india hockey coach
-
భారత్ హాకీ కోచ్ కు ఉద్వాసన
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పాల్ వాన్‌పై వేటుపడింది. ఐదు నెలల క్రితం భారత్ కోచ్‌గా నియమించిన వాన్‌ను పదవి నుంచి తొలగించారు. కాగా వాన్‌కు ఉద్వాసన పలకడానికి గల కారణాలను హాకీ ఇండియా వెల్లడించలేదు. హాకీ ఇండియా అధ్యక్షుడు నరేందర్ బాత్రాతో విబేధాలు రావడం వల్లే వాన్‌ను తొలగించారని సమాచారం. ఇటీవల జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ సందర్భంగా బాత్రాతో వాన్ ఘాటైన పదజాలం వాడినట్టు మీడియా కథనం. మలేసియాతో మ్యాచ్ అనంతరం బాత్రా ఆటగాళ్లతో మాట్లాడేందుకు మైదానంలోకి వెళ్లగా.. వాన్ జోక్యం చేసుకుని మైదానం వీడి వెళ్లాల్సిందిగా చెప్పినట్టు సమాచారం. -
వైదొలగిన టెర్రీ వాల్ష్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ మంగళవారం రాజీనామా చేశారు. తన కాంట్రాక్టుపై స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), హాకీ ఇండియాతో జరిగిన చర్చలు విఫలం కావడంతో కోచ్ పదవిని వాల్ష్ వదులుకున్నారు. ఆయన కాంట్రాక్టు రేపటితో ముగియనుంది. గత నెల 19నే వాల్ష్ రాజీనామా సమర్పించి తర్వాత మనసు మార్చుకున్నారు. తన నియమ నిబంధనలకు లోబడి కొత్త ఒప్పందం కుదుర్చుకుంటే పదవిలో కొనసాగే విషయాన్ని పునఃపరిశీలిస్తానని వాల్ష్ ఇంతకుముందు ప్రకటించారు. అయితే చర్చలు విఫలం కావడంతో కోచ్ పదవి నుంచి వాల్ష్ వైదొలగారు. -
ఇండియన్ హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా కోచ్ టెర్రీ వాల్ష్ తన పదవికి రాజీనామా చేశారు. పారితోషికం విషయంలో హాకీ ఇండియాతో చోటు చేసుకున్న విభేదాలతో వాల్ష్ రాజీనామాకు సిద్ధమైయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్ గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే భారత హాకీ జట్టు కోచ్ గా నియమితులైయ్యారు. నాలుగు ప్రపంచకప్‌లు, మూడు ఒలింపిక్స్‌లు ఆడిన అనుభవం ఉన్న వాల్ష్ ను హాకీ కోచ్ గా ప్రవేశపెట్టిన అనంతరం భారత్ హాకీ మెరుగైన ఫలితాలను సాధించింది. తాజాగా దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకోవడంలో కూడా వాల్ష్ పాత్ర కొనియాడకుండా ఉండలేం. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం హాకీ ఇండియాతో పేమెంట్ల వ్యవహారంలో చోటు చేసుకున్న విభేదాలే అతని రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.1990లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన మలేసియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల ప్రధాన కోచ్‌గా పనిచేశారు.త్వరలో రియో ఒలింపిక్స్ లో కూడా హాకీ ఇండియా ఆశించిన ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో వాల్ష్ రాజీనామా బాట పట్టారు.