Temples
-
మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..!
చరిత్రలో చాలావరకు మగవాళ్లు కట్టిన అద్భుత స్మారక కట్టడాల గురించే కథలు కథలుగా చదివాం. అలాంటి అద్భుత కళా నైపుణ్య కట్టడాలకు మహిళలు కూడా అంకురార్పణ చేశారనే విషయం తెలుసా..!. ఆ మహిళలు తమ ప్రేమ, భక్తి, ఆశయాలకు చిహ్నంగా వాటిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అవికూడా యూనెస్కో గుర్తింపుని దక్కించుకున్నాయి. ఆ అద్భుత స్మారక చిహ్నలు ఎక్కడున్నాయి..? వాటిని నిర్మించిన ఆ శక్తిమంతమైన నారీమణులు ఎవరు..?కట్టడ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఆ మహిళల చొరవను బట్టి స్త్రీలు ఆనాడే తమ వ్యక్తిత్వం, భావాలను, గుర్తింపు వ్యక్తపరిచారని సుస్పష్టంగా తెలుస్తోంది. వారంతా ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్‌ని నిర్మించిన షాజహాన్ వలే తన భర్తలపై ఉన్నప్రేమ, అభిలాష, వారి విజయాల గుర్తుగా ఈ అద్భుత స్మారక కట్టడాలను నిర్మించారు. వాటి నిర్మాణ తీరు, శిల్పకళా సంపద, మలిచిన విధానం ఆ మహిళ సృజనాత్మకతకు, అభిరుచికి ప్రతిబింబంగా ఉన్నాయి. తొలి గార్డెన్ సమాధి(హుమయూన్ సమాధి, ఢిల్లీ)..ఇది 16వ శతాబ్దపు అద్భుతమైన కట్టడం. మొఘల్ సామ్రాజ్ఞి బేగా బేగం తన భర్త మొఘల్ చక్రవర్తి హుమయూన్ జ్ఞాపకార్థం నిర్మించింది. పెర్షియన్ వాస్తు శిల్పులు దీన్ని అద్భుతంగా నిర్మించారు. భారతదేశంలోని తొలి గార్డెన్ సమాధి. మొఘల్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన కట్టడం ఇది. చుట్టూ ఒక మాదారిగా కనిపించేలా పాలరాతితో నిర్మించారు. పచ్చని తోటల మధ్య కొలువుదీరిని అద్భుత కట్టడంలా పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఈ స్మారక చిహ్నం యునెస్కో గుర్తింపును కూడా పొందింది. రాణి కి వావ్, గుజరాత్పాట్న రాణి కి వావ్ 11వ శతాబ్దంలో భర్త రాజు భీమా జ్ఞాపకార్థం నిర్మించింది. హిందూ దేవతలు, పౌరాణిక వ్యక్తులు, ఖగోళానికి సంబంధించిన అద్భుతాలు తదితరాలను వర్ణించేలా శిల్పాల గ్యాలరీ ఉంటుంది. ఇది సెవెన్ స్టెప్‌వెల్ ఆర్కిటెక్చర్. అంటే ఇది ఏడు మెట్ట నుయ్యి మాదిరిగా ఉంటుంది. ఒక్కో మెట్టు దిగుతూ ఉంటే శిల్పాల గ్యాలరీ మరింత ఎక్కువగా చూడొచ్చు. ఒకరకంగా ఇది నీటి పరిరక్షణ కోసం ఆనాడే అద్భతంగా తీర్చిదిద్ధిన నుయ్యిలా ఉంటుంది.విరూపాక్ష ఆలయం, కర్ణాటకభారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి ఈ విరుపాక్ష ఆలయం. దీన్ని ఏడవ శతాబ్దంలో లోకమహదేవి రాణి ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ దేవాలయ అభివృద్ధికి ఆమె ఎంతగానో తోడ్పాటును అందించింది. లోకమహదేవి ఈ ఆలయాన్ని తన భర్త రాజు విక్రమాదిత్య II శత్రురాజులపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించింది. ఇక్కడ హంపీ శిల్పాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ ఆలయం ముందు నిర్మించిన గ్రాండ్ గోపురం, వివరణాత్మక శిల్పాలు, క్లిష్టమైన స్థంభాల నిర్మాణం చూపురులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయంలోని ఆచారాలు, అక్కడే నివాసం ఉండే ఏనుగుల సందడి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇతిమాడ్-ఉద్-దౌలా, ఆగ్రామొఘల్ రాణి ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ ఎదురుగా ఇతిమాద్-ఉద్-దౌలా కట్టడం ఆభరణంలా ఉంటుంది. దీన్ని మొఘల్‌ని దశాబ్దం పైగా పాలించిన శక్తిమంతమైన మహారాణి నూర్ జహాన్ నిర్మించింది. ఆమె తన తండ్రి మీర్జా ఘియాస్ బెగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. యమునా ఒడ్డున నిర్మించిని సుందరమైన స్మారక చిహ్నం ఇది. ఇది ఆమె నిర్మాణాత్మక దృష్టిని, రాజకీయ శక్తిని ప్రతిబింబిస్తుంది.తాజ్-ఉల్-మస్జిద్, భోపాల్భోపాల్ బేగం కేవలం పాలకురాలేకాదు, కళ, వాస్తుశిల్పానికి పోషకులు కూడా. తాజ్-ఉల్-మస్జిద్ మసీదుల కీరీటంగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఏళ్లతరబడి నిర్మించి అద్భుత కట్టడం ఇది. పింక్ ఇసుకరాయి గోపురాలు, అత్యున్నత మినారెట్స్, విశాలమైన ప్రాంగణంతో అందంగా తీర్చిదిదదారు. ఇది బారతదేశంలో ఉన్న అతిపెద్ద మసీదులలో ఒకటి. దాని స్కైలైన్ ఆకృతి మహిళా పాలకురాలి ప్రత్యేక చరిత్రకు సాక్షిగా నిలిచింది.మిర్జన్ కోట, కర్ణాటకఈ కోట నిర్మాణం మనోహరంగా ఉంటుంది. దీన్ని 16వ శతాబ్దంలో రాణి చెన్నాభైరదేవి పాలనలో నిర్మించారు. మసాలా వాణిజ్యంలో ఆధిపత్యం కారణంగా ఆమెను "పెప్పర్ క్వీన్" అని పిలుస్తారు. ప్రస్తుతం పాక్షికంగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ..ఆ కర్ణాట రాణి గొప్ప చరిత్రకు గుర్తుగా ప్రజల మనసులో నిలిచిపోయింది.దక్షణేశ్వర్ కాళి ఆలయం, కోల్‌కతా19వ శతాబ్దంలో రాణి రష్మోని నిర్మించిన దక్షిణేశ్వర కాళి ఆలయం. కాళి దేవత ఆరాధన కోసం హుగ్లీ నదితీరాన నిర్మించిన పుణ్యక్షేత్రం. చరిత్రలో రాజులు అధికారం లేదా విజయం కోసం ఇలాంటి దేవాలయాలను నిర్మించినట్లు విన్నాం. అయితే ఆ రాజుల మాదిరిగా కాకుండా రాణి రష్మోని పరోపకార బుద్ధితో ఆధ్యాత్మిక స్థలాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మించింది. ఆలయ నిర్మాణం అత్యంత విలక్షంగా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భోధనలకు అర్థం పట్టేలా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. కోలకతా అనగానే గుర్తొచ్చే కాళిమాత ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. ప్రతి ఏడాది వేలాది భక్తులు, సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి తరలివస్తున్న గొప్ప క్షేత్రంగా అలరారుతోంది.(చదవండి: 'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
దేవాలయాలు, ఆశ్రమాలపై కూటమి కన్ను
-
హిందూ ధర్మం విశ్వజనీనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యం. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజందే ప్రధాన పాత్ర. సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణలో ఆలయాల పాత్ర కీలకం’ అని ఏపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవీస్, డాక్టర్ ప్రమోద్ సావంత్ అన్నారు. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో మూడు రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్న ‘అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ఎక్స్పో’ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 – ఫౌండర్, అంత్యోదయ ప్రతిష్ఠాన్ ప్రవీణ్ దారేకర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు.అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలుఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయాల పరిరక్షణ, భద్రత, ఆర్థిక స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ముందంజలో ఉన్నప్పటికీ, విశ్వాసం ముందు అవి ఏమీ చేయలేవని చెప్పారు. టీటీడీ పాలకమండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణ వర్గాలను సభ్యులుగా చేరుస్తామన్నారు. మతపరమైన టూరిజాన్ని పెంచేందుకు అటవీ, ఎండోమెంట్, పర్యాటక శాఖ మంత్రులతో ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అర్చకుల వేతనాన్ని, నిరుద్యోగ వేద పండితులకు గౌరవ వేతనం పెంచుతామని, ఆలయాలు, వేద వ్యవహారాల్లో స్వయంప్రతిపత్తికే అవకాశం కల్పిస్తామని తెలిపారు. తిరుమల బాలాజీని మోసం చేస్తే ఆయన క్షమించడని చెప్పారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులను సాంస్కృతిక, ఆర్థిక ఉద్యమంలో ఏకం చేయడంలో ఈ సమావేశం చొరవ చూపడం హర్షణీయమని అన్నారు.భారత ఆలయాలు శక్తి స్వరూపాలు : దేవేంద్ర ఫడ్నవీస్ ప్రపంచ దేశాల ప్రజలు భారత ఆలయాలను ఆధ్యాత్మిక నిలయాలుగా, శక్తి స్వరూపాలుగా పరిణగనిస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. దేశంలోని దేవాలయాల చరిత్ర అతి పురాతనమైనదని, దక్షణ భారత్‌లోని ఆలయాలు చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయని తెలిపారు. వేల ఏళ్ల క్రితం ఇలాంటి ఆలయ నిర్మాణం ఎలా జరిగిందని ఆరా తీస్తూ భక్తి భావానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 55 శాతం మంది ధర్మ పర్యటనల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూడటానికి ఆధ్యాత్మిక సంపద, సంస్కృతే కారణమని వివరించారు. సనాతన భక్తి భావం పెంపొందించడంలో, హిందువుల సమైక్యత, సంస్కృతిని కాపాడడంలో ఈ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో దోహదపడుతుందని తెలిపారు.ధర్మ రక్షణే భారత ప్రజల సిద్ధాతం: డాక్టర్ ప్రమోద్ సావంత్ధర్నాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అనేదే భారత ప్రజల సిద్ధాంతమని గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ చెప్పారు. గోవులను పూజించడం, రక్షించడం మన కర్తవ్యం కావాలని అన్నారు. హిందువులు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పవిత్రతకు మూల స్తంభాలైన దేవాలయాలను పరిరక్షించాల్సిన భాద్యత ప్రతి హిందువుకూ ఉందని చెప్పారు.ఎక్స్పో ప్రధాన ఉద్దేశమిదీ..అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో 58 దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పాల్గొని, 1581 దేవాలయాలను ఓకే వేదికపై అనుసంధానించడం లక్ష్యంగా ఈ ఎక్స్పో నిర్వహించారు. ప్రధానంగా స్థిరత్వ, పునరుత్పాదక ఇంధనం, దేవాలయ పాలన, దేవాలయ ఆర్థిక వ్యవస్థ, లక్ష్యాలు, స్మార్ట్ టెంపుల్ పరిష్కారాలు వంటి అంశాలపై మూడు రోజుల పాటు సెమినార్లు నిర్వహించనున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కులకర్ణి, ఐటీసీ పూర్వ చైర్మన్ ప్రసాద్ లాడ్ భవిష్యత్ కార్యక్రమాలను వివరించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద నాయక్, సాధు ప్రతినిధి ఆచార్య గోవింద్ దేవ్ మహారాజ్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ముకుంద్ తదితరులు ప్రసంగించారు. ఈ సభలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, గోవా రాష్ట్ర మంత్రులు ఆశీష్ షెలార్, విశ్వజిత్ రాణే, ప్రభుత్వ సలహాదారు రోహన్ కౌంటే తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా మార్గదర్శకాలు జారీ చేయలేం
న్యూఢిల్లీ: దేవాలయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులకు(వీఐపీలు) అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రాచమర్యాదలు చేస్తూ ప్రత్యేక దర్శనాలు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు తిరస్కరించింది. బృందావన్‌లోని శ్రీరాధా మదన్మోహన్ ఆలయంలో సేవాయత్‌గా పని చేస్తున్న విజయ్‌కిశోర్ గోస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక మర్యాదలు చేయడం, సామాన్యులు ప్రత్యేక దర్శనం చేసుకోవాలంటే అదనంగా రుసుము వసూలు చేయడాన్ని ఆయన సవాలు చేశారు. 12 జ్యోతిర్లాంగాల్లో వీఐపీ దర్శనాల సంస్కృతి విపరీతంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. పౌరులంతా సమానమేనని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 సూచిస్తున్నట్లు గుర్తుచేశారు. దర్శనాలకు అదనంగా రుసుము వసూలు చేయడం సమానత్వ హక్కులను, మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. విజయ్‌కిశోర్ గోస్వామి పిటిషన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా ప్రభుత్వాలను ఆదేశిస్తూ తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. సమస్యను పరిష్కరించడానికి సమాజం, ఆలయ మేనేజ్మెంట్ కమిటీలే చొరవ తీసుకోవాలని సూచించింది. ఆలయాల్లో ప్రముఖులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని, భక్తులందరినీ సమానంగా చూడాలన్న అభిప్రాయం తమకు కూడా ఉందని పేర్కొంది. కానీ, మార్గదర్శకాలు మాత్రం జారీ చేయలేమని వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 పరిధిలోకి ఈ కేసు వస్తుందని తాము భావించడం స్పష్టంచేసింది. పిటిషన్‌ను విచారించలేం కాబట్టి తిరస్కరిస్తున్నామని తెలియజేసింది. అయితే, పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడం అనేది వీఐపీ సంస్కృతిని అరికట్టే సంబంధిత అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకుండా అడ్డుకోలేదని ఉద్ఘాటించింది. ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక మర్యాదలు చేయకుండా స్థానికంగా చర్యలు తీసుకోవచ్చని పరోక్షంగా తేల్చిచెప్పింది. -
‘కృష్ణా’తీరం.. ఆధ్యాత్మిక తరంగం
తెలంగాణ – కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా మండలానికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. జీవ నదులు.. రాజుల సంస్థానాలు.. రుషులు తపస్సు చేసిన ప్రాంతాలు.. ఆధ్యాత్మిక క్షేత్రాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఘనకీర్తి సముపార్జించుకున్న ప్రాంతం కృష్ణా మండలం. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క విశిష్టతతో ప్రసిద్ధికెక్కాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రసిద్ధ ప్రాంతాలు ఆదరణకు నోచుకోక మరుగున పడ్డాయి. చారిత్రాత్మక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధిపరచాలని స్థానికులు కోరుతున్నారు. – కృష్ణానారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలంలో 22 కిలోమీటర్ల మేర కృష్ణానది (Krishna River) 3 కిలోమీటర్ల మేర భీమా నది ప్రవహిస్తోంది. ఈ రెండు నదులు తంగిడి గ్రామంలో కలుస్తాయి. నదీ తీర ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు (Temples) ఉన్నాయి. కుసుమర్తి గ్రామంలో కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించే భీమా నది ఒడ్డున కృష్ణ ద్వైపాయన మఠం ఉంది. ఆ రుషి మంత్రాలయం గురు రాఘవేంద్ర మహాస్వాములకు ముందే ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారు. ఆయన తపస్సుకు సాక్షాత్తు భగవంతుండు ప్రత్యక్షమైనట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ వేద పాఠశాల కూడా నిర్వహించినట్టు ఇక్కడి పురోహితులు చెబుతున్నారు. తంగిడిలో సంగమ క్షేత్రం.. కృష్ణా, భీమా నదులు కలిసే తంగిడి సంగమ క్షేత్రంలో ఎందరో రుషులు తపస్సు ఆచరించినట్టు ఆధారాలున్నాయి. నది అటువైపు కర్ణాటక (Karnataka) ప్రాంతంలో ప్రసిద్ధ శివాలయం ఉంది. అక్కడ ఇప్పటికీ ఈ ప్రాంత విశిష్టత గురించి శిలా శాసనాలు ఉన్నాయి. ఇటువైపు కొంతకాలం క్రితం దత్త పీఠాధిపతి విఠల్‌బాబా దత్త భీమేశ్వర ఆలయం నిర్మించారు. గూర్జాల్ గ్రామ సమీపంలోని కృష్ణానది మధ్యలో ఒక బండపై శివలింగం, నంది విగ్రహాలు ఉన్నాయి. అవి కదిలిస్తే కదులుతాయి. కానీ నది ప్రవాహానికి అంగుళం కూడా కదలవు. ఇక్కడ నది ఒడ్డునే సిద్ధలింగ మహాస్వాములు తపస్సు ఆచరించి.. ఓ మఠం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అక్కడ పూజలు నిర్వహిస్తూ.. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కృష్ణా గ్రామంలో నది ఒడ్డున దత్తాత్రేయ మందిరం, శివాలయం ఉన్నాయి. ఇక్కడ కూడా రుషులు తపస్సు ఆచరిస్తూ.. స్థానికులకు తమ మహిమలను చూపించే వారు. అందులో ఒకరైన శ్రీ క్షీరలింగేశ్వర మహాస్వాములు 47 రోజులపాటు కేవలం ఒకమారు మాత్రమే పాలు సేవించి ఘోర తపస్సు ఆచరించారు. ఆయన శిష్యులు ఇక్కడ ఏటా మకర సంక్రాంతి పండగ రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ముడుమాల్ గ్రామంలో నది ఒడ్డున మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల సమకాలికులైన గురు యాదవేంద్ర మహాస్వాములు తపస్సు ఆచరించారు. గురు రాఘవేంద్ర స్వాములు ప్రజల్లో దైవభక్తిని పెంపొందించేందుకు «ఇక్కడి నుంచి ధర్మ ప్రచారం ప్రారంభించారు. అలా వెళ్లిన గురురాఘవేంద్ర స్వాములు తుంగభద్ర నది ఒడ్డున ప్రస్తుత మంత్రాలయంలో మఠం ఏర్పాటు చేశారు. ఇక్కడున్న ఆయన సమకాలికుడు యాదవేంద్ర మహాస్వామి మాత్రం కేవలం పూజలు, తపస్సుకే ప్రాధాన్యం ఇచ్చి ఇక్కడే ఉండిపాయారు. ఇక్కడ ఏటా ఫిబ్రవరి 22న యాదవేంద్ర స్వాముల ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు విధిగా మంత్రాలయ పీఠాధిపతులు హాజరవుతారు. ఇక్కడ నాలుగు ద్వారాలతో కూడిన శివాలయం ఉంది. ఎక్కడైనా ఆలయ గర్భగుడికి ఓకే ద్వారం ఉంటుంది. కాని ఇక్కడ మాత్రం శివాలయ గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉండటం విశేషం. ముడుమాల్ సంస్థానం రాజులు ఈ ఆలయంలో పూజలు నిర్వహించే వారని.. యుద్ధ సమయంలో సైన్యంతో తూర్పున ఉన్న ద్వారం నుంచి ప్రవేశించి, పశ్చిమాన ఉన్న ద్వారం గుండా బయటికెళ్లే వారని చరిత్ర చెబుతోంది. మాగనూర్ మండలం కొల్పూర్‌లో కృష్ణానది ఒడ్డున సత్యపూర్ణ తీర్థ మహాస్వాముల మఠం ఉంది. ఈయన కూడా మంత్రాలయ రాఘవేంద్రస్వామి సమకాలికులే. ఈయన భక్తులు కోరిన కోర్కెలను తీర్చే స్వామిగా ప్రసిద్ధికెక్కారు. ముడుమాల్ గ్రామంలో రాజులు సంస్థానాలను ఏర్పాటు చేసుకొని పరిపాలించారు. కృష్ణా, మాగనూర్ మండలంలోని గ్రామాలతో పాటు కర్ణాటకలోని పలు గ్రామాలను ఈ రాజులు పరిపాలించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కొల్పూర్ సంస్థానంలో నది అటువైపు ఉన్న కర్ణాటక ప్రాంతంతో పాటు ఇటువైపు ఉన్న కొన్ని గ్రామాలను వారు పరిపాలించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం కూడా కొల్పూర్ ప్రాంతానికి చెందినదిగా ప్రచారం ఉంది. ఈ వజ్రం (Diamond) చేపల వేటగాడికి నదిలో దొరికిందని.. అది కొల్పూర్ దొరకు ఇవ్వగా, ఆయన నిజాం ప్రభువుకు అప్పగించినట్లు ప్రచారంలో ఉంది. కొల్పూర్‌లో ఇప్పటికీ రాజమందిరాలు ఉన్నాయి. వీరి వంశీకులే ప్రస్తుతం కర్ణాటకలోని ప్రసిద్ధ దేవసూగూర్ సూగురేశ్వర ఆలయాన్ని నిర్మించారు. సంస్థానాధీశులకు చెందిన లక్షలాది ఎకరాలు భూములను ఆచార్య వినోభాబావే స్వచ్ఛందంగా సేకరించి, పేదలకు పంచిపెట్టారు.ఇక్కడే నిలువు రాళ్లు.. ముడుమాల్ సమీపంలోని నది ఒడ్డున ఉన్న నిలువురాళ్లు దేశంలో మరెక్కడా కనిపించవు. ఈ నిలువు రాళ్లు ఆదిమానవులు ఏర్పాటు చేసుకున్నవని.. పురావస్తు శాఖకు చెందిన ప్రొఫెసర్ పుల్లారావు పరిశోధన ద్వారా ప్రపంచానికి తెలిసింది. సూర్య కిరణాలు ఒక వరుస నుంచి.. మరో వరుసకు ప్రయాణించే సమయాన్ని.. ఆది మానవులు రుతువులుగా భావించే వారని ప్రొఫెసర్ పేర్కొన్నారు. మహోన్నతమైన, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిలువురాళ్లు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, మఠాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ((ITCX) జరగనుంది. 2025 ఫిబ్రవరి 17 -19 తేదీల మధ్య అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరియు ప్రదర్శన (ఐటీసీఎక్స్) ఉంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.ఆలయ నిర్వాహకులు, ప్రతినిధులు జనవరి 31, 2025లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఒక్కో ఆలయానికి ఇద్దరు ప్రతినిధులకు వసతి కూడా ఉంటుంది. అదనపు ట్రస్టీలు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, ప్రత్యేక మాస్టర్‌క్లాస్‌లు, ప్రెజెంటేషన్లు, వర్క్‌షాప్‌లు , మాస్టర్‌క్లాస్‌లు - ఆలయ చర్చలు ఉంటాయి. ఈ సమావేశాలకు 58కి పైగా దేశాల నుండి హిందూ,సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థల నుండి కీలక ప్రతినిధులు పాల్గొననున్నారు. మూడు రోజుల స్మారక కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1581కి పైగా ప్రతిష్టాత్మక దేవాలయాల ప్రముఖులు సమావేశమవుతారు.టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి నేతృత్వంలో జరుగుతున్న ఈ మైలురాయి కార్యక్రమానికి ప్రసాద్ లాడ్ (ఐటీసీఎక్స్ 2025 చైర్మన్,మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు) సహ-నాయకత్వం వహిస్తున్నారు "ఇన్క్రెడిబుల్ ఇండియా" కార్యక్రమం కింద భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖసహకారంతో ఆలయాల కుంభమేళా నిర్వహిస్తున్నామని గిరేష్ కులకర్ణి ఒక ప్రకటనలో తెలిపారు. తొలి ఎడిషన్ 2023లో వారణాసిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
మా ఆలయాలపై మీ పెత్తనమేంటి?
సాక్షి, అమరావతి: ‘గుళ్లను హిందువులమైన మేమే నిర్మించుకున్నాం.. స్వామీజీల మార్గదర్శకంలో వాటిని హిందువులమే యోగ్యమైన పద్దతిలో నిర్వహించుకుంటాం. రాష్ట్రంలో, దేశమంతటా హిందూ ఆలయాల నిర్వహణలో పెత్తనం చేయడం నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి. ఆయా ప్రభుత్వాల నుంచి విముక్తి కలిగించాలి. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు విశ్రమించేది లేదు. అందరం కలిసి ఐక్యంగా అడుగులు ముందుకు వేద్దాం’ అని వివిధ పీఠాధిపతులు, స్వామీజీలు, వీహెచ్‌పీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి సమీపంలోని కేసరపల్లి వద్ద వీహెచ్‌పీ నిర్వహించిన హైందవ శంఖారావం బహిరంగ సభ మధ్యాహ్నం 12.40 గంటలకు మొదలై.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ‘వీహెచ్‌పీ ఆధ్వర్యంలో సాధు సన్యాసులు, నాయవేత్తలు, హిందు ప్రముఖులు కలిసి ఆలయాల స్వయం ప్రతిపత్తికి సంబంధించి రూపొందించిన ముసాయిదా చట్టం ప్రతులను ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి అప్పగించాం. బీజేపీ జాతీయ నాయకత్వానికి కూడా చట్టం ప్రతిని అందించాం. ఆయా ప్రభుత్వాలు, పార్టీలు అత్యంత శీఘ్రంగా ఆ ముసాయిదా చట్టాన్ని పరిశీలించి, నూతన చట్టం రూపొందించడం ద్వారా ఆలయాలను హిందు సమాజానికి అప్పగించే చర్యలు చేపట్టాలి. వెంటనే చట్ట సవరణ చేయాలి. ఆ లోపు, ఆలయ ట్రస్టు బోర్డుల్లో రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి. ఆలయాల్లో, ఆలయాలు నిర్వహించే సంస్థల్లో పని చేసే అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలి. ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడడంతో పాటు అన్యాక్రాంతమైన ఆస్తులను తిరిగి ఆలయాలకు అప్పగించే బాధ్యతను ప్రభుత్వాలు వెంటనే తీసుకోవాలి’ అని హైందవ శంఖారావం డిక్లరేషన్ ప్రకటించారు. గుడి నిధులను హిందు ధార్మిక ప్రచారానికి, హిందు ధర్మ, ధార్మిక సేవలకు మాత్రమే ఉపయోగించాలని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదని శంఖారావం సభ విజ్ఞప్తి చేసింది. త్రిదండి చిన్న జియ్యర్‌స్వామి డిక్లరేషన్ సాధన కోసం సభకు హాజరైన అశేష భక్త జనంతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. అయోధ్య తరహాలో అన్ని ఆలయాలుఅయోధ్యలో రామజన్మభూమి ఆలయాన్ని హిందువులే స్వతంత్రంగా నిర్వహించుకుంటున్న తరహాలోనే దేశంలో మిగిలిన అన్ని ఆలయాలు కూడా అదే బాటలో నడిచేలా అడుగులు ముందుకు వేద్దామని ఆయోధ్య రామాలయ తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గిరిగోవింద దేవ్ గిరి స్వామీజీ పిలుపునిచ్చారు. 200 ఏళ్ల క్రితం బ్రిటీష్ ప్రభుత్వం కేవలం హిందు మందిరాలను మాత్రమే తమ చేతుల్లోకి తీసుకుందని.. మసీదులు, గురుద్వారాలు, జైన్ మందిరాల జోలికి వెళ్లలేదని వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు. ఆలయ నిర్వహణను ప్రభుత్వాలు చట్టం చేసి, తమ చేతుల్లోకి తీసుకున్నాయన్నారు. ఈ పని చేయాల్సింది ధర్మాచార్యులు, భక్త సమాజం అని వివరించారు. మొత్తం హిందూ సమాజం కలిసి ఆలయాలను నిర్వహించుకోవాలన్నది వీహెచ్‌పీ అభిమతమని వెల్లడించారు. అందులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండాలన్నారు. ఈ దిశగా రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నట్టు వీహెచ్‌పీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి మిలింద్ పారండే చెప్పారు. ఈ ఉద్యమానికి హైందవ శంఖారావం పేరిట ఏపీలో నాంది పలికామని వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు. రాష్ట్రంలో గుళ్ల పేరిట ఇదివరకు 15 లక్షల ఎకరాల భూములుంటే, ఇప్పుడవి నాలుగున్నర లక్షల ఎకరాలకు కుచించుకుపోయాయని చిన్నజియ్యర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. దేవదాయ శాఖను రద్దు చేయాలన్నదే హైందవ శంఖరావం సభ డిమాండ్ అని కమలానంద స్వామి అన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లు పెట్టాలని, ఆలయాలను హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆలయాలకు ఏ సంబంధం లేని వాళ్లు కౌంటర్లు పెట్టి టికెట్లు అమ్ముకుంటుంటే ఒళ్లు మండుతోందన్నారు. మన ధర్మాన్ని మనం పాలించుకుందామని గణపతిసచ్చిదానందస్వామి అన్నారు. వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్శ, ఉత్తరాంధ్ర వీహెచ్‌పీ కన్వీనర్ తనికెళ్ల సత్యరవికుమార్, వీహెచ్‌పీ భాగ్యనగర్ క్షేత్ర సంఘటనా కార్యదర్శి గుమ్మళ్ల సత్యం, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
100 ఆలయాల్లో.. 300 కిలోల ఆభరణాల చోరీ
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల గుట్టు రట్టయింది. 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడిన ఈ దొంగల ముఠా 300 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసి విక్రయించి వచి్చన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దొంగల ముఠా ఒంగోలు జైల్లో ఉండగా.. వారి నుంచి వెండి ఆభరణాలు కొనుగోలు చేసి చెన్నైలో విక్రయించేందుకు వెళుతున్న వ్యక్తిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పూర్తి సమాచారం బయటపడింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన సవర సిపన్య, సవర బోగే‹Ù, మెదక్ జిల్లాకు చెందిన బత్తిని శ్రీకాంత్‌లు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ, బి.నిడమానురు గ్రామాల్లోని రఘునాయక స్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయాల్లో జరిగిన దొంగతనాల్లో నిందితులు. ఈ ముగ్గురు.. సవర సూర్య, కాకుమాని శ్రీనివాసరావులతో కలిసి రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా దేవాలయాలను గుర్తించి దొంగతనాలకు పాల్పడేవారు. చోరీ చేశాక దేవాలయాల్లోని సీసీ కెమెరాల డీవీఆర్‌లను కూడా తీసుకెళ్లేవారు. దొంగలించిన ఆభరణాలను శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు చెందిన కాకినాడ కృష్ణారావుకు విక్రయించి అతడు ఇచి్చన డబ్బులతో జల్సాలు చేసుకునేవారు.ఈ క్రమంలోనే గతేడాది జనవరిలో నాగులుప్పలపాడు మండలం చదలవాడలోని రఘునాయక స్వామి ఆలయంలో వెండి ఆభరణాలను, సీసీ కెమెరా డీవీఆర్‌ను దొంగిలించారు. తిరిగి ఆగస్టులో నాగులప్పలపాడు మండలం బి.నిడమానూరులోని సాయిబాబా ఆలయంలో వెండి వస్తువులను దొంగిలించారు. పోలీసులు గాలిస్తుండగా అమలాపురం పోలీసులకు చిక్కారు. అక్కడ నుంచి ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకుని స్పెషల్ జేఎఫ్‌సీఎం ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం జిల్లా కారాగారంలో ఉన్నారు. చోరీ చేసిన సొత్తును కాకినాడ కృష్ణారావుకు విక్రయించినట్టు తెలపడంతో ఒంగోలు పోలీసులు అతడిపై నిఘా పెట్టారు.చెన్నైలో వెండి ఆభరణాలను విక్రయించేందుకు శ్రీకాకుళం నుంచి చెన్నై సెంట్రల్ రైల్లో వెళుతున్న కృష్ణారావును సోమవారం ఒంగోలు రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు ఆలయాల్లో దొంగిలించిన రూ.15.50 లక్షల విలువైన వెండి, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు రాష్ట్ర వ్యాప్తంగా 100 దేవాలయాల్లో చోరీ చేసిన 300 కేజీల వెండి ఆభరణాలను కూడా తనకు విక్రయించినట్టు కృష్ణారావు వెల్లడించారు. -
ప్రార్థనా స్థలాలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
-
బంగ్లాదేశ్‌లో దాడుల సూత్రధారి యూనస్ ప్రభుత్వమే: షేక్ హసీనా
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు కారణం ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానిదేనని ఆరోపించారు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న షేక్ హసీనా ప్రసంగిస్తూ.. బంగ్లాలో హిందూ దేవాలయాలు, చర్చీలు, ఇస్కాన్‌పై వరుస దాడుల నేపథ్యంలో యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.‘నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదు చ ఏశారు కానీ వాస్తవానికి విద్యార్ధి సంఘాలతో కలిసి పక్కా ప్రాణాళికతో సామూహిక హత్యలకు పాల్పడింది మహమ్మద యూనస్. వారే సూత్రధారులు.. దేశంలో ఇలాగే మరణాలు కొనసాగితే ప్రభుత్వం మనుగడ సాగదని లండన్‌లో ఉన్న తారిక్ రెహమాన్(బీఎన్పీ నాయకుడు, ఖలీదాజియా కుమారుడు) కూడా చెప్పాడు. దేశంలో మైనారిటీలు, ఉపాధ్యాయులు, పోలీసులు అందరిపై దాడి చేసి చంపేస్తున్నారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. చర్చిలు, అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మాస్టర్‌మైండ్ యూనసే. బంగ్లాదేశ్‌లో మైనారిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ షేక్ హసీనా ప్రశ్నించారు. ఈసందర్భంగా తాను దేశాన్ని ఎందుకు వీడాల్సివచ్చిందో ఆమె మరోసారి వివరించారు. ‘‘నా తండ్రిలాగే నన్నూ హత్య చేసేందుకు కుట్రలు జరిగాయి. వాటిని ఎదుర్కోవడం నాకు 25-30 నిమిషాలు పట్టదు. నా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ, ఊచకోతను నేను కోరుకోలేదు. నేను అధికారం కోసం అక్కడే ఉంటే మారణహోమం జరిగేది. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే దేశం విడిచివెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆందోళనకారులపై కాల్పులు జరపొద్దని నా భద్రతా సిబ్బందికి చెప్పా’’ అని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు అధికమయ్యాయి. దీనిని నిరసిస్తూ హిందువులు శాంతియుత నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ఠ్తో ఈ ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి.అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలతో అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. కాగా బంగ్లాదేశ్ పరధానిగా ఉన్న షేక్ హసీనా గత ఆగస్టులో తిరుగుబాటు, కుట్ర కారణంగా దేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం దేశ బాధ్యతలను చేపట్టింది. తిరుగుబాటు సమయంలో జరిగిన మరణాలకు సంబంధించిన నేరాభియోగాలపై విచారణ నిమిత్తం హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేస్తోంది. అమె అరెస్టుకు ఇంటర్ పోల్ సాయమూ కోరింది. -
కార్తీకం స్పెషల్.. దేశంలోని ప్రముఖ శివాలయాలు
దీపావళి అమావాస్య వెళ్లగానే కార్తీకమాసం ప్రవేశించింది. ఈ మాసంలో శివారాధన ఎంతో శ్రేష్టమని పెద్దలు చెబుతుంటారు. మనదేశంలో వేల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కేదార్నాథ్ (ఉత్తరాఖండ్)భారతదేశంలోని నాలుగు ధామాలలో కేదార్నాథ్ ఒకటి. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌లో మందాకిని నదికి సమీపంలో ఉన్న కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో ఉంది.లింగరాజ్ ఆలయం (భువనేశ్వర్)భువనేశ్వర్‌లోని పురాతన శివాలయాలలో లింగరాజ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని సోమవంశీ రాజవంశానికి చెందిన రాజు జజాతి కేశరి నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుని స్వరూపమైన హరిహరుడు. ఈ ఆలయ ప్రస్తావన సంస్కృత గ్రంథాలలో కనిపిస్తుంది.నాగేశ్వర దేవాలయం (గుజరాత్)ఈ ఆలయం ద్వారకకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని నాగనాథ్ దేవాలయం అని కూడా అంటారు. ఇది గుజరాత్‌లోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి విషం శరీరంలోకి ప్రవేశించదని భక్తులు నమ్ముతారు.కాశీ విశ్వనాథ దేవాలయం (ఉత్తర ప్రదేశ్)కాశీ విశ్వనాథ దేవాలయం వారణాసిలో పవిత్ర గంగానదికి పశ్చిమ ఒడ్డున ఉంది. బంగారు పూతతో కూడిన గోపురాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. కాశీ విశ్వనాథుని సమక్షంలో చివరి శ్వాస తీసుకునే వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని చెబుతారు.శివోహం శివాలయం (బెంగళూరు)శివుని ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో 65 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం ఉంది. శివోహం శివాలయంలో అతిపెద్ద శివలింగ ద్వారం కూడా ఉంది. ఇక్కడ శివునితో పాటు 32 అడుగుల ఎత్తయిన వినాయకుడి విగ్రహం కూడా ఉంది. ఈ శివాలయంలో ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం.మురుడేశ్వర్ (కర్ణాటక)ఉత్తర కర్ణాటకలోని మురుడేశ్వర్‌లో ఎత్తయిన శివుని విగ్రహం ఉంది. ఆలయం వెనుక అరేబియా సముద్రం గంభీరంగా కనిపిస్తుంది. ఈ విగ్రహానికి సమీపంలో 20 అంతస్తుల శివుని ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి తరలివస్తుంటారు.సిద్ధేశ్వర్ ధామ్ (సిక్కిం)సిద్ధేశ్వర్ ధామ్ ఆలయం సిక్కిం రాజధాని గాంగ్టాక్కు సమీపంలో ఉంది. విష్ణువు, కృష్ణుడు, జగన్నాథుడు శివుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలతో పాటు 108 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం కూడా ఇక్కడ ఉంది.ఇది కూడా చదవండి: పార్వతీపురంలో గజ రాజుల బీభత్సం -
మాణిక్యధార కొండకు పోటెత్తిన భక్తులు
-
యాదగిరిగుట్ట లడ్డూపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అక్టోబర్ 18(శుక్రవారం) ఆమె మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రవ్యాప్తంగా అన్ని గుడుల లడ్డూలను టెస్టింగ్‌కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్ అని రిపోర్ట్ వచ్చింది. వేములవాడ దేవస్థానం మాస్టర్‌ప్లాన్ త్వరలోనే విడుదల చేస్తాం. త్వరలోనే దేవాలయాల్లో 24 రకాల ఆన్లైన్ సేవలను అందించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.వేములవాడ రాజన్నకు 65 కిలోల బంగారంతో తాపడం చేయిస్తాం. బాసర సరస్వతి టెంపుల్ పునర్నిర్మాణం కోసం మాస్టర్‌ప్లాన్ రెడీ అయింది. వేములవాడను రూ.110 కోట్లతో అభివృద్ధి చేస్తాం’అని మంత్రి సురేఖ తెలిపారు.ఇదీ చదవండి: కేటీఆర్,హరీశ్‌రావులకు సీతక్క కౌంటర్ -
ఆలయ ఆగమాలు, ఆచారాల్లో జోక్యం వద్దు
సాక్షి, అమరావతి: ఆలయాల ఆగమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో దేవదాయ శాఖ కమిషనర్ సహా ఆలయ ఈవో, తదితర అధికారులెవ్వరూ జోక్యం చేసుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైదిక ఆగమ విషయాల్లో ఆలయాలకు స్వయం ప్రతిపత్తిని నిర్ధారించడానికి 1987 నాటి దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్–13(1)కి అనుగుణంగా అధికారులు ఆలయాల ఆచారాలు, సంప్రదాయాల పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సత్యనారాయణ బుధవారం జీఓ–223ను జారీచేశారు. వివిధ ఆలయాల్లో స్వామివార్లకు నిర్వహించే సేవలకు సంబంధించిన విధానాలు.. యాగాలు, కుంభాభిషేకాలు, ఇతర ఉత్సవాల నిర్వహణ వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడి సీనియర్ అర్చకులు, ఇతర మతపరమైన సిబ్బంది అభిప్రాయాలే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఈఓ వైదిక కమిటీలను ఏర్పాటుచేసుకోవచ్చని ఆయన ఆ ఉత్తర్వుల్లో సూచించారు. ఏదైనా సందేహం, అభిప్రాయభేదం ఏర్పడితే ప్రఖ్యాత పీఠాధిపతులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో ఏ ఆలయానికి ఆ ఆలయం లేదా ఇతర దేవదాయ ధార్మిక సంస్థలు ఒక స్వతంత్ర సంస్థగా పరిగణించబడతాయన్నారు. అలాగే, ఒకే రకమైన ఆగమాలకు సంబంధించిన ఆలయాలు, ధార్మిక సంస్థలైనప్పటికీ సంబంధిత ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు భిన్నంగా వేరొక ఆలయ సంప్రదాయాలు పాటించాలనిలేదని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. -
సనాతనానికి చీడ పురుగులు
‘‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు/ మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు / జనులంతా ఒక కుటుంబం – జగమంతా ఒక నిలయం’’– జాషువాఈ మాటలు ఎంత సందర్భోచితంగా ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ రంగాన్ని చూస్తే అర్థమవుతుంది. నిజమైన మతవాదులైతే వారితో ఇబ్బంది లేదు. అది వారి ప్రగాఢ నమ్మకంగా భావించవచ్చు. కానీ కుహనా మతవాదులు వేషాలు వేసుకుని, అవకాశవాద రాజకీయాల కోసం మతాన్ని, కులాన్ని వాడుకోవటం వల్లనే అసలు ఇబ్బంది వస్తున్నది.వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సనాతన మతవాదుల అవతారం ఎత్తారు. హిందూ మతానికి వీళ్లే అసలైన వారసులన్నట్లుగా ఉపన్యాసాలిస్తున్నారు. ఇక పచ్చ మీడియా రచ్చ సరేసరి.‘అసలే అనలుడు. అతనికి సైదోడు అనిలుడు’ అని ఒక మహాకవి చెప్పినట్లు, చంద్రబాబు అబద్ధా లకు తింగరి పవన్ కల్యాణ్ దొరికాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా చెప్పిన డైలాగ్‌నే చెబుతూ, మెట్లను కడుగుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.అసలు ఇప్పుడు అర్జంట్‌గా హిందూమతాన్ని ఈ గురుశిష్యులు అంతగా తలకెత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సామాన్యుడి ప్రశ్న.అందులో ఒకరికి దేవుడన్నా, మతమన్నా ఏ సెంటి మెంట్లూ లేవు. బూట్లతో పూజలు చేస్తాడు, దేవాలయాలు పడగొడతాడు, ఆలయాల్లో క్షుద్ర పూజలు భార్య చేస్తే ఊరుకుంటాడు. ఇక రెండవ వారు చెప్పులు ధరించే స్వామి దీక్షలు నిర్వహి స్తాడు. తలక్రిందులుగా తపస్సు చేసినా వీళ్ళను నమ్మే జనాలున్నారా?అసలెందుకు హఠాత్తుగా ఈ రచ్చ లేవ దీశారు? ఢిల్లీ పెద్దలేమయినా హరియాణా, మహా రాష్ట్ర ఎన్నికల కోసం వీళ్ళిద్దరినీ సెంటిమెంట్ రోల్స్ చెయ్యమన్నారా? లేక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, విజయవాడ వరద బాధితులకు సమాధానం చెప్పలేక, ప్రజల వద్దకు 100 రోజుల మంచి పాలన అంటూ పోవాలనుకున్నా జనా లెక్కడ తిరగబడి ‘సూపర్ సిక్స్’లు అడుగుతారో అనే భయం చేతనా? ప్రజలు ఆలోచించే లోపలే పచ్చ మీడియా మూకుమ్మడిగా జనాలకు అర్థంకాని భాషలో వ్యాఖ్యానాలు చేయిస్తూ చివరకు హిందూ ధర్మం జగన్ గారి వల్లనే నాశనమైందని తేలుస్తుంది.సెంటిమెంట్ బాగా పండాలంటే కలియుగ దైవం, ఆయన ప్రసాదం వీరికి అక్కరకొచ్చాయి. జగన్ గారి పాలనలో లడ్డూ ప్రసాదంలో జంతు వుల కొవ్వులు కలిశా యని చెప్పాలనుకున్నారు. కానీ వాటికి ఆధారాలు దొరక్క చివరకు వీళ్ళ ప్రభుత్వం మెడకు చుట్టు కోవటంతో దానిని ఎలా మలపాలో అర్థం కాక ‘యూటర్న్’ బాబు... 20 సార్లు తిరుమలకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రిగారి డిక్లరేషన్ పేరుతో దానిని డైవర్ట్ చేయటానికి ప్రయత్నించారు. ‘నాతిని చెయ్యబోతే కోతిగా తయారయ్యిందన్న’ సామె తగా చివరకు సనాతన ధర్మానికే కళంకాన్ని తెచ్చే విధంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం స్వామివారి ప్రసాదాన్నే కళంకితంగా మార్చింది. ఈ చర్యలు క్షమార్హం కాదు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తారని ప్రకటించటంతో ఖంగుతిన్న చంద్రబాబు... పార్టీల మాటున గూండాలను తిరుపతికి తరలించారు. వారిలో కొంతమంది బహిరంగంగానే ‘జగన్ మోహన్‌రెడ్డి తిరుపతి వస్తే చంపేస్తాం’ అంటూ చెప్పారు. అంటే ఆయనను చంపాలనేదే కదా వీళ్ళ కుట్ర! వాళ్ళే నిందలేస్తారు. వాళ్ళే నిందిస్తారు.ఎంత నిస్సిగ్గుగా ఆయన మతాన్ని తెర మీదకు తెచ్చి డిక్లరేషన్ బోర్డు పెట్టారు! అందుకు జగన్మోహన్ రెడ్డిగారు ప్రెస్ మీట్లో చాలా చక్కటి సంస్కారవంతమైన సమా ధానం చెప్పారు. అసలైన హిందూ ధర్మతత్వం ఆయన మాటల్లో వినిపించింది. హిందూ ధర్మాన్ని సుప్రతిష్ఠం చేసిన ఉపనిషత్తులు ఏం చెప్పాయో మత ఛాందసులు కూడా తెలుసుకోవాలి.‘‘యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్వి జానతః / తత్ర కో మోహః కశ్శోకః ఏకత్వ మను పశ్యతః’’(ఈశావాస్యోపనిషత్తు)ఎవరయితే సమస్త జీవుల ఆత్మలను తన ఆత్మగా భావించి గౌరవిస్తాడో అతడు శోకమోహ ములను దాటి ఒకే ఆనంద స్థితిని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మం చెప్పేమాట. అలాగే హిందు వులందరూ పరమ ప్రామాణికంగా భావించే భగ వద్గీతలో కూడా ఆ కృష్ణ పరమాత్మ –యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజా మ్యహం! / మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః‘‘ఏ రూపంలో ఆరాధిస్తారో ఆ రూపంలో నేనే ఉంటాను అన్నాడు. అంటే అన్ని మతాలను, దేవుళ్ళను గౌరవించాలనే కదా మన హిందూ ధర్మం చెబుతున్నది. మరి ఈ మతానికి ఈ చాదస్తపు రంగులు పూసి ఎందుకిలా ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు? ఇప్పటికయినా ఢిల్లీ బీజేపీ పెద్దలు తమ కూటమి ఆంధ్రలో చేస్తున్న కోతి చేష్టలను ఆపించ కపోతే అది తమకే నష్టం అని గమనించాలి. ప్రజల్ని అంత తక్కువగా అంచనా వెయ్యొద్దు.‘‘నీకు మతం కావాలా లేక అన్నం కావాలా?’ అని అడిగితే ముందు అన్నమే ఇవ్వమంటాను. ఆకలితో బాధపడేవాళ్ళ కడుపు నింపి తర్వాత బోధలు చెయ్యి’’ అంటారు స్వామి వివేకానంద.ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పాలకులకు జగన్ మోహన్ రెడ్డి చెప్పేది అదే. ముందు పేదవాళ్ళను ఆదుకోండి, మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీ నీచ రాజకీయానికి పవిత్ర ప్రసాదాన్ని బలి చేయకండి.నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త వైసీపీ నాయకురాలు -
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతల ప్రత్యేక పూజలు
-
దేవుడా.. ఏపీని రక్షించు!
‘‘స్వామీ.. చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మేము మా ఊళ్లోని మీ గుడిలో పూజలు చేస్తున్నాం.. తప్పు చేసింది మేం కాదు.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న చంద్రబాబు నాయుడు.. ఆయన నిర్వాకంపై మీకొస్తున్న కోపాన్ని ప్రజలపై కాకుండా చంద్రబాబుపైనే చూపండని వేడుకుంటున్నాం.. ఎందుకంటే జరిగింది ఘోర అపచారం.. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని పలుచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ..జరగనిది జరిగినట్లుగా.. వాడని జంతువుల కొవ్వును వాడినట్లుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్లుగా.. పచ్చి అబద్ధాలాడుతూ మిమ్మల్ని(దేవుడు) అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తూ అపవిత్రం చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసంపై దెబ్బ కొట్టారు.. దేవుడు, దైవం.. అనే భయం, భక్తి లేకుండా.. కళ్లార్పకుండా చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతూ ప్రజల్లో విష బీజాలు నాటుతున్నారు..వైఎస్ జగన్‌పై కోపంతో మమ్మల్ని క్షోభకు గురిచేస్తూ.. మిమ్మల్ని అపవిత్రం చేస్తున్నారు. ఆ పాపాన్ని కడిగేయాలని అభిషేకాలు, పూజలు చేస్తున్నాం.. చంద్రబాబు క్షుద్ర రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నాం.’’– రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజల వేడుకోలు సాక్షి నెట్వర్క్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అపచారం ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడకుండా చూడాలని వేడుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆలయాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు.. హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లోని ఆలయాలు ప్రత్యేక పూజలతో కిటకిటలాడాయి. అనంతపురం మొదలు ఇచ్ఛాపురం వరకు హోమాలు, అభిషేకాలతో ఆలయాలు హోరెత్తాయి. పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలతో దేవదేవుడికి కలిగే ఆగ్రహం చంద్రబాబు వరకే పరిమితమయ్యేలా చూడాలని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు స్వామి వారిని వేడుకున్నారు. వైఎస్సార్సీపీ అ«ధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు, అభిమానులు భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.బాబు పాపాలకు ప్రక్షాళన గావించాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు, తెలుగు ప్రజలందరూ హారతులిచ్చారు. మత రాజకీయాలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారని, తిరుమల పవిత్రతను ‘మంట’గలుపుతూ చలి కాచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ పేరు ప్రఖ్యాతులకు విఘాతం కల్పిస్తూ భక్తులను రెచ్చగొడుతున్నారని, బాబు వ్యాఖ్యలకు మంత్రులు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తందానా అంటుండటం బాధాకరమని అన్నారు. కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని అసలు ఉపయోగించనప్పుడు తప్పు జరగడానికి ఆస్కారమే లేదని, అయినా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. బాబు మహాపచారం ప్రభావం రాష్ట్రంపై పడకుండా చూడాలని పదే పదే వేడుకున్నారు. ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులకు మద్దతుగా ప్రజలు తరలివచ్చి పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా డోన్‌లోని వేంకటేశ్వరాలయంలో పూజలు చేసేందుకు పాదయాత్రగా వెళ్తున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వైఎస్సార్సీపీ శ్రేణులు దేవదేవుడి నుంచి బాబు తప్పించుకోలేరుయూకేలో తెలుగు ప్రజల ప్రత్యేక పూజలు సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తిరుమల పవిత్రతను కాపాడాలని శనివారం లండన్ ఈస్ట్ హ్యంలో ఉన్న మహాలక్ష్మి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలుగువారు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ.. పార్టీ అభిమానులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. లడ్డూ పవిత్రత విషయంలో తప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఆ దేవ దేవుడి శాపం నుంచి తప్పించుకోలేడని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి కిషోర్ రెడ్డి, వెంకట రమణ, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీవ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్సీపీ నేతల పూజలు (ఫొటోలు)
-
చంద్రబాబు పాపాలను కడగాలి
-
Watch: ‘చంద్రబాబును క్షమించి మంచి బుద్ధిని ప్రసాదించు వెంకన్నస్వామీ’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమల లడ్డూ విశిష్టతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. భారీ ఎత్తున గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పూజలు చేస్తున్నారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష ప్రత్యేక పూజలు చేశారు.దేవుడు ప్రసాదంతో చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలి: నారాయణ స్వామి, మాజీ డిప్యూటీ సిఎంతిరుపతి జిల్లా: అంజేరమ్మ కనుమ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గం ఇన్చార్జ్ కృపాలక్ష్మీచంద్రబాబు నాయుడు దేవుడు ప్రసాదంతో రాజకీయాలు మానుకోవాలిచంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అమ్మవారిని పూజలు చేశాంతిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి హోదాలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పట్టు వస్త్రాలు అందించే అదృష్టం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికే దక్కిందిచంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడు,ప్రజలే తగిన బుద్ధి. చెబుతారుఒక మాజీ ముఖ్యమంత్రి నీ తిరుమల శ్రీవారు దర్శనం కు రానివ్వకుండా అడ్డుకున్నారు అంటే మీప్రభుత్వంలో ఇక దళితులకు ఏం రక్షణ ఉంటుందిఇప్పటికే దళితులకు చాలా చోట్ల గ్రామాల్లో దేవలయల్లోకి అనుమతిలేదు.నిన్న జరిగిన సంఘటనతో కుల,మతోన్మాద శక్తులు మరింత రెచ్చిపోతారుచంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని అంజేరమ్మ తల్లి ను కోరాను-నారాయణ స్వామిచంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించు వెంకన్నస్వామీ: భూమనచంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ పూజలు నిర్వహించారు. అనంతరం భూమన మాట్లాడుతూ, తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ అపవాదు వేశారని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు వాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను శ్రీవారి దర్శనానికి రాకుండా అడ్డుకున్నారు. ఆయన స్వామివారిని ఎన్నో సార్లు దర్శనం చేసుకున్నారు. రాజకీయ ప్రాబల్యం కోసం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.గుంటూరు జిల్లా: గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆలయంలో పూజలు నిర్వహించారు.ఏలూరు జిల్లా: తిరుపతి లడ్డు పవిత్రతను.. దెబ్బతీస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసనగా చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామవరపుకోట వీరభద్రస్వామి ఆలయంలో చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు, మద్ది ఆంజనేయస్వామి గుడి మాజీ చైర్మన్ సరితారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వినర్ మిడతా రమేష్, పార్టీ శ్రేణులు పూజలు నిర్వహించారు.తూర్పుగోదావరి: చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేయడానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పూజలు చేశారు. బొమ్మూరు ఆలయంలో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాజానగరం ఆలయంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పూజలు నిర్వహిస్తున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లిలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు.కర్నూలు జిల్లా: తిరుమల లడ్డులో కల్తీ జరిగినట్టుగా అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు కల్లూరు అర్బన్ కృష్ణ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాష్ట్రంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.వైఎస్సార్ జిల్లా: యర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో చంద్రబాబు తిరుమల లడ్డూపై చేసిన దుష్ప్రచారానికి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. లడ్డూ పవిత్రతను కాపాడే విధంగా అభిషేకాలు చేశారు.అనంతపురం జిల్లా: చంద్రబాబు పాపం ప్రజలపై పడకూడదని వైఎస్సార్సీపీ నేతలు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం శ్రీకంఠం సర్కిల్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో స్వామి వారికి పూజలు జరిగాయి. తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం మాజీ సీఎం వైఎన్ జగన్ వెళ్తుంటే.. అనుమతి లేదని చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం బాధాకరం అని, తిరుమల లడ్డూలపై అసత్య చేసిన చంద్రబాబును ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని అనంతవెంకటరామిరెడ్డి అన్నారు.విజయవాడ: తిరుమల పవిత్రతను,శ్రీవారి ప్రసాదం విశిష్టతను, టీటీడీ పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం విజయవాడలో వైఎస్సార్సీపీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. లబ్బీపేటలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూజలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. దాసాంజనేయ స్వామి ఆలయంలో సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు చేశారు. డిక్లరేషన్ ఎందుకివ్వాలి: దేవినేని అవినాష్ ఇది మంచి ప్రభుత్వం కాదు.. ప్రజలను నిండా ముంచిన ప్రభుత్వం. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశారు. పరిపాలనలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు. అనేక మార్లు తిరుమల వెళ్లిన వైఎస్ జగన్.. డిక్లరేషన్ ఎందుకివ్వాలి. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబు, టీడీపీకే చెల్లుబాటు. నేను విదేశాల్లో చదువుకున్నప్పుడు ఏపీ గురించి గొప్పగా చెప్పుకునే వారు. ఈ రోజు చంద్రబాబు వల్ల రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతింది. వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో విఫలం చెందారు.ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే ⇒తిరుమల పవిత్రతను, వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విశిష్టతను, స్వామి వారి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు అపవిత్రం చేశారు. చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో నేడు ప్రత్యేక పూజలు చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.⇒‘‘చంద్రబాబు చేసిన పాపం వల్ల వెంకటేశ్వరస్వామికి కోపం వచ్చి రాష్ట్రంపై చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి. ఎందుకంటే జరిగింది ఘోర అపచారం. వెంకటేశ్వరస్వామిని పలుచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ.. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వు వాడనిది వాడినట్లుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్లుగా పచ్చి అబద్ధాలాడుతూ ఇంత ఘోరం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆ పాపం కడగబడాలి. అందుకే అందరినీ కోరుతున్నా. పూజలు చేయమని వేడుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
ప్రాచీన దేవాలయంలో ఎన్టీఆర్ ప్రత్యేక పూజలు
-
Nashik: ఉప్పొంగిన గోదావరి.. నీట మునిగిన ఆలయాలు
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు.నాసిక్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం ఎనిమిదిన్నర వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. ఫలితంగా రాంకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి.గంగాపూర్ డ్యాం సహా పలు డ్యాంల నుంచి అధికారులు క్రమంగా నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్‌లోని హోల్కర్ వంతెన కింద నుంచి 13,000 క్యూసెక్కుల వేగంతో నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్ పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, నది ఒడ్డున ఉన్న గ్రామాల్లోనివారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
Lavanya Namoju: ఆలయచిత్రం
గుడిని గుడికి కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది? తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నామోజు లావణ్య దేశంలోని ఆలయాలకు వెళ్లి అక్కడి ఆధ్యాత్మికతను, గుడి ప్రాంగణాన్ని, ఆలయ గోపురాలను లైవ్ పెయింటింగ్ చేసి ఆ చిత్రాలను గుడికే బహుమానంగా ఇస్తోంది. దీని వల్ల గుడి రూపం చిత్రకళలో నిలుస్తోంది. అలాగే గుడికి వచ్చే భక్తులకు ఆలయ సౌందర్యాన్ని తెలియచేస్తుంది.‘ప్రతి ముఖ్యమైన గుడిలో నా చిత్రం ఉండాలి. అలాగే మరుగున పడిన గుడి నా చిత్రకళ ద్వారా కాస్తయినా ప్రచారం పొందాలని ఆలయ చిత్రాలను లైవ్ పెయింటింగ్ ద్వారా నిక్షిప్తం చేస్తున్నాను. ఇందుకు వస్తున్న ఆదరణ ఆనందం కలిగిస్తోంది’ అంది పాతికేళ్ల నామోజు లావణ్య. ‘ఇందుకు నా పెయింటింగ్స్ అమ్మకాల వల్ల వచ్చే డబ్బునే ఉపయోగిస్తున్నాను ఇటీవల భద్రాచల ఆలయంలోని సీతారాముల వారి మూర్తులు, ఆలయం లైవ్ పెయింటింగ్ చేసి దేవస్థానానికి అందజేశాను’ అందామె. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక చిత్రకళా సాధన అని కూడా అనుకోవచ్చు. మన సంస్కృతి కోసం‘మాది యాదాద్రి భువనగిరి. కామర్స్‌తో డిగ్రీ పూర్తి చేశాను. పోటీ పరీక్షలకు హాజరై, ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నా ఇష్టం మొత్తం పెయింటింగ్స్ మీదే ఉంది. దీంతో ఏడాది నుంచి పెయింటింగ్నే నా వృత్తిగా మార్చుకున్నాను. స్కూల్ ఏజ్ నుంచి నోట్ బుక్స్‌లో పెయింటింగ్స్ వేస్తుండేదాన్ని. పాశ్చాత్య సంస్కృతి పెరుగుతున్న ఈ కాలంలో సోషల్‌మీడియా ద్వారా మన సంస్కృతిని, మంచిని కూడా పరిచయం చేయవచ్చు అనిపించి సంవత్సరం నుంచి ఆలయ శిల్పాన్ని, హైందవ సంస్కృతిని నా ఆర్ట్ ద్వారా చూపుతున్నాను’.రాక్ స్టోన్స్ పై జంతువులు‘మెదక్ జిల్లా మరపడ దగ్గర ఒక వెంచర్ వాళ్లు ఆర్ట్‌కు సంబంధించిన విషయం మాట్లాడటానికి పిలిస్తే నేను, మా అంకుల్ శ్రీనివాస్ వెళ్లాం. అక్కడ ఒక గ్రామదేవత టెంపుల్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాళ్లను చూశాక వాటిని ఆకారాలుగా చూపవచ్చనిపించింది. మొత్తం 42 రకాల పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ ఉన్నాయి. వాటిని ఏనుగులు, ఆవులు, కోతులు, తాబేలు, కొలనుగా రంగులద్ది మార్చాను. మొన్నటి మే నెల ఎండలో వేసిన పెయింటింగ్స్. అక్కడికి వచ్చినవాళ్లు ‘ఆడపిల్ల అంత పెద్ద రాళ్లు ఎక్కి ఏం పెయింటింగ్స్ వేస్తుంది’ అన్నారు. కానీ అవి పూర్తయ్యాక చాలా సంతోషించారు’ అంది లావణ్య.వెడ్డింగ్ లైవ్ ఆర్ట్‘వివాహవేడుక జరుగుతుండగా ఆ సన్నివేశం, సందర్భం చూడటానికి చాలా బాగుంటుంది. లైవ్ ఆర్టిస్ట్‌ను అని తెలియడంతో గత పెళ్లిళ్ల సీజన్లో వివాహం జరుగుతుండగా ఆ సీన్ మొత్తం పెయింటింగ్ చేసే అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా ఆ కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్టుగా చిత్రించి, ఇచ్చాను. కాలేజీ రోజుల్లోనే తొమ్మిది నెలల పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. యువతకు మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటాను. షీ టీమ్ వారు ‘షీ ఫర్ హర్’ అవార్డు ఇచ్చారు. నాన్న సురేందర్ కరోనా సమయంలో చనిపోయారు. అమ్మ గృహిణి. తమ్ముడు శివప్రసాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం గల కుటుంబమే మాది. నా కళకు సపోర్ట్ చేసేవారుంటే మరెన్నో విజయాలు అందుకోవచ్చు’ అంటూ తెలిపింది ఈ హార్టిస్ట్.– నిర్మలారెడ్డి -
శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం
-
భక్తులతో ఆలయాలు కిటకిట
-
ఈ ఆలయాల్లో దేవుళ్లుగా రాజకీయ నాయకులు..!
భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలకు పేరుగాంచింది. వేదభూమి, కర్మభూమిగా పేరుగాంచిన ఈ భారతావనిలో రాజకీయనేతలను దేవుళ్లుగా భావించి పూజించిన ప్రజలు కూడా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో తమ అభిమాన నేతకు గుడికట్టించి మరీ భక్తిగా కొలుచుకుంటున్నారు. కొందరూ అనుచరులు, కార్యకర్తల్లో వారి అభిమాన నాయకుడిపై విపరీతమైన అభిమానం ఇలా భక్తిగా మారి దేవాలయాలకు నిర్మించి కొలుచుకునే వరకు వెళ్లిపోయింది. ఆ ఆలయాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? అంతటి అభిమానాన్ని పొందిన నాయకులెవరూ తదతరాల గురించి సవివరంగా చూద్దామా..!సోనియా గాంధీ తెలంగాణలోని కరీంనగర్లో భారత జాతీయ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కోసం ఆమె మద్దతుదారులు దేవాలయం నిర్మించి మరీ దేవతగా కొలుచుకుంటున్నారు. వారి ప్రాంతానికి, దేశానికి చేసిన కృషి కారణంగా ఆమెను దేవతలాం చూస్తారు వాళ్లంతా. అంతేగాదు ఈ ఆలయంలో ఆమెకు పూజలు చేసి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు ప్రజలు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆమె పట్ల కృతజ్ఞతతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆమె నాయకత్వంలో తమ ప్రాంతానికి గణనీయమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చాయని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. నరేంద్ర మోదీ..ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద సంఖ్యలో అనుచరలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఆయన గౌరవార్థం దేవాలయాలను నిర్మించారు మోదీ అభిమానులు . ఉత్తరప్రదేశ్‌లో మోదీ విధానాలు, నాయకత్వం పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకునేలా ఒక మద్దతుదారుడు ఆయన కోసం గుడి కట్టాడు. ఆ ఆలయంలో మోదీ విగ్రహం ఉంటుంది. ఇక్కడ ప్రజలు మోదీ విగ్రహానికి పూజలు చేయడమే గాక ఆయన మార్గదర్శకత్వంలోనే పయనిస్తుంటారు కూడా. ఇక మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా మోదీకి మరో ఆలయం ఉంది. ఇక్కడ ఆయన ప్రధానిగా భాద్యతలు చేపట్టిన రోజుని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయాన్ని ఆయన నాయకత్వంలో జరిగిన అభివృద్ధికి ప్రతీకగా నిర్మించారు. ఆయనను పూజించటం తమ అదృష్టంగా భావిస్తామని, ఆయన తమకు స్ఫూర్తి అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మాయవతి..బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ(బీఎస్పీ) అధినేత మాయవతికి బుందేల్‌ఖండ్, నాట్పురా గ్రామాల్లో ఆలయాలు ఉన్నాయి. ఆమె నాయకత్వంలో గణనీయమైన సామజిక మార్పు జరిగిందిని, అణగారిని వర్గాల కోసం ఎంగానో కృషి చేసినందుకుగానూ ఆమె మద్దతుదారులు, దళితలు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మాయవతి సంప్రదాయ దుస్తుల్లో ఉన్న విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఆమె పుట్టిన రోజులు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రజలు. అలాగే నాట్పురా గ్రామంలో మాయవతికి గుడి కట్టించారు. కుల వివకక్షకు వ్యతిరేకంగా సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు అభిమానులు. అక్కడి ప్రజలకు ఆమెను పూజించడం వల్ల తమకు మానసిక ధైర్యం వస్తుందని, ఇది తమకు సామాజిక సవాళ్లను అధిగమించగల ఉపయోగపడుతుందని చెబుతున్నారు.మహాత్మా గాంధీజాతిపితా మహాత్మాగాంధీని భారతదేశం అంతటా గౌరవిస్తారు. కానీ ఒడిశాలోని సంబల్పూర్లో ఆయనకు ఆలయం నిర్మించి మరీ పూజలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇక్కడ ప్రజలు ఆయనను పూజింటమే గాక, ఆయన చెప్పిన అహింస, సత్యం, స్వావలంబన వంటి వాటిని పాటిస్తారు కూడా. ఈ ప్రాంతం గాంధేయ తత్వాన్ని వ్యాప్తి చేసే కేంద్రంగా పనిచేస్తుంది. సందర్శకులు ఈ ఆలయంలో ఉన్న గాంధీని ఒక సాధువుగా చూస్తారు. ఆయన బోధనలు నేటికి అక్కడ వినిపిస్తుంటాయి. ఆ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది సమాజంలో శాంతి, సామరస్యాన్నిపెంపొందించే సామాజిక, విద్యా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.రాజీవ్ గాంధీ..ఆయన దేశాన్ని ఆధునికరించడానికి చేసిన కృషికి గుర్తుగా బిహార్‌లోని రాజీవ్ మద్దతుదారులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రజలు నివాళులు అర్పించడమే గాక ప్రగతిశీల భారతదేశం కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుని, ప్రేరణ పొందుతామని చెన్నారు. భారత్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది. బిహార్‌లోని ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించి వారి జ్ఞాపకాలను నెమరువేసుకోవడమే గాక రాజీవ్ సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటుంటారు. ఆయన నాయకత్వంలో తీసుకొచ్చిన విధానాలు గ్లోబల్ ఐటీ పవర్‌హౌస్‌గా మార్చడంలో సహాయపడ్డాయని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. ఎంజీఆర్ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆయన జ్ఞాపకార్థం పలు ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను చూస్తే.. ప్రజలతో ఆయనకు గల అవినాభావ సంబంధం తెలియజేస్తాయి. ముఖ్యంగా చెన్నైలోని ఆలయం మరింత పేరుగాంచింది. ఇక్కడ ఎంజీఆర్ జీవిత పరిణామక్రమానికి సంబంధించిన విషయాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఎంజీఆర్ స్ఫూర్తి.. తమకు మార్గనిర్దేశం చేసి కాపాడుతుందని ఆయన అనుచరుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయాల్లో ఆయన జయంతి, వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అంతేగాదు ప్రజలు తమ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆయన ఆశీర్వాదాలు పొందాలని ఇక్కడకు తరుచుగా వస్తుంటారు కూడా.(చదవండి: ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?) -
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార సిండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కాస్మొటిక్స్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఈ మధ్య ఎక్కువగా ఆమె పలు దేవాలయాల చుట్టు తిరుగుతూ తన భర్తతో కలిసి పూజలు నిర్వహిస్తుంది. దీంతో వరుసగా పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక పూజలు చేయడం వెనుక కారణం ఏమైనా ఉందా..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒకటే చర్చ జరుగుతుంది.నయనతార జాతకంలో దోషం ఉందని, అందుకే విక్కీతో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఆమె పలు దేవాలయాలను సందర్శిస్తూ పూజలు, పరిహారాలు చేస్తోందని ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చి మరీ.. పుణ్యక్షేత్రాల చుట్టూ ఆమె తిరగడం విశేషం. వాస్తవంగా నయనతారకు కాస్త దైవభక్తి ఎక్కువేనని చెప్పవచ్చు. తన వివాహం అయిన వెంటనే ఆ పట్టు వస్త్రాలతోనే తిరుమల శ్రీవారిని ఆమె సందర్శించిన విషయం తెలిసిందే. వారి పెళ్లి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం నయన్,విక్కీ విడిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడింది. ఇలాంటి వార్తలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత నయనతార జంటగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారని సమాచారం. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించేందుకు పలు పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మధురలోని కృష్ణ జన్మభూమి స్థలంలో, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో దేవాలయాలు నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.“డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు సాధించావని సచిన్ టెండూల్కర్‌ని ఎవరైనా అడుగుతారా? మనకు 300 సీట్లు ఉన్నప్పుడు రామమందిరాన్ని నిర్మించాం. ఇప్పుడు మనకు 400 సీట్లు వస్తే మధురలో కృష్ణ జన్మభూమి సాక్షాత్కరిస్తుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో విశ్వనాథుని ఆలయాన్ని కూడా నిర్మిస్తాం” అని మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో అసోం సీఎం పేర్కొన్నారు.బీజేపీ తూర్పు ఢిల్లీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రా తరపున ప్రచారం చేసేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దేశ రాజధానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అవుతుందన్నారు. ‘కశ్మీర్ భారత్, పాకిస్థాన్ రెండింటిలోనూ భాగమని కాంగ్రెస్ హయాంలో చెప్పాం. మోదీకి 400 సీట్లు వస్తే పీఓకేని భారత్‌కు తీసుకువస్తాం. 400 సీట్లతో మా ప్రణాళికలను కొనసాగిస్తూ పోతాం.. కాంగ్రెస్ ఐసీయూకి చేరుతుంది" అని హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. -
బాబుపై భక్తితోనే ఉన్మాదరాతలు
సాక్షి, అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు రేపేందుకు ‘ఈనాడు’ పూనుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించేందుకు యత్నించింది. కరోనా విపత్కర వేళ ఎవరూ రోడ్డుపైకి రాలేకపోయిన రోజుల్లో వివిధ ఆలయాల్లో చోటు చేసుకున్న 26 దుస్సంఘటనలను ఉదహరిస్తూ దానికీ జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టింది. 2020 మార్చి 12 నుంచి 2021 ఏప్రిల్ 16వ తేదీ మధ్య కొన్ని అసాంఘిక శక్తులు ఉద్దేశ పూర్వకంగా పనిగట్టుకొని ఆలయాల్లో కొన్ని దురాగతాలకు పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆలయాల్లో స్వామివార్ల నిత్య పూజలకు, భక్తుల దర్శనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్పటికప్పుడే పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో మరోచోట అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలతోపాటు ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ఆలయాల్లో యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాత్రివేళల్లో ఆలయాల వద్ద పోలీసు గస్తీని పెంచింది. తద్వారా రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండాచేసింది. కానీ చంద్రబాబుపై తనకున్న ‘స్వామి భక్తి’తో పూర్తిగా ఉన్మాదిగా మారిన ‘ఈనాడు’ ఇప్పుడు.. ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనలను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. నాడు ఆలయాలు కూల్చేస్తే నోరెత్తలేదేమీ... టీడీపీ హయాంలో పవిత్ర కృష్ణానదీ తీరాన విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో పవిత్ర దేవాలయాలను అధికారికంగా కూల్చేశారు. ఆ సంఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా.. ‘ఈనాడు’ కనీసం స్పందించనైనా లేదు. పైగా చంద్రబాబు ఓ గొప్ప విజనరీగా, దార్శనికుడిగా చూపిస్తూ ఆకాశానికెత్తేసింది. నాడు కూల్చేసిన ఆలయాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి పునరి్నర్మించడంతో పాటు రాష్ట్రంలోని ఇతర దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, కొత్తగా ఆలయాలు నిర్మించింది. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.దేవుడి ఆస్తుల రక్షణకు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు » రాష్ట్రంలోని దేవుడి ఆస్తులు, విలువైన భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు పెత్తందార్లు దర్జాగా వాటిని కైంకర్యం చేసేశారు. » అలాంటి దుశ్చర్యలను కట్టడి చేస్తూ జగన్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచి్చంది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి... వారం రోజుల తర్వాత ఆ భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని ఆర్డినెన్స్ ద్వారా దేవదాయశాఖకు కట్టబెట్టింది. » ఇప్పటి వరకు ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ముందుగా ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ వేయాల్సి ఉండేది. ట్రిబ్యునల్ ఆక్రమణదారునికి సైతం తమ లాయర్ల ద్వారా వాదనలు వినిపించుకునే అవకాశమిచ్చిoది. ట్రిబ్యునల్ దానిపై నిర్ణయం వెలువరించేవరకూ ఆ భూములు అనుభవించుకునే వెసులుబాటు ఆక్రమణదారులకే లభించేది. » ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయశాఖకు అనుకూలంగా తీర్పునిస్తే, దానిపై మళ్లీ అప్పీల్ చేసుకుని కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకుంది. దానివల్ల స్వాధీన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేది కాదు. కొత్త చట్టంతో దానికి కళ్లెం వేయగలిగింది. » ఇంకోవైపు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి తొలిసారి ఆలయ అభివృద్ధి పనులకు నేరుగా నిధులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. » ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ కేవలం ఆయా ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదంటే వంశపారంపర్య అర్చకులకు, ఇతర హిందూ ధారి్మక సంస్థలకు అప్పగించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. -
తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు
-
Telangana Temple Photos: ఈ ప్రముఖ దేవాలయాలు మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ హిందూ దేవాలయాలు (ఫొటోలు)
-
ఆధ్యాత్నిక పర్యాటకం.. ఆర్థిక వృద్ధికి దోహదం
దేశ వ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు దేశ విదేశాల నుంచి భక్తులు నిరంతరం పోటెత్తుతున్నారు. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు లక్షలాది మంది భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. ఆలయాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోంది. చిన్న చిన్న పరిశ్రమలకు, వృత్తి కళాకారులకు చేతినిండా పనిదొరుకుతోంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా ఆధ్మాత్నిక పర్యాటకానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఆధ్మాత్మిక పర్యాటకంతో స్థానిక వ్యాపారులకు పెద్దఎత్తున అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన ప్రసంగంలో కూడా చెప్పారు. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఏటా ఆధ్యాత్నిక పర్యాటకం పెరుగుతోంది. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు యాత్రికులను ఆకర్షించడమే కాకుండా ఆర్థిక వృద్ధికి ఉ్రత్పేరకంగా మారుతున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత భారతీయుల్లో ఆధ్యాత్నిక భావనలు, భక్తి విశ్వాసాలు మరింత బలపడినట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2022లో తీర్థయాత్ర కోసం ప్రయాణాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. దేశంలో ఆధ్యాత్నిక కేంద్రాలకు వచ్చే విరాళాల వాటా 14 శాతం పెరిగింది. ఈ క్రమంలోనే 2023–30 మధ్యకాలంలో దాదాపు 16 శాతానికిపైగా వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను అధిగమిస్తోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని పురాతన ఆలయాలు, క్షేత్రాలు ఆధ్యాత్నిక పర్యటనలకు స్వర్గధామంగా మారాయి. విస్తృతంగా ఉద్యోగాల కల్పన ఆధ్యాత్నిక పర్యటన భక్తితో పాటు దేశంలోని నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది. ఆధ్యాత్నిక హాట్ స్పాట్స్‌లో భక్తుల అవసరాలను తీర్చేందుకు వీలుగా హోటళ్లు, రెస్టారెంట్లు వస్తున్నాయి. తద్వారా పాకశాస్త్ర కళలు, ఈవెంట్ ప్లానింగ్ వరకు ఆతిధ్య పరిశ్రమలో అనేక ఉద్యోగాలు వస్తున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ లెక్కల ప్రకారం దేశంలో 2022లో వంద కోట్ల మంది పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇందులో ఆధ్యాత్మిక ప్రదేశాలు సుమారు రూ. 1.34 లక్షల కోట్లు ఆర్జించాయి. ఎక్కువగా విదేశీలు భారతీయ సంస్కృతి, ఆలయాల చరిత్రను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఇక్కడకి వస్తున్నారు. అందుకే ఈ రంగం 2030 నాటికి 14 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఉద్యోగాల సృష్టికి ఆలయాలు చోదక శక్తిగా ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఆధ్యాత్నిక పర్యటనల్లో ప్రయాణం, ఆతిథ్యం, పర్యాటక పరిశ్రమల్లో చిన్న సంస్థలకు మేలు జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీఓ)సైతం తరచుగా సంస్కృతి అన్వేషణలో భాగంగా ఆధ్యాత్నికతలో కొత్త అనుభవాలు కోరుకునేవారు పెరుగుతున్నట్టు గుర్తించింది. టాప్‌లో తిరుపతి.. దేశ ఆధ్యాత్నిక పర్యాటకంలో అయోధ్య రామ మందిరం రిలీజియస్ టూరిజంలో కీలక మార్పులు తీసుకొస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పర్యాటకులకు అదనంగా 5 నుంచి 10 కోట్ల మందికిపైగా భారత్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. తాజ్ మహల్ (65 లక్షలు), రోమ్‌లోని వాటికన్ సిటీ (90 లక్షలు), సౌదీ అరేబియాలోని మక్కా (2 కోట్లు) వార్షిక సందర్శకుల సంఖ్యల కంటే అయోధ్య ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవాలయం ఏడాదికి 2.50 కోట్ల మంది సందర్శకులతో టాప్‌లో నిలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం 80 లక్షల మంది సందర్శకులతో అలరాలుతోంది. ఇలాంటి ఆలయాలు భారతదేశంలో బలమైన ఆధ్యాత్నిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఏపీలోనూ ప్రత్యేక సర్క్యూట్లు ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పర్యాటకంలో అతిపెద్ద విభాగంగా ఉంది.ం మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), దేవదాయశాఖ సంయుక్తంగా ‘రిలీజియస్ టూరిజం’ను ప్రవేశపెట్టాయి. తిరుమల, మహానంది, శ్రీశైలం, అహోబిలం, యాగంటి, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, విజయవాడ, మంగళగిరి, కోటప్పకొండ, మంత్రాలయం, లేపాక్షి, కదిరి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చింది. నిత్యం ఆధ్యాత్నిక పర్యటనలను ప్రోత్సహించేలా భక్తులకు నచి్చన ఆలయాలను కలుపుతూ ప్యాకేజీలు అందిస్తోంది. తిరుపతిలో భక్తులకు చింతలేని దర్శనాన్ని కల్పించడం కోసం బ్యాకెండ్ సేవలను ప్రారంభించింది. సర్క్యూట్ టూరిజంలో భాగంగా 100కి పైగా ఆలయాల జాబితాను సిద్ధం చేసింది. దశల వారీగా ఆధ్యాత్నిక టూర్లను అందుబాటులోకి తెస్తోంది. -
వైభవంగా 7 ఆలయాల్లో విగ్రహ, కలశ ప్రతిష్ట
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): పుష్కరాల పేరుతో 2016లో అప్పటి సీఎం చంద్రబాబు కూల్చివేసిన విజయవాడలోని 7 ఆలయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరి్నర్మించారు. వాటి విగ్రహ, కలశ ప్రతిష్ట వైభవంగా జరిగింది. మంగళవారం ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు గురువారం ముగిశాయి. గురువారం ఉదయం 11.24 గంటలకు ఒకే సుముహూర్తంలో ఏడు ఆలయాల విగ్రహ, కలశ ప్రతిష్ట కార్యక్రమాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తం గా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. తొలుత సీతమ్మ వారి పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కలశ స్థాపన, విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పాత మెట్ల మార్గం వద్ద నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. కనకదుర్గ ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ శర్మ, రఘునాథ శర్మతో పాటు ఇతర ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం యాగశాలలో ఆలయ అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తం గా జరిపించారు. పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. విగ్రహ, కలశ ప్రతిష్ట అనంతరం గణపతి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ మహోత్సవంలో దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్ రామారావు, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, దుర్గగుడి ఈఈలు కోటేశ్వరరావు, ఎల్.రమాదేవి, ఎఈవో ఎన్. రమే‹Ùబాబు, డీఈ వెంకటేశ్వరరావు, ఎఈ కుటుంబరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జగన్ అందించిన ప్రతి సంక్షేమ పథకానికి దేవుడి ఆశీర్వాదం మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం ఉందని, ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం అమలు వెనుక దేవుడి ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే దేవుడికి ఎటువంటి అపచారం జరగకూడదన్నది సీఎం జగన్ భావన అని, అందుకే చంద్రబాబు కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మించారని తెలిపారు. చంద్రబాబుకు దేవుడిపై విశ్వాసం లేనందునే విజయవాడ నడి»ొడ్డున ఉన్న పురాతన ఆలయాలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడమే కాకుండా దేవతామూర్తులను చెత్త వాహనాల్లో తరలించారని తెలిపారు. భగవంతుడికి అవమానం చేశాననే విచారం కూడా ఆయనకు లేదన్నారు. ఆయన అకృత్యాల కారణంగానే ఆయన పాలనలో రాష్ట్రంలో దుర్బిక్షం, కరువు రాజ్యమేలాయన్నారు. సీఎం జగన్ పథకాలు అమలు చేయాలంటే దేశ బడ్జెట్ కూడా సరిపోదని చంద్రబాబు, పవన్ విమర్శించారని, అయినా దేవుడి అండతో ఐదేళ్లూ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. చంద్రబాబు నోరు మూతపడేలా సీఎం జగన్ ప్రజలకు సంక్షేమం అందించారన్నారు. -
ఏపీలో టెంపుల్ టూరిజం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక
-
ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది. స్పెషల్ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం పిల్గ్రిమ్ పాత్‌వేస్‌కు చెందిన ‘బుక్ మై దర్శన్’ వెబ్సైట్ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ అయిన బుక్ మై దర్శన్ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్ సర్వీసుల)ను కల్పిస్తోంది. ఏపీటీడీసీ బస్సులతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్‌పోర్టు, మార్కెటింగ్ సేవలను ‘బుక్ మై దర్శన్’ అందించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు. ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్ ఎండ్ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్ఎఫ్ఐబీ ట్యాగ్లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు) ♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్ (రూ.970/రూ.780) ♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570) ♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250) ♦ విశాఖపట్నం సిటీ టూర్ (రూ.940/రూ.750) ♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320) ♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250) ♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180) ♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290) ♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470) 2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా ♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560) ♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740) ♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460) ♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570) ♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) -
చంద్రబాబు కూల్చిన ఆలయాల్లో నేడు విగ్రహ ప్రతిష్ట
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): గత చంద్రబాబు ప్రభుత్వం కూల్చిన ఏడు ఆలయాల్లో గురువారం ప్రాణప్రతిష్టను నిర్వహించనున్నారు. ఉదయం 11.24 గంటలకు దుర్గగుడి ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ మధ్య దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ట, కలశస్థాపన జరగనుంది. ప్రాణ, శిఖర ప్రతిష్టలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఏడు ఆలయాలను ఏకంగా రూ.2.5 కోట్లతో పునర్నిర్మించింది. 2016లో కృష్ణా పుష్కరాల పేరిట చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో ఏడు ఆలయాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం కూల్చిన ఈ ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించారు. అంతేకాకుండా 2021 జనవరి 8న ఆయా ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయాల నిర్మాణం శరవేగంగా జరిగేలా నాటి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రస్తుత మంత్రి కొట్టు సత్యనారాయణతోపాటు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 7న దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌తో పాటు పునర్నిర్మించిన ఆలయాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దేవతామూర్తులకు ధాన్య, పూజాధివాసాలు కాగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాత మెట్ల మార్గంలోని వినాయక, ఆంజనేయ స్వామి వారి ఆలయాల పున ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆయా దేవతామూర్తుల విగ్రహాలతోపాటు సీతమ్మ వారి పాదాల సమీపంలోని దక్షిణాముఖ ఆంజనేయ స్వామి వారి పున:ప్రతిష్ట జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానాచార్య శివప్రసాద్‌శర్మ పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహాలకు జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాదివాసం, శయనాధివాసం చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు పాల్గొన్నారు. నేడు ప్రాణప్రతిష్ట జరిగే ఆలయాలివే.. శ్రీ దక్షిణాముఖ ఆంజనేయస్వామి వారి ఆలయం వ్యయం రూ.45 లక్షలు సీతమ్మ వారి పాదాలు వ్యయం రూ.10 లక్షలు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం –కృష్ణలంక వ్యయం రూ.15 లక్షలు వీరబాబు దేవస్థానం (తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద) వ్యయం రూ.15 లక్షలు వేణుగోపాలస్వామి వారి దేవాలయం (విజయవాడ గోశాల వద్ద) వ్యయం రూ.68 లక్షలు బొడ్డు బొమ్మ (రథం సెంటర్) వ్యయం రూ.23 లక్షలు శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయం, అమ్మవారి తొలి మెట్లు –ఇంద్రకీలాద్రి వ్యయం రూ.29 లక్షలు -
అనంత్ అంబానీ వివాహ సందడి..మరోవైపు ఏకంగా 14 దేవాలయాల నిర్మాణం!
రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జులై 12న అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ గ్రాండ్‌గా నిర్వహించేందకు అంబానీ కుటుంబం రెడీ అయిపోయింది. వచ్చే నెల మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3 వరకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకల ఘనంగా జరగనున్నాయి. అందులో భాగంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న భారీ ఆలయ సముదాయంలో 14 కొత్త ఆలయాలను నిర్మించింది అంబానీ కుటుంబం. ఇక్కడ ఎంతో అందంగా చెక్కిన స్తంభాలు, దేవతల శిల్పాలు, ఫ్రెస్కో శైలి పెయింటింగ్స్ ఉన్నాయి. తరతరాలుగా వచ్చిన నిర్మాణ శైలులను ప్రతిబింబించేలా సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్నాయి. జామ్ నగర్‌లోని మోతీ ఖావ్డి వద్ద ఉన్న ఆలయ సముదాయంలో ప్రముఖ శిల్పులు, స్థానిక కళాకారుల సహకారంతో ఈ దేవాలయాలను సర్వాంగ సుందరంగా రూపొందించారు. ఈ ఆలయాల్లో శిల్పాలను, స్థంభాలను చెక్కిన తీరు భారతదేశ శిల్పకళాకారుల అసామాన్యమైన నైపుణ్యం, అంకితభావాన్ని నిలువెత్తు నిదర్శంగా ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్ పర్సన్ నీతా అంబానీ భారతీయ వారసత్వం, సంప్రదాయం, సంస్కృతిని పరిరక్షించడం, ప్రోత్సహించడం అనే విజన్‌కు అనుగుణంగా స్థానిక కళాకారులు అద్భుతంగా ఈ ఆలయాలను నిర్మించారని ప్రశంసించారు . అంతేగాదు ఆ ఆలయాలను సందర్శించి అక్కడి కళారూపాలను చూసి ముగ్దులైపోవడమే గాక ఆ శిల్పకారుల పని తీరును కొనియాడారు నీతా అంబానీ. వారి నైపుణ్యంతో ఆయా ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వివాహానికి ముందే ఈ ఆలయాలు ఇంత అందంగా రూపుదిద్దుకోవడం తమ ఇంట జరగనున్న వివాహ వేడుకకు మంచి శుభారంభంమని అన్నారు. ఇంకోవైపు.. జామ్‌నగర్‌లో జరగబోయే వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అతిరథ మహారథులు హాజరవుతున్నారు. రజినీ కాంత్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి నటులతో పాటు ఫేస్ బుక్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈఓ టెడ్ బిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్, అడ్నోక్ సీఈఓ సుత్లాన్ అహ్మద్ అల్ జాబర్ వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు వస్తున్నారు. అలాగే అంతర్జాతీయ కళాకారులు ఈ వివాహ వేడుకలకు హాజరవనున్నారు. (చదవండి: అంబానీ ఇంట పెళ్లికి షారూఖ్ పెర్ఫార్మెన్స్? ఫీజు అన్ని కోట్లా?) -
515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులను నియమించాలని ప్రభుత్వం నియమించింది. పది పదిహేను రోజుల్లో ఈ బోర్డుల ఏర్పాటుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ. 5 లక్షలు, అంతకు పైబడి ఆదాయం ఉండే ఆలయాలు 1,234 వరకు ఉన్నాయి. వీటిలో 678 ఆలయాలకు ట్రస్టు బోర్డులు ఉన్నాయి. ట్రస్టు బోర్డుల పదవీ కాలం ముగిసిన ఆలయాలు 556 ఉన్నాయి. వీటిలో ట్రస్టు బోర్డుల నియామకానికి ఎలాంటి పాలన పరమైన, న్యాయపరమైన చిక్కులు లేని 515 ఆలయాలకు నూతన ట్రస్టు బోర్డులను నియమిస్తున్నారు. ట్రస్టు బోర్డులో ఆలయం స్థాయినిబట్టి 7 నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. ఈ ట్రస్టు బోర్డుల నియామకం ద్వారా ఐదు వేల మందికి పైనే నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ పదవుల్లో సగం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. జనరల్ సహా అన్ని కేటగిరీల్లో 50 శాతం పదవులు మహిళలకే దక్కనున్నాయి. రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం నుంచి పూర్తిగా మినహాయించారు. ఈ ఆలయాల వంశ పారంపర్య ధర్మకర్తలు లేదంటే వంశ పారంపర్య అర్చకులు, లేదా çప్రముఖ హిందూ సంస్థలు వాటి నిర్వహణకు ముందుకొస్తే వారికే అప్పగించేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ట్రస్టు బోర్డుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చింది సీఎం జగనే.. ఆలయ ట్రస్టు బోర్డుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ ఇంతకు ముందే ప్రత్యేకంగా దేవదాయ శాఖ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. ప్రతి ట్రస్టు బోర్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, జనరల్ సహా ఆయా రిజర్వు కేటగిరిల్లో సగం పదవులు తప్పనిసరిగా మహిళలకే కేటాయించేలా జగన్ ప్రభుత్వం ఈ చట్టం చేసింది. దీంతోపాటు ఆలయాల కేశ ఖండన శాలల్లో నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రముఖంగా ఉంటే ట్రస్టు బోర్డులోనూ ఆ వర్గం వారిని ఒక సభ్యుడిగా నియమించే వీలు కల్పించారు. అదే సమయంలో ట్రస్టు బోర్డు సభ్యుల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వం వారిని వారి పదవీ కాలం కంటే ముందే తొలగించేలా విస్పష్టంగా చట్టాన్ని సవరించారు. ఈ చట్ట సవరణలు అనంతరం ప్రభుత్వం నియమించిన అన్ని ఆలయ ట్రస్టు బోర్డుల్లో ఇప్పుటి వరకు 4,024 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చోటు దక్కింది. 3,787 మంది మహిళలూ ఆయా ట్రస్టు బోర్డుల్లో భాగస్వాములయ్యారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు నామ మాత్రపు ప్రాధాన్యత కూడ ఉండేది కాదని అధికారవర్గాలు వివరిస్తున్నాయి. -
నేడు వసంత పంచమి: దేశంలోని ప్రముఖ సరస్వతి ఆలయాలివే!
ఈరోజు (ఫిబ్రవరి 14).. వసంత పంచమి.. అంటే చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినోత్సవం. దేశవ్యాప్తంగా ఈరోజు సరస్వతీమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యసాలు కూడా చేయిస్తుంటారు. అయితే దేశంలోని సరస్వతి ఆలయాల విషయానికొస్తే తక్కువగానే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ సరస్వతీ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భీమపుల్ సరస్వతి ఆలయం (ఉత్తరాఖండ్) ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో భీమపుల్ సరస్వతి ఆలయం ఉంది . ఇక్కడ సరస్వతీ మాత స్వయంగా వెలిశారని చెబుతారు. ఇక్కడ సరస్వతీమాత భీమా నది సమీపంలో ఉద్భవించారు. బాసర సరస్వతి ఆలయం (తెలంగాణ) బాసర గ్రామం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ముధోల్ పరిధిలో ఉంది. ఇక్కడ గోదావరి ఒడ్డున సరస్వతీమాత ఆలయం ఉంది. దీనిని మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో వాల్మీకి సమాధి స్థలం కూడా ఉంది. ఆలయంలో లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. ఆలయంలో సరస్వతీమాత విగ్రహం పద్మాసన భంగిమలో నాలుగు అడుగుల ఎత్తుతో కూడి ఉంటుంది. ఆలయానికి తూర్పున మహంకాళి ఆలయం కూడా ఉంది. పుష్కర్ సరస్వతి ఆలయం (రాజస్థాన్) రాజస్థాన్‌లోని పుష్కర్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం, జ్ఞాన సరస్వతి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ సావిత్రిమాత ఆలయం కూడా ఉంది. సరస్వతీ మాత ఇక్కడ నది రూపంలో కొలువుదీరిందని విశ్వసిస్తారు. శృంగేరి శారదా ఆలయం(కర్నాటక) జగద్గురు శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాలలో కర్నాటకలోని శృంగేరి పీఠం ఒకటి. శృంగేరిలో శారదాంబ ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ శారదాంబ ఆలయాన్ని, దక్షిణామ్నాయ పీఠాన్ని ఏడవ శతాబ్దంలో ఆచార్య శ్రీ శంకర్ భగవత్పాదులవారు నిర్మించారు. మూకాంబిక ఆలయం(కేరళ) కేరళలోని ఎర్నాకులం జిల్లాలో మూకాంబిక ఆలయంగా పేరొందిన సరస్వతి మాత ఆలయం ఉంది. చరిత్రలోని వివరాల ప్రకారం ఇక్కడి రాజులు మూకాంబిక దేవిని పూజించేవారు. ప్రతి సంవత్సరం మంగళూరులో ఉత్సవాలు నిర్వహించేవారు. అయితే భక్తులు అక్కడికి వచ్చేందుకు పలు ఇబ్బందులు పడేవారట. ఒకరోజు అక్కడి రాజుకు కలలో అమ్మవారు కనిపించి, తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరారట. ఇక్కడ కొలువైన సరస్వతీ దేవి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. మైహార్ శారదా ఆలయం (మధ్యప్రదేశ్) మైహార్ శారదా ఆలయం.. మాతా కాళికా ఆలయంగానూ, సరస్వతీ ఆలయంగానూ పేరొందింది. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని సత్నా నగరానికి సమీపంలో త్రికూట కొండపై ఉంది. సరస్వతీమాత.. శారదాదేవి రూపంలో ఇక్కడ దర్శనమిస్తుంది. భోజశాల (మధ్యప్రదేశ్) మధ్యప్రదేశ్‌లోని ధార్ నగరంలో భోజశాల ఆలయం ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం వసంత పంచమి నాడు సరస్వతీ దేవి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ రోజున సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. భోజరాజు సరస్వతీ దేవి భక్తుడు. ఆయనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. విద్యా సరస్వతీ ఆలయం (తెలంగాణ) విద్యా సరస్వతి ఆలయం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఉంది. కంచి శంకర మఠం ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి ఆలయం, శనీశ్వరుని ఆలయం, శివాలయం ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. -
4,500 కొత్త ఆలయాల్ని నిర్మించాం
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో 4,500 కొత్త ఆలయాల్ని నిర్మించిందని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో దేవుడి ఆస్తుల రక్షణతోపాటు ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువగా ఉండే చిన్న గుళ్లలో సైతం నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు కొనసాగేలా.. డీడీఎన్ఎస్ పథకం పేరుతో అర్చకులకు తగిన ఆరి్థక సహాయం చేస్తోందన్నారు. 19 డీసీ, 22 ఏసీ పోస్టుల పదోన్నతి ఇటీవల కాలంలో ఆలయాల వార్షిక ఆదాయం ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ మేరకు దేవదాయ శాఖలో కొత్తగా మంజూరు చేసిన డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు పదోన్నతులు కల్పిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్లుగా పనిచేస్తున్న 19 మందికి డిప్యూటీ కమిషనర్లుగానూ.. వివిధ ఆలయాల్లో గ్రేడ్–1 ఈవోలుగా, ఏఈవోలుగా, కార్యాలయాల్లో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న మరో 22 మందికి అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించారు. -
బాబు పలుగుపోట్లు మర్చిపోతే ఎలా?
సాక్షి, అమరావతి: నిత్యం చంద్రబాబు మత్తులో జోగుతున్న ఈనాడు రామోజీరావు ఆ మైకంలో పడి పూర్తి ఉన్మాదిగా మారిపోయారు. ఎందుకంటే.. టీడీపీ హయాంలో కృష్ణానది ఒడ్డున పవిత్ర దేవా లయాలు కూల్చేస్తే సిగ్గులేకుండా కళ్లుమూసుకున్న ఆయన.. ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం గు రించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లి స్తున్నట్లుగా ఉంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు.. ఈనాడులో తరచూ ప్రచురించే కథనాలకు ఎక్కడా పోలిక లేదనేది జగమెరిగిన సత్యం. చరిత్రలోనే ఎప్పుడూలేని విధంగా ఏపీలో దేవాలయాల అభివృద్ధి విస్తృతంగా జరుగుతోంది. దేవదాయ శాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మా ణంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలు మూలలా 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇదంతా సీఎం వైఎస్ జగన్ హయాంలో చేపట్టడాన్ని రామోజీ తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయన విషపుత్రిక ‘ఈనాడు’లో ‘జగనన్న పాపాలు–భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలి వేటు’ అంటూ చేతికొచ్చింది రాసిపారేశారు. చంద్ర బాబు సీఎంగా ఉన్నప్పుడు రోడ్లకు అడ్డంగా ఉన్నా యనే నెపంతో విజయవాడలో ఒకే రాత్రి పదుల సంఖ్యలో గుళ్లను పలుగుపోట్లతో నేలమట్టం చేసిన విషయం ఆయన మర్చిపోయారు. అలాంటి చంద్రబాబును ‘ఈనాడు’ నిత్యం కీర్తిస్తుంది. కానీ, ఆ కూల్చిన గుళ్లను పునర్నిర్మించి ప్రారంభించిన సీఎం జగన్‌ను మాత్రం రాక్షసుడిగా పోల్చడమంటే రామోజీ పైశాచికత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ట్రస్టు భూములు అమ్మినోళ్లపై ఎందుకంత ప్రేమ? 2014లో బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పేరుతో విశాఖ పరిసరాల్లో దేవదాయ శాఖకు చెందిన నాలుగు వందల ఎకరాలకుపైగా మాన్సాస్ ట్రస్టు భూములను అమ్మకానికి పెట్టారు. కానీ, కాలేజీపై నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ ఐదేళ్లలో 70ఎకరాల వరకు విక్రయించి రూ.వందల కోట్లను పోగేసుకున్నారు. ఇలా దేవదాయ శాఖకు చెందిన అనేక భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నంలేదు. సీఎం జగన్ మాత్రం.. భవిష్యత్తులో ఆలయాల భూములను ఎవరూ ఆక్ర మించుకునేందుకు వీల్లేకుండా ఓ ఆర్డినెన్స్ తీసు కొచ్చారు. ఇది దేవదాయ శాఖ చరిత్రలో పెద్ద విప్లవాత్మక నిర్ణయం. దేవుడి భూము లను కాపాడేందుకు ఇలాంటి పటిష్ట చట్టాలు తీసుకురావడం ఈనాడుకు నచ్చడంలేదు. అందుకే సీఎం జగన్ నిర్ణయంపై అక్కసు ప్రదర్శిస్తోంది. బాబు పాలన రామరాజ్యమా? చంద్రబాబు హయాంలో విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు చేశారని పెద్ద దుమారం చెలరేగింది. బెంజ్‌సర్కిల్ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను అధికారులు వ్యతి రేకించినప్పటికీ తక్కువ లీజుకే బాబుకు అత్యంత సన్నిహితుడి విద్యాసంస్థకు టీడీపీ సర్కార్ కట్ట బెట్టింది. సీఎం జగన్ ప్రభుత్వం విజయవాడ దుర్గగుడి ఆలయ అభివృద్ధికి ఎప్పుడు లేనంతగా ప్రభుత్వ ఖజానా నుంచి రూ.70 కోట్లను మంజూరు చేసింది. రామోజీకి చంద్రబాబు ప్రభుత్వం రామ రాజ్యంగానూ, ఆలయాలను అభివృద్ధి చేస్తున్న జగన్ సర్కారు రాక్షస ప్రభుత్వంలా కనిపిస్తుంది. భక్తుల కమిటీలకే ఆలయాల నిర్వహణ.. దేవదాయ శాఖ పరిధిలోని చిన్నా, పెద్ద ఆలయాలు అన్నింటికీ టీడీపీ నేతలే ట్రస్టు బాధ్యతల్లో ఉండే వారు. సీఎం జగన్ ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ ఆయా ఆల యాల వంశపారంపర్య ధర్మకర్తలకు, స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో 25 వేలకు పైగా ఆలయాలు, సత్రాలు ఉండగా.. రూ.5 లక్షలు పైబడి ఆదాయమున్న 1,400 ఆల యాలకే ప్రభుత్వం ట్రస్టు బోర్డులు నియమిస్తోంది. ధార్మిక పరిషత్ కథ ఇంతే.. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వివిధ స్వామీజీలు, రిటైర్డు జడ్జిలు, రిటైర్డు దేవదాయ శాఖ అధికారులు సభ్యులుగా ఉండే ధార్మిక పరిషత్‌కు వర్తింప జేస్తూ 2009లోనే అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ప్రభుత్వం జోక్యం చాలావరకు తగ్గింది. అయితే, 2014–19 మధ్య చంద్రబాబు దాని ఏర్పాటును నిర్లక్ష్యంచేశారు. ఆలయాల భుములను టీడీపీ నేతలు ఇష్టానుసారం వాడుకునేందుకు వీలుగా కేవలం ఐదారుగురు అధికారులతో తాత్కాలిక పరిషత్ ఏర్పాటుచేశారు. అదే సీఎం జగన్ ప్రభుత్వం 2022లో ధార్మిక పరిషత్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసింది. కానీ, దేవదాయ శాఖకు స్వయం ప్రతిపత్తి లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ‘ఈనాడు’ గొప్పగా ఊహించుకుంటూ జగన్ సర్కారును రాక్షస రాజ్యంగా ఈనాడు అభివర్ణిస్తూ పేట్రేగిపోతోంది. -
జ్ఞానవాపి కేసులో హిందువులకు అతిపెద్ద విజయం
-
ఇక టీటీడీ పరిధిలోకి రాజనాలబండ ఆలయాలు..!
చౌడేపల్లె: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ వీరాంజనేయస్వామి ఆలయం, సమీపంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో చరిత్రాత్మక ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు విశిష్ట కృషిచేశారని కొనియాడారు. తిరుపతి గోవిందరాజస్వామి టెంపుల్ డిప్యూటీ ఈఓ శాంతి, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఏకాంబరం కలిసి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ తాళాలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఆలయానికి చెందిన భూములు, బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు ఇక నుంచి టీటీడీ ఆధ్వ ర్యంలో జరుగుతాయన్నారు. ఈ మేరకు ఆలయ ఆదాయ వనరులు, ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ ఈఓ శాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యువెలరీ ఏఈఓ మణి, జనరల్ సెక్షన్ డిప్యూటీ ఈఓ శివప్రసాద్, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ వెంకట్రమణ, ల్యాండ్స్ ఎస్టేట్ విభాగం తహసీల్దార్ లలితాంజలి, టెంపుల్ ఇన్చార్జి భానుప్రకాష్ తదితరులున్నారు. భక్తి శ్రద్ధలతో చండీ హోమం బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని యాగశాలలో నెలకొల్పారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి అభిషేక పూజలు చేశారు. పూర్ణాహుతి అనంతరం ఉభయదారులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేయించారు. -
అప్పుడు అపచారం ఇప్పుడు వైభవోజ్వలం
♦ 2015లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన ప్రచారార్భాటానికి గోదావరి పుష్కరాలను వాడుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రిలోని వీఐపీ ఘాట్‌లో కాకుండా సాధారణ భక్తులకు కేటాయించిన ఘాట్‌లో పుష్కర స్నానాలకు వెళ్లారు. ఒక డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం ప్రజలను నియంత్రించి.. ఒక్కసారిగా వదిలేయడంతో తొక్కిసలాట జరిగి ఏకంగా 29 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. ♦ 2016లో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు అడ్డుగా ఉన్నాయని సీఎంగా ఉన్న చంద్రబాబు ఆదేశాలతో విజయవాడలో దాదాపు 30 ఆలయాలు కూల్చి వేశారు. శనైశ్వర స్వామి వారి ఆలయం, సీతమ్మ వారి పాదాలు, బొడ్డు బొమ్మ, వీరబాబు ఆలయం, అమ్మవారి పాత మెట్ల మార్గంలోని ఆంజనేయ స్వామి ఆలయం, వినాయక ఆలయం, గో సంరక్షణ సంఘంలోని కృష్ణ మందిరం, దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ఆలయం, పద్మావతి ఘాట్ సమీపంలోని సాయిబాబా మందిరం, మల్లేశ్వర స్వామి ఆలయం మెట్ల మార్గంలోని వీరాంజనేయ స్వామి ఆలయం, పాత మెట్ల మార్గంలోని శృంగేరీ పీఠానికి చెందిన వీరాంజనేయ స్వామి ఆలయం, కొండపై అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మౌన స్వామి ఆలయం తదితర ఆలయాలు కూల్చివేతకు గురయ్యాయి. ♦ విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయం కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ♦ విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో బోడికొండపైనున్న శ్రీ కోదండరాముని ఆలయం 2014 అక్టోబరులో సంభవించిన హుద్‌హుద్ తుపాను ప్రభావంతో శిథిలమైంది. ప్రహరీ, ధ్వజస్తంభం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త టీడీపీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్‌గజపతిరాజే. అప్పుడు సీఎంగా ఉన్నదీ చంద్రబాబే. వీరెవ్వరూ పట్టించుకోక పోవడంతో దుండగులు కోదండ రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆదాయం లేని ఆలయాలలో నిత్య ధూప దీప నైవేద్య నిర్వహణకు అమలు చేసే డీడీఎన్ఎస్ పథకం 1,620 ఆలయాల (అందులో 1500 దాకా ఉమ్మడి ఏపీలో మంజూరు చేసినవే)కు మాత్రమే వర్తింపు. శిథిలమైన రామతీర్థం ఆలయం రూ.4 కోట్లతో పునర్నిర్మాణం. నిపుణులైన శిల్పులతో సీతా సమేత కోదండరాముడు, లక్ష్మణ విగ్రహాల తయారీ. ఆకర్షణీయంగా గర్భాలయం తర్వాత అర్ధ, ముఖ మండపాలు. ధ్వజస్తంభాన్ని పునరుద్ధరణ. పటిష్టంగా ప్రహరీ నిర్మాణం. మొత్తంగా 2022 ఏప్రిల్ 15వ తేదీన పునఃప్రతిష్ట. రాష్ట్ర సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధి కాంక్షిస్తూ ‘అష్టోత్తర శతకుండాత్మక చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం’ నిర్వహణ. – సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, విజయవాడ, విజయనగరం ♦ చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో కూల్చి వేసిన ఆలయాల్లో ప్రధానంగా 8 ఆలయాల పునఃనిర్మాణం. ఈ ఎనిమిది ఆలయాలకు 2021 జనవరి 8న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన. రూ.3.87 కోట్లతో నిర్మాణాలు పూర్తి. డిసెంబరు 8వ తేదీన భక్తులకు అంకితం. మరో ఐదు ఆలయాలలో ప్రధానమైన మౌన స్వామి విగ్రహం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తిరిగి ఏర్పాటు. పాత మెట్ల మార్గంలోని ఆంజనేయస్వామి, మల్లేశ్వర స్వామి మెట్ల మార్గంలోని వీరాంజనేయస్వామి విగ్రహాలకు బ్రాహ్మణ వీధిలోని వాటర్ ట్యాంక్ వద్ద ఆలయాల్లో పూజా కార్యక్రమాలు. ♦ దుర్గగుడి అభివృద్ధి కోసం రూ.70 కోట్లు మంజూరు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం. రూ.216 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, ఎనర్జీ, వాటర్ వర్క్స్, అన్నప్రసాద భవనం, పోటు భవనం, ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్, రాజగోపురం ముందు మెట్ల నిర్మాణం, మహారాజ ద్వారం, నూతన కేశఖండనశాల తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ♦ 757 పురాతన ఆలయాలను కామన్‌గుడ్ ఫండ్ నిధులతో పునః నిర్మాణం చేయడంతో పాటు టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో కొత్తగా 2,872 ఆలయాల నిర్మాణం. ఇప్పుడు నిత్య ధూప దీప నైవేద్య నిర్వహణకు డీడీఎన్ఎస్ పథకం 4,834 ఆలయాలకు వర్తింపు -
అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు అన్ని!
అయోధ్య నుంచి ‘సాక్షి’ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి :దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక పట్టణాలున్నా వాటిలో అయోధ్య తీరే వేరు. రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో ఇళ్లు, చెట్టు, పుట్ట సర్వం రామమయమే. రామనామ సంకీర్తనతో సూర్యోదయాన్ని చూసే అయోధ్య.. రామ భజన తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తుంది. ఇలా ఆధ్యాత్మక పట్టణాల్లో స్థానికంగా దైవ సంకీర్తనలు సహజమే.. కానీ ఆ ఊరిలో ఎన్ని ఇళ్లుంటాయో అన్ని గుడులు ఉండటం మాత్రం అయోధ్యకే చెల్లింది. ఆ పట్టణంలో 8 వేలకుపైగా ఆలయాలు ఉన్నాయని అయోధ్యవాసులు చెప్తున్నారు. మహమ్మదీయ రాజుల కాలంలో ధ్వంసంగా కాగా మిగిలిన వాటి సంఖ్య ఇదని అంటున్నారు. ప్రతి ఇల్లూ ఓ ఆలయమే.. అయోధ్యలో ప్రతి హిందువు ఇంట్లో ఓ చిన్నపాటి దేవాలయం ఉంటుంది. మన ఇళ్లలో పూజా మందిరం ఉన్నట్టుగా కాకుండా పెద్ద పరిమాణంలోని విగ్రహాలతో ఓ చిన్న గుడి ఉంటుంది. నిత్య పూజలు, నైవేద్యాలు, గుడిని తలపించే పూజాదికాలు జరుగుతుంటాయి. అందుకే అయోధ్యలో ప్రతి ఇల్లూ ఓ ఆలయమే అంటారు. అయోధ్య పట్టణంలో ఉన్న ఇళ్ల సంఖ్య 10,026. అంటే అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు కూడా అన్ని ఉన్నట్టు. ముఖ్యమైన ఆలయాల పునరుద్ధరణ కొత్త రామాలయం ప్రతిష్టాపన ఉత్సవాలు ముగిశాక అయోధ్యలోని ఇతర ప్రధాన దేవాలయాలను కూడా పునరుద్ధరించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది వేల గుడులున్నా వాటిలో ముఖ్యమైనవి వంద వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ చారిత్రక ప్రాధాన్యమున్నవే. వందల ఏళ్లుగా పూజాదికాలు జరుగుతున్నవే. వాటిలో కొన్ని ఆలయాలు చాలా పురాతనమైనవి కూడా. శ్రీరాముడి జీవిత ఘట్టాలు, వ్యక్తులతో ముడిపడిన ఆలయాలు ఉన్నాయి. హనుమంతుడు, లక్ష్మణుడు, భరత–శత్రుజు్ఞలు, సుగ్రీవుడు, జాంబవంతుడు, విశ్వామిత్రుడు, వశిషు్టడు, జనకమహారాజు, దశరథుడు.. ఇలా ఎన్నో గుడులు ఉన్నాయి. ► సీతమ్మ వంట చేసినట్టుగా పేర్కొనే సీతా రసో యీ, దశరథుడు నివసించినట్టు చెప్పే రాజభవనం, మణిమాణిక్యాలను కానుకలుగా తెచి్చన జనక మహారాజు పేరుతో ఏర్పడ్డ మణి పర్వత, సుగ్రీవ ఖిలా.. ఇలాంటి నిర్మాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిలో నిర్వహణ లోపాలు, వాతావరణ ప్రభావంతో కొన్ని శిథిలమయ్యా యి. ఇప్పటికీ సలక్షణంగా ఉన్న గుడులు, నిర్మాణాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు ప్రధానాలయ దర్శనానికే పరిమితం కాకుండా.. ఇవన్నీ చూసేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కోనేరులకూ యోగం.. అయోధ్యలో చాలా చోట్ల ఆలయాలతోపాటు అనుసంధానంగా కోనేరులు ఉన్నాయి. వాటికి కూడా రామాయణ గాథలతో ముడిపడిన చరిత్ర ఉంది. వీటిలో ముఖ్యమైన 35 కోనేరులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సరయూ నది రివర్‌ఫ్రంట్‌ను అహ్మదాబాద్ సబర్మతీ తీరం తరహాలో అభివృద్ధి చేశారు. లైట్ అండ్ మ్యూజిక్ షో, లేజర్ షో ఏర్పాటు చేశారు. సాయంత్రం నదీ హారతి ఇస్తున్నారు. -
సోమవారం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట
-
టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ప్రారంభం
సాక్షి,తిరుమల: టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానిక, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. మరోసారి తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్ సైట్ పేరు మారినట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ పేరుతో ఇతర వెబ్సైట్ వస్తుండటంతో టీటీడి తాజా వెబ్సైట్ పేరు మార్పు చేసింది. శ్రీవారి భక్తులు ఇకపై టీటీడీ సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ తెలుసుకోవచ్చు. గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉన్న టీటీడీ వెబ్సైట్ పేరు ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్పు చేశారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతి, ఇతర ప్రాంతాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలుతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో కొత్త వెబ్ సైట్ ttdevasthanams.ap.gov.inను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ పేరు మార్పుని 'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్ సైట్, వన్ మొబైల్ యాప్' లో భాగంగా మార్చినట్లు వెల్లడించింది. ఇక నుంచి శ్రీవారి భక్తులు ఆన్లైన్ బుకింగ్‌ను ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవాల్సిందిగా సూచించారు. స్వామి వారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా వెబ్ సైట్ పేరుని మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంస్థ, ఒకే వెబ్ సైట్, ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో పేరుని మార్చినట్లు ప్రకటించింది. ఇక పై భక్తులు శ్రీవారి దర్శనం కోసం లేదా ఆలయ వివరాల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే.. ఇక నుంచి కొత్త వెబ్‌సైట్‌ని ఉపయోగించాలని వెల్లడించింది. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అనంతరం టీటీడీ వెబ్‌సైట్‌ను tirupatibalaji.ap.gov.inగా మార్చారు. ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చి.. ttdevasthanams.ap.gov.inగా కొత్త పేరుని పెట్టారు. ఈ కొత్త వెబ్ సైట్ లో తిరుపతిలో టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు.. అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, చరిత్రతో సహా శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణ వివరాలు, బస సహా ఇతర వివరాలను భక్తులు తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను భక్తులకు అందుబాటులో ఉంచారు. -
అయోధ్యలో నూతన రామమందిర వైభవం
-
నయా సాల్.. ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్త జనం (ఫొటోలు)
-
హైదరాబాద్ లోని ఆలయాలకు నూతన సంవత్సర శోభ
-
ఆలయం ఏదైనా మీ ఇంట్లోనే టికెట్
సాక్షి, అమరావతి:ఏడాదిన్నర క్రితం దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. 8 ఆలయాల్లో ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్ సేవల్ని వినియోగించుకున్నారు. భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉండే రోజుల్లో సైతం భక్తులు 30 నుంచి 90 రోజుల ముందుగానే దర్శన టిక్కెట్లు, పూజలు, ఇతర సేవ టికెట్లతో పాటు ఆలయాల్లో అద్దె గదుల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. తద్వారా దైవ దర్శనాలకు వెళ్లిన రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఇష్టదైవాలను కొలిచారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 3న మొదటిసారి శ్రీశైలం ఆలయంలో ఆన్లైన్ సేవలను ప్రాథమికంగా ప్రారంభించారు. ఆ తర్వాత 2022 జూలై 21వ తేదీ నుంచి ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో అన్ని రకాల సేవలను పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దశలవారీగా పెద్ద ఆలయాలన్నింటిలోనూ ఈ రకమైన ఆన్లైన్ సేవలను విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా, ఈ సేవలు ప్రారంభించిన 2022 జూలై 21 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 23 తేదీ వరకు 10,20,943 మంది భక్తులు వినియోగించుకున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ఆలయాలు కొన్ని రకాల సేవలను గరిష్టంగా 30 రోజుల ముందుగా మాత్రమే ఆన్లైన్ అందుబాటులో ఉంచుతుండగా.. ఆలయాలు, అక్కడి సేవల ఆధారంగా గరిష్టంగా 90 రోజుల ముందుగా కూడా ఈ సేవలు పొందే వీలు కల్పించినట్టు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు ఆలయాలకు వెళ్లే భక్తులు భక్తి పారవశ్యంతో దైవ దర్శనం పూర్తి చేసుకునేలా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆలయాల పైరవీలు, అక్రమాలకు తావు లేకుండా సేవ, దర్శన టికెట్లు ముందుగా కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాటు చేశాం. ఆలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వ ఖజానా నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దుర్గ గుడికి నిధులు కేటాయించారు. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పురాతన ఆలయాల పునఃనిర్మాణంతో పాటు కొత్త ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) అత్యంత సులభ విధానంలో బుకింగ్ ఆలయాల్లో పూజలు, సేవలు, దర్శన టికెట్లు భక్తులు సులభంగా ముందస్తుగానే బుక్ చేసుకోవడానికి వీలుగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం పూర్తిగా ఆధునికీకరించింది. ఏ ఆలయానికి ఆ ఆలయం కాకుండా అన్ని ఆలయాలకు సంబం«ధించి ఈ రకమైన సేవలను ఒకేచోట నుంచి భక్తులు పొందేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. భక్తులు తమ ఫోన్ నంబర్ ఉపయోగించి ఈ సేవలు పొందేలా చర్యలు తీసుకున్నారు. -
నేడు వైకుంఠ ఏకాదశి..ఆలయాలకు పోటెత్తిన భక్తులు
-
రూ.1,400 కోట్లతో ఆలయాల అభివృద్ధి
తొండంగి: రాష్ట్రంలో రూ.1,400 కోట్లతో ముఖ్య దేవాలయాలను అభివృద్ధి చేశామని రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై రూ.25 కోట్లతో నిర్మించిన శివసదన్, యాత్రికుల విశ్రాంతి భవనాలు, ఘాట్ రోడ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవాలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అన్నవరం కొండపై భక్తుల సౌకర్యాల కల్పనలో భాగంగా 138 గదులతో శివసదన్ నిర్మించినట్లు తెలిపారు. శ్రీసత్యన్నారాయణ యాత్ర నివాస్, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు సీఆర్వో కార్యాలయం వెనుక ఆదిశంకర మార్గ్, సత్యగిరి వైజంక్షన్ వద్ద హరిహర మార్గ్, వనదుర్గ మార్గ్‌లను పూర్తి చేసినట్లు చెప్పారు. రాజమహేంద్రవరానికి చెందిన దాత రాజామణి సుమారు రూ.2 కోట్లతో భక్తుల కోసం రత్నగిరి విశ్రాంతి భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. వైకుంఠ ఏకా దశి నాడు శంఖు చక్రాలు ప్రారంభించాలని ఆలయ ఈవోకు ఆదేశాలు ఇచ్చామన్నారు. -
కార్తీక మాసం చివరి సోమవారం..
-
ఇంద్రకీలాద్రికి సరికొత్త శోభ
-
Amazing Temples: ప్రపంచంలో ఉన్న అద్భుతమైన ఆలయాలు (ఫోటోలు)
-
బాబు కూల్చారు.. జగన్ పునర్నిర్మించారు
ఇంద్రకీలాద్రి (విజయవాడపశ్చిమ): కృష్ణా పుష్కరాల పేరిట 2016లో విజయవాడలో టీడీపీ సర్కారు కూల్చి వేసిన 8 ఆలయాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పునర్ నిర్మించి ప్రారంభించింది. నాడు పుష్కరాల సమయంలో చంద్రబాబు సర్కారు కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణం, అమ్మవారి ఆలయానికి చేరుకునే మార్గంలోని మొత్తం 13 ఆలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేసింది. చంద్రబాబు సర్కారు కూల్చి వేసిన ఆలయాలను పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఎనిమిది ఆలయాలకు 2021 జనవరి 8వ తేదీన శంకుస్థాపన చేశారు. దక్షిణాముఖ ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మవారి పాదాలు, శ్రీసీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయస్వామి ఆలయం, వీరబాబు ఆలయం, విజయవాడ గో సంరక్షణ సంఘం కృష్ణ మందిరం, బొడ్డు బొమ్మ, ఆంజనేయస్వామి ఆలయం వినాయకస్వామి ఆలయం తొలి మెట్టు, శ్రీశనైశ్వర స్వామి వారి ఆలయాల పునర్ నిర్మాణాన్ని రూ.3.87 కోట్లతో చేపట్టి పూర్తి చేశారు. తాజాగా వీటిని ప్రారంభించారు. మిగిలిన ఐదు ఆలయాలలో ప్రధానమైన మౌన స్వామి వారి విగ్రహాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి ప్రాంగణంలో తిరిగి ఏర్పాటు చేయగా పాత మెట్ల మార్గంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయం, మల్లేశ్వర స్వామి వారి మెట్ల మార్గంలోని వీరాంజనేయ స్వామి ఆలయాల్లో విగ్రహాలను బ్రాహ్మణ వీధిలోని వాటర్ ట్యాంక్ వద్ద ఆలయాల్లో ఉంచి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. -
Live: ఆలయాలకు సీఎం జగన్ ప్రారంభోత్సవం..
-
బాబు కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించిన సీఎం వైఎస్ జగన్ సర్కార్
-
కార్తీక పౌర్ణమి.. శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
సాక్షి, హైదరాబాద్: శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి, అందులోనూ సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయియి. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున నుంచే భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాన్నారు. భక్తిశ్రద్దలతో దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్ భద్రకాళి, అన్నవరం, ద్వారకతిరుమల, భద్రాచలం తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో దంపతులు, మహిళలు వేలాదిగా వచ్చి దీపాలను వెలిగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి సోమవారం రావడంతో ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అలాగే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. నిర్మల్ జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. స్థానిక వెంకటేశ్వర స్వామి, హనుమాన్ దేవలయలలో భక్తులు పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమొగుతున్నాయి. హన్మకొండలోని రుద్రశ్వరస్వామి (వెయ్యి స్తంభాల గుడి), సిద్దేశ్వరా స్వామి దేవాలయం, భద్రకాళి భద్రశ్వరా స్వామి దేవాలయాల్లో తెల్లవారు జామునుంచి భక్తులు బారులు తీరారు. కార్తీకపౌర్ణమి పర్వదినం కావడంతో దేవాలయలకు పోటెత్తారు. కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయం, కురవి వీరబాదరస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాల్లో కార్తీకపౌర్ణమి శోభ సంతరించుకుంది. కాకినాడ జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వ్రతములు ఆచరిస్తూ శ్రీ స్వామి దర్శనానికి బారులు తీరారు.పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి పాదగయ పుష్కరినిలో పవిత్ర స్నానమాచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖపట్నం విశాఖ నగరంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలు దర్శించుకుంటున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా. ద్వారకాతిరుమల శేషాచల కొండపై శివాలయంలో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున కార్తీకదీపం వెలిగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కార్తీక సోమవారం పౌర్ణమి పర్వదిన సందర్భంగా రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శివనామ స్మరణతో శైవాలయాలు మారుమోగుతున్నాయి. రాజమండ్రిలో మార్కండేయ స్వామి ఆలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం, అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లాలోని కోటిపల్లి మురమళ్ళ ముక్తేశ్వరం లోని క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి స్వామివారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. -
కేదార్నాథ్ ఆలయం మూసివేత
కశ్మీర్: హిమాలయాల్లోని కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు బుధవారం మూతపడ్డాయి. కేదార్నాథ్ ఆలయ తలుపులు ఉదయం 8:30 గంటలకు, యమునోత్రి తలుపులు 11:57 గంటలకు మూసివేయబడ్డాయి. విపరీతమైన చలిలో కూడా కేదార్‌నాథ్‌లో జరిగిన ముగింపు కార్యక్రమానికి 2,500 మందికి పైగా యాత్రికులు హాజరయ్యారని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. ఈ ఆలయం శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. కేదార్నాథ్ సమీప ప్రాంతాలు ఇప్పటికే మంచుతో కప్పబడ్డాయి. కేదార్నాథ్ శివున్ని'పంచముఖి డోలీ' ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి పూజారులు తీసుకువెళ్లారు. శీతాకాలం ముగిసేవరకు అక్కడే పూజలు నిర్వహించనున్నారు. శీతాకాలంలో 19.5 లక్షల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించారని అధికారులు తెలిపారు. ఛార్‌దామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. శీతాకాలం ముగిసేవరకు ఉత్తరకాశీ జిల్లాలోని ఖర్సాలీ గ్రామంలోని ఖుషిమత్‌లో ఆరు నెలల పాటు పూజిస్తారు. భద్రినాథ్ దామ్‌ను కూడా నవంబర్ 18న మూసివేయనున్నారు. శీతాకాలంలో హిమాలయాల్లో తీవ్ర మంచు కారణంగా ఛార్‌దామ్ యాత్రను ప్రతి ఏడాది అక్టోబర్-నవంబర్‌లో నిలిపివేసి మళ్లీ ఏప్రిల్-మే నెలల్లో ప్రారంభిస్తారు. ఇదీ చదవండి: అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి -
ప్రముఖ ఆలయాలకు చంద్ర గ్రహణం ఎఫెక్ట్
-
విజయదశమి సందర్భంగా దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
-
ఈరోజు లక్ష్మి అమ్మవారిని ఇలా పూజిస్తే..!
-
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు
-
హైందవ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం: మంత్రి కొట్టు
సాక్షి, అమరావతి: సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు నిర్వహిస్తున్న ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాలతో పాటు 6-ఎ ఆలయాల్లోనూ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన ధర్మప్రచార పరిషత్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న మేజర్ టెంపుల్స్ ద్వారా ధర్మ ప్రచార మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని, అయితే 6-ఎ ఆలయాల ద్వారా కూడా ధర్మప్రచార వారోత్సవాలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో మాసోత్సవాలను గత మాసం 6న అన్నవరంలో ప్రారంభించడం జరిగిందన్నారు. 18న శ్రీకాళహస్తిలో నిర్వహించడమైనదని, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ నెల 16 వ తేదీన కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే దేవాదాయ శాఖ పరిధిలో 115 వరకు 6-ఎ ఆలయాలు ఉన్నాయని ఈ అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు ఆ 6-ఎ దేవాలయాల్లో వారోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ధర్మప్రచారం కార్యక్రమంలో భాగంగా ప్రవచనాలు, హరికథలు, భక్తి సంగీతం, కూచిపూడి నృత్యాలు, భజనలు, కోలాటాలు, పారాయణలు ఉంటాయని వివరించారు. వాటితో పాటు సామూహిక ఉచిత కుంకుమ పూజలు, అభిషేకాలు, సరస్వతీ హోమాలు, గోపూజలు, కళ్యాణోత్సవాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా నగర- గ్రామ సంకీర్తన, శోభాయాత్రలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లోని చిన్నారులకు సంప్రదాయ వేషాలు, పాఠశాల విద్యార్థులకు పురాణ పాత్రలు, భగవద్ఘీతపై వ్యాసరచన, వక్తత్వం, చిత్రలేఖన పోటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాలకు, భక్తుల గృహాలకు ఆధ్యాత్మిక అనుబంధాన్ని పటిష్టం చేయాలన్నారు. వివిధ శుభకార్యాలకు వేదికగా ఆలయం నిలవాలన్నారు. వారోత్సవాలను ఏర్పాటు చేసుకుని ప్రచురణ/ ప్రసార మాధ్యమాలు, ఆటోలు ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక వేత్తలు, పండితులు, కళాకారులు, స్థానిక ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థలు, దాతలు, గ్రామ పెద్దలను, ముఖ్యంగా యువతను ప్రచారంలో భాగస్వాములను చేయాలన్నారు. ధర్మప్రచార పరిషత్ సభ్యులు, ఆర్జేసీ, డీసీ, ఏసీ, 6-ఎ ఆలయ ఈవోలు, మేజర్ టెంపుల్స్ ఈవోలు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకుని 6-ఎ ఆలయాల్లో కార్యక్రమాలను రూపకల్పన చేయాలన్నారు. ఆయా ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ వైభవాన్ని తెలియజేస్తూ ధర్మప్రచార కార్యక్రమాలు జరగాలన్నారు. కుటుంబ, మానవ, సామాజిక ధర్మాలు, విశ్వ శ్రేయస్సు తదితర అంశాలు గురించి ప్రవచన కర్తలు ప్రవచించాలన్నారు. ధర్మప్రచార రథం నిర్వహణ, విధి విధానాలను అధికారులందరూ విధిగా పాటించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. వారంలో రెండు, మూడు గిరిజన, మత్స్యకార, వెనుకబడిన తరగతులు, తెగలు నివసించే ప్రాంతాల్లో ప్రచార రథం పర్యటించేలా చర్యలు చేపట్టి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. ధర్మప్రచార సమయంలో రథం నిలిపినచోట ఉదయం, సాయంత్రం స్థానిక పండితులు, జిల్లాలోని ప్రముఖ పండితులతో ప్రవచనాలు ఏర్పాటు చేసి సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని బోధించాలన్నారు. ధర్మ ప్రచార రథంతో పాటు కనీసం ఒక వేద పండితుడు, అర్నకుడు, పరిచారికుడు, భంజత్రీలు, పర్యవేక్షకుడు, జూనియర్ అసిస్టెంట్, అటెండర్లు సహా మొత్తం 14 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి నెలా ఆ నెలలో జరిగే ధర్మప్రచార రథ యాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను 1వ తేదీ నాటికే దేవాదాయ శాఖ కమిషనర్‌కు అందజేయాలన్నారు. యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. హైందవ ధర్మప్రచార కార్యక్రమం నిరంతర ప్రక్రియని తెలిపారు. సమావేశంలో దేవదాయ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలివన్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, వేదాంతం రాజగోపాల చక్రవర్తి, పలు ఆలయాల ఈవోలు, అధికారులు పాల్గొన్నారు. చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు? -
శివాలయంలో పానవట్టం ఏ దిక్కున ఉండాలి?
-
'నామకరణం' గురించి శాస్త్రంలో ఉన్న నిజాలు - అపోహలు
-
స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకరణ విశిష్టత
-
బొట్టు ఏ విధంగా, ఎక్కడ పెట్టుకోవాలి?
-
తప్పకుండా పాటించాల్సిన అతి ముఖ్య నియమాలు..!
-
మన పాలకులకు ప్రేమ, భక్తి ఉన్నాయి
సాక్షి ప్రతినిధి,వరంగల్: ఆధ్యాత్మిక భావనతో మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, మానవీయ కోణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా సత్ఫలితాలు వస్తాయని త్రిదండి చిన జీయర్‌స్వామిజీ అన్నారు. కొత్త ఆలయాలు నిర్మించడం సహజమని, కానీ పురాతన ఆలయానికి పునరుజ్జీవం పో యడం గొప్ప విషయమని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వల్మిడిలో రామాలయం నిర్మించడం మరింత అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలకులకు ప్రేమ, భక్తి రెండూ కలసి ఉండడంతో మనం అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇలాగే పచ్చగా కొనసాగాలని ఆకాంక్షించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో చినజీయర్ పాల్గొని సందేశం ఇచ్చారు. మనుషుల్లో అంతర్లీనమైన ప్రేమ, సహోదర భా వం పెంపొందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రతిచోట ఆలయాలు అవసరమని ఆయన తెలిపారు. వాల్మికితో సంబంధం ఉన్న అతి ప్రాచీనమైన వల్మిడి రామాలయాన్ని దివ్య క్షేత్రంగా వెలుగొందేలా మంత్రి దయాకర్‌రావు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి దీటుగా వల్మిడి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ముందుగా వేదమంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల విగ్రహాన్ని జీయర్ స్వామి ప్రతిష్టించారు. అనంతరం ఆలయంలోని ఇతర విగ్రహాలను, ఆలయ గోపురంపై కలశాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ నాథుడి స్మృతి వనం, కల్యాణ మండపం, హరిత హోటల్, గిరిజన భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. -
‘ధూపదీప నైవేద్యం’ రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోని అతి తక్కువ ఆదాయ వనరులున్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులను ప్రభుత్వం పెంచింది. ఆ ఆలయాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.6 వేలను రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధూపదీప నైవేద్యం పథకం కింద గుర్తించిన 6,541 ఆలయాలకు ఇది వర్తించనుంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో ఒక్కో ఆలయానికి రూ.2,500 ఇచ్చేవారు. తర్వాత రూ.6 వేలకు పెంచారు. అందులో రూ.2 వేలు ఆలయంలో పూజాదికాల ఖర్చుకు, మిగతా మొత్తాన్ని అర్చకుడి కుటుంబ పోషణ కోసం అందించేవారు. ఇప్పుడీ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచటంతో.. పూజాదికాలకు రూ.4 వేలు, అర్చకుల కుటుంబాలకు రూ.6 వేలు వినియోగించుకునే వీలుంటుందని అంటున్నారు. ఈ పథకం పరిధిలోకి మరిన్ని ఆలయాలను తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా.. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడిగా పాత్రికేయుడు విష్ణుదాస్ శ్రీకాంత్‌ను నియమిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంస్కృతిక సారథి కళాకారులకూ ఊరట ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్చించే విధుల్లో ఉన్న సాంస్కృతిక సారథి కళాకారుల వేత నాలను ప్రభుత్వం పెంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించిన 583 మంది కళాకారులతో.. రాష్ట్ర అవతరణ తర్వాత సాంస్కృతిక సారథి బృందాన్ని ఏర్పా టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం రూ.24,514గా ఉన్న వేతనాలను రూ.31,868 చేసింది. 2021 జూన్ 1వ తేదీ నుంచే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సాంస్కృతిక సారథి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రాలకు స్వర–క్షీరాభిషెకాలు నిర్వహించాలని నిర్ణయించామని కళాకారుల ప్రతినిధులు తెలిపారు. -
సచివాలయంలో సీఎం కేసీఆర్, గవర్నర్.. చాలా రోజులకు ఒకే వేదికపై..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదులను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ప్రారంభించారు. నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మసీదును ప్రారంభించి నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ►గవర్నర్ తమిళిసైను సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలోకి తీసుకెళ్లారు. ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌ను చూపించారు. ►.సచివాలంలోని సర్వమత ప్రార్థనల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై సీఎం, గవర్నర్ కలిసి కనిపించారు ►సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయం, మసీదు, చర్చిల ప్రారంభోత్సవం జరిగింది. ఈ క్యాక్రమంలో సీఎ కేసీఆర్, గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ ప్రారంభించారు. అనంతరం సచివాలయాన్ని గవర్నర్ తమిళిసై పరిశీలించనున్నారు ► శివాలయం, పోచమ్మగుడి, హనుమాన్, గణపతి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ► మందిరాల ప్రారంభోత్సవం సందర్భంగా యాగం నిర్వహించారు. ► గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ నేడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ► మత పెద్దల సమక్షంలో మసీదు, చర్చిలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ఇదే.. ► మధ్యాహ్నం 12: 35 గంటలకు కేసీఆర్ సచివాలయం చేరుకోనున్నారు. ► 12: 40 గంటలకు చర్చి రిబ్బన్ కటింగ్. ► 12: 45 గంటలకు చర్చిలో కేక్ కటింగ్. ►12: 55 గంటలకు చర్చిలో ముగింపు ప్రేయర్ ► మధ్యాహ్నం 1- 1.30 గంటల వరకు మసీదును ప్రారంభించి మత పెద్దల ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొననున్నారు కేసీఆర్. -
హరియాణాలో మళ్లీ ఉద్రిక్తత
గురుగ్రామ్: మత ఘర్షణలతో అట్టుడికిన హరియాణాలోని నూహ్ జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం రాత్రి 11.30 గంటలకు ఓ వర్గానికి చెందిన రెండు ప్రార్థనా మందిరాలు స్వల్పంగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే, ఒక ప్రార్థనా మందిరం కరెంటు షార్ట్ సర్క్యూట్‌తో, మరొకటి గుర్తుతెలియని కారణాలతో మంటలు అంటుకోవడంతో దగ్ధమైనట్లు పోలీసులు చెప్పారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్‌లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. కాగా, హరియాణాలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 93 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) ప్రసాద్ చెప్పారు. 176 మందిని అరెస్టు చేశామని, వీరిలో 78 మందిని పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. నూహ్ అల్లర్లలో అరెస్టయిన యువకులు -
హనుమకొండలో రుద్రేశ్వరున్ని దర్శించుకుంటున్న భక్తులు
-
ఘనంగా విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు
-
రూ.12 కోట్లు దాటిన అన్ని ఆలయాలు ఇక ఆ కేటగిరి కిందకు..
-
వెంకటేశ్వర వైభవం
-
దేవాలయాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Kurnool Yaganti Images: కర్నూలు జిల్లా యాగంటి చూడకపోతే.. మీరు మిస్సైనట్టే.! (ఫోటోలు)
-
అరసవల్లిలో అద్భుతం
-
కన్నుల పండుగగా పుష్పయాగం కన్నుల పండుగగా పుష్పయాగం
-
East Godavari Famous Temples: తూర్పుకు వెళ్తే ఇంత మంది దేవుళ్లను చూడవచ్చా? (ఫొటోలు)
-
భద్రాద్రి బ్రహ్మోత్సవాలు.. సీతారాముల కళ్యాణం
-
సిద్ధిపేటలో రోబోటిక్స్, 3D ప్రింటింగ్ టెక్నాలజీతో దేవాలయాల నిర్మాణం
-
అర్చకులకు రూ.10 వేల గౌరవ వేతనం
వర్ధన్నపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వర్ధన్నపేట పట్టణంలోని మన్నా ప్రార్థన మందిరంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ సమైక్య పాలనలో ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థన మందిరాలకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహర్దశ వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లి విరుస్తోందన్నారు. ధూపదీప నైవేద్య అర్చకులకు రూ.6 వేల నుంచి రూ.10 వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మునిసిపల్ చైర్ పర్సన్ ఆంగోతు అరుణ, వార్డు కౌన్సిలర్లు తుమ్మల రవీందర్,తోటకూరి రాజమణి తదితరులు పాల్గొన్నారు. ఇల్లంద గ్రామంలోని శ్రీరామలింగేశ్వర, లక్ష్మి నర్సింహస్వామి ఆలయాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీలు శ్రీనివాస్, పిట్టల జ్యోతి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ఆశీ ర్వదించి స్వామివారి శేష వస్త్రాలను అందజేశారు. -
ఆంధ్ర ప్రదేశ్‌లోని టాప్ 10 ప్రసిద్ధ దేవాలయాలు
-
ఆ దేవుళ్లు చేసిన పాపమేంటి?
సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు.. ఇప్పుడు దీన్ని ’’సీఎం వరమిచ్చినా దేవాదాయశాఖ కరుణించడం లేదు’’అని మార్చి చదువుకోవాలి. ధూపదీప నైవేద్యాలకు స్వయంగా సీఎం ముందుకొచ్చినా.. దేవాదాయ శాఖే దాన్ని అడ్డుకుంది. గోపన్‌పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించిన రోజు ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ధూపదీప నైవేద్య పథకాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పథకం కింద అందిస్తున్న భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించిన సమయంలో కొత్తగా మరో 2,796 దేవాలయాలకు కూడా దీన్ని వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. అప్పటికే ఆ జాబి తా దేవాదాయ శాఖ పరిశీలనలో ఉన్నందున, ఆ జాబితాలోని దేవాలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు సీఎం తేల్చి చెప్పారు. కానీ, శనివా రం విడుదలైన ఉత్తర్వుల్లో ఆ సంఖ్యను దేవాదాయశాఖ 2,043గానే చూపింది. నిధుల సాకుతో మిగతా గుడులను అందులో నుంచి తప్పించింది. ఫలితంగా, ఆయా దేవాలయాల్లో దేవరులతోపాటు, ఆ ఆలయాలనే నమ్ముకుని ఉన్న అర్చకులు ఇప్పుడు ఆగమాగమయ్యే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకే జాబితా.. ఎలా తొలగిస్తారు..? రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతినెలా రూ.6 వేలు చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది. వీటిల్లో రూ.2 వేలను దేవుడికి ధూపదీప నైవేద్యానికయ్యే వ్యయానికి వాడుతుండగా, మిగతా మొత్తాన్ని ఆ ఆలయ పూజారి కుటుంబం గడవటానికి భృతిగా వినియోగిస్తున్నారు. ఆదాయం లేక ఆలనాపాలనా లేని మరిన్ని దేవాలయాలను కూడా దీని పరిధిలోకి తేవాలన్న ఉద్దేశంతో దేవాదాయ శాఖ గత ఏడాది చివరలో ఓ జాబితాను సిద్ధం చేసింది. ప్రతి జిల్లా అదనపు కలెక్టర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, ముగ్గురు అర్చకులు.. వెరసి ఐదుగురు సభ్యుల కమిటీ అర్చకుల అర్హతల ఆధారంగా ఎంపికలు జరిపింది. అలా 2,796 మంది పూజారుల జాబితాను సిద్ధం చేసుకుని ప్రభుత్వ పరిశీలనకు పంపింది. ఆ జాబితా ఆధారంగానే ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేశారు. మిగిలిన 753 దేవాలయాల పరిస్థితేంటి? కొంతకాలంగా ధూపదీప నైవేద్య పథకానికి ఆర్థిక శాఖ నిధులు సరిగా ఇవ్వటం లేదు. మూడు నెలల మొత్తం బకాయిగా పేరుకుపోయి ఉంది. గతేడాది చివరలో కూడా నాలుగు నెలల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఈ జాబితాను తగ్గించాలని భావించిన అధికారులు, సీఎం ప్రకటనకు భిన్నంగా కేవలం 2,043 దేవాలయాలకే పథకాన్ని వర్తింపు చేస్తున్నట్టు శనివారం ఉత్తర్వు జారీ చేశారు. దీంతో ఆ జాబితాలో 753 దేవాలయాలు మిగిలి పోయాయి. ఒకేసారి రూపొందిన మొత్తం జాబితాను ఓకే చేయాల్సిందిపోయి, సింహభాగం దేవాలయాలను ఎంపిక చేసి కొన్నింటిని వదిలేయటం ఇప్పుడు గందరగోళంగా మారింది. ప్రభుత్వం నుంచి భృతి రాదని తేలితే వారు ఆ ఆలయాల్లో అర్చకులు కొనసాగే పరిస్థితి అంతగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు ఆలయంలో ధూపదీప నైవేద్యాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. -
భారతదేశంలోని టాప్ 11 మిస్టీరియస్ టెంపుల్స్
-
బంధాన్ని భంగపరిస్తే సహించం
సిడ్నీ: ఖలిస్తాన్ వేర్పాటువాద మూకలు ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులకు తెగబడటాన్ని భారత ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా, భారత్ బంధానికి భంగం కల్గించేలా జరుగుతున్న ఇలాంటి కుట్రలను సహించేది లేదని కరాఖండిగా చెప్పేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో విస్తృతస్తాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత అల్బనీస్ సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు. ‘ భారత్, ఆస్ట్రేలియాల స్నేహపూర్వక సంబంధాలకు హాని తలపెట్టే ఎలాంటి శక్తులనైనా ఉపేక్షించేది లేదు. ఈ అంశంలో కఠినంగా వ్యవహరిస్తున్న అల్బనీస్‌కు నా కృతజ్ఞతలు. హిందూ ఆలయాలపై ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఆగడాలను అణచేసేందుకు, ఖలిస్తాన్ మూకల కార్యకలాపాలపై ఇకమీదటా కఠిన చర్యలను కొనసాగిస్తానని అల్బనీస్ మరో సారి నాకు మాటిచ్చారు’ అని మోదీ ప్రకటించారు. టీ20 వేగంతో బంధం బలోపేతం భారత్, ఆస్ట్రేలియా సత్సంబంధాల బలోపేతాన్ని క్రికెట్ పరిభాషలో మోదీ సరదాగా చమత్కరించారు. ‘‘రెండు దేశాల మైత్రీ బంధం వేగంగా బలపడుతోంది. క్రికెట్‌కు వేగాన్ని తెచ్చిన టీ–20 మోడ్‌లోకి వచ్చేసింది. రెండేళ్లలో ఇక్కడికి రెండుసార్లు వచ్చా. ఏడాదిలో ఇది మా ఆరో భేటీ. ఇరుదేశాల బంధంలో పరిణతికి, సత్సంబంధాలకు ఇది నిదర్శనం. ఈసారి భారత్‌లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ పోటీలను వీక్షించేందుకు అల్బనీస్‌ను, ఆస్ట్రేలియాలోని క్రికెట్ వీరాభిమానులకు ఇదే నా ఆహ్వానం. ఇదే సమయంలో దీపావళి పర్వదిన వేడుకలు చూడొచ్చు. అల్బనీస్‌తో నిర్మాణాత్మక చర్చలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తాయి’’ అన్నారు. ఆస్ట్రేలియాలోని పలు వ్యాపారసంస్థల సీఈవోలతో కూడా మోదీ మాట్లాడారు. పలు రంగాల్లో భారత్‌లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. భారత్‌లోని డిజిటల్ ఆర్థిక, నవకల్పనల వ్యవస్థను ఆస్ట్రేలియాలోని వ్యాపారాలతో అనుసంధానించాలని ఆల్బనీస్ ఆకాంక్షించారు. -
మితి మీరితే... మరో ప్రమాదం!
పవిత్ర చార్ధామ్ యాత్ర ఎప్పటి లానే ఈ ఏడూ మొదలైంది. అక్షయ తృతీయ వేళ గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ తెరిచేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మొదలవుతూనే ఈ యాత్ర అనేక ప్రశ్నలనూ మెదిలేలా చేసింది. హిమాలయ పర్వతాల్లో కఠోర వాతావరణ పరిస్థితుల మధ్య సాగే ఈ యాత్రలో కొండచరియలు విరిగిపడి బదరీనాథ్ హైవే తాజాగా మూసుకుపోవడం పొంచివున్న ప్రమాదాలకు ముందస్తు హెచ్చరిక. యమునోత్రి ప్రయాణంలో తొలిరోజే ఇద్దరు గుండె ఆగి మరణించడం యాత్రికుల శారీరక దృఢత్వానికి సంబంధించి అధికారుల ముందస్తు తనిఖీ ప్రక్రియపై అనుమానాలు రేపుతోంది. ఇప్పటికే 16 లక్షల మందికి పైగా యాత్రకు పేర్లు నమోదు చేసుకున్న వేళ... రానున్న కొద్ది వారాల్లో ఈ పర్వత ప్రాంత గ్రామాలు, పట్నాల మీదుగా ప్రయాణంపై భయాందోళనలు రేగుతున్నాయి. ‘దేవభూమి’ ఉత్తరాఖండ్ అనేక హిందూ దేవాలయాలకు ఆలవాలం. చార్‌ధామ్‌గా ప్రసిద్ధమైన యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బదరీనాథ్‌లు ఇక్కడివే. ఇన్ని ఆలయాలు, ప్రకృతి అందాలకు నెలవైన ఉత్తరాఖండ్‌కు ఆర్థిక పురోభివృద్ధి మంత్రాల్లో ఒకటి – పర్యాటకం. అయితే, అదే సమయంలో హిమాలయాల ఒడిలోని ఈ ప్రాంతం పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతం. ఈ సంగతి తెలిసినా, పర్యావరణ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నా పాలకులు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ఉత్పాతాలనూ లెక్క చేయకుండా, చార్ధామ్ ప్రాంతాలను వ్యాపారమయం చేసి, భరించలేనంతగా యాత్రికుల్ని అనుమతిస్తున్నారు. హిమాలయాల్లో పద్ధతీ పాడూ లేక ఇష్టారాజ్యంగా చేపడుతున్న సోకాల్డ్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, అనియంత్రిత పర్యాటకం కలగలసి మానవ తప్పిదంగా మారాయి. ఈ స్వయంకృతాపరాధాలతో వాతావరణ మార్పులకు మంచుదిబ్బలు విరిగిపడుతున్నాయి. జోషీ మఠ్ లాంటి చోట్ల జనవరిలో భూమి కుంగి, ఇళ్ళన్నీ బీటలు వారి మొదటికే మోసం రావడం తెలిసిందే! నియంత్రణ లేని విపరీత స్థాయి పర్యాటకం ఎప్పుడైనా, ఎక్కడైనా మోయలేని భారం. విషాదమేమంటే, ప్రాకృతిక సంపదైన హిమాలయాలను మన పాలకులు, ప్రభుత్వాలు ప్రధాన ఆర్థిక వనరుగా చూస్తుండడం, వాటిని యథేచ్ఛగా కొల్లగొట్టడం! అభివృద్ధి, పర్యాటక అనుభవం పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడం! కనీసం ఆ ప్రాంతాలు ఏ మేరకు సందర్శకుల తాకిడిని తట్టుకోగలవనే మదింపు కూడా ఎన్నడూ మనవాళ్ళు చేయనేలేదు. బదరీనాథ్, కేదార్‌నాథ్‌లు తట్టుకోగలవని పర్యావరణ నిపుణులు అంచనా వేసిన రద్దీ కన్నా రెండు, మూడింతలు ఎక్కువగా, దాదాపు 15 వేల మందికి పైగా జనాన్ని నిరుడు ప్రభుత్వం అనుమతించడం విచిత్రం. ఒక్క గడచిన 2022లోనే ఏకంగా కోటి మంది పర్యాటకులు ఉత్తరాఖండ్‌ను సందర్శించినట్టు లెక్క. కేవలం చార్ధామ్ యాత్రాకాలంలోనే రికార్డు స్థాయిలో 46 లక్షల మంది వచ్చారు. ఈ ఏడాది ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో రోజుకు అనుమతించాల్సిన యాత్రికుల సంఖ్యపై పరిమితిని ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం ఏ రకంగా సమర్థనీయం! నిజానికి ‘జాతీయ విపత్తు నివారణ సంస్థ’ (ఎన్డీఎంఏ) 2020 నాటి నివేదికలోనే భారత హిమా లయ ప్రాంతం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్ళను ఏకరవు పెట్టింది. పర్యాటకం, పట్టణ ప్రాంతాలకు వలసల వల్ల పట్నాల మొదలు గ్రామాల వరకు తమ శక్తికి మించి రద్దీని మోయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్పింది. బఫర్ జోన్‌ను సృష్టించడం సహా అనేక నియంత్రణ చర్యలను సిఫార్సు చేసింది. మంచుదిబ్బలు విరిగిపడి, వరదలకు కారణమయ్యే ప్రాంతాల్లో పర్యాటకాన్ని నియంత్రించాలనీ, తద్వారా కాలుష్యస్థాయిని తగ్గించాలనీ సూచించింది. పాలకులు వాటిని వినకపోగా, ఏటేటా ఇంకా ఇంకా ఎక్కువ మందిని యాత్రకు అనుమతిస్తూ ఉండడం విడ్డూరం. జోషీమఠ్‌లో విషాదం ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. బీటలు వారిన అనేక ఇళ్ళు కూల్చివేయక తప్పలేదు. గూడు చెదిరి, ఉపాధి పోయి వీధినపడ్డ వారికి ఇంకా పరిహారం అందనే లేదు. తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచుకుంటున్న దుఃస్థితి. ఈ పరిస్థితుల్లో గత వారం కూడా కొత్తగా కొన్ని ఇళ్ళు బీటలు వారాయన్న వార్త ప్రకృతి ప్రకోపాన్ని చెబుతోంది. సిక్కు పర్యాటక కేంద్రం హేమ్‌కుండ్ సాహిబ్కూ, చార్ధామ్ యాత్రలో బదరీనాథ్కూ సింహద్వారం ఈ జోషీమఠే. పరిస్థితి తెలిసీ ఈసారి పర్యాటకుల సంఖ్య రికార్డులన్నీ తిరగరాసేలా ఉంటుందని రాష్ట్ర సీఎం ప్రకటిస్తున్నారు. జోషీమఠ్, ఔలీ ప్రాంతాలు అన్ని రకాలుగా సురక్షిత ప్రాంతాలని ప్రచారం చేసేందుకు తపిస్తున్నారు. ప్రమాదభరితంగా మారిన ఆ కొండవాలు ప్రాంతాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేసి, విపరీతంగా వాహనాలను అనుమతించడం చెలగాటమే. కనుక తొందరపాటు వదిలి, తగిన జాగ్రత్తలు చేపట్టాలి. హిందువులకు జీవితకాల వాంఛల్లో ఒకటైన ఈ యాత్ర ప్రభుత్వానికీ, స్థానిక ఆర్థిక వ్యవస్థకూ బోలెడంత డబ్బు తెచ్చిపెట్టవచ్చు గాక. ధర్మవ్యాప్తిలో ముందున్నామని పాలక పార్టీలు జబ్బలు చరుచుకొనేందుకూ ఇది భలేఛాన్స్ కావచ్చు గాక. జలవిద్యుత్కేంద్రాలు సహా విధ్వంసకర అభివృద్ధితో ఇప్పటికే కుప్పకూలేలా ఉన్న పర్యావరణ వ్యవస్థపై అతిగా ఒత్తిడి తెస్తే మాత్రం ఉత్పాతాలు తప్పవు. మొన్నటికి మొన్న 2013లో 5 వేల మరణాలకు కారణమైన కేదారనాథ్ వరదల్ని విస్మరిస్తే ఎలా? పర్యావరణం పట్ల మనం చేస్తున్న ఈ పాపం పెను శాపంగా మారక ముందే కళ్ళు తెరిస్తే మంచిది. హిమాలయ పర్వత సానువులు అనేకులకు అతి పవిత్రమైనవీ, అమూల్యమైనవీ గనక వాటిని పరిరక్షించడం మరింత ఎక్కువ అవసరం. అందుకు దీర్ఘకాలిక ప్రణాళికా రచన తక్షణ కర్తవ్యం. -
ఏపీలో దేవాలయాల భూముల పరిరక్షణకి ప్రత్యేక చర్యలు
-
‘పూర్తి పారదర్శకంగా దేవాలయాల ఆస్తుల రికార్డుల భద్రత ప్రక్రియ’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని దేవాలయాలు, ధార్మిక సంస్థల భూముల పరిరక్షణకై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 6వ అంతస్థులోని శ్రీ మల్లిఖార్జున మహా మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవాదాయ భూములను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివాదాస్పద దేవాలయాల భూములకు త్వరలో విముక్తి కల్పించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే పలు మార్లు అధ్యయనం చేసిన తర్వాత ప్రధానంగా దేవాదాయ భూముల వివరాల వెరిఫై అంశం, ప్రాథమిక ఆధారాలు, వివాదంలో ఉన్న భూములు, 22A1C క్రింద రిజిస్టర్ అయిన భూములు, సర్వే నంబర్ కు సంబంధించిన సబ్ డివిజన్లు, ఎండోమెంట్, రెవెన్యూ శాఖల ఆధీనంలో ఉన్న భూములు, వివాదాలు లేని ఆస్తులు, శాశ్వతంగా భూమి భద్రత, రీసర్వే సెటిల్ మెంట్ రికార్డులు, 1B ప్రతుల పరిశీలన, కోర్టు కేసుల విషయాలు, అన్యాక్రాంతం అయిన భూములు తదితర అంశాలపై ఈరోజు జరిగిన విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించామన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి ఎండో మెంట్ కమిషనర్లు, 26 జిల్లాల దేవాదాయ శాఖ అధికారులు, దేవాలయాల ఈవోలు, అధికారులు, కార్యనిర్వాహణాధికారులు పాల్గొన్న సమీక్షా సమావేశంలో దేవాలయాల భూములు కాపాడటం కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశామని వెల్లడించారు. ఇప్పటికే దేవాదాయ శాఖ భూములను కన్జర్వేషన్ ల్యాండ్ గా ఇవ్వాలని రెవెన్యూ శాఖతో చెప్పామన్నారు. ఇందుకు సంబంధించిన ఎన్ వో సీ జారీ చేసిన విషయం మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి స్థాయి నుండి క్షేత్ర స్థాయి ఉద్యోగుల వరకు దేవాదాయ శాఖ ఆస్తులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేవాదాయ భూములు దేవుడికే చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దేవుడికి రావాల్సిన ఆదాయం సక్రమంగా రాకపోతే కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలోని దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల రికార్డులను భద్రపరిచే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపడుతున్నామన్నారు. ఇప్పటికే సంబంధిత సాఫ్ట్ వేర్ ను రూపొందించి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఒక్కసారి ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో పొందుపరిచాక క్లాసిఫికేషన్ చేస్తామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,09,000 ఎకరాలను గుర్తించిన దేవాదాయ శాఖ వాటి పరిరక్షణకు తగు చర్యలు చేపట్టిందన్నారు. వివాదాల్లో ఉన్న దేవాదాయ భూముల సమస్యలను సత్వరం పరిష్కరించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 175 దేవాలయాల్లో పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ భూముల విషయంలో ఎవరైనా ఉద్యోగులు అవినీతికి పాల్పడితే తక్షణమే సస్పెండ్ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అనకాపల్లి, గుంటూరు, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో అన్యాక్రాంతమైన దేవాదాయ శాఖకు చెందిన వందలాది ఎకరాల భూములను, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొన్ని ప్రాంతాల్లో దేవాదాయ భూములను రైతులు సాగుచేసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అలాంటి ఘటనల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకొని మానవతా ధృక్పథంతో వ్యవహరిస్తామన్నారు. అంతిమంగా దేవాదాయ భూములను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేవాలయాల భూముల విషయంలో కొందరు కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ కోర్టులకు వెళ్తున్నారన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక భూములు వివాదంలో ఉన్నాయని, కోర్టుల్లోనూ పలు భూముల కేసు తీర్పులు పరిశీలిస్తే కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఆన్ లైన్ ప్రక్రియతో ఈ వివాదాలన్నింటికి చెక్ పడుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మన భూములు, మన ఆస్తుల పరిరక్షణ కోసం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా చేపడుతున్న సమయంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల ప్రక్రియను కూడా చేపట్టాలని నిర్ణయించామన్నారు. భూవివాదాలకు చరమగీతం పాడి పారదర్శకంగా వివాదాలు లేని ఆస్తులు ఆన్ లైన్ లో పొందుపరచడమే తమ ఉద్దేశమన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి ఒక్కో ప్రాంతాన్ని ఫైలట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసి సంబంధిత ప్రాంత దేవాలయాల ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో పొందుపరుస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు 6,000 చిన్న ఆలయాలకు సంబంధించి ధూప, దీప నైవేద్యాల క్రింద ప్రతి నెలా ఆన్ లైన్ ద్వారా రూ.5,000 లు నేరుగా దేవాలయాల అకౌంట్ లో జమ చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో 4 ఏళ్లుగా సంక్షేమ రాజ్యం అప్రతిహాతంగా కొనసాగుతుందని, భవిష్యత్ లో కూడా సంక్షేమ పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పాలన దేశానికి ఆదర్శం కావాలన్నారు. ప్రకృతి సహకరించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలి అని, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ప్రతి ఒక్కరి కుటుంబాల సంక్షేమం కోసం మే 12వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు అత్యంత శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర విధానాలను అనుసరించి 500 మంది రుత్వికులతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో “చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం” ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారన్నారు. ఉదయం 4 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ రాత్రి 8.30 వరకు కొనసాగుతుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విరామం ఉంటుందన్నారు. మహా పూర్ణాహుతితో యజ్ఞం ముగుస్తుందన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ యాగంలో రోజుకో ఆలయం చొప్పున దుర్గామల్లేశ్వర స్వామి, మల్లిఖార్జున స్వామి, సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, సింహాచల అప్పన్న స్వామి వార్ల శాంతి కళ్యాణాలు పెద్ద ఎత్తున వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఉదయం, సాయంత్రం వేళ జరగనున్న యాగం అనంతరం ప్రతి రోజూ సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు, చాగంటి వారి ప్రవచనాలు ఉంటాయన్నారు. -
నాయీ బ్రాహ్మణులకు ఏపీ సర్కార్ గూడ్ న్యూస్..
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాల కేశ ఖండనశాలల్లో విధులు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ.20 వేల ఆదాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేశ ఖండనశాలల్లో తలనీలాల కార్యక్రమం కనీసం వంద రోజులు కొనసాగే ఆలయాలలో ఇది వర్తిస్తుందని దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి (ఎఫ్ఏసీ) హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించే టిక్కెట్ ధరను రూ.40కి పెంచి ఆ మొత్తాన్ని సంబంధిత నాయీ బ్రాహ్మణులకే అందజేస్తారు. రద్దీ సమయాల్లో టికెట్ల విక్రయాల ద్వారా లభించే ఆదాయం రూ.20 వేల కంటే ఎక్కువగా ఉంటే అది కూడా మొత్తం సంబంధిత నాయీ బ్రాహ్మణులకే చెల్లిస్తారు. ఒకవేళ తగినంత డిమాండ్ లేక టికెట్ల అమ్మకం ద్వారా రూ. 20 వేల కంటే తక్కువ ఆదాయం లభిస్తే తలనీలాలు విక్రయాల ద్వారా సమకూరే మొత్తం నుంచి ఆమేరకు చెల్లించాలని నిర్ణయించారు. టికెట్టు ధర రూ.40కి పెంచడం ద్వారా కేశఖండన శాలలు వంద రోజుల లోపు పనిచేసే ఆలయాలలో సైతం నాయీ బ్రాహ్మణులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. నాడు చంద్రబాబు చిందులు.. టీడీపీ అధికారంలో ఉండగా తమకు కనీస ఆదాయం వర్తింపజేయాలని కోరుతూ సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు బెదిరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం తాజాగా జీవో విడుదలైంది. సముచిత స్థానం.. నాయీ బ్రాహ్మణులకు సీఎం జగన్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే అరుదైన గౌరవాన్ని కల్పించిందని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డులో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని ఆర్డినెన్స్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చదవండి: స్పీచ్ అదిరింది.. వాస్తవాలు కళ్లకు కట్టారు.. టీడీపీ హయాంలో అవమానాలు ఎదుర్కొన్న తమకు సీఎం జగన్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, నాయీ బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర నేతలు గుంటుపల్లి రామదాసు, ఇతర నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేశారు. -
భారతదేశంలో ఉన్న టాప్ 10 ప్రసిద్ధ దేవాలయాలు (ఫోటోలు)
-
మనసే దేవాలయం
మన ఊరు: ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంత సంపాదించినా.. సొంత ఊళ్లో లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. కనీసం పండగలు, పబ్బాలకైనా అక్కడ కాలు మోపకపోతే జీవతమే వృథా అనిపిస్తుంది. మన గుడి: ఊరు అన్నాక గుడి ఉంటుంది.. బాల్యం అన్నాక ఆ గుడిలో తిరిగే ఉంటాం. కులమతాలకు అతీతంగా ఆడిపాడుతూ కలిసి తిరిగే చోటు కావడంతో ప్రతి ఒక్కరి జీవితం ఈ గుడితో ముడిపడి ఉంటుంది. మన బాధ్యత: ఓ సినిమాలో చెప్పినట్లు తిరిగివ్వకపోతే లావై పోతాం. ఇది అక్షరాలా నిజం. పుట్టిన ఊరును మర్చిపోతే మనల్ని మనం కోల్పోయినట్లే. ఇక తిరగాడిన గుడి కూడా అంతే. దేవాలయాన్ని శుభ్రం చేస్తే మనసును కడిగేసినట్లే. ‘‘అక్కా ఆ పొరక ఇలా అందుకో.. అన్నా ఆ చెట్టు కొమ్మలు కత్తరిద్దాం.. తమ్ముడూ గుడి గోపురం నీళ్లతో కడుగుదాం.. చెల్లీ నవగ్రహాలను శుభ్రం చేద్దాం.. వదినా ఆ చెత్తంతా పోగు చేద్దాం.. సార్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిద్దాం.. అమ్మా బండలను నేను తుడుస్తా.. పిల్లలూ ఆ మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త. ఏంటండీ బరువు ఎక్కువగా ఉందా, ఉండండి నేనూ ఓ చేయి వేస్తా.’’ ఏంటీ ఇదంతా ప్రతి ఇంట్లో కనిపించే సందడే కదా అనుకుంటున్నారా? కాదు.. ఒకరికొకరు సంబంధం లేకపోయినా ఆ దైవమే కుటుంబాన్ని ఏర్పరిచింది. ఆప్యాయతను పంచుకునేలా చేసింది.. దూరమవుతున్న అనుబంధాలను గుర్తు చేస్తోంది. ఇదీ జగమంత కుటుంబం. – సాక్షి, కర్నూలు డెస్క్ 12మే 2022 ఏకాదశి రోజున.. గుంటూరులో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా పని చేస్తున్న శివకుమార్‌రెడ్డి స్వస్థలం నంద్యాల. సెలవు రోజుల్లో దేవాలయాలను శుభ్రం చేస్తే మంచి జరుగుతుందనే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను అందిపుచ్చుకుని ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించారు. ఆ మేరకు మిత్రులు, పరిచయం ఉన్న వ్యక్తులకు ఫోన్లు చేసి, వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ఇచ్చి కొందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. అలా పట్టణంలోని నందీశ్వరాలయాన్ని చేసేందుకు నిర్ణయించగా, మొదట 150 మందికి తెలియజేయగా 50 మంది సుముఖత వ్యక్తం చేశారు. అయితే ముందురోజు రాత్రి వర్షం కారణంగా 13 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినప్పటికీ ముందుగా నిర్ణయించుకున్నట్లు ఉదయం 5 గంటలకు ఆలయానికి చేరుకొని అనుకున్న కార్యాన్ని నాలుగు గంలల్లో పూర్తి చేశారు. కమిటీ నిర్ణయం మేరకు.. ఏ ప్రాంతానికి వెళ్లాలి, ఏ గుడిని ఎంపిక చేసుకోవాలనే విషయమై కమిటీ సభ్యులు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత సంబంధిత గుడి అధికారులకు సమాచారం అందించి అనుమతి పొందుతారు. అనంతరం ఈ విషయమై వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తారు. గుడిని శుభ్రం చేసేందుకు అవసరమైన సామగ్రిని సొంత డబ్బుతోనే కొనుగోలు చేస్తున్నారు. నెలలో రెండు గుడులు చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్తీక మాసానికి ముందు నవ నందుల ఆలయాన్ని ఒకేరోజు 900 మందితో కలిసి సేవ చేశారు. ఇప్పటి వరకు 32 గుడులను శుభ్రం చేయగా.. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులను ధరించడంతో పాటు దైవనామ స్మరణతో భక్తిభావం పెంపొందిస్తుండటం విశేషం. దేవుడిచ్చిన బంధాలు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న రోజులివి. బూతద్దం పెట్టి వెతికినా అన్నదమ్ములు కలిసుంటున్న కుటుంబాలు ఎక్కడో కానీ కనిపించవు. ఈ పరిస్థితుల్లో బంధువులు దూరమవుతుండగా, బంధుత్వాలు శుభకార్యాలకే పరిమితం అవుతున్నాయి. అలాంటిది మన ఊరు, మన గుడి, మన బాధ్యతలో భాగంగా సేవకులంతా ఓ కుటుంబంగా మారిపోతున్నారు. పిలుపులో ఆప్యాయత కనిపిస్తోంది. ఒకరికొకరు సాయం చేసుకోవడం చూస్తున్నాం. ఈ బంధం ఇక్కడితో ఆగిపోకుండా తిరిగి ఊరికి చేరుకున్న తర్వాత కూడా ఆయా కుటుంబాలు తరచూ కలసిమెలసి ఉండటం చూస్తే కార్యక్రమం ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతోంది. సహపంక్తి భోజనం ఒక ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు ఉంటే.. ఎవరు ఏ సమయానికి భోజనం చేస్తారో తెలియని పరిస్థితి. ఇంతకు ముందు ఇంట్లో అందరూ కలిసి కూర్చొని తింటే తప్ప సంప్తి కలిగేది కాదు. కాలంతో పోటీ పడే రోజులు కావడంతో ఎవరి పనుల్లో వాళ్లు బిజీ కావడంతో కలసి భోజనం చేయడమనే మాటే లేకుండా పోతోంది. అలాంటిది ఈ కార్యక్రమం సభ్యులందరినీ ఓ కుటుంబంగా మార్చేస్తుంది. కార్యక్రమం మధ్యలో అందరూ ఎంచక్కా విస్తరాకులు వేసుకొని ఒక్క చోట కూర్చొని భోజనం చేయడం ఆలయానికి వచ్చే భక్తులను సైతం ఆలోచింపజేస్తోంది. గోమాత గోళ్లు కత్తిరిస్తూ.. ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ దేవాలయాలకే పరిమితం కాలేదు. గోవులకు గోర్లు పెరిగి నడవటానికి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన సభ్యులు వాటి సేవకు నడుంబిగించారు. ఇలాంటి గోవులను గుర్తించి హాఫ్ ట్రిమ్మింగ్, గిట్టలు సరిసేసే కార్యక్రమాన్ని కూడా తరచుగా చేపడుతున్నారు. ఇప్పటి వరకు 15 ఆవుల కన్నీటిని తుడిచి నడక సజావుగా సాగేందుకు దోహదపడ్డారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తిరుమల, తిరుపతి.. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మంత్రాలయంలోనూ గోవుల గోళ్లు కత్తిరించేందుకు మానవతామూర్తులు ముందుకు రావడం విశేషం. ఆర్యోగం కూడా.. గుడి శుభ్రం చేయడం ద్వారా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని సేవకులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో తెలియకుండానే ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఈ బృందంలోని ఓ సభ్యుడు ప్రతి రోజూ ఉదయాన్నే 6వేల నుంచి 7వేల అడుగుల నడక కొనసాగిస్తారు. అయితే ఈ కార్యక్రమం వల్ల దినచర్య కాస్త మారినా, కార్యక్రమం నిర్వహణలో భాగంగా 10వేలకు పైగా అడుగులు పడటం చూస్తే ఆరోగ్యానికి ఏ స్థాయిలో సహకరించిందో అర్థమవుతుంది. ఇంటి వద్ద కనీసం నడిచేందుకు కూడా ఆరోగ్యం సహకరించని వృద్ధులు సైతం గుడిని శుభ్రం చేసేందుకు శక్తినంతటినీ కూడగట్టుకొని ఉత్సాహంగా కలియతిరగడం విశేషం. మానసిక ప్రశాంతత మా చిన్ననాటి స్నేహితుల కలయికకు గుర్తుగా నంద్యాలలోని ఓ పార్కును 2015లో స్వచ్ఛ భారత్ పార్కుగా తీర్చిదిద్దాం. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో 2015లో రూపుదిద్దుకున్న ఈ పార్కు దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది. ఇలా 2016లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ అవార్డును కైవసం చేసుకోవడం మరిచిపోలేని అనుభూతి. ఆ తర్వాత స్నేహితులంతా కలిసి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. తాజాగా ఆలయాలను శుభ్రపరిచే బృహత్ కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నాం. ఇది మానసిక ప్రశాంతతో పాటు మానవతా విలువలను నేర్పుతోంది. – శివకుమార్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, గుంటూరు -
తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
-
తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాల సందర్శన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. తొలి దశలో భాగంగా విజయవాడ కేంద్రంగా మూడు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్లను రూపొందించినట్లు తెలిపారు. రెండో దశలో విశాఖ నుంచి మరో మూడు సర్క్యూట్లను ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ప్రయాస లేకుండా.. తక్కువ ఖర్చులో పుణ్యక్షేత్రాల సందర్శనను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. గైడ్‌తో పాటు రవాణా, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో సర్క్యూట్లో 7 నుంచి 10 దేవాలయాలను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు మాట్లాడుతూ.. ప్రతి భక్తుడు సంతృప్తికరంగా, సురక్షితంగా ఆలయాలను సందర్శించేలా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు ఏపీటీడీసీ చైర్మన్, ఎండీ కలిసి పర్యాటక శాఖ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఏపీటీడీసీ ఈడీ (ఆపరేషన్స్) గోవిందరావు, ఈడీ (ప్రాజెక్ట్స్) మల్రెడ్డి, రిలీజియస్ టూరిజం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ట్రాన్స్‌పోర్టు మేనేజర్ జగదీశ్ పాల్గొన్నారు. తొలి దశలోని ఆధ్యాత్మిక సర్క్యూట్లు.. విజయవాడ–తిరుపతి: విజయవాడ ఇంద్రకీలాద్రి, మంగళగిరి పానకాల నరసింహస్వామి, నెల్లూరు రంగనాథస్వామి, శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరస్వామి, తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుచానూరు, కాణిపాకం. విజయవాడ–శ్రీశైలం: ఇంద్రకీలాద్రి, మంగళగిరి, పెదకాకాని మల్లేశ్వరస్వామి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి. విజయవాడ–సింహాచలం: ఇంద్రకీలాద్రి, ద్వారకా తిరుమల, అన్నవరం, లోవ తలుపులమ్మ, పిఠాపురం శక్తి, దత్తాత్రేయపీఠం, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, ర్యాలి లక్ష్మీజగన్మోహినీ కేశవస్వామి, సింహాచలం. రెండో దశకు సంబంధించిన ప్రతిపాదనలు.. విశాఖ–శ్రీకాకుళం: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రామతీర్థం. విశాఖ–తిరుపతి: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, మంగళగిరి, నెల్లూరు రంగనాథస్వామి, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుచానూరు, కాణిపాకం. విశాఖ–శ్రీశైలం: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, మంగళగిరి, పెదకాకాని మల్లేశ్వరస్వామి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి. -
దేవాదాయశాఖలో భారీగా అభివృద్ధి పనులు : మంత్రి కొట్టు సత్యనారాయణ
-
న్యూ ఇయర్ సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు
-
పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో.. వీఐపీ దర్శనాలకు పరిమితులు
సాక్షి, అమరావతి: పండుగలు, జాతరలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో ఉదయం సాయంత్రం వేళ నిర్ణీత సమయంలో ఒకట్రెండు గంటలు మాత్రమే ఆలయాల్లో వీఐపీ దర్శనాలను పరిమితం చేయాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. సాధారణ భక్తులకు సంతృప్త స్థాయిలో తొందరపాటు లేని దర్శనాన్ని సజావుగా అందించడం అత్యంత ప్రాధాన్యతగా దేవదాయ శాఖ భావిస్తోంది. ఆయా రోజుల్లో వృద్ధులు, చిన్నపిల్లల తల్లులతో పాటు దివ్యాంగుల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ సూచన మేరకు దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ అన్ని ఆలయాల ఈఓలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు.. ► పండుగ, జాతర రోజులతో పాటు ఇతర ప్రత్యేక పర్వదినాల్లో వీఐపీలకు, ఉదయం, సాయంత్రం ఒకట్రెండు గంటల పాటు నిర్ణీత సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో కూడా ఒకటి లేదా రెండు సాధారణ భక్తుల క్యూలైన్లు కొనసాగించాలి. ► సామాన్య భక్తులకు సాఫీగా సంతృప్త స్థాయిలో దర్శనాలను అందించడం ఆయా ఆలయాల ఈఓల ప్రాథమిక విధి. ► వీఐపీ, అతని కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురు మించకుండా చూసుకోవాలి. అంతకుమించి ఉంటే వారు దర్శన టికెట్లు కోనుగోలు చేయాలి. ► పండుగ, ప్రత్యేక పర్వదినాల రోజుల్లో ఆలయానికి వచ్చే వీఐపీలకు ఆలయ ఈఓ అవసరమైన మర్యాదలు చేసేందుకు వీలుగా వారు ఆలయ సందర్శన షెడ్యూల్‌కు ఒక్క రోజు ముందు వీఐపీలు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ► ప్రత్యేక పర్వదినాల్లో వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనాలపై నియంత్రణ ఉండాలి. ► ఈ రోజుల్లో అన్ని రకాల దర్శన టికెట్లను ఆన్లైన్ విధానంలో మాత్రమే విక్రయించాలి. ఇంటర్నెట్ సమస్యలు తలెత్తితే పీఓఎస్ వంటి ప్రత్యేక పరికరాల ద్వారా కేటాయించాలి. ► ఈ టికెట్లను క్యూలైన్లో స్కాన్‌చేసే విధానం ఏర్పాటుచేసుకోవాలి. అలాగే, స్కానింగ్ జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటుచేసుకోవాలి. ఈ ఫుటేజీ కనీసం 15 రోజుల పాటు బ్యాకప్‌తో ఉండాలి. ► ఉచిత దర్శనం క్యూలైన్లు ఆలయం తెరిచినంతసేపు కొనసాగించాలి. ► దర్శనాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక అధికారి బాధ్యత తీసుకోవాలి. -
గుళ్లలో అరిటాకులు లేదా విస్తళ్లలోనే అన్నదానం
సాక్షి, అమరావతి: ఆలయాల్లో నిర్వహించే అన్నదానంలో భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే వడ్డించాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్రంలోని ఆలయాల ఈవోలకు దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని దేవదాయశాఖ పరిధిలోని అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలోని పది ప్రధాన ఆలయాల్లోనే కేవలం మధ్యాహ్నం వేళ 2,24,727 మంది భక్తులకు అన్నదానం జరిగింది. కొన్ని ఆలయాల్లో స్టీల్‌ప్లేట్లలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. ఆలయాల్లో అన్నదానం పేరుతో అందజేసే ఆహారానికి మరింత పవిత్రతను కల్పించేందుకు భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే భోజనం వడ్డించాలని నిర్ణయించినట్టు దేవదాయశాఖ కమిషనర్ ఈవోలకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒకవేళ స్టీల్ప్లేట్లోనే వడ్డించాల్సి వస్తే.. ప్లేట్లో ఆకువేసి వడ్డించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇటీవల ప్రధాన ఆలయాల ఈవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోను సూచించిన విషయాన్ని కమిషనర్ తన ఆదేశాల్లో ఉదహరించారు. -
పెద్ద ఆలయాల్లో ఆన్లైన్ సేవలు
సాక్షి, అమరావతి: రూ.25 లక్షలకు పైబడి వార్షికాదాయం కలిగిన 175 పెద్ద ఆలయాల్లో జనవరి నెలాఖరుకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయ శాఖలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై బుధవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 16 ప్రధాన ఆలయాల్లో పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, అదనపు కమిషనర్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల్లోకి సెల్ఫోన్లు నిషేధం!.. మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు
చెన్నై: మద్రాస్ హైకోర్టు చర్చనీయాంశమైన ఆదేశాలు ఇచ్చింది. ఆలయాల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆలయాల యొక్క స్వచ్ఛత..పవిత్రతను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తెలిపింది. అయితే.. హిందూ మత & ధర్మాదాయ శాఖ (హెచ్ఆర్ అండ్ సిఇ) డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే ఆలయాల్లోకి భక్తులెవరూ తమ ఫోన్లను తీసుకెళ్లకుండా చూసుకోవాలని ఆదేశించింది. ప్రజలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఫోన్లను గుడి దగ్గర్లో పెట్టుకునేలా స్టాండులు, డిపాజిట్ లాకర్లు, టోకెన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈ ఆదేశాలను అన్ని ఆలయాల్లో అమలు అయ్యేలా చూడాలని.. భక్తులెవరూ ఫోన్లు లోపలికి తీసుకెళ్లకుండా భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని తెలిపింది. సుబ్రమణ్య స్వామి ఆలయంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. మొబైల్ ఫోన్లు ప్రజల దృష్టి మరల్చడంతోపాటు దేవతా చిత్రాలను క్లిక్ చేయడం ఆగమా నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. అంతేకాదు.. ఫొటోగ్రఫీ వల్ల దేవాలయాల భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు. మరోవైపు.. తమ అనుమతి లేకుండా తమ చిత్రాలను క్లిక్ చేయడంపై మహిళల్లో భయాందోళనలు నెలకొంటాయని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఆలయాల్లోకి అభ్యంతరకర దుస్తుల్లో రాకూడదని, ఇందుకోసం మంచి డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేయించాలని పిటిషన్ కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. తాజాగా సెల్ఫోన్లను ఆలయాల్లోకి అనుమతించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాలను సందర్శించే భక్తులు దేశ వారసత్వం, సంస్కృతిని కాపాడే వస్త్రాలను ధరించాలని కూడా భక్తులను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు పేర్కొంది. -
కార్తీక శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
-
అయ్యో దేవుడా!.. ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ప్రాచీన ఆలయాలు
ఇది నందివనపర్తిలోని ఓంకారేశ్వరాలయం. తాడిపర్తి, నస్దిక్‌సింగారం, నందివనపర్తి, కుర్మిద్ద గ్రామాల పరిధిలో ఈ గుడికి సంబంధించిన 1,450 ఎకరాల భూమి ఉంది. సుమారు 1,200 మంది రైతులు ఇందులో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. కౌలు ద్వారా వచ్చిన సొమ్ముతో ఏటా దేవుని కల్యాణం, ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. కానీ కొంత కాలంగా రైతులు కౌలు చెల్లించడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా పైసా రావడం లేదు. దీంతో వేడుకల సంగతి పక్కన పెడితే.. కనీసం ధూపదీప నైవేద్యాలకు సైతం నోచుకోవడం లేదు. కొందుర్గు మండలం పెండ్యాలలోని లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయం ఇది. ఈ గుడి పేరున 360 ఎకరాల భూమి ఉంది. కొందుర్గులోని కొంత భాగం, లూర్థునగర్ కాలనీలు ఇందులోనే వెలిశాయి. ప్రçస్తుతం 312 మిగిలింది. కౌలు డబ్బులతో ఆలయ నిర్వహణ కొనసాగాలి. మండల కేంద్రంలోని గుడి పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. చారిత్రాత్మకమైన పెండ్యాల ఆలయం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ దేవుడికి దీపం పెట్టే దిక్కు లేకుండాపోయింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్ జిల్లాలోని పలు దేవాలయాలు ధూపదీప, నైవేద్యానికి నోచుకోవడం లేదు. ఆలయ ఖజానాలో పైసా లేకపోవడం, భక్తుల నుంచి ఆశించిన మేరకు కానుకలు రాకపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన నెలవారీ ప్రోత్సాహకాలు అందకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా ఆయా దేవాలయాల్లో కొలువైన దేవుళ్లతో పాటు నిత్యం కైంకర్యాలు నిర్వహించే పూజారులకు సైతం ఉపవాసం తప్పడం లేదు. ఆలయాల నిర్వహణ, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, ఒత్తులు, నూనె, హారతి కర్పూరం బిల్లలు, ఇతర పూజా సామగ్రి కోసం అప్పులు చేయక తప్పడం లేదు. s నాలుగు మాసాలుగా.. ఆలయాల్లో పని చేస్తున్న పూజారుల జీవనభృతి కోసం 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం «ధూపదీప నైవేద్య పథకాన్ని తీసుకొచి్చంది. ఇందులో భాగంగా పూజారులకు మొదట్లో రూ.2,500 ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన కేసీఆర్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచింది. ఇందులో రూ.2 వేలు ధూపదీప నైవేద్యాలకు, రూ.4 వేలు పూజారుల నెలవారీ గౌరవ వేతనంగా చెల్లించారు. గత నాలుగు నెలలుగా ఈ ప్రోత్సాహకం అందడం లేదు. గతంలో దేవాదాయ శాఖ కమిషనర్ నుంచే నేరుగా ఈ ప్రోత్సాహాకాలు మంజూరయ్యేవి. ప్రస్తుతం ఈ బాధ్యతలను ఫైనాన్స్ విభాగానికి అప్పగించింది. దీంతో నిధుల జారీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. నెలవారీ ప్రోత్సాహకాలు అందకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,679 ఆలయాల్లో పని చేస్తున్న 3,600 మంది పూజారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. శివారులో అధ్వానం జీహెచ్ఎంసీ పరి«ధిలో 1,736 ఆలయాలను ధూప, దీప, నైవేద్య పథకం(డీడీఎన్ఎస్)లో చేర్చేందుకు ప్రభుత్వం అవకాశం కలి్పంచి, ఆ మేరకు రూ.12.5 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం తీసుకొన 43 రిజిస్ట్రేషన్ ప్రక్రియపై కమిటీలకు అవగాహన లేకపోవడం, ఉన్న వాళ్లు కూడా ఆలయంలోని విగ్రహాలు, ఇతర వస్తువులు, నిత్య కైంకర్యాల ద్వారా లభించే కానుకలు, హుండీ ఆదాయం సహా స్థిరచరాస్తుల వివరాలను పక్కగా లెక్క చూపించాల్సి వస్తుందనే భయంతో ఇందుకు వెనుకాడుతున్నాయి. ఫలితంగా ఇప్పటి వరకు కేవలం 400 ఆలయాలే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నాయి. మేడ్చల్ జిల్లాలో 101 ఆలయాలు, రంగారెడ్డి జిల్లాలో 140 ఆలయాలకు అవకాశం కల్పించినా.. మెజార్టీ ఆలయ కమిటీలు ఇందుకు సుముఖత చూపలేదు. దీంతో ఆయా ఆలయాలను నమ్ముకుని జీవిస్తున్న పేద బ్రాహ్మణులకు నెలవారీ ప్రోత్సాహకం అందకుండా పోతోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే గ్రేటర్‌లోని ఆలయాల నిర్వహణ కొంత మెరుగ్గా ఉన్నా.. మారుమూల ప్రాంతాల్లోని ప్రాచీన ఆలయాల పరిస్థితి అధ్వానంగా మారింది. రాజకీయ నిరుద్యోగులకు అడ్డా నిత్యం ఆధ్యాత్మికతతో వెల్లివిరియాల్సిన పలు ఆలయాలు రాజకీయ నిరుద్యోగులకు వేదికలుగా మారాయి. కనీస భక్తి భావం లేని వాళ్లు పాలక మండళ్లలో సభ్యులుగా చేరుతున్నారు. సాధారణ భక్తులు సమరి్పంచే విరాళాలు, నిత్య కైంకర్యాలు, ఇతర సేవల ద్వారా లభించే ఆదాయం పక్కదారి పడుతున్న దాఖలాలు జిల్లాలో కోకొల్లలు. కర్మన్‌ఘాట్‌లోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయం సహా ఇంజాపూర్ శ్రీవెంకటేశ్వరాలయం, ఆమనగల్లులోని వీరభద్రస్వామి దేవాలయం, శంషాబాద్ సమీపంలోని నర్కుడ రామాలయం, కడ్తాల్‌లోని మైసిగండి ఆలయం, కాటేదాన్‌లోని శివగంగ ఆలయాలు రాజకీయ నిరుద్యోగులకు నిలయాలుగా మారాయి. ఆలయ పూజారులు కూడా ప్రత్యేక పూజలకు టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లను, హుండీల్లో భారీగా కానుకలు సమరి్పంచిన సామాన్య భక్తులను పట్టించుకోకుండా.. పాలక మండలి సభ్యులు, వారి బం«ధుమిత్రులు, ప్రముఖుల సేవల్లోనే తరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అప్పులు చేయాల్సి వస్తోంది పట్టణ ప్రాంతాల్లోని ఆలయాలకు భక్తులు రెగ్యులర్‌గా వస్తుంటారు. కానీ మారుమూల ప్రాంతాల్లోని ప్రాచీన ఆలయాలకు పెద్దగా రారు. ప్రత్యేక పూజలు, హుండీ ఆదాయం అంతగా ఉండదు. ఫలితంగా ఆలయాల నిర్వహణ, ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందులు తప్పడం లేదు. పూలు, పండ్లు, పూజ సామగ్రి కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. – సునిల్‌జోషి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం పేద బ్రాహ్మణులు నష్టపోతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలోని 1,736 ఆలయాలకు డీడీఎన్‌ఎస్‌లో చేరే అవకాశం కల్పిస్తే.. 400 దరఖాస్తులు వచ్చాయి. ఇతర జిల్లాల నుంచి 1,263 ఆలయాలకు అవకాశం కల్పించగా.. ఆరు వేల అప్లికేషన్లు అందాయి. ఆస్తులు, ఆదాయం భారీగా ఉన్న ఆలయాలు ఇందులో చేరడం లేదు. ఫలితంగా పేద బ్రాహ్మణులు ఇబ్బంది పడాల్సివస్తోంది. - వాసుదేవశర్మ, ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు -
గ్రహణంతో ఆలయాల మూసివేత
యాదగిరిగుట్ట/భద్రాచలం/బాసర (ముథోల్): చంద్ర గ్రహణం కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మంగళవారం మూతబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. యాదాద్రిలో తెల్లవారుజామున సుప్రభాత సేవలు సహా ఇతర పూజల అనంతరం ఉదయం 6:15 గంటల నుంచి 7:30 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉదయం 8:15 గంటలకు ఆలయాన్ని మూసేసి తిరిగి చంద్రగహణం ముగిశాక రాత్రి 8 గంటలకు తెరిచారు. శుద్ధి, సంప్రోక్షణ, ఇతర పూజలు నిర్వహించారు. ఇక భద్రాచలంలో ఉదయం 7:30 గంటలకు ఆలయాన్ని మూసేసి రాత్రి 7:30 గంటలకు పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ, శాంతిహోమం నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి దర్శనాలు పునః ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు. బాసరలోనూ ఉదయం పూజలు, నైవేద్య నివేదన అనంతరం అర్చకులు ద్వార బంధనం చేశారు. గ్రహణానంతరం రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేశారు. ఆలయాల్లో మంగళవారం రద్దు చేసిన ఆర్జిత సేవలు, దర్శనాలు బుధవారం ఉదయం నుంచి కొనసాగుతాయని అధికారులు తెలిపారు. -
సూర్యగ్రహణం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేత
-
కేదార్ నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించుకున్న ప్రధాని మోదీ
-
గుళ్లలోని క్షురకులకు రూ.20 వేల కనీస ఆదాయం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రధాన ఆలయాల్లోని కేశఖండనశాలల్లో క్షురకులుగా పనిచేసే వారికి ప్రతి నెలా కనీసం రూ.20 వేలు ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ధార్మిక పరిషత్ తొలి సమావేశం సోమవారం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. అనంతరం సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రధాన ఆలయాల్లోని క్షురకులు ప్రస్తుతం టికెట్ల ఆధారంగా ప్రతి నెలా ఆదాయం పొందుతున్నారని చెప్పారు. వాళ్లకు నెలకు రూ.20 వేల కంటే తక్కువ ఆదాయం దక్కే సమయంలో.. ఆయా ఆలయాల్లోని వెల్ఫేర్ ట్రస్టు ద్వారా మిగిలిన మొత్తాన్ని ఇప్పించాలని సీఎం వైఎస్ జగన్ తమకు సూచించారని పేర్కొన్నారు. రూ.20 వేల కంటే ఎక్కువ ఆదాయం వస్తే.. వారికే ఆ మొత్తం చెందుతుందన్నారు. తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఆ మొత్తాన్ని అదనంగా అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. సమావేశంలో హథీరాంజీ, బ్రహ్మంగారి మఠం,అహోబిలం, గాలి గోపురం, బ్రహ్మానంద మఠాలకు సంబంధించిన పాలనపరమైన అంశాలపైనా చర్చించినట్టు చెప్పారు. బెజవాడ దుర్గ గుడిలో అంతరాలయ దర్శన టికెట్ ధర ఎప్పటి నుంచో రూ.500గానే ఉందన్నారు. -
అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మరిన్ని ఆలయాల్లో స్వామివార్లకు నిత్య నైవేద్యాలు జరగనున్నాయి. ఆలయాల అభివృద్ధి, నిత్యం ధూప, దీప, నైవేద్యాలకు ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి మరో 2091 ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. 30 వేల ఆదాయం కూడా లేక నిత్య పూజలు జరగని ఈ ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం పథకాన్ని (డీడీఎన్ఎస్) మంజూరు చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: మూడు రాజధానుల కోసం.. ముందడుగు ఈ పథకం ద్వారా ప్రతి ఆలయానికి స్వామివార్ల ధూప, దీప, నైవేద్యం ఖర్చులకు నెలకు రూ.2,000, పూజారి గౌరవ వేతనం మరో రూ. 3000 చొప్పున నెలకు రూ. 5000 ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఆలయ పూజారి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తారు. అక్టోబరు నెల నుంచి ఇది అమల్లోకి వస్తుందని, నవంబరు ఒకటో తేదీ తర్వాత చెల్లింపులు జరుగుతాయని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలవారీగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆలయాల వివరాలు, పూజారి పేరు, అతని బ్యాంకు ఖాతా వివరాలను కూడా పేర్కొన్నారు. దేవదాయ శాఖలో రిజిస్టర్ అయి ఉండి, గ్రామీణ ప్రాంతంలో రెండున్నర ఎకరాల లోపు మాగాణి భూమి, ఐదెకరాల లోపు మెట్ట భూమి ఉండి ఆలయానికి అన్ని రకాల ఆదాయం రూ. 30 వేలకు మించని ఆలయాలనే ప్రభుత్వం ఈ పథకానికి ఎంపిక చేసినట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ముందుగా జిల్లా దేవదాయ శాఖ అధికారులు ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారి ప్రతిపాదనలను కమిషనర్ కార్యాలయానికి పంపారు. వీటిని 11 మంది ఉన్నతాధికారులు పరిశీలించారు. ఒక్కొక్క అధికారి 20 ఆలయాలను ర్యాండమ్‌గా తనిఖీ చేసి నిర్ధారించుకున్న తర్వాతే తుది జాబితాను రూపొందించారు. ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ఆలయాల ఎంపికను పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ ప్రభుత్వాల హయాంలోనే.. గ్రామీణ ప్రాంతాల్లో తగినంత ఆదాయం లేక నిత్య పూజలకు నోచుకోని ఆలయాలకు 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ధూప, దీప, నైవేద్యం పథకాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి ఏపీలో తొలుత దాదాపు 3,600 ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. రాష్ట్ర విభజన సమయానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1,900 ఆలయాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుండేది. 2014 తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా ఒక్క ఆలయానికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. పైగా అప్పటిదాకా పనిచేస్తున్న పూజారులు చనిపోయిన ఆలయాలకు పథకాన్ని నిలిపివేయడం, ఇతర కారణాలతో 2019 ఎన్నికల సమయానికి ఆ ఆలయాల సంఖ్య 1,620కు తగ్గిపోయింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత మళ్లీ ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. తాజా ఆలయాలతో కలిపి ఈ మూడేళ్లలో ప్రభుత్వం 2,747 ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తం 4,367 ఆలయాలు ప్రయోజనం పొందుతున్నాయి. -
అన్ని ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టండి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): వికేంద్రీకరణను ఆకాంక్షిస్తూ రాష్ట్రంలో ప్రతిఒక్కరూ విజయదశమి రోజున కుల, మతాలకు అతీతంగా అన్ని ఆలయాల్లోను ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఇంతకంటే మంచి రోజు మరొకటి రాదన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు ఏ రోజూ ప్రజల కోసం ఆలోచించని చంద్రబాబుకు సద్బుద్ధి వచ్చేటట్లు, వికేంద్రీకరణకు మద్దతిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కొబ్బరికాయలు కొట్టాలన్నారు. అమరావతి నుంచి అరసవిల్లి వరకు రైతుల ముసుగులో బూటకపు పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు బృందానికి ఆ దేవుడే సరైన బుద్ధి చెబుతారని వారన్నారు. పాదయాత్రతో అరసవిల్లి వెళ్లే వారు సూర్యభగవానుడ్ని ఏమని కోరుకుంటారని.. అమరావతి మాత్రమే బాగుండాలని కోరుకుంటారా.. లేక, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారా.. అని వేణు, కన్నబాబు ప్రశ్నించారు. అందుకే పాదయాత్ర చేస్తూ అరసవల్లి వెళ్లే వారు ఏమి కోరుకున్నా సూర్యభగవానుడు మాత్రం మెజార్టీ ప్రజల అభీష్టమైన వికేంద్రీకరణకే ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. -
ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ టికెట్లు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉన్న 11 ప్రధాన ఆలయాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆలయాల వద్ద గదుల కేటాయింపు వంటి వాటిని కూడా ఆన్లైన్ పరిధిలోకి తెస్తామన్నారు. మంత్రి మంగళవారం విజయవాడలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ గుడి, పెనుగ్రంచిపోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయం, వాడపల్లి, ఐనవల్లి ఆలయాల్లో ఆన్లైన్ టికెట్ విధానం తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు అడ్వాన్స్‌గా నిర్ణీత తేదీకి ఆన్లైన్ దర్శన టికెట్లు, గదులు బుకింగ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. రద్దీ అధికంగా ఉండే మరో 12 ఆలయాల్లోనూ ఆన్లైన్ విధానం అమలుపై చర్చిస్తున్నట్లు వివరించారు. వారం వారం సమీక్ష ఇకపై ప్రతి బుధవారం దేవదాయశాఖ సమీక్ష సమావేశం నిర్వహించి, ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులకు అడ్డుగా ఉన్న కోర్టు కేసుల ఉపసంహరణకు ఉద్యోగ సంఘాల నేతలు ముందుకొచ్చారని, ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో సిబ్బంది నియామకాలను చేపట్టినట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన ధార్మిక పరిషత్ తొలి సమావేశం అక్టోబరు 10న నిర్వహించనున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల్లో వీఐపీలకూ టైం స్లాట్ దర్శనాలు దసరా ఉత్సవాల్లో విజయవాడ కనకదుర్గ గుడిలో వీఐపీలకు కూడా టైం స్లాట్ ప్రకారమే దర్శనాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. వీఐపీలు కూడా టికెట్ కొనాలని చెప్పారు. రోజుకు ఐదు ప్రత్యేక టైం స్లాట్లు ఉంటాయన్నారు. రెండేసి గంటలు ఉండే ఒక్కొక్క టైం స్లాట్‌లో రెండు వేల వీఐపీ టికెట్లను ఇస్తామన్నారు. అందులో 600 టికెట్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు ఉన్నవారికి కేటాయించి, మిగిలినవి అందరికీ ఇస్తామన్నారు. ఒక లేఖకు ఆరు టికెట్లు ఇస్తామన్నారు. సిఫార్సు లేఖలు, ఇతర వీఐపీ టికెట్ల బుకింగ్‌కు విజయవాడ కలెక్టర్ ఆఫీసులో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు వంటి ప్రివిలేజ్డ్ వీఐపీలు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉదయం, సాయంత్రం వేళల్లో అర్ధ గంట చొప్పున ఉచిత దర్శనం ఉంటుందని తెలిపారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దుర్గ గుడి ఘాట్ రోడ్డును పూర్తిగా క్యూలైన్లకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉచిత దర్శనానికి మూడు లైన్లు, రూ.300 టికెట్ వారికి ఒకటి, రూ.100 టికెట్ వారికి మరొక క్యూ ఉంటాయని చెప్పారు. వికలాంగులు, వృద్ధులకు రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఒకసారి, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య మరోసారి ప్రత్యేక దర్శనాలు ఉంటాయని వివరించారు. మంత్రులకూ అంతరాలయ దర్శనం ఉండదు దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడిలో అంతరాలయ దర్శనం గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ప్రముఖులకు మాత్రమే ఉంటుందని తెలిపారు. మంత్రులకు సైతం బయట నుంచే దర్శనాలు కల్పించాలని ఆలోచన చేస్తున్నామని వివరించారు. దసరా ఉత్సవాల తర్వాత దుర్గగుడిలో అంతరాలయ దర్శనానికి రూ. 500 టికెట్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. -
ప్రసాదానికి త్వరలో ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాల్లో భక్తులకు పంచిపెట్టే ప్రసాదాలకు కేంద్ర ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ సర్టిఫికెట్లు దక్కబోతున్నాయి. కేంద్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ఇటీవల ప్రసాదాల నాణ్యత ఆధారంగా భోగ్(దేవునికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం) పేరుతో సర్టిఫికెట్లు జారీ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, బెజవాడ దుర్గగుడి, సింహాచలం, కాణిపాకం, అన్నవరం, పెనుగంచిప్రోలు, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి, మహానంది, ద్వారకా తిరుమల ఆలయాల్లోని ప్రసాదాలకు సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 11 ప్రధాన ఆలయాల ఈవోలు ప్రసాదాలకు భోగ్ సర్టిఫికెట్ కోసం వెంటనే ఫుడ్ సేఫ్టీ విభాగానికి దరఖాస్తు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ శనివారం ఆదేశాలిచ్చారు. -
ఆదాయంలేని గుళ్లకు ‘ధూప దీప నైవేద్యం’
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ఆదాయం ఉండే ఆలయాల్లో సైతం స్వామివారికి నిత్యం నైవేద్య కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా.. ఈ నెలలో కొత్తగా 2,200 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని (డీడీఎన్ఎస్) మంజూరు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కమిషనర్ హరిజవహర్‌లాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన ఆలయాలకు నిత్య నైవేద్య ఖర్చులకుగాను నెలనెలా రూ.5 వేల చొప్పున దేవదాయ శాఖ నుంచి ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దేవాలయాలకు పరిమితి లేకుండా సంతృప్త స్థాయిలో డీడీఎన్‌ఎస్‌ను అమలుచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని.. అందుకనుగుణంగా అర్హత ఉంటే ప్రతి గ్రామంలోను కనీసం ఒక దేవాలయాన్ని అయినా ఈ పథకం కిందకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యనారాయణ తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే దాదాపు 1,500 ఆలయాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, మరో 3,500 దాకా వినతులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించిన వినతులను జిల్లా దేవదాయ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారని.. ఇప్పటివరకు 2,346 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్నారు. వీటిలో 2,200 ఆలయాలకు ఈ పథకం మంజూరు చేసేందుకు అర్హత ఉందన్నారు. ఇక డీడీఎన్ఎస్ పథకం ద్వారా ఆలయాలకు ప్రతినెలా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచే దానిపై సీఎంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని విలేకరుల ప్రశ్నకు మంత్రి కొట్టు సత్యనారాయణ బదులిచ్చారు. అమీన్లు కేటాయించాలని హైకోర్టును కోరుతాం ఇక దేవదాయ శాఖ భూముల ఆక్రమణలకు సంబంధించి ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో ప్రస్తుతం 4,708 కేసులు ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్నాయని.. అందులో 722 కేసులు పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. కొన్నిచోట్ల దేవదాయ శాఖ సిబ్బంది ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నప్పటికీ, మరికొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఇలాంటి చోట్ల ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఎనిమిది మంది అమీన్లను ప్రత్యేకంగా దేవదాయ శాఖకు కేటాయించేందుకు హైకోర్టును కోరాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇక ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తామన్నారు. మాన్యం భూముల హక్కుదారు స్వామివారే.. దేవుడి మాన్యాలపై అసలు హక్కుదారుడు దేవుడేనని.. అందులో ఫలసాయం తీసుకోవడం వరకు మాత్రమే వాటిని పొందిన వారికి హక్కు ఉంటుందని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టంచేశారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, సత్రాల పేరిట 4.09 లక్షల ఎకరాలు భూములున్నట్లు గుర్తించామని, వాటిలో ఆక్రమణలో ఉన్న వాటి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, టీటీడీ తరహాలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ ద్వారా అన్నిరకాల సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా శ్రీశైలంలో అమలుచేస్తున్నామన్నారు. ఇక 21 మంది సభ్యులతో పూర్తిస్థాయిలో ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసిందని.. అవినీతికి, అక్రమాలకు పాల్పడే మఠాధిపతులపై చర్యలు తీసుకునే అధికారం, వారి స్థానంలో మరొకరిని నియమించే అధికారం ఈ ధార్మిక పరిషత్‌కు ఉందన్నారు. ఆస్తులను 11 సంవత్సరాలకు పైబడి లీజును విస్తరించే అధికారం కూడా ఈ పరిషత్‌కే ఉందని మంత్రి చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల సంతృప్తికి ఆ సర్వేనే సాక్ష్యం దేవుడిపై విపరీతమైన నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఉంటారని, సంక్షేమ పథకాలు అమలుచేయడంలో ఆయనకు దేవుడి ఆశీస్సులు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారన్న దానికి ఇటీవల ఓ ఆంగ్ల చానల్ నిర్వహించిన సర్వే ఫలితాలే సాక్ష్యమని కొట్టు సత్యనారాయణ చెప్పారు. చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహంలో ముందెన్నడూ చూపనంత చొరవ -
21 మందితో ధార్మిక పరిషత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలు, మఠాలు, సత్రాలు, ఇతర హిందూ ధార్మిక సంస్థల వ్యవహారాలపై ప్రభుత్వ పరంగా తీసుకొనే విధాన నిర్ణయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే ధార్మిక పరిషత్ పదేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఏర్పాటయింది. దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ఇద్దరు మఠాధిపతులు, ఇద్దరు ఆగమ పండితులు, ఓ రిటైర్డు హైకోర్టు జడ్జి, ఓ రిటైర్డు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి, ఓ రిటైర్డు ఐఏఎస్ అధికారి, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక రిటైర్డు దేవదాయ శాఖ అధికారితో పాటు ఆలయాల నిర్మాణంలో ముఖ్య భూమిక ఉండే ఇద్దరు దాతలు, వివిధ ఆలయాల పాలక మండళ్లకు చైర్మన్లుగా ఉన్న ఆరుగురుని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. అధికారవర్గాల నుంచి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో సభ్యులుగా, దేవదాయ శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా (మెంబర్ సెక్రటరీ) ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబరు 571 విడుదల చేసింది. పరిషత్ పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్లు కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఉమ్మడి ఏపీలోగానీ, ప్రస్తుత విభజిత ఏపీలోగానీ ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కమిటీ సభ్యులు ధార్మిక పరిషత్‌లో దేవదాయ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈవో మినహా మిగిలిన 17 మంది పేర్లు.. మఠాధిపతులు: 1) పెద్ద జియ్యంగార్ మఠం, తిరుమల 2) పుష్పగిరి మఠం, వైఎస్సార్ జిల్లా రిటైర్డు హైకోర్టు జడ్జి: మఠం వెంకట రమణ రిటైర్డు ప్రిన్సిపల్ జడ్జి: కె. సూర్యారావు రిటైర్డు ఐఏఎస్ అధికారి: అజేయ కల్లం ఆగమ పండితులు: పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు, సీహెచ్ శ్రీరామ శర్మ చార్టెడ్ అకౌంటెంట్: శ్రీరామమూర్తి దేవదాయ శాఖ రిటైర్డు అధికారి: ఏబీ కృష్ణారెడ్డి (రిటైర్డు అడిషనల్ కమిషనర్) దాతలు: ఎస్ నరసింహారావు, యూకే విశ్వనాథ్‌రాజు ఆలయ, సత్రాల పాలక మండళ్ల సభ్యులు: ఎం.రామకుమార్ రాజు, భీమవరం (జగన్నాథరాజు సత్రం), ఇనుగంటి వెంకట రోహిత్ (అన్నవరం), జ్వాలా చైతన్య (యడ్ల పిచ్చయ్య శెట్టి సత్రం, కడప), చక్కా ప్రభాకరరావు (చాకా వారి సత్రం, పాలకొల్లు), మాక్కా బాలాజీ, రంజన్ సుభాషిణి. దేవదాయ శాఖలో పరిషత్‌వి విస్త్రత అధికారాలే.. దేవదాయ శాఖ పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో ధార్మిక పరిషత్ అత్యంత ఉన్నత కమిటీ. శాఖ పరిధిలోని రూ.25 లక్షల నుంచి రూ. కోటి లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలు, అన్ని రకాల మఠాల పాలన, ధార్మిక వ్యవహారాలు పూర్తి పరిషత్ ఆధీనంలో కొనసాగాలి. రాష్ట్రంలో చిన్నా పెద్దవి కలిపి మొత్తం 128 మఠాలు ఉన్నాయి. మంత్రాలయం, హథీరాంజీ మఠం వంటివి ఈ కేటగిరిలోకే వస్తాయి. ► ఏటా రూ. 25 లక్షలకు పైబడి కోటి రూపాయలకు తక్కువ వార్షికాదాయం వచ్చే ఆలయాలకు ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పాలక మండళ్ల నియామకం జరుగుతుంది. ► దేవదాయ శాఖ పరిధిలో ఉండే అలయాలు, సత్రాల కార్యకలాపాలపై తీసుకొనే విధాన పరమైన నిర్ణయాల్లో పరిషత్ కీలకంగా వ్యవహరిస్తుంది. ► వందేళ్లు దాటిన ఆలయాల పునర్నిర్మాణానికి ముందుగా పరిషత్ అనుమతి తీసుకోవాలి. ► హిందూ ధార్మిక పరమైన కార్యక్రమాల నిర్వహణలో ధార్మిక పరిషత్‌తో చర్చించే నిర్ణయాలు జరుగుతాయి. ► నిబంధనల ప్రకారం ధార్మిక పరిషత్ మూడు నెలలకొకసారి తప్పనిసరిగా సమావేశమవ్వాలి. అవసరమైతే ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉమ్మడి ఏపీలో ధార్మిక పరిషత్‌ను తొలిసారి ఏర్పాటు చేసింది వైఎస్సే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ధార్మిక పరిషత్‌కు దఖలు పడిన అధికారాలన్నీ అంతకు ముందు ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన వెంటనే తొలిసారి ధార్మిక పరిషత్ ఏర్పాటుకు చకచకా ప్రయత్నాలు జరిగాయి. అయితే, పరిషత్ ఏర్పాటు జీవో విడుదలకు ముందే వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం చెందారు. ఆ తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో విడుదలైంది. అప్పుడు ఏర్పడిన పరిషత్ పదవీకాలం 2012లో ముగిసింది. ఉమ్మడి ఏపీలోనే 2014లో మరోసారి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ, అది బాధ్యతలు చేపట్టక ముందే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పరిషత్ ఏర్పాటుకు ముందే రద్దయింది. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014 – 19 మధ్య రెండు విడతలు ధార్మిక పరిషత్ ఏర్పాటుకు దేవదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం 21 మంది సభ్యులతో పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటుకు ముందుకు రాలేదు. తిరిగి పదేళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ధార్మిక పరిషత్‌ను రెండో విడత పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. -
అన్నదాత నుంచే ఆలయాలకు ఆహార ధాన్యాలు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాల్లో పురుగుమందుల ఆనవాళ్లు లేని ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలు కొనాలని నిర్ణయించింది. ప్రసాదాలు, అన్నదానంలో ఉపయోగించే 12 రకాల ఆహార ధాన్యాలను దేవదాయ శాఖ రైతుల నుంచి కొంటుంది. వీటి కొనుగోలులో మార్క్‌ఫెడ్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. తొలుత 11 ప్రధాన ఆలయాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశంపై ఇంతకు ముందే ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిల స్థాయిలో ప్రాథమిక చర్చలు జరిగాయి. బుధవారం ఆలయాల ఈవోలతో దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, మార్క్‌ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న, రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు సమావేశమయ్యారు. తదుపరి దశలో ఆయా ఆలయ పాలక మండలి సమావేశాల్లో రైతుల నుంచే సేంద్రియ ఆహార ధాన్యాల కొనుగోలుపై చర్చించి, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. తదుపరి దశలో నిత్య అన్నదానం జరిగే మరో 175 ఆలయాల్లో ఈ విధానం అమలుకు కసరత్తు జరుగుతోంది. రైతులకు కేవలం 15 రోజుల్లోనే డబ్బు చెల్లించాలని కూడా దేవదాయ శాఖ భావిస్తోంది. ఆ 11 ఆలయాలకే ఏటా 8 వేల టన్నుల ఉత్పత్తులు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, వాడపల్లి, విశాఖ కనకమహాలక్ష్మీ ఆలయం, మహానంది ఆలయాల్లో ముందుగా ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఈ ఆలయాల్లో ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలకు ఏటా దాదాపు 8 వేల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం ఉంటుందని అంచనా. రెండు దశలో చేపట్టే 175 ఆలయాలకు 35 – 40 వేల టన్నుల ఆహార ధాన్యాల అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సాధారణ పురుగు మందులు ఉపయోగించి పండించే ఆహార ధాన్యాలకు బదులు సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యం వినియోగం ద్వారా భక్తులకు మరింత నాణ్యమైన ప్రసాదం అందించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ విధానానికి ప్రభుత్వ పరంగానూ అదనపు ప్రోత్సాహం అందించినట్టవుతుందని చెప్పారు. టీటీడీలో సేంద్రియ శనగల కొనుగోలు తిరుమల తిరుమల దేవస్థానం (టీటీడీ)లో ప్రసాదాల తయారీలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు పరుస్తున్నారు. టీటీడీలో ఏటా 24 వేల టన్నుల ఆహార ధాన్యాలు వినియోగిస్తారు. వీటిలో శనగలను మార్కెఫెడ్ మధ్యవర్తిత్వంతో సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల నుంచి నేరుగా కొంటున్నారు. మిగతా ఆహార ధాన్యాలను కూడా సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల నుంచి కొనాలన్న ప్రక్రియ పురోగతి దశలో ఉంది. -
ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: ప్రముఖ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీతో రైతు సాధికార సంస్థ గతేడాది అక్టోబర్‌లో చేసుకున్న ఒప్పందం మేరకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం ప్రకృతి సిద్ధంగా పండించిన శనగలను మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటిని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పండించేలా ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన రైతులకు రైతు సాధికార సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చారు. వీటిని కనీస మద్దతు ధర కంటే 10 శాతం అదనపు ధర చెల్లించి మరీ సేకరించారు. వాటి నమూనాలను థర్ట్ పార్టీ ఏజెన్సీ ద్వారా పరీక్షించి ధ్రువీకరించిన తర్వాత టీటీడీకి సరఫరా చేస్తున్నారు. ఇలా 10 నెలల్లో రూ.7.52 కోట్ల విలువైన 1,306 టన్నుల శనగలను టీటీడీకి సరఫరా చేశారు. టీటీడీ సూచన మేరకు స్వామివారి నైవేద్యం, ప్రసాదాలతో పాటు నిత్యాన్నదానం కోసం 2022–23 సీజన్లో 24,728 టన్నుల 12 రకాల ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 8 ఆలయాలకు ఉత్పత్తులు ఇదే స్ఫూర్తితో కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్వారకా తిరుమల, సింహాచలం, పెనుగంచిప్రోలు, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ ఆలయాల్లో ప్రసాదం, నైవేద్యం, నిత్యాన్నదానం కోసం రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను ప్రోసెస్ చేసి ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేయనున్నారు. ఇందుకోసం గుర్తించిన రైతులకు రైతు సా«ధికార సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వీరు పండించిన ఉత్పత్తులకు భారతీయ సేంద్రియ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాల సంస్థకు చెందిన ఆర్గానిక్ సర్టిఫికేషన్ అండర్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ (పీజీఎస్) ద్వారా సర్టిఫికేషన్ చేయించి మరీ ఆలయాలకు సరఫరా చేయనున్నారు. ఈ మేరకు దేవదాయ, వ్యవసాయ శాఖ మంత్రుల సమక్షంలో ఆయా దేవస్థానాలు, రైతు సాధికార సంస్థ, ఏపీ మార్క్‌ఫెడ్ మంగళవారం అవగాహన ఒప్పందం చేసుకోనున్నాయి. -
ఆలయాల్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు (ఫొటోలు)
-
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
ద్వారకాతిరుమల/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): సకల శుభాలు కలిగించే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు వచ్చి పూజలు చేశారు. ప్రధానంగా అన్నవరం, సింహాచలం, అరసవిల్లి వంటి ముఖ్యమైన ఆలయాల్లో భక్తజనం పెద్దఎత్తున వచ్చారు. ఇక ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలోని దాదాపు అన్ని విభాగాలూ భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రంలో రద్దీ కొనసాగింది. భజన మండళ్ల సభ్యులు కోలాట భజనలతో ఆకట్టుకున్నారు. అలాగే, ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా ఆదివారం ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. విజయవాడ లబ్బీపేట, వన్‌టౌన్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో స్వామి వారికి పలు ప్రత్యేక పూజలు, లక్ష తులసీదళార్చన నిర్వహించారు. అభినవ మేల్కొటెగా పేరుగాంచిన కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఉల్లిపాలెంలోని శ్రీగోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో పులకించింది. 11 అడుగుల శ్రీమన్నారాయణుడి మూలమూర్తికి అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మచిలీపట్నం చిలకలపూడి కీర పండరీపురంలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు జరిపించారు. అలాగే, బెజవాడ కనకదుర్గమ్మ, పట్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో పెద్దఎత్తున బారులుతీరారు. -
బిస్కెట్లుగా దేవుడి నగలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ముఖ్య దేవాలయాల్లో మూలుగుతున్న బంగారు, వెండి ఆభరణాలు, వస్తువుల మూటలకు మోక్షం కలగనుంది. బంగారం బిస్కెట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా లాకర్ల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు వడ్డీ రూపంలో ఆదాయం సమకూర్చుకునే దిశగా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణలోనే ప్రధాన దేవాలయం వేములవాడ.. భక్తుల కొంగుబంగారం. అందుకు తగ్గట్టుగానే అక్కడికి వచ్చే భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. ఇందులో పెద్దమొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు కూడా ఉంటాయి. అయితే స్వామికి అలంకరించే ఆభరణాలు పోను మిగతావి పదుల సంఖ్యలో మూటల్లో నింపి లాకర్లలో పడేశారు. రాష్ట్రంలోని భద్రాచలం, బాసర, కొండగట్టు, యాదగిరిగుట్ట, కొమురవెల్లి, ధర్మపురి, వరంగల్ భద్రకాళి, ఉజ్జయినీ మహంకాళి.. ఇలా ముఖ్య దేవాలయాలన్నిటిలో ఇదే పరిస్థితి. భద్రాచలం దేవాలయంలో ఉత్సవాల సమయంలో ఎక్కువ నగలను దేవతా మూర్తులకు అలంకరిస్తున్నారు. యాదగిరిగుట్టలో దేవాలయ పునర్నిర్మాణం నేపథ్యంలో బంగారాన్ని కరిగించి ఆలయానికే వినియోగిస్తున్నారు. కానీ మిగతా దేవాలయాల్లో ఆభరణాలు, వస్తువులు, తుసుర్ల రూపంలో ఉన్న వెండి, బంగారం ఎన్నో ఏళ్లుగా లాకర్లలో మూలుగుతున్నాయి. అయితే ఇప్పుడవి బంగారం బిస్కెట్లలా మారనున్నాయి. తర్వాత అవి స్టేట్ బ్యాంకు అధీనంలోకి వెళ్లడం ద్వారా వడ్డీ రూపంలో దేవాదాయ శాఖకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూరనుంది. గోల్డ్ మానిటైజేషన్ పథకం కింద.. బంగారాన్ని డిపాజిట్ చేసే పని ఇప్పటికే మొదలు కాగా, తాజాగా వేల కిలోల వెండి.. దాని విలువకు తగ్గ బంగారం బిస్కెట్లుగా మారనుంది. వెండిని కరిగించి దానికి బదులుగా స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో ఇచ్చేందుకు మింట్ అంగీకరించింది. మొత్తం బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ పథకంలో డిపాజిట్ చేయటం ద్వారా సాలీనా రూ.2.5 కోట్ల వడ్డీ దేవాదాయ శాఖకు అందుతుందని సమాచారం. ఇంతకాలం ఆ వెండి, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో భద్రపరిచినందుకు లాకర్ అద్దె, కొన్నింటికి బీమా చేయించినందుకు ప్రీమియం రూపంలో లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆ ఖర్చు మిగలనుంది. వేములవాడ ఆలయంతో మొదలు.. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాల్లో వినియోగంలో లేని బంగారం దాదాపు 425 కిలోలు ఉంది. అలాగే 18 వేల కిలోల వెండి లాకర్లలో మూలుగుతోంది. నిజానికి ఆలయాల్లో 38 వేల కిలోల వెండి ఆభరణాలు, వస్తువులున్నాయి. కానీ అందులో సగానికంటే కాస్త ఎక్కువ మాత్రమే వినియోగంలో ఉండగా మిగతావి లాకర్లలోనే ఉంటోంది. అయితే ప్రస్తుతం దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు కూడా నిధులు సరిపోక ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ఆదాయాన్ని పెంచుకునే కసరత్తులో భాగంగా బంగారం, వెండి వస్తువులను స్టేట్ బ్యాంకు గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో భాగంగా డిపాజిట్ చేయాలని ఇటీవల నిర్ణయించారు. ఆ మేరకు వినియోగంలో లేని బంగారాన్ని మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) ఆధ్వర్యంలో కరిగించి బిస్కెట్లుగా మార్చే కసరత్తు ప్రారంభమయ్యింది. ఇటీవలే కొంత బంగారాన్ని స్టేట్ బ్యాంకుకు అప్పగించారు. దాదాపు 70 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేయనున్నారు. మింట్ అధికారులతో చర్చ తాజా సమాచారం ప్రకారం.. బంగారాన్ని నేరుగా స్టేట్‌బ్యాంకే ఎంఎంటీసీలో కరిగిస్తుంది. అక్కడ 95 శాతం ప్యూరిటీ స్థాయికి తెప్పించి దాన్ని బిస్కట్లుగా మారుస్తారు. వెండి విషయంలో మాత్రం ఇటీవల మింట్ యంత్రాంగంతో దేవాదాయ శాఖ అధికారులు చర్చించారు. వెండిని కరిగించి పూర్తి స్వచ్ఛమైన వెండిలా మార్చి.. అప్పటి బులియన్ ధరల ప్రకారం దాని విలువను బంగారంతో లెక్కగట్టి.. అంత విలువైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కట్ల రూపంలో దేవాదాయ శాఖకు అందించేందుకు మింట్ అంగీకరించినట్టు తెలిసింది. దీంతో ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలోని దేవాలయాల్లో నిరుపయోగంగా ఉన్న 18 వేల కిలోల వెండిని మింట్‌కు అప్పగించనున్నారు. తొలుత వేములవాడ దేవాలయం వెండిని బిస్కెట్లుగా మార్చే పనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ దేవాలయంలోని 800 కిలోల వెండికి బదులుగా మింట్ నుంచి దాదాపు 8 కిలోల బంగారు బిస్కెట్లు సమకూరుతాయని అంచనా. అలా అన్ని దేవాలయాల్లోని వెండి ద్వారా దాదాపు 180 కిలోల వరకు బంగారం సమకూరుతుందని భావిస్తున్నారు. అంటే వంద కిలోల వెండికి కిలో బంగారం వస్తుందన్నమాట. -
ఒక ఆలయం... ముగ్గురు దేవుళ్లు
ఒక ఆలయం... ముగ్గురు దేవుళ్లుసాధారణంగా దేవాలయంలో ఒక్కరే ప్రధాన దేవుడు ఉంటాడు. కానీ కొన్ని దేవాలయాల్లో ముగ్గురు దేవుళ్లు మూడు వేరు వేరు గర్భగృహాల్లో ఉంటారు. ఇటువంటి ఆలయాలను త్రికూటాలయాలు అని వ్యవహరిస్తారు. అయితే ఇవి చాలా తక్కువ సంఖ్యలో నిర్మితమయ్యాయి. హన్మకొండలోని వేయి స్తంభాల గుడి త్రికూటాలయమే. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, మంథనిలోని గౌతమేశ్వరాలయం, సంగారెడ్డికి సమీపంలోని కల్పగూరు కాశీ విశ్వేశ్వరాలయాలు ఇలాంటివే. హన్మకొండ వేయిస్తంభాల ఆలయం కాకతీయ శిల్ప కళారీతికి అద్దంపట్టే అద్భుతమైన ఆలయం. క్రీ.శ. 1163లో రుద్రదేవ మహారాజు కట్టించిన ఆలయమిది. ఆయన పేరుతోనే ఈ ఆలయాన్ని రుద్రేశ్వరాలయం అనీ, దీనిలోని లింగాన్ని రుద్రేశ్వర లింగం అనీ వ్యవహరిస్తారు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ త్రికూటాలయంలో శివుడు, విష్ణువు, సూర్య దేవుళ్లకు గర్భాలయాలు ఉన్నాయి. స్తంభాలు ఒకదాని తరువాత ఒకటి వరుసలు దీరినట్లు చెక్కబడి కనిపిస్తాయి. మంథనిలోని గౌతమేశ్వరాలయం కూడా త్రికూటాలయమే. దీనిని కూడా 1000 స్తంభాల ఆలయం అని వ్యవహరిస్తారు. ఈ ఆలయం హన్మకొండ ఆలయం కన్నా ముందుగానే నిర్మించారని భావిస్తున్నారు. ఇక్కడి శివలింగం అచ్చంగా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలోని శివలింగం లాగే ఉంటుంది. ఆదిగురువు శంకరాచార్యులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారట. అయితే, దీన్ని రాష్ట్ర కూటులు నిర్మించారా, లేదా చాళుక్యులా అనే విషయంలో స్పష్టత లేదు. అయితే, కాకతీయులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతారు. మరో త్రికూటాలయం పానగల్లులో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం. నల్లగొండ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. కుందూరు చోళులు నిర్మించిన ఈ దేవాలయానికి రెండు ప్రత్యేక తలు ఉన్నాయి. ముఖ్యమైంది ఈ దేవాలయం గర్భ గుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ. రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్భగుడిలోకి అది ఉబికిరావడం. 11వ శతాబ్దంలో చాళుక్య శైలిలో నిర్మిచిన ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీదత్తాత్రేయుడు కొలువై ఉండగా, మరొకటి ఖాళీగా కనిపిస్తోంది. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీసోమేశ్వర స్వామి దర్శన మిస్తారు. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంతవరకూ తన స్థానాన్ని మార్చు కోదు అనేది ఆశ్చర్యపరుస్తుంది. భౌతిక శాస్త్రంలోని పరిక్షేపణ కాంతి ఆధారంగా ఈ త్రికూట ఆలయాన్ని నిర్మించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో కల్పగూరు గ్రామంలో కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది. హన్మకొండ వేయిస్తంభాల ఆలయ నిర్మాణశైలిలోనే ఇదీ ఉంది. ఈ ఆలయంలో దక్షిణాన కాశీ విశ్వేశ్వరుడు, ఉత్తరాన వేణుగోపాల స్వామి, పశ్చిమాన అనంత పద్మనాభ స్వామి గర్భాలయాలు ఉన్నాయి. (క్లిక్: స్ఫూర్తినిచ్చే ‘కాకతీయ వైభవం’) కాకతీయ ఆలయాలు నిర్మాణ శైలి, శిల్ప సౌందర్యాలకు ప్రసిద్ధి చెందినా... నాటి ఇంజినీర్లు వాడిన సాంకేతిక విజ్ఞానం కొంత వివాదాస్పదంగా మారింది. భూకంపాల వంటి ప్రకృతి విపత్తులను తట్టుకోవడానికి పునాదుల్లో ఇసుకను వాడటం నాటి ఆలయాల నిర్మాణంలో కనిపించే సాధారణ దృశ్యం. అయితే అదే ఈ ఆలయాల మనుగడకు శాపంగా మారింది. కాలక్రమంలో పునాదులు కుంగి ఆలయాలు కూలిపోవడానికి కారణమయింది. హన్మకొండ ఆలయంలోని కొంత భాగం ఇందువల్లనే దెబ్బతిన్నదని అంటున్నారు. - కన్నెకంటి వెంకటరమణ సంయుక్త సంచాలకులు, ఐ అండ్ పీఆర్, హైదరాబాద్ (‘కాకతీయ వైభవ సప్తాహం’ జూలై 7–13 వరకు) -
రూ.10 కోట్లతో 100 ఆలయాలు
నాతవరం: ఎంతో చరిత్ర కలిగిన ఈరుడుకొండపై శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నిర్మాణం చేయడం ఆనందాయకమని ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. నాతవరం సమీపంలో ఉన్న ఈరుడికొండపై రూ.3కోట్లతో శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నిర్మించేందుకు శుక్రవారం కశింకోట శ్రీమారుతీరామానుజచార్యులు అధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రబ్యాంకు చైర్మన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు దంపతులు, డీసీసీబీ డైరెక్టరు అంకంరెడ్డి జమీలు పార్వతి దంపతులు, అన్ని వర్గాలకు చెందిన 27 దంపతులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గం నాలుగు మండలాల్లో రూ.10కోట్లతో సుమారుగా 100 ఆలయాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ఆలయానికి రూ.10 లక్షల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రతిపాదనలు పంపించిన ఆలయాలకు గ్రామాల్లో ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారని తెలిపారు. మరో సింహచలం కానున్న నాతవరం ఉమ్మడి జిల్లాలో ఉన్న శ్రీనృసింహస్వామి ఆలయం కారణంగా సింహాచలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని డీసీసీబీ చైర్మన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లాలో నిర్మించనున్న శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంతో నాతవరం గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో భక్తిభావం పెరిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. నాతవరం గ్రామానికి సమీపంలో ఎత్తయిన ఈరుడి కొండపై 500 ఏళ్లు పైగా చెట్టు పొదలో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి రాతి విగ్రహాలకు గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతంలో పురాతన రాతి విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని పరిశీలించిన డీసీసీబీ డైరెక్టరు అంకంరెడ్డి జమీలు ఈ కొండపై ఆలయం నిర్మాణం చేయాలని గ్రామస్తులతో కలిసి నిర్ణయించారు. ఎత్తయిన కొండపై రూ.15లక్షలతో ఎకరం స్థలాన్ని చదును చేయించారు. కొండ చుట్టూ ఘాట్‌రోడ్డు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.3 కోట్లతోశ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు కొండచుట్టూ తొమ్మిది ఆలయాలు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ అప్పలనర్స, వైస్ ఎంపీపీ సునీల్, ఎంపీడీవో నాగలక్ష్మి, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఎంపీటీసీ రేణుక తదితరులు పాల్గొన్నారు. -
వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు!
ధర్మవరం రూరల్(శ్రీ సత్య సాయి జిల్లా): చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా సమాధులు కట్టడం, వర్ధంతులు, జయంతులు, పండుగ పూట పూజలు చేయడం మామూలుగా మనం చూస్తుంటాం. అయితే ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామంలో వింత ఆచారం నడుస్తోంది. చనిపోయిన వారికి ఇక్కడ సమాధులు కట్టడమే కాకుండా పైన దేవతామూర్తుల విగ్రహాలు ఉంచి చిన్న పాటి గుడిలాంటిది నిర్మిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు నిత్యం పూజలు చేస్తుంటారు. దీంతో పాటు ఏటా తొలి ఏకాదశి రోజున ఇక్కడ జాతర నిర్వహిస్తుండం గమనార్హం. సమాధిపైన చనిపోయిన వారి చిత్రం.. 45 ఏళ్ల క్రితం బళ్లారి ప్రాంతం నుంచి ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామానికి పెద్ద బొమ్మయ్య వంశీకులు వచ్చి స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన కుటుంబాలు గ్రామంలో 14 వరకు ఉన్నాయి. పెద్ద బొమ్మయ్య మరణానంతరం అతని జ్ఞాపకార్థం సమాధి నిర్మించిన కుటుంబీకులు.. పూడ్చిన చోటనే గంగమ్మ దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి పెద్ద బొమ్మయ్య వంశీకులు ఎవరు చనిపోయినా ఆలయం పక్కనే వారిని ఖననం చేసి సమాధి కడుతున్నారు. పెద్ద బొమ్మయ్య సమాధిపై ప్రతిష్టించిన గంగమ్మ దేవత విగ్రహాలు అనంతరం వాటిపై చిన్నదేవాలయం లాంటి నిర్మాణమో.. లేకుంటే పూడ్చిన వ్యక్తి చిత్రాన్నో దానిపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి చిన్నచిన్న ఆలయాలు కట్టిన ఆలయాలు నాలుగుదాకా ఉన్నాయి. ఇక.. సమాధులపై వేసిన చిత్రాలను దూరం నుంచి చూస్తే ఎవరో పడుకుని ఉన్నట్లుగా భ్రమ కలుగుతుండడం గమనార్హం. పెద్ద బొమ్మయ్య వంశస్తుల మరో ప్రత్యేకత ఏమిటంటే తమ కుటుంబంలో పుట్టే ప్రతి బిడ్డకూ పూరీ్వకుడు బొమ్మయ్యే పేరు కొనసాగిస్తుండడం. ప్రస్తుతం గ్రామంలో చిన్న బొమ్మయ్య, పెద్ద బొమ్మయ్య, నడిపి బొమ్మయ్య, సన్న బొమ్మయ్య ఇలా మగవాళ్ల పేర్లన్నీ ఒకేలా ఉన్నాయి. తాతల కాలం నుంచి అఖండం వెలుగుతోంది మేమంతా పూరీ్వకులను పూజిస్తుంటాం. వారి జ్ఞాపకార్థం సమాధులను నిర్మించి వాటిపై ప్రతిమలు ఏర్పాటు చేయించి పూజలు చేస్తాం. సమాధిపై నిర్మించిన గంగమ్మ గుడిలో మా తాతలు పెట్టిన అఖండం నేటికీ వెలుగుతోంది. కేవలం ఒత్తులు మాత్రమే మారుస్తుంటాం. ఆచారాన్ని మా పిల్లలకు కూడా నేర్పుతాం. – చిన్నబొమ్మయ్య, సుబ్బరావుపేట -
సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి
విజయనగరం టౌన్: జీర్ణోద్ధరణకు గురైన ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్, కామన్ గ్రాంట్ ఫండ్) కింద జిల్లాకు రూ.20 కోట్లు కేటాయించింది. జిల్లాలోని 44 ఆలయాల అభివృద్ధి పనులను చేపట్టింది. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయాలు కొత్తశోభను సంతరించుకుంటుండడంతో భక్తులు సంతోషపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అర్చకులు, ఆయా ఆలయాల అధికారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 461 ఆలయాలు ఉన్నాయి. ఇందులో రూ.25 లక్షలకు పైబడి వార్షిక ఆదాయం వస్తున్న 6 (ఎ) కేటగిరీకి చెందిన ఆలయాలు 6 వరకూ ఉన్నాయి. రూ.2లక్షలు పైబడి వార్షిక ఆదాయం వస్తున్న 6 (బి) కేటగిరీకి చెందిన ఆలయాలు 15 వరకూ ఉన్నాయి. వీటితో పాటు 6(సి) కేటగిరీలో రెండు లక్షల రూపాయలలోపు ఆదాయం ఉన్న ఆలయాలు 30 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఆలయాలకు ఎటువంటి ఆదాయం లేదు. వీటిలో అధిక ఆలయాలు జీర్ణోద్ధరణకు గురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సర్వ శ్రేయోనిధి కింద రూ. 20 కోట్లు కేటాయించడంతో జిల్లాలో 44 ఆలయాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. ఇటీవల కాలంలో రామతీర్థం బోడికొండపైన నూతనంగా నిర్మాణమైన ఆలయమే దీనికి నిదర్శనం. దాంతో పాటు రామతీర్థం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం విశేషం. విజయనగరం డివిజన్ పరిధిలో ఇప్పిలి వీధి శ్రీరామమందిరానికి రూ. 20 లక్షలు, నాగవంశపు వీధి రామమందిరానికి రూ.50 లక్షలు, మండపం వీధి సంపత్ వినాయకస్వామి ఆలయానికి రూ.75 లక్షలు, కొత్తపేట రామమందిరానికి రూ.50 లక్షలు, గాయత్రీనగర్ వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.40 లక్షలు, బోయవీధి రామమందిరానికి రూ.20 లక్షలు, పల్లివీధి కోదండరామాలయానికి రూ.40 లక్షలు, మండపం వీధి జగన్నాథస్వామి పురాణకాలక్షేప మండపానికి రూ. 80లక్షలను ప్రభుత్వం కేటాయించింది. వీటితో పాటు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి రూ.50 లక్షలు కేటాయింపులు జరిగాయి. చీపురుపల్లి డివిజన్ పరిధిలో నిమ్మలవలస గ్రామం శ్రీరామమందిరానికి రూ.30 లక్షలు, గరివిడి మండలం ఆర్తమూరు కోదండరామాలయానికి రూ.40 లక్షలు, మెరకముడిదాం పులిగుమ్మి రామాలయానికి రూ. 30 లక్షలు, చీపురుపల్లి కనకమహాలక్ష్మి ఆలయానికి రూ.15 లక్షలు, గరివిడి నీలాద్రిపురం రామాలయానికి రూ.25 లక్షలు, రామతీర్థం శ్రీరామస్వామి దేవస్థానానికి కోటి రూపాయలు, బోడికొండపై కోదండరామ ఆలయ నిర్మాణానికి రూ. 3 కోట్లు కేటాయించింది. పోలిపల్లి గ్రామం పైడితల్లి ఆలయానికి రూ. 50 లక్షలు, భోగాపురం మండలం నందిగాం రామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.50 లక్షలు, చీపురుపల్లి మండలం పత్తికాయలవలసలో ఉన్న శ్రీరామమందిరానికి రూ.16 లక్షలు, చీపురుపల్లి మండలం పర్లలో ఉన్న శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, మెంటాడలో ఉన్న సీతారామఆలయానికి రూ. 25లక్షలు మంజూరు చేసింది. ఎస్.కోట డివిజన్ పరిధిలో కొత్తవలస గులివిందాడ శ్రీరామలయానికి రూ.40 లక్షలు, ఎల్.కోట జమ్మాదేవిపేట రామాలయానికి రూ. 44 లక్షలు, గంట్యాడ పెదవేమలి శ్రీరామాలయానికి రూ.16 లక్షలు, వేపాడ రామయ్యపేట రాములవారు, బంగారమ్మ తల్లి ఆలయానికి రూ.20 లక్షలు, గంట్యాడ కొర్లాం శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, జామి శ్రీరామాలయానికి రూ.50 లక్షలు ఎల్.కోటకొత్తపాలం మల్లివీడు పంచాయతీ శ్రీరామాలయానికి రూ.30 లక్షలను కేటాయించింది. ఎల్.కోట రాగరాయిపురం భూలోకమాత ఆలయానికి రూ.30 లక్షలు, వేపాడ వల్లంపూడి సీతారామస్వామి ఆలయానికి రూ.50 లక్షలు, కొత్తవలస గనిశెట్టిపాలెం శ్రీరామాలయానికి రూ.19లక్షల 30వేలు, ఎస్.కోట గవరపాలెం శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, ఎస్.కోట పుణ్యగిరి ధారగంగమ్మ, శివాలయానికి రూ.30 లక్షలు కేటాయింపులు జరిపింది. బొబ్బిలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గరుగుబిల్లి తోటపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.83 లక్షలు, సాలూరు వడ్డివీధి రామాలయానికి రూ. 13 లక్షలు, సీతానగరం కాసాపేట శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, సీతానగరం నిడగల్లు శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి రూ. 50 లక్షలు, కొమరాడ దేవునిగుంప సోమేశ్వరస్వామి ఆలయానికి రూ. 50 లక్షలు, బొబ్బిలి కారడ గ్రామంలో ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.40 లక్షలు, పార్వతీపురం పిట్టలవలస నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి రూ. 25 లక్షలు, మక్కువ డి.సిర్లం సంగమేశ్వరస్వామి ఆలయానికి రూ. 49 లక్షలు, గరివిడి నీలాద్రిపురం శ్రీరామాలయానికి రూ. 25 లక్షలు, బాడంగి మండలం ముగడలో ఉన్న శ్రీరామమందిరానికి రూ. 12 లక్షలు, రేజేరులోని శ్రీరామమందిరానికి రూ. 12 లక్షలు కేటాయించింది. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్ని చోట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాల పునర్నిర్మాణంతో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. శరవేగంగా పునరుద్ధరణ పనులు ప్రభుత్వం సర్వశ్రేయోనిధి కింద మంజూరు చేసిన నిధులతో ఆలయాలు పునరుద్ధరణ పనులు చేపట్టాం. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రామతీర్థంలోని బోడికొండపై కోదండరామస్వామి ఆలయ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కొండకింద రామస్వామి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు దేవాలయాల పునరుద్ధరణ, కొత్తదేవాలయాల నిర్మాణ పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికోసం జిల్లా నుంచి 54 దరఖాస్తులు అందాయి. – జె.వినోద్‌కుమార్, దేవదాయశాఖ సహాయకమిషనర్, విజయనగరం (చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం) -
ఆలయాల్లో అక్రమాల కట్టడికి విజిలెన్స్ సెల్
సాక్షి, అమరావతి: ఆలయాల్లో అవినీతి, అక్రమాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఐజీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి(దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన 584 ఆలయ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని.. వాటిని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేసేందుకు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తామని చెప్పారు. దాదాపు రూ.58.80 కోట్లతో మరో 142 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందగా, అందులో 43 ప్రతిపాదనలకు సంబంధించి స్థానికులు మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో కొంత మొత్తం చెల్లించారన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి మరో 99 ప్రతిపాదనలు రాగా, వాటిపై త్వరలో కమిటీ మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. ధూపదీప, నైవేద్య పథకాన్ని మరిన్ని ఆలయాల్లో అమలు చేయాలని కోరుతూ ఇప్పటివరకు 653 దరఖాస్తులు అందాయని, వాటిలో 73 ప్రతిపాదనలను ఆమోదించామని తెలిపారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. దేవుడి భూముల పరిరక్షణ చట్ట సవరణ దేవదాయ భూముల ఆక్రమణను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు రానున్న కేబినెట్లో ఎండోమెంట్ చట్ట సవరణకు ప్రతిపాదించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. దేవదాయ భూముల ఆక్రమణను కట్టుదిట్టంగా నియంత్రించేందుకు ఎండోమెంట్ చట్టంలోని సెక్షన్–83, 84 నిబంధనలలో కొన్ని ఆటంకాలు ఉన్నట్టు గుర్తించామని, వాటిని సవరిస్తామని వివరించారు. -
మరిన్ని గుడులకు ‘గుడ్ ఫండ్’!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం ద్వారా మూడేళ్లలో 547 పురాతన, శిధిలావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం సోమవారం మరికొన్నింటికి అనుమతి ఇవ్వనుంది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన సచివాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ముఖ్య కార్యదర్శి, కమిషనర్లతో పాటు టీటీడీ ఈవో సభ్యులుగా కొనసాగే కామన్ గుడ్ ఫండ్ కమిటీ ఆలయాల పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 4వతేదీన నాడు దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.31.40 కోట్లతో 60 ఆలయాల పునఃనిర్మాణానికి అనుమతి తెలిపారు. ప్రస్తుతం దేవదాయ శాఖ వద్ద సుమారు 160 ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సీజీఎఫ్‌కు నిధులు పెంచుతూ చట్టం ఆదాయం లేని పురాతన, శిధిలావస్థకు చేరుకున్న ఆలయాల పునఃనిర్మాణం కోసం వినియోగించే కామన్‌గుడ్ ఫండ్‌కు ఏడాది కిత్రం వరకు టీటీడీ తన వాటాగా ఏటా రూ. 1.25 కోట్లు ఇవ్వగా శ్రీశైలం, విజయవాడ దుర్గగుడి సహా దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఇతర పెద్ద ఆలయాల నుంచి అధిక మొత్తంలో నిధులు అందేవి. ఈ నేపథ్యంలో టీటీడీ ఏటా రూ.40 కోట్లు చొప్పున కామన్‌గుడ్ ఫండ్‌కు కేటాయించేలా గతేడాది ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఈ నేపథ్యంలో కామన్‌గుడ్ ఫండ్ కింద రూ.130 కోట్లు దాకా నిధులు సమకూరనున్నాయి. -
జ్ఞానవాపి మసీదు సర్వే.. తాఖీర్ రజా వ్యాఖ్యలపై దుమారం
లక్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే వ్యవహారం న్యాయస్థానాలకు చేరిన వేళ.. యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తాఖీర్ రజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశంలోని ఆలయాలను కూల్చి వేసి మసీదులను కట్టలేదని.. పెద్ద సంఖ్యలో జనం ఇస్లాంలోకి మారి ఆలయాలను మసీదులుగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. అలాంటి మసీదులను ప్రభుత్వాలు ముట్టుకోరాదని హెచ్చరించారు. జ్ఞానవాపి మసీదులో శివలింగం దొరికిందన్న ప్రచారం.. హిందూయిజాన్ని అపహాస్యం చేయడమే!. దేశంలోని చాలా మసీదులు కట్టడానికి ముందు.. అక్కడ ఆలయాలే ఉండేవని పేర్కొన్నారు. అయితే, ఆ ఆలయాలను కూల్చలేదని చెప్పారు. వాటిని కేవలం మసీదులుగా మార్చారన్నారు. వాటిని ముట్టుకోవద్దని, కాదని ప్రభుత్వం బలవంతపు చర్యలకు పూనుకుంటే మాత్రం ముస్లింలు వ్యతిరేకిస్తారని స్పష్టం చేశాడు. ముస్లింలు ఎవరూ న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం లేదని, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎలాంటి తీర్పు వచ్చిందో తెలిసిందేనని అన్నారు. జ్ఞానవాపి మసీదుపై ఇప్పుడు ఏ కోర్టుల్లోనూ అప్పీలు చేయబోమన్నాడు. విద్వేషవాదులు.. తలచుకుంటే దేశంలో ఏదైనా జరుగుతుందన్నాడు. దేశంలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు ముస్లింలు శాంతంగా ఉంటున్నారన్నాడు. తాఖీర్ రజా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగుతోంది. -
ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, అమరావతి: ఇక నుంచి దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులకు దేవదాయ శాఖ స్వస్తి పలకనుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతోపాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి అనుమతించరు. అలాగే ఆలయానికి అనుబంధంగా ఉండే దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నారు. ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్ సంచుల వినియోగానికి పూర్తిగా చెక్ పెడతారు. తొలి దశలో జూలై 1 నుంచి 6 (ఏ) కేటగిరీగా వర్గీకరించిన ప్రధాన ఆలయాలన్నింటిలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించనున్నారు. ఏడాదికి రూ.25 లక్షలు, ఆపైన ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ 6(ఏ) కేటగిరీగా వర్గీకరించింది. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రంలో మొత్తం 24,699 ఆలయాలు, మఠాలు, సత్రాలు ఉన్నాయి. ఇందులో 174 ఆలయాలు, 28 సత్రాలు, మఠాలు 6 (ఏ) కేటగిరీ కిందకు వస్తాయి. జూలై 1 నుంచి ఆయా ఆలయాలు, మఠాలు, సత్రాలలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ఇప్పటికే ఆయా ఆలయాలు, సత్రాల ఈవోలకు ఆదేశాలిచ్చింది. టీటీడీ తరహాలో మంచినీటి సరఫరా.. తిరుమలలో గత కొద్ది నెలల నుంచి ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అమలు జరుగుతున్న తరహాలోనే ప్రధాన దేవాలయాల్లో శుభ్రమైన మంచినీటి సరఫరాకు చర్యలు చేపడతారు. అలాగే మంచినీటి సరఫరా పాయింట్ల వద్ద స్టీల్ గ్లాస్‌లను అందుబాటులో ఉంచుతారు. భక్తులు ఇంటి నుంచి మంచినీరు తెచ్చుకున్నా గాజు సీసాలు లేదంటే స్టీల్ బాటిళ్లలో తెచ్చుకునేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులు యోచిస్తున్నారు. పర్యావరణానికి, జీవజాలానికి హాని.. ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆలయాల వద్ద సంచరించే గోవులతోపాటు ఇతర జంతువులు కవర్లను తిని మృత్యువాత పడుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో క్రమంగా అన్ని ఆలయాల వద్ద ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి స్వస్తి పలకాలని దేవదాయ శాఖ నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవదాయ శాఖ కార్యక్రమాలపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీలో అమలులో ఉన్న మంచి విధానాలను అన్ని ఆలయాల్లో అమలు చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారని అధికారులు తెలిపారు. -
దేవాదాయశాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు
సాక్షి, విజయవాడ: దేవాదాయశాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా బాద్యతలు స్వీకరించా. నాకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. నాపై పెట్టిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తా. దేవాదాయశాఖ అంటే సంక్లిష్టమైనది. ప్రస్తుతం దేవాలయాల్లో కొనసాగిస్తున్న సేవల కన్నా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాను. అధికారులతో సమీక్షించి వారి సలహాలతో ముందుకెళ్తా. ప్రసాద్ స్కీమ్‌లో అన్ని ప్రముఖ దేవాలయాలని అభివృద్ధి చేస్తాం. చారిత్రాత్మకమైన ఆలయాలు ఏపీలో చాలా ఉన్నాయి. ఏపీలో టెంపుల్ టూరిజం సరిగా లేదు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రత్యేకయాప్ తయారు చేసి టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం. వీఐపీల కోసమే ఆలయాలు లేవు. భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తాం. ప్రొటోకాల్ ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆలయాలకి సిబ్బంది కొరత అధిగమించడానికి అదనపు సిబ్బందిని తీసుకోవడానికి సీఎం దృష్టికి తీసుకెళ్తాం. చదవండి: (విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన) ఆలయాలలో అవినీతి అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆలయాల ఆస్తులు, రికార్డులు డిజిటలైజేషన్ చేయాలి. భగవంతుడు ఆస్థులని రక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఒకే ఆలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని బదిలీలు చేయాల్సిన అవసరం ఉంది' అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. -
ఉగాదికి తెలుగు లోగిళ్ల ముస్తాబు
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగకు తెలుగు లోగిళ్లు ముస్తాబయ్యాయి. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణంతో పాటు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా పాల్గొననున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.50 గంటల వరకు ఉగాది కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వివిధ వేద పాఠశాలల విద్యార్థుల మంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభం స్వాగతం పలుకుతారు. 10.42 గంటలకు పంచాంగ శ్రవణం అనంతరం వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉగాది క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పంచాంగకర్తలతో పాటు వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులు, వేద పండితులను సీఎం సన్మానించనున్నారని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అర్చకులు, వేద పండితులకు సన్మానం ఉగాది పండుగ సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులతో పాటు వేద పండితులను ఘనంగా సన్మానించనుంది. ప్రతి జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో 62 ఏళ్లకు పైబడిన ముగ్గురు ఆర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించనున్నారు. సన్మాన గ్రహీతలకు రూ.10,116 సంభావన, కొత్త వస్త్రాలను కలెక్టర్ల చేతుల మీదుగా అందజేస్తారు. ఇందుకు గాను దేవదాయ శాఖ ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. మరో వైపు రాష్ట్రంలోని అన్ని పెద్ద ఆలయాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఆ సందర్భంగా ఆ సమీపంలో ఆదాయం లేని ఆలయాల్లో పనిచేసే ఇద్దరు అర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని.. -
ఆలయాల్లో దందాలపై ఏపీ సర్కార్ కొరడా
సాక్షి, విజయవాడ: ఆలయాల్లో టికెట్లు, ప్రసాదాలపై అధిక ధరలతో భక్తులను దోచుకుంటున్న దందాలకు సంబంధించి పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సర్కార్ సీరియస్ అయ్యింది. అధిక ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టీటీడీలో అనుసరిస్తున్న పద్ధతులే ఇకపై అన్ని ఆలయాల్లోనూ పాటించాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. అన్ని ఆలయాల్లో విజిలెన్స్ తరహా స్క్వాడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వీలైనంత మేర ఎలక్ట్రానిక్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయింది. -
కర్ణాటకలో మరొకటి.. ఆలయాల వద్ద అమ్మకాలపై బ్యాన్!
కర్ణాటకలో మరో డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆలయాల దగ్గర, జాతరల్లో పండ్లు, పూలు,ఇతర వస్తువులు అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించొద్దంటూ డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు పోస్టర్లు వెలుస్తుండడంతో.. పూర్తి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. కర్ణాటక ఉడుపిలోని హోసా మార్గుడి Hosa Margudi ఆలయం జాతరలో ప్రతీ ఏడాది వందకు పైగా ముస్లిం వర్తకులు స్టాల్స్ నిర్వహిస్తుంటారు. అయితే.. ఈ దఫా వాళ్లకు అనుమతి నిరాకరించారు నిర్వాహకులు. కారణం.. ఆలయాల దగ్గర, ఉత్సవాల్లో వ్యాపారం నిర్వహించుకునేందుకు ముస్లింలను అనుమతించకూడదంటూ పోస్టర్లు వెలిశాయి. దీంతో వాళ్లకు ఈసారి స్టాల్స్ పెట్టుకునేందుకు అనుమతి దొరకలేదు. ఒత్తిడి వల్లే ఉడిపిలోని వీధి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్ ఈ వ్యవహారంపై స్పందించాడు. ‘‘మేము వెళ్లి ఆలయ కమిటీ సభ్యులను కలిశాం. అయితే వాళ్లు హిందువుల కోసం మాత్రమే స్లాట్లను వేలం వేస్తామని చెప్పారు. వాళ్లపై కచ్చితంగా ఒత్తిడి ఉండే ఉంటుంది. అందుకే మేము చేసేది లేక వెనుదిరిగాం’’ అని ఆరిఫ్ పేర్కొన్నాడు. హిందూ సంఘాల డిమాండ్ మేరకే మేం నిషేధం విధించాం అని హోసా మార్గుడి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ శెట్టి స్పష్టం చేశారు. ఎండోమెంట్ చట్టాల ప్రకారం.. హిందుయేతరులకు అనుమతులు లేవని, కానీ, రెండు మతాల వాళ్లు ఈ జాతరలో పాల్గొంటుడడంతో అనుమతిస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈసారి హిందూ సంఘాల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, విషయం పెద్దది కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. హిజాబ్ తీర్పు ఎఫెక్ట్! హిజాబ్ తీర్పు తర్వాత.. ముస్లిం విద్యార్థినులకు మద్దతుగా బంద్‌కు పిలుపు ఇచ్చారు ముస్లిం వర్తకులు. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు వాళ్లను నిషేధించాలని పట్టుబట్టినట్లు ఆరిఫ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు తోటి వ్యాపారులపై నిషేధం విధించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం ధ్వజమెత్తడంతో.. చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీధుల్లోనూ అభ్యంతరాలు దేవాలయాల జాతరల్లోనే కాకుండా వీధుల్లో కూడా అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించడం లేదంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్ నేత యుటి ఖాదర్ ఆరోపించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు కూడా. అయితే న్యాయశాఖ మంత్రి మధుస్వామి మాత్రం నిషేధాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం నిషేధం లాంటి వాటిని ప్రోత్సహించడం లేదు. ఆలయ పరిసరాల్లో అలాంటి బ్యానర్లు వెలిసినా.. చర్యలు తీసుకుంటాం’’ అని మధుస్వామి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో సమన్యాయం చేస్తామని, శాంతి భద్రతలు దెబ్బ తినకుండా పటిష్ట చర్యలు చేపడతామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హామీ ఇస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో చాలా ఆలయాల దగ్గర ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. శివమొగ్గలో ఐదు రోజుల కోటే మారికాంబ జాతర ఉత్సవాల్లోనూ ముస్లిం నిర్వాహకులకు.. నిరసనలతో ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. -
11 ఆలయాలకు రూ.8.48 కోట్లు మంజూరు
తిరుమల: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు ద్వారా 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఈవో చాంబర్లో శ్రీవాణి ట్రస్టుపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఆలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రస్టు ద్వారా చేపట్టిన 50 నూతన ఆలయాలు, 84 ఆలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణ పనులు, 42 భజన మందిరాల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు. శ్రీవాణి ట్రస్టు, దేవదాయ శాఖ సీజీఎఫ్ ద్వారా మంజూరు చేసే ఆలయాల నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ డేటాబేస్డ్ సిస్టమ్‌ను తయారు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి అందిన 1,100 దరఖాస్తులను దేవదాయ శాఖ పరిశీలనకు పంపామని, పరిశీలన పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మాన్ని మరింత వ్యాప్తి చేయడంలో భాగంగా పురాతన ఆలయాల పునర్నిర్మాణం, ఆలయాలు లేనిచోట ఆలయ నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, ఎఫ్ఏ సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, డిప్యుటీ సీఈ ప్రసాద్, డిప్యుటీ ఈవో జనరల్ డాక్టర్ రమణప్రసాద్, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి లంక విజయసారథి తదితరులు పాల్గొన్నారు. -
రాతి.. చిర ఖ్యాతి!
సాక్షి, హైదరాబాద్: పాత రాతి కట్టడాలు చూస్తే వాటిల్లోని శిల్పాలు అబ్బురపరుస్తాయి. వాటిని చెక్కిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ మండపాలు, ప్రాకారాలు, గోపురాలు.. ఒకటేమిటి అన్నీ కట్టిపడేస్తాయి. కారణం.. అవన్నీ రాతి నిర్మాణాలే. 17వ శతాబ్దంలో జటప్రోలు దేవాలయాల నిర్మాణాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆ స్థాయిలో రాతి నిర్మాణాలు జరగలేదు. ఆ తర్వాత సిమెంటు వాడకం పెరిగాక నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కింది. రాతి కట్టడాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ అలనాటి అబ్బురాన్ని కళ్లకు కట్టేలా రెండు భారీ రాతి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటు యాదాద్రి.. అటు శ్రీరామానుజుల సహస్రాబ్ధి ప్రాంగణం.. సనాతన సంప్రదాయ నిర్మాణ విధానానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాయి. మన శిల్పుల్లో ఆ కళ పదిలం ఎలాంటి ఆధునిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా టన్నుల బరువున్న రాళ్లను పేర్చి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసి శిల్పులు అద్భుతాలు çసృష్టించారు. అయితే ప్రస్తుతం ఆలయాల్లోని మూలవిరాట్టు మినహా మిగతా భాగాలకు రాతితో పని అవసరం లేని సమయంలో నేటి శిల్పుల చేతుల్లో నాటి పనితనం ఉండదన్న అనుమానాలుండేవి. కానీ ఈ రెండు మందిరాలను నిర్మించి వారు నాటి శిల్పుల వారసులేనని నిరూపించారు. యాదాద్రి, రామాను జుల సహస్రాబ్ది మందిరాల్లో దాదాపు 5 వేల మంది శిల్పులు అద్భుత పనితనాన్ని చూపారు. రామానుజుల ప్రాంగణంలో రాతి నిర్మాణాలు యాదాద్రి మందిరానికి 86 వేల టన్నుల నల్లరాయి యాదాద్రి మందిరాన్ని పూర్తిగా కృష్ణ శిలతో నిర్మించారు. ఇందుకు మేలురకమైన బ్లాక్ గ్రానైట్ కోసం వివిధ ప్రాంతాలను గాలించి ప్రకాశం జిల్లా గుర్జేపల్లి ప్రాంతంలోని క్వారీని ఎంపిక చేశారు. దాదాపు 86 వేల టన్నుల నల్లరాతిని సేకరించారు. ఇందుకు రూ. 48 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆ రాతిని చెక్కి ఇటు శిల్పాలు, అటు నగిషీలు, ప్రాకార రాళ్లు.. ఇలా రకరకాలుగా వినియోగించారు. మొత్తంగా యాదాద్రి ఆలయానికి 10 లక్షల క్యూబిక్ ఫీట్ మేర దీన్ని వినియోగించారు. రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణంలో మందిరాలకు రకరకాల రాళ్లు రామానుజుల 216 అడుగుల ఎత్తున్న విగ్రహం దిగువన ఉన్న 54 అడుగుల ఎత్తున్న భద్రపీఠానికి రాజస్తాన్‌లోని బన్సీపహాడ్‌పూర్ ప్రాంతం లోని లేత గులాబీ రంగు ఇసుక రాయిని వాడారు. మౌంట్అబూ ప్రాంతంలోని శిల్పుల చేత దాన్ని చెక్కించి తీసుకొచ్చి ఇక్కడ వినియోగించారు. సమతామూర్తి చుట్టూ విస్తరించి ఉన్న 108 దివ్యదేశ మందిరాల్లోని గర్భాలయ అంతరాలయాలకు ఏపీలోని కోటప్పకొండ, మార్టూరు పరిసరాల్లోని బ్లాక్ పెరల్ గ్రానైట్‌ను వాడారు. దివ్య మండపంలో హోయసల, కాకతీయ శైలిలో ఏర్పాటు చేసిన 468 స్తంభాలకు రాజస్తాన్‌లోని బేస్లానా బ్లాక్ మార్బుల్ (నల్ల చలువరాయి) వినియోగించారు. కాంచీపురం సమీపంలోని వాలాజా ప్రాంతంలోని కృష్ణ పురుష శిలను ఆలయాల్లోని ప్రధాన మూర్తులకు వాడారు. మరో 12 రోజుల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహణ జరగబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా 216 అడుగుల భారీ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణం 17వ శతాబ్దం తర్వాత తగ్గిన రాతి నిర్మాణాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరికెళ్లినా రాతితో నిర్మించిన చారిత్రక మందిరాలు దర్శనమిస్తాయి. శాతవాహనులు మొదలు కాకతీయులు, విజయనగర రాజుల వరకు నిర్మాణాలన్నీ రాతితోనే జరిపించారు. డంగు సున్నం మిశ్రమాన్ని నిర్మాణాలకు వినియోగించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా రాతికి రాతికి మధ్య బైండింగ్ వరకే దాన్ని వాడారు తప్ప ఆలయాల నిర్మాణానికి అంతగా వినియోగించలేదు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని దక్కన్ సుల్తాన్‌ను ఓడించిన తర్వాత భారీ రాతి నిర్మాణాలు పెద్దగా జరగలేదు. తర్వాత సంస్థానాలు కొలువుదీరాక 17వ శతాబ్దంలో కొన్ని పెద్ద రాతి దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి. జటప్రోలు సంస్థానాధీశులు స్థానికంగా మదనగోపాల స్వామి దేవాలయం, కృష్ణా తీరంలోని మంచాలకట్ట మాధవస్వామి దేవాలయాలు నిర్మించారు. మళ్లీ 3 శతాబ్దాల తర్వాత 1910లో వనపర్తి సంస్థానాధీశులు పెబ్బేరు సమీపంలోని శ్రీరంగాపురంలో రంగనా«థ స్వామి ఆలయాన్ని రాతితో నిర్మించారు. కానీ అది చిన్నగా ఉండే ఒకే దేవాలయం. జటప్రోలు దేవాలయాల తర్వాత ఇంత కాలానికి అత్యంత భారీగా, పూర్తి రాతితో నిర్మించిన దేవాలయం యాదాద్రి. రామానుజుల సహస్రాబ్ధి మందిరాలు కూడా కొంతభాగం సిమెంటు నిర్మాణాలు పోను ప్రధాన మందిరాలను రాతితోనే నిర్మించారు. నగరం నడిబొడ్డున నౌబత్ పహాడ్‌పై పాలరాతితో నిర్మించిన బిర్లామందిరం కూడా రాతి కట్టడమే అయినా తెలుగు ప్రాంతాల సంప్రదాయ శైలికి భిన్నమైంది. -
ప్రధాన దేవాలయాల్లో అమల్లోకి కోవిడ్ ఆంక్షలు
ద్వారకాతిరుమల/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన విజయవాడ దుర్గమ్మ ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాల్లో మంగళవారం నుంచి కోవిడ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇరు ఆలయాల్లోని దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్‌ల వద్ద దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ జరిపి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేయించారు. మాస్క్ ధరించాలని ప్రతి ఒక్కరికీ సూచిస్తున్నారు. భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టారు. ఇరు ఆలయాల్లో గంటకు 1,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. చినవెంకన్న స్వామివారిని దర్శించిన భక్తులకు శేషాచల కొండపైన వకుళమాత అన్నదాన భవనం వద్ద ప్యాకెట్ల రూపంలో అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, తీర్థం, శఠారి, అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేశారు. ఇంద్రకీలాద్రిపై నిత్యం జరిగే ఆర్జిత సేవల్లో 50 శాతం టికెట్లను మాత్రమే విక్రయిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై నిత్య అన్నదాన ప్రసాద వితరణను అధికారులు నిలిపివేశారు. దీంతో మహా మండపం మూడో అంతస్తులోని క్యూ లైన్లు, రెండో అంతస్తులోని అన్న ప్రసాద వితరణ భవనం వెలవెలబోయింది. సెకండ్ వేవ్ వచ్చిన తరుణంలో అన్న ప్రసాద వితరణ నిలిపివేసినప్పటికీ ప్యాకెట్ల రూపంలో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసేవారు. ఈ దఫా అటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అమ్మవారి లడ్డూ, పులిహోర ప్రసాదాలను కోవిడ్ నిబంధనల మేరకు విక్రయిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలున్న వారు దేవాలయ సందర్శనను వాయిదా వేసుకోవాలని దేవదాయ శాఖాధికారులు విజ్ఞప్తి చేశారు. -
భక్తుల అభిప్రాయాలకే ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: దేవాలయాల్లో భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు, పరిష్కరించేందుకు వీలుగా ప్రతి నెలా రెండు విడతలుగా ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం నిర్వహించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. రోజువారీ కార్యక్రమాల నిర్వహణలో భక్తుల అభిప్రాయాలకు ప్రాధాన్యం కల్పించనుంది. ఈ మేరకు దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ వివిధ ఆలయాల కార్యనిర్వహణాధికారుల(ఈవో)కు ఆదేశాలు జారీ చేశారు. మొదట దేవదాయశాఖ పరిధిలోని విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కాణిపాకం, మహానంది, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు. క్రమంగా అన్ని ఆలయాల్లోనూ నిర్వహించాలన్నారు. ప్రతి నెలా ఒకటి రెండు శనివారాల్లో ఏదో ఒక రోజు మొదటి విడత, మూడు నాలుగు శనివారాల్లో ఏదో ఒక రోజు రెండో విడతగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం కల్పించాలని, వీలైతే స్థానిక టీవీ చానళ్లలో ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు జిల్లాల్లోని ఆలయాల నిర్వహణ, దేవదాయ శాఖ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం సహా ఇతర అంశాలను పరిశీలించేందుకు కమిషనర్ హరిజవహర్‌లాల్ జనవరిలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టనున్నారు. ఆ సందర్భంగా ఆప్రాంతంలోని రెండు మూడు ఆలయాలకు ఆయన వెళ్లనున్నారు. కేవలం ఒక్క రోజు ముందస్తు సమాచారంతో అన్ని జిల్లాల్లోని అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఆర్జేసీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆలయాల్లో భక్తులకు సౌకర్యాల కల్పనతో పాటు కార్యాలయ శుభ్రత, రికార్డు రూం నిర్వహణ, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, కార్యాలయ ప్రాంగణంలో గ్రీనరీ, సిబ్బంది డ్రెస్ కోడ్, సీసీ కెమెరాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించనున్నారు. -
Telangana: గుడి గోల్డ్.. బాండ్స్‌లోకి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాల్లో 800 కిలోల బంగారు నిల్వలు, దాదాపు 3,750 కిలోల వెండి నిల్వలు ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు. ఇందులో నిత్య కైంకర్యాలు, ప్రత్యేక రోజుల్లో దేవుళ్ల అలంకరణకు అవసరమైన బంగారు, వెండి ఆభరణాలు మినహా కానుకల రూపంలో భక్తులు స్వల్ప మొత్తాల్లో సమర్పించే బంగారం, వెండిని వాడటం లేదు. కానీ వాటిని ఆలయాల్లోనే భద్రపరచడం క్షేమం కాదని భావించి బ్యాంకు లాకర్లలో ప్రభుత్వం భద్రపరుస్తోంది. ఇందుకు దేవాదాయ శాఖ లాకర్ చార్జీలు చెల్లిస్తోంది. కొన్నింటికి బీమా చేయించినందున.. బీమా ప్రీమియం సైతం కడుతోంది. వెరసి వినియోగంలో లేని ఆభరణాలు, బంగారు, వెండి ముక్కల వల్ల ఎలాంటి ఆదాయం లేకపోగా ఖర్చే మిగులుతోంది. దీంతో ఆయా ఆలయాల్లో వినియోగించని నగలు, బంగారు, వెండిని (కిలోకన్నా ఎక్కువగా ఉంటేనే) గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయాలని ఇటీవల నిర్ణయించిన దేవదాయ శాఖ... ఆ మేరకు ఆలయాలవారీగా ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకోసం బంగారాన్ని కరిగించి 95 శాతం స్వచ్ఛత స్థాయికి తెచ్చి ఆ రోజు బంగారు ధర ప్రకారం స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలోని గోల్డ్ డిపాజిట్ పథకంలో చేరుస్తోంది. దాని విలువ మేరకు ఐదేళ్ల కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తోంది. ఈ మొత్తంపై బ్యాంకు 2.25 శాతం వడ్డీని ఆయా ఆలయాలకు చెల్లించనుంది. బంగారం, వెండి కరిగింపు చార్జీలను సైతం బ్యాంకే భరిస్తోంది. ఐదేళ్ల తర్వాత ఎఫ్డీని కొనసాగించొచ్చు. కాదంటే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకొని దేవాలయాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. ఇప్పటికే బాసర, వేములవాడ, సికింద్రాబాద్ గణేశ్ మందిరం, ఉజ్జయినీ మహంకాళి, కొండగట్టు, కొమురవెల్లి ఆలయాలకు చెందిన బంగారం డిపాజిట్ చేసే ప్రక్రియ మొదలైంది. ఇక వెండిని కూడా కరిగించి దాన్ని మేలిమి బంగారం విలువతో లెక్కించి ఆ మేరకు నగదులోకి మార్చి బ్యాంకు డిపాజిట్ చేయించుకుంటోంది. -
భక్తుడిలా రెక్కీ .. రాత్రికి చోరీ!
విజయవాడ: ఉదయం పూజా సమయంలో భక్తుడిలా దేవాలయంలోకి ప్రవేశించి.. రాత్రికి ఇనుపరాడ్డుతో తలుపులు తెరిచి దేవతామూర్తుల బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లే ఓ ఘరానా అంతర్రాష్ట్ర దొంగను విజయవాడ నగర పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 60.9 లక్షల విలువ చేసే 80 కేజీల వెండి, 224 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలను నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా సోమవారం విలేకరులకు వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన విజయవాడ వన్‌టౌన్‌లోని కుసుమ హరనాథ మందిరంలో జరిగిన దొంగతనంపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. సీసీ పుటేజీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఈ నెల 12వ తేదీన ప్రకాశం బ్యారేజీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సికింద్రాబాద్ తుకారం గేటు ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల అంగోత్ రాములునాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. విచారణలో నిందితుడు చేసిన తాజా చోరీతో పాటు గతంలో చేసిన దొంగతనాలను అంగీకరించడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అవనిగడ్డలోని సూర్య దేవాలయంలో నిందితుడు రాము 2011లో దొంగతనం చేసి అరెస్టు అయి జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పారు. జైలు నుంచి విడుదలయిన తరువాత అదే పంథాలో దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. చోరీ చేసిన సొత్తును కొద్ది రోజుల పాటు దేవాలయానికి సమీపంలోనే దాచి, పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తరువాత ఆభరణాల రూపం మార్చి విక్రయిస్తుంటాడని కమిషనర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్, చేబ్రోలు, ఆకివీడు, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నకిరేకల్, కొల్లిపర, తెనాలి, నగరంపాలెం, చేబ్రోలు, వినుకొండ, కృష్ణా జిల్లాలోని విజయవాడ, గన్నవరం, ప్రకాశం జిల్లాలోని నాగులపాడు, తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ ప్రాంతాల్లోని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు రాములునాయక్‌పై ఇప్పటి వరకు 14 పోలీస్ స్టేషన్లలో 18 కేసులు నమోదయినట్లు చెప్పారు. నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న డీసీపీ బాబురావు, ఏసీపీ హనుమంతరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు శంకర్, మూర్తిని సీపీ అభినందించారు. -
టీటీడీ విధానాలే మిగతా ఆలయాల్లోనూ..
సాక్షి, అమరావతి: భక్తులకు సౌకర్యాల కల్పన, ప్రసాదాల పంపిణీ, దేవుడి ఆస్తుల పరిరక్షణ తదితర అంశాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కొనసాగుతున్న మంచి విధానాలు మిగిలిన ఆలయాల్లోనూ అమలు చేసేందుకు దేవదాయ శాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు అన్ని ప్రముఖ ఆలయాల ఈవోలు, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు, ఆర్జేసీ స్థాయి అధికారులతో బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్ పాల్గొన్నారు. టీటీడీలో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు కమిషనర్ కార్యాలయ సీనియర్ స్థాయి అధికారులు కొందరు రెండు నెలల కిత్రం రెండు విడతలుగా తిరుమలను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లి అధ్యయనం చేసిన అంశాలపై ఆయా అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ– పూర్తి స్థాయి విధివిధానాలు)ను ఈ వర్క్‌షాప్ సందర్భంగా రూపొందించినట్టు కమిషనర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. ఖరారు చేసిన విధి విధానాలను అన్ని ఆలయాల్లో అమలు చేసేలా దేవదాయ శాఖ ఈవోలందరికీ ఉత్తర్వులిస్తామని ఆయన వివరించారు. -
దేవాలయాలపై పన్ను: ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం
పట్న: రాష్ట్రంలోని దేవాలయాలపై బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆలయాలను రిజిస్టెర్ చేయించుకుని పన్నులు చెల్లించాలన్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంపై ధార్మిక సంస్థలు, భక్తులు భగ్గుమంటున్నారు. వ్యక్తులు తమ ఇంటి ప్రాంగణాల్లో దేవాలయాలు నిర్మించి భక్తులను అనుమతించినా కూడా ఈ ఉత్తర్వుల పరిధిలోకి వస్తాయని తెలిపింది. అదేవిధంగా ఆ ఆలయాలు 4 శాతం పన్ను చెల్లించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. చదవండి: బీజేపీలో చేరిన అకాలీదళ్ కీలక నేత.. భక్తులు దర్శించే పత్రి ఆలయాన్ని నమోదు చేయించాలని ఆపై వాటికి వచ్చే ఆదాయంలో 4 శాతం పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆలయాలపై పన్ను విధింపు నిర్ణయాన్ని ‘జిజియా పన్ను’ గా శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కామేశ్వర్ చౌపాల్ అభివర్ణించారు. అయితే దీనిపై బీహార్ ప్రభుత్వం స్పందిస్తూ.. ఆలయాలపై తాము పన్ను విధించలేదని తెలిపింది. అయితే అది కేవలం వార్షిక సేవా రుసుమని వివరణ ఇచ్చింది. చదవండి: దేశంలో యూపీఏ లేదు.. మరో కూటమి ప్రయత్నం: మమతా బెనర్జీ -
ఆలయ పూజాదికాల్లో జోక్యం చేసుకోం
సాక్షి, న్యూఢిల్లీ: ఆలయాల రోజువారీ పూజాదికాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సంప్రదాయాలు పాటించడం లేదని అనుమానమొస్తే తగిన సాక్ష్యాధారాలతో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కైంకర్యాల్లో టీటీడీ సంప్రదాయాలు పాటించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. టీటీడీ దాఖలు చేసిన కౌంటరు పిటిషన్‌తో సంతృప్తి చెందడంలేదని, తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అభిషేకాలు, దర్శనాలు, బ్రహ్మోత్సవం తదితర అంశాల్లో సంప్రదాయాలు పాటించడం లేదని పేర్కొన్నారు. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇవ్వలేదా అని టీటీడీ న్యాయవాదిని జస్టిస్ హిమకోహ్లి ప్రశ్నించారు. పిటిషనర్ సందేహాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో నివృత్తి చేశామని టీటీడీ న్యాయవాది తెలిపారు. సంప్రదాయాల ప్రకారం పూజాదికాలు జరుగుతున్నాయని సమగ్రంగా పిటిషనర్‌కు వివరించాలని, దీనికి ఎనిమిది వారాల గడువు ఇస్తున్నామని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సంప్రదాయాలు పాటించడంలో లోపాలుంటే ట్రయల్ కోర్టును లేదా తగిన వేదికను ఆశ్రయించాలని జస్టిస్ ఏఎస్ బోపన్న సూచించారు. ప్రాథమిక హక్కుగా భావించి పిటిషన్ దాఖలు చేశానని పిటిషనర్ పేర్కొనగా.. హిమకోహ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసును మరో కోణంలోకి తీసుకెళ్లొద్దన్నారు. పిటిషన్ కొట్టేస్తామని, సివిల్ సూట్ దాఖలు చేసుకోమని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ‘పూజాదికాలు కాకుండా పాలనపరమైన నిర్లక్ష్యంపై ఎవరు కోర్టు దృష్టికి తీసుకొచ్చినా టీటీడీని ప్రశ్నిస్తాం. కొబ్బరికాయలు ఎలా కొట్టాలి, హారతి ఎలా ఇవ్వాలి అనేది న్యాయస్థానాలు నిర్ణయించవు. ఆలయ దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోం. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఎనిమిది వారాల్లో టీటీడీ సమాధానం ఇవ్వాలి. టీటీడీ లోపాలపై సాక్ష్యాధారాలుంటే పిటిషనర్ ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చు’ అని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ సమయంలో పిటిషనర్ కోర్టు సూచనలు పాటించకపోవడంతో జస్టిస్ ఎన్వీ రమణ పలుసార్లు వారించారు. సహనం పాటించాలని, కోర్టులు ప్రసంగాల కోసం కాదని, పిటిషన్ ప్రచారం కోసం దాఖలు చేసినట్లుగా భావించి కొట్టేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ప్రముఖ ఆలయాల్లో భగవద్గీత పారాయణం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఎనిమిది ప్రముఖ ఆలయాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలో ఉండే çపది ఆలయాల్లో భగవద్గీత పారాయణం చేపట్టనున్నారు. గీతా జయంతి పండుగ సందర్భంగా ఈ నెల 27 నుంచి వచ్చే నెల 14 వరకు 18 రోజుల పాటు ఆయా ఆలయాల్లో వేద పండితుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయం (శ్రీకాకుళం జిల్లా), సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానం (విశాఖ జిల్లా), అన్నవరం శ్రీరమా సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం (తూర్పుగోదావరి జిల్లా), ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం (పశ్చిమ గోదావరి), మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (గుంటూరు జిల్లా), నెల్లూరు శ్రీరంగనాథ దేవస్థానం (నెల్లూరు జిల్లా), కదిరి శ్రీలక్ష్మీ నరసింహదేవస్థానం (అనంతపురం), అహోబిలం శ్రీలక్ష్మీనరసింహ దేవస్థానం (కర్నూలు జిల్లా)లో 18 రోజుల పాటు భగవద్గీత పారాయణం చేసేందుకు ఏర్పాటు చేసుకోవాలని ఆయా ఆలయాల ఈవోలను ఆదేశిస్తూ దేవదాయశాఖ కమిషనర్ హరి జవహర్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ముందస్తుగా తగిన ప్రచారం కల్పించాలని ఈవోలను ఆదేశించారు. భగవద్గీత పారాయణ నిర్వహణ ఖర్చులు టీటీడీ భరిస్తుంది. -
ఆదిలాబాద్‌కు అడవే అందం. పర్యాటకానికి కొత్త శోభ
భైంసా(ముధోల్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అడవులు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, జాలువారే జలపాతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అందాల కశ్మీర్‌కు మన ఆదిలాబాద్‌కు చాలా విషయాల్లో సారుప్యత కనిపిస్తుందని సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ను తెలంగాణ కశ్మీర్‌గా సీఎం కేసీఆర్ చెబుతుంటారు. గతంలోనే కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఇటీవల సీఎం కేసీఆర్ సైతం అసెంబ్లీలో పర్యాటకంపై ప్రస్తావించారు. ఇరువురి ప్రకటనలతో ఒక్కసారిగా మళ్లీ పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశ ఉమ్మడి జిల్లా వాసుల్లో పెరిగింది. పెరుగనున్న పర్యాటకుల తాకిడి చదువుల తల్లి నిలయమైన బాసర నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా ప్రత్యేక ప్రాంతాలు, జలపాతాలను సందర్శించేలా టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక సర్క్యూట్ ఏర్పాటు చేయవచ్చు. సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నాక ఉమ్మడి జిల్లాలోని ఎన్నో విశేషాలను చూస్తూ ముందుకు వెళ్లవచ్చు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ఉమ్మడి జిల్లాలో పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. కుంటాల జలపాతం... నేరడిగొండ మండలం కుంటాల సమీపంలో 200 అడుగుల పైనుంచి కిందికి నీళ్లు ప్రవహిస్తుంటాయి. ఈజలపాతం వద్ద ఇప్పటికే సినిమా షూటింగ్‌లు చిత్రీకరిస్తారు. సమీపంలోనే పొచ్చర జలపాతం ఉంది. వర్షాకాలంలో ఇక్కడ బండరాళ్లపైనుంచి 20 మీటర్ల లోతున నీళ్లు జారిపడుతుంటాయి. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లేమార్గంలో వెలుగులోకి రాని వాస్తాపూర్ జలపాతం ఉంది. ఇచ్చోడ మండలం తర్నం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గాయిత్రి జలపాతం, జైనూర్ మండలం మెట్టగూడ అడవి ప్రాంతంలో సప్తగుండాల జలపాతం, బజార్హత్నూర్ మండలంలో కన్కయి జలపాతం, తాంసి మండలంలో గుంజాల జలపాతం ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో కనువిందుచేసే దృశ్యాలు ఆదిలాబాద్ నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి అక్కడి గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవచ్చు. అడవి బిడ్డల బతుకులు చూడవచ్చు. ఎన్నో కనువిందుచేసే దృశ్యాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి ఇంద్రవెల్లిలో నాగోబాను దర్శించుకోవచ్చు. నిర్మల్‌లో... బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నాక గోదావరి నది ఒడ్డున లోకేశ్వరం మండలంలో కాకతీయుల కాలంలో నిర్మించిన బ్రహ్మేశ్వర్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి లోకేశ్వరం మీదుగా కల్లూరు వెళ్లి అభినవ షిర్డీగా వర్నించే సాయిబాబా ఆలయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి దిలావర్పూర్ మండలంలోని కదిలి పాపహరేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి నేరుగా నిర్మల్ వెళ్లి పొనికి కర్రతో తయారు చేసిన కొయ్యబొమ్మలు చూడవచ్చు. పట్టణానికి ఆనుకుని ఉన్న నిర్మల్ ఖిల్లాను చూడవచ్చు. అక్కడి నుంచి ఉత్తర తెలంగాన వరప్రదాయినిగా చెప్పుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. మంచిర్యాల జిల్లాలో... మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలో శ్రీపాదసాగర్ ఎల్లంపెల్లి ప్రాజెక్టు ఉంది. ఇక్కడ ప్రత్యేక పార్కు ఏర్పాటు చేస్తే పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. ఇదే ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ సున్నపురాళ్ల కోసం తవ్విన గుంతల్లో నీరు నిలిచి ఉంటుంది. హాజీపూర్ క్వారీ ప్రాంతానికి పర్యాటకులు వస్తుంటారు. సరస్సును తలపించేలా ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేమార్గంలో ఇరువైపులా దట్టమైన చెట్లు ఆహ్లాదం పంచుతాయి. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా దండేపల్లి మండలంలో సత్యనారాయణస్వామి ఆలయానికి వెళ్లవచ్చు. అక్కడి నుంచి వస్తుండగా కవ్వాల్ అభయారణ్యంలో పర్యాటకులకు అటవి జంతువులు, ఏపుగా పెరిగిన చెట్లు చూసే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్‌లో... నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే క్రమంలో మహబూబ్‌ఘాట్ ఎంతో అనుభూతినిస్తుంది. ఘాట్ పైకి ఎక్కిచూస్తే పచ్చని ప్రకృతిలో పాముచుట్టుకుని పడుకున్నట్లు బీటీ రోడ్డు కనిపిస్తుంది. నిర్మల్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే మహబూబ్‌ఘాట్ ఉంది. రోడ్డు పక్కన కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించి వాచ్టవర్లు ఏర్పాటుచేస్తే పర్యాటకుల తాకిడి పె రుగుతుంది. జైనథ్‌లో పురాతన లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ఏటా నవంబర్‌లో ఉదయం స్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు పడుతుంటాయి. బోటింగ్‌పై ఆశలు సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత మళ్లీ ఎస్సారెస్పీలో బోటింగ్‌పై ఆశలు పెరిగాయి. గతంలో ఎస్సారెస్పీ వద్ద పునరుజ్జీవ సభలోనూ సీఎం కేసీఆర్ పోచంపాడ్ నుంచి బాసర వరకు 60 కిలోమీటర్ల మేర బోటింగ్ ప్రారంభించి సినిమా షూటింగ్‌లకు అవసరమయ్యేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. డిసెంబర్ 6, 2019న అధికారులు ఎస్సారెస్పీ నుంచి బాసర వరకు ట్రయల్‌రన్ సై తం పూర్తి చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకేశ్వర్‌లో ప్రారంభమయ్యే గోదావరి నది ప్రవాహం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవహిస్తుంది. ఈ నది పొడవు 1465 కిలోమీటర్లు. ఉమ్మడి జిల్లాలో బాసర నుంచి మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం రాంపూర్ వరకు 258 కిలోమీటర్ల మేర నది ప్రవహిస్తుంది. నది ఒడ్డున బాసర, బ్రహ్మేశ్వర్, సోన్, పొన్కల్, గూడెంలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈమేర బోటింగ్‌పై దృష్టిసారిస్తే పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. ఆహ్లాదం పంచుతున్న కవ్వాల్ అభయారణ్యం ఇక కవ్వాల్ నుంచి తిరుగు ప్రయాణంలో మళ్లీ కడెంకు చేరుకోవచ్చు. కడెం అందాలు కనువిందు చేస్తాయి. కడెం ప్రాజెక్టులో ఇప్పటికే బోటింగ్ సౌకర్యం ఉంది. ఇక్కడ పార్కు కూడా ఏర్పాటు చేశారు. అధికసంఖ్యలో వచ్చే పర్యాటకుల కోసం వసతి కల్పించాలి. పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేసేలా టూరిజం సర్క్యూట్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి. ‘పర్యాటకరంగం అభివృద్ధిలో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తాం. శాసన సభ్యులంతా తమ పరిధిలోని విశేషస్థలాలు, దేవాలయాల సమాచారాన్ని పర్యాటక మంత్రికి ప్రతిపాదనలు అందించాలి. చారిత్రక నేపథ్యం ఉన్నవాటికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. ప్రధాన టూరిజం స్పాట్లతో కలుపుతూ సర్క్యూట్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటాం. వచ్చిన వినతులపై రాష్ట్రస్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది’ – ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి అందాలు, అబ్బురపరిచే పర్యాటక ప్రదేశాలకు కొదువలేదు. చాలామంది దగ్గరున్న అందాలను వదిలేసి ఎన్నో వ్యయ ప్రయాసలతో విదేశాలకు వెళ్తున్నారు. సరైన ప్రచారం, మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ ధోరణి మారాలి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఈరంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా. – కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి -
బంగారంతో పెట్టుబడి.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న, భక్తులు కానుకల ద్వారా సమర్పించిన బంగారాన్ని కరిగించి బిస్కెట్లుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి తద్వారా కొత్తగా పెట్టుబడిని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు నూతన కార్యక్రమానికి బుధవారం సీఎం ఎంకే స్టాలిన్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 35 వేల వరకు ఆలయాలు దేవదాయశాఖ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆలయాల పరిరక్షణ, విగ్రహాలు, ఆభరణాల భద్ర త, అన్యాక్రాంతమైన ఆస్తుల స్వాధీనం దిశగా డీఎంకే ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయడం విధితమే. ఇందులో భాగంగా వేలాది ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని కరిగించి 24 క్యారెట్ల బిస్కెట్లుగా మార్చాలని నిర్ణయించింది. చదవండి: (ఇకపై ట్రాఫిక్ ఆపొద్దు.. ప్రజల వాహనాలతో కలిసే..) 2,137 కేజీల బంగారం 1980 నుంచి పలు ఆలయాల్లోని 479 కేజీల బంగారాన్ని బిస్కెట్లుగా గతంలో పాలకులు మార్చారు. ఇక మిగిలిన ఆలయాల్లో 2,137 కేజీల బంగారం వరకూ ప్రస్తుతం ఉన్నట్లు ఇటీవలి పరిశీలనలో వెలుగు చూసింది. దీంతో ఈ బంగారాన్నంతా కరిగించి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లుగా మార్చేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు కొత్త కార్య క్రమానికి సీఎం స్టాలిన్ బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా తొలి విడతగా తిరుచ్చి సమయపురం మారియమ్మన్, తిరువేర్కాడు దేవీ కరుమారియమ్మన్, విరుదునగర్ ఇమక్కంకుడి మారియమ్మన్ ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న, భక్తులు సమర్పించిన కానుకల రూపంలో వచ్చిన బంగారాన్ని కరిగించేందుకు చర్యలు తీసుకున్నారు. బిస్కెట్లుగా మార్చిన తరువాత ఈ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నారు. తద్వారా కొత్త మార్గంలో ప్రభుత్వానికి పెట్టుబడులు వచ్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. దశల వారీగా అన్ని ఆలయాల్లోని బంగారం కరిగించి బిసెట్లుగా మార్చే విధంగా దేవదాయ శాఖ చర్యలు వేగవంతం చేసింది. కాగా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను.. ఈప్రక్రియను నిఘా నీడలో పకడ్బందీగా చేపడుతున్నారు. కాగా కార్యక్రమం ప్రారంభోత్సవంలో దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
ఊరికి ముందే 101 గుడులు, 101 బావులు
సాక్షి, కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో పట్టణానికి పది కిమీ దూరంలో ఉన్న గుళ్లదూర్తి గుడులకు నిలయంగా మారింది. లక్కుమాంపురి పేరుతో వెలసిన గ్రామం కాలక్రమేణ బ్రాహ్మణ అగ్రహారం(చిన్నకాశీ), గుడులదూర్తిగా పిలువబడుతూ ప్రస్తుతం గుళ్లదూర్తిగా పేరుగాంచింది. గ్రామం ఉద్భవించేనాటికి గ్రామంలో 101 గుడులు, 101 బావులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. గ్రామంలో వెలసిన ఆలయాలు, పీర్లచావిళ్లు, చర్చిలు మత సామరస్యానికి ప్రతీకగా అద్దం పడుతున్నాయి. కొన్ని ఆలయాలు, బావులు కాలగమనంలో కలిసి పోగా ఇంకా అనేక పురాతన ఆలయాలు, నూతనంగా వెలసిన ఆలయాలతో గ్రామం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. చిన్నమ్మ ఆశ్రమంలో దేవుళ్ల కొలువు 1927వ సంవత్సరంలో భర్తను కోల్పోయిన చిన్నమ్మ అనే మహిళ గ్రామానికి చెందిన వెంకటమ్మ చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతోపాటు కుందూనది ఒడ్డున బండలపై మొలచిన సీతారాముల ప్రతిమలకు పూజలు చేస్తూ భక్తురాలిగా మారింది. పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది ఈమెకు భక్తులుగా మారటంతో కుందూనది ఒడ్డున చిన్నమ్మ ఆశ్రమాన్ని నెలకొల్పింది. ఈ ఆశ్రమంలో 1948వ సంవత్సరం కేరళకు చెందిన వ్యాస ఆశ్రమ పీఠాధిపతి మళయాలస్వామి ఉప సభ నిర్వహించారు. ఈ సభతో ఆశ్రమ పేరు ప్రతిష్టలు దేశ నలుమూలలా వ్యాపించాయి. 1956వ సంవత్సరంలో చిన్నమ్మ మృతి చెందటంతో ప్రతి ఏటా ఆశ్రమ వార్షికోత్సవం, చిన్నమ్మ ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో సీతారాముల ఆలయంతోపాటు కృష్ణ మందిరం, వీరబ్రహ్మేంద్ర ఆలయం, దక్షిణామూర్తి, చిన్నమ్మ మందిరం ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి రోజుల్లో నిర్వహించే వార్షికోత్సవం రాష్ట్రంలోని వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలకు చెందిన ఉపన్యాసకులు హాజరవుతుండటం విశేషం. శ్రీరామ నవమి పండుగను పురష్కరించుకుని సీతారాముల కల్యాణం, మూడు రోజులపాటు తిరుణాల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్రమంలో నిత్యం శ్రీరామతీర్థ సత్సంగం, ఆధ్యాత్మిక విచారణ, ధాన్యం, ప్రతి ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. మత సామరస్యానికి ప్రతీక గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా దస్తగిరిస్వామి, మౌలాలి స్వామి దర్గాలు వెలిశాయి. పూర్వీకుల కథనం మేరకు కోడి కూత, రోకలిపోటు వినిపించని సమయంలో గ్రామానికి చెందిన మాబుసాని అనే భక్తుడు చేతిలో నిప్పులు పోసుకుని వెండిని కరిగించగా ఆచారి అనే మరో భక్తుడు దస్తగిరి స్వామి పీరును తయారు చేశారు. అనేక మహిమలు ఉన్న స్వామికి ప్రతిఏటా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకునేవారు. స్వామి మహిమలు తెలుసుకున్న ఒక దొంగల ముఠా పీరును దొంగలించి నొస్సం కొండల్లో వెండిని కరిగించేందుకు ప్రయత్నించగా ఆ దొంగల కళ్లు పోవడంతో పీరును అక్కడే వదిలేసి పారిపోరినట్లు చరిత్ర. నొస్సం కొండల్లో పీరు ఉందని వెంటనే వెళ్లి తీసుకుని వచ్చి దర్గాలో ప్రతిష్టించాలని దస్తగిరిస్వామి మాబుసానికి కలలో కనిపించి చెప్పగా భక్తులు అక్కడికి చేరుకోగా స్వామి కలలో చెప్పిన మాటలు నిజం కావడంతో పీరును తీసుకొచ్చి తిరిగి ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా మొహర్రం పండుగను పురష్కరించుకుని నిర్వహించే జియారత్ వేడుకలకు ప్రాధాన్యత సంతరించుకుంది. స్వామి మహిమలకు ఆకర్షితులైన అప్పటి భక్తులు విరాళాలు సేకరించి స్వామి వారికి ప్రత్యేకంగా దర్గా నిర్మించారు. అనంతరం కొంత కాలానికి మౌలాలి స్వామి పీరును తయారు చేసి మాబుసాని వంశస్తుల ఆధ్వర్యంలో జార్తలను నిర్వహిస్తున్నారు. జంబుకేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర గ్రామంలో వెలసిన జంబుకేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. కలియుగం ఆరంభంలో పరిచిత మహారాజు( అభిమన్యుడి కుమారుడు) జన్మేజయుడు తన తండ్రి చేసిన సర్పయాగ దోశ నివారణకు దేశవ్యాప్తంగా 101 బ్రాహ్మణ గడపలు కలిగిన గ్రామాల్లో పశ్చిమాభిముఖంగా ఒకే రోజు శివాలయాలు ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా గుళ్లదూర్తిలో జంబుకేశ్వరస్వామి ఆలయం నిర్మితమైంది. ఆలయం నిర్మించి వంద సంవత్సరాలకు పైబడటంతో పదేళ్లక్రితం ఆలయ జీర్ణోద్దరణ పచేలు చేపట్టారు. ఆలయంలో ప్రతి ఏకాదశి రోజున పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో వెలసిన మరిన్ని ఆలయాలు గ్రామంలో పురాతన ఆలయాలతోపాటు మరిన్ని ఆలయాలు వెలశాయి. మూడు ఆంజనేయస్వామి, మూడు శివాలయాలు, సాయిబాబాగుడి, విఘ్నేశ్వర, వీరభద్ర, చెన్నకేశవ, లక్ష్మి నరసింహ ఆలయాలు, కర్రెమ్మ, అంకాలమ్మ, లింగమయ్య, సుంకులమ్మ, పేరంటాలమ్మ, పెద్దమ్మ గుడులున్నాయి. 2007వ సంవత్సరంలో దాతల సహకారంతోగ్రామ బస్టాఫ్ సమీపంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో ప్రతి రోజు అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, గురుపౌర్ణమి, శ్రీరామ నవమి, దత్తజయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చెన్నకేశవ(చెన్నుడు) ఆలయంలో దళితులు పూజారులుగా వ్యవహరిస్తూ పూజలు చేస్తున్నారు. గ్రామం ఆవిర్భావం తర్వాత కొన్ని ఆలయాలు కనుమరుగు కాగా గ్రామంలో ఇప్పటికి 30 ఆలయాల్లో దేవుళ్లు భక్తులచే పూజలందుకుంటూ గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. -
1,771 ఆలయాలకు కొత్త పాలక మండళ్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,771 ఆలయాలకు కొత్త పాలక మండళ్ల నియామకానికి ప్రభుత్వం, దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఆయా ఆలయాలకు కొత్త పాలక మండళ్ల నియామకానికి సంబంధించి దేవదాయ శాఖ ఇప్పటికే ఆలయాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది. తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లోనే 400 పైగా ఆలయాల చొప్పున ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు దేవదాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత వేగంగా పాలక మండళ్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తాజాగా దేవదాయ శాఖకు సూచించినట్టు సమాచారం. ఈ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 24,622 ఆలయాలు ఉండగా.. అందులో 4,481 ఆలయాలకు మాత్రమే పాలక మండళ్ల ఏర్పాటు ఆనవాయితీగా కొనసాగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అందులో 715 ఆలయాలకు ప్రభుత్వం, దేవదాయ శాఖ పాలక మండళ్ల నియామక ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. ఇప్పుడు నోటిఫికేషన్లు జారీ అయ్యి.. ప్రక్రియ కొనసాగుతున్న 1,771 ఆలయాలతో పాటు ఇంకా 1,995 ఆలయాలకు కూడా పాలక మండళ్ల నియామకానికి అవకాశం ఉంది. వాటిలో న్యాయపరంగా చిక్కులున్న ఆలయాలు మినహా మిగిలిన అన్ని చోట్ల కొత్త పాలక మండళ్ల నియామకానికి కూడా దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. పాలక మండళ్ల నియామకానికి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయిన ఆలయాలతో పాటు నోటిఫికేషన్ల జారీకి అవకాశం ఉన్న ఆలయాలతో కలిపి మొత్తం 3,766 ఆలయాల దాకా పాలక మండళ్ల నియామకానికి అవకాశం ఉంది. తద్వారా దాదాపు 26 వేల మందికి పైగా చోటు దక్కే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వివరించాయి. -
పురాతన దేవాలయాలు.. పిల్లలమర్రి శివాలయాలు
దురాజ్‌పల్లి (సూర్యాపేట): ఆ ఊరు పేరు వినగానే పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. అక్కడ కొలువైన శివుడు చెన్నకేశ్వరుడు భక్త జనానికి ఆరాద్య దైవంగా వెలుగొందుతున్నారు. అంతేకాకుండా పురాతన దేవలయాలతో అలరారుతున్న ఆ గ్రామం అత్యంత ప్రఖ్యాతిగాంచింది. సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలోని కాకతీయ కళామతల్లికి నిలయమై, ఎన్నో శివాలయాలకు వేదికైంది. "వాణి నా రాణి" అని చెప్పి మెప్పించిన పిల్లలమర్రి పిన వీరభద్రుడిని తన బిడ్డగా నిలుపుకున్న కమనీయ సీమ పిల్లలమర్రి. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కి వెళ్లే 65వ నెంబర్ జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ముఖధ్వారం ఉంది. అంతేకాదు మూసీ కాలువ పక్క నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లంగానే పిల్లలమర్రి గ్రామం వచ్చేస్తుంది. (చదవండి: ఆలుమగల బంధానికి అర్థం చెప్పారు.. ‘ఇదీ బంధమంటే..!’) శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు... పిల్లలమర్రి శివాలయాలు శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు. కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాలం ఈ గ్రామానికి నిజంగా స్వర్ణయుగం. రేచర్లరెడ్డి వంశీయులు కాకతీయులు సేనానులుగా, మహా సామంతులుగా ఆమనగల్లు, ఎలకతుర్తి, పిల్లలమర్రి ప్రాంతాలను పరిపాలించారు. మహాసామంతుడైన రేచర్ల బేతిరెడ్డి ఆమనగల్లును రాజధానిగా చేసుకుని పాలించే రోజుల్లో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించారు. అనంతరం తన రాజధానిని పిల్లలమర్రికి మార్చి పిల్లలమర్రి బేతిరెడ్డిగా ప్రఖ్యాతి గాంచాడు. ఇప్పుడున్న గ్రామ ప్రాంతంలో పూర్వం ఒక గొప్ప వటవృక్షం (మర్రిచెట్టు) ఉండేది. అక్కడికి వేటకు వచ్చిన బేతిరెడ్డికి ఆ చెట్టు క్రింద ధనం లభించిందని, ఆ ధనంతో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. రాతి దూలాలపై పురాణ గాథాలు..... క్రీ.శ 1195 నాటికి పిల్లలమర్రి బాగా ప్రసిద్ధి పొందింది. కాకతీయ రుద్రదేవుని మరణానంతరం తన తమ్ముడైన నామిరెడ్డికి మహాసామంత ఆధిపత్యం అప్పగించి బేతిరెడ్డి విశ్రాంతి తీసుకున్నాడు. రేచర్ల నామిరెడ్డి నిర్మించిన త్రికూటాలయంలో మూడు శివాలయాలున్నాయి. నామిరెడ్డి తన తండ్రిపేరు మీద కామేశ్వర, తన తల్లి పేరు మీద కాచేశ్వర, తన పేరు మీద నామేశ్వర లింగాలను ప్రతిష్టించాడు. ఈ దేవాలయ ప్రాంగణంలో మరో నామేశ్వరాలయం కూడా ఉంది. అది 1202లో నిర్మించబడింది. తెలుగు భాష మాట్లాడేవారందర్నీ మొదటిసారిగా ఏకం చేసిన వారు కాకతీయులు. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరుకసాని పిల్లలమర్రిలో తన పేరుమీద ఎరుకేశ్వరాలయాన్ని నిర్మించి శాసనం వేయించింది. ఆలయం సమీపంలో సుబ్బ సముద్రాన్ని తవ్వించింది. దేవాలయంలో పూజల నిమిత్తం భూధానం చేసింది. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతి దూలాలపై భారత రామాయణ గాథలు, సముద్ర మధనం, వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. సప్తస్వరాలు పలికే రాతి స్తంభాలు... నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్త స్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తున్నాయి. నిర్మాణంలో ఇసుక పోసి ఏనుగులతో పెద్ద పెద్ద బండలను ఎక్కించినట్లు తెలిసింది. దేవాలయాల్లో నల్లని శిలలపై నగిషీలు, పద్మాలు, హంసలు, నృత్య భంగిమలు,వాయిద్యకారుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శివరాత్రికి ఐదు రోజుల పాటు జాతర... మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది దేవాలయాలు శివరాత్రి శోభకు ముస్తాబు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. (చదవండి: దేశానికే ఆదర్శం.. హైదరాబాద్)