అవినీతి పునాదులపై రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం: అంబటి
ఆయన ఆర్థిక నేరస్తుడని ముందు నుంచి మేం చెబుతున్నది రుజువైంది
సాక్షి, అమరావతి: రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడని తాము ముందు నుంచి చెబుతున్నామని, తాజాగా హైకోర్టులో ఆర్బీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌తో అది నిరూపితమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మీడియా ముసుగులో రామోజీ యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించి అవినీతి పునాదుల మీద ఆర్థిక సామ్రాజ్యాన్ని నిరి్మంచారని ధ్వజమెత్తారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వసూళ్లపై సీఎం చంద్రబాబు ఏనాడూ కన్నెత్తి చూడలేదని విమర్శించారు. తాము ఎన్ని నేరాలు చేసినా ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాలో రామోజీ వారసులు ఉన్నారని చెప్పారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.
⇒ దశాబ్దాల పాటు రామోజీ అక్రమ డిపాజిట్ల సేకరణ, మార్గదర్శిలో భారీ కుంభకోణాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెలికితీశారు. ఆర్బీఐ చట్టం సెక్షన్–45(ఎస్) ప్రకారం ఆ డిపాజిట్ల సేకరణ నేరమని ఉండవల్లి ఫిర్యాదు చేయడంతో మార్గదర్శిపై విచారణ మొదలైంది.
⇒ మార్గదర్శి ద్వారా రామోజీరావు 2006 నాటికి చట్ట విరుద్ధంగా రూ.2,610 కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించారు. నాడు సీఎంగా ఉన్న వైఎస్సార్ మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై చర్యలకు ఆదేశిస్తే చంద్రబాబుతోసహా రామోజీరావు మద్దతుదారులంతా పత్రికా స్వేచ్ఛపై దాడిగా దు్రష్పచారం చేశారు.
⇒ మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై ఆర్బీఐ ప్రకటన చేసిన నేపథ్యంలో బాధ్యులు, ఆ సంస్థలో డైరెక్టర్లపై కోర్టులో విచారణ తప్పదు. శిక్ష కూడా తప్పదు.
⇒ ఎక్కడ, ఏ ఆఫీసులో చిత్తు కాగితాలు తగలబెట్టినా మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం టీడీపీ, ఎల్లో మీడియాకు పరిపాటిగా మారింది. ఏ ఆఫీస్‌లో చెత్త కాగితాలు కూడా తగలెట్టొద్దంటూ జీవో ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం.
⇒ పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలన్న తాపత్రయంతో స్పిల్‌వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్.. అన్నింటి పనులు ఒకేసారి మొదలు పెట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా అంగీకరించినందున వారి తప్పిదాన్ని వారే ఒప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment