Court Cancels Cop’s Sacking: సమాజ దృక్కోణం నుంచి వివాహేతర సంబంధాన్ని "అనైతిక చర్య"గా చూడగలిగినప్పటికీ, దానిని "దుష్ప్రవర్తన"గా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కానిస్టేబుల్ తన కుటుంబంతో కలిసి నివసించే పోలీస్ హెడ్‌క్వార్టర్‌లోనే వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు తనను సర్వీస్ నుంచి తొలగించడంతో అతను సవాలు చేస్తూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు.
"అయితే పిటిషనర్ క్రమశిక్షణలో భాగంగా వివాహేతర సంబంధం దుష్ప్రవర్తనే. సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత వ్యవహారమని బలవంతపు ఒత్తిళ్లు లేదా దోపిడీ ఫలితంగా కాదు అని" కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రవర్తనా నియమాలు 1971 ప్రకారం దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురాలేం అని కోర్టు స్పష్టం చేసింది.
అంతేకాదు అతన్ని ఒక నెలలోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అతను విధుల నుంచి తొలగించబడినప్పటి నుంచి అతని వేతనంలో 25 శాతం చెల్లించాలని జస్టిస్ సంగీతా విషెన్ సంచలన తీర్పు వెలువరించారు. మరోవైపు పిటిషనర్ కానిస్టేబుల్ తన అభ్యర్థనలో సంబంధం ఏకాభిప్రాయమని, ప్రతిదీ తమ స్వంత ఇష్టపూర్వకంగా జరిగిందని వాదించాడు. అంతేకాదు పోలీసు డిపార్ట్‌మెంట్ సరైన విచారణ ప్రక్రియను అనుసరించలేదని, తనను తొలగిస్తూ వచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు సదరు మహిళతో కానిస్టేబుల్ అక్రమ సంబంధానికి సంబంధించిన సీసీఫుటేజ్‌ని 2012లో నగర పోలీసు ఉన్నతాధికారులకు అందించి మరీ వితంతువు కుటుంబం అతని పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనికి షోకాజ్ నోటీసులు పంపారు. ఆ జంట కూడా సంబంధాన్ని అంగీకరించడంతో పోలీసులు విచారణ చేయడం ఇరు పార్టీలను ఇబ్బంది పెట్టడమే అవుతుందని భావించి పూర్తి విచారణ జరపలేదు.
ఆ తర్వాత జాయింట్ పోలీస్ కమీషనర్ అతను డిపార్ట్‌మెంట్‌లో కొనసాగితే ప్రజలకు పోలీస్‌శాఖ పై విశ్వాసం సన్నగిల్లుతుందంటూ 2013లో అతన్ని విధుల నుంచి తొలగించారు. అయితే కోర్టు మాత్రం విచారణ జరపకపోవడంతోనే అతన్ని విధుల నుంచి తొలగించి రద్దు చేసి పక్కన పెట్టిందని ఉత్తర్వులో పేర్కొంది. అంతేకాదు పోలీసు సర్వీస్ నిబంధనల చట్టం ప్రకారం ఒక పోలీసును తొలగించడానికి ఇది కారణం కాదని, పైగా అది అతని వ్యక్తిగత వ్యవహారమని కోర్టు స్పషం చేసింది.
(చదవండి: రవిదాస్ దేవాలయంలో ప్రార్థనలు చేసిన మోదీ)
Comments
Please login to add a commentAdd a comment