మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం | RBI report exposes Ramoji scams | Sakshi
Sakshi News home page

మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం

Published Sun, Aug 18 2024 7:52 AM | Last Updated on Sun, Aug 18 2024 11:46 AM

RBI report exposes Ramoji scams

తన ఆర్థిక అక్రమాలు బట్టబయలుతో రామోజీ బెంబేలు 

నాడు వైఎస్సార్‌పై... నేడు జగన్‌పై ఈనాడు దుష్ప్రచారం

ప్రజల్ని మభ్యపెట్టేందుకు పుంఖానుపుంఖాలుగా కట్టుకథలు 

తాజాగా ఆర్‌బీఐ నివేదిక సాక్షిగా రామోజీ మోసాలు బట్టబయలు

సాక్షి, అమరావతి: “నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక..! అన్నది తమ నినాదమని ఈనాడు పత్రిక నీతులు వల్లిస్తూ ఉంటుంది. నిజానికి రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి ‘మార్గదర్శి’ పునాది కాగా ‘ఈనాడు’ ఆ అరాచకాలకు దశాబ్దాలుగా రక్షణ కవచంలా నిలుస్తోంది!! మరి అలాంటి ‘మార్గదర్శి’ అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? పాత్రికేయ పైశాచికత్వం జడలు విప్పి కరాళ నృత్యం చేస్తుంది. 

అందుకే 2004 నుంచి 2009 వరకు  ముఖ్యమంత్రి నాడు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ఈనాడు పత్రిక అంతగా దుష్ప్రచారానికి తెగబడింది. వైఎస్సార్‌ హఠాన్మరణం తరువాత కూడా ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడింది. తదనంతరం 2019 నుంచి 2024 వరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు బరితెగించి విష ప్రచారం చేసింది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వక్రభాష్యం చెబుతూ రోజుకో రీతిలో బురద జల్లింది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రోజుకో రీతిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్నది అక్షరసత్యం.

 రామోజీరావు ముమ్మాటికీ ఆర్థిక ఉగ్రవాది అనే వాస్తవాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడంతోనే ఈనాడు అంతగా విషం చిమ్మిందన్నది నిరూపితమైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన నివేదికే ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో... అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఈనాడు ముసుగులో రామోజీ పాల్పడ్డ కుట్రలు తేటతెల్లమయ్యాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్ల కేసులో వాస్తవాలను వెల్లడిస్తూ తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ సమరి్పంచిన నివేదిక లోగుట్టును విప్పింది.

ఆర్థిక దోపిడీని అడ్డుకున్నారనే అక్కసుతోనే  
నాడు వైఎస్సార్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం
‘మార్గదర్శి ఫైనాన్సియర్స్‌’ ముసుగులో రామోజీరావు దశాబ్దాలుగా సాగించిన ఆర్థిక దోపిడీకి నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఫిర్యాదుతో 2006లో వైఎస్సార్‌ ప్రభుత్వం దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రామోజీరావు అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారని, అప్పటికే ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని నిగ్గు తేల్చింది. అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రామోజీరావు అక్రమాలను ప్రశ్నించడం కాదు కదా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ఆయన పేరు పలికేందుకు సాహసించ లేదు.

 ఈ క్రమంలో అశేష ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమకు ఏ రాజగురువూ అవసరం లేదని, ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్షగా భావించి దృఢ సంకల్పంతో వ్యవహరించారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ మూసివేయడంతో రామోజీరావు ఆర్థిక అక్రమ సామ్రాజ్యం పునాదులు కదలిపోయాయి. దశాబ్దాలుగా తాను సాగిస్తున్న ఘరానా మోసానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడ్డుకట్ట వేయడాన్ని ఆయన సహించలేకపోయారు. దాంతో పట్టరాని ఆక్రోశం, విద్వేషంతో వైఎస్సార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో నిత్యం పేజీలకు పేజీలు తప్పుడు వార్తలు రాయించారు. యావత్‌ వైఎస్సార్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దు్రష్పచారానికి తెగించారు. అయితే రామోజీ బ్లాక్‌ మెయిల్‌ పాత్రికేయానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెరవలేదు. ఆయనతో ఏమాత్రం రాజీ పడలేదు.  

తలొగ్గిన తరువాత ప్రభుత్వాలు 
ఆ అక్రమాలకు అండగా చంద్రబాబు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనాడు రామోజీరావుకు జీహుజూర్‌ అన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ ఆర్థిక అక్రమాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వమే కేసు పెట్టిందనే విషయాన్ని విస్మరించి నీరుగార్చారు. అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ స్వయంగా రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్ల  గురించి ప్రస్తావించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ఎంత కోరినా ఆలకించలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రామోజీరావు అక్రమాలకు రక్షణ లభించింది. దాంతో గుట్టుచప్పుడు కాకుండా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ కేసును క్లోజ్‌ చేసేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్‌లో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం ద్వారా రామోజీ అక్రమాలకు రక్షణగా నిలిచింది.

అక్రమాల పుట్ట మార్గదర్శి చిట్‌ఫండ్స్‌.. నిగ్గు తేల్చినందుకే జగన్‌పై దుష్ప్రచారం
రామోజీ నెలకొల్పిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కూడా ఆర్థిక అక్రమాల పుట్టేనని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. చందాదారుల ఫిర్యాదులతో స్టాంపులు–రిజి్రస్టేషన్ల  శాఖ, సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించడంతో అక్రమాలు బట్టబయలయ్యాయి. కేంద్ర చిట్‌ ఫండ్స్‌ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లలో అక్రమంగా పెట్టుబడి పెడుతున్నట్లు గుర్తించారు. చందాదారులకు ప్రైజ్‌మనీ ఇవ్వకుండా రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. 

బ్రాంచి కార్యాలయాల్లోని నగదు నిల్వలలను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. నకిలీ చందాదారుల ముసుగులో నల్లధనం దందా సాగించారు. డమ్మీ చెక్కులతో మోసగిస్తూ చందాదారులను ఇబ్బంది పెట్టి వారి ఆస్తులను సొంతం చేసుకున్నారు. ఇలా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ యథేచ్ఛగా పాల్పడుతున్న అక్రమాలన్నీ ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసులో నిందితులైన రామోజీరావు, ఆయన కోడలు శైలజ కిరణ్‌లను సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి  విచారించారు. 

తన ఇంటికి పోలీసులు రావడం ఇదే తొలిసారని రామోజీరావు సీఐడీ అధికారులతో వ్యాఖ్యానించడం గమనార్హం. నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ తమ అక్రమాలకు అడ్డుకట్ట వేయడాన్ని రామోజీరావు సహించలేకపోయారు. వైఎస్‌ జగన్‌ మరోసారి అధికారంలోకి వస్తే తమ అక్రమ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలడం ఖాయమని, తమకు శిక్ష పడటం ఖాయమని గ్రహించారు. దాంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో దుష్ప్రచారానికి తెగించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలకు వక్రభాష్యం చెబుతూ నిరాధార ఆరోపణలతో రోజుకో రీతిలో బురదజల్లారు.  

 సత్యం నినదించడం కాదు... దోపిడీ వర్ధిల్లాలి అదే ఈనాడు నినాదం.. విధానం 
రామోజీరావు తన ఆత్మనే ఈనాడు పత్రికగా ... ‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక’ అనే జ్యోతిని వెలిగించి పత్రిక తెచ్చారని ఇటీవల ఈనాడు స్వర్ణోత్సవాల్లో ఘనంగా ప్రకటించారు. ఈ మాటలు వినటానికి ఎంత అందంగా ఉంటాయో ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఈనాడు పాత్రికేయం అంత పైశాచికంగా ఉంటుందన్నది 50 ఏళ్లుగా రోజూ నిగ్గుతేలుతున్న అక్షర సత్యం. రామోజీరావు అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి పునాది మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌  అయితే.. ఆ ఆర్థిక ఉగ్రవాదానికి రక్షణ కవచంగా ఈనాడు పత్రికను వాడుకున్నారన్నది సీఐడీ దర్యాప్తులు, ఆర్‌బీఐ నివేదికల సాక్షిగా వెల్లడైన వాస్తవం. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుటుంబం వాటాలను అక్రమంగా తన కోడలు పేరిట రామోజీ బదిలీ చేసుకున్నారు. ఈనాడు కార్యాలయాలు జాతీయ రహదారులు, నగరాల్లోని రహదారులను కబ్జా చేసినా వ్యవస్థలు కళ్లు మూసుకున్నాయి. 

తమకు పోటీగా ఉన్న ఉదయం పత్రికను దెబ్బతీసేందుకు సారా వ్యతిరేక ఉద్యమం...అనంతరం సంపూర్ణ మద్యపాన నిషేద ఉద్యమాన్ని ఈనాడు నెత్తిన పెట్టుకుంది. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేసింది. ఇక 1995లో ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి రామోజీ. అందుకు ప్రతిగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి రామోజీ ఫిల్మ్‌ సిటీలో మద్యాన్ని ఏరులై పారించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఫిల్మ్‌ సిటీ పేరిట కబ్జా చేసిన రామోజీరావుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ఇక ఈనాడు స్వర్ణోత్సవ వేడుకల్లో ఆ పత్రిక ప్రతినిధులు మాట్లాడుతూ 2006లోనూ 2022లోనూ ఈనాడు పత్రికపై ప్రభుత్వాలు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించడం విడ్డూరంగా ఉంది.

ఇకనైనాప్రభుత్వాలు స్పందిస్తాయా?  
మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు తాజాగా ఆర్‌బీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇరు ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 20న తమ అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంది. ఇకనైనా డిపాజిట్‌ దారుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాయా? లేక ఈనాడు ప్రాపకం కోసం రామోజీ కుటుంబ ఆర్థిక దోపిడీకి వంత పాడి మౌనంగా ఉండిపోతాయా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దాదాపు 18 ఏళ్లుగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఈ కేసులో మునుముందు ఎలా వ్యవహరిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

18 ఏళ్లు నెట్టుకొచ్చారు

6.11.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులపై చర్యలు కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవల్లి ఫిర్యాదు.
13.11.2006: ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు పంపింది. ఆర్‌బీఐ మార్గదర్శి వివరణ  కోరింది. 
30.11.2006: తాము సెక్షన్‌ 45ఎస్‌ పరిధిలోకి రామన్న మార్గదర్శి. ఇకపై డిపాజిట్లు వసూలు చేయవద్దని మార్గదర్శికి ఆర్‌బీఐ ఆదేశం.
19.12.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ 
ఆర్‌బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ.
19.12.2006: వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఎన్‌.రంగాచారిని నియమిస్తూ జీవో నంబర్‌ 801 జారీ. మార్గదర్శి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అదీకృత అధికారిగా టి.కృష్ణరాజు నియామకం జీవో 800 జారీ. 
27.12.2006: రంగాచారి, కృష్ణరాజుల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మార్గదర్శి, రామోజీరావు పిటిషన్‌.
29.12.2006: మార్గదర్శిపై చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనంటూ ఆర్‌బీఐ లేఖ. 
29.12.2006: ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం చట్టబద్ధతను సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీ హైకోర్టులో పిటిషన్‌.
19.2.2007: ఎన్‌.రంగాచారి మార్గదర్శి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పణ. 
19.2.2007: రంగాచారి నియామక జీవోపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ.
23.2.2007: రంగాచారి నియామకం విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన మార్గదర్శి, రామోజీ రావు.
23.1.2008: మార్గదర్శి అక్రమాలపై నాంపల్లి కోర్టులో అదీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు. 
13.7.2009: అదీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు వ్యక్తిగత హాజరుకు నాంపల్లి కోర్టు ఆదేశం 
20.7.2009: నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన రామోజీ. 
3.8.2009: రామోజీ పిటిషన్‌ను కొట్టేస్తూ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్న హైకోర్టు.
7.9.2009: అదీకృత అధికారి తరఫున వాదనలు వినిపించేందుకు ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి, రామోజీ పిటిషన్‌. 
27.11.2009: వ్యక్తిగత హాజరు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మార్గదర్శి, రామోజీ 
17.10.2010: ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి పిటిషన్‌ మూసివేత 
1.7.2011: మార్గదర్శి అక్రమాల కేసులో విచారణను కొన్ని సెక్షన్లకే పరిమితం చేయాలంటూ రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన నాంపల్లి 
18.7.2011: నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రామోజీ హైకోర్టులో పిటిషన్‌ 
26.07.2011: మార్గదర్శి అక్రమాలపై దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలంటూ హైకోర్టులో రామోజీ, మార్గదర్శి పిటిషన్‌ 
2011: రామోజీ, మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 
2014: రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో ఈ కేసు గురించి ఎవరూ పట్టించుకోలేదు. 
18.9.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదల చేయాలంటూ మార్గదర్శి, రామోజీ అనుబంధ పిటిషన్‌ 
12.10.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరణ 
31.12.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శి, రామోజీరావుపై అ«దీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసిన హైకోర్టు 
16.12.2019: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ 
17.10.2022: డిపాజిటర్ల పరిరక్షణ చట్టంపై మార్గదర్శి, రామోజీరావు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను మూసేసిన హైకోర్టు 
9.4.2024: మార్గదర్శిపై అ«దీకృత అధికారి ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన దర్మాసనం. మార్గదర్శి అక్రమాలపై నిగ్గు తేల్చాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. 

మొత్తం వ్యవహారాలపై దర్యాప్తు చేయాలి 
మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్టు పూర్తి ఆధారాలతో సహా నిరూపితమైంది. ఆ సంస్థ చైర్మన్‌ రామోజీరావు లేకున్నా సరే మార్గదర్శి ఎండీగా ఉన్న ఆయన కోడలు శైలజ కిరణ్, భాగస్వాములుగా ఉన్న వారి కుటుంబ సభ్యులను చట్టపరంగా శిక్షించాలి. అంతేకాదు మార్గదర్శి మొత్తం అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి. 
    – వొగ్గు గవాస్కర్, న్యాయవాది
రామోజీ కుటుంబం బాధ్యత వహించాల్సిందే 
మార్గదర్శి అక్రమాలు నిరూపితమయ్యాయి. హెచ్‌యూఎఫ్‌ కర్త రామోజీరావు ప్రస్తుతం లేకున్నా సరే ఆ హెచ్‌యూఎఫ్‌లోని ఇతర సభ్యులు బాధ్యత వహించాల్సిందే. వసూలు చేసిన డిపాజిట్లకు కనీసం పదిరెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతరత్రా శిక్షలకు రామోజీ కుటుంబ సభ్యులు అర్హులు.      
 కోటంరాజు వెంకటేశ్‌ శర్మ, న్యాయవాది, విజయవాడ  

సొంత ఆడిట్‌ కుదరదు
నిజాలు నిగ్గు తేలాల్సిందే  
∙ మార్గదర్శికి స్పష్టంచేసిన సుప్రీం  
మార్గదర్శి అక్రమ డిపాజిట్ల బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పట్లో చెరుకూరి రామోజీరావు చేయని కుతంత్రం లేదు... ఎంతగా అంటే  ‘అక్రమంగా సేకరించిన డిపాజిట్ల సొమ్మును డిపాజిట్‌దారులకు చెల్లించేశాం... ఆ విషయాన్ని మా ఆడిటర్లు లెక్క తేల్చేసి నివేదిక ఇచ్చారు’అంటూ కనికట్టు చేసేందుకు యతి్నంచారు. కానీ, ఆ కుతంత్రాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తిప్పికొట్టింది. ‘నేరం నాదే... దర్యాప్తు నాదే... తీర్పు నాదే’ అంటే కుదరదు అని తేల్చిచెప్పింది. డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించారో... లేదో... నిర్దారించాల్సిందిగా మార్గదర్శి ఆడిటర్లు కాదు... రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అని విస్పష్టంగా ప్రకటించింది.  

డిపాజిట్లు చెల్లించేశాం...మా ఆడిటర్లులెక్క తేల్చేశారు..  
సుప్రీంకోర్టులో రామోజీ వితండవాదం 
రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,610.38కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు సుప్రీంకోర్టులో అడ్డగోలు వాదనలతో కనికట్టు చేయాలని యతి్నంచారు. తాము అక్రమంగా సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని సంబంధిత డిపాజిట్‌దారులకు చెల్లించేశామని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. మొత్తం రూ.2,610.38 కోట్ల అక్రమ డిపాజిట్లలో 2023, జూన్‌ 30నాటికి 1,247మంది డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని చెప్పారు. కేవలం రూ.5.31కోట్లు మాత్రమే క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ ఆడిటర్లు పూర్తిగా ఆడిట్‌ చేసి నివేదిక సమరి్పంచారని... అన్ని లెక్కలు సరిపోయాయని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ డిపాజిట్‌దారులు, వారికి చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు.

అదేం కుదరదు.. డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే 
– స్పష్టంచేసిన సుప్రీంకోర్టు 
రామోజీరావు తరఫు న్యాయవాదుల వాదనలను ఏప్రిల్‌లోనే సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే... మీ దగ్గర పని చేసే ఆడిటర్లు నివేదిక ఇస్తే సరిపోదు. ఆ నివేదికను పరిగణలోకి తీసుకోము’ అని స్పష్టం చేసింది. ఎందుకంటే రూ.5వేలు డిపాజిట్‌చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా అని కూడా వ్యాఖ్యానించింది. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కూడా పారీ్టగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ న్యాయస్థానం విచారించాలని తీర్పునిచి్చంది. డిపాజిట్లు తిరిగి చెల్లించినది.. లేనిది పరిశీలించేందుకు ఓ జ్యుడిíÙయల్‌ అధికారిని నియమించాలని కూడా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement