
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం నెలపర్తిపాడులో దారుణం జరిగింది. తండ్రి పిల్లి రాజు గణపతినగర్ లాకుల వద్ద తన ఇద్దరు పిల్లలు సందీప్, కారుణ్యలను కాలువలో పడేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో పదేళ్ల బాబు బయటపడ్డాడు. ఆరేళ్ళ పాప మృతదేహం లభ్యమైంది.
తండ్రి పిల్లి రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. పిల్లల తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా పరారయ్యాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment