలేదు. దీంతో హిమాయత్‌సాగర్ వెంబడి ఉన్న ఇరుకు దారి గుండానే వెళ్లాల్సి వస్తోంది. -
పరోపకారార్థం ఇదం శరీరం
ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక సాధారణ నర్సు. దీపం చేత పట్టుకుని వ్యాథిగ్రస్థులు, యుద్ధంలో క్షతగాత్రులయిన వాళ్ళ కోసం రోజుకు 20 గంటలపాటు విరామం లేకుండా సేవ చేసింది. రోగులను ఆమె ఎంతగా ఆత్మీయంగా చూసుకునేదంటే, ఆమె అటుగా వెడుతుంటే అక్కడ పడిన ఆమె నీడను ఆదరణ భావంతో ముద్దాడేవారు. ఆమె సేవ అంతగా మెప్పించేది. ఆ క్రమంలో ఆమె మంచంపట్టింది. ఆ స్థితిలోకూడా ఆమె ‘నోట్స్ ఆన్ నర్సింగ్’ పేరిట ఒక పుస్తకం రాసింది. అది ప్రపంచమంతటా ఆదరణ పొందింది. ఆస్పత్రుల నిర్వహణలో ఈరోజుకూ దానిని ప్రామాణికంగా భావిస్తారు. ఎప్పటి నైటింగేల్..!!! ఇప్పటికీ ఆమెను తలచుకుంటున్నాం. మార్గరెట్ ఎలిజబెత్ ఎక్కడో పుట్టింది. స్వామీ వివేకానంద ప్రసంగాలకు పరవశించిపోయింది. స్వామి ఆహ్వానంపై భారతదేశానికి వచ్చి ఇక్కడి భాషలు నేర్చుకుంది. చాలా కష్టాలకోర్చి పాఠశాలలు పెట్టి స్త్రీలనెందరినో విద్యావంతులను చేసింది. ‘‘నిన్ను నీవు సమాజానికి నివేదన చేసుకున్నావు. అందుకని నీకు నివేదిత అని పేరు పెడుతున్నా. నిన్ను భారతదేశం సోదరీ, అని గౌరవిస్తుంది’’ అన్నాడు వివేకానందుడు. అలా ఆమె ‘సిస్టర్ నివేదిత’ అయింది. చాలా పుస్తకాలు కూడా రాసింది. వాటిమీద లక్షల రూపాయలు రాయల్టీ వస్తాయని తెలిసి కూడా వాటిని రామకష్ణ మిషన్‌కు రాసిచ్చింది. ఎక్కడి ఎలిజబెత్ !! కాటన్ ఎక్కడి వాడు !! చివరకు అన్నార్తులకు లేదనకుండా ఏళ్ళ తరబడి తల్లిలా ఆకలి తీర్చిన మన డొక్కా సీతమ్మ.... వీళ్ళందరూ ఎవరు !!!....‘‘కులం, మతం, జాతి, ప్రాంతం, భాషవంటి పట్టింపులు’’ ఏవీ లేకుండా ఉపకారం చేయడమే పరమ ధర్మంగా భావించి, అలా జీవించి చరితార్థులయ్యారు. అరబిందో జీవితాన్ని చూడండి...స్వాతంత్ర్య సంగ్రామం నాటి రోజుల్లో... ‘ప్రజలను ప్రేరేపిస్తున్నారు’ అనే నేరంకింద ఆయనతోపాటు ఆయన సహచరులను జైళ్ళల్లో పెట్టారు. అవెలా ఉండావో తెలుసా....పడుకోవడానికి, కూర్చోవడానికి కూడా వీలు లేకుండా గదుల్లో గోతులు తవ్వి ఉంచేవారు. నీళ్ళు తాగడానికి అల్యూమినియం పాత్రలు పెడితే ఎండలకు అవి బాగా వేడెక్కి ఉండేవి. దాహం తీరదు. ఒక పింగాణీ పళ్ళెం, ఒక చిన్న పింగాణీ చిప్ప ఇచ్చేవారు. నీళ్ళు ముంచుకుని తాగాలన్నా, కూర వేసుకోవాలన్నా, చేతులు కడుక్కోవాలన్నా, స్నానం, శౌచం అన్నీ వాటితోనే. తారుపూసిన డబ్బాలు కూడా ఇచ్చేవారు. మలమూత్రాలు వాటిలో విసర్జించాలి. రోజుమొత్తం మీద ఒకసారో రెండు సార్లో ఎవరో ఒక వ్యక్తి వచ్చి అవి తీసేస్తాడు. ఆ పక్కరోజు అతనొచ్చేదాకా వాటిలో ఉన్నవి అంతే. ఇదంతా ఒకే గదిలో. ఒక రోజు, వారం కాదు, సంవత్సరాల తరబడి ఆ గదుల్లో అలా మగ్గిన మహనీయులు తీసుకొచ్చి ఇచ్చిన స్వాతంతా్ర్యన్ని అనుభవిస్తున్నాం. ఇది అనుక్షణం గుర్తుంటే మనకు లంచం, అవినీతి, బంధుప్రీతి వంటి అవలక్షణాలు అబ్బవు. అందుకే జనగణమన పాడేటప్పడు మనం తప్పక గుర్తుంచుకోవలసింది వీరి త్యాగాలను. అలాగే సర్వసుఖాలను వదులుకుని దేశ సరిహద్దులను తమ కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికులను కూడా. వీటిని మీరందరూ గుర్తించి మెలగాలన్న ఆర్తితో ఈ జాతి వైభవాన్ని రక్షించే బాధ్యతను కలాం ఈ దేశ విద్యార్థులమీద, యువతీయువకులమీద పెట్టారు. దానికి అవసరమైన శక్తి వారికి చేకూరాలని నేను భగవంతుడిని వేడుకుంటున్నాను. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మహానేతకు సేవ చేయడం మా అదృష్టం...
దేశవ్యాప్తంగా తన వాక్పటిమ, రాజనీతిజ్ఞతతో ఆకట్టుకున్న మహానేతకు వారు సేవలందించారు. వాజ్‌పేయికి అంతమ శ్వాసవరకు సేవ చేసే అవకాశం లభించడాన్ని ఢిల్లీలోని ఆల్ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) డాక్టర్లు, నర్సులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఏయిమ్స్‌లో వాజ్‌పేయికి 9 వారాల పాటు చికిత్స అందించిన సందర్భంగా తమకెదురైన జ్థాపకాలను వారు పదిలం చేసుకుంటున్నారు. వృద్ధాప్యంతో పాటు న్యూమోనియా, వివిధ అవయవాలు పనిచేయని కారణంగా గురువారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. వాజ్‌పేయి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో గత కొన్నిరోజులుగా తాము తీవ్ర వత్తిడిలో పనిచేయాల్సి వచ్చిందని, అయినా అలాంటి నేతకు సేవలు చేయడంలో ఆ శ్రమ మరిచిపోయామని చెబుతున్నారు. ’ చిన్నప్పటి నుంచి ఏ నాయకుడి ఉపన్యాసాలు టీవీల్లో చూస్తూ పెరిగామో ఆ నేతే ఆసుపత్రి మంచంపై తీవ్ర అనారోగ్య స్థితిలో కనిపించడాన్ని వివరించడానికి కష్టంగా ఉంది. వాజ్‌పేయి లాహోర్ బస్సుయాత్రకు వెళ్లిన దృశ్యాలు ఇంకా కళ్లకు కట్టినట్టుగా ఇప్పటికీ నాకు కనిపిస్తున్నాయి’ అని ఓ నర్సు చెప్పారు. మామూలు ఆరోగ్య పరీక్షల కోసం జూన్ 11న ఏయిమ్స్‌కు వచ్చిన సందర్భంగా ముత్రాశయ ద్వారంలో ఇన్ఫెక్షన్తో పాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్,తక్కువ మోతాదులో మూత్రం విడుదల, ఛాతీ సమస్యలను డాక్టర్లు గుర్తించారు. ఆయనకు అవసరమైన వైద్యం అందించేందుకు ఆ వెంటనే ఏయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఐదుగురు డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యపరిస్థితిని గురించి ప్రధాని కార్యాలయం ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉండేదని అక్కడి డాక్టర్లు తెలిపారు. గత శనివారం నుంచి వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించడం మొదలైందని, బుధవారం మరింత విశమించిందని వారు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నానానికి రెండు ఊపరితిత్తుల్లో న్యూమోనియా తీవ్రస్థాయికి చేరుకుందని, ఆ వెంటనే ’ఎక్స్ట్రా మెంబ్రేన్ ఆక్సిజెనెషన్’ (ఈసీఎంఓ) సేవలు అందించారు. ఈ ప్రక్రియ గుండెకు, శ్వాసక్రియకు సహాయకారిగా ఉండడంతో పాటు, కృత్రిమ గుండెగా, ఊపిరితిత్తులుగాను ఇది పనిచేస్తుంది. దిగజారుతున్న వాజ్‌పేయి ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు వైద్యసిబ్బంది ఓ వైపు తీవ్రంగా శ్రమిస్తుండగా, విశమిస్తున్న ఆరోగ్యం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన పెరిగింది. చివరకు ప్రధాని మోదీ ఏయిమ్స్‌ను సందర్శించాక, వాజ్‌పేయి మరణవార్తను ఏయిమ్స్ మీడియా, ప్రోటోకాల్ డివిజన్ చైర్పర్సన్ డా. ఆర్తి విజ్ ప్రకటించారు. వాజ్‌పేయి మరణం రూపంలో ఎంతో నష్టం వాటిల్లిందని, దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న సంతాపంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నామంటూ పేర్కొన్నారు. -
‘అన్నం’కు ‘సాయిస్ఫూర్తి’ విరాళం
సత్తుపల్లి : జిల్లా కేంద్రంలో అన్నం సేవా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, సాయిస్ఫూర్తి స్టూడెంట్స్ సేవా సమితి బుధవారం రూ.లక్ష విరాళాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ అన్నం శ్రీనివాసరావుకు అందించారు. అన్నం ఫౌండేషన్‌లో కళ్లులేని, మూగవారికి, వికలాంగులకు, మతిస్థిమితం లేనివారికి, వయోవృద్ధులు, పక్షవాతం, పైలేరియా వ్యాధులతో బాధపడుతున్న అనాథలకు అందిస్తున్న సేవల కోసం విరాళాన్ని అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు దిలీప్, రఘువంశీ, దివ్య, నవ్య, నాగరాజు, మానస, షణ్ముఖరెడ్డి, అన్నం సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
విమాన సేవలు పునరుద్ధరించాలి
భువనేశ్వర్ ఒరిస్సా : స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానయాన సేవల్ని ఇటీవల రద్దు చేశారు. భువనేశ్వర్ నుంచి బెంగళూరు, బ్యాంకాక్ ప్రత్యక్ష విమానయాన సేవలు రద్దయ్యాయి. ఈ సేవల్ని తక్షణమే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ బాబుకు శుక్రవారం లేఖ రాశారు. 2010వ సంవత్సరం అక్టోబరు 30వ తేదీన స్థానిక విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 2017వ సంవత్సరం డిసెంబరు 10వ తేదీ నుంచి స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు ప్రత్యక్ష అంతర్జాతీయ విమానయాన సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఇలా అంచెలంచెలుగా అంతర్జాతీయ విమానయాన సదుపాయాలు విస్తరిస్తారని ఊహిస్తుండగా కొనసాగుతున్న విమానయాన సేవల్ని రద్దు చేయడం అంతర్జాతీయ పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తుంది. సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక వంటి ప్రపంచ దేశాలకు విమానయాన సదుపాయాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆశించిన వర్గాలకు కొనసాగుతున్న విమాన సేవల్ని రద్దు చేయడం తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. బెంగళూరుకు స్వదేశీ విమాన సేవల్ని రద్దు చేయడంతో రాష్ట్రం నుంచి సాంకేతిక సమాచార వ్యవహారాల నేపథ్యంలో రాకపోకలు చేసే వర్గాలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. భువనేశ్వర్ నుంచి బ్యాంకాక్, బెంగళూరు ప్రాంతాలకు ఇటీవల రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సేవల్ని తక్షణమే పునరుద్ధరించడంలో ప్రత్యక్షంగా చొరవ కల్పించుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ బాబుకు రాసిన లేఖలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభ్యర్థించారు. -
కార్పొరేట్ ఆఫీసుల్లో ‘పాలిటోస్’ రెస్టారెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చికెన్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న పాలిటోస్ కార్పొరేట్ బాట పట్టింది. ఫుడ్, కెఫెటేరియాల నిర్వహణలో ఉన్న హంగర్ బాక్స్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంతో 170 కార్పొరేట్ కంపెనీల్లో రెస్టారెంట్లను ఏర్పాటు చేసేందుకు పాలిటోస్కు మార్గం సుగమం అయింది. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమిని, జీఈ, టీసీఎస్ వంటి సంస్థల కార్యాలయాల్లో పాలిటోస్ రెస్టారెంట్లు దర్శనమీయనున్నాయి. క్యాప్‌జెమిని పుణే క్యాంపస్‌లలో 2 ఔట్లెట్లు ఇప్పటికే ప్రారంభించింది. ఇతర సంస్థల్లో 17 కేంద్రాల ఏర్పాటుకై భాగస్వాములతో ఒప్పందం కుదిరిందని పాలిటోస్ను ప్రమోట్ చేస్తున్న ప్రోవెంచర్ గ్రూప్ డైరెక్టర్ అనిల్ దొండ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఒక్కో రెస్టారెంట్ ద్వారా 10–12 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. మెట్రో అన్ని స్టేషన్లలో.. ఎల్అండ్టీతో ఇటీవలే ప్రోవెంచర్ చేతులు కలిపింది. దీనిలో భాగంగా హైదరాబాద్ మెట్రో అన్ని స్టేషన్లలో పాలిటోస్ రెస్టారెంట్లు ఏర్పాటు కానున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఏడు పాలిటోస్ స్టోర్లు ఉన్నాయి. వియత్నాంలో రెండు కేంద్రాలు ఉన్నాయి. యూఎస్ సహా అన్ని దేశాల్లోనూ అడుగుపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే అద్దె, విద్యుత్ చార్జీలు లేకపోవడంతో కార్పొరేట్ కార్యాలయాల్లోని పాలిటోస్ రెస్టారెంట్లలో ఉత్పత్తుల ధర 15–18 శాతం తక్కువగా ఉంటుంది. కంపెనీకి 10 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు.ప్రాంతాన్నిబట్టి ఫ్రాంచైజీకి రూ.15–35 లక్షలు అవుతుంది. విస్తరణ కోసం కంపెనీ రూ.10 కోట్లు సమీకరించే పనిలోఉంది. ఆధునిక టెక్నాలజీతో.. హైదరాబాద్ సమీపంలోని కందుకూరు వద్ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కంపెనీ నెలకొల్పింది. 3.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.4 కోట్ల వ్యయంతో దీనిని స్థాపించారు. గోద్రెజ్ టైసన్ నుంచి చికెన్‌ను కొనుగోలు చేస్తోంది. ‘‘ప్రాసెసింగ్ యూనిట్లో బ్లాస్ట్ ఫ్రీజింగ్ టెక్నాలజీని వినియోగించాం. దిగ్గజ సంస్థల వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. చికెన్ ఉత్పత్తులు కలుషితం కావు. బ్యాక్టీరియా దరిచేరదు. 8 నుంచి 12 నెలలపాటు ఉత్పత్తులు నిల్వ ఉంటాయి. ఈ యూనిట్ నుంచే కోల్డ్ చైన్ ద్వారా అన్ని కేంద్రాలకు సరఫరా చేస్తాం. రెస్టారెంట్లలో ప్రత్యేక ఓవెన్లను ఏర్పాటు చేశాం’’ అని అనిల్ వివరించారు. -
ఈ చిన్నోడు.. మనసున్నోడు
జగదేవ్‌పూర్(గజ్వేల్): వయస్సు 17 కుర్రాడు తోటి విద్యార్థులకు సేవ చేయాలన్న సంకల్పంతో సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వయస్తు చిన్నదైనా మనస్సు మాత్రం పెద్దదే.. మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలకు సేవలందిస్తున్న అమెరికా అబ్బాయిపై ప్రత్యేక కథనం... కుటుంబ నేపథ్యం నల్గొండ జిల్లా పట్టణానికి చెందిన శీల శంకరయ్య, ధనలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. శంకరయ్య నల్గొండలో నాగార్జున డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ తన ముగ్గురు కొడుకులు శ్రీనివాస్, రమేష్, హరినాథ్, కూతురు కరుణశ్రీలను ఉన్నత చదువులు చదివించారు. ముగ్గురు కొడుకులు మెడిసిన్‌లో స్థిరపడగా, కూతురు కరుణశ్రీ స్టాప్వేర్గా ఉద్యోగం చేస్తున్నారు. శీల శ్రీనివాస్ నల్గొండలో 10 వరకు చదివి, ఇంటర్, డిగ్రీ, మెడిసీన్ హైదరాబాద్‌లో చదివారు. అలాగే కుటుంబం మొత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. శ్రీనివాస్ హైదరాబాద్‌లోనే కొన్నేళ్లపాటు సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించి విధులు నిర్వహించారు. అనంతరం 1990లో శంకరయ్య కుటుంబం మొత్తం అమెరికాకు వెళ్లారు. అక్కడ శ్రీనివాస్ సివిల్ వదులుకుని డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూ అక్కడే స్థిరపడ్డారు. శ్రీనివాస్, అరుణ దంపతులకు ఇద్దరు కొడుకులు రిత్విక్‌శీల, కృత్విక్ శీల, కూతురు సాన్వి. ముందుగా శ్రీనివాస్ తన తల్లి చదివిన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కోప్పోల్ గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు పంపణీ చేయడం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలో సేవలు చేయాలన్న లక్ష్యంతో అమెరికాలో తనతో పాటు ముగ్గురితో కలిసి ఓ సంస్థను ఏర్పాటు చేశారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనే పేరు పెట్టి సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా తమకు వచ్చే వేతనంలో కొంత జమా చేయడం మొదలు పెట్టారు. మొదటి సారిగా తెలంగాణ ప్రాంతంలోని కొప్పోల్ గ్రామంలో ప్రారంభించారు. జగదేవ్‌పూర్ మండలంలోని 52 పాఠశాలల విద్యార్థులకు 2016లో నోట్బుక్లు అందించారు. ఇండియాలో నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్‌కు తన పెద్దమ్మ కొడుకైనా మధుసూదన్ కొఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. అమ్మనాన్నల స్ఫూర్తితో... విద్యార్థి రిత్విక్‌శీల ప్రస్తుతం అమెరికాలో డిగ్రీ చదువుతున్నారు. అయితే తను సేవ చేయడానికి అమ్మనాన్నలే స్ఫూర్తిగా నిలిచారు. గత ఐదేళ్ల క్రితం రిత్విక్ నానమ్మ చదివిన పాఠశాలలో విద్యార్థులకు నాన్న నోట్ పుస్తకాలు ఇవ్వడం చూసాడు. అప్పుడే నేను కూడా సేవ చేయాలే ఆలోచన వచ్చి, అప్పటి నుంచి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. తోటి విద్యార్థులకు సేవ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాడు. అమ్మనాన్నలు పుట్టి పెరిగిన నేలపై సేవలు చేయాలనే ఉద్ధేశ్యంతోనే నల్గొండ జిల్లాలో ప్రారంభం చేసి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్, మర్కూక్ మండలాల్లో సేవలు ప్రారంభించారు. మూడేళ్లుగా ఇక్కడి విద్యార్థుల లక్షల రూపాయలు ఖర్చు చేసి వేల నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 35 లక్షల విలువ గల నోట్ పుస్తకాలను 1 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. ఆనందం చెప్పలేనిది... ఈ నెల 14న జగదేవ్‌పూర్‌లోని నోట్ పుస్తకాల పంపిణీకి విద్యార్థి రిత్విక్ శీల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే నోట్ పుస్తకాలు అందించారు. రిత్విక్శీలను చూసి విద్యార్థులు సంతోషంలో మునిగితేలారు. రిత్విక్తో చేతులు కలిపేందుకు పోటీ పడ్డారు. బాగా చదివి ఉన్నతస్థాయి శిఖరాలకు చేరుకోవాలని హితబోధ చేశారు. రిత్విక్తో పోటీ సెల్ఫీ పోటోలు దిగేందుకు విద్యార్థులు పోటీ పడడం, చేతులు కలపడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందం వెల్లివిరిసింది. సేవ చేయడంలో సంతృప్తి.. సేవ చేస్తే ఏమొస్తుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ సేవలో ఉన్న సంతృప్తి మరెందులో లేదనిపిస్తుంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. నా ఆశయం వెనుక అమ్మనాన్న ఉన్నారు. వారి కలను నిజం చేస్తాను. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి గోల్ పెట్టుకుని చదువుకోవాలి. అప్పుడే కన్నవాళ్ల కలలు, మా లక్ష్యం నిజం అవుతుంది. రానున్న రోజుల్లో సేవలను విస్తృత్తం చేస్తాను. – రిత్విక్‌శీల -
చిన్న వయసు.. పెద్ద మనసు
ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు భారం అనుకుంటున్న వారూ చాలా మంది ఉన్నారు... తమను పెంచి పోషించిన వారు మంచాన పడితే పట్టించుకోని వారినీ చూస్తుంటాం.. వారికి ఆలనాపాలన చూ సేందుకు వెనకాడుతుంటారు... అయితే ఓ అమ్మాయి తమ తాతయ్య కోసం అహర్నిశలు కష్టపడుతూ సేవలందిస్తోంది. రాయచోటి రూరల్ : రాయచోటి మండలం వరిగపాపిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీలోని చౌడచెరువువారిపల్లెకు చెందిన శంకారపు రెడ్డి ఈశ్వరి ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేసింది. తమ కుటుంబం కోసం ఎంతో కష్టపడిన తాతయ్య శంకారపు గంగాధరానికి సేవలందిస్తోంది. శంకారపు గంగాధరం(90) ఉపాధ్యాయుడిగా, ఎంఈవోగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అందరికీ వివాహాలు చేశారు. ఎంఈవోగా లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో పని చేస్తూ రాయచోటి పట్టణంలో నివాసం ఉండేవారు. పెద్ద కుమారుడు వెంకటరమణ బిడ్డలు రెడ్డికుమారి, రెడ్డి ఈశ్వరి, రెడ్డిప్రసాద్తోపాటు రెండో కుమారుడు శివప్రసాద్ బిడ్డలను కూడా తన వద్దనే ఉంచుకుని చదివించాడు. విద్య విలువ తెలియడంతో పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో వారినే తన వద్దే ఉంచుకున్నారు. వారి చిన్ననాటి నుంచి ఆలనాపాలన చూసుకున్నారు. పక్షవాతం సోకడంతో.. గంగాధరానికి వయసు మీద పడింది. ప్రస్తుతం 90 ఏళ్లు. ఆయనకు పక్షవాతం సోకడంతో మొదట తిరుపతి, అనంతరం మహల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో వైద్యం చేయించారు. ఆ తర్వాత రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈశ్వరి రాత్రి, పగలు ఆయన దగ్గరే ఉంటూ సేవలందిస్తోంది. రోజుకు మూడు పూటలా వేడినీరు, తడిబట్టతో శరీరం శుభ్రం చేయడంతోపాటు అన్ని రకాల సపర్యలు చేస్తోంది. ఇది చూస్తున్న ఆసుపత్రి వర్గాలు, ఇతర రోగులు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి బిడ్డ పుడితే సంతోషించని వారు ఎవరు ఉంటారని వారు అంటున్నారు. రుణం తీర్చుకుంటున్నా కుటుంబంలో అందరి మంచి కోరుకుంటూ.. మనవళ్లు, మనవరాళ్లను బాగా చదివించిన గొప్ప మనిషి మా తాతయ్య. ఇప్పుడు ఆయనకు జబ్బు చేసింది. సేవ చేసి, రుణం తీర్చుకోవాలని ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నాను. అమ్మానాన్నలు, చినాన్న వాళ్లు, అవ్వ అందరూ తరచూ వచ్చి తాతయ్యను బాగా చూసుకుంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి తాతయ్య అంటే చాలా ఇష్టం. చివరి వరకు బాగా చూసుకోవాలనుకుంటున్నాను. – రెడ్డి ఈశ్వరి -
సివిల్స్ కేటాయింపులో మార్పులకు యోచన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సర్వీసుల కేటాయింపులో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం సివిల్స్ పరీక్షలో సాధించిన ర్యాంకుల అధారంగా అభ్యర్థులకు సర్వీస్ కేటాయిస్తున్నారు. అనంతరం మూడు నెలల ఫౌండేషన్ కోర్సును పూర్తిచేశాక అభ్యర్థులు తమతమ సర్వీసుల్లో చేరుతున్నారు. అయితే ఈ ఫౌండేషన్ కోర్సు పూర్తయిన తర్వాతే అభ్యర్థులకు సర్వీసుల్ని కేటాయించే విషయాన్ని పరిశీలించాలని సంబంధిత విభాగాలను ప్రధాని కార్యాలయం(పీఎంవో) కోరింది. సివిల్స్, ఫౌండేషన్ కోర్సులో పొందిన ఉమ్మడి మార్కుల ఆధారంగా సర్వీసుల్ని కేటాయించే అంశాన్ని సమీక్షించాలంది. సివిల్స్ విజేతలను ఇండియన్ రెవిన్యూ సర్వీస్, ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ వంటి ఇతర కేంద్ర సర్వీసులకు కేటాయించే అంశంపై అభిప్రాయాలను తెలియజేయాలని సంబంధిత విభాగాలను కోరింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిఏటా సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
సామాజిక సేవా కార్యక్రమాల్లో నాట్స్
టెంపా, ప్లోరిడా: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) టెంపాలోని ప్లోరిడాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. భాషే రమ్యం సేవే గమ్యం అని నినదించే నాట్స్ తాజాగా ప్లోరిడాలో హాబిటేట్స్ ఫర్ హ్యూమానిటీ రిస్టోర్ అనే సంస్థ కోసం తన వంతు సేవలు అందించింది. పేదల కోసం ఇళ్లు, ఇంట్లో సామానులు, ఇతర వసతి సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా హాబిటేట్స్ ఫర్ హ్యూమానిటీ అనే సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థకు చాలా మంది విరాళాలు, వివిధ రకాల వస్తువులు అందించడంతో పాటు తమకు తోచిన సేవలను కూడా ఉచితంగా అందిస్తారు. ఈ క్రమంలోనే నాట్స్ కూడా తన సేవలను అందిచేందుకు నడుంబిగించింది. టెంపా బే నాట్స్ ఛాప్టర్ సభ్యులు.. ఈ సంస్థలో టాప్స్, టేబుల్స్ కోసం తమ విలువైన సేవలను అందించారు. రోజువారీ పనుల్లో ఎంతో బీజీగా గడిపే నాట్స్ సభ్యులు హాబిటేట్ ఫర్ హ్యూమానిటి రిస్టోర్‌లో అనేక పనులు చేసి పేదల పట్ల తమకు ఉండే ప్రేమను చాటుకున్నారు. పేదలకు అందించే వస్తువులను సిద్ధం చేయడంలో ఎంతో సంతృప్తినిచ్చిందని నాట్స్ టెంపా బే ఛాప్టర్ సభ్యులు తెలిపారు. హబిటేట్ ఫర్ హ్యూమానిటీ రిస్టోర్ వేర్ హౌస్ ను క్లీనింగ్ కూడా చేసి ఆ సంస్థ ప్రశంసలను నాట్స్ సభ్యులు పొందారు. -
బాటసారుల దాహం తీరుస్తున్న చలివేంద్రాలు
వికారాబాద్ అర్బన్: ఎండలు మండిపోతున్నాయి. రోడ్డు మీద నడవాలంటే జనాలు బయపడుతున్నారు. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో పట్టణంలో ఎక్కడ చూసినా జనాల సందడే నెలకొంది. తీవ్ర ఎండల్లో కొద్ది దూరం నడవగానే దాహం వేస్తోంది. చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు దాహం తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి బాటసారులందరికి చలివేంద్రాలు దాహం తీరుస్తూ ఎండ నుంచి ఉపశమనం ఇస్తున్నాయి. వికారాబాద్ పట్టణంలో సుమారు 20చోట్ల చలివేంద్రాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కుల సంఘాలు, వృత్తి సంఘాలు, ప్రభుత్వ శాఖలు, వ్యక్తిగతంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి బాట సారులకు రోజంతా నీరు అందిస్తున్నారు. తీవ్ర ఎండల్లో వచ్చిన వారికి చల్లటి మట్టి కుండ నీరు ఇచ్చి చల్లబరుస్తున్నారు. నిర్వాహకులు గతంలో ఏప్రిల్ మొదటి వారంలో చలివేంద్రాలను ప్రారంభించి మే చి వరి వరకు కొనసాగించే వారు. ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మార్చి మొదటి వారం నుంచే ప్రారంభించినట్లు చెబు తున్నారు. మార్చిలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఉండటంతో విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నెల రోజుల ముందే చలివేంద్రాలు ప్రారంభించారు. ఇలా వి కారాబాద్ పట్టణంలో చలివేంద్రాలు బాట సా రుల దాహం తీరుస్తున్నాయి. సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో... పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఎ ప్పుడూ ప్రయాణికులతో, విద్యార్థులతో రద్దీ గా ఉండే బస్టాండ్‌లో చలివేంద్రం ఏర్పాటు చే యడంతో ఎంతో మంది దాహం తీరుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వెళ్లే వారు, బస్టాండ్‌లో బస్సు ఆగిన సమయంలో సత్యసాయి చలి వేంద్రంలో దాహం తీర్చుకొని ప్రయాణమతా రు. వేసవిలో సుమారు మూడు నెలల పాటు ఇ క్కడ చలివేంద్రం సేవలు అందిస్తారు. ఆర్యవైశ్య సంఘం .. జనాలతో రద్దీగా ఉండే అనంతగిరి రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ ఎదుట ఆర్యవైశ్య సంఘం ఆ ధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బ్యా ంకుకు వచ్చే జనాలతో పాటు, వందల మంది బాటసారులు ఇక్కడ దాహం తీర్చుకుంటారు. పది సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘం వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసారుల దాహం తీరుస్తున్నారు. పోలీసు శాఖ... జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం నూతనంగా చలివేంద్రాన్ని ఏ ర్పాటు చేసి బాట సారుల దాహం తీరుస్తున్నా రు. నెల రోజుల క్రితం ఎస్పీ అన్నపూర్ణ ఈ చలి వేంద్రాన్ని ప్రారంభించారు. వాకర్స్ అసోసియేషన్ .. పట్టణంలోని ఆలంపల్లి రోడ్డు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారుల దాహం తీరుస్తున్నారు. ఈ రోడ్డులోనే వ్యాపారాలు సాగుతుంటాయి. ఎప్పుడు జనాల రద్దీ ఉంటుంది. ఈ రోడ్డు పక్కనే చలివేంద్రం ఉండటంతో రోజు కు వందల మంది దాహం తీర్చుకుంటారు. వి కారాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పది సంవత్సరాలుగా చలివేంద్రం కొనసాగుతోంది. -
వారికి ఐసీఐసీఐ బ్యాంకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు నాన్ రెసిడెంట్ ఇండియన్స్(ఎన్ఆర్ఐ)లకు కోసం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా నగదును పంపుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌తోపాటు ఇమెయిల్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా దేశానికి నగదు పంపే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ప్రవాస భారతీయులకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్న మొట్టమొదటి బ్యాంకుగా నిలిచింది. ఈ మేరకు బ్యాంకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రక్రియ చాలా సురక్షితమైందని, ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని బ్యాంకు వెల్లడించింది. సోషల్ పేగా వ్యవహరిస్తున్న మనీ 2 ఇండియా(ఎం2ఐ) యాప్ ద్వారా ఎన్ఆర్ఐలు సౌకర్యవంతంగా తమ బంధువులు, స్నేహితులకు నగుదును పంపుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ చందోక్ ప్రకటించారు. దీంతో భారతీయ రెమిటెన్స్ మార్కెట్లో అగ్రశ్రేణిగా తమ బ్యాంకు నిలుస్తుందన్నారు. అంతర్జాతీయంగా సోషల్ మీడియాకు కనెక్ట్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ సోషల్ పే ద్వారా నగదు బదిలీని మరింత సరళతరం చేశామన్నారు. ఇందుకు యూజర్లు ఎం2ఐ యాప్‌లో లాగిన్ అయ్యి....సోషల్ పేను క్లిక్ చేసి.. నగదును ఎంటర్ చేసి 4 డిజిట్ పాస్‌కోడ్‌ను సృష్టించుకోవాలి. అనంతరం బ్యాంకు ఖాతా, నగదు బదిలీ తదితర వివరాలను నమోదు చేయాలి. దీంతో ఒక సెక్యూర్డ్ లింక్ జనరేట్ అవుతుంది. దీనిని నిర్దేశిత వ్యక్తికి చెందిన సోషల్ మీడియా ఖాతాకు జోడించి, లేదా ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాలి. అనంతరం, ఈ సెక్యూర్డ్ లింక్ సహా, నాలుగు అంకెల కోడ్‌ను బెనిఫిషియరీకి తెలియజేయాలి. పేమెంట్ పూర్తి కావాలంటే బెనిఫిషియరీ ఈ సెక్యూర్డ్ లింక్‌ను క్లిక్‌చేసి 4 డిజిట్ కోడ్‌తో సహా, బ్యాంకు ఖాతా వివరాలను జోడించాలి. అపుడు సెండర్‌కు ఒక నోటిఫికేషన్ వెళుతుంది. దీంతో సంబంధిత వివరాలను సెండర్ నిర్ధారించుకున్నాక ఈ పక్రియ పూర్తవుతుంది. -
స్ట్రీట్కాజ్ ..శ్రీమంతులు
వారంతా విద్యార్థులు. ఓవైపు చదువుకుంటూ... మరోవైపు సేవాపథంలో నడుస్తున్నశ్రీమంతులు. వీరందర్ని నడిపిస్తోందిహైదరాబాద్ యూత్ అసెంబ్లీ (హెచ్‌వైఏ). ముగ్గురు స్నేహితుల మనసులో అంకురించిన ఆలోచన.. నేడు మరెందరినో సేవా మార్గంలో నడిపిస్తోంది. గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తోంది. హిమాయత్‌నగర్: నగరానికి చెందిన అఖిలేష్ జుక్కారెడ్డి, మితేష్ లోహియా, స్నిగ్ధా చల్లపల్లి స్నేహితులు. ప్రతిరోజు ఏదో ఒక రెస్టారెంట్లో లంచ్ చేసి.. కొద్దిసేపు మాటామంతీ వీరికి అలవాటు. అలా 2009లో ఓ రోజు హోటల్లో లంచ్ అనంతరం బయటకొస్తుండగా ఓ వ్యక్తి దగ్గరికొచ్చి చేయిచాచడం వీరిని కదిలించింది. ఆ క్షణాన పుట్టిన ఆలోచనే.. నేడు వేలాది మందిని సేవాపథంలో నడిపిస్తోంది. ప్రతిరోజు మెయింటనెన్స్‌కు ఎన్నో రూపాయలు ఖర్చు చేస్తున్నాం కదా.. ఆ ఖర్చుకు ఫుల్స్టాప్ పెట్టి, దానితో సేవా కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకున్నారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్ యూత్ అసెంబ్లీ (హెచ్‌వైఏ) పేరుతో ఓ ఎన్జీఓ ఏర్పాటు చేశారు. ఇందులో మరో భాగమే స్ట్రీట్కాజ్ సంస్థ. మూడు గ్రూపులు.. 30 మంది పేదరిక నిర్మూలన, ఆకలి తీర్చడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం, మహిళా సాధికారత, ఉన్నత విద్యనందించడం, స్వచ్ఛభారత్, ఆర్థిక చేయూత, గ్రామాల అభివృద్ధి తదితర లక్ష్యాలతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఇందులోని సభ్యులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 30 మంది చొప్పున ప్రజలకు సేవలందిస్తారు. అకృత్యాలను అరికట్టేందుకు అవగాహనసదస్సులు, చర్చా కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఖర్చులు వీరు సొంతంగానే భరిస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్‌లో చేరేటప్పుడు ఒక్కో సభ్యుడు రూ.10 వేలు కట్టాల్సి ఉంటుంది. మొత్తం మూడు గ్రూపుల్లో 30 మంది సభ్యులుంటారు. ఈ సభ్యులు వ్యక్తిగతంగా ఇచ్చే డబ్బులతోనే సేవలందిస్తున్నారు. మూడు గ్రామాల దత్తత... రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. హెచ్‌వైఏ స్ట్రీట్కాజ్ ప్రతినిధులు తమ వద్దనున్న ఫండ్ ఆధారంగా గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలోని లెండిగూడ గ్రామాన్ని దత్తత తీసుకోగా... ఇప్పుడు చేవేళ్ల వద్దనున్న ఇక్కారెడ్డిగూడ, రెడ్డినాయక్తండాలను దత్తత తీసుకున్నారు. గ్రామాల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. కరెంట్, బల్బుల పంపిణీ, తాగునీరు, ఉచిత విద్య, పర్యావరణంపై అవగాహన... ఇలా వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే చికిత్సకు ఖర్చులు కూడా భరిస్తున్నారు. తండా కోసం 10కే రన్ జడ్చర్ల శివారులోని లక్యానాయక్ తండాలో సుమారు 200 కుటుంబాలునివసిస్తున్నాయి. ఇక్కడ కనీస వసతులేమీ లేవు. ఇది తెలుసుకున్న స్ట్రీట్కాజ్ సంస్థ ఈ గ్రామానికి సహాయం అందించాలని నిర్ణయించుకుంది. గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ఏప్రిల్ 1న నెక్లెస్ రోడ్లో 10కే రన్ నిర్వహించనుంది. ఈ రన్లో పాల్గొనేవారు రూ.100 చెల్లించి పాస్ తీసుకోవాలి. దీని ద్వారా వచ్చే మొత్తంతో గ్రామంలో సౌకర్యాలు కల్పిస్తామని స్ట్రీట్కాజ్ ప్రతినిధి మధుచంద్ర తెలిపారు. మన బాధ్యత.. మొదట ఈ ఆర్గనైజేషన్ గురించి కొందరు స్నేహితులు చెప్పినప్పుడు... హే ఏం చేస్తారులే అనుకున్నాను. కానీ సేవా కార్యక్రమాలు చూశాక నాకూ చేరాలని అనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా ఆర్గనైజేషన్‌లో చేరిపోయాను. సమాజానికి సేవ చేయడం మన బాధ్యత. – మధుచంద్ర, అసోసియేట్ ప్రెసిడెంట్ అదే ఆనందం.. సేవా కార్యక్రమాల్లో భాగంగా చాలా మందిని కలుస్తుంటాం. వాళ్లతో మాట్లాడినప్పుడు వారి మోముల్లో వచ్చే చిరునవ్వులు మాకెంతో ఆనందాన్ని ఇస్తాయి. చిన్న వయసులో ఇదంతా మీకెందుకు అన్నవాళ్లూ ఉన్నారు. అయినా సేవా చేయాలనే తపనతోనే ముందుకెళ్తున్నాం.– తన్వీ, వైస్ ప్రెసిడెంట్ -
ఇండిగో సర్వీసులు రద్దు.. నగరాలకు ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ : తక్కువ ధరకే టికెట్లు అందిస్తూ సామాన్యుడు సైతం గగనయానం చేసేలా సర్వీసులు అందిస్తున్న ఇండిగో విమానయాన సంస్థ మంగళవారం 47 సర్వీసులను రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలు ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, పట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్సర్, గువాహటి తదితర నగరాలకు తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో ఆయా విమానాశ్రయాల్లో ప్రయాణీకులు చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇంజిన్ పరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించి ఇండిగో చెందిన 8 ఏ 320 విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిలిపివేసింది. దీంతోపాటు మరో మూడు గో ఎయిర్ విమానాలను కూడా ఆపేయించింది. ఈ నేపథ్యంలో ఇండిగో దేశీయ సేవలు అందించే 47 విమానాలను మంగళవారం రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని తన అధికారిక వెబ్సైట్లో కూడా పేర్కొంది. లక్నో వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానం 40 నిమిషాల తర్వాత ఇంజిన్‌లో సమస్య ఏర్పడిందని తిరిగి అహ్మదాబాద్ తిరిగొచ్చింది. తరుచుగా ఇండిగోలోని ఏ 320 విమానాల్లో ఈ సమస్యలు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు వెంటనే ఎనిమిది విమానాలను ఉన్నపలంగా ఆపేయాలని డీజీసీఏ ఆదేశించింది. -
వనితా సలాం
మహిళామూర్తిని వర్ణించేందుకు పదాలు చాలవు. సమాజంలో అంతటి ప్రాధాన్యం ఉన్న మహిళలు ప్రస్తుతం వివక్షను ఎదుర్కొంటున్నారు. రక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, అవి ఎందుకూ పనికి రాకుండాపోతున్నాయి. అయినా మొక్కవోని దీక్షతో సమాజ రుగ్మతలను ఎదిరిస్తూ స్వయం సాధికారత వైపు మహిళలు అడుగులేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. మనం సంతోషంగా ఉన్నాం. ఇదే మనకు వరమని సరిపుచ్చుకోలేదామె. అందరూ సంతోషంగా ఉండాలని తపన పడుతున్నారు. యువకుల్లో సైతం సేవాభావాన్ని పెంపొందిస్తూ దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు మీ కోసం మేము ఫౌండేషన్‌కు తెరవెనుక సూత్రధారిగా ఉంటూ నడిపిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు కొడవలూరు మండలం బసవాయపాళేనికి చెందిన గనకాల సుమలత. కొడవలూరు: కొడవలూరు మండలం బసవాయపాళేనికి చెందిన సుమలత వివాహానంతరం నెల్లూరులో స్థిరపడ్డారు. ఆమె ఇతరులకు సాయపడటంలోనే సంతృప్తి ఉందని భావించారు. ఆమెలోని సేవాభావాన్ని భర్త హరికృష్ణకు వివరించారు. ఆమె సమాజ సేవాభావానికి ఆయన అడ్డు చెప్పకుండా తనవంతు ప్రోత్సాహించారు. భావాలకు భర్త సహకారం కూడా తోడవడంతో సేవా కార్యక్రమాల వైపు అడుగులేశారు. సేవ దిశగా ప్రోత్సాహం సేవా దృక్పథం ఉన్న సుమలత కార్యక్రమాల అమలుకు ఒక వేదిక అవసరమని భావించారు. ఇలాంటి కార్యక్రమాలను యువకులైతే ఎంతో ఉత్సాహంగా చేపట్టగలరని నిర్ణయించుకున్న ఆమె స్వగ్రామానికి చెందిన యువకుడు చల్లకొలుసు కార్తీక్‌లోని సేవా భావాన్ని గుర్తించారు. దిక్కులేని వారికి సాయపడేందుకు తన వంతు సాయమందిస్తానని కార్తీక్‌తో తన మనస్సులోని మాటను తెలిపారు. సేవ చేయడంపై ఆసక్తి ఉన్న అతడు తన మిత్రుడైన పోసిన సునీల్‌కుమార్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. అందుకు సునీల్‌కుమార్ కూడా ఉత్సుకత చూపడంతో సేవాభావమున్న స్నేహితులతో కలిసి మీ కోసం మేము ఫౌండేషన్‌ను స్థాపించారు. ఫౌండేషన్‌లో కోశాధికారిగా ఉంటున్న సుమలత సంస్థ నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమంలో తన వంతు సాయం అందిస్తున్నారు. వృద్ధులకు వస్త్ర, అన్నదానం చేయడం, ప్లాట్‌ఫారాలపై ఉంటున్న వారికి దుప్పట్లు, వస్త్రాలను అందించడం, అనాథ పిల్లలకు వారి అవసరాలను తెలుసుకొని సాయపడుతున్నారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణా లను నిలపడంలోనూ ఫౌండేషన్ ముందంజలో ఉంది. సాయంలోనే తృప్తి ఇతరులకు సాయపడటంలో ఎంతో సంతృప్తి ఉంది. మనం ఎంతగా సుఖపడినా, ఇతరులకు సాయపడటంలో ఉన్న సంతృప్తి ఎందులో ఉండదు. ఇతరుల ఆకలిని తీర్చినపుడు, ఆపదల్లో రక్తదానం చేసినప్పుడు వారు చూపే కృతజ్ఞత మనస్సును కదిలిస్తుంది. అందువల్లే ఉన్నంతలో ఇతరులకు సాయపడాలని నిర్ణయించుకున్నా. మరిన్ని సేవా కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా చేపట్టాలన్నదే నా లక్ష్యం. : గనకాల సుమలత,మీ కోసం మేము ఫౌండేషన్ కోశాధికారి -
రోగి ప్రాణంతో చెలగాటం
విశాఖసిటీ: పెట్టుబడుల పేరుతో ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వానికి సామాన్యుడి ప్రాణాలంటే లెక్కలేని తనం. వైఎస్ హయాంలో వెలుగొందిన 108 సేవలు.. నీరుగార్చేశారనడానికి నిదర్శనమైన ఘటన నగరంలో చోటు చేసుకుంది. చెంతనే అంబులెన్స్ ఉన్నా.. ఫోన్ చేస్తే లేదని చెప్పడంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన వైనం ఆ కుటుంబాన్ని కలవరపాటుకు గురిచేసింది. రేసపువానిపాలెంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వెనుక నివాసముంటున్న బొదిరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బ్రహ్మానందం నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం 5.20 నిమిషాలకు బ్రహ్మానందం ఆరోగ్యం క్షీణించడంతో శ్రీనివాసరెడ్డి 108 వాహనానికి ఫోన్ చేసి వివరాలు చెప్పారు. కొంత సమయం తర్వాత మీ చిరునామా సమీపంలో 108 వాహనం అందుబాటులో లేదని, వేరే ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకోవాలని కేంద్రం నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికే బ్రహ్మానందం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శ్రీనివాసరెడ్డి తన ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్లారు. బైక్‌పై వెళ్తున్నప్పుడు తన ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఇండోర్ స్టేడియంలోనే 108 వాహనం ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. బ్రహ్మానందాన్ని రామాటాకీస్ రోడ్డులో ఉన్న ప్రేమ ఆస్పత్రిలో చేర్పించి 108 వాహనం వద్దకు చేరుకున్నారు. అక్కడ వాహనంలో డ్రైవర్ నిద్రిస్తున్నారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో 108 అంబులెన్స్‌ను కడుగుతున్న విషయాన్ని గమనించానన్నారు. రోజూ ఇండోర్ స్టేడియం వద్ద 108 వాహనం అందుబాటులో ఉంటుందనీ, అయితే.. ప్రజలకు అత్యవసర తరుణంలో ఇలా వ్యవహరించడం బాధాకరమైన అంశమని వ్యాఖ్యానించారు. సరైన సమయానికి బైక్‌పై తీసుకెళ్లడంతో ఆయన కోలుకున్నారనీ, ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం ఇలా వ్యవహరించడం చూస్తుంటే ప్రజల ఆరోగ్యంపై 108 సిబ్బందికి ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. -
అర్ధరాత్రి 18 కిలోమీటర్లు నడిచా ..
ఊహ తెలియని స్థితిలో వివాహం... ఆపై పిల్లలు.. జీవితంలో ఆటుపోట్లు తట్టుకోలేక వదిలేసిన భర్త.. పట్టుమని 16 ఏళ్లు కూడా నిండకుండానే కష్టాలు.. కన్నీళ్లే జీవితం. కన్న బిడ్డలతో కలిసి రైలుకిందపడి ప్రాణాలు తీసుకోవాలని.. అదే రైలు ఎక్కి పరాయి రాష్ట్రంలో మూడేళ్ల అజ్ఞాతం. తర్వాత అత్తింటికి చేరుకుంటే అయినవాళ్ల సూటిపోటి మాటలు. తండ్రిలా ఆదరించాల్సిన బావ దారుణ ప్రవర్తన! ఇమడలేక అత్తింటిని వదులుకుని పట్నం చేరుకుంది. ఆత్మస్థైర్యంతో అడుగేసింది. చదువులు నేర్చింది. విధినెదిరించి విజయకేతనం ఎగురవేసింది. అర్ధరాత్రి 18 కిలోమీటర్లు నడిచా ఒకసారి బాబుకు ‘పెద్ద అమ్మవారు’ పోసింది. ఒళ్లంతా చీము కారుతోంది. ఇతర ఇళ్లలో దుస్తులు ఉతికి రాత్రి ఇంటికి చేరుకున్న నేను బాబును చూసి తట్టుకోలేకపోయాను. 18 కి.మీ. దూరంలోని అనంతపురం ఆస్పత్రికి బాబును, పాపను ఎత్తుకుని ఒక్కదాన్నే చీకట్లో నడుచుకుంటూ వెళ్లా. నా పరిస్థితి తలుచుకుని బాగా ఏడుపొచ్చింది. పిల్లలకు అన్నం పెట్టేలేక.. కష్టాలు భరిస్తూ బతకడం ఇక సాధ్యం కాదని అనుకున్నా. పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నా.. కానీ బతికి సాధించాలని నిర్ణయం తీసుకున్నా.. జీవితంలో నిలదొక్కుకున్నా.. నా బిడ్డలకు మంచి జీవితం ఇచ్చా. – మీనాక్షి మూడేళ్ల అజ్ఞాతంలో ఆదర్శ జీవితం.. పిల్లలతో కలిసి నేను ఎక్కిన రైలు ఎక్కిడికి పోతోందో కూడా నాకు తెలియదు. అటుఇటు చూసే లోపు ఓ పెద్ద ఊళ్లో రైలు ఆగింది. నేను ప్లాట్‌ఫాంపై దిగాను. చూస్తుంటే అంతా కన్నడలో రాసి ఉంది. అక్కడి వారి మాటలను బట్టి హుబ్లీ అని తెలుసుకున్నాను. నాకు భాష రాదు. ఎక్కడికెళ్లాలో తెలియక స్టేషన్లోనే ఓ బెంచిపై కూర్చొని ఉండిపోయాను. ఇంతలో ఒకావిడ నా దగ్గరకు వచ్చి వివరాలు అడిగింది. తెలుగులో చెప్పాను. ఆమెకు అర్థమైనట్లు ఉంది. తన పేరు రాధారాణి అని పరిచయం చేసుకుని తనతో పాటు మమ్మల్ని పిలుచుకెళ్లి, తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చారు. మూడు నెలల తర్వాత నేను బెల్గాంలో ఉన్నట్లు తెలుసుకున్నాను. మూడేళ్లలో ఎక్కడా ఎలాంటి పొరబాటు లేకుండా ఆదర్శంగా జీవనం సాగించాను. అప్పటికి భాష నేర్చుకున్నా. ఓ ప్రమాదంలో రాధారాణి చనిపోయారు. దీంతో మళ్లీ ఒంటరిదానయ్యా. ఇక అక్కడ ఉండిబుద్ధి కాలేదు. 2003లో అనంతపురానికి తిరిగి వచ్చాను. 12వ ఏటనే పెళ్లి చేశారు మాది నిరుపేద కుటుంబం. అనంతపురం పాతూరు సమీపంలోని రాణి నగర్లో ఉండేవాళ్లం. అమ్మనాన్న దుస్తులు ఉతికితే వచ్చే సంపాదనతోనే కుటుంబం గడుస్తుంది. 1996లో నేను ఏడో తరగతి చదువుకుంటుండగా (12వ ఏట) మా మేనమామ లక్ష్మీనారాయణతో నాకు పెళ్లి చేశారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలోని అత్తారింటిలో అడుగుపెట్టాను. పెళ్లైనా రెండేళ్లకు పాప పుట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు చెప్పాపెట్టకుండా మా ఆయన ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్ని నెలల తరువాత తిరిగొచ్చాడు. 2000 సంవత్సరంలో మాకు బాబు పుట్టాడు. ఆ తర్వాత నా భర్త మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. బతుకుపై చిరు ఆశ జీవితంపై విరక్తితో పిల్లలను తీసుకుని రైలు కిందపడి చనిపోవాలని అనుకున్నాను. ఇద్దరు పిల్లలను తీసుకుని అనంతపురం రైల్వే స్టేషన్‌ని చేరుకున్నాను. దూరంగా రైలు కూత వినిపిస్తోంది. నా కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చిన్నోడు ఒడిలో నిద్రపోతున్నాడు. పాప బుడిబుడి అడుగులతో ఆడుకుంటోంది. వారి మొహం చూస్తే బాధేసింది. ఇంతలో రైలు కూత దగ్గర కావడంతో చిన్నోడు ఉలిక్కిపడి లేచాడు. వాడి ఏడుపు నన్ను బతుకుపై ఆశలు రగిలింది. ఆత్మహత్య చేసుకునే ఆలోచనను విడిచి ఆగిన రైలు ఎక్కేసాను. ఆదుకున్న ఆర్డీటీ 2009 ఆగస్టులో ఆర్డీటీ సంస్థ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సార్‌ని కలిసి నా పరిస్థితి మొత్తం వివరించాను. డ్రైవర్‌గా ఉద్యోగం కల్పిస్తే పిల్లలను చదివించుకుంటానని ప్రాధేయపడ్డాను. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. నాకు డ్రైవింగ్ సరిగా రాకపోయినా జాబ్ ఇచ్చారు... నేను సరిగ్గా నడపలేనని చెప్పాను. అందుకు ఆయన... ‘నీలాంటి వాళ్లను ఎంకేరేజ్ చేయాలి. అందుకే అవకాశం ఇచ్చాను... ట్రైనింగ్ అవ్వు’ అంటూ గ్యారేజి డ్యూటీ వేశారు. అక్కడ పనిచేయిస్తూ ఆరు నెలల్లో డ్రైవింగ్ బాగా నేర్పారు. గ్యారేజీలో రెండున్నర ఏళ్లు పనిచేశా. అక్కడ వాహన మరమ్మతులు పూర్తిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏటీఎల్ వాహనానికి డ్రైవర్‌గా పంపారు. మూడేళ్లు పనిచేశాను. అటు తరువాత అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ మూడేళ్లు పనిచేశాను. పనిచేస్తూనే టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. అక్కడే నా జీవితం మారిపోయింది. హెవీ లైసెన్స్ తీసుకుంటానని మాంఛో సార్‌కి చెప్పాను. టెస్ట్‌లో ఫెయల్ అయితే లైసెన్స్ ఫీజు జీతం నుంచి కట్ చేస్తా, పాస్ అయితే తానే కడతానని అన్నారు. నేను టెస్ట్‌లో పాస్ అయ్యాను. బతుకే కష్టమైంది ఇద్దరు చిన్న పిల్లలు. అత్తింటి వారు మమ్మల్ని పట్టించుకోలేదు. ఏమీ చేయాలో... పిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కాలేదు. కులవృత్తిని నమ్ముకుని దుస్తులు ఉతుకుతూ జీవించాలని అనుకుని ప్రతి రోజూ మదిగుబ్బ నుంచి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆత్మకూరుకు వచ్చి అక్కడి నుంచి బస్సులో అనంతపురం చేరుకునేదాన్ని ఐదారు ఇళ్లు ఒప్పుదల చేసుకుని దుస్తులు ఉతికి తిరిగి ఇంటికి వెళ్లిపోయేదాన్ని. అయినవాళ్లూ ఇబ్బంది పెట్టారు మూడేళ్ల తర్వాత అనంతపురానికి వచ్చిన నేను నేరుగా మదిగుబ్బకు పోయాను. నా భర్త చనిపోయినట్లు తెలిసింది. ఆ సమయంలో నా భర్త అన్నవాళ్లూ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. చాలా దారుణంగా వ్యవహరిస్తూ వచ్చారు. వారి ప్రవర్తనతో అక్కడ ఇమడలేక పిల్లలను తీసుకుని అనంతపురానికి చేరుకున్నాను. బాబానగర్‌లో చిన్న గది అద్దెకు తీసుకున్నాను. అక్కడికి దగ్గరలోని గుల్జార్ పేటలో ఐదారిళ్లలో దుస్తులు ఉతికేందుకు ఒప్పందం చేసుకున్నాను. నెలకు రూ. 1,500 వచ్చేది. దాంట్లోనే బాడుగ కట్టి, పిల్లలను పోషించుకునేదాన్ని. అలా నాలుగేళ్ల పాటు గడిచింది. మలుపు తిప్పిన డ్రైవింగ్ గుల్జార్‌పేటకు గవర్నమెంట్ ఐటీఐ మీదుగా రోజూ వెళ్లేదానిని. పొదుపు సంఘం సభ్యులకు కుట్టు, డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు డీఆర్డీఏ బోర్డు కనిపించింది. ఐటీఐలోకి వెళ్లి డ్రైవింగ్ నేర్చుకుంటానని అడిగాను. 8వ తరగతి పాస్ అయ్యి ఉండాలని చెప్పారు. నేను ఏడవ తరగతి వరకే చదువుకున్నాను. రాత్రి బడికి వెళ్లి 8వ తరగతి చదవాలని నిర్ణయించుకున్నాను. రాత్రి బడికెళితే పిల్లలను చూసుకోవడం కష్టంగా ఉంటుందని, బాబుని విజయవాడలోని క్రిష్టియన్ స్కూల్లో చేర్పించాను. పాపను గుమ్మఘట్ట హాస్టల్లో చేర్పించాను. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపన నన్ను వారిని దూరం చేసింది. రాత్రి బడికి వెళ్లి చదువుకుని 2008లో పరీక్ష రాసి 8వ తరగతి పాస్ అయ్యాను. తర్వాత ఐటీఐలోకి వెళ్లి డ్రైవింగ్ నేర్చకుంటానని చెప్పాను. 2008 డిసెంబరులో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేశాను. 2009లో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. డ్రైవింగ్‌లో మెళుకువలు, నిబంధనల గురించి విద్యార్థులకు క్లాస్ నిర్వహిస్తున్న మీనాక్షి డ్రైవింగ్ స్కూల్ పెడితే.. చాలా మంది మహిళా అధికారులు, తెలిసిన వారు డ్రైవింగ్ నేర్పించు అని అడిగేవారు. ఒక మహిళ డ్రైవర్ అవసరం ఇంత ఉందా అని అప్పుడు నాకు అనిపించి, సొంతంగా ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. 2016లో మాంఛోసార్ని కలిసి విషయం చెప్పాను. ఆలో చన మంచిదేనని అయన ప్రోత్సహించారు. ఆర్డీటీలో జాబ్‌కు రాజీనామా చేసి, బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుని డ్రైవింగ్ స్కూల్ పెట్టాను. స్పందన పేరుతో సేవ నేను ఎన్నో కష్టాలు అనుభవించి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. నాలాంటి వారికి ఏదైనా చేయాలనే ఉద్ధేశంతో స్పందన సంస్థ స్థాపించి రైతు బజార్లో కార్యాలయం ఏర్పాటు చేశాను. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడే గడుపుతాను. ఎవరైనా వారి వద్ద ఉన్న పాత దుస్తులు తెచ్చి కార్యాలయంలో ఉంచి వెళ్లవచ్చు. వాటిని పేదలు వచ్చి తమకు నచ్చినవి ఉచితంగా తీసుకెళతారు. నాలా ఎవరూ ఇబ్బంది పడకూడదనేది నా కోరిక. అందుకే పేదవారికి ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి నాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలతో ఫీజు కట్టించి లైసెన్స్ ఇప్పిస్తుంటాను. -
లాహిరి లాహిరి లాహిరిలో..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల కోసం సరికొత్త స్పీడు బోటు సిద్ధమైంది. సాగరంలోకి రయ్‌ను దూసుకుపోయే ఈ బోటు నెలాఖరు నుంచి అందుబాటులోకి రానుంది. పర్యాటక శాఖ చాన్నాళ్లుగా 40 మంది కూర్చునే వీలున్న ‘స్వర్ణవిహారి’ పాత బోటును నడిపేది. గత నవంబర్ 12న విజయవాడ వద్ద కృష్ణా నదిలో జరిగిన పర్యాటకశాఖ బోటు బోల్తాపడిన ప్రమాదంలో 25 మందికి పైగా మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆందోళన చెందిన పర్యాటకశాఖ అధికారులు అప్పటికే అంతగా ఫిట్నెస్ లేని స్వర్ణ విహారిని నిలిపివేశారు. దీంతో విశాఖ ఆర్కే బీచ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు బోటు షికారు చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో రుషికొండలో పర్యాటకశాఖ నడుపుతున్న నాలుగు సీట్ల స్పీడ్ బోటు మాత్రమే పర్యాటకులకు అరకొరగా సరదా తీరుస్తోంది. ఈ నేపథ్యంలో స్వర్ణ విహారికి మళ్లీ మెరుగులు దిద్ది పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది. దీంతో పర్యాటకశాఖ అధికారులు 10 సీట్ల సామర్థ్యం ఉన్న కొత్త స్పీడు బోటును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బోటును ఫిషింగ్ హార్బర్లోని 11వ నంబరు జెట్టీ నుంచి నడపనున్నారు. ఇందులో ఇద్దరు డైవర్లు (గజ ఈతగాళ్లు–వీరే బోటును కూడా నడుపుతారు) కాగా మిగిలిన వారు పర్యాటకులుంటారు. ఈ బోటు 11వ నంబరు జెట్టీ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలోకి తీసుకెళ్లి తీసుకొస్తారు. టిక్కెట్టు ధర రూ.250.. ఒక్కొక్కరికి రూ.250 టిక్కెట్టు ధర నిర్ణయించారు. రుషికొండలో నడుస్తున్న స్పీడ్ బోటులో షికారు చేసే వారికి ఒక్కొక్కరికి రూ.300 టిక్కెట్టు వసూలు చేస్తున్నారు. ఎక్కువ సామర్థ్యం ఉండడం, డీజిల్ నడవడం వల్ల స్వర్ణ విహారి బోటులో టిక్కెట్టు ధర రూ.60లే ఉండేది. కానీ ఈ స్పీడు బోటు పెట్రోల్‌తో నడిచేది కావడం, తక్కువ మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉండడంతో ఈ బోటు షికారుకు రూ.250 టిక్కెట్టుగా నిర్ణయించినట్టు పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ స్పీడు బోటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపనున్నారు. ఈ బోటు సర్వీసును ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ ప్రసాదరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. -
స్వచ్ఛంద సేవకులు
వీపనగండ్ల : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలతో కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సహకారంతో పథకాలు పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇస్తాయన్న విశ్వాసం తక్కువ. కానీ విద్యార్థులు ఐక్యమత్యంతో గ్రామాలు శుభ్రంగా ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని భావించి సేవా కార్యక్రమాలకు పూనుకున్నారు. స్వచ్ఛంద శ్రామికులు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ద్వారా ఐదు రోజులపాటు గోపల్‌దిన్నెలో శ్రమదానం చేస్తున్నారు. గ్రామంలోని మురుగు కాల్వలు శుభ్రం చేయడం, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలోని వీధుల్లో చెత్తాచెదారం, ముళ్లకంపలు, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. అంతేకాక మరుగుదొడ్ల నిర్మాణంతో కలిగే ఉపయోగాలు, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల సేవా దృక్పథం చూసిన మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులు పలువురిలో స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. యువకులు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. భాగస్వాములను చేయాలి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పట్ల విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సమాజ సేవలో భాగస్వాములను చేశాం. గ్రామాల ప్రజలు కూడా సమాజం కోసం పని చేయాలన్న దృక్పథాన్నినింపాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్యార్థుల చేత ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తున్నాం. – లక్ష్మినారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆనందంగా ఉంది విద్యార్థులు మా గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం అభినందనీయం. గ్రామంలో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నారు. విద్యార్థుల స్ఫూర్తి తో రానున్నరోజుల్లో అభివృద్ధి పనులు చేపడతాం. – లక్ష్మిదేవమ్మ, ఎంపీటీసీ -
బాబోయ్...ల్యాండ్‌ఫోన్!
మొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక సేవలు అందుబాటులోకి వచ్చినా... బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ఫోన్లకున్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మరమ్మతులకు గురైతే వినియోగదారులకు ఇక నరకమే. ఆయా ప్రాంతాల్లోని టెలికం మెకానిక్‌లు, ఇంజినీర్లకు పదేపదే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో ల్యాండ్ ఫోన్లు పాడైతే వినియోగదారుడు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 43,976 ల్యాండ్‌ఫోన్ కనెక్షన్క్షుడగా వాటిలో సుమారు 25 శాతం వరకు ఫోన్లు సక్రమంగా పని చేయకపోవడం, కేబుల్ సమస్యలు రావడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలాంటి నగరంలో బీఎస్ఎన్ఎల్ జిల్లా ప్రధాన కార్యాలయం, సంస్థ ఉన్నతాధికారులంతా కొలువై ఉన్నప్పటికీ ల్యాండ్‌ఫోన్ సమస్యలు ఎదురైతే దిక్కుమొక్కూ ఉండడం లేదు. దీంతోపాటు చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి వంటి ముఖ్యమైన పట్టణాల్లో సైతం ల్యాండ్‌ఫోన్ సమస్యలపై ప్రతి వారం ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వస్తూనే ఉన్నాయి. అయినా గానీ ఫిర్యాదులపై సకాలంలో స్పందించి పరిష్కరించే కిందిస్థాయి జేటీఓ, జేఈ, డీఈల పనితీరు పూర్తిగా పడకేసింది. పరికరం పాడైతే... ఐదు సంవత్సరాల క్రితం వరకు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ఫోన్లు మరమ్మతులకు గురైనా, ఏదైనా సాంకేతిక సమస్యలతో పాడైనా ఫోన్ కిట్(పరికరం) రీప్లేస్ చేసే సౌకర్యాన్ని పూర్తిగా సంస్థ పరి«ధిలోనే నిర్వహించేవారు. అయితే సంస్థ ఆధ్వర్యంలో కొత్త ఫోన్ పరికరాలు ఉత్పత్తి కావడం లేదన్న ఒకేఒక్క సాకుతో అధికారులు, టెక్నికల్ సిబ్బంది ల్యాండ్‌ఫోన్ వినియోగదారులకు అవస్థలు సృష్టిస్తున్నారు. సాంకేతిక విభాగం అధికారులు, సిబ్బంది చాలినంతమంది లేరన్న అంశం కూడా ఓ సాకుగా చూపుతున్నారు. దీంతో ల్యాండ్ ఫోన్ పరికరం పాడైతే సంబంధిత సంస్థ టెక్నికల్ సిబ్బంది సూచించే బయట మెకానిక్‌ల వద్దే రిపేరు చేయించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు మెకానిక్ ఒక్కో ఫోన్‌కు రూ.250 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారు. పాడైన ఫోన్ పరికరం బాగు కాకుంటే మాత్రం బీఎస్ఎన్ఎల్ సాంకేతిక విభాగంలో రూ.650 చెల్లిస్తే కొత్త ల్యాండ్ ఫోన్ ఇస్తామంటూ అధికారులు చెబుతుండడాన్ని వినియోగదారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రతినెలా సర్వీసు చార్జీల రూపంలో వందలకు వందలు చెల్లిస్తున్నా ల్యాండ్‌ఫోన్ సమస్యలపై అ«ధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదని మండిపడుతున్నారు. పని చేయకున్నా సర్వీస్ బిల్లు ల్యాండ్ ఫోన్లు పనిచేయకున్నా, మరమ్మతులకు గురైనా సంస్థకు చెల్లించాల్సిన సాధారణ సర్వీసు బిల్లులను మాత్రం వినియోగదారుడు భరించక తప్పడం లేదు. ఈ విధంగా సరాసరిన నెలకు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులపై పడుతున్న సర్వీస్ బిల్లుల భారమే సుమారు రూ.5 లక్షలకు పైగా ఉంటోంది. వినియోగదారులు చిరకాలం నుంచి బంధం కొనసాగిస్తున్న ల్యాండ్ఫోన్లను వదులుకోలేక, సాంకేతిక సమస్యలతోనే కొనసాగించుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా సంస్థ టెక్నికల్ సిబ్బంది సహకారం వేలాది మంది వినియోగదారులకు సకాలంలో అందడం లేదు. -
హైదరాబాద్–కొలంబో మధ్య శ్రీలంకన్ సర్వీసు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్–కొలంబో మధ్య విమాన సేవలను బుధవారం ప్రారంభించింది. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ సర్వీసులు ఉంటాయి. కొలంబోలో ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరి ఉదయం 8.55కు హైదరాబాద్ చేరుకుంటుంది. ఉదయం 9.50కి తిరుగు ప్రయాణమై 11.45కు కొలంబోలో విమానం దిగుతుంది. జూలై 16 నుంచి కోయంబత్తూరు నుంచి కొలంబోకు సర్వీసు మొదలు పెడుతోంది. దీంతో భారత్‌లో 14 నగరాల్లో అడుగు పెట్టినట్టు అవుతుందని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శివ రామచంద్రన్ బుధవారం మీడియాకు తెలిపారు. దేశంలో వారానికి 126 సర్వీసులు నడిపిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎమిరేట్స్ తర్వాత ఈ స్థాయిలో సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన కంపెనీ తమదేనని గుర్తు చేశారు. ప్రయాణికుల సంఖ్య అధికమైతే సర్వీసులు పెంచుతామన్నారు. ‘2016లో 20 లక్షల మంది విమాన ప్రయాణికులు శ్రీలంకలో అడుగుపెట్టారు. వీరిలో భారత్ నుంచి 18 శాతం మంది ఉన్నారు. సంస్థ విమానాల్లో 80 శాతం సీట్లు నిండుతున్నాయి’ అని వివరించారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, శ్రీలంక క్రికెటర్ మహేల జయవర్ధనే సైతం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
అపోలో ఎయిర్ అంబులెన్స్ మరిన్ని నగరాలకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఎయిర్ అంబులెన్స్ సర్వీసులను మరిన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించింది. వీటిలో వైజాగ్, కాకినాడ, కరీంనగర్‌తోపాటు మధురై, కరైకుడి, కరూర్, త్రిచ్చి, మైసూర్ ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలను అనుసంధానిస్తూ కంపెనీ ఈ అత్యవసర సేవలందిస్తుంది. బెంగళూరుకు చెందిన ఎయిర్ ఏవియేటర్స్ రెస్క్యూ హెలికాప్టర్లను సమకూర్చింది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు, రోగులకు ప్రాథమిక చికిత్స అందించే శిక్షణ పొందిన బృందం ఎయిర్ అంబులెన్సుల్లో ఉంటారు. బాధితులు, రోగులను మొదట రోడ్డు మార్గంలో అంబులెన్సు ద్వారా సమీపంలోని హెలికాప్టర్ ల్యాండింగ్ జోన్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అపోలో ఆసుపత్రి ఉన్న నగరానికి చేరుస్తారు. పలు ఏవియేషన్ కంపెనీల భాగస్వామ్యంతో ఎయిర్ అంబులెన్స్ సర్వీసులను 2003 నుంచి అపోలో అందిస్తోంది. ఏటా సగటున 125–150 మంది సేవలను వినియోగించుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఎయిర్ అంబులెన్స్‌కు గంటకు రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చార్జీ చేస్తారు. అపోలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ నంబరు 1066కు ఫోన్ చేయడం ద్వారా సేవలను పొందవచ్చు. -
ఇదేమి బాదుడు
– నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు – 0.75 నుంచి 2 శాతం వరకూ వసూళ్లు – ఆర్టీసీ టిక్కెట్లు బుక్ చేసినా బాదుడే – నగదు రహిత లావాదేవీలపై ప్రజల విముఖత – ఏటీఎంలలో నగదు నిల్వలు నిల్ సాక్షి, రాజమహేంద్రవరం: రూ. వెయ్యి, రూ. 500 నోట్ల చెలామణి రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన నగదు రహిత లావాదేవీలపై ప్రస్తుతం విముఖత వ్యక్తమవుతోంది. నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు వసూలు చేయడమే ఇందుకు కారణం. పెట్రోలు కొనుగోలు మినహా ఇతర అన్ని సేవలు, వస్తు కొనుగోళ్లపై ఆయా డెబిట్, క్రెడిట్ కార్డుల బ్యాంకులు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. డిసెంబర్లో పెద్ద నోట్లు రద్దు తర్వాత రెండు నెలలపాటు ఏటీఎం విత్‌డ్రాలు, నగదు రహిత సేవలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ చార్జీలు రద్దు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థ బ్యాంకులు తరువాత అంతకుముందులాగే సర్వీస్ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. లావాదేవీల మొత్తం ఆధారంగా 0.75 శాతం నుంచి 2 శాతం వరకూ సర్వీస్ చార్జీలు వేస్తున్నారు. ఫలితంగా వినియోగదారులు నగదు రహిత సేవలపై విముఖంగా ఉన్నారు. ఆర్టీసీ టిక్కెట్లు కొన్నా బాదుడే... పెట్రోలు మినహా ఇక ఏ సర్వీస్ పొందినా, ఏ వస్తువు కొనుగోలు చేసి కార్డు ద్వారా నగుదు చెల్లిస్తే మాత్రం సర్వీస్ చార్జీ చెల్లించుకోవాల్సిందే. చివరకు ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీ రూపంలో కొనుగోలు చేసినా సర్వీస్ చార్జీ బాదుడు సరేసరి. రూ.2000 లోపు నగదు రహిత లావాదేవీలపై 0.75 శాతం ఆపై గరీష్టంగా 2 శాతం సర్వీస్ చార్జీ రూపంలో బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఉదహరణకు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ టిక్కెట్లు రూ.600 అనుకుంటే దానిపై రూ.5 (0.75శాతం) సర్వీస్ చార్జీ అదనంగా తీసుకుంటున్నారు. ఏదైనా రూ.30,000 విలువైన ఎలక్ట్రానిక్ వస్తువు కొనుగోలు చేసి నగదు కార్డుల ద్వారా చెల్లించాలంటే రూ. 600 (2 శాతం) సర్వీస్ చార్జీ అవుతుందని ఆయా దుకాణాల క్యాష్ కౌంటర్లో ముందుగానే చెబుతున్నారు. దీంతో కొనుగోలుదారులు కార్డుల ద్వారా చెల్లించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నారు. అప్పటికప్పుడు ఏటీఎంల వద్దకు పరిగెడుతున్నారు. ఏటీఎంలలో కనిష్టంగా రూ. 20,00, గరిష్టంగా రూ.40,000 వస్తున్నాయి. ఒకసారి ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన సర్వీస్ చార్జీ రూ.30లోపు ఉంటోంది. అన్ని బ్యాంకులు తమ కార్డుదారులకు నెలకు ఐదుసార్లు లావాదేవీల వరకు ఎలాంటి సర్వీస్ చార్జీలు వేయడంలేదు. రూ.30,000 మొత్తం నగదు రహితంగా చెల్లిస్తే రూ.600 సర్వీస్ చార్జీ అవుతుంది. అదే ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే రూ.30 లేదా అసలే చార్జీ ఉండదు. దీంతో ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువుల చెల్లింపులను నగదు రూపంలో ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నారు. ఏటీఎం.. ఎనీ టైం నో మనీ... వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత నగదు కోసం ఏటీఎంల వద్దకు పరిగెడుతున్న ప్రజలకు ఏటీఎంల వద్ద నో క్యాష్, ఆవుట్ ఆఫ్ ఆర్డర్ వంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలో ఆయా బ్యాంకులు పెడుతున్న నగదు కొద్ది గంటల్లోనే అయిపోతోంది. జిల్లాలో 811 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అధికారిక లెక్కల ప్రాకారం దాదాపు 60 శాతం ఏటీ ఎంలలో మాత్రమే నగదు నిల్వలు ఉంటున్నాయి. వీటిలో కూడా 24 గంటలూ నగదు ఉండే ఏటీఎంలు 10 శాతం కూడా లేవు. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో మాత్రమే 24 గంటలు నగదు ఉంటోంది. జిల్లాలో ప్రతి రోజు అన్ని బ్యాంకులు దాదాపు రూ.500 కోట్ల లావాదేవీలు జరుపుతున్నాయి. ఇందులో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే లావాదేవీలు దాదాపు 70 శాతంగా ఉన్నాయి. వస్తు,సేవలకు ప్రజలు నగదు రహిత లావాదేవీలు దాదాపు 10 శాతం జరుగుతున్నాయి. సర్వీస్ చార్జీలు లేనప్పుడు 75 శాతం నగదు రహితమే.. పెద్దనోట్ల రద్దు సమయంలో సర్వీస్ చార్జీలు ఎత్తివేసినప్పుడు ప్రతి రోజు మేము చేసే వ్యాపారంలో 75 శాతం కార్డుల ద్వారానే నగదు తీసుకున్నాం. ప్రస్తుతం సర్వీస్ చార్జీలు వసూలు చేస్తుండడతో వ్యాపారంలో కనీసం 10 శాతం కూడా కార్డుల ద్వారా లావాదేవీలు జరగడం లేదు. రెండు శాతం సర్వీస్ చార్జీలు అని కస్టమర్లకు చెప్పడంతోనే నగదు తెస్తామంటూ ఏటీఎంల వద్దకు వెళుతున్నారు. – రత్నాకర్, శ్రీ కంప్యూటర్ వరల్డ్, రాజమహేంద్రవరం. సేవలకు సర్వీస్ చార్జీలు తప్పనిసరి పెద్దనోట్ల రద్దుకు ముందు నుంచే నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం రెండు నెలలపాటు కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం యథాతథంగా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే నామమాత్రపు సర్వీస్ చార్జీలు వేస్తున్నారు. జిల్లాలో దాదాపు 60 శాతం ఏటీఎంలు పని చేస్తున్నాయి. కొన్ని ఏటీఎంలలో నగదు పెట్టిన కొద్ది గంటల్లోనే అయిపోతున్నాయి. – సుబ్రమణ్యం, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, కాకినాడ. -
ఏటా అదే తంతు..
వేసవిలో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉచిత సేవలు జిల్లాలో 348 మందికి తప్పని అవస్థలు నెరవేరని ప్రభుత్వ హామీ కాంట్రాక్టు అధ్యాపకులు.. విద్యా సంవత్సరం చివరి పనిదినం రోజున వారిని విధుల నుంచి తొలగిస్తారు. అలాగని వేసవి సెలవుల్లో వారిని ఖాళీగా కూర్చోనివ్వరు. ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటారు. సెలవుల్లో వీరితో పనులు చేయించుకున్నారే తప్ప వారికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెబుతున్న ప్రభుత్వం.. వీరి విషయంలో మాత్రం చిన్న చూపు చూస్తోంది. ఏటా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ఇదీ. రాయవరం (మండపేట) : జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 348 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇంటర్మీడియేట్ పరీక్షలు పూర్తి కాగానే ఈ ఏడాది మార్చి 28 నుంచి వారిని విధుల నుంచి తొలగించారు. తిరిగి జూన్‌లో రెన్యువల్ చేస్తామంటూ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధుల నుంచి తొలగించినప్పటికీ పనుల నుంచి మాత్రం తొలగించలేదు. ఏప్రిల్ 7వ తేదీ వరకు వారు ఇంటర్మీడియేట్ మూల్యాంకన విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత విద్యార్థులను కళాశాలల్లో చేర్పించేందుకు క్యాంపైన్లలో నిమగ్నమయ్యారు. కళాశాలలో తగిన విద్యార్థుల సంఖ్య లేకుంటే పోస్టులు ఉండవన్న బెదిరింపుల నేపథ్యంలో, విద్యార్థులను చేర్పించేందుకు వారు కళాశాలల పరిధిలోని గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇంటర్మీడియేట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను జూన్ 15 నుంచి నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలకు వీరే సిద్ధం చేయాలి. ఉత్తీర్ణతా శాతం పెంపుదలకు, సప్లమెంటరీ పరీక్షలకు ఇన్విజిలేటర్ విధులు కూడా వారే నిర్వర్తించాలి. విధుల నుంచి తొలగించిన తర్వాత రెండు నెలలుగా ఇన్ని పనులు చేయించుకుంటున్నారు. ఈ పనులు చేసినందుకు వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. హామీలేమయ్యాయి? కనీస వేతనాలు చెల్లించాలంటూ గతేడాది డిసెంబర్ రెండు నుంచి జనవరి 4వ తేదీ వరకు 32 రోజుల పాటు కాంట్రాక్టు అధ్యాకులు ధర్నాలు, దీక్షలు చేపట్టారు. బెదిరింపులకు దిగినా దీక్షలు విరమించకపోవడంతో చేసేదీమీ లేక కనీస వేతనం, డీఏ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికి నాలుగు నెలలు గడిచినా ఆ హామీ నెరవేర్చలేదు. ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించినా.. జీఓ మాత్రం విడుదల కాలేదు. అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. తెలంగాణలో కాంట్రాక్టు అధ్యాపకులకు కనీస వేతనం అమలు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేయడంతో ఆ రాష్ట్ర అధ్యాపకులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఇప్పటికే ఒకసారి రూ.18 వేల నుంచి రూ.26 వేలకు వేతనాలను పెంచారు. తిరిగి కనీస వేతనం రూ.37,100 చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మన రాష్ట్రంలో మాత్రం అటువంటి చర్యలు లేకపోవడంతో ఇక్కడి కాంట్రాక్టు అధ్యాపకుల్లో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం మోసగిస్తోందని కాంట్రాక్టు అధ్యాపకులు మండిపడుతున్నారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్నాం.. కాంట్రాక్టు అధ్యాపకులుగా 17 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనానికి నోచుకోలేక పోతున్నాం. ఉద్యోగ భద్రత లేదు. అరకొర వేతనాలతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న చెబుతున్న ప్రభుత్వం మా విషయంలో అమలు చేయకపోవడం దారుణం. – పందిరి సాంబశివమూర్తి, 475 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మండపేట జీఓ విడుదల చేయాలి.. వేతనాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం జనవరిలో ఇచ్చిన హామీ మేరకు జీఓ విడుదల చేయాలి. పక్క రాష్ట్రంలో జీతాలు పెంచుతున్నప్పటికీ మన రాష్ట్రంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సెలవుల్లో విధుల్లో ఉన్నప్పటికీ రెండు నెలలుగా వేతనాలు లేక కాంట్రాక్టు అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. – యార్లగడ్డ రాజాచౌదరి, 461 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, కాకినాడ -
క్లబ్బు..గబ్బు
- నాయకుల చేతుల్లో కర్నూలు క్లబ్! - సేవలకు స్వస్తి... పేకాటతో కుస్తీ కర్నూలు: ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగుల రిఫ్రెష్‌మెంటు కోసం కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ (కర్నూలు క్లబ్) ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మారిపోయిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఐదు దశాబ్దాల క్రితం పది ఎకరాల ప్రభుత్వ స్థలంలో సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటైన ఈ క్లబ్.. ప్రస్తుతం వ్యాపార కేంద్రంగా మారిపోయిందని స్వయంగా సభ్యులే ఆరోపిస్తున్నారు. గతంలో ఇందులో మెజార్టీ సభ్యులు, ఆఫీసర్లు ఉండేవారు. క్లబ్ నిధులను పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాల కోసం వినియోగించేవారు. కొంతకాలంగా రాజకీయ నాయకుల పెత్తనంలోకి క్లబ్ వెళ్లిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సేవలకు స్వస్తి చెప్పి.. పేకాటతోనే దినసరి కార్యక్రమాలు ప్రారంభమతువున్నాయి. రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు యథేచ్ఛగా పేకాట కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. బైలాన్ మార్పు చేసి అధికారులను పక్కనపెట్టి నేతలకు పట్టం కట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు రూ.10 లక్షలకుపైగా టర్నోవర్.. కర్నూలు క్లబ్‌కు కోట్లాది రూపాయలు నిధులున్నాయి. వాటిని సేవా కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంది. ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్‌లతో పాటు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలని గతంలో జనరల్‌బాడీ సమావేశంలో నిర్ణయం చేసినప్పటికీ అటువైపుగా కార్యక్రమాలు జరగడం లేదు. క్లబ్ ప్రారంభంలో రూ.5వేలు సభ్యత్వం ఉండేది. ప్రస్తుతం రూ.50వేల వరకు ఒక్కొక్కరి నుంచి సభ్యత్వ రుసుం పేరుతో వసూలు చేస్తున్నారు. డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో వివిధ సేవా కార్యక్రమాలు జరిపే వారు. సభ్యులు, కుటుంబ సమేతంగా ఆయా కార్యక్రమాలకు హాజరయ్యే వారు. అయితే కొంతకాలంగా కేవలం పేకాట మినహా మిగతా కార్యక్రమాలు చేపట్టకపోవడంతో మహిళలు వినోద కార్యక్రమాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. పేకాట రూపేనా రోజుకు లక్ష రూపాయలకుపైగా ఆదాయం సమకూరుతున్నట్లు సమాచారం. ఆఫీసర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు గతంలో రిఫ్రెష్మెంట్ కోసం క్లబ్‌కు వచ్చే వారు. అయితే జనరల్‌బాడీ నిర్ణయాలను మార్పు చేసి ప్రైవేట్ వ్యక్తులు కూడా అందులో సభ్యులుగా చేరిపోవడంతో పేకాట జోరుగా సాగుతోంది. క్లబ్‌కు సంబంధించిన నిధులను కొంతమంది వడ్డీలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. జోరుగా మద్యం విక్రయాలు.. కర్నూలు క్లబ్లో అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గతంలో సభ్యుల కోసమే ఇక్కడ బార్ ఏర్పాటుచేశారు. వ్యాపారం పెంచుకోవడం కోసం బార్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. దీంతో సభ్యులు కాని వారు కూడా మద్యం సేవించి అల్లర్లకు పాల్పడుతుండటంతో సభ్యులు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. బార్లోకి ప్రైవేటు వ్యక్తులు వచ్చి అల్లర్లకు పాల్పడుతున్నారని కొంతమంది సభ్యులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ కమిటీ సభ్యులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. బయటి కంటే పెగ్గుకు రూ.20 అదనంగా వసూలు చేస్తున్నా ఎక్సైజు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఈ క్లబ్‌కు గతంలో కమిటీ ఉండేది. తాజాగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించి బయిలాను మార్పుచేసి, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం సాయంత్రం నూతన కమిటీ చేత క్లబ్లో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా కేఈ ప్రతాప్, ఉపాధ్యక్షుడిగా వెంకటేష్, కార్యదర్శిగా బాలచంద్రారెడ్డి, సహాయ కార్యదర్శి ఎన్.ప్రభాకర్, స్పోర్స్, కల్చరల్ సహాయ కార్యదర్శి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, కోశాధికారి కేఈ శివరామ్‌గౌడ్, కార్యవర్గ సభ్యులుగా దుర్గా ప్రసాదరెడ్డి, కే పుల్లారెడ్డి, రమణగౌడ్, వెంకటరామరాజు, శివశంకర్‌రెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. -
మెరుగైన సేవలే తపాలా శాఖ లక్ష్యం
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు కర్నూలు (ఓల్డ్‌సిటీ): అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తపాలా శాఖ లక్ష్యమని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని పోస్టుమాస్టర్లు, సబ్ పోస్టుమాస్టర్లు, సూపర్వైజర్లకు ఆదివారం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయ మేడపైన క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) అంశంపై శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు అతిథిగా హాజరై పోస్టుమాస్టర్లకు పలు సూచనలు ఇచ్చారు. క్యాష్ ఆన్ డెలివరీతో పాటు ఇటీవల గ్రామీణ పోస్టాఫీసుల్లో ప్రవేశపెట్టిన ఆర్‌ఐసీటీ ప్రాజెక్టు గురించి వివరించారు. మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ (ఎంఎన్ఓపీ) అంశంపై పవర్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.నాగానాయక్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీసెస్ ఫజులుర్ రహ్మాన్, ట్రైనర్ అబ్దుల్ హక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ సేవలతోనే గుర్తింపు
- సీమ ఐజీ శ్రీధర్‌రావు కర్నూలు : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి పోలీసు శాఖలో మంచి గుర్తింపు ఉంటుందని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది 2017 పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీసు శాఖలోని డీఎస్పీలు, పోలీసు సిబ్బందికి పలు సేవా పతకాలను జారీ చేసింది. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఉత్తమ సేవ, సేవా పతకాలు సాధించిన డీఎస్పీలు, పోలీసు సిబ్బందిని ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో అభినందన సభ నిర్వహించి సత్కరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ పోలీసుల పనితీరును గుర్తించడానికి డీజీపీ సాంబశివరావు ఆదేశాల మేరకు ఏ,బీ,సీ,డీ అవార్డులు అందజేస్తున్నారన్నారు. మంచి పనులు చేసేవారిని గుర్తించాలని సూచించారు. డీఐజీ రమణకుమార్ మాట్లాడుతూ సేవా పతకాలు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లా పోలీసులందరూ బాగా పనిచేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని సూచించారు. విధి నిర్వహణ, కేసుల పరిశీలనలో టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. సన్మాన గ్రహీతలు... డీఎస్పీలు... రాజశేఖర్‌రాజు (డీటీసీ) ఇండియన్ పోలీస్ పతకం, బాబు ప్రసాద్ (స్పెషల్ బ్రాంచ్) ఉత్తమ సేవా పతకం, కె.ఎస్.వినోద్‌కుమార్ (ఆత్మకూరు ఇన్చార్జి) సేవా పతకం. సీఐలు... పార్థసారధి రెడ్డి (పాణ్యం) సేవా పతకం, ఆర్.శివారెడ్డి (ఫింగర్ ప్రింట్స్ బ్యూరో) సేవా పతకం. ఏఎస్ఐలు... ఎల్.రఘురామయ్య (స్పెషల్ బ్రాంచ్) సేవా పతకం, రంగయ్య (స్పెషల్ బ్రాంచ్) సేవా పతకం. హెడ్ కానిస్టేబుళ్లు.. డి.మౌలాలి (స్పెషల్ బ్రాంచ్–2) ఉత్తమ సేవా పతకం, రఘురామయ్య గౌడు (సీసీఎస్) ఉత్తమ సేవా పతకం, ఉస్మాన్ బాషా(ఓఎస్డీ ఆఫీస్) సేవా పతకం, వెంకటాచలపతి (ఫింగర్ ప్రింట్స్ బ్యూరో) సేవా పతకం, వసూరప్ప (డీసీఆర్బీ) సేవా పతకం. కానిస్టేబుళ్లు... పి.వెంకటేశ్వర్లు (స్పెషల్ బ్రాంచ్–2) సేవా పతకం, రామాంజనయ్య (డోన్ పీఎస్) సేవా పతకం, ఫయాజుద్దీన్ (కర్నూలు తాలూకా పీఎస్) సేవా పతకం, బి.వి.రామరాజు (డీటీసీ) సేవా పతకం. -
తిరుపతికి ఎయిరిండియా విమానం
విశాఖ నుంచి విజయవాడ మీదుగా నేటి నుంచి సేవలు గన్నవరం: ఎయిరిండియా సంస్థ విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి శనివారం నుంచి కొత్త సర్వీస్‌ను ప్రారంభించనుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ సర్వీస్‌ను నడుపుతారు. బుధవారం ఒక్కరోజు మాత్రం విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు దీన్ని నడుపుతారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వైజాగ్‌కు నడుపుతున్న విమాన సర్వీస్‌ను రద్దు చేసి... దాని స్థానంలో ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎయిరిండియా తెలియజేసింది. నాలుగు నెలలుగా తిరుపతికి ఈ విమాన సర్వీస్‌లు లేక ఇబ్బందులు పడుతున్న శ్రీవారి భక్తులకు కొత్త సర్వీస్ రాకతో కష్టాలు తీరనున్నాయి. ఈ విమానం విశాఖ నుంచి ఉదయం 6.30 గంటలకు బయలుదేరి 7.30కి గన్నవరం చేరుకుంటుంది. కొద్దిసేపు విరామం తర్వాత 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు తిరుపతికి చేరుతుంది. తిరిగి 9.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి 10.30కు గన్నవరం వచ్చి, 25 నిమిషాల విరామం తర్వాత 10.55కు బయలుదేరి 11.55కు వైజాగ్‌కు చేరుతుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. బుధవారం మాత్రం వైజాగ్‌లో ఉదయం 10.45కు బయలుదేరి విజయవాడకు 11.45కు చేరుకుని, తిరిగి 12.10కు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10కు హైదరాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి 2.10కు బయలుదేరి 3.10 గంటలకు గన్నవరం చేరుకుని, 25 నిమిషాల విరామం తర్వాత తిరిగి బయలుదేరి సాయంత్రం 4.35కు వైజాగ్ చేరుతుంది. -
మానవత్వమే ఇస్లాం అభిమతం
నంద్యాలవిద్య: మానవత్వమే ఇస్లాం అభిమతమని జమాతే ఇస్లామిక్ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ సలాం దస్తగిరి అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక అంటికోట మసీదు ఆవరణలో ఆ సంఘం జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ గత 70సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ఉత్తమ సమాజ నిర్మాణానికి, మానవ విలువలు పెంపొందించడానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మీడియా సెక్రటరీ అక్బర్, సామాజిక కార్యదర్శి మౌలానా ఇదురుల్లా హుసేన్, పట్టణ అధ్యక్షుడు జక్రియ, తదితరులు పాల్గొన్నారు. -
’సర్వీస్’ దోపిడీ
– ఇంటర్ కాలేజీల నయా దందా – విద్యాపన్ను అంటూ రూ.1200 వసూలు – రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందంటూ బుకాయింపు – పరీక్షకు ముందు వసూళ్ల పర్వం సాక్షి, రాజమహేంద్రవరం : ఇంటర్ పరీక్షలకు ముందు కొన్ని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూళ్ల పర్వానికి తెరతీశాయి. హాజరు శాతం తగ్గిందన్న పేరుతో పరీక్షకు ఒక్కరోజు ముందు నిబంధనలకు విరుద్ధంగా రూ.2,000 వరకు వసూలు చేసిన వైనం మంగళవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అడిగినంతా కట్టకపోతే హాల్‌టిక్కెట్లు ఇవ్వబోమని చెబుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు కట్టేస్తున్నారు. హాజరు దోపిడీ ఇలా సాగిస్తున్న కార్పొరేట్ కాలేజీలు ‘విద్యాపన్ను’ పేరిట వసూలు చేస్తున్న విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. సర్వీస్ టాక్స్ అంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి రూ.1200 చొప్పున వసూలు చేస్తున్నారు. అదీ హాల్‌టిక్కెట్లు ఇచ్చే ముందు ఈ తంతు కొనసాగిస్తున్నారు. ఇదేమిటీ అని అడిగిన వారికి సర్వీస్ టాక్స్ అంటూ కాలేజీ సిబ్బంది సమాధానమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాపన్ను పేరిట రూ.1200 చెల్లించాలని చెబుతున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులకు, కాలేజీ సిబ్బందికి వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. రాజమహేంద్రవరంలోని కొన్ని కార్పొరేటర్ కాలేజీల్లో విద్యార్థుల నుంచి సర్వీస్ టాక్స్ పేరిట రూ.1200 వసూలు చేస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో హాల్‌టిక్కెట్లు ఇచ్చే ముందు కాలేజీ యాజమాన్యాలు ఈ విధంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోంది. పరీక్షలకు ముందు డబ్బుల కోసం పిల్లలను ఇలా వేధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంటర్ రెండో ఏడాది పరీక్షలకు హాజరు కావాల్సిన తన కుమార్తెకు హాల్‌టిక్కెట్టు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టిందని, చివరికి రూ.1200 కడితేనే గాని హాల్‌టిక్కెట్టు ఇవ్వలేదని రాజమహేంద్రవరం నగరానికి చెందిన విద్యార్థిని తండ్రి దివ్యాంగుడైన ఎ.తారకేశ్వరరావు వాపోయారు. ఎలాంటి పన్నూ లేదు... విద్యాపన్ను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. అలా ఎవరైనా వసూలు చేస్తున్నట్టయితే విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేయాలి. అలా చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫీజుల వసూళ్లకు సంబంధించి ఏవైనా పెండింగ్ ఉంటే టీసీ ఇచ్చే సమయంలో వసూలు చేసుకోవాలని కాలేజీలకు చెప్పాం. హాల్‌టిక్కెట్లు ఇచ్చే సమయంలో ఈ విధంగా చేసి విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేశాం. – ఎ.వెంకటేష్, ఆర్ఐవో, రాజమహేంద్రవరం. -
దివ్యాంగులకు సేవ చేయడం అదృష్టం
– కర్నూలు డయాసిస్ బిషప్ పూల ఆంథోని అయ్యలూరుమెట్ట (నంద్యాలరూరల్): దివ్యాంగులకు సమాజంలో వారికి గౌరవ స్థానం కల్పించడం అదృష్టంగా భావించాలని కర్నూలు డయాసిస్ బిషప్ మోస్ట్ రైట్ రెవరెండ్ పూల ఆంథోని అన్నారు. అయ్యలూరు మెట్ట నవజీవన్ బధిరుల పాఠశాల వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిషప్ పూల ఆంథోని మాట్లాడుతూ ఏసుప్రభువు చూపిన ప్రేమ, దయ, కరుణతో 39 సంవత్సరాలు విచారణ గురువుగా సేవలు అందిస్తున్న ఫాదర్ మర్రెడ్డి సేవలు మరువలేనివన్నారు. పెద్దకొట్టాలలో శారీరక వికలాంగుల ఆశ్రమం, గోపవరం వద్ద మానసిక వికలాంగుల ఆశ్రమం, అయ్యలూరు మెట్ట వద్ద మూగ, చెవిటి పిల్లల ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి వికలాంగులకు వసతితో పాటు విద్యను అందించడం దేవుడు ఆయనకు ఇచ్చిన గొప్పవరం అన్నారు. జేఎంజే సంస్థ పర్య అధినేత సిస్టర్ సెలీనా ఆలాపాట్ కూడా దైవ కన్యగా నిలుస్తూ 50 సంవత్సరాలుగా దైవ మార్గంలో విద్యార్థులకు, సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని సేవాదృక్పథం పెంచుకోవాలని సూచించారు. అనంతరం బిషప్ పూల ఆంథోని, సిస్టర్ సెలీనా ఆలాపాట్, ఫాదర్ మర్రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్ రాజమ్మ, పెద్దకొట్టాల ఆర్సీఎం చర్చి విచారణ గురువు ఏర్వ జోజిరెడ్డి, ప్యారీస్ క్రీస్ ఫాదర్ సురేష్, నవజీవన్ డీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ నారపురెడ్డి, ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతమ్మ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజశేఖర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు: పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నవజీవన్ విద్యార్థుల నాటికలు, సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం నృత్యం, చెక్కభజన, ఆహుతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏసుప్రభువు జీవిత ఘట్టం, గ్లోరిగ్లోరి దేవుని మహిమ గీతం, ప్రేమసింధు, పరమాత్మ నీవనే అనుక్రమ గీతం, అల్లేలూయ గీతాలకు బధిర విద్యార్థుల ప్రదర్శన శభాష్ అనిపిచింది. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. -
ఇక అన్ని సేవలు ఆన్లైన్లోనే!
– ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ కోసమే ఆర్టీఏ కార్యాలయానికి.. – ఏప్రిల్ నుంచి జిల్లాలో అమలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రవాణా సేవలన్నీ ఇకపై ఆన్లైన్లోనే లభించనున్నాయి. రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లకుండానే సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ నుంచి నూతన విధానాన్ని అమలు చేయాలని రవాణాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఆ తర్వాత కేవలం వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్‌తో పాటు లెర్నింగ్, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం మాత్రమే రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి రానుంది. ఇక మిగిలిన సేవలన్నీ ఆన్లైన్లోనే లభించనున్నాయి. ప్రాథమికంగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని విశాఖపట్నంలో ఫిబ్రవరి 15న ప్రారంభించినట్టు రవాణాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ విధానాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి కర్నూలు జిల్లాలో అమలు చేయనున్నట్టు సమాచారం. రెండో వాహనం కొనుగోలు చేసినా.. ప్రస్తుతం కొత్త వాహనం కొనుగోలు చేసిన సమయంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ మినహా మిగిలిన పనులన్నింటికీ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిందే. అయితే, కొత్త విధానంలో కొత్త వాహనానికి పర్మినెంటు నెంబర్ కూడా షోరూంలలోనే లభించనుంది. అంతేకాకుండా వాహనం ఒకరి నుంచి మరొకరు కొనుగోలు చేసినా కూడా ఆన్లైన్లోనే ఆర్సీ మార్చుకునేందుకు వీలు కలగనుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాహనాల ఫీజుల చెల్లింపులు కూడా ఆన్లైన్లోనే చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సెకండ్‌హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం ఒకచోట ఉండి.. ఆధార్‌కార్డులో ఉండే అడ్రస్ వేరే చోట ఉంటే అక్కడికే వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తోంది. ఇది అదనపు భారంగా ఉంటోంది. తాజాగా అమల్లోకి రానున్న ఆన్లైన్ విధానంలో నెట్ ద్వారా రవాణాశాఖ వెబ్సైట్లోకి వెళ్లి సదరు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా రవాణాశాఖలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలు కూడా తగ్గిపోతాయనేది ఉన్నతాధికారుల ఆలోచనగా ఉంది. షోరూంలలోనే హైసెక్యూరిటీ నెంబరు ప్లేట్లు ప్రస్తుతం కొత్తగా షోరూంలో వాహనాన్ని కొనుగోలు చేస్తే అక్కడికక్కడే తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారు. పర్మినెంట్ నెంబర్ కోసం మళ్లీ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా పర్మినెంట్ నెంబర్ వచ్చిన తర్వాత కూడా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు వచ్చేందుకు మరో వారం, పదిరోజులు పడుతోంది. అన్ని రోజులు ఆగిన తర్వాత మళ్లీ సదరు సంస్థ నిర్దేశించిన సమయంలోనే వెళ్లి నెంబర్ ప్లేటు బిగించుకోవాల్సి ఉంటుంది. అయితే, తాజా విధానంలో హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను కూడా వాహనాల షో రూంకే అప్పగిస్తారు. తద్వారా వాహనదారులకు అదనపు భారం తగ్గుతుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
సేవలోనే సంతృప్తి
– ఎంపీ ఎస్పీవైరెడ్డి – నంద్యాలలో రోటరీ ఇంటర్నేషనల్ సదస్సు ప్రారంభం – హాజరైన రెండు రాష్ట్రాల క్లబ్‌ల ప్రతినిధులు నంద్యాల: సమాజానికి, ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి, ఆనందం దాగి ఉంటుందని ఎంపీ ఎస్పీవైరెడ్డి చెప్పారు. స్థానిక వైజంక్షన్‌లోని సౌజన్య కన్వెన్షన్ హాల్లో శనివారం రోటరీ క్లబ్ 3160 ఇంటర్నేషనల్ సదస్సు గవర్నర్ కందుకూరి శ్రీరామమూర్తి అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైంది. సదస్సులో కర్ణాటకలోని ఏడు, ఏపీలోని ఆరు జిల్లాలలోని 68 క్లబ్‌లకు చెందిన వెయ్యిమంది ప్రతినిధులు పాల్గొన్నారు. అతిథులుగా ఎంపీతోపాటు మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచన హాజరయ్యారు. అనంతరం ఎంపీ ఎస్పీవైరెడ్డి మాట్లాడుతూ చిరునవ్వుతో ఎంత కష్టానైనా సాధించవచ్చన్నారు. నంద్యాలలో రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. కందుకూరి శ్రీరామమూర్తి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా విద్య, వైద్య రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. మాజీ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పోలియో వ్యాధి నిర్మూలనకు రోటరీ క్లబ్ చేసిన సేవలు ప్రశంసానీయమన్నారు. క్లబ్ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి మాట్లాడుతూ రోటరీ అందిస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం క్లబ్ సభ్యులు అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ అద్యక్షుడు రమేష్, కాన్ఫరెన్స్ చైర్మన్ చిన్నపురెడ్డి, క్లబ్ పీడీజీ గుర్జీత్‌సింగ్ శిఖోన్, క్లబ్ ఇన్నర్‌వీల్ చైర్పర్సన్ వీణాస్వామి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుబ్బరామయ్య, డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సురేంద్రనాథ్, సీనియర్ రొటేరియన్లు విజయశేఖర్‌రెడ్డి, నెరవాటి సత్యనారాయణ, డాక్టర్ మధుసూదనరావు, నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్నేషనల్ క్లబ్ డైరెక్టర్‌గా జొన్నలగడ్డ నాగరాజు
నూనెపల్లె: వాసవీ క్లబ్ 209లో ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా జొన్నలగడ్డ నాగరాజును ఎన్నుకున్నారు. డిసెంబర్ 28వ తేదీన బెంగుళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ క్లబ్ ఎన్నికల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోగా జనవరి 21న విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశంలో ఆయనకు పిన్ కేటాయించారు. ఇంటర్నేషనల్ క్లబ్ 22 మంది డైరెక్టర్లు ఉండగా కర్నూలు జిల్లా నుంచి ఆయనకు చోటు కల్పించారు. 2017 చివరి వరకు క్లబ్ డైరెక్టర్‌గా ఉంటారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. తాను నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి డైరెక్టర్‌గా అవకాశం కల్పించారని చెప్పారు. -
విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై చట్టసభల్లో చర్చ
– ఒకరోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సూచనలు తీసుకుంటాం – శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతుల సామాజిక, ఆర్థిక పరిపుష్టికి సంబంధించి ప్రత్యేక అజెండాను రూపొందించి శాసనసభ, శాసనమండలిలో ఒక రోజు సంపూర్ణ చర్చ జరిగేందుకు కృషి చేస్తామని శాసనమండలి చైర్మన్ డా.ఏ చక్రపాణియాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సూచనలు, సలహాలు స్వీకరించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రయోజన పూర్వకమైన ఉత్తర్వులను తీసుకువస్తామన్నారు. శనివారం ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్థానిక అంబేడ్కర్‌భవన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రపాణియాదవ్ మాట్లాడుతూ వికలాంగుల్లో ఎనలేని శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని, వాటిని వెలికితీసేందుకు కృషి చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలో 55 వేల మందికి వికలాంగ పింఛన్లు ఇస్తున్నామని, ఏ కుటుంబంలోనైనా 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఉంటే ఆయా కుటుంబాలకు అంత్యోదయ కార్డులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందుకు సంబంధించి గుర్తింపు ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఈ నెలలో జరగనున్న సదరం క్యాంపులో దివ్యాంగులు దరఖాస్తులు అందించి తగిన సర్టిఫికెట్లు పొంది పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్నూలులో సెన్సరీ పార్కు ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. అనంతరం వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వివాహ ప్రోత్సాహకాలు అందించారు. కార్యక్రమంలో జేసీ–2 ఎస్ రామస్వామి, ఉపాధ్యాయులు పుష్పరాజ్, ఉద్యోగ సంఘాల ప్రతినిధి కృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. -
క్రమశిక్షణ మంత్రం.. దేశభక్తి సూత్రం
- భావిభారత పౌరుల తీర్చిదిద్దడంలో ఎన్సీసీ కీలకం - ఎన్‌సీసీతో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు - జిల్లాలోని ప్రముఖులు ఈ కోవలోని వారే...! - నేడు ఎన్సీసీ డే క్రమశిక్షణమైన జీవితం, నిజాయితీగా బతకడం, ఎంతటి కఠోరశ్రమనైనా తట్టుకోవడం, ఎన్ని కష్టాలు ఎదురైనా నిలదొక్కుకోవడం, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు దూరంగా ఉండగలిగే మనోస్థైర్యాన్ని చిన్నతనంలోనే పెంపొందించడం, సమాజం గురించి తెలుసుకోవడం, జ్ఞానాన్ని సముపార్జించడం.. ఇలాంటి లక్షణాలన్నీ ఎన్‌సీసీతో సాధ్యమవుతాయనడంలో అతిశయోక్తి లేదు. చదువుతో పాటు ఇతర అంశాల్లో అవగాహన కల్పించేందుకు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇప్పుడు ఎన్సీసీలో చేర్పిస్తున్నారు. తద్వారా వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆదివారం (ఈనెల 27న) ఎన్సీసీ డే ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. - కర్నూలు(హాస్పిటల్) ఎన్సీసీ (నేషనల్ కేడెట్ కాప్స్) అంటే క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్. డ్రిల్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవ, దేశభక్తి తదితర విషయాలపై పూర్తి స్థాయిలో శిక్షణ పొందే భావిభారత పౌరులు. జిల్లాలో 2002వ సంవత్సరం వరకు తిరుపతి హెడ్‌క్వార్టర్‌గా ఎన్సీసీ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ తర్వాత కర్నూలు కేంద్రంగా 2002లో స్థానిక డాక్టర్స్ కాలనీలో ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్ ప్రారంభమైంది. దీని పరిధిలో ప్రస్తుతం బాయ్స్ బెటాలియన్, 28 ఆంధ్రా బెటాలియన్, కర్నూలు, అనంతపురం గర్ల్ బెటాలియన్, వన్ ఆంధ్రా మెడికల్ కంపెనీ ఉన్నాయి. జిల్లాలోని 71 పాఠశాలలు, 30 కళాశాలల్లో మొత్తం 10,250 మంది ఎన్సీసీ కేడెట్లు ఉండగా, ఇందులో 4,350 మంది బాలురు, 5,900 మంది బాలికలు ఉన్నారు. కర్నూలు గ్రూపులో ఆరు మంది ఆర్మీ ఆఫీసర్లు, 75 మంది జేసీవోలు, ఓఆర్‌లు, 100 మంది సాధారణ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరితో పాటు ప్రతి కళాశాలలో ఒక ఎన్సీసీ ఆఫీసర్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఎన్సీసీలో మూడు రకాల శిక్షణ ఇన్సిట్యూషన్ ట్రైనింగ్ ఎన్సీసీ అధికారులు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా డ్రిల్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే శిక్షణ, విపత్తు నివారణలో శిక్షణ, మ్యాప్ రీడింగ్, ఫైరింగ్, బ్యాటిల్ క్రాఫ్ట్, ఫీల్డ్ క్రాఫ్ట్ వంటి అంశాల్లో ప్రత్యేక తరగతుల్లో శిక్షణ ఇస్తారు. క్యాంప్ ట్రైనింగ్ ఈ శిక్షణను అనంతపురం జిల్లా పూడేరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 10 రోజుల పాటు ఎన్సీసీ కేడెట్లకు శిక్షణ ఇస్తారు. ఇన్సిట్యూషన్ ట్రైనింగ్‌లో ఇచ్చే శిక్షణతో పాటు వైద్యం, ఫైర్ ఫైటింగ్, రెడ్‌క్రాస్ సేవలు, 108 సేవలు, కమ్యూనిటీ లివింగ్, స్నేహితులతో ఎలా మెలగాలి వంటి అంశాలను నేర్చుకుంటారు. అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇందులో భాగంగా ఆర్డీసీ (రిపబ్లిక్ డే క్యాంపు), తలసైనిక్ క్యాంపులకు ఎన్సీసీ విద్యార్థులను పంపించేందుకు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులను ఢిల్లీకి పంపిస్తారు. ఆర్డీసీలో భాగంగా ఢిల్లీలో డ్రిల్, సాంస్కృతిక కార్యక్రమాలు, గార్డ్ ఆఫ్ ఆనర్, బెస్ట్ కేడెట్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. ఫ్లాగ్ ఏరియా కాంపిటీషన్‌ను ఉప రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి, మూడు రకాల భద్రతాధికారుల సమక్షంలో మోడల్ రూపొందించి ప్రదర్శిస్తారు. తలసైనిక్ క్యాంపునకు పంపించేందుకు సైతం పై విధంగానే ఎంపికలు నిర్వహించి ఢిల్లీకి పంపిస్తారు. ఇది పూర్తిగా ఆర్మీలో ఇచ్చే శిక్షణ ఇస్తారు. ఆఫ్సిటికల్స్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, జడ్జింగ్ డిస్టెన్ ఫీల్డ్ సిగ్నల్స్, హెల్త్ అండ్ హైజనింగ్లలో శిక్షణ ఉంటుంది. పాఠశాల స్థాయి పిల్లలకు ఏ- సర్టిఫికెట్, కళాశాల స్థాయి పిల్లలకు బీ,సీ సర్టిఫికెట్ పరీక్షలను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహిస్తారు. ఎన్సీసీ ప్రయోజనాలు ఎన్సీసీలో పలు రకాల సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయి. ఆర్డీసీ, తలసైనిక్ క్యాంపుల్లో పాల్గొన్న విద్యార్థులకు జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ సీట్ల కేటాయింపులో వీరికి రిజర్వేషన్ ఉంటుంది. దీంతో పాటు యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలోనూ వీరికి మంచి అవకాశాలు ఉంటాయి. ఎన్సీసీలో చేరడంతో పిల్లల్లో బాల్యం నుంచే క్రమశిక్షణ అలవడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేన్ స్కిల్స్, పరస్పర సహకారం, నిజాయితీగా జీవించడం వంటి లక్షణాలు అలవడతాయి. శిక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు: పీజీ కృష్ణ, గ్రూప్ కమాండర్ ఎన్సీసీ విద్యార్థులకు అవసరమైన శిక్షణతో పాటు సామాజిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా స్వచ్ఛభారత్, బేటీ బచావో, బేటీ పడావో, షుగర్, ఎయిడ్స్, లెప్రసి, మానవహక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్సీసీ విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌లో విదేశాలకు: గౌస్ బేగ్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 20 మంది విద్యార్థులను ఇప్పటి వరకు విదేశాలకు పంపించాము. సిల్వర్‌జూబ్లీ కళాశాలకు చెందిన ధీరజ్ శ్రీనివాస్ కజకిస్తాన్, భాస్కర్ బంగ్లాదేశ్‌కు వెళ్లి వచ్చారు. వారు అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, వాతావరణ పరిస్థితులు, వ్యక్తుల మనస్తత్వాలను పరిశీలిస్తారు. తద్వారా వారు భవిష్యత్‌లో సమాజంలో ఎలా జీవించాలో నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
– జేసీ–2 రామస్వామి – ఘనంగా బాలల హక్కుల వారోత్సవాలు కర్నూలు(అర్బన్): బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్–2 రామస్వామి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఐసీడీఎస్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి మాట్లాడుతూ.. బాల బాలికలు విద్య, ఆరోగ్యం, ఆహార విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో సమగ్ర బాలల సంరక్షణ కేంద్రాలు పని చేస్తున్నాయని, అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి వయో వృద్ధుల వరకు అన్ని రకాల సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని ఐసీడీఎస్ ఆర్జేడీ శారద చెప్పారు. చెడు అలవాట్లకు లోనుకాకుండా యోగా కేంద్రాలకు వెళ్లి ఏకాగ్రతను పెంచుకోవాలని సీనియర్ న్యాయవాది నాగలక్ష్మిదేవి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపాలని డిప్యూటీ డీఈఓ తాహెరా సుల్తానా అన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీపీ ఈశ్వరమ్మ, సర్పంచును సన్మానించారు. వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. బాలికా సంరక్షణ పథకం కింద మంజూరైన ఇన్సూరెన్స్ బాండ్లను 40 మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు జేసీ–2 అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఏపీడీ అరుణ, 1098 పీడీ మోహన్‌రావు, జిల్లాలోని ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మీ సేవా కేంద్రాలకు అదనంగా 151 సర్వీసులు
కర్నూలు (అగ్రికల్చర్): మీ సేవా కేంద్రాలకు అదనం 151 సర్వీసులు రానున్నాయని జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి వెంకటనారాయణ తెలిపారు. గురువారం మీ సేవా ఆపరేటర్లకు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీఎస్సీ, మీసేవా, డిజిటల్ ఇండియా తదితర వాటిపై మీ సేవా ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దాదాపు 320 సేవలు లభిస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్కిల్ డెవలప్మెంట్ తదితర వాటికి సంబంధించి 151 సర్వీసులు రానున్నాయని వివరించారు. కొత్త సర్వీసుల నుంచి మాస్టర్ ట్రైనర్లు ఇస్మాయిల్, యశ్వంత్‌లు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిస్టిక్ట్ మేనేజర్ రాకేష్‌బాబు, డీడీఎం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
నిస్వార్థ సేవకు నిదర్శనం లైఫ్ సభ్యులు
– జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ బేతంచెర్ల : నేత్రదానం ద్వారా అంధులకు వెలుగును ప్రసాదిస్తున్న బేతంచెర్ల లైఫ్ సభ్యులు నిస్వార్థసేవకు నిదర్శనంగా నిలుస్తున్నారని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక శేషారెడ్డి ఉన్నత పాఠశాల్లో లైఫ్ ఆధ్వర్యంలో లైఫ్ గౌరవాధ్యక్షులు గౌరు హుసేన్‌రెడ్డి, రవి, ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన ఎస్పీ సమక్షంలో 130 మంది నేత్రదాతల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. దాదాపు 150 మంది నేత్రాలు దానం చేయించడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. బేతంచెర్ల లైఫ్ సభ్యుల ఉత్సాహం చూస్తుంటే తాను కూడా ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ అనాథ ఆశ్రమం నిర్వహణకు పారిశ్రామికవేత్త గౌరు హుసేన్‌రెడ్డి రూ, 5 లక్షలు, క్రిష్ణమూర్తి రూ,25,000, కందగడ్డల మోహన్‌రావు రూ,25, 000, జబ్బార్ జవేద్ రూ. 33,000, చంద్రశేఖర్‌రెడ్డి రూ,10,000ను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి ఎస్పీ భోజనం చేశారు. రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీనివాసులు, డీఎస్పీ మురళీధర్, ఎంపీడీవో నాగరాజు నాయుడు, సీఐ సుబ్రమణ్యం , ఎస్ఐ తిరుపాలు, పట్టణ పారిశ్రామిక వేత్తలు మూర్తుజావలి, తెలుగు రమణ,గుండా గోపాలు, గుండా జగన్, మాణిక్యం, నాగసురేంద్ర, వన్నూర్ బాషా పాల్గొన్నారు. -
సేవ ముసుగులో దారుణాలు
నాగోలు: ఎల్బీనగర్ బండ్లగూడలో ఓలే్డజ్ హోం ముసుగులో అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో హోం నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓల్డు ఏజ్ హోంలో మద్యం బాటిళ్లు, నిరోధ్ ప్యాకెట్లు లభించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.... నల్లగొండ జిల్లాకు చెందిన ఆర్.శ్రీనివాస్ సౌత్‌ఎండ్‌పార్కులో రామకృష్ణ ఓలే్డజ్ హోం నిర్వహిస్తున్నాడు. వృద్ధులకు సేవ పేరుతో అతను బండ్లగూడ, రాఘవేంద్రకాలనీల్లో సెంటర్లను ఏర్పాటు చేసి బండ్లగూడలో రామకృష్ణ ఓలే్డజ్ హోం, హోం కేర్ సర్వీసెస్ పేరిట సెంటర్ నడుపుతున్నాడు. ఇక్కడి నుంచి వృద్ధులకు సేవ చేస్తున్నట్లు కాలనీవాసులు, పరిసర ప్రాంతాల వారిని నమ్మించారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మైనర్ బాలికలను హోం సర్వీసెస్‌కు పంపేవాడు. యువతీ, యువకులచే సర్వీస్... రామకృష్ణ ఓల్డు ఏజ్ హోం పేరుతో ‘మీ ఇంటి వద్దకే మా సేవలు’ అంటూ వంద నుంచి 150 మంది సిబ్బందిని తన ఆధీనంలో ఉంచుకుని నగరంలో వాహనాల ద్వారా సేవలు అందించేవాడు. సర్వీస్ పేరుతో పలు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వీస్ చేసిన యువతులు, యువకులకు తక్కువ జీతం ఇచ్చి వినియోగదారుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడని, బండ్లగూడలో ఏర్పాటు చేసిన మూడు గదుల్లో మహిళలు, యువకులు కలిసి ఉండేవారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గోపాలకృష్ణాపురంలో గత ఏడాది ఏర్పాటు చేసిన ఓల్డు ఏజ్ కేర్ సర్వీస్ సెంటర్ సిబ్బందిని మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన వెంటనే హోంకు తాళం వేసి పరారయ్యారు. గురువారం స్థానికులు హోంను పరిశీలించగా మద్యం బాటిళ్లు, నిరోధ్ ప్యాకెట్లు కనిపించాయి. ఇక్కడ కూడా వృద్ధులు ఉన్నట్లు ఆనవాళ్లు లేకపోవడంతో సేవ చాటున అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు హోంలో సర్వీస్ సెంటర్ పేరుతో అసాంఘీక కార్యక్రమాలు జరుగుతున్నాయని గోపాలకృష్ణాపురం రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్, ప్రధాన కార్యదర్శి స్వామి, కరుణాకర్‌రెడ్డి, కాలనీ మహిళలు గతంలోనే ఎల్బీనగర్ పోలీసులకు, డీసీపీకి ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదన్నారు. హోంలో ఉండే మహిళలు, యువకులు మద్యం సేవించి ఇబ్బందులకు గురిచేసేవారన్నారు. నిర్వాహకుడు శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డీసీపీఓ దేవేందర్, కౌన్సిలర్లు హోంను సందర్శించి వివరాలు సేకరించారు. ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పోస్టల్‌సేవలను సది్వనియోగం చేసుకోవాలి
– జిల్లా అదనపు సివిల్ జడ్జి పుష్పారాణి కర్నూలు (ఓల్డ్‌సిటీ): పోస్టాఫీసులు అందిస్తున్న సేవలను ప్రజలు సది్వనియోగం చేసుకోవాలని జిల్లా అదనపు సివిల్ జడ్జి పుష్పారాణి పేర్కొన్నారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు మేడపై ఉన్న పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు అధ్యక్షతన ఆదివారం ప్రపంచ తపాలా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అదనపు సివిల్ జడ్జి పుష్పారాణితో పాటు డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ సంతాన రామన్ అతిథులుగా హాజరై మెరుగైన సేవలు అందించిన పది మంది పోస్టల్ సిబ్బందికి బహుమతులు అందించారు. సుకన్య సమృద్ధి యోజనకు దరఖాస్తు చేసుకున్న ఐదుగురు చిన్నారులకు ఖాతాలకు సంబంధించిన పాస్‌బుక్‌లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా అదనపు సివిల్ జడ్జి మాట్లాడుతూ పోస్టాఫీసులు సాంకేతిక పరిజ్ఙానాన్ని పెంపొందించుకుంటూ ఆధునిక బ్యాంకింగ్ దిశగా పయనిస్తున్నాయని పేర్కొన్నారు. పోస్టల్ శాఖ బలోపేతంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ సంతాన రామన్ మాట్లాడుతూ తపాలా వ్యవస్థకు 150 ఏళ్ల చరిత్ర ఉందని, ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని, మారుతున్న కాలనికి అనుగుణంగా టెక్నాలజీ పెంచుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు నాగానాయక్, సిబ్బంది లలిత, గీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మేము సైతం
జీవితంలో ఎన్ని కష్టాలున్నా వాటిని చిరునవ్వుతో ఎదుర్కొంటూ.. జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయులకు మేము సైతం అంటూ టాలీవుడ్ తారలు ‘మేముసైతం’ కార్యక్రమం ద్వారా చేస్తున్న సేవ ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తోంది. ఈ వారం ‘మేముసైతం’లో... 15 సంవత్సరాల క్రితం భర్త చనిపోగా, ఇద్దరు కూతుళ్లను పోషించడానికి బుక్‌స్టోర్‌లో పనిచేస్తున్న జానకి, ఆమె పెద్ద కూతురు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్షవాతం వల్ల కాలు, చెయ్యి పడిపోయిన పెద్దకూతురికి వైద్యం చేయించడానికి అండగా.. యంగ్ హీరో నాగచైతన్య సెల్ఫీలు దిగి వినూత్న సేవ చేశారు. ఒంటరి పోరాటం చేస్తూ జీవితాన్ని గడుపుతున్న జానకి కష్టాల్ని తీర్చడానికి నాగచైతన్య చేసిన వినూత్న సేవతో ‘మేముసైతం’ ఈ శనివారం రా.9:30కు ప్రసారం కానుంది. తప్పక చూడండి. -
‘స్వచ్ఛంద’ వేదిక అభినందనీయం
– కేఎన్ఎన్ జిల్లా సమావేశంలో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): సామాజిక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు (ఎన్జీవోలు) కీలక పాత్ర పోషిస్తున్నాయని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు ఎన్జీవోస్ నెట్వర్క్(కేఎన్ఎన్) మొట్టమొదటి జిల్లా సమాశాన్ని బుధవారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా బుట్టా రేణుక మాట్లాడుతూ ఎన్జీవోలు ఒకే వేదికపైకి రావడం అభినందనీయమన్నారు. అందరూ కలిస్తే రాష్ట్ర వ్యాప్త సేవలుఅందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎన్జీవోలందించే సేవల పట్ల ఎవరైనా అధికారులు పట్టించుకోకపోతే తన దష్టికి తేవాలన్నారు. తాను నేరుగా కేంద్ర ప్రభుత్వ దష్టికి తీసుకెళతానని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. తమ ట్రస్టు ద్వారా ప్రజలకు విద్య, వైద్యపరమైన ఉచిత సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 132 సంస్థలు కలిశాయని కేఎన్ఎన్ జిల్లా చైర్మన్ మోహన్‌రాజ్ తెలిపారు. ప్రభుత్వం వెళ్లలేని చోటకు సేవా సంస్థలు వెళతాయన్నారు. కన్వీనర్ పాల్ రాజారావు మాట్లాడుతూ.. కరవు కాటకాలు వచ్చినా, సామాజిక సమస్యలు ఉత్పన్నమైనా ఎన్జీవోలు ముందుంటారన్నారు. అనంతరం ఎంపీ బుట్టా రేణుకను సన్మానించారు. కార్యక్రమంలో హఫీజ్ ఖాన్ ట్రస్టు వ్యవస్థాపకుడు ఎం.ఎ.మోయీజ్ ఖాన్, వైఎస్ఆర్సీపీ మైనారిటీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్ అహ్మద్ ఖాన్, కేఎన్ఎన్ కర్నూలు డివిజన్ అధ్యక్షుడు మద్దిలేటి, నంద్యాల మురళీకష్ణ, ఆదోని ఓంకారాచారితో పాటు ప్రసాద్, శైలజ, త్యాగరాజు, రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రామలింగేశ్వరుడి సేవలో జిల్లా జడ్జి
కీసర : కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి, చీర్యాల లక్ష్మీనరసింహ స్వామి వార్లను సోమవారం రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి విజయేంద్ర కుటుంబసమేతంగా సందర్శించారు. ఉదయం కీసర ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు న్యాయమూర్తికి ఆశీర్వచనాలతో పాటు ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ, వేద పండితపులు నాగేంద్రశర్మ, రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చీర్యాల లక్ష్మీనసింహస్వామి ఆలయానికి చేరుకున్న జిల్లా జడ్జికి ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు జడ్జి దంపతులకు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ చైర్మన్ మల్లారపులక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిలు స్వామివారి ప్రసాదంతో పాటు, చిత్రపటానికి బహూకరించారు. -
ఏకీకృత సర్వీసు రూల్స్‌ను ఆమోదించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్‌కు వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలిపేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన కర్నూలు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. 16 ఏళ్లుగా ఏకీకృత సర్వీసు లేకపోవడంతో ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిచిపోయి ఎంఈఓ, డీవైఈఓ, డైట్, జూనియర్కళాశాలల లెక్చరర్ పోస్టులు భర్తీ కావడంలేదన్నారు. మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీసు రూల్స్ వర్తింపజేయాలని, ఎయిడెడ్, గురుకుల, మోడల్ స్కూల్ టీచర్లకు వెంటనే హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట ఉపాధ్యాయులు సుబ్బయ్య, శ్రీనివాసులు, శ్రీనాథ్ ఉన్నారు. -
హైదరాబాద్ నుంచి గోఎయిర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విమానయాన రంగ సంస్థ గోఎయిర్ తాజాగా తన సర్వీసులను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తోంది. అక్టోబరు 12 నుంచి ఈ సేవలు మొదలు కానున్నాయి. దీంతో సంస్థకు భాగ్యనగరి 23వ నగరం కానుంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, కోక్కత నగరాలకు ప్రతిరోజు నాన్ స్టాప్ సర్వీసులను గోఎయిర్ నడుపనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా పోర్ట్‌బ్లెయిర్‌కు ఫ్లైట్స్ ప్రారంభించనుంది. ప్రస్తుతం గోఎయిర్ నుంచి ప్రతిరోజు 144 సర్వీసులు నడుస్తున్నాయి. డిసెంబరు చివరికల్లా ఈ సంఖ్య 184కు చేరుకోనుందని కంపెనీ తెలిపింది. -
నిధులిచ్చినా... ఖర్చు చేయరా..
– నెలాఖరులోపు వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి చేయాలి – రాష్ట్ర మున్సిపల్ పుర పరిపాలన శాఖ అదనపు సంచాలకులు వెంకట్రామిరెడ్డి కర్నూలు (టౌన్): ‘మున్సిపాల్టీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఖర్చుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర మున్సిపల్ పుర పరిపాలన శాఖ అదనపు సంచాలకులు వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక నగరపాలకలోని కౌన్సిల్ హాలులో జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మున్సిపాల్టీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో చేపడుతున్న అభివద్ధి పనులు, తదితర వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కింద ప్రభుత్వం జిల్లాకు రూ. 12.30 కోట్లు మంజూరు చేసిందన్నారు. 2015–16 సంవత్సరానికి కర్నూలు కార్పొరేషన్‌కు రూ. 1.51 కోట్లు, ఆదోని రూ. 54.59 లక్షలు, నంద్యాల రూ. 65.80 ల„ý లు, ఎమ్మిగనూరు 31. 22 లక్షలు, డోన్ రూ. 2.19 కోట్లు, నందికొట్కూరు 15.41 లక్షలు, గుడూరు రూ. 2. 31 కోట్లు, ఆళ్లగడ్డ రూ. 2.70 కోట్లు, ఆత్మకూరు రూ. 2. 15 కోట్లు చొప్పున నిధులు విడుదల చేశామన్నారు. గూడూరు మున్సిపాల్టీ పనితీరు అధ్వానంగా ఉందని అసంతప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ స్కూళ్లలో అభివద్ధి పనులకు కేటాయించిన నిధుల్లో డోన్, నందికొట్కూరు, గూడూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాల్టీలు ఏమాత్రం ఖర్చు చేయలేదన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా బహిరంగ మల విసర్జనను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకోని వారిని గుర్తించి జరిమానా వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈనెలాఖరులోపు అన్ని మున్సిపాల్టీల్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. సమావేశంలో కర్నూలు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ . రవీంద్రబాబు, మెప్మా పీడీ రామాంజనేయులు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు, డోన్, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు మున్సిపాల్టీల కమిషనర్లు పాల్గొన్నారు. -
పుష్కరాల్లో అధికారుల సేవలు భేష్
–డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాల్లో అధికారులు సేవలు బాగున్నాయని డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి కితాబిచ్చారు. అందుకే పుష్కర్లా నిర్వహణలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించిందన్నారు. బుధవారం రాత్రి వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్లో కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వలంటీర్లు, మహిళా సంఘాల అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేఈ మాట్లాడుతూ.. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతమంది అధికారులను ఒకేచోట చూడటం ఇదే మొదటిసారి అన్నారు. ఈ ఖ్యాతి జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్‌కు దక్కుతుందన్నారు. జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ.. మహా సంకల్పం కలిగివుండటం వల్లే దేవుడు కరుణించి కష్ణా నదికి పుష్కలంగా నీరు వచ్చిందన్నారు. పుష్కరాల అనుభూతులు వచ్చే పన్నెండేళ్లు గుర్తుండిపోయేలా ఉన్నాయని ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సర్వేలోనే సంగమేశ్వరం ఘాట్‌కు మొదటిస్థానం దక్కడం సంతోషంగా ఉందని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అన్నారు. శ్రీశైలం దేవస్థానం ఈవో నారాయణ భరత్ గుప్త, జేసీ–2 రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడు, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ ఎస్ఈ మల్లికార్జునరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరాయుడు, విద్యుత్ ఎస్ఈ భార్గవరాముడు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపు వైఎస్ఆర్ వర్ధంతి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్ధంతి జిల్లా వ్యాప్తంగా ఈనెల 2న నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తామన్నారు. నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండలాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కర్నూలులోని కష్ణకాంత్ ప్లాజాలో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు వైఎస్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎస్బీఐ సర్కిల్లోని వైఎస్ కాంస్య విగ్రహం వద్ద నివాళులర్పిస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. -
సెప్టెంబర్ నుంచి ఎయిర్కోస్టా సర్వీసుల పెంపు
గన్నవరం: విమాన సంస్థ ఎయిర్కోస్టా సెప్టెంబర్ నుంచి కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులను పెంచనుంది. ప్రస్తుతం నడుస్తున్న బెంగళూరుకు మరో అదనపు సర్వీస్ తో పాటు విశాఖపట్నం వరకు సర్వీసులను విస్తరించనుంది. సెప్టెంబర్ 11 నుంచి హైదరాబాద్ మీదుగా జైపూర్‌కు కొ త్త సర్వీస్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఉదయం సర్వీస్ 7.15కు ఇక్కడ్నుంచి బయలుదేరి 8.15కు బెంగళూరు చేరుకుంటుంది. అక్కడినుంచి వైజాగ్‌కు 10.10 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అదే విమానం సాయంత్రం 18.15కు వైజాగ్‌లో బయలుదేరి 19.50కు బెంగళూరు చేరుకుని, అక్కడినుంచి రాత్రి 21.25కు గన్నవరం చేరుకుంటుంది. రెండవ సర్వీస్ ఉదయం 10.30కు వైజాగ్ నుంచి బయలుదేరి బెంగళూరు మీదుగా 13.35కు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి 15.00కు బయలుదేరి బెంగళూరు మీదుగా సాయంత్రం 17.55కు వైజాగ్‌కు చేరుకుంటుంది. ఉదయం 8.00కు ఇక్కడి నుంచి బయలుదేరి 08.50కు హైదరాబాద్ చేరుకుని కొద్ది విరామం అనంతరం బయలుదేరి 11.15కు జైపూర్‌కు చేరుకుంటుం ది. తిరిగి జైపూర్ నుంచి సాయంత్రం 16.00కు బయలుదేరి హైదరాబాద్ మీదుగా రాత్రి 21.15కు ఇక్కడికి చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. -
సేవతోనే సమాజంలో గుర్తింపు
– ప్రతి చెంచుగూడెం నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి – రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి – చెంచుగూడేల అభివద్ధికి కషి – ఎస్పీ ఆకే రవికృష్ణ జూపాడుబంగ్లా/కొత్తపల్లి: సేవతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. డీఎస్పీ సుప్రజ దత్తత గ్రామమైన శివపురం చెంచుగూడెంలో శనివారం ఎస్పీ పర్యటించారు. ఈ సందర్భంగా గూడెం మహిళలు సాంప్రదాయ నత్యంతో ఎస్పీ, డీఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ చెంచుగూడెంలో కలియతిరిగి గూడెంలో నిర్మించిన బీటీ రహదారులు, తాగునీటి కుళాయిలు, నీటితొట్లు, ఆశ్రమ పాఠశాలలో తాగునీటి కుళాయిల ఏర్పాటు వంటి మౌళిక వసతులను పరిశీలించి ప్రారంభించారు. అనంతరం గూడెంలోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌సొసైటీ వారి సహకారంతో 92 మంది కుటుంబాలకు వంటింటి సామగ్రి, దోమతెర, దుప్పటి, టవాళ్లు, అందజేశారు. అలాగే పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున స్కూల్ డ్రస్సులను పంపిణీ చేశారు. అనంతరం నలుగురు గర్భిణిలకు శ్రీమంతం నిర్వహించి వారికి చీరె,సారెలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ చదువుకుంటే ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఎంతో సులువన్నారు. ప్రతి గూడెం నుంచి ఒక ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలన్నారు. ప్రభుత్వం గిరిజనులకు కల్పించిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శివపురం గూడెం అభివద్ధికి తనవంతు సహకారం అందిస్తానాన్నరు. ఓ రోజు గూడెంలో రాత్రి బసచేస్తానని ఆయన గూడెం వాసులకు హామీనిచ్చారు. కార్యక్రమంలో సీఐ శ్రీనాథ్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, ఎస్ఐలు సుబ్రమణ్యం, శివాంజల్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, రాజ్‌కుమార్, రమేష్, శివశంకర్‌నాయక్, ముచ్చుమర్రి పీఎస్ఐ నరసింహ, సర్పంచి సంతోషమ్మ, జడ్పీటీసీలు పురుషోత్తంరెడ్డి, యుగంధర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడున్నా శివపురం గూడెంను మరవను: డీఎస్పీ సుప్రజ విధి నిర్వహణలో తాను ఎక్కడున్నా శివపురం గూడెంను మరవనని, వీలున్నప్పుడల్లా ఇక్కడికి వస్తానని డీఎస్పీ సుప్రజ తెలిపారు. ఎస్పీ ఆకె రవికష్ణ ఆదర్శంతోనే తాను ఈ గూడెంను దత్తత తీసుకున్నానన్నారు. అప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకోసారి గూడెం ప్రజలతో చర్చించి వారికి కావాల్సిన వసతుల కల్పనకు కషి చేశానన్నారు. ఈ మేరకు గూడెంలో బీటీరోడ్లు, తాగునీటి కుళాయిలు, విద్యుత్ సౌకర్యం, పాఠశాలలో తాగునీటి కుళాయిలు, దుస్తువులు వంటి సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. -
దీనుల దేవత మదర్ థెరిస్సా
గుడిహత్నూర్ : మదర్ థెరిస్సా దీనుల పాలిట దేవతగా నిలిచారని ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, స్థానిక సీఎస్ఐ సంఘ కాపరి రెవ జీఎం దినకర్ అన్నారు. మదర్ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక సీఎస్ఐ వెస్లీ చర్చిలో మదర్ చిత్ర పటానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జాతి వైషమ్యాలు లేకుండా దీనజనులకు అండగా నిలిచిన మాతృమూర్తి అని కొనియాడారు. మనుషుల్లోనే దేవుడిని చూశారని పేర్కొన్నారు. నిస్సహాయులకు నిరంతరం సహాయం అందించి విశ్వమాతగా నిలిచారని, ఆమె సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం ప్రత్యేక దీవెనలు, ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు రత్నాకర్, రాజ్‌కుమార్, తారా రవి, సుద్దాల రాజు, ఇందిర సుకన్య, స్వప్న తదితరులు ఉన్నారు. -
సరిహద్దుల్లేని సేవ
వన్‌టౌన్ : సేవకు సరిహద్దులుండవు. వారికి కూడా కృష్ణా పుష్కరాలున్నా.. ఇక్కడ బందోబస్తు కోసం వచ్చారు. çకృష్ణా పుష్కరాలకు కర్ణాటక పోలీసులు బందోబస్తు సేవలందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు కర్ణాటక సర్కారు వారిని పంపించింది. సుమారు 41 మంది పోలీసుల బృందం పది రోజులుగా నగరంలో పుష్కరాలకు వస్తున్న భక్తులకు సేవలందిస్తున్నారు. ఒక డీసీపీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐ స్థాయి అధికారులతో పాటుగా 32 మంది పోలీసులు నగరానికి వచ్చారు. వారిలో కొంతమంది దుర్గాఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అలాగే మరికొంతమంది కనకదుర్గా నగర్ సమీపంలోని దుర్గగుడి అన్నదాన వితరణ కేంద్రం వద్ద సేవలందిస్తున్నారు. వారు సాక్షితో మాట్లాడుతూ పుష్కరాలకు సేవలందించటం ఆనందంగా ఉందన్నారు. -
యువదళం.. సేవా కెరటం
– భక్తుల సేవలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు – శ్రీశైలంలో దాదాపు 600 మంది వలంటీర్ల సేవలు – సేవలతో భక్తులు, అధికారుల మెప్పు పొందుతున్న వైనం ఊరుకాని ఊరు వచ్చిన వారికి ఓ చిన్న మంచి మాట.. కాస్తంత సాయం.. ఎంతో తృప్తిని కలిగిస్తాయి. అలాంటి సాయానికి తాము సదా సిద్ధమని జాతీయ సేవా పథక(ఎన్ఎస్ఎస్) వలంటీర్లు ముందుకొచ్చారు. గొంతెండిన వారికి దప్పిక తీర్చుతూ.. దారి తెలియని వారికి దారి చూపుతూ.. నడవలేని వారికి సాయం చేస్తూ.. దూరప్రాంతాల నుంచి వస్తున్న వారికి మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. పుణ్య స్నానం చేయడానికి వచ్చిన భక్తుల సేవలో తరించి ప్రజల మెప్పు పొందుతున్నారు. కష్ణా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు సేవ చేసేందుకు పాతాళగంగ, లింగాలగట్టు స్నాపు ఘాట్ల వద్ద దాదాపు 600 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, చిన్నారులు వలంటీర్ల సాయంతో సాఫీగా పుణ్యస్నానాలు చేస్తున్నారు. వలంటీర్ల సేవలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగడం లేదు. అధికారులకు తోడుగా వలంటీర్ల సేవలతో భక్తులకు పుణ్య స్నానాలు చేయడం సులభంగా ఉంది. శ్రీశైలంలో కర్నూలులోని ఫర్మెన్, కర్నూలు డిగ్రీ కాలేజ్‌లతోపాటు ఇండియర్ రెడ్‌క్రాస్ సొసైటీ, సున్నిపెంట డిగ్రీకళాశాల వలంటీర్లు భక్తులకు సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి అలుపు సొలుపులేకుండా విధులు నిర్వహిస్తున్నారు. – శ్రీశైలం (కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) సేవ చేయడంటే ఇష్టం: లోకేష్‌కుమార్, డిగ్రీ థర్డ్ ఇయర్, చిత్తూరు. మాది చిత్తూరు జిల్లా. అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సేవ చేయడమంటే ఇష్టం. అందుకోసమే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో వలంటీరుగా చేరాను. ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. పుష్కర భక్తులకు సేవ చేయడం సంతోషంగా ఉంది. దేశ సేవకు ఎప్పుడు ముందుంటాను: ప్రవీణ్‌కుమార్, డిగ్రీ ఫస్టియర్, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, కర్నూలు దేశ సేవ చేసేందుకే ఎన్ఎస్ఎస్లో చేరాను. శ్రీశైలానికి కృష్ణాపుష్కర భక్తులకు సేవచేయడానికి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మా సేవలను భక్తులు గుర్తిస్తే సంతోషిస్తా. వద్ధులకు స్నానం చేయిస్తుంటే ఆనందంగా ఉంది: గాయత్రీ, బీకామ్, ఫస్టియర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సున్నిపెంట వృద్ధులు, మహిళలకు పుష్కర స్నానం చేయించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. కొంతమంది కోపించుకున్నా ఆనందంగా వారిని ఘాట్ దగ్గరకు తీసుకెళ్లి స్నానం చేయిస్తున్నాం. అధికారులు మా సేవలను గుర్తించి ప్రశంసిస్తుంటే నాలో సామాజిక బాధ్యత ఇంకా పెరిగింది. -
సమాజసేవలో స్నేహితులు
నరసన్నపేట : విద్యార్థి దశలో స్నేహితులుగా మారిన ఆ యువకులు సేవల బాటలో పయనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్టూడెంట్స్ ఫర్ సొసైటీ (ఎస్ఎఫ్ఎస్)ని స్థాపించి పట్టణంలోనే కాకుండా పరసర గ్రామాలకు చెందిన పేద కుటుంబాలకు సాయం చేస్తున్నారు. నరసన్నపేటకు చెందిన ముద్దాడ కృష్ణ తేజ, నక్క ప్రవీన్‌కుమార్, శాంతి మోహన్‌లు మంచి స్నేహితులు. వీరి ముగ్గురికీ వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఎస్ఎఫ్ఎస్. అంతకు ముందు తమ వద్ద ఉన్న పాకెట్ మనీతో కనిపించే బీదవారికి సహాయం చేసేవారు. తర్వాత సంస్థను ఏర్పాటు చేసి సేవల పరిధిని పెంచారు. వీరికి ఎన్.వంశీతో పాటు మరో 10 మంది జత కలిశారు. రెండేళ్ల క్రితం ఏర్పడ్డ ఈసంస్థ ప్రస్తుతం నరసన్నపేటలో ప్రతి విద్యార్థికి, యువతకు సుపరిచితం. సేవా కార్యక్రమాలు.. ప్రస్తుతం దీంట్లో 15 మంది సభ్యులు ఉండగా వీరందరూ పాకెట్ మనీ లోంచి కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రమాదాల్లో ఆస్తులు కోల్పోయిన వారికి కూడా సాయపడుతున్నారు. రక్తదానం, మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తూ స్నేహానికి కొత్త అర్థం చెబుతున్నారు. -
ఎగిరిన ఎయిర్ కోస్టా విమానాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్కోస్టా తన సర్వీసులను పునరుద్ధరించింది. విమానాలను లీజుకిచ్చిన సంస్థతో తలెత్తిన వివాదం కారణంగా గురువారం సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఎయిర్కోస్టా శుక్రవారం తొమ్మిది సర్వీసులను నడిపింది. శనివారం నుంచి యదావిధిగా 24 సర్వీసులూ నడుస్తాయని సంస్థ సీఈవో వివేక్ చౌదరి వెల్లడించారు. వివాదం సమసిపోయిందని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యా రాదని చెప్పారు. -
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
కాగజ్‌నగర్ రూరల్ : కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులకు రెండువందల నోటు పుస్తకాలను శుక్రవారం ‘వేకువ’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పంపిణీ చేశారు. ఎన్ఆర్ఐ ఫోరం దుబాయ్‌లోని ఖతార్‌లో నివసిస్తున్న అవదూత గణేష్ ఆధ్వర్యంలో ఈ పుస్తకాలు అందజేశారు. విద్యార్థులు నోటు పుస్తకాలను సద్వినియోగపర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎల్. గాయత్రి, జెడ్పీటీసీ మౌల్కర్ లక్ష్మణ్, ఎంపీటీసీ గజ్జి వాసుదేవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆగిన ఎయిర్కోస్టా సర్వీసులు!
♦ లీజింగ్ కంపెనీతో వివాదం ♦ సమసిపోయిందన్న కంపెనీ ♦ నేటి నుంచి యదావిధిగా సర్వీసులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ; దేశీయ విమానయాన రంగ సంస్థ ఎయిర్కోస్టా తన సర్వీసులను గురువారం పూర్తిగా నిలిపివేసింది. రోజూ 9 నగరాలకు దాదాపు 24 సర్వీసులను నడుపుతున్న ఈ సంస్థ... గురువారం వాటన్నిటినీ నిలిపేసింది. సాంకేతిక కారణాలతోనే నడవలేదని... కాదు ఆర్థిక కారణాల వల్లేనని రకరకాలుగా వార్తలొచ్చాయి. అయితే ఎయిర్ కోస్టా అధికారి మాత్రం లీజుకిచ్చిన సంస్థతో ఉన్న వివాదమే విమానాల నిలిపివేతకు కారణమని చెప్పారు. ‘‘వివాదం సమసిపోయింది. శుక్రవారం నుంచి సర్వీసులు యథావిధిగా నడుస్తాయి’’ అని ‘సాక్షి ’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారాయన. తమ సంస్థకు ఎలాంటి అప్పులు లేవని, నిధుల లేమి సమస్య అసలే లేదని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యల వల్లే సర్వీసులు నిలిపివేశారన్న వార్తలను ఆయన ఖండించారు. దేశవ్యాప్తంగా విమానాలు నడపటానికి పాన్ ఇండియా లెసైన్సు కోసం దరఖాస్తు చేసుకున్న ఎయిర్కోస్టా... 112 సీట్ల సామర్థ్యం ఉన్న ఎంబ్రాయర్ ఈ-190 రకం విమానాలను నడుపుతోంది. ఈ సెగ్మెంట్లో ఖరీదైన ఈ విమానాలను దేశంలో నడిపిస్తున్న సంస్థ ఇదొక్కటే. అందుబాటు ధరలో ఉత్తమ సేవలందించాలన్న లక్ష్యంలో భాగంగానే వీటిని పరిచయం చే సినట్లు ఎయిర్కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని గతంలో చెప్పారు. ముందుకొస్తే ఆర్థిక సహాయం.. ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ పెగాసస్... జులై 27 నుంచి సర్వీసులను నిలిపివేసింది. 2015 ఏప్రిల్ నుంచి సర్వీసులు ప్రారంభించిన ఈ సంస్థ నిధుల లేమితో సతమతమవుతోంది. పెద్ద ఎత్తున అద్దె బాకీ పడటంతో దీనికి లీజుకిచ్చిన మూడు విమానాలనూ లీజింగ్ కంపెనీ స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లిన లీజింగ్ కంపెనీ.. ఎయిర్ పెగాసస్ జాబితా నుంచి ఈ విమానాలను తొలగించాలని కోరింది. తాజా పరిణామాల నేపథ్యంలో పౌర విమానయాన శాఖ స్పందించి... విమానయాన సంస్థలు ముందుకొస్తే సహాయం చేసే విషయాన్ని పరిశీలిస్తామంది. సహాయం కోసం ఏ సంస్థ కూడా తమను సంప్రదించలేదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే పేర్కొన్నారు. -
యాత్రికులకు మెరుగైన సేవలు
నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.నాగలక్ష్మి నెహ్రూనగర్ : కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు మెరుగైన సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. గోరంట్ల హోసన్నా మందిరం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర్ నగర్, పలకలూరు రోడ్డు, జేకేసీ కాలేజీ రోడ్డులో జరుగుతున్న పనులను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాలు సమీపించనున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పుష్కర్ నగర్ వద్ద భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, వాహనాల రాకపోకలకు తగు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే ప్రాంతాల్లో స్థానిక ప్రజలు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సహాయ సహకారాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట అదనపు కమిషనర్ కృష్ణకపర్ధి, ఎస్ఈ గోపాలకృష్ణరెడ్డి, ఈఈ లక్ష్మయ్య, డీసీపీ సత్యనారాయణ, డీఈలు, ఏఈలు ఇతర సిబ్బంది ఉన్నారు. -
108 కష్టాలు
అపర సంజీవనికి సుస్తీ – శిథిలమయిన వాహనాలు – అరిగిన టైర్లు, తుప్పుపట్టిన పరికరాలు – ఓపిక లేన్నట్లు మొరాయింపు – కొత్త వాహనాల మంజూరులో ప్రభుత్వ అలసత్వం కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాల అత్యవసర సేవలు 2005లో ప్రారంభమయ్యాయి. మొదట నాలుగు వాహనాలు(కర్నూలు, ఆదోని, నంద్యాల, శ్రీశైలం).. 2006లో మరో 28 వాహనాలతో ఈ సేవలను విస్తరించారు. అన్ని రకాల ప్రమాదాలు, గర్భిణిలను ఆసుపత్రికి తీసుకెళ్లడం, గుండెపోటు, మూర్చవ్యాధి, ఇతర అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో రోగిని ఆసుపత్రికి తరలించడం వీటి విధి. ఘటనా స్థలం నుంచి ఒక్క ఫోన్ చేస్తే చాలు 15 నిమిషాల్లో చేరుకుని ప్రాణం పోస్తున్నాయి. అప్పట్లో 108 అంబులెన్స్ సేవలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేశాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ సేవలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. ముక్కుతూ.. మూలుగుతూ.. జిల్లాలో మొత్తం 54 మండలాలు ఉండగా.. 32 అంబులెన్స్‌లను మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం 31 వాహనాలు సేవలందిస్తున్నా.. ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. వీటి పనితీరు తెలిసిన డ్రై వర్లు వాహనం కండిషన్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ రోగులకు సేవలందిస్తున్నారు. ప్రతి 3లక్షల కిలోమీటర్లకు వాహనాన్ని మార్చాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఉన్న అన్ని వాహనాలు 4లక్షల కి.మీ.లకు పైగా తిరిగాయి. ప్రతిరోజూ ఏదో ఒక వాహనం వర్క్‌షాప్‌నకు వెళ్లి వస్తోంది. ప్రతి నెలా వాహనాల మరమ్మతుకే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. వాహనంలోని అన్ని పార్ట్‌లూ దాదాపు ఊగిపోతూ, ఊడిపోతూ కనిపిస్తుండటంతో.. వీటిలో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ప్రధానంగా ఆదోని, కోడుమూరు, దేవనకొండ, పత్తికొండ, నంద్యాల, పాణ్యం, బనగానపల్లి, బేతంచర్ల తదితర ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ దారుల్లో ఎక్కడైనా వాహనం ఆగిపోతే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీనికి తోడు పదేళ్లయినా వాహనాల సంఖ్యను పెంచకపోవడం గమనార్హం. దుర్గంధమయంగా జిల్లా కార్యాలయం 108 అంబులెన్స్ నిర్వహణను ఓ కార్పొరేట్ కంపెనీ పర్యవేక్షిస్తోంది. అయితే దీని జిల్లా కార్యాలయం దుర్గంధభరితంగా మారింది. జిల్లా కేంద్రంలోని సి.క్యాంపు సెంటర్ సమీపంలో ప్రభుత్వ క్వార్టర్లో ఈ కార్యాలయాన్ని 2006లో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోకపోవడం.. ప్రహరీ గోడ కూడా లేకపోవడంతో కార్యాలయం పందులకు నిలయంగా మారింది. చుట్టుపక్క ప్రాంతాల వారు సైతం ఇక్కడికే వచ్చి మూత్రవిసర్జన చేస్తున్నారు. విషయాన్ని ఆర్అండ్బీ అధికారుల దష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని తెలుస్తోంది. కొత్త వాహనాలకు ప్రతిపాదనలు ప్రస్తుతం జిల్లాలోని వాహనాల కాలపరిమితి ముగిసింది. వీటి స్థానంలో కొత్త వాహనాలు పంపాలని ప్రతిపాదనలు చేశాం. అదేవిధంగా ఐదు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్) వాహనాలు కూడా కావాలని కోరాం. ఈ వాహనాలు వస్తే గుండెపోటు వచ్చిన రోగులకు, అత్యవసర వైద్యం కావాల్సిన రోగులకు వాహనంలోనే వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్ సౌకర్యంతో ప్రాథమిక చికిత్స అందించే అవకాశం ఉంటుంది. – ఇక్బాల్ హుసేన్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ -
సేవ కోసం సరికొత్తగా...
-
సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి
ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ఆర్కేపీలో లయన్స్ క్లబ్ పట్టణ శాఖ ప్రారంభం రామకృష్ణాపూర్ : సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. తోటి వారికి సహాయం చేయాలన్న మంచి గుణం అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. పట్టణంలోని ఆర్కేసీవోఏ క్లబ్లో మంగళవారం రాత్రి లయన్స్ క్లబ్ పట్టణ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయన్స్ క్లబ్ సభ్యులు ఆయా ప్రాంతాల్లో చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని అన్నారు. లయన్స్ క్లబ్ గవర్నర్ సురేశ్ మాట్లాడుతూ ఆర్కేపీ శాఖకు తమ పూర్తి సహాయసహకారాలు ఉంటాయని అన్నారు. పట్టణానికి చెందిన ఇరుకుల ఆనంద్, పందెన కృష్ణ, కల్కూరి సత్యనారాయణ రూ.60వేలు అందించారు. అనంతరం క్లబ్ ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కంభగోని సుదర్శన్‌గౌడ్, ఎంపీపీ బొలిశెట్టి కనకయ్య, క్యాతనపల్లి సర్పంచ్ జాడి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ శివప్రసాద్, రీజినల్ చైర్మన్ నారాయణరావు, లయన్స్ సిరిపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ పట్టణ కమిటీ.. ఆర్కేపీ లయన్స్‌క్లబ్ నూతన కమిటీని గవర్నర్ సురేశ్ ప్రకటించారు. క్లబ్ అధ్యక్షుడిగా కంభగోని సుదర్శన్‌గౌడ్, కార్యదర్శిగా కట్కం నాగరాజు, కోశాధికారిగా ఆడెపు కృష్ణ, సంయుక్త కార్యదర్శిగా వనం సత్యం, ఉపాధ్యక్షులుగా అరికొళ్ల సంపత్, బొలిశెట్టి కనకయ్య, ప్రభాకర్, మెంబర్షిప్ డైరెక్టర్‌గా సలీం పాషా, పీఆర్వోగా మహేందర్, పమేర్గా ఎల్లంకి గోపాల్, డైరెక్టర్లుగా బత్తుల శ్రీనివాస్, అమర్నాథ్రెడ్డి, వెంకటేశ్, రఘు, రాజబాబు, మల్లేశ్ , శ్రీనివాసులు, సత్యం, రాజేశ్, శ్రీనివాస్‌లను నియమించినట్లు తెలిపారు. -
వన్యప్రాణులనుంచీ రక్షణకు టోల్ ఫ్రీ నెంబర్..
కర్ణాటకః అడవి జంతువులు తమ పంటపొలాలను నాశనం చేస్తున్నాయని, తమ ఖరీదైన పశువులను పులి చంపేసిందని, చెరకు పంటను ఏనుగుల గుంపు తొక్కేసిందంటూ ఆందోళన చెందే మారుమూల గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు వైల్డ్ సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు ప్రభుత్వ పరిహారం వెంటనే అందేట్లుగా గ్రామసస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో కొందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సమస్యలను వెంటనే తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. లబ్ధిదారులకోసం 'వైల్డ్ సేవ' ను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో అవగాహన కల్పించేందుకు స్థానికులు కొందరికి 'ఫీల్డ్ ఏజెంట్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తాము నష్టపోయామంటూ రైతులు దరఖాస్తులు చేసుకొని కార్యాలయాలచుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా.. లబ్ధిదారులకు వెంటనే పరిహారం అందేలా 'వైల్డ్ సేవ' కార్యక్రమం చేపట్టారు. నష్టపోయిన రైతులకు కేవలం నాలుగు రోజుల్లోనే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైల్డ్ లైఫ్ కంజర్వేషన్ సొసైటీ (డబ్ల్యూసీఎస్) ఆధ్వర్యంలో ఓ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ అటవీ శాఖతో కలసి కర్ణాటక, తమిళనాడుల్లోని సుమారు 284 గ్రామాల్లో వన్యప్రాణులనుంచి జనజీవనాన్ని రక్షించడంతోపాటు... వైల్డ్ సేవ కార్యక్రమంతో అంతరించిపోతున్న అడవి జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జనాభా కలిగిన అటవీ ప్రాంతాలమీత దృష్టి సారించి.. అక్కడి ప్రజలకు, వన్యప్రాణులకు నష్టం కలగకుండా ప్రయత్సిస్తున్నారు. సుమారు 20 వేల రూపాయల ఖరీదు చేసే అవును పులి చంపేయడంతో పరిహారంకోసం దరఖాస్తు చేసుకున్నఓ రైతు.. వైల్డ్ సర్వీస్ తో 9 వేల రూపాయలు పొందాడు. అయితే పరిహారం తక్కువ వచ్చినా.. తనకు సంతృప్తిగానే ఉందన్న అతడు... గతంలో పరిహారంకోసం అధికారులచుట్టూ, కార్యాలయాలచుట్టూ తిరగడంతోపాటు పరిహారం పొందేందుకు డబ్బు ఎదురు చెల్లించాల్సి వచ్చేదని తెలిపాడు. అదీకాక ముందుగా పంటదాడులు, చనిపోయిన పశువుల ఫొటోలు తీసుకొని, గంటలకొద్దీ ప్రయాణం చేసి అటవీశాఖ కార్యాలయాలకు వెళ్ళాల్సి వచ్చేదని, సమయానికి అధికారులు లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్తున్నాడు. 'వైల్డ్ సేవ' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఏజెంట్ల ద్వారా సేవలు అందించడంతో వెంటనే పరిహారం పొందగల్గుతున్నట్లు స్థానిక రైతులు చెప్తున్నారు. అంతేకాదు 'వైల్డ్ సేవ' ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ తో తమకు జంతువులనుంచీ రక్షణతోపాటు, సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను అడవిజంతువులు నాశనం చేశాయనో, పశువులను చంపేశాయనో గ్రామస్థులు, రైతులనుంచీ తమకు రోజుకు ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుంటుందని, ఒక్కో ఏజెంట్ కు సుమారు 20 కిలోమీటర్ల పరిథిలో ఉన్న 70 గ్రామాలనుంచీ ఫోన్లు వస్తాయని, వచ్చిన ఎనిమిది గంటల్లోపు అక్కడికి వెళ్ళి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని ఫీల్డ్ ఏజెంట్లు చెప్తున్నారు. ఏడుగురు ఫీల్డ్ ఏజెంట్లతో గత సంవత్సరం ప్రారంభించిన వైల్డ్ సేవా కార్యక్రమంలో భాగంగా పంటలు, ఆస్తుల నష్టం కేసుల్లో ఇప్పటిదాకా సుమారు 3,261 పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' తెలిపింది. దీంతోపాటు.. 148 వరకూ పులులు, అడవికుక్కలద్వారా నష్టపోయిన పశుసంపద, తీవ్ర గాయాలైన 11 మంది, ఇద్దరు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' నివేదించింది. -
రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో సోమవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తనయుడు కోనేరు వంశీ పాల్గొన్నారు. సొసైటీ ఆసిఫాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఈర్ల సునీల్ కుమార్, కో ఆర్డినేటర్ పోతుల కల్యాణ్, కోశాధికారి బుక్క బాలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో సుమారు 51 మంది యువకులు రక్తదానం చేశారు. కోనేరు వంశీ కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథరాం, డాక్టర్ రావుజీ, నాయకులు అంజనేయులు గౌడ్, లంక సునీల్, శ్రీరామ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. -
రామయ్యకు ముత్తంగి సేవ
భద్రాచలం : శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేపట్టారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తెచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. తర్వాత అంతరాలయంలో రామయ్యకు, సీతమ్మ తల్లికి, లక్ష్మణస్వామికి, ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీతాయారమ్మ, ఆంజనేయస్వామిని ముత్యాలతో తయారు చేసిన వస్త్రాలతో అలంకరించి.. ముత్తంగి సేవ చేశారు. తదుపరి స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో వేంచేయింపజేసి.. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి, స్వామివారి, అమ్మవార్ల వంశక్రమాన్ని భక్తులకు తెలియజేశారు. వేద పండితులు వేద విన్నపాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. అనంతరం రామయ్యకు వైభవంగా నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘మూగజీవాలకు సేవచేయడం అదృష్టం’
చేవెళ్ల: పశువుల చికిత్సకు ఉపయోగించే పరికరం ‘ట్రేవీస్‘ను సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా అందజేశారు. ఈ పరికరాన్ని మండల పరిధిలోని ఇక్కారెడ్డిగూడ గ్రామంలో ఆదివారం సత్యసాయి సేవా సంస్థల యూత్ కో-ఆర్డినేటర్ వైసీ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రాంకుచేల్, వెటర్నరీ రిటైర్డ్ ఏడీ డాక్టర్ పున్నయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఉచితంగా మినరల్ మిక్చర్‌ను అందిస్తున్నామని తెలిపారు. మూగ జీవాలకు చికిత్స చేయడం, సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా మినరల్ మిక్చర్‌ను, గడ్డివిత్తనాలను అందజేశారు. పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ రిటైర్డ్ వైద్యాధికారులు భాస్కరరావు, రామకృష్ణ, డాక్టర్ రామన్న, శ్రీనివారావు, సత్యసాయి సేవాసమితి చేవెళ్ల శాఖ కన్వీనర్ శ్రీరంగపురం సత్యం, మాజీ కన్వీనర్ డి.ప్రభాకర్, అల్లవాడ భజన మండలి కన్వీనర్ శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు. -
ఐడియా 3జీ సేవలు ప్రారంభం
ఉప్పునుంతల : మండల కేంద్రంలో శనివారం ఐడియా 3జీ సేవలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తహసీల్దార్ సైదులు కేక్‌ను కట్‌చేసి సేవలు ప్రారంభించారు. ఐడియా డిస్ట్రిబ్యూటర్లు, వినియోగదారులు గ్రామంలో బైక్‌ర్యాలీ నిర్వహించి, టపాకాయలు కాల్చుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఐడియా ఏఎస్ఎమ్ జగనాథంనాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ఐడియా వినియోగదారులకు మరింత మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులో తేవడానికి 3జీ హైస్వీడ్ నెట్వర్క్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలోని బొమ్మన్‌పల్లి, అమ్రాబాద్, లింగాల, మన్ననూర్లలో కూడా 3జీ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఐడియా టీఎస్ఈ భాస్కర్‌రెడ్డి, డిస్టిబ్యూటర్లు సాయిరాం, శ్రీనివాస్, రమేష్‌గౌడ్, విజయభాస్కర్‌లు, వినియోగదారులు సూరం ప్రశాంత్‌రెడ్డి, గణేష్‌గౌడ్, నరేష్, అచ్యుతారెడ్డి పాల్గొన్నారు. -
జల సంరక్షకులకు అవార్డులు
బాలవికాస ఆధ్వర్యంలో ప్రదానం కాజీపేట రూరల్ : అడుగంటుతున్న భూగర్భ జలాలను పెంచి, రైతులకు అండగా నిలిచేందుకు బాలవికాస సాంఘిక సేవా సంస్థ కృషి చేస్తోందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి అన్నారు. కాజీపేట ఫాతీమానగర్ బాలవికాస పీపుల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్లో గురువారం జల వికాసం పేరుతో పూడికతీతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సంరక్షులకు అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా చెరువులలో పూడిక తీస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని 13 జిల్లాలతో పాటు కర్ణాటకలో రెండు జిల్లాల్లో మెుత్తం 750 చెరువులలో సుమారు 4.5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తీశామని, 1.15 కోట్ల ఎకరాల్లో భూసారం పెంచామని వివరించారు. ఈ ఏడాది 25 గ్రామాల్లో పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జలవికాస అవార్డులు.. ఉత్తమ పూడికతీత గ్రామాలకు (జలసంరక్షులు) అవార్డులు అందజేశారు. కర్ణాటకలోని చిక్బుల్లాపూర్ జిల్లా గుంటిగానపల్లి గ్రామస్తులకు ప్రథమ బహుమతి, వరంగల్ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లుకు రెండవ బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆపీసర్ తిరుపతి, కో ఆర్డినేటర్లు ప్రసూన్‌రెడ్డి, శ్రీరాం, రాజ్‌కుమార్, కిరణ్, రాజేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధునికి ఆర్థిక సహాయం
బెజ్జూర్ : తలాయి గ్రామానికి చెందిన బుచ్చయ్య అనే వృద్ధునికి వీపీవో నర్సయ్య బుధవారం ఆర్థిక సాయం చేశారు. సదరు వృద్ధునికి రూ 500 నగదుతో పాటు, వంట సామగ్రి, బట్టలు అందించి ఔదార్యం చాటారు. వృద్ధునికి సహాయం చేసిన వీపీవోను గ్రామస్తులు అభినందించారు. -
విద్యార్థులకు వాలీబాల్ కిట్ అందజేత
చెన్నూర్ : పట్టణంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినిలకు సీఐ సతీశ్‌కుమార్ వాలీబాల్ కిట్టును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థినిలు విద్యతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థినిలకు ఎలాంటి క్రీడా సామగ్రి అవసరం ఉన్నా తమ వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎసై ్స చందర్, ఎంపీడీవో మల్లేశం, ఎంఈవో రాధాకృష్ణమూర్తి, పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ, పీఈటీ అనిత పాల్గొన్నారు. -
సేవలు అద్వితీయం
♦ కంగ్టి పీహెచ్‌సీకి అరుదైన అవార్డు ♦ ఉత్తమ సేవలకు గుర్తింపు ♦ రేపు అవార్డు అందుకోనున్న డాక్టర్ భాస్కర్ కంగ్టి : మారుమూల ప్రాంతమని నిర్లక్ష్యం వహించకుండా.. నిరంతర శ్రమ, సేవలతో ఉత్తమ అవార్డుల జాబితాలో చేరింది కంగ్గి పీహెచ్సీ. మెరుగైన సేవల పరంగా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఆరు పడకలే ఉన్నా ప్రతినెలా 40-45 మంది గర్భిణులకు డెలివరీలు అవుతున్నాయి. ఈ విభాగంలో కంగ్టి పీహెచ్సీ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండగా రాష్ర్టంలో రెండోస్థానం సాధించి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. రేపు అవార్డు స్వీకరణ.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాష్ర్ట ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని డీఎంఈ సెంటర్లో మదర్ అండ్ చైల్డ్ సర్వీసెస్ (ఎంసీఎస్)లో బెస్ట్ పీహెచ్సీ అవార్డు ప్రదానం చేస్తారని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ తెలిపారు. ఆసుపత్రిలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రసవం కోసం కంగ్టి పీహెచ్‌సీకి గర్భిణులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, సిబ్బంది వైద్య సేవలకుగాను ఈ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది అత్యధికంగా515 డెలివరీలు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి పీహెచ్సీలో 515 మంది గర్భిణులకు డెలివరీలు నిర్వహించిన రికార్డు ఉంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పెద్దశంకరంపేటలో నిర్వహిస్తుండడంతో మండలానికి చెందిన కొందరు మహిళలు అంతదూరం వెళ్లలేక పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ర్టకు వెళ్తున్నారు. సిబ్బంది పెరిగితే మరిన్ని సేవలు పీహెచ్సీలో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయ. సిబ్బంది పెరిగితే సేవలు మరింత మెరుగుపడనున్నాయి. మండలంలో 8 ఆరోగ్య ఉపకేంద్రాలు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేక అలంకారప్రాయంగా మారాయి. పీహెచ్సీలో, సబ్ సెంటర్లలో అవసరం మేర సిబ్బంది నియమకాలు జరిగితే వైద్య సేవలు ఇంకను మెరుగుపడతాయని వైద్యాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల పరంపర... ఈ ఆసుపత్రిలో అందించిన సేవలను గుర్తించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహించిన సిబ్బంది జిల్లా స్థాయి ఉత్తమ సేవల పురస్కారాలు అందుకుంటున్నారు. కంగ్టి పీహెచ్‌సీకి చెందిన ముగ్గురు స్టాఫ్ నర్సులు, ముగ్గురు ఏఎన్ఎంలు, ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉత్తమ అవార్డులు అందుకొన్నారు. కాగా ఏఎన్ఎం కమల వరుసగా మూడు సార్లు ఉత్తమ అవార్డు అందుకోవడం విశేషం -
పూలమాలి
సేవను విధి అనుకుని చేసేవారు కొందరు. సేవను స్వభావంగా భావించి చేసేవారు మరికొందరు. శ్రీలత స్వభావంలో సేవ ఉంది. మార్పు కోరే చైతన్యం ఉంది. చైతన్యానికి సరిపడా పోరాట స్వభావం ఉంది. మొగ్గలను రాల్చే తోటమాలులతో పోరాడి వాటిని కాపాడి ఫలవంతం చేస్తున్న శ్రీలత సిసలైన పూలమాలిగా కనిపిస్తుంది. సరిగ్గా ఏడాది కిందటి మాట. మదనపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినులంతా తరగతి గది నుంచి బయటకొచ్చారు. తమ క్లాస్ టీచర్‌ను చుట్టుముట్టి సీరియస్‌గా ఏదో చెప్పారు. అవునా... అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన టీచర్ ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి పదండి అంటూ విద్యార్థినులను వెంట తీసుకుని పావుగంటలో ఊళ్లోని ఓ ఇంటికెళ్లింది. అక్కడ జరిగే పెళ్లి తతంగాన్ని చూసి పద్నాలుగేళ్ల వయసున్న పిల్లకు పెళ్లేంటని గొడవ పడి ఆ బాల్యవివాహాన్ని అడ్డుకుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న పది మండలాల్లో బాల్య వివాహాలు చేయాలంటే పెద్దలు వెనకడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. బాల్యవివాహాలు సగానికి సగం తగ్గాయి. ఇక్కడి జనంలో ఇంతటి మార్పు రావడానికి ‘రోప్స్’ సంస్థే కారణం. దానిని నడిపే శ్రీలత, ధనశేఖరన్ దంపతులు ఆరేళ్ల పోరాటానికి ఫలితం ఇప్పటి వరకూ 500కు పైగా బాల్య వివాహాలు ఆగిపోవడం. పులివెందుల నుంచి... పులివెందుల ప్రాంతానికి చెందిన శ్రీలత, ధనశేఖరన్ దంపతులు 1989లో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంను కార్యస్థలిగా చేసుకుని రూరల్ ఆర్గనైజేషన్ ఫర్ పావర్టీ ఎరాడికేషన్ సర్వీసెస్ (ఆర్వోపీఈఎస్- రోప్స్) పేరిట ఎన్జీవోను నెలకొల్పారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, తండాల్లో సాంఘిక దురాచారాలకు గురవుతూ నలిగిపోతున్న గిరిజన మహిళలు, వారి పిల్లలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా రోప్స్ సేవలు ప్రారంభించింది. పేద పిల్లలకు చదువు చెప్పడం, వైద్యం అందించడం, అనాథలను అక్కున చేర్చుకోవడం, విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధి కల్పించడం, సాంఘిక దురాచారాలను అరికట్టడం వంటి సామాజిక సేవలతో ఈ సంస్థ ఇక్కడున్న 20కి పైగా గ్రామాల్లో మంచి గుర్తింపు పొందింది. అనాథలైన పిల్లలతో పూర్తిగా మమేకమైన శ్రీలతను ‘దేవుడిచ్చిన అమ్మ’గా పిల్లలు భావిస్తారు. అందుకే ఈ నెల 8న పలమనేరులో జరిగిన ‘మదర్స్‌డే’ వేడుకల్లో ఈ ప్రాంతపు ప్రముఖులు ఆమెను ‘బెస్ట్ మదర్’గా ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. సాటివారి ఆనందం కోసం... తన ప్రయాణం ఎలా మొదలయ్యిందో శ్రీలత వివరిస్తూ - ‘‘మాది కడప జిల్లా పులివెందుల. అమ్మ రత్నమ్మ, నాన్న యూసఫ్. ఇద్దరూ టీచర్లే. నా చదువంతా రాయచోటిలోనే. 1981-85 మధ్య హైదరాబాద్‌లోని ఉస్మానియాలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత రాయచోటికి దగ్గర్లోని దేవపట్ల ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ ఇన్చార్జిగా ఉద్యోగంలో చేరాను. 1988లో ధనశేఖరన్తో పెళ్లయ్యింది. జనం కోసం ఏదైనా చేయాలన్న ఆయనలోని తపన, ఆరాటాన్ని గుర్తించాను. చిన్నప్పటి నుంచీ నాలోనూ అదే కోరిక. మనం బతుకుతూనే మన పక్క వారు ఆనందంగా బతికేలా చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందని నమ్మాం. పెళ్లైన నాలుగు నెలల తర్వాత ఉద్యోగ రీత్యా బంగారుపాళ్యం చేరుకున్నాం. బంగారుపాళ్యం, గంగవరం, పలమనేరు, పుంగనూరు, పెద్ద పంజాణి మండలాల్లో పేదరికంతో అల్లాడిపోతున్న ఎస్సీ, ఎస్టీలను చూస్తే గుండె తరుక్కుపోయేది. 1989లో వీరి కోసం రోప్స్‌ను ప్రారంభించాం. మొదట 5 గ్రామాల్లో మహిళా మండళ్లు ఏర్పాటు చేశాం. సాయంత్రం పూట చదువు లేని ఆడోళ్లందరినీ సమావేశపరిచి వారికి పొదుపు, ఆరోగ్యం, స్వయం ఉపాధి మీద మంచి మాటలు చెప్పేవాళ్లం. అంతేకాకుండా వాళ్లను వెంటబెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి రేషన్‌కార్డులు, పింఛన్లు, ధ్రువీకరణ పత్రాలు ఇప్పించడం చేసే వాళ్లం. మాధవన్తోపు ప్రాంతంలో వెట్టిచాకిరిలో మగ్గుతున్న 23 ఎస్సీ కుటుంబాలకు విముక్తి కలిగించి వారికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ద్వారా ఇళ్లు కట్టించాం. ఇప్పుడా కుటుంబాలన్నీ బుట్టలల్లుకుంటూ స్వయం ఉపాధిని పొందుతున్నాయి. ఆ తర్వాత రోప్స్ సంస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. మొదట 15 బాల్వాడీలు... రోజంతా ఎండలో ఎండుతూ చంకలో ఏడాది బిడ్డనెత్తుకుని కూలి పనులకు వెళ్లే మహిళల్ని చూస్తే బాధేసేది. వీళ్ల బిడ్డలను మా బిడ్డలుగా చూడాలనుకున్నాం. వెంటనే 0-5 ఏళ్ల మధ్యనున్న పిల్లల కోసం పలమనేరు, గంగవరం మండలాల్లో 15 చోట్ల బాల్వాడీ కేంద్రాలను ప్రారంభించాం. పిల్లలకు పోషకాహారం పెట్టడంతో పాటు వారికి ఆట పాటల విద్యాబుద్ధులు నేర్పాం. ఐరాల, బెరైడ్డిపల్లి, బంగారుపాళ్యం మండలాల్లో గర్భవతులు, కాన్పులు పూర్తయిన మహిళల్ని కలిసి వైద్య పరంగా సలహాలివ్వడమే కాకుండా వారికి ఉచితంగా మందులు, ఇంజక్షన్లు ఇచ్చేవాళ్లం. అప్పట్లో ఇక్కడి గ్రామాల్లో కాన్పులు కష్టంగా ఉండేవి. ఊళ్లల్లో ఉండే మంత్రసానులు కాన్పు సమయంలో పేగు కోసేందుకు కత్తులు, బ్లేడులు వాడే వాళ్లు. దీంతో అమాయకులైన మహిళలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవాళ్లు. దీన్ని నివారించడానికి ఇద్దరు నర్సులను ఎంపిక చేసి సురక్షిత కాన్పులపై ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. ఎక్కడ కాన్పులుంటే అక్కడికి వీరిని పంపేవాళ్లం. బాల్య వివాహాలపైనే ఫోకస్.... చిత్తూరు జిల్లాలోని పలమనేరు, పూతలపట్టు, మదనపల్లి, పీలేరు, చిత్తూరు నియోజకవర్గాల పరిధిలోని చాలా గ్రామాల్లో చదువుసంధ్యల్లేక, ఎండు కట్టెలమ్ముకునే ఆడపిల్లల్ని చూసి బాధ కలిగేది. పదమూడేళ్లకే పెద్దలు వీళ్ల పెళ్లిళ్లు చేసే వాళ్లు. దీంతో కాన్పు సమయంలో పెద్ద ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. దీన్ని నివారించాలని నిర్ణయించుకున్నాం. 2009 నుంచి బాల్య వివాహాలపై పోరాటం ప్రారంభించాం. పోలీసులు, చైల్డ్‌లైన్ సహకారంతో బాల్య వివాహాలను అరికట్టే ప్రయత్నాలు మొదలు పెట్టాం. ఇప్పటికి సుమారు 500కి పైగా బాల్య వివాహాలను ఆపగలిగాం. ఓసారి బాల్య వివాహాలపై మేం మైకు ప్రచారం జరుపుతుంటే తరగతి గదిలోంచి విన్న ఓ విద్యార్థిని బైటకొచ్చి మాకు ఫోన్ చేసింది. రేపు తన పెళ్లనీ, వచ్చి సాయం చేయమని కోరింది. వెంటనే వెళ్లాం. ఆమెకు అండగా నిలబడ్డాం. ఇప్పుడా అమ్మాయి లక్షణంగా చదువుకొని, తిరుపతి రుయా ఆస్పత్రిలో ఉద్యోగం సంపాదించుకుంది. శివరాత్రికి శ్రీకాళహస్తి, మొగిలి క్షేత్రాల్లో ఈ తరహా పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. మా బృందాలతో వెళ్లి పెద్దలను ఒప్పించి ఆయా వివాహాలను ఆపేవాళ్లం. ఈ పనిని ఇంకా కొనసాగిస్తాం. ప్రజలు మాకు అండగా నిలుస్తారని భావిస్తున్నాం’’ అని అంటున్న శ్రీలతలో ఈ సమాజానికి ముఖ్యంగా బాలబాలికలకు ఏదైనా చేయాలనే నిజమైన తపన కనిపించింది. - గంగిశెట్టి వేణుగోపాల్, సాక్షి ప్రతినిధి, తిరుపతి అందరూ అమ్మా... అనే పిలుస్తారు... 2006లో జరిగిన ఓ సంఘటన మనసును కదిలించింది. ఎయిడ్స్ వ్యాధితో కన్నుమూసిన భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలున్నారు. ఐదారేళ్లు ఉన్న ఈ పిల్లలు అనాథలయ్యారు. వీరిని దగ్గరకు తీసుకుని ఓ ఆయాను ఏర్పాటు చేశాం. వీరిని చూసి మరికొంత మంది వచ్చారు. ఈ విధంగా కారుణ్య చిల్డ్రన్స్ హోం ఏర్పడింది. ఇప్పుడు 50 మంది పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. వీళ్లంతా నన్ను అమ్మా... అంటారు. నాకు చాలా సంతోషమేస్తుంది. నేను వెళ్తే చాలు... నా చుట్టూ చేరిపోతారు. రోజంతా వాళ్లతో కబుర్లు చెప్పినా తనివి తీరదు మరి. మా ఇద్దరి జీతాలతో పాటు నెదర్లాండ్స్‌కు చెందిన టెరిడా సంస్థ ఏటా కొంత ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో పాటు చైల్డ్‌లైన్ సంస్థ వారు అయిదుగురు ఉద్యోగులకు వేతనాలు అందిస్తూ సాయం చేస్తోంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా సంస్థను నడుపుతున్నాం. - పి. శ్రీలత, రోప్స్ సంస్థ నిర్వాహకురాలు -
ఆరోగ్యశ్రీ ఆగింది..!
► ప్రైవేటు ఆస్పత్రుల్లో నేటి నుంచి సేవలు బంద్ ► ఆస్పత్రులకు రూ. 250 కోట్లు బకాయి పడిన ప్రభుత్వం ► తొమ్మిది మాసాలుగా చెల్లించకపోవడం వల్లే ఈ నిర్ణయం ► ఆరోగ్యశ్రీతో పాటు ఈహెచ్ఎస్ సర్వీసులూ నిలిపివేత ► తెలంగాణ ప్రైవేటు, నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు, నర్సింగ్ హోమ్‌లలో సాధారణ ఆరోగ్యశ్రీ సర్వీసులతోపాటు ఎంప్లాయూస్ హెల్త్ స్కీం సర్వీసులనూ నిలిపివేస్తున్నట్లు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు బకాయి పడిన ఆరోగ్యశ్రీ బిల్లులను మే 1లోగా చెల్లించాలని లేదంటే ఆ మరుసటి రోజు నుంచే సేవ లను నిలిపివేయనున్నట్లు ఇటీవల ఆ సంఘం ప్రతినిధులు డాక్టర్ సురేశ్‌గౌడ్, టి.నర్సింగ్రెడ్డిలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం తెలిసిందే. తెలంగాణవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో 190 ఆస్పత్రులు ఉండగా వీటిలో 60 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. మిగిలిన 130 ఆస్పత్రుల్లో కార్పొరేట్, ప్రెవేటు నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. వీటిలో సుమారు 80 వేల శస్త్రచికిత్సలు చేయగా ఇందుకు ప్రభుత్వం రూ. 250 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత తొమ్మిది నెలల నుంచి బిల్లులు చెల్లించక పోవడంతో నర్సింగ్‌హోమ్‌లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి. బకాయిలు చెల్లించాల్సిందిగా కోరుతూ ఇప్పటికే పలుమార్లు వైద్య ఆరోగ్య మంత్రితోపాటు ట్రస్ట్ సీఈవోకు విన్నవించామని, వారి నుంచి స్పందన లేనందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని డాక్టర్ సురేశ్‌గౌడ్, టి.నర్సింగ్రెడ్డిలు పేర్కొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఇందుకు సహకరిస్తున్నాయని తెలిపారు. అయితే దీనిపై తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతరాయం కలిగించొద్దు: ఆరోగ్య శ్రీ బకాయిలను సోమవారం నుంచి చెల్లిస్తామని, వాటి సేవలకు అంతరాయం కలిగించొద్దని నెట్వర్క్ ఆస్పత్రులను తెలంగాణ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ ఎం.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో కోరారు. -
సిమ్ కార్డు లేకుండా రోమింగ్ ఇంటర్నెట్!
వినియోగదారులకు లెనోవో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. సిమ్ కార్డు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు, గ్లోబల్ రోమింగ్ సేవలనూ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లినపుడు వినియోగదారులు రోమింగ్ అప్ డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ టెలికాం సంస్థలు ఇటీవల ఉచిత రోమింగ్ సౌకర్యాన్ని కల్పించినా మిగిలిన ప్రైవేటు వినియోగదారులంతా రోమింగ్ ఛార్జీల మోత భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో లెనెవో 'కనెక్ట్' అనే అత్యాధునిక సదుపాయాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఒక్కసారి రీచార్జి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ ప్లాన్ ఎక్కడైనా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ముందుగా ఈ సరికొత్త ప్లాన్‌ను చైనాలో ప్రవేశపెడుతోంది. వినియోగదారులకు రోమింగ్ ఖర్చులు తగ్గించేందుకు లెనోవో కృషిచేస్తోంది. ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు బిల్డ్ ఇన్ కనెక్టివిటీ ఉన్న పీసీ, టాబ్లెట్ వంటి ఏ పరికరాల్లోనైనా లోకల్ సిమ్ తోనే ఏదేశంలోనైనా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవను వాడుకునేలా చేస్తోంది. దీంతో వినియోగదారులకు బిల్లుల మోతను తగ్గిస్తోంది. కనెక్ట్ ఫీచర్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే సుమారు 50 దేశాల్లో ఎక్కడ తిరిగినా రోమింగ్ సమస్య లేకుండా ఇంటర్నెట్ వాడుకునే వీలు కల్పిస్తోంది. థింక్ ప్యాడ్ ల్యాప్ టాప్‌కూ త్వరలో ఈ సదుపాయాన్ని యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లోని మరో 45 దేశాల్లో అందించేందుకు లెనొవో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ గా పేరు తెచ్చున్న లెనొవో ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. తాజాగా ఈ కనెక్ట్ వర్చువల్ డేటా నెట్వర్క్ సేవలను ప్రారంభించి గ్లోబల్ రోమింగ్ సర్వీసుతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ కానుంది. తరచుగా ప్రయాణాలు చేసేవారికి, వ్యాపారస్తులకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని లెనొవో వైస్ ప్రెసిడెంట్ వాంగ్ ష్వాయి చెబుతున్నారు. -
రాజీవ్‌శర్మ సర్వీస్‌ను పొడిగించండి
♦ మరో ఆరు నెలలు అనుమతించండి ♦ ప్రధానికి లేఖ ఇచ్చిన సీఎం కేసీఆర్ ♦ మే నెలతో ముగియనున్న పదవీకాలం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సర్వీసును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఓ లేఖను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అందజేశారు. సీఎస్ రాజీవ్‌శర్మ పదవీ కాలం మే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును ఆరు నెలలు పెంచాలని సీఎం ఈ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇదే సందర్భంలోనే ఈ లేఖను అందించారు. నిబంధనల ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీసు గడువు పెంచాలంటే మూడు నెలల ముందు కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐఎస్ పెన్షన్ రూల్స్ సెక్షన్ 16 ప్రకారం సదరు అధికారికి ఆరు నెలల వరకు గడువు పొడిగించవచ్చు. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ లేదా ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారులైతే సర్వీసు కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేంద్రంతోనే సంప్రదింపులు జరిపితే డీవోపీటీ సీఎస్ పదవీ కాలాన్ని మూడు నెలలకు మాత్రమే పెంచే అవకాశముంది. అందుకే సీఎం ఈ లేఖను నేరుగా ప్రధానికి ఇచ్చి ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరారు. కొత్త రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత ఉన్న దృష్ట్యా ప్రత్యేక కేసుగా పరిగణించి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్‌శర్మ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2014 జూన్ 2 అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రాజీవ్‌శర్మ కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై ఉన్నారు. కేంద్ర హోంశాఖలో జాయింట్ సెక్రెటరీ హోదాలో పని చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ ఏడాది మే 31న రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగియనుంది. ఆరు నెలల పాటు పొడిగిస్తే నవంబర్ నెలాఖరు వరకు ఆయనే తెలంగాణ సీఎస్‌కు కొనసాగుతారు. -
మహిళలకోసం 'బైక్సీ పింక్' సర్వీసులు