నిధులిచ్చినా... ఖర్చు చేయరా..
నిధులిచ్చినా... ఖర్చు చేయరా..
Published Sun, Sep 4 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
– నెలాఖరులోపు వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి చేయాలి
– రాష్ట్ర మున్సిపల్ పుర పరిపాలన శాఖ అదనపు సంచాలకులు వెంకట్రామిరెడ్డి
కర్నూలు (టౌన్): ‘మున్సిపాల్టీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఖర్చుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర మున్సిపల్ పుర పరిపాలన శాఖ అదనపు సంచాలకులు వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక నగరపాలకలోని కౌన్సిల్ హాలులో జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మున్సిపాల్టీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో చేపడుతున్న అభివద్ధి పనులు, తదితర వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కింద ప్రభుత్వం జిల్లాకు రూ. 12.30 కోట్లు మంజూరు చేసిందన్నారు. 2015–16 సంవత్సరానికి కర్నూలు కార్పొరేషన్‌కు రూ. 1.51 కోట్లు, ఆదోని రూ. 54.59 లక్షలు, నంద్యాల రూ. 65.80 ల„ý లు, ఎమ్మిగనూరు 31. 22 లక్షలు, డోన్ రూ. 2.19 కోట్లు, నందికొట్కూరు 15.41 లక్షలు, గుడూరు రూ. 2. 31 కోట్లు, ఆళ్లగడ్డ రూ. 2.70 కోట్లు, ఆత్మకూరు రూ. 2. 15 కోట్లు చొప్పున నిధులు విడుదల చేశామన్నారు. గూడూరు మున్సిపాల్టీ పనితీరు అధ్వానంగా ఉందని అసంతప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ స్కూళ్లలో అభివద్ధి పనులకు కేటాయించిన నిధుల్లో డోన్, నందికొట్కూరు, గూడూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాల్టీలు ఏమాత్రం ఖర్చు చేయలేదన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా బహిరంగ మల విసర్జనను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకోని వారిని గుర్తించి జరిమానా వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈనెలాఖరులోపు అన్ని మున్సిపాల్టీల్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. సమావేశంలో కర్నూలు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ . రవీంద్రబాబు, మెప్మా పీడీ రామాంజనేయులు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు, డోన్, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు మున్సిపాల్టీల కమిషనర్లు పాల్గొన్నారు.
Advertisement