చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం | Navratri First Day Temples are Echoing with Chants of Jai Mata | Sakshi
Sakshi News home page

చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం

Published Sun, Mar 30 2025 8:06 AM | Last Updated on Sun, Mar 30 2025 10:24 AM

Navratri First Day Temples are Echoing with Chants of Jai Mata

న్యూఢిల్లీ: ఈరోజు(ఆదివారం) నుండి చైత్ర నవరాత్రులు(Chaitra Navratri) ప్రారంభమయ్యాయి. వివిధ ఆలయాల్లో నేటి నుంచి ఏప్రిల్ ఆరు వరకు అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. చైత్ర నవరాత్రి మొదటి రోజున దుర్గాదేవిని శైలపుత్రి  రూపంలో కొలుస్తారు. దేశంలోని పలు అమ్మవారి దేవాలయాల్లో ఉదయం నుంచే సందడి నెలకొంది. భక్తులు అమ్మవారి తొలి హారతిని తిలకించేందుకు ఆలయాలకు తరలివచ్చారు.
 

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని వారణాసిలో చైత్ర నవరాత్రుల మొదటి రోజున భక్తులు అష్టభుజ మాత ఆలయానికి వస్తున్నారు. మొదటి చైత్ర నవరాత్రి మంగళ హారతి సందర్భంగా కాశీలోని విశాలాక్షి శక్తిపీఠం నుంచి పంపిన గంగా జలంతో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అభిషేకించారు.

ఢిల్లీలో చైత్ర నవరాత్రి మొదటి రోజున ఛత్తర్‌పూర్‌లో కొలువైన ఆద్య కాత్యాయనీ శక్తిపీఠ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి నుంచే భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. ఢిల్లీలోని ఝండేవాలన్ ఆలయంలో చైత్ర నవరాత్రుల తొలి హారతి సందర్భంగా భారీగా భక్తుల రద్దీ కనిపించింది.

ఢిల్లీలోని ఝండేవాలన్(Jhandewalan) ఆలయ పూజారి అంబికా ప్రసాద్ పంత్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ రోజు చైత్ర నవరాత్రుల మొదటి రోజు. ఈరోజు దుర్గాదేవిని శైలపుత్రి రూపంలో పూజిస్తారు. అమ్మవారిని హిమాలయ పుత్రిగా భావిస్తారు. అందుకే శైలపుత్రి అని పిలుస్తారు’ అని తెలిపారు.

మహారాష్ట్రలోని ముంబైలో ముంబాదేవి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ ఆలయం ముంబైలోని భూలేశ్వర్ ప్రాంతంలో ఉంది. ముంబా దేవి  ముంబైని రక్షిస్తారని చెబుతారు. ఆమెను పూజించడం ద్వారా శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు.

చైత్ర నవరాత్రులలో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజించే సంప్రదాయం వస్తోంది. ఈ పవిత్ర రోజులలో ఉపవాసం ఉండి, పూజలు చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని అంటారు. చైత్ర నవరాత్రుల తొలిరోజునే హిందూ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి: Encounter: ముక్తార్ గ్యాంగ్ షూటర్ అనుజ్ హతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement