Yellow Media False propaganda
విషం చిమ్మడమే రామోజీ ఎజెండా
చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కుట్రలు
జీవిత చరమాంకంలో పరువు కోసం ప్రయత్నాలు
చంద్రబాబు కోసం అబద్దాలు, అసత్యాల ప్రచారం
రామోజీ కుటిల నీతిపై ధ్వజమెత్తిన ప్రవాసాంధ్రుడు
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వైరి పక్షాల మధ్య మాటల యుద్ధం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది . కానీ మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండగా.. చంద్రబాబు కోసం కొన్ని పత్రికలు, ఛానళ్లు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగి తెలుగుదేశం కంటే కూడా ఎక్కువగా చావో రేవో అన్నట్లుగా వైఎస్సార్‌సిపి మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. నిత్యం నీతులు వల్లించే రామోజీ ఇప్పుడు విలువలను విడిచి చంద్రబాబు కోసం గారడీలు చేయడం దీనికి పరాకాష్ట.
నిజానికి రామోజీ మొదటి నుండీ వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేస్తూనే ఉన్నాడు, కాకపోతే పాతరోజుల్లో నగ్నంగా కనిపించకుండా ముసుగు వేసుకొని టీడీపీకి కొమ్ముకాసేవాడు. ఇప్పుడు ఈ ముసుగులన్నీ తొలగించి నగ్నంగానే విచ్చలవిడిగా అన్ని కట్టుబాట్లు గాలికొదిలేసి పుఖానుపుంఖాలుగా విషం చిమ్ముతున్నాడు. ఈనాడు పత్రికను చూస్తే.. అవసానదశలో కూడా రామోజీ ఎంత నీచ స్థాయికి దిగజారిపోయాడో అని ఆశ్చర్యంగా ఉంది. అంతెందుకు, నా సొంత అనుభవాన్నే తీసుకోండి. ఎటువంటి ఆధారాలూ లేకుండా "సీబీఐ వెతుకుతున్న నిందితుడు" అనే హెడ్‌లైన్ పెట్టి ఈనాడులో మూడ్రోజులు అడ్డమైన రాతలు రాయడం .. రామోజీ దిగజారుడు తనానికి పరాకాష్ట. విచిత్రంగా అసలు కేసు ఏమిటి? అది నిజంగా ఇంకా వుందా లేదా? ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో వుంది? నోటీసులు ఇచ్చారా లేదా? ఇస్తే ఏ రకమైన నోటీసులు ఇచ్చారు? ఆ నోటీసులు ఇంకా అమల్లో ఉన్నాయా? ఇలాంటివేవీ ఆ మూడ్రోజుల రాతల్లో ఎక్కడా కనిపించలేదు. కనీసం కేసు తాలూకు వివరాలు తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు .
లుక్ అవుట్ అంటే ఏమిటి ? ఇంటర్‌పోల్ అంటే ఏమిటి? అవి ఏ ఏ దేశాలలో ఏ విధంగా పనిచేస్తాయో అన్న కనీస అవగాహన లేకుండా .. ఏదో అంతర్జాతీయ ఉగ్రవాది కేసు చేధించినట్లు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రధాన వార్తగా అచ్చేశాడంటే .. రామోజీ ఎంత అభద్రతా భావంలో బ్రతుకుతున్నాడో తెలుస్తుంది. పేరు మార్చానంట... వేషం మార్చానంట. సినిమా వాళ్ళు కూడా ఇంత పకడ్భందిగా స్టోరీ అల్లలేరు. ఎవరో ఇచ్చిన స్టోరీని కనీసం నిజానిజాలు నిర్దారించుకోకుండా యధాతధంగా అచ్చేసి రామోజీ శునకానందం పొందటం తప్పితే ఇందులో ఎలాంటి నిజాలు లేవు.
పుట్టినప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరుతోనే వున్నాను, వయస్సుతో వచ్చిన మార్పులు తప్పితే వేషంలో కూడా ఎలాంటి మార్పులు లేవు. జుట్టు ఊడిపోతే విగ్గురాజు లాగా విగ్గు ఎందుకులే అని స్టయిలిష్‌గా ఫుల్ షేవ్ చేస్తాను . నన్ను వ్యక్తిగతంగా ఎరిగిన ప్రతీ ఒక్కరికీ ఈ విషయాలు తెలుసు. నా మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి నోటీసులు లేవు . గుండుతో ఉంటే ఎయిర్‌పోర్టులో వదిలేస్తారా ? రామోజీకి మన వ్యవస్థల మీద ఎంత చిన్న చూపు వుందో అర్థం చేసుకోండి.
నా మీద వార్త రాస్తున్న సమయంలోనే ప్లాన్ లో భాగంగా నా ఫేస్‌బుక్ అకౌంట్ మీద రిపోర్టులు కొట్టించి 24 గంటలు బ్లాక్ అయ్యేలా కుట్ర పన్నారు. పైగా "చూశారా, అకౌంట్ కూడా క్లోజ్ చేసాడని" అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు . నేను ఫేస్‌బుక్‌కి ఛాలెంజ్ ఆప్షన్ పెట్టి అకౌంట్‌ను వెనక్కి తెచ్చుకొని పోస్ట్ పెట్టేవరకూ యెల్లో మీడియా అంతా చెలరేగిపోయింది.
చిన్నప్పటి నుండీ పత్రికల్లో రాతలకి, రోత రాజకీయాలకి , ఎన్నికలప్పుడు ప్రచారం చేసే పుకార్లకు అన్నిటికీ అలవాటు పడ్డవాళ్ళం కాబట్టి రామోజీ రాతలు చూసి మనకేదో పబ్లిసిటీ వచ్చిందిలే అని నవ్వుకున్నాం కానీ ... అదే నా స్థానంలో గీతాంజలి లాంటి అభాగ్యులు వుంటే అలాంటి వార్తలకు ఎంతమంది తట్టుకొని నిబ్బరంగా ఉండగలరు.? ఒకపక్క సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ వార్తలకే ప్రాణాలు తీసుకొంటుంటే .. ఈనాడు లాంటి ప్రధాన పత్రికలో మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో కధనాలు వస్తే ఎంతమంది తట్టుకొని నిలబడగలరు?
ఇదే విషయమై మొన్న ఈనాడులో పనిచేసిన పాతతరం జర్నలిస్టులు కలిసినప్పుడు చర్చకి వస్తే వాళ్ళు చెప్పిన గత సంగతులు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే! వాళ్ళు చెప్పిన దాని ప్రకారం .. రామోజీ మాట వినని ప్రభుత్వ అధికారులమీద , వివిధ వ్యవస్థలలో ఉన్న అనేకమంది ప్రముఖుల మీద , ఆఖరికి సొంత వ్యవస్థలో పనిచేసే వాళ్ళ మీద కూడా ఇలాంటి దొంగ వార్తలు రాసి దారికి తెచ్చుకొనేవాడట . అలా తన దారికి రానివాళ్ళమీద మరింత విషపూరితంగా రాసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడట. ఇది రామోజీ దగ్గర అనేక సంవత్సరాలుగా దగ్గరగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు చెప్పిన సంగతులు.
రామోజీ ఇంత నీచస్థాయికి దిగజారటానికి కారణాలు ఏమిటి ?
తరచి చూస్తే కారణాలు సుస్పష్టం. రామోజీ తన జీవితపు అవసాన దశలో ఉన్నాడు. నిజానికి ఈ వయస్సులో ఎవరైనా మరింత హుందాగా గౌరవం పొందాలని .. శత్రువులతో కూడా మంచి అనిపించుకోవాలని తాపత్రయపడతారు. నలభై ఏళ్లుగా తన టక్కుటమారా విద్యలతో ఒంటికి తెల్లని బట్టలు ముసుగుగా తొడిగి మీడియాని అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నిటినీ చెరబట్టాడు, అధికారం అండతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా తనకి ఎదురు తిరిగిన ఎన్టీఆర్ ని దించి చంద్రబాబుని ఎక్కించటంలో సఫలీకృతుడు అవ్వటంతో ఇక తనకి ఎదురే లేదని, తానే సర్వాంతర్యామి అనే స్థాయికి చేరుకున్నాడు.
చంద్రబాబు వెన్నుపోటు దిగ్విజయం అవ్వటంతో తాను తలచుకుంటే ముఖ్యమంత్రులను దించేయగలననీ .. అనుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయగలనని భయపెట్టగలిగాడు. చంద్రబాబు హయాంలో రామోజీకి ఎదురు లేకుండా పోయింది. ఫిలింసిటీకి రూపకల్పన చేసి వేల ఎకరాలని దోచుకొని ఆఖరికి రాష్ట్రం విడిపోవటానికి బీజాలు కూడా వేసాడు. విడిపోయిన రాష్ట్రానికి తన మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం .. ఆ ఊపులోనే దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ రావటంతో ఇక తనకి తిరుగే లేదని .. తాను దేవేంద్రుడంతటి వాడినని తనకో రాజధాని కావాలనే ఉద్దేశ్యంతో దానికి అమరావతి పేరు పెట్టి ' ఇది మారాజ్యం / మా ఏలుబడిలో ఉన్న రాజ్యం ' అని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే కుఠిల బుద్ధితో ఎన్నో అరాచకాలు చేసారు.
2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఈడ్చికొట్టడం, ఆ తరువాత మార్గదర్శి కేసులో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో రామోజీకి కళ్లు బైర్లు కమ్మినట్టయింది. మార్గదర్శి ఫైనాన్సియల్ మీద ఎంక్వయిరీ జరుగుతుండడంతో తన మోసాలు బట్టబయలు అవ్వటం ఖాయమని నిర్దారించుకున్నాడు రామోజీ. మార్గదర్శిలో అక్రమంగా డిపాజిట్లు సేకరించటమనేది కేసులో ఒక పార్శం మాత్రమే. వాస్తవానికి నిజమైన డిపాజిట్ దారులు 10 శాతం మంది మాత్రమే, మిగతా డబ్బంతా చంద్రబాబు బినామీదారులే... నల్ల డబ్బుని .. ఎల్లయ్య, పుల్లయ్య పేరులతో డిపాజిట్ దారులుగా రికార్డులు సృష్టించి మార్గదర్శిలో దాచుకున్నారు. అందుకే ఫిర్యాదు ఇచ్చే వాళ్లు కనిపించరు. ఎందుకంటే అక్కడ ఉన్నది 90 శాతం ఫేక్ డిపాజిట్ దారులే. కేసు ముందుకి వెళ్లే కొద్దీ ఈ అసలైన ఈ విషయం బయటకొస్తుంది. వీటన్నిటి నుండి రామోజీ తప్పించుకోవటం అసంభవం.
రామోజీకి ఇప్పుడు 88 ఏళ్ళు. జీవితపు అవసాన దశలో ఉన్నాడు. కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో ఉన్నప్పుడు మరణిస్తే శాశ్వత కీర్తి వస్తుంది. ఎవరైనా అదే కోరుకొంటారు. కానీ రామోజీ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది . అందుకే రామోజీ కంపించిపోతున్నాడు. కేసులలో తనకి శిక్ష పడటం ఖాయమని.. సమాజానికి తన నిజ స్వరూపం బట్టబయలు అవ్వటంతో పాటుగా కేంద్రం ఇచ్చిన పద్మవిభూషణ్ కూడా తిరిగి తీసుకుంటారని .. ఇది దేశంలో మరెవ్వరికీ జరగని ఘోరమైన అవమానమని రామోజీ భయకంపితులవుతున్నాడు. అవమానభారంతో మరణిస్తే ఇన్ని రోజులు తన టక్కుటమారా విద్యాలతో నిర్మించిన సామ్రాజ్యం , సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అన్నీ కుప్పకూలిపోవటం ఖాయమని , రామోజీ అనేది ఒక విషపురుగుగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుందనే ఆందోళనలో రామోజీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు .
ఇదంతా తప్పించుకోవాలంటే రామోజీ ముందున్న ఏకైక మార్గం మళ్ళీ చంద్రబాబుని ముఖ్యమంత్రి చెయ్యటం . అదొక్కటే రామోజీ ముందున్న పరిష్కారం . అందుకోసమే ఎన్నడూ లేనంతగా దిగజారి విషం చిమ్ముతున్నాడు . రాజకీయపార్టీల కంటే కూడా స్వయంగా తానే పోటీ చేస్తున్నట్లు భావిస్తూ పేపర్ మొత్తాన్ని విషంతో నింపేస్తున్నాడు. గడచిన కొద్ది నెలలుగా ప్రధాన శీర్షికలని గమనించండి. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా నిజం లేకుండా ప్రభుత్వం మీద మీద ఊహించనంత స్థాయిలో విషం చిమ్ముతూ తాను ఎంత ఆందోళనలో ఉన్నాడో చెప్పకనే చెప్తున్నాడు. విషయం చిన్నదా, పెద్దదా? నిజమా, అబద్దమా? అనే దానితో నిమిత్తం లేకుండా ఏదో రకంగా ఎదుటి పక్షానికి నష్టం చేయాలి .. ఈనాడు పరువుపోయినా ఫరావాలేదు .. కొద్దిమంది నమ్మినా అంతే చాలు .. అనే తరహాలో సిగ్గు విడిచేసి పుంఖానుపుంఖాలుగా వార్తలని వండి వారుస్తున్నాడు .
అందుకే పౌర సమాజం మేల్కోవాలి , నిజాలని గ్రహించి సమాజపు భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. దానికి ఒక తేదీ ఉంది. జూన్ 4, 2024.
శివ అన్నపురెడ్డి, అమెరికా
Comments
Please login to add a commentAdd a comment