sack
-
గోనె సంచుల సమస్యకు చెక్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ఇందులో 5 లక్షల టన్నుల వరకు బాయిల్డ్ రకాలను కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించింది. ముఖ్యంగా ధాన్యం తరలింపులో గోనె సంచుల సమస్యను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు తరలిస్తోంది. ఇక్కడ మిల్లులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చేసిన ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. వినియోగ చార్జీలు చెల్లింపు కేంద్ర ప్రభుత్వ నిబంధల ప్రకారం గోనె సంచుల (ఇప్పటికే ఒకసారి వినియోగించినవి) వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్/ఆర్డీవోలు తమ పరిధిలోని మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ, రైస్ మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఆయా సీజన్లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు. -
పామును పట్టి, బస్తాలో బంధించి.. ఆసుపత్రిలో యువకుని హల్చల్!
జార్ఖండ్‌లోని పలాములో నాగుపాము ఒక వ్యక్తిని కాటేసింది. దీనిని గమనించిన బాధితుని కుమారుడు ఆ పామును బస్తాలో బంధించి ఆసుపత్రికి తీసుకువచ్చాడు. నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుని, అక్కడి వైద్యునికి ఆ పాము చూపించి, ఇది తన తండ్రిని కాటువేసిందని తెలిపాడు. ఒక్కసారిగా అంత పెద్ద పామును చూడగానే డాక్టర్ భయపడిపోయారు. వెంటనే ఆ యువకుడు మాట్లాడుతూ తన తండ్రికి సరైన వైద్యం అందించేందుకే తాను పామును ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిపాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం రహ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదర్ మానా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఉంటున్న ఒక వ్యక్తి ఇంటిలోకి పెద్ద నాగుపాము చొరబడింది. తరువాత అది ఆ ఇంటిలోని ఒకరిని కాటువేసింది. దీంతో అతని ఆరోగ్యం విషమించింది. ఇంటిలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. వెంటనే అతని కుమారుడు ఆ పామును పట్టుకుని ఒక బస్తాలో బంధించాడు. తన తండ్రితో పాటు దానిని కూడా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వైద్యునికి ఆ పామును చూపించి, ఇదే తన తండ్రిని కాటువేసిందని చెప్పాడు. కాగా ఆ పామును చూసి అక్కడున్నవారంతా హడలిపోయారు. వెంటనే ఆ వైద్యుడు అతనితో పామును బయట విడిచిపెట్టాలని కోరారు. పాముని బయట విడిచిపెట్టాక కుమారుడు మాట్లాడుతూ ఇంటిలోకి చొరబడిన పామును పట్టుకునే ప్రయత్నంలో ఉండగా అది తన తండ్రిని కాటు వేసిందని, వెంటనే దానిని బంధించి ఆసుపత్రికి తీసుకు వచ్చానని, ఆ పామును చూసి, వైద్యులు తన తండ్రికి మరింత మెరుగైన చికిత్స అందిస్తారని భావించానని అన్నాడు. ఇది కూడా చదవండి: డ్రైవర్ లేకుండా మెట్రో రైలు -
రెడిక్యులస్..నా పాపులారిటీ తగ్గుతోందంటావా? ట్విటర్ ఉద్యోగిపై వేటు
సాక్షి,ముంబై: ట్విటర్ ఇంజనీర్ ఉద్యోగి ఒకరు పొరపాటున డేటాను డిలీట్ చేయడమే బుధవారం నాటి సర్వర్ డౌన్ సమస్యకు కారణమని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఉద్యోగాల కోత నేపథ్యంలో బుధవారం టెక్నికల్ సమస్యను పరిష్కరించే నాధుడే లేకపోయాడట. ట్విటర్ యూజర్ల ట్వీట్లు, ఫాలోవర్లు తదితర అంశాలపై ట్విటర్ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ సెటింగ్స్ నిర్వహణలోనే యాక్సిడెంటల్‌గా డేటా డిలీట్ అయిందట. ఇది ఉలా ఉంటే మరో కీలక పరిణామం మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెర్జ్ నివేదిక ప్రకారం ట్విటర్ మస్క్ తన అకౌంట్‌ను ఒక రోజు ప్రయివేట్ ఖాతాగా మార్చాడు. తద్వారా ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుందా, లేదా, తన ట్వీట్ల ఎంగేజ్మెంట్, ప్రభావం తదితర విషయాలపై స్టడీ చేస్తున్నాడట. ఈ మేరకు ఇంజనీర్లు, సలహాదారుల బృందంతో రివ్యూ చేస్తున్నాడు. అయితే ఈ పరిశీలనలో తనకు 100 మిలియన్లకు మించి ఫాలోయర్లు ఉండగా కేవలం పదివేల ఇంప్రెషన్లు మాత్రమే వస్తున్నాయని తెలిసి మస్క్ అసహనంతో రగిలి పోయాడు. దీనిపై అసంతృప్తితో మస్క్ ఇచ్చిన వివరణను అంగీకరించని ఉద్యోగిపై వేటు వేశాడు మస్క్. రెడిక్యూలస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడని నివేదించింది. మస్క్ ట్వీట్లపై ప్రజల ఆసక్తి క్షీణిస్తోందని సదరు ఇంజనీరు వాదించాడు. దీనికి సంబంధించి గూగుల్ ట్రెండ్స్ డేటాను కూడా చూపించాడు. అంతేకాదు ట్విటర్ అల్గారిథమ్ మస్క్ పట్ల పక్షపాతంగా ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఇంజనీర్ చెప్పాడు. అంతే మరుక్షణమే యూ ఫైర్డ్ అంటూ మస్క్ మండిపడటం హాట్ టాపిగ్ నిలిచింది. అయితే తాజా పరిణామం ట్విటర్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా ట్విటర్ డేటా ప్రకారం మస్క్ చేసిన ట్వీట్లు మామూలుగా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తాయనీ, కానీ మస్క్ 128 మిలియన్ల ఫాలోయర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని ఫార్చ్యూన్ నివేదిక వ్యాఖ్యానించింది -
వివాహేతర సంబంధాన్ని దుష్ప్రవర్తనగా పరిగణించలేం!: కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు
Court Cancels Cop’s Sacking: సమాజ దృక్కోణం నుంచి వివాహేతర సంబంధాన్ని "అనైతిక చర్య"గా చూడగలిగినప్పటికీ, దానిని "దుష్ప్రవర్తన"గా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కానిస్టేబుల్ తన కుటుంబంతో కలిసి నివసించే పోలీస్ హెడ్‌క్వార్టర్‌లోనే వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు తనను సర్వీస్ నుంచి తొలగించడంతో అతను సవాలు చేస్తూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు. "అయితే పిటిషనర్ క్రమశిక్షణలో భాగంగా వివాహేతర సంబంధం దుష్ప్రవర్తనే. సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత వ్యవహారమని బలవంతపు ఒత్తిళ్లు లేదా దోపిడీ ఫలితంగా కాదు అని" కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రవర్తనా నియమాలు 1971 ప్రకారం దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురాలేం అని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు అతన్ని ఒక నెలలోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అతను విధుల నుంచి తొలగించబడినప్పటి నుంచి అతని వేతనంలో 25 శాతం చెల్లించాలని జస్టిస్ సంగీతా విషెన్ సంచలన తీర్పు వెలువరించారు. మరోవైపు పిటిషనర్ కానిస్టేబుల్ తన అభ్యర్థనలో సంబంధం ఏకాభిప్రాయమని, ప్రతిదీ తమ స్వంత ఇష్టపూర్వకంగా జరిగిందని వాదించాడు. అంతేకాదు పోలీసు డిపార్ట్మెంట్ సరైన విచారణ ప్రక్రియను అనుసరించలేదని, తనను తొలగిస్తూ వచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సదరు మహిళతో కానిస్టేబుల్ అక్రమ సంబంధానికి సంబంధించిన సీసీఫుటేజ్‌ని 2012లో నగర పోలీసు ఉన్నతాధికారులకు అందించి మరీ వితంతువు కుటుంబం అతని పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనికి షోకాజ్ నోటీసులు పంపారు. ఆ జంట కూడా సంబంధాన్ని అంగీకరించడంతో పోలీసులు విచారణ చేయడం ఇరు పార్టీలను ఇబ్బంది పెట్టడమే అవుతుందని భావించి పూర్తి విచారణ జరపలేదు. ఆ తర్వాత జాయింట్ పోలీస్ కమీషనర్ అతను డిపార్ట్మెంట్లో కొనసాగితే ప్రజలకు పోలీస్‌శాఖ పై విశ్వాసం సన్నగిల్లుతుందంటూ 2013లో అతన్ని విధుల నుంచి తొలగించారు. అయితే కోర్టు మాత్రం విచారణ జరపకపోవడంతోనే అతన్ని విధుల నుంచి తొలగించి రద్దు చేసి పక్కన పెట్టిందని ఉత్తర్వులో పేర్కొంది. అంతేకాదు పోలీసు సర్వీస్ నిబంధనల చట్టం ప్రకారం ఒక పోలీసును తొలగించడానికి ఇది కారణం కాదని, పైగా అది అతని వ్యక్తిగత వ్యవహారమని కోర్టు స్పషం చేసింది. (చదవండి: రవిదాస్ దేవాలయంలో ప్రార్థనలు చేసిన మోదీ) -
గోనె సంచిలో మహిళ శవం.. ఎవరిదో తెలిసింది
ముంబై : కొద్దిరోజుల క్రితం ముంబైలోని అక్ష బీచ్‌లో గోనె సంచిలో దొరికిన శవం ఎవరిదో పోలీసులు గుర్తించారు. మృతురాలు ఈస్ట్ కాందివ్లీ, పోయిసర్‌కు చెందిన నందిని పంకజ్‌రాయ్(22)గా తేలింది. కేసు వివరాల్లోకి వెళితే.. నందిని.. భర్త, మామతో కలిసి ముంబైలోని కాందివ్లీలో నివాసం ఉంటోంది. డిసెంబర్ ప్రారంభంలో ఆమె భర్త సొంతూరుకు వెళ్లాడు. నందిని, మామతో కలిసి ఇంట్లోనే ఉంటోంది. అయితే కొద్దిరోజుల తర్వాత నందిని తల్లిదండ్రులు ఆమె సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. డిసెంబర్ 8వ తేదీ వరకు ఫోన్ చేసి, విసిగిపోయారు. దీంతో ఆమె తండ్రి కాందివ్లీలోని ఇంటికి వెళ్లాడు. (2019లో చనిపోయి.. 2020లో బ్రతికొచ్చింది!) ఇంటికి తాళం వేసి ఉంది. చుట్టు ప్రక్కల వారిని అడిగి చూశాడు. ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసుతో రంగంలోకి దిగిన పోలీసులకు నందిని మామపై అనుమానం వచ్చింది. శుక్రవారం అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ టీవీ ఫొటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు. నందిని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆమె మరణానికి గల కారణాలు తెలియరానున్నాయి. -
రోడ్డుపై గోనె సంచి కదిలింది.. ఏంటాని చూస్తే!..
ముంబై : గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఐదేళ్ల చిన్నారిని గోనె సంచిలో కుక్కి, రోడ్డుపై పడేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రేణు అనే పాపను గోనె సంచిలో కుక్కి, వాసాయ్లోని ఫాథర్వాడి పెట్రోల్ పంప్ సమీపంలోని రోడ్డుపై పడేశారు. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అప్పటివరకు మత్తులో ఉన్న పాపకు స్పృహ వచ్చింది. గోనె సంచిలోనుంచి బయటకు రావటానికి ప్రయత్నించసాగింది. ( తోటి నర్సుల బాత్రూం వీడియోలు ప్రియుడికి..) ఆ రోడ్డుపై వెళుతున్న జనం గోనె సంచి కదలటాన్ని గమనించి, దాన్ని విప్పి చూడగా ఓ చిన్నారి బయటకొచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పాపను వివరాలు అడగ్గా.. తన పేరు రేణు అని, తల్లిదండ్రుల పేర్లు గోపాల్, గాయత్రి అని చెప్పింది. ఇంటి అడ్రస్ చెప్పలేకపోయింది. పోలీసులు రేణును దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పాప తల్లిదండ్రుల కోసం విచారణ చేపట్టారు. -
రాజ్‌నాథ్ సింగ్‌ను తొలగించండి..
న్యూఢిల్లీ: రాజ్యాంగ పీఠికలోని సోషలిస్ట్, సెక్యులర్ పదాలపై చెలరేగిన వివాదం పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా మరోసారి రాజుకుంది. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు శాంతారాం నాయక్ మండిపడ్డారు. లోక్‌సభలో హోంమంత్రి రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. బాధ్యత మర్చిపోయి వ్యవహరించిన ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన సెక్యులర్ పదం దుర్వినియోగమవుతోంని రాజ్‌నాథ్ గురువారం నాడు లోక్‌సభలో చేసిన ప్రసంగంపై ఆయన స్పందించారు. ఇలా రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తూ చట్టసభలో మాట్లాడడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని నాయక్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని హోంమంత్రి ఉల్లంఘించారని ఆరోపించారు. తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆయనను తొలగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తిచేశారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యల వల్లే దేశంలో అసహనం వ్యాప్తి చెందిందని నాయక్ మండిపడ్డారు. కాగా రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలన్న శివసేన డిమాండ్‌పై చర్చకు సిద్ధమని గతంలో ప్రకటించి ఎన్డీయే సర్కారు చిక్కుల్లో పడింది. ఆ పదాలు లేని పాత రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని ప్రచురించి ఓ ప్రకటన విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ పదాలను తొలగించే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. -
భారత్ హాకీ కోచ్ కు ఉద్వాసన
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పాల్ వాన్‌పై వేటుపడింది. ఐదు నెలల క్రితం భారత్ కోచ్‌గా నియమించిన వాన్‌ను పదవి నుంచి తొలగించారు. కాగా వాన్‌కు ఉద్వాసన పలకడానికి గల కారణాలను హాకీ ఇండియా వెల్లడించలేదు. హాకీ ఇండియా అధ్యక్షుడు నరేందర్ బాత్రాతో విబేధాలు రావడం వల్లే వాన్‌ను తొలగించారని సమాచారం. ఇటీవల జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ సందర్భంగా బాత్రాతో వాన్ ఘాటైన పదజాలం వాడినట్టు మీడియా కథనం. మలేసియాతో మ్యాచ్ అనంతరం బాత్రా ఆటగాళ్లతో మాట్లాడేందుకు మైదానంలోకి వెళ్లగా.. వాన్ జోక్యం చేసుకుని మైదానం వీడి వెళ్లాల్సిందిగా చెప్పినట్టు సమాచారం. -
ఉగ్రవాదుల్లా చేసినందుకు ఉద్యోగాలు ఊడాయి
లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎలా ఉరితీస్తారో అలాంటి చర్యనే మాక్గా నిర్వహించినందుకు ఆరుగురు ఉద్యోగులను బ్రిటన్‌కు చెందిన ఓ బ్యాంక్ తొలగించింది. వీరంతా కూడా ఆసియా వాసులే కావడం గమనార్హం. హెచ్ఎస్బీసీ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మాదిరిగా ఓ ఎనిమిది నిమిషాల వీడియో రూపొందించి దానిని ఆన్లైన్లో పెట్టారు. దాని ప్రకారం ఐదుగురు వ్యక్తులు నల్లటి దుస్తులు ధరించి నవ్వుతుండగా మరో వ్యక్తికి ఆరెంజ్ దుస్తులు వేసి మొకాళ్లపై కూర్చుబెట్టారు. అందులో ఒకరు 'అల్లాహు అక్బర్' అని గట్టిగా కేక వేయగా మొకాళ్లపై నిల్చున్న వ్యక్తి మెడపై ఫేక్ కత్తిని ఉంచారు'. ఈ వీడియో బయటకుపొక్కడంతో బ్యాంకు అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యను తాము ఏమాత్రం సహించేది లేదని, వారందరిని తొలగించాలని నిర్ణయించామని చెప్పారు.