Undavally arun kumar
-
చంద్రబాబు చరిత్రకే ఇదో మాయని మచ్చ: ఉండవల్లి
తూర్పుగోదావరి, సాక్షి: చంద్రబాబు నాయుడు ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. మార్గదర్శి వ్యవహారంలో ఏపీ సీఎంగా చంద్రబాబు స్పందించిన తీరుపై ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శి కేసు విషయంలో బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తారని అనుకున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను చంద్రబాబు ప్రభుత్వం విత్ డ్రా చేసేయటం దారుణం. అధికారంలోకి రాంగానే మార్గదర్శిని కాపాడుతామని అనుకున్నారు.. అన్నట్టే చేసేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఇది. డిపాజిట్లు విషయంలో ఫ్యూచర్ సబ్ స్క్రిప్షన్ ఉండకూడదని స్పష్టంగా నిబంధన ఉంది. అయినా మార్గదర్శి ఫ్యూచర్ సబ్ స్క్రిప్షన్ కొనసాగించింది. మార్గదర్శికి సహాయం చేయాలనుకున్నా... చంద్రబాబు ఇంత బహిరంగంగా చేయకూడదు.చంద్రబాబు చరిత్రలోనే ఇదో అతిపెద్ద మచ్చగా నిలిచిపోతుంది. అయినా కేసు ఆగే పరిస్థితి లేదు..కేసు కొనసాగుతుంది. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారు. ఎన్నికల అఫిడవిట్ 900 కోట్లు తన ఆసెట్ గా చంద్రబాబు చూపారు. చంద్రబాబు భార్య రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద తమ ఆస్తి 25 వేల కోట్లు ఉన్నట్టు చూపారు. చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్టు ఎవరు ఫిర్యాదు చేయలేదు. అని ఉండవల్లి అన్నారు. మార్గదర్శి చేసిన పని తప్పేనని రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ ఇప్పటికే ఫైల్ చేసింది. చిట్‌ఫండ్ వ్యాపారి ఇతర వ్యాపారాలు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నా మార్గదర్శి అనేక వ్యాపారాలు చేసింది. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌లో ఇవన్నీ లిస్టయి అయి ఉన్నాయి. కేవలం ప్రజలు డబ్బుతోనే రామోజీరావు వ్యాపారాలు అన్నీ చేశారు... వైఎస్ జగన్ ప్రభుత్వంలో మార్గదర్శి చిట్‌ఫండ్ బ్రాంచీలను మూసేశారు. అయినా ఖాతాదారులు మాత్రం పోలేదు. వారి ఖాతాలన్నీ తెలంగాణలో ఇతర బ్రాంచ్ లకు తరలించారు. చంద్రబాబు రాగానే ఎట్టి పరిస్థితుల్లో మార్గదర్శిని వ్యతిరేకించరని తెలుసు. ప్రభుత్వం పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటారని అనుకోలేదు. ఇటువంటి పనులు చేసే ముందు చంద్రబాబు ఆలోచించుకోవాలి కనీసం ప్రజలు ఏమనుకుంటారోనని కూడా ఆలోచించలేదు’అని ఉండవల్లి పేర్కొన్నారు. చంద్రబాబు ఆస్తులు వేలకోట్లు పైమాటే మార్గదర్శిలో ఉన్న మొత్తం అమౌంట్లో 70శాతం అన్ అకౌంటబుల్. ఇది ఖచ్చితంగా నిరూపిస్తా. పన్ను ఎగవేతదారులకు మార్గదర్శి ఫైనాన్స్ కేంద్రంగా నిలిచింది. దేశంలోనే అత్యధిక ఆస్తులు రూ.900 కోట్లు ఉన్నట్టు అఫిడవిట్లో చంద్రబాబే దాఖలు చేశారు. సబ్ రిజిస్టార్ వేల్యూయే రూ.900 కోట్లు ఆస్తులుగా చంద్రబాబు ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో అయితే ఆ మొత్తం విలువ కొన్నివేల కోట్లు ఉంటుందని ఉండవల్లి అరుణ కుమార్ స్పష్టం చేశారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు తగదుఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టిన సందర్భాలు గతంలో పెద్దగా లేవు. పీఎస్ఆర్ ఆంజనేయులు మంచి అధికారి.... చంద్రబాబు హయాంలో కూడా మంచి పోస్టుల్లోనే పనిచేశారు. ఆయనపై అవినీతి కేసులు నమోదైనట్లు నేనెప్పుడూ వినలేదు. ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్ జగన్ హయాంలో పనిచేసిన వారిపై కక్షసాధింపు చేయడం సరికాదు’అని ఉండవల్లి అరుణ కుమార్ చెప్పారు. విజయవాడ పరిస్థితి దారుణంవిజయవాడ వరదల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. -
ఉండల్లి అరుణ్‌కుమార్ ఘాటు వ్యాఖ్యలు
-
నిప్పు నిప్పు అన్నారు తెలంగాణలో ఆర్పేశారు
-
ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానం
-
ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానం: ఉండవల్లి
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ పరిధిలో సీబీఐ ఎలాంటి దాడులు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి కచ్చితంగా తీసుకోవాలంటూ జారీ చేసిన జీవోపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రాజమండ్రిలో శుక్రవారం ఉండవల్లి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై నేరుగా సీబీఐ దాడులు చేయవచ్చునని అన్నారు. దానికి ఎవరి అనుమతి అవసరం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, దాని ఆధీనంలో ఉన్న అంశాలపై విచారణ కావాలంటే కోరవచ్చునని వ్యాక్యానించారు. చంద్రబాబు తన 15 ఏళ్ల పాలనలో ఎప్పుడూ కూడా సీబీఐ ఎంక్వైరీ కోరలేదని గుర్తు చేశారు. ఏ విషయంపై నైనా కోర్టు ఆదిశిస్తే సీబీఐ ఎంక్వైరీ చేయవచ్చునని తెలిపారు. ప్రభుత్వం సీబీఐని రావడానికి వీల్లేదని చెబితే చెల్లదన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కల్యాణ్ సింగ్ సర్కార్, పప్పూ యాదవ్ కేసుల్లో ఇదే జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానమని పేర్కొన్నారు. జీవో ఇవ్వడమే హాస్యాస్పదమని సీనియర్ న్యాయవాదులు చెబుతుంటే ఎందుకు చంద్రబాబు ఐటీ రైడ్లను, సీబీని వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. బాబు ఏపీ పరువు తీస్తున్నారని వాపోయారు. నిష్ప్రయోజనమైన జీవో విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి మైనస్సేనన్నారు. పోలవరంపైనే కేంద్రం ఇప్పటివరకూ సీబీఐ విచారణకు ఆదేశించలేదని తెలిపారు. మీ పార్టీ నేతలపై ఐటీ దాడులు జరిగితే అది కేంద్రం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఐటీ రైడ్లు చేయడం ద్వారా తనను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని ఓ సీఎం చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రం పరువు తీసే చర్య ఇది..ఇప్పటికైనా పునరాలోచించి నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. -
అసలు తలలే లెక్కపెట్టలేదు!
(పార్లమెంటులో ఏం జరిగింది-40) ధర్మ సంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు. ఇదే నేను చేసింది. శ్రీరాముడు వాలిని చంపినప్పుడు, రావణాసురుణ్ణి చంపినప్పుడు ఏ ధర్మం పాటించాడో మనమూ అదే చేశాం. జైపాల్‌రెడ్డి: రైటయినా, తప్పయినా, ఈ క్షణానికి ఇది తప్ప మనం ఇంకేమీ చెయ్యలేం! కేసీఆర్ నిరాహార దీక్ష విరమించేసినా... లేదు లేదు చచ్చిపోతున్నాడంటూ డిసెంబర్ 2009 మొదటి వారాంతంలో, మనం ఢిల్లీలో చేసిన ప్రచారం, ఆ ప్రచారం నిజం కాదని అందరికీ తెల్సినా... నిజమేనన్నట్లు చిదంబరం తెలంగాణ ప్రకటన చేయటం... ఆ రోజుతో ప్రారంభమయ్యింది, కేసీఆర్ నాయకత్వం బలపడటం...! అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి అనే చిదంబరం ప్రకటనలో ‘మెలిక’ అర్థం చేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాల ప్రహసనంతో మరింత బలపడింది కేసీఆర్ నాయకత్వం!! తెలంగాణ ఇవ్వవలసింది పార్లమెంట్ అని తెలిసీ.. 2009 తర్వాత కేసీఆర్ ఎన్నిసార్లు పార్లమెంట్‌కు వచ్చాడు!? మీరిన్ని రోజులు లోక్‌సభను స్తంభింపచేశారు. ఒక్కరోజైనా మీతో కేసీఆర్ వచ్చాడా..! కేసీఆర్ కాంగ్రెస్‌లో చేరిపోతే మంచిదే. అతనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతాడు... ఈ రోజు నన్నెలా స్పీకర్ దగ్గరకి తోడ్కొని పోయారో, అలాగే కేసీఆర్‌ని కాంగ్రెస్‌లోకి తోడ్కొనిరండి! ఈ రోజు స్పీకర్ బిల్లు పాసయ్యిందని ప్రకటించి తీరాలి. కమల్‌నాథ్, సుష్మాస్వరాజ్ అవునవునంటూ బల్లలు చరుస్తారు. గత్యంతరం లేదు వాళ్లలాగ చేయక తప్పదు...!! ధర్మసంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు. ఇదే నేను చేసింది. శ్రీరాముడు వాలిని చంపినప్పుడు, రావణాసురుణ్ణి చంపినప్పుడు ఏ ధర్మం పాటించాడో మనమూ అదే చేశాం. మహా భారతయుద్ధంలో భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణీ ఆఖరికి దుర్యోధనుణ్ణి ఎవర్నీ రూల్ ప్రకారం పోరాడి చంపలేదు. మనమూ అంతే చేశాం! ఆఖరి నిమిషంలో మనం చేసిన ప్రయత్నం వల్లనే ఈ బిల్లు పాసయ్యిందంటూ మనం ప్రజల ముందు చెప్పుకుంటానికి మాత్రం అవకాశం లేదు. అలా చెప్పుకున్న మరుక్షణం, మనం అధర్మపరులం అయిపోతాం. దయచేసి ఎవ్వరూ ఆ ఆలోచన చెయ్యకండి! రాజ్యాంగ మర్యాదల్ని కొంతవరకూ పాటించకతప్పదు. తెలంగాణా ఏర్పడటం తక్షణ అవసరంగా భావించే నేనీవిధంగా ప్రవర్తించాను. నౌ ఆర్ నెవ్వర్!! ఇప్పుడైతే అయినటు..్ల లేకపోతే ఎప్పటికీ తెలంగాణా ఏర్పడదు. ఏర్పడినా, ఇంతే అనుకూలమైన బిల్లు ఎప్పటికీ రాదు. నా బాధ్యత నేను నిర్వర్తించాను. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. కేసీఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించటమే మీ బాధ్యత. మాటిచ్చాడు గదా అని మాత్రం ధీమాగా ఉండకండి. తెలంగాణ కోసం నేనేమైనా మాట్లాడతాను, సమయానికి ఎవరి కాళ్లైనా పట్టుకుంటాను అని చెప్పాడు. కేసీఆర్! మెంటల్‌గా ప్రజల్ని ప్రిపేర్ చేసి వుంచాడు. రేపు కాంగ్రెస్‌ను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేసినా, ప్రజలు అతనినే నమ్ముతారు కానీ మనల్ని నమ్మరు. రెండ్రోజుల్లో రాజ్యసభలో పాసయి పోతుంది... మరో పది రోజుల్లో ప్రెసిడెంట్ సంతకం కూడా అయిపోతుంది. ఈ లోగా కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కల్సిపోవాలి! మీరు ఆ పనిలో ఉండండి.'' గత నాలుగు ఆర్టికల్స్, నేను రాసినవి. ఊహించి రాసినవి. ఆ విషయం ముందే చెప్పాను. ఇది నా విశ్లేషణ మాత్రమే! ‘‘18 ఫిబ్రవరి 2014న స్పీకర్ ఛాంబర్లో నేనూ, కమల్‌నాథ్, సుష్మాస్వరాజ్‌ల మధ్య రాజీ కుదిర్చాను’’ అని చేసిన జైపాల్‌రెడ్డిగారి ప్రకటన ఆధారంగా, జైపాల్‌రెడ్డిగారి ఉపన్యాస శైలితో పరిచయం వున్న వ్యక్తిగా ఆ కీలకమైన గంటలో, ఏం జరిగి వుండవచ్చునో, ఊహించి రాశాను. జైపాల్‌రెడ్డి గారు రూల్ ప్రకారం తలలు లెక్కపెట్టినట్లు నటించమని చెప్పారు. కానీ స్పీకర్ గారు ఒకటి రెండు సవరణలకి లెక్క పెట్టినట్లు ‘‘అనుకూలం 169 వ్యతిరేకం 6 అంటూ ప్రకటించారు గానీ ఆ తర్వాత అసలు లెక్కించలేదు. కనీసం తలలైనా లెక్క పెట్టి ఎంత మంది అనుకూలమో, ఎంతమంది వ్యతిరేకమో చెప్పండంటూ అసదుద్దీన్ ఒవైసీ పదే పదే స్పీకర్‌ని అడగటం జరిగింది గానీ, స్పీకర్ మాత్రం లెక్కించనే లేదు! సవరణ చదవటం, వీగిపోయిందంటూ ప్రకటించటం.. జరిగిపోయింది!! ఈ ప్రక్రియ రూల్ వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం కూడా!! జైపాల్‌రెడ్డి గారు నేను అభిమానించే రాజనీతిజ్ఞుడు. తెలంగాణా విషయంలో మాత్రం ఆయన సగటు రాజకీయ నాయకుడి గానే ప్రవర్తించారని నేననుకుంటు న్నాను. అలా ఎందుకనుకుంటున్నానో కూడా వివరిస్తాను. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: - ఉండవల్లి అరుణ్‌కుమార్ a_vundavalli@yahoo.com