Fact Check: పర్యాటకంపై రామోజీ నాటకం | AP is one of the leading states in terms of tourism attraction in the country | Sakshi
Sakshi News home page

Fact Check: పర్యాటకంపై రామోజీ నాటకం

Published Mon, Apr 1 2024 3:44 AM | Last Updated on Mon, Apr 1 2024 5:37 AM

AP is one of the leading states in terms of tourism attraction in the country - Sakshi

దేశంలోనే పర్యాటక ఆకర్షణలో అగ్రగామి రాష్ట్రాల్లో ఏపీ ఒకటి 

వీటిల్లో సుమారు రూ.3వేల కోట్లకు పైగా పనుల్లో ముందడుగు 

ఇవి చూసి ఓర్వలేకే ఈనాడులో రామోజీ కుట్రపూరిత రాతలు 

పైగా ఏపీటీడీసీ ఆదాయం పెరిగితే నష్టాలంటూ కనికట్టు రాతలు 

చంద్రబాబు ప్రచార పిచి్చతో రూ.కోట్లు ప్రజాధనం వృధాచేస్తే అది రామోజీకి అభివృద్ధి? 

మీ బాబు పాలనలో ఎవరికి పడితే వారికి అద్దె సూట్లు తొడిగేసి చేసుకున్న దొంగ ఒప్పందాలు మర్చిపోతే ఎలా రామోజీ? 

అప్పట్లో బీచ్‌లలో అశ్లీలత ప్రోత్సాహానికి బరితెగించలేదా? 

వాస్తవాలకు ‘పచ్చ’ గంతలు కట్టి రామోజీ పిచ్చి రాతలు 

సాక్షి, అమరావతి :  నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఈనాడు రామోజీరావు. నిత్యం తన క్షుద్ర పత్రికలో వండివారుస్తున్న అశుద్ధ కథనాలు చూసి పాఠకులు ఛీకొడుతున్నా ఆయన సిగ్గూఎగ్గూ లేకుండా బాబు పల్లకిని మోయడమే పనిగా పెట్టుకున్నారు. గ్రాఫిక్స్‌ బొమ్మలు, కనికట్టు కథనాలతో అప్పట్లో ప్రజల్ని మభ్యపెట్టిన బాబు మాదిరిగా రామోజీ కూడా ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు రంగరించి తన ఈనాడులో అభూతకల్పనలను అచ్చోస్తున్నారు. తాజాగా.. రాష్ట్రంలో టూరిజం రంగంపై ఆయన కక్కింది కూడా అక్షరాల విషమే.

దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ మూ­డో స్థానంలో నిలిచినా.. జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ‘లేపాక్షి’ ఘనత సాధించినా.. అలాగే, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో తాత్కాలిక జాబితాలోనూ ఏపీ చోటు దక్కించుకున్నా.. విశాఖలోని రుషికొండ బీచ్‌కు వరల్డ్‌ ఫేమస్‌ ‘బ్లూఫ్లాగ్‌’ సర్టిఫికేషన్‌ రావడంతో అక్కడ వరుసగా నాలుగేళ్లుగా బ్లూఫ్లాగ్‌ జెండా రెపరెపలాడుతున్నా.. అలాగే.. గతేడాది జీఐఎస్‌ సదస్సుల్లో ఏకంగా రూ.17వేల కోట్లకు పైగా పెట్టుబడులు పర్యాటక పెట్టుబడులు వెల్లువెత్తినా బాబు జాకీ లిఫ్టర్‌ రామోజీకి ఇవేమీ కనపడవు.

నిజానికి.. ఇదంతా దేశంలోనే అత్యుత్తమ పర్యాటక పాలసీని సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకురావడంవల్లే పెట్టుబడిదారులు క్యూ కట్టారనేది ఎవరూ కాదనలేని సత్యం. కరోనా రెండేళ్ల కాలం మినహా.. మిగిలిన మూడేళ్లలోనే ఇది సాధ్యపడింది. కానీ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి ఏపీ పర్యాటకానికి దక్కిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో.. ప్రపంచ పర్యాటకం మొత్తం ఏపీ వైపు చూస్తుంటే.. కళ్లకు టీడీపీ గంతలు కట్టుకున్న గురవింద రామోజీ మాత్రం కళ్లుండీ కబోదిలా నటిస్తున్నారు.

సీఎం జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క మంచిని చెప్పకపోగా.. ప్రజల మెదళ్లలో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక అంశాన్ని భుజానకెత్తుకుని టన్నుల కొద్దీ అసత్యాలతో ‘ఈనాడు’లో నింపి పారేస్తున్నారు. ఇందులో భా గమే శుక్రవారం ‘పర్యాటకం.. పక్కా నాటకం’ అంటూ ఈనాడు వండిన ఓ ఫక్తు నాటకీయ కథనం. 

అప్పట్లో బీచ్‌లలో అశ్లీలత ప్రోత్సాహానికి కుట్ర 
ఇక అప్పట్లో పర్యాటకం ముసుగులో చంద్రబాబు సంప్రదాయలకు పాతరేశారు. విశాఖ బీచ్‌లో లవ్‌ ఫెస్టివల్‌ పేరుతో అశ్లీలతను ప్రోత్సహించే కుట్రకు తెరతీశారు. దీనిపై ప్రజలు, మేధావుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే రామోజీకి పర్యాటకాభివృద్ధిగా కనిపిస్తుందంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. చంద్రబాబు బీచ్‌లను బహిరంగ అశ్లీలతకు వాడుకోవాలని చూస్తే ప్రస్తుత ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.

ఇందులో భాగంగా 288 బీచ్‌లను గుర్తించి అత్యాధునిక మౌలిక వసతులు కల్పించి కోస్టల్‌ జోన్‌ టూరిజాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో క్రూయిజ్‌ టెర్మినల్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. కానీ, చంద్రబాబు ప్రచార పిచి్చతో రూ.కోట్ల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చుచేయడాన్ని రామోజీ ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. 

రికార్డు స్థాయిలో ఏపీటీడీసీ ఆదాయం.. 
ప్రపంచ పర్యాటకం మొత్తం కరోనాతో కుదేలైన రోజుల్లోనూ ఏపీ పర్యాటకం అత్యంత వేగంగా బలోపేతమైంది. ఏపీటీడీసీ ఆదాయాన్ని టీడీపీ ఐదేళ్ల పాలనతో పోలిస్తే రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. 2022–23లో ఏకంగా రూ.162.­25 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 2021–22తో పోలిస్తే 10.82 శాతం వృద్ధిని నమోదు చేసింది. విచిత్రంగా 2017–18లో టీడీపీ హయాంలో మాత్రం రూ.1.99 కోట్ల లోటుతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం గమనార్హం.

మరి రామోజీ చెబుతున్న పర్యాటకం కుంటుపడితే ఒక్క హరిత హోటళ్లు, బోటింగ్‌ ద్వారా ఇంత వృద్ధి ఎలా సాధ్యపడుతుందో రామోజీనే చెప్పాలి. మరోవైపు.. నాస్తికత్వపు వాసనలు పోని రామోజీ టీటీడీ టూర్‌ ప్యాకేజీలపైనా విషం చిమ్మారు. సెంట్రలైజ్డ్‌గా అత్యాధునిక సౌకర్యాలతో ఉత్తమ రవాణా మార్గాల్లో సేవలందిస్తుంటే.. పర్యాటక సంస్థ ఆదాయానికి గండి కొట్టేస్తున్నట్లు  ఆయన గుండెలు బాదుకున్నారు.  

కేంద్రం మెచ్చిన ఏపీ.. 
ఇక రూ.200 కోట్లతో అరకు, గండికోట అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గండికోట ప్రాంతంలో 4,336 ఎకరాల్లో పర్యాటక సిటీని అభివృద్ధి చేయనున్నారు. అరకు లోయలోనూ సుందర హోటళ్లు, అడ్వెంచర్, ఎకో పర్యాటకానికి ప్రణాళిక సిద్ధమయ్యాయి. సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, విజయవాడ దేవాలయాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. అహోబిళం, నాగార్జునసాగర్‌ను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.  

రూ.3వేల కోట్ల పనులకు శ్రీకారం.. 
జీఐఎస్‌లో చేసుకున్న ఒప్పందాల్లో దాదాపు రూ.3,049.90 కోట్ల విలువైన సివిల్‌ వర్క్స్‌ ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయితే 9,022 మందికి ఉపాధి రెడీగా ఉంటుంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద రూ.600 కోట్లతో 7వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. మరో రూ.3,757 కోట్లతో 2,750 మందికి ఉపాధి కల్పించేలా 15 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కింద (ఓ అండ్‌ ఎం) 87 ప్రాజెక్టులను పట్టాలెక్కించింది.   

అప్పట్లో అద్దె సూట్లు తొడిగేసి.. 
వాస్తవానికి.. చంద్రబాబు హయాంలో ప్రచార పిచ్చి పీక్స్‌లో ఉండేది. గ్రాఫిక్స్‌ బొమ్మలు, కనికట్టు సదస్సులతో ప్రజలను నిరంతరం మభ్యపెడుతూనే ఉండేవారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరుతో రోడ్ల పక్కన కనిపించిన ప్రతిఒక్కరికీ అద్దె సూట్లు తొడిగేసి మరీ వారికి పెట్టుబడిదారుల కలరింగ్‌ ఇచ్చేశారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు వారితో దొంగ ఒప్పందాలు చేసుకున్నారు. ఇదంతా జగమెరిగిన సత్యం.

అప్పట్లో పర్యాటక రంగంలో తన అనుయాయులకు తప్ప మిగిలిన ఎవరికీ ఒక్క కాంట్రాక్టు, లేదా ఒక్క ఉద్యోగం కూడా రాలేదంటే చంద్రబాబు పాలనంతా పైన పటారం లోన లొటారం అనే స్పష్టమైంది. ఇక వీటినే రామోజీరావు గొప్పగా కీర్తిస్తూ పతాక శీర్షకల్లో బాబుకు నిర్లజ్జగా భజన చేసి ప్రజలను దగా చేశారు. కానీ, సీఎం జగన్‌ దార్శనిక పిలుపుతో గతేడాది విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లో మొత్తం రూ.13.11 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే.. ఒక్క పర్యాటక రంగంలోనే 117 ఒప్పందాల ద్వారా రూ.17,127 పెట్టుబడులు వచ్చాయి.

తద్వారా 39,170 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రణాళిక రచించారు. కానీ, చంద్రబాబు దొంగ ఒప్పందాలను అడ్డగోలుగా కీర్తించిన అదే రామోజీరావు.. సీఎం జగన్‌ పాలనలో వాస్తవాలకు పాతరేస్తూ దు్రష్పచారానికి తెగబడడం సిగ్గుచేటు.  

ఆతిథ్య ఆంధ్ర.. 
మరోవైపు.. సీఎం జగన్‌ సారథ్యంలో ఆతిథ్య రంగం అభివృద్ధి బాట పడుతోంది. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటల్‌ రంగ సంస్థలైన ఒబెరాయ్, హయత్, తాజ్‌ గ్రూప్‌తో పాటు దేశీయ సంస్థలైన గార్రిసన్‌ కన్‌స్ట్రక్షన్, మేఫెయిర్‌ హోటళ్లు వచ్చాయి. అత్యాధునిక సౌకర్యాలతో రిసార్ట్స్‌ (ఇండిపెండెంట్‌ విల్లా), స్టార్‌ హోటళ్ల నిర్మాణంతో ఈ రంగంలో మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7–స్టార్‌ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్‌ నిర్మాణానికి ఒబెరాయ్‌ ముందుకొచ్చింది.

ఇప్పటికే విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు), గండికోటలో నిర్మాణాలకు ఒప్పందాలు పూర్తయ్యా యి. ఇక్కడ శంకుస్థాపనలు జరగ్గా త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి. ఒక్క ఒబెరాయ్‌ సంస్థల ద్వారానే సుమారు 11వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తిరుపతిలో నోవోటెల్‌ సంస్థ రూ.125 కోట్లతో మూడువేల మందికి ఉపాధి, విశాఖపట్నలో మేఫెయిర్‌ సంస్థ రూ.525 కోట్లతో, మరో రూ.404 కోట్లతో హయత్‌ రీజెన్సీ ఫైవ్‌స్టార్‌ హోటళ్లు నిర్మాణానికి సిద్ధమయ్యాయి.

ఇప్పటికే విజయవాడలో సుమారు రూ.100 కోట్లతో హయత్‌ న్యూ లగ్జరీ స్టార్‌ హోటల్, గుంటూరులో ఐటీసీ హోటళ్లు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. చంద్రబాబు హ యాంలో ఇలాంటి అభివృద్ధి లేకపోగా విదేశీ యులను తీసుకొచ్చి పర్యాటకంలో విపరీతమై న దుబారా ఖర్చులు చేశారు. బహుశా రామోజీకి రూపాయి రాక కంటే.. రూపాయి ఖర్చుచేయడమే అభివృద్ధిగా కనిపించినట్లుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement