సాక్షి, అమరావతి: నిత్యం చంద్రబాబు మత్తులో జోగుతున్న ఈనాడు రామోజీరావు ఆ మైకంలో పడి పూర్తి ఉన్మాదిగా మారిపోయారు. ఎందుకంటే.. టీడీపీ హయాంలో కృష్ణానది ఒడ్డున పవిత్ర దేవా లయాలు కూల్చేస్తే సిగ్గులేకుండా కళ్లుమూసుకున్న ఆయన.. ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం గు రించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లి స్తున్నట్లుగా ఉంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు.. ఈనాడులో తరచూ ప్రచురించే కథనాలకు ఎక్కడా పోలిక లేదనేది జగమెరిగిన సత్యం.
చరిత్రలోనే ఎప్పుడూలేని విధంగా ఏపీలో దేవాలయాల అభివృద్ధి విస్తృతంగా జరుగుతోంది. దేవదాయ శాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మా ణంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలు మూలలా 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇదంతా సీఎం వైఎస్ జగన్ హయాంలో చేపట్టడాన్ని రామోజీ తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయన విషపుత్రిక ‘ఈనాడు’లో ‘జగనన్న పాపాలు–భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలి వేటు’ అంటూ చేతికొచ్చింది రాసిపారేశారు.
చంద్ర బాబు సీఎంగా ఉన్నప్పుడు రోడ్లకు అడ్డంగా ఉన్నా యనే నెపంతో విజయవాడలో ఒకే రాత్రి పదుల సంఖ్యలో గుళ్లను పలుగుపోట్లతో నేలమట్టం చేసిన విషయం ఆయన మర్చిపోయారు. అలాంటి చంద్రబాబును ‘ఈనాడు’ నిత్యం కీర్తిస్తుంది. కానీ, ఆ కూల్చిన గుళ్లను పునర్నిర్మించి ప్రారంభించిన సీఎం జగన్‌ను మాత్రం రాక్షసుడిగా పోల్చడమంటే రామోజీ పైశాచికత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
ట్రస్టు భూములు అమ్మినోళ్లపై ఎందుకంత ప్రేమ?
2014లో బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పేరుతో విశాఖ పరిసరాల్లో దేవదాయ శాఖకు చెందిన నాలుగు వందల ఎకరాలకుపైగా మాన్సాస్ ట్రస్టు భూములను అమ్మకానికి పెట్టారు. కానీ, కాలేజీపై నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ ఐదేళ్లలో 70ఎకరాల వరకు విక్రయించి రూ.వందల కోట్లను పోగేసుకున్నారు.
ఇలా దేవదాయ శాఖకు చెందిన అనేక భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నంలేదు. సీఎం జగన్ మాత్రం.. భవిష్యత్తులో ఆలయాల భూములను ఎవరూ ఆక్ర మించుకునేందుకు వీల్లేకుండా ఓ ఆర్డినెన్స్ తీసు కొచ్చారు. ఇది దేవదాయ శాఖ చరిత్రలో పెద్ద విప్లవాత్మక నిర్ణయం. దేవుడి భూము లను కాపాడేందుకు ఇలాంటి పటిష్ట చట్టాలు తీసుకురావడం ఈనాడుకు నచ్చడంలేదు. అందుకే సీఎం జగన్ నిర్ణయంపై అక్కసు ప్రదర్శిస్తోంది.
బాబు పాలన రామరాజ్యమా?
చంద్రబాబు హయాంలో విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు చేశారని పెద్ద దుమారం చెలరేగింది. బెంజ్‌సర్కిల్ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను అధికారులు వ్యతి రేకించినప్పటికీ తక్కువ లీజుకే బాబుకు అత్యంత సన్నిహితుడి విద్యాసంస్థకు టీడీపీ సర్కార్ కట్ట బెట్టింది. సీఎం జగన్ ప్రభుత్వం విజయవాడ దుర్గగుడి ఆలయ అభివృద్ధికి ఎప్పుడు లేనంతగా ప్రభుత్వ ఖజానా నుంచి రూ.70 కోట్లను మంజూరు చేసింది. రామోజీకి చంద్రబాబు ప్రభుత్వం రామ రాజ్యంగానూ, ఆలయాలను అభివృద్ధి చేస్తున్న జగన్ సర్కారు రాక్షస ప్రభుత్వంలా కనిపిస్తుంది.
భక్తుల కమిటీలకే ఆలయాల నిర్వహణ..
దేవదాయ శాఖ పరిధిలోని చిన్నా, పెద్ద ఆలయాలు అన్నింటికీ టీడీపీ నేతలే ట్రస్టు బాధ్యతల్లో ఉండే వారు. సీఎం జగన్ ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ ఆయా ఆల యాల వంశపారంపర్య ధర్మకర్తలకు, స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో 25 వేలకు పైగా ఆలయాలు, సత్రాలు ఉండగా.. రూ.5 లక్షలు పైబడి ఆదాయమున్న 1,400 ఆల యాలకే ప్రభుత్వం ట్రస్టు బోర్డులు నియమిస్తోంది.
ధార్మిక పరిషత్ కథ ఇంతే..
దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వివిధ స్వామీజీలు, రిటైర్డు జడ్జిలు, రిటైర్డు దేవదాయ శాఖ అధికారులు సభ్యులుగా ఉండే ధార్మిక పరిషత్‌కు వర్తింప జేస్తూ 2009లోనే అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ప్రభుత్వం జోక్యం చాలావరకు తగ్గింది. అయితే, 2014–19 మధ్య చంద్రబాబు దాని ఏర్పాటును నిర్లక్ష్యంచేశారు.
ఆలయాల భుములను టీడీపీ నేతలు ఇష్టానుసారం వాడుకునేందుకు వీలుగా కేవలం ఐదారుగురు అధికారులతో తాత్కాలిక పరిషత్ ఏర్పాటుచేశారు. అదే సీఎం జగన్ ప్రభుత్వం 2022లో ధార్మిక పరిషత్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసింది. కానీ, దేవదాయ శాఖకు స్వయం ప్రతిపత్తి లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ‘ఈనాడు’ గొప్పగా ఊహించుకుంటూ జగన్ సర్కారును రాక్షస రాజ్యంగా ఈనాడు అభివర్ణిస్తూ పేట్రేగిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment