Ramoji Rao
-
ఈనాడు ఆస్తుల జప్తు
సాక్షి, అమరావతి: అందరికీ నిత్యం ఉదయాన్నే నీతులు చెప్పే ఈనాడు (ఉషోదయ ఎంటర్ప్రైజెస్) దౌర్జన్యం కొనసాగుతోంది. తమ పత్రిక ద్వారా జనాలకు నీతులు మాత్రమే చెబుతామని, వాటిని తాము మాత్రం ఆచరించమని ఈనాడు మరోమారు నిరూపించింది. గతంలో విశాఖపట్నం ఈనాడు కార్యాలయం స్థలం విషయంలో దాని యజమాని ఆదిత్య వర్మను ముప్పుతిప్పలు పెట్టిన ఈనాడు యాజమాన్యం, ఇప్పుడు విజయవాడలో ఉన్న కార్యాలయ స్థలం విషయంలో కూడా దాని యజమాని ముసునూరు అప్పారావును సైతం అలాగే ముప్పుతిప్పలు పెడుతోంది. ఈనాడు పత్రిక కోసం తీసుకున్న స్థలం లీజు గడువు ముగిసినా.. దాన్ని అప్పారావుకు అప్పగించకుండా చుక్కలు చూపిస్తోంది. చివరకు అప్పారావు కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి తెచ్చింది. అక్కడ కూడా అప్పారావుకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేసింది. కోర్టుకెళ్లి అప్పారావు విజయం సాధించినా.. న్యాయస్థానం ఆదేశాలను సైతం ఈనాడు బేఖాతరు చేసింది. దీంతో కోర్టు ఈనాడు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. స్థల యజమానిని వేధించడానికే ఆ స్థలాన్ని ఖాళీ చేయడం లేదని కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. కాగా.. బాధితుడు అప్పారావుకు రూ.5.20 కోట్లను 6 శాతం వార్షిక వడ్డీతో పరిహారం చెల్లించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ఈనాడు యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈనాడు ఆస్తుల జప్తునకు న్యాయస్థానం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలో ఉన్న ఈనాడు ఆస్తులను బదలాయించడం, తాకట్టు పెట్టడం, అమ్మడం, బహుమతిగా ఇవ్వడం చేయరాదని ఈనాడు యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ ఆస్తులను ఎవరూ కొనడం, బహుమతిగా తీసుకోవడం చేయరాదంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈనాడు సీఎండీ కిరణ్‌ను ఆదేశించింది. అసలు కథ ఏమిటంటే.. ఈనాడు యజమాని రామోజీరావు 1975లో విజయవాడ పటమటలంకలో ముసునూరి అప్పారావుకు చెందిన 92 సెంట్ల స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.725 అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పక్కనే అప్పారావు సమీప బంధువైన వల్లూరు వెంకటేశ్వరరావుకు చెందిన ఎకరా 47 సెంట్ల భూమిని కూడా రామోజీరావు లీజుకు తీసుకున్నారు. లీజు గడువు 30.04.2008న ముగిసింది. దీంతో మరో 33 ఏళ్ల పాటు లీజు పొడిగించాలని స్థల యజమాని అప్పారావును రామోజీరావు కోరారు. రామోజీ సంగతి బాగా తెలిసిన అప్పారావు లీజు పొడిగింపునకు నిరాకరించారు. 6 నెలల్లో స్థలాన్ని ఖాళీ చేసి ఇవ్వాలని రామోజీరావుకు తేల్చిచెప్పారు. 6 నెలల గడువు 2008 అక్టోబర్‌తో ముగిసింది. అయినా రామోజీరావు ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. ఇదే సమయంలో మరో 33 ఏళ్లపాటు లీజు పొడిగించేలా అప్పారావును ఆదేశించాలంటూ విజయవాడ జిల్లా కోర్టులో రామోజీరావు సూట్ దాఖలు చేశారు. దానిని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 2013లో కొట్టేసింది. అప్పారావుకు చెందిన స్థలంపై ఈనాడుకు ఎలాంటి హక్కు లేదని తేల్చిoది. అంతేకాక ఈనాడు ఆ స్థలంలో ఉండటం అక్రమమేనని స్పష్టం చేసింది. దీనిపై ఈనాడు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను సైతం కోర్టు కొట్టేసింది. సీనియర్ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని స్పష్టం చేసింది. అప్పారావును వేధించడానికి ఈ అప్పీల్‌ను ఆయుధంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని జిల్లా కోర్టు 2017లో తీర్పునిచ్చింది. పరిహారంగా రూ.5.20 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించినా..2015లో ముసునూరి అప్పారావు తన స్థలం నుంచి ఈనాడును ఖాళీ చేయించాలని కోరుతూ విజయవాడ కోర్టులో సూట్ దా3ఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అప్పారావుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాదాపు 60 పేజీల తీర్పు వెలువరించింది. 2012–15 వరకు అప్పారావుకు రూ.5.20 కోట్లను 6శాతం వార్షిక వడ్డీతో పరిహారంగా చెల్లించాలని ఈనాడు యాజమాన్యాన్ని ఆదేశించింది. మిగిలిన కాలానికి పరిహారం కోసం పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటును అప్పారావుకు ఇస్తూ 2024 అక్టోబర్ 3న తీర్పునిచ్చింది. అయితే.. ఈ తీర్పును ఈనాడు బేఖాతరు చేసింది. దీంతో తీర్పు అమలుకు అప్పారావు కింది కోర్టులో ఈపీ దాఖలు చేశారు. విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలో ఉన్న ఈనాడు కార్యాలయాన్ని జప్తు చేయాలని అందులో కోరారు. దానిపై విచారణ జరిపిన కోర్టు తాము ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.5.20 కోట్ల పరిహారం చెల్లించడంలో ఈనాడు విఫలమైందని తేల్చింది. ఇందుకు గాను ఈనాడు ఆస్తుల జప్తునకు ఆదేశిస్తున్నట్టు ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఎండీ కిరణ్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఆదిత్య వర్మను వేధించిన ఈనాడు రామోజీరావు ఈనాడు పత్రిక కోసం విశాఖపట్నం సీతమ్మధారలో మంతెన ఆదిత్య వర్మకు చెందిన 2.7 ఎకరాల భూమిని 1974లో 33 ఏళ్ల గడువుతో లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.2,500 అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే వర్మ నుంచి లీజుకు తీసుకున్న భూమిని రామోజీరావు సొంత భూమిగా చూపుకుని ప్రభుత్వం నుంచి పరిహారం పొందారు. రామోజీరావు లీజుకు తీసుకున్న 2.7 ఎకరాల భూమిలో ప్రభుత్వం రోడ్డు వెడల్పు నిమిత్తం 618 గజాల భూమిని తీసుకుంది. ఇందుకు గాను సీతమ్మధారలో 872 గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి ఈ స్థలం ఆదిత్య వర్మకు చెందాలి. కానీ.. రామోజీరావు మోసపూరితంగా ఆ భూమిని తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించారు. ఇందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆదిత్యవర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రామోజీ పలుకుబడి ముందు పోలీసులు ఏం చేయలేకపోయారు. దీంతో వర్మ న్యాయపోరాటం చేపట్టారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలకు దిగగా.. ఆ భూమికి సంబంధించి 2007లో 33 ఏళ్ల లీజు ముగిసింది. అయినా రామోజీ ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. లీజును మరో 33 ఏళ్ల పాటు పొడిగించాలని కోరారు. రామోజీ దుర్బుద్ధి తెలిసిన వర్మ అందుకు అంగీకరించలేదు. దీంతో తనది కాని స్థలం విషయంలో రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. వర్మ కూడా రామోజీరావును దీటుగా ఎదుర్కొన్నారు. చివరకు వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఎక్కడా పప్పులు ఉడకకపోవడంతో రామోజీరావు చివరకు వర్మ స్థలాన్ని ఖాళీ చేశారు. వర్మకు చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా పూర్తిగా చెల్లించకుండా కొంత చెల్లించి రామోజీ రాజీ చేసుకున్నారు. -
మార్గదర్శిది 45 ఏళ్ల నయవంచన
-
మార్గదర్శి, రామోజీది 45 ఏళ్ల నయవంచన
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త రామోజీరావుల అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారం 45 ఏళ్ల నయవంచన అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఏపీలోని గత ప్రభుత్వం మార్గదర్శి అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ సర్కారు కూడా దీనికి తానతందాన అంటోందని తెలి పారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (ఆర్బీఐ) ప్రతివాదిగా చేర్చాలని, డిపాజిట్ల వసూళ్లు అక్రమమా? సక్రమమా? తేల్చాల్సింది చట్టబద్ధ సంస్థేనని సుప్రీంకోర్టే నేరుగా చెప్పిందని ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల వసూళ్లు అక్రమమేనని ఆర్బీఐ చాలా స్పష్టంగా ఈ కోర్టుకు చెప్పిందన్నారు. ఇప్పుడు కూడా మార్గదర్శిపై కఠిన చర్యలు చేపట్టకుంటే భవిష్యత్‌కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందన్నారు.రామోజీ అక్రమాలకు హెచ్‌యూఎఫ్ సభ్యులు కూడా బాధ్యులేనని చెప్పారు. హెచ్‌యూఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే బాధ్యడవుతారని, ఇతర కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ ఆ సంస్థ జనవరి 29న దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై అన్ని పక్షాల వాదనలు విన్న జస్టిస్ పి.శ్యాం కోషి, జస్టిస్ కలాసికం సుజనలతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు ఉండవల్లి తన వాదనలను కొనసాగించారు.ఇష్టారాజ్యంగా వసూళ్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇలా వేటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను నడిపించారని, ఇదేమని అడిగేవారు లేకుండా తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి రామోజీ కావడం, వెంట ఆయన మీడియా మాఫియా ఉండడంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు. ఫిర్యాదు చేసినా రామోజీపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. 2004 తర్వాత బోగస్ బ్యాంక్‌ల బండారం బయటపడుతుండడంతో మార్గదర్శి అక్రమాలపై కూడా విచారణ జరపాలని నాటి సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారు. ఎప్పుడైతే మార్గదర్శిపై విచారణ ప్రారంభమైందో నాటి నుంచి వైఎస్సార్‌పై రామోజీరావు తన మీడియాలో అనుచిత వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం మొదలుపెట్టారు. కథనాలు అల్లి రాసేవారు. ఈ క్రమంలోనే నా తల్లికి మార్గదర్శి నుంచి వచ్చిన చెక్, దానిపై ఉన్న సంతకాలను పరిశీలించగా అవకతవకలన్నీ బయటపడ్డాయి. దీంతో నేను ఫిర్యాదు చేసి, నిజం తేల్చేందుకు 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా’’అని ఉండవల్లి కోర్టుకు నివేదించారు. ఐటీ శాఖ కనీసం పట్టించుకోలేదు.. ‘‘కర్త మరణించి, వ్యాపారం ఆగిపోతే ఎలా చర్యలు చేపట్టాలనేది ఆలోచించవచ్చు. రామోజీ చనిపోయినా హెచ్‌యూఎఫ్ వ్యాపారాన్ని వారసులు కొనసాగిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇదో హత్య కేసు లాంటిది. నిందితుడు చనిపోతే ఇక కేసు ఉండదని మార్గదర్శి న్యాయవాదులు చెప్పడం విడ్డూరం. దేశంలోని అన్ని హెచ్‌యూఎఫ్‌ల నుంచి ఆదాయపు పన్ను శాఖ పన్ను వసూలు చేస్తోంది. వాటి సిబిల్ స్కోరు, ఆదాయ వ్యయాలపై పరిశీలన చేస్తుంది. ఈనాడు, ఈటీవీ, ఫిలిం సిటీ.. ఇలా అన్నీ కలిపి దాదాపు రూ.1,359 నష్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ సాంకేతిక నష్టాలని మార్గదర్శి చెబుతోంది. ఇంత జరిగినా ఆదాయ పన్ను శాఖ కనీసం హెచ్‌యూఎఫ్ వ్యాపారంపై స్టే కూడా కోరడం లేదు. టీడీఎస్ ప్రస్తావనే లేదు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఉన్న ప్రభుత్వాలకు మీడియా మాటున అక్రమాలు చెలాయిస్తున్న మార్గదర్శిపై ప్రత్యేక అభిమానం ఉంది’’అని ఉండవల్లి వాదించారు. ఈ కేసులో ఆర్బీఐని తాను ప్రతివాదిగా తొలుత చేర్చలేదని.. సుప్రీంకోర్టు ఎస్ఎల్పీ విచారణ చేస్తూ.. ఇది ఓ కుంభకోణంలా కనిపిస్తోందని, ఆర్బీఐని ప్రతివాదిగా చేర్చాలని స్పష్టం చేసిందని వివరించారు.‘‘అక్రమాలు, అవకతవకలు జరిగాయా? లేదా? చట్టప్రకారమే జరిగిందా? తేల్చాల్సింది ఆర్బీఐ కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి డిపాజిట్ల వసూలు అక్రమమేనని ఆర్బీఐ తేల్చింది’’అని ఉండవల్లి పేర్కొన్నారు. లూథ్రాను మందలించిన ధర్మాసనం ఉండవల్లి వాదనలు వినిపిస్తుండగా, మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పదేపదే అడ్డుపడ్డారు. సీనియర్ న్యాయవాది అయి ఉండి ఇలా కలుగజేసుకోవడం సరికాదని ఆయనను ధర్మాసనం మందలించింది. ఉండవల్లి వాదనలు ముగిసేవరకు ఆగాలని ఆదేశించింది. తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి వాదిస్తూ ఉండవల్లి వాదనలను తోసిపుచ్చారు. విచారణ చేశామని, ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాలేదని చెప్పారు. హెచ్‌యూఎఫ్ వ్యక్తి కాదని, విచారణ సాధ్యం కాదని మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది నాగముత్తు చెప్పారు. కర్త అక్రమాలకు హెచ్‌యూఎఫ్ సభ్యులు బాధ్యత వహించరని పేర్కొన్నారు. రామోజీ మరణం నేపథ్యంలో కేసు విచారణను ముగించాలని కోరుతూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. నాకు డబ్బులు చెల్లించలేదు... అందరి వాదనలు పూర్తయిన తరువాత లక్ష్మీనరసింహారావు అనే న్యాయవాది జోక్యం చేసుకున్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన డబ్బు తిరిగివ్వలేదని ఆర్బీఐకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనను కూడా ఈ పిటిషన్లలో ప్రతివాదిగా చేర్చుకుని, వాదనలు వినాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ, అప్పటికే తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించామని, వాదనలను లిఖితపూర్వకంగా అందజేయాలని ఆదేశించింది.బాధ్యత నుంచి పారిపోలేరు రామోజీరావు మరణించినా.. అక్రమాల కారణంగా లబ్ధి పొందినవారు ఉన్నారు. ఆ లబ్ధిని అనుభవిస్తూ మాకేం సంబంధం లేదని వారు తప్పించుకోలేరు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్‌ను ఉల్లంఘించారని ఆర్బీఐ స్పష్టంగా చెబుతోంది. తన కుటుంబ సభ్యుల కోసమే సేకరిస్తున్నా అన్నట్లు రామోజీరావు 22 మంది కుటుంబసభ్యుల పేర్లను కూడా హెచ్‌యూఎఫ్‌లో చేర్చారు. అలాంటప్పుడు వారు బాధ్యత నుంచి పారిపోలేరు.తండ్రి లోన్ తీసుకుని చనిపోతే కుటుంబం బాధ్యులు కారా? తండ్రి బ్యాంక్ లోన్ తీసుకుని మరణిస్తే.. కుటుంబసభ్యులను బాధ్యులను చేయరా? రామోజీ అక్రమాలకు కుటుంబసభ్యులు కచ్చితంగా బాధ్యులే. వారు శిక్ష అనుభవించాల్సిందే. కాదని.. ఇలానే ప్రోత్సహిస్తే.. దీన్ని అసరాగా తీసుకుని ఇలాంటి ఫైనాన్షియర్లు ఎన్నో పుట్టుకొస్తాయి. అప్పుడు ఈ దేశమే తీవ్ర ప్రమాదంలో పడిపోతుంది. భవిష్యత్‌లో ప్రజల డిపాజిట్లకు గ్యారెంటీ లేకుండా పోతుంది. – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ -
రూ.1,500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: రిజర్వ్‌బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయ పన్ను శాఖను కోరారు. ఇప్పటికే 16 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఈ విషయాన్ని సత్వరం పరిష్కరించి పెనాల్టీని వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను నిర్వహించిన హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్‌యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున దీనికి సంబంధించి గతంలో ఉమ్మడి హైకోర్టు విధించిన స్టే కూడా తొలగిపోయినట్లేనని స్పష్టం చేశారు. ఈమేరకు ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌కు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల రెండు వేర్వేరు లేఖలు రాశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అక్రమ డిపాజిట్ల ఉదంతాన్ని అందులో సవివరంగా ప్రస్తావించారు. అక్రమంగా డిపాజిట్లు వసూలు నిర్ధారించిన ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ పేరిట రామోజీరావు ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ తొలిసారి 2006లో ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. రిజర్వ్ బ్యాంకు చట్టం ప్రకారం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రెండు లక్షల మందికిపైగా డిపాజిటర్ల నుంచి అక్రమంగా రూ.2,600 కోట్లకుపైగా డిపాజిట్లు వసూలు చేసింది. ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్‌కుమార్ అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆర్బీఐలకు లేఖల ద్వారా తెలియచేశారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ కేసు నమోదు చేసింది. ఆర్బీఐ సెక్షన్ 45 ఎస్ నుంచి తమకు మినహాయింపు ఉందని రామోజీ అప్పట్లో అడ్డగోలుగా వాదించారు. అయితే ఆ వాదనను ఆర్బీఐ కొట్టిపారేసింది. 45 ఎస్ కింద రామోజీరావుకు మినహాయింపు వర్తించదని.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట వసూలు చేసినవి ముమ్మాటికీ అక్రమ డిపాజిట్లేనని స్పష్టం చేసింది. దాంతో విధి లేని పరిస్థితుల్లో రామోజీరావు తన మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను మూసివేస్తున్నామని.. సేకరించిన అక్రమ డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని ఆర్బీఐ, న్యాయస్థానాలకు విన్నవించారు.రూ.1,500 కోట్లు పెనాల్టీ విధించిన ఐటీ శాఖస్టే తెచ్చుకున్న రామోజీనిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల ద్వారా రామోజీ సముపార్జించిన అక్రమ ఆదాయంపై ఆదాయపన్ను శాఖ 2008లో రూ.1,500 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 271 డి ప్రకారం మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై రామోజీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే విధించి 16 ఏళ్లు దాటినప్పటికీ దాన్ని తొలగించేందుకు ఇప్పటికీ ఆదాయపన్ను శాఖ సరైన చర్యలు తీసుకోలేదు. దాంతో రూ.1,500 కోట్ల పెనాల్టీ చెల్లింపు అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. ‘మార్గదర్శి’పై చర్యలు తీసుకోవాల్సిందేనన్న ‘సుప్రీం’మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిటర్లకు డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించేసినందున ఇక ఎలాంటి చర్యలు అవసరం లేదని ఏపీ – తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందు రోజు అంటే 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఆ తీర్పును అప్పటి టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయకుండా రామోజీరావుకు సహకరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ డిపాజిట్లు ఎవరెవరికి తిరిగి చెల్లించారో వివరాలు వెల్లడించాలని.. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అనంతరం 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేసును తిరిగి విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టుకు సహకరించాలని ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సూచించింది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినా సరే... అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పెనాల్టీ వసూలుకు చర్యలు చేపట్టండిఈ పరిణామాల నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయపన్ను శాఖకు లేఖ రాశారు. హెచ్‌యూఎఫ్ కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున ఆ సంస్థపై ఐటీ శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించి గతంలో న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులు తొలగిపోయినట్లేనని వివరించారు. రామోజీరావు మరణించిన తరువాత ఆయన కుటుంబ సభ్యులను ఈ కేసు రికార్డుల్లో నమోదు చేయనందున గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు మనుగడలో లేనట్లుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. రామోజీ స్థానంలో తనను హెచ్‌యూఎఫ్ కర్తగా పరిగణించాలని ఆయన కుమారుడు సీహెచ్.కిరణ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టును కోరారు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించిన కేసులో మాత్రం రామోజీరావు వారసుల పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. కాబట్టి గతంలో ఆదాయ పన్ను శాఖ విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీపై న్యాయస్థానం ఇచ్చిన స్టే తొలగిపోయినట్లుగానే పరిగణించాలని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ నివేదించారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ న్యాయపరంగా అన్ని చర్యలూ చేపట్టాలని కోరారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై తానే ఫిర్యాదుదారుడిని కాబట్టి పెనాల్టీ అంశంపై ప్రస్తుత పరిస్థితిని తనకు వివరిస్తే అవసరమైతే తాను కూడా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.తొక్కిపెడుతున్న బాబు సర్కారుమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆర్బీఐ ఆధారాలతో సహా న్యాయస్థానానికి నివేదించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తొక్కిపెడుతూ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ కర్త రామోజీరావు మరణించినందున ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదంటూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఇటీవల తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఏకంగా న్యాయస్థానానికే సూచించింది. చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా?‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చే శారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ – మార్గదర్శినుద్దేశించి గతంలో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యడిపాజిట్ల సేకరణచట్ట విరుద్ధమే:ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలు దఫాలు న్యాయస్థానానికి నివేదించింది. ఇది సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆర్బీఐ తన కౌంటర్లో పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు ముందుంచింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి, రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో, తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గ దర్శి ఫైనాన్సియర్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్కి విరుద్ధమని పునరుద్ఘాటించింది. అంతేకాక ఇలా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. -
రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందే.. మార్గదర్శి కేసులో ఆర్బీఐ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి మధ్యంతర పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణలో ఏపీ ప్రభుత్వం , తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి, ఆర్బీఐ వాదనలు వినిపించాయి. విచారణ సందర్భంగా రామోజీ మృతి చెందారు.. విచారణ అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తెలంగాణ సర్కార్ సైతం దాదాపు ఇదే వాదనలు వినిపించింది.అదే సమయంలో మార్గదర్శి సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించింది. రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందేనని ఆర్బీఐ పట్టుబట్టింది. ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందేనని ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ మార్చి7కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. -
సీఐడీలో C అంటే చంద్రబాబేనా?
వ్యవస్థలను మ్యానేజ్ చేయడం.. అందులోని వాళ్ళను వివిధమార్గాల ద్వారా తన దారికి తెచ్చుకోవడం.. అవసరాన్ని బట్టి అవతలివారి అవసరాలు తీర్చడం,. వారిని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం.. ఇలాంటి జయప్రదంగా చేసిన రికార్డ్ చంద్రబాబుకు ఉంది. ఇందుకోసం అయన ఎన్ని మెట్లు కిందికి దిగిపోవడానికైనా వెనుకాడరు. తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఏ వ్యవస్థను అయినా భ్రష్టుపట్టించగలరు.. తన తన కాళ్లకిందకు తెచ్చుకోగలరు. తన చర్యలతో సదరు వ్యవస్థల గౌరవం.. ఔన్నత్యం ఎలా మంటగలిసిపోయినా చంద్రబాబు ఫర్వాలేదనుకుంటారు. తన ప్రయోజనాలే తనకు ముఖ్యం అనేది ఆయన పాలసీ. కేసులు దర్యాప్తు చేసే పోలీసు వ్యవస్థను సైతం నేరుగా వాడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.చంద్రబాబు(Chandrababu) గతంలో వ్యవస్థలను, ప్రభుత్వ పెద్దలను తనకు అనుకూలంగా మార్చుకుని వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంతలా ఇబ్బందులు పెట్టింది తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పుడూ కూడా అది నడిచింది. మరోవైపు.. చంద్రబాబు 2014-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డబ్బును ఏ విధంగా పక్కదారి పట్టించింది.. వేర్వేరు సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులను సొంత సంస్థలకు మళ్లించుకుని... ఆ డబ్బును తాను కాజేసిన అంశం గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైయస్ జగన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. స్కిల్ స్కాంకు సంబంధించిన అన్ని ఆధారాలూ అప్పటి ఏపీ సీఐడీ(AP CID) విభాగం చీఫ్ సునీల్ కుమార్ సారథ్యంలోనే దర్యాప్తు బృందాలు సేకరించి కోర్టుకు అందజేశాయి. దీంతో చంద్రబాబు అరెస్టై.. జైలు జీవితం గడిపారు. ఆపై బెయిల్ మీద కూడా వచ్చారు. ఐతే ప్రభుత్వం మారగానే చంద్రబాబు దర్యాప్తు సంస్థ మీద మీద కన్నేశారు. తనను ముప్పుతిప్పలు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిన సీఐడీనీ.. దాని అధికారులను టార్గెట్ చేసారు. ఐజీ సంజయ్, సునీల్ కుమార్ తదితరులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనబెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ స్కిల్ స్కామ్ కేసు సైతం లేకుండా చేసేందుకు సీఐడీలోని తన విధేయులైన అధికారులద్వారా కథ నడిపిస్తున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు విప్పని సీఐడీరాజగురు రుణం తీర్చుకుంటూ..ఇన్నాళ్లూ రాజకీయంగా తాను చేస్తూ వస్తున్నా అవినీతి.. అక్రమాలను కాపాడుతూ వస్తున్నా రాజగురు రామోజీరావు(Ramoji Rao)కు ఋణం తీర్చుకునేందుకు చంద్రబాబు నడుం బిగించారు. రామోజీకి చెందిన మార్గదర్శిపై రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా వేలాదికోట్ల డిపాజిట్లను సేకరించిన అభియోగం మీద కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రూ. 1,050 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించినట్లు సీఐడీ సైతం తెలంగాణ హైకోర్టుకు గతంలోనే ఆధారాలు అందించింది. ఈలోపు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్ళీ సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఇదీ చదవండి: మార్గదర్శిపై కేసు.. మా పొరపాటే!మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు(Margadasi Illegal Deposits) సేకరించినట్లు తాము ఆధారాలు సంపాదించలేకపోయామని, కొద్దోగొప్పో వివరాలు ఉన్నా.. వాటితో మార్గదర్శిని విచారించలేమని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. తాము ఇక కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని, కేసు కొట్టేసినా ఫర్వాలేదని సీఐడీ కోర్టుకు నివేదించింది. చంద్రబాబు పవర్లో ఉంటే కేసులు కూడా మాఫీ అయిపోతాయి. తమ అనుయాయులంతా పత్తిగింజలు అయిపోతారు.. తనకు రాజకీయంగా ఎదుగుదలకు ఎంతో వెన్నుదన్నుగా మారినవాళ్లను కాపాడేందుకు చంద్రబాబు మరోమారు సీఐడీని ఇలా దిగజార్చుతున్నారు.:::సిమ్మాదిరప్పన్న -
అంతా రామోజీ ఊహించినట్టే జరుగుతోందా?
ఇది ఊహించని పరిణామమే!. ఎంతటి బలాఢ్యుడైనా ఏదో ఒక రోజు తన తప్పునకు మూల్యం చెల్లించాల్సిందే. డిపాజిట్ల వ్యవహారంలో మార్గదర్శి సంస్థ ఇంతకాలం ఎంతగా బుకాయించినా చివరకు వాస్తవాన్ని పరోక్షంగానైనా అంగీకరించక తప్పలేదు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను మేనేజ్ చేసినా.. మార్గదర్శి అక్రమాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అండగా నిలిచినా చివరికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వాదనే సరైందని తేలింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమంగా రూ.2610 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ధారించింది. దీనితో ఇంతకాలం ఆ సంస్థ అసలు తప్పు చేయలేదని, తప్పు చేయదని, ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావుపైనే నిందలు మోపుతారా అని గుండెలు బాదుకుంటూ మాట్లాడిన వారికి జవాబు వచ్చినట్లయింది. కొద్ది రోజుల క్రితం లోక్ సభలో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసుపై చర్య తీసుకోవాలని YSRCP ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా టీడీపీ ఎంపీలు మార్గదర్శి అధికార ప్రతినిధుల్లా ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను వెనకేసుకొచ్చారు. అంతేకాదు.. సేకరించిన డిపాజిట్లను దాదాపు అందరికి తిరిగి చెల్లించిందని వాదించారు. మిథున్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారానికి ఈనాడు మీడియా ‘‘వార్త రాస్తే విషం చిమ్ముతారా’’ అంటూ టీడీపీ ఎంపీలు ధ్వజమెత్తారని ప్రముఖంగా ప్రచురించారు. నిజానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఆరోపణలు వస్తే ఈనాడు మీడియాను అడ్డం పెట్టుకుని దబాయించడమే తప్పు. పైగా.. ఈనాడేమో.. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులపై ఇష్టారీతిన అసత్యాలతో కథనాలు వండివార్చవచ్చు. ఈనాడు గ్రూపులోని సంస్థ అవకతవకలకు పాల్పడిందని కూడా ఎవరూ విమర్శించకూడదన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. మార్గదర్శి డిపాజిట్ల అక్రమ సేకరణపై ఇంతకాలం మీడియా బలంతో బుకాయించినప్పటికీ ఆర్బీఐ నివేదిక వచ్చాక టీడీపీ ఎంపీలు ఎందుకు సమాధానం ఇవ్వలేదో ఇప్పుడు చెప్పాలి. మార్గదర్శి చిట్స్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, డిపాజిట్ల సేకరణను రసీదుల రూపంలో కొనసాగించారని, చిట్స్‌లో వందల కోట్ల రూపాయల నల్లధనం ఉందని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ సాక్ష్యాధారాలతో సహా కేసు పెడితే, కూటమి ప్రభుత్వం రాగానే వాటన్నిటిని నీరుకార్చడం ఆరంభించింది. అందులో భాగంగా జప్తు అయిన వేయి కోట్ల మొత్తాన్ని కూడా విడుదల చేశారు. ఇదంతా చూస్తే.. పరస్పర రాజకీయ,వ్యాపార ప్రయోజనాల కోసం టీడీపీ ఈనాడు మీడియాను వాడుకున్నారని పలుమార్లు స్పష్టం అయింది. ఆర్బీఐ తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని స్పష్టం చేయడంతోపాటు ఈ సంస్థపై తమకు పలువురు ఫిర్యాదు చేశారని కూడా తెలిపింది. రామోజీరావు మరణించినప్పటికీ, ఆ కేసు మూతపడదని, విచారణ కొనసాగించాలన్నదే నిబంధన అని వివరించింది. మరి ఈనాడు మీడియా ఎందుకు దీన్ని ప్రజలకు తెలియజేయడం లేదు. ఆర్బీఐ కూడా తమపై విషం చిమ్ముతోందని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎందుకు చెప్పించలేకపోతోంది?. ఆర్బీఐకి ఈనాడు మీడియాకు ఏ శత్రుత్వం ఉందని ఆ నివేదిక ఇచ్చింది?. నిజానికి అఫిడవిట్ ఫైల్ చేయడం వీలైనంత ఆలస్యం చేసేందుకు ఈనాడు మీడియా తనకు ఉన్న పరపతిని వాడి ఉండవచ్చు. తెలంగాణ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చిన తరువాతే ఆర్బీఐ కూడా చట్టంలోని సెక్షన్ 45(ఎస్) గురించి వివరించాల్సి వచ్చింది. దాని ప్రకారం మార్గదర్శి చట్ట విరుద్ద చర్యలకు పాల్పడిందని తేలుతోంది. నేరం నిర్ధారణ అయితే సేకరించిన డిపాజిట్ల మొత్తానికి రెట్టింపు జరిమానా చెల్లించాలి. దీంతో మార్గదర్శి కొత్త వాదన తీసుకువచ్చింది. రామోజీరావు నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా అని అంటోంది. ఈ వాదన రామోజీ నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకరించడమే అని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రామోజీ తర్వాత హెచ్ యుఫ్ (అవిభాజ్య హిందూ కుటుంబ కర్త)గా ఆయన కుమారుడు కిరణ్ నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన బాధ్యత వహించాలా? లేదా? సంస్థ తరపున జరిమానా చెల్లించవలసిన బాధ్యత ఆయనపై ఉంటుందా? లేదా?అనేది చర్చనీయాంశం అయింది. ఇక్కడ ఇంకో సంగతి గుర్తు చేయాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన కుమారుడిపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి అక్రమ కేసులు పెట్టాయి. వైఎస్సార్ చనిపోయిన తరువాత ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. అప్పట్లో ఈనాడు మీడియా ఇది కరెక్టేనని ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం భిన్నంగా వాదిస్తోంది. రామోజీ లేరు కనుక, ఆయన కర్తగా ఉన్న సంస్థ ఆక్రమ డిపాజిట్లతో కొడుకుకు సంబంధం లేదంటోంది. కాని ఆ డిపాజిట్ల ద్వారా సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రం అనుభవించవచ్చట. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది ఒక సంస్థ అని, దాని కర్త మరణించినా, చట్టపరంగా సంస్థ బాధ్యత పోదని, వారసులు సైతం తీసుకోవల్సిందేనని చట్టం చెబుతోంది. రామోజీ ఆస్తులకు కిరణ్, ఇతర కుటుంబ సభ్యులు వారసులైనప్పుడు ఆయన చేసిన ఆర్థిక అక్రమాలకు వీరికి బాధ్యత ఉండదా? రామోజీరావు మరణించినందున ఈ కేసు విచారణ కొనసాగించాలా? లేదా? అనేది ఆలోచించాలని ఏపీ ప్రభుత్వం తరపున వేసిన అఫిడవిట్లో కోరారు. దానిని అంగీకరిస్తే ఈ కేసు నుంచి బయటపడవచ్చని ప్లాన్ చేశారు. కానీ.. ఆర్బీఐ ఇచ్చిన అఫిడవిట్ తో మార్గదర్శి సంస్థ పరిస్థితి కుడితిలో పడ్డయినట్లయిందని అంటున్నారు. అంతకుముందు అసలు డిపాజిట్ల వసూలులో తప్పు చేయలేదని కొంతకాలం, డిపాజిట్లు తీసుకున్నా తిరిగి చెల్లించేశామని మరికొంతకాలం చెప్పింది ఈనాడు. ఉండవల్లికి తెలియకుండానే ఉమ్మడి ఏపీ హైకోర్టులో కేసు కొట్టివేయించుకున్నారు. కానీ ఆరు నెలల తర్వాత ఆయనకు తెలిసి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ కేసు ఈ దశకు చేరింది. జగన్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయిందన్న కోపంతో ఈనాడు మీడియా పచ్చి అబద్ధాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసింది. ఉండవల్లికి డిపాజిట్ దారుల వివరాలు ఇవ్వకుండా అడ్డుపడడానికి పెద్ద, పెద్ద లాయర్లను నియోగించింది. మొత్తం మీద 18 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఒక రూపానికి వచ్చినట్లనిపిస్తుంది. ఆర్థికంగా ,రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంత శక్తిమంతుడైనా న్యాయ వ్యవస్థ కొంత గట్టిగా ఉంటే చట్టానికి ఎవరూ అతీతులుగా ఉండలేరని ఈ ఉదంతం రుజువు చేసింది. గతంలో సహారా డిపాజిట్ల కేసులో ఆ సంస్థ యజమానిని సుప్రీంకోర్టు జైలులో పెట్టింది. రామోజీరావు ఆ గండం నుంచి తప్పించుకున్నా.. ఆయన మరణం తర్వాత అయినా సత్యం బయటపడిందని అనుకోవాలి. అయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు, ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ అండతో ఈ కేసు ముందుకు సాగకుండా చేసే ప్రయత్నాలు జరగవచ్చన్న అభిప్రాయం లేకపోలేదు. కాగా ఉండవల్లికి డిపాజిటర్ల వివరాలు ఇవ్వక తప్పలేదు. వాటిని పరిశీలించిన తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావొచ్చు. రామోజీకి అసలు డిపాజిట్లు ఎలా వచ్చాయి? అందరి వివరాలు ఉన్నాయా? అందరికి తిరిగి చెల్లించారా? లేదా? ఆ మొత్తాలకు వడ్డీని కూడా చెల్లించారా? లేదా? ఇలాంటి విషయాలు అన్ని తేలితే అప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం. రామోజీరావు గతంలో ఒక మాట అనేవారు. ‘‘వయలేట్ ద లా లాఫుల్లీ’’ అని. చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని చట్టాన్ని ఉల్లంఘించవచ్చన్నది ఆయన ఫిలాసఫి. అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించకూడదన్న సిద్దాంతం కాదన్నమాట. ఆ క్రమంలో ఇలా ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోయే అవకాశం ఉందని ఈ అనుభవం చెబుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రామోజీ నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా?
సాక్షి, అమరావతి: చట్టవిరుద్ధంగా డిపాజిట్ల స్వీకరణ విషయంలో గత 18 సంవత్సరాలుగా న్యాయస్థానాల సాక్షిగా అడ్డగోలుగా అబద్ధాలు వల్లెవేస్తూ వచ్చిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ ఎట్టకేలకు న్యాయస్థానం ఎదుట నిజం అంగీకరించక తప్పలేదు. ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ముందుంచింది. తమ హెచ్‌యూఎఫ్ కర్త అయిన రామోజీరావు చేసిన డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుడిని (ప్రస్తుత కర్త) బాధ్యుడిని చేయరాదంటూ వాదిస్తోంది. తండ్రి చేసిన నేరానికి కుమారుడిని శిక్షిస్తారా? అంటూ ప్రశ్నిస్తోంది. ఒకవేళ తండ్రి నేరం చేసినా కుమారుడిని జైలుకు పంపించడం ఎంత వరకు సమంజసమని నిలదీస్తోంది. తద్వారా రామోజీరావు చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేశారన్న నిజాన్ని హైకోర్టు ముందు పరోక్షంగా అంగీకరించినట్లయింది. రామోజీరావు మరణాన్ని అడ్డుపెట్టుకుని ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌తో పాటు రామోజీ స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే డిపాజిట్ల స్వీకరణ విషయంలో రామోజీ చేసిన నేరానికి తమను బాధ్యులుగా చేయడం తగదంటూ గట్టిగా వాదిస్తున్నారు. తండ్రి చేసిన నేరానికి కుమారుడిని బాధ్యుడిగా చేయరాదంటూ ‘వైకేరియస్ లయబిలిటీ’ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ పాల్పడిన అక్రమాలు, అవకతవకలకు దాని కర్త అయిన రామోజీరావు మాత్రమే బాధ్యుడవుతారని చెప్పడం ద్వారా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక కొత్త కర్త (కిరణ్) నియామకంతో మార్గదర్శి హెచ్‌యూఎఫ్ పునరుద్ధరించినట్లయిందని, అందువల్ల తమను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదంటూ కొత్త వాదనను కూడా తెరపైకి తెచ్చింది. అయితే హైకోర్టు మాత్రం మార్గదర్శి వాదనకు భిన్నంగా స్పందించింది. చట్టవిరుద్ధ పనులకు బాధ్యత వహించాల్సిందే కదా..! (సివిల్ లయబిలిటీ) అని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి తేల్చి చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇదే సమయంలో రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ బాధ్యత వహించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదురోవాల్సిందేనంటూ రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించింది. రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇన్నేళ్లుగా కోర్టుల ముందు చెబుతూ వస్తున్నవన్నీ అసత్యాలు, అవాస్తవాలేనని కూడా హైకోర్టుకు వివరించింది.విచారణ 28కి వాయిదా...సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ పి.శ్యామ్‌కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శి హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినందున ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లవని నివేదించారు. ఆర్బీఐ చట్ట నిబంధనలను రామోజీరావు ఉల్లంఘించారంటూ మార్గదర్శి హెచ్‌యూఎఫ్ ప్రస్తుత కర్త అయిన రామోజీరావు కుమారుడు కిరణ్‌ను ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. తండ్రి నేరం చేసినా కుమారుడిని జైలుకు పంపించడం సమంజసం కాదని పదేపదే ధర్మాసనానికి నివేదించారు. చట్టప్రకారం కిరణ్, ఇతర కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ సాధ్యం కాదని పేర్కొన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే అవకతవకలకు బాధ్యుడవుతాడని, ఇతర కుటుంబ సభ్యులకు వాటితో సంబంధం ఉండదంటూ గంటకు పైగా సాగిన వాదనల్లో ఆయన హైకోర్టుకు నివేదించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో అది చేసిన తప్పులకు బాధ్యత వహించాలి కదా? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు సమయం పూర్తి కావడంతో తదుపరి విచారణ తొలుత 21కి వాయిదా పడింది. తర్వాత మార్గదర్శి తరఫు మరో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యక్తిగత కారణాలతో 21న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని, మరో తేదీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. -
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే
సాక్షి, అమరావతి: మార్గదర్శి(Margadarshi) ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు(Ramoji Rao)ల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) (ఆర్బీఐ) పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ముందుంచింది. తాము వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో ఏ ఒక్క డిపాజిటర్ కూడా తమపై ఫిర్యాదు చేయలేదంటూ ఇన్నేళ్లుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు చెబుతూ వచ్చిన దాంట్లో వాస్తవం లేదని ఆర్బీఐ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది.డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి, రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో, తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్కి విరుద్ధమని పునరుద్ఘాటించింది.అంతేకాక ఇలా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కాబట్టి రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. పలు చట్టాల కింద హెచ్యూఎఫ్ను ప్రత్యేక న్యాయపరమైన సంస్థగా, చట్టపరమైన వ్యక్తిగా గుర్తించడం జరిగిందని వెల్లడించింది. హెచ్‌యూఎఫ్ అనేది చట్టం సృష్టించిన ఓ జీవి అని పేర్కొంది. హెచ్‌యూఎఫ్ కర్త అనేది.. దాని సభ్యుల నుంచి భిన్నమైన, చట్టపర ప్రత్యేక సంస్థ అని తేల్చి చెప్పింది. అందువల్ల మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందేనని ఖరాకండిగా చెప్పింది.⇒ డిపాజిట్ల వసూలుకు ఎన్నడూ అనుమతించలేదు..కర్త రామోజీరావు మరణించినంత మాత్రాన మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తనపై మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నట్లు తెలిపింది. ఆ ఆరోపణలన్నీ తప్పుడు, అసత్య, తప్పుదోవ పట్టించేవేనని స్పష్టం చేసింది. మార్గదర్శి హెచ్‌యూఎఫ్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి వస్తుందని మొదటి నుంచీ తాము చెబుతూ వస్తున్నామంది. చట్ట ఉల్లంఘనల గురించి, సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుందన్న వాస్తవాన్ని ఎప్పటికప్పుడు మార్గదర్శి దృష్టికి తెస్తూనే ఉన్నామని తెలిపింది.డిపాజిట్ల స్వీకరణకు అనుమతినిస్తూ తాము సర్టిఫికెట్ జారీ చేశామన్న మార్గదర్శి వాదన శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పింది. డిపాజిట్ల వసూలుకు తాము ఎన్నడూ మార్గదర్శికి అనుమతినివ్వలేదని స్పష్టం చేసింది. రామోజీ మరణించిన నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును ఆర్బీఐ అభ్యర్థించింది. అంతేకాక నాంపల్లి కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సైతం కొట్టేయాలని హైకోర్టును కోరింది. ఈ మేరకు ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. -
కాలయాపన సరికాదు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్సియర్స్ భారీ ఆర్థిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయడంలో కాలయాపన సరికాదని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అందరి వాదనలు విని వీలైనంత త్వరగా తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు(Supreme Court) సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. అదనపు కౌంటర్ అఫిడవిట్(Counter Affidavit) దాఖలుకు రెండు వారాలు గడువు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోరడం సరికాదంది. అంత సమయం ఇవ్వలేమని, వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇకపై ప్రతి శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తను పేరును కాజ్ లిస్టులో చేర్చాలని అక్టోబర్‌లో రిజిస్ట్రీని ఆదేశించినా అది అమలు కావడం లేదని కోర్టు సహాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్(Undavalli Arunkumar) ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో మరోసారి ధర్మాసనం రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఆ తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వర్చువల్‌గా.. ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు నేరుగా విచారణకు హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు కావాలని ఆర్బీఐ కోరిందని ఎల్.రవిచందర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అంత గడువు ఇవ్వలేమని, వారంలో దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ 14కు వాయిదా వేసింది. విచారణ 18 సార్లు వాయిదా సుప్రీంకోర్టు ఆదేశాలతో గత జూన్ 25న తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. తొలుత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా వాదనలు వినిపించాలని, వాయిదాలు కోరవద్దని పలుమార్లు ధర్మాసనం న్యాయవాదులకు సూచించింది. అయినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయడంతో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. ఎట్టకేలకు గత నెలలో కౌంటర్లు దాఖలు చేశాయి. ఇదే క్రమంలో తీరా వాదనలు ప్రారంభమయ్యే సమయంలో రామోజీరావు మరణించినందున కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి అఫిడవిట్ వేసింది. దీనిపై కూడా వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ సుజోయ్‌పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల్లో ఉండటంతో విచారణ జస్టిస్ శ్యామ్‌కోషి ధర్మాసనానికి బదిలీ అయ్యింది. జనవరి 31న కేసు లిస్టయినా.. విచారణ నుంచి జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు తప్పుకుంటున్నారు. శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆర్బీఐ అదనపు కౌంటర్ దాఖలుకు సమయం కోరడంతో వాయిదా పడింది. ఇలా దాదాపు ఏడున్నర నెలల్లో ఇప్పటి వరకు 18 సార్లు విచారణ వాయిదా పడింది. -
రామోజీరావు పట్ల మరోసారి భక్తి చాటుకున్న చంద్రబాబు
-
రామోజీపై ‘రాజ’భక్తి!
సాక్షి, అమరావతి: తన రాజగురువు రామోజీరావు పట్ల టీడీపీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మరోసారి భక్తిని చాటుకున్నారు. సాక్షాత్తూ సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకుని.. మార్గదర్శి, రామోజీ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అనే అంశాన్ని తేల్చాలని హైకోర్టును ఆదేశించగా.. చంద్రబాబు సర్కార్ దాన్ని పూర్తిగా విస్మరిస్తూ అక్రమాలకు పాల్పడ్డ రామోజీ కుటుంబాన్ని రక్షించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా వసూలు చేసిన రూ.2,610 కోట్ల డిపాజిట్లు గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఆ అక్రమ డిపాజిట్ల గురించి వాస్తవాలను కోర్టుకు వెల్లడిస్తే మార్గదర్శి(Margadarsi), రామోజీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవని గుర్తించడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయం జోలికే వెళ్లలేదు. పైగా ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన రూ.వేల కోట్లను తిరిగి వారికి చెల్లించేశామని, అందువల్ల తమను వదిలేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు(Ramoji Rao) ఇన్నేళ్లుగా కోర్టుల్లో చేస్తూ వస్తున్న వాదననే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సైతం అందుకుంది. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తంలో రూ.5.15 కోట్లు మినహా అత్యధిక భాగాన్ని తిరిగి చెల్లించేసిందని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. రూ.5.15 కోట్ల డబ్బు 1,270 మంది డిపాజిటర్లకు సంబంధించిందని, అయితే వారెవరూ ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడం లేదని ఏపీ ప్రభుత్వం తన కౌంటర్ ద్వారా హైకోర్టుకు తెలిపింది. ఎస్క్రో ఖాతాలో ఉన్న ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు గానీ ఆర్బీఐకి గానీ బదలాయించాలంటూ వింత అభ్యర్థనను హైకోర్టు ముందుంచింది. ఎవరైనా డిపాజిటర్లు వస్తే వారికి ఆ మొత్తాలను తామే చెల్లిస్తామని ప్రతిపాదించింది. తద్వారా అక్రమ డిపాజిట్ల వ్యవహారం నుంచి రామోజీ కుటుంబాన్ని బయటపడేసేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు యత్నించింది. రామోజీరావు గత ఏడాది జూన్ 8న చనిపోయారంటూ ఆయన మరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అసలు మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందా? అన్న దానిపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో హైకోర్టుని కోరింది. దాటవేత ధోరణే... రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో పూర్తి దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ఈ కౌంటర్లో ఎక్కడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45ఎస్‌ను మార్గదర్శి, రామోజీరావు ఉల్లంఘించిన విషయం గురించి ప్రస్తావించనే లేదు. చట్ట విరుద్ధంగా రూ.వేల కోట్లను ప్రజల నుంచి డిపాజిట్లు రూపంలో మార్గదర్శి వసూలు చేసిందని స్వయంగా రిజర్వ్ బ్యాంకే చెప్పినా చంద్రబాబు సర్కారు ఆ అంశం జోలికి వెళ్లలేదు. డిపాజిట్లను వెనక్కి ఇచ్చేసిందని మాత్రమే చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో ఎవరు ఫిర్యాదు చేశారు? ఆ తరువాత కోర్టుల్లో ఏమైంది? తిరిగి తెలంగాణ హైకోర్టు ఎందుకు విచారణ జరుపుతోంది? లాంటి అందరికీ తెలిసిన విషయాలనే కౌంటర్లో పొందుపరిచింది. అంతేకాక రామోజీ, మార్గదర్శి ఆర్థిక అవకతకవలపై అ«దీకృత అధికారిగా వ్యవహరిస్తున్న కృష్ణరాజు విచారణ జరపవచ్చో లేదో తేల్చాలని హైకోర్టును కోరింది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిన అవసరంపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో కోరింది. చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయండి... ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్కి విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినట్లు రుజువులు కూడా ఉండటం, విచారణ జరిగితే శిక్ష, భారీ జరిమానా ఖాయం కావడంతో రామోజీ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఈ గండం నుంచి బయటపడాలని మార్గదర్శి ప్రస్తుత యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం చేత తమకు కావాల్సిన విధంగా కౌంటర్ దాఖలు చేయించింది. రామోజీ మరణించారని ఏపీ ప్రభుత్వం చేత ప్రత్యేకంగా చెప్పించడమే కాకుండా ఇక ఈ కేసు విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదన్న రీతిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెద్దలు కౌంటర్లో రాయించారు. మరోవైపు మార్గదర్శి ఫైనానియర్స్ యాజమాన్యం కూడా ఇదే వాదనతో హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రామోజీ మరణంతో ఇక ఈ కేసులో విచారించడానికి ఏమీ లేదని అందులో పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరపడం నిష్ప్రయోజనమని పేర్కొంది. పూర్తిస్థాయి వాదనలకు ముందే ఈ విషయాన్ని తేల్చాలని తెలంగాణ హైకోర్టును కోరింది. హెచ్‌యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీ మరణించడంతో ఆ హెచ్‌యూఎఫ్‌లో సభ్యులుగా ఉన్న వారికి నేరాన్ని ఆపాదించడాన్ని వీల్లేదని నివేదించింది. వసూలు చేశాం... వెనక్కి ఇచ్చేశాం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా తాము ప్రజల నుంచి రూ.2,596.98 కోట్లు అక్రమంగా వసూలు చేసిన మాట వాస్తవమేనని మార్గదర్శి ఫైనాన్షియర్స్ హైకోర్టు ముందు అంగీకరించింది. వసూలు చేసిన డిపాజిట్లలో అత్యధిక మొత్తాన్ని తిరిగి చెల్లించేశామని, మిగిలి ఉన్న మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో ఉంచామంది. ఈమేరకు ఆర్బీఐ కౌంటర్‌కు మార్గదర్శి ఫైనాన్షియర్స్ తిరుగు సమాధానం ఇచి్చంది. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నర్సింగ్‌రావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక అవకతవకలకు సంబంధించి జరుగుతున్న విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ నర్సింగ్‌రావు తప్పుకున్నారు. గతంలో తాను మార్గదర్శి తరఫున దాఖలైన కేసుల్లో న్యాయవాదిగా ఉన్నానని, అందువల్ల ఈ వ్యాజ్యంపై విచారణ జరపలేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాజ్యాలను తగిన ధర్మాసనం ముందుంచేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందుంచాలని జస్టిస్ శ్యాంకోషి, జస్టిస్ నర్సింగరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ తేదీని, విచారణ ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూద్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు విచారణకు హాజరయ్యారు. రామోజీ మరణించిన నేపథ్యంలో ఈ కేసును కొట్టేయాలని, దీనిపై అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ముకుల్ రోహత్గీ చేసిన ఈ అభ్యర్థన పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారీ ఆరి్థక నేరానికి పాల్పడిన వ్యక్తి చనిపోయినంత మాత్రాన అతను నేరం చేయనట్లుగా భావించాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ కౌంటర్ దాఖలు చేయగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఐడీ, ఆర్థిక నేరాల విభాగం ఎస్పీ కొల్లి వెంకట లక్ష్మీ కౌంటర్ దాఖలు చేశారు. బాబు బాటలోనే రేవంత్...ప్రజల నుంచి మార్గదర్శి చట్టవిరుద్ధంగా రూ.2,610 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో రేవంత్‌రెడ్డి సర్కార్ సైతం చంద్రబాబు బాటనే ఎంచుకుంది. రామోజీరావు, మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి తెలంగాణ ప్రభుత్వం కూడా నోరు మెదప లేదు. రూ.2610 కోట్లను మార్గదర్శి వసూలు చేయడం చట్ట విరుద్ధమా? కాదా? అన్న విషయం గురించి కనీస స్థాయిలో కూడా మాట్లాడలేదు. చట్టవిరుద్ధ డిపాజిట్ల గురించి మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమానికి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కలగకుండా అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చాలా లౌక్యంగా, వాస్తవాల జోలికి వెళ్లకుండా కౌంటర్లు దాఖలు చేశాయి. అందరికీ తెలిసిన, కోర్టుల్లో ఇప్పటి వరకు జరిగిన విషయాలనే తెలంగాణ ప్రభుత్వం తన కౌంటర్లో వివరించింది. వాస్తవానికి మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో అ«దీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు ఎందుకు దాఖలు చేశారు? మార్గదర్శి, రామోజీపై ఉన్న ఆరోపణలు ఏంటి? ఆర్బీఐ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది? తదితర వివరాలను తమ కౌంటర్లలో పూర్తిస్థాయిలో పొందుపరిచే అవకాశం ఉన్నప్పటికీ గురుశిష్యుల ప్రభుత్వాలు రామోజీపై తమ భక్తిని చాటుకుంటూ కౌంటర్లు దాఖలు చేశాయి. ‘‘45 ఎస్’’ ఏం చెబుతోందంటే..?నిర్దిష్ట వ్యక్తులు, సంస్థలు, ఇన్కార్పొరేటెడ్ సంఘాలు తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 45 ఎస్ నిషేధిస్తుంది. -
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్‌లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్‌లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్‌గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్‌లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్‌ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘సుప్రీం’ కేసులో ఇంత నిర్లక్ష్యమా..? ‘మార్గదర్శి’పై మరెన్నాళ్లు?
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక అవకతవకలపై ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారు? స్వయంగా సుప్రీం కోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశాం. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పండి. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందే. ఇదే చివరి అవకాశం. లేకపోతే తదుపరి విచారణకు ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది.– ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం⇒ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. ⇒ 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషేధం. ⇒ అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. ⇒ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ⇒ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది. సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ ఆర్ధిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారని ఇరు ప్రభుత్వాలను నిలదీసింది. స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశామని గుర్తు చేసింది. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. లేని పక్షంలో తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మూడు వారాల గడువునిచ్చింది. అంతేకాక రిప్లై కాపీని మాజీ ఎంపీ, కోర్టు సహాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందచేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త చెరుకూరి కిరణ్‌లను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుప్రీం’ ఆదేశాలతో హైకోర్టు విచారణ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. అదే విధంగా హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, రిజర్వ్ బ్యాంక్, ఏపీ సర్కార్‌తో సహా అందరి వాదనలు వినాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతేడాది నవంబర్ 7న విచారణ సందర్భంగా మార్గదర్శి ఆర్థిక అవకతవకలపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. అయితే ఇరు ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదు. తాజాగా ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ్ రవిచందర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (ఎస్‌జీపీ) బి.రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. 6వ తేదీ కల్లా ఉండవల్లికి ఆ కాపీలు ఇవ్వండి.. ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ స్పందిస్తూ 200కిపైగా పేజీలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్, చెరుకూరి కిరణ్ గత నెల 19న రిప్లై దాఖలు చేశారని, దీనిపై తాము పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని నివేదించారు. ఇందుకు మూడు వారాల గడువునివ్వాలని కోరారు. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన రిప్లై కాపీని తనకు ఇవ్వలేదని ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఈ నెల 6వ తేదీలోపు ఆ రిప్లై కాపీని ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఇలాగేనా అమలు చేసేది? విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారని నిలదీసింది. సుప్రీంకోర్టు పంపిన వ్యాజ్యాల్లోనూ ఇలా చేస్తే ఎలా? అంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేది ఇలాగేనా? అని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్‌కి మూడు వారాల గడువునిచ్చేందుకు ఇరుపక్షాలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ధర్మాసనం ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది. ఈ సమయంలో మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అడ్డుకుని మాట్లాడటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అనంతరం విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలు విషయంలో తమ ఆదేశాల అమలు నిమిత్తం ఉత్తర్వుల కాపీని అడ్వొకేట్ జనరల్ కార్యాలయానికి సోమవారంలోగా పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.రూ.వేల కోట్లు కొల్లగొట్టిన మార్గదర్శి ఫైనాన్షియర్స్రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడాన్ని అది నిషేధించింది. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి సేకరించిన డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.అక్రమాలను నిర్ధారించిన రంగాచారిమార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలు, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో 800 జీవో జారీ అయింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజు జీవో 800 వెలువడింది. దీంతో తమ అక్రమాలు బయటపడటం ఖాయమని పసిగట్టిన మార్గదర్శి, రామోజీరావులు.. రంగాచారి, కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ సుదీర్ఘ కాలం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ క్రమంలో తాము కోరిన వివరాలు మార్గదర్శి ఇవ్వకపోవడంతో రంగాచారి ఆదాయ పన్ను శాఖ నుంచి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి పరిశీలించారు. 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణ ద్వారా తేల్చారు.అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టుచట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు హైకోర్టు 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టుఈ తీర్పుపై అటు ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. అటు తరువాత ఈ వ్యాజ్యాల్లో ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా గతేడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇదే సమయంలో డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది. -
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు.. 18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అ«దీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది.వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచి్చంది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆరి్థక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అ«దీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచి్చంది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచి్చన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చి0ది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచి్చన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమరి్థంచారు. హెచ్‌యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చి0ది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చి0ది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచి్చన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అదీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! సాక్షి, అమరావతి: ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది. వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అదీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచ్చిన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమర్ధించారు. హెచ్‌యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అదీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
బయటపడ్డ చంద్రబాబు మరో నిర్వాకం..
-
విస్తుపోయేలా బాబు సర్కార్ నిర్వాకం.. రామోజీ సంస్మరణ సభ ఖర్చు ఎంతంటే?
సాక్షి, విజయవాడ: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని పణంగా పెట్టింది. ఏకంగా రూ.4.28 కోట్లు ఖర్చు చేసింది. జూన్ 27న విజయవాడలో రామోజీ సంస్మరణ సభను చంద్రబాబు సర్కార్ నిర్వహించింది.అయితే, సభను నిర్వహణ ఖర్చు 4.28 కోట్లు రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో రామోజీ సంస్మరణ సభకు అంత భారీగా ఖర్చు చేశారా అంటూ ప్రభుత్వ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఒక వ్యాపార వేత్త సంస్మరణ సభకు రూ.4 కోట్లుపైగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై చర్చ కూడా జరుగుతోంది.ఇదీ చదవండి: ఇది సరైన సందేశమేనా? -
రామోజీ రావు ఎదుగుదల ఆ ఒక్క అడుగుతో మొదలైంది
-
ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకో: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: రామోజీరావుకు క్లీన్చిట్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రామోజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రామోజీరావు సంస్థలను చంద్రబాబు కాపాడుతున్నారన్నారు.రామోజీ ఆర్థిక నేరస్థుడు..‘‘డీబీటీ పథకాలన్నీ చంద్రబాబు పక్కనపెట్టారు. దాచుకో.. దాచుకో.. తినుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మార్గదర్శి ఫండ్స్‌ను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారు. చిట్స్ వసూలు చేసి మిగతా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. రామోజీ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. చట్ట వ్యతిరేకంగా రామోజీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. రామోజీ ఆర్థిక నేరస్థుడు. రామోజీ పెట్టుబడులన్నీ అక్రమంగా నిర్వహించినవే. చిట్స్ కేసు కొట్టేస్తే పత్రికల్లో వార్త రాకుండా జాగ్రత్తపడ్డారు. అర్ధాంతరంగా కేసును సీఐడీ విత్ డ్రా చేసుకోవడం దారుణం. దీనిపై ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఉండవల్లి ఈ కేసును బతికించారు’’ అని అంబటి చెప్పారు.అసలు మార్గదర్శి చట్టపరంగా నడుస్తోందా? ‘‘మార్గదర్శికి సహాయం చేయాలనే దురుద్దేశంతో చంద్రబాబు ఇటువంటి పనులకు పాల్పడ్డారు. రామోజీరావు కుటుంబం చట్టాలను ఉల్లంఘించింది. రామోజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. మార్గదర్శి మీద అనేక కోర్టుల్లో విచారణ జరుగుతోంది. కానీ ఈ కేసులను ప్రభుత్వం విత్ డ్రా చేసకోవటం చాలా అన్యాయం. ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకో. కోర్టులతో పనిలేకుండా ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇస్తోంది. మార్గదర్శి అంటే వైఎస్సార్, జగన్‌కు కోపం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మార్గదర్శిలోని లోపాల గురించి మాట్లాడటం లేదు. అసలు మార్గదర్శి చట్టపరంగా నడుస్తోందా? లేదా? అనేదే చూడాలి. ఒక చిట్ వేసేటప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక ఎకౌంట్ ఓపెన్ చేయాలి. ఇలా ఎన్ని చిట్లు వేస్తే అన్ని ఖాతాలు తెరవాలి. కానీ మార్గదర్శి కేసులో ఒకే ఖాతాలో ఎమౌంట్ వేశారు’’ అని అంబటి రాంబాబు వివరించారు. సీఐడీ విత్ డ్రా.. దీని వెనుక కుట్ర ‘‘ఆ డబ్బుని ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టారు. ప్రజల సొమ్ముతో పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నారు. సీఐడీ దీన్ని గుర్తించి రామోజీరావుని కూడా విచారించింది. ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ, పీవి నరసింహారావు కూడా కోర్టులో నిలబడ్డారు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్. 2006లోనే మార్గదర్శి ఫైనాన్షియల్ అక్రమాలను ఆర్బీఐ గుర్తించింది. ఆ తర్వాతే కేసు నమోదు చేశారు. రాష్ట్రం విడిపోయే ముందు రోజు ఎవరికీ తెలియకుండా కోర్టు కొట్టేసింది. ఆనాడు ఏ పత్రికా ఆ వార్త రాయలేదు. ఇవాళ కూడా సీఐడీ విత్‌డ్రా చేసుకున్న సంగతిని కూడా ఏ పత్రిక రాయలేదు. అంటే దీని వెనుక కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. మార్గదర్శిలో డిపాజిట్లు కూడా ఎవరూ వేయకపోవటంతో దివాళా దశగా ఆ సంస్థ నడుస్తోంది. ప్రభుత్వం కేసు విత్‌డ్రా చేసుకున్నా కేసు ఎక్కడకూ పోదు. గతంలో ఇలాగే చేసినా ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లి కేసును బతికించారు. రామోజీ, చంద్రబాబులకు వ్యవస్థలను మేనేజ్ చేయటం అలవాటు.’’ అని అంబటి దుయ్యబట్టారు.చంద్రబాబు జీవితమంతా కొనుగోలు, అమ్మకాలే..‘‘నీతి, నిజాయితీ గలవారే రాజకీయాలు చేయగలరు. చంద్రబాబు జీవితమంతా కొనుగోలు, అమ్మకాలే. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్కడివారు గట్టిగా నిలబడ్డారు. ఎంపీటీసి, జడ్పీటీసీలను చూసైనా ఈ ఎంపీలు బుద్ది తెచ్చుకోవాలి. ఎంతమంది వెళ్లినా వైసీపికి 40 శాతం ఓటర్లు ఉన్నారని గుర్తించాలి. చంద్రబాబు, ఎల్లోమీడియా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి ని టార్గెట్ చేశారు. అసలు సజ్జలకు ఈ కేసుతో ఏం సంబంధం ఉంది?. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా ఈ కేసుతో చంద్రబాబు హడావుడి ఉంది. అదంతా త్వరలోనే భూమ్ రాంగ్ అవుతుంది. జెత్వాని వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. చంద్రబాబు స్కాం చేసినందున అరెస్టు అయ్యాడు. ఆయన్ని అరెస్టు చేశారని కక్ష కట్టి ఐపీఎస్‌ల మీద పగ సాధిస్తున్నారు. బాలకృష్ణ కాల్పుల కేసును కూడా బయటకు తీస్తారేమో చూడాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
రామోజీ కుటుంబానికి బాబు రిటర్న్ గిఫ్ట్.. బయటపడ్డ అసలు నిజం
-
ఈనాడుకు బాబు గిఫ్ట్
పరస్పర ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికి గానూ బాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. మార్గదర్శి విషయంలో అక్రమాలు జరిగినట్లు సీఐడీ గతంలో పక్కా ఆధారాలతో చార్జిషిట్లు వేసింది.దీంతో తేడా వస్తే తమ ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు మార్గదర్శి వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. సాక్షి, అమరావతి: ‘కుమ్మక్కు బంధం’ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతటి విఘాతమో మరోసారి తేటతెల్లమైంది. పరస్పర ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ సర్కారుపై ఐదేళ్ల పాటు దుష్ప్రచారం చేసిన రామోజీ కుటుంబానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృతజ్ఞతాపూర్వకంగా ‘కానుక’ సమర్పించింది. అదీ రాష్ట్రంలో వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలను కాలరాసి మరీ!! మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఆంధ్రప్రదేశ్ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 వర్తించదంటూ ప్రత్యేక కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తుల జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఉపసంహరింప చేశారు. ఈమేరకు సీఐడీ అదనపు డీజీ గురువారం హైకోర్టుకు నివేదించారు. దీంతో అప్పీళ్ల ఉపసంహరణకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ వ్యాజ్యాలు తాజాగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. సీఐడీ కేసులన్నింటినీ తనకు అప్పగిస్తూ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ (ఈ అప్పీళ్లలో శైలజా కిరణ్ తరఫున వాదనలు వినిపించారు) ప్రొసీడింగ్స్ ఇచ్చారని నివేదించారు. అందువల్ల సీఐడీ తరఫున తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ అప్పీళ్లను ఉపసంహరించుకోవాలంటూ సీఐడీ అదనపు డీజీ లేఖ రాశారన్నారు. దీంతో తాము తమ అప్పీళ్లను ఉపసంహరించుకుంటున్నట్లు అదనపు డీజీ రాసిన లేఖను కోర్టుకు సమర్పించారు. ఆ లేఖను పరిశీలించిన న్యాయస్థానం పీపీ లక్ష్మీనారాయణ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని నమోదు చేసింది. అప్పీళ్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో వాటిని పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి అనంతరం ఉత్తర్వులు జారీ చేశారు. చిట్స్ రిజిస్ట్రార్ల ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ.. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిష్ట్రార్లు గతంలో సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. గడువు ముగిసినా, ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా ఫిర్యాదు చేశారు. పకడ్బందీ ఆధారాలతో చార్జిషీట్లు... మార్గదర్శి చిట్‌ఫండ్స్ అవకతవకలపై పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించిన సీఐడీ ప్రత్యేక కోర్టుల్లో చార్జిషిట్లు దాఖలు చేసింది. ఇదే సమయంలో ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖరారు చేయాలని కోరుతూ సీఐడీ పిటిషన్లు దాఖలు చేసింది. అయితే సీఐడీ దాఖలు చేసిన చార్జిషిట్లను పరిశీలించిన గుంటూరు, విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. ఆస్తుల జప్తు ఖరారు కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గుంటూరు కోర్టు కొట్టివేసింది. మార్గదర్శి, శైలజా కిరణ్ వాదనలను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీఈ అప్పీళ్లపై హైకోర్టు గత ఏడాది డిసెంబర్ నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ఈ అప్పీళ్ల విచారణార్హతపై రామోజీ, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ తరఫున నాడు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం చెప్పారు. మొదట విచారణార్హతపై తేల్చాలని పట్టుబట్టారు. దీనిపై సీఐడీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమ అప్పీళ్ల విచారణార్హతపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ రూపంలో తెలియచేయాలే తప్ప మౌఖికంగా కాదంది. అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ దాఖలు చేసినప్పుడే అందుకు తగిన సమాధానం ఇచ్చేందుకు తమ అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో మార్గదర్శి, శైలజా కిరణ్ తదితరులు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో జప్తు ఆస్తుల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగిస్తామని మార్గదర్శి తరఫున న్యాయవాది పోసాని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు తరువాత ఈ అప్పీళ్లపై ఇప్పటిదాకా విచారణ జరుగుతూ వస్తోంది.అప్పీళ్ల ఉపసంహరణతో జరిగేదిది..తాజాగా అప్పీళ్లను సీఐడీ ఉపసంహరించుకోవడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు భారీ ఊరట లభించినట్లయింది. తద్వారా నామమాత్రమైన ఐపీసీ సెక్షన్ల కింద విచారణకు ఆస్కారం ఉంటుంది. దీని వల్ల మార్గదర్శి యాజమాన్యానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిగి మార్గదర్శి డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలే పరిస్థితి ఉంటే దాని యాజమాన్యానికి, మేనేజర్లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, అలాగే ఆ సంస్థకు రూ 5 లక్షల జరిమానా విధించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మార్గదర్శి, దాని యాజమాన్యం బయటపడినట్లే. అదే రీతిలో రూ.1050 కోట్ల ఆస్తుల జప్తు కూడా ఉండదు. ఎందుకంటే ఆ జప్తును ఖరారు చేసేందుకు గుంటూరు కోర్టు తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఇలా ఈ మొత్తం కేసును నీరుగార్చి దాన్ని కొట్టేసేందుకు సీఐడీ ఆస్కారం కలిగించింది.భారీ గురు దక్షిణ..వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికిగానూ చంద్రబాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను, కీలక ప్రాజెక్టులను అటకెక్కించేసిన సీఎం చంద్రబాబు.. రామోజీ కుటుంబం కోసం మాత్రం రంగంలోకి దిగారు. సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ జరిపి కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ మాదిరిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా ఇరుక్కుపోవడం ఖాయమని పసిగట్టి ఆ పరిస్థితి తలెత్తకుండా సీఐడీని రంగంలోకి దించి అనుకున్న విధంగా పనికానిచ్చేశారు. అంతేకాదు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్ధిక మోసాలపై ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న కేసులను క్రమంగా ఎత్తివేసే దిశగా పావులు కదులుతున్నాయి. మార్గదర్శి విషయంలో రామోజీ కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ గతంలో పూర్తి ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులు సంఘం ఏర్పాటు చేసుకుని మరీ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటుఇతర రాష్ట్రాల్లోనూ బాధితులున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలు నాలుగు రాష్ట్రాలకు విస్తరించడం, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినందున ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించాలని సీఐడీ అధికారులు గతంలో కోరడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి రూ.4,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి చట్టపరంగా పీకల్లోతుల్లో కూరుకుపోయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం ఇప్పుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడుతోంది. తేడా వస్తే దాదాపు రూ.1,050 కోట్ల ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగా రామోజీరావు (ఇటీవల మృతి చెందారు) డైరెక్టర్‌గా, ఆయన కోడలు శైలజా కిరణ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఉన్న ఆరోపణలను నీరుగారుస్తోంది.మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలలో కొన్ని..సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టిపెట్టుకున్న మొత్తాలను రొటేషన్ చేస్తూ వస్తోంది. చట్ట నిబంధనల ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. అయితే అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. నాడు సీఐడీ అభ్యంతరం.. అప్పీళ్లు దాఖలుఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా, ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదంటూ గుంటూరు, విశాఖపట్నం కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో సీఐడీ అభ్యంతరం తెలిపింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ గత ఏడాది డిసెంబర్లో హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేసింది. మరికొన్ని అప్పీళ్లను ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు, ఆర్ధిక అవకతవకలు, చట్ట ఉల్లంఘనలపై పూర్తిస్థాయి ఆధారాలను చార్జిషీట్ రూపంలో ప్రత్యేక కోర్టుల ముందు ఉంచినా, వాటిని పట్టించుకోకపోవడం ఎంత మాత్రం సరికాదని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధమంది. చార్జిషిట్‌లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని తన అప్పీళ్లలో హైకోర్టుకు వివరించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయని, అలా చెప్పి ఉండకూడదంది. చార్జిషిట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను, జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. -
18 ఏళ్లుగా సాగదీత.. ఇంకా ఎన్నాళ్లో?
తాము ఏ సుద్దులు చెప్పిన... ఏ నీతులు చెప్పిన అవి ఎదుటి వారికే కాని తమకు కాదని ఈనాడు మీడియా గట్టిగా విశ్వసిస్తోంది. అందుకే ఈనాడు వారు తమకు ఇష్టం లేని వారిపై, లేదా తమ రాజకీయ ,వ్యాపార ప్రయోజనాలకు అడ్డం అవుతారని అనుకున్న వారిపై నానా బురద వేస్తుంటారు .పచ్చి అబద్దాలు రాయడానికి కూడా వెనుకాడడం లేదు .తెలుగుదేశం పార్టీకి , సీఎం చంద్రబాబుకు ,తమకు కొమ్ము కాసేవారికి మాత్రం రక్షణగా నిలబడుతుంది.గత ఐదేళ్లుగా వైఎస్ జగన్ పాలనపై ఎంత విషం చిమ్మిందో చూశాం. అప్పుడే కాదు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయినా, ఇప్పటికి వారిపైనే చెడరాస్తోంది. పాపాల పుట్టలు అని... అవి అని, ఇవి అని ఇష్టరీతిలో హెడ్గింగ్లు పెడుతుంది .అదే తమకు సంబందించిన అక్రమాల గురించి మాత్రం నోరు విప్పితే ఒట్టు.మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సంబందించి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం, అందులో రామోజి సంస్థ అక్రమాలకు పాల్పడిందని , అర్హత లేకపోయినా డిపాజిట్ లు వసూలు చేసిందని ...శిక్షార్హ నేరమని స్పష్టంగా చెప్పినా కనీసం స్పందించ లేకపోయింది.వేలకోట్లకు సంబందించిన దందా అనండి ...స్కామ్ అనండి.. దానిపై నేరుగా వివరణ ఇచ్చే పరిస్థితి కూడా మార్గదర్శి ఫైనాన్శయర్స్ కాని...ఈనాడు మీడియాకు కాని ఉన్నట్లు లేదు.మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుదలతో సాగించిన పోరాటంతో ఈ మాత్రం అయినా కదలిక వచ్చింది .లేకుంటే ఈ దేశంలో మీడియాను అడ్డంపెట్టుకుని ... ఎన్ని అరాచకాలకైనా పాల్పడవచ్చని, తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసి...తద్వారా ఎన్ని కైన ప్రభుత్వాల ద్వారా తమ అర్ధిక ప్రయోజనాలకు కాపాడుకోవచ్చని ఏవరైన భావించే పరిస్థితి ఏర్పడింది .తాజాగా ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించినప్పుడు జరిగిన పరిణామం చూస్తే మార్గదర్శి అనండి...దివంగత రామోజి రావు అనండి లేదా ప్రస్తుత యాజమాన్యం అనండి.. వారికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఎంత పట్టు ఉన్నది అర్ధం అవుతుంది .ఏపిలోని చంద్రబాబు ప్రభుత్వం...తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసులో జవాబు ఇవ్వడానికే సిద్దం పడకపోవడం విశేషం. చంద్రబాబు అంటే ఏటూ టిడిపి కనుక అయన తోటి ఈనాడుకు ఉన్న సంబంధాల రీత్య అర్ధం చేసుకోవచ్చు. రామోజీ కాంగ్రెస్‌కు అనుకూలం కాదని తెలిసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎలాంటి సమాదానం ఇవ్వకపోవడం గమనించదగ్గ అంశం.బహుశా గురుశిష్యులు ఇద్దరు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవ్వడం మార్గదర్శి సంస్థకు కలిసి వస్తోందని అనుకోవాలి. ఈ రెండు రాష్ట్రాల న్యాయవాదులు మార్గదర్శి కేసు విచారణకు హజరు అయినా పూర్తిగా మాౌనం పాటించారట. దానిని మార్గదర్శి న్యాయవాది లుద్రా అనుకూలంగా మలచుకుని కేసును అలస్యం చేసేందుకు ప్రయత్నాలు ఆరంబించారని మీడియా కధనం. మొత్తం విషయం పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది .రెండు వేల ఆరువందల కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారన్నది అభియోగం. అప్పటి ఎంపీ ఉండవెల్లి చేసిన ఫిర్యాదు వ్యవహరంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుని చివరకు ఈ దశకు చేరింది .మద్యలో ఏదో కారణం చూపి రామోజి ఈ కేసును ఉమ్మడి ఏపి హైకోర్టు విభజనకు ముందు రోజు కోట్టివేయించుకోగలిగారు .ఆ తర్వాత ఎప్పటికో ఈ విషయం తెలిసి ఉండవల్లి సుప్రీం కోర్టుకు వెళ్లి తన పోరాటం కోనసాగించారు . అసలు ఏప్పడో చర్య తీసుకోవాల్సిన ఆర్బిఐ ఇనాళ్లు మౌనంగా ఉండడం కూడా అశ్చర్యం కలిగిస్తోంది .తుదకు కోర్టు ఆదేశాలతో ఒక నివేదికను తయారు చేసి సమర్పించింది.అందులో మార్గదర్శి అక్రమంగానే డిపాజిట్లు వసూలు చేసిందని తేల్చింది .ఆర్బీఐ చట్టం లో సెక్షన్ 45 ఎస్ ను మార్గదర్శి ఉల్లంఘించిందని బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని తెలిపింది .ఈ కేసులో నేరాభియోగం రుజువు అయితే జైలు శిక్షతో పాటు డిపాజిట్ లుగా వసూలు చేసినదానికి రెండింతులు పెనాల్టి చెల్లించాల్సి ఉంటుంది .దీనితో మార్గదర్శికి, ఈనాడు వారికి మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది .ఒక్క సాక్షి తప్ప మిగిలిన మీడియా ఇంత పెద్ద వార్తను ప్రముఖంగా ఇవ్వకపోవడం కూడా వారి పలుకుబడిని తెలియచేస్తుంది .రామోజి రావు 2008 లో సమర్పించిన అఫడివిట్ ప్రకారం 2610 కోట్లు సేకరించారు .అందులో 1864 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపారు .మరి మిగిలిన సుమారు 750 కోట్ల డిపాజిట్లు ఏం అయ్యాయి?అవి ఎవరివి అన్న అంశాలను మాత్రం గుట్టుగా ఉంచారు .అంతేకాదు 1864 కోట్లు ఎవరేవరికి చెల్లించారో జాబితా ఇవ్వడానికి రామోజి కుటుంబం సమ్మతించడం లేదని సమాచారం మీడియాలో వచ్చింది.ఆ వివరాలు వెల్లడిస్తే కొందరు పెద్దలు ...అందులో ముఖ్యంగా టిడిపి వారికి చెందిన నల్లధనం బట్టబయలు అవుతుందని ..బినామి పేరుతో తాము పెట్టిన దందా వెల్లడి అవుతుందని రామోజీ కుటుంబం అందోళన చెందుతున్నట్టు సాక్షి పత్రిక నేరుగా అరోపించింది .ఈనాడు వారు కాని ...మార్గదర్శి వారు కాని ,రామోజి రావు కుమారుడు కిరణ్ , కోడలు శైలజ కాని ఏ మాత్రం విలువలు పాటించేవారైనా, ఖచ్చితంగా వీటికి సమాదానం చెప్పగలగాలి. అలా చెప్పడం లేదంటే దాని అర్దం వారు తప్పు చెసినట్టు అంగీకరించడమే .ఊరందరికి నీతులు చెప్పే ఈనాడు మీడియా ఈ విషయంలో ఉన్న గుట్టుముట్లను ఎందుకు విప్పడం లేదు అంటే ...దీని ఱర్ధం ఈ విషయాలు వెలుగులోకి వస్తే తమ పాపాల పుట్ట బయటపడుతుందా అన్న భయమా అనే సందేహం వస్తే తప్పు ఏముంది.దేశంలో ఉన్నవారందరని పారదర్శకంగా ఉండాలని నీతులు రాస్తూ ...కథలు చెబుతూ ఉండే ఈనాడు, మార్గదర్శిల యాజమాన్యం ఇప్పటికైనా ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేసినట్టుగా డిపాజిట్ లు ఏవరేవరికి చెల్లించారో వెల్లడించాలి.అలాగే ఎవరికి చెల్లించని 750 కోట్ల డిపాజిట్ ల రహస్యం ఏంటో తెలపాలి.అదంతా నల్లధనం కాదని ,తాము పద్దతిగా వ్యాపారం చేస్తున్నామని చెప్పగలగాలి.అలాగే చంద్రబాబు,రేవంత్ ప్రభుత్వాలు కూడా ఈ డిపాజిట్ లకు సంబందించి వాస్తవాలను తమ అఫడవిట్ ల ద్వారా తెలియచేయాలి.లేకుంటే ఈ రెండు ప్రభుత్వాలకు ఈనాడు మీడియాకు మద్య క్విడ్ ప్రో కో సాగుంతుందని జనం అభిప్రాయపడతారు . అరుణకుమార్ చేసిన విజ్ఞప్తికి రెండు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?అన్నది డౌటే.ఒకవేళ స్పందించినా, అది మార్గదర్శికి, ఈనాడు వారికి అనుకూలంగానే ఉండవచ్చు. నిజానికి ఉండవల్లి తన వాదనలో చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యకు దిగితే మొత్తం లోగుట్టులు అన్ని బహిర్గతం అవుతాయి. కాని ఇప్పుడు ఉన్న వాతావరణం గమనిస్తే అది అంత తేలిక కాకపోవచ్చు. పద్దేనిమిది ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహరంలో ఎంతకాలం వీలైతే , అంత కాలం ఈ కేసును సాగదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కేసుల వల్లే మన వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతుంది .ప్రజల్లో విశ్వాసం నెలకోనాలంటే కనీసం న్యాయవ్యవస్థ అయినా ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది .అది జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబూ.. జగన్‌లా మీరు చేయలేరా? ఉండవల్లి హాట్ కామెంట్స్
తూర్పుగోదావరి, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని, కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో చూడాలని మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇంప్లీడ్ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. బుధవారం ఉదయం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. మార్గదర్శి తరపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపిస్తూ.. రెండు వారాల సమయం కోరారు. తాము ఎవరెవరికి డబ్బు చెల్లించామో 70 వేల పేజీల్లో సుప్రీంకోర్టుకు వివరాల్ని మార్గదర్శి సబ్మిట్ చేసింది. కట్టిన డబ్బుల ఇచ్చారే తప్ప వడ్డీ ఇవ్వలేదని పలువురు మార్గదర్శి ఫైనాన్స్ ఖాతాదారులు నన్ను అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా డబ్బు అందేందో లేదో పరిశీలించమని ఒక జ్యుడీషియరీ అడ్వైజర్ ను హైకోర్టులో నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..ఇదీ చదవండి: టీడీపీకి ఇది నల్ల ఖజానా.. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధం. 2006లో అప్పటి ఫైనాన్స్ శాఖా మంత్రి చిదంబరానికి నేను చెప్పిందే.. ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది. ఆర్బీఐ అఫిడవిట్‌తో నేను చెప్పిందే నిజమైంది. మార్గదర్శిపై నా పోరాటాన్ని మరోలా వక్రీకరించారు. ఇదేదో వైఎస్సార్ చెప్పటం వల్లే నేను చేశానని అందరూ అనుకుంటున్నారు... అది నిజం కాదు. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఏ చిట్‌ఫండ్ కంపెనీ కూడా చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరించడం లేదు. ఇటీవలె కాకినాడలో జయలక్క్క్ష్మి చిట్‌ఫండ్ కంపెనీ ఎత్తేశారు. మార్గదర్శి.. చిట్‌ఫండ్ యాక్ట్‌ను బ్యాడ్ లాగా పేర్కొంది. రామోజీరావు అనుసరించకపోవడం వల్లే తాము అదే ఫాలో అవుతున్నామని చెబుతున్నారు. ఈ విషయంలోనే నాపై మార్గదర్శి కంపెనీ కూడా కేసు కూడా వేసింది. రామోజీరావు కేసులో ప్రెస్‌మీట్ చెప్పిన అందరిని జైల్లో వేస్తున్నారు. మిగిలిన వారెవరు ప్రశ్నించకుండా ఉండేందుకు మార్గదర్శి నాపై పరువు నష్టం దావా కేసు వేశారు.సంబంధిత వార్త: మార్గదర్శి దందాకు క్విడ్ ప్రోకో కుట్ర.. మార్గదర్శి చిట్ ఫండ్స్ నాపై 50 లక్షలు పరువు నష్టం దావా వేశారు.. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్ లో ఉంది. మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసు నుంచి బయటపడగలను. మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్ లోకి వెళ్లి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్ళింది. ఈనాడు పేపర్ ను అడ్డం పెట్టుకుని రామోజీరావు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు. హెచ్ఎఫ్ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది. .. సెప్టెంబర్ 11 కి వాయిదా ఉంది. మార్గదర్శి కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఇటు రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ కావడంతో కేసుకు కాస్త బలం వచ్చింది. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు రామోజీరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నారు. కాబట్టి ఎలా స్పందిస్తారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే గౌరవం నిలబడుతుంది. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం జరగదు. రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలి. వెంటనే రెండు ప్రభుత్వాలు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి’’ అని ఉండవల్లి కోరారు.ఏపీ ఎన్నికల ఫలితాలపైనా.. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఐదు మండలాలు తిరిగి వెనక్కి ఇచ్చేయమని తెలంగాణ కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైయస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేశారో.. మీరు కూడా అదే చేయమని చంద్రబాబును కోరుతున్నాను. స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రకటించిన 11 రాష్ట్రాల్లో తెలంగాణ ను ఎందుకు చేర్చారో తెలియటం లేదు. మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 12.5% తేడా ఉందన్న ప్రకటించారు.. దీనిపై ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయిన ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో .. స్పష్టం తెలియాలి అని ఉండవల్లి డిమాండ్ చేశారు. -
ఇదీ క్విడ్ ప్రోకో కుట్ర.. ‘మార్గదర్శి’ దందాకు బాబు రక్షణ
సాక్షి, అమరావతి: అసలు సిసలైన క్విడ్‌ప్రోకో అంటే ఇదే..! చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు, కుంభకోణాలకు ఈనాడు కొమ్ము కాస్తోంది. అందుకు ప్రతిగా ఆ పత్రిక యాజమాన్యం అక్రమ ఆర్థిక సామ్రాజ్యం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అవకతవకలకు చంద్రబాబు సర్కారు రక్షణగా నిలుస్తోంది!! అందుకే ‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్లపై న్యాయస్థానంలో తమ వైఖరి తెలిపేందుకు ససేమిరా అంటోంది. కుట్రపూరితంగా మౌనం పాటిస్తూ సామాన్య డిపాజిట్‌దారుల ప్రయోజనాలను గాలికొదిలేస్తోంది. మార్గదర్శి యాజమాన్యంతో కుమ్మక్కు కుట్రలో ఇటు చంద్రబాబు సర్కారు అటు తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడబలుక్కున్నట్లు ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయి. బాబు కుట్రపూరిత మౌనం.. ‘మార్గదర్శి’కి వత్తాసుమార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందాకు చంద్రబాబు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. ఆ కేసు విచారణను తీవ్ర జాప్యం చేసేలా వ్యవహరిస్తుండటమే అందుకు నిదర్శనం. ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట ఈనాడు రామోజీరావు కుటుంబం యథేచ్ఛగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా ఆధారాలతో సహా బట్టబయలైన విషయం తెలిసిందే. మార్గదర్శి పేరుతో ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది.ఈ నేపథ్యంలో ఆ అక్రమ డిపాజిట్లపై విచారణ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అంతేకాదు.. ఏపీ, తెలంగాణలో మార్గదర్శి డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించాలని స్పష్టం చేసింది. అందుకోసం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలంగాణ హైకోర్టుకు వెల్లడించాలని పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కారు దీనిపై స్పందించలేదు. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణకు హాజరైనా పూర్తిగా మౌన ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం గమనార్హం.తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కూడా మౌనమే వహించారు. ఇదే అదునుగా ‘మార్గదర్శి’ తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఈ కేసు విచారణను సాగదీసేందుకు ఎత్తుగడ వేశారు. ‘మార్గదర్శి’ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనన్న ఆర్బీఐ అఫిడవిట్‌పై తమ వైఖరిని వెల్లడించేందుకు సమయం కావాలని కోరారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేసింది. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలియచేస్తూ రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టులు క్రియాశీలం.. ప్రభుత్వాలు ఉదాశీనం‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై న్యాయ వ్యవస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. అక్రమ డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిపాజిటర్ల పేర్లు, డిపాజిట్ల వివరాలను జిల్లాల వారీగా ప్రకటించాలని.. ఎంతమందికి డిపాజిట్లు వెనక్కి ఇచ్చారో పరిశీలించాలని కూడా ఆదేశించడం గమనార్హం. ఆరు నెలల్లో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టుకు నిర్దేశించింది. ఈ క్రమంలో ‘సుప్రీం’ ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సత్వరం చేపట్టింది. కాగా ‘మార్గదర్శి’ డిపాజిట్లు చట్టవిరుద్ధమేనని ఆర్బీఐ తెలంగాణ హైకోర్టుకు లిఖితపూర్వకంగా వెల్లడించింది.ఈ కేసులో న్యాయస్థానాలు, ఆర్బీఐ చురుగ్గా వ్యవహరిస్తుండగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి ఉదాశీన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ‘మార్గదర్శి’ డిపాజిటర్ల వివరాలను జిల్లాలవారీగా ప్రకటిస్తామని, వారికి డిపాజిట్ల మొత్తం చెల్లించారో లేదో పరిశీలిస్తామని, ఎంతమందికి డిపాజిట్లు తిరిగి చెల్లించారు? ఎంతమందికి చెల్లించ లేదు? అనే అంశాలపై వాస్తవాలు తెలుసుకుని తెలంగాణ హైకోర్టుకు వెల్లడిస్తామని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పాల్సి ఉంది.క్షేత్రస్థాయిలో ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది ఈ రెండు ప్రభుత్వాలే. అయితే ఆ మాట చెప్పేందుకు ఇటు చంద్రబాబు ప్రభుత్వానికిగానీ అటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గానీ మనస్కరించడం లేదు. మార్గదర్శి యాజమాన్యానికి పరోక్షంగా సహకరించాలనే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.నాడు కొట్టివేతకు బాబు ప్రభుత్వ సహకారంకేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం1995 నుంచి 2004 వరకు చంద్రబాబు సర్కారు అండతోనే ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణించారు) ఉమ్మడి ఏపీలో యథేచ్చగా అక్రమ డిపాజిట్ల దందా సాగించారు. దీనిపై 2006లో నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో రామోజీ వసూలు చేసినవి అక్రమ డిపాజిట్లేనని ఆర్బీఐ స్పష్టం చేయడంతో ఆయన అనివార్యంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసివేశారు. సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని డిపాజిట్‌దారులకు చెల్లించేసినట్లు చెప్పారు.అయితే సేకరించిన డిపాజిట్లు, డిపాజిట్‌దారుల వివరాలు, వారికి తిరిగి చెల్లించిన మొత్తం వివరాలను వెల్లడించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్‌కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఈ కేసును పట్టించుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం రామోజీ అక్రమ డిపాజిట్ల దందాకు అండగా నిలిచింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును కొట్టివేయడం గమనార్హం.అయితే డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పును ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ కేసులో ఇంప్లీడ్ అయింది. తద్వారా ఆ కేసు నిలిచేలా చేసింది. మళ్లీ అదే కుతంత్రం..రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల దందాకు వత్తాసు పలుకుతోంది. ‘మార్గదర్శి’వి అక్రమ డిపాజిట్లేనని స్వయంగా ఆర్బీఐ నిగ్గు తేల్చడంతో రామోజీ కుటుంబం అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించడంతో రామోజీ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. దీంతో మీ అక్రమాలకు అండగా నేనున్నానంటూ చంద్రబాబు మరోసారి కుట్రలకు తెరతీశారు. అక్రమ డిపాజిట్లపై ప్రభుత్వ వైఖరిని చెప్పకుండా వీలైనంత జాప్యం చేసేలా కుట్ర పన్నుతున్నారు.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తే ‘గోడ మీద పిల్లి’ వైఖరి అనుసరించాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక జిల్లాల వారీగా డిపాజిటర్ల వివరాల వెల్లడి, వారికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లించారో లేదో పరిశీలన ప్రక్రియ చేపట్టే ఉద్దేశమే లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా పరిగణించాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్గదర్శి డిపాజిటర్లకు న్యాయం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని స్పష్టం చేస్తున్నారు. -
KSR Live Show: రామోజీ రావు రాజ్యాంగానికి అతీతుడు.. మార్గదర్శి మోసానికి గాను భారతరత్న
-
రామోజీ అవినీతి సామ్రాజ్యం
-
మార్గదర్శి మోసాలకు శిక్ష తప్పదు
సాక్షి, అమరావతి: రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడని తాము ముందు నుంచి చెబుతున్నామని, తాజాగా హైకోర్టులో ఆర్బీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌తో అది నిరూపితమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మీడియా ముసుగులో రామోజీ యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించి అవినీతి పునాదుల మీద ఆర్థిక సామ్రాజ్యాన్ని నిరి్మంచారని ధ్వజమెత్తారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వసూళ్లపై సీఎం చంద్రబాబు ఏనాడూ కన్నెత్తి చూడలేదని విమర్శించారు. తాము ఎన్ని నేరాలు చేసినా ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాలో రామోజీ వారసులు ఉన్నారని చెప్పారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ⇒ దశాబ్దాల పాటు రామోజీ అక్రమ డిపాజిట్ల సేకరణ, మార్గదర్శిలో భారీ కుంభకోణాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెలికితీశారు. ఆర్బీఐ చట్టం సెక్షన్–45(ఎస్) ప్రకారం ఆ డిపాజిట్ల సేకరణ నేరమని ఉండవల్లి ఫిర్యాదు చేయడంతో మార్గదర్శిపై విచారణ మొదలైంది.⇒ మార్గదర్శి ద్వారా రామోజీరావు 2006 నాటికి చట్ట విరుద్ధంగా రూ.2,610 కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించారు. నాడు సీఎంగా ఉన్న వైఎస్సార్ మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై చర్యలకు ఆదేశిస్తే చంద్రబాబుతోసహా రామోజీరావు మద్దతుదారులంతా పత్రికా స్వేచ్ఛపై దాడిగా దు్రష్పచారం చేశారు. ⇒ మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై ఆర్బీఐ ప్రకటన చేసిన నేపథ్యంలో బాధ్యులు, ఆ సంస్థలో డైరెక్టర్లపై కోర్టులో విచారణ తప్పదు. శిక్ష కూడా తప్పదు. ⇒ ఎక్కడ, ఏ ఆఫీసులో చిత్తు కాగితాలు తగలబెట్టినా మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం టీడీపీ, ఎల్లో మీడియాకు పరిపాటిగా మారింది. ఏ ఆఫీస్‌లో చెత్త కాగితాలు కూడా తగలెట్టొద్దంటూ జీవో ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ⇒ పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలన్న తాపత్రయంతో స్పిల్‌వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్.. అన్నింటి పనులు ఒకేసారి మొదలు పెట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా అంగీకరించినందున వారి తప్పిదాన్ని వారే ఒప్పుకున్నారు. -
‘మార్గదర్శి’ అక్రమాల నిగ్గు తేల్చాల్సిందే: అంబటి
సాక్షి, గుంటూరు: రామోజీరావు అనేక చట్టాలను ఉల్లంఘించారని.. అవినీతి మీద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘రామోజీరావు వైపు 2006 వరకు ఏ వ్యవస్థ చూడలేదన్నారు.‘‘మార్గదర్శిపై ఆనాడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆర్బీఐకి ఫిర్యాదు చేశారు. ఉండవల్లిపై కూడా రామోజీ పరువునష్టం దావా వేశారు. ఈ కేసును కొట్టేయమంటూ రామోజీ పిటిషన్ కూడా వేశారు. కేసు కొట్టేసినట్టు కూడా ఏ పేపర్లోనూ రాలేదు. 2016 డిసెంబర్లో ఉండవల్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసును కొట్టేయడం సరికాదని, విచారించాలని సుప్రీంకు వెళ్లారు. దీంతో విచారణ జరగాలని తెలంగాణ హైకోర్టుకు అప్పగించింది. మార్గదర్శి డిపాజిట్లపై విచారణ జరగాల్సిందేనని ఆర్బీఐ తెలిపింది’’ అని అంబటి రాంబాబు వివరించారు.సంబంధిత వార్త: మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం‘‘రామోజీరావు చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడ్డారు. దుష్టచతుష్టయంలో రామోజీరావు కూడా ఉన్నారు. ప్రజల వద్ద నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేశారు. చట్ట వ్యతిరేకంగా వసూలు చేసి పెట్టుబడి పెట్టుకున్నారు. రామోజీ ఎన్ని నేరాలు చేసినా ఇప్పటి సీఎం కూడా పట్టించుకోలేదు. ఎన్ని నేరాలు చేసినా తమను ఎవరూ పట్టించుకోకూడదని రామోజీ వారసులు కూడా వ్యవహరిస్తున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా చంద్రబాబుకు పట్టదు’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘రామోజీరావు ఆర్థిక నేరస్థుడని మేం ముందునుంచి చెప్తున్నాం. ఈ కేసును బతికించడానికి ఉండవల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుపై యుద్ధం చేయాలని అరుణ్‌కుమార్‌ను కోరుతున్నా. చిట్‌ఫండ్ పేరుతో చేసిన నేరాలపై ఉండవల్లి పోరాడాలి’’ అని అంబటి సూచించారు.సంబంధిత వార్త: అంతా నల్లధనం దందానే!2006 నాటికి రూ. 2610 కోట్లు అక్రమ వసూళ్లు..‘‘హెచ్‌యూఎఫ్ ప్రకారం డిపాజిట్లు సేకరించడం నేరమని ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టు విభజన చివరి రోజు కేసును కొట్టేయాలంటూ రామోజీరావు క్వాష్ పిటిషన్ వేశారు. 2006 నాటికి 2610 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారు. రామోజీరావు చనిపోయినా వారి కుటుంబ సభ్యుల పై చర్యలు తీసుకోవాలి. తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అవినీతి కార్యక్రమాలను చేసుకోవడంలో రామోజీరావు ఒకరు’’ అని అంబటి పేర్కొన్నారు.రామోజీ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదు‘‘వైఎస్ జగన్‌పై పుంఖాను పుంఖాలుగా తప్పుడు వార్తలు రాశారు. ఉదయం లేచినదగ్గర్నుంచి వైసీపీ పై దాడి చేసే ప్రయత్నం చేయడం దారుణం. మార్గదర్శి కేసులో రామోజీ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్.. ఆర్థిక నేరగాడు. మార్గదర్శి చిట్ ఫండ్ చేసిన కార్యక్రమాలన్నీ చట్ట వ్యతిరేకమే. మార్గదర్శిపై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు.చెత్త నుంచి స్కాములు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు‘‘రాజమండ్రి ఆర్అండ్ఆర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. ఆఫీసుల్లో చెత్తకాగితాలు తలేస్తుంటే ఎందుకు దిగజారిపోతున్నారు. చెత్త తగలబడితే స్కామ్ జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. చెత్త నుంచి స్కాములు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు. కావాలనే మా నాయకులను అరెస్టులు చేస్తున్నారు. మేం దేనికీ భయపడం. వైఎస్సార్సీపీ పార్టీ ధైర్యంలోంచి పుట్టింది. మా పై బురద చల్లాలలని చూస్తున్నారు’’ అని అంబటి మండిపడ్డారు. మంత్రి రామానాయుడు నిజం ఒప్పేసుకున్నాడు‘‘పోలవరం ఇష్యూ పై చంద్రబాబు, రామానాయుడికి చర్చకు రావాలన్న నా రిక్వెస్ట్‌ను విరమించుకుంటున్నా. అన్నీ సైమన్ టేనియస్ గా ప్రారంభించామని తెలిసో తెలియకో మంత్రి రామానాయుడు నిజం ఒప్పేసుకున్నాడు. ఇంక దీనిలో చర్చించడానికేం లేదు.’’ అని అంబటి చెప్పారు.కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదు‘‘మా సమయంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే స్కామ్‌కు అవకాశమెక్కడుంటుంది? కక్షసాధింపు చర్యల్లో ఉండవని చంద్రబాబు చెబుతున్నాడు. కానీ చెప్పే మాటలకు చేతలకు తేడా ఉంది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. కక్ష సాధింపు చర్యల వెనుక మనిషి చంద్రబాబు.. బుర్ర లోకేష్‌ది. రామోజీరావును సపోర్ట్ చేసిన వారు ఆర్బీఐ అఫిడవిట్‌కు ఏం సమాధానం చెబుతారు?. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు కూడా రామోజీరావు ఎదుర్కున్న పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయం’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం
సాక్షి, అమరావతి: “నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక..! అన్నది తమ నినాదమని ఈనాడు పత్రిక నీతులు వల్లిస్తూ ఉంటుంది. నిజానికి రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి ‘మార్గదర్శి’ పునాది కాగా ‘ఈనాడు’ ఆ అరాచకాలకు దశాబ్దాలుగా రక్షణ కవచంలా నిలుస్తోంది!! మరి అలాంటి ‘మార్గదర్శి’ అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? పాత్రికేయ పైశాచికత్వం జడలు విప్పి కరాళ నృత్యం చేస్తుంది. అందుకే 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రి నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ఈనాడు పత్రిక అంతగా దుష్ప్రచారానికి తెగబడింది. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత కూడా ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడింది. తదనంతరం 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు బరితెగించి విష ప్రచారం చేసింది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వక్రభాష్యం చెబుతూ రోజుకో రీతిలో బురద జల్లింది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రోజుకో రీతిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్నది అక్షరసత్యం. రామోజీరావు ముమ్మాటికీ ఆర్థిక ఉగ్రవాది అనే వాస్తవాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడంతోనే ఈనాడు అంతగా విషం చిమ్మిందన్నది నిరూపితమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన నివేదికే ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో... అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఈనాడు ముసుగులో రామోజీ పాల్పడ్డ కుట్రలు తేటతెల్లమయ్యాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో వాస్తవాలను వెల్లడిస్తూ తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ సమరి్పంచిన నివేదిక లోగుట్టును విప్పింది.ఆర్థిక దోపిడీని అడ్డుకున్నారనే అక్కసుతోనే నాడు వైఎస్సార్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు దశాబ్దాలుగా సాగించిన ఆర్థిక దోపిడీకి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదుతో 2006లో వైఎస్సార్ ప్రభుత్వం దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రామోజీరావు అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారని, అప్పటికే ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని నిగ్గు తేల్చింది. అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రామోజీరావు అక్రమాలను ప్రశ్నించడం కాదు కదా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ఆయన పేరు పలికేందుకు సాహసించ లేదు. ఈ క్రమంలో అశేష ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు ఏ రాజగురువూ అవసరం లేదని, ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్షగా భావించి దృఢ సంకల్పంతో వ్యవహరించారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ మూసివేయడంతో రామోజీరావు ఆర్థిక అక్రమ సామ్రాజ్యం పునాదులు కదలిపోయాయి. దశాబ్దాలుగా తాను సాగిస్తున్న ఘరానా మోసానికి వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుకట్ట వేయడాన్ని ఆయన సహించలేకపోయారు. దాంతో పట్టరాని ఆక్రోశం, విద్వేషంతో వైఎస్సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో నిత్యం పేజీలకు పేజీలు తప్పుడు వార్తలు రాయించారు. యావత్ వైఎస్సార్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దు్రష్పచారానికి తెగించారు. అయితే రామోజీ బ్లాక్ మెయిల్ పాత్రికేయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి వెరవలేదు. ఆయనతో ఏమాత్రం రాజీ పడలేదు. తలొగ్గిన తరువాత ప్రభుత్వాలు ఆ అక్రమాలకు అండగా చంద్రబాబువైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనాడు రామోజీరావుకు జీహుజూర్ అన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్థిక అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వమే కేసు పెట్టిందనే విషయాన్ని విస్మరించి నీరుగార్చారు. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయంగా రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల గురించి ప్రస్తావించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ఎంత కోరినా ఆలకించలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రామోజీరావు అక్రమాలకు రక్షణ లభించింది. దాంతో గుట్టుచప్పుడు కాకుండా మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును క్లోజ్ చేసేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం ద్వారా రామోజీ అక్రమాలకు రక్షణగా నిలిచింది.అక్రమాల పుట్ట మార్గదర్శి చిట్‌ఫండ్స్.. నిగ్గు తేల్చినందుకే జగన్‌పై దుష్ప్రచారంరామోజీ నెలకొల్పిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా ఆర్థిక అక్రమాల పుట్టేనని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. చందాదారుల ఫిర్యాదులతో స్టాంపులు–రిజి్రస్టేషన్ల శాఖ, సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించడంతో అక్రమాలు బట్టబయలయ్యాయి. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లలో అక్రమంగా పెట్టుబడి పెడుతున్నట్లు గుర్తించారు. చందాదారులకు ప్రైజ్‌మనీ ఇవ్వకుండా రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. బ్రాంచి కార్యాలయాల్లోని నగదు నిల్వలలను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. నకిలీ చందాదారుల ముసుగులో నల్లధనం దందా సాగించారు. డమ్మీ చెక్కులతో మోసగిస్తూ చందాదారులను ఇబ్బంది పెట్టి వారి ఆస్తులను సొంతం చేసుకున్నారు. ఇలా మార్గదర్శి చిట్‌ఫండ్స్ యథేచ్ఛగా పాల్పడుతున్న అక్రమాలన్నీ ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసులో నిందితులైన రామోజీరావు, ఆయన కోడలు శైలజ కిరణ్‌లను సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి విచారించారు. తన ఇంటికి పోలీసులు రావడం ఇదే తొలిసారని రామోజీరావు సీఐడీ అధికారులతో వ్యాఖ్యానించడం గమనార్హం. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు వైఎస్ జగన్ తమ అక్రమాలకు అడ్డుకట్ట వేయడాన్ని రామోజీరావు సహించలేకపోయారు. వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తమ అక్రమ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలడం ఖాయమని, తమకు శిక్ష పడటం ఖాయమని గ్రహించారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో దుష్ప్రచారానికి తెగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలకు వక్రభాష్యం చెబుతూ నిరాధార ఆరోపణలతో రోజుకో రీతిలో బురదజల్లారు. సత్యం నినదించడం కాదు... దోపిడీ వర్ధిల్లాలి అదే ఈనాడు నినాదం.. విధానం రామోజీరావు తన ఆత్మనే ఈనాడు పత్రికగా ... ‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక’ అనే జ్యోతిని వెలిగించి పత్రిక తెచ్చారని ఇటీవల ఈనాడు స్వర్ణోత్సవాల్లో ఘనంగా ప్రకటించారు. ఈ మాటలు వినటానికి ఎంత అందంగా ఉంటాయో ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఈనాడు పాత్రికేయం అంత పైశాచికంగా ఉంటుందన్నది 50 ఏళ్లుగా రోజూ నిగ్గుతేలుతున్న అక్షర సత్యం. రామోజీరావు అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి పునాది మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ అయితే.. ఆ ఆర్థిక ఉగ్రవాదానికి రక్షణ కవచంగా ఈనాడు పత్రికను వాడుకున్నారన్నది సీఐడీ దర్యాప్తులు, ఆర్బీఐ నివేదికల సాక్షిగా వెల్లడైన వాస్తవం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుటుంబం వాటాలను అక్రమంగా తన కోడలు పేరిట రామోజీ బదిలీ చేసుకున్నారు. ఈనాడు కార్యాలయాలు జాతీయ రహదారులు, నగరాల్లోని రహదారులను కబ్జా చేసినా వ్యవస్థలు కళ్లు మూసుకున్నాయి. తమకు పోటీగా ఉన్న ఉదయం పత్రికను దెబ్బతీసేందుకు సారా వ్యతిరేక ఉద్యమం...అనంతరం సంపూర్ణ మద్యపాన నిషేద ఉద్యమాన్ని ఈనాడు నెత్తిన పెట్టుకుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేసింది. ఇక 1995లో ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి రామోజీ. అందుకు ప్రతిగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి రామోజీ ఫిల్మ్ సిటీలో మద్యాన్ని ఏరులై పారించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఫిల్మ్ సిటీ పేరిట కబ్జా చేసిన రామోజీరావుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ఇక ఈనాడు స్వర్ణోత్సవ వేడుకల్లో ఆ పత్రిక ప్రతినిధులు మాట్లాడుతూ 2006లోనూ 2022లోనూ ఈనాడు పత్రికపై ప్రభుత్వాలు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించడం విడ్డూరంగా ఉంది.ఇకనైనాప్రభుత్వాలు స్పందిస్తాయా? మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇరు ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 20న తమ అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంది. ఇకనైనా డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాయా? లేక ఈనాడు ప్రాపకం కోసం రామోజీ కుటుంబ ఆర్థిక దోపిడీకి వంత పాడి మౌనంగా ఉండిపోతాయా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దాదాపు 18 ఏళ్లుగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో మునుముందు ఎలా వ్యవహరిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.18 ఏళ్లు నెట్టుకొచ్చారు6.11.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులపై చర్యలు కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవల్లి ఫిర్యాదు.13.11.2006: ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపింది. ఆర్బీఐ మార్గదర్శి వివరణ కోరింది. 30.11.2006: తాము సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రామన్న మార్గదర్శి. ఇకపై డిపాజిట్లు వసూలు చేయవద్దని మార్గదర్శికి ఆర్బీఐ ఆదేశం.19.12.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ.19.12.2006: వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఎన్.రంగాచారిని నియమిస్తూ జీవో నంబర్ 801 జారీ. మార్గదర్శి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అదీకృత అధికారిగా టి.కృష్ణరాజు నియామకం జీవో 800 జారీ. 27.12.2006: రంగాచారి, కృష్ణరాజుల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మార్గదర్శి, రామోజీరావు పిటిషన్.29.12.2006: మార్గదర్శిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనంటూ ఆర్బీఐ లేఖ. 29.12.2006: ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం చట్టబద్ధతను సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీ హైకోర్టులో పిటిషన్.19.2.2007: ఎన్.రంగాచారి మార్గదర్శి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పణ. 19.2.2007: రంగాచారి నియామక జీవోపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ.23.2.2007: రంగాచారి నియామకం విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మార్గదర్శి, రామోజీ రావు.23.1.2008: మార్గదర్శి అక్రమాలపై నాంపల్లి కోర్టులో అదీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు. 13.7.2009: అదీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు వ్యక్తిగత హాజరుకు నాంపల్లి కోర్టు ఆదేశం 20.7.2009: నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన రామోజీ. 3.8.2009: రామోజీ పిటిషన్‌ను కొట్టేస్తూ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్న హైకోర్టు.7.9.2009: అదీకృత అధికారి తరఫున వాదనలు వినిపించేందుకు ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి, రామోజీ పిటిషన్. 27.11.2009: వ్యక్తిగత హాజరు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మార్గదర్శి, రామోజీ 17.10.2010: ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి పిటిషన్ మూసివేత 1.7.2011: మార్గదర్శి అక్రమాల కేసులో విచారణను కొన్ని సెక్షన్లకే పరిమితం చేయాలంటూ రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన నాంపల్లి 18.7.2011: నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రామోజీ హైకోర్టులో పిటిషన్ 26.07.2011: మార్గదర్శి అక్రమాలపై దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలంటూ హైకోర్టులో రామోజీ, మార్గదర్శి పిటిషన్ 2011: రామోజీ, మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 2014: రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో ఈ కేసు గురించి ఎవరూ పట్టించుకోలేదు. 18.9.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదల చేయాలంటూ మార్గదర్శి, రామోజీ అనుబంధ పిటిషన్ 12.10.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరణ 31.12.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శి, రామోజీరావుపై అ«దీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసిన హైకోర్టు 16.12.2019: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ 17.10.2022: డిపాజిటర్ల పరిరక్షణ చట్టంపై మార్గదర్శి, రామోజీరావు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను మూసేసిన హైకోర్టు 9.4.2024: మార్గదర్శిపై అ«దీకృత అధికారి ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన దర్మాసనం. మార్గదర్శి అక్రమాలపై నిగ్గు తేల్చాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. మొత్తం వ్యవహారాలపై దర్యాప్తు చేయాలి మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్టు పూర్తి ఆధారాలతో సహా నిరూపితమైంది. ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు లేకున్నా సరే మార్గదర్శి ఎండీగా ఉన్న ఆయన కోడలు శైలజ కిరణ్, భాగస్వాములుగా ఉన్న వారి కుటుంబ సభ్యులను చట్టపరంగా శిక్షించాలి. అంతేకాదు మార్గదర్శి మొత్తం అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి. – వొగ్గు గవాస్కర్, న్యాయవాదిరామోజీ కుటుంబం బాధ్యత వహించాల్సిందే మార్గదర్శి అక్రమాలు నిరూపితమయ్యాయి. హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు ప్రస్తుతం లేకున్నా సరే ఆ హెచ్యూఎఫ్లోని ఇతర సభ్యులు బాధ్యత వహించాల్సిందే. వసూలు చేసిన డిపాజిట్లకు కనీసం పదిరెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతరత్రా శిక్షలకు రామోజీ కుటుంబ సభ్యులు అర్హులు. కోటంరాజు వెంకటేశ్ శర్మ, న్యాయవాది, విజయవాడ సొంత ఆడిట్ కుదరదు∙ నిజాలు నిగ్గు తేలాల్సిందే ∙ మార్గదర్శికి స్పష్టంచేసిన సుప్రీం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పట్లో చెరుకూరి రామోజీరావు చేయని కుతంత్రం లేదు... ఎంతగా అంటే ‘అక్రమంగా సేకరించిన డిపాజిట్ల సొమ్మును డిపాజిట్‌దారులకు చెల్లించేశాం... ఆ విషయాన్ని మా ఆడిటర్లు లెక్క తేల్చేసి నివేదిక ఇచ్చారు’అంటూ కనికట్టు చేసేందుకు యతి్నంచారు. కానీ, ఆ కుతంత్రాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తిప్పికొట్టింది. ‘నేరం నాదే... దర్యాప్తు నాదే... తీర్పు నాదే’ అంటే కుదరదు అని తేల్చిచెప్పింది. డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించారో... లేదో... నిర్దారించాల్సిందిగా మార్గదర్శి ఆడిటర్లు కాదు... రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అని విస్పష్టంగా ప్రకటించింది. డిపాజిట్లు చెల్లించేశాం...మా ఆడిటర్లులెక్క తేల్చేశారు.. సుప్రీంకోర్టులో రామోజీ వితండవాదం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,610.38కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు సుప్రీంకోర్టులో అడ్డగోలు వాదనలతో కనికట్టు చేయాలని యతి్నంచారు. తాము అక్రమంగా సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని సంబంధిత డిపాజిట్‌దారులకు చెల్లించేశామని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. మొత్తం రూ.2,610.38 కోట్ల అక్రమ డిపాజిట్లలో 2023, జూన్ 30నాటికి 1,247మంది డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని చెప్పారు. కేవలం రూ.5.31కోట్లు మాత్రమే క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆడిటర్లు పూర్తిగా ఆడిట్ చేసి నివేదిక సమరి్పంచారని... అన్ని లెక్కలు సరిపోయాయని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్‌దారులు, వారికి చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు.అదేం కుదరదు.. డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే – స్పష్టంచేసిన సుప్రీంకోర్టు రామోజీరావు తరఫు న్యాయవాదుల వాదనలను ఏప్రిల్‌లోనే సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే... మీ దగ్గర పని చేసే ఆడిటర్లు నివేదిక ఇస్తే సరిపోదు. ఆ నివేదికను పరిగణలోకి తీసుకోము’ అని స్పష్టం చేసింది. ఎందుకంటే రూ.5వేలు డిపాజిట్‌చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా అని కూడా వ్యాఖ్యానించింది. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కూడా పారీ్టగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ న్యాయస్థానం విచారించాలని తీర్పునిచి్చంది. డిపాజిట్లు తిరిగి చెల్లించినది.. లేనిది పరిశీలించేందుకు ఓ జ్యుడిíÙయల్ అధికారిని నియమించాలని కూడా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. -
రామోజీ ఆర్థిక నేరగాడే
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక దోపిడీకి పాల్పడినట్లు స్పష్టమైంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు కూడా చైర్మన్‌గా వ్యవహరించిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణించారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైంది. చట్టానికి తాను అతీతమన్నట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడి భారీగా దోపిడీకి తెగించినట్లు నిగ్గు తేలింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు తాజాగా తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 13న లిఖితపూర్వకంగా కౌంటర్లో నివేదించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలివి. ఆర్బీఐకి తెలియకుండానే...హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఏర్పాటైంది. ఈ హెచ్‌యూఎఫ్‌కు రామోజీరావు కర్త. డిపాజిట్లు వసూలు చేసేందుకు హెచ్‌యూఎఫ్‌లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతివ్వదు. ఇక్కడ అసక్తికర విషయం ఏమిటంటే అసలు మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే సంస్థ ఉన్నట్లు రిజర్వ్ బ్యాంకుకే తెలియదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్సియర్స్ తన కార్యకలాపాలను కొనసాగించింది. ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 2006 మార్చి నాటికి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.2,610.38 కోట్లను డిపాజిట్లుగా సేకరించింది. ఇంత భారీ మొత్తాల్లో డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి అప్పట్లో ప్రతీ సంవత్సరం వందల కోట్ల రూపాయల్లో నష్టాలు చూపింది. 2000 మార్చి 30వ తేదీ నాటికి 619.25 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేయగా, 2006 మార్చి 30 నాటికి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తాన్ని రూ.2,610.38 కోట్లుగా చూపింది. ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసినప్పటికీ 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. అంటే 50 శాతం డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్సియర్స్ చేరింది. డిపాజిటర్లకు వడ్డీలు, మెచ్యూరిటీ మొత్తాలు చెల్లించేందుకు మళ్లీ డిపాజిట్లు తీసుకోవడం మొదలు పెట్టింది. ఇలా మార్గదర్శి ఆర్థికంగా మనుగడ సాగించింది. ఉండవల్లి ఫిర్యాదుతో కదిలిన మార్గదర్శి పునాదులు.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ చట్ట ఉల్లంఘనలపై 2006లో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ డిపాజిట్ల కథ వెలుగులోకి వచ్చింది. ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి పంపింది. దీంతో ఆర్బీఐ మార్గదర్శి ఫైనాన్సియర్స్ వివరణ కోరింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)కు వర్తించదని మార్గదర్శి ఆర్బీఐకి రాతపూర్వకంగా తెలిపింది. అందులో ఎక్కడా కూడా డిపాజిట్లు వసూలు చేయలేదని మాత్రం చెప్పలేదు. అంతేకాక 2006 సెప్టెంబర్ 16 నుంచి రూ.లక్ష అంతకన్నా తక్కువ మొత్తాలను డిపాజిట్లుగా స్వీకరించడాన్ని నిలిపేశామని ఆర్బీఐకి చెప్పింది. ఈ వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. అక్రమాల నిగ్గు తేల్చే బాధ్యత రంగాచారికి ఆర్బీఐ సూచన మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలను, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో జారీ చేసింది. అలాగే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమించింది. దీంతో ఉలిక్కిపడ్డ రామోజీరావు... మార్గదర్శి ఫైనాన్సియర్స్ ద్వారా అటు రంగాచారి, ఇటు కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ 2006లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వారి నియామకాలను రద్దు చేసేందుకు తిరస్కరిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లను కొట్టేసింది. మార్గదర్శి, రామోజీల ప్రాసిక్యూషన్ కోసం కృష్ణరాజు ఫిర్యాదు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్, హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008, జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) దాఖలు చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఇందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 58ఈ కింద శిక్షార్హమని తెలిపారు. ఈ ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి 2008లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసేందుకు నిరాకరించింది. మార్గదర్శిపై చర్యల నిలిపివేతకు సుప్రీంకోర్టు తిరస్కృతి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చుతూ 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీరావు హైకోర్టును ఆశ్రయించారు. హెచ్‌యూఎఫ్ అయిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ... మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 2011లో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు నాంపల్లి కోర్టు ముందున్న ఫిర్యాదు (సీసీ 540)లో తదుపరి చర్యలను నిలిపేసేందుకు నిరాకరించింది. అలాగే హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొనసాగించేందుకు సైతం నిరాకరించింది. ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు మార్గదర్శికి అనుకూలంగా తీర్పు... ఆ తర్వాత 2019, జనవరి ఒకటో తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన జరిగింది. అంటే 31.12.2018న ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అందరూ విభజన పనుల్లో నిమగ్నమయ్యారు. అటు న్యాయవాదులు, ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై ఎవరూ దృష్టి సారించలేని పరిస్థితి. ఇదే అదునుగా భావించిన రామోజీరావు నాంపల్లి కోర్టులో కృష్ణరాజు ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో దాఖలు చేసిన తన వ్యాజ్యాలను 2018, డిసెంబర్ 31వ తేదీన విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ అదే రోజున... అంటే 2018, డిసెంబర్ 31న తీర్పు కూడా ఇచ్చేశారు. హెచ్‌యూఎఫ్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. మార్గదర్శి, రామోజీరావులకు క్లీన్చిట్ ఇచ్చేసిన న్యాయమూర్తి... డిపాజిట్ల సేకరణ విషయంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులకు అసలు ఎలాంటి దురుద్దేశాలు లేవంటూ న్యాయమూర్తి సర్టిఫికెట్ ఇచ్చేయడం ఈ తీర్పులో ఆసక్తికర విషయం. అంతేకాక డిపాజిట్లను తిరిగి చెల్లించే ప్రక్రియను మొదలుపెట్టారని చెప్పిన హైకోర్టు, పరోక్షంగా మార్గదర్శి, రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన విషయాన్ని నిర్ధారించినట్లు అయింది. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి తీర్పునివ్వడం విశేషం. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లు గానీ ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. దీంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఇంప్లీడ్ అయింది. యావజ్జీవ ఖైదు... రెండింతల జరిమానా అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే భారీ జరిమానాతోపాటు ఆ సంస్థ బాధ్యులకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ చైర్మన్ రామోజీ ఇటీవల మృతిచెందారు. కానీ నేరం రుజువైతే నేరంగానే పరిగణిస్తారు. ఆ సంస్థ నిర్వాహకులు అందుకు బాధ్యత వహించక తప్పదు. ఇక సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.రూ.2,610.38కోట్లకు రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉంది. బెడిసికొట్టిన ‘పత్రికా స్వేచ్ఛ’ పన్నాగంపత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి బయటపడేందుకు నాడు రామోజీరావు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. ఈనాడు పత్రికకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో పట్టుబడుతోందని రామోజీరావు తరఫున ప్రముఖ న్యాయవాదులు వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరఫు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..! ఎన్నికలతో ఏం సంబంధం?’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్‌పై నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరఫు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. రంగాచారి నివేదికలోని కీలక అంశాలు ⇒ రంగాచారి విచారణకు రామోజీరావు, మార్గదర్శి ఎంతమాత్రం సహకరించలేదు. కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డుపడ్డారు. కావాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెట్టారు. తమ పిటిషన్లు కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల డాక్యుమెంట్లు ఇచ్చేది లేదన్నారు. చివరకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన అన్నీ డాక్యుమెంట్లను పరిశీలించిన రంగాచారి 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ⇒ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్లు సేకరించిందని రంగాచారి తేల్చారు. ⇒ డిపాజిటర్లకు వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న విషయాన్ని రంగాచారి తన నివేదికలో పొందుపరిచారు. ⇒ డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ లేదని, దాని ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ తీవ్ర నష్టాల్లో ఉండటమే అందుకు కారణమని స్పష్టంచేశారు. ⇒ రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తేల్చారు. క్రియాశీలకంగా లేని అనేక కంపెనీలకు మార్గదర్శి నిధులను బదలాయించినట్లు వారు సమర్పించిన డాక్యుమెంట్లే స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు. ⇒ రామోజీ గ్రూపులోని ఇతర కంపెనీల్లో కూడా ఇలాగే ఒక గ్రూపు నిధులను మరో గ్రూపునకు బదలాయించడం జరిగిందని పేర్కొన్నారు. ⇒ 2000, ఆ తర్వాత సంవత్సరాల్లోని బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని, మొత్తం ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని తెలిపారు. ⇒ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ తప్ప మిగిలిన అన్నీ కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు బ్యాలెన్స్ షీట్ల పరిశీలన ద్వారా తెలిసిందని రంగాచారి తన నివేదికలో వివరించారు. -
ఆ డిపాజిట్లు చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను అడ్డు పెట్టుకుని రామోజీరావు సాగించిన ఆర్థిక అక్రమాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎట్టకేలకు బహిర్గతం చేసింది. రామోజీ నిస్సందేహంగా ఆర్థిక ఉగ్రవాదేనని రుజువైంది. చట్ట విరుద్ధంగా దశాబ్దాల తరబడి ఆర్థిక దోపిడీకి తెగించారని తేటతెల్లమైంది. 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్లు తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ తాజాగా నివేదించింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని తెలిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షి యర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సీఆర్పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన ప్పుడు ఆరోపిత నేరాలకు ప్రాథమిక ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్న నేపథ్యంలో తమపై దాఖలైన కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని హైకోర్టును ఆర్బీఐ అభ్యర్థించింది.సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు పునర్విచారణ...చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గ దర్శి, దాని కర్త రామోజీరావులపై డిపాజిటర్ల పరి రక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టి వేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అంతకు ముందు హైకోర్టు తీర్పులో కొంతభాగంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఈ ఏడాది ఏప్రిల్ 9న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు తీర్పు ను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు లోతు ల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని స్పష్టం చేసింది. పునర్విచారణను ఆరు నెలల్లో ముగించాలని సూచించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇటీవల ఈ విచారణ మొదలు పెట్టింది. హైకోర్టులో నెంబర్ టూ స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్బీఐని ప్రతివాదులుగా చేర్చి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్బీఐ పూర్తి వివరాలతో తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. ఆర్బీఐ కౌంటర్లో ముఖ్యాంశాలివీ...సెక్షన్ 45 ఎస్‌ను సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించింది...‘1997లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట సవరణలో భాగంగా సెక్షన్ 45 ఎస్‌ను కూడా సవరించాం. ఓ వ్యక్తి వ్యక్తిగతంగా, సంస్థగా, వ్యక్తుల సమూహంతో కూడిన అన్ ఇన్కార్పొరేటెడ్లు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడాన్ని పూర్తిగా నిషేధించాం. చట్ట సవరణ వల్ల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వ్యాపారాన్ని సమర్థంగా నియంత్రించేందుకు మాకు అధికారం లభించింది. కంపెనీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ లావాదేవీలు చేపట్టాలంటే మా నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 45 ఎస్ చట్టబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 2000లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెక్షన్ 45 ఎస్‌ను సమర్థించింది. చట్టం ప్రకారం వ్యక్తులు, అన్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీలు చేసే వ్యాపారాన్ని సెక్షన్ 45 ఎస్ కింద ఆర్బీఐ నిషే«ధించలేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు తమ స్వీయ నిధులతో లేదా బంధువుల వద్ద రుణంగా తీసుకున్న నిధులతో లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న నిధులతో వ్యాపారం చేసుకోవచ్చు. అంతేగానీ ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసి వాటి ద్వారా వ్యాపారం చేయడానికి వీల్లేదు’ అని ఆర్బీఐ తన కౌంటర్లో తేల్చి చెప్పింది.రెండేళ్ల జైలు.. రెండింతల జరిమానా‘చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారని భావించినప్పుడు ఆర్బీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఆ డిపాజిట్ల వసూలు తాలుకూ డాక్యుమెంట్లన్నింటినీ తనిఖీ చేసే అధికారాన్ని సెక్షన్ 45 టీ కట్టబెడుతోంది. సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్లు తేలితే ఆ వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు లేదా వసూలు చేసిన డిపాజిట్ల మొత్తానికి రెండింతల జరిమానా విధించవచ్చు. చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి సంబంధిత కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి వ్యవహారంలో కూడా అధీకృత అధికారి అలాగే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదునే గతంలో హైకోర్టు కొట్టేసింది. దానిపైనే ఇప్పుడు హైకోర్టు విచారణ జరుపుతోంది’ అని ఆర్బీఐ పేర్కొంది.హెచ్‌యూఎఫ్‌కు సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుంది...హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) లీగల్ పర్సన్ కాదు. ఇది కొందరు వ్యక్తుల సమూహం. కర్త ద్వారా ఈ హెచ్‌యూఎఫ్ పని చేస్తుంటుంది. దీన్ని వ్యక్తుల సమూహంగానే పరిగణించాల్సి ఉంటుంది. అందువల్ల హెచ్‌యూఎఫ్‌కు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుంది. వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ఏ రకమైన వ్యాపారం, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న దానిపై సెక్షన్ 45 ఎస్ వర్తింపు ఆధారపడి ఉంటుంది. వ్యాపారం చేసేందుకు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఈ సెక్షన్ కింద నిషిద్ధం. హెచ్‌యూఎఫ్ ఇలా డిపాజిట్లు వసూలు చేస్తే అది ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఈ కేసులో మొదటి ప్రతివాది అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యూఎఫ్గా ఆర్బీఐ చట్ట నిబంధనలకు తిలోదకాలు ఇచ్చింది. సెక్షన్ 45 ఎస్‌లో హెచ్యూఎఫ్ను చేర్చలేదని, తాము ఆ సెక్షన్ పరిధిలోకి రామని చెప్పడం సరికాదు. ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణ నిషేధాన్ని ఆర్బీఐ పరిధిలోకి తేవడమే శాసనకర్తల ప్రధాన ఉద్దేశం. అందుకే ఆర్బీఐ చట్టంలో చాప్టర్ 3 బీ, 3 సీలను చేర్చింది’ అని రిజర్వ్ బ్యాంక్ తన కౌంటర్లో తెలిపింది.చట్ట విరుద్ధమన్న విషయాన్ని గతంలో హైకోర్టు పట్టించుకోలేదుహెచ్యూఎఫ్గా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం చట్ట విరుద్ధమన్న విషయాన్ని హైకోర్టు గతంలో పట్టించుకోలేదు. హెచ్‌యూఎఫ్ వ్యక్తుల సమూహం పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కూడా విస్మరించింది. ఇవన్నీ మార్గదర్శి, రామోజీరావు సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించారన్న విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసినందుకు వీరికి సెక్షన్ 45ఎస్ (1), 45 ఎస్ (2) వర్తిస్తాయి. చట్టవిరుద్ధంగా వ్యవహరించారనేందుకు ఇవన్నీ ప్రాథమిక ఆధారాలే. సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా వ్యవహరించినందుకు వారిని ప్రాసిక్యూట్ చేయాలి. ఈ వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని ఆర్బీఐ కౌంటర్లో అభ్యర్థించింది. కాగా రామోజీరావు ఇటీవల మరణించిన నేపథ్యంలో హెచ్‌యూఎఫ్ కర్తగా ఆ స్థానంలో ఆయన కుమారుడు చెరుకూరి కిరణ్‌ను చేర్చాలని (సబ్‌స్టిట్యూట్) కోరుతూ మార్గదర్శి ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 20న చేపట్టనున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అక్రమాలు బయటపడినందునే చెలరేగిన ‘ఈనాడు’ రామోజీ అక్రమ ఆరి్థక సామ్రాజ్యానికి ‘మార్గదర్శి’ పునాది కాగా.. ‘ఈనాడు’ ఆ అరాచకాలకు రక్షణ కవచంలా నిలుస్తోంది. మరి అలాంటి ‘మార్గదర్శి’ అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? అందుకే నాడు దివంగత వైఎస్సార్‌పై.. నేడు జగన్‌పై కట్టుకథలు అల్లుతూ దు్రష్పచారం చేస్తోంది. అక్రమాల సినిమాలో ఆయన త్రిపాత్రాభినయం ప్రజల సొమ్ము దోచుకునేందుకు రామోజీరావు త్రిపాత్రాభినయం చేశారు. ఆయన హెచ్‌యూఎఫ్ కర్తగా, ప్రొప్రైటర్‌గా, చైర్మన్‌గా మూడు వేర్వేరు పాత్రలలో అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఆర్బీఐకి మస్కా కొట్టారు. 18 ఏళ్లుగా నెట్టుకొచ్చారు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావుపై చర్యలు కోరుతూ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తొలి ఫిర్యాదు అందింది. నాంపల్లి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మొట్టికాయలు వేసినా.. ఆర్బీఐ తప్పుబట్టినా రామోజీరావు మాత్రం 18 ఏళ్లుగా తన అక్రమ దందాను కొనసాగిస్తూ వచ్చారు. సొంత ఆడిట్ కుదరదు.. ఎప్పుడో చెప్పిన సుప్రీంకోర్టు‘డిపాజిట్‌దారులకు సొమ్మును చెల్లించేశాం... మా ఆడిటర్లు లెక్క తేల్చేసి నివేదిక ఇచ్చారు’ అంటూ కనికట్టు చేసేందుకు యత్నించారు. ఆ కుతంత్రాన్ని పసిగట్టిన సుప్రీంకోర్టు.. ‘నేరం నాదే... దర్యాప్తు నాదే... తీర్పు నాదే’ అంటే కుదరదని, నిజాలు నిగ్గు తేలాల్సిందేనని స్పష్టం చేసింది. -
ఏపీని రామోజీ నిజంగానే ప్రేమించారా?
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంస్మరణ సభలో కొందరు వక్తలు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ప్రభుత్వపరంగా ఒక ప్రైవేటు వ్యక్తికి ఇలా సంస్మరణ సభలు నిర్వహించవచ్చా అన్న చర్చ ఒకటి అయితే, కీరవాణి వంటి సినీ ప్రముఖులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురి అవుతున్నాయి.కీరవాణి కులగజ్జితోనో, పార్టీ గజ్జితోనో మాట్లాడారన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తన మామ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్.ను,రామోజీరావును సమానం చేస్తూ రాజగురువు పట్ల తన భక్తిని చాటుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనాడు మీడియా నిష్పక్షపాతంగా వార్తలు ఇస్తుందని అంటూ గత ప్రభుత్వం ఓడిపోయిందన్న వార్త విన్న తర్వాతే రామోజీ కన్నుమూశారని చెప్పారు. ఈ విషయాన్ని బట్టే రామోజీ పక్షపాతంగా పనిచేశారా?లేక నిష్పక్షపాతంగా పనిచేశారా అన్నది పవన్ చెప్పకనే చెప్పారనుకోవచ్చు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు రాజకీయ నేతలు కనుక, ఈనాడు మీడియాతో తమ రాజకీయ అవసరాలు తీర్చుకోవాలి కనుక అలా మాట్లాడారులే అని సరిపెట్టుకోవచ్చు. కాని కీరవాణి చేసిన రాజకీయ విమర్శ అర్ధరహితంగా ఉందని చెప్పవచ్చు.సంస్మరణ సభ కనుక రామోజీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం తప్పు కాదు. ఆయనను బాగా పొగడడం అభ్యంతరం కాదు. కాని అంతటితో ఆయన ఆగలేదు. రామోజీ ఏపీని ఎంతో ప్రేమిస్తారట.అలాంటి ఏపీ కబంధ హస్తాల నుంచి బయటపడిన తర్వాతే నిష్క్రమించారని ఆయన తెలిపారు . ఇది దుర్మార్గమైన కామెంట్. రామోజీ నిజంగానే ఏపీని ప్రేమించి ఉంటే అదెలాగో చెప్పి ఉండాల్సింది.ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో కబంద హస్తాలలో ఉండి ఉంటే ఏ రకంగానో వివరించాలి కదా! పేదల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తే అది కబంద హస్తం అవుతుందా?ప్రభుత్వ స్కూళ్లను ,ఆస్పత్రులను బాగు చేయడం, ప్రజల ఇళ్లవద్దకే పాలనను తీసుకు వెళ్లడం, వృద్దుల ఇళ్లవద్దే పెన్షన్ లు అందచేయడం, చెప్పిన హామీలు చెప్పినట్లు నెరవేర్చడం, కిడ్నీ బాదితుల కోసం ఉద్దానంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆస్పత్రి, పరిశోధన కేంద్రం ఒక భారీ రక్షిత నీటి పధకం తీసుకు వస్తే అది కబంధ హస్తమా!రాజకీయాలలో గెలుపు,ఓటములు ఉంటాయి.ఇందుకు చాలా కారణాలు ఉంటాయి. ఆ మాటకు వస్తే కీరవాణి అభిమానించే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూడా మూడుసార్లు ఓడిపోయింది. అప్పుడు కూడా ఏపీ కబంద హస్తం నుంచి బయటపడినట్లు అవుతుందా!చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో మద్యం ధరలు తగ్గిస్తానని ,నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని వాగ్దానం చేశారు.అది ఏపీ ప్రజలకు ఇచ్చిన అభయహస్తమని కీరవాణి భావిస్తున్నారా!జగన్ అమలు చేసిన వాగ్దానాలకన్నా మూడు రెట్లు అధికంగా ప్రజలకు డబ్బు పంచుతానని టిడిపి మానిఫెస్టోలో ప్రకటించింది.అప్పుడు అది కబంధ హస్తం అవుతుందా?లేక అభయహస్తం అవుతుందా?మద్యం ధర తగ్గించి, సినిమా టిక్కెట్ల రేట్లను పెంచి ప్రజలను దోపిడీ చేయడానికి బడా సినిమా నిర్మాతలకు అవకాశం ఇవ్వడం ఏపీకి అభయహస్తం ఇచ్చినట్లవుతుందని కీరవాణి అనుకుంటుండవచ్చు. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ది చేయడం, కనీసం ముప్పైశాతం షూటింగ్‌లు చేయాలని జగన్ కోరితే అది కబంద హస్తం అన్నమాట.రామోజీకి నిజంగానే ఏపీపై అంత ప్రేమ ఉంటే ఫిలిం సిటీ వంటివాటిని ఏపీలో ఎందుకు పెట్టలేకపోయారు! ఆ రాష్ట్రంలో గత పదేళ్లలో ఆయన పెట్టిన సంస్థలు ఏమి ఉన్నాయి?పోనీ అంతకుముందు అయినా ఏపీ ప్రజల కోసం ఆయన చేసిన సేవ ఏమిటి?తుపాను వంటివి వచ్చినప్పుడు విరాళాలు సేకరించి కొన్నిచోట్ల ఒక వంద ఇళ్లు నిర్మించి ఉండవచ్చు. అది తప్ప మిగిలినదంతా ఆయన చేసింది వ్యాపారమే కదా!అంతవరకు ఆయన గొప్పవాడే అని చెప్పండి. కాని ఏపీని ఆయనే ఉద్దరించినట్లు కలరింగ్ ఇవ్వడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది.మార్గదర్శి సంస్థల ద్వారా సేకరించిన డబ్బు తీసుకువెళ్లి తెలంగాణలో రామోజీ ఫిలింసిటీని, టీవీ కార్యాలయాలను నెలకొల్పారు కాని, ఏపీలో ఏమైనా పెట్టుబడి పెట్టారా!ఈనాడు మీడియా ద్వారా అబద్దాల ప్యాక్టరీని పెట్టి నిత్యం తనకు గిట్టని వారిపై విషం చిమ్మడం విలువలకు ప్రాధాన్యం ఇచ్చినట్లా!సినిమా రంగానికి చెందిన దాసరి నారాయణరావు పేరు కూడా లేకుండా ఆయన సినిమాలను టీవీలలో చూపించడం గొప్ప విషయమా?రామోజీ ఒక వ్యక్తిగా,తన వ్యాపార రంగంలో అభివృద్ది చెందారు.దానిని ఎవరు కాదనరు.కాని దాంతోనే ఏపీ సమాజం అంతటికి ఆయనే ఆదర్శమన్నట్లు చిత్రీకరించడం కరెక్టు కాదు.ఏపీ సమాజానికి ఆయన ఏమి ఇచ్చారో కాని,ఆ సమాజం నుంచి ఆయన చాలా పొందారు. ఎంత మేలు చేశారోకాని, హానీ మాత్రం బాగా ఎక్కువగానే చేశారు. మీడియా లేకుండా కేవలం ఇతర వ్యాపారాలకే రామోజీ పరిమితం అయి ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వపరంగా ఇంత భారీ సభ నడిపేవారా?కీరవాణి ఇంతగా పొగిడేవారా!ఏపీలో తొలితరం పారిశ్రామికవేత్తలుగా పేరొందిన హరిశ్చంద్రప్రసాద్ వంటివారికి గాని, దేశంలోనే అత్యున్నత స్థానాలకు చేరిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహారావు ,ఉమ్మడి ఏపీకి చెందిన పలువురు మాజీ ముఖ్యమంత్రులకు కాని ఇవ్వనంతగా గౌరవం ఇచ్చారంటే కేవలం మీడియా ద్వారా ప్రభావితం చేయడం కాదా! తెలుగుదేశం పార్టీకి, అందులోను చంద్రబాబు నాయుడుకు బాజాలు కొట్టినందుకు కాదా! కీరవాణి వంటి వారికి సినిమా వ్యాపారంలో రామోజీ అవకాశాలు ఇచ్చి ఉండవచ్చు.అంతవరకు అభినందించడం, కృతజ్ఞతలు చెప్పడం మంచిదే.అలాకాకుండా జగన్ ప్రభుత్వంపై పిచ్చి వ్యాఖ్యలు చేయడం ద్వారా కీరవాణి కులగజ్జితోనే మాట్లాడుతున్నారని రుజువు చేసుకున్నట్లు కాదా!ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీతి,నిజాయితీల కోసం రామోజీ బతికారని చెప్పారు. మార్గదర్శిపై ఎన్నో కేసులు పెట్టారని ,ఎన్నో రకాలు గా హింసించారని ఆయన అన్నారు. రామోజీ తన పత్రిక, టీవి ద్వారా చాలామందిని అంతకన్నా ఎక్కువగా హింసించారు. అవన్ని ఎందుకు! మార్గదర్శి ద్వారా డిపాజిట్లు వసూలు చేయవచ్చా?అందులో నల్లధనం పెద్ద ఎత్తున ఉందని వచ్చిన అభియోగాలపై ఎందుకు రామోజీ తన జీవిత కాలంలో వివరణ ఇవ్వలేకపోయారు?రామోజీరావు ,ఎన్.టి.ఆర్.లను సమానం చేసే విదంగా చంద్రబాబు మాట్లాడడం ద్వారా తనకు రాజగురువుపై ఉన్న భక్తిని తేటతెల్లం చేశారని అనుకోవచ్చు.అంతవరకుతప్పుపట్టనవసరం లేదేమో! చంద్రబాబు ఒక ఆసక్తికర విషయం తెలియచేశారు.' కొన్ని పత్రికలలో ఇతర పార్టీల వార్తలు రాయరని, కాని రామోజీ మాత్రం ప్రతి పార్టీ,నాయయకుడికి వారి సంఖ్యా బలాన్ని బట్టి ,ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇస్తారని, కవరేజీలో ఎక్కడ తప్పు చేయరు అని అన్నారు. తన అభిప్రాయాలను ఎడిటోరియల్ పేజీలో చెబుతారని" కూడా పేర్కొన్నారు.నిజంగానే ఇలా జరిగిందా అని చూస్తే నేతిబీరకాయలో నెయ్యి చందమే అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి వార్తలు ఇవ్వాలనే వారు. టిడిపి ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అవేమీ పాటించలేదు.గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి 151 సీట్లు ఉంటే, విపక్ష టిడిపికి 23 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఒకసారి ఈ కాలంలో ఈనాడు మీడియా ఇచ్చిన కవరేజీని గమనిస్తే చంద్రబాబు ఈ విసయంలో కూడా అసత్యాలు చెప్పారని అర్దం అవుతుంది. టిడిపి కి డెబ్బైఐదుశాతం వార్తల కవరేజీ ఇస్తే,వైఎస్సార్సీపీకి పాతిక శాతం కూడా ఇవ్వలేదు.వైఎస్సార్సీపీ వ్యతిరేక వార్తలు మాత్రం డెబ్బై ఐదు శాతం ఇచ్చారు.అంతేకాదు.గత ఐదేళ్లు వార్తలకు,సంపాదకీయాలకు తేడా లేకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కధనాలను,పచ్చి అబద్దాలను మొదటిపేజీలో ఇచ్చారో అందరికి తెలుసు. రామోజీరావు అంటే నాకు గౌరవమే.ఆయన వద్ద పనిచేసిన అభిమానం ఉంటుంది.కాని ఆయన చెప్పిన సూత్రాల ప్రకారమే ఇప్పుడు వాస్తవాలు చెప్పవలసి వస్తోంది.చివరిగా ఒక మాట.కీరవాణి తన ప్రసంగంలో రామోజీరావును భీష్ముడితో పోల్చారు. అంటే భీష్ముడు మాదిరి కౌరవుల తరపునే రామోజీ యుద్దం చేశారని చెప్పినట్లే కదా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
KSR Comment: శృతిమించిన కీరవాణి.. రామోజీ నిజస్వరూపం బయటపెట్టిన పవన్
-
ఇది సరైన సందేశమేనా?
‘మరణం నా చివరి చరణం కాదు’ అంటాడు విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్. నిజమే, ప్రభావశీలమైన వ్యక్తులు మరణానంతరం కూడా జీవించే ఉంటారు. వారి ప్రభావ స్థాయిని బట్టి సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాల పర్యంతం కూడా. ప్రభావశీలతలో పాజిటివ్ కోణం ఒక్కటే చూడాలా? నెగెటివ్ ప్రభావానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? మానవ చరిత్రపై అడాల్ఫ్ హిట్లర్ చేసిన రక్తాక్షర సంతకం కూడా తక్కువ ప్రభావాన్ని చూపలేదు కదా! అతడు కూడా మనకు ప్రాతఃస్మరణీయుడవుతాడా?నిజానికి ఇందులో సమస్య ఏమీ లేదు. సందేహాతీతమైన సదాచారాలు మనకు ఉన్నాయి. సమాజం మేలు కోరిన వారు, ప్రజల మంచి కోసం పోరాడినవారు, మంచితనాన్ని పెంచినవారిని స్మరించుకునే సంప్రదాయం మనకున్నది. స్మారకాలు నిర్మించుకునే అలవాటు కూడా ఉన్నది. వారి జీవితాల్లోంచి సమాజం పాఠాలు నేర్చుకోవాలనే కాంక్షతో వారినలా తమ జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. చెడుమార్గంలో పయనించి ప్రభావం కలిగించిన వారిని... అధ్యయనం కోసం మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కించాలి. వారికి మరణమే చివరి చరణం కావాలి. ఆ ప్రభావం ఆదర్శం కాకూడదు.కానీ, దురదృష్టవశాత్తు మారుతున్న కాలం వింత పోకడలు పోతున్నది. అభివృద్ధికి అర్థం మారుతున్నది. విజయ గాథలకు కొత్త నిర్వచనాలు చేరుతున్నాయి. గొప్పతనం అనే మాటకు తాత్పర్యం మారింది. ఎవరు బాగా సంపాదిస్తారో వారే మహానుభావులు అనే భావన బలపడుతున్నది. వారు ఏ మార్గంలో సంపాదించారన్న పట్టింపేమీ కనిపించడం లేదు. గమ్యం మాత్రమే కాదు, గమ్యాన్ని చేరే మార్గం కూడా పవిత్రంగా ఉండాలన్న గాంధీ బోధనను ఒక చాదస్తం కింద జమకట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గాడ్సే వారసులకు గౌరవ మర్యాదలు లభిస్తున్న కాలంలోకి ప్రవేశించాము కదా!పారిశ్రామికాభివృద్ధిలో జాతి ప్రగతిని దర్శించిన జేఆర్డీ టాటా వంటి ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు కూడా మనకు ఉన్నారు. అటువంటి వారు చనిపోయినప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని అధికారిక సంస్మరణ సభలు నిర్వహించినట్టు గుర్తు లేదు. అటువంటి అదృష్టం మన తెలుగువాడైన చెరుకూరి రామోజీరావుకు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’కున్నంత పేరు ఆయనకూ ఉన్నది. బాగా సంపాదించారు. చిట్‌ఫండ్స్‌తో ప్రారంభమై మీడియాకు విస్తరించారు. మీడియా దన్నుతో సాటి చిట్‌ఫండ్ కంపెనీలను చావబాది, వాటిని దివాళా తీయించారు. ఫలితంగా ఆయన ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ దినదిన ప్రవర్ధమానమైంది.చిట్‌ఫండ్స్‌కు తోడుగా ‘ఫైనాన్షియర్స్’ పేరుతో మరో జంట కంపెనీ తెరిచారు. రెండు చేతులా ప్రజాధనాన్ని స్వీకరించారు. మీడియాను విస్తరింపజేశారు. ఫిలిం సిటీ పేరుతో ఓ మాహిష్మతీ రాజ్యాన్ని స్థాపించేశారు. ఈలోగా మీడియాను వాడుకొని ప్రభుత్వాలను మార్చారు. ‘పత్రికొక్కటి ఉన్న పదివేల సైన్యంబు’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావు. ఆ వాక్యాన్ని చెరుకూరి వారు వ్యాపారపరంగా ఆలోచించారు. పదివేల సైన్యంబును ప్రయోగిస్తూ వచ్చారు. మొదట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పదివేల సైన్యం పొగబాంబులు పేల్చింది. ఫలితంగా ఎన్టీ రామారావు గద్దెనెక్కారు. రామోజీరావు వ్యాపారపు అడుగులకు మడుగులొత్తడానికి రామారావు నిరాకరించారు. క్రుద్ధుడైన రామోజీ వృద్ధుడైన రామారావుపైకి తన పదివేల సైన్యాన్ని అదిలించారు. ఎన్టీఆర్ గద్దె దిగి చంద్రబాబు గద్దెనెక్కారు. మనోవేదనతో ఐదు మాసాల్లోపే ఎన్టీఆర్ చనిపోయారు. రామోజీరావు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు ఆయనకు శుక్రాచార్యులవారి హోదా కల్పించారు.పత్రికా రచన రంగానికి సంబంధించి రామోజీకి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. ‘ఈనాడు’ ఎడిటర్ హోదాతో ఆయన ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. కానీ ఆయన వృత్తిపరంగా జర్నలిస్టు కాదు. నాన్ జర్నలిస్ట్ ఎడిటర్‌గా ఆయన పలు రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఏకవాక్య రచన కూడా లేకుండా ఏకబిగిన దశాబ్దాల తరబడి ప్రధాన సంపాదకుడిగా కొనసాగిన ఘనతను ఆయన్నుంచి ఎవరూ లాక్కోలేరు. 1974లో విశాఖపట్నం నుంచి ‘ఈనాడు’ పత్రిక ప్రారంభమయ్యే నాటికి అప్పటికే ఉన్న రెండు పెద్ద పత్రికలు పాత మూసలోనే మునకేసి ఉన్నాయి. ఈ స్థితిలో కొంత ఆధునికతను జోడిస్తూ, ప్రజల అవసరాలను గమనిస్తూ, వారికి అర్థమయ్యే సరళమైన భాషను వినియోగిస్తూ ‘ఈనాడు’ ముందుకొచ్చింది. ఈ మార్పులకు మూల పురుషుడు ‘ఈనాడు’ తొలి ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఉరఫ్ ఏబీకే ప్రసాద్ అనే తెలుగుజాతి అగ్రశ్రేణి పాత్రికేయుడు.‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఏబీకే ప్రసాద్‌ను బయటకు పంపించారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తర్వాత కాలంలో రామోజీరావే స్వయంగా ప్రధాన సంపాదకులయ్యారు. ఏబీకే నెలకొల్పిన పత్రికా ప్రమాణాల స్థానాన్ని క్రమంగా రామోజీ వ్యాపార సూత్రాలు ఆక్రమించాయి. ఈ వ్యాపార సూత్రాలు కూడా పత్రిక విస్తృతిలో వాటి పాత్రను పోషించాయి. ఆ రోజుల్లో ‘స్కైలాబ్’ పేరుతో అమెరికా నెలకొల్పిన ఒక అంతరిక్ష కేంద్రానికి ఆయుష్షు మూడింది. అది ముక్కచెక్కలై భూమ్మీద పడిపోయే సందర్భాన్ని ‘ఈనాడు’ వినియోగించుకున్నది. అది రేపోమాపో పడిపోనున్నదనీ, దాంతో భూమి బద్దలైపోతుందని, ఇవే మనకు చివరి రోజులనీ ఊరూరా ప్రచారం జరగడంలో ‘ఈనాడు’ గొప్ప పాత్రనే పోషించింది. ఆ విధంగా గ్రామీణ ప్రజల్లోకి కూడా చొచ్చుకొనిపోగలిగింది.పత్రికకు ఉండవలసిన నిష్పాక్షికత అనే లక్షణాన్ని ఈ యాభయ్యేళ్ల ప్రయాణంలో మొదటి ఐదారేళ్లు ‘ఈనాడు’ పాటించిందేమో! ఎనభయ్యో దశకం ప్రారంభంలోనే నిష్పాక్షికతకు నిప్పు పెట్టేసింది. గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా దాని పాత్రికేయమంతా ఏకపక్షా రచనా వ్యాసంగమే! నాణేనికి ఉండే రెండో కోణాన్ని తెలుగు ప్రజలు చూడకుండా ‘ఈనాడు’ దాచిపెట్టింది. పోటీగా మరో పత్రిక ఎదగకుండా దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే రామోజీ ఎత్తుగడలన్నీ తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే. ‘ఉదయం’ పత్రిక అకాల అస్తమయానికి ఈ ఎత్తుగడలే కారణం. ‘వార్త’ను నిర్వీర్యం చేయడానికి కూడా అది ప్రయత్నాలు చేసింది. ఒక్క ‘సాక్షి’ ముందు మాత్రం దాని మంత్రాంగం పారలేదు. ఫలితంగా గత పదహారేళ్లుగా తెలుగు ప్రజలకు వార్తాంశాల రెండో కోణం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు నిష్పాక్షిక సమాచార హక్కును దక్కకుండా చేసినందుకుగాను ఆయన్ను అక్షర సూర్యుడుగా భృత్య మీడియా బహువిధాలుగా శ్లాఘించింది. ప్రభుత్వం వారి సంస్మరణ సభలో వక్తలందరూ నోరారా కొనియాడారు.ఇక రామోజీరావు తన వ్యాపార సామ్రాజ్య స్థాపనలో అనుసరించిన పద్ధతులూ, నియమోల్లంఘనలూ, చట్టవిరుద్ధ వ్యవహారాలూ ఆమోదయోగ్యమైనవేనా? భవిష్యత్తు తరాల వారికి వాటిని బోధించవచ్చునా? ఈ అంశాలపై విస్తృతమైన చర్చ జరగవలసి ఉన్నది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఆయన చేసిన డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమైనదని స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది. ఆయన కూడా అది తప్పేనని ఒప్పుకున్నందువల్లనే ఆ సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఎవరెవరి దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో, ఎవరెవరికి తిరిగి చెల్లించారో తెలియజేస్తూ ఒక జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం ఆదేశాన్ని ఆయన పాటించలేదు.కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. కానీ మార్గదర్శి ఆ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించింది. ఆ డిపాజిట్లను నిబంధనలకు విరుద్ధంగా షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్‌లో, తమ సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టింది. లేని చందాదారులను ఉన్నట్టుగా చూపిస్తూ ఘోస్ట్ చిట్టీలు నడుపుతూ మనీలాండరింగ్ నేరానికి పాల్పడినట్టు ఇటీవల జరిగిన సోదాల్లో బయటపడింది. కేంద్ర దర్యాపు సంస్థలు జోక్యం చేసుకోవలసిన పరిణామాలివి.ఇక రామోజీ ఫిలింసిటీ ఒక అక్రమాల పుట్ట. ఇక్కడ జరిగిన నియమోల్లంఘనలు నూటొక్క రకాలు. ఇందులో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉన్నది. పప్పుబెల్లాలు పంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన నేరం ఉన్నది. తరతరాల నాటి రహదారులనే కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చుట్టుకున్న దాదాగిరి ఉన్నది. మాతృభూమిలో వైద్యసేవలు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్‌ను బెదిరించి 200 ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసిన దాష్టీకం ఉన్నది. భూపరిమితి చట్టాన్ని వెంట్రుక సమానంగా జమకట్టిన లెక్కలేని తెంపరితనం ఈ ఫిలింసిటీ కథలో దాగున్నది.ఎటువంటి అనుమతుల్లేకుండా ఫిలిం సిటీలో నిర్మించిన 147 భవనాలు హెచ్ఎమ్డీఏ అధికారాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాయి. చెరువులను చెరపట్టి వాటిలోకి ప్రవాహాలను మోసుకెళ్లే కాల్వలను రహదారులుగా మార్చుకున్న ఫిలింసిటీ రుబాబు ముంగిట... ‘వాల్టా’ చట్టం చేతులు ముడుచుకొని సిగ్గుతో తలవంచి నిలబడింది. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ వెనుక ఇంత తతంగం ఉన్నది. ఇది రేఖామాత్రపు ప్రస్తావన మాత్రమే! ఈ ‘సక్సెస్’ స్టోరీ రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదేనా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరపడం సమర్థనీయమేనా? అమరావతిలో శిలా విగ్రహం, ఒక రహదారికి పేరు, స్మారక ఘాట్ల స్థాపన ఎటువంటి స్ఫూర్తిని ఉద్దీపింపజేస్తాయి. ‘భారతరత్న’ బిరుదాన్ని ఆయనకు సంపాదించిపెడతామని ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం సరైన సందేశాన్నే సమాజంలోకి పంపిస్తుందా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
KSR Live Show: కిరవాణి కులగజ్జి ?.. రామోజీ కోసం ఎన్టీఆర్ ని అవమానిస్తారా ?
-
ఏపీ ప్రజల సొమ్ముతో రామోజీ రావు సంస్మరణ సభ
-
రామోజీ బ్రతికుండగానే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే ?
-
Big Question: దుర్మార్గదర్శికి కాంస్య విగ్రహం
-
KSR Live Show: ఏ వ్యక్తికీ జరగని విధంగా రామోజీకి మాత్రమే ఎందుకు ?
-
రామోజీకి అశ్రు నివాళి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. ఉదయం ఫిలింసిటీలోని ఆయన నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీ చితికి ఆయన కుమారుడు కిరణ్ నిప్పంటించారు.ప్రముఖుల నివాళిరామోజీరావు (88) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం నుంచి ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం రామోజీ మృతదేహాన్ని ఫిలింసిటీలోని నివాసంలో ఉంచారు. ఆదివారం ఉదయం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, బీజేపీ ఎంపీలు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు మురళీ మోహన్ తదితరులు రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. రామోజీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.పాడె మోసిన చంద్రబాబుఆదివారం ఉదయం 9.30 గంటలకు రామోజీ నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. అంతిమ యాత్ర వాహనంపై కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజ, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి, సోహన, మనవడు సుజయ్తోపాటు జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు కూర్చున్నారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర స్మృతివనానికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంతిమ యాత్రలో పాల్గొని రామోజీ పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. 11.30 గంటల సమయంలో రామోజీ భౌతికకాయాన్ని చితిపై ఉంచారు. పోలీసులు గౌరవ వందనం చేసి, గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత.. రామోజీ కుమారుడు కిరణ్ చితికి నిప్పంటించారు. -
ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు
-
రామోజీరావు మృతి పట్ల నాట్స్ సంతాపం
తెలుగుజాతి ముద్దు బిడ్డ... తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష వైభవానికి రామోజీరావు చేసిన కృషి మరువలేనిదన్నారు.. ప్రతి తెలుగువాడికి రామోజీరావు జీవితం ఓ స్ఫూర్తిదాయక పాఠమని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. రామోజీరావు ఈనాడు, ఈటీవీ సంస్థలను ఉన్నత విలువలు ఉన్న సంస్థలుగా నిలబెట్టి మనందరికి విజ్ఞానాన్ని, విలువైన సమాచారాన్ని అందించారని తెలిపారు. రామోజీరావు మరణవార్త అమెరికాలో ఉండే తెలుగువారందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రామోజీరావు మృతి పట్ల నాట్స్ సంతాపాన్ని వెలిబుచ్చింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నాట్స్ సభ్యులు ప్రార్థించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.(చదవండి: రష్యా నది నుంచి భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత) -
రామోజీరావు అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్, సాక్షి: రామోజీగ్రూప్ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు.రామోజీరావుకు గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక.. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో రామోజీ సంస్థల ఉద్యోగులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతి వనం దాకా అంతిమయాత్ర కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఆయన కుటుంబ సభ్యుల కూడా ఇందులో పాల్గొన్నారు.మరోవైపు ఈ ఉదయం కూడా పలువురు ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పెదపారుపూడి టు ఫిలింసిటీ -
వంద చిత్రాల ఆకాంక్ష నెరవేరకుండానే..
సాక్షి, హైదరాబాద్: రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌తో తెలుగు చలనచిత్ర పరిశ్రమపైనా తన ముద్ర వేశారు. ఈ బ్యానర్‌పై తెలుగులో నిర్మించిన తొలి చిత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ (1984)’. జంధ్యాల దర్శకత్వంలో.. వీకే నరేశ్, పూరి్ణమ నటించిన ఆ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. తర్వాత ‘మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్, నువ్వే కావాలి, నిన్ను చూడాలని.., చిత్రం, ఆనందం, ఇష్టం, నచ్చావులే’వంటి పలు సినిమాలు నిర్మించారు. వివిధ భాషల్లో కలిపి దాదాపు 80 సినిమాలు నిర్మించారు రామోజీరావు. మయూరి పేరిట ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించి.. పలు చిత్రాలను పంపిణీ చేశారు. రామోజీరావు ఓ సినిమాలో నటించారు కూడా. యు.విశ్వేశ్వరరావు దర్శకత్వంలో వచి్చన ‘మార్పు’ సినిమాలో అతిథి పాత్ర పోషించారు. రామోజీరావు నిర్మించిన చివరి చిత్రం ‘దాగుడుమూత దండాకోర్ (2015)’. అంతకు ముందు కొన్ని చిత్రాలు అపజయం కావడంతో ఉషాకిరణ్ మూవీస్‌లో సినిమాల నిర్మాణానికి గ్యాప్ వచ్చింది. 2019లో మళ్లీ సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్టు వార్తలు వచ్చాయి. కొందరు యువ దర్శకులను సంప్రదించి, కథలు తయారు చేయించారని, పలువురికి అడ్వాన్సులు కూడా ఇచి్చనట్టు వినిపించింది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో బ్రేక్ పడింది. రామోజీరావుకు వంద చిత్రాలు నిర్మించాలనే ఆకాంక్ష ఉండేదని సన్నిహితులు చెప్తుంటారు. అది నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు. జూ.ఎన్టీఆర్ తొలి చిత్రం ఉషాకిరణ్‌లోనే.. రామోజీరావు ఎందరో నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌ను ‘నిన్ను చూడాలని’(2001) మూవీ ద్వారా పరిచయం చేసింది ఉషాకిరణ్ సంస్థనే. అలాగే ‘చిత్రం’సినిమా ద్వారా ఉదయ్‌కిరణ్, రీమాసేన్లను హీరో హీరోయిన్లుగా, ఇదే సినిమాతో నటుడు ‘చిత్రం’ శ్రీనును, దర్శకుడు తేజను పరిచయం చేశారు.‘నువ్వే కావాలి’తో హీరోగా తరుణ్, హీరోయిన్గా రిచా, ఓ కీలక పాత్రలో సాయికిరణ్‌లను.. ‘పీపుల్స్ ఎన్కౌంటర్స్’ద్వారా శ్రీకాంత్‌ను.. ‘ఇష్టం’చిత్రంతో కథానాయికగా శ్రియను.. ఇలా మరికొందరు నటీనటులను పరిచయం చేశారు. హిందీలో ‘తుజే మేరీ కసమ్’ద్వారా రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఎంఎం కీరవాణిని ‘మనసు మమత’చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయం చేసింది ఉషాకిరణ్ మూవీస్ సంస్థనే.ఇతర భాషల్లోనూ.. రామోజీరావు తెలుగులోనే కాదు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ.. ఇలా పలు భాషల్లో కలిపి దాదాపు 80కిపైగా సినిమాలను నిర్మించారు. హిందీలో నేరుగా ఓ సినిమా నిర్మించగా.. మూడు రీమేక్‌లు ఉన్నాయి. రామోజీరావు హిందీలో నిర్మించిన తొలి రీమేక్ ‘నాచే మయూరి’(1986). తెలుగులో ‘మయూరి’. క్లాసికల్ డ్యాన్సర్ సుధాచంద్ర బయోపిక్‌గా ఆ మూవీ రూపొందింది.తర్వాత విజయశాంతి లీడ్ రోల్లో టి.కృష్ణ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘ప్రతిఘటన’సూపర్ హిట్ కావడంతో దానిని హిందీలో ‘ప్రతిఘట్’(1987) పేరుతో రీమేక్ చేశారు. అలాగే తెలుగు సూపర్ హిట్ మూవీ ‘నువ్వే కావాలి’ని ‘తుజే మేరీ కసమ్’ (2003) పేరిట హిందీలో రీమేక్ చేశారు. రామోజీరావు నేరుగా నిర్మించిన హిందీ చిత్రం ‘తోడా తుమ్ బద్లో తోడా హమ్’(2004). ఆ చిత్రంలో ఆర్య బబ్బర్, శ్రియ శరణ్ జోడీగా నటించారు. -
ప్రముఖుల దిగ్భ్రాంతి
రామోజీరావు మరణంతో దేశం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన ఈనాడు దినపత్రిక, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలను నెలకొల్పిన వినూత్న వ్యాపారవేత్త. సమాజ హితంపై ఆయనకు ఉన్న దృష్టి కారణంగా పద్మ విభూషణ్ వరించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి ప్రకటిస్తున్నాను. – ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి⇒ రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రామోజీరావు కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. –నరేంద్ర మోదీ, ప్రధాని⇒ భారతీయ మీడియా పరిశ్రమలో అగ్రగామిగా నిలిచిన పద్మవిభూషణ్ రామోజీరావు మృతికి నా సంతాపం. జర్నలిజం, సినిమా, వినోదానికి ఆయన చేసిన కృషి మీడియా ల్యాండ్‌స్కేప్‌ను మార్చింది. – రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత⇒ మీడియా, వినోద రంగాల్లో ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. –ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ⇒ భారతీయ మీడియా, సినీ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన దిగ్గజం రామోజీరావు. తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు, నిజాయితీని పెంపొందించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తీరని లోటు: రేవంత్‌రెడ్డి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని పేర్కొన్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో జరిగిన సమావేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.తెలుగు వారి కీర్తిని చాటిన వ్యక్తి: చంద్రబాబురామోజీ మరణవార్త తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ తిరిగి వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి ఫిలింసిటీకి వెళ్లి రామోజీ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో బాబు మాట్లాడుతూ, రామోజీరావును యుగపురుషుడిగా అభివర్ణించారు. నిత్యం సమాజహితం కోసం, తెలుగుజాతి కోసం పనిచేసిన వ్యక్తి రామోజీ అని, సాధారణ కుటుంబంలో పుట్టి, అసాధారణ వ్యక్తిగా ఎదిగారని, తెలుగువారి కీర్తిని దశదిశలా చాటారని అన్నారు. కేసీఆర్ సంతాపం...రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డిలతో కలిసి ఫిలింసిటీలో రామోజీరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.⇒ రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారు. నేను మాత్రం ఆయనలో చిన్న పిల్లాడిని చూశాను. ఆయనకు పెన్నులంటే ఇష్టం. ప్రజారాజ్యం పార్టీ నడుపుతున్న సమయంలో ఒక పెన్ను బహూకరిస్తే దాన్ని చూసి ఆయన మురిసిపోయారు. – చిరంజీవి⇒ ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నా. కానీ, ఇంతలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి. – పవన్ కళ్యాణ్ప్రముఖుల సంతాపం..రామోజీకి నివాళులు అర్పించిన వారిలో బీజేపీ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పువ్వాడ అజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వరరెడ్డి, సినీనటులు నాగార్జున, వెంకటేశ్, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, కళ్యాణ్‌రామ్, నరేష్, కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్, బోయపాటి శ్రీను, రాజమౌళి, కీరవాణి, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఇళయరాజా, మంచు విష్ణు, విజయేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్ -
పెదపారుపూడి టు ఫిలింసిటీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. పరస్పరం భిన్నమైన రంగాల్లో వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధించారు. యాడ్ ఏజెన్సీలో పనిచేయడం మొదలుపెట్టి.. ఎరువుల వ్యాపారం, చిట్‌ఫండ్స్, పచ్చళ్లు, మీడియా వంటి ఎన్నో రంగాలకు విస్తరించారు. రామోజీరావు ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16న జని్మంచారు. ఆయన తండ్రి వెంకట సుబ్బారావు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. పెదపారుపూడి, గుడివాడలలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ (బీఎస్సీ) గుడివాడలోనే పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో రామోజీరావుకు వివాహం జరిగింది. మొదట యాడ్ ఏజెన్సీలో చేరి..: బీఎస్సీ పూర్తిచేసిన రామోజీరావు.. తన కుటుంబం చేసే వ్యవసాయానికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అడ్వర్టైజింగ్ రంగం వైపు ఆసక్తి కలగడంతో.. ఢిల్లీ వెళ్లి ఓ అడ్వరై్టజింగ్ ఏజెన్సీలో చేరారు. అక్కడ మూడేళ్లు పనిచేశాక హైదరాబాద్‌కు వచ్చారు. 1962 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థను, 1965లో కిరణ్ యాడ్స్ పేరిట అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. తర్వాత ఇతర వ్యాపారాలవైపు దృష్టి సారించారు. 1967–1969 మధ్య వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే వ్యవసాయ సమాచారంతో కూడిన అన్నదాత పత్రికను ప్రారంభించారు.1970లో ఇమేజెస్ ఔట్‌డోర్ యాడ్ ఏజెన్సీని, విశాఖలో డాలి్ఫన్ హోటల్‌ను ప్రారంభించారు. అప్పటికే పత్రికారంగంపై ఆసక్తి ఉన్న ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు పత్రికకు శ్రీకారం చుట్టారు. స్థానిక వార్తలకు ప్రాధాన్యమివ్వటం, గ్రామాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, వేగంగా పంపిణీ చేయడం ద్వారా పత్రికను పాఠకులకు చేరువ చేశారు. ఎల్రక్టానిక్ మీడియాతోనూ..: పాత్రికేయ రంగంలో మార్పులను ముందుగానే గుర్తించిన రామోజీరావు.. మొదట్లో వినోదం ప్రధానాంశంగా ఈటీవీ చానల్‌ను ప్రారంభించారు. తర్వాత పూర్తి న్యూస్ చానల్ ఈటీవీ2ను ప్రారంభించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీ, తెలంగాణలకు విడివిడి న్యూస్ చానళ్లను ఏర్పాటు చేశారు. ఇక ‘ప్రియ’పేరిట రామోజీ ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారం కూడా సక్సెస్ అయింది. వివిధ రంగాల్లో రామోజీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. రామయ్య నుంచి రామోజీగా మార్చుకుని..: రామోజీరావు తాత పేరు రామయ్య. ఆయన వ్యవసాయం చేసేవారు. రామోజీ జని్మంచడానికి కొన్నిరోజుల ముందు రామయ్య మరణించారు. దీంతో తాత పేరే మనవడికి పెట్టారు. కానీ రామయ్య అనే పేరు పాతదిగా అనిపించడంతో.. ఆయన తన పేరును రామోజీగా మార్చుకున్నారని చెబుతారు. తెల్ల వ్రస్తాలంటే మక్కువ..: రామోజీరావు ఎప్పుడు చూసినా తెలుపు రంగు వస్త్రధారణతోనే కనిపిస్తారు. ఆయనకు తెలుపు రంగు వ్రస్తాలంటే ప్రత్యేక మక్కువే దీనికి కారణమని చెబుతారు. వదులుగా ఉండే తెలుపు రంగు హాఫ్‌హ్యాండ్స్ షర్టు, అదే రంగు ప్యాంటు, మ్యాచింగ్‌గా తెలుపు రంగు షూస్ ధరించేవారు. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎప్పుడూ తెలుపు వస్త్రధారణతో ఉండేవారు.పత్రికారంగానికి ఎనలేని సేవలందించారురామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందివైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ‘తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో శనివారం పోస్టు చేశారు. -
రామోజీ కన్నుమూత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపారవేత్త, రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీని కుటుంబ సభ్యులు నానక్‌రాంగూడలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. గుండె పనితీరు దెబ్బతిన్నదని, బీపీ పడిపోయిందని గుర్తించిన వైద్యులు.. ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. యాంజియోగ్రామ్ చేసి గుండె నాళాల్లో స్టంట్ వేశారు. అయినా ఆయన కోలుకోలేదు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించి.. శనివారం తెల్లవారుజామున 4.51గంట లకు తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 7.45 గంటలకు రామోజీ ఫిలింసిటీకి తెచ్చారు. రామోజీ మరణ వార్త తెలిసి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఫిలింసిటీలో రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిలింసిటీలోని నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ గ్రామాల మధ్యలో ప్రత్యేకంగా నిర్మించిన స్మృతివనంలో రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఫోన్లో మాట్లాడి ఈ మేరకు సూచనలు చేశారు. దీంతో ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ పోలీస్ కమిషనర్లను సీఎస్ ఆదేశించారు. బతికుండగానే రామోజీ స్మృతివనం ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీరావు తాను బతికి ఉండగానే ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ మధ్యలో ప్రత్యేక స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆయన అంత్యక్రియలను ఈ స్మృతివనంలోనే నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి శనివారం స్మృతి వనాన్ని పరిశీలించి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు చేయించారు. -
రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి
-
రామోజీ రావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం
-
రామోజీరావు కన్నుమూత.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
రామోజీరావు మరణం దిగ్భ్రాంతి కలిగించింది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రామోజీరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ‘‘రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2024గవర్నర్ సంతాపం..రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియా, వినోద రంగంలో నిష్ణాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని, జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించినందుకు గాను రామోజీరావును పద్మవిభూషణ్‌తో సత్కరించినట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
రామోజీరావు అస్తమయంపై ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్: రామోజీరావు మరణం పట్ల రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీతో పాటు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డి తదితరులు తమ సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి.వెంకయ్యనాయడు.. చేపట్టిన ప్రతీ పనిలో రామోజీరావు విజయంసాధించారుప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా గర్వపడేలా చేశారుఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయిరామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాకేటీఆర్జర్నలిజానికి గుర్తింపుగా చిరకాలం నిలిచారుఫిిల్మ్సిటీ నిర్మాణం రామోజీరావుకే సాధ్యమైందిఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతినటుడు రజినీకాంత్నా గురువు, నా శ్రేయోభిలాషి రామోజీరావు ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యాపాత్రికేయ రంగంలో, సినిమాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీ రావురాజకీయాల్లో గొప్ప కింగ్ మేకర్ అనిపించుకున్నారునా జీవితంలో రామోజీరావుకు ప్రత్యేక స్థానం ఉందిఆయన నాకు మార్గదర్శకుడు, నాకు స్ఫూర్తి ప్రదాతఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాచంద్రబాబురామోజీరావు మరణం పట్ల చంద్రబాబు సంతాపంఫిల్మ్సిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళులురామోజీ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారురామోజీరావు మరణం చాలా బాధాకరం: చంద్రబాబురామోజీరావు ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థతెలుగు జాతి కోసం అహర్నిశలు కృషిచేశారుప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు కృషి చేసేవారుఎప్పుడూ ప్రజల పక్షంగానే నిలబడతానని ఎప్పుడూ స్పష్టంగా చెప్పేవారుఆయన సమాజహితం కోసం పని చేశారుచిత్రపరిశ్రమకు కూడా ఎనలేని సేవలు అందించారురామోజీరావు లాంటి వ్యక్తిని పొగొట్టుకోవడం బాధగా ఉందిమరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రామోజీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా సీఎం ఆదేశాలు జారీ చేశారు.1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు ‘సితార’ సినీ పత్రిక నడిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మవిభూషణ్‌తో సత్కరించింది.రామోజీరావుకు సినీ ప్రముఖులు సంతాపంఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. ‘ఓం శాంతి’. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఎక్స్ వేదికగా చిరంజీవి తన సంతాపాన్ని ప్రకటించారు. రజనీకాంత్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, వెంకటేశ్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు ఎక్స్ వేదికగా రామోజీరావుకి సంతాపం తెలిపారు. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం .. దివి కేగింది 🙏💔 🙏 ఓం శాంతి 🙏 pic.twitter.com/a8H8t9Tzvf— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2024I am deeply saddened on hearing the demise of my mentor and well wisher Shri Ramoji Rao Garu. The man who created history in Journalism, Cinema and a great kingmaker in Politics. He was my guide and inspiration in my life. May his soul rest in peace. @Ramoji_FilmCity— Rajinikanth (@rajinikanth) June 8, 2024శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం… pic.twitter.com/ly5qy3nVUm— Jr NTR (@tarak9999) June 8, 2024Deeply saddened by the passing of Ramoji Rao Garu, a visionary always ahead of his time. Ramoji Film City is a testament to his brilliance and passion for cinema. His legacy will continue to inspire us all. My thoughts and prayers are with the family and loved ones. May his soul…— Mahesh Babu (@urstrulyMahesh) June 8, 2024Ramoji Rao garu was a true visionary whose revolutionary work in Indian media has left an unforgettable legacy. His contributions to journalism and cinema have inspired so many. He will be missed dearly. Heartfelt condolences to his loved ones. May his soul rest in peace 🙏🏻 pic.twitter.com/YKEDaEHeCT— Venkatesh Daggubati (@VenkyMama) June 8, 2024 -
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత
-
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.మూడురోజుల క్రితం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు.రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా సీఎం ఆదేశాలు జారీ చేశారు.రేపు రామోజీరావు అంత్యక్రియలురామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీరావు భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. వెంకయ్యనాయుడు, కేటీఆర్, సబితా, జానారెడ్డి,హరీశ్‌రావు రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.రేపు సినిమా షూటింగ్‌లకు సెలవురామోజీరావు మృతికి సంతాపంగా రేపు(ఆదివారం) సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు.రామోజీ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు ‘సితార’ సినీ పత్రిక నడిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మవిభూషణ్‌తో సత్కరించింది.ఇదీ చదవండి: రామోజీరావు మృతిపట్ల ప్రముఖుల సంతాపం -
అసైన్డ్ భూములపై రామోజీవి రోత రాతలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో రామోజీరావు, పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రోత రాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలనే సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందు ఉన్న భూములపైనే హక్కులు కల్పించారని తెలిపారు. ఇదంతా పారదర్శకంగానే చేశారన్నారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ నేతలు, పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం రూ.5 లక్షలకు కొని రూ. కోట్లు దోపిడీ చేశారని చెప్పారు. రామోజీరావు దళితుల భూములు దోచుకుని ఫిలిం సిటీని నిర్మించింది వాస్తవం కాదా.. అని నిలదీశారు. అందరి గురించి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు పిచ్చి రాతలు రాసే రామోజీరావు ఈ విషయాలను ఈనాడులో ఎందుకు రాయలేదన్నారు. ఆయన అక్రమాలు చేసినా మంచి, ఇతరులు మంచి చేసినా అక్రమమా.. అని నిలదీశారు. వయస్సు పెరిగినా రామోజీ బుద్ధి మారలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. చంద్రబాబు దళితవ్యతిరేకి అని చెప్పారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అన్న చంద్రబాబును ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశారని తెలిపారు. చంద్రబాబుకు, రామోజీకి దళితుల అభ్యున్నతి ఇష్టంలేదని, అందుకే దళితులకు లబ్ధి చేకూర్చే సీఎం జగన్ నిర్ణయంపై విషం కక్కుతున్నారని చెప్పారు. తాము చంద్రబాబులా దళితుల భూములను కొట్టేసి తప్పుడు పనులు ఎన్నటికీ చేయబోమన్నారు. రామోజీ వాస్తవాలు గ్రహించాలని, సీఎం జగన్ ప్రభుత్వంపై పిచ్చి రాతలు మానుకోవాలని అన్నారు. -
వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక ఘటనకు విశేష ప్రచారం వచ్చింది. అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎంను కిందపడేసినట్లు చెబుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సహజంగానే వైరల్ అవుతుంది. అలాంటి వాటిని ఎవరూ సమర్థించరు. కానీ అదే సమయంలో అక్కడ జరిగిన ఇతర గొడవలు, టీడీపీవారి దౌర్జన్యాలను కప్పిపుచ్చుతూ ఈ వీడియో మాత్రమే లీక్ అయిన తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది. మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిన్నెల్లి తప్పు చేశారో, లేదో కానీ, దానితో పోల్చితే ఎన్నికల సంఘం చేసిన తప్పే పెద్దదిగా కనిపిస్తుంది.ఎన్నికల సంఘం వద్ద రహస్యంగా ఉండవలసిన వెబ్ కాస్ట్ వీడియో ఫుటేజీ బయటకు వచ్చిన వైనం, అది కూడా టీడీపీ నేత లోకేష్ కు దగ్గరకు చేరడం, దానిని ఆయన ఎడిట్ చేసి తమకు అనుకూలమైన మేర ఎన్నికల కమిషన్ కు పంపడం, వెంటనే కమిషన్ స్పందించడం.. ఇవన్ని చూస్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఏదో పెద్ద కుట్రే జరుగుతోందన్న అనుమానం వస్తుంది. లోకేష్ వద్దకు ఆ వీడియో ఎలా వెళ్లిందో తెలియదని సీఈఓ మీనా చెప్పడాన్ని బట్టే ఇందులో కుట్ర స్వభావం కనిపిస్తుంది. దీనిపై లోకేష్ ను విచారిస్తారా? లేదా? అనేది చూడాలి.మే పదమూడో తేదీన జరిగిన ఈ ఘటన వీడియో ఎనిమిది రోజుల తర్వాత ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఒక ప్రశ్న. అలా అనధికారికంగా ఎన్నికల సంఘం నుంచి వీడియోలు లీక్ కావచ్చా? అది నిజమైన వీడియోనా? కాదా? అనే దానిని దృవీకకరించుకోకుండా ఎన్నికల సంఘం చర్యకు ఉపక్రమించవచ్చా? వీడియో లీక్ పై విచారణ జరగదా? సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోరా? పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రజలకు అనుమానాలు రావా? ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీలు జత కట్టాక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదని, కూటమి నేతలు ఏది కోరితే అది చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగినట్లే ఇలా రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లితే కౌంటింగ్ అయినా సజావుగా జరుగుతుందా? లేక కూటమికి ఉపయోగపడేలా ఈసీ నిర్ణయాలు తీసుకుంటుందా? అనే సందేహాలు వచ్చే అవకాశం ఉంది.ఈవీఎంలను కిందపడేసి పాడు చేసే యత్నాలకు సంబంధించి అనే ఈ వీడియోలను ఈసీ అధికారికంగా విడుదల చేసి ఉండవచ్చు. అప్పుడు ఎమ్మెల్యే అయినా, మరొకరు అయినా తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. అలాకాకుండా సెలెక్టివ్ గా వీడియో లీక్ కావడంలో ఆంత్యర్యం ఏమిటి? దానిని ఎవరైనా ఈసీ వర్గాల నుంచి తస్కరించి బయటపెట్టారా? లేక అధికారులు ఎవరైనా లీక్ చేశారా? లేదా పిన్నెల్లి లాయర్ అనుమానించినట్లు అదేమైనా ఫేక్ వీడియోనా? అనేది తేలాలి.పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబందిత పాల్వాయి గ్రామం వద్ద టీడీపీ వారు రిగ్గింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు శ్రద్ద చూపలేదట. ఈసీకి ఫిర్యాదు చేసినా వారు సీరియస్‌గా చర్య తీసుకోలేదు. అక్కడ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్‌ను కూడా తరిమేసి దొంగ ఓట్లను వేయించుకోవడం, బలహీనవర్గాలవారిని ఓటింగ్ కు రాకుండా భయపెట్టడం వంటి సంఘటనలు ఏమి చెబుతాయి! ఆ సమాచారం తెలిసిన పిన్నెల్లి అక్కడకు వెళ్లి ఆవేశపడి ఉండవచ్చు. కానీ దానివల్ల ఈవీఎం. ఏమీ పాడుకాలేదు. అక్కడ రీపోలింగ్ కూడా అధికారులు పెట్టలేదు. అలాంటటప్పుడు ఈవీఎం ద్వంసం అని ప్రచారం చేయడం అర్దరహితం. టీడీపీ వారు కూడా ఇలాగే మరో ఆరేడు, చోట్ల పల్నాడు ప్రాంతంలో ఈవీఎంలను పాడు చేయడానికి యత్నించారు. అక్కడ కూడా రీపోలింగ్ జరగలేదు.ఆ ఘటనలలో కొందరు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు. అయినా టీడీపీ వారు చేసిన తప్పులను మాత్రం కప్పిపుచ్చుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వైఎస్సార్సీపీపై మాత్రం విపరీత ద్వేషపూరిత ప్రచారం చేస్తోంది. ఈసీ ఈవీఎంలను ద్వంసం చేయడానికి జరిగే ప్రయత్నాల వీడియోలన్నిటిని బహిరంగపరచి ఉండాల్సింది. అలాగే పాల్వాయి వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్ ను కొట్టి బయటకు లాగడం, తదితర దృశ్యాలను కూడా విడుదల చేయాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఈసీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి.తాజాగా గుంటూరు ఐజీ త్రిపాఠి కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై వచ్చిన కథనం సంచలనంగా ఉంది. ఇదంతా చూస్తే ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ, అధికారం మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చెలాయిస్తున్నదన్న అభిప్రాయం వస్తుంది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈసీ పై ఆరోపణలు చేస్తూ సిఈఓ ఆఫీస్ వద్ద ధర్నా కూడా చేశారు. తన మనిషిగా భావించి ఇంటెలెజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడానికి వీలు లేదని నానా రచ్చ చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఫలానా అధికారి కావాలని కానీ, ఫలానా అధికారులను ఎందుకు బదిలీ చేశారని కానీ ఈసీని ప్రశ్నించలేదు.చంద్రబాబు మాదిరి గొడవలకు దిగకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు. పార్టీపరంగా ఏదైనా అవసరం వస్తే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తున్నారు. ఈ రకంగా చంద్రబాబుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఉన్న తేడాను గమనించవచ్చు. అంతేకాక జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎందుకు అంటకాగడానికి విశ్వయత్నం చేసింది అందరికి అర్ధం అయిపోతోంది. ఇక్కడ కొన్ని సంగతులు చెప్పుకోవాలి. ఓటుకు నోటు కేసు సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో అరెస్టు అయ్యారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మనవాళ్లు భ్రీఫ్ డ్ మి అంటూ చేసిన వ్యాఖ్యల ఆడియో బయటకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు వాదన ఏమిటంటే తన ఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించేవారు. పైగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఏపీలో ఎదురు కేసులు రిజిస్టర్ చేయించారు. ఆ కేసులో ముప్పైసార్లు చార్జీషీట్ లో చంద్రబాబు పేరు వచ్చినా, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకుండా మేనేజ్ చేసుకోగలిగారు. దానిని అంతటిని కుట్రగా ప్రచారం చేశారే కానీ, జరిగింది తప్పు అని చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.అదే కాదు. కొద్ది నెలల క్రితం పుంగనూరు, అంగళ్లు వద్ద జరిగిన గొడవలలో చంద్రబాబు స్వయంగా తన కార్యకర్తలను రెచ్చగొడుతూ తన్నండి.. కొట్టండి.. అంటూ దూషణలకు దిగారు. దానిపై కేసు అయితే, అదంతా పోలీసుల తప్పు గా ఈనాడు, జ్యోతి ప్రచారం చేశాయి. పుంగనూరులో అయితే చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్దం చేయడం, రాళ్లు విసరడం చేస్తే ఒక పోలీస్ కానీస్టేబుల్ కు కన్ను కూడా పోయింది. అయినా ఈనాడు మీడియా పోలీసులదే తప్పన్నట్లు, టీడీపీ నేతలను అరెస్టు చేయడం అక్రమం అనేట్లుగా దారుణ ప్రచారం చేసింది.ఏపీలో ఎల్లో మీడియా ఎంత నీచంగా వ్యవహరిస్తున్నదనడానికి ఇవన్ని ఉదాహరణలే. అలాగే ఇతర చోట్ల ఈవీఎం లను కింద పడేస్తే టీడీపీ వారిపై పెట్టిన కేసులకు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై పెట్టిన కేసుల సెక్షన్లకు చాలా తేడా ఉందట. ఎమ్మెల్యేపై అతి కఠినమైన సెక్షన్లు పెట్టడం కూడా కుట్రగానే చూస్తున్నారు. హైకోర్టు ఈ కేసులో తాత్కాలిక స్టే ఇచ్చింది. అది వేరే విషయం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, నేతలు కానీ కొందరు ఇలాంటి నేరాలకు పాల్పడకపోలేదు. ఉదాహరణకు గతంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే బాంబుల శివారెడ్డిగా పేరొందారు. వేరేప్రాంతానికి చెందిన ఆయన హైదరాబాద్ స్థానిక ఎన్నికలలో బూత్‌ల వద్ద బాంబులు విసిరారు. మరో టీడీపీ ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లి బాక్స్‌లలో నీళ్లు పోశారు. ఈవీఎం లకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న రోజుల్లో ఆయన మద్దతుదారుడు ఒకరు ఏకంగా ఒక ఈవీఎం నే అపహరించుకుని వచ్చారన్న కేసు నమోదు అయింది.గతంలో 1999 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రముఖ నేత కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణిస్తే, ఆయనపై కేసు విచారణే జరగకుండా చంద్రబాబు అప్పటి కేంద్ర హోం మంత్రి అద్వాని ద్వారా మేనేజ్ చేయగలిగారు అప్పుడు ఆ కేసును బీజేపీ సహకారంతో కప్పిపుచ్చగలిగారు. ఇప్పుడు బీజేపీ సహకారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చికాకు సృష్టిస్తున్నారు. తమకు కావల్సిన పోలీసు అదికారులను ఈసీ ద్వారా పోస్టు చేయించుకుని గందరగోళం చేస్తున్నారు. ఈసీ ఇంతగా దిగజారిపోవడం ఇటీవలికాలంలో ఇదే అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో అనేకం జరిగినా, బలహీనవర్గాలవారు ఓట్లు వేయకుండా పోలీసు అధికారులే ఇప్పుడు అడ్డుకున్నా అదంతా ప్రజాస్వామ్యమని ఈనాడు రామోజీరావు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాత్రం ఘోర అపచారానికి పాల్పడినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. టీడీపీ వారు ఏమి చేసినా భుజాన వేసుకోవడం, అదే ఎదుటివారిది చిన్న తప్పు అయినా గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేయడం ఈ మీడియాకు అలవాటు అయింది.దీనికి తోడు ఈనాడు రామోజీరావు రాజ్యాంగానికి ఏదో జరిగిపోయిందంటూ దిక్కుమాలిన సంపాదకీయం రాసి మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా మంచిదికాదని చెప్పవలసిన ఈ పెద్ద మనిషి టీడీపీ నేతల తప్పులను మాత్రం ఎంతదూరం అయినా వెళ్లి కాస్తున్నారు. మాచర్ల టీడీపీ అభ్యర్ధిపై పలు కేసులు ఉన్న విషయాన్ని కప్పిపుచ్చే యత్నం జరుగుతోంది. ఎన్నికల రోజున ఆయన ఆధ్వర్యంలో కొన్ని బూత్‌ల వద్ద జరిగిన అల్లర్లపై పలు వార్తలు వచ్చాయి. వాటి మీద ఏ చర్యలు తీసుకుంది తెలియదు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో పోలీసులు జరిపిన విధ్వంసంపై ఎన్నికల సంఘం ఏ చర్య తీసుకుందీ కూడా తెలియరాలేదు. పల్నాడుతో సహా వివిధ ప్రాంతాలలో సిట్ ఏర్పడిందే ప్రధానంగా టీడీపీవారి అరాచకాలపైన అనే సంగతి మర్చిపోకూడదు. దారుణాలకు పాల్పడి బలహీనవర్గాలవారిని ఓట్లు వేయనీయకుండా టీడీపీకి చెందినవారు చేసిన ప్రయత్నాలకు ఈనాడు కొమ్ముకాస్తున్న తీరు పెత్తందారులకు ఎలా వత్తాసు పలుకుతోంది అర్దం చేసుకోవచ్చు.పిన్నెల్లి పరార్ అనే బ్యానర్ కథనాలు రాసే ఈ పెద్దలు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పీఎస్ గా ఉన్న వ్యక్తి విచారణకు హాజరుకాకుండా అమెరికాకు పరారైతే మాత్రం సమర్థిస్తూ వార్తలు ఇస్తారు. చంద్రబాబుపై అవినీతి కేసు వస్తే నిర్లజ్జగా అది అక్రమ కేసు అని డబాయించడానికి రామోజీరావు బృందం చేసిన ప్రయత్నం చూశాక, వారు ఇంతేలే అని సరిపెట్టుకోవడం తప్ప ఏమి చేయగలం. ఆ రోజుల్లో చంద్రబాబును అరెస్టు చేస్తారా అని గగ్గోలు పెట్టిన ఈనాడు అర్జంట్ గా పిన్నెల్లిని తీసుకువెళ్లి జైలులో పెట్టాలని, ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని వీరే తీర్పు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు దొంగ మెడికల్ సర్టిఫికెట్లతో బెయిల్ పొందేవరకు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తప్పుడు వార్తలు రాసిన ఈనాడు రామోజీరావు నుంచి ఇంతకన్నా ప్రమాణాలతో కూడిన జర్నలిజాన్ని ఆశించడం తప్పే అనుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
ఏపీలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలో మార్పు వస్తుందేమోలే అని ఆశించినవారికి యధాప్రకారం ఆశాభంగమే ఎదురైంది. ఎన్నికల ముందు ఎలాగైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను, ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి విశ్వయత్నం చేశారో, వైఎస్సార్సీపీపై విషం కక్కారో అదే ధోరణి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అవే అబద్దాలు, అవే మోసపూరిత కథనాలు, కక్ష, విద్వేషంతో కూడిన వార్తలు రాస్తూ ప్రజలను ఇంకా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు.ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున, పోలింగ్ అయిన తర్వాత జరిగిన హింసపై వారు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్న తీరు నీచంగా ఉంది. టీడీపీ వారిని రక్షించడానికి, వారి ప్రమేయంతో నియమితులైన పోలీసు అధికారులకు ఎలాంటి సమస్య రాకుండా చేయాలన్న లక్ష్యంతో వారు రాస్తున్న వార్తలు జర్నలిజం ప్రమాణాలను దిగజార్చుతూనే ఉన్నాయి. ఈ ఘటనలలో ఇరు వర్గాల తప్పులు ఉంటే వాటిని రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా రాస్తున్న తీరును బట్టే ఈ అల్లర్లు పెత్తందార్లే చేశారని అర్థం అవుతుంది. బలహీనవర్గాలపై జరిగిన దాడుల పట్ల కూడా మానవత్వం లేకుండా రామోజీ వార్తలు రాయించారంటే పేదలపై ఎంతటి పగ పట్టారో తెలుస్తుంది.ఎన్నికల సంఘం ఈ దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశిస్తే, ఆ ప్రకారం ప్రభుత్వం కొంతమంది అధికారులను ఎంపిక చేసింది. అంతే!ఈనాడు రామోజీకి నచ్చలేదట. వారందరికి రాజకీయాలు అంటగడుతూ రాసేశారు. అంటే ముందస్తుగానే సిట్ అధికారులను ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి వీరు ప్రయత్నం చేశారన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వారు ఇచ్చిన స్టోరీలు చూస్తే వీరు ఉగ్రవాదుల కన్నా ఘోరంగా మారారన్న సంగతి ఇట్టే అర్థం అయిపోతుంది. ఈనాడు రామోజీరావు రాస్తే ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసివేయాల్సిందే. ఆయన ఎవరిని కోరితే వారిని ఆయా పోస్టులలో నియమించాల్సిందే. లేకుంటే వారిపై బండలు వేస్తాం. వారిని నైతికంగా దెబ్బతీస్తాం. ఈ క్రమంలో వారు చెప్పినట్లు వింటే సరి.. ఎక్కడైనా ఒకటి, రెండు విషయాలలో మరీ బాగుండదని వినకపోతే.. ఇంకేముంది.. ఎన్నికల సంఘాన్ని వదలిపెట్టం అన్న రీతిలో దారుణమైన కథనాలు వండి పాఠకులను మోసం చేస్తున్నారు.ఇలా ఒకటి కాదు.. ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ బురద వేయడం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాయో, లేదో ఇంకా డీబీటీ కింద లబ్దిదారులకు డబ్బులు ఎందుకు వేయలేదని రాశారు. పేదలకు కాకుండా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం తన డ్యూటీ ప్రకారం ఆయా స్కీముల కింద నిధులు విడుదల చేసింది. ఇంకా వారికి ఇవ్వలేదు.. వీరికి ఇవ్వలేదు.. అంటూ పిచ్చి కథనాలు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే చేసిన పనులకు బిల్లులు రాక వారు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రాసేది వీరే. బిల్లులు చెల్లిస్తుంటే స్కీముల డబ్బును కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని రాసేది వీళ్లే.రాజకీయ నేతలు డబుల్ టాక్ చేయడంలో దిట్టలని అనుకుంటాం. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు డాక్టరేట్ సంపాదించారని అంతా భావిస్తారు. కానీ వారిని మించి రామోజీరావు, రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా వారు ఏది పడితే అది రాసి పరువు పోగొట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి పరువు పోయాక, కొత్తగా పోయేదేముందిలే అని సిగ్గు విడిచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎన్నికల సంఘం పల్నాడు, తాడిపత్రి, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసపై సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించగానే, టీడీపీకి కొమ్ముకాసి తప్పులు చేసిన అధికారులను రక్షించడానికి ఈ మీడియా పూనుకుంది. వైఎస్సార్సీపీవారే హింసకు పాల్పడ్డారని పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించింది.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కానీ, స్వయంగా ఒక మంత్రిగాని ఫోన్ చేస్తే బదులు ఇవ్వని ఎస్పీలను గొప్పవారిగా ప్రొజెక్టు చేయడానికి యత్నించారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీ వారు రాసిన పిర్యాదుపై సంతకం చేసి ఎన్నికల కమిషన్‌కు పంపించారు. అందులో ఏ ఏ అధికారిని తొలగించాలో రాయడమే కాకుండా, ఫలానా వారిని నియమించాలని కూడా కోరడం చిత్రమైన సంగతి. ఎన్నికల సంఘం కూడా ప్రామ్ట్ గా వారు కోరిన విధంగా అధికారులను మార్పు చేసింది. ఆ సమయంలో డీజీపీ, సీఎస్‌ను, ఇంటెలెజజెన్స్ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని ఈనాడు పెద్ద ఉద్యమంలా చెడరాసింది. ఈసీ ఒక్క సీఎస్‌ను తప్ప వారు కోరిన వారందరిని బదిలీ చేసింది.కొత్త అధికారులు వైఎస్సార్సీపీ ఓటర్లను బెదిరించి ఓటింగ్‌కు రాకుండా చేస్తారని వీరు ఆశించినట్లు ఉన్నారు. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయినా పేదలంతా వెల్లువలా ఓటింగ్‌కు తరలిరావడంతో వీరు ఆశించిన రీతిలో టీడీపీకి ప్రయోజనం కల్పించి ఉండకపోవచ్చు. దాంతో మరుసటి రోజు టీడీపీ వారు హింసాకాండకు దిగారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపైన దాడి చేశారు. తాడిపత్రిలో టీడీపీ రౌడీ మూకలు అల్లర్లకు దిగితే పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు. పైగా కొందరు పోలీసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి అరాచకం చేశారు. అది కనిపించకుండా సీసీ కెమెరాలను కూడా పోలీసులే పగులకొట్టారు. మరో సీసీ కెమెరాలో చిక్కడంతో వారు దొరికిపోయారు. ఈ సన్నివేశం మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చింది. దాంతో అనంతపురం, పల్నాడు కొత్త ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది.ఇది కేవలం తెలుగుదేశం వారి నిర్వాకమే. రామోజీ వంటివారి నీచమైన రాతల ఫలితమే అని చెప్పాలి. మరి కొందరిపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు వారిని రక్షించడానికి కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు సీఎస్‌పై అడ్డగోలు కథనం రాశారు. మొత్తం ఈ హింసాకాండకు సీఎస్ బాధ్యుడని రామోజీ తేల్చేశారు. ఆయన ఎలా బాధ్యుడు అవుతారో అర్థం కాదు. కొత్తగా నియమితుడైన డీజీపీ బాధ్యుడు కాదట. టీడీపీ, ఈనాడు ఏరికోరి వేయించుకున్న ఎస్పీలు బాధ్యులు కాదట. అర్థం, పర్థం లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు చేసిన తెలివితక్కువ నిర్ణయాలు కారణం కాదట. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక సీఎస్ వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారని రామోజీ తేల్చేశారు.జవహర్ రెడ్డి ఏమి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు? ఈసీ ఏమి చెబితే అది చేశారు తప్ప సొంతంగా ఆయన చేసింది ఏముంది? అయినా రామోజీ మరి అది పార్టీ పక్షపాతమో, కుల పక్షపాతమోకానీ, నిర్లజ్జగా ప్రభుత్వ ఉన్నతాధికారి నైతికస్థైర్యం దెబ్బతినేలా చెత్త వార్తలు రాసి పారేశారు. చేతిలో టీవీ, పేపర్ ఉంది కదా అని, ఎలాగూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయా వ్యవస్థలలో తమకు పలుకుబడి ఉంది కదా అని ఇంత ఘోరంగా వార్తలు ఇస్తారా? నిజానికి ఇలాంటి వార్తలు రాసిన ఈనాడు రామోజీరావుపై కేసు పెట్టాలి! ఈసీ ఛీఫ్ సెక్రటరీపై ఆధారపడుతూ నిర్ణయాలు చేసిందట. అంటే చంద్రబాబుకో, రామోజీకో ఫోన్ చేసి వారు ఏమి ఆదేశిస్తే అది చేయాలన్నది వీరి కోరిక కావచ్చు. అక్కడికి వీరు అడిగినవన్నీ ఈసీ చేసినా కనీసం కృతజ్ఞత లేకుండా ఈసీని ఆక్షేపిస్తూ వార్తలు ఇచ్చారంటేనే వీరు ఎంత అవకాశవాదులో అర్థం చేసుకోవచ్చు.వృద్దులకు ఇళ్ల వద్ద వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వద్దని ఈసీ ద్వారా చెప్పించిందే తెలుగుదేశం, ఈనాడు రామోజీ వంటి వారు అయితే దానికి జవహర్ రెడ్డి బాధ్యుడట. ఈసీ సూచనలను పరిగణనలోకి తీసుకునే సీఎస్ గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు. బ్యాంకుల ద్వారా పెన్షన్ ఇవ్వాలని కోరింది నిమ్మగడ్డ రమేషే కదా! అయినా ఆయన తప్పు లేదట. జనం అందరికి ఇది అర్థం అయినా రామోజీకి ఇంకా తెలియలేదు. వృద్దులంతా చంద్రబాబును, నిమ్మగడ్డను, రామోజీ వంటివారిని బండబూతులు తిట్టిన సంగతి జనానికి తెలియదా! సీఎస్‌నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుని అధికారులను నియమించిందట.రామోజీ కొత్త రాజ్యాంగం రాయాలి. ప్రతిపక్ష నేతనో, లేక రామోజీనో నివేదికలు అడగాలి కాబోలు. పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగితే ఛీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేయకపోవడం ఏమిటి? అని ఈనాడు రాసిందంటే వారు జర్నలిజం చేస్తున్నారా? లేక ఇంకేమైనా చేస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. ఈసీకి జాబితాలు పంపించి, వారు ఎవరిని నియమించమని చెబితే వారిని అప్పాయింట్ చేస్తే అది కూడా జవహర్ రెడ్డి తప్పేనట. ఈయన ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని విపక్షాలు అన్నాయట. అది వేద వ్యాఖ్యమట.ఆయా స్కీములకు కొన్ని నెలలు డబ్బు వేయకుండా, ఎన్నికల ముందు లబ్దిదారులకు ఇచ్చేయత్నం చేశారని అన్నారు. మరి చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అని, అన్నదాత సుఖీభవ అని డబ్బులు వేస్తే గొప్ప విషయమని ఇదే ఎల్లో మీడియా ఆ రోజుల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో లబ్దిదారులకు డబ్బులు పడకుండా ఆపింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఇంక వైఎస్సార్సీపీకి వచ్చిన లాభం ఏముంది. చివరిగా వీరి అసలు బాధ బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం వివిధ ఆరోపణలపై సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదట. అదట వీరి కడుపు నొప్పికి కారణం. ఈయనేమో టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని పోలీసు అదికారులను ప్రభావితం చేయడానికి కృషి చేశారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అయినా పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదని ఈనాడు గొడవ చేస్తోంది. దీనిని బట్టే వారి మధ్య ఎలాంటి సంబంధ, బాంధవ్యాలు ఉన్నాయో గమనించవచ్చు.ఆంధ్రజ్యోతి అయితే హీనంగా మరో అబద్దపు కథనాన్ని ప్రచారం చేసింది. నీతి అయోగ్ లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తమకు తెలియదని అన్నదట. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారంటే ఓట్ల కోసం అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే రకంగా అబద్ధాలు చెబుతున్నారంటే వారికి బుద్ది, జ్ఞానం లేదని అనుకోవాలి. నీతి అయోగ్ ముసాయిదా పంపించామని తెలిపినా వీరు ఒప్పుకోరన్నమాట. ఎన్నికలు అయిపోయాక కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగబడి ఇలాంటి అసత్య కథనాలు ఇవ్వడం ద్వారా సాధించేది ఏమిటో తెలియదు! అంటే ఎన్నికలలో గెలవడం కష్టమనే అభిప్రాయానికి ఎల్లో మీడియా వచ్చేసిందా? అందుకే అప్పుడే మళ్లీ దాడి ఆరంభించిందా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్‌గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్‌లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ను తమ ట్రాప్‌లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్‌సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బృందం ఈసీని కలిసింది. టీడీపీ నేత చంద్రబాబు, ఈనాడు పత్రిక, ఆర్ టీవీపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ.. కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు, నంద్యాల సభల్లో చంద్రబాబు అప్రజాస్వామిక పదజాలం వాడారని, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ 230 ఫిర్యాదులు ఈసీకి ఇచ్చాం. ఎన్నికల సంఘం సరిగ్గా స్పదించలేదు. కూటమి ఫిర్యాదులపై వెంటనే స్పందించింది. ఈసీ ప్రభావం పడకుండా ఉండేందుకే బీజేపీతో చంద్రబాబు కూటమి కట్టారని మల్లాది విష్ణు అన్నారు.ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా తీర్పును ఆపలేరు. ప్రజలు ధర్మం, న్యాయం, నిజం పక్కనే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూతో ఆర్. టీవీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడింది. మనుగడ కోల్పోతున్నామన్న భయంతోనే సీఎం జగన్ పై ముప్పేట దాడి చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. -
నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
బాగా చదివే విద్యార్థులను వెన్నుతట్టి...ప్రోత్సహిస్తే ..మరింతగా వారు రాణిస్తారు..ఆ విద్యార్థుల ప్రతిభకే ప్రభుత్వం పట్టం గడుతూ... దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు వారికి చేయూతనందిస్తుంటే...వారి తల్లిదండ్రులే వేనోళ్ల కొనియాడుతున్న అపురూప దృశ్యం ఈ రోజు నవ్యాంధ్రలో అపూర్వంగా కనిపిస్తోంది.. రామోజీరావుకు ఒక్కరికే విద్యారంగ ప్రగతి నచ్చడం లేదు.. ఇంకా చెప్పాలంటే ఈ పచ్చమద్దతుదారుకు ఒంటిపై తేళ్లూ జెర్రులు పాకుతున్నట్లుగా ఉంది... పచ్చపార్టీ కొమ్ముకాయకపోతే తనకు రోజు గడవదు...పచ్చను రోజూ ఏదోలా పైకి లేపనిదే తనకు నిద్ర పట్టదు...ఈ మానసిక అల్లకల్లోలంలో మంచినీ చెడుగా చెప్పడం పెద్ద దురలవాటుగా మార్చుకున్నారు...శనివారం నాటి ఈనాడులో తన పిచి్చని, దౌర్భాగ్యాన్నంతా రంగరించి ‘ఈ చదువులు మాకొద్దు మామా’ శీర్షికన ప్రచురించిన కథనం ఇలాంటిదే...విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడమంటే నాణ్యమైన విద్యను నేరి్పంచడం...వారి భవిష్యత్తుకు జీవితకాల భరోసా ఇవ్వడం...ఇవేవీ చంద్రబాబు పద్నాలుగేళ్లలో చేయలేక, చేవలేక చతికిల పడితే కేవలం అయిదంటే అయిదేళ్లలో చేసి చూపించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధి రామోజీరావుకు మహా కంటగింపుగా ఉంది...మా బాబు సాధించలేకపోయిన ఘనతను జగన్ సాధిస్తారా? ...అనే ఈర‡్ష్య అణువణువునా జీరి్ణంచుకుపోయిన రామోజీలోని విషమంతా అక్షరాల్లో కుమ్మరించి, జనంలోకి వదులుతున్నారు...ఈ అవాస్తవాల విషానికి విరుగుడుగా వాస్తవాల ఫ్యాక్ట్‌చెక్ ఇది...సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు, నైపుణ్యాలతో ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నా, ఈనాడు రామోజీరావుకొక్కరికే అవేవీ కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం ఎందుకూ కొరగాకుండా పోయినా, అదే అద్భుతమన్నట్లు వరి్ణంచిన ఈనాడు ఇప్పుడు విద్యారంగం పురోభివృద్ధి సాధిస్తున్నా అవాస్తవాలను అచ్చేస్తోంది.. ఓ రిక్షా కార్మికుడు, వ్యవసాయ కూలీ, వెయిటర్..ఇలా రోజు పనిచేస్తే గానీ పొద్దుగడవని కుటుంబాల బిడ్డలు పెద్ద చదువుల్లో రాణిస్తుంటే అక్కసు వెళ్లగక్కుతోంది.ప్రతిభ ఉంటే ఆ విద్యారి్థకి ఎంత సాయమైనా చేసి చదివించే సంస్కరణలను సీఎం జగన్ ప్రవేశపెడితే.. కుట్ర కథనాలతో అసత్యాలను ప్రచారం చేస్తోంది. సీఎం జగన్ ఉన్నత విద్యను మొత్తం ఉచితం చేసేశారు. టీడీపీ ఐదేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కింద రూ.12 వేల కోట్లు చెల్లిస్తే.. 59 నెలల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 27 లక్షల మంది విద్యార్థులకు ఏకంగా రూ.18 వేల కోట్లకు పైగా చెల్లిస్తుండటం విశేషం. ఇందులో గత ప్రభుత్వం 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలూ ఉన్నాయి ఉన్నత చదువుల్లో భాగంగా పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చు కోసం ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సాయాన్ని ఈ ప్రభుత్వం అందిస్తోంది. గతంలో కుల ప్రాతిపదికన, కోర్సు ప్రాతిపదికన కేవలం రూ.4 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇంత మేలు చేస్తుంటే ఎన్నికల్లో చతికిలపడ్డ చంద్రబాబును ఎలాగైనా గద్దెనెక్కించేందుకు తనవంతు దుష్ట యజ్ఞాన్ని చేస్తోంది. ఆరోపణ: వర్సిటీల్లో 76 శాతం పోస్టుల ఖాళీ వాస్తవం: విశ్వవిద్యాలయాలలోని ఖాళీలు భర్తీ కాకపోవడానికి కారణం గత ప్రభుత్వం కాదా? గత ప్రభుత్వం అధికారంలో ఉన్న మొదటి తొమ్మిదేళ్లూ అంటే 1995 నుంచి 2004 వరకు, రాష్ట్రం విడిపోయాక 2014 నుంచి 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఆచార్యుడినైనా నియమించారా? దీనిపై ఎప్పుడైనా రామోజీరావు చంద్రబాబును ప్రశి్నంచారా? గత ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు నియామక ప్రక్రియపై పలు కేసులు అప్పుడే కోర్టుల్లో నమోదయ్యాయి. వాటిని కోర్టులో పరిష్కరించి గత సెప్టెంబర్ నాటికి ప్రభుత్వం వర్సిటీల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీని ప్రకారం 18 వర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. వీటిని భర్తీ చేస్తే సీఎం జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోనన్న కుట్రలతో చంద్రబాబు వాటిపైనా కోర్టుల్లో కేసులు వేయించడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆరోపణ: పీజీ చదివినా ఏం లాభం? ఉద్యోగాలు రావట్లేదు... వాస్తవం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచి్చన తర్వాత ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. కరిక్యులమ్‌ను పూర్తి స్థాయిలో మార్పు చేయడంతో పాటు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దారు. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్íÙప్తో చదువు సమయంలోనే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించారు. మైక్రోసాఫ్ట్‌తో కలిసి అప్‌స్కిల్లింగ్ చేపట్టారు. ఇవన్నీ చేయడంతోనే డిగ్రీ, బీటెక్‌లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ యువత ఎంఎన్సీ కంపెనీల్లో భారీ వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తోంది.ఇలా చంద్రబాబు హయాంలో కేవలం 35 వేలుగా ఉన్న క్యాంపస్ ఉద్యోగాలు 2022–23 విద్యా సంవత్సరంలో 1.80 లక్షలకు పెరిగాయి. ఇందులో ఒక్క సంప్రదాయ డిగ్రీతోనే 60 వేలకు పైగా ఉద్యోగాలు సాధించారు. వీటిల్లో మళ్లీ 17 వేల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులూ ఉండటం మరో విశేషం. ఇలా డిగ్రీ స్థాయిలో మంచి ఉద్యోగాలు రావడంతో యువత కుటుంబ ఆరి్థక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ముందుగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు.అనంతరం ఆన్లైన్ సరి్టఫికేషన్, దూరవిద్య.. ఇలా వివిధ రూపాల్లో తమకు నచి్చన పీజీ కోర్సులను అభ్యసిస్తున్నారు. కొన్ని కంపెనీలయితే తమ ఉద్యోగుల్లో సామర్థ్యాన్ని పెంచేందుకు అవే ప్రైవేట్ వర్సిటీలతో అనుసంధానమైన పీజీ, ఎంటెక్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగానే నేరుగా పీజీ చదివే వారి సంఖ్య కొంత తగ్గింది.ఆరోపణ: ఓట్ల కోసమే ఎడెక్స్ కోర్సులువాస్తవం: విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం ప్రఖ్యాత ప్రపంచ వర్సిటీల కోర్సులను సీఎం జగన్ ప్రభుత్వం ఎడెక్స్ ద్వారా అందిస్తోంది. వరల్డ్ క్లాస్ విద్యను అందుకున్నప్పుడే విద్యార్థులు మంచి ఉద్యోగం, మెరుగైన జీతం సంపాదిస్తారని బలంగా విశ్వసిస్తోంది. ప్రపంచ దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ ‘‘ఎడెక్స్’’ ద్వారా 260కి పైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్‌తో కలిసి 2 వేలకు పైగా కోర్సులను అందుబాటులోకి తెచి్చంది.హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సరి్టఫికేషన్లు పొందేలా ప్రోత్సహిస్తోంది. ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఏకంగా 1.80 లక్షలకు పైగా విద్యార్థులు సరి్టఫికేషన్లు సాధించారు. ఈ ఎడెక్స్ కోర్సులను బయట నేర్చుకోవాలంటే ఒక్కో కోర్సుకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.తొలి విడతలో 4 లక్షల మందికి ఈ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. వీరందరూ ఒక్కో కోర్సు చొప్పున చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్ల వ్యయమవుతుంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా ఈ మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఎడెక్స్ ద్వారా స్థానికంగా అధ్యాపకుల కొరతను అధిగమించడంతో పాటు నాణ్యమైన బోధననూ అందించగలుగుతోంది. ఆరోపణ: డిగ్రీ విద్య అస్తవ్యస్తం... నాణ్యమైన బీఈడీ విద్య లేదు.. వాస్తవం: డిగ్రీలో సింగిల్ మేజర్, మైనర్ విధానంతో విద్యారి్థని ఒక ప్రధాన సబ్జెక్టులో నిపుణుడిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. పాశ్చాత్య దేశాల్లో ఈ తరహా విద్యా విధానాన్ని అవలంబించడంతోనే అక్కడ ఉన్నత విద్యలో విద్యార్థులు బాగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే కళాశాల విద్యాశాఖ సుమారు 80 రకాల సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వీటికి తోడు 100కి పైగా మైనర్ సబ్జెక్టుల్లో విద్యార్థులు నచి్చన వాటిని చదువుకోవడానికి అవకాశమూ కలి్పస్తోంది.మరోవైపు యూజీసీ నిబంధనల ప్రకారం దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల డిగ్రీని (హానర్స్) ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని యూజీసీ సైతం ప్రశంసించింది. చంద్రబాబు హయాంలో కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్, బయటి రాష్ట్రాల విద్యార్థులను నిలువు దోపిడీ చేసేందుకు బీఈడీ, డీఈడీ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మౌలిక సౌకర్యాలు లేకుండా కాగితాలపై విద్యార్థులను చూపించి ప్రజాధనాన్ని దోపిడీ చేసేవారు.వీటికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం, తన అనుయాయులకు అక్రమార్జన నిలిచిపోవడంతోనే రామోజీరావు ఏడుపు ఎక్కువైంది. ఎంటెక్ కోర్సుల్లోనే ఇదే తంతు నడిచేది. బీటెక్‌లో సున్నా ప్రవేశాలు ఉన్న కాలేజీల్లో ఎంటెక్ 90–100 శాతం ప్రవేశాలు ఉండేవి. అంటే ఇక్కడ చదువు చెప్పేది ఉండదు. కేవలం ఫీజుల కోసమే కళాశాలల బోర్డులు తగిలించుకుని కనిపించేవి. ఆరోపణ: ఈఏపీసెట్‌లో 500లోపు ర్యాంకర్లు ఏపీలో చేరడం లేదు.. ప్రతిభావంతులు బయటికి వెళ్లిపోతున్నారు.. వాస్తవం: ఈఏపీసెట్‌లో టాప్ 500 లోపు ర్యాంకర్లు కచి్చతంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కచి్చతంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌లోనూ అర్హత సాధిస్తున్నారు. అలాంటప్పుడు వారు జాతీయ వర్సిటీలను కోరుకోవడంలో తప్పేముంది. వారు మినహా ఏపీలో మిగిలిన విద్యార్థులు ఇంజనీరింగ్ చేరుతున్నారు కదా. వీరిలో నుంచే దాదాపు అర కోటికిపైగా ప్యాకేజీలు పొందుతున్న విద్యార్థులు ఏటా కనిపిస్తున్నారు. మరి వీరంతా ఈనాడు దృష్టిలో ప్రతిభావంతులు కాదా? ఆరోపణ: నాణ్యమైన విద్య కోసం ప్రైవేటు విశ్వవిద్యాలయాల వైపు చూపు? వాస్తవం: చంద్రబాబు హయాంలో ప్రైవేట్ యూనివర్సిటీల్లో మెరిట్ ఉన్నా పేదింటి విద్యార్థులు చదువుకోవాలంటే రూ.లక్షలు వెచి్చంచాల్సిన పరిస్థితి. ఆ చదువులు కావాలంటే ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చేది. ఆస్తులు లేనివారు నిరాశతో, ప్రత్యామ్నాయాలు వెతుక్కునేవారు. సీఎం జగన్ మెరిట్ సాధించిన పేద విద్యార్థులకు ప్రైవేట్ వర్సిటీల్లో పైసా చెల్లించకుండానే ఉన్నత విద్యను అందిస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం కనీ్వనర్ కోటా సీట్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వారికే కేటాయించేలా జగన్ ప్రైవేట్ వర్సిటీ బిల్లులో మార్పులు చేశారు. రెండేళ్లలో 7 వేల మంది వరకు విట్, ఎస్ఆర్ఎం, మోహన్‌బాబు, సెంచూరియన్ వంటి ప్రైవేటు వర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు. -
బాబుపై భక్తితోనే ఉన్మాదరాతలు
సాక్షి, అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు రేపేందుకు ‘ఈనాడు’ పూనుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించేందుకు యత్నించింది. కరోనా విపత్కర వేళ ఎవరూ రోడ్డుపైకి రాలేకపోయిన రోజుల్లో వివిధ ఆలయాల్లో చోటు చేసుకున్న 26 దుస్సంఘటనలను ఉదహరిస్తూ దానికీ జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టింది. 2020 మార్చి 12 నుంచి 2021 ఏప్రిల్ 16వ తేదీ మధ్య కొన్ని అసాంఘిక శక్తులు ఉద్దేశ పూర్వకంగా పనిగట్టుకొని ఆలయాల్లో కొన్ని దురాగతాలకు పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆలయాల్లో స్వామివార్ల నిత్య పూజలకు, భక్తుల దర్శనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్పటికప్పుడే పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో మరోచోట అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలతోపాటు ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ఆలయాల్లో యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాత్రివేళల్లో ఆలయాల వద్ద పోలీసు గస్తీని పెంచింది. తద్వారా రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండాచేసింది. కానీ చంద్రబాబుపై తనకున్న ‘స్వామి భక్తి’తో పూర్తిగా ఉన్మాదిగా మారిన ‘ఈనాడు’ ఇప్పుడు.. ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనలను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. నాడు ఆలయాలు కూల్చేస్తే నోరెత్తలేదేమీ... టీడీపీ హయాంలో పవిత్ర కృష్ణానదీ తీరాన విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో పవిత్ర దేవాలయాలను అధికారికంగా కూల్చేశారు. ఆ సంఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా.. ‘ఈనాడు’ కనీసం స్పందించనైనా లేదు. పైగా చంద్రబాబు ఓ గొప్ప విజనరీగా, దార్శనికుడిగా చూపిస్తూ ఆకాశానికెత్తేసింది. నాడు కూల్చేసిన ఆలయాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి పునరి్నర్మించడంతో పాటు రాష్ట్రంలోని ఇతర దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, కొత్తగా ఆలయాలు నిర్మించింది. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.దేవుడి ఆస్తుల రక్షణకు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు » రాష్ట్రంలోని దేవుడి ఆస్తులు, విలువైన భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు పెత్తందార్లు దర్జాగా వాటిని కైంకర్యం చేసేశారు. » అలాంటి దుశ్చర్యలను కట్టడి చేస్తూ జగన్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచి్చంది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి... వారం రోజుల తర్వాత ఆ భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని ఆర్డినెన్స్ ద్వారా దేవదాయశాఖకు కట్టబెట్టింది. » ఇప్పటి వరకు ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ముందుగా ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ వేయాల్సి ఉండేది. ట్రిబ్యునల్ ఆక్రమణదారునికి సైతం తమ లాయర్ల ద్వారా వాదనలు వినిపించుకునే అవకాశమిచ్చిoది. ట్రిబ్యునల్ దానిపై నిర్ణయం వెలువరించేవరకూ ఆ భూములు అనుభవించుకునే వెసులుబాటు ఆక్రమణదారులకే లభించేది. » ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయశాఖకు అనుకూలంగా తీర్పునిస్తే, దానిపై మళ్లీ అప్పీల్ చేసుకుని కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకుంది. దానివల్ల స్వాధీన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేది కాదు. కొత్త చట్టంతో దానికి కళ్లెం వేయగలిగింది. » ఇంకోవైపు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి తొలిసారి ఆలయ అభివృద్ధి పనులకు నేరుగా నిధులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. » ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ కేవలం ఆయా ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదంటే వంశపారంపర్య అర్చకులకు, ఇతర హిందూ ధారి్మక సంస్థలకు అప్పగించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. -
చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
వాహనాల్లో తుపాకులు... చేతుల్లో కర్రలు, రాళ్లు, తాగి ఖాళీ చేసిన బీరు బాటిళ్లు... ఇవన్నీ పట్టుకుని ప్రాజెక్టులు చూడటానికి ‘యాత్ర’గా వెళ్లారంటే నమ్మగలమా? వీళ్లు ఎలాంటి యాత్రకు ప్లాన్ చేస్తున్నారో తెలియటం లేదా? గుంపును నడిపిం చే నాయకుడు ఆవేశంతో... ‘‘తరమండిరా నా కొడుకుల్ని’’ అంటూ ఎదుటివాళ్లను కొట్టమని రెచ్చగొడుతుంటే దాన్నేమనుకోవాలి? పైపెచ్చు... ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండ్రా నా కొడకల్లా రా..’’ అని తన బావమరిది సినిమాల్లో రెచ్చిపోయినట్లుగా 73 ఏళ్ల చంద్రబాబు నాయుడు రెచ్చిపోయాడంటే ఏమనుకోవాలి? ఆయన మాటలతో రెచ్చిపోయి పరుగులు తీస్తూ ఎదుటి వ్యక్తులపై రాళ్ల దాడికి తెగబడ్డ తెలుగుదేశం రౌడీ మూకలు ఏం యాత్ర చేస్తున్నట్లు? నిరసన తెలపటానికి నల్ల జెండాలతో వచ్చిన 20 మంది కూడా లేని వైఎస్సార్ సీపీ కార్యకర్త లను తరమటంతో పాటు పోలీసులను రాళ్లు విసిరి గాయపరిచిన వారిపై కేసు పెట్టడం తప్పా? అన్నమయ్య జిల్లా ‘అంగళ్లు’ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎవరు ఎవరిపై హత్యాయత్నం చేశారో తెలియటం లేదా? మరి ఈ ఘటనలోకెమెరాల సాక్షిగాకార్యకర్తల్నిరెచ్చగొట్టివిధ్వంసానికిపాల్పడినచంద్రబాబునాయుడిపై కేసు పెట్టడం తప్పెలా అవుతుంది? దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ కోణంలోనే చూసి... ‘వైకాపాజులుం’ అంటూ రాసిన మీ కలానికి జోహార్లు రామోజీరావు గారూ!!. మీ పాత్రికేయానికి 50 ఏళ్లు నిండుతున్న తరుణంలో మీరు కొత్త లోతులకుదిగజారిపోతున్నారని అర్థం కావటం లేదా? ఏది నిజం?పుంగనూరులో మరీ దారుణం. అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా లేరు. ఉన్నదల్లా పోలీసులే. వారు కూడా బందోబస్తు కోసం పుంగనూరు ఊళ్లోకి వెళ్లే రోడ్లకు బారికేడ్లు పెట్టి... ఆ బారికేడ్ల వెనక నిలుచున్నారు. ఇక చంద్రబాబు నాయుడి మూకకు ఆ ఊళ్లోకి వెళ్లాల్సిన పనే లేదు. ఎందుకంటే వాళ్లు అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్‌లో... పుంగనూరు బైపాస్ మీదుగా వెళ్లిపోవాలి తప్ప పుంగనూరు ఊళ్లోకి వెళ్లటమనేది లేదు. అందుకే పోలీసులు అక్కడ బందోబస్తుగా నిలుచున్నారు. అలాంటి చోట వెళుతూనే... దూరం నుంచే పోలీసులపైకి రాళ్లు, బీరు బాటిళ్లు విసురుతూ వారిని గాయపరిచిందెవరు? ఉద్దేశ పూర్వకంగా దాడి చేసి... ఏకంగా 47 మంది పోలీసుల్ని రక్తం వచ్చేలా రాళ్లతో కొట్టిందెవరు? ఒక కానిస్టేబుల్ కంటి చూపు కూడా పోయింది కదా!!. ఇది హత్యాయత్నం కాక మరేమిటి? చంద్రబాబు నాయుడు వెనక ఉండి ఉసిగొల్పడం వల్లే కదా... వారంతా పోలీసుల పైకి రాళ్లతో విరుచుకుపడ్డారు!!. ఆ సమయంలో పోలీసులు లాఠీచార్జి చేయటంతో... టీడీపీ మూకలు కూడా తాము తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి దిగాయి. చంద్రబాబు నాయుడు దాడులకు ప్రేరేపించటంతో పాటు... దగ్గరుండి రెచ్చగొడుతూ దాడులు చేయించటం... ఆయన సమక్షంలోనే మొత్తం దాడులు జరగటం... ఇదంతా కుట్ర కాక మరేంటి? చంద్రబాబుపై కేసు పెడితే తప్పేంటి రామోజీరావు గారూ? అసలు ముందే దాడులు చేయాలన్న ప్రణాళిక లేకుంటే తెలుగుదేశం నేతల వాహనాల్లో తుపాకులు ఎందుకున్నాయి? కర్రలు, రాడ్లు ఎందుకు వెంట తెచ్చుకున్నారు? చేతుల్లో రాళ్లు సిద్ధంగా ఉన్నాయంటే అర్థమేంటి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి రామోజీరావు గారూ? చంద్రబాబు టీడీపీ గుండాలను ఉసిగొల్పిన వీడియోలు వైరల్... డీఎస్పీని ఉద్దేశించి ‘ఆ బట్టలు తీసేయండయ్యా. అందరూ పెయిడ్ ఆరి్టస్టులే. గాడిదలు కాస్తున్నారా’ అంటూ నోరుపారేసుకున్నారు చంద్రబాబు. తనను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు కూడా. ఇంకా.. ‘దెబ్బలు తగిలినా.. తలలు పగిలినా భయపడేది లేదు. నేను ఎన్ఎస్జి రక్షణలో ఉన్నా. ఏయ్ పోలీస్... బట్టలిప్పు. రోషం లేని జీవితం. మీ పతనం చూసేవరకు వెంటపడతా’ అంటూ పుంగనూరులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఆడియో, వీడియో సాక్షాలతో సహా బయటపడ్డాయి. చంద్రబాబు వైఖరిని చూసి జనం ఛీకొట్టడమే కాదు... ఆయన అడ్డంగా దొరికిపోయాడు కనక పోలీసులు తననే ఏ–1గా పెట్టి కేసు నమోదు చేశారు. అంతటా తనకు ప్రతికూలత పెరుగుతుండటంతో... సంఘటన జరిగిన నాలుగు రోజుల తరవాత ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. తనపైనే హత్యాయత్నం జరిగిందని, అలాంటిది తనపైనే కేసు పెట్టడం ఏంటని కొత్త రాగం అందుకున్నారు. అందుకే.. రామోజీరావు సైతం తన బాబుకు మద్దతుగా సంఘటన జరిగిన నాలుగు రోజుల తరవాత... అంతా వైఎస్సార్ సీపీ కార్యకర్తలే చేశారని, ఎదురు కేసులు పెడుతున్నారని కొత్త కథనం అందుకున్నారు. ఇదంతా చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌లో భాగమేనని అర్థం కావటానికి ఇంకా ఏం కావాలి? అయినా సాక్ష్యాలతో దొరికిపోవడం చంద్రబాబుకు ఎప్పుడూ అలవాటే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓట్ల కోసం కోట్లు లంచాలిచ్చిన కేసులో చంద్రబాబు ఇలానే ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ అడ్డంగా దొరికిపోయిన వ్యవహారం ఎవరికీ తెలియంది కాదు. ఇక అంగళ్లు, పుంగనూరులో బహిరంగంగానే పోలీసులపై దాడులు చేయాలని ఆయన తమ కార్యకర్తలను ఆదేశించారు. మరి హత్యాయత్నానికి ప్రేరేపించిన వ్యక్తిపై కేసు పెట్టరా? చట్ట ప్రకారం పోలీసులు కేసు పెడితే అంతగా పెడబొబ్బలు పెడితే ఎలా...! చంద్రబాబు మీకు ఎక్కువ కావచ్చు. కానీ చట్టానికి అతీతుడు కాదు. అంతా చంద్రబాబు పన్నాగమే... రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కరువవుతున్న టీడీపీకి... లేని సానుభూతి సృష్టించేందుకు చంద్రబాబు కుట్రపన్నారన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సాగునీటి ప్రాజెక్టుల పేరిట తాను చేపట్టే యాత్రలో విధ్వంసం సృష్టించాలనేది ఆయన పన్నాగం. ముందుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో అంగళ్లు సర్కిల్‌కు వద్దకు చంద్రబాబు చేరుకోగానే టీడీపీ మూకలు కేకలు వేస్తూ... తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డాయి. దాంతో పోలీసులతో సహా పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో చంద్రబాబు శాంతించ లేదు. తన వాహనం నుంచే ప్రసంగిస్తూ ‘పుంగనూరులో ఓ పుడింగి ఉన్నాడు.. పదండి అక్కడ తేల్చుకుందాం’ అని టీడీపీ నేతలు, కార్యకర్తలతో అన్నాడు. పుంగనూరులో విధ్వంసానికి అప్పటికే ‘అన్నీ’ సిద్దం చేసుకునే ఆయన ఆ మాటన్నారు. 2 వేలమందికిపైగా టీడీపీ రౌడీలు మాటువేశారు. అప్పటికే కృష్ణదేవరాయ కూడలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు, గుండ్రటి టపాసు బాంబులును గట్టిగా విసిరే బాధ్యత కొందరికి అప్పగించారు.ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్వాలేదు... పోలీసులు అనివార్యంగా కాల్పులు జరిపే పరిస్థితిని క్రియేట్ చేయాలన్నది బాబు లక్ష్యం. పోలీసు కాల్పుల్లో టీడీపీ కార్యకర్తలు చనిపోతే రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలకు విఘాతం కలించాలన్నది అసలు పన్నాగం. అందుకే రూట్ మ్యాప్‌లో లేకపోయినా సరే పుంగనూరు పట్టణంలోకి వెళ్లాలని పట్టుబట్టారు. ఎన్ఎస్జీ కమాండోల భద్రతలో ఉండే చంద్రబాబు పర్యటన రూట్‌ను ముందే ఖరారు చేస్తారు. ఆ మేరకు ఆ రూట్‌ను భద్రతా బలగాలు పరిశీలించి క్లియరెన్స్ ఇస్తాయి. అదే రీతిలో టీడీపీ నేతలు ముందుగా ఇచి్చన దరఖాస్తు మేరకు పుంగనూరు బైపాస్ నుంచి యాత్రకు అనుమతినిచ్చారు. ఆ విషయాన్ని ఎన్ఎస్జీ కార్యాలయానికి కూడా తెలిపారు. కానీ చివరి నిముషంలో ఆ రూట్ కాకుండా పుంగనూరు పట్టణంలోకి వెళ్లాలని చంద్రబాబు ఎందుకు పట్టుబట్టారు? అదీ తనకు భద్రత విధుల్లో ఉండే ఎన్ఎస్జీ కమాండోలకు ఎలాంటి సమాచారం లేకుండా? ఎందుకంటే పుంగనూరులో అయితే యథేచ్ఛగా విధ్వంస కాండ సృష్టించవచ్చనేది కుతంత్రం. ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నిఖార్సైన నిజాలు. పోలీసులు సంయమనం పాటించి కాల్పులు జరపకపోవటం వల్లే పరిస్థితి చేయిదాటిపోకుండా ఉందన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. కానీ ‘ఈనాడు’కు ఇవేవీ పట్టవు. ఎందుకంటే దానికి నిజాలతో పనిలేదు. బాబు కోసం పనిచేస్తే చాలు. పోలీసులను రక్తమోడేలా కొట్టారు... ఒకరి కన్నుపోగొట్టారు చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ రౌడీ మూకలు అంగళ్లులో సృష్టించిన విధ్వంస కాండా అంతా ఇంతా కాదు. ఏకంగా ముందస్తు కుట్రతోనే తెచ్చుకున్న రాళ్లూ, కర్రలు, బీర్ సీసాలతో పోలీసులపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఈ పెనుదాడిలో 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్లంతా రక్తమోడుతూ కుప్పకూలిపోయారు. టీడీపీ అల్లరి మూకల రాళ్లవర్షంతో గాయపడిన మహిళా పోలీసులు హాహాకారాలు చేయడం అక్కడున్న అందరినీ కలచివేసింది. చాలా మంది ఖాకీ దుస్తులు రక్తంతో తడిసి ఎర్రబారటం దాడి తీవ్రతకు నిదర్శనం. టీడీపీ రౌడీల రాళ్ల దాడితో రణ«దీర్ అనే కానిస్టేబుల్ కన్ను పోయింది. మరో కంటికి ఆపరేషన్ చేస్తేగానీ ఏమీ చెప్పలేమన్నది వైద్యుల మాట. ఇవన్నీ వీడియోలు, ఫొటోలతో సహా బయటపడినా... ‘ఈనాడు’ మాత్రం ఎవరిపై దాడి చేశారు...? ఎవరు గాయపడ్డారు?...అంటూ నంగనాచి కబుర్లు చెప్పడం పాత్రికేయానికి పట్టిన ఖర్మ కాక మరేంటి? -
గొర్రెదాటు రాతలు.. ఎన్నాళ్లీ రోతలు
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్ అంటూ అడుగడుగునా బీసీలకు వెన్నంటి నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. యాదవులకు గొర్రెలు, మేకలు పంపిణీ చేయడం దగ్గర ఆగిపోకుండా ఆ సామాజిక వర్గాలకు చెందిన వారిని చట్టసభలకు పంపించిన చరిత్ర సీఎం జగన్‌ది. యాదవుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా గుర్తింపును తీసుకొచ్చారు.ఆర్బీకేల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా డీ వారి్మంగ్, వ్యాక్సినేషన్ చేస్తోంది. వైఎస్సార్ పశు బీమా పథకాన్ని సన్న జీవాలకు వర్తింప చేయడమే కాదు..మూగ, సన్నజీవాల కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవారథాలను తీసుకొచ్చింది.సుమారు 400 ఏళ్లపాటు కలగా ఉన్న మాచర్ల, నాగావళి గొర్రె జాతులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గుర్తింపును సాధించడం ద్వారా వాటిపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఇలా ఐదేళ్లుగా యాదవుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే రామోజీరావుకు మాత్రం కనిపించడం లేదు. యాదవులను తప్పుదారి పట్టించేవిధంగా ‘షెడ్డు దక్కలేదు..పొట్టేలు చిక్కలేదు’ అంటూ అచ్చేసిన బురద కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిద్దాం.. ఆరోపణ: యాదవుల సంక్షేమం పట్టని జగన్ వాస్తవం: రాష్ట్రంలో 55.22 లక్షల మేకలు, 1.77 లక్షల గొర్రెలు పెంచుకుంటూ లక్షన్నర కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరిలో 75 శాతం యాదవులు కాగా, మిగిలిన 25 శాతం ఇతర సామాజిక వర్గాల వారున్నారు. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గతంకంటే మెరుగైన రీతిలో ఆర్థిక చేయూతనందించారు. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించారు. అర్హత ఉన్నవారందరికీ ఇంటి స్థలాలతోపాటు సొంత ఇళ్ల నిర్మాణానికి సహకరించారు. ఆరోపణ: గత ప్రభుత్వ పథకాలను తెగ్గోసిన జగన్ సర్కార్ వాస్తవం: కేంద్రం సహకారంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రుణం అందించే స్కీమ్ నేటికీ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో 2029 సొసైటీలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 2735కు పెరిగింది. అంటే కొత్తగా 706 సొసైటీలను ఏర్పాటు చేయడమే కాదు. వారికి అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఎన్సీడీసీ ద్వారా 2423 మందికి రూ.62.49 లక్షల ఆర్థిక సాయం అందించారు. గొర్రెలు, మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై ఆర్బీకేల ద్వారా నిరంతరాయంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆర్బీకేల ద్వారా 1159 యూనిట్లకు డీ వారి్మంగ్తోపాటు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆరోపణ: వైఎస్సార్సీపీ హయాంలో అందని రుణాలు వాస్తవం: జగన్ ప్రభుత్వంలో యాదవులకు రుణాలే అందలేదని రాసుకొచ్చారు. ఎన్సీడీసీ పథకం కింద ఇప్పటి వరకు 2150 యూనిట్లు మంజూరు చేశారు. వీటిలో రూ.లక్ష చొప్పున 1,416 యూనిట్ల (20 గొర్రెలు. ఒక పొట్టేలు), రూ.5 లక్షల చొప్పున 675 యూనిట్లు (50 గొర్రెలు, రెండు పొట్టేళ్లు), రూ.10 లక్షల చొప్పున 57 యూనిట్లు (100 గొర్రెలు, ఐదు పొట్టేళ్లు), రూ.50 లక్షల చొప్పున 2 యూనిట్లు (500 గొర్రెలు 25 పొట్టేళ్లు) మంజూరు చేశారు. వీటికోసం రూ.43.77 కోట్లు ఖర్చు చేశారు. ఇవే కాదు..ఎన్ఎల్ఎం స్కీమ్ కింద 12 మందికి 50 లక్షల సబ్సిడీతో రూ.కోటి చొప్పున రుణాలు అందించారు. ఇంకా 60 అప్లికేషన్లు బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. లక్ష మందికి జారీ చేసిన కేసీసీ కార్డుల ద్వారా రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేశారు. ఆరోపణ: అటెకెక్కించిన బీమా పథకం వాస్తవం: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం నాలుగేళ్లలో 77 వేల మంది పశు పోషకులకు వైఎస్సార్ పశునష్టపరిహారం పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో పరిహారం జమ చేశారు. ఇలా రూ.176.68 కోట్లు జమ చేస్తే అత్యధికంగా లబ్ధి పొందింది మేకలు, గొర్రెల పెంపకందారులే. మరింత ఎక్కువ మందికి లబ్థి చేకూర్చాలని సంకల్పంతో 2022–23లో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారితోపాటు ఎస్సీ, ఎస్టీలకు తమ జీవాలకు మూడేళ్ల కాలపరిమితితో నిర్దేశించిన ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వం రాయితీగా భరిస్తోంది. ఇప్పటికే 1.75 లక్షల మంది ఈ స్కీమ్‌లో నమోదు కాగా, ఇప్పటి వరకు మృత్యువాతపడిన జీవాలకు సంబంధించి రూ.2.50 కోట్ల పరిహారాన్ని అందించారు. ఆరోపణ: కార్పొరేషన్‌తో పైసా మేలు జరగలేదు. వాస్తవం: యాదవుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘతన వైఎస్ జగన్‌కే దక్కుతుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు..నవరత్నాల ద్వారా యాదవులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ కార్పొరేషన్ ద్వారానే అందిస్తున్నారు. చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూతనివ్వడమే కాదు..జగనన్న విద్యాదీవెన, వసతి వంటి పథకాల ద్వారా వారి పిల్లల చదువులకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల ద్వారా సన్న జీవాలకు నాణ్యమైన వైద్యం వారి ముంగిటకే తీసుకొచ్చారు. ఆరోపణ: జగన్ హయాంలో ఏదీ పెద్దపీట? వాస్తవం: యాదవుల సంక్షేమానికి చంద్రబాబు అన్ని విధాలుగా తూట్లు పొడిచారు. యాదవులకు గుర్తింపు కాదు కదా..కనీసం ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం అమలు చేసిన పథకాలు తప్ప సొంతంగా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆర్థిక చేయూతనివ్వలేదు.మంజూరు చేసిన రూ.250 కోట్లలో చెల్లించిన మొత్తం కేవలం రూ.80 కోట్లే. కేంద్ర ప్రాయోజిత పథకం కింద పశువులు, సన్న జీవాల కోసం అమలు చేసిన బీమా పథకంలో నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం లబ్ధిదారులే భరించాల్సి వచ్చేది. మిగిలిన 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 2015లో కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ నిలిపివేయడంతో బాబు హయాంలో బీమా పథకాన్నే అటకెక్కించేశారు. ఆ రెండు జాతుల గుర్తింపు కనిపించలేదా మాచర్ల, నాగావళి జాతి గొర్రెలకు అరుదైన గొర్రె జాతులుగా ఐసీఏఆర్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకూ నెల్లూరు జాతి గొర్రెలకే అధికారిక గుర్తింపు ఉంది. ఐసీఏఆర్ గుర్తింపు ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రుణాలు పొందేందుకు వెసులుబాటు కలిగింది. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధరలు రెట్టింపు పలకనున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల కింద వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరుకానున్నాయి. -
మీ ‘మద్దతు’ బాధంతా బాబు కోసమేగా!
సాక్షి,అమరావతి: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అనే చందంగా పచ్చ పత్రికాధినేత రామోజీరావు తీరు ఉంది. వ్యవసాయం దండగ అని చంద్రబాబు తీసిపారేస్తే.. వ్యవసాయం పండుగ అని వైఎస్ జగన్ ప్రభుత్వం నిరూపించింది. అధికారంలోకి వచ్చింది మొదలు గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు, అక్కడే విత్తు నుంచి విక్రయం వరకు అన్ని ఏర్పాట్లు, కనీస మద్దతు ధర దక్కని పంటలను ప్రభుత్వమే కొనుగోలు, మార్కెట్లో ధరలు పడిపోయిన ప్రతిసారి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వ జోక్యం, ఏకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఆరు పంటలకు కనీస మద్దతు ధర, సీఎం యాప్ ద్వారా ధరల పర్యవేక్షణ, ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు గోనె సంచులతోపాటు కూలీల భారం, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే పెట్టుకుంటున్నా.. ఇంకా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో చేస్తున్నా రామోజీ విషం జిమ్ముతున్నారంటే ఏం అనుకోవాలి? ఈ ఏడుపుకు, కడుపుమంటకు అసలు మందు ఉందా? బుధవారం తన పచ్చ పత్రిక ‘ఈనాడు’లో ‘కనీస మద్దతు ధర.. గరిష్ట మోసం దొర’ అంటూ ఒక తప్పుడు కథనాన్ని అచ్చేశారు. దీనికి సంబంధించి అసలు వాస్తవాలివిగో..ఆరోపణ: ధరల స్థిరీకరణ నిధి ఒక దగావాస్తవం: మార్కెట్లో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రూ.3 వేల కోట్లతో ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఈ 57 నెలల్లో 1–2 సీజన్లలో 2–3 పంట ఉత్పత్తులకు మినహా మిగిలిన పంటల మార్కెట్ ధరలు మద్దతు ధరకు మించి పలికాయి. ఈ ఏడాది కూడా మద్దతు ధరలు ప్రకటించిన పంట ఉత్పత్తులతో సహా పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న మాట వాస్తవం కాదా? అలాంటప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుందో ‘ఈనాడు’కే తెలియాలి. ఆరోపణ: సీఎం యాప్ సిగ్గు..సిగ్గువాస్తవం: దేశంలోనే తొలిసారిగా గ్రామాల వారీగా మార్కెట్లో ధరలను సేకరించి ఎప్పటికప్పుడు వాటి హెచ్చుతగ్గులను సమీక్షించేందుకు సీఎం యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పతనమైన ప్రతిసారీ ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతులకు కనీసమద్దతు ధర దక్కేలా కృషి చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల పంటల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులను జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే... రెట్టింపు కన్నా అధికం. అలాగే చంద్రబాబు ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.65 వేల కోట్లు చెల్లించింది. బాబు హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు మాత్రమే వెచ్చిస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది అంటే.. సగటున చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. ఆరోపణ: గిట్టుబాటు ధర కల్పనలో చేతులెత్తేశారువాస్తవం: గిట్టుబాటు ధరలు పడిపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా ప్రభుత్వ భరోసా వల్లే మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. అలాగే 2021–22లో ఉల్లి ధరలు పతనమైనప్పుడు మద్దతు ధరకు, 2022–23లో ధరలు పెరిగినప్పుడు మార్కెట్ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇటు రైతులకు, అటు వినియోగదారులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఇలా రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించింది. 2022–23లో రూ.22.94 కోట్ల విలువైన 2,541 టన్నులు, 2023–24లో రూ.43.46 కోట్ల విలువైన 5,517 టన్నుల పసుపును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. మిరప ఎమ్మెస్పీ రూ.7వేలు కాగా మూడేళ్లుగా మార్కెట్లో క్వింటా రూ.15వేల నుంచి రూ.30వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. నాలుగేళ్లుగా చిరుధాన్యాల మార్కెట్ ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగానే ప్రస్తుత ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మార్కెట్లో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ఆరోపణ: వ్యవసాయ ఖర్చులు పెరిగాయివాస్తవం: సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని పంటలు వేసే రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా సొంతంగా వాటికి మద్దతు ధరలను ప్రకటించింది. మద్దతు ధరకు మించి పలికితే మార్కెట్లోనే రైతులు విక్రయించుకుంటారు. మార్కెట్లో ధర లేనప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు బాసటగా నిలుస్తోంది. రైతులకు పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ... అదే సమయంలో రైతుకు ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్న రైతు భరోసా సాయాన్ని మాటమాత్రం ప్రస్తావించలేదు. ఈ 57 నెలల్లో ప్రతి రైతుకు రూ.65,500 చొప్పున 53.53 లక్షల మందికి రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించినా రామోజీ పచ్చ కళ్లకు కనిపించలేదు. జీఎల్టీ ఖర్చులను కూడా భరిస్తూ.. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా జీఎల్టీ (గన్నీ బ్యాగ్‌లు, కూలీలు, రవాణా)ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. -
పరిశ్రమలపై పనికిమాలిన కథ
సాక్షి, అమరావతి : అసత్యాలను అక్షరాలుగా పేర్చడంలో ఆరితేరిన రామోజీరావు అనేకానేక అబద్దల కథనాలతో ఈనాడును నింపేస్తున్నారు. రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమలపైనా విషం చిమ్ముతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ చార్జీలకు సంబంధించి కనీస అవగాహన లేకుండా, లేని భారాన్ని ఉన్నట్లు చూపిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గతంలో ఎంత రుణం తీసుకున్నా రూ.10 వేలు చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు దాన్ని 25 రెట్లు పెంచి వాటిపై భారం వేశారంటూ పచ్చి అబద్ధాన్ని ఈనాడులో అచ్చేశారు. నిజానికి మార్ట్గేజ్ బాండ్‌కు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో ఎటువంటి మార్పు లేదు. గతంలో ఉన్న ఛార్జీలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అయినా 25 రెట్లు పెరిగిందని అబద్దాలు ప్రచురించేశారు. ఎక్కడ ఏ పరిశ్రమకు ఎలా పెరిగిందో మాత్రం చూపలేకపోయారు. దాన్నిబట్టే ఈనాడులో అచ్చేసింది పచ్చి అబద్ధమని తేలిపోయింది.ఆ రెండింటికీ తేడా తెలియదా?డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ దస్తావేజుకి, మార్ట్గేజ్ బాండ్‌కి తేడా తెలియకుండా రామోజీ అవాస్తవాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నిజానికి సూక్ష్మ, చిన్న పరిశ్రమలు రుణాలు పొందినప్పుడు ఇచ్చే డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్‌కు మాత్రమే వెయ్యి రూపాయల స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది. మ«ద్య తరహా పరిశ్రమలకు ఎప్పుడూ స్టాంప్ డ్యూటీ మినహాయింపు లేదు. మధ్యతరహా పరిశ్రమ రూ.5 కోట్లు రుణం తీసుకుంటే దాని మార్ట్గేజ్ బాండ్‌కి స్టాంప్ డ్యూటీగా 0.5 శాతం చొప్పున 2.5 లక్షలు చెల్లిస్తున్నారనడం పూర్తి అవాస్తవం. డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ని మార్ట్గేజ్బాండ్గా ఊహించుకుని దానికి 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కట్టాలనే కాకి లెక్క వేసి ప్రజలను మాయ చేయాలనేది రామోజీ ప్రయత్నం. ఒకవేళ ఏదైనా పరిశ్రమ తీసుకునే ఎన్ని కోట్ల రుణానికైనా డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ దస్తావేజుకు చెల్లించే స్టాంప్ డ్యూటీ రూ.50 వేలు మాత్రమే. 0.5 శాతం స్టాంపు డ్యూటీ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్‌కు వర్తించదు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్టాంపుల చట్టం ప్రకారం వెయ్యి రూపాయల స్టాంప్ డ్యూటీ కడితే సరిపోతుంది. 25 రెట్ల భారం ఎక్కడ వేసినట్లు? ఈ కనీస పరిజ్ఞానం కూడా రామోజీకి లేదు.వాస్తవానికి రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రజలు, పరిశ్రమలకు అనుకూలంగా అనేక మార్పులు జరిగాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల వ్యవస్థతో పాటు ఈ–స్టాంపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిద్వారా గతంలోకంటే సులభంగా ప్రజలు రిజిస్ట్రేషన్ల సేవలు పొందుతున్నారు. ఇలాంటి అంశాలను తప్పుదోవ పట్టించే క్రమంలో రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పరిశ్రమలపై రిజిస్ట్రేషన్ల ఛార్జీలతో బాదేస్తున్నారంటూ ఒక కల్పిత కథనాన్ని ప్రచురించారు. -
రామోజీ.. ఈ కథనం నువ్వు వేసిందేగా!
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని వక్రీకరించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న రామోజీరావు 7 నెలల క్రితం దాన్ని జగన్ ప్రభుత్వం అమల్లోకి తేలేకపోతుందంటూ ఈటీవీ భారత్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. గతేడాది ఆగస్టు 11న ఈటీవీ భారత్‌లో ‘వైసీపీ ప్రభుత్వ ప్రచారాలకే పరిమితమైన చట్టాలు.. ఖాతాలో మరో యాక్ట్’ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులకు కూడా కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోలేకపోతున్నారని అందులో వివరించారు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను ఆమోదించినా కేంద్రం నుంచి అనుమతి తేలేకపోతున్నారని ఆక్షేపించింది.అనేకసార్లు దిల్లీలో ప్రదక్షిణలు చేసిన సీఎం జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్‌కు కేంద్రం నుంచి ఆమోదం పొందడంలో విఫలమయ్యారని ఆ కథనంలో రామోజీ గుండెలు బాదుకున్నారు. ఆ కథనం వచ్చిన కొద్దినెలలకే కేంద్రం ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదముద్రా పడింది. ఇప్పుడు ఏకంగా విష ప్రచారం చేయడం రామోజీ ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. ఎంతో విజన్ ఉన్న చట్టం అని చెప్పిన దాని గురించి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఈ చట్టం వస్తే భూ యజమానులకు వరంగా మారుతుందని చెప్పిన ఈటీవీ ఇప్పుడు అది వస్తే భూములు పోతాయని రైతులను భయభ్రాంతులకు గురిచేసే కథనాలు వండి వారుస్తోంది. ఈ చట్టం గురించి వ్యతిరేక ప్రచారం చేసి భూములకు సంబంధించి వారిలో భయాలు సృష్టించి తద్వారా ఎన్నికల్లో చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు రామోజీ ఈ దిగజారుడు పాత్రికేయానికి తెగబడ్డారు. భూ హక్కుల చట్టంతో భూములకు భద్రత వస్తుందని ఈటీవీలో పలు కథనాలు ప్రసారం చేసి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్లు బురద జల్లడం ద్వారా తనకు కుట్రలు, కుతంత్రాలు తప్ప విలువలు, నీతి అనేదే లేదని రామోజీ నిరూపించుకున్నారు. -
పౌర సమాజం మేల్కోవాలి !
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వైరి పక్షాల మధ్య మాటల యుద్ధం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది . కానీ మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండగా.. చంద్రబాబు కోసం కొన్ని పత్రికలు, ఛానళ్లు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగి తెలుగుదేశం కంటే కూడా ఎక్కువగా చావో రేవో అన్నట్లుగా వైఎస్సార్సిపి మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. నిత్యం నీతులు వల్లించే రామోజీ ఇప్పుడు విలువలను విడిచి చంద్రబాబు కోసం గారడీలు చేయడం దీనికి పరాకాష్ట.నిజానికి రామోజీ మొదటి నుండీ వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేస్తూనే ఉన్నాడు, కాకపోతే పాతరోజుల్లో నగ్నంగా కనిపించకుండా ముసుగు వేసుకొని టీడీపీకి కొమ్ముకాసేవాడు. ఇప్పుడు ఈ ముసుగులన్నీ తొలగించి నగ్నంగానే విచ్చలవిడిగా అన్ని కట్టుబాట్లు గాలికొదిలేసి పుఖానుపుంఖాలుగా విషం చిమ్ముతున్నాడు. ఈనాడు పత్రికను చూస్తే.. అవసానదశలో కూడా రామోజీ ఎంత నీచ స్థాయికి దిగజారిపోయాడో అని ఆశ్చర్యంగా ఉంది. అంతెందుకు, నా సొంత అనుభవాన్నే తీసుకోండి. ఎటువంటి ఆధారాలూ లేకుండా "సీబీఐ వెతుకుతున్న నిందితుడు" అనే హెడ్లైన్ పెట్టి ఈనాడులో మూడ్రోజులు అడ్డమైన రాతలు రాయడం .. రామోజీ దిగజారుడు తనానికి పరాకాష్ట. విచిత్రంగా అసలు కేసు ఏమిటి? అది నిజంగా ఇంకా వుందా లేదా? ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో వుంది? నోటీసులు ఇచ్చారా లేదా? ఇస్తే ఏ రకమైన నోటీసులు ఇచ్చారు? ఆ నోటీసులు ఇంకా అమల్లో ఉన్నాయా? ఇలాంటివేవీ ఆ మూడ్రోజుల రాతల్లో ఎక్కడా కనిపించలేదు. కనీసం కేసు తాలూకు వివరాలు తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు .లుక్ అవుట్ అంటే ఏమిటి ? ఇంటర్‌పోల్ అంటే ఏమిటి? అవి ఏ ఏ దేశాలలో ఏ విధంగా పనిచేస్తాయో అన్న కనీస అవగాహన లేకుండా .. ఏదో అంతర్జాతీయ ఉగ్రవాది కేసు చేధించినట్లు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రధాన వార్తగా అచ్చేశాడంటే .. రామోజీ ఎంత అభద్రతా భావంలో బ్రతుకుతున్నాడో తెలుస్తుంది. పేరు మార్చానంట... వేషం మార్చానంట. సినిమా వాళ్ళు కూడా ఇంత పకడ్భందిగా స్టోరీ అల్లలేరు. ఎవరో ఇచ్చిన స్టోరీని కనీసం నిజానిజాలు నిర్దారించుకోకుండా యధాతధంగా అచ్చేసి రామోజీ శునకానందం పొందటం తప్పితే ఇందులో ఎలాంటి నిజాలు లేవు.పుట్టినప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరుతోనే వున్నాను, వయస్సుతో వచ్చిన మార్పులు తప్పితే వేషంలో కూడా ఎలాంటి మార్పులు లేవు. జుట్టు ఊడిపోతే విగ్గురాజు లాగా విగ్గు ఎందుకులే అని స్టయిలిష్‌గా ఫుల్ షేవ్ చేస్తాను . నన్ను వ్యక్తిగతంగా ఎరిగిన ప్రతీ ఒక్కరికీ ఈ విషయాలు తెలుసు. నా మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి నోటీసులు లేవు . గుండుతో ఉంటే ఎయిర్‌పోర్టులో వదిలేస్తారా ? రామోజీకి మన వ్యవస్థల మీద ఎంత చిన్న చూపు వుందో అర్థం చేసుకోండి.నా మీద వార్త రాస్తున్న సమయంలోనే ప్లాన్ లో భాగంగా నా ఫేస్బుక్ అకౌంట్ మీద రిపోర్టులు కొట్టించి 24 గంటలు బ్లాక్ అయ్యేలా కుట్ర పన్నారు. పైగా "చూశారా, అకౌంట్ కూడా క్లోజ్ చేసాడని" అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు . నేను ఫేస్‌బుక్‌కి ఛాలెంజ్ ఆప్షన్ పెట్టి అకౌంట్‌ను వెనక్కి తెచ్చుకొని పోస్ట్ పెట్టేవరకూ యెల్లో మీడియా అంతా చెలరేగిపోయింది.చిన్నప్పటి నుండీ పత్రికల్లో రాతలకి, రోత రాజకీయాలకి , ఎన్నికలప్పుడు ప్రచారం చేసే పుకార్లకు అన్నిటికీ అలవాటు పడ్డవాళ్ళం కాబట్టి రామోజీ రాతలు చూసి మనకేదో పబ్లిసిటీ వచ్చిందిలే అని నవ్వుకున్నాం కానీ ... అదే నా స్థానంలో గీతాంజలి లాంటి అభాగ్యులు వుంటే అలాంటి వార్తలకు ఎంతమంది తట్టుకొని నిబ్బరంగా ఉండగలరు.? ఒకపక్క సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ వార్తలకే ప్రాణాలు తీసుకొంటుంటే .. ఈనాడు లాంటి ప్రధాన పత్రికలో మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో కధనాలు వస్తే ఎంతమంది తట్టుకొని నిలబడగలరు?ఇదే విషయమై మొన్న ఈనాడులో పనిచేసిన పాతతరం జర్నలిస్టులు కలిసినప్పుడు చర్చకి వస్తే వాళ్ళు చెప్పిన గత సంగతులు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే! వాళ్ళు చెప్పిన దాని ప్రకారం .. రామోజీ మాట వినని ప్రభుత్వ అధికారులమీద , వివిధ వ్యవస్థలలో ఉన్న అనేకమంది ప్రముఖుల మీద , ఆఖరికి సొంత వ్యవస్థలో పనిచేసే వాళ్ళ మీద కూడా ఇలాంటి దొంగ వార్తలు రాసి దారికి తెచ్చుకొనేవాడట . అలా తన దారికి రానివాళ్ళమీద మరింత విషపూరితంగా రాసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడట. ఇది రామోజీ దగ్గర అనేక సంవత్సరాలుగా దగ్గరగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు చెప్పిన సంగతులు.రామోజీ ఇంత నీచస్థాయికి దిగజారటానికి కారణాలు ఏమిటి ?తరచి చూస్తే కారణాలు సుస్పష్టం. రామోజీ తన జీవితపు అవసాన దశలో ఉన్నాడు. నిజానికి ఈ వయస్సులో ఎవరైనా మరింత హుందాగా గౌరవం పొందాలని .. శత్రువులతో కూడా మంచి అనిపించుకోవాలని తాపత్రయపడతారు. నలభై ఏళ్లుగా తన టక్కుటమారా విద్యలతో ఒంటికి తెల్లని బట్టలు ముసుగుగా తొడిగి మీడియాని అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నిటినీ చెరబట్టాడు, అధికారం అండతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా తనకి ఎదురు తిరిగిన ఎన్టీఆర్ ని దించి చంద్రబాబుని ఎక్కించటంలో సఫలీకృతుడు అవ్వటంతో ఇక తనకి ఎదురే లేదని, తానే సర్వాంతర్యామి అనే స్థాయికి చేరుకున్నాడు.చంద్రబాబు వెన్నుపోటు దిగ్విజయం అవ్వటంతో తాను తలచుకుంటే ముఖ్యమంత్రులను దించేయగలననీ .. అనుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయగలనని భయపెట్టగలిగాడు. చంద్రబాబు హయాంలో రామోజీకి ఎదురు లేకుండా పోయింది. ఫిలింసిటీకి రూపకల్పన చేసి వేల ఎకరాలని దోచుకొని ఆఖరికి రాష్ట్రం విడిపోవటానికి బీజాలు కూడా వేసాడు. విడిపోయిన రాష్ట్రానికి తన మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం .. ఆ ఊపులోనే దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ రావటంతో ఇక తనకి తిరుగే లేదని .. తాను దేవేంద్రుడంతటి వాడినని తనకో రాజధాని కావాలనే ఉద్దేశ్యంతో దానికి అమరావతి పేరు పెట్టి ' ఇది మారాజ్యం / మా ఏలుబడిలో ఉన్న రాజ్యం ' అని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే కుఠిల బుద్ధితో ఎన్నో అరాచకాలు చేసారు.2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఈడ్చికొట్టడం, ఆ తరువాత మార్గదర్శి కేసులో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో రామోజీకి కళ్లు బైర్లు కమ్మినట్టయింది. మార్గదర్శి ఫైనాన్సియల్ మీద ఎంక్వయిరీ జరుగుతుండడంతో తన మోసాలు బట్టబయలు అవ్వటం ఖాయమని నిర్దారించుకున్నాడు రామోజీ. మార్గదర్శిలో అక్రమంగా డిపాజిట్లు సేకరించటమనేది కేసులో ఒక పార్శం మాత్రమే. వాస్తవానికి నిజమైన డిపాజిట్ దారులు 10 శాతం మంది మాత్రమే, మిగతా డబ్బంతా చంద్రబాబు బినామీదారులే... నల్ల డబ్బుని .. ఎల్లయ్య, పుల్లయ్య పేరులతో డిపాజిట్ దారులుగా రికార్డులు సృష్టించి మార్గదర్శిలో దాచుకున్నారు. అందుకే ఫిర్యాదు ఇచ్చే వాళ్లు కనిపించరు. ఎందుకంటే అక్కడ ఉన్నది 90 శాతం ఫేక్ డిపాజిట్ దారులే. కేసు ముందుకి వెళ్లే కొద్దీ ఈ అసలైన ఈ విషయం బయటకొస్తుంది. వీటన్నిటి నుండి రామోజీ తప్పించుకోవటం అసంభవం.రామోజీకి ఇప్పుడు 88 ఏళ్ళు. జీవితపు అవసాన దశలో ఉన్నాడు. కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో ఉన్నప్పుడు మరణిస్తే శాశ్వత కీర్తి వస్తుంది. ఎవరైనా అదే కోరుకొంటారు. కానీ రామోజీ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది . అందుకే రామోజీ కంపించిపోతున్నాడు. కేసులలో తనకి శిక్ష పడటం ఖాయమని.. సమాజానికి తన నిజ స్వరూపం బట్టబయలు అవ్వటంతో పాటుగా కేంద్రం ఇచ్చిన పద్మవిభూషణ్ కూడా తిరిగి తీసుకుంటారని .. ఇది దేశంలో మరెవ్వరికీ జరగని ఘోరమైన అవమానమని రామోజీ భయకంపితులవుతున్నాడు. అవమానభారంతో మరణిస్తే ఇన్ని రోజులు తన టక్కుటమారా విద్యాలతో నిర్మించిన సామ్రాజ్యం , సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అన్నీ కుప్పకూలిపోవటం ఖాయమని , రామోజీ అనేది ఒక విషపురుగుగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుందనే ఆందోళనలో రామోజీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు .ఇదంతా తప్పించుకోవాలంటే రామోజీ ముందున్న ఏకైక మార్గం మళ్ళీ చంద్రబాబుని ముఖ్యమంత్రి చెయ్యటం . అదొక్కటే రామోజీ ముందున్న పరిష్కారం . అందుకోసమే ఎన్నడూ లేనంతగా దిగజారి విషం చిమ్ముతున్నాడు . రాజకీయపార్టీల కంటే కూడా స్వయంగా తానే పోటీ చేస్తున్నట్లు భావిస్తూ పేపర్ మొత్తాన్ని విషంతో నింపేస్తున్నాడు. గడచిన కొద్ది నెలలుగా ప్రధాన శీర్షికలని గమనించండి. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా నిజం లేకుండా ప్రభుత్వం మీద మీద ఊహించనంత స్థాయిలో విషం చిమ్ముతూ తాను ఎంత ఆందోళనలో ఉన్నాడో చెప్పకనే చెప్తున్నాడు. విషయం చిన్నదా, పెద్దదా? నిజమా, అబద్దమా? అనే దానితో నిమిత్తం లేకుండా ఏదో రకంగా ఎదుటి పక్షానికి నష్టం చేయాలి .. ఈనాడు పరువుపోయినా ఫరావాలేదు .. కొద్దిమంది నమ్మినా అంతే చాలు .. అనే తరహాలో సిగ్గు విడిచేసి పుంఖానుపుంఖాలుగా వార్తలని వండి వారుస్తున్నాడు .అందుకే పౌర సమాజం మేల్కోవాలి , నిజాలని గ్రహించి సమాజపు భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. దానికి ఒక తేదీ ఉంది. జూన్ 4, 2024.శివ అన్నపురెడ్డి, అమెరికా -
రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్
-
కాల యముళ్లు
-
ఒక వైపే చూడకు.. పచ్చిగా అబద్ధాలాడకు!
సాక్షి, అమరావతి: ఒకసారి తప్పు చేస్తే పొరపాటు...పదే పదే ఆ తప్పులనే పునరుక్తం చేస్తుంటే అది అలవాటు...గ్రహపాటు...దురలవాటు..అలాంటి దురలవాటును ఈనాడు ఆనవాయితీగా మార్చుకుంది..అబద్ధాలనే రాయడానికే కంకణం కట్టుకున్నానన్నట్లుగా ఉంది ఆ పత్రిక వక్రీకరణల ధోరణి...గతంలో కౌలురైతుల సాయంపై అడ్డగోలుగా వక్రీకరిస్తే అది తప్పని ...వాస్తవమేంటని గణాంకాలతో రుజువు చేసినా... మూర్ఖపు రాతలతో మళ్లీ రాసిన తప్పులనే రాస్తూ... తన అజ్ఞానాన్ని, తానేం చేసినా చెల్లిపోతుందన్న అహంకారాన్ని రామోజీ నిరూపించుకుంటున్నట్లుగా ఉంది.. ఇప్పటికే ఈనాడు దుష్టరాతల తలంపును పాఠకులు అర్థం చేసుకున్నారు..ఒక నిజాన్ని ఎన్నిసార్లు అబద్ధంగా చూపాలనుకున్నా అది అవాస్తవంగా మారదన్న వాస్తవం రామోజీకి బోధపడినట్లు లేదు... రైతులకు ఆపన్నహస్తమందిస్తున్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం... ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు కొండంత ఊతంగా నిలుస్తూ... వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తున్నదే జగన్ ప్రభుత్వం... రైతులే కాదు...వారితో సమానంగా కౌలు రైతుల భుజంపైనా భరోసా చెయ్యేసి... వారిని అక్కున చేర్చుకుంటున్నదే ఈ ప్రభుత్వం...ఆ నిజాన్ని అబద్ధం చేయాలని రామోజీ తహతహలాడిపోతూ.. గురువారం ఈనాడులో ..‘ధీమా లేదు...బీమా రాదు’... శీర్షికన ప్రచురించిన కథనం ఒక బోగస్. నిజాలేమిటో సవివరంగా గణాంక సహితంగా చెప్పడానికే ఈ ఫ్యాక్ట్‌చెక్...గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలు రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు ఆలోచనే చేయని పంట సాగు హక్కు దారుల చట్టం–2019ను తీసుకురావడమే కాదు..సీసీఆర్సీల ఆధారంగా భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకూ సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇస్తోంది. పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా రైతులు మద్దతు ధరకు సులువుగా అమ్ముకోగలుగుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు దురదృష్టవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఈ ప్రభుత్వం అందిస్తోంది.అబద్ధం: పెట్టుబడి సాయానికి అర్హులు కారట..వాస్తవం: బాబు హయాంలో కౌలురైతులకు కాదు కదా అటవీ, దేవదాయ భూ సాగుదారులకు పైసా విదల్చ లేదు. తద్భిన్నంగా ...నేడు దేశంలోనే తొలిసారిగా ఏపీలో మాత్రమే కౌలు రైతులకు జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకూ రూ.13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది.మెజార్టీ కౌలుదారులు సొంత భూమినీ కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డులు పొందిన సెంటు భూమిలేని కౌలు రైతులకు భూ యజమానులతో సమానంగా పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. ఇలా గత ఐదేళ్లలో 5.57 లక్షల మంది కౌలు రైతులకు రూ.751.42 కోట్లు, 4.01 లక్షల అటవీ భూములు (ఆర్వో ఎఫ్ఆర్) సాగు చేసే గిరిజనులకు రూ.541.58 కోట్లు కలిపి మొత్తం 9.58 లక్షల మందికి రూ.1293 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి సహాయంగా అందించింది. అంటే ఏటా సగటున 1.92 లక్షల మందికి రూ.259 కోట్ల చొప్పున పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇచ్చింది. అయినా ఈనాడుకు మాత్రం 1.07 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించినట్టుగా కని్పంచింది.అబద్ధం: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు..వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకూ ఈ ప్రభుత్వం వర్తింప చేస్తోంది. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా ఈ సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈనాడుకు మాత్రం సున్నా వడ్డీ రాయితీ పొందిన వారే కని్పంచలేదు. ఈ ఐదేళ్లలో 3,54,878 మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 3,67,903 మందికి రూ.424 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌సబ్సిడీ) పంపిణీ చేస్తే, ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో పెట్టుబడి రాయితీ పొందిన వారు 48,290 మంది, పంటల బీమా పరిహారం పొందిన వారు 88,619 మంది మాత్రమే కని్పస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేసిన సాయాన్ని తక్కువ చేయాలన్న దుష్టతలంపేనని ఇట్టే అర్థమవుతోంది.అబద్ధం: కౌలు రైతులకు పంట రుణాల్లేవు..వడ్డీ రాయితీకి సున్నా..వాస్తవం: వాస్తవ సాగు దారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో ప్రభుత్వం అనుసంధానం చేసింది. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ పొందలేని కౌలు రైతులను గుర్తించి, వారితో జాయింట్ లయబలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఏర్పాటు చేస్తోంది. ఈ గ్రూపుల ద్వారా కౌలుదారులకు పెద్ద ఎత్తున రుణాలు అందేలా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 14.75 లక్షల మంది కౌలుదారులకు రూ.8,642.40 కోట్ల రుణాలను ఈ ప్రభుత్వం అందించింది. ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో రుణాలు పొందిన వారు 1.68 లక్షల మందే కని్పంచారు. ఈ –క్రాప్ ఆధారంగా లక్ష లోపు పంట రుణాలు పొందిన 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని జగన్ ప్రభుత్వం అందించింది. -
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అసలింతకీ రామోజీరావుకు ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తికావటమా... లేక ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటమా? దీనికి ఆగిపోవటమే ఆయనకు కావాలన్న సమాధానం తేలిగ్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచి్చన దగ్గర్నుంచీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రామోజీరావు ‘ఈనాడు’లో అచ్చోసిన దుర్మార్గపు కథనాలు అన్నీఇన్నీ కావు. ఇంకేముంది ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని కొన్నాళ్లు...కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని కొన్నాళ్లు... ఎత్తు తగ్గించి కట్టేస్తున్నారని కొన్నాళ్లు... ఇలా పదేపదే విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు.చిత్రమేంటంటే... రామోజీ అంచనాలకు భిన్నంగా పోలవరం వేగంగా ముందుకెళుతోంది. చంద్రబాబు వీసమెత్తయినా పట్టించుకోని పునరావాసాన్ని కూడా వైఎస్ జగన్ భుజాలకెత్తుకుని ప్రాజెక్టును నడిపిస్తున్నారు. కేంద్రాన్ని పదేపదే అభ్యఆర్థికస్తూ... రావాల్సిన నిధుల్ని రాబట్టుకుంటున్నారు. ఇదిగో... ఇదే ‘ఈనాడు’ కడుపు మంటను పెంచేస్తోంది. కాంట్రాక్టరుగా తన వియ్యంకుడిని తప్పించేసి మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని రామోజీరావు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ‘పోలవరం నిధుల కోసం... జగన్ నేల చూపులు– బేల మాటలు’ అంటూ సోమవారం ప్రచురించిన కథనం కూడా ఇలాంటిదే!!. మరి దీన్లో నిజానిజాలెంత? ఏది నిజం?ఏది నిజం..?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911.15 కోట్లనేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్లో 2017లో ఆమోదించిన మొత్తానికి అదనంగా... రూ.12,911.15 కోట్లే ఇస్తామని పేర్కొంది. దీనికన్నా పైసా ఎక్కువరాదు.వాస్తవం: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి, ఆఆర్థికక శాఖ మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్‌లను కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.ఈ క్రమంలోనే గతేదాది జనవరి 3న ప్రధాని మోదీతో సమావేశమైనపుడు... ప్రాజెక్టు తొలి దశను సత్వరమే పూర్తి చేసి, రైతులకు ముందస్తు ఫలాలు అందించడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించి... జల్ శక్తి, ఆర్థిక శాఖలకు తగు ఆదేశాలిచ్చారు. కేంద్ర జల్ శక్తి శాఖ సూచన మేరకు తొలి దశ పూర్తికి రూ.10,911.15 కోట్లు అవసరమని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.వాటిని జల్ శక్తి శాఖ ఆమోదించింది. అయితే చంద్రబాబు ఘోర తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడానికి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని గత మార్చి 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. దాంతో తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు (10,911 ప్లస్ 2వేలు) విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఆఆర్థికక శాఖ జూన్ 5న అంగీకరించింది. అదీ కథ.వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం.. 2014, ఏప్రిల్ 1 నాటికి ఇరిగేషన్ కాంపొనెంట్ ఖర్చులో మిగిలిన మొత్తం అంటే రూ.15,667.9 కోట్లకు మించి ఇచ్చేది లేదని, ఆ తర్వాత పడే అదనపు భారంతో కేంద్రానికి సంబంధం లేదని 2017 మార్చి 15న కేంద్రం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని కేబినెట్ ఆమోదించింది కూడా.జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,128.78 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.14,418.39 కోట్లు రీయింబర్స్ చేసింది. అంటే 2017, మార్చి 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం పోలవరానికి ఇక విడుదల చేయాల్సింది రూ.1249.51 కోట్లే. ఈ నేపథ్యంలో... తొలి దశ పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లు విడుదల చేయాలంటే.. 2017, మార్చి 15 నాటి కేబినెట్ తీర్మానాన్ని సవరించాలి.ఆ మేరకు ప్రతిపాదన పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆఆర్థికక శాఖ సూచించిందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వబోమని గానీ.. ఇచ్చేది ఇక ఇంతేననిగానీ ఆర్థిక శాఖ నోట్లో ఎక్కడా లేదు. రామోజీరావు మాత్రం ఇచ్చేది ఇక ఇంతేనని కేంద్ర ఆఆర్థికక శాఖ నోట్లో పేర్కొన్నట్లు తప్పుడురాతలు రాసేశారు. చంద్రబాబులా రామోజీది కూడా చంద్రబాబు తరహా బ్రీఫ్డ్ మీ ఇంగ్లీషే అయితే.. ట్యూషన్ పెట్టించుకోవాలి గానీ తనకు అర్థమైనదే వాస్తవమన్న రీతిలో రాసేస్తే ఎలా? అజా్ఞనంతో తప్పుడురాతలు అచ్చేస్తే ఎలా?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులివ్వబోమని కేంద్రం చెప్పినా సీఎం వైఎస్ జగన్ నోరెత్తడం లేదు. లోక్‌సభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఉన్న రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు సీఎం వైఎస్ జగన్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు?వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిరి్మంచాలి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ... దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014, జూన్ నుంచి 2016, సెపె్టంబరు 6 వరకూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు కేంద్రం మంజూరు చేశాక యనమల రామకృష్ణుడు బావమరిదికి, రామోజీరావు వియ్యంకుడికి ఈ కాంట్రాక్టు పనులు నామినేషన్‌పై కట్టబెట్టేశారు. భారీగా కమీషన్లు దండుకున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెపె్టంబరు 7న అంగీకరించడం. మరి ఆ మూడేళ్లలో ధరలు పెరిగి ఉండవా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా?2016, సెపె్టంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని.. 2018, డిసెంబర్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే.. విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలికకు సైతం చంద్రబాబు తల ఊపేశారు.2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆఆర్థికక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే (ఇరిగేషన్ కాంపొనెంట్) వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది.ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నోరు మెదపలేదు.2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసినా సరే... చంద్రబాబు స్పందించలేదు.2016, సెపె్టంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం... 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ. 33,168.23 కోట్లు. అలాంటిది కేవలం రూ.15,667.9 కోట్లు ఇస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా అంగీకరించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్‌కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికైనా అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు కనక.చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోందన్నది నిజం. ç2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. పోలవరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌తోపాటు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చల వల్ల 2014–15 నాటి రెవెన్యూ లోటు రూ.10,421 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు సీఎం వైఎస్ జగన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇవేవీ కని్పంచడం లేదా రామోజీ?ఈనాడు ఆరోపణ: రెండో దశ పునరావాసానికి రాష్ట్రం ఏమీ చేయలేదని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు.వాస్తవం: కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే.. ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ గైడ్ లైన్స్, కేంద్ర జలసంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా.. మూడు దఫాలుగా నిల్వ చేసుకుంటూ పోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి.. ప్రాజెక్టులో అన్ని భాగాలను పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు.ఆ తర్వాత 44 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నింపి, లోటుపాట్లు ఏవైనా ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుతారు. ఆనక 45.72 మీటర్లలో అంటే గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ పలు మార్లు శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. తొలుత 41.15 మీటర్ల వరకూ నిర్వాసితులకు పునరావాసం కలి్పస్తామని.. ఆ తర్వాత దశలవారీగా పునరావాసం కల్పించి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తామని ఉద్ఘాటించారు.ప్రాజెక్టు ఎత్తు ఏమాత్రం తగ్గదని.. కావాలంటే పూర్తయ్యాక టేపు తెచ్చుకుని కొలుచుకోవాలని చంద్రబాబు, రామోజీరావు ఎల్లో మీడియాకు సవాల్ విసిరారు. ఇదే అంశంపై అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గదని, నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో అదనంగా 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలటంతో ఆ గ్రామాల ప్రజలకూ పునరావాసం కల్పించడానికి రూ.5,122 కోట్ల నిధులివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యఆర్థికంచారు. దీనికీ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్టు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టమవుతుంది. అయినా సరే.. రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు.ఇదే అంశాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శాసనసభలో పలు మార్లు ఎత్తిచూపుతూ.. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లని.. అలాంటిది కేంద్రం ఇస్తామన్న రూ.15,667.9 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీస్తే.. నాటి సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు. అంటే చంద్రబాబుకు కావాల్సింది కమీషన్లు తప్ప ప్రాజెక్టు పూర్తవటం కాదు.అందుకే రాష్ట్రమే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... ప్రత్యేక హోదా అడగబోమని తాకట్టుపెట్టేశారు. అంచనా వ్యయాన్ని సవరించకున్నా నోరు మెదపలేదు. ఆఖరికి పునరావాసం ఊసెత్తకుండా కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ మాత్రమే ఇస్తామన్నా... సై అనేశారు.అసలు పునరావాసం లేకుంటే ప్రాజెక్టు ఉంటుందా? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పేదలకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, వారికి తగిన పరిహారం ఇవ్వకుంటే వారు అక్కడి నుంచి వెళతారా? వారు వెళ్లకపోతే ప్రాజెక్టు పూర్తి చేసినా నీటిని నిల్వ చేయగలరా? నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనపుడు ఎంత ఎత్తు కడితే లాభమేంటి? మరి పునరావాస నిధుల ఊసెత్తకుండా చంద్రబాబు ఎందుకు నోరుమూసుకున్నారు? -
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
సాక్షి, తిరుపతి: ‘రామోజీరావు నాకు చాలా సన్ని హితులు. నేను ఆయనను 15 సార్లకుపైగా కలి శా. ఒకసారి వెళ్లి కలిసినప్పుడు రామోజీరావు.. ‘కరుణాకర్‌రెడ్డి గారు.. రూ.2వేల కోట్లు జగన్ నుంచి ఇప్పిస్తే ఈనాడంతా మీ గురించే రాస్తాం’ అన్నారు. ఇది వాస్తవం.. ఏ ప్రమాణానికైనా నేను సిద్ధం. తన బిడ్డలు, మనవళ్లపై ప్రమాణం చేసి కాదని రామోజీ చెప్పగలరా’ అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రామోజీ కుమారుడు సుమన్ తనకు బాగా తెలుసన్నారు. ఒకసారి కలిసిన సమయంలో సుమన్ తన తండ్రి అన్నమాటలను తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. రామోజీÆకి తాను పుట్టలేదన్నారని.. అటువంటి నైజం తన తండ్రిదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో తాను దోపిడీ చేసినట్టయితే ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. 1974లో రాడికల్ స్టూడెంట్ నాయకుడిగా ఉన్న సమయంలో నిధుల సేకరణ కోసం తిరుపతిలో ‘చక్రపాణి’ సినిమాను బెనిఫిట్ షోగా వేశామని తెలిపారు. అప్పుడు వర్సిటీలో చంద్రబాబుని తాను శ్రీధర్, హైకోర్టు అడ్వకేట్ సారధి వెళ్లి కలిశామన్నారు. ఆ సమయంలో బాబు కూర్చొని, ఆయన స్నేహితుడు పడుకుని ఉన్నాడన్నారు. సినిమా టికెట్ కొనుగోలు చేయాలని అడిగితే.. నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో ఉన్న రూ.2లను బాబు దొంగిలించి తన చేతిలో పెట్టారని తెలిపారు. -
అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆప్యాయత చూపిస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆత్మస్థైర్యం పెరుగు తుంది. గుండెల్లో పెట్టుకుని ప్రేమ చూపిస్తే గ్రామాలు, రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వారి ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది.ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో చంద్రబాబు కొనసాగుతున్నారు. ఆరు నూరైనా ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. ప్రధాని మోదీ సమక్షంలో ఇలా మాట్లాడే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఒక్క రిజర్వేషన్లే కాదు.. ఎన్ఆర్సీ, సీఏఏతో పాటు ఏ అంశంమైనా సరే ముస్లిం మైనార్టీల మనోభావాలకు, ఇజ్జత్, ఇమాన్‌కు అండగా నిలబడతాం. 175 అసెంబ్లీ సీట్లకుగానూ 4 శాతం అంటే ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి పొలిటికల్ రిజర్వేషన్లు కూడా కల్పించిన ఏకైక పార్టీ మీ బిడ్డది మాత్రమే. మైనార్టీలకు ఏనాడైనా మంచి చేసిన చరిత్ర చంద్ర బాబుకు ఉందా? ఎన్ని జన్మలకైనా వస్తుందా? చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ.– ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి కర్నూలు/సాక్షి, అనంతపురం/సాక్షి ప్రతినిధి, కడప: ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న వాటి గురించి కాకుండా కేవలం చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, రామోజీరావు లాంటి దుష్ట చతుష్టయానికి ఏం కావాలి? అని మాత్రమే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఏపీకి వచ్చిన ఢిల్లీ పెద్దలంతా మన రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేలా ఎలాంటి ప్రకటన చేయకుండా నాలుగు రాళ్లేసి వెళ్లారని వ్యాఖ్యానించారు. అక్కచెల్లెమ్మల అభ్యున్నతి, అవ్వాతాతల చిరునవ్వులు, సామాజిక వర్గాల వికాసానికి పాటుపడతామని కూటమి నేతలు చెప్పడం లేదని, చంద్రబాబుది పెత్తందార్ల కూటమి అని ధ్వజమెత్తారు. గురువారం కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కొల్లాపురమ్మ టెంపుల్ రోడ్డు వాల్మీకి సర్కిల్, అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ..దేశంలోనే అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే..చంద్రబాబు ఈమధ్య ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో ఏపీలో ఉమ్మడి సభలు పెట్టిస్తున్నాడు. చంద్రబాబు ఉమ్మడి సభలు పెట్టిస్తున్నప్పుడు ప్రజలంతా ఏం ఆశించారంటే.. పదేళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను ఇప్పటికైనా ఇస్తారేమో! ఈ మాట వారి నోటి నుంచి వస్తుందేమోనని ఆశగా ఎదురు చూశారు. ఆ ప్రకటన చేస్తారేమోనని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రజలకు కావాల్సిన మాట ఒక్కటీ మాట్లాడకుండా... చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి? దత్తపుత్రుడికి ఏం కావాలి? వదినమ్మకు ఏం కావాలి? దుష్ట చతుష్టయానికి ఏం కావాలి? అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి, మన మీద నాలుగు రాళ్లు వేసి వెళ్లారు. అదే మోదీ గారు మొన్నటిదాకా ఇదే చంద్రబాబును ‘ఇంతటి అవినీతిపరుడు దేశ చరిత్రలోనే ఉండడు’ అని చెప్పిన నోటితోనే ఇవాళ వారి కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్లిపోయారు! మరి దీనివల్ల రాష్ట్రంలో రైతులకుగానీ, అక్కచెల్లెమ్మలకుగానీ, అవ్వాతాతలకుగానీ, పిల్లలకుగానీ, ఏ ఒక్కరికైనా లాభం జరిగిందా? 2014 హామీలపై మాట్లాడని కూటమి నేతలుమరి దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ వీరంతా 2014లో ఇచ్చిన మేనిఫెస్టోను చూపించి ఇదిగో ఇవన్నీ చెప్పాం.. ఆ ముఖ్యమైన హామీలను నెరవేర్చాం!! అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? కూటమి అంటారు.. డబుల్ ఇంజన్ అంటారు! 2014లో ఇదే ముగ్గురి ఫొటోలతో, చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికీ పంపిన పాంప్లెట్, మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలనే అమలు చేయలేకపోతే ఇక డబుల్ ఇంజనూ... డబుల్ ఇంజనూ! అని ఎందుకు అంటున్నారు? అంటరానితనంపై యుద్ధం మిగిలే ఉంది!ఈ పెత్తందార్ల కూటమి అంతా పేద పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. మొన్న వచ్చి చంద్రబాబును పక్కన పెట్టుకుని మాట్లాడిన అమిత్ షా, ఢిల్లీ పెద్దలను అడుగుతున్నా. బాబును, దత్తపుత్రుడినీ అడుగుతున్నా. వీళ్లకు మద్దతు ఇస్తున్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5నూ అడుగుతున్నా. మీ పిల్లలు, మీ మనవళ్లు.. మీవాళ్లలో ఏ ఒక్కరినైనా కూడా ఇంగ్లిష్ మీడియం బడుల్లో కాకుండా తెలుగు మీడియంలోగానీ లేదా మీ స్థానిక భాషలోగానీ చదివిస్తున్నారా? మన గవర్నమెంట్ స్కూళ్ల పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అట! ఇటువంటి పెత్తందారీ భావజాలంతో వాళ్లు మన ప్రజల ముందుకు వచ్చి ఓటు వేయమని అడుగుతున్నారు. ఇలాంటి వారికి ఓటు వేస్తే పేద పిల్లలకు, గవర్నమెంట్ బడుల్లో చదువుతున్న ఆ పిల్లలకు ఒక్కరికైనా ఇంగ్లీష్ మీడియం నేర్పుతారా? అందుకే ఆలోచన చేయండి. ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద మనం చేయాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో గుర్తుపెట్టుకోమని కోరుతున్నా.మోసపూరిత హామీలతో బాబు మేనిఫెస్టోమరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. రాబోయే ఐదేళ్లూ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్లీ మోసపోవడమే! చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే. ఆయన జీవితమంతా మోసాలు, అబద్ధాలే. అధికారం దక్కిన ప్రతిసారీ పేదలను మోసం చేశాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మోసపూరితంగా ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం లేదు. ఎన్నికల తరువాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాలను మారుస్తూ 99 శాతం వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలు చేశాం. గతంలో రాష్ట్రంలో కేవలం నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాడు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి వివిధ పథకాల ద్వారా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు పారదర్శకంగా అందించాం.వ్యవస్థల్లో సమూల మార్పులు..నాడు–నేడుతో బాగుపడిన ప్రభుత్వ పాఠశాలలు, ఇంగ్లిష్ మీడియం, ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లు, తొలిసారిగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐటీ దాకా ప్రయాణం, బడులు తెరవగానే విద్యాకానుక, గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, వసతి దీవెన, కరిక్యులమ్‌లో సమూల మార్పులు, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులు, తప్పనిసరి ఇంటర్న్‌షిప్.. ఇలాంటి విద్యా విప్లవాలను గతంలో ఎప్పుడైనా చూశారా? ఇంజనీరింగ్, డాక్టర్, డిగ్రీ లాంటి ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థుల్లో ఏకంగా 93% మంది జగనన్న విద్యా దీవెన అందుకుంటున్నారు. నా అక్క చెల్లెమ్మలు వారి కాళ్లపై నిలబడేలా ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు 31లక్షల ఇళ్లపట్టాలు వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేశాం. ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా?ముస్లింలపై బాబు కపట ప్రేమ..ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ శపథం చేసింది. అలాంటి పార్టీతో చంద్రబాబు జత కట్టాడు. మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతానంటున్నాడు. మైనార్టీలను మోసం చేసేందుకు డ్రామాలాడుతూ కపట ప్రేమ నటిస్తున్నాడు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా? ఈ రోజు నేను మీ అందరి సమక్షంలో చెబుతున్నా.. ఆరు నూరైనా నూరు ఆరైనా 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ బిడ్డ జగన్ ఇస్తున్న మాట. వైఎస్సార్ బిడ్డ మాట. ఈ మాట ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు చెప్పగలరా? మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు కొనసాగుతున్నారు? మైనార్టీలపై మీ బిడ్డ జగన్‌ది నిజమైన ప్రేమ. ఇవాళ ఇక్కడున్న వేలాది మందితోపాటు అందరికీ ఒక్క విషయం చెబుతున్నా.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికన ఇచ్చినవి కాదు. ముస్లింలలోనూ ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్, సయ్యద్, మొఘల్కు రిజర్వేషన్లు వర్తించవు. వారిలో పేదవారికి మాత్రమే ఇచ్చారు. అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉంటారు. అలాంటప్పుడు రాజకీయ స్వార్థంతో మైనార్టీలను వేరేగా చూసి వారి నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత వరకూ ధర్మం? రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా? ఎట్టిపరిస్థితుల్లోనూ రిజర్వేషన్లతో పాటు ఎన్ఆర్సీ, సీఏఏ లాంటి ఏ అంశంలోనైనా ముస్లింలకు అండగా నిలబడతా. ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటా. వారిపై ప్రేమ చూపుతా. ఇళ్ల పట్టాలు, డీబీటీ, షాదీ తోఫాతో పాటు ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించాం. నలుగురు ఎమ్మెల్సీలు, నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మైనార్టీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఐదేళ్లు నా పక్కనే పెట్టుకున్నా. మైనార్టీ సోదరికి శాసనసభ మండలి ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించాం. మైనార్టీ సబ్‌ప్లాన్ బిల్లు తేవడంతో పాటు ప్రతీ సందర్భంలోనూ చిత్తశుద్ధి చాటుకున్నాం.రైతన్నలకు తోడుగా..గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూట 9గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ లాంటి పథకాలను తీసుకొచ్చాం. రైతన్నలను ఇంతగా ప్రేమించే ప్రభుత్వం కానీ పథకాలు కానీ గతంలో ఉన్నాయా? స్వయం ఉపాధికి అండగా ఆటోలు, టాక్సీలు నడిపే డ్రైవర్లకు వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసాతో పాటు చిరువ్యాపారులకు తోడు, చేదోడు అందించాం. లాయర్లకు లానేస్తం ఇచ్చాం.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?ఆరోగ్యం.. పౌరసేవలువైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీని విస్తరించి ఉచితంగా సేవలందిస్తున్నాం. విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా ద్వారా అండగా నిలిచాం. గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష తెచ్చాం. ప్రజల ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఉందా? ఇవాళ ఏ గ్రామానికి వెళ్లి చూసినా 600 రకాల పౌరసేవలు అందిస్తున్న గ్రామ సచివాలయం కనిపిస్తోంది. 60–70 ఇళ్లకు వలంటీర్ల సేవలు, ఇంటికే రూ.3వేల పింఛన్, రేషన్, పౌరసేవలు, పథకాలు, గ్రామాల్లో అక్క చెల్లెమ్మలకు అండగా మహిళా పోలీసు, దిశ యాప్ లాంటివి గతంలో ఎప్పుడైనా అమలయ్యాయా? ఇవాళ మన గ్రామాల్లో ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. మరి 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కటైనా మంచి పని గుర్తుకొస్తుందా? బాబు ఇచ్చే డబ్బులన్నీ మీవే..బటన్లు నొక్కి మీ బిడ్డ మీకు మంచి చేశాడు. ఎలాంటి బటన్లు నొక్కని చంద్రబాబు వద్ద డబ్బులు దండిగా ఉన్నాయి. మీకు ఇవ్వాల్సిన డబ్బులను ఆయన దోచుకున్నాడు. ఆ దోచుకున్న డబ్బులో నుంచి ఓటుకు రూ.2 వేలు, రూ.3 వేలు, కొన్నిచోట్ల రూ.4వేలు కూడా ఇచ్చేందుకు తయారుగా ఉన్నాడు. చంద్రబాబు డబ్బులిస్తే వద్దనకుండా తీసుకోండి. ఎందుకంటే.. ఆ డబ్బు అంతా మనదే. మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులతోనూ చర్చించండి. చిన్నపిల్లల అభిప్రాయం కూడా తీసుకుని నిర్ణయం తీసుకోండి. ఎవరి వల్ల ఈ మంచి కొనసాగుతుందో గమనించి ఓటేయాలని కోరు™è ున్నా. మంచి చేసిన ఫ్యాను ఇంట్లో¯ó∙ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోకండి. మళ్లీ జగన్ ఉంటేనే ప్రతి నెలా కేలండర్ ప్రకారం పథకాలు మీ చేతికే అందుతాయి. మళ్లీ వలంటీర్లు మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు బాగుండాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా, బడులు, పేద పిల్లల చదువులు బాగుండాలన్నా, వైద్యం, వ్యవసాయం మెరుగ్గా ఉండాలన్నా ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులనే గెలిపించాలి.బాబు హేళన చేస్తే జగన్ ఆత్మస్థైర్యం కల్పించాడు‘నేను ప్రతీ సందర్భంలోనూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ ప్రేమను బాహాటంగా ఎందుకు చూపిస్తానో తెలుసా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ప్రేమ చూపిస్తే గ్రామాలు, రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వారిలో ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది. ఇది జరగాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ‘నా...’ అనే ఆప్యాయత చూపించాలి. చంద్రబాబును చూస్తే ఇలాంటి ప్రేమ, న్యాయం దేవుడెరుగు! అధికారంలో ఉంటే బడుగు, బలహీన వర్గాలను హేళన చేసి కించపరుస్తూ బెదిరిస్తారు. దారుణమైన మోసాలూ చేస్తారు. 2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..⇒ రూ.87,612కోట్ల రైతురుణాల మాఫీ జరిగిందా? ⇒ రూ.11,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశారా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం ద్వారా రూ.25 వేలు డిపాజిట్ దేవుడెరుగు కనీసం రూపాయైనా ఇచ్చాడా?⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగభృతి ఇచ్చాడా? ఐదేళ్లలో ఏ ఒక్కరికైనా రూ.1.20 లక్షలు ఇచ్చారా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా?⇒ రూ.10వేలకోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత, పవర్‌లూమ్స్ రుణాలమాఫీ హామీలు అమలయ్యాయా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు ఇస్తానని నమ్మబలికి ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీని నిర్మించారా? కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేటలో ఎవరికైనా కనిపిస్తున్నాయా? ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశారు. ⇒ మళ్లీ కూటమిగా మీ ముందుకొచ్చి సూపర్‌సిక్స్, సూపర్ సెవన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌కారు అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు.రోడ్డు ప్రమాద బాధితుడికి సీఎం జగన్ అభయంకళ్యాణదుర్గం: కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మంచానికే పరిమితమైన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన బి.శ్రీనివాసులుకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. అక్కడ స్ట్రెచర్‌పై ఉన్న శ్రీనివాసులును చూసి సీఎం జగన్ బస్సులో నుంచి దిగారు. నేరుగా శ్రీనివాసులు వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గత ఏడాది నవంబర్ 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పటికీ చికిత్స పొందుతున్నట్లు బాధితుడు తెలిపాడు. అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని, ఇప్పటికే రూ.7 లక్షలకు పైగా ఖర్చయిందని కుటుంబ సభ్యులు సీఎం జగన్‌కు వివరించారు. ఇందుకు సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. శ్రీనివాసులు త్వరలోనే కోలుకొనేలా మెరుగైన వైద్య సేవలకు సిఫారసు చేస్తామని, వైద్య ఖర్చులను భరిస్తామని వారికి భరోసా ఇచ్చారు.రాజంపేటలో 18వ మెడికల్ కాలేజీ.ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని అమరన్న, మిథున్ ఇద్దరూ కలసి నాపై ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే టర్మ్‌లో అది చేస్తానని మాట ఇస్తున్నా. రాష్ట్రంలో ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టగా, 18వ మెడికల్ కాలేజీ రాజంపేటలో వస్తుంది.ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి..మీరు ఇక్కడ నొక్కే బటన్ సౌండ్ ఢిల్లీ దాకా వినిపించాలి. మీ బిడ్డ పెన్షన్లు నేరుగా ఇంటికే పంపుతుంటే అడ్డుకున్న వారికి ఆ సౌండ్ వినిపించాలి. అంత గట్టిగా సౌండ్ వినిపించేలా భారీ మెజార్టీతో మన అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నా.ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా?చంద్రబాబు మన జిల్లాకు వచ్చి మూడు ప్రాంతాల్లో మీటింగులు పెట్టాడు. రాయచోటికి వెళ్తే రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్‌గా కంటిన్యూ అవుతుంది అంటాడు. మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అంటాడు. రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్ అంటాడు. మరి ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా? ఇదే రాజంపేటలో మన గంగిరెడ్డి అన్నకు చెందిన అన్నమయ్య కాలేజీని ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీలతో టైఅప్ చేయించి ఒక వర్సిటీగా మీకు అందించాం. పింఛా ప్రాజెక్టు దాదాపు 90 శాతం పనులు పూర్తిచేశాం. అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, గాలేరు నగరి కాలువ పనులు రైల్వేకోడూరు వరకు పూర్తి చేయాలన్నా మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి.మన అభ్యర్థులను ఆశీర్వదించండికర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బీవై రామయ్య, ఇంతియాజ్, పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణ, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్రెడ్డి, నాకు సొంత తమ్ముడు లాంటి ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డిని గొప్ప మెజార్టీతో మీరంతా ఆశీర్వదించాలని కోరుతున్నా.రాజంపేటలో 18వ మెడికల్ కాలేజీ.ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని అమరన్న, మిథున్ ఇద్దరూ కలసి నాపై ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే టర్మ్‌లో అది చేస్తానని మాట ఇస్తున్నా. రాష్ట్రంలో ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టగా, 18వ మెడికల్ కాలేజీ రాజంపేటలో వస్తుంది.వైఎస్సార్సీపీకి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతుకర్నూలు(సెంట్రల్): వైఎస్సార్సీపీకి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు ప్రకటించారు. గురువారం సీఎం జగన్ కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పాల్గొని తమ మద్దతు సీఎం వైఎస్ జగన్‌కే అని ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించారు. వైఎస్ జగన్ పొలిటికల్ హీరో అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎంగా వైఎస్ జగన్ గెలుపొందడం ఖాయమన్నారు. వైఎస్ జగన్‌తోనే పేద ప్రజల అభివృద్ధి సాధ్యమన్నారు. -
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకుంటున్నారు. ప్రత్యేకించి రైతుల మనోబావాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరికైనా భూమితో ఉండే సంబంధం చెప్పనవసరం లేదు. అందులోను రైతులకు మరింతగా ఉంటుంది. వారు భూమిని దైవంగా పరిగణిస్తారు. ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఆ భూముల డాక్యుమంట్లను చాలా జాగ్రత్తగా భద్రపరచుకుంటారు. వాటిని తమ కుటుంబ భవిష్యత్తుకు చిహ్నాలుగా చూసుకుంటారు. అలాంటి డాక్యుమెంట్లను చంద్రబాబు నాయుడు దగ్దం చేసే సాహసం చేశారు. ఆయన చేసింది చాలా పెద్ద తప్పు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయనకు ఎంత ద్వేషమైనా ఉండవచ్చు. ఎంత అక్కసు అయినా ఉండవచ్చు.కాని జగన్‌ను దూషించడానికి రైతుల డాక్యుమెంట్లను తగులబెట్టి దారుణమైన చర్యకు ఉపక్రమించారు. పైగా అదేదో గొప్ప పని మాదిరి ఏమి తమ్ముళ్లూ తగులబెట్టానా? అంటూ ఒకటికి రెండుసార్లు సభలో వికటాట్టహాసం చేయడం. ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు ఎవరు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇస్తున్నారో కాని, ఆయన చేష్టలన్నీ రోత పుట్టిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. బూతులు తిట్టడం, డాక్యుమెంట్లు కాల్చడం ఏమిటి? 2014-2019 టరమ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులను పీడించి 33 వేల ఎకరాలను సమీకరించారు. కొందరు ఇష్టంతోనే ఇచ్చినా, చాలామంది అందుకు సిద్దపడలేదు. వారిపై రకరకాల కేసులు పెట్టి, చివరికి వారి పంటలను కూడా దహనం చేయించారన్న విమర్శలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం గురి అయింది. దాని ప్రభావంతో ఏపీలో ఆయన ఏకంగా అధికారాన్ని కోల్పోయి, కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యారు. వైఎస్సార్సీపీకు 151సీట్లతో స్వీప్ వచ్చింది.అమరావతి రాజధాని గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరిలలో కూడా టీడీపీ ఓటమిపాలైంది. మంగళగిరిలో స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటీచేసినా ఫలితం దక్కలేదు. దానిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఏదో ఒక వివాదం సృష్టిస్తూ జగన్ ప్రభుత్వాన్ని సజావుగా నడవకుండా అడ్డుపడుతూ వచ్చారు. అలాగే మళ్లీ 2024 ఎన్నికల సమయంలో కూడా అనేక గొడవలు సృష్టించడానికి, అబద్దపు ప్రచారాలు చేయడానికి చంద్రబాబు బృందం పూనుకుంది. నిప్పుకు గాలి తోడైనట్లు పవన్ కల్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటి మరికొందరు ఆ బాచ్‌లో చేరి అడ్డగోలు ప్రచారాలకు దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు నిజానికి తానేమి చేస్తున్నాననో అర్ధం చేసుకోలేని మానసిక స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది.ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నీ అమ్మమొగుడు, అమ్మమ్మ మొగుడు, నానామ్మ మొగుడు.. ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారా? మైండ్ ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి బూతులు మాట్లాడతారా? రెండు రోజుల క్రితమే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ బూతులు తిట్టే రాజకీయ నేతలను ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబును ఓడించాలని వెంకయ్య నాయుడు పిలుపు ఇస్తే బాగుంటుంది. ఎన్నికల సంఘం కూడా చంద్రబాబు పట్ల చాలా ఔదార్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రెండు రోజుల నిషేధం పెట్టిన ఎన్నికల సంఘం చంద్రబాబుపై మాత్రం ఆ స్థాయిలో చర్య తీసుకోవడం లేదు. జగన్‌ను చంపితే ఏమి అవుతుందని చంద్రబాబు ప్రశ్నించినా, ఎన్నికల సంఘం మాత్రం చూస్తూ ఊరుకుంటోంది. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు వైఎస్సార్సీపీ పైన, సీనియర్ అధికారులపై ఫిర్యాదు చేస్తే చాలు.. ఆఘమేగాల మీద చర్యలు చేపట్టి వారిని బదిలీ చేస్తోంది. తద్వారా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న లక్ష్యాన్ని ఎన్నికల సంఘం కూడా నెరవేర్చుతున్నట్లు అనిపిస్తుంది.కేంద్ర హోం మంత్రి అమిత్-షా వచ్చిన రోజున డీజీపీని బదిలీ చేసి, ప్రధాని మోదీ ఏపీకి వచ్చిన రోజున మరికొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కూటమి నేతలను సంతోషపెట్టినట్లు అనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఏపీలో ఎప్పటి నుంచో అమలు అవుతున్న ఆయా స్కీములకు గాను ప్రజలకు వెళ్లవలసిన డబ్బు వెళ్లకుండా అడ్డుపడుతోంది. కూటమి నేతలు చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్ వంటివారు చేసే ఫిర్యాదుల ఆధారంగా ఈసి పనిచేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఎన్నికలనైనా సజావుగా జరగనిస్తారా? అన్న సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పక్కనబెడితే, రైతు భూమి డాక్యుమెంట్‌ను చంద్రబాబు దగ్దం చేయడానికి కారణం ఏమిటని పరిశీలిస్తే అందులోను చంద్రబాబు డబుల్ గేమ్ బయటపడుతుంది. రామోజీ జర్నలిజాన్ని ఎంతగా దిగజార్చింది అర్దం అవుతుంది.2019 జూలైలో శాసనసభలో లాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది చాలా గొప్ప చట్టమని, కేంద్రం దీనిపై ఎప్పటినుంచో కసరత్తు చేస్తోందని, పలు దేశాలలో ఇప్పటికే ఈ తరహా చట్టాలు ఉన్నాయని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మెచ్చుకున్నారు. అప్పుడు చంద్రబాబు ఎక్కడా వద్దనలేదు. కాని శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో దానిని కాంట్రవర్శీ చేసి రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. తదితర ఎల్లో మీడియా అడ్డగోలు కధనాలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించాలని తలపెట్టాయి. మొదట వైఎస్సార్సీపీ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాని ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పవన్ కల్యాణ్‌లు కుయుక్తులు పన్నారన్న విషయం అర్దం చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు మేల్కొని అసలు విషయాలు చెప్పడం ఆరంభించారు. ఆ క్రమంలో అసెంబ్లీలో టీడీపీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వీడియోని, రామోజీకి చెందిన టీవీలలో ఈ బిల్లు గొప్పదని చెప్పిన సంగతులను బయటపెట్టారు. దాంతో వారికి నోట మాటరాని పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి ప్లేట్ పిరాయించాయి. ఇంత తొందరేముంది అంటూ మరో చెత్త కధనాన్ని వండి యత్నం చేశాయి. చంద్రబాబు అయితే నిర్లజ్జగా ఆ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం మరింత వికృతంగా వ్యవహరించారు. అందులో భాగంగానే రైతుల సెంటిమెంట్ దెబ్బతినే విదంగా వారి భూ డాక్యుమెంట్‌ను దగ్దం చేశారు. ఆ పనేదో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్-షాల సభలలో వారి సమక్షంలోనే తగులబెడితే వారు ఏమి చెప్పేవారో తెలిసేది కదా? కాని ఆ పని చేయరు.కేవలం ప్రజలను మోసం చేయడానికి, తాను ఆత్మరక్షణలో పడిన విషయాన్ని కప్పిపుచ్చడానికి డాక్యుమెంట్లను దగ్దం చేసి రైతుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని చెప్పాలి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా డబుల్ గేమ్ ఆడారు. ఒకటికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం అంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారు. తీరా కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు రెడీకాగానే సోనియాగాంధీని దెయ్యం, బూతం అంటూ బండబూతులు తిట్టారు. ఆంధ్రుల పొట్టకొట్టిందని అన్నారే తప్ప తాను సమైక్యవాదినని, తాను ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నానని మాత్రం చెప్పలేదు. తెలంగాణలో జరిగిన సభలలో తనవల్లే రాష్ట్రం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు. ఇలా ఎన్నిసార్లు డబుల్ గేమ్ ఆడారో లెక్కలేదు. రెండు నాలుకల దోరణిలో బహుశా దేశంలోనే చంద్రబాబుకు అగ్రస్థానం ఉండవచ్చు. వలంటీర్ల వ్యవస్థను రకరకాలుగా దూషించారు. ఆ తర్వాత తాను అదే వ్యవస్థను కొనసాగిస్తానని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తానని అంటారు.జగన్ సంక్షేమ స్కీములు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని అన్న చంద్రబాబు అంతకు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీ ఇస్తుంటారు. ఈ డబుల్ టాక్‌తో రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారు. అలాగే ఇప్పుడు లాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన డబుల్ టాక్ చేసి అప్రతిష్టపాలయ్యారు. అమలులోకి రాని చట్టంతో ఏదో ప్రమాదం జరిగినట్లు పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారం చేయడం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిచ్చి ప్రసంగాలు చేయడం నిత్యకృత్యం అయింది. అందులో బాగంగా చంద్రబాబు రైతుల బూమి డాక్యుమెంట్ ను దగ్దం చేసి రైతుల సెంటిమెంట్‌ను దెబ్బతీశారు. గతంలో అమరావతిలో పంటపొలాలు దహనం చేయించిన తర్వాత ఘోర పరాజయం చెందారు. అలాగే ఈసారి రైతుల భూమి డాక్యుమెంట్‌ను బుగ్గిపాలు చేయడం ద్వారా కూటమి అదికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అలాగే తగులబెడతామని ప్రజలకు వారికి తెలియకుండానే సంకేతం పంపించారు. కనుక భూ డాక్యుమెంట్ తగులబెట్టిన చంద్రబాబుకు మరోసారి ఓటమి తప్పదన్న భావన వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బెడిసి కొట్టిన ఈనాడు స్టోరీ.. రామోజీ షాక్స్!
ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయా? ఇంత అభివృద్దికి అడుగులు పడుతున్నాయా? నిజంగా ఏపీ ప్రజలకు వీటి గురించి పూర్తి వివరాలు తెలియవంటే ఆశ్చర్యం కాదు. కాని ద్వేష భావంతో, ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడం కోసం ఈనాడు మీడియా రాసిన ఒక స్టోరీ అందరూ చదవవలసిందే. బహుశా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఇంత వివరంగా తన ప్రభుత్వం ఇన్ని కొత్త పరిశ్రమలను తీసుకు వస్తున్న సంగతి ప్రజలకు చెప్పినట్లు అనిపించదు. శుక్రవారం నాడు ఈనాడు దినపత్రికలో "అంతా.. ఆ ఏడు చేపలకే" అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. ఈనాడు లక్ష్యం ఏమిటంటే ఏడు పెద్ద కంపెనీలకు జగన్ లబ్ది చేకూర్చే యత్నం చేశారని, ఏపీలో వాటికి పలు భారీ పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఇచ్చారని ప్రజలు అనుకోవాలని వారు ఈ కథనాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత నాకైతే జగన్‌పై మరింత గౌరవం పెరిగింది. ఎందుకంటే ఏపీకి ఇన్ని ముఖ్యమైన పరిశ్రమలు తీసుకు రావడానికి జగన్ చేసిన కృషి ఈ కథనం ద్వారా తెలిసింది. మరి ఇంతకాలం ఇదే ఈనాడు మీడియా ఏమని ప్రచారం చేసింది? ఏపీకి అసలు పరిశ్రమలు రావడం లేదని కదా! పారిశ్రామికవేత్తలు రావడం లేదని కదా? పెట్టుబడులు రావడం లేదని కదా! ఈనాడు తాజాగా ఇచ్చిన కథనం ప్రకారం 2.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏడు కంపెనీలవారు చేపట్టారని. ఇది మంచిదే కదా? అసలే పరిశ్రమలే రావడం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం, అవన్ని పురోగతిలో ఉండడం స్వాగతించవలసిన విషయం కదా! ఈనాడు మీడియాకు, దాని అధిపతి రామోజీరావుకు ఏపీలో పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ఎస్ఈజెడ్లు వచ్చాయి. అప్పుడు ఈ మీడియా కాని, తెలుగుదేశం కాని చేయని యాగీ లేదు. విదేశాలకు ఎగుమతులు చేసే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల ఏర్పాటుకు వీటిని కేంద్రం ప్రతిపాదించింది. అందుకోసం భూములు సేకరిస్తుంటే విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రకరకాలుగా అడ్డంకులు సృష్టించేవారు. సోనియాగాంధీ, చంద్రబాబు, సీబిఐ కుమ్మక్కై వాన్‌పిక్ రాకుండా చేశారు. చీరాల, రేపల్లె ప్రాంతంలో వాన్‌పిక్ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని పదమూడు వేల ఎకరాల భూములను ఆ సంస్థ కొనుగోలు చేసింది. అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికి పనికిరాని భూములే. కొంత ప్రభుత్వ భూమి. కాని ఆ భూమిని సేకరించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్‌పై ఉన్న ద్వేషంతో వీరు కేసులలో ఇరికించి జైలులో పెట్టారు. ఆ భూములలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి అడ్డు పడకుండా ఉంటే ఈపాటికి ఆ ప్రాంతం బ్రహ్మాండంగా తయారై ఉండేదేమో! వైఎస్ హయాంలో సూళ్లూరు పేట సమీపంలో శ్రీసిటీ పేరుతో ఒక పారిశ్రామికవాడ నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో ఇదే ఈనాడు మీడియా భూ సేకరణను దోపిడీ కింద అభివర్ణించి పలు కధనాలు రాసేది. సెజ్‌లలో ఉద్యోగాలు ఏవి అంటూ దిక్కుమాలిన విమర్శలు చేసేది. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి వెనక్కి తగ్గకుండా శ్రీసిటీ ఏర్పాటుకు సహకరించారు. ఆ సంస్థ యజమానులు స్థానిక రైతుల సహకారంతో పారిశ్రామిక వాడను రూపొందించారు.ఇప్పుడు అది నిజంగానే శ్రీసిటీ అయింది. అక్కడి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తోంది. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఈనాడు మీడియా ఏమని రాసిందో తెలుసా?బతుకు చిత్రాన్ని మార్చిన సిరుల సీమ శ్రీసిటీ అని రాశారు. అంటే వైఎస్ అధికారంలో ఉంటే వ్యతిరేకించడం, చంద్రబాబు సీఎంగా ఉంటే భజన చేయడం. ఇదే ఈనాడు నైజం. ఇప్పుడు కూడా ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తుంటే ఈ మీడియా ఏడ్చిపోతోంది. షిర్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుమారు 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వీటిలో ఒకటి. కేంద్ర ప్రుభుత్వం చేసిన సూచనల ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే, దానివల్ల రైతులకు ఏదో నష్టం జరిగిపోతుందని ఇదే మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ మీటర్లు రైతులకు ఉరి అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దానివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వం సరపరా చేసే విద్యుత్‌కు లెక్కలు ఉంటాయని, రైతులకు డబ్బు జమ చేస్తామని చెప్పి ముందుకు వెళ్లారు.ఈ ప్రాజెక్టు పై ఎంత అబద్దపు ప్రచారం చేసినా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు వివరణలు ఇచ్చినా, ఈనాడు ఆరోపణలను ఖండించినా, వీరి పద్దతి మాత్రం మారలేదు. అదే సమయంలో ఈ మీటర్లు బిగించాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆయన రెండు నాలుకల ధోరణికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులో 478 కోట్లతో రెండు అదనపు యూనిట్లు స్థాపిస్తున్నారు. ఇది టెండర్ ఆధారంగానే ప్రాజెక్టుల కేటాయింపు జరుగుతుంది.అయినా ఈనాడుకు ఇష్టం లేదు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్ల, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కంపెనీ వారే పెట్టుబడి పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇందులో రామోజీకి వచ్చిన బాధ ఏమిటో తెలియదు. రామోజీ ఫిలింసిటీ స్థాపించినప్పుడు వేల ఎకరాలను కొనుగోలు చేశారు. దానికి ఎవరు అనుమతించారు. అసలు ఆ ప్రాజెక్టు స్థాపనకు ఏమైనా టెండర్ పిలిచారా? అయినా స్థాపించలేదా? అందులో తప్పు లేదు.కాని ఇతర కంపెనీలు ఏవైనా పరిశ్రమలు పెడుతుంటే మాత్రం ఈ మీడియా అడ్డం పడుతుంటుంది. ఈనాడు మీడియా అభివృద్ది నిరోధకంగా మారింది. విచిత్రం ఏమిటంటే షిర్డిసాయి ఎలక్టికల్ కంపెనీ తెలుగుదేశం పార్టీకి నలబై కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ఈ విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అదే మెఘా కంపెనీ వైఎస్సార్సీపీకి 37 కోట్ల విరాళం ఇచ్చింది. దానిని మాత్రం రాసేశారు. మరి అదే సంస్థ తెలుగుదేశంకు పాతిక కోట్లు ఇచ్చింది. దానిని కప్పిపుచ్చారు. అసలు గుర్తింపేలేని జనసేనకు ఐదు కోట్లు ఇచ్చారు. మరి దీనిని ఏమంటారో రామోజీనే చెప్పాలి. జిందాల్ కంపెనీ 42500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం వద్ద రెండు కాప్టివ్ బెర్తుల నిర్మాణం, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా. నంద్యాల ప్రాంతాలలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పదివేల మెగావాట్ల పవన విద్యుత్, 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపడితే దానిపైన విమర్శలు చేశారు. వీరికి మైనింగ్ లీజులు కేటాయించారన్నది ఈనాడు ఏడుపు. ఖనిజం లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందో వీరే చెప్పాలి.మెఘా కంపెనీ 30445 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది. సీలేరు వద్ద 12264 కోట్లతో పిఎస్పి ప్రాజెక్టును ఈ సంస్థ స్థాపిస్తోంది. అది వీరికి కడుపునొప్పిగా మారింది. జెన్కో టెండర్ ద్వారానే దీనిని కేటాయించినా, తప్పే నట. మచిలీపట్నం పోర్టు పనులు కూడా టెండర్ ద్వారానే ఈ సంస్థ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును, జల విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఈ కంపెనీ అమలు చేస్తోంది. ఇంత అభివృద్ది జరుగుతుంటే, ఈనాడుకు ఇదంతా మింగుడుపడడం లేదు. అందుకే ఇంత బురదచల్లుతూ స్టోరీలు ఇస్తోంది. విశాఖలో అదానికి డేటా సెంటర్ నిర్మాణానికి భూమి ఇవ్వడం కూడా నేరమేనట. అదాని బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే వీరు కుళ్ళుతున్నారు. అదే అమరావతి గ్రామాలలో సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను చంద్రబాబు ఇస్తే మాత్రం గొప్ప విషయం అని రామోజీ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ కంపెనీలను పట్టుకువచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో పదవి పోగొట్టుకున్నారు. అలాగే దుబాయికి చెందిన ఒక సంస్థ పేరుతో వంద ఎకరాలు ఆస్పత్రి నిమిత్తం ఇచ్చారు. ఆస్పత్రి రాలేదు కాని, ఆ కంపెనీ యజమాని అక్కడ చేసిన నేరాలకు జైలుకు వెళ్లారు.ఇలాంటి వాళ్లు చంద్రబాబుకు స్నేహితులు. దేశంలోనే పెద్ద కంపెనీలకు వివిధ ప్రాజెక్టులను అప్పగిస్తే నేరం చేసినట్లు ఈనాడు రామోజీ రాయించేస్తున్నారు. అంటే ఈ కంపెనీలు ఏవీ రాకుండా ఉంటే, ఏపీలో ఉద్యోగాలు పెరగకుండా ఉంటే వీరికి సంతోషం అన్నమాట. ఈ ప్రాజెక్టులను కనుక చంద్రబాబు టైమ్‌లో చేపట్టి ఉంటే అబ్బో అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవారు. రామాయపట్నం ఓడరేవు వద్ద ఇండోసోల్ సంస్థ సోలార్‌పానెల్ ప్రాజెక్టును ఆరంభిస్తే, ఎంత దారుణమైన కథనాలు ఈనాడు మీడియా ఇచ్చిందో గమనిస్తే వీళ్లు అసలు మనుషులేనా అన్న అనుమానం వస్తుంది. 43 వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంటే సంతోషించాల్సింది పోయి విషం చిమ్ముతున్నారు. పైగా వారి ఖర్చుతో భూములు కొనుగోలు చేస్తుంటే వీరికి తీటగానే ఉంది.అక్కడ రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు అమ్ముతున్నారు. అది వీరికి గిట్టడం లేదన్నమాట. అలాగే అరవిందో సంస్థ పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వాటిపై కూడా విషం చిమ్మారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ప్రజలకు ఉపయోగపడేవి. ప్రభుత్వం ఖర్చు కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి. అయినా ఈనాడు మీడియా అదేదో ఘోరం జరిగినట్లు దారుణమైన కథనాలు ప్రచురిస్తోంది. ఈ మొత్తం కధనం చదివితే ఇన్ని వివరాలను నెగిటివ్‌గా ఇచ్చినా ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయని తనకు తెలియకుండానే ఈనాడు మీడియా అంగీకరించింది. నిజంగా ఇవన్ని ఆచరణలోకి వస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
దొంగలు దొరికారు
-
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు
సాక్షి, అమరావతి: ఒకరు నారా... మరొకరు రారా (రామోజీరావు)! ఒకరికి 75... మరొకరికి 87. ఇద్దరికీ ఏళ్లు వచ్చినా బుద్ధి మాత్రం రాలేదు! ముందొక మాట చెప్పి.. ఆ వెంటనే నాలుక మడత పెట్టడంలో ఇద్దరూ ఆరితేరిపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా... మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త వాగ్దానాలు, రంగురంగుల మేనిఫెస్టోతో తయారైపోవటం చంద్రబాబు సహజ లక్షణం. 2014లో వందల హామీలిచ్చేసిన బాబు... ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాటిని నెరవేర్చటం తన తరం కాదని తెలిసి ఏకంగా మేనిఫెస్టోనే కనపడకుండా చేసేశారు. ఆఖరికి తన పార్టీ వెబ్సైట్లో నుంచి కూడా తీసేశారు. రామోజీరావూ సేమ్ టూ సేమ్! కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రామోజీ గతంలో బాగా ప్రశంసించారు. దీన్లో ఉన్న అంశాలను వివరిస్తూ... ఈ చట్టంతో రైతుల భూమికి భద్రత ఉంటుందని, ఎక్కడైనా ఇబ్బందులొస్తే ప్రభుత్వమే వారికి పరిహారమిచ్చేలా గ్యారంటీ ఇస్తుంది కనుక ఇది చాలా మంచి చట్టమంటూ తన ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమంలో ఓ స్టోరీని ప్రసారం చేశారు. ఇపుడు ఎన్నికల వేళ సీఎం జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక... ఇంకా అమల్లోకే రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం వచ్చేసిందంటూ, ప్రభుత్వం అందరి భూములూ లాక్కుంటోందంటూ టీడీపీ విష ప్రచారం మొదలెట్టింది. టీడీపీ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన ‘ఈనాడు’ శక్తి మేరకు విషం చిమ్ముతోంది. ఈ చట్టం వస్తే ‘మీ భూములు మీవి కావు’ అంటూ విషపూరిత కథనాలు ప్రచురిస్తోంది. ఇక చంద్రబాబు, లోకేశ్ అయితే ‘మీ భూములు జగన్ ప్రభుత్వం లాక్కుంటుంది జాగ్రత్త..!’ అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ’ గతంలో ప్రసారం చేసిన కథనాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం బయటపెట్టారు. వీడియో లింక్‌ను అందరికీ షేర్ చేశారు. దీంతో తన బండారం బయటపడి పోయిందని గ్రహించిన రామోజీరావు.. క్షణాల్లో ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించారు. ఇపుడు ఆ లింకుపై క్లిక్ చేసిన వారికి... ‘దిసీజ్ ప్రైవేట్ వీడియో’ అనే మెసేజ్ కనిపిస్తోంది. ఇది చూసినవారు బాబు, రామోజీ ఇద్దరూ ఇద్దరే అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీని పబ్లిక్‌గా ప్రసారం చేస్తున్నపుడు దాన్లోని వీడియోలు ప్రైవేట్‌వి ఎలా అవుతాయి? ఈ ప్రశ్నకు రామోజీ దగ్గర సమాధానం లేదు. గుడ్డలిప్పిన గురుశిష్యులు! కొద్దిరోజులుగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి అడ్డూ అదుపూ లేకుండా విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా, చంద్రబాబు పరివారం బట్టలు విప్పుకుని బరి తెగించి చెబుతున్న మాయమాటలు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పన్నిన మాయోపాయాలేనని తేలిపోయింది. భూ హక్కు చట్టంపై చెబుతున్న బూటకపు కబుర్లన్నీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కారు కూతలేనని బయటపడింది. ఈ చట్టం చాలా మంచిదని, రాష్ట్రంలోని రైతులకు ఎంతో మేలు చేస్తుందంటూ స్వయంగా రామోజీ మీడియానే గతంలో అనేక కథనాలు అచ్చేసింది. ఈటీవీలోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయగా, చట్టం అద్భుతమని కితాబిస్తూ ఈనాడులోనూ కథనాలు రాశారు. రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఈటీవీ అన్నదాతలో నాలుగు నెలల క్రితం ‘టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం గమనార్హం. ప్రముఖ భూ చట్టాల నిపుణుడు, హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ ఈ చట్టం వస్తే రాష్ట్రంలోని భూముల వ్యవస్థ ఎంతగా మారిపోతుందో చాలా కూలంకషంగా వివరించారు. చంద్రబాబు కోసం హఠాత్తుగా యూటర్న్ రామోజీ గతంలో తాను ఈ చట్టానికి అనుకూలంగా ప్రసారం చేసిన వీడియోకి విరుద్ధంగా ఎన్నికల్లో చంద్రబాబు లబ్ధి కోసం తాజాగా యూటర్న్ తీసుకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి వ్యతిరేకంగా బురద జల్లే బాధ్యత తనపై వేసుకున్నారు. ఈ చట్టం ద్వారా రైతుల భూములకు భద్రత ఉంటుందని చెప్పిన నోటితోనే అది దుర్మార్గమంటూ నిస్సిగ్గుగా నాలుక మడతేశారు. రైతుల భూములు తెల్లారేసరికల్లా ఇతరుల పేరు మీదకు మారిపోతాయని, సీఎం జగన్ ప్రజల స్థిరాస్తులు లాక్కునేందుకే ఈ చట్టం తెచ్చారంటూ బరితెగించి దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఈ అడ్డగోలు ప్రచారంతో ప్రజల మెదళ్లను విషపూరితం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ల్యాండ్ టైట్లింగ్ చట్టం చాలా మంచిదంటూ ఈటీవీ ప్రసారం చేసిన వీడియో తాజాగా వైరల్ కావడంతో పచ్చ మంద నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అందులో ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఇది రాష్ట్రానికి అవసరమని, ఎంతో ప్రయోజనకరమని చెప్పిన అంశాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. భూ హక్కుల చట్టం గురించి అంత గొప్పగా చెప్పి అది వస్తే భూములకు భరోసా వస్తుందని కితాబిచ్చిన రామోజీ ఇప్పుడు సిగ్గు విడిచి భూములు పోతాయని కల్లబొల్లి మాటలు చెప్పడం ఏమిటని అంతా విస్తుపోతున్నారు. చంద్రబాబు హయాంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి వదిలేసిన భూదార్ ప్రాజెక్టుకు ఈ చట్టం కొనసాగింపు అంటూ అదే కథనంలో ఈటీవీ కార్యక్రమంలో ప్రసారం చేశారు. అది అబద్ధమే అయినా సీఎం జగన్ హయాంలో వచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి చెప్పే క్రమంలో చంద్రబాబు చేయలేక వదిలేసిన భూదార్ గురించి ప్రస్తావించారు. ఈ ప్రత్యేక కథనంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పదనం, దాని ఆవశ్యకత, రైతులకు చేకూరే ప్రయోజనాలు, భూముల వ్యవస్థలో వచ్చే మార్పుల గురించి సోదాహరణంగా వివరించారు. ఎంతో మంచి చట్టమని కితాబిచ్చిన రామోజీ ఎన్నికల వేళ ఈ స్థాయికి దిగజారడంపై ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. దీనిబట్టి ఈనాడు, ఈటీవీ కార్యక్రమాలన్నీ ప్రజలను మభ్యపుచ్చడం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మరోసారి స్పష్టమైందని పేర్కొంటున్నారు. ఆదరాబాదరాగా అదృశ్యం.. ఈ వీడియోతో తమ పరువు బజారున పడిందని గ్రహించడంతో నాలుక కరుచుకున్న రామోజీ ఆదరబాదరగా యూట్యూబ్‌లోని ఈటీవీ ఛానల్లో దాన్ని ఎవరూ చూడకుండా చేశారు. 2014 ఎన్నికల్లోనూ ప్రజలను మాయ చేసేందుకు చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి మేనిఫెస్టో విడుదల చేశాడు. అనంతరం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతుండడంతో వాటి గురించి ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించి తన దొంగ బుద్ధిని చాటుకున్నారు. ఇప్పుడు రామోజీ కూడా ఎంతో మంచిదని తాను ప్రసారం చేసిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం వీడియోను ఈటీవీ యూట్యూబ్ ఛానల్లో కనపడకుండా మాయం చేశారు. తద్వారా రామోజీ, చంద్రబాబు ప్రజా ప్రయోజనాలు పట్టని గురు శిష్యులని మరోసారి స్పష్టంగా రుజువైంది. కాగా 2019లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం బిల్లుకు అసెంబ్లీలో టీడీపీ మద్దతివ్వడం గమనార్హం. ఈ చట్టంతో భూ కబ్జాలకు తెర పడుతుందన్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తోందంటూ బిల్లుకు మద్దతు పలికారు. ఇప్పుడు ఎన్నికల ప్రయోజనాల కోసం ‘యూటర్న్’ తీసుకుని మీ భూములు లాక్కుంటారంటూ ప్రతి సభలోనూ చంద్రబాబు పెడబొబ్బలు పెడుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు అమల్లోకి రాని చట్టంపై ఇంత దుష్ప్రచారమెందుకని నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఈటీవీలో ఏం చెప్పారంటే.. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. మీకు భూమి ఉంటే అది పట్టాదార్ పాస్ పుస్తకంలోగానీ ఆన్లైన్ రికార్డులోగానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో భూములున్నా సరైన పాస్ పుస్తకాలు, ఇతర హక్కు పత్రాలు లేక రికార్డుల్లో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చట్టాన్ని అనుసరించి భూ యజమానులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిష్టర్‌లో ఎవరి పేరు ఉంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. -
మోదీ మాస్టర్ ప్లాన్‌లో బకరాలైన బాబు, పవన్
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతోంది. తాము ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు. పాజిటివ్ కాంపెయిన్ కన్నా నెగిటివ్ కాంపెయిన్‌కే ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్నారు. దీనివల్ల జనంలో అంత ఆదరణ కనిపించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు సంయుక్త మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు బీజేపీ నేత సిద్దార్ధ్ సింగ్ ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం బాగా డామేజ్ చేసింది. అంతకు మించి ఇప్పుడు మరో అంశం కనబడుతోంది. కూటమి పక్షాన ఇస్తున్న ప్రచార ప్రకటనలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి టీడీపీ పక్షాన చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలలో ఏదో ఒక దానిని పెట్టి చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం అంటూ ప్రకటన ఇచ్చారు. అందులో ఎక్కడా టీడీపీ వాగ్దానాలకు ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కట్టుబడి ఉంటామని చెప్పడం లేదు. అంటే ఇది కేవలం టీడీపీ దే తప్ప కూటమిది కాదన్న అర్ధం వస్తుంది. అలాగే పవన్ మేనిఫెస్టోలో భాగస్వామి అయిఇనప్పటికీ, కొన్నిసార్లు ఆయన ఫోటో కూడా వాడడం లేదు.మరో ప్రచార ప్రకటన గమనించండి. అది బీజేపీ అడ్వర్వైజ్ మెంట్. అందులో పైన ప్రధాని మోదీ ఫోటటో ఉంటే, కింద, చంద్రబాబు, పవన్‌ల పోటోలు వేసుకున్నారు. ఆ పక్కనే మోదీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం.. అని స్పష్టంగా తెలిపారు. మోదీ మేనిఫెస్టోకి వీరిద్దరూ గ్యారంటీగా ఉంటారు కాని, చంద్రబాబు మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ ఉండరని తేలిపోతోంది. ఇది టీడీపీ, జనసేనలకు మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలే బతిమలాడి, బాములాడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీ వారేమో తమ మేనిఫెస్టోని అంటరాని పత్రంగా పరిగణించడం బాధాకర అంశమని టీడీపీ నేతలు అంటున్నారు. అదే టైమ్‌లో చంద్రబాబు చేసే పిచ్చి వాగ్దానాలకు, గాలి హామీలకు తాము ఎక్కడ గ్యారంటీ ఇస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఒక రకంగా ఇది చంద్రబాబుకు దయనీయ పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మోదీ గ్యారంటీలు, ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ. అధికారంలోకి వస్తే ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా చెబుతున్నారు. దానిని అవుననలేక, కాదనలేక టీడీపీ, జనసేనలు సతమతమవుతున్నాయి. సుమారు ముప్పై నియోజకవర్గాలలో ముస్లీంలు రాజకీయ పార్టీల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి అంగీకారం తెలపడం అంటే చంద్రబాబు, పవన్‌లు కూడా ముస్లీంల రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లే అవుతుంది.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు వచ్చిన ఈ హామీని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందులో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒకటి. కాని ఇప్పుడు చంద్రబాబు దీనిపై ఇరకాటంలో పడ్డారు. ఎవరో కొందరు ముస్లీం నేతలతో దీని గురించి మాట్లాడిస్తున్నా, జనం నమ్మడం లేదు.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఫోటోతో పాటు ఇస్తున్న ప్రచార ప్రకటనలో శనివారం ఇచ్చిన అంశం ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి పౌరుడికి ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు. అది పచ్చి అబద్దం అని తెలిసిన వారు ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రచార ప్రకటన విడుదల చేశారన్న సంగతి అర్దం అవుతుంది. మేనిఫెస్టోలో వారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ తీసుకోవచ్చని ఇచ్చారు. కాని ప్రకటనలో మాత్రం మొత్తం జనాభాకు ఈ హామీ ఇచ్చినట్లుగా ఉంది. ఈ హామీ ప్రకారం బలహీనవర్గాలకు వారికి నాలుగువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే కనీసం ముప్పైవేల కోట్ల పైబడిన మాటేనని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలందరికి పెన్షన్ అని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం మరింతగా పెరుగుతుందన్నమాట. సుమారు ఏభైవేల కోట్ల వరకు వ్యయం అయినా ఆశ్చర్యం లేదు. అంటే అది ఆచరణ సాధ్యం కాని హామీ అని తెలిసిపోతుంది.చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో ఏ హామీకి ఎంత వ్యయం అవుతుందన్నది చెప్పకుండా జనాన్ని మాయ చేసే యత్నం చేశారు. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు జగన్ సుమారు రెండుగంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ ఏ స్కీమును తమ ప్రభుత్వం అమలు చేసింది, దానికి ఎంత వ్యయం అయ్యింది కూడా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు దాటిపోతున్నందున, జగన్ కొత్త వాగ్దానాలు దాదాపు చేయకుండా ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. పాత తరం నాయకుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం కొత్త-కొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ మాదిరి ఆ సూపర్ సిక్స్‌కు ఎంత వ్యయం అయ్యేది చెప్పి ఉంటే ప్రజలకు అర్ధం అయి ఉండేది. చంద్రబాబు, పవన్‌లలో ఉన్న నిజాయితీ ఎంతో తెలిసేది. కాని వారు అలా చేయడం లేదు. వారితో పాటు అభ్యర్ధులు ఆకాశమే హద్దుగా అన్నీ చేసేస్తామని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే తప్ప, ఫలానా స్కీముకు ఇంత వ్యయం అవుతుంది.. ఈ డబ్బు ఇలా సమకూర్చుకుంటామని చెప్పే ధైర్యం లేదు. సంపద సృష్టిస్తామని పడికట్టు పదాన్ని వాడి ప్రజలను బురిడి కొట్టించాలన్నది వారి ఉద్దేశం.గతంలో యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసే సంక్షేమ స్కీలు అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా కష్టంగా ఉందని వివరించారు. చంద్రబాబు కూడా పలుమార్లు తాను చాలా కష్టపడుతున్నానని, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా, తాను రాత్రింబవళ్లు పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నానని అనేవారు. ఈయన నిద్ర లేకుండా ఉంటే డబ్బు ఎలా వస్తుందో ఎవరికి అర్ధం అయ్యేకాదు.. జన్మబూమి కమిటీలతో స్కీములను అమలు చేయడంలో చాలా వరకు కోత పెట్టేవారు. జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక, ఎన్నడూ ఆర్ధిక పరిస్థితిపై వాపోతూ మీడియా ముందు మాట్లాడలేదు. తానేదో రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నానని బిల్డప్ ఇవ్వడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోయి, ప్రజలకు చెప్పిన విధంగా హామీలు నెరవేర్చడంలో సఫలం అయ్యారు. ఈ నేపద్యంలో జగన్‌పై ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఒక నమ్మకం పెరిగింది. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినా, దానిని వెబ్ సైట్ నుంచి తీసివేయడం, అసలు ఎన్ని వాగ్దానాలు చేసింది ఆయనకే గుర్తులేని పిరిస్థితి ఏర్పడడంతో క్రెడిబిలిటి కోల్పోయారు. అందువల్లే చంద్రబాబు, పవన్‌లు పెద్దగా తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. ఎంత సేపు జగన్‌ను దూషించడానికే యత్నిస్తున్నారు.ఒకవేళ ప్రచార ప్రకటనలు ఇచ్చినా అందులో అబద్దాలు రాస్తున్నారు. జగన్ తన ప్రసంగాలలో ఎక్కడా టీడీపీ, జనసేన అభ్యర్దులను విమర్శిస్తూ మాట్లాడడం లేదు. చంద్రబాబు, పవన్‌లు మాత్రం వెళ్లిన ప్రతి చోట జగన్‌తో పాటు, వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై కూడా పలు రకాల దూషణలకు పాల్పడడం, వారు దీనికి కౌంటర్ ఇవ్వడం నిత్యకృత్యం అయింది. రామోజీ, రాధాకృష్ణలకు కూడా టీడీపీ మేనిఫెస్టోపై భ్రమలు తొలగిపోయాయి. అందుకే వారు దీనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికే వార్తలు రాస్తున్నారు. సంపాదకీయాలు రాస్తున్నారు. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పెక్కు కధనాలు ఇస్తున్నారు. పేజీలకొద్ది వార్తలను పరుస్తున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడుతున్నారు. శనివారం నాటి ఈనాడు పత్రికలో ఒక పేజీడు చెత్త అంతా తమ పత్రికలో అచ్చేశారు. అందులో అసలు ఈ యాక్ట్ అమలులోకి వచ్చిందని, దీనికోసం ప్రత్యేకంగా కిందిస్థాయిలో అధికారులను నియమించారని నీచమైన అబద్దాన్ని ఎవరో రైతు చెప్పారంటూ మరీ రాసుకున్నారు.చట్టమే అమలులో లేనప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా చెడరాస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలపై రాసిన వార్తలనే మళ్లీ-మళ్లీ రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పెన్షన్లు ఇళ్ల వద్ద పంపిణీ కాకుండా చూసిన చంద్రబాబు, పవన్, రామోజీ, రాధాకృష్ణ ప్రభృతులు నాలుక కరుచుకుని యుటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ జగన్ వల్లే పెన్షన్ దారులకు ఇబ్బందులు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టకుండా, ఈ పరిస్థితికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఒక్క మాట అనకుండా ప్రజలను తప్పుదారి పట్టించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ, జనసేన, బీజేపీలు ఏపీలో కూటమి పెట్టుకున్నా, వాటికి ఒక ప్రామాణికత లేదని, ఒక విశ్వసనీయత లేదని, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఉన్నారని వారి ప్రకటనల ద్వారా అర్థం అవుతుంది. మోదీ గ్యారంటీకి చంద్రబాబు, పవన్‌లు కట్టుబడి ఉంటారట. అదే చంద్రబాబు, పవన్‌లు ఇచ్చిన గ్యారంటీలకు మోదీ హామీగా ఉండబోరట. బహుశా ప్రత్యేక హోదా, విభజన హామీలు తదితర అంశాలపై గతంలో మాట్లాడి ఏపీలో పరువు పోగొట్టుకున్నానని తెలిసి మోదీ తెలివిగా వ్యహరిస్తున్నారని అనుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో బకరా అయింది చంద్రబాబు, పవన్‌లే అయితే, జనాన్ని బకరా చేయాలని వీరిద్దరితో పాటు రామోజీ, రాధాకృష్ణలు నానా తంటాలు పడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు. -
కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలో
సాంబశివుడు.. గోవిందరెడ్డి.. సుబ్బారావు.. ఎవరు వీళ్లంతా?రామోజీరావు రహస్య సంతానమా? లేకపోతే చంద్రబాబు దత్తపుత్రులా? లేని పేర్లను సృష్టించి.. లేని రిజిస్టరులో వీళ్ల పేర్లు వివాదంలో చిక్కుకున్నట్లుగా రాసి పారేసి... లేని చట్టాన్ని అమల్లో ఉన్నట్టుగా చూపిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతుల్ని చేసిన ‘ఈనాడు’ను ఏమనుకోవాలి? రాష్ట్రాన్ని రాచపుండులా పీడిస్తున్న రామోజీరావు తన చంద్రబాబు కోసం ఇంకెంత దిగజారుతారు? అసలు అమల్లోకే రాని ‘ల్యాండ్ టైట్లింగ్ చట్టం’ గురించి ఎందుకు జనాన్నింతలా భయపెడుతున్నారు? జనం గనక మాకు వద్దంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ చట్టాన్నయినా తెస్తుందా? అలా తెచ్చిన దాఖలా ఒక్కటయినా ఉందా?సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖరారు చేసిన చట్టం ఈ ‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్’. దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ‘నీతీ ఆయోగ్’ అన్ని రాష్ట్రాలకూ పంపితే.. ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో రాష్ట్రం కూడా ఆ దిశగా అడుగులు వేసి ముసాయిదా చట్టాన్ని చేసింది. కానీ ఈ చట్టానికి సంబంధించిన రూల్స్ ఏవీ ఇప్పటిదాకా విడుదల కాలేదు. అంటే ఈ చట్టం కింద టైటిల్ రిజిస్టరు ఎలా ఉంటుంది? టైటిల్ రిజిష్ట్రారుగా ఎవరిని నియమించాలి? రెవెన్యూ అధికారులనా... లేకపోతే న్యాయ వ్యవస్థ నుంచి జ్యుడీíÙయల్ అధికారులనా? ఇలా ఈ చట్టం అమలుకు సంబంధించి ఉండే సమగ్ర నియమ నిబంధనలేవీ ఇంకా రూపు దిద్దుకోనేలేదు. ఈ రూల్స్ విడుదలయ్యాక వీటిపై గ్రామ స్థాయి నుంచి సభలు నిర్వహించి.. ప్రజల అభ్యంతరాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నియమాలు (రూల్స్) రూపొందిస్తారు. ఆ రూల్స్‌కు లోబడే చట్టాన్ని అమలు చేస్తారు.ఇవేవీ జరగకుండానే... చట్టం అమలయిపోతున్నట్లుగా, ప్రభుత్వం భూములు లాక్కుంటోందంటూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేయటం ఎంత దుర్మార్గం రామోజీరావ్? అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సందర్భంలోనూ ఒక మాటంటూ ఉంటారు. తాను పోరాడుతున్నది మాయా యుద్ధం చేసే మారీచులతోనని. ఈ ఎల్లో ముఠా అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతుందని, ఎంతటి విపత్తులనైనా సృష్టిస్తుందని. నారా వారిని ఎలాగైనా గద్దెనెక్కించాలని మాయా యుద్ధం చేస్తున్న ‘ఈనాడు’ బుద్ధి... అందుకే ఇపుడు భూ మార్గం పట్టింది. చట్టం రావాలంటే సర్వే పూర్తి కావాలి..మూడేళ్ల కిందట కేంద్రం ఈ చట్టాన్ని ఆమోదించి అన్ని రాష్ట్రాలకూ పంపిన తర్వాత.. నీతీ ఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా చట్టానికి రూపకల్పన చేయటంతో పాటు.. రాష్ట్రంలోని గ్రామాల్లో రీ సర్వే చేపట్టింది. నిజానికి వందేళ్ల కిందట ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సర్వే తప్ప.. నాటి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వమూ భూముల సమగ్ర సర్వే చేపట్టలేదు.కొత్తగా సర్వేయర్లను నియమించి.. రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తాన్ని మోహరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రీ సర్వే యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సర్వే జనరల్ సైతం రాష్ట్రానికి వచ్చి రీ సర్వే చేస్తున్న తీరును ప్రశంసించారు. ఈ రీ సర్వే చేస్తూ... కింది స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న చిన్న వివాదాల కోసం మొబైల్ న్యాయ స్థానాలను కూడా ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా సాగుతున్న ఈ ప్రయత్నం వల్ల ఇప్పటికి 4 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. మరో 2 వేల గ్రామాల్లో తుది దశలో ఉంది. కాకపోతే రాష్ట్రంలో మొత్తం 17 వేల గ్రామాలున్నాయి. ఇంకా 11 వేల గ్రామాల్లో రీసర్వే మొదలు కావాల్సి ఉంది.మొత్తం అన్ని గ్రామాల్లోనూ రీసర్వే పూర్తయ్యాక వివాదాలు లేని భూములకు సంబంధించి వాటి యజమానులకు హక్కు పత్రాలు అందజేస్తారు. ఆ హక్కు దారుల వివరాలే చివర్లో టైటిల్ రిజిస్టరులో ఉంటాయి. ప్రజలంతా అంగీకరించి.. ప్రభుత్వం గనక ముందుకు వెళితే ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తవటానికి కొన్నేళ్లు పడుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి కనక... మిగతా రాష్ట్రాలు కూడా రీ సర్వేలు పూర్తి చేసి, ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తే.. అప్పుడు దేశ వ్యాప్తంగా ఒకే టైటిల్ రిజిస్టరు నిర్వహించడానికి వీలవుతుంది.కేంద్రం ఆశిస్తున్నది అదే. దీనివల్ల దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడి భూమినయినా కొనుగోలు చేయొచ్చు. ఢిల్లీలో భూమి కొనుగోలు చేసినా విజయవాడ రిజిస్టరు కార్యాలయంలోనే దాన్ని రిజిస్టరు చేసుకోవచ్చు. పైపెచ్చు ఒక భూమిని ఎక్కడ ఎవరు కొనుగోలు చేసినా... విక్రయించినా, లేక ఆ భూమిపై ఎక్కడ రుణం తీసుకున్నా ఆ వివరాలన్నీ టైటిల్ రిజిస్టరులో నమోదవుతాయి.కాబట్టి రుణం వంటి వివరాలు దాచి మరొకరి దగ్గర రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. ఇదిగో ఇలాంటిది వ్యవస్థ ఇంకా అమల్లోకి రాలేదు కనకనే సుజనా చౌదరి లాంటి వ్యక్తులు పారిశ్రామిక వేత్తల ముసుగులో ఒకే పరిశ్రమకు సంబంధించిన భూముల్ని పలు ఆర్థిక సంస్థల దగ్గర తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. చివరకు బ్యాంకుల్ని ముంచేశారు. ఇప్పుడేమో తాను ఆ వ్యాపారాల నుంచి తప్పుకున్నానని, తనకేమీ సంబంధం లేదని శుద్ధపూస కబుర్లు చెబుతున్నారు.టైటిల్‌కు ప్రభుత్వమే గ్యారంటీ సమగ్రంగా రీ సర్వే జరిపి... వివాదాలేవీ లేవని తేలి్చన మీదట ఆ భూములకు టైటిల్ పత్రాలిస్తారు కనక.. అక్కడి నుంచి ఆ టైటిల్‌కు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ ప్రభుత్వం టైటిల్ ఇచ్చాక కూడా ఆ భూమి అసైన్డ్ అనో, డీ పట్టా అనో వివాదం గనక తలెత్తితే ఆ టైటిల్ దారుకు ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వమే ఆయా భూములకు బీమా చేస్తుంది. బీమా సొమ్మును టైటిల్ దారుకు చెల్లిస్తుంది. ఈ నిబంధన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టే ఈ చట్టం విషయంలో ముందుకు అడుగులు వేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ చెబుతోంది. మోదీతో చెప్పించగలవా బాబూ?ఈ చట్టం వల్ల ప్రజలకు హాని జరుగుతుందని, ఈ చట్టం ద్వారా ప్రభుత్వం భూములు లాక్కుంటుందని చంద్రబాబు ముఠా, ఎల్లో మీడియా ఉధృతంగా విష ప్రచారం చేస్తున్నాయి. పత్రికల్లో కథనాలు రాయించటంతో పాటు పనికిమాలిన వ్యక్తులకు లాయర్ల కోటు తొడిగి నిపుణుల ముసుగులో ఎల్లో చానెళ్లలో మాట్లాడిస్తోంది. సోషల్ మీడియాలో అబద్ధాలను జోరుగా వైరల్ చేస్తోంది.వీటిలో ఏ ఒక్క శాతం నిజం ఉన్నా.. ఈ చట్టం కేంద్రానిది కనుక ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పగలవా చంద్రబాబూ? ఈ చట్టం వల్ల ప్రజలకు హాని జరుగుతుందని, కాబట్టి దీన్ని తాము వెనక్కి తీసుకుంటున్నామని మోదీతో చెప్పించగలవా? మరి అవేవీ చెయ్యలేనపుడు ఎందుకీ విష ప్రచారం? ఎందుకు బీజేపీతో కలిసి పోటీ చేయటం? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కూటమి గట్టడమెందుకు? వారు చేస్తున్న చట్టం ప్రజలకు మేలు చేసేది కాదని, దాన్ని తెలుగుదేశం అంగీకరించదని నేరుగా చెప్పలేని నీ బతుకెందుకు? అబద్ధాల పునాదులపై నిరి్మంచుకున్న నీ రాజకీయ కోట పునాదులతో సహా పేలిపోయే రోజు అతి దగ్గరలోనే కనిపించటం లేదా! -
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
-
పచ్చ చిలుకలుగా ఆ మేధావులు.. కళ్లకు గంతలు కట్టిన చంద్రబాబు
ఈ మధ్య కాలంలో తెలుగుదేశం బాకా మీడియా ఈనాడు కొత్త పుంతలు తొక్కి ఏపీ జనాన్ని మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మేధావుల పేరుతో కొందరిని తీసుకు వచ్చి, ఇంటర్వ్యూలు అంటూ ఒక తంతు నడిపి, వారితో తమకు కావల్సినవి చెప్పించుకుని ప్రజలను మోసం చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో మేధావులుగా ముద్ర వేసుకున్న కొంతమంది భ్రష్టు పట్టిపోతున్నారు. ఈనాడు రామోజీ పైత్యాన్ని ఈ మేధావుల నోట్లో పెట్టి పచ్చి అబద్ధాలను చెప్పిస్తున్నారు. ఆ మేధావులైనా నిస్సిగ్గుగా ఒక పార్టీ కోసం పనిచేయడం ఏమిటో అర్దం కాదు.ఏ అంశానికైన రెండు కోణాలు ఉంటాయి. వాటిలో ఒకదానివైపే చూసి, రెండో కోణాన్ని వదలివేసి మాట్లాడితే ఆ వ్యక్తి ఎలా మేధావి అవుతారో అర్దం కాదు. ఈనాడు మీడియా నిర్లజ్జగా బట్టలు ఊడదీసుకుని తిరుగుతోంది కాబట్టి, మేధావుల ముసుగులో మరికొందరిని కూడా అలాగే చేస్తోంది. ఇప్పటికే మాజీ ఐఎఎస్‌లు నిమ్మగడ్డ రమేష్ కుమార్, జయప్రకాష్ నారాయణ, పీవీ రమేష్ వంటివారిని తమ ప్రయోజనాలకు వాడుకున్న ఈనాడు మీడియా కొద్ది రోజుల క్రితం ఆర్దిక వేత్త పేరుతో మహేంద్రదేవ్‌ను తెరపైకి తెచ్చి ఆయనతో కొన్ని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయించి బానర్గా తన పత్రికలో అచ్చేసింది. అది చదివితే వీరు నిజంగా మేధావులా, లేక తెలుగుదేశం కోసం రామోజీ చెప్పినట్లు, కోరినట్లు మాట్లాడే మేతావులా అన్నది తెలుసుకోవడం కష్టం కాదు.లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కొంతకాలం క్రితం వరకు ఏపీలో విద్య, వైద్య రంగాలలో సంస్కరణలు, అమలు అవుతున్న స్కీములు చాలా బాగున్నాయని మెచ్చుకునేవారు. కానీ ఎన్నికల సమయానికి ఆయనపై రామోజీ ఒత్తిడి బాగానే పనిచేసినట్లుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి జేపీ కూడా యుటర్న్ తీసుకుని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించి ఎన్డీఏ కి అనుకూలంగా మాట్లాడారు. అంటే చంద్రబాబు కోసం పనిచేయడం ఆరంభించారన్నమాట. జేపీ ఇంతగా దిగజారి పోయి చివరికి కుల ముద్ర వేయించుకునే దుస్థితికి వస్తారని నేనైతే ఊహించలేదు.ఈనాడు మీడియా కోసం ప్రచారం చేస్తున్న ఈ మేధావులలో ఎక్కువ మంది ఒకే కులం వారు ఉండడాన్ని అంతా గమనిస్తున్నారు. దీనివల్ల చంద్రబాబుకే నష్టం తప్ప ఇంకొకటి కాదు. తాము చేస్తున్నది ఏమిటో వారికి తెలియడం లేదు. తాజాగా మహేంద్రదేవ్ అనే మరో మేధావిని ఈనాడు ముగ్గులోకి దింపి ఆయనను కూడ గబ్బు లేపింది. ఆయన తండ్రి సంజీవదేవ్ చాలా గౌరవమైన వ్యక్తి. ఈయన కూడా పద్ధతిగానే ఉంటారు. కానీ రామోజీ ట్రాప్‌లో పడి తన ప్రతిష్టను తానే దెబ్బతీసుకున్నారనిపిస్తుంది.ఇంతకాలం టీడీపీ కోసం పనిచేసిన సోకాల్డ్ మాజీ ఐఏఎస్‌లు చెప్పేదానిని జనం నమ్మడం లేదని మహేంద్రదేవ్ ను ప్రవేశపెట్టినట్లు అనిపిస్తుంది. ఆయనను ఇంటర్వ్యూ చేయడం తప్పని ఎవరూ చెప్పరు. కానీ ప్రశ్నలు అడిగిన తీరు, ఆయననుంచి జవాబులు రప్పించుకున్న వైనం చూస్తే, కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ద్వేషాన్ని వెళ్లగక్కడానికి, ఏపీ ప్రజలను మోసం చేయడానికే ఈ ఇంటర్వ్యూని వాడుకున్నారని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.ఏపీలో నిరుద్యోగం తాండవిస్తోందట. ఇది ఒక ప్రశ్న. దానిపై ఆయన అవునంటూ దిక్కుమాలిన సమాధానం. దేశవ్యాప్తంగా ఈ సమస్య లేదా! ఆ మాటకు వస్తే అమెరికా వంటి అగ్రదేశంలో కూడా నిరుద్యోగం ఉంది. అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరానికి వచ్చి చూస్తే అడ్డాలపై పనులు లేని కూలీలు, వందలు, వేల సంఖ్యలో కనిపిస్తారు. ఉద్యోగం కోసం తిరిగే వేలాది మంది యువకులు కనిపిస్తారు. వారిని మోసం చేసి డబ్బులు వసూలు చేసుకునే కంపెనీలకు తక్కువేమీ లేదు. కానీ రామోజీ దిక్కుమాలిన ఆలోచన ఏమిటంటే ఏపీలో మాత్రమే నిరుద్యోగ సమస్య ఉన్నట్లు జనాన్ని నమ్మించాలనే.పోనీ ఆ మాటకు వస్తే 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడలేదు! ఆయన పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా! అప్పుడు ఎందుకు తేలేకపోయారో చెప్పాలి కదా! పరిశ్రమలకు ఆయువుపట్టుగా భావించే ప్రత్యేక హోదాను వద్దన్న చంద్రబాబు నిర్వాకం మాట ఏమిటి? ఇది ఒక అంశం అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనా సమస్య ఉన్నప్పటికీ, మూడేళ్లలో ఆయన టైమ్‌లో వచ్చిన పరిశ్రమలు, ఓడరేవులు, మెడికల్ కాలేజీలు మొదలైనవాటి గురించి ఈ మేధావులు పట్టించుకోరు.చంద్రబాబు టైమ్ లో వచ్చిన కియా కార్ల ప్లాంట్ వచ్చింది. అది తమ ఘనత అని బీజేపీ నాయకులు చెబుతారు. అది వేరే విషయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్‌లో అనేక పరిశ్రమలు వచ్చాయి. వాటిని పట్టించుకోరు. పైగా పరిశ్రమలు తరలిపోతున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరంభించిన ఒక్కో పోర్టు వల్ల రెండువేల మందికి ఉపాధికి కల్పిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలు మొదలైనవాటిని ప్రోత్సహించడం, స్వయం ఉపాధి కింద లక్షల యూనిట్లు వచ్చిన వైనాన్ని జనం మర్చిపోవాలన్నది ఈనాడు మీడియా కోరిక. దానికి ఈ మేధావులు బాజా వాయించడం దురదృష్టకరం.ఏపీకి పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎలా అడ్డుకోవాలా అని అడ్డగోలు కథనాల గురించి ఈ మేధావులకు తెలియదు. ప్రభుత్వపరంగా చంద్రబాబు పాలనలో 34వేల ఉద్యోగాలు ఇస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా రెండున్నర లక్షల మందికి ఐదువేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. వీటన్నిటిని ఉపాధి కింద పరిగణనలోకి తీసుకోకుండా కుహానా మేధావులు చెబుతున్నారు. సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎలా అని మహేంద్రదేవ్ బాధ పడ్డారు. బాగానే ఉంది.2014లో చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తానంటే లక్ష కోట్ల రూపాయల రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని వాగ్ధానం చేస్తే, ఇదే ఈనాడు మీడియా ఎందుకు బాండ్ కొట్టింది. అప్పుడు ఏ సంపద సృష్టించి రుణాలను మాఫీ చేస్తానని అన్నారు. పోనీ ఫలానా రకంగా సంపద సృష్టించానని చెప్పగలరా! కేవలం అమరావతి రాజధాని పేరుతో 29 గ్రామాలలో తన వాళ్లతో భూములు కొనిపించి రేట్లు పెంచడమే సంపద సృష్టించడం అవుతుందా? ఆఆ గ్రామాలలో వేల ఎకరాల భూములలో పంటలను ఎండబెట్టి విధ్వంసానికి పాల్పడితే అది గొప్ప విషయం అని రాస్తారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి చేశారు. రాష్ట్రం అంతటా పేదలకు సంపద పెరగాలని ఆయన తలపెట్టారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తద్వారా ఒక్కొక్కరికి ఐదు నుంచి పది లక్షల రూపాయల ఆస్తి లేదా సంపద సమకూరింది. దీనిని సంపదగా ఈ మేధావులు పరిగణిచరా? రాష్ట్ర రుణాలు పద్నాలుగు లక్షల కోట్లు దాటిపోయాయని ఈయనకు ఎవరు చెప్పారు. ఈనాడు వాళ్లు చెప్పిన అబద్ధాలను ప్రచారం చేయడం కోసం ఈయన పరువు తీసుకోవాలా? అసలు ఎప్ఆర్బీఎం పరిధిలో లేకుండా రాష్ట్రాలు ఆ స్థాయిలో రుణాలు చేయగలుగుతాయా? జీఎస్ డీపీ వృద్ధిలో ఏపీ అగ్ర భాగాన ఉందన్న సంగతి ఈ మేధావులకు తెలియదా? తెలియకపోతే తప్పు ఏపీ ప్రజలదా!కరోనా సంక్షోభంలో ఏపీ ప్రభుత్వం ఎంత చక్కగా విధులు నిర్వర్తించింది వీరికి తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీరు రామోజీ, చంద్రబాబు వంటి పెత్తందారుల తరపున పని చేస్తున్నారు కనుక. ప్రత్యక్ష నగదు బదిలీ తాత్కాలికమేనని అంటున్నారు. బాగానే ఉంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్కీముల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నారనే కదా! అది తప్పని మీరు నమ్మితే ఏమి చెప్పాలి. ఎవరు అలాంటి స్కీములు అమలు చేసినా మంచిది కాదని అనాలి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే ఒప్పు అన్న చందంగా మాట్లాడి మీ మేధావి మస్తిష్కానికి దరిద్రపు రాజకీయం అంటిందన్న అభిప్రాయం కలిగించడం లేదా?వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్కీముల ద్వారా ఏటా సుమారు ఏభైవేల కోట్ల రూపాయల నగదు పంపిణీ చేశారు. దాంతో ఏపీ శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఇదే బాబు, పవన్‌లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నదానికంటే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా నగదు పంచుతామని చెబుతున్నారు. అంటే ఏటా లక్షన్నర కోట్లు పంచుతామని అంటున్నారన్నమాట. దీనిని మేధావి మహేంద్రదేవ్ తప్పు పడతారా? లేక సమర్థిస్తారా? చంద్రబాబు ఏమి చేసినా ఈయనకు కూడా బాగానే ఉంటుందని అనుకోవాలా! ఇంత చిన్న లాజిక్ ను మహేంద్రదేవ్ వంటివారు కూడా విస్మరిస్తే సమాజానికి ఎలాంటి సంకేతం ఇస్తుంది?పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కేంద్రం తగు రీతిలో నిధులు ఇవ్వకపోవడం కారణమని వీరికి తెలియదా! విద్యా రంగంలో వచ్చిన మార్పుల గురించి ముందుగా మహేంద్రదేవ్ వంటివారు స్వయంగా ఏపీకి వెళ్లి పరిశీలించి చూసిన తర్వాత ఏవైనా విమర్శలు లేదా సలహాలు ఇవ్వవచ్చు. అలాకాకుండా రామోజీ కళ్లలో ఆనందం చూడడానికి వీరు ఏమి చెబితే అది చెప్పడానికి అయితే మహేంద్రదేవ్ వంటివారి మేధావితనం ఎవరికి పనికి వచ్చినట్లు. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలియకుండా ఇలాంటి మేధావులు మాట్లాడడం ఎంత దారుణం.ఏడాదికి రెండు లక్షల మంది ఇంజనీరింగ్ చదవుతున్నారట. వారిలో కొందరికి కూడా రాష్ట్రంలో ఉద్యోగాలు రావడం లేదట. మరి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏమి చేసినట్లు? ఆ ప్రశ్న అసలు ఈ మేధావులకు రాదా? ఈనాడు వాళ్లు చెత్త ప్రశ్నలు వేస్తే, మహాద్భాగ్యమన్నట్లు వీరు వారికి కావల్సిన సమాధానాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పరిశ్రమలు వేటిని వీరు గుర్తించరా! వాటన్నిటి జాబితా చాంతాడు అవుతుంది.ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు చేయాలన్నది రామోజీ విధానం అయితే ఆయన ఉద్యోగం కోసం అప్పట్లోనే ఢిల్లీ ఎందుకు వెళ్లారు? హైదరాబాద్‌లో ఎందుకు కంపెనీలు పెట్టారు? చంద్రబాబు నాయుడు ఏపీలో కాకుండా హైదరాబాద్, తెలంగాణలో తన యూనిట్లు ఎందుకు నెలకొల్పారు. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పని దిక్కుమాలిన ధీరిలు చెబుతున్నారు. అదే అమెరికా వెళితే అంతా తన ఘనత అని డబ్బా వాయించుకుంటారు. ఉపాధి లేకపోతే డ్రగ్స్ వంటి వ్యసనాలు వస్తాయట.అదే కరెక్టు అయితే హైదరాబాద్, బెంగుళూరు, గుజరాత్ తదితర ప్రాంతాలలో డ్రగ్స్ ఎందుకు విస్తారంగా ఉన్నాయి? హైదరాబాద్ లోనే అత్యధికంగా గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతున్న సంగతి వీరికి తెలియదా! బ్రెజిల్ నుంచి విశాఖకు డ్రగ్స్ తెప్పించింది ఎవరన్నది ఇంతవరకు ఎందుకు తేల్చలేదు? మేధావులు కేవలం ఎవరి రాజకీయ స్వార్థం కోసమో ఇంటర్వ్యూలు ఇచ్చి వారి పరువు పోగొట్టుకోకూడదు.నిజానికి మహేంద్ర దేవ్ వంటివారికి వాస్తవాలు తెలియనివి కావు. ఏకపక్షంగా మాట్లాడడం పద్ధతి కాదని కూడా తెలుసు. కానీ మరి వారిపై ఎలాంటి ఒత్తిడి ఉందో ఏమో కానీ, రామోజీ కోరుకున్న అబద్ధాలు చెప్పి అనవసరంగా భ్రష్టు పడుతున్నారు. మేధావులు వాస్తవ పరిస్థితి తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పాలి. ఎన్నికల సమయంలోనే వీరు మాటలను టీడీపీ మీడియా ప్రచారం చేయడంలోనే కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. ఆ విషయాన్ని టీడీపీ తరపున మాట్లాడే మేధావులు తెలుసుకుంటే మంచిది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Fact check: రామోజీ శాసిస్తే... టీటీడీ శిరసావహించాలట!
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం తాను చెప్పినట్లు నడుచుకోవాలని ఈనాడు రామోజీ తన బూటకపు కథనాలతో శాసిస్తున్నారు. తిరుమల కొండపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఆ దేవస్థానానికి పెరిగిన ఆదాయం, భక్తులకు సమకూరిన సౌకర్యాలు, సామాన్య భక్తులకు శీఘ్రంగా సర్వదర్శనం చేయించడంలోనూ వచ్చిన విశేష మార్పులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా లభిస్తున్న ఆదాయంతో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి... వంటివాటిని పక్కనబెట్టి లేనిపోని వక్రభాష్యాలతో మంగళవారం ‘వడ్డీకాసుల వాడికి వంచన సేవ’ ...శీర్షికన ఈనాడులో ఓ దౌర్భాగ్య కథనాన్ని అచ్చేశారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ కొనసాగింపు గురించి, సేవా టికెట్లలో అక్రమాలు జరిగిపోతున్నాయని, టీటీడీ సభ్యుల్లో నేరచరితులున్నారని, శ్రీ వాణి ట్రస్టులో పారదర్శకత లేదని... ఇలా మతిలేని గ్రాఫిక్స్ జోడించి మరీ పైత్యాన్ని రంగరించి కథనాన్ని రాశారు. ఈ అబద్ధాల కథనం వెనుక రామోజీ దురాలోచనను బట్టబయలు చేయడానికే ఈ ఫ్యాక్ట్‌చెక్.రామోజీ తాపత్రయమంతా టీడీపీ కోసమే... తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హిందువుల ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చేయాలని రామోజీరావు తెగతాపత్రయపడిపోతున్నారు. గత ఆరు నెలలుగా టీటీడీ మీద రాజకీయ దాడి ప్రారంభించిన ఈ అక్షర అష్టావక్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాత్ర పోషించడం ప్రారంభించారు. ఈనాడులో పనికిమాలిన, అవాస్తవ కథనాలను రాయడం... టీడీపీ నాయకులు దాన్నే మళ్లీ ప్రెస్మీట్లో చర్విత చరణంగా చెప్పడం, రెండు మూడు రోజుల పాటు ఈ డ్రామా నడపడం ఈ పత్రికకు నిత్యకృత్యమైంది. ఎన్నికలు దగ్గర పడటంతో గత రెండు నెలలుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై రాజకీయ ఆరోపణలు చేస్తూ, లేనిది ఉన్నట్లు అభూత కల్పనల కథనాలను రాసిందే రాస్తున్నారు. బాబు హయాంలో ఇద్దరిని సుదీర్ఘంగా కొనసాగిస్తే రామోజీకి కనిపించలేదా?...చంద్రబాబు నాయుడి హయాంలో తిరుమల జేఈవోగా పి.బాలసుబ్రమణ్యం తొమ్మిదేళ్లు పని చేశారు. ఆయన తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అప్పటి తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మొదలు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పదే పదే మొర పెట్టుకున్నా చంద్రబాబు ఆయన్ను ఎందుకు బదిలీ చేయలేదో ఈనాడు బదులివ్వగలదా? పైగా బాలసుబ్రమణ్యం తిరుమల జేఈవోగానే రిటైరయ్యేలా చంద్రబాబు ఎందుకు అవకాశం కల్పించారో రామోజీ చెప్పగలరా? టీటీడీపై అంత ప్రేమ ఉంటే ఈ విషయాన్ని ఆ రోజు ఈనాడు ఎందుకు రాయలేదు? అంతేకాదు... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తిరుమల జేఈవోగా నియమితులైన మరో అధికారి శ్రీనివాసరాజు. ఆయన లాబీయింగ్, అధికార పారీ్టకి వీరవిధేయత వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ కొనసాగించారు. దాదాపు పదేళ్ల పాటు తిరుమల జేఈవోగా శ్రీనివాసరాజు పనిచేశారు. అప్పుడూ చంద్రబాబును ఈనాడు ప్రశి్నంచలేదు. శ్రీనివాసరాజు అధికార పారీ్టకి అనుకూలంగా దేశ, విదేశాల్లో సైతం లాబీయింగ్ చేస్తున్నారని రామోజీరావు ఎందుకు నిలదీయలేదో చెప్పగలరా?ధర్మారెడ్డి కొనసాగింపు కేవలం భక్తుల సౌకర్యార్థమే ప్రస్తుత టీటీడీ ఈవో ధర్మారెడ్డి బాలసుబ్రమణ్యం, శ్రీనివాసరాజుల్లాగా వరుసగా తొమ్మిదేళ్లు పని చేయలేదు. వేసవిలో వరుస సెలవుల కారణంగా తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి సమర్థుడైన అధికారి అవసరం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డికి మరో 8 వారాల పొడిగింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదేదో మహా అపచారమన్నట్లు ఈనాడు రాసింది. కథనం రాశాం కాబట్టి ధర్మారెడ్డికి పొడిగింపు రాదని భ్రమపడింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని, తిరుమలలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మారెడ్డి మరో 8 వారాలు టీటీడీలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని జీర్ణించుకోలేని రామోజీరావు ‘వారికి నో.. వీరికి ఎస్’ అంటూ తన కడుపుమంట కథనాన్ని ప్రచురించారు. ధర్మారెడ్డికి డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు రావడంతో ఆక్రోశం, ఆందోళన, కోపం, బాధ కలగలిపి పనికిమాలిన కథనాన్ని అచ్చేశారు.బోర్డు సభ్యుల నియామకాలపైనా వక్రపూరిత రాతలుతన రాజకీయ, ఆర్థిక, కార్పొరేట్ ప్రయోజనాల కోసం టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను పెంచిందే చంద్రబాబు. ఈ నిజాన్ని ఈనాడు పొరపాటున రాయదు. తన అడుగులకు మడుగులొత్తే చంద్రబాబు నాయుడు ఈ పనిచేస్తే రామోజీరావు దృష్టిలో తప్పుకాదు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులో మొదట నియమించింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఆయనను చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్‌గా నియమిస్తే దాన్ని ఘోరంగా అభివర్ణిస్తూ ఆ కథనంలో ఈనాడు పేర్కొందిశ్రీవాణి ట్రస్టు ఆదాయమంతా ఆలయాల అభివృద్ధికే... శ్రీవాణి ట్రస్టు ఆదాయ, వ్యయాల గురించి సుమారు ఏడాది కిందటే టీటీడీ శ్వేత పత్రం ప్రకటించింది. ఈనాడు ఈ విషయాన్నీ గతంలో ప్రచురించింది. ఈ ట్రస్టుపై ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా తమను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో మతాంతీకరణలను నిరోధించడానికి టీటీడీ సుమారు 3 వేల ఆలయాలను నిర్మించింది. అనేక పురాతన ఆలయాల జీర్ణిద్ధరణకు నిధులు ఇచ్చింది. కేవలం వైఎస్సార్సీపీ నేతలున్న గ్రామాల్లోనే ఈ ఆలయాలు నిర్మించారని ఈనాడు ఆ కథనంలో అసత్యాలను రాసేసింది. ఈ ఆలయాల్లో దీప, ధూప నైవేద్యాల కోసం టీటీడీ ప్రతినెలా రూ. 5 వేలను అందిస్తున్న వాస్తవాన్ని ఈనాడు దాచి పెట్టింది. సేవా టికెట్లపైనా అవాస్తవాలు వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉండగా, సిఫారసు లేఖల మీద జారీచేసే సేవా టికెట్ల ధరలు పెంచి తద్వారా వీటి డిమాండ్ తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో సేవా టికెట్లు జారీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఈనాడు దీన్నీ వక్రీకరించి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలు, వేల సంఖ్యలో టికెట్లు హోల్‌సేల్‌గా విక్రయించడంతో అనేక కేసులు నమోదయ్యాయి. వసతి సముదాయాల నిర్మాణాలపై అభూతకల్పనలుతిరుపతిలో ఉన్న శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి భావించింది. ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో ఆ భవనాల పటుత్వంపై అధ్యయనం చేయించింది. యాత్రికుల వసతికి ఎక్కువ కాలం ఈ భవనాలు పనికి రావని నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగానే అచ్యుతం, శ్రీ పథం పేర్లతో కొత్త వసతి సముదాయాలను నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ వసతి సముదాయంలో 1,800 మందికి మాత్రమే ఉన్న వసతి 8,200 మందికి పెంచి అధునాతన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.600 కోట్లుగా ఉన్న ఈ నిర్మాణాల అంచనాలను రూ.460 కోట్లకు కుదించి గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. టెండర్ల ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జ్యుడీషియల్ కమిషన్ అనుమతీ తీసుకుంది. ఈనాడు తన కథనంలో ఈ వాస్తవాలను దాచి 10% కమీషన్లు తీసుకున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీద ఆరోపణలు చేసింది. మూడేళ్లలో పూర్తయ్యే పనికి ముందే కమీషన్లు తీసుకునే విద్య రామోజీరావుకు మాత్రమే తెలిసినట్లు ఉంది. -
పెత్తందార్లకు గుత్తేదార్లు..
పేదరికం నిర్మూలనే లక్ష్యంగా సంక్షేమ పథకాల ద్వారా సీఎం వైఎస్ జగన్ డీబీటీ రూపంలో 50 నెలల్లో పేదల ఖాతాల్లో రూ.2,31,123.28 కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.2,33,915.92 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు రూ.4,65,039.20 కోట్ల లబ్ధి కలిగించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఈ రీతిన ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న పేదలను చూసి ఓర్చుకోలేక.. సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దబాయించిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయన తానా అంటే తందానా అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారంటూ తప్పుడు రాతలతో పుంఖానుపుంఖాలుగా కథనాలు అచ్చేసిన మీరు పెత్తందార్ల పక్షం కాదా రామోజీ?రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ.. 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75,670.05 కోట్ల విలువైన ఇంటి స్థలాలను సీఎం వైఎస్ జగన్ పంపిణీ చేశారు. సెంటు భూమి శవాన్ని పూడ్చటానికి మాత్రమే సరిపోతుందంటూ పేదల సొంతింటి స్వప్నంపై అవహేళన చేస్తూ మాట్లాడటం ద్వారా తాను పెత్తందారుడినని చంద్రబాబు చాటుకున్నారు. కోర్టుల్లో కేసులు వేయించి పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి మోకాలడ్డిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయనకు వంతపాడుతున్న మీది పెత్తందారీ పోకడ కాదా రామోజీ?నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేసిన సీఎం వైఎస్ జగన్.. పేద పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెడితే.. దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం కాదా? ఇందుకు మద్దతిస్తూ అక్షరోద్యమం నడిపిన మీరూ ఆ బాపతే కదా రామోజీ? అమరావతి రాజధాని ప్రాంతంలో 50 వేల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. దాన్ని నిరసిస్తూ హైకోర్టులో కేసులు వేయించి.. వారికి ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని వాదించేలా చక్రం తిప్పిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయన్ను సమరి్థస్తూ వరుస కథనాలు వండివార్చిన మిమ్మల్ని పెత్తందారు అనక ఇంకేమనాలి రామోజీ? సీఎం వైఎస్ జగన్.. ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయ పడుతూ, వారి అభ్యున్నతి కోసం నాలుగేళ్లుగా పరితపిస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆరి్థకంగా వారికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. అన్ని పదవుల్లోనూ సింహ భాగం కేటాయిస్తున్నారు. ఇది పెత్తందారీతనమా? లేక ‘ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?’ అని చంద్రబాబు వారిని అవమానించడంపెత్తందారీతనమా? తేల్చి చెప్పే ధైర్యముందా రామోజీ? ‘ఈ రోజు రాష్ట్రంలో జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్.. పేదలు ఒక వైపు, పెత్తందారీ మనస్తత్వం ఉన్న వాళ్లు మరో వైపు. వచ్చే ఎన్నికల్లో పొరపాటు జరిగితే పేదలు రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదు’ అంటూ రాష్ట్రంలో చంద్రబాబు, ఎల్లో మీడియా పోకడలపై సీఎం వైఎస్ జగన్ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం.. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్సీపీకి ప్రజలు చారిత్రక విజయాలను కట్టబెట్టడం.. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జాతీయ సంస్థల సర్వేలు నొక్కివక్కాణిస్తుండటం.. వీటన్నింటితో ఇక చంద్రబాబుకు రాజకీయంగా నూకలు చెల్లడం ఖాయమని మీరు తీవ్రంగా ఆందోళన చెందుతుండటం నిజం కాదా రామోజీ? విషం చిమ్ముతున్నది అందుకే కదా? మద్యం వ్యసనానికి దూరమవుతున్న పేదలు మద్యం ధరలు షాక్ కొట్టేలా చేస్తాం.. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేస్తాం.. అని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు విస్పష్టంగా ప్రకటించారు. అదే విధానాన్ని సమర్థంగా అమలు చేస్తుంటే ఈనాడు రామోజీరావుకు కంటగింపుగా మారింది. రాష్ట్రంలో 2014–19 మధ్య మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతల ప్రైవేటు సిండికేట్ గుప్పిట్లో ఉండేవి. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తూ పేదలను కొల్లగొట్టేవారు. నిర్ణీత వేళలను పాటించకుండా విక్రయాలు సాగించేవి. ఇప్పుడు ఆ దందాకు చెక్ పెట్టారు. 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించారు. గత సర్కార్ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 2,934కి తగ్గిపోయాయి. ఈ సంఖ్యనుఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. కొత్త బార్లకు లైసెన్స్‌లు ఇవ్వలేదు. 2019లో ఖరారు చేసిన 840 బార్లే ఉన్నాయి. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నూ విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. తద్వారా పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోవడమే అందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వంలో 2018– 19లో రాష్ట్రంలో 384.31 లక్షల మద్యం కేసులు, 277.1 లక్షల బీర్ కేసులు విక్రయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత 2019–20లో మద్యం కేసులు 308.49 లక్షలు, బీరు 212.91లక్షల కేసులే విక్రయించారు. 2020–21లో మద్యం కేసులు 187.55 లక్షలు, బీరు కేసులు 56.97 లక్షలతో విక్రయాలు తగ్గిపోయాయి. 2021–22లో మద్యం కేసులు 266.08 లక్షలు, బీరు కేసులు 81.67 లక్షలు, 2022–23లో మద్యం కేసులు 335.98 లక్షలు, బీరు కేసులు 116.76 లక్షల కేసులు విక్రయించారు. అయినా సరే చంద్రబాబు కోసం ఈనాడు దు్రష్పచారం చేస్తోంది.సామాన్యునికి అందుబాటులో సినీ వినోదంటీడీపీ ప్రభుత్వ హయాంలో సినీ సిండికెట్ సినిమా టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది. టికెట్ల గణాంకాలు ఎక్కడా ఉండేవి కావు. ఈ పరిస్థితిలో వెఎస్సార్సీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విక్రయాల విధానంలో సంస్కరణలు తీసుకువస్తూ ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాలను అందుబాటులోకి తీసుకువస్తూ విధాన నిర్ణయం తీసుకుంది. అలా చేస్తే తమ దందాకు చెక్ పడుతుందని భావించిన టీడీపీ అనుకూల సిండికేట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా మరోవైపు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల కేటగిరీల్లో సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తూ 2021 ఏప్రిల్ 8న జీవో 35 జారీ చేసింది.దీనిపై కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో హోమ్, సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సినీ రంగానికి చెందిన వివిధ సంఘాల ప్రతినిధులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఓ విధానాన్ని రూపొందించింది. ఆ మేరకు సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ 2022 మార్చి 7న జీవో 13 జారీ చేసింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధరలను తొలి వారం రోజులపాటు పెంచుకునేందుకు నిర్దిష్టమైన విధి విధానాలను రూపొందించింది. హీరో, హీరోయిన్, దర్శకుడి పారితోషకాలు కాకుండా సినిమా నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటితే.. సినిమాలో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ చేస్తే... టికెట్ల ధరలను తొలి పది రోజులపాటు పెంచుకునేందుకు అనుమతిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల యావత్ సినీ పరిశ్రమతోపాటు సామాన్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. దీనిపై కూడా దిగజారుడు రాతలేనా రామోజీ? కార్పొరేట్‌కు కొమ్ము కాసింది బాబే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయకుండా.. ప్రైవేట్, కార్పొరేట్ వైద్య కళాశాలలకే పట్టంకట్టారు. టీడీపీ నాయకులు, సానుభూతిపరులకు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చి.. వారి జేబులు నింపారు. ఇదంతా అప్పుడు రామోజీ కళ్లకు పచ్చగా కనిపించింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించడం కోసం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే.. దేశంలో ఎక్కడా లేనట్టుగా చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి 2017 నుంచి రాజస్తాన్, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి.రాష్ట్రంలో పాత 12 వైద్య కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లకు కొత్త విధానాన్ని అమలు చేయకుండా కేవలం కొత్తగా ఏర్పాటైన కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా పోగా.. మిగిలిన సీట్లలో 50 శాతం సీట్లను కనీ్వనర్ కోటాలో భర్తీ చేస్తున్నారు. మరో 50 శాతం సీట్లలో 35 శాతం ‘బీ’, 15 శాతం సీట్లను ‘సీ’ కేటగిరిలో భర్తీ చేయనున్నారు. ఈ సీట్లకు ఫీజుల రూపంలో వచ్చే నిధులను ఆయా కళాశాలల అభివృద్ధికే ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సీఎం వైఎస్ జగన్ పేదల పక్షపాతి కాబట్టే నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం కోసం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా ఏకంగా 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో 15 శాతం ఆల్ ఇండియా కోటా పోగా మిగిలిన సీట్లలో 50 శాతం రిజిర్వేషన్ వర్గాలకు కేటాయిస్తున్నారు. అంటే 300కు పైగా సీట్లు కన్వీనర్ కోటాలో ఈ ఏడాది నుంచి పెరిగాయి. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు మేలు చేయడం కాదా? నేతన్నకు తోడుగా.. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. వరుసగా ఐదేళ్లు నేతన్న నేస్తం ద్వారా రూ.969.77 కోట్లు అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కారి్మకులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ వారి జీవితాలను మెరుగుపర్చుకున్నారు. నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇచి్చంది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఈ మూడు పథకాలకు రూ.2,835.06 కోట్లు వ్యయం చేసింది. చేనేత వ్రస్తాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కలి్పంచి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.చేనేతకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తూ ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి వినూత్న ప్రయోగాలతో ప్రోత్సహిస్తోంది. ప్రత్యేక శిక్షణ, క్లస్టర్ ట్రైనింగ్ వంటి గట్టి ప్రయత్నాలతో చేనేత కుటుంబాలకు నైపుణ్యాన్ని మెరుగుపరిచే కృషి చేస్తోంది. శిక్షణతో వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడీ అందించి మగ్గాలు, షెడ్లు తదితర సామగ్రిని సమకూర్చారు. మిల్లు వస్త్రాలకు దీటుగా చేనేత వ్రస్తాలకు మార్కెటింగ్ కలి్పంచడం, ఆప్కో షోరూమ్‌లను విస్తరించి సొసైటీల వద్ద వ్రస్తాలు కొనుగోలు చేసి విక్రయించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఏపీ చేనేత వ్రస్తాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి(ఓడీఓపీ) కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఏకంగా 36 చేనేత వ్రస్తాల ఉత్పత్తిని గుర్తించి వాటికి జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ సాధించేలా కృషి చేస్తోంది. ‘పచ్చ’పొరలు కమ్మిన మీకు ఇవేవి కని్పంచట్లేదా రామోజీ?నాడు చీకట్లు.. నేడు వెలుగులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారికి నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇంధన వినియోగ చార్జీలతో పాటు, ట్రూ అప్, ఎఫ్‌ఏపీసీఏ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఎస్సీ, ఎస్టీల విద్యుత్తు వినియోగదారుల రాయితీ మొత్తం రూ.74.43 కోట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో 0–75 యూనిట్ల పరిమితి వుండగా, 0–100 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారుల విద్యుత్ సరీ్వసులకు విద్యుత్తు సరఫరాను నిలిపివేసేవారు. ఆ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించడంతో పాటు యూనిట్ల పరిమితిని కూడా 0–200కు పెంచింది. దీంతో సర్వీసులు పెరిగాయి. సబ్సిడీ పెరిగింది. 2017–18లో సబ్సిడీ రూ.52.04 కోట్లు ఉండగా, 2022–23కి రూ.189.17 కోట్లకు పెరిగింది.ఇదంతా పేదలకు మేలు చేయడం కాదా రామోజీ? టీడీపీ హయాంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసి దివాలా తీయించిన చంద్రబాబు ఇప్పుడు ఏమీ ఎరుగనట్టు మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను అప్పటి ప్రభుత్వం ఏపీఈఆర్సీకి సమర్పించలేదు. దానికి తోడు డిస్కంలపై ఒత్తిడి తెచి్చ, 25 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేయించారు. పవన విద్యుత్ యూనిట్ రూ.2.44 ఉన్నప్పుడు రూ.5.94తో ఒప్పందం చేసుకున్నారు. సౌర విద్యుత్ యూనిట్ రూ 2.44కు లభిస్తుంటే (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిపి అయితే రూ. 3.54) రూ.8.09తో ఒప్పందాలపై సంతకాలు చేశారు. చంద్రబాబు హయాంలో స్లాబుల పేరుతో విద్యుత్ చార్జీల దోపిడీ జరిగేది. ఇవన్నీ మరచిపోయి ఎవరి కోసం విషం కక్కుతున్నారు రామోజీ?ఉన్నతంగా విదేశీ విద్య జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా రాష్ట్రానికి చెందిన అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు.. నోబెల్ గ్రహీతలైన టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ వంటి గొప్ప వ్యక్తులు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు చదువుకున్న విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ పథకం కింద గత ఏడాది 290, ఈ ఏడాది 67 మందికి కలిపి రూ.142.71 కోట్లు మంజూరు చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి గత ఏడాది ఫిబ్రవరిలో లబి్ధపొందిన 290 మందిలో ఎస్సీ విద్యార్థులు 27 మంది, బీసీ 64, క్రిస్టియన్ నలుగురు, ముస్లింలు 20, ఈబీసీలు 175 మందిఉన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఫాల్ సీజన్ కింద ఎంపికైన వారు 67 మంది ఉండగా, వీరిలో ఎస్సీ విద్యార్థులు ఐదుగురు, ఎస్టీ ఒక్కరు, బీసీ 13, క్రిస్టియన్ నలుగురు, ముస్లింలు ఎనిమిది మంది, ఈబీసీలు 36 మంది ఉన్నారు. 2022–23 బ్యాచ్‌కు చెందిన 290 మంది విద్యార్థులకు రెండో విడత వాయిదా ఫీజు, వీసా చార్జీలు, విమాన ఖర్చులతో సహా రూ.35.40 కోట్లను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది.గత ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ కార్డు రాగానే ఒకసారి, మొదటి సెమిస్టర్ పూర్తవగానే రెండోసారి ఫీజు చెల్లించి వదిలేసేది. ఆ తర్వాత విద్యార్థి ఏమయ్యాడో పట్టించుకునే వారు కాదు. గత ప్రభుత్వం విదేశాల్లో చదువుకునేందుకు 2014–19 మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు రూ.15 లక్షల చొప్పున, ఓసీలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించి చేతులు దులుపుకుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం నూరు శాతం ఫీజు చెల్లిస్తోంది. ఓసీలకు రూ.కోటి, ఇతర వర్గాలకు రూ.1.25 కోట్ల వరకు వెచి్చస్తోంది.పైగా చంద్రబాబు 2016–17, 2018–19 సంవత్సరాల్లో 3,326 మంది విద్యార్థులకు రూ.318 కోట్ల బకాయిలను పెట్టారు. ఇప్పుడు నిధుల దురి్వనియోగానికి తావు లేకుండా విద్యార్థి సెమిస్టర్/టర్మ్ పత్రాలు సమరి్పంచగానే ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం పొందేలా 21 కోర్సులకు సంబంధించి ప్రతి కోర్సుకు టాప్ 50లో ఉన్న విద్యా సంస్థలను నిర్ణయించింది. దీంతో మొత్తం విద్యా సంస్థల సంఖ్య 320కి పెరిగింది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్న పరిమితిని తొలగించింది. దీనికి కూడా వక్రభాష్యం చెప్పడం రామోజీకే చెల్లింది.ఇంటిపై హక్కులు కలి్పస్తే తప్పా? గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకుని ఇళ్లు నిరి్మంచుకున్న పేదలకు మేలు చేకూర్చేలా ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది/రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు యాజమాన్య హక్కులు కలి్పంచింది. దీంతో 22–ఏ జాబితాలో ఉండే స్థలాలపై పేదలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు లభించాయి. పేదలు తమ కాళ్లపై తాము నిలబడాలి.. ఇళ్లలో నివసించే హక్కు స్థానంలో పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. స్వచ్ఛందంగా ముందుకు వచి్చన వారికి యాజమాన్య హక్కులను కల్పించారు.వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)ను అమలు చేసి రుణాల నుంచి విముక్తి కలి్పంచాలని.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల నుంచి విజ్ఞప్తులు వచ్చినా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లో ప్రభుత్వం పేదల మొర ఆలకించడం లేదంటూ రామోజీరావు ఒక్క రాత కూడా రాసిన పాపానపోలేదు. ఇప్పుడు పేదలపై మితిమీరిన భారం లేకుండా రూ.10వేలు, ఒక వేళ అంతకంటే తక్కువ రుణం ఉంటే అదే మొత్తం చెల్లించిన వారికి, రుణాలు తీసుకోని వారికైతే రూ.10 వంటి నామ మాత్రపు ఫీజులతో ఇళ్లపై యాజమాన్య హక్కులు కలి్పంచారు. రిజి్రస్టేషన్ ఫీజులను మినహాయించారు. ఇది పేదలకు మేలు చేయడం కాదా?ఓట్ల కోసం చంద్రబాబు డ్రామా బాబు హయాంలో 2014 జూన్ నుంచి 2016 అక్టోబర్ వరకు కందిపప్పు పంపిణీయే లేదు. 2016 నవంబర్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేశారు. ఎన్నికలు దగ్గరపడడంతో 2018 మార్చి నుంచి కార్డుదారులకు రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.63 ఉంటే రూ.23 మాత్రమే సబ్సిడీ భరించి రూ.40కు పంపిణీ చేశారు. మార్కెట్ ఒడిదుడు కులు, కోవిడ్ సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో ప్రస్తుత మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 నుంచి రూ.160కు చేరింది.ప్రభుత్వం రూ.120కి పైగా కంది పప్పు ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే ఇచి్చంది. నెలకు రూ.56 కోట్లు సబ్సిడీ ఖర్చు అయ్యేది. ప్రస్తుతం ధరలు పెరగడంతో నాఫెడ్ నుంచి కందులు కొనుగోలు చేసి వాటిని మర ఆడించి సబ్సిడీపై పంపిణీ చేసేలా కసరత్తు చేస్తోంది. సీఆర్ఎస్ కింద హోల్‌సేల్ వ్యాపారులతో మాట్లాడి తక్కువ ధరకు కందిపప్పు, బియ్యాన్ని విక్రయించే స్టాల్స్ ఏర్పాటు చేసింది. నాణ్యమైన పంచదారను సైతం అందిస్తోంది. అదే చంద్రబాబు ప్రభుత్వం పండగల పేరుతో సొంత కాంట్రాక్టుదారులకు నాసిరకం సరుకులు సరఫరా చేసే బాధ్యతను అప్పగించి దోచుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో రాగులు, జొన్నలు పంపిణీ చేస్తోంది. మున్సిపాల్టీల్లో ఫోరి్టఫైడ్ గోధుమ పిండిని ఇస్తోంది. -
డిజిటల్ టెక్నాలజీకి అర్థం తెలుసా రామోజీ
పాతికేళ్ల క్రితం... » రైల్వే ప్రయాణంలో టీసీ టికెట్ చూపించమని అడిగితే... చిన్న అట్టముక్కలాంటి టికెట్ చూపించేవాళ్లం. ఇప్పుడు సెల్ ఫోన్లో టిజిటల్ కాపీ చూపిస్తున్నాం. టీసీల దగ్గర కూడా ఓ అట్ట దానికి తగిలించిన కాగితాలు ఉండేవి. దాన్లో ఉన్న పేర్లపై టిక్కులు పెట్టుకునేవారు. ఇప్పుడు వారి చేతుల్లోకి ట్యాబ్‌లు వచ్చాయి. » బ్యాంకుల్లో విత్‌డ్రాయల్‌కు గాని, డిపాజిట్ చేయడానికి గాని వెళ్తే పని పూర్తవడానికి ఓ పూట పట్టేది. నేడు మన చేతుల్లోకి ఏటీఎం కార్డులు వచ్చాయి. క్షణాల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చు. అసలు బ్యాంకులకే వెళ్లకుండా ఈ–బ్యాంకింగ్ ద్వారా ఇంటి వద్ద నుంచే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అసలు పాసు పుస్తకాలనే బ్యాంకులు ఇవ్వడం మానేసాయి. మన చేతిలో ఉన్న ఆ చిన్న కార్డులోనే మన వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి. ఆ కార్డు ద్వారానే మన లావాదేవీలన్నీ క్షణాల్లో తెలుసుకోవచ్చు. » ఒకప్పుడు మన వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు, ఇన్సూరెన్సు పత్రాలు కాగిత రూపంలో ఉండేవి. వాటిని ఓ పర్సులాగా బైండ్ చేయించుకునే వాళ్లం. ఇప్పుడు ఓ బెత్తెడంత డిజిటల్ ప్లాస్టిక్ కార్డు చాలు. అందులోనే మన వాహనం పుట్టుపూర్వోత్తరాలు ఉంటాయి. » వ్యవసాయ భూములు వివరాల కోసం ప్రాథమికంగా చూసేది అడంగల్–బి ఫారం. ఒకప్పుడు దీన్ని పొందాలంటే వారాలు, నెలలు పట్టేది. ఇప్పుడది మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఏ ఈ–సేవ కేంద్రానికి వెళ్లినా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. గత పాతికేళ్లుగా ప్రపంచమంతా విస్తరించిన డిజిటల్ విప్లవం ద్వారా ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రపంచగతినే మార్చేసిన ఈ సాంకేతికతను రిజిస్ట్రేషన్ల శాఖ కూడా అందిపుచ్చుకుంది. స్టాంపు పేపర్లపై జరిపే లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చి తన సర్వర్‌లో నిక్షిప్తం చేస్తుంది. దాన్నే మనకు అందిస్తుంది. అంతేగానీ అవి జిరాక్సు కాపీలు కాదు. ప్రతి డిజిటల్ కాపీపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే చాలు. మన ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ నూతన సాంకేతిక విధానాన్నే ఈ–స్టాంపింగ్ అంటున్నాం. ఇంత గొప్ప సాంకేతిక వ్యవస్థను వ్యతిరేకిస్తున్నది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని తాబేదారు రామోజీరావు మాత్రమే. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు పిచ్చి కూతలు కూస్తే... దాన్ని వ్యాప్తి చేయడానికి రామోజీ పచ్చిరాతలు రాస్తున్నాడు.సాంకేతికత అందిపుచ్చుకోవడం తప్పా గురివిందా సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగే మార్పుల్ని కూడా రామోజీ పత్రిక తప్పుదోవ పట్టిస్తూ పచ్చ పైత్యం పరాకాష్టకు చేరిందని నిరూపించుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ–స్టాంపింగ్ విధానంలో జారీ అయ్యే స్టాంపు పత్రాలను జిరాక్స్ కాపీలని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్ల వినియోగం చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ వివిధ రాష్ట్రాల్లో ఈ–స్టాంపింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా డిజిటల్ స్టాంపుల వినియోగం తప్పనిసరి అనే ఉద్దేశంతో ఈ–స్టాంపింగ్ వ్యవస్థను చాలా ఏళ్ల క్రితమే కేంద్రం ప్రవేశ పెట్టింది. అదే సమయంలో నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్లను పూర్తిగా రద్దు చేయలేదు. ప్రజల్లో అవగాహన కోసం స్టాంప్ పేపర్లు, ఈ–స్టాంపింగ్ వ్యవస్థ రెండింటినీ అందుబాటులో ఉంచింది.మన రాష్ట్రంలోనూ ఏడాదిన్నరగా నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అనుమతించిన కామన్ సర్విస్ సెంటర్ల ద్వారా ఈ–స్టాంపులను జారీ చేస్తోంది. ఇవి జిరాక్స్ కాపీలని చెప్పడం అంటే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టడమే. ఆస్తి కొనుగోళ్ల వ్యవస్థను గతం కంటే పారదర్శకంగా చేయడాన్ని వ్యతిరేకించడమేకాకుండా సాంకేతికాభివృద్ధిని కూడా తప్పుదోవ పట్టించే స్థాయికి రామోజీ దిగజారిపోయారు.ఆన్లైన్ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంపైనా ఈనాడు తన పైత్యపు రాతలు రాసింది. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్‌ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అభివృద్ధి చేసింది. దీని ద్వారా వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండానే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోనే మోడల్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రిజిష్టర్ చేసుకునే ఆస్తి, వివరాలను ఎవరికివారే పూర్తి చేసుకునే డేటా ఎంట్రీ విధానం ఇందులో భాగమే. అంటే గతంలో మాదిరిగా తమ ఆస్తి డాక్యుమెంట్‌ను డాక్యుమెంట్ రైటర్లు కాకుండా తామే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న డాక్యుమెంట్‌ను సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో రిజిష్టర్ చేసి ప్రింట్ ఇస్తారు. దీనిపైనా ఎల్లో మీడియా విష ప్రచారం చేసి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డాక్యుమెంట్లు ఇవ్వకుండా జిరాక్స్ పత్రాలు ఇస్తారనే దు్రష్పచారం చేస్తోంది. జిరాక్స్ పత్రాలనే ప్రచారం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ఎల్లో మీడియా, కొందరు డాక్యుమెంట్ రైటర్లు చేసేదే తప్ప నిజానికి అది స్టాంప్ పేపర్ల కంటే అత్యంత భద్రమైన ఆన్లైన్ విధానం. ఇటీవల కార్డ్ ప్రైమ్ అమలుకు సంబంధించి జారీ అయిన మెమోను ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు కోసం జారీ చేసిందిగా పేర్కొంటూ దు్రష్పచారానికి తెరదీశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు. -
ఆ ద్రోహం మీ బాబుదే రామోజీ
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల పక్షపాతిగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ సర్కారుకు వంకలు పెడుతూ అబద్ధాలు అచ్చేస్తున్న రామోజీరావు మరో అవాస్తవాన్ని మిత్ర ద్రోహం శీర్షికతో వండి వార్చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే మొదటి వేటు యానిమేటర్లపైనే పడుతుందని అలవోకగా అబద్ధం ఆడేశారు. యానిమేటర్లను మోసం చేసింది చంద్రబాబేనన్న నిజాన్ని దాచిపెట్టి అప్పటి దారుణాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేశారు. పొదుపు సంఘాల డ్వాక్రా యానిమేటర్లకు ఉమ్మడి ఏపీలో 2014కు ముందు రూ. రెండువేల గౌరవ వేతనం ఉండేది. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ గౌరవ వేతనాన్ని నిలిపివేశారు.యానిమేటర్లును ఉద్యోగులుగా పరిగణించలేమని, జీతాలు ఇచ్చేది లేదని తెగేశారు. డ్వాక్రా సంఘాల నుంచే కొంత మొత్తం వసూలు చేసుకోవాలని కూడా సూచించారు. దీనిపై 2015లో వారు 75 రోజులు పాటు సమ్మె చేసినా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. వీరి ఆగ్రహం ఎదురు తిరుగుతుందన్న భయంతో అదే గౌరవ వేతనం అందజేస్తామంటూ 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రకటించారు. అప్పట్లో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని యానిమేటర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.పార్టీ అధికారంలోకి వస్తే రూ.10 వేల చొప్పున వేతనం చెల్లిస్తామని జగన్ ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే గత ఐదు సంవత్సరాలుగా నిరాటంకంగా చెల్లిస్తున్నారు. అప్పట్లో బీమా మిత్ర, కళ్యాణ్‌మిత్రలు మండల కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవారు. కానీ, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ బీమా, వైఎస్సార్ కళ్యాణమస్తు పథకాలను వలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందిస్తున్నారు. దీన్ని కూడా తప్పుగా పేర్కొంటూ రామోజీ విషం చిమ్మారు. -
ఏయూను వదలని ‘ఎల్లో’ కుతంత్రం!
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎల్లో మీడియా బరితెగించేస్తోంది. అధికారులు, పోలీసులు, వలంటీర్లు.. ఇలా ప్రతి ఒక్కరినీ తప్పుపడుతూ సొంత తీర్పులిచ్చేస్తున్న ఎల్లో మీడియా ఇప్పుడు విశ్వవిద్యాలయాలను కూడా వాటి పని వాటిని చేసుకోనీయడం లేదు. ప్రతిదానికి యాగీ చేయడం.. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేసేస్తున్నారని అసత్యాలు, అబద్ధాలు అచ్చేయడమే పనిగా పెట్టుకుంది. చివరకు జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలున్న ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని కూడా ఎల్లో మీడియా తమ రాజకీయ ప్రయోజనాలకు రోడ్డుకు ఈడుస్తోంది. ఇదెలా తప్పు? ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుని ఉద్యోగాలు సాధించినవారికి శుక్రవారం వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని విశ్వవిద్యాలయం సంకల్పించింది. అయితే ఇందులో కూడా ఎల్లో మీడియా తప్పులు వెతికింది. ఎచీవర్స్ డే పేరిట విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారని అభూతకల్పనలతో ఈనాడు పత్రిక ఒక అశుద్ధ కథనం అచ్చేసింది. ఏయూ ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని.. తన కథనంలో రంకెలేసింది. దీంతో ఈనాడు పత్రిక దుర్బుద్ధికి భయపడిన అధికారులు అచీవర్స్ డేని రద్దు చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. ఫలితంగా ఏయూలో చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోవాలని ఆశించిన 2,287 మంది తీవ్రంగా నిరాశ చెందారు. కాగా టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ మాత్రం ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదంటూ ఏప్రిల్ 24న అచీవర్స్ డే నిర్వహించడం గమనార్హం. అక్రమాల ‘గీతం’ కోసమే పన్నాగం.. ఈ ఏడాది ఏయూ సైన్స్ కళాశాల పరిధిలో 802, ఇంజనీరింగ్‌లో 900, ఆర్ట్స్‌లో 410, బీఈడీలో 175కి పైగా ఉద్యోగాలు విద్యార్థులకు లభించాయి. ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి ఇప్పటి వరకూ సాధ్యం కాని రికార్డును ఏయూ సొంతం చేసుకుంది. సైన్స్‌లో ఏకంగా 802 ఉద్యోగాలు రావడం ఇదే తొలిసారి. ఇంతటి ఘనమైన కీర్తిని సొంతం చేసుకున్న సమయంలో అచీవర్స్డేని తప్పుపడుతూ, దాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ ఈనాడు పత్రిక తన దుర్బుద్ధిని చాటుకుంది. విద్యార్థి విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా ఏటా ఏయూలో అచీవర్స్ డే నిర్వహిస్తున్నారు.వేదికపై విద్యాన్థితో పాటు వారి తల్లిదండ్రులను సత్కరించి, వారికి విద్యార్థితో పాదాభివందనం చేయిస్తారు. ఏయూలో విద్యార్థులకు నియామక పత్రాలు అందించి, తల్లిదండ్రులను గౌరవించే ఈ కార్యక్రమాన్ని నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) నిపుణుల బృందం సైతం ఇటీవల ప్రశంసించింది. అయితే దీన్ని ఈనాడు పత్రిక తట్టుకోలేకపోయింది. పేద కుటుంబాల పిల్లలకు లక్షల రూపాయల వేతనాలతో ఉద్యోగాలు సాధించడంతో ప్రభుత్వ యూనివర్సిటీ అయిన ఏయూ ప్రతిష్ట పెరిగింది. దీంతో టీడీపీ నేత భరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీకి, టీడీపీకి కంటగింపుగా ఏయూ మారింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ స్వయంగా గీతం డీమ్డ్ వర్సిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తన వర్సిటీ ఉద్యోగులతో విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని సిబ్బంది ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతి ఇచ్చి రద్దు చేశారు.. క్లాజ్ –22 ప్రకారం ఎన్నికల సమయంలోనైనా యూనివర్సిటీల పరిధిలో అపాయింట్మెంట్స్, రిక్రూట్మెంట్స్ ఆపడానికి వీల్లేదు. అందుకే.. 15 రోజుల ముందుగానే జాయింట్ కలెక్టర్ డా.మయూర్ అశోక్‌కు ఏయూ అధికారులు అచీవర్స్ డే కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి అభ్యంతరం లేదని జేసీ కూడా అనుమతులు మంజూరు చేశారు. అచీవర్స్ డే కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. అయితే ఈనాడు విషకథనంతో అధికారులు చివరి క్షణంలో అచీవర్స్ డేకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. నేనెలా ప్రభావితమవుతాను? నాకు 22 ఏళ్లు. పూర్తి పరిణితి చెందిన నేను సమావేశంలో ఒక వ్యక్తి చెప్పే ప్రసంగానికి ప్రభావితమై ఓటు వేస్తానని ఎలా అనుకుంటున్నారు? విద్యను రాజకీయంతో ముడిపెట్టడం ఏమాత్రం సరికాదు. ఏటా అచీవర్స్ డేను నిర్వహిస్తుండగా ఈ ఏడాది అడ్డుకోవడం తప్పు. – ఒ.గోవర్ధన్, బయోటెక్నాలజీ విభాగంచాలా బాధగా ఉంది.. నేను నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల సమక్షంలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవచ్చని చాలా సంతోషించాను. ఇప్పుడు అచీవర్స్‌డే రద్దు కావడం పట్ల చాలా బాధగా ఉంది. – ఎ.స్వాతి, స్టాటిస్టిక్స్ విభాగం -
టీడీపీ తొండాట.. బాబు అండ్ కోకు మామూలే!
గతంలో ఒక జోక్ ఉండేది. ఇండియా, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మాచ్ జరుగుతుంటే మా వైపు ధోని వంటి మంచి క్రికెటర్లు ఉన్నారని భారత క్రికెటర్లు చెబితే, తమ వైపు ఎంపైర్ అంటే రిఫరీ ఉన్నారులే అని పాక్ క్రికెటర్లు అన్నారని జోక్‌గా చెప్పుకునేవారు. సరిగ్గా ఏపీలో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే, ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో పొత్తు కట్టి తిరిగి అధికారంలోకి రావాలని సంకల్పించారు. కానీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం జనసేన, బీజేపీ లతో పాటు ఎల్లో మీడియాతో నేరుగాను, కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలతో పరోక్ష కూటమి కడుతున్నారు. తాజాగా ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసే పనిలో పడ్డారా అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి.నిష్పక్షపాతంగా ఉంటోన్న ఈసీపై కూటమి నేతలు బీజేపీ ద్వారా ఒత్తిడి తెస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. తత్ఫలితంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికి టీడీపీ కూటమి నేతలకు అవకాశం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రత్యర్థులు అనుసరిస్తున్న ఇలాంటి అనైతిక వ్యూహాలను ఎదుర్కోవడం వైఎస్ జగన్మోహన్రెడ్డికు కొత్తకాదని చెప్పాలి.వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితం.. పొలిటికల్ కెరియర్ చెప్పాలంటే.. మరీ పెద్దదేం కాదు. ఆయన 2009 నుంచే రాజకీయాలలో ఉన్నట్లు లెక్క. అంటే 15 ఏళ్ల రాజకీయ జీవితం అన్న మాట. కానీ ఆయన ఎదుర్కున్నన్ని సమస్యలు, సవాళ్లు దేశంలోనే మరే నేతకు ఎదురు అయి ఉండకపోవచ్చు. ప్రత్యేకించి ఆయా వ్యవస్థలు పగబట్టినట్లుగా ఆయనపై పడ్డ తీరు తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక పెద్ద టీవీ సిరియల్ అవుతుంది. సినిమా తీస్తే ఒక సంచలన కథ అవుతుంది.తాజాగా 2024 శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అదే తరహా దాడి జరుగుతున్నట్లు అనిపిస్తుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఒంటరిగా ఎదుర్కోలేమన్న భయంతో కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీలు అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసే పనిలో పడ్డట్టు అనిపిస్తుంది. ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం ఉద్దేశం కానప్పటికీ, జరిగిన పరిణామాలు విశ్లేషించినప్పుడు అలాంటి భావన కలుగుతోంది. లేకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి దాడి, హత్యాయత్నం జరిగితే ఆ కేసును విచారిస్తున్న పోలీసు అధికారిని ఎన్నికల సంఘం సహేతుక కారణం లేకుండా బదిలీ చేయడం, నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఇంటిలెజెన్స్ హెడ్‌ను మార్చడం తాజా ఉదాహరణలుగా నిలుస్తాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఇలా వ్యవస్థలనుంచి చికాకులు రావడం కొత్తకాదు. చిన్న వయసులోనే అనేక కష్టాలు పడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండె ధైర్యం మాత్రం మెచ్చుకోదగింది. అదే సాహస యాత్రను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సొంతంగా పార్టీ పెట్టుకున్న ఫలితంగా సోనియాగాంధీ, చంద్రబాబు వంటివారు కుమ్మక్కై అక్రమ కేసులుపెట్టినా చలించలేదు. పదహారు నెలలు జైలులోపెట్టినా బెదరలేదు. ఇన్ని అడ్డంకులు అధిగమించి, 2014లో తనపార్టీకి ఓటమి ఎదురైనా నిబ్బరంగా రాజకీయాలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి 3800 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల ఆదరణ చూరగొని రికార్డు స్థాయిలో 2019లో 151 సీట్లను గెలుచుకున్నారు. అది రాజకీయ ప్రత్యర్దులకు కంటగింపుగా మారింది.ముఖ్యంగా తనకంటే పాతికేళ్ల చిన్నవాడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ స్థాయిలో ప్రజల మన్నన పొందడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం నచ్చలేదు. ఆయనకే కాదు. తన మీడియా బలంతో రాజకీయాలను శాసించాలని అనుకునే రామోజీరావు వంటివారికి అసలు గిట్టలేదు. దాంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాడన్నమాటే కానీ, మళ్లీ అవే సమస్యలు. మళ్లీ అవే ఆటంకాలు. మళ్లీ ఆయా వ్యవస్థల నుంచి ఇబ్బందులు. పార్టీ పెట్టిన కొత్తలో సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఆయనను వెంటబడి వేధించాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరికొన్ని వ్యవస్థలు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ నుంచి పదే, పదే వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కున్నారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడన్న చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థలో తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు కొందరితో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఇబ్బంది పెట్టడానికి ఎన్ని సమస్యలు పెట్టాలో అన్నీ సృష్టించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ స్కీమును ఆరంభించినా, ఏ సంస్కరణను తీసుకు వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో లిటిగేషన్ తీసుకురావడం, వాటిని న్యాయ వ్యవస్థలో కొందరు ఎంటర్ టెయిన్ చేయడం వంటివి ప్రజలలో అనేక డౌట్లకు కారణం అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఇబ్బంది పెట్టాలని టీడీపీ కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తున్నట్లు కనిపిస్తుంది.తెలుగుదేశం వారు రాసిచ్చిన ఒక ఫిర్యాదుపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సంతకం పెట్టి ఎన్నికల సంఘానికి పంపారు. అందులో ఏకంగా 22 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదులు చేయడం ఒక ఎత్తు అయితే, తమకు ఫలానా అధికారులు కావాలని, వారికి తాము కోరిన రీతిలో పోస్టింగ్‌లు ఇవ్వాలని కోరడం ఒక సంచలనం. అలాంటి ఫిర్యాదు చేసిన పురందేశ్వరిని మందలించవలసిన ఎన్నికల సంఘం, అలా చేయకపోగా, వారు కోరిన రీతిలో స్పందించారు. అంటే బీజేపీతో టిడిపి ఎందుకు పొత్తు పెట్టుకున్నదో అర్థం చేసుకోవచ్చన్నమాట.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని మోదీని టెర్రరిస్టు అని అనడమే కాకుండా, అనేక రకాలుగా దూషణలు చేసినా, ఓటమి తర్వాత మళ్లీ కాళ్లా, వేళ్లాపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తనపై ఉన్న కేసుల భయంతోనే చంద్రబాబు ఇలా చేశారులే అనుకున్నారు. కానీ అదొక్కటే కాదని, వ్యవస్థను మేనేజ్ చేయడానికి కూడా ఈ పొత్తు అవసరమని ఆయన లెక్కగట్టుకున్నారని అర్దం అయింది. పురందేశ్వరి ఫిర్యాదు తర్వాత కొందరు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అయినా టీడీపీ కూటమికి సంతృప్తి కలగలేదు. మరికొందరిని కూడా తప్పించాలని తలపెట్టారు. గతంలో ఇంటెలెజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టారు. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో కీలక భూమిక పోషించారని ఆరోపణలు వచ్చాయి.గత ఎన్నికల సమయంలో ఆయనపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది. అప్పట్లో ఏబీపై నిర్దిష్ట అభియోగాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఇంటలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులుపై అలాంటి ఆరోపణలు లేవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు రాసిన కథనాలలో కూడా సీతారామాంజనేయులపై స్పష్లంగా ఫలానా ఆరోపణ అని చెప్పలేకపోయాయి. కాకపోతే ఆయన ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో ప్రవర్తిస్తున్నారన్నట్లుగా రాశాయి. ఆ ఇబ్బంది ఏమిటో తెలియలేదు. అంటే విపక్ష కూటమికి చెందినవారు డబ్బు రవాణా చేసినా, మద్యం సీసాలు సరఫరా చేసినా, దౌర్జన్యాలు చేసినా ఈ అధికారులు పట్టించుకోరాదన్నది వారి ఉద్దేశంగా ఉంది. పోనీ వీరు అధికార పార్టీ వారికి సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే కేసులు పెట్టడం లేదా? అంటే అదేమీ లేదు. తెలుగుదేశం పత్రిక ఈనాడులోనే వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెట్టిన ఉదంతాలను ఇచ్చింది.ఇక విజయవాడ కమిషనర్ కాంతీలాల్ రాణా బదిలీ అయితే మరీ ఘోరం అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతున్నప్పుడు ఒక దుండగుడు రాయి విసిరాడు. ఫలితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గాయపడ్డారు. ఆ కేసు రాణా నేతృత్వంలో విచారణ జరుగుతోంది. దానిని ఆయన విజయవంతంగా పరిశోధిస్తూ, సాంకేతికతను వాడి నిందితుడిని పట్టుకున్నారు. ఆ నిందితుడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని బయటకు వినవస్తోంది. అంతే! రాణాపై కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దానికి స్పందించి ఎన్నికల సంఘం ఆయనను బదిలీ చేసి ప్రజలను ఆశ్చర్యపరచింది. ఈయన బదిలీకి ఏ కారణం ఉందో చెప్పరు. వీరంతా వైఎస్సార్సీపీకి అనుకూలమని ఒక ముద్రవేసి వారిపై చర్య తీసుకోవాలని కోరారు.గతంలో ఏబీని పక్కన పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల సంఘం తీరును తప్పు పడుతూ ఏకంగా ముఖ్య ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి ధర్నా చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు అలా చేయడం లేదు. ఎవరు బదిలీ అయినా, ఎవరిని కొత్తగా నియమించినా ఆయన పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుపోతూ ప్రజలలో తిరుగుతున్నారు. ఒక వైపు ప్రధాని మోదీ ముస్లింలపై, కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, వాటిపై పదిహేడువేల మంది ఫిర్యాదు చేసినా, స్పందించని ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం చిన్న, చిన్నవాటిపై మాత్రం సీరియస్‌గా స్పందిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రిపై దాడి కేసులో విచారణ చేస్తున్న అధికారులను బదిలీ చేస్తోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తెలంగాణలో బీజేపీపై అక్కసు..ఏపీలో మాత్రం జగనే టార్గెట్..
-
ఆ బుర్రలో ‘సైతాన్’ తిష్ట ఫ్యాక్ట్ చెక్
రామోజీ మెదడును సైతాన్ శోధించింది. అందుకే దయ్యం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అబద్దాలు అచ్చు వేస్తూ చంద్రబాబు పాలన మొత్తం నీతివంతంగా జరిగినట్లు వక్రీకరిసు్తన్నారు. ‘పాపపు’ రాతలు రాస్తూ ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారు. దీన్నే నిత్యం పనిగా పెట్టుకుని కల్లిబొల్లి మాటలతో అబద్ద ప్రచారం చేస్తున్నారు. ‘జీసస్’ కాలంలో ‘అబద్ద ప్రవక్తలు’ ఉండేవారు. ఇప్పుడు అచ్చు గుద్దినట్లు వారికి పదిరెట్లు ఎక్కువగా ‘ఈనాడు’ అబద్దాలను ప్రచారం చేస్తోంది. నిస్సిగ్గుగా నిజాలను తప్పులుగా రాస్తున్న రామోజీకి ప్రజాకోర్టులో ఆ ‘కరుణామయుడు’ శిక్ష వేయడం మాత్రం ఖాయం.(సాక్షి, అమరావతి) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ప్రకటించిన మేనిఫెస్టోను బైబిల్ అంత పవిత్రంగా భావించారు. అందుకే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటీ చిత్తశుద్దితో అమలు చేసి చూపించారు. అంతకు ముందు మేనిఫెస్టోను చిత్తు కాగితంలా చూసిన చంద్రబాబు 600పైగా హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని రామోజీకి తెలియదా?. మేనిఫెస్టోను అమలు చేయని చంద్రబాబు దాన్ని టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా తొలగించిన మాయల మరాఠీ. ఇప్పుడు జర్నలిజం విలువలకు శిలువేస్తూ రామోజీ నీతులు వల్లిస్తున్నారు.ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందిన సీఎం వైఎస్ జగన్‌పై రోజు ఏదో ఒకటి పచ్చి అబద్దాలతో అచ్చేస్తూ రామోజీ పైశాచికానందాన్ని పొందుతున్నారు. తాజాగా క్రైస్తవులకు టీడీపీ హయాంలో బాగా చేశారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమి చేయలేదంటూ.. ‘హామీలకు శిలువ’ అంటూ అడ్డగోలు అబద్దాలతో రామోజీ వార్త అచ్చేయడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.ఆరోపణ: పాస్టర్లను బెంబేలెత్తించారువాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పాస్టర్లకు గౌరవ వేతనం అందించి అండగా నిలిచింది. కోవిడ్ కష్టంలోను పాస్లర్లకు నెలకు రూ.5వేలు చొప్పున అందించి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. ఈ ప్రభుత్వం నెలకు రూ.5వేలు చొప్పున 8,427 మందికి ఇప్పటి వరకు గౌరవ వేతనంగా రూ.71.10కోట్లు అందించింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో క్రిస్టియన్లతోపాటు పాస్టర్లకు కలిపి 29,841 మందికి కోవిడ్ అసిస్టెన్సీ వన్ టైమ్ గ్రాంట్‌గా రూ. రూ.14.90కోట్లు అందించింది. చంద్రబాబు తన హయాంలో ఏనాడు పాస్టర్లను పట్టించుకోలేదు. అయినా చంద్రబాబు కోసం రామోజీ దాసోహం అయిపోతున్నారు.ఆరోపణ: ఆర్థిక సాయం రెట్టింపు చేస్తామనివాస్తవం: పవిత్ర జెరుసలేం యాత్రకు గత టీడీపీ ప్రభుత్వం సాయం చేసినట్టు రామోజీ మసి పూస్తున్నారు. ఆయన హయాంలో నిధులు కేటాయించినట్టు చూపించినా సాయం అందించింది నామమాత్రమే. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకం కింద వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి క్రైస్తవునికి రూ.60వేలు, రూ.3లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.30వేలు సాయాన్ని అందించింది. ఇప్పటివరకు 1,060 మంది లబ్ధిదారులకు రూ.591.60 లక్షలు నిధులు అందించారు.ఆరోపణ: సాయాన్ని కాదు..జాప్యాన్ని పెంచారు..వాస్తవం: గత ప్రభుత్వం సాయం చేసింది గోరంత అయినా రామోజీకి ఆనందంగా ఉంటుంది. నిరుపేద ఆడ పిల్లల పెళ్లికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ మింగుడు పడటంలేదు. వాస్తవానికి గత ప్రభుత్వం తోచినప్పుడు సాయం అందించేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాలెండర్( నిర్థిష్ట గడువు) ప్రకటించి ప్రతి మూడు నెలలకు (త్రైమాసికం) ఒకసారి పెళ్లి సాయాన్ని విడుదల చేస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకోవాలంటే ఆపసోపాలు పడేవారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాయాల ద్వారా స్థానికంగా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది.దీంతో ఉన్న చోట నుంచే ధరఖాస్తు చేసుకోవడంతోపాటు ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలకు పొందుతున్నారు. గత ప్రభుత్వంలో బకాయిలు కాలానుగుణంగా విడుదల చేయలేదు. ఇప్పుడు వివాహం జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు ఒకసారి అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆడ పిల్లల చదువులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వివాహాలు చేసుకునే వారు కనీసం పదవ తరగతి విద్యార్హత ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. వారిని ఉన్నత చదువులు చదివించాలనే సీఎం వైఎస్ జగన్ ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది.ఆరోపణ: పెళ్లి కానుక హుళక్కే..వాస్తవం: పేదల పెళ్లికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచినట్టు రామోజీ అడ్డగోలుగా రాసేశారు. వాస్తవానికి పేద బిడ్డల పెళ్లికి సాయం అందించేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ‘మాస్ మ్యారేజ్’ పేరుతో ఆర్థిక సాయాన్ని అందించారు. క్రైస్తవ ఆడ బిడ్డల పెళ్లికి రూ.25వేల ఆర్థిక సాయం, కొత్త బట్టలతోపాటు పెళ్లి వస్తువులు అందించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ పెట్టిన పథకాన్ని 2015లో ‘దుల్హాన్’ పథకంగా పేరు మార్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా 2018లో రూ.25వేల ఆర్థిక సాయాన్ని రూ.50వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.పెంచిన మొత్తాన్ని అందించకపోగా బకాయిలు పెట్టారు. చంద్రబాబు హయాంలో 2018 నుంచి జరిగిన 43,490 జంటల(పెళ్లిళ్లు)కు రూ.177.96 కోట్ల బకాయిలను చెల్లించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ బకాయిలను విడుదల చేసి పేద బిడ్డలకు భరోసా ఇచ్చింది. అంతేకాకుండా ఆయా వర్గాలకు గతం కంటే రెట్టింపు చేసి మరీ సీఎం వైఎస్ జగన్ పెళ్లి సాయాన్ని అందిస్తుండటం విశేషం.ఆరోపణ: బీమా అమలులోను కుయుక్తులే..వాస్తవం: బీమా అమలు లేదంటూ రామోజీ కుయుక్తులతో కూడిన ఆరోపణలు చేశారు. వాస్తవానికి వైఎస్సార్ బీమా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సీఎం వైఎస్ జగన్ పేద వర్గాలకు అండగా నిలిచారు. కుటంబంలో ప్రధాన ఆధారమైన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యానికి గురైనా ఆ కుటుంబం రోజువారీ గడవడం కష్టమని భావించి బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తోంది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, శాశ్వత వైకల్యానికి గురైతే రూ.5లక్షలు, సహజ మరణమైతే రూ.లక్ష బీమా మొత్తాన్ని చెల్లిస్తోంది.ఆరోపణ: గ్రాంట్ ఇన్ ఎయిడ్‌నూ ఎగ్గొట్టారువాస్తవం: చర్చిల నిర్మాణం, ప్రహారీల ఏర్పాటుకు గత ప్రభుత్వం గొప్పగా చేసింది.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని రామోజీ బురదచల్లేశారు. వాస్తవానికి కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల మరమ్మత్తులు, పునరుద్ధరణ, అభివృద్ధి, ప్రహారీ, మరుగుదొడ్లు, మౌళిక వసతుల కోసం రూ.5 లక్షల సాయంతో పాటు శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.3 లక్షల నుంచి 5 లక్షలు చొప్పున నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు 98 చర్చిలకు రూ.5.67కోట్లు నిధులు కేటాయించింది.ఐదేళ్లలో 24,304.37కోట్ల లబ్ది వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక క్రిస్టియన్ మైనార్టీలకు ఐదేళ్లలో నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందాయి. క్రిస్టియన్ మైనారిటీలకు డీబీటీ ద్వారా రూ.13,239.49కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 11,064.88కోట్లు లబ్ధిని అందించింది. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37కోట్లు లబ్దిని చేకూర్చింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,82,270 మందికి రూ.416.56కోట్లు లబ్ది అందించింది. చంద్రబాబు ఓట్ల కోసం మాయ మాటలతో మభ్య పెడితే.. సీఎం జగన్ ప్రజల నమ్మకాన్ని పొందారు. -
‘క్రమం’ తప్పి బాబు ‘కక్ష’
సాక్షి, అమరావతి: అబద్దాలు అలవోకగా చెప్పడం చంద్రబాబుకే అలవాటు తప్ప ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డికి అవి వర్తించవు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్థీకరణ చేయకుండా మోసం చేసింది మీ చంద్రబాబే. గత చరిత్రను వదిలేసి ఇప్పుడు కళ్లు మూసుకుని రాసే రాతలు చెల్లవు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు.ఆ హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరించకుండా పరీశీలన చేయడానికి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమావేశాలతో కాలయాపన చేసి చివరికి సుప్రీం కోర్టు తీర్పు అడ్డు వస్తోందని, దానికి సాధ్యం కాదంటూ కాంట్రాక్టు ఉద్యోగులను నిలువునా వంచించింది చంద్రబాబే. ఇవేమీ రామోజీకి అప్పట్లో కనిపించలేదు.ఇప్పుడు వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ అమలు చేస్తుంటే ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల కోడ్ ముందు వరకూ జీవోలు ఇవ్వలేదంటూ మరో పచ్చి అవాస్తవాన్నీ ఈనాడు అచ్చువేసింది. అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 13నే ఆర్దికశాఖ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. కానీ ఈనాడు మాత్రం ఎన్నికల షెడ్యూల్‌కు రెండు రోజులు ముందే ఉత్తర్వులు ఇచ్చినట్లు ఈనాడు మరో అబద్దాన్ని అచ్చు వేసింది.మేనిఫెస్టోనే వక్రీకరిస్తున్న రామోజీవైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫేస్టోలో అర్హత గల కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరిస్తామని పేర్కొంది తప్ప అందరినీ క్రమబద్దీకరిస్తామని చెప్పలేదు. ఎన్నికల మేనిఫేస్టోను కూడా వక్రీకరించి మరీ రామోజీ అవాస్తవాలను ప్రచురించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఎటువంటి కసరత్తు చేయలేదు. వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్దీకరించే విధంగా నిబంధనలను రూపకల్పన చేశారు.ప్రభుత్వ రంగ సంస్ధలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారందరినీ క్రమబద్దీకరిస్తామని ఎక్కడా ఎన్నికల మేనిఫేస్టోలోగానీ ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్.జగన్ చెప్పలేదు. వివిధ కేంద్ర పథకాల కింద పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు, ఆ పథకాల కొనసాగినంత కాలమే కొనసాగుతారు. ఈ విషయం తెలిసి కూడా ఆ ఉద్యోగులను క్రమబద్దీకరించడం లేదంటూ మరో వక్రభాష్యం చెప్పారు.1999 నుంచి 2004 మధ్య ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు మూసేయించారు. ఇందుకోసం ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అని ఓ విభాగాన్నే సెక్రటేరియట్లో పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను పప్పూ, బెల్లాల మాదిరిగా తన వాళ్లకు అమ్మేసుకున్నారు.ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్చ్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ వంటివి ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది. దాని గురించి అప్పట్లో ఒక్క వార్త రాయని ఈనాడు ఇప్పుడు మేనిఫేస్టోలో చెప్పకపోయినా ప్రభుత్వ రంగ సంస్ధల ఉద్యోగులను క్రమబద్దీకరించడం లేదంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉంది.నిబంధనల ప్రకారమే క్రమబద్దీకరణచంద్రబాబు హయాంలో ఐదేళ్లు పాటు సాగదీసి గత ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ సాధ్యం కాదని చెప్పారు. వైఎస్.జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల కోడ్ కన్నా ముందే క్రమబద్ధీకరణ ప్రారంభమైంది. ఇందుకోసం అర్హులైనవారిని రెగ్యులరైజేషన్ చేసేందుకు ఆర్థికశాఖ చర్యలను చేపట్టింది. రెగ్యులరైజేషన్‌కు సంబంధించి మార్గదర్శకాలను ఆర్థిక శాఖ 13-12-2023న సర్క్యులర్ మెమో ద్వారా విడుదల చేసింది. దీనికి రూపొందించిన సాఫ్ట్ వేర్లో ఉద్యోగులు దరఖాస్తులను నమోదు చేసుకోవాల్సిందిగా ఆర్దిక శాఖ స్పష్టం చేసింది.సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అర్హులైన సుమారు పది వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 3,000 మందికిపైగా క్రమబద్దీకరించారు. మిగతా ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రెండు మూడు నెలల్లో ఆ ప్రకియ పూర్తి అవుతుంది. ప్రభుత్వంలో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటిస్తూనే కాంట్రాక్టు ఉద్యోగులు సర్వీసును క్రమబద్దీకరిస్తారు.ప్రభుత్వం అంటే రామోజీ సొంత జాగీరు కాదు రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటించకపోవడానికి. మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండాలనే నిబంధన ఇప్పుడు తెచ్చింది కాదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయబోమని, సుప్రీం కోర్టు తీర్పు అందుకు అనుమతించదని టీడీపీ హయాంలో చంద్రబాబు అడ్డు పుల్ల వేశారు.ఎన్నికల హామీ నెరవేర్చకుండా సుప్రీం కోర్టు తీర్పు పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్‌పై ఆర్దిక మంత్రి, మానవ వనరుల మంత్రి, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులతో 09-09-2014న జీవో 3080 ద్వారా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది.ఇప్పుడు వైఎస్ జగన్ సర్కారు న్యాయంఇప్పుడు సీఎం వైఎస్.జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు న్యాయ పరమైన చిక్కులు అధిగమించి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ప్రభ్వుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని వైస్సార్సీపీ మేనిఫేస్టోలో పేర్కొంది. దీని ప్రకారం రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది.మంత్రుల కమిటీతో పాటు సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది. మంత్రులు కమిటీ, వర్కింగ్ కమిటీ పలు సార్లు న్యాయపరమైన, చట్టపరమైన సమస్యలపై చర్చించింది. ఇందుకోసం రెగ్యులరైజేషన్‌పై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. బ్యాక్ డోర్ కాకూడదని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొంది.కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఎటువంటి చిక్కులు ఎదురుకాకుండా ఉండే విధంగా న్యాయపరంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు సుప్రీం కోర్టు తీర్పును బూచిగా చూపెట్టి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా మోసం చేస్తే జగన్ సర్కారు సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటూనే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. -
మీ కథనమే బోగస్
సాక్షి, అమరావతి : గురివింద రామోజీ మరోసారి తన మచ్చను కప్పెట్టేసుకున్నారు. కరోనా కష్టకాలంలో సైతం రైతులకు అండగా నిలిచి, బాబు ఎగ్గొట్టిన ఉచిత విద్యుత్, ఆక్వా విద్యుత్, విత్తన, సూక్ష్మ సేద్యం, ధాన్యం సేకరణ బకాయిలను జగన్ చెల్లించిన అంశాలను విస్మరించారు. ఈ ఐదేళ్లలో రూ.1.86 లక్షల కోట్ల సాయం అందించారు. బాబు ప్రయోజనాలే లక్ష్యంగా ‘ప్రోగ్రెస్ కాదు..అంతా బోగస్’ అంటూ సీఎం వైఎస్ జగన్‌పై విషం కక్కిన కథనంలో వాస్తవాలివీ.ఆరోపణ: రైతు భరోసాకు కోత పెట్టేశారువాస్తవం: 2014 ఎన్నికల నాటికి ఉన్న రూ.87,612 కోట్ల రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత రూ.15 వేల కోట్లతో సరిపెట్టాడు. అన్నదాత సుఖీభవ పేరిట పెట్టుబడి సాయం అందిస్తానంటూ ఏమార్చిన చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి రూ.1765.29 కోట్లతో మమ అనిపించాడు. ఇలా మొత్తం చెల్లించింది రూ.16,765 కోట్లే. జగన్ ప్రభుత్వం వచ్చాక హామీ కంటే మిన్నగా ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.67,500 చొప్పున రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించారు.ఆరోపణ: మూడు కోట్ల ఎకరాలకు పంటల బీమా పోయింది.వాస్తవం: బాబు పాలనలో 30.9 లక్షల మందికి రూ.3411.20 కోట్ల బీమా పరిహారం మాత్రమే దక్కింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఈ ఐదేళ్లలో 2.04 కోట్ల మంది రైతులకు రక్షణ కల్పించారు. రైతుల వాటాతో కలిపి రూ.4406.86 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించారు. ఈ ఐదేళ్లలో 54.55 లక్షల మందికి రూ.7802.08 కోట్ల పరిహారం అందించింది. గతం కంటే ఇది రూ.4390.88 కోట్లు అధికం.ఆరోపణ : వడ్డీలేని పంట రుణాలు..తూచ్వాస్తవం: ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మందికి రూ.2050.53 కోట్లు చెల్లించారు. ఇందులో బాబు ఎగ్గొట్టిన రూ.1180.66 కోట్ల బకాయిలున్నాయి.ఆరోపణ: కర్షకులను విపత్తులకు వదిలేశారువాస్తవం: సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేశారు. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ చివర్లోనే పరిహారం అందిస్తున్నారు. తిత్లీ తుపాన్ సమయంలో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్లతో సహా ఈ ఐదేళ్లలో రూ.3261.60 కోట్ల పరిహారం చెల్లించారు. బాబు పాలనలో రూ.2558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు.ఆరోపణ: దోచుకునే వారికే మద్దతువాస్తవం: ఈ ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం 37.73 లక్షల మంది రైతుల నుంచి 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.65,313 కోట్లు చెల్లించింది. గోతాలు, కూలీలు, రవాణా ఖర్చులు(జీఎల్టీ) రూపంలో ఎమ్మెస్పీకి అదనంగా క్వింటాకు రూ.252 చెల్లిస్తోంది. రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా ధరలు పతనమైన ప్రతీసారి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చేస్తోంది.ఆరోపణ: బాధిత రైతు కుటుంబాలకు మోసంవాస్తవం: బాబు జమానాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల్లో తమ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే పరిహారం అందేది. అందులోనూ కోతలు, ఆంక్షలుండేవి. టీడీపీ ఐదేళ్లలో 924 మంది ఆత్మహత్యలకు పాల్పడితే కేవలం 450 మందికే పరిహారం అందింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పరిహారాన్ని రూ.7లక్షలకు పెంచడమే కాకుండా, నిర్ణీత గడువులోగా నేరుగా రైతు కుటుంబాలకు జమ చేస్తోంది. ఈ ఐదేళ్లలో బాబు ఎగ్గొట్టిన 474 మందితో కలిపి 1770 మందికి రూ.114.42 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించింది.ఆరోపణ: పేరుకే వెలుగులు..రైతులకు కోతలువాస్తవం: రైతులకు పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది. అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.8845 కోట్ల బకాయిలను చెల్లించి, ఈ ఐదేళ్లలో ఉచిత విద్యుత్ కోసం రూ.43,744 కోట్లు ఖర్చు చేసింది.ఆరోపణ: ఆక్వా కరెంట్..అంతే సంగతులువాస్తవం: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సరఫరా చేసింది. ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగు చేసే 3.34 లక్షల ఎకరాలకు ఆక్వా సబ్సిడీ అందిస్తున్నారు. ఆయా జోన్ల పరిధిలో ఉన్న కనెక్షన్లలో 95 శాతం మంది ఆక్వా సబ్సిడీ పొందుతున్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల బకాయిలతో పాటు ఈ 57 నెలల్లో రూ.3,497 కోట్లు ఆక్వా విద్యుత్తు సబ్సిడీ కింద ప్రభుత్వం ఖర్చు చేసింది.ఆరోపణ: పాడి రైతుకు బోనస్..తుస్వాస్తవం: ‘జగనన్న పాల వెల్లువ’ (జేపీవీ)తో పాడి రైతుల జీవితాలకు భద్రత.. భరోసా కల్పిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా రూ.10 నుంచి రూ.20 వరకు పాడి రైతులకు అదనంగా లబ్ధి చేకూరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 4794 గ్రామాలకు చెందిన 4.19 లక్షల మందిపాడి రైతుల నుంచి 16.72 కోట్ల లీటర్ల పాలు సేకరించగా, రూ.762.89 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మరొక వైపు మూతపడిన చిత్తూరు డెయిరీని రూ.385 కోట్ల అమూల్ పెట్టుబడులతో పునరుద్ధరిస్తున్నారు.ఆరోపణ: అటకెక్కిన ఆహార శుద్ధి పరిశ్రమలువాస్తవం: పంటలకు అదనపు విలువ జోడించేందుకు ఆర్బీకేలకు అనుబంధంగా 940 కలెక్షన్ సెంటర్స్, 340 కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 478 కలెక్షన్ సెంటర్లు, 89 కోల్డ్ రూమ్స్‌తో పాటు 2,905 ప్యాక్ హౌస్‌ల ద్వారా అదనంగా 2.44 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం పెరిగింది. రైతులకు వ్యక్తిగతంగా 1156, రైతు సంఘాలకు 164 ఫామ్ పాండ్స్ నిర్మించారు. రాయలసీమలో 217 సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరొక పక్క పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. -
FACT CHECK: బడుగులను ఏవగించుకునే బాబు రామోజీకి గొప్పోడు!
ఇంట్రో... మంచి మనిషికో మాట...మంచి గొడ్డుకో దెబ్బ ...అంటారు...రామోజీ దుర్మార్గపు రాతలపై ఎన్నిసార్లు వాస్తవాల హంటర్ ఝళిపించినా బజారుస్థాయి రాతలతో పత్రికను ఆసాంతం దిగజార్చుకుంటూనే పోతున్నారు...జగన్ ప్రభుత్వ వ్యతిరేకత అనే పూనకంలో కన్నూమిన్నూగాననంతగా తప్పుడు కథనాలను అచ్చేస్తున్నారు...విచక్షణాయుత పాత్రికేయానికి మంగళం పాడేసి దుష్ట పాత్రికేయం అంటే ఎలా ఉంటుందో పాఠకలోకానికి తన రాతల్లో చూపిస్తున్నారు...అన్నీ ఏకపక్ష కథనాలు... పవిత్ర పాత్రికేయ వస్త్రాన్ని తొలగించుకుని అక్షర దిగంబర నృత్యం చేస్తున్నట్లుగా ఉంది రామోజీ తీరు...ఈ కథనాలు ఎవరు చదివినా చదవకపోయినా బాబొక్కడు చదివితే చాలు తన జన్మ ధన్యమైపోతుందన్న మూర్ఖత్వంలో బొంకుల దిబ్బపై కూర్చుని బొంకుడు కథనాలను రాస్తున్నట్లుగా ఉంది...బడుగులను ఏవగించుకున్న బాబు రామోజీ దృష్టిలో గొప్పోడు..అయిదేళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ లకు అన్ని రంగాల్లోనూ అగ్రాసనం వేసిన జగన్ అంటే మంట...మంచి చేసిన జగన్ కన్నా జనాన్ని ముంచే బాబే రామోజీకి ఆదర్శం..ఈ వికృతధోరణిని నిలువెల్లా ఒంటబట్టించుకుని మంగళవారం ’నా..నా...నా..అని బాకా...చేసిందంతా ధోకా’ శీర్షికన జగన్ ప్రభుత్వంపై రాళ్లేస్తూ...ఓ తప్పుడు కథనాన్ని జనంపైకి వదిలారు...రామోజీ బుర్ర తక్కువ రాతలకు వాస్తవాల షాక్ ఇచ్చే సమాధానాలివి...సాక్షి, అమరావతిః చంద్రబాబుకు పదవీ ప్రయోజనం కోసం రామోజీ అబద్ధాల డోలు వాయించడం మానడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ధోకా ఇచ్చింది చంద్రబాబేనని తెలిసినా రామోజీ దుర్మార్గ రాతల ధోరణి మాత్రం మారడంలేదు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలతో వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వడంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపింది. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధితో పాటు అనేక విధాలుగా ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్ద మనస్సును చాటుకుంది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలను రద్దు చేశారని, ఉపాధి అవకాశాలను దెబ్బతీశారనే తప్పుడు ప్రచారానికి ఈనాడు బరితెగించింది.పేదల అసైన్డ్ భూములను రాబందులా ఆక్రమించి ఫిలిం సిటీ కోట కట్టుకున్న రామోజీ నీతులు వల్లిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు దళితులను భయపెట్టి భూములను కాజేసినా రామోజీ కళ్లప్పగించి చూశారు. వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను అయినా ఇవ్వకపోయినా అది తప్పని ఏ రోజూ బాబుకు బుద్ధి చెప్పలేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరుతో బాబు అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టినా, ఎస్సీలకు దక్కాల్సిన కార్లు బినామీల పేరుతో టీడీపీ నేతలు దక్కించుకున్నా, ఈ ఎల్లో మీడియా పెద్దకు అక్షరం రాసేందుకు మనసొప్పలేదు.రామోజీ చేసిన ఆరోపణలు ఎంత నీచమైనవో చెప్పే వాస్తవాలివి... ఆరోపణః కొత్త వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ల కోత వాస్తవంః కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కొత్తగా ఎంబీబీఎస్ సీట్లను సీఎం వైఎస్ జగన్ సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో ఒక్కసారిగా 319 కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే సీట్లు దక్కించుకుని లబ్ధిపొందారు. మీ బాబు అధికారంలో ఉండగా ఏనాడైనా ఈ విధంగా అట్టడుగు వర్గాల పిల్లలకు మెడికల్ సీట్లను తెచ్చిపెట్టి మేలు చేశాడా రామోజీ? ఆరోపణః అవన్నీ సంక్షోభ వసతి గృహాలు వాస్తవంః సంక్షోభంలో వసతి గృహాలు అంటూ ఈనాడు మరో వక్రీకరణకు దిగింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్ వర్కుల కోసం మరో రూ.133.90 కోట్ల మొత్తాన్నీ వెచ్చించింది. ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి. దాదాపు రూ.318 కోట్లతో 177 స్కూళ్లలో నాడు–నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది, వసతి గృహాలను ఆధునికీకరించి మౌలిక వసతులు కల్పించింది. ఆరోపణః సివిల్స్‌లో శిక్షణకు విముఖత, పోటీలో నిలవకుండా కుట్ర వాస్తవంః నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి.పోటీ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ కోచింగ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతుల్లో స్టడీ సర్కిళ్లున్నాయి. ఒక్కో స్డడీ సర్కిల్లో ఒక్కో మాదిరిగా సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ టెస్ట్‌లకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వం విద్యోన్నతి పథకం కింద 9,775 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పంపగా , ఒక అభ్యర్థి మాత్రమే ఎంపికైనా రామోజీ ఏరోజూ రాయలేదు. ఆ పథకాన్ని సవరించి సివిల్స్ సర్వీస్ పరీక్షకు ఏపీ స్టడీ సర్కిళ్లలోనే ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు. ఇటీవలే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. మెయిన్స్‌కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించి అందిస్తోంది.పేద పిల్లలు ఉన్నత స్థానాలకు పోటీ పడి ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అమెరికా వంటి సంపన్నదేశాలకు వెళ్లేందుకు ఊతమిస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై రామోజీ విషం కక్కుతున్నారు. ఆరోపణః విదేశీ విద్యకు కొర్రీలు వాస్తవంః గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలు, అవినీతి, అక్రమాలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి లోపాలు, అక్రమాలకు తావులేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తెచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది.అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్లు, ట్యూషన్ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని సమర్థంగా మార్చి ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగిలిన వర్గాలకు రూ.కోటి లేదా అసలు ట్యూషన్ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తోంది. ఈ స్థాయిలో విదేశీ విద్య కోసం గత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగిందా? మరి ఈనాడు ఈ పథకంపై పదేపదే ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోందో రామోజీ పక్షపాత బుద్ధిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.. ఆరోపణః స్వయం ఉపాధికి చెల్లు వాస్తవంః ఇస్త్రీ పెట్టె.. కత్తెర ఇచ్చి.. అదే స్వయం ఉపాధి పథకం అని గత టీడీపీ ప్రభుత్వం అర్భాటపు ప్రచారం చేసుకునేది. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలుగా ఆదుకుని వారి జీవన ప్రమాణాలను పెంచేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది.టీడీపీ హయాంలో స్వయం ఉపాధి పథకం కింద 2,02,414 మందికి రూ.2,726 కోట్లు, ఎస్టీలు 39,906 మందికి రూ.284.8 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా ద్వారా 23,27,682 మంది ఎస్సీలకు రూ.9,697.99 కోట్లు. 4,78,716 మంది ఎస్టీలకు రూ.1,895.37 కోట్ల లబ్ధి చేకూరింది. చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు 6,256 మంది ఎస్సీలకు రూ.346.79 కోట్లు, 1,228 మంది ఎస్టీలకు రూ.65.90 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది.స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో ఎస్సీ లబ్ధిదారులకు 2,300, ఎస్టీలకు 701 ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డోర్ డెలివరీ కోసం అందించింది.ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా స్వయం ఉపాధి పథకంలో రూ.63.20 కోట్లతో 1,038 యూనిట్లను అమలు చేసింది. ఆరోపణః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదు వాస్తవంః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదని తప్పుడు రాతలు రాసిన ఈనాడు గత ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి ఎంతమేర భూమి సేకరించిందనే విషయాన్ని రాయలేకపోయింది. దీన్నిబట్టే ఈ పథకాన్ని టీడీపీ ఎత్తేసిందనే సంగతి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇది మైలు రాయిగా నిలిచిపోయింది. 22ఏ జాబితా నుంచి మినహాయింపుతో 14.223 దళిత మహిళలకు 16,213.51 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. అసైన్ భూముల క్రమబద్ధీకరణతో 3,57,805 మందికి 5,37,719 ఎకరాలపై హక్కులు దక్కాయి. అవసరమైనప్పుడు భూములను విక్రయించడానికి ఎస్సీ మహిళా లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం పూర్తి హక్కులను కల్పించింది. ఎస్సీ మహిళా లబ్ధిదారులు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ జలకళ, పంటలబీమా సాయాన్నీ పొందే సౌలభ్యాన్నీ ఏర్పరిచింది.అసైన్డ్ భూముల డీనోటిఫికేషన్ తర్వాత, భూమి యజమానులు తమ భూములపై ఫ్రీహోల్డ్ హక్కులు పొందుతారు. పట్టా భూములతో సమానంగా తమ భూములను విక్రయించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వాల కంటే అత్యధికంగా ఎస్టీలకు ఏకంగా 2.47 లక్షల ఎకరాలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమినీ కొనుగోలు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు ’ కార్యక్రమంలో దళితులకు, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31.19 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇస్తే , అందులో 6,36,732 మంది లబ్ధిదారులు దళిత వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలే (మొత్తం లబ్ధిదారుల్లో 20.7 శాతం).ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది. వారి కోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు (మొత్తం లబ్ధిదారుల్లో 6 శాతం) ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి లబ్ధి ఈ వర్గాలకు దక్కడం ఇదే ప్రథమం. ఇంత భారీస్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వం అండగా నిలబడలేదు. ఆరోపణః బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్‌కు గండి వాస్తవంః ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని నిర్వీర్యం చేసినట్టు ఈనాడు మరో వక్రీకరణకూ దిగింది. వాస్తవానికి కనీస ప్రమాణాలు పాటించని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీమును గత బాబు ప్రభుత్వం అమలు చేసింది.ఇప్పుడు ఆ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు అందుతున్నాయి. అత్యుత్తమంగా తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. బైలింగ్యువల్ టెక్ట్స్బెక్స్, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ ఆధునాతనంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే 15 వేల స్కూళ్లలో పనులు జరిగాయి. టోఫెల్ లాంటి కోర్సులనూ ప్రభుత్వం ఈ పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో ఎస్సీ చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15వేల చొప్పున రూ.5,335.70 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం అందించింది.2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.76 కోట్లు సమకూర్చింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5,06,390 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.834.96 కోట్లు జమ చేసింది. 83,04 మంది ఎస్టీలకు రూ.135.౬౬ కోట్లను జమచేసింది. జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5,93,926 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.2,409.76 కోట్లను అందించింది. 1,22,495 ఎస్టీ విద్యార్థులకు రూ.383.43 కోట్లను సమకూర్చింది. ఈ పథకాల నిధులన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికీ చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఆరోపణః కేంద్ర సాయానికి మోకాలడ్డు వాస్తవంః ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించడంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసింది.ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, సాయాన్ని రాబట్టడంలో గత టీడీపీ ప్రభుత్వానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గణనీయమైన కృషి చేసింది. ఎస్సీ కాంపొనెంట్ అమలులో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చిన జాబితాలో దేశంలోని 20 రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికలోను స్పష్టం చేసింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 35.92 లక్షల మందికి లబ్ధి చేకూరడం గొప్ప రికార్డు.ఈ కోవలోనే గిరి బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారినీ సమాదరిస్తోంది. జిల్లాల విభజనతో గిరిజనులకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం రెండు జిల్లాలను ఏర్పాటు చేయడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు సమస్యలు ఉంటాయి కాబట్టి ఒకే కమిషన్‌గా ఉన్న దాన్ని వేర్వేరుగా ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి దన్నుగా నిలవడం గొప్ప విషయం. ----- సంక్షేమానికి ఇలా... -టీడీపీ హయాంలో ఎస్సీలు 21,43,853 మందికి రూ..8844 కోట్లు, ఎస్టీలు 9,17,488 మందికి రూ.2,611.3 కోట్లను వెచ్చించింది.-వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీబీటీ ద్వారా ఎస్సీలు 1,37,72.539 మందికి రూ.45,412.12 కోట్లు, ఎస్టీలు 37,90,517 మందికి రూ.13,389.21 కోట్ల మొత్తాన్ని నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాలకే జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 69,91,349 మంది ఎస్సీలకు రూ.23,468.91 కోట్లు, ఎస్టీలు 22,71,105 మందికి రూ.5,963.43 కోట్ల లబ్ధిని ఈ ప్రభుత్వం చేకూర్చింది. ఈ ప్రభుత్వంలోనే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తంగా ఎస్సీలు 2,07,63,888 మందికి రూ.68,881.04 కోట్లు, ఎస్టీలు 60,61,622 మందికి రూ.19,352.64 కోట్ల లబ్ధిని అందించింది. -
FactCheck: ‘అంధుడి’ సర్టిఫికెట్ అందుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై రాజ గురువు రామోజీ పదే పదే విషం కక్కుతూ చివరికి కోర్టుల్ని సైతం పక్కదారి పట్టించేలా తప్పుడు రాతలు రాస్తున్నారు. అధికారులు ఇసుకపై కోర్టులకు ఇవ్వాల్సిన నివేదికలు తనకే ఇచ్చినట్లు ఊహించుకుని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. ‘ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే.. కృష్ణా జిల్లా గనుల శాఖాధికారి సంచలన నివేదిక’ పేరుతో రామోజీ రోత పత్రిక వాస్తవాలకు మసి పూసి పూర్తిగా వక్రీకరించి అడ్డగోలు కథనాన్ని ప్రచురించింది.నివేదికలో అంతా అక్రమాలే జరిగాయని ఒక అధికారి నివేదిక ఇచ్చారంట.. అది ఈయనగారికి చెప్పారంట? దాన్నే ఏ ఆధారం లేకుండా అబద్దాలతో అచ్చేశారు. కోర్టులకు వెళ్లాల్సిన నివేదికలు అంతకంటె ముందు రామోజీ, ఈనాడు కార్యాలయాలకు వెళుతున్నాయంటే అది నమ్మాలా? ఒకవేళ నిజంగా అలా జరిగితే రామోజీరావు కోర్టుల్ని కూడా డిక్టేట్ చేస్తున్నారా?. ఇసుక తవ్వకాలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ విచారణ జరుగుతుంటే దానిపై కోర్టును ధిక్కరించేలా అడ్డగోలు కథనాలు రాసి మరీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.జిల్లా కలెక్టర్లు ఇసుక రీచ్‌లను మరోసారి పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జిల్లా గనుల శాఖ అధికారితో సహా సంబంధిత అధికారుల బృందం ఇసుక రీచ్‌లను సందర్శించి నివేదికలను రూపొందిస్తున్నాయి. రూపొందించాక కోర్టుకు సమర్పించనున్నారు. ఈలోపే అక్రమ తవ్వకాలు జరిగాయని ఈనాడుకు తెలిసిపోతుందా? నివేదిక తయారు కాకుండానే అందులో ఏం రాస్తారో ఊహించుకుని తన ఇష్టానుసారం వార్తలు రాస్తారా?ఈ కథనాల ద్వారా కోర్టుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడమేగా? జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన అధికారుల బృందం సంయుక్తంగా తనిఖీలు చేసి, సమర్పించిన నివేదికలు మార్చేందుకు వీలుంటుందా? అలా మార్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారా? ఈనాడు మాత్రం కనీస అవగాహన లేకుండా అక్రమాలు జరిగిపోతున్నాయని ఊహించుకుని, నివేదికలో అవి జరిగాయని ఊహించుకుని కథనాలు రాసేసింది. అక్రమ తవ్వకాలపై నిరంతర పర్యవేక్షణ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగకుండా గనులశాఖ, ఎస్ఇబి నిరంతరం పర్యవేక్షణ జరుపుతోంది.ఎక్కడ అక్రమాలు జరిగినా ఉక్కుపాదం మోపుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంటే ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా అబద్ధాలు రాసింది. కేవలం రాజకీయ దురుద్ధేశంతో ప్రభుత్వంపై బుదరచల్లే పనిలో భాగంగా తరచూ ఇలాంటి కథనాలు రాస్తోంది. అందుబాటు ధరలోనే ఎక్కడా ఇసుక కొరత లేకుండా ప్రజలకు అందించడాన్ని తట్టుకోలేక అడ్డగోలుగా బురదజల్లుతున్నారు. పర్యావరణ అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ రాష్ట్రంలో పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఎస్ఇబిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక రవాణా జరగకుండా అన్ని చోట్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఇంత పకడ్భందీగా ఇసుక ఆపరేషన్స్ జరుగుతుంటే దానిపై అదే పనిగా అబద్ధపు ప్రచారం చేస్తోంది. 4 వేల కోట్ల విలువ లేని ఇసుక కాంట్రాక్టులో రూ.40 వేల కోట్ల దోపిడీయా? రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ఏపీఎండీసీ సహకారం అందిస్తోందంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు సోమవారం కామెడీ షో నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం టెండర్లు పిలిచిన మొత్తం కాంట్రాక్ట్ విలువే రూ.4 వేల కోట్ల లోపు ఉంటే, ఏకంగా రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీ ఎలా జరుగుతుందో ఆ మహా మేధావికే తెలియాలి.ఏపీఎండీసీ శరవేగంగా అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన నిధులను బాండ్లను జారీ చేయడం ద్వారా మార్కెట్ నుంచి సేకరించేందుకు ఏపీఎండీసీ నిర్ణయించింది. బాండ్ల కోసం సేకరించే మొత్తం, దానికి చెల్లించే వడ్డీ కన్నా అధికంగా రెవెన్యూ ఆర్జించే అవకాశం ఉన్న ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టనుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపి వాణిజ్య ప్రయోజనం అందించే ప్రాజెక్టులనే బాండ్ల ద్వారా సేకరించిన సొమ్మును పెట్టుబడి వ్యయంగా పెట్టాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది.ఈ బాండ్ల సేకరణ ప్రక్రియ ఇంకా నడుస్తుండగానే ఏపీఎండీసీ రూ.7 వేల కోట్లకు బాండ్లు జారీ చేసిందని ఆరోపణలు చేయడం విడ్డూరమే. బాండ్ల కోసం ఆసక్తి వ్యక్తం చేసిన వారి వివరాలే తెలియకుండా, బాండ్ల జారీనే జరగకుండా, రూ.7 వేల కోట్లు ఎలా సేకరిస్తారో ఆ ప్రతినిధికే తెలియాలి? అసలు సేకరణే జరగని సొమ్మును ప్రభుత్వానికి ఎలా బదిలీ చేస్తారనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు మెప్పు కోసం ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
ఓటమి ఊహించిన రామోజీ...కక్షతో పేదల విద్యపై కుట్ర..
-
Pawan Kalyan: రాజకీయ అజ్ఞాని అని ఒప్పుకున్నట్లేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలలోకి ఎందుకు వచ్చినట్లు! ఆయన ఏమి సాధించినట్లు! ఆయన ఏమి మాట్లాడుతున్నట్లు! ఎవరి కోసం ఆయన పని చేస్తున్నట్లు! ఎవరో ఒకరిని ద్వేషించడానికి అయితే రాజకీయాలలోకి రావడం వల్ల ఉపయోగం ఉండదు. సమాజానికి ఏదో రకంగా సేవ చేయడానికి రాజకీయాలలోకి రావాలని అనుకుంటారు. కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి, వేరే పార్టీ నేత కోసం నిత్యం పరితపించే వ్యక్తిగా పవన్ దేశంలోనే ఒక రికార్డు సాదించినట్లు అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ తీరుతెన్నులు చూశాక ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కల్యాణ్ అవసరం ఎంత మాత్రం లేదనిపిస్తుంది. ఆయనకు ఒక సిద్దాంతం లేదని, పద్దతి పాడు లేదని అడుగడుగున అందరికి తెలిసిపోతుంది. అందుకే ఆయన రాజకీయాలలో రాణించలేకపోతున్నారని భావించాలి.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆయనకు ద్వేషం ఉండవచ్చు. ఆయనను అర్జంట్‌గా పదవి నుంచి దించేయాలన్నంత కోపం ఉండవచ్చు. అందుకోసం ఆయన ప్రయత్నిస్తే తప్పేమీ కాదు. కానీ జగన్‌ను అసలు ఎందుకు పదవి నుంచి దించాలన్నదానిపై ఆయనకు ఒక స్పష్టత ఉండాలి కదా! తనపార్టీని తానే నాశనం చేసుకుని, తన పార్టీవారిని తానే అవమానించి బయటకు వెళ్లగొడుతున్న అరుదైన రికార్డు ఉన్న పవన్ కల్యాణ్‌కు ఏవిషయంలోను స్పష్టత ఉండదు. అలాంటప్పుడు జగన్ విషయంలో ఏమి క్లారిటీ ఉంటుంది! జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయనకు వ్యతిరేకత ఉందా? వలంటీర్ల వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాలు మొదలైనవి నచ్చలేదా! ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జగన్ ప్రత్యేక నీటి పథకం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తేవడం పవన్‌కు ఇష్టం లేదా? జగన్ విధానాలు నచ్చకపోతే ఫలానాది బాగాలేదు.. తాము దానికి ప్రత్యామ్నాయం ఇది సూచిస్తున్నానని చెప్పవచ్చు.కానీ అలా ఎన్నడైనా చేశారా! సముద్ర తీరంలో జగన్ నిర్మిస్తున్న ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, విద్యుత్, తదితరరంగాలలో కొత్తగా తెస్తున్న పరిశ్రమలు ఇష్టం లేదా! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణ వంటివారికి వీటిని అడ్డుకోవడం ద్వారా ఒక లాభాన్ని ఆశిస్తున్నారు. వాటిపై దుష్ప్రచారం చేయడం ద్వారా తమకు రాజకీయ లబ్ది కలగాలని వారు కోరుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తామే ప్రభుత్వాన్ని నడపవచ్చన్నది రామోజీ, రాధాకృష్ణల కుట్ర. కానీ, అందులో పవన్ కల్యాణ్‌కు అసలు పాత్రే ఇవ్వరు కదా. మహా ఇస్తే ఒక ప్యాకేజీ ఇచ్చి సరిపెట్టుకోమంటారు తప్ప ఇంకొకటి కాదని అంతా భావిస్తారు. ఈ మాత్రం దానికి పవన్ కల్యాణ్ తన ప్రతిష్టను అంతా పణంగా పెట్టి తన పార్టీని తాకట్టు పెట్టి. తనవారందరిని నట్టేట ముంచి చంద్రబాబు పాదాల వద్ద రాజకీయ బానిసత్వం చేయడం దేనికో ఆయన అభిమానులకు కూడా అంతు పట్టదు.ఈ మద్యకాలంలో పార్టీ నుంచి బయటకు వస్తున్న అనేక మందినేతలు ఎలా వాపోతున్నారో కనబడుతూనే ఉంది కదా! శాసనసభ ఎన్నికలలో పార్టీ తరపున పోటీచేసే అవకాశం వస్తుందని నమ్మిన పలువురు నేతలు కోట్లు ఖర్చు పెట్టారట. ఇప్పుడు పవన్ కల్యాణ్ వారిని తూర్పు తిరిగి దండం పెట్టుకోండని చెప్పి, ఆయన మాత్రం పడమర వైపు తిరిగి చంద్రబాబుకు సరెండర్ అయిపోయారు. తత్పలితంగా పార్టీని కేవలం పది, పరకా సీట్లకే పరిమితం చేశారు. మిగిలిన చోట్ల లక్షలు, కోట్లు వ్యయం చేసిన నేతలంగా నిండా మునిగిపోయారు. బుద్ది తక్కువై పవన్‌ను నమ్మామని వారు చెబుతున్నారు. ఇందులో తెలుగుదేశం నేతల్నీ తప్పు పట్టలేం. ఎందుకంటే వారంతా చాలాకాలం నుంచి ఒకే మాట చెబుతున్నారు. పదో - పరకో సీట్లు పడేస్తే పవన్ కల్యాణ్ తాము చెప్పినట్లు పడి ఉంటారని వారు అంటూ వచ్చారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఒక సభలో చెప్పి, తాను పదోపరకకో లొంగుతానా? అంటూ మాట్లాడితే జనసేన వారంతా బాగా మాట్లాడారులే అనుకున్నారు.. కానీ ఆయన చివరికి పది సీట్ల కోసం టీడీపీకి సరెండర్ అయ్యారు. పేరుకు ఇరవైఒక్క సీట్లు అయినా, పది సీట్ల వరకు చంద్రబాబు పంపించిన టీడీపీ నేతలకే పవన్ సీట్లు ఇచ్చారు.ఈ మాత్రం దానికి పార్టీ ఎందుకు? వారాహి భోషాణం దేనికి, ఎవరి కోసం బిల్డప్? అసలు తెలుగుదేశంలో విలీనం చేసేస్తే సరిపోయేది కదా అని జనసేనను నమ్మి నాశనం అయినవారు అడుగుతున్నారు. వారిది అరణ్యరోదనగా మిగిల్చిన పవన్ కల్యాణ్ ప్రతి విషయంలోను చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం మాట్లాడుతున్నారు. చంద్రబాబు తెలివిగా పవన్ కల్యాణ్‌ను పది సీట్లకే పరిమితం చేసి జనసేనను పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాంతో ఇంతకాలం తాను ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నానని, చంద్రబాబుకు సమానంగా ఆయన పక్కనే నడుస్తున్నానని చెప్పుకున్న పవన్ కల్యాణ్‌ను అసలు ఆ రేసులో లేకుండా చేసుకున్నారు. తద్వారా తాను, లేదా తన కుమారుడు లోకేష్‌లు మాత్రమే.. ఒకవేళ అవకాశం వస్తే సీఎం పదవి చేపట్టడానికి వీలుగా పవన్‌ను లొంగదీసుకున్నారు.పవన్ కూడా ఒక ఎమ్మెల్యే పదవి వస్తే మహద్బాగ్యం అంటూ పిఠాపురంలో ఒక నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతను బతిమలాడుకుంటున్న తీరు ఆయన రాజకీయాలకు పనికిరాడని రుజువు చేస్తుంది. తనపార్టీవారిని గెలిపిస్తారని అనుకు్న్నవారికి భ్రమలు తొలగిస్తూ పవన్ కల్యాణ్ తను గెలుపుకోసం పిఠాపురంలో టీడీపీ నేత కాళ్లావేళ్లా పడుతున్నారు. ఇలా తన రాజకీయ పార్టీని తానే నాశనం చేసుకున్న పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ పై ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయన మాట తీరు చూస్తే రాజకీయాలలో ఏ మాత్రం పరిణితి లేని అజ్ఞాని అన్న సంగతి పదే, పదే అర్ధం అవుతుంది. జగన్ తనకు తానే దండలో రాయి పెట్టుకుని కొట్టుకున్నారట! ఏ మాత్రం ఇంగితం ఉన్నవారైనా ఇలా మాట్లాడతారా! లోకేష్ పిచ్చి వ్యాఖ్యలకు, పవన్ బుర్ర తక్కువ కామెంట్లకు తేడా ఏమీ కనిపంచదు. చంద్రబాబే అతి తెలివితో ముందుగా తానేదో ఖండించినట్లు నటించి, ఆ తర్వాత గులకరాయి తగిలిందంటూ డబుల్ టాక్ చేశారు.పవన్ కల్యాణ్‌కు ఆ మాత్రం కూడా కుట్ర తెలివితేటలు కూడా లేవు. చంద్రబాబు ఏది చెబితే అదే తాను కూడా వంత పాడి గులకరాయి స్వరం ఎత్తుకున్నారు. జగన్‌కు తగిలింది గ్రానైట్ రాయి అని, పొరపాటున అది నవరగంతకు తగిలినా, కంటికి తగిలినా ఎంత ప్రమాదం జరిగేది! అంతదాకా ఎందుకు ఒక గులకరాయిని తీసుకుని తమవాళ్లతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కొట్టించుకు చూస్తే దాని పవర్ ఏమిటో తెలుస్తుంది. జగన్‌కు ఆ రకంగా గాయమైతే కనీసం సానుభూతి తెలపకపోగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పైగా రాష్ట్రంలో ఏవేవో నేరాలు జరిగాయట. అప్పుడు ఎవరూ స్పందించలేదట. సమాజంలో జరిగే నేరాలకు, ముఖ్యమంత్రిపై దాడికి లింకు పెట్టి మాట్లాడడంలోనే పవన్ కల్యాణ్ అజ్ఞానం తెలుస్తుంది.సుగాలి ప్రీతి హత్య గురించి మాట్లాడారు. అది ఎప్పుడు జరిగింది.. చంద్రబాబు పాలన టైమ్ లోనే కదా! మరి అలాంటి చంద్రబాబుతో ఎందుకు జత కట్టారు! వివేకానంద రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేగా! అప్పుడు శాంతి భద్రతలు వైఫల్యం చెందాయని పవన్ అన్నారా! పైగా వివేకా కూతురు సునీత నాలుక మడతేసి చెబుతున్న అసత్యాలను ఈయన ఎత్తుకున్నారు. సునీతే తన తండ్రి హత్య జరిగిన రోజుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలపైనే ఆరోపణలు చేశారు కదా! ఆ తర్వాత కాలంలో, హత్య తానే చేశానని చెప్పుకుంటున్న వ్యక్తికి ఈమె ఎందుకు బెయిల్ ఇప్పించారు! ఈ విషయాలేవీ పవన్‌కు పట్టవా! ఏదో ఒకటి జగన్ పై బురద వేసి చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న వ్యక్తికి ఎవరు రాజకీయాల గురించి చెప్పాలి.మళ్లీ ముప్పైవేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ పిచ్చి వాగుడు. అదే నిజమని నమ్మితే వలంటీర్ల వ్యవస్థను తీసివేస్తామని పవన్ కల్యాణ్ ఎందుకు చెప్పడంం లేదు? చంద్రబాబు అయితే యూటర్న్ తీసుకుని వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నారే! జగన్ అమలు చేస్తున్న స్కీములను తామూ అమలు చేస్తామని చెప్పడం ద్వారా తాము ఎంత బలహీనంగా ఉన్నది వీరిద్దరూ తెలియచేస్తున్నట్లే కదా! జగన్‌పై జరిగిన దాడి లేదా హత్యాయత్నం ఘటనలో తొలుత పవన్ సోదరుడు నాగబాబు కొంత అభ్యంతరకరంగా వ్యాఖ్యానించినా, ఆ తర్వాత సర్దుకుని దాడిని ఖండించారే.ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, దాడి హేయమని ఖండించారు కదా! నాగబాబుకు దాడి ఎలా కనిపించింది? పవన్ కల్యాణ్‌కు ఎందుకు కనిపించలేదు! అంటే పవన్ కల్యాణ్ పిచ్చి మాటలుమాట్లాడుతున్నారని తేలిపోవడం లేదా! పవన్‌కు నాగబాబు ఇచ్చిన స్టేట్ మెంటే జవాబుగా కనిపిస్తుంది కదా! అంటే నాగబాబుకు ఉన్న విజ్ఞత కూడా పవన్ కల్యాణ్‌కు లేదనే అనుకోవల్సిందే కదా! పవన్ కల్యాణ్ హుంకరింపులు, గంతులు, ఆవేశం నటిస్తూ ఊగిపోవడాలు ఇవన్ని చూసిన తర్వాత మనందరికి ఒక స్పష్టత వస్తుంది కదా! ఈయన రాజకీయాలకు ఏ మాత్రం తగడని. వ్యక్తిగత జీవితంలో అనైతిక ప్రవర్తనతో పాటు, ఇలాంటి అజ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎంత ప్రమాదకరం! ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరికలు సిగరెట్ల మీద, మందు బాటిళ్ల మీద ఉంటాయి. అలాగే పవన్ కల్యాణ్ పాలిటిక్స్ రాజకీయ సమాజానికి, ఏపీ ప్రజలకు ప్రమాదకరమని అనిపించడం లేదా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బస్సు యాత్ర దెబ్బకు రామోజీ కి మైండ్ బ్లాక్
-
ఆర్థిక వేత్తలను గబ్బు పట్టించిన రామోజీ
-
రామోజీ రావు మార్గదర్శి స్కామ్ పై ఉండవల్లి సంచలన విషయాలు
-
ఓడిపోయే విలన్లకు హీరోలు బచ్చగానే కనిపిస్తారు..
-
రామోజీ రావుపై నాకు వ్యకిగతంగా ఎలాంటి కోపం లేదు
-
కొత్త కుట్రలకు పదును పెడుతోన్న పచ్చమంద..
-
రామోజీ పెన్షన్ల లెక్క తేలుద్దాం
-
రామోజీ.. మీ రాతల్లోనే వ్యత్యాసం
సాక్షి, అమరావతి : రామోజీ మెదడు మోకాల్లోకి వచ్చిందేమోనన్న సందేహాలను ఈనాడు ప్రచురించే కథనాలు బలపరుస్తున్నాయి. పొదుపు సంఘాల రుణాలకు కొన్ని జిల్లాల్లో ఒక విధంగా.. మరికొన్ని జిల్లాల్లో మరో విధంగా వ్యత్యాసపు వడ్డీ రేటును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అజ్ఞానపు రాతలతో సున్నా వడ్డీ రుణాలపై శుక్రవారం ‘అన్నా...సున్నా అంటే అంత భారమా?’ శీర్షికన ఒక తెలివితక్కువ కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈనాడు అజ్ఞానాన్ని చూసి బ్యాంకులు, పొదుపు సంఘాల మహిళలు నవ్విపోతారన్న స్పృహ అయినా రామోజీకి లేకుండా పోయింది. బాబు 2014 ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే బేషరతుగా పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఘోరమైన అబద్ధమాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి కూడా మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా తన హయాంలో సున్నా వడ్డీ పథకాన్ని ఆపేస్తే.. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు పెట్టిన బకాయిలన్నిటినీ బ్యాంకులకు చెల్లించి, ఆ పథకాన్ని పునరుద్ధరించారు. బాబు చేసిన మోసానికి పొదుపు సంఘాలు నీరుకారిపోయాయి. సున్నా వడ్డీ రుణాలు అందక అల్లాడిపోయాయి. బాబు చేసిన ఈ ఘోరమైన తప్పును జగన్ సరిదిద్దడంతో బ్యాంకులు ఇప్పుడు పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నాయి. ఈ నిజాలు రామోజీ మట్టిబుర్రకు తెలియక అజ్ఞానాన్ని రంగరించి, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో నాలుగు శాతమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని, మిగిలింది కేంద్రం ఇస్తోందని తన తెలివితక్కువ పాత్రికేయ అసమర్థతను బయటపెట్టుకుంది. తెలివి తక్కువ తనాన్ని బయటపెట్టుకున్న ఈనాడు... ‘ఆరు జిల్లాలకు ఏడు శాతం కేంద్రం రాయితీ’ అంటూ తమ కథనంలో ఓ ఉపశీర్షికను పెట్టి.. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోందని , అందులో ఏపీ పరిధిలో ఆరు ఉమ్మడి జిల్లాలు ఉన్నట్టు ‘ఈనాడు’ రాసుకుపోయింది. ఆ ఆరు జిల్లాల్లో మాత్రమే సంఘాలు రూ. 3 లక్షల వరకు తీసుకున్న రుణానికి అక్కడ బ్యాంకులు 11 శాతం వడ్డీకి రుణాలు ఇస్తూ, కేంద్రం ఏడు శాతం రాయితీ ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు శాతమే భరిస్తోందంటూ ఈనాడు రాసింది. వాస్తవం ఏమిటంటే..2022 జూలై 20న ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏడు శాతం వడ్డీకే పొదుపు సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణాలపై కేంద్రం ఏడు శాతం వడ్డీ రాయితీ ఇస్తుందన్నదే శుద్ద తప్పు. ఆ ఏడు శాతం వడ్డీ మొత్తాన్ని ఇప్పటి ప్రభుత్వమే భరిస్తోంది. ఈనాడు మరో పెద్ద శుద్ధ తప్పు రాసింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఒకలా, మరో ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇంకోలా వడ్డీ రేటుకు పొదుపు సంఘాలకు రుణాలిస్తోందని రాసింది. అలాంటి వ్యత్యాసం లేనేలేదు. ఇప్పుడు.. బ్యాంకులే మహిళలను బతిమిలాడి రుణాలిచ్చే స్థితి.. అప్పట్లో చంద్రబాబు డ్వాక్రా రుణామాఫీ హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయని కారణంగా రాష్ట్రంలో మొత్తం పొదుపు సంఘాల్లో 18.6 శాతం సంఘాలు అంటే ప్రతి ఐదులో ఒక సంఘం బాబు మాట నమ్మి తమ రుణాలు చెల్లించకపోవడంతో వాళ్లందరూ బ్యాంకుల ఎగవేతదారులుగా ముద్ర వేయించుకున్నారు. ఇప్పుడు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 2019 ఎన్నికల నాటికి ఉన్న అప్పు మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లించడం వంటి కారణాలతో ఇప్పుడు మహిళలు 99.83 శాతం మంది అంటే దాదాపు అందరూ ఎప్పటికప్పుడు తమ కిస్తీలను చెల్లిస్తున్నారు. ఈ చెల్లింపులతో బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలపై నమ్మకాన్ని పెంచుకున్నాయి. ఇప్పుడు ఎంత కావాలంటే అంత రుణాలు బ్యాంకులు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. 2019 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు ఐదేళ్ల కాలంలో ఏకంగా 1.73 లక్షల కోట్ల మొత్తాన్ని బ్యాంకులు పొదుపు సంఘాలకు రుణాలుగా ఇచ్చాయంటే రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల వద్ద ఎంత పరపతి పెరిగిందో అర్ధమవుతుంది. బాబు ప్రభుత్వంలో కేవలం ఒక్కో సంఘానికి గరిష్ఠంగా రూ. 10 లక్షల చొప్పున మాత్రమే బ్యాంకు రుణాలు ఇవ్వగా, ఇటీవల ఆర్బీఐ పొదుపు సంఘాలకు గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు పరిమితిని పెంచడంతో చాలా సంఘాలు ఇప్పుడు రూ. 20 లక్షల చొప్పున రుణాలు పొందుతున్నాయి. చంద్రబాబు చేసిన మోసం ఈ ప్రభుత్వానికి అంటగట్టే యత్నం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాల రుణాలపై మొదట పావలా వడ్డీ పథకం అమలు చేయగా, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే సున్నా వడ్డీ అమలులోకి వచ్చింది. విభజన అనంతరం.. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఐదేళ్ల కాలంలో ఒక రూపాయినైనా మాఫీ చేయకుండా రాష్ట్రంలో పొదుపుసంఘాల మహిళలందరినీ మోసం చేసిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకానికీ మంగళం పాడేశారు. 2016 జూలై తర్వాత రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీలో ఒక్క రూపాయి అయినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లించలేదు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు గత ఐదేళ్లుగా ఏటా ఠంచన్‌గా ఆర్థిక సంవత్సరం ముగియగానే ఆ ఏడాది వడ్డీ డబ్బును ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లిస్తూ వస్తోంది. గత నాలుగేళ్లల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వారి రుణాలపై వడ్డీ రూ. 4969.05 కోట్లను ఇప్పటికే ఆయా మహిళలకు చెల్లించింది. 2023–24 సంవత్సర వడ్డీని ఇటీవల ముగిసిన మార్చి నెలాఖరు తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. వాస్తవం ఇది...దీనికి భిన్నంగా చంద్రబాబును వెనకేసుకొచ్చే రాతలు రాసింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి ఆపేసిన సున్నా వడ్డీని గొప్పగా చిత్రీకరిస్తూ.. అవన్నీ బకాయిలుగా పేర్కొంది. అప్పటి ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించలేదని , ఇదంతా ‘జగన్ మోహన్‌రెడ్డి నయవంచన’ అంటూ ఈనాడు వక్రీకరించింది. వరుసగా రెండన్నరేళ్ల పాటు పథకానికి నిధులు ఇవ్వకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆపేస్తే వాటిని బకాయిలు ఎలా అంటారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
సీఎం జగన్ హత్యకు పెద్ద కుట్ర.. ‘ఎల్లో బ్యాచ్’పై అనుమానాలెన్నో!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం జరిగినప్పుడు తెలుగుదేశం స్పందన, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పిచ్చి రాతలు, నిందితులను పోలీసులు ట్రేస్ చేయడంతో టీడీపీకానీ, వారి మీడియా కానీ మాటలు మార్చిన వైనం చూస్తే కచ్చితంగా ఇందులో ఏదో పెద్ద కుట్రే ఉందన్న అనుమానం వస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అంతా ఒక మాట మీద ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటిని ప్రోత్సహించే విధంగా మాట్లాడరాదు. నిందితులకు మద్దతుగా సానుభూతి వచనాలు చెప్పడానికి యత్నించకూడదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక పదునైన రాయి ద్వారా హత్యాయత్నం నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నిటిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఎక్కువగా కంగారు పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఖండన తప్ప ఇతరత్రా స్పందించనవసరం లేని వాటిపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తొలుత ఖండన చేసినట్లు కనిపించినా, ఆ తర్వాత నాటకం అంటూ ఆరోపించడం ఆరంభించారు. కానీ పోలీసులు కచ్చితంగా ఇది హత్యాయత్నమేనని తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఈ ఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని అజిత్ సింగ్ నగర్ వద్ద జరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ట్రాక్ రికార్డు అంత సవ్యంగా లేదు. ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. దానికి తగినట్లే ఆయన అనుచరులే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఇప్పుడు పోలీసుల రిమాండ్‌లోని అంశాలను బట్టి అర్థం అవుతుంది. ఈ రిపోర్టులో ఇంకా కుట్రదారులదాకా వెళ్లలేదు కానీ, భవిష్యత్తులో ఈ కేసులో కుట్రకు పాల్పడింది ఎవరు అన్న దర్యాప్తు జరుగుతుంది. అప్పుడు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుతానికి ఒక నిందితుడు వేముల సతీష్‌ను పోలీసులు పట్టుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. అజిత్ సింగ్ నగర్ వద్ద ఒక స్కూల్‌కు, ఒక దేవాలయానికి మధ్య ఉన్న చెట్ల వద్ద ఎవరికి కనబడకుండా ఈ దాడి చేశారు. పొరపాటున ఆ రాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కంటికి తగిలి ఉంటే ఏమిటి పరిస్థితి! అంతేకాదు, నవరగంత వద్ద ఆ పదునైన రాయి తగిలి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేది. అంత పెద్ద గాయం కంటిపైన తగిలితే చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా అది కేవలం గులకరాయి దాడిగా అభివర్ణించడం నీచంగా ఉంది. పవన్ కల్యాణ్ వంటి రాజకీయ అజ్ఞాని ముఖ్యమంత్రికి వేసిన దండలో వచ్చిన రాయి కావచ్చని పిచ్చి వాదన తెచ్చారు. లోకేష్ వంటి పరిణితిలేని వ్యక్తి ఈ రాయిని తాడేపల్లి పాలెస్ నుంచి వచ్చిందని అహంకారపూరిత, కనీసం ఇంగితం లేని వ్యాఖ్య చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా తొలుత అయితే ఇదంతా పోలీసుల వైఫల్యంగా తేల్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి విసురుతున్నప్పుడు పోలీసులు ఏమి చేస్తున్నారని, వారు ఎందుకు ఆపలేకపోయారని నిలదీస్తూ వార్తలు రాశారు. అప్పటికి వీరికి ఒక నమ్మకం ఉండి ఉండాలి. ఈ రాయి విసిరిన వ్యక్తులను విజయవాడ పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని భావించి ఉండాలి. అందుకే అంత ధైర్యంగా పోలీసులదే వైఫల్యం అన్నట్లు ప్రొజెక్టు చేసే యత్నం చేశారు. చంద్రబాబు తన సహజ శైలిలో దీనిపై కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడి తన లక్షణాన్ని మరోసారి బహిర్గతం చేసుకున్నారు. ఇక్కడ కీలకమైన టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. తొలుత ఈ దాడి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కలిసి ఆడిన డ్రామా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అనుమానితులను, నిందితులను పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయన్న సమాచారం రాగానే మాట మార్చి, అదేదో కావాలని చేసింది కాకపోవచ్చన్నట్లు చెప్పారు. ఆ తర్వాత నిందితుడు అన్నా క్యాంటిన్ ఎత్తివేశారని కోపంతో, తన తల్లికి రోడ్‌షోకు వచ్చినందుకు ఇస్తానన్న 200 రూపాయలు ఇవ్వలేదన్న కోపంతో రాయి విసిరి ఉండవచ్చని బొండా అన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ కేసులో కనుక తనను కూడా ఇరికించాలని చూస్తే జూన్ నాలుగు తర్వాత ఆ పోలీసుల సంగతి చూస్తానని బెదిరించారు. ఇది అచ్చం చంద్రబాబు, లోకేష్‌ల నుంచి తర్ఫీదు పొందినట్లే మాట్లాడారు. వారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా, అధికారులను ,ముఖ్యంగా పోలీసులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ స్వరం మార్చింది. బీసీ వర్గానికి చెందినవారిని కేసులో పెడతారా అని అచ్చెన్నాయుడు విమర్శించారు. హత్యాయత్నం ఘటనలలో కులం చూసి కేసు పెట్టాలని కొత్త రాజ్యాంగాన్ని వీరు చెబుతున్నారు. అలాగైతే చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్ దాడి జరిగినప్పుడు కూడా కులం చూసే కేసులు పెట్టారా? ఇక చంద్రబాబు అయితే ఈ కేసులో బొండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు కేసు దర్యాప్తే ఒక దశకు రాకుండానే చంద్రబాబుకు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? అంటే ఈ హత్యాయత్నం ఎలా జరిగింది? అందులో ఎవరు ఉన్నారు? ఎవరికి సంబంధించినవారో ముందే తెలుసునని అనుకోవాలి. పోలీసు రిమాండ్ రిపోర్టులో వేముల సతీష్ అనే వ్యక్తి పదునైన రాయి విసిరితే, అందుకు ప్రేరేపించింది మరో వ్యక్తి అని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలపలేదు. ఈ రెండో నిందితుడు బొండా ఉమా అనుచరులలో ఒక ముఖ్యుడన్న ప్రచారం జరుగుతోంది. లేదా బొండా తన పేరును నిందితులు చెబుతారన్న భయం ఏమైనా ఏర్పడిందా?ఇప్పటికే సతీష్ తాను నేరానికి పాల్పడ్డానని అంగీకరించారు. ఆ తర్వాత అందుకు ఎవరు ప్రోద్బలం చేసింది కూడా చెప్పి ఉంటారు. తీగ లాగితే డొంక కదులుతుందన్న భయం వీరికి పట్టుకుంది. దాంతో వెంటనే పోలీసులను విమర్శించడం ఆరంభించారు. అందుకు ఈనాడు, జ్యోతి వంటి అనైతికంగా మారిన మీడియాను వాడుకున్నారు. ఒక ముఖ్యమంత్రిపై అంత దాడి జరిగితే, సానుభూతి చూపకపోతే మానే, ఏకంగా నిందితులకు మద్దతు ఇచ్చేలా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వారు మాట్లాడుతున్నారు. నిజానికి టీడీపీలో ఎవరికి సంబంధం లేకపోతే, అసలు ఈ అంశం గురించి వారు ప్రస్తావించవలసిన పనే లేదు. కానీ అందుకు భిన్నంగా అతిగా వ్యవహరించి తెలుగుదేశం నేతలు వారికివారే ఆత్మరక్షణలో పడ్డారనిపిస్తుంది. ఈనాడు మీడియా నిందితులు ఉన్న వడ్డెర కాలనీకి వెళ్లి నిందితుల కుటుంబాలు చాలా బాధలో ఉన్నట్లు, వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నట్లు వార్తలు ప్రచారం చేశారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు వైఫల్యం అని రాసిన ఈ మీడియా ఇప్పుడు పోలీసులు నిందితులను పట్టుకోవడాన్ని తప్పు పడుతోంది. నిందితుడు రాళ్ళు విసరడంలో నేర్పరి అయి ఉండాలి. లేకుంటే ముఖ్యమంత్రి కంటిపై భాగానికి తగిలేలా ఎలా వేయగలుగుతారు? ఇతనికి సహకరించినవారిని కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తన పేరు ఎక్కడ వస్తుందోనని బోండా ఉమ అజ్ఞాతంలోకి వెళ్లినటట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలీసులను బెదిరించారు. నిందితుడు సతీష్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యంగా అతనికి అనుకూలంగా వాదించడానికి లాయర్లు వచ్చారు. రోజుకు 250 రూపాయలు సంపాదించుకునే కుటుంబానికి ఇంత పెద్ద లాయర్లను పెట్టుకునే శక్తి ఎక్కడ నుంచి వస్తుందన్నది ప్రశ్న. ఇక్కడ కూడా సరిగ్గా చంద్రబాబు పై వచ్చిన కేసుల్లో వాదించిన రీతిలోనే ఈ లాయర్లు వాదన చేసినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబుకు ఐటి నోటీసులు వస్తే, ఫలానా ఆఫీస్‌కు జ్యురిస్ డిక్షన్ లేదని సమాధానం ఇచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదించారు. ఇప్పుడు వేముల సతీష్ మైనర్ అని చెప్పడానికి ఆయన లాయర్లు యత్నించారు. కానీ పోలీసులు పకడ్బందిగా అతనికి పందొమ్మిదేళ్లని నిరూపించారు. తదుపరి సతీష్ రాయి వేయలేదన్న వాదనకు వెళ్లారు. సీఎంకు వేసిన దండ కర్ర గీసుకుని ఉండవచ్చని వాదించినట్లు అతని తరపు లాయర్ చెప్పారు. జగన్మోహన్రెడ్డితో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా గాయం అయిన సంగతిని విస్మరించారేమో తెలియదు. దండ కర్ర గీసుకుంటే ఒకరికే గాయం అవుతుంది కానీ, ఇద్దరికి అవ్వదు కదా! ఈ లాజిక్ మిస్ అయి మాట్లాడినట్లు అనిపిస్తుంది. మరో సంగతి చెప్పాలి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకుడు అప్రూవర్‌గా మారడంతోనే అతనికి బెయిల్ వచ్చేసింది. కానీ ఆ కేసు కుట్రదారులన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి మాత్రం నెలల తరబడి బెయిల్ రావడం లేదు. ఈ కేసుతో ముఖ్యమంత్రి పై జరిగిన హత్యాయత్నం కేసును పోల్చి చూస్తే, రాయి విసిరిన వ్యక్తి సంగతి ఎలా ఉన్నా, వెనుక ఉన్న కుట్రదారులకు కీలక పాత్ర ఉంటుందన్నమాట. కుట్రదారులను పట్టుకుని జైలులో పెట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రముఖ నేతలపై జరిగిన హత్యాయత్నం, దాడుల కేసుల్లో నిందితుల తరపున వాదించడానికి లాయర్లు సుముఖంగా ఉండేవారు కారు. కానీ ఇక్కడ సతీష్ రిమాండ్ సమయంలోనే లాయర్లు రావడం విశేషం. మామూలుగా అయితే పోలీసులు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగానే రిపోర్టు చూసుకుని న్యాయమూర్తి రిమాండ్‌కు పంపిస్తుంటారు. కానీ అతని తరపు లాయర్లు రావడంతో వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామం చూసిన తర్వాత, అతని ఆర్దిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, నిందితుడిని కాపాడడానికి పెద్దప్రయత్నమే జరుగుతోందన్న అనుమానం వస్తోంది. దీనికి కారణం ఆ నిందితుడు విచారణలో తమ పేర్లు చెబితే అది సమస్య అవుతుందన్న భయం కావచ్చు. వీటన్నిటిని చూసిన తర్వాత తెలుగుదేశం నేతలుకానీ, ఎల్లో మీడియా కానీ వ్యవహరించిన వైనం అనుమానాస్పదంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. వారు అతిగా స్పందించడం, గులకరాయి దాడి అని పనికిమాలిన రాతలు రాయడం, నిందితుడిని రక్షించే యత్నం చేయడం ఇవన్నీ గుమ్మడి కాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు కనిపించడం లేదూ! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
దళితులపై పెత్తందారీ తోడేలు దొంగ ప్రేమ
రామోజీరావు: వేలాది దళిత కుటుంబాలను రోడ్డు మీదకు లాగి వారి ఆశలను చిదిమేసి హైదరాబాద్‌లో ఫిలిం సిటీని నిర్మించిన పెత్తందారీ కర్కోటకుడు. ఫిలిం సిటీ కోసం దళితుల నుంచి వందలాది ఎకరాల అసైన్డ్, భూదాన్ భూములను నిర్ధాక్షిణ్యంగా లాక్కున్న కబ్జాకోరు. గ్రామాలకు వెళ్లే రోడ్లను ఫిలిం సిటీలో కలిపేసుకుని గోడ గట్టి, ఆ గ్రామాల ప్రజలను నానా తిప్పలు పెట్టి, వారి ఉసురు తీసిన రక్త పిపాసి. వేలాది దళిత కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసి రాజసౌధాలను నిర్మించుకుని రాజులా చలామణి అవుతున్న ఆధునిక నరకాసురుడు. ఇప్పుడు వారిపై తనకు అమిత ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న తోడేలు. చంద్రబాబు: రాష్ట్రంలో పచ్చ ముఠాకు నాయకుడు. దళితులంటే అస్సలు పడని ఓ పెత్తందారు. ఆయన హయాంలో దళితులపై లెక్కలేనని దాడులు, అవమానాలు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ వ్యాఖ్యానించిన దళిత ద్వేషి. ఈయనే కాదు.. ఈయన వెంట ఉన్న నేతలదీ అదే తీరు. దళితులకు రాజకీయాలెందుకురా అంటూ హుంకరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దళితుల దగ్గర కంపు కొడుతుందంటూ ఈసడించుకున్న ఆదినారాయణ రెడ్డి. వీళ్లే కాదు.. టీడీపీలో అనేక మంది నేతలది ఇదే తీరు. వీళ్లంతా రామోజీ నమ్మిన బంటు చంద్రబాబు బ్యాచ్. అందుకే దళితులపై వీళ్లెంతగా వీరంగం వేసిన రామోజీకి కనిపించదు, వినిపించదు. సీఎం వైఎస్ జగన్: నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ దళితులను కుటుంబ సభ్యుల్లా అక్కున చేర్చుకున్న నాయకుడు. వారిని రాజకీయంగా, అన్ని రంగాల్లో ఉన్నత స్థితి కల్పిస్తూ, వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, ఎవరినీ పైసా అడగాల్సిన పని లేకుండా ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి. వారిని సాధికారత వైపు నడిపించి, సమాజంలో గౌరవం కల్పించి, తలెత్తుకొని తిరిగేలా చేసిన నేత. దళితులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టే ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను ఇటీవల ఆ వర్గానికి చెందిన నేత నందిగం సురేష్ తో విడుదల చేయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితుల మనసు గెల్చుకున్న దళిత బంధువు. – సాక్షి, అమరావతి రామోజీ కపట నాటకం తానే స్వయంగా దళితుల భూములు లాక్కొని, వారి కంటి నుంచి రక్తం కారేలా ఏడిపించిన రామోజీ.. ఇప్పుడు దళితులపై ప్రేమ అంటూ కపట నాటకమాడుతున్నారు. జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు అంటిందంటూ ఈనాడులో రక్తపు రాతలు రాసి అక్కసును బయటపెట్టుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవం ఏ పాటిదో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది తమ ప్రభుత్వమని ప్రతి దళితుడూ చెప్పుకునే రాష్ట్రంలో అనుకోకుండా జరిగిన ఒకట్రెండు ఘటనలను బూచిగా చూపి దళితుల నెత్తురు జగన్ చేతులకు అంటిందని నిస్సిగ్గుగా రాయడం ఆకాశంపై ఉమ్మి వేయడం లాంటి ప్రయత్నమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దళితులంటే అంటరాని వారనే ఆదిమ సమాజపు భావజాలంతో వారిని అడుగడుగునా అవమానిస్తున్న చంద్రబాబు బ్యాచ్‌కు మద్దతు పలికిన రామోజీరావు.. దళితులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై బురద జల్లేలా రాసిన రాతలను అసలు ఎవరైనా నమ్ముతారా? ఈ లాజిక్ రామోజీ బుర్రకు అందదు. ఎందుకంటే.. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలన్నదే ఆయన ఏకైక అజెండా. అందుకే తప్పుడు రాతలతో ప్రజలను పక్కదోవ పట్టంచాలని ప్రయత్నిస్తున్నారు. బాబు హయాంలో దారుణ దమనకాండ చంద్రబాబు హయాంలో దళితులపై దారుణమైన దమనకాండ జరిగినా అసలు ఏమీ జరగనట్లు దొంగ నిద్ర నటించాడు రామోజీ. సాక్షాత్తూ బాబు సీఎంగా ఉన్నప్పుడే వారి పుట్టుకనే అవమానç³రిచేలా అన్యాయమైన వ్యాఖ్యలు చేసినా కిమ్మనలేదు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని బాబు అన్నప్పుడు దళిత సమాజం మొత్తం భగ్గుమంది. అప్పుడు రామోజీ వంత పలికింది దళితులకు కాదు.. బాబుకు. బాబు మంత్రివర్గ సభ్యుడు ఆదినారాయణరెడ్డి దళితులను అవహేళన చేసినప్పుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీచంగా తూలనాడినా రామోజీకి దళితులపై ప్రేమ పుట్టలేదు. 2017 డిసెంబర్లో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచరులు ఓ దళిత మహిళపై దాడి చేసి, ఆమె బట్టలు చింపి పొలం నుంచి ఈడ్చిపడేసినా పట్టించుకునే నాథుడే లేడు. బాబు హయాంలో దళితులు నిత్యం భయంగా బతికే పరిస్థితులు ఉండేవి. తమపై దాడులు జరిగితే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యేవి కాదు. కేసు పెట్టడానికి దళితులు పోరాడాల్సివచ్చేది. బాబు హయాంలో ఎస్సీలపై నేరాల సంఖ్య పెరిగినట్లు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలే చెబుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు తగ్గిపోయాయి. దళితుల భద్రతకు పెద్దపీట వేయడంతోపాటు దళిత మహిళనే హోంమంత్రిగా చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. అలాంటి జగన్ చేతులు దళితుల రక్తం అంటిందంటూ అడ్డగోలు రాతలతో రామోజీ ఆక్రోశం వెనుక బాబును పీఠం ఎక్కించాలన్న తపన ఉందని మేధావులు అంటున్నారు. దళితుల గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన దారుణ వ్యాఖ్యలు ♦ ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? అందరూ సంపన్న వర్గాల్లోనే పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలు ఏలవచ్చనుకుంటారు. కులాలను బట్టి ఓట్లు రావు. వాటితో ఎవడూ గెలవలేడు. మంద కృష్ణ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయాడు. - సీఎం హోదాలో 2016 ఫిబ్రవరి 9న చంద్రబాబు ♦ దళితులు శుభ్రంగా ఉండరు. వారి దగ్గర వాసన వస్తుంది. వాళ్లు సరిగా చదవరు. అయినా ఎస్పీలు అవుతారు. రిజర్వేషన్లు పదేళ్ల కోసం ఇస్తే 70 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పట్టాలిస్తే వాటిని నిలుపుకోరు. – 2017లో చంద్రబాబు మంత్రివర్గం సభ్యుడిగా ఉన్నప్పుడు ఆదినారాయణరెడ్డి ♦రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా పిచ్చి –––––––––––––––– – 2019 ఫిబ్రవరి 20న టీడీపీకి చెందిన అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుడిపై దాడి చేసేది టీడీపీ నాయకులే రాష్ట్రంలో దాడులు చేసేది టీడీపీ నాయకులే. వారు అధికారంలో ఉన్నా, లేకపోయినా దళితులే లక్ష్యంగా దాడులు చేస్తుంటారు. దళిత నాయకుడినైన నాపై అంబేడ్కర్ జయంతి రోజున టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర తన అనుచరులతో దాడికి దిగారు. మా ఇంటికి వచ్చి తలుపులు పగులగొట్టి వీరంగం సృష్టించారు. ఇవి ఈనాడు రామోజీరావుకు కనిపించవు. దళిత ద్రోహి చంద్రబాబే. ఈ రోజు ఆయనకు మద్దతుగా ఈనాడులో తప్పుడు కథనాలు ఇవ్వడం దారుణం. టీడీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు రాయాలంటే పేపర్లు చాలవు. – అలజంగి జోగారావు, ఎమ్మెల్యే, పార్వతీపురం ఎవరు మేలు చేశారో తెలుసు దళితులకు సీఎం జగన్ పాలనలోనే మేలు జరిగింది. దళితులను అక్కున చేర్చుకొని, ఉన్నత స్థితికి చేర్చింది సీఎం వైఎస్ జగన్ మాత్రమే. ఎన్నికల వేళ ఈనాడు అధినేత రామోజీరావుకు మతి భ్రమించింది. ఎస్సీ సామాజిక వర్గం ఓట్ల కోసం తప్పుడు కథనాలు వండివార్చితే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఓటమి భయంతో నిత్యం కట్టు కథలు అల్లుతున్నారు. గత ఎన్నికల్లోనూ వారిది ఇదే ధోరణి. ప్రజలు ఎప్పుడూ వాస్తవాలనే స్వీకరిస్తారు. ప్రజలంతా బాబు అండ్‌కో ను ఛీ కొడుతుంటే ఎలాగైనా బాబును గద్దెనెక్కించాలని, తద్వారా కేసుల నుంచి తప్పించుకోవాలని రామోజీ తాపత్రయపడుతున్నారు. – రేగాన శ్రీనివాసరావు, టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చంద్రబాబే దళితుల ద్రోహి దళితులంటే బాబుకు గిట్టదు. కేవలం ఓట్లు దండుకోవడానికే మాత్రమే బాబుకు ఎస్సీలు కావాలి. తర్వాత తన సామాజికవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఎస్సీలపై ఆయన చేసిన దాడులన్నీ చెప్పుకుంటూ పోతే పుస్తకం రాయొచ్చు. ఎవరైనా ఎస్సీలుగా పుడతారా అని హేళన చేసింది చంద్రబాబే. ఇటీవల ఓ మైనారిటీ సమావేశంలో కూడా ఎస్సీలను చులకన చేసి మాట్లాడారు. క్రైస్తవులంతా ఎస్సీలని, అధికారంలోకి వస్తే వాళ్ల అంతు చూస్తామన్నట్లుగా బెదిరింపు ధోరణిలో వ్యవహరించారు. ఇటువంటివన్నీ పచ్చ పత్రికలు కప్పిపుచ్చి బాబును వెనకేసుకుని వస్తున్నాయి. దళితులకు సీఎం జగన్‌మాత్రమే మేలు చేస్తున్నారు. – ప్రసాద్, మాల మహానాడు అధ్యక్షుడు, చిత్తూరు పచ్చ పత్రిక విషపు రాతలు సీఎం జగన్, దళితులపై పచ్చ పత్రిక విషపు రాతలు రాసింది. సీఎం జగన్ బస్సు యాత్రకు తండోపతండాలుగా వస్తున్న వారిలో అధికంగా ఉండేది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలే. మరి ఈ పచ్చ రాతలు రాసే వాళ్లకు ఇలాంటి నిజమైన యాత్రలు కనిపించవా?. దళితులకు తీవ్ర అన్యాయం చేసింది బాబే. ఆయన దళిత ద్రోహి. గతంలో మాల, మాదిగలను విడదీసి గద్దెనెక్కిన బాబు దళిత జాతిని అవహేళనగా మాట్లాడుతూ దళిత విద్యార్థులపై కుట్ర పూరిత పాలన కొనసాగించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా బయటికి కూడా రాని విధంగా చంద్రబాబు దళిత జాతి అణచివేతకు పెద్ద కుట్ర చేశాడు. – ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రబాబే దళిత ద్రోహి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే దళిత ద్రోహి. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా దళితులపైన దాడుల కేసులు 3400 పైగా నమోదయ్యాయి. నమోదవని ఇంకా చాలా ఉన్నాయి. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు అన్న మాటలు ఇప్పటికీ మేం మర్చిపోలేదు. చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తున్నాయి. దళితులపైన టీడీపీ నేతలు, ఆ ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు ఎన్నో. లేనిపోని రాతలు రాసి జగనన్న ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే సహించేది లేదు. – మాస్టీల మంజు, ఎస్సీ నేత, ఏఎంసీ మాజీ అధ్యక్షురాలు, కంచిలి -
చంద్రబాబు ఒళ్లంతా దళితుల రక్తంతోనే తడిసింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిసిందన్న విషయం రామోజీరావు మరిచిపోతే ఎలా అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. ఆయన గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అన్నదమ్ములుగా బతుకుతున్న దళితుల్ని విడగొట్టింది బాబేనని చెప్పారు. వారిలో మనస్పర్ధలు తెచ్చి, కోర్టులకెక్కేలా చేసి, దాడులకు ఉసిగొల్పిందీ చంద్రబాబేనన్నారు. ఈ విషయాలు తెలిసి కూడా రామోజీరావుకు బాబు మంచోడులా కనిపిస్తాడన్నారు. సీఎం జగన్ పేదల పక్షాన నిలిచి, పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రతి పేద కాలనీల్లో అందరూ ఒప్పుకునే మాట అని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలు, రాజ్యాంగ సూత్రాలను ముందుకు తీసుకెళ్లిన నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరేనని చెప్పారు. దళిత బంధువైన సీఎం వైఎస్ జగన్‌పై ఈనాడు దినపత్రిక ద్వారా రామోజీ విషం కక్కారని అన్నారు. సీఎం జగన్‌ను దళితుల నుంచి దూరం చేయాలనే కుట్రకు దిగిందని, అందులో భాగంగా బాబు దళితుల ఆపద్బాంధవుడంటూ విచిత్రమైన కథనాన్ని రాసుకొచ్చిందని చెప్పారు. ఈ కథనం రాసిన ఈనాడు భయంకర కుట్రలకు వేదికగా చరిత్రలో నిలచిపోతుందన్నారు. దళితుల్ని బాబు గుర్రాలతో తొక్కిస్తే వార్త రాయలేదెందుకు అని నిలదీశారు. అసలు ఏనాడైనా బాబు దళితుల్ని మనుషుల్లా చూశారా అని ప్రశ్ని0చారు. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం బాబు సామాజికవర్గ దాషీ్టకాలేనన్నారు. కారంచేడులో ఏరులై పారింది దళితుల రక్తం కాదా? దళితుల్ని ముక్కలుగా నరికి శవాల్ని మూటగట్టిన రక్తచరిత్ర మీది కాదా బాబూ అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో దళితులకు అడుగడుగునా అవమానాలే జరిగాయని తెలిపారు. వైఎస్ కుటుంబానికి దళితులు బంధువులని, ఆత్మ బంధువులని చెప్పారు. దళితులతో వియ్యమొందిన చరిత్ర చంద్రబాబు, రామోజీ కుటుంబాలలో ఉందా అని ప్రశంసించారు. ఈనాడు పుట్టిన దగ్గర్నుంచీ గడచిన 50 ఏళ్లల్లో ఈ రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల్సిన అవసరం ఉందని వార్త రాశావా రామోజీ అని నిలదీశారు. చంద్రబాబు రక్తంలోనే దళిత వ్యతిరేకత బాబుకు దళితులంటేనే గిట్టదని జూపూడి చెప్పారు. ఆయన రక్తంలోనే ఎస్సీ, ఎస్టీలపై వ్యతిరేకత ఉందన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ సీఎం స్థానంలో కూర్చొని నోరుపారేసుకున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి నీచత్వాన్ని పక్కనబెట్టి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ పేదలకు అండగా ఉండే సీఎం జగన్‌ని విమర్శిస్తూ రాసే మాయ రాతలను ప్రజలు నమ్మరని చెప్పారు. సామాజిక న్యాయ సూత్రాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని తెలిపారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతూ, దళితవాడల్లో అభివృద్ధి ఫలాల్ని పూయిస్తూ, పేద పిల్లల చదువు ఖరీదు కాకూడదని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చి వారికి ఇంగ్లిషు మీడియం విద్యాబోధన చేయించిన సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. వైద్యం, ఆరోగ్యం విషయంలోనూ ఎన్నడూ ఊహించని విధంగా గ్రామస్థాయిలో మార్పు తెచ్చిన సీఎం జగనే అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్‌ని మరిచిపోయే దళితులు ఎవరైనా ఉంటారా అని ప్రశ్ని0చారు. రేపటి ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్సార్సీపీ గెలవబోతోందని చెప్పారు. -
Fact check: ఓటమి భయం ప్రస్ఫుటం
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం, టీడీపీ ఓటమి ఖాయమని జాతీయ చానళ్ల సర్వే ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ ...ఈనాడు రామోజీరావులో పాత్రికేయ పైశాచికత్వం పెట్రేగి పోతోంది. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో సీఎం వైఎస్ జగన్ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో రామోజీరావుకు తత్వం మెల్లగా బోధపడుతోంది. జగన్‌కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం తన తరం కాదన్న అక్కసుతో ఏకంగా పోలీసు వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేసేందుకు బరితెగించారు. ఆ కసిలో ఈనాడు పత్రికలో ‘అదే అరాచకత్వం...అదే దౌర్జన్యం’ శీర్షికన గురువారం తాజాగా విష పూరిత కథనాన్ని ప్రచురించారు. రామోజీ రాతలకు అతీతంగా అటు ఈసీ, ఇటు పోలీసు వ్యవస్థ నిబద్ధతతో తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం సానుకూల పరిణామం. కుట్ర బెడిసికొట్టినా ఖాకీలపై ఈనాడు కారుకూతలు... చంద్రబాబు, పురందేశ్వరిల భాగస్వామ్యంతో పోలీసు వ్యవస్థను తమకు గులాంగా చేసుకునే కుట్రలో భాగంగా ...రాష్ట్రంలో 20 మందికి పైగా ఐపీఎస్ అధికారులను మార్చేయాలని ఈనాడు లో కథనాలు రాశారు. రామోజీ పాచిక పారలేదు. డీఐజీ, ఐదుగురు ఎస్పీలను మాత్రమే ఎన్నికల కమిషన్ మార్చింది. వారి స్థానాల్లో తాము చెప్పిన వారినే నియమించాలన్నట్టుగా పచ్చ ముఠా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసింది. తద్భిన్నంగా నియమావళి ప్రకారం ఎన్నికల కమిషన్ ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలను నియమించడంతో రామోజీలో అహం దెబ్బతింది. దీంతో ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు లక్ష్యంగా దు్రష్పచార కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈ కథనంతో చిర్రెత్తిన పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఏకంగా 19 మంది ఐపీఎస్ అధికారులు టీడీపీ, జనసేన, బీజేపీ, ఈనాడులకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఈనాడు తీరుపై మండిపడింది. అంతటితో బుద్ధి రాని రామోజీ కుక్కతోక వంకరన్నట్లు మరోసారి పోలీసు వ్యవస్థపై విధ్వేషం వెళ్లగక్కారు. ఈనాడులో వచి్చన ఆదేశాలనే ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పోలీసులు పాటించాలన్నట్టుగా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగజారారు. టీడీపీ దౌర్జన్యాలు, దాడులను మసిపూసి మారేడు కాయ చేస్తూ వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు యతి్నంచారు. వైఎస్సార్సీపీలో ఫలానా నేతలపై ఫలానా సెక్షన్ల కింద కేసులు పెట్టండంటూ పోలీసులకు రామోజీ తన రాతల హుకుం జారీ చేశారు. పోలీసు అధికారుల బెదిరింపునకూ పన్నాగం తాజాగా ఎన్నికల విధుల్లో క్రియాశీలంగా ఉండే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్న పచ్చ కుట్రలో రామోజీ భాగస్వామిగా మారారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌ ర్జన్యాలకు పాల్పడ్డ ఉదంతాలను ఈనాడు వక్రీకరిస్తూ తప్పుడు కథనం ప్రచురించింది. మాచర్ల, గన్నవరం, అద్దంకి, ఉరవకొండ, గుడివాడ తదితర నియోజకవర్గాల్లో గత వారం పదిరోజుల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జ న్యాలకు పాల్పడ్డారు. తాజాగా బుధవారం రాత్రి ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్సీపీ అ భ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఆయన కుటుంబ స భ్యులనే అడ్డుకున్నారు. అసలు ఎన్నికల ప్రచారం చే యడానికి వీల్లేదని గలాభా సృష్టించారు. ఈ ఘటనల పై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారు కఠిన చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచా రా న్ని అడ్డుకున్నా పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూ స్తుండాలన్నట్టుగా ఈనాడు వితండవాదం చేస్తోంది. ఈసీనే శాసిస్తున్న రామోజీ రాతలు... ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఈసీకే పరోక్షంగా తన రాతలతో ఆదేశాలు జారీ చేస్తుండటం రామోజీరావు బరితెగింపునకు నిదర్శనం. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏకంగా ఎస్పీలను మారిస్తే సరిపోతుందా... మొత్తం డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను మార్చేయాలని ఈసీకే రాతల హుకుం జారీ చేశారు. అందర్నీ మారుస్తామన్నారు..ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈసీనే ఈనాడు నిలదీయడాన్ని ప్రజాస్వామ్యవాదులే ఛీత్కరించుకుంటున్నారు. ఈసీ కొత్తగా నియమించిన పల్నాడు ఎస్పీపైనా ఈనాడు విషం కక్కింది. అయినా రామోజీ రాతలకు అతీతంగా ఈసీ తన పని తాను పక్షపాత రహితంగా చేసుకుపోతోంది. -
Fact check: అబద్ధాలు రచించెన్
సాక్షి, అమరావతి: అబద్ధం.. కుళ్లు.. భయం.. వీటికి ప్యాంటూ చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం రామోజీ మాదిరే ఉంటాయేమో! జగన్ పరిపాలనలో అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పింఛన్లు అందుకుంటూ ఆనందంగా ఉంటే రామోజీకి కంపరంగా ఉంది. ఈ వర్గాల్లో జగన్‌కు పెరుగుతున్న పరపతిని చూసి తన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. అందుకే వాస్తవాలకు మసిపూసి ‘నవరత్నాలు – నయవంచన’ అంటూ మరో అబద్ధపు కథనాన్ని అచ్చేసేశారు. ఈ నిస్సిగ్గు పాత్రికేయాన్ని చూసి అక్షరాలు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనేమో...!! పింఛనుదారుల సంఖ్య పెరిగింది జగన్ హయాంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా పింఛన్లు అందుకున్నవారే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. అప్పట్లో 43.11 లక్షల మంది పింఛనుదారులున్నారని లెక్కలు చెబుతున్నా 39 లక్షల మందికే చెల్లింపులు జరిపేది. నాలుగు నుంచి 5 లక్షల మందికి ఎగ్గొట్టేది. రామోజీ దగ్గర ఈ లెక్కలు లేవో.. లేక కావాలనే విస్మరించారో. ఇంటికో పింఛను విధానం బాబుదే కుటుంబానికి ఒక్కటే పింఛను విధానం జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టు ఈనాడు ఓ అబద్ధాన్ని రాసింది. ఈ విధానం ప్రవేశపెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ 18న ఆర్సీ నంబరు 1053 పేరిట జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఐదేళ్ల పాటు దీన్ని అమలు చేసింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఇంటిలో ఇద్దరు దివ్యాంగులున్నా రెండో పింఛను ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. మరో వైపు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛన్ అందిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కొత్తగా తీసుకొచి్చన ఈ మేలును బహుశా రామోజీ మరిచిపోయి ఉంటారు. కోతల్లేవు పింఛనుదారులలో మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి పింఛన్లను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్టు ఈనాడు ఇంకో అబద్ధం ప్రచురించింది. సాధారణంగా పింఛనుదారుల్లో 0.5 శాతం మరణాలు నమోదవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.8 శాతం ఉండొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2015 మేలో 0.8 శాతం మేర అంటే 36,406 మరణాలు నమోదు కావడంతో ఆ నెలలో పింఛన్లకు కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్‌లో 0.6 శాతం మేర అంటే 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వాటిని తొలగించింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వాస్తవ మరణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ మేరకే తొలగింపులు ఉంటున్నాయి. గత ఆరు నెలల గణాంకాలు తీసుకుంటే ఏ నెలలోనూ ఈ సంఖ్య 20 వేలకు మించలేదు. పింఛను విధానంలో మరెన్నో మార్పులు ► గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ పొ ద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తోంది. ► పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనాన్ని జగన్ కూకటివేళ్లతో పెకలించారు. కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో అందజేస్తున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబి్ధదారుల జాబితాలు ప్రదర్శించి, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేస్తున్నారు. ► గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. ఈ ప్రభుత్వంలో లబ్ధి రూ.1,91,000. అంటే రూ.1,32,500 అదనం. ► పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ► 2014–19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. -
‘కోతల’ రాతలు ఇంకెన్నాళ్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో అనంతపురానికి మైక్రోసాఫ్ట్ వచ్చేసింది. హైపర్‌లూప్ టెక్నాలజీతో గంటలో అమరావతి నుంచి విశాఖకు వెళ్లిపోవచ్చు. దుబాయ్‌కు చెందిన బీఆర్‌షెట్టి అమరావతిలో నిర్మించిన ఆసుపత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుతోంది... ‘ఇవన్నీ గ్రాఫిక్స్ రా’ అని ప్రజలు ఎప్పుడో తేల్చేసినా ఆయన కూలీ రామోజీ మాత్రం ఆ మాయాజాలం నుంచి బయటకు రావడం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి సర్కార్‌లో విదేశీ పెట్టుబడులు వాస్తవ రూపంలో కనిపిస్తున్నా కళ్లకు గంతలు కట్టేసుకుని రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాలేదంటూ కొయ్ రాజా కొయ్ శీర్షికతో ఓ పుచ్చు కథనాన్ని ప్రచురించారు. కోవిడ్ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థలు తమ వ్యాపార విస్తరణ కార్యక్రమాలను తగ్గించుకున్నప్పటికీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోనే కాదు వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో రూ.35,000 కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్ అచ్యుపుతాపురం సెజ్‌లో సుమారు రూ.1929 కోట్లతో భారీ టైర్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించింది. జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద రూ.4,640 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. యూరప్‌కు చెందిన పెట్రేగ్యాస్ కృష్ణపట్నం వద్ద రూ.600 కోట్లతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లోటింగ్ ఎల్ఎన్జీ టెర్మినల్ వారం రోజుల క్రితమే వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది. జపాన్‌కు చెందిన డైకిన్ రూ.2,600 కోట్లతో ఏసీ తయారీ యూనిట్‌ను తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ప్రారంభించింది. టోరే ఫార్మా అక్కడే రూ.1,000 కోట్ల పెట్టుబడులను వాస్తవరూపంలో తెచ్చింది. క్యాడ్బరీస్ చాక్లెట్స్ మాండలీజ్ రూ.1,600 కోట్లతో భారీగా విస్తరిస్తోంది. అదిదాస్ బ్రాండ్‌తో తయారయ్యే పాదరక్షల తయారీ సంస్థ హిల్‌టాప్ సెజ్ పేరుతో రూ.800 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. దావోస్‌లో పాలకూర పప్పు.. వాస్తవాలు ఇలా కళ్లకు కనబడుతుంటే.. విదేశీ పెట్టుబడుల కోసం రాష్ట్రం చాలా సమావేశాలు, డిప్లొమాటిక్ ఔట్‌రీచ్‌లు ఏర్పాటు చేసింది కానీ ఏం సాధించలేదంటూ ఈనాడు రాసేసింది. గత ప్రభుత్వంలో దావోస్ వెళ్లిన చంద్రబాబు పాలకూర పప్పు... బెండకాయ వేపుడు ప్రసంగం ఇప్పటికీ అంతర్జాతీయంగా కామెడీ పీస్‌గా ఉంది. ఈ నెలలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆయనను ఏపీకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇక్కడ వనరులు అవకాశాలను వివరిస్తూ వార్తలు రాయాల్సింది పోయి.. నీచ రాజకీయాల బాబు కోసం స్థానిక యువత నోట్లో మట్టి కొట్టే విధంగా విషపురాతలు రాయడం తగునా? అని యువత ప్రశ్నిస్తోంది. -
Fact Check: రుచీపచీ లేని రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారాయి. అత్యాధునిక వైద్యం అందుతోంది. గ్రామాలు, వార్డుల చెంతకు వైద్యం చేరింది. డాక్టర్లే ప్రజల గుమ్మం వద్దకు వచ్చి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. మందులకు కొదవ లేదు. విలేజ్, వార్డు క్లినిక్‌లు ఏర్పడ్డాయి. ఇక ప్రధానాసుపత్రుల్లో సేవలు కార్పొరేట్ స్థాయిని తలపిస్తున్నాయి. గడచిన ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో నాడు–నేడు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బలోపేతం, డైట్ చార్జీల పెంపు ఇలా అనేక సంస్కరణలతో ప్రభుత్వాస్పత్రులు అభివృద్ధి చెందాయి. ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అభిమానం వెల్లువెత్తుతోంది. ఇది రుచించని ఈనాడు రామోజికి ఆసుపత్రుల్లో అందిస్తున్న రుచికరమైన భోజనం నచ్చలేదు. తన బాబు పాలనలో రుచీపచీలేకుండా వండినా, ఆ ఐదేళ్లలో రోగుల మెనూ ఛార్జీ రూ.40 మించకపోయినా, మూడుపూటలా భోజనం అందించకపోయినా ఈ ‘పచ్చ’రోగికి వెచ్చగా ఉంది. జగన్ పాలనలో మెనూ చార్జి రూ.80కి పెంచి రుచితో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నా రామోజీకి చప్పగానే ఉంది. అందుకే ‘బటన్ల బడాయి.. రోగుల బువ్వకూ బకాయి’ అంటూ రుచీపచీలేని ఓ కథనాన్ని వండేశారు. బాబు పాలనలో ఇదీ గతీ 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో రోగికి రూ.40తో భోజనం పెట్టేది. ఇది కూడా 2011లో నిర్దేశించిన ఖర్చు. ఇంత తక్కువ ధరతో ఎలా వీలవుతుందన్న ఆలోచన కూడా అప్పట్లో బాబుకు రాలేదు. ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా డైట్ చార్జీల పెంపుపై బాబు దృష్టి పెట్టిన పాపాన పోలేదు. రోజులో ఒక పూట మాత్రమే కోడిగుడ్డు అందించేవారు. ఇక అప్పట్లో వైద్య సేవల గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గుంటూరు జీజీహెచ్‌లో చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన దుర్ఘటనే బాబు పాలనలో కునారిల్లిన వైద్య రంగానికి పెద్ద నిదర్శనం. జగన్ పాలనలో ఇదీ పురోగతి 2019లో సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చేరిన రోగులు త్వరగా కోలుకోవాలంటే నాణ్యమైన వైద్య సేవలతో పాటు, పౌష్టికాహారం అవసరమని గుర్తించారు. ఇందులో భాగంగా రూ.80కు డైట్ చార్జీలను పెంచారు. రోగులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అందించేందుకు ప్రత్యేకంగా ఒక మెనూ రూపొందించారు. రూ.100 తో గర్భిణులకు నిర్దేశించిన మెనూతో పాటు, అదనంగా చిక్కీలు, రాగి జావ, టీబీ, ఎయిడ్స్, మానసిక రోగులకు హై ప్రొటీన్ డైట్‌ను అందిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రోగులందరికీ కోడిగుడ్డు ఇస్తున్నారు. మెనూలో మార్పులు ఇలా టీడీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.40 బ్రేక్ ఫాస్ట్: బ్రెడ్, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, గుడ్డు, అరటిపండు, మజ్జిగ రాత్రి భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, మజ్జిగ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.80 ఖర్చు బ్రేక్ ఫాస్ట్: ఉప్మా, కిచిడీ, ఇడ్లీ, పొంగలి, కోడిగుడ్డు, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, ఆకుకూర పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, గుడ్డు రాత్రి భోజనం: అన్నం, సాంబారు, పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, సంగటి, చపాతీ(డయాబెటీస్ రోగులకు), గుడ్డు -
పందికొక్కులు మీరు, మీ బాబే
సాక్షి, అమరావతి: పెరిగిన కార్డులను ఒప్పుకోరు. అత్యంత నాణ్యతతో ఇస్తున్న సరుకులను చూడరు. దాదాపుగా రెట్టింపైన సబ్సిడీ గానీ... ఇంటి ముంగిటకే వస్తున్న రేషన్ డెలివరీ గానీ... ఇవేవీ ‘నంగనాచి రామోజీ’కి పట్టవు! ఐదేళ్ల జగన్ ప్రభుత్వం 162.15 లక్షల టన్నుల బియ్యం, 3.28 లక్షల టన్నుల చక్కెర, 3.28 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.28,491 కోట్లు ఖర్చు చేసినా సరే...రామోజీకి మాత్రం రేషన్ వ్యవస్థ గాడితప్పినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు హ యాంలో కేవలం 117.45 లక్షల టన్నుల బియ్యం, 3.15 లక్షల టన్నుల చక్కెర, 0.93 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.15,356 కోట్లు ఖర్చు చేస్తే అదేదో ఘనకార్యంగా ఈనాడు కీర్తిస్తోంది. భాషా విచక్షణ కోల్పోయిన రామోజీ పరమ నీచపు రాతలు రాస్తున్నారు. ‘గాదె కింద పందికొక్కు.. కోతవేసే పప్పూ..ఉప్పు!’ అంటూ మంగళవారం ఈనాడులో రేషన్ పంపిణీపై దగాకోరుభాషను వాడారు. అప్పట్లో.. రేషన్ కోసం ఫీట్లు..అగచాట్లు... చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి 1.39 కోట్ల కార్డులు మిగిలాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా నిర్దేశించి, పార్టీల కతీతంగా కార్డులు ఇవ్వడంతో రాష్ట్రంలో 1.49 కోట్లకు కార్డుల సంఖ్య పెరిగింది. చంద్రబాబు హయాంలో ముక్కిపోయిన, పురుగుల పట్టిన, రాళ్లు, నూకలు ఎక్కువగా ఉన్న బియ్యాన్ని ఇస్తే తినలేక జనం బియ్యం జోలికే పోయేవారు కాదు. జగన్ ప్రభుత్వంలో ఇప్పుడిస్తున్నది నాణ్యమైన సార్టెక్స్ బియ్యం. అప్పట్లో నాసిరకం బియ్యాన్నే లబ్ధిదారుల నుంచి బాబు బినామీలు తమ దళారులతో పదీ పరక్కు కొనుగోలు చేసి అక్రమ రవాణా ద్వారా రూ.కోట్ల ప్రజాధనాన్ని మింగేసేవారు. వాస్తవానికి జాతీయ ఆహార భద్రత చట్టం కింద 2.68 కోట్ల మందికి 1.54 లక్షల టన్నులు మాత్రమే కేంద్రం బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే.. మిగిలిన 1.68 కోట్ల మంది లబి్ధదారులకు సీఎం జగన్ ప్రభుత్వం సొంత ఖర్చుతో 0.81 లక్షల టన్నుల బియ్యాన్ని అందిస్తోంది. హెరిటేజ్ కోసమే పండగ కానుకలు.. చంద్రబాబు ప్రభుత్వం పండగల పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను హెరిటేజ్‌కు దోచిపెట్టడానికి.. తమ అనుయాయులు స్వాహా చేయడానికే ఉపయోగించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. టెండర్లు లేకుండా ఇష్టమొచ్చిన ధరలకు అప్పటి ప్రభుత్వానికి సరుకులు సరఫరా చేసిన బాబు అనుయాయులు ప్రజాధనాన్ని మింగేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. 2013లో అప్పటి ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే 9 రకాల నిత్యావసరాల్లో పామాయిల్ ఉండేది. బాబు ప్రభుత్వం దీన్ని తొలగించింది. కందిపప్పు పంపిణీ నాడు ఎన్నికల డ్రామా వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం జూన్ 2014 సెపె్టంబర్ నుంచి 2015 జూలై వరకు అసలు కందిపప్పు గురించి పట్టించుకోలేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేసింది. 2017–18లో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్చి 2018 నుంచి రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓపెన్ మార్కెట్లో హెచ్చురేటు ఎంత ఉన్నా, సబ్సిడీ భారాన్ని భరిస్తూ రూ.67కే అందిస్తోంది. ఇదీ.. బాబు చిరుధాన్యాల గుట్టు టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో రాగులు, జొన్నలు, గోధుమ పిండి, ఉప్పు పంపిణీ ప్రారంభించింది. 1.39 కోట్ల కార్డుల్లో కేవలం 1 శాతానికే వీటినిచి్చనా... అబ్బో అంటున్నారు రామోజీ. ఎన్నికల భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి సంవత్సరంలో టీడీపీ పంపిణీ చేసిందీ చిరు ధాన్యాల్ని. జగన్ ప్రభుత్వం కరోనా తర్వాత వినియోగదారులకు పౌష్టికాహారం పంపిణీలో భాగంగా ఉత్తరాంధ్రలో రాగులు, రాయలసీమలో రాగులు, జొన్నల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రేషన్‌లో కిలో బియ్యం బదులు కిలో రాగులు, జొన్నలు ఉచితంగా అందిస్తోంది. -
నిజాలకు పాతర.. 'అబద్ధాల జాతర'
సాక్షి, అమరావతి: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీ పరిస్థితి. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు అచ్చోస్తే ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లోనే ఆయన ఇంకా ఉన్నారు. ఇదే భ్రమలతో ఏది రాసినా చెల్లుతుందని గుడ్డిగా నమ్ముతూ రోజుకో అంశంపై ఆయన విషం కక్కుతున్నారు. పాఠకులు ఏమనుకుంటారనే ఇంగిత జ్ఞానం, సిగ్గూఎగ్గూ లేకుండా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడెప్పుడో ఈట్ క్రికెట్.. స్లీప్ క్రికెట్.. డ్రింక్ క్రికెట్ అన్న ప్రకటన మాదిరిగా రామోజీ ఏ పనిచేస్తున్నా అందులో భూతద్దం పెట్టి జగన్ వ్యతిరేకతపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఇందులో భాగమే ఆయన కనుసన్నల్లో సాగిన తాజా పచ్చపైత్యం ‘బందిపోటు పాలన’ కథనం. డొంకతిరుగుడు రాతలతో ఎప్పటిలాగే సీఎం జగన్ పాలనపై రామోజీ అక్షరం అక్షరంలో తన అక్కసునంతా వెళ్లగక్కారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అక్కడక్కడ బందిపోటు పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానిస్తే దాన్ని వక్రీకరించి రాష్ట్రానికి అంటగడుతూ రామోజీ బందిపోటు ‘గోల’ చేస్తూ పండగ చేసుకున్నారు. నేను సీఎం అయితే ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టిస్తా, జైల్లో వేస్తాం, భూములు లాక్కుంటాం అంటే కుదరదని.. అది బందిపోట్లు చేసే పనవుతుందని.. అక్కడక్కడ బందిపోటు పాలకులను చూస్తున్నామని పీవీ రమేష్ వ్యాఖ్యానిస్తే దాన్ని ఈనాడు రామోజీ సీఎం జగన్ పాలనకు ఆపాదిస్తూ పైశాచికానందం పొందారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో.. నిజానికి.. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ అధికారైనా రాజ్యాంగం, చట్టాల మేరకే పాలన సాగిస్తారని.. కానీ, ఏపీలో అందుకు విరుద్ధంగా పాలన సాగుతున్నట్లు పీవీ రమేష్ చెప్పారంటూ ఈనాడు తన వక్రబుద్ధిని, సీఎం జగన్‌పై తన అక్కసును మరోసారి బయటపెట్టుకుంది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో వందిమాగధులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్టి పేరుతో సీఎం జగన్ పాలనపై ఈనాడు రామోజీ విమర్శలు చేయించి వాటిని వక్రీకరించీ మరీ అనైతికంగా అచ్చువేశారు. ఏ ప్రభుత్వమైనా దోచుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు బందిపోట్ల పాలన అవుతుందని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించేందుకు ఈనాడు రామోజీ తెగ ఆరాటపడిపోయారు. మరోవైపు.. సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదు ఒక్కటే.. రెండూ అవసరమేనని, డబ్బులు పంచడం సులభతరమేనని, అందుకు బటన్ నొక్కితే సరిపోతుందని, అలాగే ఇంటర్నెట్ ఉంటే చాలంటూ పేదలకు నగదు బదిలీ చేయడాన్ని పీవీ రమేష్ అవహేళన చేస్తూ తన పెత్తందారీ ధోరణిని బయటపెట్టుకున్నారు. ఈనాడు రామోజీ కూడా పెత్తందారే కాబట్టి పీవీ రమేష్ మాటలు చాలా రుచికరంగా ఉండటంతో ఆయన మాటలకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చి ప్రముఖంగా అచ్చువేశారు. గురవింద గింజలా పీవీ రమేష్.. ఇక ప్రజలకు అవసరమైన సేవలందించడమే ప్రభుత్వ పాలనంటూ పీవీ రమేష్ చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్ జగన్ కూడా ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. గత ప్రభుత్వాల తరహాలో గ్రామీణ, పట్టణ ప్రజలు తమకు అవసరమైన సేవలకు రాజకీయ నేతలు, మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరంలేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల ముంగిటికే పాలనందిస్తున్న విషయం రిటైర్ట్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌కు కనిపించడంలేదా? కనిపించినా ఈనాడు రామోజీ తనకు కావాల్సినట్లు రాసుకున్నారా? అసలు రమేష్ రిటైర్ కాగానే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగంలో చేరిన ఆయన ఇతరులకు నీతులు చెప్పడం అంటే తన కింద నలుపు చూసుకోకపోవడమే అవుతుంది. ఈనాడు రామోజీ వంటి పెత్తందారుకు కావాల్సినట్లు మాట్లాడాలి కాబట్టి పీవీ రమేష్ కూడా ఆ ముసుగు ధరించారు. ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ప్రగతిపథంలో వెళ్తున్నట్లు కనిపించడంలేదని.. రివర్స్ ఇంజన్లో రాంగ్ రూట్లో వెళ్తున్నామనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గణాంకాలను ఈయన చూడలేకపోతున్నట్లు ఉన్నారు. అందుకే గణాంకాలపై కూడా పెత్తందార్లకు ఏదీ కావాలో అదే ఎంపిక చేసుకుని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోలోని 99 శాతం అంశాలను అమలుచేసి పేదవర్గాలకు పైసా లంచం లేకుండా నగదు బదిలీచేస్తే దాన్ని కూడా పీవీ రమేష్ తప్పుపట్టారంటే పేదలు అభివృద్ధి చెందకూడదనే ధోరణిని ఆయన కూడా చాటుకున్నారు. ఇవేవీ అభివృద్ధి కావా రమేష్..? మరోపక్క.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడితే ఇది అభివృద్ధిగా రమేష్‌కు కనిపించడంలేదా? ఇదే పీవీ రమేష్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు నాడు–నేడు పేరుతో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని కూడా మరిచిపోయి ఇప్పుడు పెత్తందారుల పంచన చేరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాగే.. ► నాలుగు పోర్టులను, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇది అభివృద్ధి కాదా పీవీ రమేష్? ► పేదలందరికీ ఇళ్లు పేరుతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇంటి నిర్మాణాలను చేపట్టారు. ఇది పేదలు అభివృద్ధి చెందడం కాదా? ► గతంలో చంద్రబాబు వ్యవసాయ రుణాలన్నీ మాఫీచేస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఆ సమయంలో ఇదే పీవీ రమేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రుణమాఫీకి తూట్లుపొడవడంలో రమేష్ పాత్ర కూడా ఉంది. ఆయన దీనిని మర్చిపోతే ఎలా? ► 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ఆధారంగా జీఎస్డీపీలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత చంద్రబాబు పాలన కన్నా జీఎస్డీపీ పెరుగుదల ఇప్పుడే ఎక్కువగానే ఉంది. దీనిని ఆయన ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించారా లేక రామోజీ ఇచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీపట్టారా? ఏం పీవీ రమేష్? ► ఇక రాష్ట్ర అప్పులు కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే ఉన్నాయి. జీఎస్డీపీతో సమానంగా అప్పులున్నాయంటూ పీవీ రమేష్ పచ్చమీడియా వల్లిస్తున్న అబద్ధాలనే వల్లించారు. కార్పొరేషన్ల పేరుతో అప్పులుచేయడం తప్పుగా పీవీ రమేష్ అనడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. ► ఎందుకంటే.. గత ఎన్నికల ముందు ఇదే పీవీ రమేష్ కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్ధలో పనిచేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు కోరిక మేరకు 2019 ఎన్నికలకు ముందు పసువు–కుంకమ పేరుతో డబ్బులు పంచేందుకు సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి అప్పు మంజూరు చేసిన విషయం మరిచిపోతే ఎలా? ► కానీ, ఇందుకు భిన్నంగా సంక్షేమం, అభివృద్ధి సమతుల్యతతో సీఎం జగన్ ఐదేళ్ల పాలన సాగింది. -
చంద్రబాబూ.. డైలాగులు చెబితే సరిపోదు!
రాష్ట్రాన్ని కాపాడుకోవాలి... ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం... ప్రజలంతా ఫ్రస్టేషన్లో ఉన్నారు... ఇవన్నీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న డైలాగులు. ఇవన్నీ పాత డైలాగులే అయినా, కొత్తగా చెబుతున్నట్లు కనిపిస్తుంటారు. వీటిలో ఏ ఒక్కటైనా నిజమేనా అన్నదానికి సమాధానం దొరకదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం అంటే ఏమిటి? ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పనులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయనే కదా.. చంద్రబాబు సొదగా నిత్యం చెప్పేది. ఇక్కడే ఆయనలో బహురూపి కనిపిస్తాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసే పనులన్నీ తాను చేస్తానని అంటారు. కావాలంటే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తానని చెబుతారు. మరి అది రాష్ట్రాన్ని నాశనం చేయడం అవ్వదా అంటే జవాబు దొరకదు. అదేమంటే తాము సంపద సృష్టించి ఖర్చు చేస్తామని చంద్రబాబు ఒక పిచ్చి డైలాగు చెబుతారు. అదెలాగో మాత్రం వివరించరు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడితే ఈ నాలుగేళ్లు పూర్తిగా వ్యతిరేకించారు. అనేక నిందలు మోపారు. దానివల్ల రాష్ట్రం నాశనం అయిందని ప్రచారం చేశారు. వలంటీర్లు అంటే ఏమిటి? వారు చేసేది ఏమిటి? మూటలు మోసే ఉద్యోగం. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారు! అని చంద్రబాబు విమర్శించేసేవారు. ఈయన దత్తపుత్రుడుగా పేరొందిన పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లు ఆడవాళ్లను ట్రాఫికింగ్ చేస్తున్నారని దారుణమైన నీచమైన ఆరోపణ చేశారు. ఇవి విన్నవారికి ఏమినిపిస్తుంది. ఓహో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థలన్నీ తొలగిస్తారు కాబోలు అనుకుంటే, అందరిని ఆశ్చర్యపరచే విధంగా ప్రకటన చేశారు. తాము వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పైగా ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనం ఐదువేల రూపాయలను పదివేల రూపాయలు చేస్తామని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదువేలు ఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్న చంద్రబాబు ఇప్పుడు రెట్టింపు వేతనం ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడతానంటే జనం ఎవరైనా నమ్ముతారా! గతంలో 2014లో లక్ష కోట్ల రుణాల మాఫీ చేస్తానని అంటే చంద్రబాబును నమ్మి ఓటేసిన వారిని ఎలా నట్టేట ముంచింది తెలిసిన వారంతా ఆయన ఏదో ఒకటి ఇలాగే చెబుతారులే అని సరిపెట్టుకుంటున్నారు. అసలు విశ్వసనీయతతో నిమిత్తం లేకుండా మాట్లాడడం అంటే ఇది. వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్దాప్య పెన్షన్లను రెండువేల నుంచి మూడువేల రూపాయలకు పెంచితే రాష్ట్రం నాశనం అయినట్లు కదా! ఆ మాట నేరుగా చెప్పకపోయినా, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే కదా చంద్రబాబు చెబుతూ వస్తోంది. మరి తాను అధికారంలోకి వస్తే నాలుగువేల రూపాయల పెన్షన్ ఇస్తానని అంటున్నారు. అది బొంకడమా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాంటి హామీనే ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. అలాగే చంద్రబాబు కూడా పొరపాటున అధికారంలోకి వస్తే అలాగే చేస్తారని చెప్పడంలో ఎలాంటి సంశయం ఉండదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు చేయూత స్కీమ్ కింద ఏడాదికి 18750 రూపాయలు ఇస్తుంటే రాష్ట్రం పాడైపోతోందని చంద్రబాబు బృందం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఆయన మీడియా ప్రచారం చేసింది. చిత్రంగా సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన వాగ్ధానాలలో ప్రతి మహిళకు 1500 ఇస్తానని అంటున్నారు. అప్పుడు రాష్ట్రం పాడవదా? అంటే సమాధానం ఉండదు. అమ్మ ఒడి కింద స్కూల్‌కు వెళ్లే పిల్లల కోసం పదిహేను వేలు ఇస్తానంటే డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని పరోక్షంగా ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు అదే స్కీమ్‌కు తల్లికి వందనం పేరుతో ప్రతి కుటుంబంలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అక్కడితో ఆగలేదు. సంసారాలు చేసుకునేవారంతా ఎక్కువ మంది పిల్లలను కనాలని ఒక దిక్కుమాలిన సలహా ఇస్తున్నారు. రైతు భరోసా కింద వైఎస్ జగన్మోహన్రెడ్డి 13500 ఇస్తుంటే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నది వీరి మనసులో మాట. కానీ 2024 ఎన్నికలలో రైతులను మోసం చేయడానికి ఏకంగా ఇరవైవేల చొప్పున ఇస్తానని అంటున్నారు. గతంలో రుణమాఫీ చేస్తానని చెప్పి జనాన్ని ఆ తర్వాత ఆశపోతులన్నట్లుగా ఇప్పుడు మాత్రం దూషించరని గ్యారంటీ ఏమైనా ఉందా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా అనేది ఆయనే.వలంటీర్ల సేవలను నిమ్మగడ్డ ద్వారా నిలుపుదల చేయించిన తర్వాత లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగాలు చేస్తున్నారు కదా! అని చెప్పింది చంద్రబాబే! ఇవన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కదా ఇచ్చింది. ఇంతకీ ఏ రకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరికి అర్దం కాదు. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేసింది చెప్పరు. తాను ఇన్ని పోర్టులు నిర్మింప చేశానని చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు పోర్టులను నిర్మిస్తున్న ఘనత పొందారు. అవే కాదు. ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ లాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే కదా! అయినా రాష్ట్రం నాశనం అయిందని అంటారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని నిర్మించడం, 800 గ్రామాలకు వాటర్ స్కీమ్ అమలు చేయడం రాష్ట్రాన్ని పాడు చేయడమా? లేక తన పద్నాలుగేళ్ల పాలనలో ఆ ఆస్పత్రి నిర్మించని చంద్రబాబు రాష్ట్రాన్ని పాడు చేసినట్లా? రాజధాని అమరావతి పేరుతో మూడు పంటలు పండే భూములను సమీకరించి పంటలు లేకుండా చేసిన చంద్రబాబు విధ్వంసానికి పాల్పడినట్లా? కాదా! అన్ని హంగులు ఉన్న విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేయడం ద్వారా లక్ష కోట్లు ఆదా చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేసినట్లా!ప్రతిదానికి ఒక సినిమా డైలాగు మాదిరి చెప్పి జనాన్ని తప్పుదారి పట్టించాలని అనుకుంటే ప్రజలు పిచ్చివాళ్లు కాదు. విజయవాడలో కృష్ణానదికి రిటైనింగ్ వాల్‌ను నిర్మించడం ద్వారా వేలాది మందిని వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షిస్తే రాష్ట్రం ఏ రకంగా నాశనం అవుతుంది? మరి అదే పని చంద్రబాబు తన పాలనలో ఎందుకు చేయలేకపోయారు? బడులకు రంగులేస్తే సరిపోతుందా అని అంటారు. మరి తన హయాంలో వాటిని బాగు చేయడానికి ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పరు. ఆస్పత్రులను వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగు చేస్తే రాష్ట్రం పాడైందట. చంద్రబాబు పట్టించుకోకుండా ఉంటే అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగం జరిగినట్లా? ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక స్థాయిలో అవసరం లేదని అంటారు. అలాంటప్పుడు తన కొడుకును, మనుమడిని ఎందుకు తెలుగు మీడియంలో చదివించడం లేదంటే మాత్రం నోరు పెగలదు. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండవచ్చు. ప్రభుత్వ స్కూళ్లలో ఉంటే తప్పని చెబుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలను కాపాడతారట. ముప్పైఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తుంటే రాష్ట్రం పాడైపోయినట్లు.. తన హయాంలో ఒక్క ఇల్లు కట్టకుండా ఉంటే రాష్ట్రాన్ని బాగు చేసినట్లా? పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి నిర్మాణాలు చేస్తుంటే రాష్ట్రం ఎలా నాశనం అవుతుందో తెలియదు. చంద్రబాబు టరమ్‌లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాకపోయినా, రాష్ట్రాన్ని బాగా అభివృద్ది చేసినట్లు! ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి అడ్డగోలు మీడియాను అడ్డం పెట్టుకుని పడికట్టు డైలాగులు చెబితే సరిపోదు. స్పష్టంగా ఏ రకంగా రాష్ట్రం నష్టపోతోంది చెప్పి, ఆ తర్వాత తాను ఏమి చేస్తానో చెప్పగలిగితే ఆలోచించవచ్చు. కేవలం ప్రజలను భ్రమలలో పెట్టాలన్న దృష్టితోనే ఇలాంటి మాటలు చెబితే ప్రజలు ఎవరు అభివృద్ది చేసేది, ఎవరు చేయనిది అర్ధం చేసుకోగలరు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సీఎం జగన్ పై దాడి.. ఈనాడు తప్పుడు వార్త.. యాంకర్ హరి కౌంటర్
-
Fact check: చదువులపై విషం కక్కిన నారా వారి కూలీ..
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని కొనసాగిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న గురివింద రామోజీకి ఇది మింగుడు పడలేదు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టింది.. వారిచేత మరుగుదొడ్లు ఊడ్పించిందని టీచర్లను అవమానించేలా కట్టుకథ అల్లేసింది. ఈ పనులు ఎక్కడ చేయించిందో మాత్రం ఆ పత్రిక రాయదు. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవన్న సత్యాన్ని మరుగున పరిచింది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కూల్లో స్టాఫ్‌కు ప్రత్యేక, ఆధునిక సదుపాయాల కల్పన ఆ పత్రికకు కనబడవు. ఒకేసారి 25 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది ఈ ప్రభుత్వమే. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడులు అద్భుతంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు, బోధనకు ఐఎఫ్‌పీ స్క్రీన్ల ఏర్పాటు జరిగాయి. వీటిని కావాలనే విస్మరించి ఆధారాలు లేని రాతలతో ఎల్లో మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాఠశాల అభివృద్ధిలో టీచర్లను భాగస్వామ్యం చేయడం తప్పేనా? ఒకప్పటి బ్లాక్ బోర్డుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ బోధన సాగుతోంది. విద్యార్థులు నేర్చుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు 2019–20 విద్యా సంవత్సరంలో ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్, రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 44,512 స్కూళ్లను ఈ పథకం కిందకు తీసుకొచ్చింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగాయి. నాడు–నేడు మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలు, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలు బాగుపడ్డాయి. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందిస్తున్నారు. 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ రికార్డు. ఇవన్నీ పూర్తి పారదర్శకత కొనసాగేందుకు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఏం అవసరమో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. వీటిని తప్పంటోంది ఈనాడు పత్రిక. మీ రమాదేవి స్కూల్లో.. మీ నారాయణ స్కూళ్లల్లో ఇలాగే చేయిస్తున్నారా రామోజీ. జగన్ పాలనలో ► విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త భవనాల నుంచి మరుగుదొడ్ల వరకు సమకూరాయి. ►గత నాలుగేళ్లలో అర్హత కలిగిన 25 వేల మంది టీచర్లు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. ఇందులో నాలుగేళ్ల సర్వీసు ఉన్నవారికీ అవకాశం లభించింది. ►నాడు–నేడుతో ప్రతి బడిలోనూ 12 రకాల సదుపాయాలు. ►బోధనకు డిజిటల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలు. ►బడుల్లోకి కొత్త ఫర్నిచర్. ►మన బడికి అంతర్జాతీయ కీర్తి. ►కోవిడ్ కష్ట కాలంలో నెలల తరబడి పాఠశాలలు మూతబడినా ప్రతి టీచర్‌కు ఠంచన్‌గా వేతనాలు. ►బడిలో పాఠాలు చెప్పడం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం తప్ప ఏ ఉపాధ్యాయుడికీ అదనపు పనులు అప్పగించలేదు. ►మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ఉన్నారు. వారికి ప్రతినెలా వేతనాలు చెల్లించేందుకు ‘టాయిలెట్ మెయింటనెన్స్ ఫండ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించే బాధ్యత స్థానిక ఉపాధ్యాయులు తీసుకున్నారు. చంద్రబాబు పాలనలో ► 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో చంద్రబాబు జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచారు. నూరు శాతం ఫలితాలు తేవాలని ఆదేశించారు. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో సాధ్యం కాదని ఆ ప్రధానోపాధ్యుడు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అంతే అదే వేదికపై ఆ హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ► 2003లో మంత్రిగా చేసిన నిమ్మల కిష్టప్ప గోరంట్లలో నిర్వహించిన జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టమని అనుచరులను రెచ్చగొట్టారు. ►మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల ఇబ్బందులు వర్ణనాతీతం. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ అవసరం తీర్చుకునేవారు. ►జన్మభూమి సభ్యులే పేరెంట్స్ కమిటీల్లో చేరిపోయి పప్పు, బియ్యం ఎత్తుకెళితే అడిగినందుకు ఉపాధ్యాయులపై దౌర్జన్యాలు చేశారు. ►ఉపాధ్యాయులను నియమించకుండా నూరు శాతం ఫలితాలు తేవాలని ఒత్తిడి చేశారు. సాధ్యం కాదని చెబితే వెంటనే సస్పెండ్ చేసేవారు. ఈ రాతలు టీచర్లను అవమానించడమే గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయినులు పట్టణాలకే గాని మండల స్థాయి పాఠశాలలకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. బ్లాక్ బోర్డులౖపె రాసేందుకు సుద్దముక్క కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకు, స్టాఫ్‌కు అన్ని సదుపాయాలు కల్పించింది కళ్లకు కనిపిస్తున్నాయి. తప్పుడు రాతలు రాసి టీచర్ల మనోభావాలను కించపరచడం దుర్మార్గం. ఉపాధ్యాయుల విధులు, సిబ్బంది విధులు ప్రత్యేకంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏ టీచర్ కూడా మరుగుదొడ్లు కడిగింది లేదు. గతంలో ఎన్నికల విధులకు వెళ్లే ఉపాధ్యాయులు స్థానిక బడుల్లో ఉండలేక కష్టాలు పడేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పాఠశాలకైనా నిర్భయంగా వెళ్లే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. – గోపీకృష్ణ, ఉపాధ్యాయుడు (వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) -
‘‘రాళ్లతో కొట్టండి.. మసి చేయండి!’’.. ఇంత జరిగినా మారని బాబు తీరు
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రచార సభలో మాట్లాడుతూ ఏమన్నారో గమనించారా! తనకు ప్రత్యర్ధిగా ఉన్న వేరే పార్టీ నేతను రాళ్లతో కొట్టండి అని చెబుతున్నారు. పైగా ఆ నేతను ఉద్దేశించి దున్నపోతు అని కూడా సంబోధిస్తున్నారు. మరో సందర్భంలో ఏమన్నారంటే తమ్ముళ్లూ మనం కొట్టే దెబ్బకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మసి అయిపోవాలి.. తెలుగుదేశం కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు. దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. టీడీపీ కార్యకర్తలు ప్రత్యర్దులపై రాళ్లతో దాడి చేయాలనే చెప్పడమే కదా! వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను పట్టుకుని అంతమాట అన్నారంటే మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది కదా! ఈ వీడియోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు చూపించారు. ఇవి విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది. చంద్రబాబు మాటలకు రెచ్చిపోయిన ఎవరో టీడీపీ దుండగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి విసిరారని వైఎస్సార్సీపీ వారు అనుకోవడంలో తప్పు ఏమి ఉంటుంది? ఆ అనుమానం నిజమా? కాదా? అన్నది పోలీసులు నిర్ధారిస్తారు. ప్రాథమికంగా చూస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికు రాజకీయంగా ఉన్న ప్రధాన ప్రత్యర్ధి పార్టీపైనే సందేహాలు వస్తాయి. దానికి తగినట్లుగానే ఈ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు స్పందించిన తీరు కూడా పలు సంశయాలు కలిగిస్తుంది. చంద్రబాబేమో కొంత తెలివిగా దాడిని ఖండిస్తూ నిష్పాక్షిక విచారణ చేయించి నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్య తీసుకోవాలని కోరారు. అంటే దాని అర్దం ఏమిటి? ఇది దుండగులు చేసిన పని అయినా, అధికారులను తప్పు పట్టే రీతిలో ఆయన మాట్లాడారు. ఓకే! అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరడం తప్పుకాదు. కానీ అందులో కూడా అంతర్లీనంగా మొత్తం నెపాన్ని పోలీసులపై నెట్టేసి, రాయి వేసిన వారిని కాపాడాలన్న భావన ఆయనలో ఉన్నట్లు అనిపించదా! మరుసటి రోజుకు మాట మార్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వచ్చి పడింది గులకరాయి అని నీచ ప్రచారం ఆరంభించారు. చంద్రబాబు అలా మాట్లాడితే అధికారిక ఎక్స్‌లో తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్య దారుణంగా ఉంది. "కమలాసన్" అంటూ ఎద్దేవ చేస్తూ ఇదంతా డ్రామా అన్నట్లుగా వ్యాఖ్యానించింది. దీనికి ,చంద్రబాబుకు సంబంధం ఉండదా? అంటే.. కచ్చితంగా ఉంటుంది. ప్రతి దానిలోను ఆయన డబుల్ గేమ్ ఆడుతుంటారు. అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం అయినా, వలంటీర్ల సంగతి అయినా, మోదీ, సోనియాలపై వ్యాఖ్యలు అయినా ఎప్పటికి ఏది అవసరమైతే అది మాట్లాడి యుటర్న్ తీసుకోవడం ఆయనకు సర్వసాధారణం. చంద్రబాబు దాదాపు పద్నాలుగేళ్లపాటు సీఎంగా ఉన్నారు. పదిహేనేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంత సీనియర్ ఎంత మర్యాదగా, ఎంత హుందాగా ఉండాలి! కానీ తన రాజకీయ స్వార్దం ముందు ఆయనకు అవేవి అక్కర్లేదు. అదే తనను ఎవరైనా పొరపాటున ఏమైన అంటే మాత్రం అమ్మో.. నన్ను అన్నారు.. నేను ప్రజల కోసం పడతాను అంటూ డ్రామా రక్తి కట్టిస్తారు. ఆయనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా అంతా తబలా వాయిస్తాయి. ఆయన మాత్రం ఎదుటి వ్యక్తిని ఎంత మాట పడితే అంత అనేస్తారు. కొన్నిసార్లు అసలు ఈయన మతి ఉండి మాట్లాడుతున్నారా అన్న సంశయం కూడా వస్తుంది. టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణిస్తూ ప్రకటనలు చేశారు. కోడికత్తి-2 అంటూ వ్యంగ్య వ్యాఖ్యనాలు చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏకంగా ఆ రాయి తాడేపల్లి పాలస్ నుంచి వచ్చిందంటూ ఒక పిచ్చి వ్యాఖ్య చేసి తన రాజకీయ అపరిపక్వతను, పిల్ల చేష్టను తెలియచేసుకున్నారు. జనసేన నేత నాగబాబు మాత్రం తొలుత అభ్యంతర వ్యాఖ్య చేసి తదుపరి దానిని తీసివేసి పద్దతిగా ఖండించారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.. ఏ నాయకుడి మీద ఎలాంటి దాడి జరిగినా, ముందుగా అంతా ఖండించాలి. తమ పార్టీపై ఏదైనా ఆరోపణ వస్తే అది నిజం కాకపోతే అంతవరకు చెప్పవచ్చు. మరి అధికార పార్టీ తమపై ఆరోపణ చేయవచ్చా అని ఎవరైనా అడగవచ్చు. ఇప్పుడు వైఎస్సార్సీపీ బాధిత స్థానంలో ఉంది. తన అనుమానాన్ని వెల్లడించింది. అందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. పోలీసుల దర్యాప్తులో ఇలాంటివన్నీ తేలే అవకాశం ఉంటుంది. అంతెందుకు! ఏపీలో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డా, వారిలో ఒకరిని వైఎస్సార్సీపీ పార్టీ అని పులిమి ఈనాడు మీడియా ప్రచారం చేయడం లేదా? రాష్ట్రంలో జరిగే చిన్న నేరమైనా, పెద్ద నేరమైనా, దానిని వైఎస్సార్సీపీకి అంటకట్టే విధంగా అది వైఎస్సార్సీపీ నేతల పనే అనుకుంటున్నారని ఈనాడు మీడియా ఎందుకు నిర్లజ్జగా రాస్తోంది. దానిని తప్పు అని తెలుగుదేశం వారు అనడం లేదే! పైగా ఈనాడు మీడియా వాగడం, టీడీపీ ప్రచారానికి పెట్టడం, రాష్ట్రంలో ఏదో అయిపోయిందన్న తప్పుడు భావన కలిగించే యత్నం చేయడం నిత్యకృత్యం అయిందే. అందువల్ల వైఎస్సార్సీపీ నేతలు తమకు ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి ఆధారంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ వంటివారు తన ప్రసంగాలలో చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియోలను చూపిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు వైఎస్సార్‌సీపీవారిని బట్టలూడదీసి కొడతాం అని ఎన్నిసార్లు అన్నారో గుర్తు చేసుకోండి. అందువల్లే టీడీపీ అభిమాని లేదా, కార్యకర్త, లేదా మూర్ఖుడు ఎవరైనా మానసికంగా పర్వర్ట్ గా మారి ఇలా దాడి చేశారు అన్న అభిప్రాయం కలగదా! గతంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా విజయవాడ నగర వీధులలో వేలాది జనం తండోపతండాలుగా తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతు ప్రకటిస్తుంటే చూసి ఓర్వలేనివారు ఇలాంటి ఘాతుకానికి పాల్పడినట్లు అర్థం అవడం లేదా!రాయలసీమలో ఆరంభం అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్ యాత్ర మొదటి నుంచి ఒక రికార్డు స్థాయిలో జనాదరణ పొందుతోంది. రాయలసీమ ఆయనకు బాగా పట్టుఉన్న ప్రాంతం కనుక వచ్చారులే అనుకుంటే గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో అదే స్థాయిలో జనం రావడం టీడీపీ వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. దాంతో వారికి మైండ్ బ్లాంక్ అయింది. ఇంతవరకు తమకు కూడా విజయావకాశాలు ఉంటాయని ఆశతో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి నిరాశ ఆవరించే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి బలహీనవర్గాలవారు, మహిళలు, పిల్లలు వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్ యాత్రలో పాల్గొని ఆయనకు సంఘీబావం ప్రకటిస్తున్న వైనం వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఐదేళ్ల పాలన తర్వాత ఈ స్థాయిలో ఇలాంటి జన స్పందన రాలేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున జనం వీదులలోకి వచ్చి స్వాగతం చెప్పారు. కానీ ఏడేళ్ల పాలన తర్వాత ఎన్టీఆర్ జనంలోకి వెళితే స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. ఆయన 1989లో తొలుత ఉమ్మడి ఏపీలో మేడ్చల్ వద్ద సభ పెడితే కేవలం కొద్ది వందల మంది మాత్రమే సభకు వచ్చారు. అప్పుడే టీడీపీ ఆ ఎన్నికలలో ఓడిపోతుందని అర్దం అయింది. చివరికి ఎన్టీఆర్ సైతం కల్వకుర్తిలో ఓటమి చెందారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయం చూస్తే ఆయనేమీ సినీ నటుడు కాదు. పెద్ద అందగాడు కాదు. గొప్ప వక్త అని కూడా చెప్పలేం. కానీ తాను చెప్పదలచుకున్నది ప్రజలకు అర్దం అయ్యేలా స్పష్టంగా చెబుతూ, ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ స్పీచ్ ఇస్తుంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో తీసుకువచ్చినన్ని సంస్కరణలు మరే సీఎం తీసుకురాలేదన్నది పచ్చి నిజం. అలాగే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి కూడా ఈయనే. ఇన్ని అభివృద్ది పనులు చేపట్టింది కూడా జగనే. వీటన్నిటి ఫలితమే ఐదేళ్ల పాలన తర్వాత స్వచ్ఛందంగా ప్రజలు ఆయనను చూడడానికి తరలివస్తున్నారు. దీనిని గమనించే చంద్రబాబు నాయుడు తాను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాదిరే చేస్తానని చెప్పవలసి వచ్చింది. ఒకదఫా సీఎంగా జగన్ పాలనను.. డెబ్బై ఐదేళ్ల వృద్దుడు అయిన చంద్రబాబు తాను కూడా కొనసాగిస్తానని చెప్పడమే పెద్ద విజయం కాదని ఎవరైనా అనగలరా! వలంటీర్ల మొదలు, అమ్మ ఒడి వంటి స్కీముల వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డినే చంద్రబాబు ఫాలో అయ్యే పరిస్థితి రావడమే ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుభూతి కోసం నాటకాలు ఆడవలసిన అవసరం లేదని తేటతెల్లం అవుతోంది. టీడీపీ వారు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే వారి కంగాళీతనం బయటపడుతోందన్నమాట. గత ఎన్నికల ప్రచారం సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో ఒక కత్తితో ఒక యువకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి చేశాడు. అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు అంతకన్నా పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకోవాలి. ఎందుకంటే ఎయిర్ గన్ లేదా కాట్ బాల్ పంగలకర్ర వంటి దానితో రాయి లేదా పెల్లెట్ పెట్టి కొట్టి ఉండాలి. అందువల్లే అంత పదునుగా గాయం అయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటి పై భాగాన తగిలి గాయం అయింది. అదే పొరపాటున నవరగంత వద్ద తగిలి ఉంటే ఎంత ప్రమాదమో ఊహించుకోవడమే కష్టం. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన ప్రాథమిక చికిత్స తీసుకుని మళ్లీ జనానికి అభివాదం చేస్తూ వెళ్లారు. జనం ఆయన బస్ వెంట పరుగులు తీస్తూ అన్నా.. ఆరోగ్యం జాగ్రత్త.. అని చెప్పారంటేనే ఆయనపై వారిలో ఎంత ప్రేమ ఏర్పడిందో తెలుస్తుంది. అంతగా ప్రజలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి కనెక్ట్ అయ్యారని అర్దం. సానుభూతి కోసం ఎవరైనా కన్ను పోగొట్టుకుంటారా? ప్రాణం పోగొట్టుకుంటారా? ఇంత నీచంగా మాట్లాడతారా? 2003లో చంద్రబాబు నాయుడు తిరుమల వెళుతుండగా, అలిపిరి వద్ద బాంబులు పేలాయి. ఆయన అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా పరామర్శకు వెళ్లి, తిరుపతిలో ఈ దాడికి నిరసనగా దీక్ష చేశారు. ఆ రోజు ఆయన అంత హుందగా ఉంటే, ఈరోజున తెలుగుదేశం పార్టీ ఇంత ఘోరంగా వ్యవహరించింది. అప్పుడు అదంతా నక్సల్స్ పని అని పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చారు కానీ, పోలీసుల నిర్లక్ష్యం అంటూ డైవర్ట్ చేసే యత్నం చేయలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం కానీ, ఆ పార్టీ మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి మొత్తం నెపాన్ని పోలీసులపై నెట్టేసి, దుండగులను కాపాడే యత్నం చేయడం దుర్మార్గంగా కనిపిస్తుంది. నిజానికి ఇలాంటి ఘటనలు సృష్టించడంలో కానీ, సానుభూతి డ్రామాలు ఆడడంలో కానీ టీడీపీకి ఉన్న అనుభవం తక్కువేమీ కాదు. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్.బి స్టేడియంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్‌పై మల్లెల బాబ్జి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన డ్రామా అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మల్లెల బాబ్జి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అలిపిరి బ్లాస్ట్ తర్వాత చాలా రోజులు చంద్రబాబు కట్టు కట్టుకుని తిరిగే వారు. సానుభూతి వస్తుందని అనుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ క్రమంలో చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో చేతికి కట్టు తగిలించుకుంటున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత రోశయ్య గమనించి, నిమ్స్ డాక్టర్లను ఉద్దేశించి చమత్కారంగా ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబుకు పొరపాటున ఒక చేతికి బదులు మరో చేతికి కట్టు తగిలిస్తున్నారని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కట్టు లేకుండానే తిరిగారు. ప్రజలలో అలజడి కోసం ఎలాంటి అశాంతి నైనా సృష్టించాలన్నది చంద్రబాబు విధానంగా ఉంటుందని పలువురు టీడీపీ నేతలు చెబుతుంటారు. మాజీ మంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు జిల్లాలకు ఫోన్లు చేయించి బస్‌లు దగ్దం చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. బంద్ అంటే బస్‌ల అద్దాలు పగలకొట్టడమో, బస్‌లు దగ్ధం చేయడమో జరగకపోతే ఎలా అని.. ఈ చంద్రబాబు అంటారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో కూడా ప్రస్తావించారు. అమిత్ షా పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు నల్ల బెలూన్లు సెక్యూరిటీకి విఘాతం కలిగించేలా ఎగురవేశారు. పుంగనూరు, ఆంగళ్లు వద్ద టీడీపీ కార్యకర్తలను దాడులు చేయాలని రెచ్చగొట్టారు. టీడీపీ కార్యకర్తలు పోలీసు వ్యాన్ దహనం చేయడమే కాకుండా, రాళ్లు విసరడంతో ఒక పోలీసు కానీస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఇదంతా చంద్రబాబు నైజం అని అంతా తెలుసుకున్నారు. రాజమండ్రి, కందుకూరు, గుంటూరులలో తన వల్ల తొక్కిసలాట జరిగి అనేక మంది తెలిసినా, మొత్తం పోలీసులపై తోసేసి చంద్రబాబు తప్పించుకున్నారు. ఆయన కుట్రదారుడిగా ముద్ర పొందినా, దానిని కనిపించనివ్వకుండా, రామోజీ, రాధాకృష్ణ వంటి మీడియా ప్రముఖులు కవర్ చేసేసి చాలా పవిత్రుడుగా చూపించే యత్నం చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు దొరికిపోతుంటారు. అందుకు ఉదాహరణే తాజాగా రాళ్లతో కొట్టండి.. మసి చేయండి అని అన్న చంద్రబాబు వ్యాఖ్యల వీడియోలు. సోషల్ మీడియా రాబట్టి ఈ మాత్రం అయినా ప్రజలకు తెలుస్తోంది. లేకుంటే ఎల్లో మీడియా ప్రజలను ఎప్పటికి మోసం చేస్తూనే ఉండేది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడిని పక్కదారి పట్టించడానికి టీడీపీ కూటమి ఏదైనా ప్లాన్ చేస్తుందా అన్న డౌటు కూడా చాలమందిలో ఉంది. అనుకున్నట్లే ఆదివారం సాయంత్రానికి తనపైన రాళ్లు పడ్డాయని చంద్రబాబు సీన్ సృష్టించారు. అది నిజమా? కాదా? అన్నది తేలవలసి ఉంటుంది. పవన్ కల్యాణ్‌పై కూడా దాడి జరిగిందని చంద్రబాబు చెప్పేశారు. తీరా చూస్తే పవన్ కల్యాణ్‌పై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం అయింది. దీనిని బట్టే వీరు ఎలా ప్రవర్తిస్తున్నది అర్థం కావడం లేదా! అందువల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు అనండి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు అనండి.. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా సంయమనంతో వ్యవహరించారు. తన నొప్పిని భరిస్తూ జనంతో మమేకం అయిన తీరు అభినందనీయం. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
FACT CHECK: కల్లు తాగిన కోతి..రామోజీ
సాక్షి, అమరావతి: కల్లు తాగిన కోతిలా చిందులు వేయడం అంటే ఏమిటో ఈనాడు రామోజీరావును చూస్తుంటే తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఘోర పరాజయం తప్పదన్న బాధతో ఆయనలో పచ్చ పైత్యం ప్రకోపిస్తోంది. ఆ ఆక్రోశంతో నిద్రపట్టని రాత్రులు గడుపుతున్న రామోజీ చిత్త చాపల్యంతో మతి స్థితమితం కోల్పోతూ మత్తు రాతలు రాస్తున్నారు. ఈనాడు పత్రిక నిండా అసత్యాలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయంటూ తాజాగా ‘తాగించారు.. తూగించారు’ శీర్షికతో కట్టుకథను అల్లారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నా కల్లు తాగిన కోతిలా చిందులు తొక్కారు. మద్యం విక్రయాలు తగ్గించేందుకే షాక్ కొట్టేలా ధరలు.. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పారు. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేసేందుకే ఆ నిర్ణయమన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. దాచేస్తే దాగని సత్యాలు చంద్రబాబు హయాంలో ► రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ యథేచ్ఛగా చెలరేగిపోయింది. మూడు పరి్మట్ రూమ్‌లు.. ఆరు బెల్ట్ దుకాణాలు అన్నట్టుగా మద్యం ఏరులై పారింది. ► ఉ. 10 నుంచి రాత్రి 11 వరకు విక్రయాలు. అనధికారికంగా 24 గంటలూ షాపులు. ► 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా అంతే సంఖ్యలో పరి్మట్ రూమ్‌లకు అనుమతి. వీటికి తోడు 43 వేలకుపైగా బెల్డ్ దుకాణాలు. ► ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం వరకు అధిక ధరలకు అమ్మకాలు. ► ఏటా బార్ల సంఖ్య పెంపు. ► మొక్కుబడిగా మద్యం నాణ్యత పరీక్షలు. ఐదేళ్లలో 96,614 శాంపిల్స్ మాత్రమే సేకరణ. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో 34.9 శాతం పురుషులు, 0.4 శాతం మహిళలకు మద్యం అలవాటు ఉంది. జగన్ హయాంలో ► మద్యం మాఫియా అరాచకాలను ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. ► ప్రైవేటు మద్యం దుకాణాల విధానం రద్దు. ► 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం. ► మద్యం దుకాణాల వేళలు కుదింపు. ఉ.10 నుంచి రాత్రి వరకే విక్రయాలు. ► 4,380 పరి్మట్ రూమ్‌లు రద్దు. 43వేల బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగింపు. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు. ప్రస్తుతం ఉన్నవి 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే. ► కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. నోటిఫికేషన్ జారీ చేసి ఈ–వేలం ప్రక్రియ ద్వారా బార్ల కేటాయింపు. ► నగదు చెల్లింపులతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానం. ► మద్యం నాణ్యత పరీక్షల కోసం బెవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక లేబరేటరీల ఏర్పాటు. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ పరీక్ష. ► అక్రమ మద్యం అరికట్టేందుకు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ఏర్పాటు. ► 2019–21 నాటికి ఇది పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గింది. -
నారా.. దగ్గుబాటి మధ్య రాజీ కుదిర్చింది రామోజీయేనా?
కప్పుకునేది కాషాయం కండువా చేసేది పసుపు రాజకీయం. ఇదీ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలి. సంక్షోభంలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని బతికించుకోడానికి.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేందుకు పురందేశ్వరి పడని పాట్లు లేవు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయవమ్మా అని అధ్యక్ష పదవి కట్టబెడితే.. బీజేపీని నిండా ముంచి మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తానంటున్నారు పురందేశ్వరి. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయినపుడు పురందేశ్వరి దంపతులే మంచి కత్తి ఒకటి చంద్రబాబుకు కానుకగా ఇచ్చారని అప్పట్లో వైస్రాయ్ కోళ్లు ఆగ్రహంగా కూశాయి. వైస్రాయ్ ఎపిసోడ్లో.. తన తండ్రిని ముఖ్యమంత్రి పీఠం నుండి నిర్దాక్షిణ్యంగా దించేసిన కుట్రలో ఎన్టీయార్ తనయ దగ్గుబాటి పురందేశ్వరి..ఆమె భర్త వెంకటేశ్వరరావులు భాగస్వాములన్నది బహిరంగ రహస్యం. వెన్నుపోటులో తనకు అండగా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని అంటారు. తీరా వెన్నుపోటు పొడిచేసి కత్తికంటిన నెత్తుటిని తుడిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత దగ్గుబాటి విషయాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఇవాళో రేపో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని దగ్గుబాటి కొద్ది రోజులు వెయిట్ చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిదని దాని వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మనసా వాచా కర్మేణా నమ్మడం వల్ల వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి రాలేదు. అప్పటికి కానీ తాము మోసపోయామని దగ్గుబాటి దంపతులు గ్రహించలేకపోయారు. తెలిసిన తర్వాత ఉక్రోషంతో టిడిపి నుండి బయటకు వచ్చి చంద్రబాబుపై కారాలూ మిరియాలను మిక్సీలో వేసి రుబ్బారు. కొంతకాలం బిజెపిలో మరి కొంతకాలం కాంగ్రెస్ లో కాలక్షేపం చేసిన వెంకటేశ్వరరావు ఖాళీ సమయంలో ఓ ఆత్మకథ రాసి అందులో చంద్రబాబును నిర్మా వాషింగ్ పౌడర్ తో ఉతికి ఆరేశారు. ఆ కోపం చాలా ఏళ్ల పాటు చంద్రబాబులో ఉండిపోయింది. అందుకే 2014లో టిడిపి-బిజెపిలు పొత్తు పెట్టుకున్నా.. రాజంపేట నుండి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరిని దగ్గరుండి మరీ ఓడించారు చంద్రబాబు.ఎన్నికల ఫలితాల రోజున పురందేశ్వరి ఓడారని తెలిసిన తర్వాతనే చంద్రబాబు సంతృప్తిగా నవ్వారని టీడీపీ వర్గాలంటాయి. రెండు దశాబ్దాలకు పైగా నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం అలానే కొనసాగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందడం ఆ తర్వాత వరుసగా అన్ని స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం జరిగిపోయాయి. 2024 ఎన్నికల్లోనూ టీడీపీ లేచి నిలబడే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ సమయంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండె సంబంధ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరితే పరామర్శ పేరిట చంద్రబాబు వెళ్లారు. అలా వెళ్లడానికి రామోజీ సలహాయే కారణమంటారు. విడిపోయిన నారా-దగ్గుబాటి కుటుంబాలు మళ్లీ కలవకపోతే వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేమని రామోజీరావే రెండు కుటుంబాలకూ నూరిపోశారని కృష్ణా జిల్లా కోళ్లు మొహమాటంగా కూశాయి. అలా రాజగురువు ఇచ్చిన టిప్‌తో ఆసుపత్రిలో దగ్గుబాటి దంపతులు కాళ్లమీద పడిపోయిన చంద్రబాబు వెన్నుపోటు ఘటన అనంతరం తాను చేసిన ద్రోహాన్ని ఒప్పుకుని క్షమించమన్నారట. దాంతో దగ్గుబాటి దంపతులు చంద్రబాబును క్షమించేసి ఇకనుంచి కలిసుందాం రా అన్నారట. ఆ క్రమంలోనే ఎన్టీయార్ నాణెం విడుదల చేసినపుడు పురందేశ్వరే ప్రణాళిక రచించి చంద్రబాబును ఎన్టీయార్ నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబ సభ్యుల ముసుగులో ఆహ్వానించారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో వన్ టూ వన్ మాట్లాడుకునే వీలూ కల్పించారు. బిజెపితో తిరిగి పొత్తుకు ఆ క్షణానే చంద్రబాబు నడ్డాను మోహించినట్లు నటించారు. ఆ తర్వాత 371 కోట్ల రూపాయలు దోచుకు తిన్న స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుణ్ని కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేసి జైలుకు పంపగానే.. టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులకన్నా కూడా ముందుగా స్పందించింది పురందేశ్వరే. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమం అని ఆమె ముందస్తుగా ఖండించేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాల కోసం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతల అపాయింట్ మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతలకు కూడా చెప్పకుండా అర్జంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి హస్తినలో దిగి అక్కడ తన చెల్లెలి కొడుకు నారా లోకేష్‌ను తీసుకుని పార్టీ అగ్రనేత కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ కుదిర్చి తన వంతు సాయం అందించారు. ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అనాసక్తిగా ఉండడంతో పురందేశ్వరే జోక్యం చేసుకుని టీడీపీతో పొత్తు కుదిరేలా అగ్రనేతల దగ్గర మంత్రాంగం నడిపారని అంటారు. మొత్తం మీద టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత ఏపీ బీజేపీలో చంద్రబాబు అనుకూల నేతలకు టికెట్లు ఇప్పించారు. చంద్రబాబు అవినీతిని అను నిత్యం ఎండగట్టిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావులకు టికెట్ దక్కకుండా పక్కన పెట్టారు పురందేశ్వరి. అలా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం తాను ఏమైనా చేస్తానని చాటుకున్నారు. తాజాగా టీడీపీ నేతల అవినీతి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటూ స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలంటూ ఏకంగా ఈసీకే లేఖ రాసి బరితెగించేశారు పురందేశ్వరి. ఫలానా అధికారులు ఉంటే అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం వేరు.. వారిని తప్పిస్తే ఆ స్థానాల్లో ఎవరిని వేయాలో కూడా పురందేశ్వరే సిఫారసు చేస్తూ జాబితా పంపడం వివాదస్పదం అయ్యింది. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి స్థాపించిన టీడీపీ గెలిచి అధికారంలోకి రాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని పురందేశ్వరి భయపడుతున్నారు. తన తండ్రి పెట్టిన పార్టీని గుంజుకుని.. తన తండ్రి ఆశాయలకు తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి జారుకోకూడదని పాపం పురందేశ్వరి విపరీతంగా కష్టపడుతున్నారు. అయితే ఏవీ వర్కవువ్ కావంటున్నారు రాజకీయ పండితులు. -సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
అక్రమాల డొంక కదిలింది...రామోజీ ఇక జైలుకే..!
-
రామోజీరావు మార్గదర్శి కేసుపై నేను ఇంత ఇంట్రెస్ట్ పెట్టడానికి కారణం
-
ఇక రామోజీరావు తప్పించుకోలేడు.. కొమ్మినేని కామెంట్స్
-
లోకేశ్ ఐటీ.. రియల్ లూటీ
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో మాటల మరాఠి చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ పాలనను ప్రజలు ఛీకొట్టారు. అరచేతిలో స్వర్గం చూపిస్తే.. జనం తమ ఓటుతో అసలు వాస్తవం చూపించారు. మన మందళగిరి చినబాబు అయితే ఏకంగా ఐటీ పేరుతో మంగళగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తే.. గోబెల్స్‌కు రాజగురువు రామోజీ మాత్రం మంగళగిరిని ఏకంగా మాదాపూర్‌లా మార్చేయడానికి మా మాలోకం కష్టపడ్డాడని జాకీలతో పైకెత్తడానికి తెగ ఆరాటపడుతున్నారు. ‘మంగళగిరి ఐటీపై జగన్ వేటు’అంటూ ఈనాడులో విషపు రాతలు రాశారు. చంద్రబాబు హయాంలో మంగళగిరి సింగపూర్‌ను తలదన్నేలా బహుళ అంతస్తుల భవనాల ఐటీ కంపెనీలతో కళకళలాడేదట. కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు ఆకాశహర్మ్యాలతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌ను తలపించేదట. యువత ఆనందంతో ఉద్యోగాలు చేసుకునేవారట. జగన్ వచ్చాక ఇవన్నీ మాయమయ్యాయట. ఇదీ అసలు నిజం.. ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అంటూ చంద్రబాబు పుత్రరత్నం ఇక్కడ ఐటీ మంత్రిగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారు. ఐటీ పార్కుల పేరుతో బిల్డింగ్లు నిర్మించేసి.. ఐటీ కంపెనీలు రాకపోతే ఖాళీగా ఉన్న స్థలానికి ప్రభుత్వమే అద్దె చెల్లించేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కుల పేరుతో ప్రత్యేక పాలసీ రూపొందించారు. ఈ పాలసీ ముసుగులో బాబు అనుయాయులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భవనాలు నిర్మించి భారీ ఎత్తున ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఈ విధంగా నిరుపయోగంగా ఉన్న భవనాలకు భారీగా అద్దెను చెల్లించాల్సి వస్తుండటంతో ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. నిజంగా మంగళగిరిలో ఐటీ కంపెనీలు వచ్చి ఉంటే ఆ కంపెనీల పేర్లు రాయొచ్చు కదా రామోజీ..? ఒక్క కంపెనీ పేరు రాసే ధైర్యం లేదు. ఐటీ, ఎల్రక్టానిక్స్ రంగాల్లో మూడు లక్షల ఉద్యోగాలంటూ లోకేశ్ ప్రచారంలోని డొల్లతనం 2019 జనవరిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే బయట పడింది. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 2018 అక్టోబర్ నాటికి కేవలం 8,768 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 47,908 మందికి ఐటీ రంగంలో ఉపాధి కల్పించినా అవేవీ మీకు పట్టవా రామోజీ? -
నాలుకా.. తాటిమట్టా?
సాక్షి, అమరావతి: ‘అది నేనే... ఇది నేనే... నా చేతులతోనే పోలీసులపై బురద జల్లుతా... మళ్లీ నా నోటితోనే అయ్యో పోలీసులు అంటూ మొసలి కన్నీరు కారుస్తా’ ఇదీ ఈనాడు రామోజీరావు పాత్రికేయ వికృత తాండవం. మొన్నటి వరకు రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకూ వైఎస్సార్సీపీకి ఊడిగం చేస్తున్నారంటూ యథేచ్ఛగా రాసేశారు. దీనిపై పోలీసు యంత్రాంగం తిరగబడడంతో రామోజీ వెంటనే ప్లేటు ఫిరాయించి పోలీసులను వైఎస్సార్సీపీ నేతలు వేధిస్తున్నారంటూ నిర్లజ్జగా మరో విషపు రోత రాత అచ్చేసేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన పోలీసు వ్యవస్థకు గౌరవాన్ని పెంచింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్న నిజాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారు. చంద్రబాబు–పురందేశ్వరి కుట్రలో భాగంగా ఎన్నికల కమిషన్(ఈసీ)ను తప్పుదారి పట్టించేందుకు పోలీసులపై దు్రష్పచారం చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ఒక డీఐజీ, అయిదుగురు ఎస్పీలను బదిలీ చేసింది. వారి స్థానంలో ఎన్నికల నియమావళి ప్రకారం కొత్త అధికారులను నియమించింది కూడా. అయినా సరే ఈనాడు రామోజీరావు శాంతించ లేదు. తనను సంప్రదించకుండా ఎస్పీలను ఈసీ నియమిస్తుందా అన్నట్టుగా పేట్రేగిపోయారు. ‘వీళ్లా ఎస్పీలు..’ అంటూ ఐపీఎస్ అధికారులను అవమానపరుస్తూ విషం కక్కారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలపై కూడా దు్రష్పచారానికి పాల్పడ్డారు. దీనిపై ఐపీఎస్ అధికారుల సంఘం, పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించి ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో రామోజీ మరో కుట్రకు తెరతీశారు. 16 ఏళ్ల డిమాండ్ 16 రోజుల్లో పరిష్కారం ♦ బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన తమ యూనిఫామ్‌లో మార్పులు చేయాలని ఆర్మ్డ్ రిజర్వుడ్(ఏఆర్), స్పెషల్ పోలీస్(ఏపీఎస్పీ) కానిస్టేబుళ్లు 16 ఏళ్లుగా చేస్తున్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 16 రోజుల్లో పరిష్కరిస్తూ జీవో జారీ చేశారు. బ్యారెట్ టోపీ స్థానంలో పీక్ టోపీని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కానిస్టేబుల్ నుంచి రిజ ర్వ్ ఎస్సై స్థాయివరకు నలుపు రంగు విజిల్ కార్డ్‌ను తీసుకువచ్చింది. ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు విజిల్ కార్డ్‌తోపాటు పోలీస్ ఎంబ్లమ్ ఉన్న నలుపు బకిల్ ఉన్న బెల్ట్‌ను యూనిఫామ్‌లో భాగం చేసింది. ♦రాష్ట్రంలో ఎస్సైలకు గెజిటెడ్ అధికారి హోదా కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కొత్త పీఆర్సీ ద్వారా ఆ మేరకు సిఫార్సు చేయనున్నట్టుగా ప్రకటించింది. ♦పోలీసులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు ఎస్ఎల్ఆర్, ఏఎస్ఎల్ఎస్ బిల్లులు చెల్లించేలా ఆర్థిక శాఖను ఆదేశించారు. వివిధ రిస్క్ అలవెన్స్‌లను మంజూరు చేయాలని ఆదేశించారు. ♦24 ఏళ్ల సర్వీసు ఇంక్రిమెంట్‌ను కొనసాగిస్తూనే 30 ఏళ్ల సర్విసుకు ప్రత్యేకంగా ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ♦ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు మారే పోలీసులకు 6, 12, 18, 24 ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ♦అమర వీరుల కుటుంబాల పిల్లలకు ఇంజినీరింగ్, వైద్య విద్య తదితర కోర్సుల్లో 2 శాతం రిజర్వేషన్ (ఇది వరకు 0.25 శాతం) కల్పించారు. ఇతర ప్రయోజనాలు ♦ డీజీపీ, జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనరేట్లలో ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు. ♦ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో పోలీసు ఆసుపత్రుల ఏర్పాటు. ♦ మహిళా పోలీసులకు అదనంగా ఏడాదికి 5 క్యాజువల్ లీవులు. చైల్డ్ కేర్ లీవులు 150 నుంచి 180 రోజులకు పెంపు. ♦విధి నిర్వహణలో భాగంగా రాజధానికి వచ్చే మహిళా పోలీసులకు ప్రత్యేక వసతి సౌకర్యం.. ఎల్టీసీ సౌకర్యం పునరుద్ధరణ ♦ పోలీసు అధికారుల సంఘం తొలిసారిగా రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో భాగం. -
రామోజీ ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశద్రోహి కూడా!
సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశ ద్రోహి కూడా అన్న విషయం బయటపడింది. ఏడు దశాబ్దాలుగా ఆయన సాగిస్తున్న ఆర్థిక అక్రమాల వెనుక దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరాలు కూడా ఉండటం సంచలనంగా మారింది. విదేశాల నుంచి అక్రమంగా తెచ్చిన నిధులే పునాదిగా రామోజీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్, ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్ ఇలా అన్నింటిలోనూ అక్రమ పెట్టుబడులు, ఆర్థిక మోసాల దందా దాగుందన్నది స్పష్టమైంది. రామోజీ దేశద్రోహం అనంతర కాలంలో జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు నమోదైంది. దాంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. కానీ ఈ కేసు విషయంలో ఆయన ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం విచారించకపోవడం గమనార్హం. జీజే రెడ్డి దేశం విడిచి పారిపోయిన తరువాత ఆయన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఆయన పేరిట ఉన్న 288 షేర్లను రామోజీరావు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయలేదు. చట్టానికి వ్యతిరేకంగా తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అది తీవ్రమైన దేశ ద్రోహ నేరం. అంతేకాదు జీజే రెడ్డి దేశం విడిచిపారిపోవడానికి రామోజీ సహాయం చేశారని కూడా అప్పటి పరిణామాలను నిశితంగా పరిశీలించిన వారు చెబుతుండటం గమనార్హం. ఆ కేసులో ఇతర నిందితులు ఈమేరకు వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్‌లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు! రామోజీరావు ప్రధాన వ్యాపార సంస్థలైన ఈనాడు పత్రిక, డాల్ఫిన్ హోటల్స్‌లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు పెట్టారని బలమైన వాదన ఉంది. జీజే రెడ్డి 1963లోనే రామోజీరావుతో ఎలైట్ అనే ఇంగ్లిష్ పత్రికను పెట్టించారని, ఆ తర్వాత ఈనాడు పత్రిక ప్రారంభానికి కూడా ఆయన పెట్టుబడి పెట్టారని ఆనాటి ఈనాడు సంస్థ ఉద్యోగులే చెప్పడం గమనార్హం. కమ్యూనిస్టు కార్డును ఉపయోగించి రష్యా నుంచి ప్రింటింగ్ యంత్రాలు తెప్పించి ఈనాడు పత్రికను ప్రారంభించడంలో జీజే రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈనాడు స్థాపన సమయంలో పెట్టుబడులపై కూపీ లాగితే విదేశాల నుంచి అక్రమ నిధుల బాగోతం బయటపడుతుంది. 1960లలో రష్యా నుంచి తెచ్చిన నిధులను ఈనాడు, డాల్ఫిన్ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. రష్యా నుంచి అక్రమంగా నిధుల తరలింపు విషయంలో జీజే రెడ్డిపై అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహ నేరం కింద కేసు పెట్టింది. అలా అక్రమ నిధులు పెట్టుబడిగా పెట్టిన ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్, వాటి యజమాని రామోజీరావుపైనా దేశ ద్రోహ నేరం నమోదు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రామోజీ వాటా 100 షేర్లే... జీజే రెడ్డి పేరిట 288 షేర్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు. ఆ సంస్థపై సర్వాధికారాలు ఆయన కుటుంబానివేనని అందరూ భావిస్తారు. కానీ అసలు మార్గదర్శి సంస్థను ఏర్పాటు చేసిందే రామోజీ స్నేహితుడు జీజే రెడ్డి అని, దానిని ఏర్పాటు చేసే నాటికి రామోజీరావు షేర్లకంటే జీజేరెడ్డి షేర్లు చాలా రెట్లు ఎక్కువ అనే విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచారు. 1960ల నాటికే జీజే రెడ్డి ఢిల్లీలో బాగా పరపతి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీరావుకు తన సంస్థలో గుమస్తాగా ఉద్యోగం ఇచ్చారు. అనంతరం వారిద్దరూ కలిసి 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. ఆ సంస్థకు జీజే రెడ్డి ప్రధాన ప్రమోటర్. 1962 ఆగస్టు 31 నాటికి హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం రామోజీరావు ప్రారంభ వాటా కేవలం రూ.10 మాత్రమే. ఆయన సోదరుడు విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది. ఇక 1960–70లలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రామోజీరావు పేరిట ఉన్నవి కేవలం 100 షేర్లు మాత్రమే. కానీ జీజే రెడ్డి పేరిట 288 షేర్లు ఉండటం విశేషం. అంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ప్రధాన వాటాదారు జీజే రెడ్డే. జీజే రెడ్డి కుటుంబాన్ని మోసం చేసిన రామోజీ 1986లో జీజే రెడ్డి మరణానంతరం ఆయన ఇద్దరు కుమారులు తమ తండ్రి పేరిట ఉన్న 288 షేర్ల వాటాను తమ పేరిట బదిలీ చేయమని కోరితే రామోజీ ససేమిరా అన్నారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డిలను తుపాకితో బెదిరించారు. జీజే రెడ్డి పేరిట ఉన్న 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేశారు. దీనిపై ఆయన కుమారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు జీజే రెడ్డి కుటుంబం తమ వాటా షేర్ల కోసం న్యాయ పోరాటం కూడా చేస్తోంది. -
LIVE: ఉండవల్లి అరుణ్ కుమార్ PRESS MEET
-
రామోజీని జైల్లో పెట్టాలన్నది నా కోరిక కాదు: ఉండవల్లి
సాక్షి, రాజమండ్రి: మార్గదర్శి కేసు వివరాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఉండవల్లి తెలిపారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. కాగా, ఉండల్లి అరుణ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. తెలంగాణ హైకోర్టుకు విచారణ బాధ్యతలు అప్పగించారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది. మార్గదర్శిలో జరిగింది ఆర్థికనేరం. రామోజీరావు ఎవరైతే నాకేంటి. ఒక ఇష్యూలో తప్పు జరిగింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే మనం కళ్లు మూసుకుపోవాలా?. అందుకే ఈ విషయాన్ని బయటకు తీశాను. నేను అడిగింది 45-ఎస్ ఉల్లంఘన గురించి. అది తేల్చండి చాలు. రామోజీరావును జైలులో పెట్టాలని లేక శిక్షించాలన్నది నా కోరిక కాదు. ఈ వ్యవహారంలో కొన్ని నిజాలు బయటకు రావాలన్నదే నాకు కావాల్సింది. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ లూథ్రాకు కూడా చెప్పాను. ఈనాడు రాసిన రాతలపైనే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను. వక్రీకరించి వార్తలు రాయడం ఈనాడుకు అలవాటుగా మారింది. భావవ్యక్తీకరణను ఏ రకంగా చంపేస్తారో.. ఈనాడు అలాంటి రాతలను ఇన్ని సంవత్సరాల్లో అనేకంగా రాసింది. నా మాటలను వక్రీకరించి చూపారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎంతమంది ఖాతాదారులకు డబ్బులు వెనక్కిచ్చారన్న విషయాన్ని పరిశీలించడానికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని జ్యుడీషియల్ అధికారిగా ఏర్పాటు చేశారు. 80 నిమిషాల పాటు ఇండియాలో ఉన్న టాప్ అడ్వకేట్స్ ముగ్గురు రామోజీరావు తరపున దీనిపై వాదనలు వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగిందంటే కేవలం జడ్జిలు వల్ల జరిగిందని భావించాలి. ఇప్పుడు 45-ఎస్ ఓపెన్.. దానిపైన నిర్ణయం తీసుకుంటామన్నారు.ఎక్యుర్డ్ ఇంట్రెస్ట్‌తో సహా ఖాతాదారులకు డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించామని మార్గదర్శి కోర్టు వివరించింది. ఖాతాదారులు అందరికీ కలిపి 55.39 కోట్లు వడ్డీ కింద అందజేశామని మార్గదర్శి ఫైనాన్షియర్స్ చెప్పారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపితే 900 కోట్లు వడ్డీ పే చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకును పార్టీలను చేసి తెలంగాణ హైకోర్టుకు ఈ వ్యవహారంలో అరుణ్ కుమార్ అసిస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందజేసిన మెచూరిటీ అమౌంట్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఖాతాదారుల దగ్గర ఉన్న ఆధారాలు, పూర్తి అడ్రస్‌తో జీమెయిల్‌కి పంపండి. thedepositers@gmail.com అనే జిమెయిల్ ప్రారంభించాను. జరిగిన వ్యవహారంపై పూర్తి విచారణ తెలంగాణ హైకోర్టులో జరిపించమన్నారు. దీనిపై పూర్తి విచారణ జరుగనుంది. ఈ వ్యవహారం ఆరు నెలలలో తేల్చమంది. ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ వస్తుందని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
జైలు శిక్ష ఖాయం.. రామోజీ గిలగిల
-
తుపాకి గురిపెట్టి... షేర్లు కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి : మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల బాగోతం బయటపెట్టాల్సిందేనన్న సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పుతో ఆర్థిక ఉగ్రవాది రామోజీ అక్రమాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులోనే మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే మరో కంపెనీని ఏర్పాటు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అని కనీసం బోర్డు కూడా పెట్టకుండా వేల కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లుగా సేకరించారు. రామోజీ ఇంతటి ఆర్థిక అక్రమానికి కేంద్ర బిందువుగా మార్చుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ అనే సంస్థ ఏర్పాటుకు, తన ఉన్నతికి సాయం చేసిన చేతినే ఆయన కాటేశారన్న వాస్తవం కూడా విస్మయపరుస్తోంది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. దీనిపై జీజే రెడ్డి వారసుల ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఆ సోదరులు ఇద్దరూ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. సాయం చేసిన మిత్రుడిని ముంచేసిన రామోజీ కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావు 1960లలో నిరుద్యోగి. చిన్న ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను కలిసి ఏదైనా ఉద్యోగానికి సిఫార్సు చేయమని ప్రాథేయపడేవారు. ఇదే జిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లో్లవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీకి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. రెండేళ్ల తరువాత 1962లో ఇద్దరూ కలిసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. జీజే రెడ్డి తన స్వగ్రామం జొన్నలపాడులోని భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇందులో పెట్టుబడిగా పెట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత జీజే రెడ్డి చెకొస్లో వేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని ఎన్నిసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. తుపాకితో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించారు. చిట్టచివరకు 2016 సెప్టెంబరు 29న రామోజీరావు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007 – 08 వార్షిక సంవత్సరం షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని కోరగా, అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోపెట్టారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు వారిపై ఆగ్రహంతో చిందులు తొక్కారు. తుపాకీ తీసి మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తారని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బతుకు జీవుడా అని బయటపడ్డారు. రామోజీ, శైలజపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీరావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. మరోవైపు ఇదే అంశంపై యూరి రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్న రామోజీరావు, శైలజ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ షేర్లను తమ పేరిట బదిలీ చేసేలా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ను ఆదేశించాలని కోరుతున్నారు. దీనిపై న్యాయస్థానంలో వ్యాజ్యం కొనసాగుతోంది. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ, తమ షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. తమ తండ్రి వాటా షేర్లను అట్టిపెట్టుకోవాలనే నిర్ణయించుకున్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మారిస్తే చట్ట ప్రకారం షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. వాటన్నింటిపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ ఆర్థిక అక్రమాల్లో ఆరితేరిన రామోజీ తాను అనుకున్నంతా చేశారు. జీజే రెడ్డి షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తన పేరుతో ఒక్క షేరు కూడా లేకపోవడంతో విస్తుపోయారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. కంపెనీల చట్టం మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో అక్రమంగా షేర్లు బదిలీ చేసేసుకున్నట్లు వెల్లడైంది. -
నిస్సిగ్గుగా నిజాలను కాలదన్ని..
చంద్రబాబు హయాంలో ఏమీ సాధించలేకున్నా... ప్రగతి పరుగులు తీసిందంటూ తప్పుడు రాతలు. పరిస్థితులు దిగజారినా... రాష్ట్రం పురోగమిస్తుందంటూ అడ్డగోలు అబద్ధాలు. ఐటీ కంపెనీ ఒక్కటైనా తీసుకురాలేకపోయినా... ఏదో సాధించారంటూనిస్సిగ్గుగా కితాబులు. ఇదీ పచ్చముసుగు వేసుకున్న రామోజీ పత్రికలో నిత్యం అచ్చవుతున్న అసత్య కథనాల తీరు. అదే జగన్ హయాంలో ఎంత ఉన్నతంగా ఎదిగినా... ఏమీలేదంటూ కబోది వ్యాఖ్యానాలు. కళ్లముందే దానికి సంబంధించిన రుజువులున్నా... దాచిపెట్టి అడ్డగోలు రోతలు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ... జనానికి ఏమీ తెలియదులే అన్న అహంకార ధోరణి. ఇదీ రోజూ ఈనాడులో వండివారుస్తున్న అబద్ధాలు. గడచిన ఐదేళ్లలో ఐటీరంగం రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తే ‘కల్పతరువును కాలదన్నారు’ అంటూ అభాండాలు వేసేశారు. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం... సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. కరోనా వంటి విపత్కర పరిస్ధితుల్లో అంతర్జాతీయంగా ఐటీ రంగం కుదేలైనా రాష్ట్రంలో ఆ సమస్య ఎదురుకాలేదు. బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్,విప్రో,భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలు విశాఖలో డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయగా, రాండ్‌స్టాండ్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించాయి. రాష్ట్రానికి 65కు పైగా కొత్త కంపెనీలు రాగా విశాఖలో డబ్ల్యూఎన్ఎస్, పల్సస్ గ్రూపులు భారీగా విస్తరించాయి. టెక్ మహీంద్రా విశాఖ నుంచి తన కార్యకలాపాలను విజయవాడకు విస్తరించింది. ‘ఐటీకి పితామహుడిని నేనే... సైబర్‌బాద్‌ను నేనే సృష్టించా...’ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పాలనలో విశాఖకు వచ్చిన ఐటీ దిగ్గజం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. ఆయన సీఎం పదవి ముగిసేనాటికి రాష్ట్రంలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 27,643 అయితే ఇప్పు డు ఆ సంఖ్య 75,551కు చేరింది. చంద్రబాబు దిగిపోయే నాటికి ఉన్న ఐటీ ఉద్యోగుల్లో సగంమందికి పైగా దివంగత నేత ముందుచూపుతో విశాఖ, కాకినాడ, విజయవాడల్లో అభివృద్ధి చేసిన∙ఐటీ పార్కుల్లో పనిచేస్తున్నవారే. కానీ ప్రస్తుత వైఎస్ జగన్ హయాంలో ఐటీ రంగంలో 47,908 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించినా కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీకి అవేవీ కనిపించడం లేదు. పైగా ప్రజలను తప్పుదారి పట్టించేలా ఐటీ పాలసీ తుస్ అంటూ గురువారం ఒక అబద్ధాన్ని వండివార్చారు. తెలంగాణతో పోలికెందుకు రామోజీ... 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి తీసుకువచ్చిన ఒక్క కంపెనీ పేరు కూడా ఆ కథనంలో రాసుకోలేకపోయారు. ఎంతసేపూ ప్రస్తుత ప్రభుత్వంపై విషం చిమ్మాలన్నదే వారి దుగ్ధ. అందుకే పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోలుస్తూ అబద్దాలు అచ్చేశారు. బాబు పాలనలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంటే ఆయన ఎందుకు ఉద్ధరించడానికి కృషి చేయలేదు? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు వల్లే కదా విశాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేవలం హైదరాబాద్‌ను మాత్రమే ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువునా ముంచేసిన విషయం రాష్ట్ర ప్రజలు మరచిపోయారనుకుంటున్నారా? రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కేవలం అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించి ఐటీ రంగాభివృద్ధిని గాలికి వదిలేసిన విషయం ఇక్కడి యువత గమనించలేదనుకుంటున్నారా? పైగా ఇప్పుడు ఐటీ రంగంలో విశాఖ పురోగమిస్తుంటే తప్పుడు కథనాలతో జనాన్ని ఏమార్చడానికి యత్నిస్తారా? నాడు ప్రచారం... నేడు ప్రోత్సాహం... చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికే పరిమితం చేసి స్టార్టప్‌లలో రాష్ట్రం చతికిలబడితే వైఎస్ జగన్ ప్రభుత్వం స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్‌లకు మెంటార్షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్‌లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ‘‘కల్పతరువు’’ పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది. దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఓ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఐటీ రంగంలో విశాఖను కల్పతరువుగా మార్చేలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటే యువతను నైరాశ్యంలో నెట్టివేసేలా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనాడు రామోజీ రాస్తున్న తప్పుడు రాతలను ప్రజలు గమనిస్తున్నారు. మూడు రెట్లు పెరిగిన స్టార్టప్‌ల సంఖ్య నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువస్తూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ఏర్పాటుతో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే గాకుండా, వేలాది మందికి ఉద్యోగాలూ వస్తున్నాయి. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వరంగ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586కు పెరిగింది. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది. -
Fact Check: పచ్చగంతలు తీస్తే రహదారులు కనిపిస్తాయి
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో టీడీపీ ఓటమి తథ్యమని స్పష్టం కావడంతో ఈనాడు రామోజీరావు పైత్యం పరిపరి విధాలుగా ప్రకోపిస్తోంది. అసహనంతో చిందులు తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేష విషం కక్కుతున్నారు. అందుకే రాష్ట్ర రోడ్ల పరిస్థితిపై మరోసారి రామోజీ తన మార్కు రోత రాతలతో ఈనాడు పత్రికను ఖరాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తూ రహదారుల పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినా సరే ...కళ్లకు పచ్చ గంతలు కట్టుకున్న రామోజీ కబోదిలా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఈనాడు పత్రిక గురువారం ‘రోడ్లేయని జగన్ ఓ జనహంతక చక్రవర్తి’ అంటూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీశారు. తప్పుడు కథనంతో ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నంలో ఈనాడు బోల్తా కొట్టింది. వాస్తవానికి రాష్ట్రంలో రోడ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది చంద్రబాబు హయాంలోనే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రోడ్ల పునరుద్ధరణ పనులు వేగం పుంజుకున్నాయని ప్రభుత్వ రికార్డులు వెల్లడిస్తున్న వాస్తవం. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులకు కలిపి మొత్తం రూ.23,792.19 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఏకంగా రూ.46,383.20 కోట్లు వెచ్చించారు. రోడ్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమిది. కళ్లుండీ కబోదిగా వ్యవహరిస్తున్న రామోజీకి కనువిప్పు కలిగించేందుకే ఈ ఫ్యాక్ట్ చెక్... చంద్రబాబు జమానా..రహదారులు అధ్వాన్నం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రోడ్ల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నది అక్షరసత్యం. ఆ ప్రభుత్వ హయాంలో మొదటి మూడేళ్లూ అసలు రోడ్ల గురించే పట్టించుకోలేదు. తరువాత రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. దాంతో 2019 నాటికి రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ► టీడీపీ ప్రభుత్వ ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.2,953.81 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.591 కోట్లు ఖర్చు చేసింది. ► రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు రూ.4,325 కోట్లే వెచ్చించింది. ► పంచాయతీరాజ్ రహదారుల కోసం రూ. 3,160.38 మాత్రమే ఖర్చు చేసింది. ► 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.13,353 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో మారిన రూపురేఖలు 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్ల పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తోంది. కోవిడ్ పరిస్థితులు, వరుసగా రెండేళ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసినా రోడ్ల నిర్మాణంపై రాజీ పడలేదు. ప్రజల సంక్షేమంతోపాటు మౌలిక సదుపాయాలపైనా దృష్టి సారించారు. రోడ్ల మరమ్మతులు చేపట్టి విశాలంగా చేస్తున్నారు. కొత్త రోడ్లు వేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో రాష్ట్రంలో రోడ్లు మెరుగయ్యాయి. ఇందు కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు ఇలా ఉంది... ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.5,099.59 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.951కోట్లు. దీని ప్రకారం బాబు ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 591 కోట్లకంటే చాలా ఎక్కువే. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ.9,175 కోట్లు ఖర్చుచేసింది. ► పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.6,804.61 కోట్లు వెచ్చించింది. ► జాతీయ రహదారుల కోసం రూ.25,304 కోట్లు వెచ్చించారు. సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు, నిరంతరం పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైంది. ► ఇక రోడ్ల అభివృద్ధి సెస్ ద్వారా వచ్చిన రూ.3 వేల కోట్లను టీడీపీ చేసిన అప్పులు తీర్చడానికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. సెస్ ద్వారా వచ్చిన మరో రూ.2 వేల కోట్లకు అదనంగా రూ.2,500 కోట్ల రుణం తీసుకుని మొత్తం రూ.4,500 కోట్లతో 7,600 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించింది. -
Fact Check: ఈనాడు దగాకోడ్ రాతలు
సాక్షి, అమరావతి: ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతుండటంతో రాష్ట్రంలో ఎల్లో సిండికేట్ బెంబేలెత్తుతోంది. త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో వరుసగా రెండోసారి టీడీపీ ఓటమి ఖాయమని స్పష్టం కావడంతో చంద్రబాబు, ఈనాడు రామోజీరావుల కాళ్ల కింద భూమి కంపిస్తోంది. తమ రాజకీయ జీవితానికి ముగింపు కార్డు పడిందని చంద్రబాబుకు.. తమ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలుతుందని రామోజీరావుకు భయం పట్టుకుంది. తమ భవిష్యత్తు సినిమా కళ్ల ముందు కనిపిస్తోంది. ఫలితంగా దింపుడు కళ్లెం ఆశతో విద్వేష కథనాలు అల్లుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా, ప్రభుత్వ యంత్రాంగంపైనా విషం చిమ్ముతున్నారు. ఏకంగా రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్(ఈసీ) అధికార పరిధినీ ప్రశ్నిస్తూ కట్టుకథలతో ‘ఈనాడు’ పత్రిక చెలరేగిపోతోంది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న పోలీసు, అధికార యంత్రాంగాన్ని బ్లాక్మెయిల్ చేయాలని పన్నాగం పన్నింది. మొన్న ఐపీఎస్ అధికారుల పోస్టింగులను ప్రశ్నిస్తూ ఈసీనే బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నించిన ఈనాడు.. తాజాగా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలే లక్ష్యంగా అబద్ధాలను వల్లెవేసింది. ‘వైకాపా కోడ్ నడుస్తోంది’ అంటూ బుధవారం ఓ విష కథనాన్ని వండి వార్చింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. పోలీసు అధికారుల బెదిరింపునకూ పన్నాగం తాజాగా ఈనాడు రామోజీరావు క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా వ్యవహరించే పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని దు్రష్పచార కుట్రకు తెరతీశారు. ఎన్నికల విధుల్లో క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా ఉండే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్నది పచ్చ కుట్ర. ఇటీవల రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డ ఉదంతాలను ఈనాడు పత్రిక వక్రీకరిస్తూ తప్పుడు కథనం ప్రచురించింది. మాచర్ల, గన్నవరం, అద్దంకి, ఉరవకొండ, గుడివాడ తదితర నియోజకవర్గాల్లో గత వారం పదిరోజుల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తాజాగా బుధవారం రాత్రి ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులనే అడ్డుకున్నారు. అసలు ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదని గలాభా సృష్టించారు. ఇటువంటి ఘటనలపై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం యావత్ పోలీసు యంత్రాంగం ఈసీ మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహిస్తోంది. ఈ వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ వైఎస్సార్ సీపీ నేతల ఆదేశాల ప్రకారం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని కట్టుకథలను ఈనాడు ప్రచారంలోకి తీసుకువస్తోంది. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకున్నా సరే పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండాలి అన్నట్టుగా ఈనాడు వితండవాదం చేస్తోంది. నిజంగా పోలీసులు ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈసీ విచారించి తగిన చర్యలు తీసుకుంటుంది. కానీ చంద్రబాబుగానీ ఈనాడు రామోజీరావుగానీ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పోలీసులు నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నారు. అందుకే ఈనాడు పత్రిక ద్వారా పోలీసు అధికారులపై దు్రష్పచారానికి పాల్పడుతున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో పని చేసే పోలీసు అధికారులను బెదిరించి టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్నది చంద్రబాబు, రామోజీ లక్ష్యం. కానీ వారి కుట్రలను తిప్పికొడుతూ ఈసీ నిబంధనల మేరకు సక్రమ ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది. మొన్న ఐపీఎస్‌లపై అక్కసు బెడిసికొట్టి.. చంద్రబాబు హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చలామణి అయిన రామోజీరావు ప్రస్తుతమూ తన మాటే శాసనం అనేట్టుగా ఉండాలని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నదీ ప్రజలు ఎన్నుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అని.. రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సాగుతుందని గానీ గుర్తించేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. తాను చెప్పిన అధికారులనే ఎస్పీలుగా నియమించాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకు విరుద్ధంగా ఎన్నికల నియమావళి ప్రకారం ఇటీవల ఎన్నికల కమిషన్ ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమించడంతో ఆయన చిందులు తొక్కారు. ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ ఈనాడు పత్రికలో విద్వేష కథనాన్ని ప్రచురించారు. దీనిపై యావత్ పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించడం విశేషం. ఏకంగా 13 మంది ఐపీఎస్ అధికారులు సంతకాలు చేసి మరీ టీడీపీ, జనసేన, బీజేపీ, ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఈనాడు పత్రికను అడ్డంపెట్టుకుని పోలీసు వ్వవస్థను, ఈసీని బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నిస్తున్నాయన్న వాస్తవం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. ఈసీ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశాలు ఉండటంతో రామోజీరావు తోక ముడిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ నోళ్లు కూడా మూతపడ్డాయి. కానీ అధికారయంత్రాంగం ఆత్మస్థైర్యం దెబ్బతీసే కుతంత్రాలు మాత్రం ఆపలేదు. -
ప్రజలను మోసం చేస్తూ రామోజీ రావు వ్యాపారాన్ని విస్తరించారు
-
రామోజీ అక్రమాలు సుప్రీం తీర్పుతో బయటకు వస్తాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీ రావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రామోజీ.. ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రజలను మోసం చేస్తూ రామోజీ వ్యాపారాన్ని విస్తరించారని స్పష్టం చేశారు. కాగా, సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా రామోజీ బండారం బయటపడుతుంది. రామోజీ రావు అక్రమ సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారు. రామోజీ అక్రమాలన్నీ సుప్రీం కోర్టు తీర్పుతో వెలుగులోకి వస్తాయి. 2024 ఎన్నికలను కూడా శాసించాలని రామోజీ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు. వాళ్లు సృష్టించిన అబద్ధాలనే బ్యానర్ కథనంగా ఇస్తున్నారు. అంతేకానీ, మార్గదర్శి గురించి చిన్న వార్త అయినా ఈనాడులో రాశారా?. అందరికీ నీతులు చెప్పే రామోజీ తాను పాటించలేదు. రామోజీ ఏనాడైనా నిష్పక్షపాతంగా వార్తలు రాశారా? అని ప్రశ్నించారు. వాలంటీర్లపై తప్పుడు రాతలు రాశారు. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించారు. ఒక్కప్పుడు వాలంటీర్లపై ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు. ఇప్పుడు వారిని కొనసాగిస్తామంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారు. 2014లో చేసిన మోసాన్నే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారు. నాలుగు ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారు. వాలంటీర్లపై చంద్రబాబు, దత్తపుత్రుడు విషయం కక్కారు. ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ చూపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు వస్తాయి. వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీల సభ్యులు ఉంటారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందుతాయి. చంద్రబాబు నైజం ప్రజలకు అర్థమైంది. గొడవలు వాళ్లు సృష్టించి మాపై నిందలు వేస్తున్నారు. నిష్ఫక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయం సాధిస్తుంది. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబే. ఆయన మాటలను ప్రజలు గమనిస్తున్నారు. వృద్ధులు చనిపోతే వైఎస్సార్సీపీకి అంటగట్టాలని చూస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ గొడవలు సృష్టిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
పాపం పండింది..ఆరునెలల్లో...కటకటాలే..!
-
ఎమ్మెల్వోలపై ఏడుపు
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ రోత రాతలు చూస్తుంటే ప్రభుత్వం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూరినా వారిపై ఎన్నికల సంఘం ఎడాపెడా కేసులు నమోదు చేయాల్సిందేననే ఆక్రోశం కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంపై వలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ల వద్ద విధులు నిర్వహించే ఎమ్మెల్వోలపై ఏడుపుగొట్టు కథనాలను ప్రచురించింది. ఒకవైపు వలంటీర్లను ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాజేసే దొంగలుగా చిత్రీకరిస్తూ మరోవైపు తాయిలాలను ఎర వేయడంపై విస్మయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈనాడు ఆరోపణ: ఎమ్మెల్వోలను వైఎస్సార్సీపీ స్లీపర్ సెల్స్‌లా ప్రజలపైకి వదిలారు. వాస్తవం: వలంటీర్లు ప్రజల నుంచి ఎలాంటి వ్యక్తిగత సమాచారం సేకరించరు. ప్రభుత్వ పథకాల అమలు ప్రక్రియలో సేకరించే వివరాలను యాప్‌లో నమోదు చేయగానే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలో ఉండే డేటా సెంటర్లో నిక్షిప్తమవుతుంది. వలంటీర్ల వద్ద ఉండే మొబైల్ యాప్‌లోని సమాచారాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్వోలకు లాగిన్ అవకాశం ఉండదు. ఈనాడు ఆరోపణ: ఎమ్మెల్వోలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవం: వలంటీర్ల నుంచి ఫోన్లు, నంబర్లను స్వాదీనం చేసుకున్నాక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమో ఈనాడుకే తెలియాలి. -
కాకి లెక్కలు కుదరవ్!
సాక్షి, అమరావతి: ‘నేరం నాదే..! దర్యాప్తు నాదే..! తీర్పూ నాదే..!’ అంటూ మొండికేస్తున్న ఈనాడు రామోజీకి సుప్రీంకోర్టు గట్టి మొట్టికాయలు వేసింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా సేకరించిన డిపాజిట్లను తిరిగి డిపాజిట్‌దారులకు చెల్లించేశామని, తమ ఆడిటర్లు ఈ లెక్కలు తేల్చేశారంటూ నమ్మబలుకుతున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. ఆ విషయాన్ని నిర్దారించాల్సింది మార్గదర్శి ఆడిటర్లు కాదని, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ధ్రువీకరించాలని తేల్చి చెప్పింది. దీంతో రామోజీ గొంతులో పచ్చి వెలగకాయ పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బహిరంగ ప్రకటన జారీ చేసి అభ్యంతరాలు స్వీకరణకు సన్నద్ధం కానుండటం రామోజీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చెల్లించేశాం.. లెక్క తేల్చేశాం: రామోజీ వితండవాదం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు అడ్డగోలు వాదనలు సుప్రీంకోర్టులో ఫలించలేదు. 2023 జూన్ 30 నాటికి 1,247 మంది డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని, కేవలం రూ.5.31 కోట్లు మాత్రమే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆయన న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆడిటర్లు క్షుణ్ణంగా ఆడిట్ చేసి నివేదిక సమర్పించారని, అన్ని లెక్కలు సరిపోయాయని చెప్పుకొచ్చారు. అందువల్ల మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్‌దారులు, చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు. తద్వారా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో అక్రమంగా డిపాజిట్ చేసినవారి పేర్లు, ఆ డిపాజిట్ మొత్తాల వివరాలు బయటకు రాకుండా చేసేందుకు రామోజీ ప్రయాస పడ్డారు. అక్రమ డిపాజిట్ల వెనుక భారీగా నల్లధనం దాగి ఉండటమే దీనికి కారణం. అదేం కుదరదు... నిగ్గు తేలాల్సిందే.. రామోజీ తరపు న్యాయవాదుల వాదనలను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే సరిపోదు. మీ దగ్గర పని చేసే ఆడిటర్ల నివేదికను పరిగణలోకి తీసుకోలేం’ అని స్పష్టం చేసింది. డిపాజిట్‌దారులకు న్యాయం జరిగిందో లేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ధారించాలని పేర్కొంది. ‘రూ.5 వేలు డిపాజిట్ చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా..!’ అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను పార్టీగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించాలని తీర్పునిచ్చింది. డిపాజిట్లు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించేందుకు ఓ జ్యుడిషియల్ అధికారిని నియమించాలని ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. బహిరంగ ప్రకటన.. అభ్యంతరాల స్వీకరణ సుపీం్ర కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించిన అక్రమ డిపాజిట్లను సంబంధిత డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే డిపాజిట్‌దారులు అత్యధికంగా ఉన్నారు. వారి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారిని సంప్రదించి బహిరంగ ప్రకటన జారీ చేసేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేయనున్నాయి. అగ్రిగోల్డ్ కేసులో మాదిరిగానే ఈ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంది. బహిరంగ ప్రకటన జారీ చేసి డిపాజిట్‌దారులకు సమస్యలుంటే నివేదించాలని కోరనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు. డిపాజిట్లు తిరిగి చెల్లించకుంటే ఆ సెల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. వీటిని క్రోడీకరించి తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతాయి. ఇక రామోజీ డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్న వారి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలను జ్యుడీషియల్ అధికారితోపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేయాలి. వాటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ద్వారా విడుదల చేస్తాయి. అందులోని డిపాజిట్‌దారుల పేర్లు, చెల్లింపుల వివరాలను పరిశీలిస్తాయి. వాటిపై వ్యక్తమయ్యే అభ్యంతరాలపై విచారణ చేపడతాయి. అనంతరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదికల ఆధారంగా జ్యుడీషియల్ అధికారి తదుపరి చర్యలు తీసుకుంటారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆరు నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. ఇరు ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ఇవ్వడంతో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు దిశగా వేగంగా చర్యలు చేపట్టాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. -
ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం.. టీడీపీ డీలాతో రామోజీ బెంబేలు
సాక్షి, అమరావతి: ఆర్థిక ఉగ్రవాది పత్రిక నడిపితే ఎలా ఉంటుందో ‘ఈనాడు’ చాటి చెబుతోంది. జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా డిపాజిట్లు సేకరించడమే అందుకు నిదర్శనం. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ఆర్థిక నేరం గుట్టంతా రట్టవుతుండటం.. తన శిష్యుడు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తేలడంతో రామోజీరావు భయంతో వణికి పోతున్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయం సాధించడం దిశగా దూసుకెళ్తోందని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీ న్యూస్ తదితర ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేలి్చచెప్పడం.. రాజకీయ విశ్లేషకులూ అదే మాట చెబుతుండటం రామోజీరావుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లను కొల్లగొట్టేందుకు వేల కోట్లు కుమ్మరిస్తోందని.. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో చెలరేగిపోతోందంటూ వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతూ బుధవారం ‘ఈనాడు’లో ‘కుమ్మరించేస్తోంది’ శీర్షికన రోతరాతలు అచ్చేశారు. ఇటీవల ఐదు జిల్లాల ఎస్పీలు, ఒక ఐజీ, మూడు జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ చేస్తే.. ‘ఈడ్చికొట్టిన ఈసీ’ అంటూ శివాలెత్తిన రామోజీ.. మార్గదర్శి కుంభకోణంపై విచారించిన అధికారి కొల్లి రఘురామిరెడ్డిని ఎన్నికల పరిశీలకుడిగా ఈసీ అస్సాంకు పంపితే.. ‘కొల్లికి షాక్’ అంటూ కథనాన్ని అచ్చేసి సంబరపడ్డారు. ఈసీ కనుసన్నల్లో అధికారులు పని చేస్తుంటే.. అడిగేవారు, అడ్డుకునేవారు లేరంటూ ఇప్పుడు ఎన్నికల సంఘంపై అభాండాలు వేయడం చూస్తే రామోజీరావు మతిస్థిమితం కోల్పోయారేమో అనిపిస్తోంది. ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తుంటే.. ఏ రోజు లెక్కలు ఆ రోజే తేలుస్తుంటే.. ప్రతి మద్యం దుకాణానికి వైఎస్సార్సీపీ రూ.పది లక్షలు ముందస్తు చెల్లింపులు చేయడం ఎలా సాధ్యం అన్న ఇంగిత జ్ఞానం కూడా రామోజీరావుకు లేకుండా పోయింది. తన శిష్యుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే గురవింద రామోజీ సాకులు వెతుకుతూ రోత రాతలు అచ్చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాన్ని వ్యాపారం చేసింది బాబే దేశంలో రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసి, ఓటుకు నోటును అలవాటు చేసిన ఘనుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబే. ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికల నుంచి ఓటుకు నోటుకు తెరతీశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచేసిన సొమ్ముతోపాటు.. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా బ్యాంకులను కొల్లగొట్టిన ఆర్థిక నేరగాళ్లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, ఎన్నారైలకు టికెట్లు ఇచ్చారు. కోట్ల కట్టలను వెదజల్లి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రక్రియను ప్రారంభించారు. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఎరగా వేస్తూ ఆడియో, వీడియో టేపులతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా చంద్రబాబు తన తీరు మార్చుకోలేదు సరికదా మరింతగా చెలరేగిపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న వారిని కాదని రూ.900 కోట్లు ఫార్టీ ఫండ్‌గా ఇచ్చిన విద్యా వ్యాపారి పొంగూరు నారాయణను నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి చంద్రబాబు బరిలోకి దించారు. రూ.వందల కోట్లు పార్టీ ఫండ్‌గా ఇచ్చిన ఎన్నారైలు పెమ్మసాని చంద్రశేఖర్‌ను గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి, కాకర్ల సురేష్ ను ఉదయగిరి నియోజకవర్గం నుంచి, వెలిగండ్ల రామును గుడివాడ నుంచి, యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం నుంచి, రియల్టర్ కేశినేని చిన్నిని విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి.. కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. ఫార్టీ ఫండ్ రూపంలో.. అభ్యర్థుల నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను యథేచ్ఛగా వెదజల్లుతున్నారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులు పెమ్మసాని, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, బీజేపీ అభ్యర్థులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ వంటి వారు భారీ ఎత్తున నోట్ల కట్టలను వెదజల్లుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు వంటి వారిని కొనుగోలు చేస్తూ తమ వైపునకు తిప్పుకోవడానికి బాబు ప్రయతి్నస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సభలకు నోట్ల కట్టలను వెదజల్లుతున్నా జనం మొహం చాటేస్తున్నారు. కోట్ల కట్టలతో చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు రామోజీ కంటికి కన్పించలేదేమో! సరి కొత్త ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం జన బలమే గీటురాయిగా.. ప్రజాసేవే ప్రామాణికంగా.. నిబద్ధతే పరమావధిగా కింది స్థాయి కార్యకర్తలను అభ్యర్థులుగా ఎంపిక చేయడం ద్వారా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ప్రజాస్వామ్యానికి సరైన అర్థం చెప్పారు. శింగనమల నియోజకవర్గం నుంచి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులును, మడకశిర నియోజకవర్గం నుంచి ఉపాధి కూలీ ఈర లక్కప్పను, నెల్లూరు సిటీలో విద్యా వ్యాపారి కోటీశ్వరుడు నారాయణపై సాధారణ కార్యకర్త ఖలీల్ అహ్మద్‌ను, మైలవరం నియోజకవర్గం నుంచి రైతుబిడ్డ సర్నాల తిరుపతిరావును, కోటీశ్వరులు బరిలోకి దిగే నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి న్యాయవాది గూడూరి ఉమాబాలను సీఎం వైఎస్ జగన్ బరిలోకి దించడం ద్వారా రాజకీయాల్లో సరి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అర్హతే ప్రమాణికంగా.. ఎలాంటి వివక్షకు తావు లేకుండా.. లంచాలకు చోటులేకుండా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు ఇంటి గుమ్మం వద్దే అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని పథకాలను కొనసాగించి.. ఇచ్చిన మాటపై నిలబడి.. సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారు. దీంతో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజు రోజుకూ పెరుగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు పోటెత్తిన జనసంద్రమే అందుకు నిదర్శనం. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు మండుటెండైనా.. అర్ధరాత్రి అయినా ఉప్పొంగుతున్న అభిమానసంద్రమే అందుకు తార్కాణం. ఓ వైపు వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలు, నిర్వహిస్తున్న బస్సు యాత్రకు అభిమాన సంద్రం ఉప్పొంగుతుండటం.. మరో వైపు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయడాన్ని చూస్తే రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభంజనమేనన్నది స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేలూ అదే చెబుతున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న రామోజీరావు.. శిష్యుడు చంద్రబాబు ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్నారని స్పష్టమవుతోంది. -
మార్గదర్శి చిట్ ఫండ్ కుంభకోణంపై రామోజీరావుపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
-
మార్గదర్శి క్లోజ్ ?.. జైలుకు రామోజీ..!
-
రామోజీ రావు సుప్రీం కోర్టు తీర్పుపై కొమ్మినేని విశ్లేషణ
-
అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యిమనిపించిన సుప్రీం కోర్టు
-
‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టీకరణ.. కేసు పునర్విచారణకు ఆదేశిస్తూ తీర్పు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Fact Check: రామోజీ రాతల్లోనే ‘కోతలు’.. బాబు పాలనలోనే ‘చీకట్లు’
సాక్షి, అమరావతి : ‘‘పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలిడే అమలు చేస్తున్నాం. వారంతపు సెలవుతో కలిపి వారంలో మూడు రోజులు పరిశ్రమలకు విద్యుత్ ఉండదు.’’ ‘‘గ్రామాల్లో ఎనిమిది గంటలు..పట్టణాల్లో ఆరు గంటలు..నగరాల్లో నాలుగు గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ విధిస్తున్నాం.’’‘‘వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇవ్వడం కష్టం..నాలుగు గంటలు రెండు విడతల్లో ఇస్తాం..క్రాప్ హాలిడే తీసుకుంటే ఇంకా మంచిది.’’ ...ఇదీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి..బాబు హయాంలో రాష్ట్రాన్ని చీకటి మయం చేశారు. రైతులు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక పొలాల్లోనే పడిగాపులు కాసేవారు. ఆ సమయంలో పాముల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు. గ్రామాల్లో పగలూ రాత్రీ గంటల తరబడి కోతలు విధించేవారు. కొన్ని సీజన్ల పంటలకు విద్యుత్ సరఫరా లేక రైతులు క్రాప్ హాలిడే పేరుతో పంటలు వేయకుండా చేలను బీడు భూములుగా వదిలేసేలా అప్పటి పాలకులు ప్రోత్సహించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసింది. రైతులకు ఉచితంగా పగటి పూటే 9 గంటల విద్యుత్‌ను అందిస్తోంది. భారీ విద్యుత్ డిమాండ్, తీవ్ర విద్యుత్ కొరత ఉండే వేసవిలోనూ ఎలాంటి కోతలు లేకుండా, లోడ్ రిలీఫ్ అవసరం రాకుండా, క్రాప్ హాలిడే విధించకుండా, పవర్ హాలిడే పెట్టకుండా అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తోంది. కానీ దీనిని చూసి బాబు తోక పత్రికైన ఈనాడు కుళ్లుకుంటోంది. ఇలాంటి పాలనకు ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టనున్నారని గ్రహించి, తప్పుడు రాతలతో జనాన్ని నమ్మించాలని చూస్తోంది. అందులో భాగంగానే ‘కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్?’ అంటూ ఈనాడు మంగళవారం ఓ అబద్దాన్ని అచ్చేసింది. రామోజీ రాస్తున్న రాతల్లో అన్నీ కోతలేనని, వాస్తవాలను పరిశీలిస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. ♦ శ్రీకాకుళం జిల్లా గార మండలం జల్లువలస, జఫ్రా బాద్, రాఘవాపురం, వాదాడ, తోనంగి శాలి హుండం గ్రామాల పరిధిలో సోమవారం ఉదయం 05:34 నుండి సాయంత్రం 04:15 గంటల వరకు కరెంటు లేదు అన్నది వాస్తవం కాదు. ఎందుకంటే ఆ రోజు బలమైన ఈదురు గాలులు వచ్చిన కారణంగా కళింగపట్నం, చల్లపేట, అతులుగు సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ ఫీడర్స్పై చెట్టు కొమ్మలు పడి ట్రిప్ అయి కొంత విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ♦ రాజమహేంద్రవరం జిల్లా గండేపల్లి మండలం, కె. సూరపాలెం గ్రామీణ ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలో సోమవారం ఉదయం 07:15 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది. రాజమహేంద్రవరం తాడితోట సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 8.55 నుంచి సాయంత్రం 04:15 గంటల వరకు సరఫరా నిలిచింది అన్నది కూడా వాస్తవం కాదు. ఈదురు గాలుల వల్ల 33/11 కేవీ గండేపల్లి సబ్ స్టేషన్లో 11కేవీ సూరంపాలెం ఇండస్ట్రియల్ పరిధిలో చెట్లు కొమ్మలు, వెదురు చెట్లు లైన్ మీద పడి బ్రేక్ డౌన్ అయ్యింది. కొమ్మలు, చెట్లు తొలగించి మధ్యాహ్నం 1 గంటకు సరఫరా పునరుద్ధరించారు. అలాగే 33/11కేవీ తాడితోట సబ్ స్టేషన్ పరిధిలోగల 11కేవీ ఇన్నిస్ పేట ఫీడర్ పైన నక్కలగూడెం వద్ద గల వీటి కాలేజ్ దగ్గర చెట్టు కొమ్మలు పడటంతో సరఫరాలో అంతరాయం కలిగింది. తెగిన విద్యుత్ లైన్ పున రుద్ధరించి 09:59 గంటలకు సరఫరా ఇచ్చారు. ♦పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, అలవద్ద, కురుపాం, మండలం భర్తంగి గ్రామాల పరిధిలో ఉదయం 09:24 గంటలకు 33/11కేవీ గుమ్మలక్ష్మీపురంలోని 11కేవీ గుమ్మలక్ష్మీపురం–ఆర్కే బాయ్ ఫీడర్ పరిధిలో అల్లవరం గ్రామం వద్ద చెట్లు కొమ్మలు లైను మీద పడి విద్యుత్ అంతరాయం కలిగింది. వాటిని తొలగించి 09:48 గంటలకు సరఫరా యధావిధిగా కొనసాగించారు. ♦ కడపలోని 220 కెవి సబ్‌స్టేషన్‌లో బ్యాటరీల మరమ్మతుకు గురై సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు. ♦ కర్నూలు సర్కిల్ పరిధిలోని గుండ్లకొండ సబ్‌స్టేషన్, అనంతపురం సర్కిల్ పరిధిలోని రాయదుర్గం, తిరుపతి సర్కిల్ పరిధిలోని పూతలపట్టు సబ్ స్టేషన్లలో బ్రేక్‌డౌన్ కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ ఆయా సబ్స్టేషన్ల పరిధిలో లైటింగ్ సప్లైలో మాత్రం ఎటువంటి అంతరాయం లేదు. -
జనం సొమ్ముతో గురివింద విందు!
సాక్షి, అమరావతి: ఆర్థిక అక్రమాల ఉగ్రవాది ‘ఈనాడు’ రామోజీ పాపాలు పండాయి! చట్టాలంటే లెక్క లేకుండా దశాబ్దాలుగా సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు చెక్ పడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకునే ఎత్తుగడలు ఎల్లకాలం సాగవని రుజుౖవెంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా రామోజీ మెడకు చుట్టుకుంది. టీడీపీ హయాంలో చంద్రబాబు అండదండలతో ‘రమణ’ మంత్రంతో కనికట్టు చేసి అక్రమ డిపాజిట్ల కేసు నుంచి తప్పించుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేక పోయారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసును కొట్టివేయడానికి వీల్లేదని, ఆ కేసును సమగ్రంగా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈనాడు పేరుతో పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టు క్రియాశీలత ముందు వీగిపోయాయి. ఈనాడు అంటే ఆఫ్టరాల్ ఒక పేపర్ మాత్రమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందన్న రామోజీ మొసలి కన్నీళ్లను కొట్టిపారేస్తూ సుప్రీంకోర్టు విప్లవాత్మకమైన తీర్పును విస్పష్టంగా వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలు ఇవిగో... రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ.. నిర్భీతిగా నిబంధనల ఉల్లంఘన చట్టాలకు తాను అతీతం అన్నట్టుగా భావించే రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట బరితెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ చట్టం 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగానీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్‌యూఎఫ్)లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. ఈ నిబంధనను రామోజీ నిర్భీతిగా ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. 2006లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదుతో సీఐడీ దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు 1997 నుంచి 2006 వరకు యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించడంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ 2006లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారమే అప్పటికి రూ.2,610.38 కోట్లు అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడైంది. హెచ్యూఎఫ్గా తాము డిపాజిట్లు సేకరించవచ్చంటూ రామోజీ చేసిన వితండవాదాన్ని ఆర్బీఐ అప్పట్లోనే సమ్మతించలేదు. సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తన ఆర్థిక అక్రమాల వ్యవహారం బట్టబయలు కావడంతో రామోజీ అనివార్యంగా తప్పిదాలను అంగీకరించారు. డిపాజిట్‌దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని ప్రకటించారు. అక్రమ డిపాజిట్ల వివరాలు వెల్లడించం.. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్లు డిపాజిట్లుగా సేకరించామని పేర్కొన్న రామోజీరావు 2008లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాము ఇంకా చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.1,864.10 కోట్లు అని వెల్లడించారు. మరి మిగతా రూ.746.28 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయో ఆయన వెల్లడించలేదు. మరోవైపు తాము సేకరించిన డిపాజిట్లను పూర్తిగా చెల్లించేశామని 2012 తరువాత రామోజీ తాపీగా ప్రకటించారు. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. డిపాజిట్లు ఎవరెవరి నుంచి ఎంతెంత సేకరించారు..? ఎవరెవరికి ఎంతెంత డిపాజిట్లు ఏయే తేదీల్లో చెల్లించారు...? నగదు రూపంలో చెల్లించారా? చెక్కుల రూపంలో చెల్లించారా? అనే వివరాలు వెల్లడించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ వాస్తవాలు ఏమిటో వెలికి తీసేందుకు ప్రయత్నించాల్సి ఉండగా... నాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, ఆ తరువాత చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ సర్కారుగానీ ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చాయి. తద్వారా రామోజీరావు ఆర్థిక అక్రమాలకు పరోక్షంగా వత్తాసు పలికాయి. దాంతో రామోజీరావు తాను సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలు చెపాల్సిన అవసరం లేదంటూ వితండవాదాన్ని వినిపించారు. తమకు ఎలాంటి క్రిమినల్ లయబులిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 21న (ఉమ్మడి హైకోర్టు చివరి పనిదినాన) మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయింది. తద్వారా రామోజీ ఆర్థిక అక్రమాలకు చంద్రబాబు దన్నుగా నిలిచారు. అక్రమ డిపాజిట్లే... ఆర్థిక నేరస్తుడే: ఆర్బీఐ స్పష్టీకరణ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సోదాహరణంగా వివరించింది. ఆ డిపాజిట్లను ఎవరెవరికి తిరిగి చెల్లించారో.. ఎంతెంత చొప్పున చెల్లించారో వివరాలు వెల్లడించాల్సిందేనని వాదించింది. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ కేసులో పార్టీ పర్సన్ ఇన్చార్జ్గా ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 45 ఎస్ కింద హెచ్‌యూఎఫ్ సంస్థలు డిపాజిట్లు సేకరించవచ్చా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది రమేశ్‌బాబు తన వాదనలు వినిపిస్తూ ‘ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మినహా ఇతర సంస్థలు, వ్యక్తులు డిపాజిట్లు సేకరించకూడదు. హెచ్‌యూఎఫ్ కూడా డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. కాబట్టి హెచ్‌యూఎఫ్ పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లను సేకరించడం అక్రమమే, చట్ట విరుద్ధమే. రామోజీ ఆర్థిక నేరస్తుడే ’అని విస్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసులో రిజర్వు బ్యాంక్‌ను కూడా పార్టీగా చేర్చి సుప్రీంకోర్టు విచారణను కొనసాగించింది. కేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు వ్యతిరేకంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. దీంతో ఈ కేసు నీరుగారిపోకుండా చూడగలిగింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ వసూలు చేసిన అక్రమ డిపాజిట్లు వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది. ‘ఈనాడు’కు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం ఎప్పటి మాదిరిగానే పత్రికా స్వేచ్ఛ ముసుగులో తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ వేసిన ఎత్తుగడను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. ఈనాడు పత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో ఇంత పట్టుబడుతోందని రామోజీ తరపున ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, లూథ్రా, అభిషేక్‌మను సింఘ్వీలు వాదించినా ఫలితం లేకపోయింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరపు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం సమ్మతించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..? ఎన్నికలతో ఏం సంబంధం?’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్‌పైకి నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరపు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. ఉండవల్లి ఓ రాజకీయ నేత అని పేర్కొంటూ గతంలో హైకోర్టు తీర్పుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ తెలుగులో ఉన్న వీడియో రికార్డులు తర్జుమా చేసి మరీ వినిపించారు. అయితే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించవచ్చని, అదేమీ తప్పు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల తీర్పులపై విశ్లేషణలు జరగాలనే తాము కోరుకుంటామని తెలిపింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి చదువుకున్న వ్యక్తులు విశ్లేషిస్తే మరింత మంచిదని కూడా వ్యాఖ్యానించింది. మేమే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం కదా...? అంటే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించినట్లే కదా? అని ప్రశ్నించింది. దాంతో తప్పించుకునేందుకు రామోజీ వేసిన అన్ని ఎత్తుగడలు బెడిసికొట్టాయి. అక్రమ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు ఆరు నెలల్లో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యావజ్జీవ ఖైదు...రెండింతల జరిమానా! మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే రామోజీరావుకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. దీంతోపాటు ఆయన సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.2,600 కోట్లకు రెట్టింపు జరిమానా విధించవచ్చన్నారు. దీన్నిబట్టి రామోజీకి రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.5,200 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు
సాక్షి, అమరావతి: పచ్చళ్ల వ్యాపారి... చిట్‌ఫండ్ సంస్థ యజమాని... పత్రికాధిపతి... ఫిల్మ్ సిటీ అధినేత... ఇవన్నీ చెరుకూరి రామోజీరావు ధరించిన లొసుగుల ముసుగులే! దశాబ్దాలుగా సాగించిన అక్రమ డిపాజిట్లే ఆయన దోపిడీకి రాచబాట. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు నివేదించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడే అన్నది స్పష్టమైంది. చిట్‌ఫండ్స్ బోర్డు.. ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు 2006 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వరకు ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్లు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపించేవి. ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించిందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం కింద నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీ తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లెంపలేసుకుని.. ‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేయడంతో రామో జీ తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. అంతా నల్లధనం దందానే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకనే డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ♦ కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీ నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓలుగా మార్చారు. ♦ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్‌దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ♦ రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు డిపాజిట్‌దారులకు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా రామోజీకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ పెద్దలు, ఆయన గ్యాంగ్‌వేనని తెలుస్తోంది. -
చెరుకూరి త్రిపాత్రాభినయం
సాక్షి, అమరావతి: ప్రేక్షకులను అలరించేందుకు కథానాయకులు కొన్ని సినిమాల్లో ద్విపాత్రా భినయం... త్రిపాత్రాభినయం చేయటాన్ని చూస్తుంటాం. చట్టం కళ్లకు గంతలు కట్టి ఆర్థిక అక్రమాలకు పాల్పడేందుకు త్రిపాత్రాభినయం చేయడం మాత్రం చెరుకూరి రామోజీరావుకే చెల్లింది. ఆర్బీఐ కళ్లుగప్పేందుకు చెరుకూరి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఆర్బీఐను బురిడీ కొట్టించేందుకే... ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. కాగా రామోజీరావు తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అంటే హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. దీనిపై ఆర్బీఐగానీ ఇతర దర్యాప్తు సంస్థలుగానీ ప్రశ్నిస్తే తప్పించుకునేందుకు ఆయనో ఎత్తుగడ వేశారు. అదే త్రిపాత్రాభియనం... సాంకేతిక కారణాలతో తప్పించుకునే ఎత్తుగడ చెరుకూరి రామోజీరావు అనే వ్యక్తి ఏకకాలంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్ రశీదులపై హెచ్‌యూఎఫ్ కర్తగా... చెక్కులపై ప్రొప్రైటర్‌గా... బోర్డు మీటింగుల మినిట్స్ బుక్‌లో చైర్మన్‌గా సంతకాలు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనేది చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ. ఆ సంస్థ ముసుగులో ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించారు మరి. సాంకేతిక కారణాలను సాకుగా చూపించి తప్పించుకునేందుకే రామోజీరావు ఇలా వేర్వేరు హోదాలతో సంతకాలు చేశారన్నది సుస్పష్టం. కరడుగట్టిన ఆర్థిక నేరస్తులు మినహా ఇతరులు ఇంత పక్కాగా మోసగించలేరని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. డిపాజిట్ పత్రాలపై హెచ్‌యూఎఫ్ కర్తగా... మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విలువ మేరకు తమ డిపాజిట్‌దారులకు పత్రాలను జారీ చేసింది. వాటిపై రామోజీరావు తనను తాను ‘హెచ్‌యూ ఎఫ్ కర్త’గా పేర్కొంటూ సంతకం చేశారు. బోర్డు మీటింగులో చైర్మన్‌గా... ఇక మార్గదర్శి ఫైనాన్సియర్స్ బోర్డు మీటింగుల విషయం వచ్చేసరికి రామోజీరావు మరో పాత్రలోకి ప్రవేశించారు. బోర్డు మీటింగు మినిట్స్ బుక్‌లో, తీర్మానాల్లోనూ ఆయన ‘చైర్మన్’ అని సంతకం చేశారు. చెక్కులపై ప్రొప్రైటర్‌గా... మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిట్‌దా రులకు కాలపరిమితి తరువాత చెక్కుల రూపంలో చెల్లింపులు చేసింది. ఆమేరకు జారీ చేసిన చెక్కులపై రామోజీరావు ‘ప్రొప్రైటర్’ అని పేర్కొంటూ సంతకం చేశారు. అంటే డిపాజిట్ రశీదు మీద హెచ్‌యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు చెక్కు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రొప్రైటర్ అయిపోయారు. -
అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యిమనిపించిన సుప్రీం..'డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే'
కోర్టు తీర్పుల్ని ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు. విమర్శించరాదంటూ లక్ష్మణ రేఖ ఎలా గీయగలం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేం ఆదేశించలేం.. – సుప్రీం కోర్టు సాక్షి, అమరావతి: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లను అక్రమంగా డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి స్వీకరించిన కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావుకు సుప్రీంకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. చట్ట ఉల్లంఘనకు పాల్ప డినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియ ర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ తేలప్రోలు రజని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందున తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా వసూలు చేసిన సొమ్ములను వెనక్కి ఇచ్చేశామంటే ఎంత మాత్రం సరిపోదని వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తి ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని, తాజాగా విచారణ చేపట్టి ఆర్నెళ్లలో ముగించాలని హైకోర్టుకు సూచించింది. స్వీకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని పేర్కొంది. డిపాజిట్లు వెనక్కి తీసుకోని వారి సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని హైకోర్టుకు సూచించింది. ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావుడిగా ఉన్న సమయంలో జస్టిస్ రజని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాధన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి, రామోజీరావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు తాజాగా మరోసారి విచారణకు వచ్చాయి. ఆంధప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏపీ హైకోర్టు ఏర్పాటు కావడానికి ఒక రోజు ముందు అంటే 31.12.2018న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే మూడేళ్ల క్రితం హైకోర్టు తోసిపుచ్చిన క్వాష్ పిటిషన్‌కు, ఈ తాజా క్వాష్ పిటిషన్‌కు ఎలాంటి తేడా లేదన్నారు. కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఏవీ లేకున్నప్పటికీ మరోసారి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. గతంలో హైకోర్టు తోసిపుచ్చిన అంశాన్ని దాచిపెట్టి ఈ పిటిషన్ వేశారని నివేదించారు. ఈ సమయంలో మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ జోక్యం చేసుకొంటూ.. సేకరించిన రూ.2,600 కోట్లను 1,247 మంది డిపాజిటర్లకు 30.6.2023 నాటికి తిరిగి ఇచ్చేశారని చెప్పారు. సొమ్ము తీసుకున్న వారు కానీ, ప్రాసిక్యూషన్ స్టేట్ తెలంగాణ గానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రూ.5.31 కోట్లు అన్ క్లెయిమ్డ్ మొత్తం మాత్రమే మిగిలి ఉందన్నారు. రూ.5 వేలు డిపాజిట్‌దారులు కోర్టుకొచ్చి పోరాడగలరా..? ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ... సొమ్మంతా ఇచ్చేశారా? లేదా? ఫిర్యాదు చేశారా లేదా? అనే విషయాలు సమస్య కాదు. తీర్పులో హైకోర్టు ఏం చెప్పిందన్నదే ఇక్కడ ముఖ్యం. మొత్తం డిపాజిటర్లు ఇంత మంది ఉన్నారు.. ఇంత మొత్తం సొమ్ము ఉంది.. ఇస్తానన్న వడ్డీ, డివిడెంట్‌తో కలిపి ఇంత మొత్తం అయింది. ఆ తర్వాత సొమ్ములు ఇచ్చేశారు అనే విషయాలు తీర్పులో ఎక్కడున్నాయి? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాల్లో బయటకు రాలేని వ్యక్తుల సమస్యలు కూడా ఆలోచించాలన్నారు. రూ.5 వేలు డిపాజిట్ చేసిన వారు వేల రూపాయిలు ఖర్చు చేసి కోర్టుకు వచ్చి పోరాడగలరా? అని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న డిపాజిటర్ల గురించి హైకోర్టు పబ్లిక్ నోటీసు ఎందుకు ఇవ్వలేదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ వాదన కూడా వినాలి కదా...! అనంతరం సింఘ్వీ తన వాదనలు కొనసాగిస్తూ.. ఫిర్యాదుదారు ఏపీ ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి కృష్ణరాజు అని, ప్రాసిక్యూట్ స్టేట్ తెలంగాణ ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. సుప్రీంకోర్టుకు రావడానికి ఏపీ ప్రభుత్వం 1,236 రోజులు ఆలస్యం చేసిందనడంతో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ డిపాజిటర్లు ఏపీలో కూడా ఉంటారు కదా? వారి వాదన ఆ రాష్ట్రం ద్వారానే కదా వినాలి? అని ప్రశ్నించారు. అయితే ఏపీ ప్రభుత్వం తొలుత రాలేదని సింఘ్వి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పునిచ్చే సమయంలో నిర్దిష్ట విధానాన్ని అనుసరించలేదనే విషయాన్ని తాము ప్రశ్నిస్తున్నామని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లడం లేదని, అందరికీ అవకాశాలు తెరిచే ఉంచుతామన్నారు. హైకోర్టులో ప్రతివాదులందరూ వాదనలు వినిపించలేదని గుర్తు చేశారు. ఈ కేసును తిరిగి హైకోర్టుకు పంపుతామని తేల్చి చెప్పారు. మార్గదర్శిపై ఫిర్యాదులు లేవు... మార్గదర్శిపై ఇప్పటి వరకూ ఫిర్యాదులు లేవని, ఇప్పుడు వస్తాయని సింఘ్వి పేర్కొనగా.. సొమ్ములు మీవద్దే ఉంటే ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకొస్తారని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హైకోర్టుకు పంపడానికి ఏమీ లేదని, ఇక్కడే ఆదేశాలు ఇవ్వాలని సింఘ్వీ గట్టిగా కోరారు. ఈ సమయంలో నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ కొత్త పరిణామాలు ఏమీ లేకుండా ఒకసారి హైకోర్టు తోసిపుచ్చిన అంశాలతోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. హైకోర్టు ముందు వాదనలు జరిగిన సమయంలో తెలంగాణ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్కరే హాజరయ్యారన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడగా ఆ సమయంలో కోర్టు మాత్రం ఒక్కటే ఉందన్నారు. ఉల్లంఘనలు బయటకు రాగానే ఆ సమయంలో కొన్నాళ్లు డిపాజిట్లు నిలుపుదల చేసి మళ్లీ రూ.2,600 కోట్లు వసూలు చేశారని నిరంజన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని ఇదంతా ప్రస్తుతం అనవసరమన్నారు. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదు... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మీ తరఫున ముగ్గురు దిగ్గజాలు (సింఘ్వీ, రోహత్గీ, లూథ్రా) ఉన్నారంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదని అభిప్రాయపడింది. గతంలో జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సింఘ్వీ ప్రస్తావిస్తుండగా.. అదంతా తమకు తెలుసునని, ఆ ఉత్తర్వులను పరిశీలించామని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఇదేమీ సహారా, ఆమ్రపాలి తరహా కేసు కాదని, రూ.5.31 కోట్లు మినహా మిగతా సొమ్ము అంతా వెనక్కి ఇచ్చేశామని, మొత్తం 70 వేల పేజీల రికార్డు సుప్రీంకోర్టుకు అందజేశామని సింఘ్వీ పేర్కొన్నారు. మొత్తం డిపాజిటర్లు ఎంత మంది? అని ధర్మాసనం ప్రశ్నించడంతో 2.7 లక్షల మంది అని సింఘ్వీ సమాధానమిచ్చారు. చెల్లించారో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి... తొలుత ముందుకు రాని ఏపీ ప్రభుత్వం సడన్‌గా ఎందుకు వచ్చిందో కూడా అర్థం చేసుకోగలమని, అయితే దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపుతామని, అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా వాదనలు వినిపిస్తుందని, విచారణ పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. రూ.2,600 కోట్లు తిరిగి చెల్లించేశామని సింఘ్వీ మరోసారి ప్రస్తావించడంతో... ఈ వాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టుకు నివేదించాల్సి ఉందని న్యాయమూర్తి తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ వాదనే విన్నారని, అయితే హైకోర్టు ఏ ప్రక్రియ అనుసరించిందనేది పరిశీలించాలని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. పబ్లిక్ నోటీసు కన్నా మిన్నగానే తిరిగి చెల్లింపులు చేశామని, భవిష్యత్ మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆర్బీఐ స్టేటస్ రిపోర్టు ఇచ్చిన అంశాన్ని ఆయన గుర్తుచేయగా.. దాన్నేం మార్చలేం కదా? ఇప్పుడు అది అప్రస్తుతం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏమున్నా తెలంగాణ హైకోర్టులోనే.. సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ.. అదృష్టమో, దురదృష్టమో రామోజీరావు ఈనాడు పబ్లిషర్ కావడంతో చాలా విషయాలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఈనాడు చాలా పాత పేపరని, ఈటీవీ కూడా ఉందన్నారు. నాలుగేళ్లుగా ఈనాడు తమపై వార్తలు రాస్తోందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ముందుకు వచ్చిందని ఆరోపించారు. ఇదంతా హైకోర్టులో చెప్పుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.5 కోట్లు మాత్రమే ఉన్నందున ఉండవల్లి పిటిషన్‌ను కొట్టివేసి, భవిష్యత్తు మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ మరోసారి కోరగా హైకోర్టు ఎదుటే చెప్పుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్కడొద్దు.. మీరే పరిష్కారం చూపండి ఈ సమయంలో మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసును తెలంగాణ హైకోర్టు పంపొద్దని అభ్యర్థించారు. ఈ కేసు చాలా పాతదని, సుప్రీంకోర్టులోనే పరిష్కార మార్గం చూపాలని కోరారు. తగిన మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్నారు. అయితే తాము కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని, నిర్దిష్ట కాలపరిమితితో కేసును పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సూచిస్తామని ధర్మాసనం పేర్కొంది. అనంతరం మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదనలు ప్రారంభిస్తుండగా... ఆ పిటిషన్ ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఆర్డర్లో హెచ్‌యూఎఫ్ విషయంలో వచ్చిన తప్పును సవాల్ చేశామని లూథ్రా తెలిపారు. ఇది ప్రస్తుతం అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టు అందరి వాదనలు వినాలి... ‘‘పిటిషన్ దాఖలులో ఏపీ ప్రభుత్వ జాప్యాన్ని మన్నిస్తున్నాం. ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎస్సెల్పీ విచారణ అర్హతతోపాటు పార్టీ ఇన్ పర్సన్‌గా అనుమతిస్తున్నాం. 31.12.18న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు తిరిగి విచారించాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆర్బీఐ, ఉండవల్లి అరుణ్‌కుమార్, రామోజీరావు, అన్‌క్లయిమ్ డిపాజిటర్ల వాదనలు విని ఆరు నెలల్లోగా ఈ కేసును తేల్చాలి. అన్ క్లెయిమ్డ్ డిపాజిటర్ల సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు ఒక న్యాయాధికారిని నియమించాలి’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలాంటి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేం... కోర్టు తీర్పులపై ఏపీ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని రామోజీరావు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా నివేదించారు.ఏపీ ప్రభుత్వానికి సాక్షి పత్రిక ఉందని, దాంట్లో రామోజీరావుపై కథనాలు రాయకుండా నియంత్రించాలని కోరారు. ఈ దశలో నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ రామోజీరావుకే ఈనాడు, ఈటీవీ ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సాక్షి పత్రికతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. తాను చట్టబద్ధంగా దీన్ని నిరూపించగలనని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎలాంటి గ్యాగ్ ఆర్డర్లు ఇక్కడ ఇవ్వలేమని, కోర్టులో ఏం జరిగిందో చెప్పుకోవచ్చని, అదే సమయంలో జరగనిది చెప్పడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్‌కుమార్ దాన్ని తప్పు పట్టారని లూథ్రా పేర్కొనడంతో దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఉండవల్లి మాజీ ఎంపీ, ప్రజా క్షేత్రంలో ఉంటారని వ్యాఖ్యానించింది. ప్రజల కోసమే ఉండవల్లి సుప్రీంకోర్టు వరకూ వచ్చారని, అదే సమయంలో కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించి ఉంటారని పేర్కొంది. ‘కోర్టు తీర్పులను కొందరు స్వాగతిస్తారు. మరికొందరు విమర్శిస్తారు. కోర్టు తీర్పులను ఒక్కొక్కరూ ఒక్కోలా చూడరాదంటూ మేం లక్ష్మణ రేఖ గీయలేం. ఈనాడు పత్రికకు ఏపీ ప్రభుత్వం వ్యతిరేకమన్న భావనతో అలా వ్యవహరించొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం కదా! ప్రజాక్షేత్రంలో ఉండేవారు మీడియా ముందు అనేక విషయాలు ప్రస్తావిస్తారు. మీడియా వాటిని రాస్తుంది. ఎవరినీ నియంత్రించలేం. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఇరు పక్షాలు కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాని స్పష్టం చేసింది. కత్తితో తిరగబడాలని లూథ్రానే చెప్పారు.. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆయన తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్‌లు స్పందిస్తూ తాను ఎవరిపైనైనా వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి పరుష పదాలు వినియోగించలేదన్నారు. రామోజీరావుకు ఏదో అయిపోవాలని ఇక్కడకు రాలేదన్నారు. ఈ సమయంలో గతంలో సిద్దార్ధ లూత్రా చేసిన ఓ ట్వీట్ (స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రాని సందర్భంలో)ను ఉండవల్లి గుర్తు చేశారు. ఎక్కడా విజయం సాధించకపోతే ప్రజలు కత్తితో తిరగబడే అవకాశం ఉందంటూ ఒకరు సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తానెప్పుడూ అలా చేయలేదని లూథ్రా పేర్కొనగా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి తెలిపారు. తాను 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, వ్యక్తిగతంగా విమర్శించినట్లు ఎవరూ అనలేదన్నారు. ఈ కేసు పూర్తయ్యే వరకూ ఎక్కడా, ఎవరూ, ఏమీ మాట్లాడకూడదని ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలా ఎలా ఆదేశాలు ఇవ్వగలమని ప్రశ్నించింది. ఇరు పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ ఆరు నెలలు వారికి పరీక్ష లాంటిదని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రజా క్షేత్రంలో ఉన్నవారిని నియంత్రించడం సాధ్యం కాదన్నారు. -
మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ‘‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. .. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్‌లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హై కోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్ బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, అలాగే.. ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి.ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టు లో వాదనలు వినిపించండి’’ అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఏపీ వాదనలు: కేసు నడుస్తుండగా రూ,2,300 కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారు ఏపీ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి మార్గదర్శి వాదనలు: 2.7 లక్షల డిపాజిటర్లు ఉన్నారు అందరికీ డబ్బు తిరిగి చెల్లించాము సుప్రీం కోర్టులో ఉండవల్లి.. ‘‘రామోజీ రావు అంటే అందరికీ భయం.. రామోజీ రావుకు నేనంటే భయం’’. ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉంది’ : రామోజీ తరఫు న్యాయవాదులు ‘‘అయితే ఎంటీ... ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేం’’: సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సాక్షి టీవీతో ఉండవల్లి మాట్లాడుతూ.. తన 17 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నిజమే అని రుజువైంది. దేశంలో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైంది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే నేరం. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటే చెల్లదు. 45Sకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే చట్టవిరుద్ధం. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణకు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మా తరఫున సుప్రీంకోర్టు మార్గదర్శిని అనేక ప్రశ్నలు అడిగింది. ఈ కేసు గురించి నేను మాట్లాడకుండా చేయాలన్న రామోజీరావు ప్రయత్నం విఫలమయ్యింది. ఆఖరికి.. నాపై గ్యాగ్ ఆర్డర్ తేవాలని ప్రయత్నం చేశారు. కానీ, నా పోరాటం వృథా కాలేదు’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. నేపథ్యం ఇదే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్నది రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఉన్న ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ 2006లో మార్గదర్శి రూ.2,300 కోట్ల డిపాజిట్లను సేకరించిదని ఉండవల్లి అప్పట్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చర్యలకు సిద్ధమైన అప్పటి ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ క్రమంలో 2008లో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అవ్వగా.. దాన్ని కొట్టివేయాలంటూ పదేళ్ల తరువాత మార్గదర్శి సంస్థ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31 మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో చట్టాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శిపై క్రిమినల్ కేసు కొట్టివేశారని, ఆ తీర్పును సమీక్షించాలని 2019లో ఉండవల్లి సుప్రీం కోర్టులో ఆశ్రయించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు కూడా. అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. గత విచారణే కీలకం మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. -
కరెంటు ఆపడం కొత్తేం కాదు
సాక్షి, అమరావతి: ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు, వేగంగా తుపాను గాలులు వీస్తున్నప్పుడు, అల్పపీడనం కారణంగా జోరుగా వాన కురుస్తున్నప్పుడు మాత్రమే కాదు రోడ్డు మీద భారీ లోడ్‌తో ఉన్న వాహనం వెళుతున్నప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. లక్షలాది జనం ఒకే రహదారి వెంట బారులుతీరినప్పుడు, తమ నాయకుడిని చూడాలని వేలాది మంది భవనాలపై నిలబడినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు తీగలు తగిలే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి సమయాల్లో అనుకోనిది ఏదైనా జరిగి తీగలు తెగి జనం మీద పడినా, ట్రాన్స్ఫార్మర్ తగిలి షాక్‌కు గురైనా అమాయకుల ప్రాణాలు క్షణాల్లో పోతాయి. అలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రముఖుల పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలు జరుగుతున్న ప్రదేశాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను కాసేపు నిలిపివేస్తుంటారు. ఇది అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న చర్య మాత్రమే. దీనిని కూడా రాజకీయం చేయాలని చూశారు ఈనాడు రామోజీ. ‘జగన్ వస్తే కరెంట్ వైర్లకు కత్తిరింపే’ అంటూ ఈనాడులో వంకర రాతలు రాశారు. ప్రజల ప్రాణాలు పోతే మా కెందుకు మా అజెండా మాదే అన్నట్లు రాసిన ఆ తప్పుడు కథనాన్ని విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి మరోమారు అక్కసు వెళ్లగక్కారు. ఈ అసత్య రాతలపై ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ కె.సంతోషరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రముఖుల రోడ్ షో సందర్భంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సహజంగా జరిగేదేనని ఆయన వివరించారు. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జన సందోహం ఎక్కువై విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ప్రముఖుల పర్యటన జరిగినా ఇదే పద్ధతిని అవలంభిస్తున్నామని స్పష్టం చేశారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారి పర్యటనల సమయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. అప్పుడు మాత్రం ప్రభుత్వం కావాలనే, వారి పర్యటనకు ఆటంకం కలిగించడం కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసిందంటూ ఇదే ఈనాడు కథనాలు రాస్తోంది. ఇటీవల పవన్ పర్యటనలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అలాంటి దుర్ఘటనలు జరగకూడదనే విద్యుత్ శాఖ అధికారులు కరెంటు నిలిపివేస్తుంటే దానిపైనా పడి ఏడ్వడం రామోజీకే చెల్లింది.