తూర్పుగోదావరి, సాక్షి: చంద్రబాబు నాయుడు ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. మార్గదర్శి వ్యవహారంలో ఏపీ సీఎంగా చంద్రబాబు స్పందించిన తీరుపై ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
మార్గదర్శి కేసు విషయంలో బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తారని అనుకున్నా. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను చంద్రబాబు ప్రభుత్వం విత్ డ్రా చేసేయటం దారుణం. అధికారంలోకి రాంగానే మార్గదర్శిని కాపాడుతామని అనుకున్నారు.. అన్నట్టే చేసేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఇది. డిపాజిట్లు విషయంలో ఫ్యూచర్ సబ్ స్క్రిప్షన్ ఉండకూడదని స్పష్టంగా నిబంధన ఉంది.
అయినా మార్గదర్శి ఫ్యూచర్ సబ్ స్క్రిప్షన్ కొనసాగించింది. మార్గదర్శికి సహాయం చేయాలనుకున్నా... చంద్రబాబు ఇంత బహిరంగంగా చేయకూడదు.చంద్రబాబు చరిత్రలోనే ఇదో అతిపెద్ద మచ్చగా నిలిచిపోతుంది. అయినా కేసు ఆగే పరిస్థితి లేదు..కేసు కొనసాగుతుంది. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందని ఉండవల్లి అన్నారు.
చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారు. ఎన్నికల అఫిడవిట్ 900 కోట్లు తన ఆసెట్ గా చంద్రబాబు చూపారు. చంద్రబాబు భార్య రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద తమ ఆస్తి 25 వేల కోట్లు ఉన్నట్టు చూపారు. చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్టు ఎవరు ఫిర్యాదు చేయలేదు. అని ఉండవల్లి అన్నారు.
మార్గదర్శి చేసిన పని తప్పేనని రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ ఇప్పటికే ఫైల్ చేసింది. చిట్‌ఫండ్ వ్యాపారి ఇతర వ్యాపారాలు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నా మార్గదర్శి అనేక వ్యాపారాలు చేసింది. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌లో ఇవన్నీ లిస్టయి అయి ఉన్నాయి. కేవలం ప్రజలు డబ్బుతోనే రామోజీరావు వ్యాపారాలు అన్నీ చేశారు.
.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మార్గదర్శి చిట్‌ఫండ్ బ్రాంచీలను మూసేశారు. అయినా ఖాతాదారులు మాత్రం పోలేదు. వారి ఖాతాలన్నీ తెలంగాణలో ఇతర బ్రాంచ్ లకు తరలించారు. చంద్రబాబు రాగానే ఎట్టి పరిస్థితుల్లో మార్గదర్శిని వ్యతిరేకించరని తెలుసు. ప్రభుత్వం పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటారని అనుకోలేదు. ఇటువంటి పనులు చేసే ముందు చంద్రబాబు ఆలోచించుకోవాలి కనీసం ప్రజలు ఏమనుకుంటారోనని కూడా ఆలోచించలేదు’అని ఉండవల్లి పేర్కొన్నారు.
చంద్రబాబు ఆస్తులు వేలకోట్లు పైమాటే
మార్గదర్శిలో ఉన్న మొత్తం అమౌంట్‌లో 70శాతం అన్ అకౌంటబుల్. ఇది ఖచ్చితంగా నిరూపిస్తా. పన్ను ఎగవేతదారులకు మార్గదర్శి ఫైనాన్స్ కేంద్రంగా నిలిచింది. దేశంలోనే అత్యధిక ఆస్తులు రూ.900 కోట్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో చంద్రబాబే దాఖలు చేశారు. సబ్ రిజిస్టార్ వేల్యూయే రూ.900 కోట్లు ఆస్తులుగా చంద్రబాబు ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో అయితే ఆ మొత్తం విలువ కొన్నివేల కోట్లు ఉంటుందని ఉండవల్లి అరుణ కుమార్ స్పష్టం చేశారు.
అధికారులపై కక్ష సాధింపు చర్యలు తగదు
ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టిన సందర్భాలు గతంలో పెద్దగా లేవు. పీఎస్ఆర్ ఆంజనేయులు మంచి అధికారి.... చంద్రబాబు హయాంలో కూడా మంచి పోస్టుల్లోనే పనిచేశారు. ఆయనపై అవినీతి కేసులు నమోదైనట్లు నేనెప్పుడూ వినలేదు. ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్ జగన్ హయాంలో పనిచేసిన వారిపై కక్షసాధింపు చేయడం సరికాదు’అని ఉండవల్లి అరుణ కుమార్ చెప్పారు.
విజయవాడ పరిస్థితి దారుణం
విజయవాడ వరదల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment