
బోయకొండలో నిర్వహిస్తున్న చండీ హోమం
చౌడేపల్లె: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ వీరాంజనేయస్వామి ఆలయం, సమీపంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో చరిత్రాత్మక ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు విశిష్ట కృషిచేశారని కొనియాడారు.
తిరుపతి గోవిందరాజస్వామి టెంపుల్ డిప్యూటీ ఈఓ శాంతి, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఏకాంబరం కలిసి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ తాళాలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఆలయానికి చెందిన భూములు, బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు ఇక నుంచి టీటీడీ ఆధ్వ ర్యంలో జరుగుతాయన్నారు.
ఈ మేరకు ఆలయ ఆదాయ వనరులు, ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ ఈఓ శాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యువెలరీ ఏఈఓ మణి, జనరల్ సెక్షన్ డిప్యూటీ ఈఓ శివప్రసాద్, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ వెంకట్రమణ, ల్యాండ్స్ ఎస్టేట్ విభాగం తహసీల్దార్ లలితాంజలి, టెంపుల్ ఇన్‌చార్జి భానుప్రకాష్ తదితరులున్నారు.
భక్తి శ్రద్ధలతో చండీ హోమం
బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని యాగశాలలో నెలకొల్పారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి అభిషేక పూజలు చేశారు. పూర్ణాహుతి అనంతరం ఉభయదారులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment