Palamu Boy Reached Hospital Looking Snake in Sack - Sakshi
Sakshi News home page

పామును పట్టి, బస్తాలో బంధించి.. ఆసుపత్రిలో యువకుని హల్‌చల్‌!

Published Sun, Jul 23 2023 9:16 AM | Last Updated on Sun, Jul 23 2023 6:09 PM

palamu boy reached hospital locking snake in sack - Sakshi

జార్ఖండ్‌లోని పలాములో నాగుపాము ఒక వ్యక్తిని కాటేసింది. దీనిని గమనించిన బాధితుని కుమారుడు ఆ పామును బస్తాలో బంధించి ఆసుపత్రికి తీసుకువచ్చాడు. నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుని, అక్కడి వైద్యునికి ఆ పాము చూపించి, ఇది తన తండ్రిని కాటువేసిందని తెలిపాడు. ఒక్కసారిగా అంత పెద్ద పామును చూడగానే డాక్టర్‌ భయపడిపోయారు. వెంటనే ఆ యువకుడు మాట్లాడుతూ తన తండ్రికి సరైన వైద్యం అందించేందుకే తాను పామును ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిపాడు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం రహ్లా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోదర్‌ మానా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఉంటున్న ఒక వ్యక్తి ఇంటిలోకి పెద్ద నాగుపాము చొరబడింది.  తరువాత అది ఆ ఇంటిలోని ఒకరిని కాటువేసింది. దీంతో అతని ఆరోగ్యం విషమించింది. ఇంటిలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. వెంటనే అతని కుమారుడు ఆ పామును పట్టుకుని ఒక బస్తాలో బంధించాడు. తన తండ్రితో పాటు దానిని కూడా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. 

ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వైద్యునికి ఆ పామును చూపించి, ఇదే తన తండ్రిని కాటువేసిందని చెప్పాడు. కాగా ఆ పామును చూసి అక్కడున్నవారంతా హడలిపోయారు. వెంటనే ఆ వైద్యుడు అతనితో పామును బయట విడిచిపెట్టాలని కోరారు. పాముని బయట విడిచిపెట్టాక కుమారుడు మాట్లాడుతూ ఇంటిలోకి చొరబడిన పామును పట్టుకునే ప్రయత్నంలో ఉండగా అది తన తండ్రిని కాటు వేసిందని, వెంటనే దానిని బంధించి ఆసుపత్రికి తీసుకు వచ్చానని, ఆ పామును చూసి, వైద్యులు తన తండ్రికి మరింత మెరుగైన చికిత్స అందిస్తారని భావించానని అన్నాడు. 
ఇది కూడా చదవండి: డ్రైవర్‌ లేకుండా మెట్రో రైలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement