న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పాల్ వాన్పై వేటుపడింది. ఐదు నెలల క్రితం భారత్ కోచ్గా నియమించిన వాన్ను పదవి నుంచి తొలగించారు. కాగా వాన్కు ఉద్వాసన పలకడానికి గల కారణాలను హాకీ ఇండియా వెల్లడించలేదు.
హాకీ ఇండియా అధ్యక్షుడు నరేందర్ బాత్రాతో విబేధాలు రావడం వల్లే వాన్ను తొలగించారని సమాచారం. ఇటీవల జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ సందర్భంగా బాత్రాతో వాన్ ఘాటైన పదజాలం వాడినట్టు మీడియా కథనం. మలేసియాతో మ్యాచ్ అనంతరం బాత్రా ఆటగాళ్లతో మాట్లాడేందుకు మైదానంలోకి వెళ్లగా.. వాన్ జోక్యం చేసుకుని మైదానం వీడి వెళ్లాల్సిందిగా చెప్పినట్టు సమాచారం.
భారత్ హాకీ కోచ్ కు ఉద్వాసన
Published Mon, Jul 20 2015 5:04 PM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM
Advertisement
Advertisement